Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

అదనంగా

Vol 11 సంచిక 4
July/August 2020


1. ఆరోగ్య చిట్కాలు

నేత్రాలు ఎంతో విలువైనవి - తగిన జాగ్రత్తలు తీసుకోండి.

చెడు చూడకు మంచినే చూడండి, అప్పుడే మీ కళ్ళు పవిత్ర శక్తిని పొందుతాయి. దీని ద్వారా మీరు దైవ విశ్వరూపాన్ని దృశ్యమానం చేయగలుగుతారు.”… సత్య సాయి బాబా1

“అన్నీ ఇంద్రియాలలో దృష్టి చాలా ప్రధానమైనది కనుక ఆనందదాయకంగా ఉండాలి. అంధుడుగా ఉండటం కంటే దారుణమైనది ఏమిటంటే బాహ్య దృష్టి ఉన్నా జ్ఞాన దృష్టి లేకపోవడమే... హెలెన్ కెల్లర్ (అమెరికాకు చెందిన బధిర, అంధ రచయిత్రి మరియు కార్యకర్త)  

1. మీ కళ్ళను గురించి తెలుసుకోండి

1.1 మానవ శరీరంలో అత్యంత దుర్బలమైన, సంక్లిష్టమైన మరియు సున్నితమైన ఇంద్రియ అవయవములైన కనులు మనకు విలువైన దృష్టిని, కాంతి యొక్క రంగు, రూపం, మరియు కదలికల భావాన్ని ఇస్తాయి, మరియు శరీరం యొక్క జీవ గడియారమును నిర్వహిస్తాయి. గూడు వంటి ఎముకల నిర్మాణములో గల రెండు కనుగ్రుడ్లు బాహ్య భాగంలో కనురెప్పలు, కనుబొమ్మలు, మరియు కన్నీటిపొర ద్వారా రక్షింపబడుతున్నాయి.  ప్రతీ కన్నుకనుగ్రుడ్డు చుట్టూ ఉన్న 6 కండరాల ద్వారా కదులుతుంది. కాంతి కిరణాలు కంటిపాప ద్వారా కార్నియా పొర మరియు కటకము (లెన్స్) ద్వారా కేంద్రీకృతమై రెటీనా మీద ఒక చిత్రాన్ని ఏర్పరుస్తాయి.

రెటీనా పొర మిలియన్ల సంఖ్యలో కాంతి ప్రతిస్పందక కణాలను కలిగి ఉంటుంది. ఇవి చిత్రాన్ని నాడీ ప్రేరణల నమూనాగా మారుస్తాయి. ఈ ప్రేరణలు దృష్టి నాడి ద్వారా మెదడుకు వ్యాపిస్తాయి. ఇక్కడ ఇవి తిరిగి ఒకే చిత్రముగా రూపొందించడానికి ప్రాసెస్ చేయబడతాయి. 2-4

1.2  సాధారణ కంటి చూపు అంటే ఏమిటి? :  “20/20” (అడుగులలో) లేదా  “6/6” (మీటర్లలో ) దృశ్య తీక్షణత పూర్తిగా సరైనది కానప్పటికీ ఇది సాధారణ కంటి చూపును సూచిస్తుంది. మొదటి సంఖ్య (పైన పేర్కొన్నది) కంటి పరీక్ష సమయంలో స్నెల్లెన్ కంటి చార్టు  ఉపయోగించి దృష్టిని పరీక్ష చేసే దూరాన్ని సూచిస్తుంది. రెండవ సంఖ్య చార్టులోని అక్షరాలను ఆరు మీటర్ల వద్ద ఎంత బాగా చదవగలరో మనకు చెబుతుంది. ఒకరికి 6/9 దృశ్య తీక్షణత ఉంటే జనులంతా సాధారణముగా 9 మీటర్ల వద్ద చూడగలిగితే అతను ఆరు మీటర్ల వద్ద ఉన్న వస్తువును మాత్రమే చూడగలడు.5,6  

1.3  కంటి సాధారణ పీడనం అంటే ఏమిటి? ఇంట్రా ఆక్యులర్ ప్రెషర్ IOP — గా పిలవబడే కంటి  పీడనము కనుగ్రుడ్డు లోని ద్రవపు పీడనము కొలిచే కొలత. సాధారణ కంటి పీడనము 15 mmHg ఉంటుంది. సాధారణ కంటి పీడనము 90% ప్రజలలో ఈ కొలత కన్నా ఎక్కువ పరిధిలో 10 మరియు 21 మధ్య ఉంటుంది.  ఇది వయస్సు, రక్తపోటు, పల్స్ రేటు, మరియు వక్రీభవన లోపం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. 21 కన్నా ఎక్కువ కంటి పీడనము సాధారణంగా ప్రమాద కారకంగా పరిగణింపబడుతుంది.7,8 

1.4 కంటి వ్యాధులు ఇన్ఫెక్షన్ వలన గానీ, జన్యు పరమైన లోపాలు, లేదా పుట్టుక తోనే వచ్చే లోపాలు, పుట్టినప్పటినుండి నిర్లక్ష్యం లేదా ప్రమాదం లేదా తప్పుగా వాడడం లేదా దుర్వినియోగం చేయడం వల్ల కంటి సమస్యలు తలెత్తుతాయి.

2. కంటి ఇన్ఫెక్షన్లు

2.1 హానికరమైన సూక్ష్మజీవులు (బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, లేదా వైరస్లు) లేదా విదేశీ కణాలు కంటిలోని ఏదైనా భాగాన్ని లేదా దాని కణజాలమును ఆక్రమించినపుడు అంటు వ్యాధులు సంభవిస్తాయి.9-13 

2.2 అంటు వ్యాధులు: సర్వసాధారణముగా వచ్చే అంటు వ్యాధి  కండ్లకల లేదా  పింక్ ఐ. ఇది సాధారణంగా వైరస్ లేదా బ్యాక్టీరియా వలన రావచ్చు.  అకస్మాత్తుగా కనిపించే సాధారణ లక్షణాలు ఎరుపుదనము, దురద, కాంతికి సున్నితత్వము, మంటగా ఉండటం, కళ్ళలో ఇసుక, గింజలు, లేదా దుమ్ము పడ్డట్టు చికాకు కలిగించే భావన. కనుల వెంట నీరు కారడం, కనురెప్పల వాపు (కొన్నిసార్లు బాధాకరమైనవిగా కూడా ఉంటాయి) మరియు అస్పష్టమైన దృష్టి ఉంటాయి.  ట్రకోమా అనేది ఇంకొక అత్యంత వేగంగా వ్యాప్తి చెందగల అంటువ్యాధి  కానీ ఇది కొన్ని ప్రదేశాల్లో మాత్రమే చెదురుమదురుగా ఉంటుంది 9-12 .

2.3 అంటువ్యాధులు కాని ఇన్ఫెక్షన్లు : పుప్పొడి వంటి ఎలర్జీ కారకాలు, ఏదైనా రసాయన పదార్ధము చింది పడడం వలన, విషపూరిత పదార్ధము యొక్క ఆవిరి, ఏదైనా మంటను రేకెత్తించే పదార్ధము, లేదా కాంటాక్ట్ లెన్స్ ను ఎక్కువ కాలం వాడడం వంటివి. అలెర్జీ సంబంధిత కండ్లకలక విషయంలో మంట, దురద. కోసుకుపోయినట్లు బాధ అధికంగా ఉండవచ్చు. దీంతోపాటు తుమ్ములు మరియు నాసికా ఉత్సర్గము (ముక్కు నుంచి ద్రవం కారడం) ఎక్కువగా ఉంటుంది. శిలీంద్రాల ద్వారా వచ్చే (ఫంగల్) ఇన్ఫెక్షన్ చాలా అరుదు. ఇతర సాధారణముగా వచ్చే ఇన్ఫెక్షన్లు కెరటైటిస్ (బ్యాక్టీరియా, వైరస్, లేదా నీటిలో ఉన్న పరాన్నజీవుల కారణంగా ఏర్పడే కార్నియా యొక్క వాపు), యువేటిస్ (హెర్పెస్ వంటి వైరస్ కారణంగా వస్తుంది కానీ ఇతర స్వయం ప్రతి రక్షక (ఆటో ఇమ్యూన్) వ్యాధులైన రుమటాయిడ్ ఆర్థ్రైటీస్, ల్యుపస్ వంటి చర్మ వ్యాధులతో కూడి ఉంటుంది. కనురెప్పలకు ఇన్ఫెక్షన్, కంటి కురుపు (మొటిమ వలనే బాధకారమైన ఉబ్బు) మరియు చలాజియాన్ (ఉత్సర్గములు అధికం కావడంచేత ఏర్పడేది సాధారణంగా బాధ రహితమైనది) మరియు బ్యాక్టీరియా, వైరస్, శిలీంద్రాల ఇన్ఫెక్షన్ కారణంగా ఏర్పడే కార్నియల్ అల్సర్.9,10,13 

3. కంటి సమస్యలు /లోపాలు

3.1  సాధారణ వక్రీభవన లోపాలు: మయోపియా-సాధారణంగా బాల్యము నుండి మొదలయ్యే ఈ రుగ్మత వలన సుదూర వస్తువులను చూడలేక పోవడం, హైపర్ మెట్రో పియా- చిన్న కంటి గ్రుడ్డు కారణంగా సమీపంలోని వస్తువులను చూడలేకపోవడం, ఆస్టిగ్మాటిజం- సక్రమమైన వక్రత లేని కార్నియా కారణంగా దగ్గర మరియు దూరపు వస్తువులు చెదిరి పోయినట్లుగా కనిపించడం, ప్రెస్బైయోపియా -  40 సంవత్సరాల వయసు తరువాత వస్తువులను చూడడంలో కష్టముగా ఉండడం, లేదా చేతి పొడవులోఉన్న అక్షరాలను చదవలేక పోవడం.4,15 

3.2 కంటిశుక్లం అనేది కంటి కటకం (లెన్స్) తక్కువ అనువైనదిగా, తక్కువ పారదర్శకంగా, మరియు వయసుతో మరింత దట్టంగా  మేఘం వంటిది కమ్ముకున్నట్లుగా ఒకటి లేదా రెండు కళ్ళకూ ఏర్పడి దృష్టి తగ్గుతుంది. దీని లక్షణాలు దృష్టి క్షీణించడం, రంగులు  అస్పష్టంగా లేదా పసుపు రంగులో కనబడడం, దృష్టి అస్పష్టంగా ఉండడం లేదా ద్వంద దృష్టి, కళ్ళజోడులో తరచూ మార్పులు, కాంతి చుట్టూ ప్రకాశవంతమైన వలయాలు కనబడడం, ప్రకాశవంతమైన కాంతి చూడడంలో అసౌకర్యం, మరియు చదవడంలో, డ్రైవింగ్ చేయడంలో, లేదా రాత్రి పూట స్పష్టంగా చూడడం ఇబ్బంది వంటివి కలుగుతాయి. వయసుతో పాటు, పోషక లోపం, జన్యుపరమైన లోపాలు, డయాబెటిస్ లేదా గతములో నిర్వహించిన కంటి శస్త్ర చికిత్స వంటి కొన్ని వంటి వైద్యపరమైన పరిస్థితులు, రేడియేషనుకు గురి కావడం, దీర్ఘకాలిక స్టెరాయిడ్ల వినియోగం, గాయం లేదా వ్యసనాలు వంటివి కూడా కారణం కావచ్చు. 16

3.3 గ్లూకోమా అనేది కాంతి యొక్క సున్నితత్వం లేదా దానికి తక్కువ రక్త సరఫరా కారణంగా కంటిలో ఉండే దృష్టి నాడుల క్షీణత, మరియు దెబ్బతిన్న పరిస్థితి. కార్నియా మరియు కటకము మధ్య ఉండే సజల ద్రవము అధిక ఉత్పత్తి  లేదా అడ్డుపడడం కారణంగా ప్రవాహ నిలుపుదల వల్ల కంటిపై ఒత్తిడి పెరగడం చాలా తరచుగా జరుగుతూ ఉంటుంది. కంటికి నష్టం ఎటువంటి హెచ్చరిక లేకుండా క్రమంగా ఉంటుంది. అత్యంత సాధారణ లక్షణం రెండు కళ్ళల్లోనూ తరచుగా దృష్టిని మందగింప చేసే మచ్చలు ఏర్పడి తరువాతి దశలలో సొరంగం దృష్టి ఏర్పడడం. కొన్ని సందర్భాల్లో గుర్తించదగిన లేదా అస్పష్టమైన దృష్టి, ప్రకాశవంతమైన లైట్లు చుట్టూ ఇంద్రధనస్సు రంగు వృత్తాలు కనిపించడం, తల నొప్పితో కూడిన తీవ్రమైన నొప్పి, ఎర్రటి కన్ను, వికారం లేదా వాంతి, మరియు ఆకస్మిక దృష్టి నష్టం ఏర్పడతాయి. చికిత్స లేదా శస్త్రచికిత్సతో నష్టం తిరిగి పొందడం కష్టం కాబట్టి 60 సంవత్సరాల వయసు దాటిన పెద్ద వారిలో అంధత్వానికి ఇది ప్రధాన కారణాల్లో ఒకటి..17,18

3.4 రెటీనా రుగ్మతలు: ప్రధాన రెటీనా సమస్యలు మాక్యులర్ క్షీణత మరియు రెటీనా అనుసంధానం కోల్పోవడం. వీటి లక్షణాలు అనేక కొత్త ప్లోటర్లు (దారం వంటి నల్లమచ్చలు లేదా మరకలు ) ఏర్పడడం, దృశ్య క్షేత్రం యొక్క అంచు వద్ద ఆకస్మిక మరియు వేగవంతమైన మెరుస్తున్న కాంతి కనబడడం, వక్రీకృత దృష్టి మరియు కొన్నిసార్లు బూడిదరంగు తెర వంటిది దృష్టిని అడ్డుకుంటుంది. రెటీనా అనుసంధాన లోపం అనేది ఏదైనా గాయం ఏర్పడినందువల్ల తప్ప మిగతా విషయాలలో నొప్పి లేకుండా ఉంటుంది, మరియు కొన్ని గంటలు లేదా రోజుల్లో ఆకస్మికంగా సంభవిస్తుంది. అస్థిరంగా ఉండేవారికి, లేదా అధిక చక్కెర స్థాయి ఉన్న వారికి డయాబెటిక్ రెటినోపతి వచ్చే ప్రమాదం ఉంది.19,20

3.5 ఇతర కంటి రుగ్మతలు: కొన్ని అరుదైన లేదా జన్యుపరమైన లోపాలు రాత్రి అంధత్వం మరియు సాధారణ ఎరుపు-ఆకుపచ్చ లేదా కొన్నిసార్లు నీలం పసుపు రంగులను గుర్తించి వేరు చేయలేనప్పుడు ఏర్పడేది రంగు అంధత్వం.19,21

మెల్ల కన్నుఅనేది ఒక కంటి లోపం. ఇక్కడ కళ్ళు దేనినైతే చూస్తాయో సరిగ్గా దానిపైనే సమలేఖనం చేయబడవు, మరియు వేర్వేరు ప్రదేశాలపై లగ్నం ఔతాయి, ఒకే సమయంలో ఒకే స్థలాన్ని చూడలేవు. ఈ లోపానికి ఖచ్చితమైన కారణం తెలియదు. ప్రభావితమైన కంటి నుండి మెదడు సంకేతాలు గ్రహించడంలో లోపం కారణంగా ఇది సోమరితనపు కంటికిలేదా లేజి ఐ కి దారి తీయవచ్చు.22

పొడి కళ్ళు మన కన్నీళ్లు కళ్ళను తగినంత ఆర్ద్రతగా ఉంచలేనప్పుడు మరియు వయస్సుతో పాటు ఈ సమస్య తీవ్రమవుతున్న సందర్భంలో ఈ రుగ్మత  సంభవిస్తుంది. ఇది ఆటో ఇమ్యూన్ వ్యాధి వలన లేదా యాంటీ హిస్టామిన్ వంటి ఔషధము మరియు పొగ లేదా గాలికి గురికావడం వల్ల కూడా ఏర్పడవచ్చు. దీని లక్షణాలు గుచ్చుతున్నట్లు, లేదా మంట కంటిలో నిరంతర అసౌకర్యం లేదా నిరంతరంగా కన్నీళ్లు రావడం.23

నీరు కారే కళ్ళు నొప్పితో కూడి ధారగా నీటి చుక్కలు కారడం, దృష్టి లో మార్పు, లేదా కంటిలో ఏదో అడ్డు ఉండి అది బయటకు రాని భావన.24

మరికొన్ని సమస్యలు కనురెప్పలు వాలిపోవడం, కనులు ఉబ్బడం, విశ్రాంతి లోపం కారణంగా  కళ్ళచుట్టూ చీకటి వలయాలు, పోషకాహార లోపం, మరియు జీవనశైలి లోపం కారణంగా వస్తాయి.25,26

3.6 డిజిటల్ కంటి వత్తిడి – ఉత్పన్నమవుతున్న ప్రజారోగ్య సమస్య90% కంటే ఎక్కువ డిజిటల్ పరికర వినియోగదారులు కంటి ఒత్తిడిని అనుభవిస్తారు. అతి  సాధారణ లక్షణాలు నీరు కారడం, కంటి అలసట, పొడికళ్లు, అస్పష్టమైన దృష్టి, మండుతున్న భావన, ఎరుపుదనం, మరియు ద్వంద్వ దృష్టి. దృష్టికి సంబంధం లేని సాధారణ లక్షణాలు మెడబిగుసుకు పోవడం, సాధారణ అలసట, తలనొప్పి మరియు వెన్నునొప్పి. కనురెప్పలు వాల్చే సంఖ్య నిమిషానికి 10-16 ఐన సాధారణ స్థాయి తో పోలిస్తే నిమిషానికి 5-9 స్థాయికి తగ్గుతుంది.27-29

4. గాయాల నుండి మీ కళ్ళను సంరక్షించండి

4.1 కంటి గాయాలు: గాయాలు అయ్యేందుకు అవకాశం ఉన్న అంశాలు : కంటి పై గీతలు ; దైనా పరికరం ద్వారా లేదా పెంపుడు జంతువు ద్వారా కంటి పై గీతలు, రాపిడి, కంటి లోకి వెళ్ళే విదేశీ కారకములు, రసాయన ఆమ్లాలు, లేదా క్షారాలు కారణంగా ఏర్పడే గాయాలు, లేదా ఆవిరి, పొగల లేదా రేడియేషనుకు  ప్రత్యక్షంగా గురి కావడం, కంటికి దెబ్బ తగలడం వలన, లేదా కోసుకోవడం వలన ఏర్పడే బ్లాక్ ఐ, లేదా వాపు కలుగుతూ ఉంటాయి. సాధారణ చిహ్నాలు కంటిలో లేదా కంటి వెనుక నొప్పి, కనురెప్పల అధిక స్పందన, కంటి నుండి నిరంతరం నీరు కారడం, దృష్టి లోపం లేదా తగ్గుదల, లేదా దృష్టి కోల్పోవడం, కంటిలో రక్తం లేదా కంటిచుట్టూ రక్తస్రావ చిహ్నాలు.30

4.2  ప్రథమ చికిత్స మరియు వైద్య సంరక్షణసమస్య తీవ్రత మేరకు వెంటనే ఒక అత్యవసర కంటి ఆసుపత్రిని సందర్శించండి. కానీ దీనికి ముందు ప్రథమ చికిత్సకు సంబంధించిన క్రింది సాధారణ దశలు సహాయపడతాయి.31-33

·       కను రెప్పలు మూసి తెరవడం ద్వారా చిన్న దుమ్ము లేదా ఇసుకరేణువులను వదిలించుకోవచ్చు.

·       కనురెప్పలు మెల్లిగా తెరిచి ఏదైనా నలకలు వంటి వాటిని బయటకు తీయడానికి కళ్ళను శుభ్రమైన నీటితో కడిగి వేయండి లేదా ధారగా నీరు పోయండి. కంటి పై రెప్పను క్రింది రెప్పతో తాకించడం ద్వారా ధూళి కణాలు మెల్లగా బయటకు తొలగింపబడతాయి.

·       కంటిలో ఏవైనా రసాయనాలు పడినప్పుడు వెంటనే కాంటాక్ట్ లెన్స్ తొలగించండి. ప్రభావితమైన కంటి వైపు తలను వాల్చడం ద్వారా కళ్ళను కడిగే టప్పుడు లేదా నీటితో తడిపేటప్పుడు రసాయనాల నీరు మరొక కంటి లోనికి లేదా ముఖము పైన మరొక ప్రక్కకి పోకుండా ఉంటుంది. పదిహేను ఇరవై నిమిషాలు కంటిని శుభ్రపరిచిన తరువాత రోగిని ఆస్పత్రికి తీసుకువెళ్ళేటప్పుడు శుభ్రమైన గుడ్డను కంటిపైన ఉంచండి.

·       కంటి వద్ద తెగినా గాయం ఐనా కన్నం పడినా కంటిపై నీరు పోయవద్దు. దానికి బదులు శుభ్రమైన మృదువైన గుడ్డతో లేదా బ్యాండేజీ క్లాత్ తో నొక్కకుండా మృదువుగా రక్షణగా కంటిపై ఉంచండి.

·       కంటిపై ఏదైనా గుద్దుకున్నప్పుడు నొప్పి మరియు వాపును నిరోధించడానికి చల్లగా ఉండే మృదువైన గుడ్డతో కంటిని ఒత్తిడి లేకుండా మూసి ఉంచాలి.

4.3  గాయం తర్వాత చేయకూడనివి: తలను కదల్చకుండా నివారించండి. కనుగ్రుడ్లు తిప్పకూడదు, కంటిని వేలు లేదా పత్తితో శుభ్రపరచుకొనడం కోసం వాటిని రుద్దకూడదు. సొంత వైద్యం చేసుకోకూడదు.31-33

5. ఆరోగ్యకరమైన కళ్ళకు నివారణ చర్యలు

5.1 తరచుగా చేతులు కడుక్కోవడం, కళ్ళను రుద్దకుండా చూసుకోవడం, మరియు పరిశుభ్రమైన తువ్వాళ్ళు వాడడం వంటి మంచి ఆరోగ్య పద్ధతులు ఇన్ఫెక్షన్లు రాకుండా నివారించడంలో సహాయపడతాయి. 10-13 

5.2 మీ కళ్ళను బలోపేతం చేయండికళ్లకు విశ్రాంతి ఇవ్వడానికి మరియు విశ్రాంతి పెంచడానికి కొన్ని మార్గాలు 26,34-40

·        అరచేతులతో  మూసివేసిన కళ్లపై సున్నితంగా ఉంచుతూ, కాంతి లేకుండా నిరోధించి, హాయిగా కూర్చుని శ్వాస క్రియ పై దృష్టి కేంద్రీకరించండి. ఇలా  ఐదు నుండి పది నిమిషాలు చొప్పున రోజుకు రెండుసార్లు లేదా ఒకటి లేదా రెండు నిమిషాలు చొప్పున రోజులో అనేక సార్లు కళ్ళు మూసుకొని విశ్రాంతి తీసుకోండి..34,36-38   

·       చూపుడు వ్రేళ్లతో కళ్ళను తేలికగా నొక్కుతూ కొన్ని సెకన్ల పాటు ఉంచి నెమ్మదిగా కళ్ళు తెరవండి.  కొన్ని సెకన్ల పాటు కనురెప్పలు వేయడం, తెరవడం ఇలా  రోజుకు 5 సార్లు ఇలా పునరావృతం చేయండి.  వేళ్ళతో కనుబొమ్మలకు తేలికపాటి మసాజ్ కూడా సహాయపడుతుంది..36-38

·        సూర్యరశ్మిసోకే ప్రదేశంలో  ఉదయాన్నే లేదా సాయంత్రం ఐదు నుండి పది నిమిషాలు ఎండ తక్కువగా ఉండి వేడిమి లేనప్పుడు సూర్యరశ్మి తెరిచిన కనులకు సోకే విధంగా నిలబడండి.34,36,37

·       కంటి కదలికలు పైకి కిందికి మరియు కుడి మరియు ఎడమ తర్వాత కంటి గ్రుడ్డు భ్రమణం సమీప మరియు దూరాల మధ్య దృష్టిని మార్చడం ద్వారా ఫోకస్ చేయడం, అప్పుడప్పుడూ సాధారణమైన రెప్పల కదలికలు, మరియు  ఖాళీ గోడ వైపు చూస్తూ నెమ్మదిగా రెప్పలు వాల్చి తెరవడం,-36-39 .

·       నిద్రించడానికి ముందు కూరగాయలు లేదా బాదం నూనెతో కంటి క్రింద నల్ల చారికలపై మసాజ్ చేయడం.26

·       కంటి వ్యాయామాల తర్వాత అలసినట్లు అనిపించినప్పుడు దోసకాయ లేదా ముడి బంగాళదుంప ముక్కలు లేదా వడకట్టగా మిగిలిన టీపొడి సంచులతో చల్లగా మెల్లగా కళ్లను వత్తాలి. ఉదయాన్నే లేవగానే నోటి నిండా నీరు పుక్కిలించడం,  కనురెప్పల మీద చల్లటి నీటిని చిలకరించడం, రక్తప్రసరణను మెరుగు పరుస్తుంది .40  

·       ఈత, నడక. యోగాసనాలు, మరియు గురువుల మార్గదర్శకత్వంలో మెడ మరియు భుజాల వ్యాయామాలు రక్త ప్రసరణను మెరుగు పరుస్తాయి. మరియు కళ్ళకు శక్తి నిస్తాయి.  

5.3  కంటికి అనుకూలమైన ఆహారం: ఎ, సి, డి, మరియు ఈ విటమిన్లు  ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మరియు జింక్ ఖనిజ లవణమును కలిగి ఉన్న సమతుల్య ఆహారం కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది. తాజా పండ్లు, కూరగాయలు ముఖ్యంగా ఆకుకూరలు, కాయలు మరియు విత్తనాలలో ఇవి పుష్కలంగా లభిస్తాయి.35,41-43

6.  కంటి సంరక్షణ కోసం చిట్కాలుమన దృష్టిని మెరుగుపర్చడానికి ఎప్పుడూ ఆలస్యం చేయకూడదు

చురుకైన జీవనశైలి, తగినంత విశ్రాంతి, సమతుల్య ఆహారం, తగినంత నీరు తీసుకోవడం. నిటారుగా కూర్చోవడం ముఖ్యంగా డిజిటల్ గాడ్జెట్లను ఉపయోగిస్తున్నప్పుడు, సాధారణ వ్యాయామం, వ్యక్తిగత పరిశుభ్రత. స్వచ్ఛమైన గాలి, వీటన్నింటి కన్నా కూడా శరీరం మరియు మనస్సు యొక్క విశ్రాంత స్థితి కంటి సమస్యలను నివారించడానికి ఉపయోగపడతాయి.17,34-40,44-45

·  కొన్ని సంవత్సరాల వరకూ సమగ్రమైన కంటి పరీక్షలు చేయించుకుంటూ ఉండండి. పిల్లలకు ఆరు నెలల వయసులోనూ, మూడు సంవత్సరాల వయసులో ఆ తరువాత 6 నుండి 17సంవత్సరాల మధ్య ప్రతీ సంవత్సరం కంటి పరీక్షలు చేయించుకోవాలి. పెద్దల విషయంలో 40 సంవత్సరాల లోపు వారికి ప్రతీ 5 నుండి 10  సంవత్సరాలకు, ఆ తరువాత 54 ఏళ్ళు వచ్చే వరకూ ప్రతీ 2-4 సంవత్సరాలకు ఒకసారి ఆపై వయసు పెరిగే కొద్దీ చాలా తరుచుగా పరీక్షలు చేయించు కోవాలి.  ప్రారంభ రోగ నిర్ధారణ మాత్రమే అంధత్వాని నిరోధించగలదు.17,44,45

·  మీ కుటుంబ చరిత్ర మరియు రానున్న ఇబ్బందులు గురించి తెలుసుకోండి. అవసరమైన చోట రక్షక అద్దాలు ధరించండి. దృశ్యమాన మార్పులపై వెంటనే శ్రద్ధ వహించి వెంటనే కంటి వైద్యుడిని సంప్రదించండి. హ్రస్వదృష్టి, డయాబెటిస్, గుండె సమస్యలు ఉన్నవారు, లేదా స్ట్రోక్ కు గురి అయివారు, మరియు కాంటాక్ట్ లెన్స్ వాడేవారు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి.17,44 

·  డిజిటల్ కంటి ఒత్తిడి నివారించడానికి 20-20-20 నియమాన్ని పాటించండి.ప్రతీ 20 నిమిషాలకు విరామం తీసుకోండి మరియు 20 అడుగుల దూరంలో ఉన్న ఏదో ఒక వస్తువును 20 సెకన్ల పాటు చూడండి. మీకు గుర్తు చేయడానికి కంటి సంరక్షణ అనువర్తనాలను డౌన్లోడ్ చేసుకోండి. అంతేకాక డిజిటల్ పరికరాలు ఉపయోగిస్తున్నప్పుడు కంటికి హాని కలిగించే విధంగా కాంతి లేకుండా డిస్ప్లే సెట్టింగులలోకి వెళ్ళి సర్దుబాటు చేసుకోండి.46-48

ప్రస్తావనలు, వెబ్సైట్ లింకులు:

       1.      Sathya Sai Baba, Divine Discourse on “I and You are One”, Guru Purnima day, 5 July 2001, SSS volume 34, chapter 13, page 182 http://www.sssbpt.info/ssspeaks/volume34/sss34-13.pdf

2.      https://www.merckmanuals.com/home/eye-disorders/biology-of-the-eyes/structure-and-function-of-the-eyes

3.      Structure of eye : https://byjus.com/biology/structure-of-eye/

4.      https://kidshealth.org/en/kids/eyes.html

5.      20/20 vision: https://www.allaboutvision.com/en-in/eye-exam/2020-vision/

6.      20/10 vision: https://www.nvisioncenters.com/lasik/20-10-vision/

7.      Normal eye pressure: https://www.brightfocus.org/glaucoma/question/what-considered-normal-eye-pressure

8.      Study on intraocular pressure: https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC5957383/

9.      Eye infections: https://www.allaboutvision.com/en-in/conditions/eye-infections/

10.  Conjunctivitis & Prevention: https://www.mayoclinic.org/diseases-conditions/pink-eye/symptoms-causes/syc-20376355

11.  Pink eye & prevention: https://www.allaboutvision.com/en-in/conditions/conjunctivitis/

12.  Trachoma: https://www.who.int/news-room/fact-sheets/detail/trachoma

13.  All eye infections & Prevention: https://www.healthline.com/health/infected-eye;  https://www.healthline.com/health/eye-health/home-remedies-for-eye-infection#overview

14.  Refractive errors: https://www.nei.nih.gov/learn-about-eye-health/eye-conditions-and-diseases/refractive-errors

15.  https://www.who.int/news-room/q-a-detail/what-is-a-refractive-error

16.  Cataract: https://www.mayoclinic.org/diseases-conditions/cataracts/symptoms-causes/syc-20353790

17.  Glaucoma: https://www.mayoclinic.org/diseases-conditions/glaucoma/symptoms-causes/syc-20372839

18.  https://www.glaucoma.org/gleams/what-are-the-symptoms-of-glaucoma.php

19.  Retinal disorders: https://www.ccteyes.com/retina-problems-warning-signs-you-may-have-a-retinal-disease/

20.  Floaters: https://www.brightfocus.org/macular/article/what-causes-eye-floaters

21.  Colour blindness: https://www.aoa.org/patients-and-public/eye-and-vision-problems/glossary-of-eye-and-vision-conditions/color-deficiency

22.  Squint & lazy eye: https://www.medicalnewstoday.com/articles/220429

23.  Dry eye: https://www.aoa.org/patients-and-public/eye-and-vision-problems/glossary-of-eye-and-vision-conditions/dry-eye

24.  Watering eyes: https://www.health.com/condition/eye-health/watery-eyes?slide=6f6f7ac5-f902-4822-ab25-fce2aad58c5a#6f6f7ac5-f902-4822-ab25-fce2aad58c5a

25.  Twitching: https://www.allaboutvision.com/en-in/conditions/eye-twitching/

26.  Dark circles: https://www.healthline.com/health/how-to-get-rid-of-dark-circles-permanently#remedieshttps://www.mapsofindia.com/my-india/health/30-best-home-remedies-to-remove-dark-circles-naturally-and-permanently

27.  Coles-Brennan, C., Sulley, A., & Young, G. (2019), Management of digital eye strain, Clinical and Experimental Optometry, 102, 18-29.

28.  Muniraju, N. M.,  Amarnath, H. K., &  Ashwini, M. J.  (2018), A review on effects of electronic Gadgets on eye, Journal of Ayurveda Physicians & Surgeons, 5(1). 

29.  Digital eye strain: https://medpharm.co.za/eye-strain-the-new-affliction-of-the-digital-generation/

30.  Eye injuries: https://www.allaboutvision.com/en-in/conditions/eye-injuries/

31.  First aid tips: https://www.aao.org/eye-health/tips-prevention/injuries

32.  First aid tips: https://www.stjohn.org.nz/first-aid/first-aid-library/eye-injuries/

33.  Washing chemical in eye: https://www.mayoclinic.org/first-aid/first-aid-eye-emergency/basics/art-20056647

34.  Guide to eye exercises & Bates method: https://seeing.org/techniques/

35.  https://www.bateseyeexercises.com/basicInformation.php

36.  Eye exercises for perfect eyesight: https://eyecare.sriaurobindoashram.org/resources/School_For_Perfect_Eyesight.pdf

37.  Dr Agarwal eye care exercises: https://www.slideshare.net/elsavonlicy/agarwal-the-complete-book-of-eye-care

38.  Rejuvenating eye exercises: https://www.lenspure.com/articles/eye-exercises-alleviate-eye-strain

39.  Prevent eye strain:  https://www.healthline.com/health/eye-health/eye-exercises

40.  Splash eyes along with mouthful water: https://www.youtube.com/watch?v=gs-x4tNIGbw

41.  Nutritive diet for eyes: https://www.aoa.org/patients-and-public/caring-for-your-vision/diet-and-nutrition

42.  Eye friendly diet: https://www.allaboutvision.com/nutrition/nutrition_summary.htmhttps://www.allaboutvision.com/en-in/conditions/cataracts/

43.  Importance of Zinc for vision: https://www.aoa.org/patients-and-public/caring-for-your-vision/diet-and-nutrition/zinc

44.  Protect eyes: https://www.allaboutvision.com/en-in/vision-by-age/ways-to-protect/

45.  Prevent blindness & care for infants: https://www.healthline.com/health/blindness

46.  Prevent digital eye strain: Follow 20-20-20 rule says a study; https://www.medicalnewstoday.com/articles/321536

47.  How to prevent eye strain from gadgets: https://gadgets.ndtv.com/laptops/features/how-to-prevent-eye-strain-when-using-a-computer-575879

48.  Prevent digital eye strain: https://www.mayoclinic.org/diseases-conditions/eyestrain/diagnosis-treatment/drc-20372403

 

2. కోవిడ్-19  వృత్తాంతాలు

#1. ప్రాక్టిషనర్ 00512…స్లొవేనియా   యొక్క ఉత్తేజకరమైన అనుభవం  

 నేను స్లోవేనియాలో ని రిటైర్మెంట్ హోమ్ లో పనిచేస్తూ కోవిడ్-19 రెమిడీ తీసుకుంటున్న నర్సును. మార్చి 27న మొదటి కేసు హోమ్ లో కనిపించి వెంటనే విస్తరిస్తూ 53 మందికి నిర్వాసితులకు సోకింది, వీరిలో 30 మంది కొన్ని వారాలలోనే మరణించారు. ఆ తరువాత నాతో పని చేయడానికి నర్సింగ్ సిబ్బంది ఎవ్వరూ లేరు. రిటైర్మెంట్ హోమ్ మొత్తం నిర్మానుష్యం అయిపోతోంది. ఐదు స్లొవేనియా ఆరోగ్య కేంద్రాలు మరియు మూడు ఆసుపత్రులు మా రక్షణకు వచ్చాయి. రెండు పట్టణాల నుండి వైద్య మరియు నర్సింగ్ విద్యార్థులు కూడా మా సహాయం కోసం వచ్చారు. దురదృష్టవశాత్తు వారిలో కొందరు వైరస్ బారిన పడ్డారు. నేను తీసుకుంటున్న ఇమ్యూనిటీ బూస్టర్ ను నా సహచరులు అందరికీ అందించడానికి ప్రయత్నించాను. కొందరు అంగీకరించి వాడి త్వరగా వైరస్ నుండి బయటపడ్డారు. ఇక్కడ పనిచేస్తున్న అధికార యంత్రాంగం హోమ్ లో పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నప్పటికీ ఇమ్యూనిటీ బూస్టర్ ను వాడటానికి తిరస్కరించారు. కోవిడ్ కేంద్రంలో ఉన్న నా ప్రమాదకర పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని నా కుమార్తెలు, భాగస్వామి మరియు ప్రియమైన వారికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుని సమీపంలోని హోటల్ లో బస చేయసాగాను. ఇది ఎంత కష్టమైనది అంటే నేను దాదాపు ఎనిమిది వారాల పాటు నా కుటుంబాన్ని ఫోన్ లో మాత్రమే చూశాను. ఇక్కడ నివాసితులను సందర్శించడానికి నేను వైద్యుల తో కలిసి పని చేయాల్సి వచ్చింది. సాయంత్రంవేళ నా హోటల్ నుండి నేను ఇన్కమింగ్ వైద్య సిబ్బందిని ఫోన్, టెక్స్ట్ మరియు వీడియో కాల్స్ ద్వారా పర్యవేక్షించాలని మార్గనిర్దేశం చేశారు. వీరికి ఆహారం, వసతి,  వంటి వారి అవసరములను నేను పర్యవేక్షించవలసి వచ్చింది. ఇది కష్టంగానూ, ఒత్తిడితో కూడి త్వరగా అలిసటకు గురిచేస్తూ షెడ్యూల్ మొత్తం ఒక కఠిన శిక్ష వలె ఉంది.

మొత్తం మీద ఈ దుర్భరమైన మరువరాని అనుభవం శాంతింపబడి నేను రక్షింపబడ్డాను. ఐతే నన్ను రక్షించిన నా ఆరోగ్యానికి సహకరించిన ఘనత ఇమ్యూనిటీ బూస్టర్ కే  దక్కుతుంది. నేను ఇది వ్రాస్తున్నప్పుడు ఏమేమి జరిగిందో నేను ఏ సమయంలో సహాయం కోసం ఫోన్ చేసినా ప్రాక్టీషనర్ గా మీరు  చేసిన సహాయానికి నేను కృతజ్ఞురాలిని. మీరు నాకు చేసిన ప్రతీ సహాయానికి థాంక్యూ అనే పదం సరిపోదు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను.

#2.  వృద్ధ అమెరికన్ భక్తుడు నుండి ఈమెయిల్ స్పందన : కోవిడ్-19  కోసం ఇమ్యూనిటీ బూస్టర్ మొదటి మోతాదు తీసుకున్న తర్వాత దాని అద్భుతమైన ప్రభావముతో నేను ఆశ్చర్యపోయాను. గత ఐదేళ్లలో అనారోగ్యము తుంటి భాగము, లేదా గాయం తాలూకు అవస్థ తో బాధపడుతూ నా శరీరం లోని అన్ని ప్రాంతాల్లో వరుస అనుభూతులను స్థానాల వారీగా నేను గుర్తించాను. మూత్రాశయం, చిన్నప్రేవులు మరియు తలకు గాయం ఐన కేంద్రము ప్రధానమైనవి. ఈ భాగాలలో రెమిడీ  ప్రతి ఒక్క ప్రాంతంలోనూ విడివిడిగా చాలా నిమిషాలు పనిచేస్తూ స్వస్థత చేకూరుస్తున్న అనుభూతిని నేను స్పష్టంగా పొందాను. అన్నింటికన్నా ఆశ్చర్య పరిచిన విషయం నా మనసు పై దాని ప్రభావం. నేను రెండు శక్తివంతమైన మరియు హృదయపూర్వక భావోద్వేగముల విడుదలను అనుభవించాను. బాధాకరమైన అనుభవం యొక్క ప్రభావం ఆశాజనకంగా త్రుంచివేసుకోగలిగాను.   నిజమైన వైద్యం గురించి సమయం మాత్రమే తెలియజేస్తుంది. కానీ ఈ కాంబో నా ఆరోగ్య సమస్యలను గుర్తించి నయం చేసిన గూఢచారి అని నిరూపించబడింది.

 

3. వర్చ్యువల్ పునశ్చరణ సదస్సు 2020 మే 8-12 - ఢిల్లీ NCR వైబ్రియానిక్స్ టీం చొరవతో సాకారం

40 మంది ప్రాక్టీషనర్లు పాల్గొన్న ఈ చక్కటి వ్యవస్థీకృత వర్క్ షాప్ భారీ విజయాన్ని సాధించింది. ఈ వర్క్ షాప్ యొక్క మొదటి రోజు వైబ్రియానిక్స్ కోర్సు మొత్తాన్ని ఒక ఆసక్తికరమైన క్విజ్ రూపంలో టీచర్ 11422 సమీక్షించారు. ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న ఈ రంగంలో తాజా పరిణామాలతో వినూత్నంగా ఉండడానికి  వార్తాలేఖలు అన్నింటిని చదవమని ప్రాక్టీషనర్లను కోరారు. రెండవ రోజు ఢిల్లీ-NCR  టీచర్ మరియు కోఆర్డినేటర్ 02859  నేతృత్వంలో విజయవంతమైన కేసు చరిత్రలు ప్రవేశపెట్టబడగా వైబ్రియానిక్స్ పట్ల ఒక విధమైన కృతజ్ఞత భావం సభ్యులందరిలో స్పష్టంగా కనబడింది. కేసుల నమోదు విషయంలో నిర్ణీత పద్దతి పాటించాలని, అవసరం మేరకు వ్యాధిగ్రస్తమైన శరీర భాగాన్ని ఫోటో తీయాలని, మోతాదు తగ్గింపు విధానాన్ని అనుసరించాలని నొక్కిచెప్పారు. మూడవ రోజు  ప్రాక్టీషనర్ 11964 నేతృత్వంలో సభ్యులంతా వైబ్రియానిక్స్ తమలో ఎలా పరివర్తన తెచ్చిందో తెలిపారు.

అంతేకాకుండా కేసు చరిత్ర రాయడానికి తుది సంస్కరణలకు అనుగుణంగా ప్రచురణ కోసం అందుకున్న కేసు చరిత్ర నమూనాను ఆమె ఒక వివరణాత్మకముగా అందించారు. డాక్టర్ అగర్వాల్ వైబ్రియానిక్స్ అభివృద్ధి పధంలో స్వామి ఏ విధంగా మార్గదర్శకత్వం వహించారో సభ్యులకు వివరించారు. రాబోయే రెండేళ్లలో పుట్టపర్తిలో రాబోయే రీసెర్చ్ ట్రైనింగ్ మరియు వెల్నెస్ సెంటర్ గురించి సంక్షిప్తంగా  చెప్పారు. వైబ్రియానిక్స్ కోర్స్ పుస్తకాలు, వార్తాలేఖలు,  మరియు కాన్ఫరెన్స్ పుస్తకం క్రమం తప్పకుండా చదవాలని ఆయన సభ్యులను కోరారు. ఈ వైద్య వ్యవస్థను అభ్యసించే వారిగా ఉత్తమమైన సేవను అందించ గలిగేలా ఉండేందుకు  స్వామిని ప్రార్ధించాలని ఆయన పునరుద్ఘాటించారు. స్వామి దయతో హాజరైన వారందరికీ ఈ సదస్సు ఒక గొప్ప అభ్యాస అనుభవంగా మారింది. సదస్సు కొనసాగుతూ ఉండగా వినయం, ప్రేమ మరియు సామాజిక బాధ్యత తో సేవ చేస్తూ ఎంతో మంది హృదయాలలో ఆనందం నింపిన ఉత్తమ వ్యవస్థలో భాగమైనందుకు విస్మయం వ్యక్తం చేసారు. తరువాత కొన్ని క్లిష్టమైన కేసుల గురించి చర్చించ బడింది. నాల్గవ రోజు సంస్థ యొక్క నిర్మాణము గురించి అది విస్తరిస్తున్న వైనం గురించి చర్చింప బడింది.

IASVP లో సభ్యత్వం తీసుకోవడము ఇప్పుడు తప్పనిసరి కనుక సభ్యులందరిని సభ్యత్వం తీసుకోవలసిందిగా వారిని ప్రోత్సహించారు. శ్రీమతి హేమ మరియు డాక్టర్ అగర్వాల్ ఇద్దరూ చివరిదైన ఐదవ రోజు పాల్గొన్నందుకు ఆనందం వ్యక్తం చేసారు.  శ్రీమతి హేమ కోవిడ్ పై ప్రశ్నలకు సమాధానం ఇస్తూ తమ వ్యక్తిగత అనుభవం నుండి ఉపయోగకరమైన చిట్కాలను అందించారు.