Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

అదనంగా

Vol 11 సంచిక 5
September/October, 2020


1.  ఆరోగ్య చిట్కాలు

 కూరగాయలుమీ ఆరోగ్య పరిరక్షణకు నిండైన భోజనం!

అనారోగ్యానికి ప్రధాన హేతువు ఏమిటి? రుచి కోసం మరియు ఇంద్రియ సుఖం కోసం మానవుడు ప్రకృతి అందించిన వస్తువుల కూర్పును మరియు లక్షణాలను మారుస్తాడు. ఉడకబెట్టడం, వేయించడం, మరియు మిక్సింగ్ ప్రక్రియ ద్వారా సిద్ధం చేసుకుంటాడు. వాటిలో ఏ మాత్రం శక్తి ఉండదు.ఆహారపు అలవాట్ల గురించి అప్రమత్తంగా ఉండండి...ఉడికించని లేదా సగం ఉడికించిన కూరగాయలు, ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మంచివి.”… శ్రీ సత్య సాయి బాబా1

1. కూరగాయలు అంటే ఏమిటి?

ఇవి సాధారణంగా మనందరికీ తెలిసిన కొన్ని పండ్లను మినహాయించి గుల్మకాండమునకు (హెర్బేసియస్) చెందిన తినదగిన భాగము. ఈ కూరగాయలు విస్తృతంగావేర్లు లేదా మూలాలు, దుంపలు, మరియు మొగ్గల రూపంలో లభ్య మవుతాయి; కాండము గా లభించేవి, పువ్వులు గా లభించేవి, ఆకుకూరలు మరియు వృక్ష శాస్త్ర (బొటానికల్) పండ్లు అనేవి కూరగాయలుగా పరిగణింపబడతాయి మరియు వినియోగించబడతాయి. అలాగే గుమ్మడి కాయలు(స్క్వాష్), పొట్లకాయ వంటి కాయలు(గార్డ్స్), చిక్కుడు కాయ లాంటి కాయ రూపాలు, పచ్చి బఠానీ వంటి పండని రూపాలు కూడా కూరగాయలుగా పరిగణింప బడతాయి.2

2. కూరగాయల వినియోగము మరియు ప్రయోజనాలు

ప్రయోజనాలు: దాదాపు అన్ని కూరగాయలు కేలరీలు తక్కువగానూ, విటమిన్లు(A, K, B, & C), ఖనిజలవణాలు, డైటరీ ఫైబర్ వ్యాధితో పోరాడే ఫైటోకెమికల్స్ మరియు యాంటిఆక్సిడెంట్స్ అధికంగానూ కలిగి ఉంటాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇవి  ఆల్కలీన్ స్వభావంతో ఉంటూ నీటి శాతం ఎక్కువగా ప్రత్యేకించి ఆకుకూరలు, వేరుకు సంబంధించినవి, ఆకుపచ్చ కూరగాయలలో     అధికంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని నిర్విషీకరణ చేయగలవు మరియు ముఖ్యమైన అవయవ వ్యవస్థలను బలోపేతం చేయగలవు. ఇంకా రోగనిరోధక శక్తిని పెంచి దీర్ఘకాలిక మరియు ప్రాణాంతక వ్యాధులను నివారణ మరియు చికిత్స కూడా చేయగలవు.    ప్రత్యేకించి అందరూ భయపడే రక్తపోటు, మధుమేహం, రక్తహీనత, బరువును అదుపులోఉంచుకొనుట, క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్, శ్వాసకోశ అనారోగ్యం, ఇన్ఫెక్షన్ మొదలైన వాటిని నివారించవచ్చు. సంక్షిప్తంగా చెప్పాలంటే కూరగాయలు ఉత్తమ సహజ ఔషధములు.  అన్నిటికంటే మించి ఇవి శక్తివంతంగా మరియు ఆరోగ్యంగా కూడా ఉంచడమే కాక ముఖాన్ని కాంతివంతం చేస్తాయి!3-8

వినియోగము: స్థానికంగా దొరికే కాలానుగుణంగా ఉండే తాజా కూరగాయలు కొనండి. దోసకాయ వంటి కొన్నింటిని ఉత్తమ పోషకాల కోసం పచ్చివిగానే తీసుకొనగా మరికొన్నింటిని పచ్చివిగానూ మరియు ఉడికించినవి(పోషకాలు ఉత్తమంగా గ్రఫించడం కోసం)      తీసుకుంటారు. ఉదాహరణ బ్రోకలీ, క్యారెట్టు, టమాటా, బెల్ పెప్పర్ వంటివి. పాలకూర, బంగాళదుంప వండినప్పుడు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయి. ఐతే ఉడికించే సమయం, ఉష్ణోగ్రత మరియు నీటి మొత్తాన్ని కనిష్టంగా ఉంచండి. ఉడక పెట్టడానికి బదులు ఆవిరికి గురిచేయడం, లేదా తేలికగా ఉడికించడం వంటివి చెయ్యాలి ; వేయించడానికి బదులు రొట్టెలు బేకింగ్ చెయ్యడం, గ్రిల్ చెయ్యడం, లేదా సూట్ చెయ్యవచ్చు. తక్కువ జీర్ణ సామర్థ్యం ఉన్న వారికి పచ్చిగా తినడం శ్రేయస్కరం కాదు.3-8

సిఫార్సు చేసిన రీతిగా తీసుకోవడం: 250-300 గ్రాములు లేదా 2½ కప్పుల వివిధ రకాల కూరగాయలు రోజుకు వివేక వంతంగా మిశ్రమం చేసి పొడి లేదా రసం వంటివి తీసుకోవచ్చు.  ఐతే కొన్ని పదార్ధాల విషయంలో సమతుల్యతను పాటించాలి. ఉదాహరణకు అన్నము మరియు చిలకడదుంపలు కలిసి వడ్డించ కూడదు అలాగే ఎప్పుడూ ఒకటే రకానికి చెందిన వేరు రకం మరియు కూరగాయలను తీసుకోవద్దు. రుచి కోసం లేదా మానసిక ఆనందం కోసం అప్పుడప్పుడు తీసుకోవడం అనేది ఉచితంగానే ఉంటుంది!3-9

కూరగాయలు శుభ్రపరచడం చాలా ముఖ్యం :  కడగని కూరగాయలు మెదడులో టేప్ వార్మ్ పెరగడానికి దారితీయవచ్చు.  మొదట చేతులు శుభ్రంగా కడిగి  కూరగాయలను పంపు నీటితో  శుభ్రం చేయడం ద్వారా వాటి ఉపరితలం నుండి హానికరమైన అవశేషాలు మరియు సూక్ష్మ క్రిములనుతొలగించాలి .

ఇలా కడిగిన తరువాత బేకింగ్ సోడా లేదా ఉప్పు మరియు వెనిగర్ లేదా పసుపు మరియు ఉప్పు కలిపిన నీటి గిన్నెలో కూరగాయలు 20 నిమిషాలు నానబెట్టడం మంచిది. ఆ తర్వాత నీటిలో బాగా కడగాలి కఠినమైన ఉపరితలం కలిగిన కూరగాయలు మృదువైన బ్రష్ తో  శుభ్రం చేయడం మంచిది.3,8,10

కూరగాయలను తాజాగా ఉంచడం: కూరగాయలను అవసరమైనప్పుడు మాత్రమే తాజాగా ఉండేవి కొనుక్కోవడం ఉత్తమమైన ఎంపిక. టమాటాలు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు మరియు చిలకడ దుంపలు, మొక్కజొన్న, మరియు కఠినమైన ఉపరితలం కలవి లేదా శీతాకాలపు స్క్వాష్ వంటివి ఐన గుమ్మడికాయ లాంటివి శీతలీకరించవలసివలసిన అవసరం లేదు. కానీ వాటిని బాగా గాలి వెలుతురు సోకే చల్లని నీడ ప్రదేశంలో ఉంచండి.శీతలీకరణ అనివార్యం అయిన చోట ఆకుపచ్చ కూరగాయలను ప్లాస్టిక్ సంచులలోనూ లేదా కంటెయినర్ల లోనూ, టమాటాలు కాగితపు టవల్ లో చుట్టి బౌల్ లో ఉంచాలి, ఆకుకూరలను పేపరులో చుట్టి ప్లాస్టిక్ బుట్టలో పెట్టాలి. అవి వాడిపోయినట్లుగా కనిపిస్తే ఆకుకూరలు మరియు పచ్చని కూరగాయలపై ఐస్ వాటర్ చల్లాలి. కొన్నిరకాల కూరగాయలను కట్ చేసి కూడా ఫ్రీజ్ చేయవచ్చు.2,3,8,11

ప్రపంచవ్యాప్తంగా వెయ్యికి పైగా కూరగాయల జాతులు సాగు చేపడుతున్నాయి. ఈ సంచికలో సుమారు 50 సాధారణ కూరగాయలను వాటి భారతీయ పేర్లనూ కుండలీకరణంలోనూ ఇక్కడ పొందుపరచ బడ్డాయి.

3. మూలాలు, దుంపలు, మరియు మొగ్గ కూరగాయలు

3.1 బీట్ రూట్ (చుకందర్): ముదురు రంగు కలిగి రుచికి తియ్యగా ఉండే ఇది క్రీడాకారులకు అద్భుతమైనది. ఇది కొన్ని గంటల్లోనే రక్తపోటును ప్రత్యేకించి సిస్టోలిక్ బిపిని తగ్గిస్తుంది మరియు అభిజ్ఞా సామర్ధ్యాన్ని పెంచుతుంది. బీట్ రూట్ ను ఉడికించి సంతృప్త పరిచిన ద్రవాన్ని తలపై రాసుకున్నప్పుడు పొరలుగా ఉడిపోయే చర్మ సమస్య మరియు దురద నుండి ఉపశమనం పొందవచ్చు.  బీట్రూట్ యొక్క ఆకులను పాలకూర వలె ఉపయోగించవచ్చు.12

హెచ్చరిక: మూత్రపిండాలలో రాళ్ళు మరియు గౌట్ ఉన్నవారికి మంచిది కాదు.12

3.2 క్యారెట్ ( గాజర్): బీటా కెరోటిన్ మరియు విటమిన్లు A, C & E, యొక్క అద్భుతమైన మూలము.  పిల్లలలో అంధత్వాన్ని మరియు వయో సంబంధిత మాక్యులర్ క్షీణతను నిరోధిస్తుంది. లుకేమియా,  ఊపిరితిత్తులు మరియు పెద్దప్రేగు క్యాన్సర్ యొక్క పురోగతిని ఆపగలదు. జుట్టు, దంతాలు మరియు చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.13

పార్స్నిప్  (చుకందర్): తెల్లటి క్యారెట్ లాగా ఉంటూ ఫోలేట్ అధికంగా ఉన్న ఇది పుట్టుకతో వచ్చే లోపాలతో పాటు చిగుళ్ల వ్యాధిని కూడా నివారించగలదు.

హెచ్చరిక: దీని ఆకులు, కాండం, మరియు పువ్వులు విషపూరితమైన రసం కలిగిఉండి చర్మం పైన కాలిన బొబ్బలకు కారణమవుతుంది కనుక వీటిని నివారించాలి.14

3.3 ముల్లంగి (మూలి): ఇది pH సమతుల్యతను కాపాడుతుంది, శ్వాసకోశములో అవరోధాలను తొలగిస్తుంది, జలుబు మరియు దగ్గు నుండి ఉపశమనం ఇస్తుంది, కామెర్లు ఇంకా మూత్ర మరియు ఆస్టియో ఆర్థరైటిస్ చికిత్సలో సహాయపడుతుంది. శరీరాన్ని సహజంగా ఆర్ధ్రత గా ఉంచుతుంది. పొడి చర్మం, మొటిమలు, మరియు దద్దుర్లను పోగొడుతుంది. దీని ఆకులు తినదగినవి మరియు విత్తనాలు ల్యూకోడెర్మా లేదా చర్మ వ్యాధి చికిత్సకు ఉపయోగపడతాయి.15

హెచ్చరిక: జీర్ణ వ్యవస్థను చికాకు పెట్టవచ్చు, వాయువును కడుపు ఉబ్బరాన్ని కలిగించవచ్చు. పిత్తాశయములో రాళ్ళు ఉన్న సందర్భంలో దీనిని నివారించండి.15

3.4 టర్నిప్/ సెలిరియాక్ (షాల్గామ్): కడుపు పూతలు, గొంతు నొప్పి, కామెర్లు మరియు హెపటైటిస్ చికిత్సకు బాగా ఉపయోగ పడుతుంది. మూత్రపిండాలలో చిన్న రాళ్లను కరిగిస్తుంది.16

రుటాబాగా: ఇది క్యాబేజీ మరియు టర్నిప్ ల ద్వారా ఏర్పడిన హైబ్రిడ్ రకము. టర్నిప్ కంటే కొంచెం పెద్దదిగానూ మరియు తియ్యగానూ ఉంటుంది.  జికామా : టర్నిప్ కంటే తీయగా మరియు పోషక కరమైనది.16

హెచ్చరిక: ఎవరికైనా థైరాయిడ్ రుగ్మత ఉంటే దీనిని నివారించండి.16

3.5 చిలకడ దుంప (షకర్ కండ్): సాధారణ బంగాళదుంప కంటే విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది కళ్ళకు అద్భుతమైనది. పిండిపదార్ధముతో కూడి రుచికి తీయగా ఉండే దీనిని రుచికరమైన మరియు తీపి వంటలలో ఆస్వాదించవచ్చు. 17

హెచ్చరిక: కిడ్నీలో రాళ్లు ఉంటే దీనిని మానుకోవాలి. మధుమేహం ఉన్నవారు మితంగా తీసుకోవాలి.17

3.6 బంగాళాదుంప (ఆలు): ఇది అన్ని వేళల్లోనూ సౌకర్యవంతమైన ఆహారము.  ఫైబర్ అధికంగా ఉండే చర్మంతో దీని తిన్నప్పుడు ప్రయోజనకరంగా ఉంటుంది అయితే అతిగా వేపకూడదు. ఇది నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. హృదయ ఆరోగ్యము, బలమైన ఎముకల నిర్మాణం అందిస్తూ క్రీడాకారుల పనితీరును వారి సామర్ధ్యమును పెంచుతుంది.18

కాసావా: బంగాళదుంప కంటే అధిక ప్రోటీన్ మరియు క్యాలరీలు ఉంటాయి. దీనిలో చీమల పోషకాలు ఉంటాయి కనుక దీని ప్రయోజనాలను పొందడానికి ఒలిచి, నానబెట్టి ఉడికించిన దానిని తినాలి(పచ్చిది తింటే విషపూరితం).19

3.7 ఎలిఫాంట్ ఫుట్ యామ్ (సురాన్/జిమికండ్): గట్టి చర్మం కలిగి ఉంటుంది. గొంతులో శ్లేష్మం మరియు మరియు కడుపులో గాలిని తగ్గిస్తుంది. పైత్యా రసాన్ని పెంచి జీర్ణక్రియకు సహాయపడుతుంది. పెరుగుతున్న పిల్లలకు అనువైనది.20

హెచ్చరిక: ఒకసారి కట్ చేసిన తరువాత వాడకపోతే ఇది చర్మం మరియు గొంతులో చికాకును కలిగిస్తుంది. కనుక నీటిలో మునిగే టట్లు ఉంచి దానిలో వినిగర్, నిమ్మకాయ లేదా చింతపండు వేసి ఉడకబెట్టాలి.20

3.8 టారో రూట్/ కొలో కాసియా (ఆర్బి): వివిధ పోషకాలు, పీచు పదార్ధం, మరియు రెసిస్టెంట్ స్టార్చ్ యొక్క గొప్ప మూలము. దీని       వేరు మరియు ఆకులు వండినవి తినాలి.21

3.9 ఉల్లిపాయ (ప్యాజ్):.ఉత్తమ డి టాక్సీ ప్లయర్ లేదా నిర్విషీకరుణులలో ఇది ఒకటి. ఇది రక్తం గడ్డ కట్టడాన్ని నిరోధిస్తుంది  మరియు కీటకాలు కుట్టిన గాయాలకు,  ఆనెలు, దురద మరియు జలుబు మరియు ఫ్లూ తో సహా శ్వాసకోస అనారోగ్యానికి చికిత్సచేస్తుంది. పసుపు మరి తెలుపు ఉల్లిపాయ తో పోలిస్తే విడాలియా మరియు షాలోట్స్ వంటి ఉల్లి రకాలు తక్కువ శాతం  పోషకాలు   కలిగి ఉంటాయి.22

హెచ్చరిక:  గుండె మంట లేదా జీర్ణక్రియ సమస్యల విషయంలో ఉల్లిని ముఖ్యంగా ముడి ఉల్లిని నివారించాలి.22

3.10 చిన్న (స్ప్రింగ్) ఉల్లిపాయలు/ స్కాలియన్స్ (ప్యాజ్ పట్టా): ఈ చిన్న ఉల్లిపాయలు ఫోలెట్, విటమిన్లు మరియు కాలుష్యం యొక్క మంచి మూలము. అలంకరించడానికి వాడబడే వీటిని పచ్చిగా కూడా తినవచ్చు. ఇవి లీక్స్(ఎక్కువ విటమిన్ A తో రుచిగా ఉండే పెద్దమరియు తేలికపాటి రకం) మరియు చిప్స్ (తేలికపాటి రకం పోషకాలు తక్కువ ఉంటాయి కానీ శరీర జీవక్రియ మరియు పిండం అభివృద్ధికి సహాయపడే కోలిన్ యొక్క చక్కని మూలం)వంటి రకాలతో పోలి ఉంటాయి.23

4. కాండము మరియు పూల రకపు కూరగాయలు

4.1 కోహిరబీ (నాల్కోల్): ఇది క్యాబేజీ యొక్క ఒక రూపం మరియు రుచికి బ్రోకలీ కాండము మాదిరిగానే ఉంటుంది కానీ తేలికపాటి మరియు తీయగా ఉంటుంది. దీని కాండము మినహా మొత్తం తినదగినది. ఒక కప్పుకోహిరబీ మన రోజువారీ విటమిన్ సి అవసరాల్లో 100% ఇస్తుంది.24

4.2 ఆస్పరాగస్(శతావరి): దీనిలో బ్రోకలీకంటే విటమిన్లు తక్కువగా ఉంటాయి కానీ ఇనుము మరియు కాపర్ కు మంచి మూలము. సహజ మూత్రవిసర్జన కారి అలాగే నీటి చేరిక (ఎడిమా)మరియు మూత్ర మార్గ ఇన్ఫెక్షన్ నివారించగలదు మరియు శాంతపరిచే ప్రభావాన్ని కలిగి ఉంటుంది.25

4.3 క్యాబేజీ (పట్టా గోబి): దోరగా వేయించి నప్పుడు గ్రీన్ క్యాబేజీ ఆరోగ్యంగా ఉంటుంది. ఎర్ర క్యాబేజీ సలాడ్ కు మరింత సముచితమైనది. గ్రీన్ క్యాబేజీ కంటే పది రెట్లు ఎక్కువ విటమిన్ ఏ మరియు రెట్టింపు ఇనుమునుఇస్తుంది కానీ కానీ దానిలో ఉన్న విటమిన్ k లో 50% మాత్రమే ఉంటుంది. 26

బ్రసెల్ మొలకలు: సామాన్య పోషకాలతో చిన్నవిగా ఉంటాయి మాడ్చినప్పుడు లేదా వేయించినప్పుడు దాని రుచి పెరుగుతుంది అధికంగా ఉడికించినా లేదా మరగ బెట్టినా దుర్వాసన ఉంటుంది.27

కోలార్డ్ గ్రీన్స్ (హాక్) & బాక్ చొయ్: విటమిన్లు అధికంగా ఉంటాయి ప్రత్యేకించి ఇది శరీరాన్ని నిర్విషీకరణ చేయటానికి, ఆరోగ్యవంతమైన ఎముకల నిర్మాణానికి మరియు ఆరోగ్యకరమైన దృష్టిని ఇవ్వడానికి ఉత్తమ మైనది.28

ఆర్టిచోక్ : కాలేయ టానిక్ గా పరిగణింపబడే దీని ఆకులు అత్యంత పోషకకరమైన భాగము.29

4.4 బ్రోకోలి: క్యాన్సర్ నివారణకు, ఎముకలను బలోపేతం చేయడానికి మరియు ప్రతీ ఒక్క అంశము లోనూ ఆరోగ్యాన్ని అందించే సూపర్ ఫుడ్ గా పిలువ బడుతుంది. తాజాగా ఉన్నప్పుడు చాలా పోషక కరమైనది ఆవిరితో ఉడక బెట్టే ముందు బాగా కడగాలి.30

4.5 కాలీఫ్లవర్ ( ఫూల్ గోపి): విటమిన్లు మరియు ఖనిజలవణాలకు చక్కని ఆధారము. ఇది జ్ఞాపకశక్తికి అద్భుతమైనది.31

హెచ్చరిక: మూత్రపిండాలు లేదా గౌట్ సమస్య లేదా రక్తం పలచ బడడానికి మందులు వాడేవారు దీనిని నివారించండి లేదా తక్కువ పరిమాణంలో తీసుకోండి.31

5. ఆకుకూరలు

5.1 పాలకూర (పాలక్): ఇది మెగ్నీషియం యొక్క ఉత్తమ వనరులలో ఒకటి. ఉడికించేటప్పుడు దీని పోషకాలు మెరుగుపడతాయి కానీ దానిలోని ఇనుము మరియు కాల్షియం కొన్ని యాంటీ న్యూట్రియంట్స్ వల్లగ్రహింపబడవు.32

 లేట్యుస్ (సలాడ్ పట్టా): పోషకాలు తక్కువగా ఉన్నప్పటికీ అధిక నీటిశాతం కారణంగా ఇది శరీరాన్ని ఆర్ద్రత గా ఉంచుతుంది.32

అరుగుల/రాకెట్ : పోషక పరంగా సాంద్రీకృతమైన ఇది ఆరోగ్యానికి అద్భుతమైనది.33

వాటర్ క్రెస్: ఒమేగా 3 కొవ్వు ఆమ్లం అధికంగా ఉండే ఇది గుండెకు మంచిది. పారుతున్న జలమార్గాలు ఒడ్డున సహజంగా ఎల్లప్పుడూ పెరుగుతూ ఉంటుంది. ఐతే దీనిని ఉపయోగించే ముందు పూర్తిగా కడగాలి.34

ఆవాల ఆకు కూర (సర్సోంకా సాగ్): పాలకూరను పోలి ఉంటుంది కానీ దానికన్నా మసాలా ఎక్కువ.35

కాలే (కరం సాగ్): పోషకాలు విషయంలో పాలకూరను పోలి ఉంటుంది, దీనిలో విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి పచ్చిగా తింటే ఉత్తమంగా ఉంటుంది. స్మూతీలు వంటి వాటిలో ఆవిరితో ఉడక బెట్టినది లేదా తేలికగా వేపినది ఉత్తమం.36

5.2 మొరింగా/ మునగ కాయ (సాజన్): ఇది అద్భుతమైన మొక్కగా పిలువబడుతుంది. ఇందులో పెరుగులో ఉండే ప్రోటీనుకు రెండు రెట్లు, అరటిలో ఉండే పొటాషియంకు 3రెట్లు, క్యారెట్ లో ఉండే విటమిన్ A మరియు ఆవుపాలలో కాల్షియం కు 4 రెట్లు నారింజలో ఉండే విటమిన్ Cకి 7 రెట్లు పోషకాలు ఉంటాయి.  వివిధ వంటకాలలోనూ విస్తృతంగా ఉపయోగించబడే ఈ కాయ ఒక సంప్రదాయ ఔషధంగా రక్తాన్ని శుద్ధి చేస్తుంది, మంటను నివార్స్తుంది, హార్మోన్లను సమతుల్యం చేస్తుంది, పోషకాహారలోపమును మరియు వృద్ధాప్యాన్ని నిరోధిస్తుంది, రక్తహీనతను నివారిస్తుంది, జీర్ణక్రియకు సహాయపడుతుంది, రక్తంలో చక్కెరను సమతుల్యం చేస్తుంది మరియు చర్మ సమస్యలను నయం చేస్తుంది.37

హెచ్చరిక: ఔషధాలు తీసుకుంటున్నవారు దీని విషయంలో తమ డాక్టర్ను సంప్రదించడం మంచిది.37

5.3 ఫెనుగ్రీక్/మెంతికూర(మేతి) ఆకులు: ఇనుము మరియు ఇతర ఖనిజలవణాలు సమృద్ధిగా ఉండే ఈఆకు జీర్ణక్రియకు సహకరిస్తుంది మరియు మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది, ఆహారానికి  మంచి రుచిని మరియు సువాసనను జోడిస్తుంది.38

6. బీర (గార్డ్స్), గుమ్మడి (స్క్వాష్), చిక్కుడు, బఠానీ (పొడ్స్) వంటి కూరగాయలుగా తినగలిగిన పండ్ల జాతులు

6.1 అవకాడో/బట్టర్ ఫ్రూట్: గుండెకు మేలు చేసే ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడి అధిక పొటాషియం కలిగినట్టి ఇది దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షణ కోసం అద్భుతమైనది. ఐతే కత్తిరించిన తర్వాత కొంత కాలం తాజాగా ఉండటానికి నిమ్మరసం చల్లుకోవాలి.39

6.2 బెల్/ స్వీట్ పెప్పర్ (శిమ్లా మిర్చ్): అనేక రంగులతో ఆకర్షణీయంగా కనబడుతూ అనేక రకాలుగా ఉపయోగపడే ఈ స్వీట్ పెప్పర్ ఒక మధ్యతరహా సైజు కాయ మన రోజువారీ విటమిన్ ఎ మరియు సి అవసరాలను తీర్చగలదు. మరియు సాధారణ జలుబు నుండి క్యాన్సర్ వరకూ వ్యాధులతో పోరాడ గలదు. గర్భిణీ స్త్రీలకు అనువైనది. దీనిని సలాడ్లు లేదా ఏదైనా ఇతర ఆహార తయారీలో చేర్చవచ్చు.40

6.3 టొమాటో (టమాటర్): రోజుకు ఒక ముడి టమాటా పెద్ద ప్రేగు క్యాన్సర్ నివారించగలదు. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచి కేన్సర్ కణుతుల పెరుగుదలను నిలిపివేసే ఫైటోన్యూట్రింట్ లైకోపిన్ యొక్క ఉత్తమ వనరులలో ఇది ఒకటి. టొమాటోలను ఉడికించి అవకాడో, ఆలివ్, లేదా కొబ్బరి నూనె, గింజలు లేదా విత్తనాలు వంటి కొవ్వు అధికంగా ఉన్న ఆహారంతో కలిపి తీసుకున్నట్లైతే లైకోపిన్ యొక్క జీవ లభ్యత మెరుగుగా ఉంటుంది.41

హెచ్చరిక: యాసిడ్ రిఫ్లెక్స్ లేదా తరచుగా జాయింట్లు లేదా కండరాల నొప్పి విషయంలో దీనిని తీసుకోకూడదు.41

6.4 దోసకాయ (ఖీరా): రసంతో కూడిన చల్లని స్పుటమైన ఈ దోసకాయను పచ్చిదిగా తినడం ఎంతో ఉత్తమం. మూత్ర విసర్జన దుష్ప్రభావాలకు తగిన చికిత్స నందిస్తుంది. ఇది కళ్ళ వాపును తగ్గిస్తుంది, వృద్ధాఫ్యాన్ని సహజంగా నెమ్మదింప జేస్తుంది, రక్తాన్ని శుభ్రపరుస్తుంది మరియు ఆల్కలైజ్ చేస్తుంది, నిర్జలీకరణం నివారిస్తుంది, మలబద్ధకం పోగొడుతుంది  మరియు శరీరం వేడెక్కకుండా నిరోధిస్తుంది. దోస ముక్కలను కళ్ళ మీద ఉంచినట్లైతే వాటికి విశ్రాంతి నిచ్చి పునః శక్తివంతం చేస్తాయి.42

6.5 గుమ్మడి కాయ (సీతాఫాల్ /కడ్డూ): శీతాకాలంలో లభించే ఈ తేజోవంతమైన కాయ కళ్లకు చాలా మంచిది మరియు ఊబకాయాన్ని నిరోధిస్తుంది. దీని గింజలు నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తాయి.43

పచ్చ గుమ్మడి కాయ (తురాయి): విటమిన్ సి అధికంగా ఉండే ఈ వేసవి గుమ్మడి అధిక నీటి పదార్థంతో కూడి జీర్ణించుకోవడానికి సులభంగా ఉంటుంది.44

6.6 బూడిద గుమ్మడి/తెల్ల గుమ్మడి (పెట్టా): భారతదేశం మరియు చైనాలో ఎక్కువగా ఉపయోగిస్తున్న వైద్య ప్రయోజనలు కల ఒక ప్రత్యేకమైన పుచ్చకాయ వంటిది. ఇది పర్యావరణం నుండి ప్రతికూల శక్తి తొలగింప జేస్తుంది. ప్రతి ఉదయం ఒక గ్లాసు రసం శరీరాన్ని చల్లగా, చురుకుగా, మరియు శక్తివంతం చేస్తుంది. నరాలను ప్రశాంతంగా ఉంచి మేధో  సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇది  ఫైల్స్, మలబద్ధకం, మరియు బొబ్బలను పోగొడుతుంది.45

హెచ్చరిక: శ్వాసకోశ అనారోగ్యానికి అవకాశం ఉన్నవారు తేనె లేదా మిరియాలతో కలిపి తీసుకోవచ్చు.45

6.7 కాకరకాయ (కరేలా): మధుమేహము, గౌట్, కామెర్లు, మూత్రపిండాల్లో రాళ్లను పోగొట్టడానికి చక్కని వనరు. ఋతు చక్రాన్ని సక్రమం  చేస్తుంది. అలాగే మలేరియా, వైరస్లు, HIV/AIDS మరియు క్షయ వ్యాధికి చికిత్స చేయడమే కాక కీళ్లవాతముటో సహా అనేక స్వయం ప్రతిరక్షక రుగ్మతలను నిరోధించడానికి సహాయపడుతుంది.46

హెచ్చరిక: గర్భిణీ స్త్రీలకు, మధుమేహ ఔషధముల పై ఉన్నవారికి, శస్త్రచికిత్స తర్వాత కోలుకున్న వారికి మంచిది కాదు.46

6.8 సొరకాయ/ఆనపకాయ (ఆకి): ఆంత్రము (గట్) ఆరోగ్యానికి సిఫార్సు చేయబడిన ఇది రుచికరమైన మరియు తీపి వంటకాలు తయారికీ కూడా ఉపయోగిస్తారు. చేదుగా ఉంటే దీనిని తినకూడదు.47

6.9 ఇటువంటి ప్రయోజనాలు కలిగిన మరికొన్ని కూరగాయలు:

ఐ వి గార్డ్/కోకినియా(కుండూరు), ఇండియన్ స్క్వాష్ లేదా రౌండ్ బేబీ గుమ్మడికాయ(టిండా), పేదవాని కూరగాయగా భావించే  భావించే  (పర్వాల్‌)గుండ్రని పొట్లకాయ ఇది ఆకలి లేమి అద్భుతంగా పనిచేస్తుంది. బీరకాయ, పొట్లకాయ ఉదర రుగ్మతలు(అజీర్ణం,కడుపు నొప్పి, మలబద్ధకం మరియు అధిక అపానవాయువు) నివారిస్తుంది.48-52

6.10 వంకాయ (బయింగన్): దీని పై చర్మంలో మెదడు కణత్వచమును సంరక్షించే అరుదయిన యాంటీఆక్సిడెంట్ నాసునిన్  ఉంటుంది.53

హెచ్చరిక: రక్తంలో ఇనుము ధాతువు స్థాయి తక్కువ ఉన్న వారికి, మూత్రపిండాల సమస్య, గౌట్ లేదా అలర్జీ ఉన్న వారికి ఇది తగినది కాదు. దీని ఆకులు మరియు దుంపలు విషపూరితమైనవి వీటిని తినకూడదు.53

6.11 బెండకాయ (భీండీ): ఒమేగా 3 మరియు ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి, దీని లోపల అధిక పోషక పదార్ధాలతో కుడి ఉంటుంది, పార్శ్వపు నొప్పి నివారించడానికి మరియు జ్ఞాపక శక్తి వృద్ధికి ఇది ఉత్తమమైన కూరగాయ.54

6.12 గ్రీన్/ఫ్రెంచ్ బీన్స్ (ఫాలియన్): సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, మరియు ఫైబర్ అధికంగా ఉంటుంది కానీ సోడియం తక్కువగా ఉండే ఇది ఆరోగ్యకరమైన సంపూర్ణ ఆహారం మరియు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా మంచిది. హెచ్ఐవి ని నిరోధించగలదని   అధ్యయనాలు చెబుతున్నాయి.55

హెచ్చరిక: మూత్రనాళాల సమస్యల ఉన్నవారు దీనిని నిరోధించాలి వాడకూడదు.55

6.13 ఆకుపచ్చని బఠానీలు (మటార్): ఫైబర్ మరియు ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది కానీ దాని యాంటీ న్యూట్రియంట్స్ వల్ల జీర్ణ అసౌకర్యం కలుగుతుంది కాబట్టి ఉడికించిన తర్వాత మాత్రమే తినవలెను.56

6.14 పచ్చిమిరపకాయలు (హరి మిర్చి): విటమిన్ సి, ఐరన్ మరియు క్యాప్సైసిన్ సమృద్ధిగా ఉన్నఇది భారతీయ మరియు తాయ్ వంటకాల్లో ముఖ్యమైన పదార్థం. ఇది రక్తప్రసరణను పెంచుతుంది మరియు నోటికి రుచిని ప్రేరేపిస్తుంది.57

6.15 స్వీట్ కార్న్/ మొక్కజొన్న (మక్కా): అధిక పిండిపదార్థం కలిగిన కూరగాయ (వృక్ష శాస్త్ర రీత్యా ఇది ఒక పండు జాతికి మరియు తృణ ధాన్యానికి సంబంధించినది), జన్యుపరంగా మార్పు చేయబడ నట్లయితే ఇది అధిక పీచు, బంధన నిరోధి మరియు అధిక పోషక పదార్ధాలు కలిగి ప్రయోజనకరంగా ఉంటుంది.58

హెచ్చరిక: సున్నితమైన జీర్ణ వ్యవస్థ కలిగిన వారికి ఇది అంత్రము లో పులి పెట్టబడి కడుపునొప్పికి కారణం అవుతుంది.58

6.16 కొన్ని పక్వానికి రాని పండ్లు కూరగాయల వలె అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి: జాక్ ఫ్రూట్ (కథల్) రోగనిరోధక శక్తికి మరియు మంచి నిద్రకు; బొప్పాయి (పాపిటా) జీర్ణఅన్న క్రియ మెరుగుదల, చర్మ సంరక్షణ, అంటువ్యాధుల నిరోధానికి, ఋతు పరమైన నొప్పుల నివారణకు; బొప్పాయి ఆకులు అంటువ్యాధి రూపంలో వచ్చే జ్వరాలను నయం చేస్తాయి. దీనితో పాటు  పచ్చి అరటి(కచ్చా కేలా) దాని పువ్వు మరియు మొగ్గ  అధిక ఫైబర్ కలిగి ఉంటుంది, మెదడు మూత్రపిండాలకు అద్భుతమైనది, అనేక వ్యాధుల నివారణ చేస్తుంది.59-61

6.17 పుట్టగొడుగులు (చాట్రాక్): ప్రకృతి ద్వారా ప్రయోజనకరమైన ఫంగస్(కూరగాయల మాదిరిగా తిన్నప్పటికీ), ఇది శక్తివంతమైన క్యాన్సర్ విరోధి, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, మెదడు మరియు హృదయానికి శక్తినిచ్చే మంచి B విటమిన్ల యొక్క మూలము  థైరాయిడ్ సమస్యలను నివారిస్తుంది.62

హెచ్చరిక: అడవిలో నుండి గ్రహించిన కొన్ని పుట్టగొడుగులు విషపూరితమైనవి కనుక తెలిసిన వారి వద్ద నుండి మాత్రమే  దీనిని కొనుగోలు చేయండి.62

ముగింపు: కూరగాయలు మన రోజువారీ ఆహారంలో ముఖ్యమైన భాగంగా ఉండాలి కానీ అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణ క్రియకు ఆటంకం కలుగుతుంది. మన శారీరక అవసరాలు మరియుదాని ప్రతిస్పందన గురించి సంపూర్ణ అవగాహనతో ఒక మిశ్రమం మాదిరిగా మితంగా ఉపయోగించినప్పుడు మాత్రమే అవి ఔషధం వలె పనిచేస్తాయి.3-8

రిఫరెన్స్ లు మరియు లింకులు:

1.    Sathya Sai Speaks, Good health and goodness, chapter 21, vol 15, 30 September 1981,http://sssbpt.info/ssspeaks/volume15/sss15-21.pdf

2.    What is a vegetable: https://www.britannica.com/topic/vegetable

3.    Benefits: https://www.myupchar.com/en/healthy-foods/vegetables?utm_medium=firstpost&utm_source=indian-green-leafy-vegetables

4.    https://www.eatforhealth.gov.au/food-essentials/five-food-groups/vegetables-and-legumes-beans

5.    https://www.marthamckittricknutrition.com/10-benefits-of-eating-vegetables/

6.    Alkaline: https://trans4mind.com/nutrition/pH.html

7.    Balanced eating: https://www.hsph.harvard.edu/nutritionsource/what-should-you-eat/vegetables-and-fruits/

8.    Dietary guidelines India: https://www.nhp.gov.in/healthlyliving/healthy-diet

9.    Dietary guidelines USA: https://healthyeating.sfgate.com/usda-fruit-vegetable-recommendations-9339.htmlhttps://www.hhs.gov/fitness/eat-healthy/dietary-guidelines-for-americans/index.html

10. Cleaning vegetables: Vibrionics Newsletter, Vol 2 issue 2, March 2011”Answer corner,Q1”);  https://www.healthline.com/nutrition/washing-vegetables#1https://www.moving.com/tips/how-to-sanitize-fruits-and-vegetables/

11.  Keeping vegetables fresh: https://www.unlockfood.ca/en/Articles/Cooking-Food-Preparation/How-to-store-vegetables-to-keep-them-fresh.aspxhttps://inhabitat.com/6-ways-to-keep-your-fruits-and-veggies-fresher-for-longer/

12.  Beets: https://www.healthline.com/nutrition/benefits-of-beets#section2;https://foodrevolution.org/blog/benefits-of-beets/https://www.readersdigest.ca/food/healthy-food/health-benefits-of-beets;

13.  Carrots: https://www.medicalnewstoday.com/articles/270191;https://parenting.firstcry.com/articles/magazine-18-must-know-benefits-of-carrot-gajar-for-health-skin-and-hair/

14.  Parsnip: https://draxe.com/nutrition/parsnip-nutrition/

15.  Radish: https://www.indiatoday.in/lifestyle/health/story/mooli-radish-health-benefits-winter-veggie-india-digestion-blood-pressure-lifest-1117051-2017-12-27https://www.lybrate.com/topic/benefits-of-radish-and-its-side-effectshttps://www.organicfacts.net/health-benefits/vegetable/health-benefits-of-radish.htmlhttps://draxe.com/nutrition/radish-nutrition/

16.  Turnip /Celeriac /Rutabaga: https://www.medindia.net/dietandnutrition/top-10-health-benefits-of-a-turnip.htmhttps://draxe.com/nutrition/turnip/https://draxe.com/nutrition/celeriac/

17.  Sweet potato: https://draxe.com/nutrition/sweet-potato-nutrition-facts-benefits/;https://www.healthline.com/nutrition/sweet-potato-benefits

18.  Potato: https://draxe.com/nutrition/root-vegetables/http://www.whfoods.com/genpage.php?tname=foodspice&dbid=48;

19.  Cassava: https://www.healthline.com/nutrition/cassava

20.  Elephant foot yam: https://timesofindia.indiatimes.com/life-style/food-news/suran-or-jimikand-secret-benefits-of-this-vegetable-and-tips-to-cook-it/articleshow/76245383.cms

21.  Taro root: https://www.healthline.com/nutrition/taro-root-benefits#section5

22.  Onion: https://www.livescience.com/45293-onion-nutrition.htmlhttps://draxe.com/nutrition/onions-nutrition/; (refer “In Addition” Vol 5 issues 1 & 2 (Jan/Feb and March/April 2014).

23.  Spring onion: https://draxe.com/nutrition/scallions/

24.  Kohlrabi/German turnip: https://draxe.com/nutrition/kohlrabi/

25.  Asparagus: https://draxe.com/nutrition/asparagus-nutrition/

26.  Cabbage red v. green: https://draxe.com/nutrition/red-cabbage/

27.  Brussel sprouts: https://draxe.com/nutrition/brussels-sprouts-nutrition/

28.  Collard greens: https://draxe.com/nutrition/collard-greens/

29.  Artichoke: https://indianexpress.com/article/india/india-others/vegetable-of-gods-artichoke-and-its-untapped-benefits/

30.  Broccoli: https://draxe.com/nutrition/broccoli-nutrition/

31.  Cauliflower: https://draxe.com/nutrition/cauliflower/

32.  Spinach & Lettuce: https://draxe.com/nutrition/spinach-nutrition/

33.  Arugula: https://draxe.com/nutrition/arugula/

34.  Watercress: https://draxe.com/nutrition/watercress/

35.  Mustard greens: https://draxe.com/nutrition/mustard-greens-nutrition/

36.  Kale: https://draxe.com/nutrition/health-benefits-of-kale/

37.  Moringa: https://draxe.com/nutrition/moringa-benefits/https://www.netmeds.com/health-library/post/drumstick-health-benefits-nutrition-uses-recipes-and-side-effects;https://www.medicalnewstoday.com/articles/319916#risks-with-existing-medications

38.  Fenugreek leaves: https://www.firstpost.com/health/forget-kale-you-should-be-eating-these-10-indian-greens-instead-7884601.html

39.  Fruit vegetables: Avocado: https://draxe.com/nutrition/avocado-benefits/;https://www.medicalnewstoday.com/articles/270406#diet

40.  Bell pepper: https://draxe.com/nutrition/bell-pepper-nutrition/

41.  Tomato: https://draxe.com/nutrition/tomato-nutrition/http://saibaba.ws/teachings/foodforhealthy.htm

42.  Cucumber: https://draxe.com/nutrition/cucumber-nutrition/

43.  Pumpkin: https://www.healthline.com/nutrition/pumpkinhttps://draxe.com/nutrition/pumpkin-seeds/;

44.  Zucchini: https://www.healthline.com/nutrition/zucchini-benefits

45.  Ash Gourd: https://isha.sadhguru.org/in/en/blog/article/ash-gourd-winter-melon-cool-vegetable-benefits-recipes

46.  Bitter gourd(Karela): https://draxe.com/nutrition/bitter-melon/

47.  Bottle gourd: https://www.nutrition-and-you.com/bottle-gourd.htmlhttps://food.ndtv.com/food-drinks/7-incredible-benefits-of-drinking-of-bottle-gourd-lauki-juice-1452828

48.  Ivy gourd/Kunduru: https://www.verywellhealth.com/the-benefits-of-ivy-gourd-89467;https://www.healthbenefitstimes.com/ivy-gourd/

49.  Indian squash (Tinda): https://www.netmeds.com/health-library/post/tinda-indian-round-gourd-health-benefits-nutrition-uses-for-skin-hair-weight-loss-and-recipes

50.  Pointed gourd (Parval): https://www.lybrate.com/topic/pointed-gourd-benefits-and-side-effects

51.  Ridge gourd(turai): https://www.thehealthsite.com/fitness/health-benefits-of-ridge-gourd-or-tori-bs815-319005/https://food.ndtv.com/food-drinks/make-your-boring-vegetables-yummy-3-tasty-yet-healthy-turai-ridge-gourd-dishes-to-try-2031443

52.  Snake gourd (Chichinda): https://www.healthbenefitstimes.com/snake-gourd/

53.  Eggplant/aubergine /brinjal: https://draxe.com/nutrition/eggplant-nutrition/;https://www.medicalnewstoday.com/articles/279359

54.  Okra/ladies finger: https://draxe.com/nutrition/okra-nutrition/https://www.netmeds.com/health-library/post/6-astonishing-health-benefits-of-okra-you-didnt-know

55.  Green Beans: https://draxe.com/nutrition/green-beans-nutrition/https://www.verywellfit.com/green-beans-nutrition-facts-calories-carbs-and-health-benefits-4169523;https://www.seedsofindia.com/category/Beans-Peas-and-Corn-17

56.  Green Peas: https://draxe.com/nutrition/green-peas/https://www.healthline.com/nutrition/green-peas-are-healthy#section7

57.  Green chillies: https://www.lybrate.com/topic/green-chilli-benefits-and-side-effects

58.  Sweet corn (Makka): https://draxe.com/nutrition/nutritional-value-of-corn/

59.  Unripe Jackfruit: https://food.ndtv.com/food-drinks/7-important-reasons-to-include-jackfruit-kathhal-in-your-regular-diet-1783929

60.  Unripe Papaya: https://www.medindia.net/dietandnutrition/health-benefits-of-unripe-green-papaya.htm

61.  Plantain/raw banana/stalk: https://food.ndtv.com/ingredient/plantain-701208;https://www.ndtv.com/health/raw-bananas-are-good-for-diabetics-health-benefits-of-raw-bananas-you-must-know-1888722https://www.thehealthsite.com/diseases-conditions/natural-remedies/amazing-health-benefits-of-banana-stem-kd0718-582035/

62.  Mushroom: https://draxe.com/nutrition/mushroom-nutrition-benefits/

 

2. వృత్తాంతము ప్రాక్టీషనర్ యొక్క ఒక అద్భుత అనుభవం 11601… ఇండియా

సంపూర్ణ హృదయ విశ్వాసము తలపై  ఏర్పడిన రంధ్రాన్ని నయం చేసిన అనుభవం

2020  ఫిబ్రవరి 18న సాయంత్రం 5 గంటలసమయంలో క్లినిక్ ప్రారంభించడానికి ముందు ప్రాక్టీషనరు తన ఇంటి పోర్టికోసుబ్ర పరిచే టప్పుడు జారిపడి తన వెనుక భాగంవైపు పడిపోయారు. ఆమె కేకలు విన్న ఆమె సోదరీమణులు పరిగెత్తుకుంటూ వచ్చిరక్తపుమడుగులో సాయిరాం సాయిరాం అంటూకలవరిస్తున్న ఆమెను చూశారు. ఆపై 20 నిమిషాల అనంతరం ఆమె పరిసరాలపై పూర్తి అవగాహన కోల్పోయారు. అప్పటికే ఐదుగురు రోగులు చికిత్స కోసం వచ్చి ఆమె ఇంటి లోపల కూర్చుని ఉన్నారు. ప్రాక్టీషనరు సోదరీమణులు ఆమెను జాగ్రత్తగా వీల్ చైర్ లో కూర్చుండబెట్టి  సమీపంలోని ఆసుపత్రిలో చేర్చే ఏర్పాట్లు చేస్తూఉన్నారు.

ఇదే  సందర్భంలో  బయట గందరగోళం జరగడం చూచి లోపల వేచి ఉన్న రోగులు బయటకు వచ్చారు. ఇంతలో స్పృహ కలిగి సమూహంలో ఉన్న తన స్నేహితురాలిని ప్రాక్టీషనర్ గుర్తించారు. తన పరిస్థితి గురించి అర్థం చేసుకొన్న ఆమె  హాస్పిటల్ కి వెళ్లడానికి నిరాకరించి దానికి బదులుగా సాయి వైబ్రియానిక్స్ కోంబో బాక్స్ కోసం ఆమె అడిగారు. ఆమె రెమిడీ సిద్ధం చేసుకుని ఒక మోతాదు కూడా తీసుకున్నారు కానీ వెంటనే వాంతి అయ్యింది. స్వామి పై పూర్తి నమ్మకంతో మరొక మోతాదు తీసుకున్నారు అలాగే కొబ్బరి నూనెలో కూడా రెమిడీ తయారు చేసి తన గాయానికిపూయగానే  రక్తస్రావం ఆగిపోయింది. అటువంటి స్థితిలో కూడా ప్రాక్టీషనరు తనకోసం వచ్చిన ఐదుగురు రోగులలో దూరం నుండి వచ్చిన ముగ్గురికి  ఆమె రెమిడీలు సిద్ధం చేశారు. వారిలో ఒకరు గర్భవతి. మిగతా ఇద్దరూ ఆమెకు సమీపంలోనే ఉండటం చేత మరొక రోజు వస్తానని చెప్పివెళ్లారు.  

మరుసటి రోజు కుటుంబం యొక్క ఒత్తిడి మేరకు ఆమె సోదరి శ్రీ సత్యసాయి ఆస్పత్రికి తీసుకువెళ్లారు. తలకు గాయం అయినందున వెంటనే రాకుండా ఉండటానికి చూసి వారు మందలించారు. కుట్టు చేయడానికి గాయం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని నర్సు గుండుగా చేశారు. గాయం చాలా లోతుగా ఉన్నప్పటికీ అప్పటికే నయం కావడం ప్రారంభించిందని కుట్టు అవసరం లేదని డ్యూటీలో ఉన్న వైద్యులు కనుగొన్నారు! ఆమెను ఒక సీనియరు న్యూరోసర్జన్ కు రిఫర్ చేశారు.  వారు విస్తృతమైన రీతిలో శారీరక పరీక్ష రక్త పరీక్ష సిటీ స్కాన్ కూడా చేశారు. అక్కడున్న వైద్య సిబ్బంది ఏర్పడిన  లోతైన మూడు అంగుళాల పొడవైన గాయం ఏ సమస్యా లేకుండా మానిపోసాగడం, తలకు అంత దెబ్బ తగిలినా కనీసం అంతర్గత రక్తస్రావం, రక్తం గడ్డ కట్టడం, పగులు లేదా చిట్లడము, మెదడుకు గాయం వంటివి ఏమీ లేకపోవడం చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. గాయానికి కేవలం డ్రస్సింగ్ మాత్రం చేసి అల్లోపతీ ప్రమేయం ఏమీ లేకుండానే ఆమెను ఇంటికి పంపించారు. అయితే రక్త పరీక్షలో ఆమె రక్తంలో చక్కెర శాతం, రక్తపోటు కూడా స్వల్పంగా పెరిగినట్లు వెల్లడించింది.     (కింద పడటం కారణంగా ఇవి స్వల్పంగా పెరిగి ఉంటాయని డాక్టర్ భావించారు);  వీటి కోసం ఆమెకు మందులు ఇచ్చారు కానీ నొప్పి కోసం ఆమె ఏమీ తీసుకోలేదు!! వారం తర్వాత వాటిని తీసుకోవడం మానేసి ఒక నెలరోజులపాటు వైబ్రియనిక్స్ రెమిడీలు కొనసాగించారు. అదనంగా ఆమె స్వామి స్వయంగా సృష్టించిన పసుపును అప్పుడప్పుడు గాయానికి రాశారు. ఇప్పుడు ఆమె పూర్తిగా 100% కోలుకున్నారు. ఈ సంఘటన తన జీవితంలో గొప్ప అద్భుతం అని ఆమె భావిస్తూ వైబ్రియనిక్స్ కు స్వామికి కృతజ్ఞతలుతెలుపుతున్నారు.   

*CC3.2 Bleeding disorders + CC3.7 Circulation + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC18.5 Neuralgia + CC20.7 Fractures + CC21.11 Wounds & Abrasions

 

3. కోవిడ్-19 నవీకరణము

2020 ఏప్రిల్ 13 నుండి కోవిడ్-19 నివారణ మరియు చికిత్స కోసం ఈ క్రిందికాంబోలను ఉపయోగిస్తూ ఉన్నాము:

CC4.1 Digestion tonic + CC4.8 Gastroenteritis + CC9.4 Children’s diseases + CC10.1 Emergencies + CC13.1 Kidney & Bladder tonic + CC15.1 Mental & Emotional tonic + CC19.3 Chest Infections chronic + CC19.6 Cough chronic + CC19.7 Throat chronic

108CC box లేకుండా SRHVP ఉన్నవారికోసం: NM6 Calming + NM76 Dyspnoea + NM113 Inflammation + BR4 Fear + BR14 Lung +SM26 Immunity + SM27 Infection + SM31 Lung & Chest + SM40 Throat + SR270 Apis Mel + SR271 Arnica 30C + SR272 Arsen Alb 30C + SR277 Bryonia 30C + SR291 Gelsemium 30C + SR298 Lachesis + SR301 Mercurius 30C + SR302 Nux Vom 30C + SR306 Phosphorus 30C + SR385 Eupatorium Perf + SR406 Sabadilla 30C + SR505 Lung

కోవిడ్ వైరస్ త్వరగా పరివర్తనము అవడం(మ్యూటేషన్) విషయం చూసి మన పరిశోధనా బృందం ఇమ్యూనిటీ బూస్టర్ ను ఈ క్రింది విధంగా సవరించారు:

CC4.1 Digestion tonic + CC4.2 Liver & Gallbladder tonic + CC9.2 Infections acute + CC9.4 Children’s diseases + CC15.1 Mental & Emotional tonic + CC19.3 Chest Infections chronic + CC19.6 Cough chronic + CC19.7 Throat chronic

108CC box లేకుండా SRHVP ఉన్నవారికోసం: NM6 Calming + BR4 Fear + BR9 Digestion + BR10 Fever & Infection + BR14 Lung + SM26 Immunity + SM27 Infection + SM31 Lung & Chest +SM40 Throat + SR271 Arnica 30C + SR272 Arsen Alb 30C + SR291 Gelsemium 200C + SR302 Nux Vom 30C

ఈ రెండు సందర్భంలోనే మునుపటి మాదిరిగానే మోతాదు ఉంటుంది: ముందస్తు కోసం నిద్ర లేవగానే OD;  అనుమానాస్పద విషయంలో (స్వల్పముగా దగ్గు వంటి లక్షణాలు)TDS; కోవిడ్-19 కు గురైన వ్యక్తికి 6 గంటలవరకూ  ప్రతి గంటకు ఒక మోతాదు చొప్పున ఆతర్వాత 6TD; కోలుకుంటున్నప్పుడు QDS - TDS - BD - OD.గా తగ్గించు కుంటూ రావాలి.  ఏ అలోపతి చికిత్స అయినా కొనసాగించాలి కానీ ఏ సమయంలోనూ ఆపడానికి ప్రయత్నించ కూడదు.

కోలుకోవడం:  రోగి కోలుకున్న తర్వాత తక్కువ శక్తి కలిగి ఉండి, శారీరకంగా మానసికంగా అలసిపోయినట్లు అనిపించినప్పుడు రోగి ఆరోగ్యంగా మరియు బలంగా తయారయ్యే వరకు క్రింది రిక్యూపరేషన కోంబో ఇవ్వండి:  

CC4.1 Digestion tonic + CC11.3 Headaches + CC19.7 Throat chronic

108CC లేకుండా SRHVP ఉన్నవారికోసం: NM75 Debility + BR9 Digestion + BR10 Fever & Infection + SM31 Lung & Chest + SM24 Glandular + SM40 Throat

పై రెండు సందర్భాలలోనూ మోతాదు: నిద్ర పోయే ముందు రాత్రి OD గా తీసుకుంటూ ఇమ్యూనిటీ బూస్టర్ మాత్రం పగటి పూట ODగా  కొనసాగిస్తునే ఉండాలి.

2020 ఏప్రిల్ 20 కంటే ముందు ఆల్కహాల్ లో రెమిడీ సిద్ధం చేస్తున్న వారి సౌలభ్యం కోసం వారు తమరెమిడీ బాటిల్ కు క్రింది వాటిని జోడించవచ్చు: CC4.2 Liver & Gallbladder tonic + CC9.2 Infections acute.

108 సి సి బాక్స్ లేకుండా  SRHVP ఉన్నవారికి: BR9 Digestion + BR10 Fever & Infection