Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

Vol 17 సంచిక 2
మార్చ్ / ఎప్రిల్ 2026
ముద్రింప తగిన వార్తాలేఖ


పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి

డా. జిత్. కె అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి

ప్రియమైన ప్రాక్టీషనర్లకు,

సాయి వైబ్రియానిక్స్ కుటుంబంలోని మన అందరికీ జనవరి నెల మిశ్రమ భావోద్వేగాలతో నిండిన నెలగా నిలిచింది.

ఇటీవల మన అత్యంత సీనియర్ ప్రాక్టీషనర్ మరియు పరిశోధన విభాగాధిపతిని కోల్పోయాము. ఆమె ఒక అద్భుతమైన వ్యక్తి, అత్యంత అంకితభావం గల సేవకురాలు. నిస్వార్థ సేవా భావానికి ఆమె సజీవ ఉదాహరణ. సాయి వైబ్రియానిక్స్ ప్రయాణం ప్రారంభమైన నాటి నుండి ఆమె మనతో ఉన్నారు. నేడు మనం ఉపయోగిస్తున్న 108CC బాక్స్ ఆమె విడిచిపెట్టిన అమూల్యమైన వారసత్వంలో ఒక భాగం. ఈ అపారమైన నష్టంతో మన హృదయాలు బాధపడుతున్నప్పటికీ, ఆమె ఆత్మ స్వామి సన్నిధికి చేరిందనే భావన మనకు ఓదార్పునిస్తుంది. వైబ్రియానిక్స్‌కు ఆమె అందించిన అమూల్యమైన సేవలకు కృతజ్ఞతగా, ప్రాక్టీషనర్స్ కార్నర్‌లో పాట్ హంట్ గారికి మన ఘన నివాళులను అర్పిస్తున్నాము.

అదే సమయంలో, మన సమిష్టి ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని కూడా చేరుకున్నాము. ఈ సంవత్సరం జనవరి 26న తొలి “సాయి వైబ్రియానిక్స్ దినోత్సవం”ను జరుపుకుని, మన సమాజానికి ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాము. జనవరి 26నే ఎందుకు ఎంచుకున్నామని చాలామంది అడిగారు. అది భారత గణతంత్ర దినోత్సవం కావడంతో జాతీయ సెలవుదినంగా ఉంటుంది; అందువల్ల సేవా కార్యక్రమాలను నిర్వహించడం సులభమవుతుంది. అలాగే, ఆ సమయంలో ప్రశాంతి నిలయంలో సెలవుదినాల రద్దీ తగ్గి ఉండటంతో వసతి సౌకర్యాలు కూడా సులభంగా లభిస్తాయి. ముఖ్యంగా, ఆ రోజు ఐక్యత మరియు పురోగతికి ప్రతీకగా నిలుస్తుంది. ఇవి మన లక్ష్యంతో ఎంతో సన్నిహితంగా అనుసంధానమైన విలువలు. ఇంకా విశేషమేమిటంటే, 2014లో ప్రశాంతి నిలయంలో నిర్వహించిన తొలి అంతర్జాతీయ వైబ్రియానిక్స్ సదస్సు కూడా ఇదే తేదీన జరిగింది. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రాక్టీషనర్ల సమాజానికి ఈ తేదీ మరింత ప్రత్యేకమైనదిగా నిలిచింది.

ప్రపంచవ్యాప్తంగా వైబ్రియానిక్స్ దినోత్సవాన్ని వైద్య శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు మరియు వర్చువల్ సమావేశాల ద్వారా ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారని మీతో పంచుకోవడం నాకు ఆనందంగా ఉంది. భారతదేశం, బోస్నియా, కెనడా, క్రొయేషియా, ఫ్రాన్స్, గాబోన్, జర్మనీ, గ్రీస్, ఇటలీ, పోలాండ్, ఖతార్, రొమేనియా, రష్యా, దక్షిణాఫ్రికా, స్లోవేనియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, అమెరికా మరియు జింబాబ్వే తదితర 18 దేశాల ప్రాక్టీషనర్లు తొలి వైబ్రియానిక్స్ దినోత్సవ వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమావేశంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి మాట్లాడే అవకాశం నాకు లభించింది. నా ప్రసంగంలోని ముఖ్యాంశాలను ‘అదనంగా’ విభాగంలో చూడవచ్చు.

మరో ముఖ్యమైన విషయంగా, ఇప్పుడు SVIRT కార్యాలయంలో అందుబాటులో ఉన్న సాయి వైబ్రియానిక్స్ బ్యాడ్జ్ విడుదలైన విషయాన్ని తెలియజేయడం మాకు ఆనందంగా ఉంది. ఈ బ్యాడ్జ్‌లను ప్రాక్టీషనర్లు వైద్య శిబిరాలు మరియు సమావేశాల సందర్భంగా ధరించడం ద్వారా ఐక్యతా భావాన్ని, పరస్పర అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవచ్చు.

గత నెలలో మహాశివరాత్రి పవిత్ర సందర్భంగా ప్రశాంతి నిలయంలో జరిగిన రాత్రంతా భజనలు మరియు లింగాభిషేకం ద్వారా మనలో చాలామంది దివ్యమైన ఆధ్యాత్మిక స్పందనలను అనుభవించే భాగ్యం పొందాము. ఈ పవిత్ర పర్వదినాన స్వామి అందించిన సందేశాన్ని మననం చేసుకుంటూ, మన సాధనను మరియు సేవను మరింతగా లోతుగా చేసుకునేందుకు ప్రేరణ పొందుదాం.

భగవంతునికి చేసే సేవకన్నా మానవునికి చేసే సేవ ఎంతో అవసరమైనది. వాస్తవానికి, మానవ సేవే మాధవ సేవ. ఇదే నిజమైన భక్తి మార్గం. భగవంతుని సంతానాన్ని సంతోషపరచడం కన్నా భగవంతుని సంతోషపరచడానికి మరే గొప్ప మార్గం ఉండగలదు? పురుషసూక్తం పురుషుని లేదా భగవంతుని వెయ్యి తలలు, వెయ్యి కళ్ళు, వెయ్యి పాదాలు కలవాడిగా వర్ణిస్తుంది. అంటే సమస్త జీవరాశి ఆయనే. వెయ్యి తలలు ఉన్నాయని చెప్పినా, వెయ్యి హృదయాలు ఉన్నాయని చెప్పలేదు; హృదయం ఒక్కటే. అదే రక్తం అన్ని తలలు, కళ్ళు, పాదాలు మరియు అవయవాలలో ప్రసరిస్తుంది. మీరు ఒక అవయవాన్ని సంరక్షించినప్పుడు వ్యక్తినే సంరక్షించినట్లే; మీరు మానవునికి సేవ చేసినప్పుడు భగవంతునికే సేవ చేసినట్లే.”… శ్రీ సత్యసాయి బాబా, ఫిబ్రవరి 1966, ప్రశాంతి నిలయం (శ్రీ సత్య సాయి స్పీక్స్, సంపుటి. 6, 1966)

స్వామి మనకు గుర్తుచేస్తున్నట్లుగా, నిజమైన భక్తి కేవలం ప్రార్థనలు లేదా భజనలలో మాత్రమే వ్యక్తమవదు; ఆయన సంతానానికి నిస్వార్థంగా చేసే సేవలోనే అది పరిపూర్ణంగా వికసిస్తుంది. అంకితభావంతో సేవ చేసిన ఒక సేవకురాలికి మనం అర్పించిన నివాళి, సాయి వైబ్రియానిక్స్ దినోత్సవ వేడుకలు, అలాగే మహాశివరాత్రి పవిత్ర ఆచరణలు — ఇవన్నీ ఒకే సత్యాన్ని ప్రతిధ్వనిస్తున్నాయి: సేవే అత్యున్నత ఆరాధన. మనము ప్రేమతో, వినయంతో, విశ్వాసంతో బాధలో ఉన్నవారిని ఆదుకున్నప్పుడు, సర్వజీవుల్లో నివసించే ఆ పరమాత్మకే సేవ చేస్తున్నాము. అందువల్ల, నూతన ఉత్సాహంతో మరియు దృఢసంకల్పంతో ముందుకు సాగుదాం. మనం సిద్ధం చేసే ప్రతి రెమెడీని, చికిత్స చేసే ప్రతి రోగిని, చేసే ప్రతి దయా కార్యాన్ని ఆయన పదపద్మాలకు సమర్పించే పుష్పంగా భావిద్దాం. మానవ సేవే మాధవ సేవ. ఆ సేవలోనే మన ఆనందం, మన ఐక్యత, మన జీవిత పరమార్థం నిక్షిప్తమై ఉన్నాయి.

సాయికి ప్రేమపూర్వక సేవలో,

జిత్ కె. అగ్గర్వాల్

వీనస్ అల్సర్ 11654...भारत

72 సంవత్సరాల వయస్సు గల ఒక వ్యక్తి, 2024 మే నెలలో జరిగిన ప్రమాదంలో తన కుడి పాదం పైభాగం వద్ద తీవ్రమైన గాయానికి గురయ్యాడు. ఆ గాయం క్రమంగా 1 నుండి 2 సెం.మీ. లోతైన, బిలం ఆకారపు పుండుగా (చిత్రం 1) మారింది. దాని చుట్టూ గణనీయమైన వాపు కూడా ఏర్పడింది. ప్రమాదం జరిగిన వెంటనే ప్రథమ చికిత్స పొందిన అనంతరం, అతను ఆరు నెలల పాటు అలోపతి చికిత్స తీసుకున్నాడు. ఈ కాలంలో అనేక పరీక్షలు, స్కాన్లు నిర్వహించినప్పటికీ, గాయం మానుతున్నట్లు ఎటువంటి సూచనలు కనిపించలేదు. గాయం నిరంతరం తడిగా ఉండేది, అలాగే వాపు కూడా కొనసాగింది. గాయం వల్ల కలిగిన నొప్పి కారణంగా అతను కుంటుతూ నడవాల్సి వచ్చేది. నొప్పి ఉపశమనానికి తరచూ నొప్పి నివారణ మందులపై ఆధారపడేవాడు. వైద్యుల సూచనలకు విరుద్ధంగా, అతను తరచూ కారు నడుపుతుండేవాడు. ఇది గాయం మానడంలో ఆలస్యానికి ఒక కారణంగా భావించబడింది. చివరకు వైద్యులు చర్మ మార్పిడి శస్త్రచికిత్స చేయాలని సూచించినప్పటికీ, అతను అందుకు ఇష్టపడలేదు.

ఈ రోగిని వ్యక్తిగతంగా తెలిసిన ప్రాక్టీషనర్, అతను కుంటుతూ కారులోకి ఎక్కడం గమనించి, వైబ్రియానిక్స్ గురించి సూచించారు. వెంటనే రోగి అపాయింట్‌మెంట్ తీసుకున్నాడు. సంప్రదింపుల సమయంలో గాయం లోతుగా, తడిగా ఉండి, అంచులు వాపుతో ఎర్రబడి కనిపించాయి. వాపు మొత్తం పాదం అంతటా వ్యాపించింది. రోగి MRI నివేదికలను పరిశీలించగా, వీనస్ వాల్వుల పనితీరు సరిగా లేకపోవడం వల్ల గాయం చుట్టూ ద్రవం పేరుకుపోవడం, వెరికోస్ వీంస్, అలాగే చర్మం క్రింద వాపు ఏర్పడటం వంటి సమస్యలు ఉన్నట్లు తెలిసింది. ఇవన్నీ గాయం మానడాన్ని గణనీయంగా అడ్డుకుంటున్నాయి. 2024 నవంబర్ 9న అతనికి క్రింది వైబ్రియానిక్స్ రెమెడీలు ఇవ్వబడ్డాయి:

#1. CC3.1 Heart tonic + CC3.2 Bleeding disorders + CC3.7 Circulation + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC18.5 Neuralgia + CC20.4 Muscles & Supportive tissue + CC21.11 Wounds & Abrasions… ప్రతి 10 నిమిషాలకు ఒక మోతాదు ఒక గంటపాటు అనంతరం అదే మోతాదు TDS.*

#2. IB (Vol 13 #5)…OD

చికిత్స పురోగతి

  • 27 నవంబర్ 2024: నొప్పి అప్పుడప్పుడు మాత్రమే ఉండేది. నొప్పి నివారణ మందులను పూర్తిగా నిలిపివేశారు. గాయం నెమ్మదిగా మానుతున్నందుకు రోగిలో ఆందోళన ఉండటంతో, #1 ను #3 గా మెరుగుపరిచారు. CC15.1 Mental & Emotional Tonic + #1 … TDS*
  • 14 డిసెంబర్ 2024: కాలు పైకి ఎత్తకుండా ఉన్నప్పుడు మాత్రమే నొప్పి ఉండేది. వాపు 75% తగ్గింది.
  • 30 జనవరి 2025: గాయం పరిమాణం తగ్గి, ఎండడం ప్రారంభమైంది. నొప్పి 80% తగ్గింది. #3 ను #4 గా మెరుగుపరిచారు. CC20.2 SMJ Pain + CC21.1 Skin Tonic + #3 … TDS*
  • 14 ఫిబ్రవరి 2025: గాయం మరింత ఎండింది. నివారణగా క్రింది రెమెడీ ఇవ్వబడింది: #5. CC21.2 Skin Infections + #4 … TDS*
  • 9 మార్చి 2025: పురోగతి నెమ్మదిగా ఉండటంతో, స్నానం చేసే సమయంలో గాయాన్ని రక్షించుకోవాలని మరియు కారు నడపడం మానుకోవాలని సూచించారు. #5 ను క్రింది రెండు వేర్వేరు సీసాలుగా విభజించారు: #6. CC3.1 Heart Tonic + CC3.2 Bleeding Disorders + CC3.7 Circulation + CC10.1 Emergencies + CC12.1 Adult Tonic + CC15.1 Mental & Emotional Tonic … BD* & #7. CC18.5 Neuralgia + CC20.2 SMJ Pain + CC20.4 Muscles & Supportive Tissue + CC20.7 Fractures + CC21.1 Skin Tonic + CC21.2 Skin Infections + CC21.11 Wounds & Abrasions … BD*
  • 19 ఏప్రిల్ 2025: గాయం పూర్తిగా ఎండిపోయి, పరిమాణం మరింత తగ్గింది. ఎక్కువ శ్రమ చేసినప్పుడు మాత్రమే నొప్పి ఉండేది. వాపు 90% తగ్గింది. #6 మరియు #7 మోతాదులను 6TD కు మార్చారు.
  • 22 జూలై 2025: అన్ని లక్షణాలు పూర్తిగా తగ్గిపోయాయి. రోగి తన సాధారణ దినచర్యను తిరిగి ప్రారంభించాడు. మోతాదును ఒక వారం పాటు TDS కు తగ్గించి, తరువాత OD గా మార్చారు.
  • 7 ఆగస్టు 2025: మోతాదును క్రమంగా తగ్గించిన అనంతరం రెమెడీలు పూర్తిగా నిలిపివేశారు.

* ప్రతి మోతాదు: ఒక గంటపాటు ప్రతి 10 నిమిషాలకు ఒక డోసు చొప్పున తీసుకోవాలి.

డిసెంబర్ 2025 నాటికి, రోగి పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడు మరియు ఎటువంటి సమస్యలు లేకుండా సాధారణ జీవితం గడుపుతున్నాడు.

 

 

ఆందోళన, శ్వాసకోశ అలర్జీ, వణుకులు, వెన్నునొప్పి 11668...भारत

62 సంవత్సరాల వయస్సు గల ఒక వ్యక్తి బ్యాంకింగ్ రంగంలో చాలాకాలం పాటు తీవ్రమైన ఒత్తిడితో కూడిన ఉద్యోగం చేసి ఆ ఒత్తిడిని తట్టుకోలేక 2013లో, తన 50 ఏళ్ల వయస్సులో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఉద్యోగం వదిలినప్పటికీ, ఆ ఉద్యోగానికి సంబంధించిన చేదు జ్ఞాపకాలు అతనిని వెంటాడుతూనే ఉండటంతో, 12 సంవత్సరాల తర్వాత కూడా అతను నిరంతర ఆందోళనతో బాధపడుతూనే ఉన్నాడు. దీని ఫలితంగా అతనికి తీవ్రమైన నిద్రలేమి ఏర్పడి, రాత్రి కేవలం మూడు గంటల మాత్రమే నిద్రపోయేవాడు. దీనివల్ల పగటిపూట ఎల్లప్పుడూ అలసటగా ఉండేది. గత నాలుగు సంవత్సరాలుగా, బయట నడవడం లేదా దుమ్ముకు గురికావడం వల్ల అతనికి తరచుగా తుమ్ములు మరియు ముక్కు కారడం ప్రారంభమయ్యేవి. ప్రతి సారి ఈ లక్షణాలు సుమారు మూడు గంటల పాటు కొనసాగేవి. ఉపశమనం కోసం యూకలిప్టస్ నూనె మరియు ఇతర ఇంటి చిట్కాలను ఉపయోగించినప్పటికీ, అవి పాక్షిక ఉపశమనాన్ని మాత్రమే కలిగించాయి. గత రెండు సంవత్సరాలుగా, అతను చేతులు మరియు కాళ్లలో తరచుగా వణుకులతో (tremors) బాధపడుతున్నాడు. రోజుకు కనీసం ఎనిమిది సార్లు ఈ వణుకులు వచ్చేవి. ఒక్కోసారి సుమారు రెండు నిమిషాల పాటు కొనసాగేవి. ఆ సమయంలో అతను పెన్ను పట్టుకోవడం లేదా రోజువారీ పనులను సక్రమంగా చేయడం కూడా కష్టంగా ఉండేది. ఒక సంవత్సరం క్రితం, కొన్ని నిమిషాలు నడిచిన తర్వాత అతనికి వెన్నునొప్పి ప్రారంభమైయ్యెది, మరియు ప్రతిసారీ సుమారు పది నిమిషాల పాటు కొనసాగేది. దీనికి అతను ఇతర ఎలాంటి చికిత్సా తీసుకోలేదు. 2025 ఆగస్టు 12న పదవీ విరమణ చేసిన ఉద్యోగుల సమావేశంలో సాయి వైబ్రియానిక్స్ గురించి జరిగిన సంక్షిప్త ప్రసంగాన్ని విన్న అనంతరం, అతను ఒక ప్రాక్టిషనర్‌ను సంప్రదించగా, క్రింది రెమెడీలు ఇవ్వబడ్డాయి:

తుమ్ములు మరియు ముక్కు కారడానికి:

#1. CC9.2 Infections acute + CC12.1 Adult tonic + CC19.2 Respiratory allergies + CC19.5 Sinusitis + CC19.6 Cough chronic...TDS

వణుకులు మరియు వెన్నునొప్పికి:

#2. CC15.1 Mental & Emotional tonic + CC18.5 Neuralgia + CC18.6 Parkinson’s disease + CC20.2 SMJ pain + CC20.3 Arthritis + CC20.5 Spine...TDS

నిద్ర కోసం:

#3. CC15.6 Sleep disorders...నిద్రపోయే అరగంట ముందు.

చికిత్స పురోగతి:

19 ఆగస్టు 2025: చేతులు, కాళ్ల వణుకులు రోజుకు 1–2 సార్లకు తగ్గాయి. తుమ్ములు, ముక్కు కారడం ఒక్కోసారి కేవలం ఒక గంట మాత్రమే కొనసాగాయి. దుమ్ము వల్ల కలిగే లక్షణాల తీవ్రత కూడా గణనీయంగా తగ్గింది. మానసికంగా ప్రశాంతంగా అనిపించడంతో పాటు, నిద్ర కూడా మెరుగుపడి రోజుకు ఆరు గంటలు నిద్రపోగలిగాడు.

10 సెప్టెంబర్ 2025: అన్ని లక్షణాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఇంటి చిట్కాల అవసరం లేకుండా పోయింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వేచ్ఛగా రాయగలిగాడు. ఉత్సాహంగా, ఆనందంగా అనిపించింది. దీంతో #1 మరియు #2 రెమెడీల మోతాదును రోజుకు ఒకసారి (OD)కు తగ్గించి, #3ను నిలిపివేశారు.

23 సెప్టెంబర్ 2025: #1 మరియు #2 రెమెడీల మోతాదును క్రమంగా తగ్గించి పూర్తిగా నిలిపివేశారు.

2026 జనవరి 16 నాటికి, ఈ లక్షణాలు ఏవీ తిరిగి కనిపించలేదు.

మడమల పగుళ్లు 11658...भारत

ప్రాక్టీషనర్ నివసించే రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో కాపలాదారునిగా పనిచేస్తున్న 56 ఏళ్ల వ్యక్తికి, 2024 జూన్‌లో రెండు మడమలలోనూ పగుళ్లు (కుడి మడమలో తీవ్రంగా – చిత్రం చూడండి) ఏర్పడ్డాయి. అతనికి పనిలో ఎక్కువసేపు నిలబడాల్సి వచ్చేది. వేసవి కాలంలో పగుళ్లు మరింత తీవ్రమై, తరచూ రక్తస్రావం కావడంతో నిలబడటానికి, నడవడానికి ఇబ్బంది కలిగేది. మడమలు మరింత పొడిబారకుండా ఉండేందుకు అతను ఆవ నూనె మాత్రమే రాసుకునేవాడు; ఇతర ఎలాంటి చికిత్స తీసుకోలేదు.

21 జూన్ 2025న అతనికి ఈ క్రింది రెమెడీ ఇవ్వబడింది:

CC3.2 Bleeding disorders + CC21.5 Dry Sores…BD కొబ్బరి నూనెలో కలిపి బాహ్యంగా రాయడానికి.

చికిత్స పురోగతి:

30 జూన్ 2025: రెండు మడమలలోని పగుళ్లు పూర్తిగా నయమయ్యాయి. రోగి ఎంతో ఆనందంతో కృతజ్ఞతలు తెలిపాడు.

30 జూలై 2025: రెమెడీని నిలిపివేసి, అవసరమైతే వాడేందుకు ముందుజాగ్రత్తగా దగ్గర ఉంచుకున్నారు.

2026 జనవరి నాటికి ఈ సమస్య మళ్లీ రాలేదు.

 

                          చికిత్సకు ముందు                                చికిత్స తర్వాత

దూకుడు ప్రవర్తన 11634...भारत

వైబ్రియానిక్స్ శిబిరానికి తీవ్ర ఆందోళనతో వచ్చిన ఒక తండ్రి, తన 35 ఏళ్ల కుమారుడికి చికిత్స అందించాలని ప్రాక్టీషనర్‌ను కోరాడు. అతని కుమారుడు మెకానికల్ ఇంజినీర్. చిన్నప్పటి నుంచే అతను అత్యంత భావోద్వేగపరుడు, ఎప్పుడూ ఉద్విగ్నంగా ఉండేవాడు. పెద్ద శబ్దాలను లేదా తన అభిప్రాయానికి భిన్నమైన అభిప్రాయాలను అస్సలు సహించలేకపోయేవాడు. ముఖ్యంగా తన సవతి తల్లిపట్ల, చిన్నచిన్న విషయాలకే తీవ్రంగా కోపంతో దూకుడుగా ప్రవర్తించేవాడు. అసంతృప్తిగా ఉన్నప్పుడు భోజనపు పళ్ళాన్ని విసిరేయడం లేదా ఇంటి సామగ్రిని ధ్వంసం చేయడం చేసేవాడు. కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోవడం, తిరిగి రావడం, అంతేకాకుండా ఉద్యోగం కోసం విదేశాలకు కూడా చెప్పకుండా వెళ్లిపోవడం చేసేవాడు. కాలక్రమేణా, అతని కోపాన్ని రెచ్చగొట్టకుండా ఉండేందుకు కుటుంబ సభ్యులే తమ ప్రవర్తనను మార్చుకున్నారు. అతను ఎప్పుడూ వైద్యుడిని సంప్రదించలేదు, ఎలాంటి చికిత్స కూడా తీసుకోలేదు.

తండ్రి క్రమం తప్పకుండా యోగా చేసే వ్యక్తి మరియు వైబ్రియానిక్స్ ద్వారా ప్రయోజనం పొందిన రోగి. చాలాకాలంగా తన కుమారుడిని యోగా చేయమని, వైబ్రియానిక్స్ ప్రయత్నించమని ప్రోత్సహించినప్పటికీ, అతను అనుమానంతో వాటిని నిరాకరించేవాడు. అయితే, తన తండ్రికి ఆసనద్వార భగందరం (Anal fistula) నుంచి వైబ్రియానిక్స్ ద్వారా విశేషమైన ఉపశమనం లభించినట్లు (వాల్యూం 16 #2 చూడండి) చూసిన తరువాత, చివరకు వైబ్రియానిక్స్ చికిత్సకు అంగీకరించాడు.

11 జనవరి 2023న ప్రాక్టీషనర్ ఈ క్రింది రెమెడీ ఇచ్చారు:

CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…TDS

అతను ఇతర ఎలాంటి చికిత్స తీసుకోవడం లేదు.

చికిత్స పురోగతి:

18 జనవరి 2023: రోగి ప్రవర్తనలో స్వల్ప మార్పు కనిపించింది; కొంత శాంతంగా మారి యోగా సాధన ప్రారంభించాడు.

1 ఫిబ్రవరి 2023: ప్రవర్తనలో విశేషమైన మెరుగుదల కనిపించింది. అతను ప్రశాంతంగా, సమతుల్యంగా మారి, కుటుంబ విషయాలు మరియు భవిష్యత్ ప్రణాళికల గురించి తన తల్లిదండ్రులతో చర్చించడం ప్రారంభించాడు—ఇది అతను ఇంతకు ముందు ఎప్పుడూ చేయలేదు. ఈ మార్పుతో తండ్రి ఎంతో సంతోషం వ్యక్తం చేశాడు.

29 మార్చి 2023: ఇకపై రెమెడీ అవసరం లేదని భావించి, రోగి చికిత్సను నిలిపివేశాడు.

28 మే 2025న, తన సిఫారసుతో అతని స్నేహితుడు చికిత్స కోసం ప్రాక్టీషనర్‌ను సంప్రదించడం ద్వారా, వైబ్రియానిక్స్ ప్రభావంపై అతనికి ఏర్పడిన విశ్వాసం మరింత స్పష్టమైంది.

2026 జనవరి నాటికి అతను ఆరోగ్యంగా, ప్రశాంతంగా కొనసాగుతున్నాడు. తన కుమారుడి ప్రవర్తనలో వచ్చిన ఈ సానుకూల మార్పుకు తండ్రి వైబ్రియానిక్స్ పట్ల హృదయపూర్వక కృతజ్ఞతతో ఉన్నాడు.

అధిక లాలాజల స్రావం, వికారం, తలనొప్పి 11632...भारत

1996 నుంచి పునరావృతమవుతున్న మూత్రనాళ ఇన్ఫెక్షన్  (UTI)తో బాధపడుతున్న 52 ఏళ్ల మహిళ, తరచూ యాంటీబయోటిక్ కోర్సుల ద్వారా చికిత్స పొందుతూ వచ్చారు. 2010లో ఆమెకు పొత్తికడుపు దిగువ భాగంలో నొప్పి ప్రారంభమై, పరీక్షల అనంతరం Painful Bladder Syndromeగా నిర్ధారణ అయింది. ఆమెకు నొప్పి నివారణ మందు Nise సూచించబడగా, దానిని తరువాతి పది సంవత్సరాల పాటు వాడారు. 2020 ఏప్రిల్ నాటికి పొత్తికడుపు నొప్పి చాలావరకు తగ్గినప్పటికీ, Niseను దీర్ఘకాలం వాడటం వల్ల అనేక దుష్ప్రభావాలు కలగడంతో, తీవ్రమైన నొప్పి వచ్చినప్పుడు మాత్రమే దానిని తీసుకోవడం ప్రారంభించారు. అనంతరం ప్రతిరోజూ అధికంగా లాలాజలం ఊరడం, రోజంతా కొనసాగే వికారం, అలాగే సుమారు గంటసేపు ఉండే తలనొప్పితో బాధపడసాగారు. బయట ఆహారం తిన్న తరువాత ఈ లక్షణాలు మరింత ఎక్కువయ్యేవి. అందువల్ల వీలైనంతవరకు బయట ఆహారం తీసుకోవడం మానేశారు. హోమియోపతి చికిత్స తీసుకుని ఆరు నెలల్లో 50% ఉపశమనం పొందినా, తరువాత 2020 డిసెంబరులో ఆయుర్వేద చికిత్సను ఒక సంవత్సరం పాటు తీసుకున్నప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో దానిని నిలిపివేశారు. ఆ తరువాత తీవ్రమైన సందర్భాల్లో యాంటాసిడ్లు, నొప్పి నివారణ మందులు వాడినా, అవి కొంతవరకే ఉపశమనం కలిగించేవి.

ఒక స్నేహితురాలి సలహా మేరకు, ఆమె 9 జూన్ 2023న ప్రాక్టీషనర్‌ను సంప్రదించగా, ఈ క్రింది రెమెడీ ఇవ్వబడింది:

CC4.10 Indigestion + CC10.1 Emergencies + CC12.1 Adult tonic…TDS

చికిత్స పురోగతి:

15 జూన్ 2023: అధిక లాలాజల స్రావం, వికారం 50% తగ్గాయి; తలనొప్పి తీవ్రత 75% తగ్గింది.

30 జూలై 2023: అన్ని లక్షణాల్లో 80% ఉపశమనం లభించింది.

16 డిసెంబర్ 2023: అన్ని లక్షణాలు పూర్తిగా (100%) నయమయ్యాయి. ఒక పర్యటనలో బయట ఆహారం తీసుకున్నప్పటికీ ఎలాంటి అసౌకర్యం కలగలేదు.

16 జనవరి 2024: మోతాదును ODకు తగ్గించారు.

16 మే 2024: మోతాదును క్రమంగా తగ్గిస్తూ రెమెడీని పూర్తిగా నిలిపివేశారు.

2026 జనవరి నాటికి ఆమె పూర్తిగా లక్షణరహితంగా ఉన్నారు. బయట ఆహారం తీసుకునే ముందు ఒక రోజు, మానసిక ప్రశాంతత కోసం మాత్రమే OD మోతాదులో రెమెడీని తీసుకుంటున్నారు.

సైనసైటిస్ 11656...भारत

43 ఏళ్ల గృహిణికి 2024 మే నుంచి తీవ్రమైన తలనొప్పి ప్రారంభమైంది. దుమ్ముకు గురైన ప్రతిసారీ తలనొప్పి తప్పనిసరిగా వచ్చేది. జూన్‌లో ఆమెకు సైనసైటిస్ అని నిర్ధారణ అయి, ఐదు రోజుల పాటు అల్లోపతి చికిత్స తీసుకున్నారు. దాంతో కొంత ఉపశమనం లభించినప్పటికీ, దుమ్ముకు గురైనప్పుడల్లా తలనొప్పి మళ్లీ వచ్చేది.

2024 నవంబర్ నాటికి ఆమెకు చెవినొప్పి కూడా ప్రారంభమై, పరీక్షల్లో చెవిపొర (eardrum)కు రంధ్రం ఉన్నట్లు నిర్ధారణ అయింది. అదే నెలలో ఆమెకు సైనస్ శస్త్రచికిత్స జరిగింది. దాంతో చెవినొప్పి 70% తగ్గింది. అయితే ఆ తరువాత ప్రతిరోజూ ముక్కు మూసుకుపోవడం ప్రారంభమైంది. కొద్దిసేపు బయటకు వెళ్లినా తట్టుకోగలిగే స్థాయిలో తలనొప్పి, అలాగే ముక్కు కారడం వచ్చేవి. ఒకటి లేదా రెండు రోజులపాటు విశ్రాంతి తీసుకున్న తరువాత మాత్రమే అవి తగ్గేవి. బయటకు వెళ్లకుండా పూర్తిగా ఉండటం సాధ్యం కాకపోవడం, మళ్లీ అల్లోపతి మందులు తీసుకోవడానికి ఇష్టపడకపోవడం వల్ల ఈ సమస్యలు ఆమె దైనందిన జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి.

అదనంగా, ఆమెకు చివరిసారిగా రుతుస్రావం 2024 ఆగస్టులో జరిగింది. గత ఆరు నెలలుగా ఆమె అలసటను కూడా అనుభవిస్తున్నారు. ఇది రుతువిరతి (Perimenopause) ప్రారంభ దశ కారణంగా వచ్చిందని ఆమె భావించినప్పటికీ, ఆమె ప్రధాన సమస్య మాత్రం సైనసైటిస్‌నే.

8 ఫిబ్రవరి 2025న ఆమెకు ఈ క్రింది రెమెడీ ఇవ్వబడింది:

#1. CC5.2 Deafness + CC8.6 Menopause + CC9.2 Infections acute + CC10.1 Emergencies + CC11.3 Headaches + CC19.2 Respiratory allergies + CC19.5 Sinusitis + CC19.6 Cough chronic...TDS

చికిత్స పురోగతి:

19 ఫిబ్రవరి 2025: అలసట పూర్తిగా తగ్గింది. ముక్కు మూసుకుపోవడం 70%, ముక్కు కారడం 50% తగ్గాయి.

6 మార్చి 2025: ముక్కు మూసుకుపోవడం పూర్తిగా నయమైంది. ముక్కు కారడం 70% తగ్గింది. తలనొప్పి తీవ్రత 50% తగ్గింది. ఇక విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం లేకపోయింది. రుతుస్రావం కూడా తిరిగి ప్రారంభమైంది.

5 ఏప్రిల్ 2025: ముక్కు కారడం 90% మెరుగుపడింది. గత ఆరు నెలలుగా తరచూ కోపం వస్తోందని ఆమె తెలియజేయడంతో, #1ను ఈ విధంగా మార్చారు: #2. CC15.1 Mental & Emotional tonic + #1…TDS

17 మే 2025: చెవినొప్పితో సహా అన్ని లక్షణాలు పూర్తిగా నయమయ్యాయి. ఆమె సంతోషంగా, ఉత్సాహంగా ఉన్నట్లు తెలిపారు.

14 జూలై 2025: #2 మోతాదును BDకు తగ్గించారు. రెమెడీ ప్రారంభించినప్పటి నుంచి ప్రతి రెండు నెలలకు ఒకసారి రుతుస్రావం జరుగుతోంది.

2026 ఫిబ్రవరి నాటికి సమస్య మళ్లీ రాలేదు. ప్రతి రెండు నెలలకు ఒకసారి రుతుస్రావం కొనసాగుతోంది. తనకు అనుకూలంగా అనిపించడంతో ఆమె ఇప్పటికీ BD మోతాదులో రెమెడీని కొనసాగిస్తున్నారు.

వెన్నునొప్పి, భావోద్వేగ అసమతుల్యత 03590...यूएसए

40 ఏళ్ల ఆరోగ్యవంతురాలు, శారీరకంగా చురుకుగా ఉండే మహిళకు 2006లో మొదటి ప్రసవం తర్వాత నడుము దిగువ భాగంలో నొప్పి ప్రారంభమైంది. హోమియోపతి, ఆయుర్వేద చికిత్సలతో అది పూర్తిగా తగ్గిపోయి, అనేక సంవత్సరాల పాటు మళ్లీ రాలేదు. అయితే, 2021 మధ్యలో కోవిడ్ బారిన పడిన తరువాత, ఆమెకు మళ్లీ నడుము దిగువ భాగంలో నొప్పి రావడం ప్రారంభమైంది. ఈ నొప్పి బిగుతుగా ఉండటంతో పాటు వెన్నెముక స్థిరంగా లేనట్లుగా, "వెన్నెముక జారిపోతున్నట్లు" అనిపించేది. నెలకు రెండు నుంచి మూడు సార్లు ఈ నొప్పి వచ్చి, ఒక రోజు నుంచి వారం రోజుల వరకు కొనసాగేది. శారీరక శ్రమ, వ్యాయామం లేదా ఎక్కువసేపు పని చేసిన తరువాత ఇది ప్రేరేపించబడేది. విశ్రాంతి తీసుకోవడం ద్వారా ఆమె దానిని నియంత్రించుకునేది. రుతుస్రావానికి ముందు మరియు రుతుస్రావం సమయంలో నొప్పి మరింత తీవ్రమై, చిరాకు మరియు భావోద్వేగ సున్నితత్వం కూడా పెరిగేవి. కుటుంబానికి సంబంధించిన ఒత్తిడి ఆమె మానసిక ఆందోళనను మరింత పెంచేది.

24 జనవరి 2022న నాలుగు రోజులుగా కొనసాగుతున్న వెన్నునొప్పితో ఆమె ప్రాక్టీషనర్‌ను సంప్రదించగా, ఈ క్రింది రెమెడీ ఇవ్వబడింది:

CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC17.3 Brain & Memory tonic + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine…TDS

ఆమె ఇతర ఎలాంటి మందులు తీసుకోవడం లేదు.

చికిత్స పురోగతి:

31 జనవరి 2022: వెన్నునొప్పి, బిగుతు, అస్థిరత పూర్తిగా (100%) తగ్గాయి. మానసికంగా కూడా ఎంతో మెరుగ్గా అనిపించింది.

24 ఫిబ్రవరి 2022: సెలవుల్లో వరుసగా మూడు రోజుల పాటు రోజుకు 9–10 గంటలు ఎలాంటి అసౌకర్యం లేకుండా నడవగలిగింది. భావోద్వేగ సమతుల్యత కూడా తిరిగి వచ్చింది.

3 మార్చి 2022: రుతుస్రావం సమయంలో స్వల్ప వెన్నునొప్పి మాత్రమే వచ్చింది.

3 ఏప్రిల్ 2022: వైరల్ అనారోగ్యం కారణంగా రెమెడీని నిలిపివేశారు.

5 మే 2022: శారీరక శ్రమ తరువాత నొప్పి మళ్లీ రావడంతో రెమెడీని తిరిగి ప్రారంభించారు.

15 మే 2022: నొప్పి పూర్తిగా నయమైంది.

1 జనవరి 2023: మోతాదును ODకు తగ్గించారు.

5 అక్టోబర్ 2023: నిర్వహణ (మెయింటెనెన్స్) కోసం రెమెడీని నెలకు ఒకసారి మాత్రమే తీసుకునేలా క్రమంగా తగ్గించారు.

2026 జనవరి నాటికి ఆమె ఎలాంటి నొప్పి పునరావృతం లేకుండా చురుకైన, సమతుల్యమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. గతంలో తనకు ఈ సమస్య ఉండేదన్న విషయాన్నే పూర్తిగా మర్చిపోయేంతగా ఆమె కోలుకున్నారు!

దీర్ఘకాలిక దగ్గు 18018...भारत

20 సంవత్సరాల విద్యార్థి గత రెండేళ్లుగా 2023 ఆగస్టు నుండి పొడి దగ్గుతో బాధపడుతున్నాడు. ఈ దగ్గు ప్రతిరోజూ వచ్చేది. ముఖ్యంగా రాత్రి సమయంలో తీవ్రంగా ఉండి, కొన్నిసార్లు అసలు నిద్రపట్టకుండా చేసేది. చలికాలంలో, ముఖ్యంగా శీతాకాలంలో, దగ్గు మరింత తీవ్రమై, కొన్నిసార్లు కళాశాలకు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడేది. దీనికి ముందు వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన చరిత్ర లేదు.

వివరంగా ప్రశ్నించగా, 2023 ప్రారంభంలో మెట్రో రైల్వే వ్యవస్థలో పని చేస్తున్నప్పుడు దుమ్ముతో కూడిన వాతావరణంలో ఎక్కువసేపు ఉండడం వల్లే ఈ దగ్గు ప్రారంభమై ఉండవచ్చని రోగి తెలిపాడు. 2024 జనవరి నుండి సుమారు ఒక నెలపాటు అలోపతి మందులు వాడినప్పటికీ, చాలా తక్కువ ఉపశమనం మాత్రమే లభించడం, అలాగే వాటి వల్ల దుష్ప్రభావాలు వస్తాయనే ఆందోళనతో వాటిని నిలిపివేశాడు.

2025 సెప్టెంబర్ 11న అతను వైబ్రియానిక్స్ ప్రాక్టిషనర్‌ను సంప్రదించగా, ఈ క్రింది రెమెడీ ఇవ్వబడింది:

CC19.6 Cough chronic….TDS

చికిత్స పురోగతి:

21 సెప్టెంబర్ 2025: దగ్గు తీవ్రత, దగ్గు వచ్చే సమయం 90% తగ్గాయి.

28 సెప్టెంబర్ 2025: దగ్గు పూర్తిగా తగ్గిపోయింది. నిద్రకు ఎలాంటి అంతరాయం లేకుండా పోయింది.

8 నవంబర్ 2025: మోతాదును క్రమంగా తగ్గిస్తూ రెమెడీని పూర్తిగా నిలిపివేశారు.

2026 ఫిబ్రవరి నాటికి, శీతాకాలం తీవ్రంగా ఉన్న సమయంలో కూడా దగ్గు మళ్లీ రాకుండా రోగి పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడు.

బొడ్డు హెర్నియా 10363...भारत

ప్రాక్టిషనర్ యొక్క తల్లికి, 93 సంవత్సరాల వయస్సులో, 2012 నవంబర్‌లో బొడ్డు భాగంలో చిన్నదిగా, నొప్పిలేని ఉబ్బు ఏర్పడింది. తరువాతి రెండు నెలల్లో ఆ వాపు క్రమంగా పెరిగి సుమారు 8 సెం.మీ. పరిమాణానికి చేరుకుంది. అలాగే బొడ్డు చుట్టూ నొప్పి, అసౌకర్యం ఏర్పడి, దగ్గినప్పుడు మరింత ఎక్కువయ్యేవి.

2013 జనవరిలో వైద్యుడు పరీక్షించి, ఆమెకు బొడ్డు హెర్నియా (Umbilical Hernia) ఉన్నట్లు నిర్ధారించారు. ఆమె వయస్సు చాలా ఎక్కువగా ఉండడం, ఇప్పటికే గుండె మరియు ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధుల కోసం దీర్ఘకాలంగా అలోపతి చికిత్స తీసుకుంటుండడం వల్ల శస్త్రచికిత్సను సూచించలేదు.

2013 జనవరి 15న ప్రాక్టిషనర్ ఆమెకు ఈ క్రింది రెమెడీ ఇచ్చారు:

CC4.9 Hernia…QDS నీటిలో కలిపి.

హెర్నియాకు సంబంధించిన లక్షణాల కోసం ఆమె ఎలాంటి ఇతర మందులు తీసుకోవడం లేదు.

చికిత్స పురోగతి:

15 ఫిబ్రవరి 2013: నొప్పి, అసౌకర్యం 50% తగ్గాయి. ఉబ్బు పరిమాణం సుమారు 4 సెం.మీ.కు తగ్గింది.

15 మార్చి 2013: నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. ఉబ్బు పరిమాణం మరింత తగ్గి 2 సెం.మీ.కు చేరుకుంది.

20 మే 2013: నొప్పి పూర్తిగా తగ్గిన స్థితి కొనసాగింది. అయితే ఉబ్బు పరిమాణంలో ఇకపై మరింత తగ్గుదల కనిపించలేదు. అందువల్ల మోతాదును ఒక నెలపాటు ODకు తగ్గించి, తరువాత పూర్తిగా నిలిపివేశారు.

ఆమె 2019 వరకు ఆరోగ్యంగా జీవించి, 99 సంవత్సరాల వయస్సులో ప్రశాంతంగా పరమపదించారు.

పగిలిన కాలి గోరు 11587...भारत

2021 మార్చిలో, 50 సంవత్సరాల వ్యక్తి షిర్డీ సాయి ఆలయంలో ప్రతి వారం నిర్వహించే వైబ్రియానిక్స్ శిబిరానికి తన ఎడమ కాలి బొటనవేలి గోరు తీవ్రంగా పగిలి, పెళుసుగా మారిన సమస్యతో వచ్చారు. ఈ సమస్య 2006లో గోరు చుట్టూ నొప్పితో కూడిన వాపుతో ప్రారంభమైంది. అలోపతి చికిత్సతో వాపు తగ్గినప్పటికీ, ఆ తరువాత పెరిగే గోరు ప్రతిసారీ పగిలిపోతూ, పెళుసుగా ఉండేది. ముఖ్యంగా చెప్పులు ధరించినప్పుడు గణనీయమైన అసౌకర్యాన్ని కలిగించేది.

2021 మార్చి 10న ఆయనకు ఈ క్రింది రెమెడీలు ఇవ్వబడ్డాయి:

#1. CC21.9 Nails తెల్లని పెట్రోలియం జెల్లీలో కలిపి బయటకు రాయడానికి.

#2. CC21.1 Skin tonic + #1…QDS నోటి ద్వారా తీసుకోవడానికి, అలాగే గోరువెచ్చని నీటిలో కలిపి ప్రభావిత కాలును ప్రతిరోజూ కొన్ని నిమిషాలు ముంచడానికి.

చికిత్స పురోగతి:

30 ఏప్రిల్ 2021: పాత గోరు ఊడిపోయి, కొత్త గోరు పెరగడం ప్రారంభమైంది.

30 ఆగస్టు 2021: కొత్త గోరు పూర్తిగా సాధారణంగా పెరిగి, ఎలాంటి పగుళ్లు లేకుండా ఆరోగ్యంగా మారింది. #2 మోతాదును TDSకు తగ్గించారు.

20 నవంబర్ 2021: మోతాదును క్రమంగా తగ్గిస్తూ రెమెడీని పూర్తిగా నిలిపివేశారు.

ఈ అద్భుతమైన ఫలితాన్ని చూసిన రోగి, తన స్నేహితులలో పలువురిని కూడా ఆ ప్రాక్టిషనర్ వద్దకు పంపించారు. 2023 ఏప్రిల్‌లో ఆలయ సందర్శన సందర్భంగా, 19 నెలల తర్వాత ఆయన మళ్లీ ప్రాక్టిషనర్‌ను కలిశారు. అప్పటికీ ఆయన కాలి గోరు పూర్తిగా సాధారణంగా, ఆరోగ్యంగా ఉంది.

సయాటికా నొప్పి 18007...भारत

63 సంవత్సరాల మహిళా బాలవికాస్ టీచర్, 2022 మార్చిలో ఒక తీర్థయాత్ర సందర్భంగా బరువైన సామాను ఎత్తడంతో నడుము కింది భాగంలో నొప్పి ప్రారంభమైంది. ఆ నొప్పి క్రమంగా రెండు కాళ్లలోకి వ్యాపించి, 2022 జూలై నాటికి నిరంతరంగా కొనసాగసాగింది. వంగడం, కూర్చోవడం, ఆధారం లేకుండా నడవడం చాలా కష్టమయ్యేది. తరచూ సమతుల్యత కోల్పోయి పడిపోతుండేది. రోజువారీ పనులకూ ఇతరుల సహాయం అవసరమయ్యేది. వైద్యుడు ఆమెకు సయాటికా (Sciatica) అని నిర్ధారించి కండరాలను సడలించే మందులు, నొప్పి నివారణ మాత్రలు సూచించారు. అయితే వాటితో చాలా స్వల్ప ఉపశమనం మాత్రమే లభించడంతో, 2022 నవంబర్‌లో వాటిని నిలిపివేశారు. తరువాతి రెండు నెలల్లో నొప్పి మరింత తీవ్రమై, విశ్రాంతిలో ఉన్నప్పటికీ కొనసాగింది. 2023 జనవరి నుండి ఆమె బాలవికాస్ తరగతులను నిలిపివేయాల్సి వచ్చింది. దీనివల్ల ఆమె తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. తిరిగి పిల్లలకు బోధించే అవకాశం రావాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ తరచూ కన్నీళ్లు పెట్టుకునేవారు. నడవడానికి నడుముకు బెల్ట్, చేతికర్రపై మాత్రమే ఆధారపడేవారు. తన ఆరోగ్యం బాగా క్షీణించిందని భావించి, 2023 మార్చి 27న వైబ్రియానిక్స్ ప్రాక్టిషనర్‌ను సంప్రదించారు. ఆమెకు ఈ క్రింది రెమెడీలు ఇవ్వబడ్డాయి:

#1. CC20.5 Spine…BD విభూతిలో కలిపి బయటకు రాయడానికి.

#2. CC20.1 SMJ tonic + CC20.2 SMJ pain + CC20.4 Muscles & Supportive tissue + #1…TDS

చికిత్స పురోగతి:

9 ఏప్రిల్ 2023: గత ఒక సంవత్సరం నుండి ముఖ్యంగా ఉదయం లేవగానే చేతులు, కాళ్లలో తిమ్మిరి వస్తోందని, అది ముందుగా చెప్పడం మరిచిపోయానని తెలిపింది. అందువల్ల #2ను క్రింది విధంగా మెరుగుపరిచి #3గా ఇచ్చారు:

#3. CC3.7 Circulation + CC18.5 Neuralgia + #2…TDS

25 జూన్ 2023: అన్ని లక్షణాల్లో 30% మెరుగుదల కనిపించింది.

24 సెప్టెంబర్ 2023: మెరుగుదల 40%కు చేరుకుంది.

24 డిసెంబర్ 2023: మెరుగుదల 50%కు పెరిగింది. ఆమె సంతోషంగా, ప్రశాంతంగా అనిపిస్తోందని తెలిపి, ఆధారంతో తిరిగి బాలవికాస్ తరగతులు ప్రారంభించారు.

21 జనవరి 2024: 60% మెరుగుదల వచ్చింది. ఇప్పుడు ఎలాంటి ఆధారం లేకుండానే సౌకర్యంగా కూర్చోగలుగుతున్నారు, నడవగలుగుతున్నారు. రెమెడీ రీఫిల్ కోసం స్వయంగా వచ్చారు.

17 మార్చి 2024: మెరుగుదల 85%కు చేరుకుంది. అయితే గత రెండు వారాలుగా భోజనం తర్వాత పుల్లటి త్రేన్పులు (Belching), అప్పుడప్పుడు కళ్లలో నీరు కారడం ఉందని తెలిపారు. అందువల్ల ఈ క్రింది రెమెడీలు ఇచ్చారు:

#4. CC4.2 Liver & Gallbladder tonic + CC4.6 Diarrhoea + CC4.8 Gastroenteritis + CC4.10 Indigestion…TDS

#5. CC7.3 Eye infections…TDS

14 ఏప్రిల్ 2024: అన్ని లక్షణాలు పూర్తిగా తగ్గిపోయాయి. #4 మరియు #5 మోతాదును ODకు తగ్గించి, క్రమంగా తగ్గిస్తూ 15 మే 2024న నిలిపివేశారు. నిర్వహణ కోసం #1 మరియు #3ను కొనసాగించారు.

2026 ఫిబ్రవరి నాటికి ఆమె పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు. మునుపటిలాగే తీర్థయాత్రలు కొనసాగిస్తూ, అమర్‌నాథ్ కొండపై ఉన్న పవిత్ర ఆలయానికి కూడా విజయవంతంగా యాత్ర చేశారు.

రోగి అనుభవం జనవరి 2026 (ఆడియో అందుబాటులో ఉంది)

ఓం సాయి రామ్. నాకు తీవ్రమైన సయాటికా నొప్పి ఉండేది. ఎన్నో ఇంగ్లీషు మందులు వాడినా, సాయి వైబ్రియానిక్స్ వాడిన తర్వాత నా సమస్యలు చాలా తగ్గాయి. ఇంతకుముందు నేను తరచూ పడిపోతుండేదాన్ని, సరిగా నడవలేకపోయేదాన్ని. పనులు చేసుకోవడానికి చేతికర్ర పట్టుకోవాల్సి వచ్చేది, నడుముకు బెల్ట్ కూడా ధరించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సాయి వైబ్రియానిక్స్ వల్ల నేను నా పనులన్నీ చక్కగా చేసుకోగలుగుతున్నాను. అలోపతి మందులు కూడా ఇక వాడడం లేదు. కళ్లలో నీరు కారడం తగ్గింది. గ్యాస్ సమస్య కూడా చాలా బాగా తగ్గిపోయింది. సయాటికా నొప్పి కూడా తగ్గి, ఇప్పుడు నేను ఎంతో సౌకర్యంగా నా పనులు చేసుకుంటున్నాను. ఇక బెల్ట్ గానీ, చేతికర్ర గానీ అవసరం లేదు. మామూలుగా నడుస్తున్నాను. అంతేకాదు, బరువులు కూడా మోస్తున్నాను, రైళ్లలో ప్రయాణిస్తూ తీర్థయాత్రలకు వెళ్తున్నాను. ఇదంతా స్వామివారి అనంత కరుణ వల్లే సాధ్యమైంది. సాయి వైబ్రియానిక్స్ వాడిన తర్వాత నా శరీరానికి మంచి శక్తి వచ్చింది. నా ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోయాయి. ఇప్పుడు నేను ఎంతో ప్రశాంతంగా, సంతోషంగా జీవిస్తున్నాను. నాకు ఈ రెమెడీలు ఇచ్చి నా ఆరోగ్యాన్ని తిరిగి ప్రసాదించిన ప్రాక్టిషనర్‌కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. స్వామివారికి నా ప్రణామాలు.

కడుపు నొప్పి, మలబద్ధకం 11587...भारत

అమెరికాలో నివసిస్తున్న 40 ఏళ్ల మహిళ, 2013 నుంచి ఐదు సంవత్సరాలుగా వారానికి రెండు నుంచి మూడు సార్లు వచ్చే కడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నొప్పి సుమారు గంటసేపు ఉండేది. దీనితో పాటు గట్టిగా, ఉండల రూపంలో మలం రావడం వల్ల మలవిసర్జన చాలా కష్టంగా, నొప్పితో కూడినదిగా ఉండేది. విరేచన మందులు (లాక్సేటివ్స్) వాడినప్పటికీ తాత్కాలిక ఉపశమనం మాత్రమే లభించేది. ఒక సాయి భక్తుని సలహా మేరకు, ఆమె 7 జనవరి 2018న న్యూజెర్సీలోని షిర్డీ సాయి ఆలయంలో ప్రతి వారం నిర్వహించే వైబ్రియానిక్స్ శిబిరంలో ప్రాక్టీషనర్‌ను సంప్రదించారు. ఆమెకు ఈ క్రింది రెమెడీ ఇవ్వబడింది:

CC4.4 Constipation + CC4.10 Indigestion + CC10.1 Emergencies…ప్రతి 10 నిమిషాలకు ఒక గంటపాటు, అనంతరం 6TD

ఆమె రోజుకు సుమారు 1.5 లీటర్ల నీరు మాత్రమే తాగుతుండటంతో, దానిని క్రమంగా రోజుకు 2 నుంచి 3 లీటర్లకు పెంచాలని సూచించారు.

చికిత్స పురోగతి:

20 జనవరి 2018: మలం గట్టిగా ఉండటం, కడుపు నొప్పి, మలద్వార నొప్పి 50% తగ్గాయి.

4 ఫిబ్రవరి 2018: మొత్తం మీద 90% మెరుగుదల కనిపించడంతో మోతాదును TDSకు తగ్గించారు.

14 ఫిబ్రవరి 2018: అన్ని లక్షణాలు పూర్తిగా నయమయ్యాయి. రోగి సౌకర్యాన్ని బట్టి మోతాదును OWకు తగ్గించి, 10 మార్చి 2018న రెమెడీని పూర్తిగా నిలిపివేశారు.

2018 ఆగస్టు లో జరిగిన చివరి ఫాలో-అప్ సమయానికి సమస్య మళ్లీ రాలేదు. అనంతరం ఆమె భారత్ ‌కు తిరిగి రావడంతో, ప్రాక్టీషనర్‌కు ఆమెతో సంబంధం కొనసాగలేదు.

 

ప్రాక్టీషనర్ల వేదిక 00002...यूके

ప్యాట్రిషియా హంట్ 00002… యూకే గారికి హృదయపూర్వక నివాళి, వైబ్రియానిక్స్ పరిశోధన విభాగాధిపతి

జిత్ కె. అగ్గర్వాల్ – వైబ్రియానిక్స్‌కు అతీతమైన మూడు దశాబ్దాల అనుబంధం

1994 ఆగస్టులో వైట్‌ఫీల్డ్‌లో, స్వామివారి అనుమతి మరియు ఆశీర్వాదాల కోసం SRHVP నమూనాను తీసుకువెళ్లినప్పుడు నేను మొదటిసారిగా పాట్‌ను కలిశాను. ఆ మొదటి పరిచయం నుంచే ఆమె నన్ను తన తమ్ముడిలా ఆదరించింది. నిజానికి, దర్శనం సమయంలో స్వామివారికి SRHVPను సులభంగా ఆశీర్వదించేలా నేను దానిని పైకి ఎత్తకపోవడంతో, బ్రిటిష్ వారికి అరుదైన రీతిలో, ఆమె నన్ను మందలించింది కూడా! ఆ ప్రేమతో కూడిన కఠినత్వం ఆమె అంకితభావానికి ప్రతిబింబం. స్వామివారు ఆ పరికరాన్ని ఆశీర్వదించిన తరువాత, నేను ఢిల్లీకి తిరిగి వెళ్లి ప్రతి SRHVPను స్వయంగా తయారు చేయడం ప్రారంభించాను. ఆశ్రమం మరియు వైట్‌ఫీల్డ్‌కు నేను తరచూ వెళ్లే సందర్భాల్లో, కొత్త ప్రాక్టీషనర్లకు మార్గదర్శకంగా ఉండే సాహిత్యాన్ని సిద్ధం చేయడానికి పాట్‌తో కలిసి గంటల తరబడి కూర్చునేవాడిని. అది దైవసంకల్పమే అనిపిస్తుంది. ఒకవైపు అనుభవజ్ఞురాలైన సాంప్రదాయ హోమియోపతి వైద్యురాలు పాట్, మరోవైపు శాస్త్రీయ నేపథ్యం ఉన్నప్పటికీ, స్వామి నారాయణి గారి Handbooks on Healing తప్ప పెద్దగా అధికారిక జ్ఞానం లేని నేను – ఈ పవిత్ర సేవ కోసం ఒకచోట కలుసుకున్నాము.

తదుపరి మూడు దశాబ్దాలు నిరంతర బోధన, SRHVPల తయారీ మరియు ప్రపంచవ్యాప్తంగా వర్క్‌షాప్‌ల నిర్వహణతో గడిచాయి. పాట్ నాతో కలిసి ప్రయాణించకపోయినా, ఆమె నాకు ఎల్లప్పుడూ బలమైన ఆధారం. ఆమె స్థిరమైన సహకారం అనేక కాంబోలను రూపొందించడంలో, చికిత్సా విధానాలను మెరుగుపరచడంలో ఎంతో దోహదపడింది. 2004లో వైబ్రియానిక్స్ పుస్తకాన్ని సిద్ధం చేసి స్వామివారి ఆశీర్వాదాల కోసం సమర్పించినప్పుడు, అందులో అనేక తప్పులు ఉన్నాయని స్వామివారు సూచించారు. అప్పుడు పాట్ ప్రతి పేజీని అత్యంత శ్రద్ధతో పరిశీలించి, మన సేవా కార్యక్రమం యొక్క నాణ్యతను మరియు విశ్వసనీయతను కాపాడింది.

మన ప్రయాణంలో అత్యంత విశేషమైన అధ్యాయం 108CCల రూపకల్పన. సాంప్రదాయ హోమియోపతిలో లోతైన పట్టు కలిగిన పాట్‌కు, ఒకే సీసాలో ఇన్ని రెమెడీలను కలపడం తొలుత అంగీకరించడం కష్టంగా అనిపించింది. అయితే ఆమె అంతరంగంలో స్వామిని ప్రార్థించింది. నెలల తరబడి అధ్యయనం, అంతర్దృష్టి మరియు రేడియస్థీషియా ఆధారంగా, దైవప్రేరణతో 108CC మందులు రూపుదిద్దుకున్నాయి. అనంతరం అవి మన ప్రియమైన స్వామివారి ఆశీర్వాదాన్ని పొందాయి. 2014 అంతర్జాతీయ వైబ్రియానిక్స్ సదస్సుకు ముందు గడిపిన రోజులు కూడా నాకు ఎంతో మధురస్మృతులు. ఆ సదస్సు కోసం సిద్ధం చేసిన పుస్తకంపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించేందుకు నేను, నా భార్య మరియు పాట్ ఒక వారం పాటు కలిసి పని చేసాము.

పాట్‌తో కలిసి గడిపిన ఈ 30 సంవత్సరాలను వెనక్కి తిరిగి చూసినప్పుడు, ఆమె లేకపోతే నేడు వైబ్రియానిక్స్ ఈ స్థాయికి చేరేది కాదని అనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ఆమె స్నేహం, జ్ఞానం, మార్గదర్శకత్వం మరియు అచంచలమైన అంకితభావం పట్ల నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. పాట్, మేము మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాము. మీరు ఇప్పుడు శాంతి యొక్క పరమధామం నుండి మీ సౌమ్యమైన ఆశీస్సులతో మమ్మల్ని నిరంతరం మార్గనిర్దేశం చేస్తున్నారని మేము విశ్వసిస్తున్నాము.

హేమ్ అగ్గర్వాల్ 00006

మేము వైబ్రియానిక్స్ ప్రయాణంలో తొలి అడుగులు వేస్తున్న సమయంలోనే పాట్ మా జీవితాల్లోకి ప్రవేశించారు. మొదటి నుంచీ ఆమె కేవలం పక్కన నిలబడి చూసే వ్యక్తి కాదు; మా కుటుంబంలో ఒక సభ్యురాలిగా మారిపోయారు. నిశ్శబ్దమైన ఆత్మబలం, మాతృస్నేహపూర్వకమైన ఆప్యాయతతో ఆమె మాకు మార్గనిర్దేశం చేశారు. అది కేవలం వైబ్రియానిక్స్‌కు మాత్రమే పరిమితం కాలేదు; వ్యక్తిగత మరియు కుటుంబ విషయాల్లో కూడా ఆమె సలహాలు, సహకారం అందించారు. ఆమె సాన్నిధ్యం మాకు స్థిరత్వాన్ని, జ్ఞానాన్ని, భరోసాను ప్రసాదించింది. ఆమె ప్రశాంతమైన ఇంటి వరండాలో కూర్చొని, ప్రేమతో ఆమె స్వయంగా సిద్ధం చేసిన భోజనాన్ని ఆస్వాదించిన ఎన్నో మధుర క్షణాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. అలాంటి సందర్భాల్లో ఆమె వైబ్రియానిక్స్ విషయాలను పక్కన పెట్టి, “కొంత విశ్రాంతి తీసుకోండి, నవ్వండి, జీవితాన్ని ఆస్వాదించండి” అని ప్రోత్సహించేవారు. సేవకు కూడా విశ్రాంతి, పోషణ అవసరమని ఆమెకు బాగా తెలుసు.

తరువాతి సంవత్సరాల్లో, 108CCలు లేదా SVP గైడ్‌లో లేని ఏదైనా ఆరోగ్య సమస్య ఎదురైనప్పుడు, నేను అవసరమైన వివరాలను సేకరించి ఆమెకు పంపేదానిని. పాట్ ఎంతో ఓర్పుతో, శ్రద్ధతో కొత్త కాంబోలను రూపొందించేవారు. నేడు మన ఇమ్యూనిటీ బూస్టర్ (ఐబీ) ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి చేరుకోవడం ఆమె దూరదృష్టికి, ప్రతిభకు నిదర్శనం. మూడు దశాబ్దాలకు పైగా పాట్ మా వెంట నడిచినందుకు మేము నిజంగా ధన్యులమని భావిస్తున్నాము. ఆమె ప్రేమ, అంకితభావం, సౌమ్యమైన ఆత్మబలం మా జీవితాలపై మాత్రమే కాదు, వైబ్రియానిక్స్‌పై కూడా చెరగని ముద్ర వేశాయి.

సోనియా అగ్గర్వాల్ థాకర్ 00030

నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు, 32 సంవత్సరాల క్రితం, పాట్ ఆంటీని మొదటిసారి కలిశాను. కాలక్రమేణా ఆమె మా కుటుంబ సభ్యురాలిగా మారిపోయారు. నా తోబుట్టువుల వివాహాలు, నా వివాహం, తరువాత నా పిల్లల జననం వంటి మా కుటుంబంలోని ప్రతి సంతోషకరమైన సందర్భాన్ని ఆమె హృదయపూర్వక ఆనందంతో పంచుకున్నారు. ఇతరుల పట్ల ఆమె చూపిన ఆప్యాయత, నిజాయితీ ఎల్లప్పుడూ ప్రత్యేకమైనవి. వైబ్రియానిక్స్‌లో అత్యంత సీనియర్ మరియు అనుభవజ్ఞురాలైన ప్రాక్టీషనర్‌గా, ముఖ్యంగా మా పిల్లల ఆరోగ్య సమస్యల విషయంలో, మేము తరచూ ఆమె సలహాను కోరుకునేవాళ్లం. నా భర్త ఒక న్యూరోసర్జన్ అయినప్పటికీ, ఆయన ఎప్పుడూ “ముందుగా పాట్‌ను అడుగు” అని చెప్పేవారు. తన పెండ్యులమ్ సహాయంతో పాట్ ఎంపిక చేసిన రెమెడీల పట్ల ఆయనకు అపారమైన విశ్వాసం ఉండేది. ఎన్నో సంవత్సరాలు గడిచిన తరువాత కూడా, ఆ సమస్యలు మళ్లీ వచ్చినప్పుడు, ఆమె సూచించిన రెమెడీలనే మేము ఉపయోగిస్తూ ఉంటాము. ఆమె ప్రసరించిన ప్రశాంతమైన ఆత్మబలం, ఆమె ప్రకాశవంతమైన ఆత్మ, అలాగే ఎటువంటి సంకోచం లేకుండా ఆధారపడగలిగే పెద్దవారిగా ఆమె ఇచ్చిన భరోసా — ఇవన్నీ మాకు ఎంతో గుర్తుకొస్తాయి. ఆమె లేని లోటు ఎప్పటికీ అనుభూతి చెందుతూనే ఉంటుంది

ఆకాషా వుడ్ 00135

పాట్‌తో నాకు ఎంతో గాఢమైన, ఫలవంతమైన స్నేహబంధం ఉండేది. అది పరస్పర సహకారం, సహాయం మరియు వ్యక్తిగత వికాసంతో నిండిన అనుబంధం. ఆమె ఒక అమూల్యమైన నిధి; అనేక విషయాల్లో జ్ఞానాన్ని పంచిన గొప్ప గురువు. స్వామి గురించి ఆమె చెప్పిన కథలను నేను ఎంతో ఇష్టపడేదాన్ని. ఆ కథల్లో దాగి ఉన్న పాఠాలను మేము తరువాత అర్థం చేసుకునేవాళ్లం. స్వామివారికి హాస్యప్రియ స్వభావం ఉండేది; ఆయన గురించి మాట్లాడుకుంటూ మేము ఎన్నోసార్లు మనసారా నవ్వుకున్నాము. పాట్ తన మాటల్లో చెప్పాలంటే, తన “బాస్సీ బూట్స్” కింద నన్ను చేర్చుకుని, హోమియోపతి నేర్పింది, అనేక పుస్తకాలను పంచుకుంది. తరువాత ఆమె రేడియోనిక్స్ వ్యవస్థను పరిచయం చేసుకుంది, అదే ఆమెను వైబ్రియానిక్స్ వైపు నడిపించింది.

సాయి కాలనీలోని ఆమె చిన్న క్లినిక్‌లో కలిసి పనిచేసిన రోజులు నాకు ఎంతో ప్రీతిపాత్రమైన జ్ఞాపకాలు. రోగులు, నిర్ధారణలు, రెమెడీలు — ఇవన్నీ స్వామివారి ప్రేమపూర్వక పర్యవేక్షణలో జరుగుతున్నట్లుగా అనిపించేవి. ఆ వాతావరణంలో, ఆమె మార్గదర్శకత్వంలో నేను ఎంతో ఎదిగాను. నిజంగా చెప్పాలంటే, ఆమె వైబ్రియానిక్స్ తల్లి. డా. అగ్గర్వాల్ గారు మొదటి సాయి వైబ్రియానిక్స్ యంత్రం మరియు కార్డులను రూపొందించి, వాటికి శిక్షణను అందించడం ప్రారంభించిన తరువాత, ఆయనతో కలిసి పాట్ ఈ సేవా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు.

పుట్టపర్తిలోని ఒక గొప్ప హోమియోపతి గురువు వద్ద పాట్ శిక్షణ పొందింది. ఆయన అసాధారణ ఉపాధ్యాయుడు. ఆమె పొందిన ఆ జ్ఞానాన్ని స్వామివారు భక్తులకు సహాయపడేందుకు ఉపయోగించారు — ఆమె రూపొందించిన రెమెడీలు మరియు కట్టింగ్ టైస్ సేవ ద్వారా సాయి మార్గదర్శకత్వంపై సంపూర్ణ విశ్వాసంతో, అదే మార్గాన్ని అనుసరించమని ఆమె నన్ను ప్రోత్సహించింది. తరువాత మాతాజీ గారి హోమియోపతి కాంబోలు, డా. అగ్గర్వాల్ గారి వైబ్రియానిక్స్ వ్యవస్థతో కలిసిన ఒక కొత్త దశ ప్రారంభమైంది. పాట్ సాయి వైబ్రియానిక్స్‌ను సంపూర్ణంగా స్వీకరించింది. దాని ద్వారా జరిగిన అద్భుత స్వస్థతలను చూసి ఆశ్చర్యపోయింది. కాలక్రమేణా, స్వామివారి ప్రేరణతో, దైవిక అంతర్దృష్టి మార్గదర్శకత్వంలో, ఆమె శక్తివంతమైన కాంబోలను రూపొందించింది. అవి ప్రభావవంతమైనవి, వేగవంతమైన ఫలితాలను ఇచ్చేవి, దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించేవి. ఇది సాయి వైబ్రియానిక్స్ చరిత్రలో ఒక కీలక ఘట్టంగా నిలిచింది.

పాట్ వార్తాలేఖ (న్యూస్‌లెటర్) తయారీలో కూడా సహకరించింది. క్లిష్టమైన కేసులు ఎదురైనప్పుడు ఎల్లప్పుడూ సహాయం చేయడానికి సిద్ధంగా ఉండేది. ఈ సేవ ఆమెకు పవిత్రమైన సాధన. స్వామివారి వైద్య సేవా కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన పెద్ద చెక్క బల్ల వద్ద కూర్చొని పనిచేస్తున్న పాట్ రూపం ఇప్పటికీ నా కళ్లముందు కదలాడుతోంది. తనకు సాధ్యమైనంత కాలం ఆ బల్ల ఆమె జీవితానికి కేంద్రబిందువుగా నిలిచింది. పాట్ ఈ లోకాన్ని విడిచినప్పుడు, స్వామివారి చేతిని పట్టుకుని స్వర్గ ద్వారాల్లోకి ప్రవేశించిందని నేను విశ్వసిస్తున్నాను. ఆమె ప్రేమించినవారు, సేవ చేసినవారు అందరూ ఆమెకు స్వాగతం పలుకుతూ ఉండగా, తన ప్రియతమ సాయి సన్నిధిలో ఆమె శాశ్వత శాంతిని పొందిందని నమ్ముతున్నాను.

సుసాన్ సలివాన్ రాకాఫ్ 01339

డా. అగ్గర్వాల్ గారి ద్వారా నేను మొదటిసారిగా 2003 ప్రాంతంలో పాట్ హంట్ గురించి విన్నాను. తరువాత 2006/2007లో కొన్ని సాధారణ కాంబోల మెరుగుదల గురించి ఆయన ప్రస్తావించినప్పుడు ఆమె గురించి మరింత తెలుసుకున్నాను. మొదటి వైబ్రియానిక్స్ అంతర్జాతీయ సదస్సు సమీపిస్తున్న సమయంలో, సన్నాహక కార్యక్రమాలకు సహాయపడేందుకు నేను మరియు నా భర్త ముందుగానే ప్రశాంతి నిలయానికి చేరుకున్నాము. ఆ సమయంలో పాట్‌తో కొంత సమయం గడిపే అదృష్టం నాకు కలిగింది.

పాట్ తన వ్యవసాయ క్షేత్రానికి నన్ను తీసుకెళ్లింది. అక్కడ ఆమె ఔషధ గుణాలు కలిగిన మొక్కలు, మూలికలు మరియు ఆహారంగా ఉపయోగించే మొక్కలను పెంచేది. హోమియోపతిలో తనకున్న అనుభవాన్ని వైబ్రియానిక్స్‌తో సమన్వయం చేసి, రెమెడీల వైబ్రేషన్లను అభివృద్ధి చేయడం లేదా మెరుగుపరచడం ఎలా చేసేదో ఆమె వివరించింది.

పాట్ నాకు అత్యంత ప్రేరణనిచ్చే భక్తురాలిగా అనిపించింది. ఆమె సమయమంతా స్వామివారి పట్ల అంకితభావంతో గడిచేది. ఆయన అంతరంగ స్వరాన్ని అనుసరిస్తూ, తన జీవితాన్ని సేవకు అంకితం చేసింది. ఒక నిజమైన భక్తురాలి జీవితాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం నాకు కల్పించినందుకు స్వామివారికి నేను ఎంతో కృతజ్ఞురాలిని.

పద్మా రాళ్లబండి 10375

2014 జనవరి 26న జరిగిన తొలి అంతర్జాతీయ వైబ్రియానిక్స్ సదస్సులో పాట్ మేడమ్‌ను ప్రత్యక్షంగా కలవడం నాకు అపారమైన ఆనందాన్ని కలిగించింది. అంతకుముందు, 2013 జూన్/జూలైలో ఆమె నాకు SVP ఈ-కోర్స్ ఉపాధ్యాయురాలిగా ఉన్నారు. ఆమె ఎంతో సౌమ్యంగా, ఓర్పుతో, ప్రోత్సాహకరంగా ఉండేవారు. నేను ఆలస్యంగా ప్రారంభించినప్పటికీ, ఈ-కోర్స్‌ను త్వరగా పూర్తిచేయడానికి అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని ఆమె నాలో నింపారు. అందువల్ల ఆమెను ప్రత్యక్షంగా కలవడం నా కల నిజమైనట్టే అనిపించింది. తరువాత ఆమె కాంబోలకు సంబంధించిన ప్రశ్నలను నేరుగా చూడటం తగ్గించినప్పటికీ, నాకు అవసరమైనప్పుడు రోగుల కేసుల విషయంలో సహాయం చేయడానికి ఎంతో సౌజన్యంతో ముందుకు వచ్చేవారు. ఆమె స్పందనలు ఎల్లప్పుడూ త్వరగా వచ్చేవి. తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న నా అనేక మంది రోగులు, ఆమె ఆలోచనాత్మకంగా సూచించిన రెమెడీల వల్ల కోలుకున్నారు. 108 కామన్ కాంబోల రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన వారిలో ఒకరైన పాట్ మేడమ్‌ను కోల్పోవడం నాకు తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఆమె వైబ్రియానిక్స్‌కు ఒక బలమైన స్తంభం. హోమియోపతిలో తన విశేష నైపుణ్యాన్ని ఉపయోగించి 108 కామన్ కాంబోలను మరింత మెరుగుపరిచిన అంకితభావం గల పరిశోధకురాలు. ఆమె నిరంతరం ప్రాక్టీషనర్లకు సహాయపడుతూ, లెక్కలేనన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ, చివరి వరకు అపారమైన ఉత్సాహంతో సేవ చేశారు. సాయి వైబ్రియానిక్స్ కుటుంబంలో ఆమె నైపుణ్యం, ఆమె ప్రేమపూర్వక సాన్నిధ్యం మాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆమె లేని లోటును తీర్చలేనిది.

లలితా గుప్తా 11422

సిస్టర్ పాట్ హంట్ అన్ని విధాలుగా ఒక దేవదూత వంటివారు. నేను ఆమెను కలిసిన ప్రతిసారీ, ఆమె ముఖంలో ఒక ప్రకాశవంతమైన చిరునవ్వు, వ్యక్తిత్వంలో ఒక ప్రశాంతమైన ఔన్నత్యం కనిపించేవి. 2013లో, నేను ఒక SVPగా ఇంకా అనుభవం తక్కువగా ఉన్న సమయంలో, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాను. అప్పుడు హేమ్‌జీ మరియు డా. అగ్గర్వాల్ గారి సూచనతో పాట్‌ను సంప్రదించాను. ఆమె నాకు ఒక రెమెడీ సిద్ధం చేసి, స్వీయ స్వస్థత పద్ధతుల ద్వారా భావోద్వేగ కలతలను అధిగమించడానికి మార్గనిర్దేశం చేశారు. ఆమె ఆప్యాయమైన సంరక్షణ, ఓదార్పునిచ్చే మాటలు నాకు నిజమైన ఉపశమనాన్ని కలిగించాయి. తరువాత పుట్టపర్తిలో జరిగిన తొలి అంతర్జాతీయ సదస్సులో మేము కలిసినప్పుడు, నా ఆరోగ్య పునరుద్ధరణను చూసి ఆమె ఎంతో ఆనందంతో నన్ను హృదయపూర్వకంగా ఆలింగనం చేసుకున్నారు. ఆ తరువాతి సంవత్సరాలలో నేను ఆమెను వ్యక్తిగతంగా కొన్ని సార్లు కలిశాను. ఆమె ఎప్పుడూ ఉల్లాసంగా, సేవకు సిద్ధంగా, స్వామివారితో గాఢమైన అనుబంధంతో ఉండేవారు. అందుకే ప్రాణాంతక జ్వరాల వ్యాప్తి సమయంలో, ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి సమయంలో ఇమ్యూనిటీ బూస్టర్ (ఐబీ) వంటి ప్రత్యేక కాంబోల కోసం మేమంతా ఆమెనే ఆశ్రయించేవాళ్లం.

శివ కుమార్ 02696

శ్రీమతి పాట్ నిజంగా ప్రేమతో నిండిన, దయగల ఆత్మ. ఆమె మృదుస్వభావి, పరిశోధన పట్ల అంకితభావం కలిగినవారు, సేవకు పూర్తిగా నిబద్ధులైనవారు. ఆమె సాన్నిధ్యం ప్రశాంతతను, ఆధ్యాత్మిక లోతును ప్రసరించేది. ఆమెతో జరిగిన ప్రతి సంభాషణ అర్థవంతంగా, మౌన ప్రేరణతో నిండినదిగా ఉండేది. వ్యక్తిగతంగా చెప్పాలంటే, నా వివాహ దినాన ఆమె నాకు అందించిన స్వామివారి గాయత్రీ మంత్ర స్మారక చిహ్నం నాకు ఎంతో విలువైనది. అది ఆమె కరుణ, ఆశీర్వాదాలను ఎల్లప్పుడూ గుర్తు చేస్తూ ఉండే అమూల్యమైన జ్ఞాపకం. సాయి వైబ్రియానిక్స్ పట్ల ఆమెకు ఉన్న అచంచలమైన అంకితభావం, అలాగే తన జ్ఞానాన్ని ఎంతో వినయంతో ఇతరులతో పంచుకునే స్వభావం, ఆమెను మన సమాజానికి ఒక మార్గదర్శక దీపంలా నిలిపాయి. ఆమెను కోల్పోయిన బాధ మాలో ఎంతో లోతుగా ఉన్నప్పటికీ, ఆమె ఇప్పుడు స్వామివారి దివ్య సన్నిధిలో విశ్రాంతి పొందుతున్నారనే భావన మాకు ఓదార్పునిస్తుంది. ఆమె మహోన్నత ఆత్మ శాశ్వత శాంతిని పొందాలని మనసారా ప్రార్థిస్తున్నాము.

జెరమ్ జో 02822

2014లో ప్రశాంతి నిలయంలో జరిగిన వైబ్రియానిక్స్ అంతర్జాతీయ సదస్సు సందర్భంగా మేము మొదటిసారిగా ప్యాట్రిషియా హంట్ గారిని కలిశాము. ఆమె నిజంగా అద్భుతమైన వ్యక్తి, ఎప్పుడూ సహాయం చేయడానికి సిద్ధంగా ఉండేవారు. వైబ్రియానిక్స్‌కు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాల్లో కూడా మేము ఆమెతో సన్నిహిత సంబంధాన్ని కొనసాగించాము. ప్రశాంతి నిలయంలో డా. అగ్గర్వాల్ గారు, హేమాబెన్ గారి నివాసంలోనూ, అలాగే యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌లో ఆమె కుమార్తె పాలీతో కలిసి ఉన్నప్పుడు కూడా ఆమెను సందర్శించాము. ఆమె అనారోగ్యానికి గురైన తరువాత, మేము తరచూ సంప్రదింపులు కొనసాగిస్తూ, సాయి వైబ్రియానిక్స్ రెమెడీలు పంపిస్తూ, ఆమె కోసం ప్రార్థనలు చేసేవాళ్లం. ఆమె మరణం మాకు మాత్రమే కాదు, మొత్తం సాయి వైబ్రియానిక్స్ అంతర్జాతీయ సంస్థకు కూడా ఎంతో బాధాకరమైన నష్టం. ఆమె ఆత్మను స్వామివారు తన దివ్య సన్నిధిలో చేర్చుకుని, శాశ్వత శాంతిని ప్రసాదించాలని, అలాగే ఆమె కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ధైర్యం మరియు బలాన్ని ఇవ్వాలని మేము ప్రార్థిస్తున్నాము. ఆమె నిజమైన స్ఫూర్తిదాయక వ్యక్తి, వినయపూర్వకమైన సాయి సేవకురాలు, సాయి వైబ్రియానిక్స్ బృందానికి మార్గదర్శక దీపంలా నిలిచారు.

శ్రీ సత్యసాయి మీడియా సెంటర్‌కు చెందిన సాయి ప్రకాష్

‘పాట్ ఆంటీ’ — మేము ఎప్పటికీ ప్రేమతో గుర్తుంచుకునే పేరు. ఆమె ఆశాకిరణంలా నిశ్శబ్దంగా ఎంతో మంది సాధారణ ప్రజలకు ముఖ్యంగా మరెక్కడా సహాయం లభించని వారికి సాయి వైబ్రియానిక్స్ రెమెడీలు అందించారు. అలోపతి చికిత్సలకు సులభంగా స్పందించని రెండు ఆరోగ్య సమస్యలు — ఆస్తమా మరియు అలర్జీలు. ఈ రెండు సమస్యల విషయంలో పాట్ ఆంటీ సరైన కాంబినేషన్‌ను గుర్తించి, క్రమంగా ఉపశమనాన్ని మరియు స్వస్థతను అందించేవారు. పాట్ ఆంటీ నివాసమైన  సాయి కిరణ్ హౌస్ ప్రారంభ రోజుల నుంచీ ఆమెతో ఉన్న మస్తా మరియు రుక్మిణి అలాంటి ఎన్నో సంఘటనలను గుర్తుచేసుకుంటున్నారు. వారి 30 ఏళ్ల అల్లుడు మల్లికార్జున అలర్జీలు మరియు దీర్ఘకాలిక దగ్గుతో బాధపడేవాడు. అలాగే అతని 10 ఏళ్ల కుమార్తె కూడా ఇలాంటి సమస్యలతో బాధపడేది. పాట్ ఆంటీ సూచించిన రెమెడీల వలన వారిద్దరూ కోలుకున్నారు. వారు పుట్టపర్తిలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి సమీపంలో నివసిస్తున్నప్పటికీ, అక్కడికి వెళ్లాల్సిన అవసరం వారికి ఎప్పుడూ రాలేదు. వారు ఎల్లప్పుడూ పాట్ ఆంటీ రెమెడీల పైనే ఆధారపడ్డారు. అంతేకాక, గ్రామంలోని ఇతర ప్రజలు కూడా సాయి కిరణ్ ఇంటి ప్రాంగణాన్ని ఎంతో కృతజ్ఞతతో చూస్తారు. ఎందుకంటే పాట్ ఆంటీ అక్కడి ప్రజలకు నిస్వార్థంగా చేసిన సేవ అపారమైనది. ఆమె నిశ్శబ్దంగా వారి శారీరక బాధలను తగ్గించడమే కాకుండా, వారి మనసులకు కూడా శాంతిని ప్రసాదించేవారు.

ప్రశ్నలు జవాబులు

Q1. కొందరు తమను ‘హీలర్స్’ అని, మరికొందరు ‘ప్రాక్టీషనర్స్’ అని పిలుచుకుంటారు. ఈ రెండింటి మధ్య ఏమైనా తేడా ఉందా?

A. వైద్య చికిత్సల రంగంలో హీలర్ మరియు ప్రాక్టీషనర్ అనే పదాలను తరచుగా ఒకే అర్థంలో ఉపయోగించినప్పటికీ, ఈ రెండూ ఒకటే కావు.

హీలర్ అంటే, ఎవరి ద్వారా స్వాభావికంగా స్వస్థత కలుగుతుందో అలాంటి వ్యక్తి. ప్రేమ, కరుణ, ప్రార్థన, నిర్మలమైన సంకల్పం, దైవానికి సంపూర్ణ శరణాగతి ద్వారా స్వస్థత ప్రవహిస్తుంది. హీలర్ ఒక నిర్దిష్ట పద్ధతిని అనుసరించకపోవచ్చు లేదా ప్రత్యేకమైన సాధనాలను ఉపయోగించకపోవచ్చు. చాలామంది హీలర్లు తమను తాము హీలర్లుగా కూడా భావించరు; వారు భగవంతుని కృపకు తాము కేవలం సాధనాలమని భావిస్తారు. ఇక్కడ ప్రధానమైనది చికిత్సా విధానం కాదు, వారి అంతరంగ స్థితి.

మరోవైపు, ప్రాక్టీషనర్ అంటే అల్లోపతి, హోమియోపతి లేదా వైబ్రియానిక్స్ వంటి నిర్దిష్ట వైద్య విధానంలో శిక్షణ పొందిన వ్యక్తి. ఆయన రెమెడీలను ఎలా తయారుచేయాలి, ఏ ప్రోటోకాల్‌ను ఎలా అనుసరించాలి, లక్షణాలను ఎలా అర్థం చేసుకోవాలి, అలాగే క్రమశిక్షణ, నైతిక విలువలను ఎలా పాటించాలో నేర్చుకుంటారు. సాయి వైబ్రియానిక్స్‌లో ప్రాక్టీషనర్ సరైన రెమెడీలను ఎంపిక చేసి, తగిన మోతాదులో ఇచ్చి, రోగి పురోగతిని గమనించి, ఫలితాలను నమోదు చేస్తారు. ఇక్కడ ప్రధానమైనది వైబ్రియానిక్స్ విధానాన్ని సక్రమంగా అమలు చేయడం.

ఈ రెండూ కలిసినప్పుడే అత్యుత్తమ స్వస్థత ఫలితాలు లభిస్తాయి. వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్ వినయం, ప్రార్థన, కరుణతో సేవ చేసినప్పుడు చికిత్స మరింత లోతైనదిగా, స్థిరమైన ఫలితాలను ఇస్తుంది. అలాగే, ఒక హీలర్ వైబ్రియానిక్స్ వంటి క్రమబద్ధమైన విధానాన్ని అనుసరించినప్పుడు, మరింత ఎక్కువ మందికి సురక్షితంగా, సమర్థవంతంగా స్వస్థత అందించగలుగుతారు.

సాయి వైబ్రియానిక్స్‌లో మనకు ప్రాక్టీషనర్లుగా శిక్షణ ఇస్తారు. అయితే, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి కృపకు సాధనాలుగా సేవ చేస్తూ, ఫలితాలన్నింటినీ ఆయన పాదపద్మాలకు సమర్పించే హీలర్లుగా ఎదగాలని మనం లక్ష్యంగా పెట్టుకోవాలి.

_______________________________________________________________________________

Q2. ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్)కు వైబ్రియానిక్స్‌లో ప్రత్యామ్నాయం ఉందా?? 

A.  లేదు. ORS‌కు వైబ్రియానిక్స్‌లో ప్రత్యక్ష ప్రత్యామ్నాయం లేదు. ORS అనేది నిర్జలీకరణం (డీహైడ్రేషన్) చికిత్సకు ఉపయోగించే, నీరు, గ్లూకోజ్, ఎలక్ట్రోలైట్లు (ముఖ్యంగా సోడియం, పొటాషియం) కలిగిన శాస్త్రీయంగా నిర్ధారించబడిన ద్రావణం. వైబ్రియానిక్స్ శక్తి ఆధారిత చికిత్సా విధానం కాబట్టి, శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్లను భర్తీ చేసే శారీరక అవసరాన్ని ఇది భర్తీ చేయదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాణాలను కాపాడగల అత్యవసర గృహ ORS ద్రావణాన్ని సూచిస్తోంది: 1 లీటరు నీరు + 6 టీ స్పూన్ల చక్కెర + ½ టీ స్పూన్ ఉప్పు. పూర్తి ORSలో పొటాషియం కూడా ఉంటుంది. పొటాషియానికి సహజ వనరులుగా కొబ్బరి నీరు, అరటిపండు లేదా మజ్జిగ ఉపయోగపడతాయి. శరీర శక్తి సమతుల్యతను పునరుద్ధరించి కోలుకోవడానికి తోడ్పడే విధంగా, నిర్దిష్ట వైబ్రియానిక్స్ రెమెడీని ORSతో పాటు ఉపయోగించవచ్చు. హెచ్చరిక: తీవ్రమైన నిర్జలీకరణం (డీహైడ్రేషన్) ఉన్నప్పుడు వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.

_______________________________________________________________________________

Q3. మధుమేహం, అధిక రక్తపోటు లేదా అధిక కొలెస్ట్రాల్ వంటి వ్యాధులకు వాడే అల్లోపతి మందులను పొటెన్టైజ్ చేసినప్పుడు, అవి దుష్ప్రభావాలను తగ్గిస్తాయని మాకు తెలుసు. అయితే అవి చికిత్సాపరంగానూ పనిచేస్తాయా?

A.  అవును. అల్లోపతి మందులను పొటెన్టైజ్ చేసినప్పుడు అవి దుష్ప్రభావాలను తగ్గించడంలో (దీనిని ఐసోపథిక్ చర్య అంటారు) సహాయపడతాయి. అయితే, చికిత్సాపరంగా అవి కొంతమంది రోగులలో మాత్రమే పనిచేయవచ్చు. ఇది రోగి యొక్క శారీరక స్వభావం, లక్షణాల సారూప్యత (Symptom similarity), అలాగే స్పందనశీలత (Sensitivity)పై ఆధారపడి ఉంటుంది. ఈ అంశంపై ఇంకా పరిశోధన అవసరం.

ప్రస్తుతం మనకు తెలిసిన విషయం ఏమిటంటే: దుష్ప్రభావాలను నివారించేందుకు సాధారణంగా 200C పొటెన్సీని ఉపయోగిస్తారు. చికిత్సాపరమైన ప్రయోజనం కోసం సరైన పొటెన్సీ ఎంపిక అత్యంత ముఖ్యమైనది. ఉదాహరణకు, శరీర క్రియలలో ఏర్పడిన సాధారణ లోపాలను సున్నితంగా ప్రభావితం చేయాలనుకుంటే, 6C లేదా 30C వంటి తక్కువ పొటెన్సీలతో ప్రారంభించాలని సూచిస్తున్నాము. లోతుగా పాతుకుపోయిన లేదా రాజ్యాంగ సంబంధిత (Constitutional) సమస్యల విషయంలో అనుభవజ్ఞులైన SVPs అవసరమైతే 200C లేదా అంతకంటే ఎక్కువ పొటెన్సీలను ఉపయోగించవచ్చు. కొన్ని సందర్భాల్లో ఒకే పొటెన్సీ ఈ రెండు ప్రయోజనాలను కూడా అందించవచ్చు.

ఇంకా ఒక విషయం జోడించాలనుకుంటున్నాను. కొంతమంది ప్రాక్టీషనర్లు, తమ రోగులు 1X పొటెన్సీలో పొటెన్టైజ్ చేసిన అల్లోపతి నొప్పి నివారణ మందులను తీసుకున్నప్పుడు, అసలు మందుతో పోలిస్తే మెరుగైన ఫలితాలు పొందినట్లు నివేదించారు. ఈ విధానాన్ని అనుభవించిన లేదా పరిశీలించడానికి ఆసక్తి ఉన్న ప్రాక్టీషనర్లు, నొప్పి నివారణ మందుతో చేసిన ప్రయోగాల సందర్భంగా రోగుల వివరాలతో కూడిన సమగ్ర నివేదికలను [email protected] కు పంపితే ఎంతో అభినందిస్తాము.

_______________________________________________________________________________

Q4. నా రోగికి తన తల్లి నివసించే ప్రాంతంలో ఉన్న ఒక ప్రాక్టీషనర్ వివరాలు కావాలి. నేను ఆమెకు ఎలా సహాయం చేయగలను?

A.  మీ రోగిని మా వెబ్‌సైట్ www.vibrionics.org ను సందర్శించి, Contact Us అనే ట్యాబ్‌పై క్లిక్ చేసి, అందులో ఉన్న ఫారమ్‌ను పూరించమని చెప్పండి. సంబంధిత బృందం ఆమెకు వీలైనంత త్వరగా స్పందిస్తుంది. అవసరమైతే, ఆమె మొబైల్ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌లో ఈ ప్రక్రియను పూర్తి చేయడంలో మీరు సహాయం చేయవచ్చు.

_______________________________________________________________________________

Q5. మన 108CC పుస్తకంలో పేర్కొన్నట్లుగా, రక్త క్యాన్సర్లో CC2.1 Cancers - allతో పాటు CC2.3 Tumours & Growths కాంబోను ఎందుకు ఇవ్వకూడదు?

A.  కారణం చాలా సరళమైనది. రక్త క్యాన్సర్ అనేది కణితి (Tumour) కాదు, అసాధారణ పెరుగుదల (Growth) కూడా కాదు.

దివ్య వైద్యుని దివ్య వాణి

మనస్సును పవిత్రం చేసుకోవడానికి మొదటి అవసరం పవిత్రమైన ఆహారం. అయితే ప్రతిసారీ, అన్ని విధాలా ఆహారం సంపూర్ణంగా పవిత్రంగా ఉండేలా చూసుకోవడం సాధ్యం కాదు. కష్టాన్ని అధిగమించే మార్గం ఏమిటంటే, ఆహారాన్ని ముందుగా భగవంతునికి సమర్పించి, దానిని భగవంతుని ప్రసాదంగా భావించడం. అలా చేసినప్పుడు ఆహారంలోని అన్ని అపవిత్రతలు తొలగిపోతాయి.”

శ్రీ సత్యసాయి బాబా, Purity of the Mind, దివ్య ప్రసంగం, 25 మే 1990               https://saispeaks.sathyasai.org/discourse/purity-mind-role-senses

సేవ ద్వారా సమస్త జీవులు దైవసాగరంలోని అలలేనని మీరు గ్రహిస్తారు. సమస్త జీవుల ఏకత్వాన్ని నిరంతరం ధ్యానించే స్థితికి మరే ఇతర ఆధ్యాత్మిక సాధన మిమ్మల్ని చేర్చలేదు. ఇతరుల బాధను మీ బాధగా అనుభవిస్తారు. ప్రతి ఒక్కరిలో మిమ్మల్ని మీరు, మీలో ప్రతి ఒక్కరినీ చూడగలగడంఅదే సేవా సాధన యొక్క సారాంశం. ఇది ఇతరుల బాధల ముందు మిమ్మల్ని వినయవంతులుగా చేస్తుంది. సేవ అందించే అవకాశాల ద్వారా ఎంత కఠినమైన హృదయమైనా క్రమంగా వెన్నలాంటి మృదుత్వాన్ని సంతరించుకుంటుంది.”

శ్రీ సత్యసాయి బాబా, అధ్యాయం 18 – No Bumps, No Jumps, సత్యసాయి స్పీక్స్,  సంపుటి 13 (1975–77), సేవాదళ్ సమావేశం, 15 నవంబర్ 1975   https://saispeaks.sathyasai.org/discourse/no-bumps-no-jumps#

 

 

ప్రకటనలు

రాబోయే వర్క్ షాప్లు

భారతదేశం, పుట్టపర్తి: తెలుగు AP* ప్రాక్టికల్ వర్క్ షాప్, 10–13 జూలై 2026 **, సంప్రదించవలసిన ఇమెయిల్: [email protected]

భారతదేశం, పుట్టపర్తి: AVP* ముఖాముఖి వర్క్ షాప్, 15–19 జూలై 2026 **, సంప్రదించవలసిన ఇమెయిల్: [email protected]

భారతదేశం, పుట్టపర్తి: SVP* వర్క్ షాప్, 21–25 జూలై 2026 **, సంప్రదించవలసిన ఇమెయిల్: [email protected]

భారతదేశం, పుట్టపర్తి: AVP* ముఖాముఖి వర్క్ షాప్, 26–30 నవంబర్ 2026 **, సంప్రదించవలసిన ఇమెయిల్: [email protected]

భారతదేశం, పుట్టపర్తి: SVP ఫాలో-అప్ కోర్సు, 1–2 డిసెంబర్ 2026 **, సంప్రదించవలసిన ఇమెయిల్: [email protected]

* ప్రవేశ ప్రక్రియ మరియు ఈ-కోర్సును పూర్తి చేసిన వారికి మాత్రమే.

** తేదీలు మారవచ్చు

 

అదనంగా

1. ఆరోగ్య వ్యాసం

మహిళల ఆరోగ్యాన్ని కాపాడుకుందాం!

మహిళలు కుటుంబ వ్యవహారాలను నిర్వహించడమే కాకుండా, కుటుంబ సభ్యులందరి ఆరోగ్యం, సంక్షేమాన్ని కూడా చూసుకుంటారుఅందుకే వారు తమ ఆరోగ్యాన్ని తప్పనిసరిగా కాపాడుకోవాలి. వైద్యుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడే రోగులను సక్రమంగా చూసుకోగలడు. వైద్యుడు ఎలా ఉంటాడో, రోగి కూడా అలాగే ఉంటాడు. ప్రతికూల ఆలోచనలను విడిచిపెట్టి పవిత్రమైన భావాలను పెంపొందించుకోండి. ఆదర్శవంతమైన జీవితాన్ని గడపండి. ఉపనిషత్తులు మానవ జీవితానికి అత్యున్నత విలువను ఇచ్చాయి. మీరు దానికి తగిన విధంగా జీవించి, మీలోని దివ్యశక్తిని వ్యక్తపరచాలి.”
శ్రీ సత్యసాయి బాబా 1-3

1. మహిళల ఆరోగ్యం ఎంతో ప్రాముఖ్యమైనది!

ప్రతి మహిళ జీవిత ప్రయాణం ఒక సవాలుతో కూడుకున్నదే. యుక్తవయస్సు, నెలసరి రుతుచక్రం, గర్భధారణ, ప్రసవం, రుతువిరతి (మెనోపాజ్) వంటి జీవన దశలన్నింటినీ ఆమె ఎదుర్కొంటుంది. సామాజిక పరిమితులు, కుటుంబ బాధ్యతలు వంటి కారణాల వల్ల ఈ దశలు ఆమెను మరింత సున్నితంగా, అప్రమత్తంగా, కొన్నిసార్లు పరిమితులకు లోనైన వ్యక్తిగా మార్చవచ్చు. ప్రత్యేకించి సంతానోత్పత్తి దశల్లో మహిళలకు ఉండే ప్రత్యేక ఆరోగ్య అవసరాలు, అలాగే దీర్ఘకాలిక వ్యాధులు మహిళలపై చూపే భిన్నమైన ప్రభావాల గురించి వైద్య పరిశోధనలు గత రెండు దశాబ్దాలుగా మాత్రమే సమగ్రంగా గుర్తించి అధ్యయనం చేస్తున్నాయి.

2. మహిళల ప్రజనన వ్యవస్థ పనితీరు మరియు జీవన దశలు

2.1 మహిళల అంతర్గత ప్రజనన అవయవాలు: అండాశయాలు (Ovaries), ఫాలోపియన్ నాళాలు (Fallopian Tubes), గర్భాశయం (Uterus), గర్భాశయ ముఖద్వారం (Cervix), మరియు యోని (Vagina). అండాశయాలు గర్భాశయానికి ఇరువైపులా ఉండే రెండు అండాకార గ్రంథులు. ఇవి అండాలను (Ova/Eggs) ఉత్పత్తి చేయడంతో పాటు ఈస్ట్రోజెన్ , ప్రొజెస్టెరోన్ అనే ముఖ్య హార్మోన్లను స్రవిస్తాయి. ఫాలోపియన్ నాళాలు అండం మరియు వీర్యకణం కలిసే ఫలదీకరణ (Fertilization) ప్రక్రియకు అనుకూలంగా పనిచేస్తాయి. గర్భాశయం మందమైన కండరాలతో కూడిన పియర్ ఆకారపు అవయవం. ఇందులోనే గర్భస్థ శిశువు పెరిగి పోషణ పొందుతుంది. గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్) గర్భాశయం దిగువన ఉండే సన్నని భాగం. ఇది యోనితో కలుస్తుంది. యోని ఒక కండరాలతో కూడిన ప్రసవ మార్గం. ప్రసవ సమయంలో శిశువు బయటకు రావడానికి ఇది విస్తరించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.5-8

2.2 బాల్యం నుండి యుక్తవయస్సు వరకు: యుక్తవయస్సు అనేది ప్రతి బాలిక ఎదుగుదలలో సహజమైన దశ. సాధారణంగా ఇది 8 నుంచి 13 సంవత్సరాల మధ్య ప్రారంభమవుతుంది. దీని తొలి సూచన రొమ్ముల అభివృద్ధి (Thelarche). ఆ తరువాత వరుసగా జననేంద్రియాల చుట్టూ, చంకలలో వెంట్రుకలు పెరగడం, ఎత్తు వేగంగా పెరగడం, ముఖ్యంగా నడుము భాగంలో శరీర బరువు పెరగడం, చెమట ఎక్కువగా పట్టడం, మొటిమలు రావడం, చివరికి మొదటి రుతుస్రావం (Menarche) ప్రారంభమవుతుంది. అనంతరం నెలకోసారి రుతుచక్రం కొనసాగుతుంది. ప్రతి రుతుచక్రంలో గర్భధారణ జరిగే అవకాశం కోసం శరీరం సహజంగా సిద్ధమవుతుంది. గర్భధారణ జరగకపోతే (అండం సుమారు 24 గంటల వరకు మాత్రమే జీవిస్తుంది), గర్భాశయ అంతర్గత పొర విడిపోయి యోని ద్వారా రక్తస్రావం రూపంలో బయటకు వస్తుంది. దీనినే రుతుస్రావం అంటారు. ప్రారంభ సంవత్సరాల్లో రుతుస్రావం కొన్నిసార్లు ఎక్కువగా, తక్కువగా, నొప్పితో లేదా క్రమం తప్పి రావచ్చు. ఇది సహజమే అయినప్పటికీ, బాలికలకు కొంత అసౌకర్యం కలిగించవచ్చు. అందువల్ల తల్లిదండ్రులు తమ కుమార్తెలను ముందుగానే ఈ సహజ మార్పుల గురించి అవగాహన కల్పించి, అవి జీవితంలో సహజమైన భాగమని తెలియజేయాలి. దీంతో వారు ఈ మార్పులను ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో, మానసిక ఒత్తిడి లేకుండా స్వీకరించగలుగుతారు.9-11

2.3 గర్భధారణ: గర్భధారణ అనేది సంక్లిష్టమైన సహజ ప్రక్రియ. యోని ద్వారా పైకి ప్రయాణించిన వీర్యకణం, అండాశయం నుండి విడుదలైన అండాన్ని (అండోత్సర్గం – Ovulation) చేరుకొని ఫలదీకరణం చేసినప్పుడు గర్భధారణ ప్రారంభమవుతుంది. ఫలదీకరణం చెందిన ఈ అండాన్ని జైగోట్ అంటారు. ఇది సుమారు ఒక వారంలో గర్భాశయంలో స్థిరపడి (Implantation), గర్భధారణ ప్రారంభమవుతుంది. ప్రారంభ లక్షణాలుగా కొన్ని రోజులపాటు స్వల్పమైన కడుపు నొప్పి లేదా కొద్దిపాటి రక్తపు చుక్కలు (Spotting) కనిపించవచ్చు. అయితే చాలామందికి ఎలాంటి లక్షణాలు అనిపించకపోవచ్చు. గర్భధారణకు సాధారణంగా కనిపించే ఇతర సంకేతాలు: రుతుస్రావం ఆగిపోవడం, తరచుగా మూత్రవిసర్జన కావడం, అలసట, వికారం, రొమ్ములు నొప్పిగా లేదా ఉబ్బినట్లు అనిపించడం, తలనొప్పి, మానసిక స్థితిలో మార్పులు (Mood swings). గర్భధారణ జరిగిన 11–14 రోజుల తరువాత గర్భధారణ పరీక్షలో సానుకూల ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది.12

2.4 గర్భధారణ కాలం: గర్భధారణ మొత్తం 40 వారాలు కొనసాగి, మూడు త్రైమాసికాలుగా విభజించబడుతుంది. మొదటి త్రైమాసికం (112 వారాలు) అత్యంత కీలకమైనది. ఈ దశలో ఉదయం వికారం (Morning sickness), అలసట వంటి అసౌకర్యాలు సాధారణంగా కనిపిస్తాయి. ప్రతి వారం గడిచేకొద్దీ గర్భస్థ శిశువుకు ముఖ ఆకృతి, చేతులు, కాళ్లు, అంతర్గత అవయవాలు, ఎముకలు, కండరాలు క్రమంగా అభివృద్ధి చెందుతాయి. 12వ వారం తరువాత గర్భస్రావం జరిగే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. ఉదయం వికారం కూడా సాధారణంగా తగ్గుతుంది. రెండవ త్రైమాసికం (1328 వారాలు) తల్లికి ఎంతో ఆనందాన్నిచ్చే దశ. ఈ సమయంలో గర్భస్థ శిశువు శబ్దం, వెలుతురుకు స్పందించడం ప్రారంభిస్తుంది. అలాగే శిశువు కదలికలు (తన్నడం) తల్లికి స్పష్టంగా అనిపించడం మొదలవుతుంది. మూడవ త్రైమాసికం (29–40 వారాలు)లో గర్భస్థ శిశువు పూర్తిగా ఎదిగి, బరువు పెరిగి, ప్రసవానికి సిద్ధమవుతుంది. ఈ సమయంలో శిశువు తల క్రిందికి తిరిగి, సాధారణంగా 37 నుంచి 40 వారాల మధ్య ప్రసవానికి సిద్ధంగా ఉంటుంది. మొదటిసారి ప్రసవించే మహిళలకు ప్రసవ ప్రక్రియ సాధారణంగా 12 నుంచి 19 గంటల వరకు కొనసాగి, శారీరకంగా, మానసికంగా ఎంతో కఠినమైన అనుభవంగా ఉంటుంది. ప్రసవం ప్రారంభమయ్యే తొలి సంకేతాలు గర్భాశయ సంకోచాలు. అనంతరం గర్భాశయ ముఖద్వారం విస్తరించడం, ఉమ్మనీరు పోవడం, శ్లేష్మ స్రావం (Mucus discharge) జరగడం జరుగుతుంది. ప్రసవ నొప్పిని తగ్గించేందుకు శ్వాస వ్యాయామాలు, శరీర కదలికలు వంటి సహజ పద్ధతులు ఉపయోగిస్తారు. నొప్పి భరించలేనప్పుడు వైద్యపరమైన నొప్పి నివారణ అందిస్తారు. అవసరమైతే తల్లి లేదా శిశువు భద్రత కోసం సిజేరియన్ శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు. శిశువుకు జన్మనివ్వడం నిజంగా శారీరకంగానే కాక భావోద్వేగపరంగానూ అత్యంత సవాలుతో కూడుకున్న అనుభవం.13-15

గర్భధారణ సమయంలో సంభవించే కొన్ని సంక్లిష్టతలు: ఎక్టాపిక్ గర్భధారణ (అండం గర్భాశయం వెలుపల, సాధారణంగా ఫాలోపియన్ నాళంలో స్థిరపడడం), గర్భస్థ శిశువుకు సంబంధించిన సమస్యలు, గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహం (Gestational Diabetes), గర్భధారణ సంబంధిత అధిక రక్తపోటు, ప్లాసెంటాకు సంబంధించిన సమస్యలు, గర్భస్రావం, గర్భధారణ సమయంలో వచ్చే ఇన్‌ఫెక్షన్లు లేదా నెలలు నిండకముందే ప్రసవం. వీటి లక్షణాలుగా తీవ్రమైన కడుపు లేదా కటి భాగంలో నొప్పి, యోని ద్వారా అధిక రక్తస్రావం లేదా రక్తపు గడ్డలు వెలువడడం, తలతిరగడం, తేలికగా అనిపించడం, మూర్ఛపోవడం, అధిక జ్వరం లేదా తీవ్రమైన వాంతులు కనిపించవచ్చు. అలాగే వయస్సు లేదా ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా కూడా గర్భధారణ అధిక ప్రమాదకరమైనదిగా మారవచ్చు.16-18

2.5 ప్రసవానంతర కాలం (Postpartum): ప్రసవం తరువాత 6 నుంచి 8 వారాల కాలాన్ని ప్రసవానంతర దశ అంటారు. ఈ సమయంలో మహిళ శరీరంలో అనేక శారీరక, హార్మోన్ల మార్పులు జరుగుతాయి. పాలు అధికంగా ఉత్పత్తి కావడం, లింఫ్ ద్రవం పేరుకుపోవడం వల్ల స్తనాలు గట్టిపడటం, ఉబ్బడం, బిగుతుగా ఉండటం, నొప్పి కలగడం సాధారణంగా ఒక వారం వరకు ఉండవచ్చు. అదనంగా యోని ద్వారా రక్తస్రావం, అధిక చెమట, మలబద్ధకం, జుట్టు రాలడం, ఆందోళన, నిరాశ వంటి మార్పులు కూడా కనిపించవచ్చు. తగినంత విశ్రాంతి, కుటుంబ సభ్యుల సంరక్షణ, పోషకాహారం త్వరగా కోలుకోవడానికి ఎంతో దోహదపడతాయి. సిజేరియన్ శస్త్రచికిత్స జరిగినట్లయితే పూర్తిగా కోలుకోవడానికి సుమారు 12 వారాలు పట్టవచ్చు. ఈ మొత్తం కాలంలో చికిత్స చేస్తున్న వైద్యుని సూచనలను తప్పకుండా పాటించాలి. ఈ దశలో తల్లి బాధ్యత రెండింతలు అవుతుంది  - తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు నవజాత శిశువును కూడా సంరక్షించాలి. ఈ సమయంలో మానసిక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ దిగులుగా ఉండడం, అందరినుంచి దూరంగా ఉండడం, శిశువు పట్ల నిర్లక్ష్యం చూపడం వంటి లక్షణాలు ప్రసవానంతర నిరాశ (Postpartum Depression)కు హెచ్చరిక సంకేతాలుగా పరిగణించాలి. అలాంటి పరిస్థితిలో వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. ఈ సమయంలో ఒంటరిగా ఉండకుండా, కుటుంబ సభ్యుల సమక్షంలో ఉండటం మంచిది.19,20

2.6 రుతువిరతి (Menopause): రుతువిరతి అంటే వరుసగా 12 నెలల పాటు రుతుస్రావం రాకపోవడం. ఇది సాధారణంగా 52 సంవత్సరాల వయస్సు ప్రాంతంలో లేదా అంతకంటే ముందే సంభవించి, మహిళ సంతానోత్పత్తి దశకు ముగింపు పలుకుతుంది. రుతువిరతికి సుమారు 10 సంవత్సరాల ముందు ప్రారంభమయ్యే దశను పెరిమెనోపాజ్ అంటారు. ఈ సమయంలో ఉత్పత్తి అయ్యే అండాల సంఖ్య, నాణ్యత రెండూ క్రమంగా తగ్గడంతో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. ఈ దశలో కనిపించే సాధారణ లక్షణాలు: రుతుచక్రం క్రమం తప్పడం, అకస్మాత్తుగా వేడిగా అనిపించడం, మానసిక స్థితిలో మార్పులు, యోని పొడిబారడం, రాత్రివేళ అధిక చెమటలు పట్టడం, బరువు పెరగడం, తలనొప్పి, తరచుగా మూత్రవిసర్జన చేయాలనిపించడం, నిద్రలేమి, నిరాశ మొదలైనవి. ఈ లక్షణాలు సాధారణంగా రుతువిరతి వచ్చిన తరువాత 7 నుంచి 10 సంవత్సరాల కాలంలో క్రమంగా తగ్గుముఖం పడతాయి.21

2.7 రుతువిరతి అనంతర దశ (Postmenopause) రుతువిరతి తరువాత శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయి గణనీయంగా తగ్గిపోవడం వల్ల మహిళల్లో గుండె జబ్బులు, గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఆరోగ్యకరంగా లేకపోతే ఈ ప్రమాదం మరింత అధికమవుతుంది. గుండెపోటు సమయంలో సాధారణంగా కనిపించే లక్షణాలు - ఛాతీలో ఒత్తిడి, బిగుతు లేదా నొప్పి, మెడ, దవడ, చేయి లేదా వెన్నులో నొప్పి, అకస్మాత్తుగా అధికంగా చెమటలు పట్టడం. అయితే కొంతమంది మహిళల్లో అసాధారణ లక్షణాలు కూడా కనిపించవచ్చు. ఉదాహరణకు, ఇంతకు ముందు ఎప్పుడూ లేనట్లుగా అజీర్ణం కలగడం; మంచం సర్దడం, బాత్‌రూమ్ వరకు నడవడం లేదా రెండు మెట్లు ఎక్కడం వంటి చిన్న పనులు చేసినా అకస్మాత్తుగా తీవ్రమైన అలసట రావడం; ఎలాంటి శారీరక శ్రమ చేయకపోయినా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం, పడుకున్నప్పుడు అది ఎక్కువై కూర్చున్నప్పుడు తగ్గడం; ఇంతకుముందు సులభంగా చేయగలిగిన పనులను చేయలేకపోవడం వంటి లక్షణాలు కూడా గుండె సమస్యలకు సంకేతాలు కావచ్చు.22-23

అలాగే, పక్షవాతం (Stroke) వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉండవచ్చు. అందువల్ల “BE FAST” అనే హెచ్చరిక సంకేతాలను గుర్తుంచుకోవాలి - Balance: సమతుల్యత లేదా శరీర సమన్వయం కోల్పోవడం. Eyes: చూపు తగ్గడం, మసకగా లేదా రెండుగా కనిపించడం. Face: ముఖం ఒకవైపు వాలిపోవడం. Arm: చేయి బలహీనపడడం లేదా పైకి ఎత్తలేకపోవడం. Speech: మాట తడబడడం లేదా స్పష్టంగా మాట్లాడలేకపోవడం. Time: ఈ లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా అత్యవసర వైద్య సహాయం పొందాలి. అదనంగా, కారణం లేకుండా అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి రావడం, శరీరంలోని ఏదైనా భాగం పనితీరు హఠాత్తుగా తగ్గిపోవడం, తీవ్రమైన అలసట, గందరగోళం, బలహీనత, వికారం, వాంతులు వంటి లక్షణాలను కూడా నిర్లక్ష్యం చేయకూడదు.24

కొన్ని వ్యాధులు మహిళల్లో పురుషులతో పోలిస్తే ఎక్కువకాలం గుర్తించబడకుండా ఉండే అవకాశం ఉంది. 70 లక్షల (7 మిలియన్) మంది ఆరోగ్య రికార్డులపై చేసిన ఒక అధ్యయనం ప్రకారం, మహిళల్లో క్యాన్సర్ పురుషులతో పోలిస్తే సగటున రెండున్నర సంవత్సరాలు ఆలస్యంగా, అలాగే మధుమేహం సగటున నాలుగున్నర సంవత్సరాలు ఆలస్యంగా నిర్ధారణ అవుతోంది. అందువల్ల శరీరం ఇచ్చే హెచ్చరిక సంకేతాలను ఎప్పటికప్పుడు గమనించి, వెంటనే వైద్యులను సంప్రదించడం అత్యంత అవసరం.4

3. స్త్రీ జననేంద్రియాలకు సంబంధించిన వ్యాధులు

3.1 సాధారణంగా కనిపించే వ్యాధులు (i) మెనోరేజియా: అధిక రుతుస్రావం. ఇది హార్మోన్ల అసమతుల్యత లేదా గర్భాశయ ఫైబ్రాయిడ్స్ కారణంగా రావచ్చు. (ii) పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS): రుతుచక్రం క్రమం తప్పడం, అవాంఛిత వెంట్రుకలు పెరగడం, మొటిమలు, బరువు పెరగడం, గర్భధారణలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. (iii) ఎండోమెట్రియోసిస్: సాధారణంగా గర్భాశయం లోపలి పొరలో మాత్రమే ఉండాల్సిన కణజాలం అండాశయాలు లేదా ప్రేగులు వంటి ఇతర ప్రాంతాల్లో పెరగడం. దీని వల్ల తీవ్రమైన రుతునొప్పి, సంభోగ సమయంలో నొప్పి, సంతానలేమి సమస్యలు ఏర్పడవచ్చు. దీనిని నిర్ధారించడానికి చాలా సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. (iv) గర్భాశయ ఫైబ్రాయిడ్స్: గర్భాశయంలో లేదా దాని చుట్టూ ఏర్పడే క్యాన్సర్ కాని కణితులు. అధిక రుతుస్రావం, కటి భాగంలో నొప్పి, గర్భధారణలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపించవచ్చు. సాధారణ స్కానింగ్ లేదా వైద్య పరీక్షల సమయంలో ఇవి గుర్తించబడతాయి. (v) అండాశయ తిత్తులు: ఇవి ఎక్కువగా ప్రమాదకరం కావు, చాలావరకు వాటంతట అవే తగ్గిపోతాయి. అయితే నొప్పి, కడుపు ఉబ్బరం లేదా తిత్తి మెలిక తిరిగిపోతే అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పి కలగవచ్చు. నిరంతరంగా ఉండే లేదా నొప్పి కలిగించే తిత్తులను నిర్లక్ష్యం చేయరాదు. (vi) పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ (PID): సాధారణంగా లైంగిక సంబంధం ద్వారా సంక్రమించే బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్‌ఫెక్షన్. కటి భాగంలో నొప్పి, జ్వరం, అసాధారణ యోని స్రావం వంటి లక్షణాలు ఉంటాయి. చికిత్స తీసుకోకపోతే దీర్ఘకాలిక నొప్పి లేదా సంతానోత్పత్తి సమస్యలు రావచ్చు. (vii) యోని ఇన్ఫెక్షన్లు: దురద, అసాధారణ స్రావం, దుర్వాసన వంటి లక్షణాలు కనిపిస్తాయి. చికిత్స చేయకపోతే తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు. (viii) పెల్విక్ అవయవాల జారడం (Pelvic Organ Prolapse): ప్రసవం లేదా రుతువిరతి తర్వాత కటి భాగంలోని కండరాలు బలహీనపడటం వల్ల మూత్రాశయం లేదా గర్భాశయం క్రిందికి జారిపోవడం. యోనిలో ఉబ్బినట్లు లేదా ఒత్తిడిగా అనిపిస్తే నిర్లక్ష్యం చేయరాదు. (ix) గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (Cervical Cancer): అసాధారణ రక్తస్రావం, సంభోగ సమయంలో నొప్పి, అసాధారణ దుర్వాసనతో కూడిన యోని స్రావం వంటి హెచ్చరిక లక్షణాలు కనిపించవచ్చు. ఇది అత్యంత తీవ్రమైన స్త్రీ జననేంద్రియ వ్యాధులలో ఒకటి. క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు, స్మియర్ పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. (x) మూత్ర నియంత్రణ లోపం (Urinary Incontinence): మూత్రాశయ నియంత్రణ కోల్పోవడం వల్ల తెలియకుండానే మూత్రం కారిపోవడం లేదా ఆపుకోలేకపోవడం. ఇది ముఖ్యంగా ప్రసవం తరువాత లేదా వృద్ధాప్యంలో ఉన్న మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది.25,26

3.2 రొమ్ము క్యాన్సర్ (Breast Cancer): రొమ్ము క్యాన్సర్ మహిళల్లో చాలా సాధారణమైనప్పటికీ, ఇది ఖచ్చితంగా స్త్రీ జననేంద్రియ వ్యాధులలోకి రాదు. ప్రారంభ దశలో లక్షణాలు కనిపించకపోవచ్చు. అందువల్ల ఈ క్రింది హెచ్చరిక సంకేతాలను వెంటనే గమనించాలి: రొమ్ములో లేదా చంకలో గడ్డ కనిపించడం. రొమ్ము పరిమాణం లేదా ఆకృతిలో మార్పు లేదా అసమానత. కొత్తగా ప్రారంభమై తగ్గకుండా ఉండే నొప్పి లేదా తాకితే నొప్పిగా అనిపించడం. పాలస్రావం కాని రక్తం లేదా పారదర్శక ద్రవం వంటి అసాధారణ చనుమొన స్రావం. చనుమొన అకస్మాత్తుగా లోపలికి తిరిగిపోవడం—ఇది వెనుక పెరుగుతున్న కణితికి ప్రారంభ సంకేతం కావచ్చు.27,28

ప్రతి నెలా, ముఖ్యంగా రుతుచక్రం మధ్యలో లేదా రుతుస్రావం ముగిసిన తరువాత, స్వయంగా రొమ్ములను పరీక్షించుకోవడం అత్యంత ముఖ్యమైన మొదటి దశ. దీనిని సరైన విధంగా ఎలా చేయాలో అనుభవజ్ఞులైన రొమ్ము శస్త్రచికిత్స నిపుణులు రూపొందించిన వీడియోల కోసం ఇవ్వబడిన లింకులను చూడండి.29,30

4. మహిళల ఆరోగ్యం కోసం కొన్ని సూచనలు

  మీ గురించి మీరు శ్రద్ధ వహించండి - మీ మనస్సు, జీవనశైలి, శారీరక ఆరోగ్యం అన్నింటినీ జాగ్రత్తగా చూసుకోండి.

➤  క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి. స్వయంగా కూడా శరీరాన్ని పరిశీలించుకునే అలవాటు చేసుకోండి. ఏవైనా లక్షణాలు లేదా హెచ్చరిక సంకేతాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి. వ్యాధిని ముందుగానే గుర్తించడం, వెంటనే చికిత్స ప్రారంభించడం ఎంతో ముఖ్యమైనది.

రిఫరెన్సెస్ మరియు లింక్స్

  1. Sathya Sai Speaks on glory of womanhood: https://saispeaks.sathyasai.org/discourse/glory-womanhood
  2. https://saispeaks.sathyasai.org/discourse/health-diet-and-divinity
  3. https://saispeaks.sathyasai.org/discourse/responsibility-women-character-building
  4. https://health.clevelandclinic.org/what-is-womens-health
  5. Female system video: https://www.youtube.com/watch?v=8vCwcWQycOE
  6. https://www.youtube.com/watch?v=7J_Quu2YPdo
  7. Female Reproductive system: https://www.narayanahealth.org/blog/female-reproductive-system-structure-function
  8. https://my.clevelandclinic.org/health/articles/9118-female-reproductive-system
  9. Puberty: https://www.hopkinsmedicine.org/health/wellness-and-prevention/the-stages-of-puberty-for-girls
  10. https://kidshealth.org/en/teens/puberty.html#
  11. https://health.clevelandclinic.org/puberty-in-girls-whats-normal-and-whats-not
  12. Conception: https://my.clevelandclinic.org/health/articles/11585-conception
  13. Pregnancy: https://my.clevelandclinic.org/health/articles/7247-fetal-development-stages-of-growth
  14. https://www.mayoclinic.org/healthy-lifestyle/labor-and-delivery/in-depth/stages-of-labor/art-20046545
  15. https://www.hopkinsmedicine.org/health/wellness-and-prevention/labor#
  16. Pregnancy complications: https://womenshealth.gov/pregnancy/youre-pregnant-now-what/pregnancy-complications#
  17. https://www.mayoclinic.org/healthy-lifestyle/pregnancy-week-by-week/in-depth/high-risk-pregnancy/art-20047012
  18. https://my.clevelandclinic.org/health/articles/24442-pregnancy-complications
  19. Postpartum: https://my.clevelandclinic.org/health/articles/postpartum
  20. https://www.mayoclinic.org/healthy-lifestyle/labor-and-delivery/in-depth/postpartum-complications/art-20446702
  21. Menopause: https://my.clevelandclinic.org/health/diseases/21841-menopause
  22. https://health.clevelandclinic.org/estrogen-and-heart-health
  23. https://health.clevelandclinic.org/women-dont-ignore-3-subtle-heart-attack-symptoms
  24. https://health.clevelandclinic.org/causes-of-a-stroke-in-women-vs-men
  25. Gynae disorders: https://www.manipalhospitals.com/gurugram/blog/gynecological-problems-every-woman-should-know/
  26. https://www.cloudninecare.com/blog/8-most-common-gynaecological-disorders
  27. Breast cancer: https://mmi.edu.pk/blog/decoding-the-connection-is-breast-cancer-truly-a-gynecological-cancer/
  28. https://www.parashospitals.com/blogs/symptoms-of-breast-cancer-in-women-early-signs#
  29. Self-examination right way video English: https://www.youtube.com/watch?v=DZYJWwQYJMk
  30. Self-examination right way video Hindi: https://www.youtube.com/watch?v=gUHNxyVf_Bw

_________________________________________________________________________________

2. సెమినార్లు మరియు సమావేశాలు

2.1 యునైటెడ్ కింగ్‌డమ్ మిడ్‌లాండ్ ప్రాంత వార్షిక సమావేశం, 18 జనవరి 2026

ఈ సంవత్సరంలో నిర్వహించనున్న మూడు జాతీయ సమావేశాలలో మొదటిదానికి 17 మంది ప్రాక్టీషనర్లు హాజరయ్యారు. వారు వైబ్రియానిక్స్‌తో తమ వ్యక్తిగత అనుభవాలను పంచుకోవడంతో పాటు, విజయవంతమైన చికిత్సల గురించి వివరించారు. ముఖ్యమైన కేసులలో, ప్రాక్టీషనర్ 02897 పాల పదార్థాల వల్ల వచ్చిన చర్మ అలర్జీని వేగంగా నయం చేసిన కేసును, అలాగే ప్రాక్టీషనర్లు 02899 & 02900 ద్వంద్వ దృష్టి మరియు మెదడు కణితి (Brain Tumour) నుండి కోలుకున్న కేసును వివరించారు. అనంతరం పాలాహారం మరియు వీగన్ ఆహారం మధ్య తేడాలు, సేంద్రీయ (ఆర్గానిక్) ఆహార పదార్థాల ప్రయోజనాలపై ఉత్సాహభరితమైన చర్చ జరిగింది.

ఫార్మసిస్ట్ అయిన ప్రాక్టీషనర్ 00534, శరీరం మరియు మనస్సు ఆరోగ్యానికి రెడ్ లైట్ థెరపీ వినియోగంపై సమాచారపూర్వకమైన ప్రసంగం చేశారు. ఇదే విధమైన ఫలితాలను జెమ్ కార్డ్స్ ఉపయోగించి తయారు చేసిన వైబ్రియానిక్స్ రెమెడీల ద్వారా కూడా సాధించవచ్చని ఆయన వివరించారు.

జనరల్ ప్రాక్టీషనర్ (GP) అయిన ప్రాక్టీషనర్ 02802, తమ తమ ప్రాంతాల్లో వైద్య శిబిరాలను నిర్వహించి, వైబ్రియానిక్స్ పై అవగాహన పెంచడంతో పాటు సమగ్ర వైద్య సేవలను మరింత విస్తృతంగా ప్రజలకు అందించాలని సహచరులను ప్రోత్సహించారు.

ప్రత్యేక అతిథి వక్తగా విచ్చేసిన నేత్ర శస్త్రచికిత్స నిపుణులు డా. ఉపాధ్యాయ్, గత 40 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న అనుభవాన్ని పంచుకుంటూ, సేవపై స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు. సేవలో సంఖ్య కంటే నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, స్థానిక సంస్కృతిని గౌరవించాలని ఆయన సూచిస్తూ, మీ పాత్ర వారి ముఖాలపై చిరునవ్వు తీసుకురావడం; అప్పుడు స్వామి మీపై చిరునవ్వు చిందిస్తారు అని గుర్తుచేశారు.

పరిపాలనా విషయాలపై, యుకే కోఆర్డినేటర్ 02822, ప్రాక్టీషనర్లు తమ చిరునామా, ఇ-మెయిల్ వివరాలను ప్రాక్టీషనర్ల వెబ్‌సైట్‌లో లాగిన్ అయి స్వయంగా నవీకరించుకోవాలని సూచించారు. అలాగే ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి తమ కోఆర్డినేటర్ ద్వారా 108CC బాక్స్ ను రీఛార్జ్ చేయించుకోవాలని గుర్తుచేశారు. నిరంతర అధ్యయనం కొనసాగించాలని, డా. అగర్వాల్ ‌కు ప్రశ్నలు పంపాలని, అలాగే ఐక్యత, పవిత్రత, దైవభావంతో సేవ చేయాలని ప్రోత్సహించారు.

సమావేశంలో Copilot ఉపయోగించి కాంబో సూచనలను రూపొందించే విధానంపై కృత్రిమ మేధస్సు (AI) ప్రదర్శన కూడా జరిగింది. అనంతరం ఆలస్యమైన మాటతీరు (Delayed Speech) ఉన్న ఆటిజం గురించి ప్రశ్నోత్తర కార్యక్రమం నిర్వహించారు.

డా. అగర్వాల్, శతజయంతి సమర్పణలో భాగంగా సిద్ధమవుతున్న మూడు పుస్తకాల పురోగతిని వివరించారు. యుకే ప్రాక్టీషనర్లు అందించిన విశేష సహకారానికి కృతజ్ఞతలు తెలియజేసి, భవిష్యత్తు వార్తాలేఖల కోసం విశేషమైన కేసులను పంపాలని అందరినీ ప్రోత్సహించారు.

సమావేశం హారతితో ముగిసి, అనంతరం కృతజ్ఞతలు తెలియజేశారు.

   

 

 

 

_________________________________________________________________________________

2.2 ప్రాక్టీషనర్ల సమావేశం, 31 జనవరి 2026, హైదరాబాద్, తెలంగాణ

VT10375 వారి నిపుణుల మార్గదర్శకత్వంలో 2026 జనవరి 31న తెలంగాణలోని హైదరాబాద్‌లో ఒక రోజు రిఫ్రెషర్ సమావేశం నిర్వహించబడింది. ఈ ఉత్సాహభరితమైన, స్ఫూర్తిదాయకమైన సమావేశానికి 15 మంది ప్రాక్టీషనర్లు హాజరయ్యారు. వారిలో ప్రతి ఒక్కరూ వైబ్రియానిక్స్‌తో తమ ప్రేరణాత్మకమైన, జీవితాన్ని మార్చిన అనుభవాలను క్లుప్తంగా పంచుకున్నారు. SVP11568, 11583 మరియు VP11587 వరుసగా కేసు చరిత్రలు, మెంటరింగ్, హైదరాబాద్‌లో శిబిరాల నిర్వహణ గురించి వివరించారు.

సమావేశంలోని ముఖ్యాంశాలు:

➤ కొత్త శిబిరాలను ప్రారంభించడానికి ముందుగా ప్రాంతీయ కోఆర్డినేటర్ అనుమతి తప్పనిసరి. కనీస బృందంలో ఇద్దరు VPలు మరియు ఒక AVP ఉండాలి. శిబిరాల ప్రారంభం మరియు నిర్వహణలో అన్ని ప్రోటోకాల్స్‌ను ఖచ్చితంగా పాటించాలి. VP11632 పరిచయం చేసిన Google Form సమయం ఆదా చేయడంతో పాటు మొత్తం ప్రక్రియను డాక్యుమెంట్ చేయడానికి ఎంతో ఉపయోగకరమని చర్చించారు. ఈ ఫారమ్‌ను ప్రామాణిక రూపంలో రూపొందించి ఇతర ప్రాక్టీషనర్లతో పంచుకోవాలని ప్రతిపాదించారు.

APలు, AVPలు మరియు VPలు, మొదట నుంచే SVP వద్ద నుంచి కార్డ్ రెమెడీలను తీసుకోవాలని ఆలోచించకుండా, 108CC బాక్స్ను సంపూర్ణ విశ్వాసంతో ఉపయోగించాలని గుర్తుచేశారు.

➤ కొత్తగా పొటెన్టైజ్ చేసిన వైబ్రేషన్లు, ఉదాహరణకు ఆవు పేడ లేదా బిట్టర్ లీఫ్ వంటివి, సరైన డాక్యుమెంటేషన్‌తో ప్రయోగాత్మకంగా మాత్రమే ఉపయోగించాలి. పరిశోధనలో నమూనా (Sample) మరియు నియంత్రణ (Control) బృందాలు ఉండాలి; వారి పురోగతిని క్రమం తప్పకుండా నమోదు చేయాలి. ఈ నివేదికలను ఈ ప్రాజెక్టు కోఆర్డినేటర్ అయిన SVP11567కు సమర్పించాలి. హోమియోపతి పరిజ్ఞానం మరియు మంచి అంతర్దృష్టి ఉన్న ఆసక్తిగల ప్రాక్టీషనర్లు పరిశోధన మరియు అభివృద్ధి (R&D) బృందాన్ని సంప్రదించవచ్చు.

➤ మెంటరింగ్ యొక్క ప్రాముఖ్యతను ప్రత్యేకంగా నొక్కి చెప్పారు. కొత్తగా చేరిన AVPలను, VPలు మెంటర్ చేయాలని ప్రోత్సహించారు.

108CC బాక్స్ను క్రమం తప్పకుండా రీఛార్జ్ చేయడం ఎంత ముఖ్యమో మరోసారి వివరించారు. రేడియేషన్ ప్రభావం మరియు కాంబోల నవీకరణల కారణంగా ఇది అవసరమని తెలియజేశారు. సమావేశంలో వేదమంత్రాల జపంతో 108CC బాక్స్ రీఛార్జింగ్ నిర్వహించారు.

➤ ప్రాక్టీషనర్లు ధరించేందుకు కొత్త సాయి వైబ్రియానిక్స్ బ్యాడ్జ్ ను పరిచయం చేశారు.

➤ ప్రాక్టీషనర్లు చేసిన సూచనలలో, ప్రాక్టీషనర్ల వెబ్‌సైట్‌లో స్వచ్ఛంద సేవా కార్యక్రమాల జాబితాను ప్రచురించడం, VP కోసం రిఫ్రెషర్ కోర్సులు నిర్వహించడం, అలాగే ఉపయోగంలో లేని 108CC బాక్స్ను గుర్తించి వాటి వివరాలను నమోదు చేయడం ఉన్నాయి.

సాయంత్రం 5:30 గంటలకు మంగళ హారతితో సమావేశం ముగిసింది. ఈ సమావేశం సమాచారపూర్వకంగా, ఆధ్యాత్మికంగా ఉత్తేజపరిచేదిగా, అలాగే ఎంతో పరస్పర చర్చలకు అవకాశం కల్పించేదిగా నిలిచింది. పాల్గొన్న వారందరూ కృతజ్ఞతాభావంతో, వైబ్రియానిక్స్ సేవను మరింత అంకితభావంతో కొనసాగించాలనే నూతన సంకల్పంతో తిరిగి వెళ్లారు.

 

 

 

_________________________________________________________________________________

2.3 వైబ్రియానిక్స్ దినోత్సవం 2026: ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం మరియు సామరస్యాన్ని విస్తరించడం

2026 జనవరి 26న, తొలి వైబ్రియానిక్స్ దినోత్సవం సందర్భంగా భారతదేశంలోని అనేక రాష్ట్రాలలో వైబ్రియానిక్స్ స్ఫూర్తి వికసించింది. అంకితభావంతో పనిచేస్తున్న ప్రాక్టీషనర్లు క్యాంపులు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఈ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. సమాజ ఆరోగ్య శిబిరాల నుంచి విద్యా కార్యక్రమాల వరకు విస్తరించిన ఈ సేవా కార్యక్రమాలు వందలాది మంది జీవితాలను స్పృశిస్తూ, నిస్వార్థ సేవ అనే వైబ్రియానిక్స్ లక్ష్యాన్ని ప్రతిబింబించాయి.

ఆంధ్రప్రదేశ్

SVIRT పుట్టపర్తి తొలి వైబ్రియానిక్స్ దినోత్సవాన్ని ఒక బాలల గృహాన్ని సందర్శించడం ద్వారా ప్రారంభించింది. అక్కడ 30 మంది ఉత్సాహభరితమైన చిన్నారులకు చైల్డ్ టానిక్స్ పంపిణీ చేసి, వారికి ప్రతి నెలా ఆరోగ్య సహాయాన్ని అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. అనంతరం SVIRT క్లినిక్లో జరిగిన హృదయాన్ని హత్తుకునే పరస్పర సమావేశంలో, ఏడుగురు రోగులు తమ అనుభవాలను పంచుకున్నారు. సోరియాసిస్, రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుండి కోలుకున్న తమ అనుభవాలను వారు ఎంతో హృద్యంగా వివరించారు. ఈ అనుభవాలు విన్న ఒక సందర్శకుడు ప్రేరణ పొంది, వెంటనే AVP కోర్సుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి వ్యవస్థాపకులు మరియు అంతర్జాతీయ ప్రాక్టీషనర్లు కూడా హాజరై కార్యక్రమానికి మరింత విశిష్టతను చేకూర్చారు. మంగళ హారతితో కార్యక్రమం ముగిసి, అనంతరం అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే ఎమర్జెన్సీ రెమెడీ కిట్లు పంపిణీ చేశారు.

SVIRT పుట్టపర్తి:

 

 

 

 

ప్రాక్టీషనర్లు 11634 & 18009 చొరవతో, ట్రస్ట్ అధ్యక్షుల సహకారంతో అనకాపల్లిలోని కుసుమ హరనాథ్ బాబా ఆలయంలో సాయి వైబ్రియానిక్స్ శిబిరాన్ని ప్రారంభించారు. SVIRT కార్యనిర్వాహక సభ్యులు 11567 సాయి వైబ్రియానిక్స్ గురించి పరిచయ ప్రసంగం చేశారు. 32 మంది రోగులకు రెమెడీలు అందించగా, ఇకపై ఈ శిబిరాన్ని ప్రతి నెలా నిర్వహించాలని నిర్ణయించారు. SVIRT గవర్నర్ 02696, ప్రాక్టీషనర్ 18017తో కలిసి అనంతపురంలోని SSS భజన మందిరంలో విస్తృత స్థాయి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి 100 మందికి పైగా రోగులు, వారి కుటుంబ సభ్యులు మరియు భక్తులు హాజరయ్యారు. రోగులు తమ అనుభవాలను పంచుకోగా, ప్రసాదం పంపిణీ చేశారు. సేవాదళ్ సభ్యులు మరియు సమితి పదాధికారులను సన్మానించారు. ప్రాక్టీషనర్ 11587, తిరుమల యాత్ర సందర్భంగా యాత్రికులకు సాయి వైబ్రియానిక్స్ గురించి సంక్షిప్తంగా వివరించి, ఐదుగురు రోగులకు రెమెడీలు అందించారు. అదనంగా, 25 మంది యాత్రికులు IB (ఇమ్యూనిటీ బూస్టర్లు)ను పొందారు. ప్రాక్టీషనర్ 11542, విజయవాడలోని SSS భజన మందిరం, హనుమాన్‌పేటలో సాయి వైబ్రియానిక్స్ ‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి సుమారు 10 మంది పాల్గొన్నారు. ప్రాక్టీషనర్లు 11542 & 11592, విజయవాడలోని KBN కళాశాలలో నిర్వహించిన ఆర్య వైశ్య మ్యారేజ్ బ్యూరో సమావేశం సందర్భంగా ప్రత్యేక సాయి వైబ్రియానిక్స్ శిబిరాన్ని నిర్వహించారు. ఇందులో 19 మంది రోగులకు చికిత్స అందించి, 90 ఇమ్యూనిటీ బూస్టర్లు పంపిణీ చేశారు.

అనకాపల్లి ఫోటోలు:

 

 

 

అనంతపురం ఫోటోలు:

 

 

 

తిరుమల ఫోటోలు:

 

 

 

విజయవాడ ఫోటో:

 

 

 

గుజరాత్ రాష్ట్రంలో అనేక సాయి వైబ్రియానిక్స్ శిబిరాలు నిర్వహించబడ్డాయి. వడోదరలో ప్రాక్టీషనర్లు 11635 & 10547 ఛాణీ జకాత్నాకా సాయి మందిరంలో గంటన్నరపాటు శిబిరం నిర్వహించి, వివిధ ఆరోగ్య సమస్యలకు రెమెడీలు అందించారు. కచ్ లో ప్రాక్టీషనర్ 10832 శివ్ టౌన్షిప్, ముండ్రాలో విజయవంతమైన శిబిరాన్ని నిర్వహించి, జలుబు, దగ్గు, కీళ్ల నొప్పులు, చర్మ అలర్జీలు వంటి సాధారణ వ్యాధులతో బాధపడుతున్న 15 మంది రోగులకు చికిత్స అందించారు.

గుజరాత్ ఫోటోలు:

 

 

 

హర్యానాలో ప్రాక్టీషనర్ 11606 DLF ఫేజ్ IV, గురుగ్రామ్లో శిబిరం నిర్వహించి, దగ్గు, గాయాలు, వివిధ రకాల నొప్పులు, వ్యసనాలు మొదలైన సమస్యలతో ఉన్న 10 మంది రోగులకు చికిత్స అందించారు.

హర్యానా ఫోటోలు:

 

 

 

 

కర్ణాటక: కర్ణాటకలో రాష్ట్రవ్యాప్తంగా వైబ్రియానిక్స్ దినోత్సవాన్ని అంకితభావంతో, నిస్వార్థ సేవా స్పూర్తితో నిర్వహించారు. వివిధ శిబిరాలు, అవగాహన కార్యక్రమాల ద్వారా అనేక మంది రోగులకు సేవలు అందించారు. ప్రాక్టీషనర్లు 10741, 11527 & 10768 బెంగళూరులోని పద్మనాభనగర్ సమితిలో నిర్వహించిన శిబిరంలో 24 మంది రోగులకు చికిత్స అందించి, IB సీసాలను కూడా పంపిణీ చేశారు. ప్రాక్టీషనర్ 11170, లయన్స్ క్లబ్ సభ్యులను కలిసి సాయి వైబ్రియానిక్స్ భావనను పరిచయం చేశారు. అనంతరం సేవాదళ్ సభ్యుల సహకారంతో ఉత్తర బెంగళూరులోని ఒక మురికివాడలో 10 మందికి రెమెడీలు అందించారు. ప్రాక్టీషనర్ 11020 బెల్గావిలోని బెల్గాం పబ్లిక్ స్కూల్, షిండొల్లిలో శిబిరాన్ని నిర్వహించారు. ప్రధానంగా ఉపాధ్యాయులు సహా 25 మంది రోగులు రెమెడీలు తీసుకుని, ఈ వైద్య సేవకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రాక్టీషనర్లు 11619, 11531, 11260 & 1070 బెంగళూరులోని JP నగర్ సాయి గీతాంజలి సమితిలో శిబిరాన్ని నిర్వహించారు. దీనికి 30 మంది భక్తులు హాజరుకాగా, 23 మంది రోగులకు రెమెడీలు అందించారు. సాయి వైబ్రియానిక్స్ ప్రాముఖ్యత, దాని ప్రయోజనాలపై సంక్షిప్త ప్రసంగం నిర్వహించడంతో పాటు, మరింత మంది ప్రాక్టీషనర్లుగా చేరి ఈ సేవా ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రాక్టీషనర్ 11210 తమిళనాడు సరిహద్దుకు సమీపంలోని గిరిజన గ్రామమైన ఉబ్బనూర్లోని 32 మంది గ్రామస్థులకు కీళ్ల నొప్పులు, పురుగుల కాట్లు, అసిడిటీ వంటి సమస్యలకు రెమెడీలు అందించి, ఈ మారుమూల ప్రాంత ప్రజలకు స్వామి వైద్యసేవను అందించారు. ప్రాక్టీషనర్ 12051 బెంగళూరులోని సాయి ప్రశాంతి వృద్ధాశ్రమం, యెలహంకలో అవగాహన శిబిరాన్ని నిర్వహించి, రక్తపోటు, మధుమేహం, మానసిక ఆరోగ్య సమస్యలు వంటి వివిధ వ్యాధులతో బాధపడుతున్న 25 మంది వృద్ధులకు రెమెడీలు అందించారు. అక్కడి నివాసితులు తమకు అందించిన శ్రద్ధ, ప్రేమ, స్వస్తతా సహాయానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రాక్టీషనర్ 11217 కొత్తగా నియమితులైన కర్ణాటక దక్షిణ రాష్ట్ర అధ్యక్షుడికి సాయి వైబ్రియానిక్స్ దినోత్సవ ప్రాముఖ్యతను, నిశ్శబ్దంగా, నిస్వార్థంగా కొనసాగుతున్న స్వస్తతా సేవను వివరించి, రాష్ట్రవ్యాప్తంగా వైబ్రియానిక్స్ సేవను మరింత బలోపేతం చేయడానికి ఆయన సహకారాన్ని కోరారు. దీనికి ఆయన సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం బృందావనంలో కొందరు రోగులకు రెమెడీలు అందిస్తూ, ప్రేమతో, చిత్తశుద్ధితో చేసే ప్రతి చిన్న సేవ కూడా దైవిక కార్యంలో భాగమేనని మరోసారి చాటిచెప్పారు.

కర్ణాటక ఫోటోలు:

 

 

 

 

కేరళ తిరువనంతపురం మరియు పాలక్కాడ్ జిల్లాల్లో నిర్వహించిన శిబిరాల ద్వారా కేరళ రాష్ట్రం విశేషమైన సేవా కార్యక్రమాలకు నాయకత్వం వహించింది. ప్రాక్టీషనర్ 11276 తిరువనంతపురంలో 32 మంది రోగులకు రెమెడీలు అందించి, 30 ఇమ్యూనిటీ బూస్టర్లు పంపిణీ చేశారు. అలాగే 75 మంది వృద్ధులకు, చిన్నారులకు అన్నదానం నిర్వహించి, బృంద సభ్యులతో జరిగిన ఆన్‌లైన్ సమావేశంతో ఆ రోజు కార్యక్రమాలను ముగించారు. పాలక్కాడ్లో ప్రాక్టీషనర్ 11996 సాయంత్రం నిర్వహించిన శిబిరంలో 10 మంది రోగులకు రెమెడీలు అందించి, 20 ఇమ్యూనిటీ బూస్టర్లు పంపిణీ చేశారు. అనంతరం భక్తి భజనలతో కార్యక్రమం ముగిసింది.

కేరళ ఫోటోలు:

 

 

 

 

మహారాష్ట్ర: ప్రాక్టీషనర్ 10213 భండారా జిల్లాలోని తుమ్సర్లో సమితి భజన అనంతరం సుమారు 40 మంది భక్తులకు సాయి వైబ్రియానిక్స్‌పై అవగాహన ప్రసంగం చేశారు. ప్రాక్టీషనర్ 10818 చంద్రపూర్ జిల్లాలోని వరోరాలో సమితి భజన అనంతరం సుమారు 20 మంది భక్తులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రీజినల్ కోఆర్డినేటర్ 10332, గడ్చిరోలీ నుండి వైబ్రియానిక్స్ దినోత్సవ కార్యక్రమాలను సమన్వయం చేశారు. ప్రాక్టీషనర్లతో అనుసంధానం, ఆన్‌లైన్ సమావేశం నిర్వహించడం, డా. అగర్వాల్ గారి సందేశాన్ని పంచుకోవడం, సాయి సత్సంగ్ హాల్లో అవగాహన ప్రసంగం చేయడం, అలాగే 12 మంది రోగులకు రెమెడీలు అందించిన శిబిరాన్ని నిర్వహించడం వంటి కార్యక్రమాలను చేపట్టారు. ప్రాక్టీషనర్ 11278 నాగ్పూర్‌లోని షహీద్ మతిదాస్ గురుద్వారాలో వైద్య శిబిరాన్ని నిర్వహించి, 26 మంది రోగులకు రెమెడీలు అందించారు. ప్రాక్టీషనర్ 10001 ఆనందన్ కిచెన్ సెంటర్లో సుమారు 30 మంది భక్తులకు సాయి వైబ్రియానిక్స్‌పై అవగాహన ప్రసంగం చేశారు. ప్రాక్టీషనర్లు 10363 & 10399 పూణెలోని వానవాడి ఝులేలాల్ మందిరంలో శిబిరాన్ని నిర్వహించి, 65 మంది రోగులకు చికిత్స అందించారు. ఇకపై ఈ శిబిరాలను ప్రతి పదిహేను రోజులకు ఒకసారి నిర్వహించాలని నిర్ణయించారు. ప్రాక్టీషనర్ 10067 యవత్‌మాల్‌లోని SSS ప్రార్థనా మందిరంలో 50 మందికి పైగా భక్తులకు అవగాహన ప్రసంగం చేశారు. మార్థడ్ గ్రామంలో నిర్వహించిన శిబిరం ద్వారా 32 మంది రోగులు ప్రయోజనం పొందారు. ముంబైకి చెందిన ప్రాక్టీషనర్ 02817 అమెరికా పర్యటన సందర్భంగా శాన్ ఫ్రాన్సిస్కోలో సాయి వైబ్రియానిక్స్‌పై అవగాహన ప్రసంగం చేసి, అనంతరం ఏడుగురు రోగులకు రెమెడీలు అందించారు.

 

మహారాష్ట్ర ఫోటోలు :

 

 

 

 

తెలంగాణ: హైదరాబాద్కు చెందిన ప్రాక్టీషనర్ 11656 బాలవికాస్ విద్యార్థుల తల్లిదండ్రుల కోసం ఆన్‌లైన్‌లో సాయి వైబ్రియానిక్స్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి సుమారు 20 మంది పాల్గొన్నారు. ప్రాక్టీషనర్ 11627 ఒక సేవాదళ్ సభ్యుని సహకారంతో మహబూబ్‌నగర్ జిల్లాలోని వింజమూరు గ్రామంలో రోజంతా వైబ్రియానిక్స్ శిబిరాన్ని నిర్వహించారు. ఇందులో 158 మంది రోగులకు రెమెడీలు అందించారు. ప్రాక్టీషనర్ 11563 సికింద్రాబాద్‌లోని సైనిక్పురిలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించి, కరపత్రాల పంపిణీ మరియు సంక్షిప్త ప్రసంగం ద్వారా సుమారు 40 మందికి సాయి వైబ్రియానిక్స్‌ను పరిచయం చేశారు.

తెలంగాణ ఫోటోలు:

 

 

 

ఉత్తరాఖండ్ ప్రాక్టీషనర్ 11117 దేశభక్తిని ఆరోగ్య అవగాహనతో సమన్వయం చేస్తూ, డెహ్రాడూన్‌లోని ఒక జూనియర్ హైస్కూల్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం వైబ్రియానిక్స్ శిబిరాన్ని నిర్వహించి, 14 మంది విద్యార్థులకు రెమెడీలు అందించడంతో పాటు ఆరోగ్యంపై అవగాహన కల్పించి, ప్రేరణాత్మక కథలను పంచుకున్నారు.

ఉత్తరాఖండ్ ఫోటోలు:

 

 

 

 

ఉత్తరప్రదేశ్ SVIRT కోశాధికారి 11964 మరియు ప్రాక్టీషనర్ 11679 ఆధ్వర్యంలో మీరట్ జిల్లాలోని భరోటా గ్రామంలో సమగ్ర సాయి వైబ్రియానిక్స్ శిబిరం నిర్వహించబడింది. ప్రార్థనలు మరియు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో ప్రారంభమైన ఈ శిబిరంలో, నలుగురు సేవాదళ్ సభ్యుల సహకారంతో 75 మంది రోగులకు ఉచితంగా రెమెడీలు అందించారు. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి, చికిత్సను క్రమం తప్పకుండా కొనసాగించడం వంటి అంశాలపై విలువైన ఆరోగ్య సలహాలు ఇచ్చారు. ఈ శిబిరం ముఖ్యంగా నిరుపేదల్లో అవగాహన, ఆశాభావాన్ని పెంపొందిస్తూ ప్రేమ, కరుణతో తన లక్ష్యాన్ని విజయవంతంగా నెరవేర్చింది.

ఉత్తరప్రదేశ్ ఫోటోలు:

 

 

 

పశ్చిమ బెంగాల్ ప్రాక్టీషనర్లు 18000 & 11540 కోల్‌కతాలోని మద్రాల్ హనుమాన్ మందిరంలో నిర్వహించిన వైద్య శిబిరంలో సంయుక్తంగా తొమ్మిది మంది రోగులకు చికిత్స అందించారు.

పశ్చిమ బెంగాల్ ఫోటోలు:

 

 

 

ఈ నివేదికలు, వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్లు తమ తమ సమాజాల్లో విభిన్న మార్గాల ద్వారా ప్రజల జీవితాల్లో స్పష్టమైన సానుకూల మార్పును తీసుకువస్తూ, ఆరోగ్యం, స్వస్థత మరియు ఈ స్వస్తతా విధానంపై విశ్వాసాన్ని విస్తరించేందుకు చేస్తున్న విశేష కృషిని ప్రతిబింబిస్తున్నాయి.

ఆన్‌లైన్ సమావేశం:

పవిత్రమైన మొదటి వైబ్రియానిక్స్ దినోత్సవం 20:30 ISTకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైబ్రియానిక్స్ కుటుంబ సభ్యుల ఆన్‌లైన్ సమావేశంతో ముగిసింది. ఈ సమావేశాన్ని చాలా తక్కువ సమయంలో ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశం వెలుపల ఉన్న అనేక మంది ప్రాక్టీషనర్లకు, భిన్నమైన కాలమాన మండలాల (Time Zones) కారణంగా అసౌకర్యమైన సమయంలో జరిగినప్పటికీ, 273 మంది ప్రాక్టీషనర్లు ఎంతో ఉత్సాహంతో, ఐక్యతా భావంతో పాల్గొనడం హృదయానికి హత్తుకునే విషయంగా నిలిచింది. కార్యక్రమం ప్రారంభంలో, మూడు రోజుల క్రితం 92 సంవత్సరాల వయస్సులో స్వామిలో ఐక్యమైన, ముప్పై సంవత్సరాలకు పైగా మనకు అత్యంత ఆప్తులుగా, గౌరవనీయులుగా ఉన్న పరిశోధనా విభాగాధిపతి ప్యాట్ హంట్ గారి పవిత్ర స్మృతికి శ్రద్ధాంజలి ఘటిస్తూ, ఒక నిమిషం మౌనం పాటించారు.

జనవరి 26ను వైబ్రియానిక్స్ దినోత్సవంగా ఎంపిక చేసిన ప్రాముఖ్యతను వివరించిన అనంతరం, డా. అగర్వాల్, 2023 మార్చిలో స్థాపించబడిన సాయి వైబ్రియానిక్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (SVIRT) గురించి వివరించారు. వైబ్రియానిక్స్ సేవా కార్యక్రమాన్ని బలోపేతం చేయడం, సరైన దిశలో నడిపించడం అనే లక్ష్యంతో ఈ సంస్థను స్థాపించినట్లు తెలిపారు. పుట్టపర్తిలోని తన కార్యాలయం ద్వారా SVIRT శిక్షణా శిబిరాలు, ప్రాక్టీషనర్ల సమావేశాలు, వైద్య క్లినిక్‌లను నిర్వహించడంతో పాటు, రెమెడీలు మరియు అవసరమైన పరికరాల సరఫరాను పర్యవేక్షిస్తోంది. SRHVP యంత్రాలు మరియు 108CC బాక్స్లు ఇప్పుడు అధికారికంగా SVIRT ఆధ్వర్యంలోకి తీసుకురాబడి, ప్రతి దానికి ప్రత్యేక సీరియల్ నంబర్ కేటాయించబడింది. దీని ద్వారా సేవలో క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన నిర్వహణ, అలాగే సేవ పవిత్రత పట్ల గౌరవం మరింత బలపడుతున్నాయి. వైబ్రియానిక్స్ సేవ పరిధిని, నాణ్యతను మరింత అభివృద్ధి చేసే మార్గదర్శక కేంద్రంగా SVIRT పనిచేస్తోంది.

డా. అగర్వాల్, సాయి వైబ్రియానిక్స్‌కు శ్రీ సత్య సాయి సేవా సంస్థ (భారతదేశం) మరియు శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ నుండి పూర్తి మద్దతు కొనసాగుతున్నదని ప్రాక్టీషనర్లకు భరోసా ఇచ్చారు. ప్రశాంతి నిలయంలోని మహిళా మరియు పురుష సేవాదళ్ భవనాలలో, అలాగే బెంగళూరులోని స్వామి ఆసుపత్రిలో ఉన్న వెల్నెస్ సెంటర్లో వైబ్రియానిక్స్ క్లినిక్‌లు క్రమం తప్పకుండా నిర్వహించబడుతున్నాయని తెలిపారు. అలాగే, వైబ్రియానిక్స్‌లో ఉపయోగించేది కేవలం స్వస్థత ప్రకంపనలతో సంస్కరించిన చక్కెర మాత్రలు మాత్రమేనని, వాటిలో ఎటువంటి రసాయనాలు లేవని ప్రయోగశాల పరీక్షలు నిర్ధారించాయని ఆయన పునరుద్ఘాటించారు. ఈ రెమెడీలు పూర్తిగా సురక్షితమైనవి; ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. అంతేకాకుండా, శరీరంపై రసాయనాల ప్రభావాన్ని తగ్గించడంలో కూడా ఇవి సహాయపడగలవని తెలిపారు. రోగులు తమ సాధారణ వైద్య చికిత్సను కొనసాగిస్తూనే, వారి శారీరక, మానసిక, భావోద్వేగ బాధలను తగ్గించాలనే ఏకైక సేవాభావంతో ఈ రెమెడీలను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నామని వివరించారు.

స్వస్తతా సేవ ఫలితాలను మరింత మెరుగుపరచడంలో జ్ఞానం ఎంత ముఖ్యమో వివరిస్తూ, డా. అగర్వాల్ శతజయంతి సమర్పణలో భాగంగా సిద్ధం చేసిన మూడు గ్రంథాలను ప్రస్తావించారు—100 Extraordinary Experiences of Practitioners, 100 Case Histories, మరియు 100 Clinics and Camps. ఈ మూడు పుస్తకాలూ ప్రాక్టీషనర్ల నిజ జీవిత అనుభవాల ఆధారంగా రూపొందించబడ్డాయి. మొదటి గ్రంథానికి శ్రీ ఆర్. జె. రత్నాకర్, శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, ముందుమాట రాయగా, రెండవ గ్రంథానికి శ్రీ నిమిష్ పాండ్యా, శ్రీ సత్య సాయి సేవా సంస్థ (భారతదేశం) అఖిల భారత అధ్యక్షులు ముందుమాట రాశారు. ఈ పుస్తకాలకు నిరంతరం పెరుగుతున్న ఆదరణ, వాటి ఆచరణాత్మక విలువను స్పష్టంగా తెలియజేస్తోందని ఆయన అన్నారు. ప్రస్తుతం 87 సంచికకు చేరుకున్న ద్వైమాసిక వార్తాలేఖ ద్వారా ఉపయోగకరమైన కేసు అధ్యయనాలు, మార్గదర్శక సూచనలు నిరంతరం అందుతున్నాయని పేర్కొంటూ, ప్రతి ప్రాక్టీషనర్ తమ నిరంతర అధ్యయనంలో భాగంగా దానిని క్రమం తప్పకుండా చదవాలని ప్రోత్సహించారు.

భవిష్యత్తు ప్రణాళికలను వివరిస్తూ, వార్తాలేఖను డిజిటల్ రూపంలో మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, దానిని ప్రాంతీయ భాషల్లోకి అనువదించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, మరాఠీ భాషల్లో ప్రావీణ్యం ఉన్న స్వచ్ఛంద సేవకులు ఈ కార్యక్రమానికి సహకరించాలని ఆయన ఆహ్వానించారు. దీని ద్వారా విలువైన జ్ఞానం మరింత మంది ప్రాక్టీషనర్లకు చేరుతుందని చెప్పారు. మారుమూల గ్రామాలకు వైబ్రియానిక్స్ సేవలను విస్తరించేందుకు, గ్రామ నాయకులకు ప్రాథమిక శిక్షణతో పాటు 18CC రెమెడీ కిట్లు అందించే ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. దీనివల్ల గ్రామీణ స్థాయిలోనే ప్రజలు ఆరోగ్య సేవలను పొందగలరని, సమాజాలు స్వయం సమృద్ధి దిశగా ముందుకు సాగగలవని తెలిపారు. అదే సమయంలో, పుట్టపర్తిలో ప్రాక్టీషనర్ల సక్రియ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం కూడా ఎంతో ముఖ్యమని చెప్పారు. ఎందుకంటే, ఈ ఆధ్యాత్మిక కేంద్రంలో అవగాహన కార్యక్రమాలు మరియు సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగడం వైబ్రియానిక్స్ అభివృద్ధికి అవసరమని వివరించారు.

ప్రపంచవ్యాప్తంగా వైబ్రియానిక్స్ సేవలు నిరంతరం విస్తరిస్తున్నాయని, ప్రతి నెలా వేలాది మంది రోగులకు చికిత్స అందుతున్నదని ఆయన తెలిపారు. రోగులు మరియు ప్రాక్టీషనర్ల మధ్య పరస్పర సమావేశాలు చికిత్సా ఫలితాలను మెరుగుపరచడంలో, పరస్పర విశ్వాసాన్ని పెంపొందించడంలో, కొత్త ప్రాక్టీషనర్లకు ప్రేరణ కలిగించడంలో ఎంతో ఉపయోగకరంగా మారుతున్నాయని చెప్పారు. అలాగే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైబ్రియానిక్స్ కుటుంబ సభ్యులను మరింత ఏకతాటిపైకి తీసుకువచ్చి ఉత్సాహపరిచే లక్ష్యంతో 2027 జనవరిలో ఒక అంతర్జాతీయ మహాసభను నిర్వహించే ప్రణాళికలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

అన్నిటికంటే ముఖ్యంగా, SVIRT ప్రతి ప్రాక్టీషనర్కు చెందిన సంస్థ అని డా. అగర్వాల్ హృదయపూర్వకంగా పేర్కొన్నారు. భవిష్యత్తు వైద్య విధానంగా స్వామి దర్శించిన సాయి వైబ్రియానిక్స్‌ను ముందుకు తీసుకెళ్లడంలో ప్రతి ప్రాక్టీషనర్ కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన ఉద్బోధించారు. ఈ ప్రసంగం అనంతరం ప్రశ్నోత్తర కార్యక్రమం నిర్వహించబడింది. ప్రాక్టీషనర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూనే, వార్తాలేఖలోని Answer Corner విభాగాన్ని మరియు Vibrionics Guideను ప్రతి ప్రాక్టీషనర్ శ్రద్ధగా చదవాలని డా. అగర్వాల్ సూచించారు. ఎందుకంటే, వారిలో చాలామందికి కలిగే అనేక సందేహాలకు వాటిలోనే సమాధానాలు లభిస్తాయని ఆయన వివరించారు.

సాయంత్రం కార్యక్రమం విద్యా విభాగాధిపతి 10375 ప్రసంగ సారాంశాన్ని వినిపించడంతో పాటు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిసింది.

ఆన్లైన్ సమావేశం ఫోటోలు:

        

  

 

 

 

 

 

 

 

 

                   

_________________________________________________________________________________

2.4 ప్రాక్టీషనర్ల సమావేశం, బెంగళూరు, కర్ణాటక, 10 జనవరి 2026

కర్ణాటక రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన 37 మంది ప్రాక్టీషనర్లు బెంగళూరులోని జె.పి. నగర్ సాయి గీతాంజలి సమితి లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. కార్యక్రమం శ్రీ గణేశునికి ప్రార్థనతో, అనంతరం సాయి గాయత్రీ పారాయణంతో ప్రారంభమైంది. తరువాత కోఆర్డినేటర్ 12051, వైబ్రియానిక్స్ ద్వారా సేవ చేసే ఈ పవిత్ర అవకాశాన్ని ప్రసాదించిన స్వామికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అందరికీ హృదయపూర్వక స్వాగతం పలికారు.

ఆ తరువాత వ్యవస్థాపకులు డా. మరియు శ్రీమతి అగర్వాల్ గారితో స్నేహపూర్వక వర్చువల్ సమావేశం జరిగింది. ప్రాక్టీషనర్ల ఉత్సాహాన్ని చూసి వారు ఎంతో ఆనందించి, హృదయపూర్వకంగా ప్రోత్సహించారు. క్రమం తప్పకుండా ఉన్నత ప్రమాణాలతో కూడిన కేసు నివేదికలను పంపుతున్నందుకు వారిని అభినందించారు. మరింత మంది పాల్గొనగలిగేలా ఈ సమావేశాన్ని ఏకకాలంలో కన్నడ భాషలోకి అనువదించారు.

వారి ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

➤ వైబ్రియానిక్స్, నిస్వార్థ సేవ ద్వారా శరీరం మరియు మనస్సుకు సమగ్ర స్వస్థతను అందిస్తుంది.

➤ ప్రాక్టీషనర్లు ఎల్లప్పుడూ వినయంతో ఉండాలి. నిజమైన వైద్యుడు స్వామియే అని గుర్తుంచుకోవాలి.

➤ తీవ్రమైన లేదా స్పష్టంగా నిర్ధారించలేని కేసుల్లో, వైద్య నిపుణుల వద్దకు రోగులను పంపించడానికి సంకోచించకూడదు. ఎందుకంటే వైబ్రియానిక్స్ ఇతర వైద్య విధానాలకు పరస్పర సహాయకంగా పనిచేస్తుంది.

➤ క్లిష్టమైన కేసులు అధ్యయనం, పరస్పర సంప్రదింపులు, ప్రార్థన, అలాగే కేసు నివేదికలను పంచుకోవడం ద్వారా నేర్చుకునే అవకాశాలను కల్పిస్తాయి.

➤ స్థానికంగా రోగులతో సమావేశాలు నిర్వహించడం ద్వారా పరస్పర విశ్వాసం పెరుగుతుంది. అలాగే వారు కూడా ప్రాక్టీషనర్లుగా చేరేందుకు ప్రేరణ పొందుతారు.

అనంతరం నిర్వహించిన ప్రశ్నోత్తర కార్యక్రమంలో ఈ క్రింది ముఖ్యాంశాలు వెలువడ్డాయి:

➤ అత్యంత సన్నిహిత కుటుంబ సభ్యులకు చికిత్స చేయాల్సిన సందర్భాల్లో, భావోద్వేగ ప్రభావం లేకుండా ఉండేందుకు మరొక ప్రాక్టీషనర్ ద్వారా చికిత్స చేయించడం కొన్నిసార్లు ఉత్తమం.

➤ నీటిలో కలిపి తీసుకునే రెమెడీలు సాధారణంగా మరింత ప్రభావవంతంగా ఉంటాయి. అయితే రోగి సౌకర్యాన్ని బట్టి పిల్ల్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు.

➤ తాజా పరిశోధనల ప్రకారం, వైబ్రియానిక్స్‌ను ఏ ఇతర వైద్య చికిత్సతోనైనా కలిపి తీసుకోవచ్చు. ఇప్పటికే కొనసాగుతున్న చికిత్సను ఆపాల్సిన అవసరం లేదు. అయితే రెండు చికిత్సల మధ్య కనీసం 20 నిమిషాల విరామం ఉండాలి.

➤ ప్రాక్టీషనర్లు వార్తాలేఖలోని సమాధానాల విభాగాన్ని క్రమం తప్పకుండా చదవడం ఎంతో అవసరం. ఎందుకంటే అందులో తాజా సమాచారం, మార్గదర్శక సూచనలు అందుబాటులో ఉంటాయి.

సమావేశం అత్యంత ఉత్సాహభరితమైన రీఛార్జింగ్ సెషన్తో ముగిసింది. అనంతరం, స్వామి దివ్య మిషన్‌లో తాము యోగ్యమైన సాధనాలుగా సేవ చేయడానికి నిరంతరం మార్గనిర్దేశం చేయాలని భగవాన్ బాబాను సామూహిక ప్రార్థనతో వేడుకున్నారు.

 

 

_________________________________________________________________________________

3. శిబిరాలు మరియు క్లినిక్‌లు

గత సంవత్సరంలో సాధించిన పురోగతిని కొనసాగిస్తూ, 2026 జనవరి/ఫిబ్రవరి నెలల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో మూడు కొత్త శిబిరాలు/క్లినిక్‌లు ప్రారంభించబడ్డాయి.

1. నక్కవానిపాలెం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ 24 జనవరి 2026: ప్రాక్టీషనర్లు 11650 & 11666 శ్రీ సత్య సాయి భజన మండలిలో సాయి వైబ్రియానిక్స్ క్లినిక్‌ను ప్రారంభించారు. ఈ క్లినిక్ సమితి కన్వీనర్ అభ్యర్థన మేరకు ప్రారంభించబడింది. కన్వీనర్ మరియు ఆయన సతీమణి రోగులకు సహాయం చేయడంతో పాటు, సాయి వైబ్రియానిక్స్ రెమెడీలకు సంబంధించిన చేయవలసినవి, చేయకూడనివి గురించి వారికి మార్గనిర్దేశం చేస్తూ హృదయపూర్వక సహకారం అందించారు. వివిధ వ్యాధులతో బాధపడుతున్న 15 మంది రోగులకు రెమెడీలు అందించగా, వారిలో చాలామంది కండరాలు-ఎముకలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. ఇకపై ఈ క్లినిక్ ప్రతి నెలా నిర్వహించబడుతుంది.

2. SSS సేవా సమితి, గచ్చిబౌలి, హైదరాబాద్, తెలంగాణ 29 జనవరి 2026: ప్రాక్టీషనర్ 11632 ఈ సమితిలో సీనియర్ టీచర్ 10375 ద్వారా సాయి వైబ్రియానిక్స్‌పై అవగాహన ప్రసంగాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 50 మంది భక్తులకు సాయి వైబ్రియానిక్స్ కరపత్రాలు పంపిణీ చేయడంతో పాటు, IB సీసాలు కూడా అందజేశారు. ఈ కార్యక్రమం సమితి కన్వీనర్ మరియు భక్తులకు ఎంతో ప్రేరణనిచ్చింది. దీంతో 2026 మార్చి నుండి ప్రతి నెల రెండవ ఆదివారం ఈ క్లినిక్‌ను క్రమం తప్పకుండా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్లినిక్‌కు ప్రాక్టీషనర్ 11632 నాయకత్వంలో, ప్రాక్టీషనర్లు 11587 & 11568 సహకరిస్తారు.

3. గంగలకుర్రు అగ్రహారం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్ – 3 ఫిబ్రవరి 2026: హైదరాబాద్‌కు చెందిన ప్రాక్టీషనర్ 11632, తన స్వస్థలమైన అమలాపురం ప్రాంతంలో మొదటిసారిగా క్రమం తప్పకుండా నిర్వహించే ద్వైమాసిక శిబిరాన్ని ప్రారంభించారు. ఇంతవరకు ఆమె ఈ ప్రాంత ప్రజలకు దూరం నుంచే సేవలు అందించేవారు. ఈ శిబిరంలో 25 మంది రోగులకు చికిత్స అందించారు. అలాగే రోగులతో నిరంతర సంబంధాన్ని కొనసాగించేందుకు ప్రత్యేకంగా ఒక వాట్సాప్ గ్రూప్ను కూడా ఏర్పాటు చేశారు.

పై క్రమబద్ధమైన క్లినిక్‌లతో పాటు, మూడు ఒకరోజు ప్రత్యేక శిబిరాలు కూడా నిర్వహించబడ్డాయి.

ధర్మన్న గూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ – 10 జనవరి 2026: ప్రాక్టీషనర్ 11585, ఈ గిరిజన గ్రామంలో 22 మంది రోగులకు సేవలందించారు. అదే రోజు సమీపంలోని కొర్రాజుల గుట్ట గిరిజన గ్రామంలో మరో 8 మంది రోగులకు కూడా చికిత్స అందించారు.

పూడిమడక, అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్ – 1 ఫిబ్రవరి 2026: మాఘ పౌర్ణమి సందర్భంగా సముద్రతీరంలో జరిగిన పవిత్ర ఉత్సవంలో ఏర్పాటు చేసిన సాంప్రదాయ మజ్జిగ పంపిణీ కేంద్రం వద్ద, స్థానిక భజన మండలి సహకారంతో ప్రాక్టీషనర్లు 11634 & 11648 ప్రత్యేక సాయి వైబ్రియానిక్స్ శిబిరాన్ని నిర్వహించారు. ఇందులో కీళ్ల నొప్పులు, తలనొప్పి, అధిక రక్తపోటు, మధుమేహం వంటి వివిధ సమస్యలతో బాధపడుతున్న 222 మంది రోగులకు రెమెడీలు అందించారు. తీవ్రమైన తలనొప్పి నుండి పూర్తిగా ఉపశమనం పొందిన ఒక రోగి, స్థానిక సర్పంచ్తో కలిసి వైబ్రియానిక్స్ గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తితో వైబ్రియానిక్స్ బృందాన్ని సంప్రదించారు.

                                

 

 

    

_________________________________________________________________________________

    4. అనుభవాలు

డా. జిత్ కె. అగర్వాల్ డైరీ నుండి – 20 సప్లిమెంట్లు

1998లో, 48 సంవత్సరాల వయస్సు గల ఒక అమెరికన్ పెద్దమనిషి దర్శన్ పిల్ల్స్ కోసం ఆశ్రమంలో నన్ను కలిశారు. ఎక్కువసేపు కింద కాలు మడిచి కూర్చోవడం వల్ల కలిగే అసౌకర్యాన్ని అవి తగ్గిస్తాయని ఆయన విన్నారు. కొద్ది రోజుల్లోనే ఆయనకు గణనీయమైన ఉపశమనం కలిగింది. ఎంతో కృతజ్ఞతతో ఆయన మిగిలిపోయిన మాత్రలను తిరిగి ఇవ్వడానికి వచ్చారు. మామూలు సంభాషణలో భాగంగా ఆయన ఆరోగ్యం గురించి అడిగాను. చిరునవ్వుతో, తన ఆరోగ్యం ఎంతో బాగుందని, తనకు ఎలాంటి సమస్యలూ లేవని చెప్పారు. తరువాత తన రహస్యాన్ని వెల్లడిస్తూ, ప్రతిరోజూ నేను అత్యుత్తమ నాణ్యత కలిగిన ఇరవై రకాల సప్లిమెంట్లు తీసుకుంటాను. వాటికి నెలకు దాదాపు 200 డాలర్లు ఖర్చవుతుంది. అయితే నేను ఖర్చును భరించగలను. అందువల్ల ఎప్పుడూ ఉత్సాహంగా, సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటాను అన్నారు.

అంతటి సంఖ్యలో సప్లిమెంట్ సీసాలను గందరగోళం లేకుండా ఎలా నిర్వహిస్తారని నేను ఆసక్తిగా అడిగాను. ఎంతో గర్వంగా, ఒక వడ్రంగితో ప్రత్యేకంగా ఇరవై అరలతో కూడిన చెక్క పెట్టె తయారు చేయించుకున్నానని చెప్పారు. సప్లిమెంట్లు కొనుగోలు చేసిన తర్వాత, ప్రతి సీసాలోని మాత్రలను ఆయా అరల్లో పోస్తానని వివరించారు. ప్రతి ఉదయం అల్పాహారం సమయంలో ప్రతి అర నుండి ఒక్కో మాత్ర తీసుకొని అన్నింటినీ ఒకేసారి మింగేస్తానని చెప్పారు.

దానికి ప్రత్యామ్నాయంగా ఒక సూచన చేశాను. ఆయన ప్రతి సప్లిమెంట్‌లో కొద్దిగా నమూనా ఇస్తే, వాటితో వైబ్రియానిక్స్ రెమెడీ మాత్రలను తయారు చేసి ఇవ్వగలనని చెప్పాను. మొదట ఆయన కొంత సంకోచించినప్పటికీ, చివరకు అంగీకరించారు. మరుసటి రోజు ఆయన తీసుకొచ్చిన అన్ని మాత్రలు, క్యాప్సూల్స్‌ను పొటెన్టైజ్ చేసి, TDS మోతాదులో తీసుకోవడానికి ఒకే సీసాలో వైబ్రియానిక్స్ రెమెడీ మాత్రలను అందించాను. వారం రోజుల తరువాత ఆయన మళ్లీ ఎంతో ఉత్సాహంగా వచ్చారు. తన జీవితంలో ఇంత ఉల్లాసంగా, ఇంత శక్తివంతంగా ఎప్పుడూ అనిపించలేదని చెప్పారు. ఇకపై సప్లిమెంట్లపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గిస్తూ, వైబ్రియానిక్స్‌ను కొనసాగించాలని తన కోరికను వ్యక్తం చేశారు. ఆయన స్వదేశానికి తిరిగి వెళ్లే ముందు, భవిష్యత్తులో అనుసరించాల్సిన చికిత్సా ప్రణాళికను ఇద్దరం కలిసి రూపొందించుకున్నాము.

_________________________________________________________________________________

5. స్మరణాంజలి

సాయి వైబ్రియానిక్స్ వ్యవస్థాపక స్తంభాలలో ఒకరైన, సాయికి నిశ్శబ్దంగా, వినయపూర్వకంగా సేవ చేసిన మా ప్రియమైన ప్యాట్రిషియా హంట్ 00002…UK, 92 సంవత్సరాల వయస్సులో 2026 జనవరి 23, పవిత్రమైన వసంత పంచమి రోజున తన భౌతిక జీవనయాత్రను ముగించి స్వామిలో ఐక్యమయ్యారు. ఆమెకు ఎంతో ప్రేమతో అంకితభావంతో ఉన్న ఇద్దరు పిల్లలు, ఐదుగురు మనుమలు/మనుమరాళ్లు ఉన్నారు. పరిశోధనా బృందానికి నాయకత్వం వహించడం, సాయి వైబ్రియానిక్స్ అభివృద్ధికి ఆమె అందించిన అపార సేవ, అచంచలమైన సేవాస్ఫూర్తి—ఇవన్నీ లెక్కలేనన్ని జీవితాలపై చెరగని ముద్ర వేశాయి. స్వామి దివ్య పరమాత్మలో ఆమెకు శాశ్వత శాంతి చేకూరాలని మనమందరం ప్రార్థిస్తున్నాము.