అదనంగా
Vol 12 సంచిక 1
January / February 2021
1. ఆరోగ్య చిట్కాలు
మీ వంట నూనెలను జాగ్రత్తగా ఎంపిక చేసుకొని వాడండి
“ఆధునిక మానవుడు జీవితంలోని ప్రతీ అంశములోనూ మితము అనే సూత్రాన్ని పాటించక పోవడం ద్వారా తన ఆరోగ్యానికి,సంక్షేమానికి హాని కలిగించు కుంటున్నాడు. తినే ఆహారంలో ఎక్కువ కొవ్వు పదార్ధం లేకుండా జాగ్రత్త వహించాలి ఎందుకంటే ఎక్కువ మొత్తంలో తీసుకునే కొవ్వులు శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి ముప్పు కలుగజేస్తాయి. పెద్ద మొత్తంలో కొవ్వు పదార్థాలు తీసుకోవడం హృదయ సంబంధ వ్యాధులకు కారణమవుతుంది.”…శ్రీ సత్యసాయిబాబా1
1. వంట నూనెల స్వభావము:
వంట నూనెలు అనేవి మొక్కలనుండి (గింజలు, విత్తనాలు, పండ్లు,అలివ్లు, ధాన్యాలు లేదా చిక్కుళ్ళు)యాంత్రిక లేదా రసాయన ప్రక్రియ ద్వారా సేకరించిన కొవ్వు వంటి పదార్ధము. వీటిరుచి, ఆకృతి, మరియు నిలువ ఉండే సామర్ధ్యము మెరుగు పరచడానికి ఇది వడకట్టబడడము,శుద్ధి చేయబడడము, లేదా రసాయనికంగా మార్చబడడము చేయబడతాయి. కొవ్వులు అనేవి సంతృప్త కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్ అంటే హైడ్రోజనేటెడ్అనగాడాల్డా వంటి క్రొవ్వులు,మోనో లేదా పాలీఅసంతృప్త కొవ్వులను కలిగి మొత్తంగా ఇవి కొవ్వు ఆమ్లాలు అని పిలవబడతాయి. సంతృప్త మరియు ట్రాన్స్ ఫ్యాట్స్ క్రొవ్వులు సాధారణంగా కరోనరీ హార్ట్ డిసీజ్ ప్రమాదంతో సంబంధం కలిగి ఉంటాయి.ఒమేగా-3 అనేది గుండె, మెదడు, మరియు కళ్ళకుఅలాగే ఒమేగా-6 అనేవి శక్తికి ఉపయోగపడే అతి ముఖ్యమైనపాలీఅసంతృప్త కొవ్వు ఆమ్లాలను మన శరీరం ఉత్పత్తి చేయలేదు. ఒమేగా-9 అనేది ఒక ఆరోగ్యకరమైన సంతృప్త కొవ్వు, ఇది శరీరం ద్వారా ఉత్పత్తి అవుతుంది.2-9
1.1 కొవ్వు ఆమ్లాలు అవసరం: కొవ్వు ఆమ్లాలు అనేవి శరీరానికి అవసరమైన A, D, E, మరియు Kవిటమిన్లను గ్రహించడానికి,రోగనిరోధక శక్తి పెంచడానికి, ముఖ్యమైన హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి, కణాల పెరుగుదలకు, అవయవాలను రక్షించడానికి, కళ్ళు చర్మం మరియు జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి,శక్తివంతంగా ఉంచడానికి, శరీరాన్ని తగినంత వెచ్చదనంతో ఉంచడానికి ఉపయోగపడతాయి. మన ఇళ్ళలోతీసుకొనేసలాడ్ లలో ఒక చెంచా (లేదా 2 గరిష్టంగా) నూనె చేర్చితే వాటిని మరింత పోషకమైన దిగా చేస్తుంది.ఎక్కువ భాగం వంటనూనెలు గుండెకు మేలు కలిగించే శోద నిరోధక పాలీలేదామోనో అసంతృప్త కొవ్వులను ఎక్కువ శాతం కలిగి, అసంతృప్త కొవ్వులు తక్కువగా కలిగి ఉంటాయి. మన రోజువారీ ఆహారంలోఒమేగా 6 మరియు ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు1:1 నుండి 4:1 (ఇకనుండి దీనిని నిష్పత్తిఅనిపిలుద్దాం) గా తీసుకోవడం చాలా ముఖ్యం. ఒమేగా 6 అనేది మనం ఉపయోగించే అనేక వంటనూనెలలో పుష్కలంగా ఉంటుంది కానీ ఒమేగా-3 యొక్క మూలాలు చాలా పరిమితం.ఒమేగా 6 యొక్క అధిక వినియోగం ఒమేగా 3 ను గ్రహింపును7 నిరోధిస్తుంది కనుక B6 & B7 వంటి ప్రధాన పోషకాలను మరియు మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలను మన ఆహారంలో చేర్చడం అవసరం. కనుక కొవ్వులను మన ఆరోగ్యకరమైన ఆహారంలో ఒక భాగంగానే చూడాలి తప్ప వాటిని ప్రత్యేకమైనవి భావిస్తూ పక్కన పెట్టకూడదు.2-9
1.2 నూనెల స్మోక్ పాయింట్: స్మోక్ పాయింట్ అంటేఏదైనా నూనె మరుగుదల లేదా పొగలు గ్రక్కే ఉష్ణోగ్రత యొక్క స్థానం. అన్ని శుద్ధిచేసిన నూనెలు కూరగాయల ఉత్పాదనానూనెలు 200 C నుండి 270 C మధ్య అధిక స్మోక్పోయింట్కలిగి ఉంటాయి.చాలా వరకూ శుద్ధి చేయని నూనెలు తక్కువ స్మోక్పోయింట్ కలిగి ఉంటాయి కనుక తక్కువ వేడి అవసరమయ్యేవంటల కోసం ఉపయోగించవచ్చు.10అన్ని రకాల నూనెల నిర్మాణము వాటి స్మోక్పోయింటుకుచేరుకునే సరికి వాటిలోని అన్ని పోషకాలు మరియు రుచిని కోల్పోయి ఆరోగ్యానికిహాని కలిగించే ఫ్రీ రాడికల్స్ విడుదల చేయడం ప్రారంభిస్తాయి. ప్రామాణికమైన గృహ వంట చాలా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద జరుగుతుంది అనగా మరిగించడం/ఉడకబెట్టడం100C వద్ద ,ప్రెజర్కుకింగ్ (పీడన వంట) 120 Cవద్ద, వేపుడుచేయడం120 C వద్ద ,మాడ్చడం160C నుండి 190Cవద్ద జరుగుతుంది..10
1.3శీతల ఉష్ణానికి ఘనీభవింపజేసిన నూనెలు ప్రయోజనకరంగా ఉంటాయి: ప్రకృతికి దగ్గరగా ఉన్న శుద్ధి చేయని నూనెలు ప్రత్యేకించి సేంద్రియ నూనెలు ఆరోగ్యానికి అనువైనవి, ఎందుకంటే తయారీ ప్రక్రియలో వాటి ప్రయోజనకరమైన లక్షణాలను కోల్పోవు. ప్రధానంగా వాటిని వేడి చేయకూడదుమరియు పూర్తి ప్రయోజనం పొందడానికి వీటిని సలాడ్లు,సాస్లు,స్మూతీలు,మొదలైన వాటిని తయారుచేయడానికి తగినవి.ఐతే కొంతమంది వేయించడానికి లేదా ఫ్రైచేయడానికి వాడుతూ ఉంటారు.10,11
1.4 తీసుకోవడం: ఏదైనా నూనె ఆరోగ్యకరమైనది లేదా ఇతరత్రా ప్రయోజన కరంగా భావించడానికి దానిలో తప్పనిసరిగా కొవ్వు (9 క్యాలరీలు/ గ్రాము)చేరి ఉండాలి. ఐతే ఎంతనూనె తీసుకోవాలిఅనేది వయసు, లింగము, మరియు శారీరక స్థాయిమరియు ఇతర కొవ్వు పదార్థాల వినియోగం మీద ఆధారపడి ఉంటుంది.రోజువారీ కేలరీల వినియోగం 25-30% మధ్య కనిష్టంగా ఉంచడం ఉత్తమం. ఈ పరిమితిలో సంతృప్త కొవ్వులు 10% కన్నా తక్కువ ట్రాన్స్ ఫ్యాట్కొవ్వులు 1% కన్నా తక్కువ ఉండేవిధంగా చూసుకోవాలి.12
1.5 నిల్వచేయడం: అన్ని నూనెలు వేడి,కాంతి మరియుఆక్సిజన్విషయంలో సున్నితంగా ఉంటాయి కనుక తగు జాగ్రత్త వహించాలి. సూర్యరశ్మి విటమిన్ E ని నాశనం చేస్తుంది కనుక చల్లని అల్మారాలలోభద్రపరుచుకోవలసి ఉంటుంది. వాటి నాణ్యతనిలుపుకోవడానికి ఎప్పుడూ స్టవ్ దగ్గరలేదావేడిమూలందగ్గర ఉంచవద్దు. ఎందుకంటే కాలం గడిచేకొద్దీ ఈ నూనెలలో ఆక్సీకరణం వలన వ్యాధులకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ వృద్ధి చెందుతాయి. వాసన వచ్చే ఏదైనానూనెనువెంటనే విడిచి పెట్టండి.3,4,5
మనకు తెలిసినంతవరకు 100 కంటే ఎక్కువ వంట నూనెలు13 ఉన్నాయి. ఈఅధ్యయనంనెయ్యితో(ఇదొక్కటే మొక్కల మూలం కాదు) సహా 23 ప్రధాన నూనెలను గురించి తెలుపుతుంది. సలాడ్లు,స్మూతీస్,డిప్స్,స్ప్రెడ్స్మొదలైన వాటికి నూనె వాడడంశీతల ఉష్ణోగ్రతకు ఘనీభవింప చేసిన శుద్ధి చేయని నూనెను సూచిస్తుంది.
2. సాధారణంగా ఉపయోగించే వంట నూనెలు (సాధారణంగా అధిక ఒమేగా 6 కలిగి ఉండి వేడి చేయడం ద్వారా వంట చేయడానికి ఉపయోగించేవి):
2.1 బాదంనూనె: విటమిన్ E యొక్క మంచి మూలముఐన దీనిని గోరు వెచ్చగా ఒక టేబుల్ స్పూన్ తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంచుతుంది. సలాడ్ డ్రెస్సింగ్ మరియు సువాసన కోసంవాడబడుతున్నప్పటికీ తక్కువ వేడి వద్ద బేకింగ్, దోరగా వేయించే వాటికి ఉపయోగిస్తారు. ఇది కొవ్వును సమతుల్యం చేస్తుంది, క్యాన్సర్ మరియు మధుమేహాన్ని నివారిస్తుంది, పెద్ద పేగు మరియు పురీష నాళాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చెవులలో నొప్పిని తొలగిస్తుంది,కళ్ళ కింద చీకటి వలయాలను రూపుమాపుతుంది, తామర మరియు సొరియాసిస్కు సహజమైన ఔషధంగా పనిచేస్తుంది.14
2.2 అవకాడోనూనె: అవకాడో పండు యొక్క గుజ్జుతో తయారైన ఈ నూనె అత్యధిక స్మోక్పాయింటు కలిగిన ఉత్తమ వంటనూనె. ఇది వేయించడానికి,బేకింగ్, మాడ్చడానికి,గ్రిల్లింగ్చేయడానికి తగినది. సలాడ్లు,స్మూతీస్,డిప్స్మరియుస్ప్రెడ్స్కు అనువైనది.ఇదిమధుమేహ నివారణ,కంటిశుక్లాల నివారణ,మాక్యులార్డిజనరేషన్ మరియు సోరియాసిస్వంటి చర్మ సమస్యలను నివారిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.జీర్ణవ్యాధులు, నాడీ సంబంధిత సమస్యలు,స్వయం ప్రతిరక్షకపరిస్థితులు, మరియు చర్మ గాయాలకు చికిత్స చేయడంలో దీన్ని ఉపయోగిస్తారు. కీళ్లనొప్పుల లక్షణాలను వెనక్కి మళ్ళించే సామర్థ్యం ఉన్నందున ఇది ఫ్రాన్స్ లో వైద్యుల చేత సూచించబడే ఔషధ శక్తిని కలిగి ఉంది.15
హెచ్చరిక : రక్తాన్ని పలుచన చేసే మందులు వాడేవారు ఈ నూనెను వాడే ముందు వారి వైద్యుడిని సంప్రదించడం మంచిది ఎందుకంటే ఇది అట్టి ఔషధాలపై ప్రభావం చూపిస్తుంది.15
2.3 నెయ్యి: వెన్నని వేడి చేయడం ద్వారా ఉత్పత్తి చేయబడిన ఈ పదార్ధంలో ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు కరిగే విటమిన్లు అధికంగా ఉంటాయి. గడ్డి తినే ఆవుల పాలను చిలికి తయారుచేసినఈ వెన్నలో ఇతర నూనెల కన్నా మంచి నిష్పత్తి (1.5:1) కలిగి ఉంటుంది. ఆరోగ్యకరమైన దృష్టికి, జీర్ణక్రియ, బలమైన ఎముకలు మరియు మెరుస్తున్న చర్మానికి నెయ్యితో చేసిన వంటలు ఎంతో ఉపయోగపడతాయి.9,16,17
2.4 కెనోలా/ర్యాప్ సీడ్ నూనె: ఇది ఆలివ్ ఆయిల్ వలెనేమోనోశాచ్యురేటెడ్ కొవ్వులను అధికంగా కలిగి ఉంటుంది, సంతృప్త కొవ్వు తక్కువగా అద్భుతమైన 2:1 నిష్పత్తిలో ఉంటుంది. దీని ఉపయోగితమరియు తక్కువ ధరలో లభ్యమయ్యే వెసులుబాటు కారణంగా మరియు వంటకు మరియు ఆహార ప్రాసెసింగ్లో విస్తృతంగా ఉపయోగించబడుతుంది.
హెచ్చరిక:ఇది ఎక్కువగా ప్రాసెస్ చేయబడినది, పాక్షికంగా హైడ్రోజనేటెచేయబడినది మరియు జన్యుపరంగా మార్పు చెందినది.18
2.5 కొబ్బరి నూనె: ఇది అధిక వేడి నిరోధకతను కలిగి ఉంటుంది. 185Cవద్ద 8 గంటల నిరంతర వేపుడు తర్వాత కూడా దాని నాణ్యత ఆమోదయోగ్యంగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.అవకాడో మాదిరిగా వేయించడానికి ఇతర నూనెల కన్నా ఇది మంచిది అని భావిస్తారు. అనేక ఔషధ లక్షణాలతో ఆరోగ్యానికి అద్భుతమైనది అని చెప్పడానికి తగిన శాస్త్రీయ ఆధారాలు ఎన్నో ఉన్నాయి.ఐతే దీనిలో 90% మధ్యస్థ స్థాయి సంతృప్త కొవ్వుల కంటెంట్ కారణంగా అపోహ పడుతూ ఉంటారు కానీ దీని కొవ్వుపదార్థంలో సగం లారిక్ ఆమ్లంఉంటుంది కనుక ఇది అనేక వ్యాధులను నివారించగలుగుతుంది19. దీని ప్రత్యేక ప్రయోజనాలు మరియు హెచ్చరికల కోసం మునుపటి వార్తాలేఖలు చూడండి.
2.6 మొక్కజొన్న నూనె: ఇది మొక్కల నుండి లభించే బాగా శుద్ధి చేయబడిన నూనె సులభంగా లభిస్తుంది,మరియూస్పుటతకు(క్రిస్ప్ గా ఉండడం) ఎక్కువగా వేయించడానికి విస్తృతంగా ఉపయోగపడుతుంది.21
హెచ్చరిక: ఇది ఎక్కువగా జన్యుపరంగా మార్పు చేయబడినది.21
2.7 పత్తి విత్తన నూనె: తప్పనిసరిగా శుద్ధి చేయబడినదే వాడవలసి ఉంటుంది. దీనియొక్క రుచి మరియు తక్కువ ఖర్చు దృష్ట్యా ప్రాసెస్ చేసిన ఆహారాలు,బేకింగ్ మరియు మాడ్చడంకొరకు మరియు రుచి కారణంగా ఉపయోగిస్తారు. గాయాలు నయం చేయడానికి మరియుఇన్ఫెక్షన్నుండి రక్షించడానికి బాహ్య అనువర్తనానికి అనువైనది.22
హెచ్చరిక: సంతృప్త కొవ్వు లు అధికంగా కలిగి ఉంటుంది.22
2.8 ఆవనూనె: భారతదేశం యొక్క ఆలివ్ ఆయిల్ అని పిలువబడే ఈ నూనెనువంట కోసం మరియుపచ్చళ్ళ నిలువకు ఉపయోగిస్తారు. ఇతర నూనెలతో పోలిక దృష్ట్యా సంతృప్త కొవ్వులు తక్కువగా ఉండే ఇది ఒమేగా 3 ఒమేగా 6 మరియు ఒమేగా 9 కొవ్వు ఆమ్లాలల విషయంలో వాంఛనీయమైన స్థాయి కలిగి ఉంటుంది. ఇది విటమిన్ E యొక్క అధిక స్థాయిని కలిగి ఉండి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మరియు పగిలిన పాదాలకు,గోళ్ళకు రక్షణ మరియు దంతాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మసాజ్ కోసం తరచుగా ఉపయోగిస్తారు.ఈ నూనె యొక్క కొన్ని చుక్కలు నీటి ఆవిరిలో వేసుకొని పీల్చితే జలుబును నిరోధించడమే కాక ఛాతీ రద్దీనితగ్గిస్తుంది.23
2.9 ఆలివ్‌నూనె: ఆలివ్ చెట్టు యొక్క పండు నుండి తయారయ్యే ఈ నూనె అనేక శతాబ్దాలుగా ప్రపంచంలోఆరోగ్యకరముగాను మరియు ఎక్కువ కాలం జీవించే ప్రజల ఆహారంలో ఒక భాగము. పరిశోధన దృష్ట్యా అధిక నాణ్యత గల వర్జిన్ ఆలివ్ ఆయిల్ యాంటీ ఇన్ఫ్లమేటరీసమ్మేళనాలు,యాంటీ ఆక్సిడెంట్లు, మరియు అనేక గుండె సంబంధిత ఆరోగ్యకరమైన పోషకాలు కలిగి ఉంటాయి. ఇది మెదడు ఆరోగ్యానికి, మానసిక రుగ్మతలు రూపు మాపుటకు ఉపయోగపడడమే కాక రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీన్ని తినడానికి ఉత్తమ మార్గం వండిన వంటకాలు,కూరగాయలు,ధాన్యపు వంటకాలు, సలాడ్ల మీద పల్చగా చల్లుకొని ఉపయోగించవచ్చు. లేదా వంట చివరిలో చేర్చవచ్చు. ఇది చర్మం మరియు జుట్టు కోసం అద్భుతమైనదే కాక గ్రీజును తొలగించడానికి మరియు ఫర్నిచర్ను పాలిష్ చేయడానికి ఉపయోగించవచ్చు.24-27
2.10పామాయిల్: దీనిని అనేక బేకింగ్ పదార్ధాల తయారీకి,డైట్ బార్ మరియు చాక్లెట్లుతయారీకి ఉపయోగిస్తారు. ఔషధపరంగా ఇది విషానికి విరుగుడుగానూ,గనేరియా అనే సుఖవ్యాధి నివారణకు, సహజ మూత్ర విసర్జనకారి గానూ, మరియు డై యురైటిక్ గానూ ఇంకా తలపోటు, చర్మవ్యాధి సంక్రమణ చికిత్సకు ఉపయోగపడుతుంది.28
హెచ్చరిక : ఎక్కువగా భారీగా ప్రాసెస్ చేయబడినది.28
2.11వేరుశెనగ నూనె: వేయించడానికి ఉపయోగ పడేది మరియు ఎక్కువ ఉపయోగించదగిన కాలం కలిగి ఉండేదిఐన ఈ నూనె యాంటీఆక్సిడెంట్స్ మరియు విటమిన్ E యొక్క గొప్ప మూలము. గుండె, మెదడు, కళ్ళు, మరియు రక్తంలో చక్కెర నియంత్రణకు ఆరోగ్యకరమైనది. సాధారణంగా సురక్షితమైనదిగాపరిగణింపబడుతుంది.29
హెచ్చరిక: కొన్నిసార్లు జన్యుపరంగా మార్పుచేయబడినదిగానుమరియు పాక్షికంగా హైడ్రోజనేటెడ్ గానూ ఉంటుంది.29
2.12 ధాన్యపు నూనె: దక్షిణ ఆసియా లో చాలా సాధారణమైనఈ నూనె అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడి మోనోశాచ్యురేటెడ్ కొవ్వులగొప్ప మూలంగా ఉంటుంది. 30
2.13కుసుమ నూనె: వేయించడం,బేకింగ్ చేయడం,మాడ్చడం వంటి అధిక వేడితో కూడిన పంటలకు అనువైనది. ఇది మలబద్దకం నుండి ఉపశమనం పొందడం లో సహాయపడుతుంది.31
2.14 నువ్వుల నూనె: వంటలకు చక్కని రుచిని అందిస్తూ శతాబ్దాలుగా వాడుకలో ఉన్న అద్భుతమైన నూనె ఇది. అధిక వేడి చూపించే వేపుడు వంటకాలకు,సాటీయింగ్ చేయడానికి,పచ్చళ్లు తయారీకి,మరియు సలాడ్లకుప్రత్యేకించి రోస్ట్ చేసే వంటకాలకు ఈ నువ్వుల నూనె బాగా సరిపోతుంది. యాంటీ ఆక్సిడెంట్ల యొక్క గొప్ప మూలము మాత్రమేకాకరక్తంలో చక్కెర స్థాయి నియంత్రణకు గుండె జబ్బుల నియంత్రణకు అద్భుతమైనది.32,33
2.15సోయాబీన్ నూనె: రక్తం గడ్డ కట్టడానికి మరియు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవసరమైన ఆరోగ్యకరమైన విటమిన్ కె కు ఇది మంచి మూలము. ఇది ప్రయోజనకరమైన అసంతృప్త కొవ్వు ఆమ్లాల తో నిండి ఉంటుంది.34
హెచ్చరిక: హానికరమైన ట్రాన్స్ ఫ్యాటీ ఆమ్లాలు ఉండవచ్చు.34
2.16 సన్ ఫ్లవర్ లేదా పొద్దుతిరుగుడు నూనె: దీనిలో ఉండేవివిధ రకాల కొవ్వు ఆమ్లాల కూర్పు వల్ల అనేక రకాల పొద్దుతిరుగుడు నూనెలులభ్యమవుతూ ప్రయోజనాలు మరియు అప్రయోజనాలుకూడా కలిగి ఉన్నాయి. మధ్యస్థ ఓలిక్ మరియు ఎక్కువ ఓలిక్రకాలు తక్కువ వేడి వద్ద వంట చేయడానికి ఆరోగ్యకరంగా భావిస్తారు.35
హెచ్చరిక: అధిక ఉష్ణోగ్రత వద్ద విశష సమ్మేళనాలను విడుదల చేయవచ్చుఅధిక స్మోక్పోయింట్ఉన్నప్పటికీ వేయించడానికి మంచిది కాదు.35
2.17 కూరగాయల నూనెల మిశ్రమం: ఏనూనెకూడా పరిపూర్ణమైనదికానందునకావలసిన కొవ్వు ఆమ్లముల నిష్పత్తుల సాధనకు మరియు మొత్తం సూక్ష్మపోషక ప్రొఫైల్ మెరుగుపరచడానికి పరిశోధనలు నూనె మిశ్రమాన్ని ప్రోత్సహిస్తున్నాయి.36
హెచ్చరిక: చాలా విస్తృతంగా ప్రాసెస్ చేయబడతాయి మరియు సులభంగా ఆక్సీకరణం చెందుతాయి.36
3. అధిక ఒమేగా-3 కంటెంట్ కలిగి నూనెలు (నిష్పత్తి ప్రకారం జాబితా చేయబడ్డాయి) వంట చేయడానికి అనుకూలం కాదు: మసాలా,స్మూతీస్,పులుసులు, షేక్ లు, పెరుగు, ఓట్ మీల్ మరియు సలాడ్ డ్రెస్సింగ్ కోసం అనువైనవి. మునుపటి వార్తాలేఖను చూడండి.8
3.1 అవిశ గింజల నూనె (1:4 నిష్పత్తి):ప్రకృతిలోఒమేగా 3 యొక్క ఉత్తమ వనరులలో అనగాదాదాపు 50-60% నూనెలో ఇది లభ్యమవుతుంది.మెదడు మరియు గుండెను ఆరోగ్యంగా చేస్తుంది,నిర్విషీకరణ చేస్తుంది,మలబద్ధకం మరియు విరోచనాలనుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇది సెల్యులైట్ను(సాధారణంగా పిరుదులు మరియు తొడలలో పేరుకుపోయిన కొవ్వు డిపాజిట్లను) నివారించడం మరియు తొలగించడం,మరియుసోగ్రెన్స్సిండ్రోమ్ (పొడి కళ్ళు మరియు పొడి నోటి లక్షణాలతో రోగనిరోధక వ్యవస్థ యొక్క రుగ్మత)37ను నివారణ గావిస్తుంది.
(పెరిల్లా గింజల నూనె: 8,38 65% ఒమేగా-3 ఉంటుంది కానీ ప్రతికూలతలు: యాంటీ కోయాగ్యులెంట్(గడ్డకట్టక పోవడం)మరియు పల్మనరీటాక్సిసిటీ(నరాలలో విషపదార్ధాలుపెరుకోవడం)వంటి ఫలితాలు ఉంటాయి)
హెచ్చరిక (అవిశ నూనె):గర్భిణీ స్త్రీలు మరియు మధుమేహ వ్యాధిగ్రస్తులు మరియు రక్తం పల్చగాచేసుకొనే మందులు వాడేవారు వైద్యుడిని సంప్రదించాలి.37
3.2 చియాగింజల నూనె (1:3 నిష్పత్తి): ఒమేగా 3 అధికంగా ఉన్నందున ఉత్తమ ప్రయోజనాలను పొందడానికి ఆలివ్ నూనెతో జతచేయండి.39
3.3 హెంప్ గింజల నూనె (2.5:1):తగినంతయాంటీఆక్సిడెంట్లు మరియు అనేక ఖనిజాలు మరియు క్లోరోఫిల్కలిగి ఉంటుంది.40,41
3.4 వాల్నట్నూనె (5:1 నిష్పత్తి): మెదడు మరియు రక్తంలో చక్కెర నియంత్రణకు అద్భుతమైనది.42
3.5 గోధుమ పొట్టు నూనె/విటమిన్ E నూనె(7:1 నిష్పత్తి):ఒక టేబుల్ స్పూన్ నూనె రోజుకు కావలసిన విటమిన్ E అవసరాన్ని తీరుస్తుంది. ప్రతిరోజూ తీసుకోవడం వలన స్కార్స్ (గాయం వలన ఏర్పడిన మచ్చలు) తొలగుతుంది.43
3.6 గుమ్మడికాయ గింజల నూనె/ తక్కువ ఒమేగా 3గల పెపిటనూనె: మంచి ఆరోగ్యం అందించే ఈ నూనెను నిశ్శబ్ద చాంపియన్ అని పిలుస్తారు. జుట్టు రాలడాన్ని నివారించడంలేదా అట్టి లక్షణాలను వెనకకుమళ్లింప చేయడం,రుతువిరతి లక్షణాలను తగ్గించడం,అతి చురుకైన మూత్రాశయానికి చికిత్స చేయడం,గుండెజబ్బులు, ప్రోస్టేట్ మరియు క్యాన్సర్ రోగుల ఆరోగ్యానికి తోడ్పడుతుంది క్యాన్సర్ ను కూడా నివారిస్తుంది.44
సూచన : చేపల నూనె అనుబంధముగా మాత్రమే తీసుకోవాలి,ఎందుకంటే దీనిలో ఒమేగా 3 నిష్పత్తి ఎక్కువ ఉండడమే కాక ఒమేగా3 యొక్క అధిక వనరులలో ఇది ఒకటి.9
4. తెలుసుకోవలసిన గుర్తుంచుకోవాల్సిన విషయాలు
★ కొనేటప్పుడు జాగ్రత్త వహించాలి: మార్కెట్లో లభించే అనేక రకాల నూనెలు అధిక ప్రాసెస్ మరియు శుద్ధిచేసిన నూనెల మిశ్రమంతో కూడి కూరగాయల నూనెల యొక్క ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంది. మరికొన్ని నూనెలు వాటి రుచి మరియు సెల్ఫ్ జీవితాన్ని మరింత పెంచడానికి హైడ్రోజనేట్ చేయబడతాయి, ఫలితంగా అనారోగ్యకరమైన ట్రాన్స్ ఫ్యాటీ ఆమ్లాలు గుండె జబ్బులు మధుమేహం ఊబకాయం మరియు క్యాన్సర్ ప్రమాదాన్ని కలిగిస్తాయి. నూనెల యొక్క ప్రయోజనాలు మరియు అప్రయోజనాలుఎల్లప్పుడూ మీ దృక్పథంలో ఉండేలా చూసుకోండి. ముదురు రంగు గ్లాస్ బాటిళ్లలో ఉన్న నూనెలను కొనడానికి ప్రయత్నించండి.2,4,24
★ మార్పిడి చేయండి: మీ సాధారణ వంట నూనెలను మార్పిడి చేస్తూ ఒమేగా-3 సమృద్ధిగా ఉన్న ఆహారము మరియు ఆయిల్తో అనుబంధంగా తీసుకోండి.3,4
★ దాదాపు అన్ని నూనెలు చర్మము మరియు జుట్టుకు మంచివేఅయినప్పటికీ బాహ్యంగా ఉపయోగించదలచినప్పుడుఏదైనా అలర్జీప్రతిచర్య నివారణకు చర్మం మీద కొంచం నూనెను రాసుకోవడం ద్వారా స్వీయ పరీక్ష చేసుకోవడం ఉత్తమం. కొబ్బరినూనె, నువ్వులు లేదా ఆలివ్ నూనె తో ఆయిల్ పుల్లింగ్ చేయడం దంత ఆరోగ్యంతో సహా అనేక ప్రయోజనాలను కలిగి ఉంటుంది.45
★ నూనె వాడకాన్ని తగ్గించండి: స్ప్రే బాటిల్ లో సమానమైన నూనె మరియు నీటిని కలపడం ద్వారా వంటఇంట్లో తయారు చేసిన ద్రావణాన్ని సిద్ధం చేసుకొని వంటకు ఉపయోగించే పాన్ ను పదార్ధానికి అంటకుండా చేయవచ్చు.46
★ నీరు పోకుండా కాలువలు అడ్డుపడడాన్నినివారించండి:పాన్ ఉపయోగించిన తరువాత దానిని కడిగే ముందు నూనె మరకలనుతుడిచివేయండి, మిగిలిపోయిన నూనెను సింకులోకి విసిరివేయ వద్దు.47
రిఫెరెన్స్ లు మరియు లింకులు :
- Sathya Sai Baba Speaks on Food, the heart, and the mind, 21 January 1994; http://www.sssbpt.info/ssspeaks/volume27/sss27-03.pdf
- Know about oils: https://draxe.com/nutrition/vegetable-oil/; https://draxe.com/nutrition/omega-3-foods/
- Nature of oils, storing, & nutrition: https://www.nutrition.org.uk/attachments/113_Culinary%20oils%20and%20their%20health%20effects.pdf
- Composition of fats & whole diet: https://health.clevelandcliniuc.org/how-to-choose-and-use-healthy-cooking-oils/
- Moderate fat essential: https://www.heart.org/en/healthy-living/healthy-eating/eat-smart/fats/dietary-fats
- Oil makes veg nutritious: https://sciencedaily.com/releases/2017/10/171009124026.htm
- Guide to Omega fats 3, 6, & 9: https://www.healthline.com/nutrition/omega-3-6-9-overview; https://healthline.com/nutrition/3-types-of-omega-3#TOC_HDR_6
- Sources of Omega-3: https://www.theplantway.com/plant-based-omega-3/; https://draxe.com/nutrition/vegan-omega-3/; https://news.vibrionics.org/en/articles/164
- Fatty acid ratio of oils: https://en.wikipedia.org/wiki/Fatty_acid_ratio_in_food
- Cooking temp. & Smoke points of oils: https://www.exploratorium.edu/food/pressure-cooking; https://en.wikipedia.org/wiki/Pressure_cooking; https://en.wikipedia.org/wiki/Deep_frying; https://en.wikipedia.org/wiki/Smoke_point;
- Benefit from cold-pressed oils: https://food.ndtv.com/food-drinks/guide-to-cold-pressed-oils-would-you-replace-them-with-cooking-oils-1772859; https://www.netmeds.com/health-library/post/go-for-cold-pressed-oils-for-amazing-health-benefits
- How much fat intake is good!: https://www.who.int/news-room/fact-sheets/detail/healthy-diet
- Edible oils list: https://en.wikipedia.org/wiki/list_of_vegetable_oils
- Almond oil: https://draxe.com/nutrition/almond-oil/; https://healthline.com/nutrition/almond-oil
- Avocado oil: https://draxe.com/nutrition/avocado-oil/; https://www.healthline.com/nutrition/9-avocado-oil-benefits
- Butter oil (Ghee): https://draxe.com/nutrition/ghee-benefits/; https://www.ecpi.edu/blog/culinary-nutrition-9-health-benefits-ghee
- Nutritious butter oil from grass-fed cow milk: https://www.healthline.com/nutrition/grass-fed-butter#TOC_TITLE_HDR_2
- Canola oil : https://www.hsph.harvard.edu/nutritionsource/2015/04/13/ask-the-expert-concerns-about-canola-oil/; https://draxe.com/nutrition/canola-oil-gm/; https://www.healthline.com/nutrition/is-canola-oil-healthy; https://www.healthline.com/nutrition/rapeseed-oil#benefits
- Coconut oil: https://healthline.com/nutrition/healthiest-oil-for-deep-frying#coconut-oil
- Coconut oil article ref: https://news.vibrionics.org/en/articles/239; https://news.vibrionics.org/en/articles/92
- Corn oil: https://www.healthline.com/nutrition/corn-oil; https://www.organicfacts.net/health-benefits/oils/corn-oil.html
- Cottonseed oil: https://www.healthline.com/health/cottonseed-oil; https://draxe.com/nutrition/cottonseed-oil/; https://www.organicfacts.net/health-benefits/oils/cottonseed-oil.html
- Mustard Oil: https://www.healthline.com/nutrition/mustard-oil-benefits; https://draxe.com/nutrition/mustard-oil/; https://food.ndtv.com/health/8-incredible-mustard-oil-benefits-that-make-it-so-popular-1631993; https://timesofindia.indiatimes.com/15-amazing-facts-and-uses-of-mustard-oil/articleshow/55067780.cms
- Olive oil : https://draxe.com/nutrition/olive-oil-benefits/; https://www.healthline.com/nutrition/11-proven-benefits-of-olive-oil#TOC_TITLE_HDR_2
- Many benefits of olive oil: https://food.ndtv.com/food-drinks/olive-oil-amazing-benefits-of-olive-oil-for-health-hair-skin-its-wonderful-uses-1736506
- How to nourish the body with olive oil: https://www.oliveoilsfromspain.org/olive-oil-news/olive-oil-benefits/
- Stability of olive oil: https://www.healthline.com/nutrition/is-olive-oil-good-for-cooking
- Palm oil: https://www.healthline.com/nutrition/palm-oil; https://draxe.com/nutrition/red-palm-oil/
- Peanut oil Benefits and caution: https://draxe.com/nutrition/peanut-oil/; https://www.healthline.com/nutrition/is-peanut-oil-healthy
- Rice bran oil: https://www.healthline.com/nutrition/rice-bran-oil; https://draxe.com/nutrition/rice-bran-oil-versatile-healthy-fat-or-inflammatory-cooking-oil/
- Safflower oil: https://draxe.com/nutrition/safflower-oil/; https://www.healthline.com/health/safflower-oil-healthy-cooking-oil; https://www.medindia.net/dietandnutrition/11-health-benefits-of-safflower-oil.htm
- Benefits of sesame oil: https://draxe.co(m/nutrition/sesame-oil/; https://food.ndtv.com/food-drinks/7-sesame-oil-benefits-an-antioxidant-natural-spf-stress-buster-more-1237049
- Toasted sesame oil Vs. sesame oil: https://healthyeating.sfgate.com/toasted-sesame-oil-vs-sesame-oil-11158.html
- Soybean oil: https://www.healthline.com/health/soybean-oil; https://draxe.com/nutrition/soybean-oil/
- Sunflower oil: https://draxe.com/nutrition/sunflower-oil/; https://www.healthline.com/nutrition/is-sunflower-oil-healthy
- Vegetable oil (Blends): https://draxe.com/nutrition/vegetable-oil/; https://easyfitnessidea.com/benefits-of-blended-oils/
- Flaxseed/linseed oil: https://draxe.com/nutrition/flaxseed-oil-benefits/; https://www.healthline.com/nutrition/flaxseed-oil-benefits
- Perilla oil: https://www.healthline.com/health/food-nutrition/healthy-cooking-oil-perilla-oil
- Chia: https://www.healthline.com/nutrition/chia-seed-oil; https://todaysdietitian.com/newarchives/images/0215-2.pdf
- Hempseed oil: https://draxe.com/nutrition/hemp-oil-benefits-uses/; https://www.medicalnewstoday.com/articles/324450
- How to use hemp oil for skin: https://www.healthline.com/health/hemp-oil-for-skin#uses
- Walnut oil: https://www.healthline.com/nutrition/walnut-oil; https://draxe.com/nutrition/healthy-cooking-oils/
- Wheat germ oil: https://draxe.com/nutrition/wheat-germ/; https://food.ndtv.com/food-drinks/6-incredible-benefits-of-wheat-germ-oil-1638519; https://www.verywellfit.com/wheat-germ-oil-nutrition-facts-4165648
- Pumpkin seed oil: https://www.verywellhealth.com/pumpkin-seed-oil-health-benefits-4686960; https://www.healthline.com/health/pumpkin-seed-oil#1; https://draxe.com/nutrition/pumpkin-seed-oil/
- Oil Pulling for dental & general health: https://draxe.com/beauty/oil-pulling-coconut-oil/
- Spray oil: https://www.onegoodthingbyjillee.com/homemade-cooking-spray/
- Prevent clogging of drains: https://333help.com/blog/clean-clear-maintain-drain-5-easy-steps/; https://dummies.com/home-garden/plumbing/clogs/how-to-prevent-clogs-in-your-drai
2. ప్రేరణాత్మక కధానికలు
a.తీర్థయాత్రలో పరమఔషదమ్11529…ఇండియా
2019 జూలైలో 15 నుంచి 65 సంవత్సరాల వయస్సు గల 170 మంది యాత్రికుల బృందం నేపాల్లోనిఖాట్మండు లో ఎత్తయిన హిమాలయాల్లోకి ప్రయాణించడానికిమరియు తమ గమ్యమైన పవిత్ర మానస సరోవరం సరస్సు మరియు కైలాస పర్వతం సందర్శించడానికి బయలుదేరారు. డయామాక్స్ అనే అలోపతిఔషధం సాధారణంగా వంపులు తిరిగే పర్వత రహదారిపై ప్రయాణించేతప్పుడు పర్వతాల ఎత్తు మరియు ప్రతికూల పరిస్థితుల వల్ల ఏర్పడే అనారోగ్యమునకు రక్షణగా పరిగణించబడుతుంది. ఈ తీర్థ యాత్రలో ప్రాక్టీషనర్కుటుంబ సభ్యులు ఉన్నారు కానీ ఆమె లేరు, ఐతే అందరూ కూడా ప్రయాణపు అనారోగ్యానికి గురవుతున్నాడయామాక్స్ యొక్క ప్రతికూల దుష్ప్రభావాలు కారణంగా చాలా మంది దానిని తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఇంతకుముందు 2012లో స్వయంగా తీర్థయాత్ర చేసిన తర్వాత ఈ ప్రాక్టీషనర్ప్రయాణికులకు ఏమీ అవసరమో అర్థం చేసుకుని క్రింది రెమిడీ సిద్ధం చేసి అందరికీ ఇచ్చారు:
CC3.7 Circulation + CC4.1 Digestion tonic + CC4.6 Diarrhoea + CC4.10 Indigestion + CC9.2 Infections acute + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC17.1 Travel sickness + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine...TDS to 6TDప్రతీ వ్యక్తి అవసరానికి అనుగుణంగా TDS నుండి 6TD60 వరకు
ఈ రెమిడీ వైబ్రియానిక్స్ ఎంచుకున్న బృందంలోని నలుగురు అల్లోపతి వైద్యుల తో సహా 75 మంది సభ్యులకు ఖచ్చితంగా పనిచేసి వారి ప్రతికూల పరిస్థితుల నుండి తప్పిస్తూ ప్రయాణాన్ని సుగమం చేసింది. వైబ్రియానిక్స్ తీసుకోకుండా అలోపతి ఎంచుకున్న వారిలో దాదాపు సగం మంది వాంతులు, విరేచనాలు, దగ్గు మరియు జలుబు మరియు శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులకు గురయ్యారు. ఇంటికి తిరిగి వచ్చినతరువాత యాత్రికులుప్రాక్టీషనరుకుఫోన్ చేసి తమ కృతజ్ఞతలు తెలిపారు.
b. వృద్ధ పిల్లి యొక్క పునరుజ్జీవనం00660…USA
సింబా అనేది మార్మలాడే అనే ఉత్తమ జాతికి చెందిన ఒక వృద్ధురాలైన 20 ఏళ్ళ పిల్లి.మొదట ఇది అరణ్యవాసిగా ఉండే ఒక పిల్లి ద్వారా జన్మించి ఒక వ్యక్తి ద్వారా గ్రహింపబడి1999లోఆ వ్యక్తి నుండి సానుభూతి పరురాలైనఒక తల్లి చేత చిన్నతనం లోనే దత్తత తీసుకోబడింది. ఇది క్రమంగా పెరుగుతూ ప్రేమతో సంరక్షించ బడుతూ దానికి వృద్ధాప్యం వచ్చేసరికి పాపం 2019 ఆగస్టులో అనారోగ్యానికి గురైంది.దీనికి ఆకలి తగ్గిపోయి, బరువు తగ్గిపోయి దాని పై చర్మపు బొచ్చు కుచ్చులుగా ఊడిపోతూ తన స్నేహితులతో కలవడానికి సాధారణముగా చూపించే ఆసక్తిచూపక ఇంటిలోనే ఉండిపోతున్నది. పశువైద్యుడుఇది మూత్రపిండాల వైఫల్యంగా నిర్ధారించి ఇక దానిపై ఆశ వదులుకోమని చెప్పారు. పిల్లిపై ఆక్యుపంక్చర్ వైద్యం ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది.సింబాను ఆర్ద్రంగా (హైడ్రేటెడ్) ఉంచడానికి పొటాషియంమరియు సెలైన్లురోజుకు ఎనిమిది సార్లు అతని మెడ వెనుక భాగంనుండి ఇవ్వసాగారు. చివరి ఆశగా దీనిని పెంచుకునే తల్లి ద్వారా ప్రాక్టీషనరును సంప్రదించగా వారు పెండ్యులమ్ ద్వారా స్వామిని కోరగా స్వామి ఉత్సాహభరితమైన అంగీకారం ఇచ్చారు. ఆ విధంగా 2020 జనవరి 18న క్రింది రెమిడీ తయారుచేయబడింది:
NM2 Blood + NM7 CB7 + NM59 Pain + NM75 Debility + NM86 Immunity + OM5 Circulation + BR11 Kidney + SM2 Divine Protection + SR325 Rescue…6TD నీటితో తయారుచేసి డ్రా ఫర్ బాటిల్ ద్వారా నోటిలో వేయబడుతోంది.
సింబా వెంటనే ప్రతిస్పందించడంతో దానికి ఆకలి తిరిగి ఏర్పడింది. దాని ఆరోగ్యం విషయంలో నిరంతర పెరుగుదలఉండడంతో మోతాదు ఒక వారం తర్వాతTDS కు తగ్గించబడింది. పది రోజులు వరుసగా రెమిడీ తీసుకున్న తరువాత సింబాపెరట్లోతిరగడం ప్రారంభించింది. ఒక నెలలోనే ఈ వృద్ధ పిల్లి తన సాధారణ బరువును తిరిగి పొందింది.దీనికి మెడ వెనుక ఇచ్చే ఇంజెక్షన్లు వారానికి రెండు సార్లు మాత్రమే ఇవ్వబడసాగాయి. దానికి బొచ్చు ఊడిపోవడం తగ్గిపోయి మృదువుగా మరియు అందంగా పెరగ సాగింది. దాని ప్రవర్తనలో గతంలో వలె నవయవ్వనంతొనికిసలాడుతూ తరచూ ఆమెను పెంచుకునే తల్లివెంట తిరుగుతూ ఉడుతలు మరియు పక్షుల సందడిని ఆనందించడానికి భానూదయంలోతన తల్లిని అనుసరిస్తోంది.సింబాపగలంతాసంతృప్తితో తన తల్లితో దోగాడుతూ రాత్రిపూట ఆమె పక్కలోనే పడుకోంటోంది. ఆగస్టు చివరినాటికి మోతాదుOD కితగ్గించబడి డిసెంబర్ 2020నాటికి కొనసాగుతోంది.
ఇటీవల వెటర్నరీ డాక్టర్ సందర్శించినపుడుసింబాయొక్క అద్భుతమైన ప్రగతి డాక్టర్ మరియు అతని సిబ్బందిని ఆశ్చర్యపరిచింది.సింబాతల్లి మరియు ఆమె ప్రాక్టీషనర్ ఫ్రెండ్ ఇద్దరికీ తెలుసు ఈ అపూర్వ స్వస్థత వెనుక ఉన్న హస్తం ఎవరిదో. సింబా తల్లి హృదయపూర్వకంగా ఇలా ప్రకటించారు. “ఈ అద్భుతమైన వైద్యం ద్వారా మనందరికీ ముఖ్యంగా 4 కాళ్ళ రెండు రెక్కల మూగ జీవులన్నింటికీఅందుబాటులో ఉంచిన భగవాన్ బాబాకు నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను”
3. పుట్టపర్తి రైల్వే స్టేషన్ లో ఆరోగ్య శిబిరము 2020 నవంబర్ 21-23
పరిమాణము నుండి నాణ్యతకు పరిణామము
Since 2009, Prasanthi Nilayam Railway Station becomes the scene of a large, well-established, vibrionics camp from 21-23 Nov to serve devotees arriving by train to celebrate Swami's Birthday. Usually, there is
2009 నుండి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్ నవంబర్ 21 నుంచి 23 వరకు స్వామి పుట్టినరోజు వేడుకలలో పాల్గొనడానికి రైలులో వచ్చే భక్తులకు సేవ చేయడానికి బాగా స్థిరపడిన వైబ్రియానిక్స్ దంపతుల వైద్య శిబిరానికి వేదికగా మారింది.సాధారణంగా ఇక్కడ ఆలోపతి క్యాంపు కూడా జరుగుతూ ఉంటుంది కానీ ఈ కోవిడ్మహమ్మారి బారిన పడిన ఈసంవత్సరం సాధారణంగా హాజరయ్యే వేలాది మంది బదులు కేవలం వందల సంఖ్యలో భక్తులు రావడంతో కేవలం వైబ్రియానిక్స్ క్యాంపు మాత్రమే నిర్వహింపబడింది. శిబిరము నిర్వహించడానికి ముందుగానే ప్రాక్టీషనర్ జంట 02444 & 01228 500 రెమిడీ బాటిళ్ళను సిద్ధం చేసారు. స్వామి రక్షణ మరియు కోవిడ్నివారణ కోసంస్వామి అందించిన IB పై పూర్తి నమ్మకంతో అనుభవజ్ఞులైన ఈ వీరోచిత జంట హాజరైన వారందరికీ తమ అనుభవ పూర్వక సేవలను అందించడానికి వెనకాడలేదు.పేషంట్లుచాలా తక్కువగా ఉండడం వలన దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న రోగులతో ఎక్కువ సమయం గడపడానికి మరియు అవసరం మేరకు వైబ్రియానిక్స్వ్యవస్థను గురించి వివరించడం,ఎక్కువ వ్యక్తిగత సహాయాన్ని అందించడానికి వీలు కల్పించబడింది. 368 మంది రోగులు తమకు మరియు అనారోగ్యంతో ఉన్న బంధువులు మరియు స్నేహితులకు రెమిడీలు తీసుకువెళ్లడంతో పాటు తమ దీర్ఘకాలిక సమస్యలకు ఎక్కువ రెమిడీ బాటిళ్ళనుతీసుకు వెళ్లారు. కొంతమందికివారి గాయాలకు పుండ్లకుప్రథమ చికిత్సకూడా చేసారు. హ్యాండ్ సానిటైజర్సదుపాయంతో పాటు మాస్కులు ఉపయోగించడం సామాజిక దూరాన్ని పాటించడం వంటి మార్గదర్శకాలకు కట్టుబడి సేవలు నిర్వహింపబడ్డాయి.
4. సంస్మరణలు
నవంబర్ నెలలో ఇద్దరు అనుభవం గల ప్రాక్టీషనర్లు కన్నుమూసిన వార్తలను ఎంతో బాధతో నేను మీ ముందుకు తీసుకు వస్తున్నాను. 75 సంవత్సరాల వయసుగల శ్రీ దుధరాం ఎన్ సమర్త 10330 మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాకు అధ్యక్షులు. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండే వీరు చాలాచురుకైన మరియు నిజాయితీ గల నాయకుడు. 66 సంవత్సరాలవయసు గల శ్రీ శివ దర్శనం ఎం. జి11238 కేరళ లోని ఎర్ణాకులం జిల్లా సత్యసాయి సేవా సంస్థల జిల్లా సర్వీస్ ఇంచార్జిగా పనిచేశారు. ఎస్ ఎస్ఎస్ వి ఐ పి ప్రోగ్రాం క్రిందసాయి వైబ్రియానిక్స్శిబిరము నిర్వహించడానికి కోఆర్డినేటర్ గా పని చేశారు. చివరి క్షణం వరకు ఇద్దరు వైబ్రియానిక్స్ సేవలో నిమగ్నమవడమే కాక వారి ఆదర్శప్రాయమైన సేవకు వైబ్రియానిక్స్కుటుంబ సభ్యులందరిచేత కలకాలం గుర్తుంచుకోబడతారు.