Vol 16 సంచిక 6
నవంబర్ / డిసెంబర్ 2025
ముద్రింప తగిన వార్తాలేఖ
పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి
డా. జిత్. కె అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి
ప్రియమైన ప్రాక్టిషనర్లకు,
భగవాన్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఈ పవిత్ర సంవత్సరంలో ముందుకు సాగుతున్న, మన హృదయాలు కృతజ్ఞతాభావంతో నిండిపోయాయి. భగవానునికి మనమందరం సమిష్టిగా సమర్పిస్తున్న శతజయంతి కానుకలో భాగంగా, తమ విలువైన అనుభవాలను, విజయవంతమైన చికిత్సా కేసులను, అలాగే సేవా శిబిరాల వివరాలను పంచుకున్న ప్రాక్టిషనర్లలందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మీ ప్రతి నిస్వార్థ సహకారం, స్వామివారు తమ వైబ్రియానిక్స్ సేవా ఉద్యమం కోసం ఆకాంక్షించిన ఐక్యతా భావాన్ని, అంకితభావాన్ని ప్రతిబింబిస్తోంది.
“మానవుడు సమాజము యొక్క సృష్టి. సమాజానికి చేసే సేవయే భగవంతునికి చేసే నిజమైన సేవ. అటువంటి సేవను కులం, మతం, జాతి లేదా దేశభేదాలను పరిగణనలోకి తీసుకోకుండా చేయాలి. అన్ని మతాల సారాంశం ఒక్కటే. అనేక విధాలుగా ఉపయోగపడే విద్యుత్ ప్రవాహం ఒక్కటే అయినట్లే, అన్ని మతాల సారాంశం కూడా ఒక్కటే. సమాజానికి సేవ చేస్తున్నప్పుడు సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ అనే నాలుగు ఆదర్శాలను ఎల్లప్పుడూ మనస్సులో ఉంచుకోవాలి.” … శ్రీ సత్యసాయి బాబా జనవరి 1985, చెన్నై, https://saispeaks.sathyasai.org/discourse/seva-highest-sadhana
మా మూడు సంపాదక బృందాలు ఇప్పటివరకు అందిన విస్తృత సమాచారాన్ని పరిశీలించి, ప్రచురణకు అనువుగా తీర్చిదిద్దేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాయి. ఇంకా మీ వద్ద విశేషమైన చికిత్సా కేసులు లేదా విలువైన అనుభవాలు పంచుకోవడానికి ఉంటే, వాటిని మాకు పంపవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఈ దశలో అందిన ప్రతి సమాచారాన్ని ఈ ప్రత్యేక సంచికలో పొందుపరచడం సాధ్యం కాకపోవచ్చు. అయినప్పటికీ, మీ అమూల్యమైన రచనలు, అనుభవాలు రాబోయే వార్తాపత్రికలు మరియు ఇతర ప్రచురణలలో తప్పక స్థానం పొందుతాయని మేము హామీ ఇస్తున్నాము.
ప్రస్తుతం రూపొందుతున్న ఈ మూడు పుస్తకాలతో మా కృతజ్ఞతలు తెలపడం ముగిసిపోదు; అది 2026 సంవత్సరమంతటా, ఆ తరువాత కూడా నిరంతరంగా కొనసాగుతుంది. మనమందరం కలిసి ఈ సమిష్టి శతజయంతి సమర్పణను మరింత ప్రభావవంతంగా తీర్చిదిద్దుదాం. ఆ దిశగా మనం సాధించడానికి లక్ష్యంగా పెట్టుకోదగిన కొన్ని స్ఫూర్తిదాయకమైన లక్ష్యాలు ఇవి:
• 100 మంది కొత్త రోగులకు వ్యక్తిగతంగా ప్రాక్టిషనర్ సేవలందించడం • 100 కొత్త సేవా శిబిర కేంద్రాలను ఏర్పాటు చేయడం
• 100 అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం • 100 కొత్త చికిత్సా కేసు వివరాలను నమోదు చేయడం
ప్రతి లక్ష్యాన్ని ముందుకు నడిపించడానికి ఒక అంకితభావం గల నాయకుడు అవసరం. ఈ మైలురాళ్లను విజయవంతంగా సాధించిన ప్రాక్టిషనర్లను లేదా ప్రాంతాలను మన వార్తాలేఖ ద్వారా గుర్తించి, సత్కరించడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. ఈ సమిష్టి లక్ష్యాల సాధనలో నూతన ఉత్సాహంతో కృషి చేయడానికి ఇది మనందరికీ స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షిస్తున్నాము!
మన ప్రాక్టిషనర్ల సంఖ్యను పెంపొందించి, భారతదేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం వైబ్రియానిక్స్ సేవలను విస్తరించేందుకు మా విద్యా విభాగం కూడా అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. ఈ లక్ష్య సాధనలో మరో ముందడుగుగా, ఈ మంగళకరమైన శతజయంతి సంవత్సరంలో స్వామివారికి వినమ్ర సమిష్టి సమర్పణగా “మీతో ఒకరిని తీసుకురండి (Bring Your Buddy)” అనే కార్యక్రమాన్ని ఆనందంతో ప్రారంభిస్తున్నాము. ప్రతి ప్రాక్టిషనర్ తన కుటుంబ సభ్యుల్లో ఒకరిని, స్నేహితుడిని, పొరుగువారిని లేదా రోగిని వైబ్రియానిక్స్ ప్రాక్టిషనర్గా తీర్చిదిద్దేందుకు ప్రేరేపించి, మానవసేవలో భాగస్వామి చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. అలాగే, గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాలలో మన సేవలను మరింత బలోపేతం చేయడానికి, పుట్టపర్తిలోనే కాకుండా, గణనీయమైన భాగస్వామ్యం ఉన్న ప్రాంతీయ కేంద్రాలలో కూడా స్థానిక భాషల్లో శిక్షణా శిబిరాలను నిర్వహించాలని ప్రణాళిక రూపొందిస్తున్నాము.
ఈ కార్యక్రమానికి అనుగుణంగా, ప్రాంతీయ భాషలలో ప్రావీణ్యం కలిగిన స్వచ్ఛంద సేవకులను భారతీయ భాషలలో వైబ్రియానిక్స్ కోర్స్ మెటీరియల్ని మరియు వార్తాలేఖలను అనువదించడంలో భాగస్వాములు కావలసిందిగా ఆహ్వానిస్తున్నాము. ఈ మహోన్నత సేవా కార్యక్రమానికి అవసరమైన సంపూర్ణ శిక్షణను మరియు సాంకేతిక సహాయాన్ని మా సమాచార సాంకేతిక (IT) బృందం అందిస్తుంది.
మన ప్రయాణం నిరంతరం విస్తరిస్తూ, అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, మన వార్తాలేఖను మరింత చైతన్యవంతంగా, అందరి భాగస్వామ్యంతో ముందుకు సాగే వేదికగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఉన్నాము. ఇప్పటివరకు ప్రతి సంచికలో ఇద్దరు ప్రాక్టిషనర్ల పరిచయాన్ని అందిస్తున్న "2వ విభాగాన్ని" మరింత విస్తరించాలని ఒక విలువైన సూచన అందింది. ఇకపై, వ్యక్తిగతంగా లేదా బృందాలుగా ప్రాక్టిషనర్లు అందిస్తున్న విశిష్టమైన సేవా కార్యక్రమాల స్ఫూర్తిదాయక విశేషాలతో పాటు, సాంప్రదాయ చికిత్సా కేసుల రూపంలో పొందుపరచలేని వైబ్రియానిక్స్‌కు సంబంధించిన ఆలోచనలు, సమగ్ర ఆరోగ్యం (Holistic Health) పై అభిప్రాయాలు, స్వస్థతకు సంబంధించిన అనుభవాలను కూడా ఈ విభాగంలో చేర్చాలని భావిస్తున్నాము. ఈ విభాగాన్ని మరింత స్ఫూర్తిదాయకంగా తీర్చిదిద్దేందుకు మీ అమూల్యమైన ఆలోచనలు, రచనలు, అనుభవాలను సాదరంగా ఆహ్వానిస్తున్నాము. స్వామివారి దివ్య సంకల్పంలో ఐక్యంగా, చేయి చేయి కలిపి ముందుకు సాగుతూ, అవసరంలో ఉన్న ప్రతి ఇంటికీ, ప్రతి హృదయానికీ వైబ్రియానిక్స్ వెలుగును ప్రసరింపజేద్దాం!
“ప్రేమస్వరూపులారా! శరీరం జన్మించిన రోజుకే ప్రాధాన్యం ఇచ్చి, ఆ సందర్భాన్ని ఆడంబరంగా జరుపుకుంటూ స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకోవద్దు. మీ హృదయాలలో నిర్మలమైన భావాలను వికసింపజేసి, మీ ఆలోచనలలో దైవతత్వంపై దృఢమైన విశ్వాసాన్ని స్థాపించి, ఇతరులకు సేవ చేయాలనే నిస్వార్థ ఉత్సాహాన్ని పెంపొందించుకున్న రోజే మీ నిజమైన జన్మదినంగా జరుపుకోవడానికి అర్హమైనది. సేవ ద్వారా భగవంతుని సర్వవ్యాపకత్వాన్ని అనుభవించగలరు... ఎక్కడ అవసరం ఉన్నా, ఎప్పుడు పిలుపు వచ్చినా, సేవ చేయాలనే అంతఃప్రేరణ మిమ్మల్ని అక్కడికి నడిపించి, ఎటువంటి సంశయం లేదా వెనుకంజ లేకుండా మీ సేవలను సమర్పించాలి.” … శ్రీ సత్యసాయి బాబా 23 నవంబరు 1984, ప్రశాంతి నిలయం, https://saispeaks.sathyasai.org/discourse/real-birthday.
స్వామివారి శతజయంతి మహోత్సవాలలో మీరందరూ ఆనందోత్సాహాలతో పాల్గొంటూ, “అందరినీ ప్రేమించండి – అందరికీ సేవ చేయండి” అనే ఆయన శాశ్వత సందేశానికి మరొకసారి మిమ్మల్ని మీరు అంకితం చేసుకోవాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాము.
సాయి సేవలో,
డా. జిత్ కె. అగర్వాల్
నడుము నొప్పి 11656...India
33 సంవత్సరాల వ్యక్తి 2022 ఫిబ్రవరిలో మెట్లపై నుంచి జారిపడిన తరువాత, రెండేళ్లుగా నిరంతర నడుము నొప్పితో బాధపడుతున్నారు. ప్రతిరోజూ మోటార్‌సైకిల్‌పై ఉద్యోగానికి వెళ్లడం లేదా శారీరక శ్రమ చేయడం వల్ల నొప్పి మరింత తీవ్రమయ్యేది. వైద్య పరీక్షల్లో వెన్నెముక స్వల్పంగా స్థానభ్రంశం చెందడంతో నరంపై ఒత్తిడి ఏర్పడినట్లు నిర్ధారణ అయింది. వైద్యుల సలహా మేరకు, నొప్పి ఎక్కువైనప్పుడు మాత్రమే 4 నుండి 5 రోజులపాటు ఫిజియోథెరపీ చికిత్స తీసుకునేవారు. దాని వల్ల తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలిగేది. ఆయుర్వేద నూనెతో మర్దన చేయించుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వలన స్వల్ప ప్రయోజనం కలిగినప్పటికీ, నొప్పి పూర్తిగా తగ్గలేదు. అయితే, ఆయన నొప్పి నివారణ మాత్రలను తీసుకోవడం మాత్రం నివారించారు.
ప్రాక్టీషనర్ని కలుసుకోవడానికి కొద్దిరోజుల ముందు, తీవ్రమైన నొప్పి కారణంగా ఆయన మరోసారి నాలుగు రోజుల ఫిజియోథెరపీ చికిత్సను పూర్తిచేశారు. ఎప్పటిలాగే, నొప్పి కొంత తగ్గినప్పటికీ పూర్తిగా తగ్గకుండా అలాగే కొనసాగింది. ఆ తరువాత అన్ని రకాల చికిత్సలను నిలిపివేయాలని నిర్ణయించుకుని, 2024 మార్చి 19న ప్రాక్టీషనర్ని సంప్రదించగా, ఆయనకు ఈ క్రింది కాంబినేషన్ ఇవ్వబడింది::
#1. CC18.5 Neuralgia + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine...BD ఆవాల నూనెలో తయారుచేసి, బాహ్యంగా రాసుకోవడానికి
#2. CC10.1 Emergencies + #1...TDS
చికిత్సలో పురోగతి:
➢ 3 ఏప్రిల్ 2024: నొప్పి 30% తగ్గింది.
➢ 11 ఏప్రిల్ 2024: నొప్పి 60% వరకు తగ్గింది; ఎలాంటి అసౌకర్యం లేకుండా ఎక్కువ దూరం మోటార్‌సైకిల్ నడపగలిగారు.
➢ 16 జూన్ 2024: నొప్పి పూర్తిగా నయమైంది!
➢ 23 జూన్ 2024: రోగి స్వయంగా మందులు తీసుకోవడం నిలిపివేశారు.
2025 అక్టోబరు నాటికి, ఆయనకు నొప్పి తిరిగి రాకుండా పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు.
దీర్ఘకాలిక మలబద్ధకం, కడుపు నొప్పి 11656...India
2023 నవంబరు నుండి, 11 సంవత్సరాల బాలిక ప్రతిరోజూ కడుపు నొప్పితో బాధపడుతోంది. ఈ సమస్య దాదాపు ఒక సంవత్సరం పాటు కొనసాగింది. నొప్పి రోజులో ఏ సమయంలోనైనా వచ్చి, సుమారు గంటసేపు ఉండేది. అదనంగా, ఆమెకు ప్రతి 2 నుండి 3 రోజులకు ఒకసారి మాత్రమే గట్టి మలం విసర్జన అయ్యేది. మలవిసర్జన సమయంలో ఆసనద్వారం వద్ద ఏర్పడిన చిన్న పగుళ్ల (Anal fissures) కారణంగా నొప్పి కలిగేది. కొన్నిసార్లు మలంలో రక్తపు జాడలు కూడా కనిపించేవి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా, అలాగే ఈ సమస్య తనంతట తానుగా తగ్గిపోతుందనే ఆశతో, ఆమె తల్లిదండ్రులు వైద్యుడిని సంప్రదించలేదు.
2024 నవంబరు 13న, ఆ బాలిక తల్లి ఆమెను వైబ్రియానిక్స్ సేవా శిబిరానికి తీసుకువచ్చారు. ఆ బాలిక రోజుకు కేవలం ఒక లీటరు నీరు మాత్రమే తాగుతుందని గమనించి, దానిని క్రమంగా రోజుకు ఒకటిన్నర లీటర్లకు పెంచాలని సూచించారు. అలాగే, ఆమెకు ఈ క్రింది కాంబినేషన్ ఇవ్వబడింది:
#1. CC4.2 Liver & Gallbladder tonic + CC4.4 Constipation + CC4.6 Diarrhoea + CC4.10 Indigestion + CC21.11 Wounds & Abrasions...TDS
చికిత్సలో పురోగతి:
➢ 13 డిసెంబరు 2024: ఎలాంటి మెరుగుదల కనిపించలేదు. అందువల్ల #1 కాంబినేషన్‌ను #2గా మార్చి, CC12.2 Child tonic + #1 ను రోజుకు మూడుసార్లు (TDS) కొనసాగించమని సూచించారు.
➢ 12 ఫిబ్రవరి 2025: గత రెండు వారాలుగా ప్రతిరోజూ మలవిసర్జన జరుగుతోంది. స్వల్ప అసౌకర్యం మాత్రమే ఉంది. కడుపు నొప్పి కూడా వారానికి కేవలం 2 నుండి 3 సార్లు మాత్రమే వచ్చి, ఒక్కోసారి 10 నుండి 15 నిమిషాల పాటు మాత్రమే కొనసాగుతోంది.
➢ 13 మార్చి 2025: అన్ని లక్షణాలు పూర్తిగా నయమయ్యాయి. రోగి రోజువారీ నీటి తీసుకునే పరిమాణాన్ని 1.5 లీటర్లకు పెంచుకుంది.
➢ 13 ఏప్రిల్ 2025: రోగి స్వయంగా మందులు తీసుకోవడం నిలిపివేసింది.
2025 అక్టోబరు నాటికి, వ్యాధి తిరిగి రాకుండా ఆమె పూర్తిగా ఆరోగ్యంగా ఉంది.
దీర్ఘకాలిక విరేచనాలు, నోటి లైకెన్ ప్లానస్, కాలి నొప్పి 11632...India
69 సంవత్సరాల వయస్సు గల ఒక వ్యాపారవేత్త 2004 నుండి తరచుగా పునరావృతమవుతున్న విరేచనాలతో బాధపడుతున్నారు. ఉద్యోగరీత్యా నెలలో సుమారు 20 రోజులపాటు ప్రయాణాలు చేయడం, బయట ఆహారం తినడంపై ఆసక్తి ఉండడం వల్ల, దుర్వాసనతో కూడిన పలుచని మలం 1 నుండి 2 రోజులపాటు కొనసాగే విరేచనాలు తరచూ వచ్చేవి. ప్రారంభంలో ఇవి నెలకు ఒకసారి మాత్రమే వచ్చేవి. అయితే, క్రమంగా దాదాపు ప్రతి వారమూ వచ్చే స్థితికి చేరుకున్నాయి. 2020లో పదవీ విరమణ చేసిన తరువాత ఆయన ఎక్కువగా ఇంట్లో తయారైన ఆహారమే తీసుకోవడం ప్రారంభించినప్పటికీ, అప్పుడప్పుడు బయట ఆహారం తీసుకున్నా కూడా సమస్య తీవ్రమై, వారానికి 2 నుండి 3 సార్లు విరేచనాలు వచ్చేవి. దాదాపు 20 సంవత్సరాలపాటు, అంటే 2024 వరకు, ఆయన మధ్య మధ్యలో హోమియోపతి చికిత్స తీసుకున్నారు. దాని వల్ల తాత్కాలికంగా సుమారు 75 శాతం ఉపశమనం కలిగినప్పటికీ, చికిత్స నిలిపివేసిన కొద్దికాలానికే లక్షణాలు మళ్లీ తిరిగి వచ్చేవి.
2024 జనవరిలో ఆయన ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా మరింత దిగజారింది. ఇంట్లో వండిన ఆహారం తీసుకున్నప్పటికీ, రోజుకు 4 నుండి 5 సార్లు దుర్వాసనతో కూడిన పలుచని మలవిసర్జన జరుగుతూ, వెంటనే టాయిలెట్ కి వెళ్లాలనే తీవ్రమైన ఆవశ్యకత కలిగేది. కొద్దిపాటి నూనె పదార్థాలు లేదా బయట ఆహారం తీసుకున్నా, రోజుకు 9 నుండి 10 సార్ల వరకు విరేచనాలు అయ్యేవి. దీంతో ఆయన హోమియోపతి చికిత్సను నిలిపివేసి అల్లోపతి వైద్యుడిని సంప్రదించారు. 2024 ఫిబ్రవరిలో నిర్వహించిన పరీక్షల్లో గ్యాస్ట్రిటిస్ (Gastritis) మరియు విల్లస్ అట్రోఫీ (Villous Atrophy) ఉన్నట్లు నిర్ధారణ అయింది. అనంతరం మూడు రోజులపాటు యాంటీబయోటిక్స్, ప్రోబయోటిక్స్, ఫోలిక్ యాసిడ్‌తో చికిత్స అందించగా సుమారు 90 శాతం ఉపశమనం లభించింది. అయితే, చికిత్స ముగిసిన పది రోజులకే లక్షణాలు మళ్లీ తిరిగి వచ్చాయి. పరిస్థితి తీవ్రతరమైన ప్రతిసారీ ఇదే మూడు రోజుల చికిత్సను పునరావృతం చేయాలని, అలాగే బయట ఆహారాన్ని పూర్తిగా నివారించాలని వైద్యుడు సూచించారు. అయితే, తరచూ ప్రయాణాలు మరియు ఇతర పరిస్థితుల కారణంగా ఈ సూచనలను పూర్తిగా పాటించడం ఆయనకు కష్టంగా ఉండేది.
అదనంగా, 2021లో కోవిడ్-19 నుండి కోలుకున్నప్పటి నుంచి, 5 నుండి 10 నిమిషాలకు మించి నిలబడినా లేదా నడిచినా ఆయనకు కాళ్లలో నొప్పి వచ్చేది. దీంతో ప్రతిరోజూ నడిచే అలవాటు కూడా మానుకోవలసి వచ్చింది. నొప్పి భరించగలిగే స్థాయిలో ఉండటంతో, దీనికి ఎలాంటి చికిత్స తీసుకోలేదు. 2023లో ఆయన నాలుక నల్లటి రంగులోకి మారడం ప్రారంభమైంది. అలాగే వేడి లేదా కారంగా ఉండే ఆహారాన్ని తట్టుకోలేకపోయేవారు. వైద్యులు దీనిని నోటి లైకెన్ ప్లానస్ (Oral Lichen Planus) గా నిర్ధారించారు. స్టెరాయిడ్ లేపనం (Steroid ointment) వాడడంతో 10 రోజుల్లో సుమారు 50% ఉపశమనం లభించినప్పటికీ, దుష్ప్రభావాల పట్ల ఉన్న భయంతో దానిని నిలిపివేశారు.
2024 జూన్ 13న, బయట ఆహారం తీసుకున్న అనంతరం, ఆయనకు ఆ రోజు దుర్వాసనతో కూడిన విరేచనాలు 9 నుండి 10 సార్లు అయ్యాయి. చికిత్స కోసం ఆయన పూర్తిగా సాయి వైబ్రియానిక్స్‌పైనే విశ్వాసం ఉంచాలని నిర్ణయించుకున్నారు, ఆయనకు ఈ క్రింది కాంబినేషన్ ఇవ్వబడింది:
విరేచనాలు మరియు నోటి లైకెన్ ప్లానస్ కోసం:
#1. CC4.6 Diarrhoea + CC4.8 Gastroenteritis + CC4.10 Indigestion + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC21.3 Skin allergies...6TD
#2. CC21.3 Skin allergies + CC21.11 Wounds & Abrasions...BD నాలుకపై బాహ్యంగా రాసుకోవడానికి కొబ్బరి నూనెలో ఇచ్చారు.
కాలి నొప్పి చికిత్స కోసం:
#3. Covid recuperation...TDS 13వ సంపుటి, 5వ సంచికలో సూచించిన విధంగా
#4. CC3.7 Circulation + CC10.1 Emergencies + CC18.5 Neuralgia + CC20.3 Arthritis + CC20.5 Spine + CC20.7 Fractures…BD బాహ్యంగా రాసుకోవడానికి ఆవ నూనెలో
చికిత్సలో పురోగతి:
➢ 16 జూన్ 2024: మలవిసర్జన కోసం వెంటనే వెళ్లాల్సిన ఆవశ్యకత (Bowel urgency) పూర్తిగా తగ్గింది. విరేచనాలు రోజుకు ఏడు సార్లకు తగ్గాయి. నాలుక రంగు 70% వరకు మెరుగుపడింది. #1 మోతాదును రోజుకు మూడుసార్లు (TDS)కి తగ్గించారు.
➢ 18 జూన్ 2024: నాలుక పరిస్థితి 90% మెరుగుపడింది. స్వల్పంగా కారంగా ఉన్న ఆహారాన్ని తట్టుకోగలిగారు.
➢ 30 జూన్ 2024: నాలుకకు సంబంధించిన లక్షణాలు పూర్తిగా నయమయ్యాయి. విరేచనాలు రోజుకు ఆరు సార్లకు తగ్గాయి. దుర్వాసన 50% తగ్గింది. కాలి నొప్పి 50% వరకు తగ్గింది. #2 నిలిపివేయబడింది.
➢ 11 జూలై 2024: విరేచనాల దుర్వాసన పూర్తిగా తొలగిపోయింది. కాలి నొప్పి 75% వరకు తగ్గడంతో, ఆయన తిరిగి ప్రతిరోజూ 30 నిమిషాలు నడవడం ప్రారంభించారు.
➢ 15 జూలై 2024: నూనె ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకున్న తరువాత తీవ్రమైన దుర్వాసనతో కూడిన విరేచనాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. #1 ను ఒక గంటపాటు ప్రతి 10 నిమిషాలకు ఒకసారి, ఆ తరువాత రోజుకు ఆరు సార్లు (6TD) తీసుకోవాలని సూచించారు. ఒక గంటలోనే 50% ఉపశమనం లభించింది. అనంతరం మూడు రోజుల అల్లోపతి చికిత్సను కూడా ప్రారంభించారు.
➢ 18 జూలై 2024: దుర్వాసన పూర్తిగా తొలగిపోయింది. విరేచనాలు రోజుకు 4 నుండి 5 సార్లకు తగ్గాయి. #1 మోతాదును రోజుకు మూడుసార్లు (TDS)కి తగ్గించారు. బయట ఆహారం తీసుకోకుండా ఖచ్చితంగా పాటించాలని మరోసారి సూచించారు.
➢ 13 సెప్టెంబరు 2024: కాలి నొప్పి పూర్తిగా నయమైంది. #3 మరియు #4 నిలిపివేయబడ్డాయి.
➢ 1 డిసెంబరు 2024: విరేచనాలు పూర్తిగా నయమయ్యాయి. ప్రస్తుతం రోజుకు 1–2 సార్లు మాత్రమే అర్థఘన (Semi-solid) మలవిసర్జన జరుగుతోంది. నూనె ఎక్కువగా ఉన్న లేదా బయట ఆహారం తీసుకున్నప్పుడు మాత్రమే స్వల్ప అసౌకర్యం కలుగుతోంది. ఇకపై అల్లోపతి మందుల అవసరం లేకుండా, ఫోలిక్ యాసిడ్ మాత్రలను మాత్రమే కొనసాగిస్తున్నారు.
➢ 1 మార్చి 2025: #1 మోతాదును రోజుకు రెండుసార్లు (BD)కి తగ్గించారు.
2025 అక్టోబరు నాటికి, అప్పుడప్పుడు బయట ఆహారం తీసుకున్నప్పటికీ అర్థఘన మలవిసర్జనతో ఎలాంటి లక్షణాలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు. తన స్వచ్ఛంద నిర్ణయంతో #1 ను రోజుకు రెండుసార్లు (BD) కొనసాగిస్తున్నారు.
గొంతులో శ్లేష్మం 11669...India
2018 నుండి, 51 సంవత్సరాల వ్యక్తి గొంతులో నిరంతరం కఫం పేరుకుపోయే సమస్యతో బాధపడుతున్నారు. కాలక్రమేణా ఈ సమస్య మరింత తీవ్రమైంది. 2023 నాటికి, గొంతులో ఎప్పుడూ కఫం ఇరుక్కుపోయినట్లుగా అనిపిస్తూ, దానిని తరచూ బయటకు ఉమ్మివేయాలనే కోరిక కలిగేది. ముఖ్యంగా ఉదయం మరియు మధ్యాహ్న వేళల్లో ఈ సమస్య ఎక్కువగా బాధించేది. ప్రయాణాలు, ఉద్యోగ నిర్వహణ, అలాగే ఏకాగ్రతపై కూడా దీని ప్రభావం పడింది. చల్లని వాతావరణం, తీపి పదార్థాలు తీసుకోవడం, అలాగే ఎక్కువసేపు పనిచేయడం వల్ల కలిగే మానసిక ఒత్తిడి ఈ సమస్యను మరింత తీవ్రతరం చేసేవి. సాధారణంగా కఫం రెండు రోజులపాటు తెల్లగా ఉండి, తరువాత మూడు నుంచి నాలుగు రోజులపాటు పసుపు రంగులోకి మారి, చివరికి గోధుమరంగులోకి మారిన తరువాత మళ్లీ అదే చక్రం పునరావృతమయ్యేది.
2023 జూలైలో లక్షణాలు మరింత తీవ్రమవడంతో, 1990లో ఇదే తరహా గొంతులో కఫం సమస్యకు హోమియోపతి చికిత్స ద్వారా ఉపశమనం పొందిన విషయాన్ని గుర్తుచేసుకుని, ఆయన మళ్లీ హోమియోపతి చికిత్సను ఆశ్రయించారు. మూడు నెలల్లో సుమారు 80% ఉపశమనం లభించినప్పటికీ, చికిత్స నిలిపివేసిన తర్వాత లక్షణాలు తిరిగి కనిపించాయి. ప్రతిరోజూ నడవడం, అలాగే ముందుకు మరియు వెనుకకు వంగే వ్యాయామాలు చేయడం వల్ల గణనీయమైన ఉపశమనం లభించేది. అయితే, వ్యాయామంలో కొద్దిరోజుల విరామం వచ్చినా సమస్య మళ్లీ తిరగబెట్టేది. 2023 అక్టోబరు నుండి, ఆయన తన సమస్యను ప్రధానంగా క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా నియంత్రించుకుంటూ, తీవ్రమైన దశల్లో మాత్రమే హోమియోపతి చికిత్సను ఆశ్రయిస్తున్నారు.
స్వామివారి అంతఃప్రేరణతో, ఆయన AVP శిక్షణను పూర్తిచేసి, 2025 మార్చి 26న తన కోసం స్వయంగా వైబ్రియానిక్స్ రెమెడీని సిద్ధం చేసుకున్నారు.
CC19.1 Chest tonic + CC19.3 Chest infections chronic + CC19.7 Throat chronic + CC21.8 Herpes*…TDS అలాగే, వీలైనప్పుడల్లా శారీరక వ్యాయామాలను కూడా కొనసాగించారు.
* అంతఃప్రేరణతో జోడించబడింది
చికిత్సలో పురోగతి:
➢ 9 ఏప్రిల్ 2025: గొంతులో కఫం పూర్తిగా తొలగిపోయింది. మోతాదును రోజుకు ఒకసారి (OD)కి తగ్గించారు.
➢ 7 మే 2025: మోతాదును క్రమంగా తగ్గిస్తూ, మందులను పూర్తిగా నిలిపివేశారు.
➢ 23 జూన్ 2025: వరుసగా కొన్ని రోజులు వ్యాయామం చేయకపోతే అప్పుడప్పుడు స్వల్పంగా గొంతులో కఫం ఏర్పడేది. అయితే, ఒక్క మోతాదు రెమెడీ తీసుకున్న వెంటనే అది తగ్గిపోయేది. అందువల్ల నిర్వహణ మోతాదుగా (Maintenance dose) రోజుకు ఒకసారి (OD) మళ్లీ ప్రారంభించారు.
2025 అక్టోబరు నాటికి, ఆయన ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగిస్తూ, గొంతులో కఫం సమస్య మళ్లీ రాకుండా ఆరోగ్యంగా ఉన్నారు.
పెప్టిక్ అల్సర్ (జీర్ణాశయ పుండు) 11618...India
2020 జనవరి నుండి, 51 సంవత్సరాల వయసు గల గృహిణి ఆరు నెలలుగా ముఖ్యంగా కారంగా ఉన్న ఆహారం తీసుకున్న తర్వాత కడుపులో మంటతో బాధపడుతున్నారు. 2020 ఏప్రిల్ నాటికి, ఆమెకు శరీరంలో అధిక వేడి అనిపించడం, వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే గట్టి మలంతో కూడిన మలబద్ధకం, అలాగే ఒకసారి మలంలో రక్తపు జాడలు కూడా కనిపించాయి. కోవిడ్-19 లాక్‌డౌన్ కారణంగా, ఆమె ఆన్‌లైన్‌లో వైద్యుడిని సంప్రదించారు. వైద్యుడు యాంటాసిడ్ మందులను సూచించడంతో పాటు, ఎక్కువగా కూరగాయలు తినాలని మరియు మజ్జిగ తీసుకోవాలని సలహా ఇచ్చారు. దీనివల్ల సుమారు 50% ఉపశమనం లభించినప్పటికీ, కారంగా ఉన్న ఆహారం తీసుకున్న ప్రతిసారీ లక్షణాలు మళ్లీ తిరిగి వచ్చేవి. రెండు నెలల తరువాత, యాంటాసిడ్ మందులపై ఆధారపడకూడదనే ఉద్దేశంతో ఆమె వాటిని తీసుకోవడం నిలిపివేశారు.
కుటుంబానికి చెందిన అనేక వ్యాపారాల నిర్వహణ బాధ్యతలను నిర్వర్తిస్తూ, ఆమె చాలా నెలలుగా, ముఖ్యంగా ఒకేసారి అనేక పనులను నిర్వహించే సందర్భాల్లో, తీవ్రమైన మానసిక ఒత్తిడి మరియు ఆందోళనను అనుభవిస్తున్నారు. వైబ్రియానిక్స్ గురించి తెలుసుకున్న తరువాత, 2020 జూలై 27న ఆమె ప్రాక్టీషనర్ని సంప్రదించగా, ఆమెకు ఈ క్రింది కాంబినేషన్ ఇవ్వబడింది:
CC4.4 Constipation + CC4.10 Indigestion + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…TDS ఆమెకు కారంగా ఉండే ఆహారం మరియు రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం మానుకోవాలని, ప్రతిరోజూ నడక చేయాలని, అలాగే ప్రాణాయామం సాధన చేయాలని సూచించారు.
చికిత్సలో పురోగతి:
➢ 15 ఆగస్టు 2020: మలవిసర్జన సాధారణ స్థితికి వచ్చింది. కడుపులో మంట 70% వరకు తగ్గింది. ఆమె మానసికంగా ప్రశాంతంగా, మరింత సడలిన భావంతో ఉన్నారు.
➢ 7 సెప్టెంబరు 2020: కడుపులో మంట మరియు ఆందోళన పూర్తిగా నయమయ్యాయి. ఒకేసారి అనేక పనులను ప్రశాంతంగా నిర్వహించగలుగుతున్నారు.
➢ 15 జనవరి 2021: మోతాదును క్రమంగా తగ్గిస్తూ, మందులను పూర్తిగా నిలిపివేశారు.
2025 అక్టోబరు నాటికి, ఆమె ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగిస్తూ, ఎలాంటి లక్షణాలు తిరిగి రాకుండా ఆరోగ్యంగా ఉన్నారు. అంతేకాకుండా, వైబ్రియానిక్స్‌ను తన బంధుమిత్రులకు కూడా చురుకుగా పరిచయం చేస్తూ సిఫారసు చేస్తున్నారు.
మెడ నొప్పి 11568...India
2024 జనవరి నుండి, 28 సంవత్సరాల మహిళ తొమ్మిది నెలలుగా మెడ నొప్పితో బాధపడుతున్నారు. విశ్రాంతి తీసుకోవడం, నొప్పి నివారణ స్ప్రే ఉపయోగించడం ద్వారా ఆమె ఆ నొప్పిని తాత్కాలికంగా నియంత్రించేవారు. అయితే, 2024 ఏప్రిల్ 12న తన మొదటి బిడ్డకు జన్మనిచ్చిన తరువాత, నొప్పి మరింత తీవ్రమైంది. దీంతో మెడను తిప్పడం, శిశువుకు పాలివ్వడం, అంతేకాక తన బిడ్డను ఎత్తుకోవడం కూడా చాలా కష్టంగా మారింది. వైద్యుడు సూచించిన నొప్పి నివారణ మాత్ర తీసుకున్న తర్వాత గంటలోపే ఉపశమనం కలిగినప్పటికీ, మరుసటి రోజే నొప్పి మళ్లీ వచ్చేది. ఆమె బిడ్డకు పాలిస్తున్న తల్లి కావడంతో, నొప్పి భరించలేనంతగా ఉన్నప్పుడు మాత్రమే ఆ మాత్రను తీసుకుంటూ, మిగతా సమయాల్లో వైద్యుడు సూచించిన స్ప్రేపైనే ఆధారపడేవారు.
2024 అక్టోబరులో కూడా ఎలాంటి మెరుగుదల కనిపించకపోవడంతో, ఆమె ఒక ఆర్థోపెడిక్ వైద్యుడిని సంప్రదించారు. ఆయన సూచన మేరకు ఎంఆర్ఐ (MRI) పరీక్ష చేయించగా, సర్వైకల్ స్పాండిలోసిస్ (Cervical Spondylosis) ఉన్నట్లు నిర్ధారణ అయింది. వైద్యుడు మరింత ప్రభావవంతమైన నొప్పి నివారణ మాత్రతో పాటు కండరాలను సడలించే మందు (Muscle Relaxant) కూడా సూచించారు. అయితే, బిడ్డకు పాలిస్తున్న తల్లి కావడంతో, వాటి దుష్ప్రభావాల పట్ల ఉన్న ఆందోళన కారణంగా ఆ మందులను తీసుకోవడానికి ఆమె సంకోచించారు. అందువల్ల సురక్షితమైన ప్రత్యామ్నాయ చికిత్స కోసం అన్వేషించడం ప్రారంభించారు. తన ఇంటి పనిమనిషికి వైబ్రియానిక్స్ ద్వారా మంచి ఫలితాలు లభించాయని తెలుసుకున్న తరువాత, 2024 అక్టోబరు 20న ఆమె ప్రాక్టీషనర్ని సంప్రదించారు. ఆ సమయంలో, బిడ్డను ఎత్తుకోవడానికి కొద్దిగా ముందుకు వంగినప్పుడల్లా మెడలో కత్తితో పొడిచినట్లుగా తీవ్రమైన నొప్పి కలుగుతుందని, తన బిడ్డను సౌకర్యంగా ఎత్తుకొని చూసుకోలేకపోతున్నందుకు ఎంతో మనోవేదనకు గురవుతున్నట్లు తెలిపారు. ఆమెకు ఈ క్రింది కాంబినేషన్ ఇవ్వబడింది:
CC10.1 Emergencies + CC18.5 Neuralgia + CC20.5 Spine…6TD అలాగే బాహ్యంగా రాసుకోవడానికి …BD, రెండిటిని నీటితోనే
చికిత్సలో పురోగతి:
➢ 5 నవంబరు 2024: నొప్పి 50% వరకు తగ్గింది. తన బిడ్డను ఎక్కువసేపు ఎత్తుకోగలుగుతున్నారు. నోటి ద్వారా తీసుకునే రెమెడీ మోతాదును రోజుకు మూడుసార్లు (TDS)కి తగ్గించారు.
➢ 25 నవంబరు 2024: నొప్పి పూర్తిగా నయమై, మెడను సాధారణంగా తిప్పగలుగుతున్నారు! అపారమైన ఆనందంతో ఆమె వైబ్రియానిక్స్ పట్ల తన ప్రగాఢ కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ, బిడ్డ పుట్టినప్పటి నుండి తొలిసారిగా ఎలాంటి అసౌకర్యం లేకుండా తన బిడ్డను ఎత్తుకొని, మాతృత్వాన్ని నిజంగా ఆనందించగలుగుతున్నానని తెలిపారు. బాహ్యంగా రాసుకునే రెమెడీని నిలిపివేసి, నోటి ద్వారా తీసుకునే రెమెడీ మోతాదును రోజుకు ఒకసారి (OD)కి తగ్గించారు.
➢ 20 జనవరి 2025: మోతాదును క్రమంగా తగ్గిస్తూ, మందులను పూర్తిగా నిలిపివేశారు.
2025 అక్టోబరు నాటికి, ఆమెకు మెడ నొప్పి తిరిగి రాకుండా పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు.
మందగించిన జుట్టు పెరుగుదల 03623...Zimbabwe
47 సంవత్సరాల మహిళ, ప్రాక్టీషనర్కి స్నేహితురాలు. 2017 నుండి, గత ఏడు సంవత్సరాలుగా తన జుట్టు ఆరోగ్యం సరిగా లేదని ఆమె తెలిపారు. అలాగే, కొత్త వెంట్రుకలు మొలుస్తున్నప్పటికీ, ఆమె జుట్టు ఎప్పుడూ చెవుల కింది వరకు కూడా పెరగలేదు. ఎన్నో సంవత్సరాలుగా హెయిర్ లోషన్లు ఉపయోగించడం, మూలికలతో తలస్నానం చేయడం, ఎండ మరియు దుమ్ము నుంచి జుట్టును రక్షించుకోవడం, సమతుల్య ఆహారం తీసుకోవడం వంటి అనేక జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, జుట్టు చెవుల కిందకు కొద్దిగా మాత్రమే పెరిగేది. అయితే, ఇటీవలి సంవత్సరాలలో నిరంతర మానసిక ఒత్తిడి మరియు వ్యక్తిగత సంరక్షణకు తగినంత సమయం కేటాయించలేకపోవడం వల్ల ఆమె జుట్టు పరిస్థితి మరింత క్షీణించింది.
2024 డిసెంబరు 5న, ప్రాక్టీషనర్చే ఆమెకు ఈ క్రింది కాంబినేషన్ ఇవ్వబడింది:
#1. CC11.1 Hair tonic + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic… TDS మరియు OW బాహ్యంగా రాసుకోవడానికి కొబ్బరి నూనెలో
అదనంగా, నీటిలో తయారుచేసిన రెమెడీ ని ప్రతిరోజూ జుట్టుకు రాసుకోవాలని కూడా రోగికి సూచించారు. అదే సమయంలో, ఆమె తనకు అలవాటైన హెయిర్ ఆయిల్‌ను యథావిధిగా ఉపయోగించడం కొనసాగించారు.
చికిత్సలో పురోగతి:
➢ 22 ఫిబ్రవరి 2025: జుట్టు 4 అంగుళాలు పెరిగి, ఇప్పటివరకు ఎన్నడూ లేనంత పొడవుకు చేరుకుంది. జుట్టు మరింత దృఢంగా, ఆరోగ్యంగా, మృదువుగా మారింది!
➢ 5 మే 2025: నోటి ద్వారా తీసుకునే రెమెడీ మోతాదును రోజుకు రెండుసార్లు (BD)కి తగ్గించి, నీటిలో తయారుచేసిన రెమెడీని జుట్టుకు రాయడం నిలిపివేశారు.
➢ 31 జూలై 2025: నోటి ద్వారా తీసుకునే రెమెడీ మోతాదును క్రమంగా తగ్గిస్తూ, పూర్తిగా నిలిపివేశారు.
➢ 30 ఆగస్టు 2025: జుట్టు భుజాల కింది వరకు పెరిగి, దట్టంగా మరియు ఆరోగ్యంగా కొనసాగుతోంది. సాధారణ ఆరోగ్య పరిరక్షణ కోసం #2. CC12.1 Adult tonic ఇవ్వబడింది.
2025 అక్టోబరు నాటికి, రోగి ఎంతో ఆనందంగా ఉండి, కొబ్బరి నూనెను జుట్టుకు రాసుకోవడం కొనసాగిస్తున్నారు.
నాలుకపై భౌగోళిక ఆకారపు మచ్చలు 03607...UK
2018 నుండి, గత ఐదు సంవత్సరాలుగా 9 సంవత్సరాల బాలుడు తన నాలుకపై వివిధ పరిమాణాలలో, క్రమరహిత ఆకారంలో, మృదువైన ఎర్రటి మచ్చలతో (చిత్రాన్ని చూడండి) బాధపడుతున్నాడు. ఈ సమస్య నెలకు రెండుసార్లు వచ్చి, ఒక్కోసారి సుమారు 10 రోజులపాటు కొనసాగేది. ఈ సమయంలో ఆహారం తీసుకునేటప్పుడు నొప్పి మరియు మంట కలిగేవి. దీంతో అతని ఆహారపు అలవాట్లు ప్రభావితమవుతుండటంతో, ఆందోళన చెందిన అతని తల్లి వైద్యుడిని సంప్రదించారు. వైద్యుడు దీనిని జియోగ్రాఫిక్ టంగ్ (Geographic Tongue) గా నిర్ధారించి, స్టెరాయిడ్ మాత్రలు మరియు NSAID స్ప్రే సూచించారు. అయితే, రెండు నెలలపాటు వాటిని ఉపయోగించినప్పటికీ ఎలాంటి ఉపశమనం కలగలేదు. అప్పటి నుండి, కారంగా ఉండే ఆహారాన్ని నివారించడం ద్వారా మాత్రమే ఈ సమస్యను కొంతవరకు నియంత్రించగలిగారు. అనంతరం ఆమెకు వైబ్రియానిక్స్ గురించి తెలిసి, 2023 ఫిబ్రవరి 21న ప్రాక్టీషనర్ని సంప్రదించగా, బాలుడికి ఈ క్రింది కాంబినేషన్ ఇవ్వబడింది:
#1. CC11.5 Mouth infections + CC12.2 Child tonic…TDS
చికిత్సలో పురోగతి:
➢ 11 మే 2023: ఎలాంటి మార్పు కనిపించలేదు. అందువల్ల #1 కాంబినేషన్‌ను #2గా మార్చి, CC12.4 Autoimmune diseases + CC21.10 Psoriasis + #1 ను రోజుకు మూడుసార్లు (TDS) తీసుకోవాలని సూచించారు.
➢ 3 జూన్ 2023: ఒకసారి మాత్రమే స్వల్పంగా, చిన్న పరిమాణంలో నొప్పిలేని మచ్చలు ఏర్పడ్డాయి. అవి 2 నుండి 3 రోజుల్లోనే పూర్తిగా తగ్గిపోయాయి. ఈ సమయంలో బాలుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాధారణంగా ఆహారం తీసుకోగలిగాడు.
➢ 12 జూలై 2023: మరోసారి మాత్రమే నొప్పిలేని ఒక చిన్న మచ్చ ఏర్పడి, అది కూడా 2 నుండి 3 రోజుల్లో తగ్గిపోయింది. అనంతరం బాలుడు విదేశాలకు వెళ్లడంతో మందులు నిలిపివేశారు.
➢ 2 నవంబరు 2023: నొప్పితో కూడిన లక్షణాలు మళ్లీ రావడంతో, రోగి ప్రాక్టీషనర్ని సంప్రదించారు. #2 కాంబినేషన్‌ను తిరిగి ప్రారంభించాలని సూచించారు.
➢ 12 జనవరి 2024: రెండు స్వల్పమైన, నొప్పిలేని ఎపిసోడ్‌లు మాత్రమే వచ్చాయి. అవి రెండూ రెండు రోజుల్లోనే తగ్గిపోయాయి. బాలుడు మళ్లీ సాధారణంగా ఆహారం తీసుకోగలిగాడు.
➢ 15 జూలై 2024: ఆ తరువాత ఎలాంటి ఎపిసోడ్‌లు సంభవించలేదు.
➢ 14 డిసెంబరు 2024: ఫ్లూ రెండు సందర్భాల్లో వచ్చినప్పుడు మాత్రమే స్వల్పంగా, నొప్పిలేని ఒక ఎపిసోడ్ వచ్చింది. అది కూడా రెండుసార్లూ రెండు రోజుల్లోనే తగ్గిపోయింది. అందువల్ల #3. IB (13వ సంపుటి, 5వ సంచికలో సూచించిన విధంగా) రోజుకు ఒకసారి (OD) ఇవ్వబడింది.
➢ 15 జనవరి 2025: ఆ తరువాత ఎలాంటి ఎపిసోడ్‌లు రాలేదు.
➢ 30 ఏప్రిల్ 2025: ఫ్లూ వచ్చినప్పటికీ సమస్య తిరిగి రాలేదు. అందువల్ల అన్ని మందులు నిలిపివేయబడ్డాయి.
2025 సెప్టెంబరు నాటికి, ఈ సమస్య మళ్లీ పునరావృతం కాలేదు.
చికిత్సకు ముందు చికిత్స అనంతరం

తలనొప్పి, నడుము నొప్పి, కడుపు ఉబ్బరం 11618...India
33 సంవత్సరాల మహిళ, 2003 నుండి 17 సంవత్సరాలకు పైగా తలనొప్పితో బాధపడుతున్నారు. ప్రారంభంలో ఈ తలనొప్పి నెలకు ఒకటి లేదా రెండు సార్లు వచ్చి, రాత్రి బాగా నిద్రపోయిన తరువాత తగ్గిపోయేది. అయితే, 2015 నాటికి ఈ సమస్య ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వచ్చి, ఒక్కోసారి 5 నుండి 6 రోజులపాటు కొనసాగేది. వైద్యుడు సూచించిన మందులను మూడు నెలలపాటు తీసుకోవడంతో 50 నుండి 60 శాతం వరకు ఉపశమనం లభించింది. ఫలితంగా, ఒక్కోసారి తలనొప్పి 2 నుండి 3 రోజులపాటు మాత్రమే కొనసాగేది. ఆ తరువాత, ఆమె వైద్యుల చీటీ లేకుండానే దొరికే (OTC) నొప్పి నివారణ మాత్రలు, నూనెతో మర్దన, విశ్రాంతి ద్వారా సమస్యను తాత్కాలికంగా నియంత్రించుకుంటూ వచ్చారు. అదనంగా, గత నాలుగు సంవత్సరాలుగా పక్కకు వంగినప్పుడు నడుము ఎడమవైపున నొప్పి కలుగుతోంది. అలాగే, గత నాలుగు నెలలుగా కడుపు ఉబ్బరం సమస్యతో కూడా బాధపడుతున్నారు.
వైబ్రియానిక్స్ గురించి తెలుసుకున్న తరువాత, ఆమె ప్రాక్టీషనర్ని సంప్రదించారు. ఆ సమయంలో, నొప్పి నుదిటి నుంచి ప్రారంభమై తల మొత్తం వ్యాపించేది. ఈ తలనొప్పికి కారణం ఏమిటో, లేదా దానిని ప్రేరేపించే అంశాలు ఏమిటో గుర్తించలేకపోయారు. 2020 అక్టోబరు 28న ఆమెకు ఈ క్రింది కాంబినేషన్ ఇవ్వబడింది:
#1. CC3.7 Circulation + CC4.10 Indigestion + CC10.1 Emergencies + CC11.3 Headaches + CC15.1 Mental & Emotional tonic + CC18.5 Neuralgia…TDS అలాగే, బాహ్యంగా రాసుకోవడానికి కొబ్బరి నూనెలో …OD
చికిత్సలో పురోగతి:
➢ 11 నవంబరు 2020: కడుపు ఉబ్బరం పూర్తిగా (100%) తగ్గింది. ఒకసారి మాత్రమే తలనొప్పి వచ్చినప్పటికీ, అది భరించగలిగే స్థాయిలో ఉంది. అయితే, నొప్పి మరింత పెరుగుతుందేమోననే భయంతో మరుసటి రోజు వైద్యుల చీటీ లేకుండానే దొరికే (OTC) నొప్పి నివారణ మాత్ర తీసుకున్నారు. నడుము నొప్పి 20% వరకు తగ్గింది. రోజూ బరువైన నీటి కుండను మోసుకెళ్లడం వల్లే నడుము నొప్పి వచ్చి ఉండవచ్చని రోగి తెలిపారు. అందువల్ల అదనంగా #2. CC20.2 SMJ pain + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine + CC20.7 Fractures రోజుకు రెండుసార్లు (BD), నడుముపై బాహ్యంగా రాసుకోవడానికి కొబ్బరి నూనెలో ఇవ్వబడింది. అలాగే #1 కాంబినేషన్‌ను #3. #2 + #1 గా మార్చి, రోజుకు మూడుసార్లు (TDS) తీసుకోవాలని సూచించారు.
➢ 22 నవంబరు 2020: ఒకసారి మాత్రమే స్వల్ప తలనొప్పి వచ్చింది. రాత్రి నిద్రపోయిన తరువాత అది పూర్తిగా తగ్గిపోయింది.
➢ 9 డిసెంబరు 2020: తలనొప్పి మరియు నడుము నొప్పి పూర్తిగా నయమయ్యాయి.
➢ 20 జనవరి 2021: రోగికి ఎలాంటి లక్షణాలు లేకుండా ఆరోగ్యంగా ఉండటంతో, ఆమె ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. #2 మోతాదును రోజుకు ఒకసారి (OD)కి తగ్గించారు.
➢ 30 ఏప్రిల్ 2021: మోతాదును క్రమంగా తగ్గిస్తూ, అన్ని మందులను పూర్తిగా నిలిపివేశారు.
2025 అక్టోబరు నాటికి, ఆమె పూర్తి ఆరోగ్యంతో, ఎలాంటి సమస్యలు లేకుండా ఉన్నారు.
దీర్ఘకాలిక ఆయాసం 11583...India
2024 జనవరి నుండి, 11 సంవత్సరాల బాలిక ఒక సంవత్సరం పాటు పునరావృతమవుతున్న జ్వరం, చలి, ముక్కు దిబ్బడ, మరియు తీవ్రమైన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది సమస్యలతో బాధపడుతోంది. ఈ లక్షణాలు ప్రతి మూడు నెలలకు ఒకసారి తిరిగి వచ్చి, ప్రతిసారీ ఆమెను వారం రోజులపాటు ఐసీయూ (ICU)లో చేర్చాల్సి వచ్చేది. ఆ సమయంలో సాధారణంగా చలి మరియు ముక్కు దిబ్బడ తగ్గిపోయేవి. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తరువాత, జ్వరానికి పారాసిటమాల్, అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి ఇంట్లోనే నెబ్యులైజేషన్ చేయాలని వైద్యులు సూచించారు. నెబ్యులైజేషన్‌ను కనీసం రోజుకు ఒకసారి చేయాల్సి వచ్చేది. ప్రతి మూడు వారాలకు ఒకసారి తీవ్రమైన శ్వాస ఇబ్బంది వచ్చినప్పుడు మరింత తరచుగా చేయాల్సి వచ్చేది. ఈ కారణంగా ఆమె తరచూ పాఠశాలకు వెళ్లలేకపోయేది.
వైబ్రియానిక్స్ గురించి తెలుసుకున్న ఆ బాలిక తల్లి, తన కుమార్తె ఆరోగ్యం పట్ల ఆందోళనతో 2025 జనవరి 9న ప్రాక్టీషనర్ని సంప్రదించగా, ఆమెకు ఈ క్రింది కాంబినేషన్ ఇవ్వబడింది:
#1. IB (vol 12 #4)…6TD
#2. CC9.2 Infections acute + CC10.1 Emergencies + CC19.2 Respiratory allergies + CC19.4 Asthma attack + CC21.7 Fungus…6TD
అవసరమైనప్పుడల్లా నెబ్యులైజేషన్ మరియు పారాసిటమాల్‌ను యథావిధిగా కొనసాగించారు.
చికిత్సలో పురోగతి:
➢ 10 జనవరి 2025: రోజంతా జిగురుగా ఉండే పలుచని మలవిసర్జన జరిగింది (బహుశా పుల్అవుట్ ప్రభావం కావచ్చు). అయితే బలహీనత లేదా అలసట ఏవీ కనిపించలేదు.
➢ 11 జనవరి 2025: జ్వరం పూర్తిగా తగ్గింది.
➢ 12 జనవరి 2025: శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పూర్తిగా తొలగిపోయింది. గత ఒక సంవత్సరంలో తొలిసారిగా నెబ్యులైజర్ అవసరం రాలేదు. #1 మోతాదును రోజుకు మూడుసార్లు (TDS)కి తగ్గించారు.
➢ 25 జనవరి 2025: లక్షణాలు మళ్లీ కనిపించలేదు. నిర్వహణ మోతాదుగా #1 ను రోజుకు రెండుసార్లు (BD)కి, #2 ను రోజుకు మూడుసార్లు (TDS)కి తగ్గించారు.
➢ 1 ఫిబ్రవరి 2025: #2 మోతాదును నిర్వహణ కోసం రోజుకు ఒకసారి (OD)కి తగ్గించారు. 2025 మే 30న, రోగి తల్లి ఆ తరువాత ఎలాంటి ఎపిసోడ్ కూడా రాలేదని తెలిపారు.
2025 అక్టోబరు నాటికి, ఆ బాలిక పూర్తిగా ఆరోగ్యంగా ఉండి, క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరవుతోంది.
సంపాదకుని గమనిక: శిలీంధ్రాలు (ఫంగస్) అలెర్జీ ప్రతిచర్యల వలన, ఊపిరితిత్తుల ప్రత్యక్ష ఇన్‌ఫెక్షన్ ద్వారా, అలాగే ఇన్‌ఫ్లమేషన్ (Inflammation) ద్వారా దీర్ఘకాలిక శ్వాస సంబంధిత సమస్యలను కలిగించవచ్చు లేదా మరింత తీవ్రతరం చేయవచ్చు. కాబట్టి CC21.7 Fungus ను కాంబినేషన్‌లో చేర్చడం సముచితమైన నిర్ణయం.
మోకాలి నొప్పి, కడుపులో మంట, తలనొప్పి 11671...India
36 సంవత్సరాల గల గృహ సహాయకురాలు ఒకరు, ప్రాక్టీషనర్ వద్ద పనిచేస్తున్నారు. 2024 సెప్టెంబరు నుండి గత నాలుగు నెలలుగా ఆమె మోకాళ్లు మరియు తుంటి నొప్పితో బాధపడుతున్నారు. నాలుగో అంతస్తులో నివసించడం వల్ల ప్రతిరోజూ అనేకసార్లు మెట్లు ఎక్కి దిగాల్సి వచ్చేది, దీంతో నొప్పి మరింత ఎక్కువయ్యేది. ప్రారంభంలో వారానికి ఒకటి లేదా రెండుసార్లు వైద్యుల చీటీ లేకుండానే దొరికే (OTC) నొప్పి నివారణ మాత్రలు తీసుకునేవారు. అయితే, నవంబరు నాటికి వాటి వినియోగం వారానికి మూడు నుండి నాలుగు సార్లకు పెరిగింది. డిసెంబరు నాటికి ఆ మాత్రలు కూడా ప్రభావం చూపకపోవడంతో, నొప్పి నివారణ లేపనాలను ఉపయోగించడం ప్రారంభించారు. 2025 జనవరి నాటికి నొప్పి నిరంతరంగా ఉండి, అప్పుడప్పుడు భరించలేనంతగా మారింది. విశ్రాంతి తీసుకున్న తరువాత నొప్పి మరింత ఎక్కువగా ఉండగా, కొద్దిగా కదలికతో స్వల్ప ఉపశమనం కలిగేది. ఇంటి పనులు, అలాగే ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడం కూడా కష్టంగా మారినప్పటికీ, ఆమె వైద్యుడిని సంప్రదించడానికి మాత్రం సంకోచించారు.
అదనంగా, 2018 నుండి ఆమె వారానికి ఒకసారి అధికంగా తేన్పులు రావడం, నడుము నొప్పి, ఛాతీలో స్వల్ప బిగుతు, అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలతో కూడా బాధపడుతున్నారు. ముఖ్యంగా గుమ్మడికాయ, బీన్స్, మరమరాలు వంటి ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు ఈ లక్షణాలు ఎక్కువగా కనిపించేవి. ఈ సమస్యలకు కడుపులో మంటే కారణమని భావించి, ఆమె నెలకు మూడు నుండి నాలుగు సార్లు వైద్యుల చీటీ లేకుండానే దొరికే (OTC) యాంటాసిడ్ మందులు తీసుకునేవారు. అయితే, వాటి వల్ల తాత్కాలిక ఉపశమనం మాత్రమే లభించేది.
అదనంగా, ఆమెకు వారానికి ఒకసారి నుదుటి వెనుక భాగంలో ఒత్తిడిగా అనిపించే తలనొప్పి వచ్చేది. దీంతో ముందుకు వంగడం కూడా కష్టంగా ఉండేది. అయితే, రాత్రి బాగా నిద్రపోయిన తరువాత ఈ లక్షణాలు తగ్గిపోయేవి. ఆమె ఆహారపు అలవాట్లు కూడా క్రమబద్ధంగా ఉండేవి కావు. ఉదయం కేవలం కాఫీ మాత్రమే తీసుకుని, మధ్యాహ్నం ఒంటి గంట తరువాత మొదటి భోజనం చేసేవారు. అలాగే, రోజుకు సుమారు ఒక లీటరు నీరు మాత్రమే తాగేవారు.
2025 జనవరి 7న ఆమె ప్రాక్టీషనర్ని సంప్రదించినప్పుడు, తనకు మోకాలి నొప్పి నుండి ఉపశమనం లభిస్తే చాలని మాత్రమే కోరుకున్నారు. ఆమెకు ఈ క్రింది కాంబినేషన్ ఇవ్వబడింది:
#1. CC20.3 Arthritis…TDS
#2. CC20.4 Muscles & Supportive tissue + #1…BD ఆవ నూనెలో బాహ్యంగా రాసుకోవడానికి
వైద్యుల చీటీ లేకుండానే దొరికే (OTC) మందులను పూర్తిగా నిలిపివేశారు. అలాగే, రోజూ తాగే నీటి పరిమాణాన్ని క్రమంగా 1.5 నుండి 2 లీటర్లకు పెంచాలని, ఉదయం కాఫీ తాగే ముందు ఒక గ్లాసు నీరు తాగాలని, పనికి వెళ్లే ముందు ఏదైనా తేలికపాటి ఆహారం తీసుకోవాలని సూచించారు. ఆమె ఈ సూచనలన్నింటినీ క్రమంగా పాటించారు.
చికిత్సలో పురోగతి:
➢ 8 జనవరి 2025: మోకాలి మరియు తుంటి నొప్పి 50% వరకు తగ్గింది.
➢ 12 జనవరి 2025: నొప్పి 90% వరకు తగ్గింది. మెట్లు ఎక్కడం, ఇంటి పనులు చేయడం సులభమైంది. #2 కాంబినేషన్‌ను మాత్రమే రోజుకు ఒకసారి (OD) కొనసాగించాలని సూచించారు.
➢ 30 జనవరి 2025: మెట్లు ఎక్కేటప్పుడు మాత్రమే స్వల్ప నొప్పి మిగిలి ఉంది.
➢ 15 ఫిబ్రవరి 2025: నొప్పి పూర్తిగా నయమైంది. రోగి ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. #1 మోతాదును రోజుకు ఒకసారి (OD)కి తగ్గించి, #2 ను నిలిపివేశారు.
➢ 26 ఫిబ్రవరి 2025: కర్ణాటకలోని సప్తగిరులపై ఉన్న మహాదేశ్వర స్వామి ఆలయానికి క్లిష్టమైన ట్రెక్కింగ్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. అలాగే, మూడు గంటలపాటు క్యూలో నిలబడినప్పటికీ ఎలాంటి నొప్పి కలగలేదు.
➢ 5 మార్చి 2025: #1 మోతాదును క్రమంగా తగ్గిస్తూ పూర్తిగా నిలిపివేశారు. కడుపులో మంట మరియు సైనసైటిస్ వల్ల వచ్చే తలనొప్పి కోసం #3. CC4.10 Indigestion + CC19.5 Sinusitis రోజుకు మూడుసార్లు (TDS) ఇవ్వబడింది.
➢ 10 ఏప్రిల్ 2025: కడుపులో మంట మరియు తలనొప్పి పూర్తిగా తగ్గాయి. #3 మోతాదును రోజుకు ఒకసారి (OD)కి తగ్గించారు.
➢ 15 జూన్ 2025: #3 మోతాదును క్రమంగా తగ్గిస్తూ పూర్తిగా నిలిపివేశారు.
2025 అక్టోబరు నాటికి, ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో, చురుకుగా, ఎలాంటి లక్షణాలు లేకుండా ఉన్నారు.
అలెర్జీ బ్రోన్కైటిస్ 11648 ...India
ప్రాక్టీషనర్ యొక్క పొరుగింటి వారి 33 సంవత్సరాల కుమారుడు, 2001 నుండి గత 22 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం శీతాకాలంలో (నవంబరు నుండి జనవరి వరకు) పునరావృతమయ్యే దగ్గుతో బాధపడుతున్నారు. ఈ దగ్గు కొన్నిసార్లు పొడిదగ్గుగా, మరికొన్నిసార్లు కఫంతో కూడినదిగా ఉండేది. దీనితో పాటు ముక్కు నుంచి నీరు కారడం కూడా ఉండి, శీతాకాలం మొత్తం ఈ సమస్య కొనసాగేది. చల్లని గాలికి గురైనప్పుడు ఈ సమస్య మరింత తీవ్రమై, ముఖ్యంగా రాత్రివేళల్లో ప్రతి గంటకోసారి 2 నుండి 3 నిమిషాలపాటు తీవ్రమైన దగ్గు వచ్చేది. ఆ దగ్గు శబ్దం ఇంట్లోనే కాకుండా బయట ఉన్నవారికి కూడా వినిపించేంత తీవ్రంగా ఉండేది. ఇలాంటి తీవ్రమైన దగ్గు దాడులు సాధారణంగా వారం రోజులకుపైగా కొనసాగేవి. పగటి సమయంలో దగ్గు కొంత తక్కువగా ఉండి, ప్రతి 3 నుండి 4 గంటలకు ఒకసారి 2 నుండి 3 నిమిషాలపాటు వచ్చేది.
ఇతర ఋతువులలో కూడా చల్లని గాలి లేదా ఎయిర్ కండిషనర్ (AC) కారణంగా ఇలాంటి దగ్గు దాడులు వచ్చేవి. అయితే, అవి సాధారణంగా ఒకటి లేదా రెండు రోజుల్లో తగ్గిపోయేవి. ఇన్ని సంవత్సరాలుగా ఈ సమస్యతో బాధపడుతున్నప్పటికీ, ఆయన ఎప్పుడూ వైద్యుడిని సంప్రదించలేదు. సమస్యను ప్రేరేపించే కారణాలను నివారించడం, గోరువెచ్చని నీరు తాగడం, అలాగే ఇంటి వైద్యంగా మూలికలతో చేసే చికిత్సలను ఆశ్రయించేవారు. వీటి వల్ల కొన్ని రోజుల్లో సుమారు 50% వరకు ఉపశమనం లభించినప్పటికీ, అది తాత్కాలికంగానే ఉండేది. అదనంగా, తన తల్లి అనారోగ్యం కారణంగా ఆయన మానసిక ఒత్తిడికి కూడా గురయ్యారు.
రెండు రాత్రులుగా తీవ్రమైన దగ్గుతో బాధపడుతూ 2023 జనవరి 2న ఆయన ప్రాక్టీషనర్‌ను సంప్రదించినప్పుడు, ఆయనకు ఈ క్రింది కాంబినేషన్ ఇవ్వబడింది:
#1. CC9.2 Infections acute + CC15.1 Mental & Emotional tonic + CC19.2 Respiratory allergies + CC19.6 Cough chronic…6TD
ఆయన ఇంతవరకు చురుకైన జీవనశైలిని పాటించడం లేదని గమనించి, ప్రతిరోజూ నడవడం లేదా తేలికపాటి శారీరక వ్యాయామం చేయాలని సూచించారు. అలాగే, ఇంటి వైద్యంగా తీసుకుంటున్న చికిత్సలను కూడా నిలిపివేయాలని సూచించారు.
చికిత్సలో పురోగతి:
➢ 10 జనవరి 2023: రాత్రివేళ వచ్చే దగ్గు ప్రతి రాత్రి 3 నుండి 4 సార్లకు తగ్గింది. ఒక్కోసారి ఒక నిమిషం కంటే తక్కువసేపే కొనసాగింది. దగ్గు తీవ్రత మూడింట రెండొంతులు తగ్గడంతో పాటు, నిద్ర కూడా మెరుగుపడింది. ఔషధం మోతాదును రోజుకు మూడుసార్లు (TDS)కి తగ్గించారు.
➢ 30 జనవరి 2023: అన్ని లక్షణాలు పూర్తిగా నయమయ్యాయి.
➢ 1 మార్చి 2023: #1 మోతాదును రోజుకు ఒకసారి (OD)కి తగ్గించి, క్రమంగా తగ్గిస్తూ 2023 ఏప్రిల్ 30న పూర్తిగా నిలిపివేశారు.
➢ 10 అక్టోబరు 2023: ఎయిర్ కండిషనర్ (AC) చల్లని గాలికి గురైనప్పటికీ సమస్య మళ్లీ రాలేదు. రాబోయే శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నివారణ కోసం #2. CC19.2 Respiratory allergies + CC19.3 Chest infections chronic + CC19.6 Cough chronic వారానికి రెండుసార్లు (2TW) ఇవ్వబడింది.
➢ 10 నవంబరు 2023: ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. అందువల్ల #2 ను నిలిపివేశారు.
➢ 30 జనవరి 2024: సమస్య మళ్లీ రాకపోవడంతో ఆయన ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.
2025 అక్టోబరు నాటికి, ఆయన పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు.
ప్రాక్టీషనర్ పరిశీలన: దీర్ఘకాలిక దగ్గు, మైగ్రేన్ వంటి సమస్యలకు ఇంతకుముందు ఎప్పుడూ అల్లోపతి మందులు తీసుకోని రోగులలో, వైబ్రియానిక్స్ ద్వారా త్వరగా ఉపశమనం లభించినట్లు గమనించబడింది.
ప్రాక్టిషనర్ల వివరములు 11656...India
శ్యామల కస్తూరి 11656… ఇండియా మెకానికల్ ఇంజినీరింగ్‌లో పట్టభద్రురాలైన ఆమె, తన ఇష్టంతో అంకితభావం కలిగిన గృహిణిగా ఉండడాన్ని ఎంచుకున్నారు. సంగీతం మరియు సేవ ఆమెకు అత్యంత ఇష్టమైన రెండు అభిరుచులు. సాయి భక్తుల కుటుంబంలో
జన్మించిన ఆమెకు, తన తాతయ్య చెప్పిన స్వామివారి దివ్యలీలల ద్వారా చిన్నప్పటి నుంచే భగవాన్‌పై గాఢమైన ప్రేమాభిమానాలు పెంపొందాయి. 2006లో సాయి భజన మండలి సమీపానికి నివాసం మారిన తరువాత, ఆమె సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడం ప్రారంభించారు. 2008లో సాయి భక్తులు కాని కుటుంబం యొక్క వ్యక్తితో వివాహం కావడంతో, 11 సంవత్సరాలపాటు సాయి కార్యక్రమాలకు దూరంగా ఉండవలసి వచ్చింది. అనంతరం 2019లో తన పిల్లల కోసం బాల వికాస్ తరగతిని వెతుకుతున్న సందర్భంలో, ఆనందంగా మళ్లీ సాయి కుటుంబంలోకి అడుగుపెట్టారు.
అప్పటి నుండి ఆమె నారాయణ సేవ, బట్టలు మరియు దుప్పట్ల పంపిణీ, అలాగే ఒక పాఠశాల మరియు మానసిక ఆరోగ్య సంస్థలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఆమె తన సమితిలో ప్రధాన భజన గాయనిగా సేవలందిస్తున్నారు. రేడియో సాయి నిర్వహించిన భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో, అలాగే 2025 ఏప్రిల్‌లో ప్రశాంతి నిలయంలో నిర్వహించిన 1008 భజన మాల వంటి ప్రధాన కార్యక్రమాలలో భజనలు ఆలపించే భాగ్యం ఆమెకు లభించింది.
అంకితభావం కలిగిన విద్యావేత్తగా ఆమె సుమారు ఐదు సంవత్సరాలుగా బాల వికాస్ గురువుగా మరియు విద్యా సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తన నివాసంలోనే కాకుండా, వెనుకబడిన ప్రాంతంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో కూడా బాల వికాస్ తరగతులను నిర్వహిస్తున్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో, 200 మంది పిల్లలు మరియు 10 మంది గురువుల భాగస్వామ్యంతో నెల రోజుల పాటు కొనసాగిన ఆన్‌లైన్ వేసవి శిబిరానికి నాయకత్వం వహించారు. అంతేకాకుండా, తల్లిదండ్రుల అవగాహన సమావేశాలు, పిల్లల భజన కార్యక్రమాలు, పుట్టపర్తి యాత్రలు, వ్యాసరచన పోటీలు, అలాగే వివిధ సేవా కార్యక్రమాలను ప్రారంభించి విజయవంతంగా నిర్వహించారు. 2025 ఆగస్టులో, ఆమె కేంద్రానికి చెందిన ఆరుగురు బాల వికాస్ విద్యార్థులు ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ హాల్‌లో భజనలు ఆలపించి, నాటికను ప్రదర్శించే దివ్యావకాశాన్ని పొందడం ఆమె సేవా ప్రస్థానంలో చిరస్మరణీయమైన మైలురాయిగా నిలిచింది.
2022 జూన్‌లో ఒక సాయి భక్తుడు పంపిన వైబ్రియానిక్స్ సంబంధిత వీడియో ద్వారా ఆమెకు వైబ్రియానిక్స్‌తో తొలి పరిచయం ఏర్పడింది. దీనిని స్వామివారు స్వయముగా ఆశీర్వదించారన్న విషయం తెలుసుకున్న వెంటనే, ఆమె మనసు దీనివైపు ఆకర్షితమైంది. అనంతరం, వైబ్రియానిక్స్ రెమెడీల ద్వారా సేవలందిస్తున్న ఒక ప్రాక్టిషనర్ ని కలిసి, ఆయన సేవానుభవాలను విన్నప్పుడు ఆమె హృదయం ఎంతో ప్రభావితమైంది. ప్రస్తుత కాలంలో వైద్య చికిత్సలు అధిక వ్యయభారంతో కూడుకుని కరుణాభావాన్ని కోల్పోతున్న నేపథ్యంలో, ఈ విశిష్టమైన వైద్య విధానం ద్వారా మానవసేవ చేసే మరో దివ్య అవకాశమిదేనని ఆమె దృఢంగా విశ్వసించారు. ఆ సంకల్పంతో వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్గా చేరేందుకు దరఖాస్తు చేసి, 2023 నవంబరులో AVP కోర్సును విజయవంతంగా పూర్తిచేసి, 2024 ఆగస్టులో VPగా అర్హత పొందారు.
ప్రాక్టీషనర్గా సేవ ప్రారంభించిన తొలిరోజుల్లో, ఒక రోజు రాత్రి పొద్దు పోయిన తరువాత ఆమె ఇంటికి వచ్చిన 62 సంవత్సరాల వయస్సు గల తన బంధువుకు చికిత్స అందించారు. ఆ మహిళ గత ఆరు వారాలకు పైగా కఫంతో కూడిన దగ్గుతో (Wet cough) బాధపడుతున్నారు. అల్లోపతి మందులుతో పాటు రెండు సీసాల దగ్గు సిరప్ పూర్తిగా తీసుకున్నప్పటికీ ఉపశమనం కలగలేదు. ఆ రాత్రి ఆమె నిరంతరం దగ్గుతూ ఉండడంతో నిద్రపోలేకపోయారు. ప్రాక్టీషనర్ CC9.2 Infections acute + CC19.2 Respiratory allergies + CC19.3 Chest infections chronic + CC19.5 Sinusitis + CC19.6 Cough క్రానిక్ కాంబినేషన్‌ను నీటిలో తయారుచేసి, ఒక గంటపాటు ప్రతి 10 నిమిషాలకు ఒక మోతాదు చొప్పున తీసుకోవాలని సూచించారు. కేవలం మూడు మోతాదులు తీసుకున్న వెంటనే దగ్గు సుమారు 70 శాతం వరకు తగ్గి, ఆమె ప్రశాంతంగా నిద్రపోగలిగారు. మరుసటి ఉదయానికి పూర్తిగా ఉపశమనం పొందారు. వాస్తవానికి, ఇదే కాంబినేషన్‌తో ప్రాక్టీషనర్ ఇటువంటి 50కిపైగా కేసులకు విజయవంతంగా చికిత్స అందించారు.
2024 ఫిబ్రవరిలో, 10 సంవత్సరాల బాలిక జ్వరం, ఒళ్లునొప్పులు, వాంతులు, నీరసం, అలాగే చెవుల సమీపంలో వాపుతో బాధపడుతోంది. ఆమె చదువుతున్న పాఠశాలలో ఇదే లక్షణాలతో పలువురు విద్యార్థులు బాధపడుతుండటంతో, ఇది గవదబిళ్లలు (Mumps) అయి ఉండవచ్చని అనుమానించారు. ఆమెకు CC9.2 Infections acute + CC9.4 Children’s diseases + CC12.2 Child tonic + CC13.1 Kidney & Bladder tonic కాంబినేషన్‌ను నీటిలో తయారుచేసి, రెండు రోజులపాటు ప్రతి గంటకోసారి, అనంతరం రోజుకు ఆరు సార్లు (6TD) తీసుకోవాలని సూచించారు. ఆమె తల్లికి ఎంతో ఆశ్చర్యం కలిగిస్తూ, ఎలాంటి అల్లోపతి మందులు తీసుకోకుండానే కేవలం మూడు రోజుల్లో బాలిక పూర్తిగా కోలుకుంది.
మరో సందర్భంలో, ఆమె వద్ద పనిచేసే 36 సంవత్సరాల గృహ సహాయకురాలు దీర్ఘకాలంగా తక్కువ రక్తపోటు (సాధారణంగా 95/60 mmHg), తలతిరగడం, నీరసం, నిద్రలేమి వంటి సమస్యలతో బాధపడుతూ, గతంలో మూడుసార్లు స్పృహ తప్పి పడిపోయింది. 2024 మార్చిలో, ప్రాక్టీషనర్ ఆమెకు CC3.2 Bleeding disorders + CC15.1 Mental & Emotional tonic + CC15.6 Sleep disorders కాంబినేషన్‌ను ఒక మోతాదు ఇచ్చి, నిద్రపోయే ముందు 30 నిమిషాల వ్యవధిలో మరో రెండు మోతాదులు తీసుకోవాలని సూచించారు. ఆమెకు ఎంతో ఆనందం కలిగించే విధంగా, కేవలం మూడు మోతాదుల తర్వాతే గృహ సహాయకురాలికి అన్ని లక్షణాల నుంచీ పూర్తిగా ఉపశమనం కలిగి, ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ తరువాత ఆమె ఒక్క మోతాదు కూడా తీసుకోలేదు. ఇప్పటివరకు, అంటే గత 18 నెలలుగా, ఆమెకు ఎలాంటి లక్షణాలు తిరిగి కనిపించలేదు. అంతేకాకుండా, ఆమె రక్తపోటు 110/80 mmHgగా సాధారణ స్థాయిలో కొనసాగుతోంది!
2025 ఆగస్టులో జరిగిన పుట్టపర్తి యాత్ర సందర్భంగా జరిగిన ఒక సంఘటనను ఆమె చిరస్మరణీయమైన అనుభవంగా గుర్తుచేసుకుంటారు. సాయి కుల్వంత్ హాల్‌లో మరుసటి రోజు జరగాల్సిన కార్యక్రమంలో తన కుమార్తెతో కలిసి భజన పాడవలసిన బాలికకు, కార్యక్రమానికి ముందు రాత్రి తీవ్ర జ్వరం వచ్చింది. మందులు వాడినప్పటికీ ఎలాంటి ఉపశమనం కలగలేదు. అప్పుడు ప్రాక్టీషనర్ Immunity Booster (IB) ను నీటిలో తయారుచేసి, తదుపరి ఒక గంటపాటు తరచుగా తీసుకోవాలని సూచించారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ, మరుసటి రోజు ఉదయం 7 గంటలకే ఆ బాలిక పూర్తిగా కోలుకొని, కార్యక్రమంలో ఆనందంగా భజనలు ఆలపించింది. ఆమె తల్లి వైబ్రియానిక్స్‌ను భగవంతుడు ప్రసాదించిన అద్భుతమైన వరం అని ప్రశంసించారు.
రజోనివృత్తి (post-menopausal) అనంతరం గర్భాశయ తొలగింపు (Hysterectomy) చేయించుకున్న అనేక మంది మహిళలు మోకాలు, వెన్ను లేదా భుజాలలో SMJ నొప్పితో బాధపడుతుంటారు. అటువంటి సందర్భాల్లో, సంబంధిత నొప్పి నివారణ కాంబినేషన్‌కు CC8.1 Female tonicను జోడించడం ద్వారా, తాను చికిత్స చేసిన ఏడు కేసులలోనూ అద్భుతమైన ఫలితాలు లభించినట్లు ఆమె గుర్తించారు. అలాగే, తలతిరగడం (Vertigo)తో బాధపడుతున్న నలుగురు రోగులకు CC5.1 Ear infections + CC10.1 Emergencies + CC18.7 Vertigo కాంబినేషన్‌ను ఇవ్వగా, వారందరికీ మంచి ఉపశమనం లభించింది.
అనుభవం పెరిగే కొద్దీ, వ్యాధికి మూలకారణాలను మరింత ఖచ్చితంగా గుర్తించి, తగిన కాంబినేషన్లను సూచించే అంతఃస్ఫూర్తి ఆమెలో మరింత పెంపొందింది. సేవా శిబిరాలలో పాల్గొనడం ద్వారా ఆమె వినే నైపుణ్యం, రోగులకు సలహాలు అందించే సామర్థ్యం మరింత మెరుగుపడి, వ్యాధి లక్షణాలతో పాటు వాటికి దోహదపడే మానసిక, భావోద్వేగ మరియు జీవనశైలి సంబంధిత అంశాలను కూడా సమర్థవంతంగా పరిష్కరించగలుగుతున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవాలని, సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకోవాలని, అలాగే ఓంకార జపం, గాయత్రీ మంత్ర పారాయణం వంటి ఆధ్యాత్మిక సాధనలను ఆచరించాలని ఆమె రోగులను ప్రోత్సహిస్తారు. ప్రతి ఔషధాన్ని “బ్రహ్మార్పణం సాయీశ్వరార్పణమస్తు” అనే ప్రార్థనతో భక్తిపూర్వకంగా ప్రసాదంగా అందజేస్తారు.
ప్రస్తుతం ఆమె ప్రతి నెల రెండు సమితి సేవా శిబిరాలలో, అలాగే స్వామివారి పాఠశాలలో నిర్వహించే ఒక సేవా శిబిరంలో సేవలందిస్తూ, రెండు సంవత్సరాల లోపే వెయ్యిమందికి పైగా రోగులకు చికిత్స అందించారు. భవిష్యత్తులో వైబ్రియానిక్స్ ప్రాక్టిషనర్లకు మార్గదర్శకురాలిగా సేవ చేయాలనే ఆకాంక్ష కూడా ఆమెకు ఉంది. వైబ్రియానిక్స్ సేవ తనలో సహనం, కరుణ, సమస్త జీవుల పట్ల ప్రేమను మరింత పెంపొందించిందని, అదే సమయంలో స్వామివారితో నిరంతర అనుబంధాన్ని ప్రసాదించిందని ఆమె చెబుతారు. ఆమె దృష్టిలో, వైబ్రియానిక్స్ అనేది బాబా ప్రసాదించిన ఒక పవిత్ర వరం—ఆపదలో ఉన్నవారికి సేవ చేసే అవకాశం, ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఒక సాధనం, నిస్వార్థ సేవలో నిజమైన తృప్తిని పొందే మార్గం. చికిత్స అనంతరం రోగి ముఖంపై కనిపించే ప్రతి ఉపశమన చిరునవ్వు ఆమె హృదయాన్ని ఆనందంతో, కృతజ్ఞతతో నింపుతుంది.
Cases to share:
ప్రశ్నలు జవాబులు
Q1. అనేక అద్భుతమైన విజయగాథలు ఉన్నప్పటికీ, సాయి వైబ్రియానిక్స్‌కు ఇంకా విస్తృత గుర్తింపు ఎందుకు లభించలేదు?
A. సాయి వైబ్రియానిక్స్ అత్యంత సూక్ష్మమైన కంపనాలు (వైబ్రేషన్లు) మరియు ఆధ్యాత్మిక శక్తులపై ఆధారపడిన చికిత్సా విధానం. ఇవి ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంప్రదాయ శాస్త్రీయ కొలమానాల పరిధికి అతీతమైనవి. వేలాది కేసు అధ్యయనాల ద్వారా దీని వైద్య ఫలితాలు విశేషమైనవిగా, చక్కగా నమోదు చేయబడినప్పటికీ, అవి ప్రధానంగా అనుభవాధారిత (anecdotal) ఆధారాలుగానే ఉన్నాయి; ఇంకా సమీక్షిత (peer-reviewed) శాస్త్రీయ పత్రికల్లో ప్రచురించబడలేదు.
సేవా భావంతో, వాణిజ్య లక్ష్యం లేకుండా నడుస్తున్న వ్యవస్థ కావడం వల్ల, దీనికి విస్తృత ప్రచారం లేదా సంస్థాగత మద్దతు కూడా పరిమితంగానే ఉంది. అంతేకాక, ప్రస్తుత శాస్త్రీయ నమూనాల ద్వారా పూర్తిగా వివరించలేని చికిత్సా విధానాలను ప్రధాన వైద్య వ్యవస్థ సాధారణంగా సులభంగా అంగీకరించదు. అయితే, ప్రతి ప్రాక్టీషనర్ నిస్వార్థ సేవతో చేసే ప్రతి చికిత్స, ప్రతి విజయవంతమైన స్వస్థత కథనం, వైబ్రియానిక్స్‌ను దైవకరుణతో కూడిన పవిత్ర వైద్యశాస్త్రంగా ప్రపంచం ఒక రోజు గుర్తించే దిశగా నిశ్శబ్దంగా పునాది వేస్తూనే ఉన్నాయి. ఉన్నతమైన దృక్కోణంలో చూస్తే, మానవజాతి శక్తి ఆధారిత చికిత్సలను స్వీకరించేందుకు మరింత సిద్ధమైనప్పుడు, దైవ సంకల్పానుసారం తగిన సమయంలో ఈ గుర్తింపు సహజంగానే లభిస్తుంది. అప్పుడు బాబా మనలో కొందరితో వ్యక్తిగతంగా చెప్పిన ఈ ప్రవచన వాక్యాలు సాక్షాత్కారమవుతాయి: “ఇది భవిష్యత్తు వైద్యం (Medicine of the Future)!”
________________________________________________________________________________________________________
Q2. SRHVP ద్వారా స్వస్థత కోసం మంత్రాలు లేదా పవిత్ర నామాలను ప్రసారం (Broadcast) చేయవచ్చా?
A. సందర్భాన్ని అర్థం చేసుకోవడానికి: తగిన పౌనఃపున్యం (ఫ్రీక్వెన్సీ)తో ఉత్పన్నమయ్యే ధ్వని, శరీరంలోని సూక్ష్మ శక్తి క్షేత్రాన్ని ప్రభావితం చేసి, కొన్ని నిర్దిష్ట వ్యాధుల నివారణకు ఉపకరించే సాధనంగా పనిచేయగలదు. మంత్రాలను శక్తివంతమైన ధ్వని సూత్రాలుగా (Vibrational Formulas) పరిగణిస్తారు. ఓం, సోహం, గాయత్రీ వంటి పవిత్ర అక్షరాలను పునరావృతంగా జపించడం వల్ల ఉత్పన్నమయ్యే ధ్వని తరంగాలు మెదడు తరంగాలను సమకాలీకరించి (Entrain), విశ్రాంతి మరియు స్వస్థతకు అనుకూలమైన ఆల్ఫా, థీటా స్థితులను కలిగించగలవని భావిస్తారు. నియమితంగా మంత్రజపం చేయడం మనస్సును ప్రశాంతపరచి, ఆందోళనను తగ్గించి, భావోద్వేగ అవరోధాలను తొలగించడంలో సహాయపడుతుంది. రోగి స్వయంగా మంత్రజపం చేయగలిగితే, అది స్వస్థత ప్రక్రియను మరింత వేగవంతం చేయవచ్చు. అదేవిధంగా, మంత్రాల ప్రభావం ఉత్తమంగా ఉండాలంటే వాటిని సరైన ఉచ్చారణ, లయ, సమయపాలనతో స్పష్టంగా శబ్దపూర్వకంగా జపించడం మంచిదని భావిస్తారు. మంత్రాల శక్తి వాటి పదార్థంలో కాకుండా, వాటి ధ్వని స్పందన, లయ, నిరంతర పునరావృతంలోనే నిక్షిప్తమై ఉంటుంది. ఈ ప్రభావం తరచుగా సాధారణ తార్కిక వివరణకు అతీతంగా అనుభూతి చెందబడుతుంది.
ప్రాక్టీషనర్ దృక్కోణంలో, SRHVP అనేది రెమెడీల కంపన నమూనాలను (Vibrational Patterns) ప్రసారం చేయడానికి రూపొందించబడింది; మంత్రాలు లేదా నామస్మరణ వంటి ధ్వని ఆధారిత లేదా వాచిక శక్తులను ప్రసారం చేయడానికి కాదు. అయినప్పటికీ, మంత్రాలు సహాయక పాత్రను పోషిస్తూ, ప్రాక్టీషనర్ యొక్క స్వస్థత సంకల్పాన్ని మరింత బలపరుస్తాయి. మంత్రజపం చేసే సమయంలో ప్రాక్టీషనర్ యొక్క శ్రద్ధ, ఏకాగ్రత, విశ్వాసం చికిత్సా స్పందనలను ప్రసారం చేయడంలో కీలకమైనవిగా పరిగణించబడతాయి. అందువల్ల, రెమెడీలను తయారుచేసేటప్పుడు లేదా SRHVP ద్వారా ప్రసారం చేస్తున్నప్పుడు మంత్రాలు లేదా ప్రార్థనలు చేయడం, ఆ ప్రక్రియ యొక్క ఆధ్యాత్మిక శక్తిని మరింత పెంపొందించగలదు. అయితే, అలా చేయడం వల్ల ప్రసారం చేయబడుతున్న ఔషధ స్పందనల స్వరూపం (Vibrational Integrity) మాత్రం మారదు.
________________________________________________________________________________________________________
Q3. అధిక రక్తపోటు, మధుమేహం, ఆర్థ్రైటిస్ వంటి అనేక వ్యాధుల కోసం ఒక రోగి రోజంతా అనేక అల్లోపతి మందులు తీసుకుంటున్నట్లయితే, వాటిలో గరిష్ఠంగా ఎన్ని అల్లోపతి మందులను ఒకే సీసాలో కలిసి పొటెంటైజ్ చేయవచ్చు?
A. సమాధానం: ఒకే సీసాలో గరిష్ఠంగా ఏడు అల్లోపతి మందులను కలిసి పొటెంటైజ్ చేయవచ్చు. ఈ పరిమితి వల్ల ప్రతి ఔషధానికి చెందిన ప్రత్యేక కంపన స్వరూపం (Vibrational Signature) నిలిచి ఉండటానికి సహాయపడుతుంది. అలాగే, ఒకదానితో మరొకటి శక్తిపరంగా జోక్యం చేసుకోవడం (Energetic Interference) లేదా కంపన ప్రభావం పలుచబడటం (Dilution Effect) వంటి పరిస్థితులను నివారించి, ఔషధాల ప్రభావం తగ్గకుండా ఉండేలా చేస్తుంది. ఒకవేళ రోగి ఏడు కంటే ఎక్కువ అల్లోపతి మందులు తీసుకుంటున్నట్లయితే, రోగి ప్రధాన ఆరోగ్య సమస్యలకు అత్యంత అవసరమైన మందులకు ప్రాధాన్యం ఇచ్చి వాటినే పొటెంటైజ్ చేయడం ఉత్తమం. లేకపోతే, మందులను రెండు వేర్వేరు సీసాల్లో పొటెంటైజ్ చేసి ఇవ్వవచ్చు.
________________________________________________________________________________________________________
Q4. వైబ్రియానిక్స్‌లో వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేసే (Anti-ageing) చికిత్స ఏదైనా ఉందా?
A. వృద్ధాప్యం అనేది వయస్సు పెరుగుతున్న కొద్దీ శారీరక, మానసిక, సామాజిక మార్పులు సహజంగా సంభవించే ప్రక్రియ. వృద్ధాప్యంలో కొన్ని అంశాలు జీవశాస్త్రపరంగా అనివార్యమైనప్పటికీ, ప్రతి వ్యక్తి వృద్ధాప్యాన్ని అనుభవించే విధానం జన్యుపరమైన లక్షణాలు, పరిసరాలు, జీవనశైలి, అలాగే వ్యక్తిగత దృక్పథంపై ఆధారపడి ఉంటుంది. వృద్ధాప్యంలో తరచుగా గుర్తించని, కానీ అత్యంత ప్రభావవంతమైన అంశం మన దృక్పథం. వయస్సు పెరగడాన్ని మనం ఎలా స్వీకరిస్తామనే విషయం, వృద్ధాప్యాన్ని అనుభవించే విధానంపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. సానుకూల దృక్పథం మానసిక దృఢత్వం, ఉత్సాహం, భావోద్వేగ సమతుల్యతను పెంపొందిస్తే, ప్రతికూల ఆలోచనలు శారీరక, మానసిక క్షీణతను వేగవంతం చేయవచ్చు. వృద్ధాప్యంలో కొన్ని అంశాలు మన నియంత్రణలో లేకపోయినా, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా అనేక అంశాలను సానుకూలంగా ప్రభావితం చేయవచ్చు (మా ఆరోగ్య వ్యాసాలను చూడండి). వైబ్రియానిక్స్‌లో వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేయడానికి, జీవశక్తిని పునరుద్ధరించడానికి, అలాగే శారీరక, మానసిక, భావోద్వేగ స్థాయిలలో సమగ్ర పునరుజ్జీవనాన్ని (Rejuvenation) ప్రోత్సహించడానికి ఉపయోగపడే అనేక కాంబినేషన్లు ఉన్నాయి. వీటి ప్రధాన ఉద్దేశ్యం శరీరంలోని శక్తి ప్రవాహాలను సమతుల్యం చేసి, శరీరం సహజంగా తనను తాను పునరుద్ధరించుకునే (Self-regenerative) సామర్థ్యాన్ని పెంపొందించడం.
From 108CC box, give: CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC17.2 Cleansing + CC20.3 Arthritis + CC21.1 Skin tonic.
SRHVP users, give: SR260 Mag Phos + SR306 Phosphorus 200C + SR323 Veratrum Alb 30C + SR408 Secale Corn 200C + SR561 Vitamin Balance.
ఈ కాంబినేషన్లను క్రమం తప్పకుండా ఉపయోగించడంతో పాటు, ఆధ్యాత్మిక జీవన విధానాన్ని అనుసరించడం వల్ల వృద్ధాప్యాన్ని హుందాగా, ఆరోగ్యవంతంగా స్వీకరించడానికి, అలాగే అంతరంగ కాంతి, జీవశక్తి వికసించడానికి విశేషంగా తోడ్పడుతుంది.
________________________________________________________________________________________________________
Q5. ప్రసారం (Broadcasting) కోసం వెంట్రుకల నమూనాను సేకరించే సరైన విధానం ఏమిటి? అలాగే, హెయిర్ డైలు లేదా షాంపూలు వాటి కంపనాలపై ఏమైనా ప్రభావం చూపుతాయా?
A. తల పైభాగం లేదా వెనుక భాగం నుండి 5 నుండి 10 శుభ్రమైన, పొడి వెంట్రుకలను సేకరించాలి. వాటిలో తల చర్మానికి అత్యంత దగ్గరగా ఉండే 1 నుండి 2 అంగుళాల భాగాన్ని మాత్రమే ఉపయోగించాలి. ఈ వెంట్రుకలను పాలిథిన్ సంచిలో కాకుండా, స్థిరవిద్యుత్ (Static) ప్రభావం కలగకుండా ఉండేందుకు, రోగి వివరాలతో గుర్తింపు చేసిన కాగితపు కవరులో భద్రపరచడం ఉత్తమం. వైబ్రియానిక్స్ దృక్కోణంలో, వెంట్రుకలు వ్యక్తి యొక్క సూక్ష్మ శక్తి స్పందనలను (Energetic Signature) అనేక సంవత్సరాల పాటు నిలుపుకుంటాయని భావిస్తారు. హెయిర్ డైలు లేదా షాంపూల వంటి రసాయన చికిత్సలు ఆత్మకు సంబంధించిన ఈ సూక్ష్మ స్పందనలను నాశనం చేయవు; అవి వెంట్రుకలలో ఉపరితల రసాయన మార్పులకు అతీతంగా నిలిచి ఉంటాయని భావించబడుతుంది. అయితే, ఔషధ గుణాలు కలిగిన షాంపూలు లేదా బలమైన సువాసన గల షాంపూలు, హెయిర్ డైలు వంటివాటి అవశేషాలు సూక్ష్మ స్థాయిలో కొంత అంతరాయం కలిగించే అవకాశం ఉన్నందున, కొత్తగా రంగు వేసిన వెంట్రుకలను ఉపయోగించకపోవడం మంచిది. అవసరమైతే, వెంట్రుకలను ఉపయోగించే ఒకటి లేదా రెండు రోజుల ముందు బాగా కడిగి, పూర్తిగా ఆరిన తరువాత నమూనా సేకరించాలి. సాధ్యమైనప్పుడల్లా, ఎలాంటి రసాయన చికిత్స చేయని వెంట్రుకలను ఉపయోగించడం ఉత్తమ పద్ధతిగా పరిగణించబడుతుంది.
దివ్య వైద్యుని దివ్యవాణి
“చెడు అలవాట్లే అనారోగ్యానికి మూలకారణం. కాబట్టి వాటిని పూర్తిగా విడనాడండి. చిన్నపిల్లలకు బుగ్గలు గుండ్రంగా, ఆరోగ్యంగా ఉండాలి. కానీ నేడు వారి ముఖాలు చిక్కిపోయి కనిపిస్తున్నాయి. మీరు మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి. మంచి ఆరోగ్యమే పుణ్యకార్యాలు చేయడానికి శక్తిని ఇస్తుంది. అలాంటి సత్కార్యాల ద్వారానే నిజమైన ఆనందం లభిస్తుంది. కాబట్టి ఆనందానికి మూలం మంచి ఆరోగ్యమే. అందువల్ల ఆనందాన్ని పొందాలంటే మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఆనందమే మీ గొప్ప సంపద. ఆరోగ్యమే మీ మహాభాగ్యం, మీ నిజమైన ఐశ్వర్యం.”
…సత్య సాయిబాబాబా, “ఆరోగ్యమే మహాభాగ్యం”, దివ్య ప్రసంగం, సమ్మర్ షవర్స్, 27 మే 2002 https://sssbpt.info/summershowers/ss2002d12.pdf
“సమాజం అంటే ప్రజల సమాహారం. సమాజంలోని ప్రజలు స్వచ్ఛందంగా, పవిత్రమైన ఉద్దేశాలతో పరస్పరం సహకరించుకోవడమే సేవ యొక్క ముఖ్య లక్షణం. సేవకు రెండు ప్రాథమిక లక్షణాలు ఉన్నాయి. అవి కరుణ మరియు త్యాగానికి సిద్ధపడే మనస్తత్వం.”
… సత్యసాయిబాబా, “Lessons on Seva Sadhana”, దివ్య ప్రసంగం, సేవాదళ్ సదస్సు, 19 నవంబరు 1981 https://www.ssssahitya.org/discourses/1981/lessons-on-seva-sadhana
ప్రకటనలు
భవిష్యత్తులో నిర్వహింప బోయే వర్క్ షాపులు*
- ఇండియా పుట్టపర్తి: వర్చువల్ AVP* ప్రాక్టికల్ వర్క్ షాప్: 3 నుండి 21 నవంబరు 2025 వరకు తరువాత ప్రత్యక్ష (Face-to-Face) వర్క్‌షాప్: 26 నుండి 28 నవంబరు 2025 వరకు. మరిన్ని వివరాల కోసం [email protected] ను సంప్రదించండి.
- ఇండియా పుట్టపర్తి: SVP ప్రాక్టికల్ వర్క్ షాప్: * 1 నుండి 4 డిసెంబరు 2025 వరకు. మరిన్ని వివరాల కోసం [email protected] ను సంప్రదించండి.
* ప్రవేశ ప్రక్రియను పూర్తి చేసి, ఈ-కోర్సును విజయవంతంగా పూర్తిచేసిన వారికి మాత్రమే;
అదనంగా
1. ఆరోగ్య వ్యాసం
మీ కణాల ఆరోగ్యాన్ని కాపాడుకోండి – ప్రాణాంతక క్యాన్సర్ను నివారించండి!
“గాలి, నీరు, ఆహారంలోని కాలుష్యాలు క్యాన్సర్కు తోడ్పడే అంశాలు మాత్రమే. అయితే క్యాన్సర్కు ప్రధాన కారణం తెల్ల చక్కెర. దీనికి కారణం, చక్కెర శుద్ధి ప్రక్రియలో అనేక రసాయనాలను ఉపయోగించడం. వాటిలో ఒకటి ‘బోన్ చార్’. చక్కెరను తీసుకున్నప్పుడు దాని అవశేషాలు శరీరంలోని ఏదో ఒక భాగంలో చేరి సమస్యలను కలిగించవచ్చు. పూర్వకాలంలో ప్రజలు చక్కెరను ఏ రూపంలో తీసుకునేవారు? ఈ కృత్రిమ, శుద్ధి చేసిన చక్కెర రూపంలో కాదు; సంపూర్ణమైన బెల్లం రూపంలోనే తీసుకునేవారు.” — శ్రీ సత్యసాయిబాబా 1,2
1. కణాల ఆరోగ్యం అత్యంత కీలకం!
1.1 మన ఆరోగ్యం కణాల (Cells) సమష్టి కృషిపై ఆధారపడి ఉంటుంది. కణాలే జీవానికి ప్రాథమిక నిర్మాణ ఘటకాలు. అవి
నిరంతరం నశిస్తూ, అదే సమయంలో కొత్త కణాలు ఏర్పడుతూ ఉంటాయి. కణాలు ఎంత ఆరోగ్యంగా ఉంటే, మన శరీరం కూడా అంత ఆరోగ్యంగా ఉంటుంది. సగటున మానవ శరీరంలో 30 నుండి 40 ట్రిలియన్ల కణాలు ఉంటాయి. ఇవి సుమారు 200 రకాలుగా ఉండి, వయస్సు, లింగం, ఎత్తు, శరీర బరువు, ఆరోగ్య స్థితి, పరిసరాల వంటి అంశాల ఆధారంగా వాటి సంఖ్య మారవచ్చు. రక్త కణాలు స్వల్పకాలం మాత్రమే జీవిస్తే, కాలేయ కణాలు సుమారు 18 నెలల వరకు జీవించగలవు. మెదడు కణాలు మాత్రం జీవితాంతం కొనసాగుతాయి. ఈ కణాలన్నీ సమన్వయంతో పనిచేస్తూ శరీరంలోని ప్రాథమిక విధులను నిర్వహిస్తాయి. సాధారణ కణాలలో వాటి పెరుగుదల, విభజన, మరమ్మత్తును నియంత్రించే జన్యువులు (Genes) ఉంటాయి. ఆంకోజీన్లు కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ట్యూమర్ సప్రెసర్ జన్యువులు అధిక కణ విస్తరణను నిరోధించే బ్రేకులా పనిచేస్తాయి. DNA మరమ్మత్తు జన్యువులు జన్యు పదార్థంలో ఏర్పడే లోపాలను సరిచేస్తాయి.3-6
1.2 ఆరోగ్యకరమైన కణాల జీవన చక్రం: ఆరోగ్యకరమైన కణాలు ఒక క్రమబద్ధమైన జీవన చక్రాన్ని అనుసరిస్తాయి. అవి
మొదట పెరుగుతాయి, తరువాత తమ DNAను ప్రతిరూపం (Replication) చేసుకుంటాయి. అనంతరం నియంత్రిత ప్రక్రియలో విభజన చెంది, పరిపక్వత సాధించి శరీరానికి అవసరమైన విధులను నిర్వహిస్తాయి. దెబ్బతిన్న కణాలు మరింతగా విభజించకుండా శరీరం నిరోధిస్తుంది. చివరికి అవి అపోప్టోసిస్ (Apoptosis) అనే సహజ ప్రక్రియ ద్వారా క్రమంగా కుంచించుకుని చిన్న చిన్న భాగాలుగా విడిపోతాయి. ఈ భాగాలను శరీరం సురక్షితంగా తొలగిస్తుంది; ఈ ప్రక్రియలో చుట్టుపక్కల ఉన్న ఆరోగ్యకరమైన కణాలకు ఎలాంటి హాని కలగదు. మన శరీర నిర్మాణానికి సంబంధించిన DNA (శరీర నిర్మాణ పథకం – Blueprint of the Body) మన జీవసంబంధమైన తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా లభిస్తుంది. ఇందులోని జన్యువులు ప్రతి వ్యక్తిని ప్రత్యేకంగా నిలబెడతాయి. ఎర్ర రక్తకణాలు , ప్లేట్‌లెట్లు మినహా దాదాపు అన్ని కణాలలో DNA ఉంటుంది. కణాల పెరుగుదల, అభివృద్ధి, పునరుత్పత్తికి అవసరమైన జన్యు సమాచారాన్ని నిల్వ చేసి, దానిని ఉపయోగించి ప్రోటీన్లను తయారుచేయడం DNA యొక్క ప్రధాన బాధ్యత. ఈ ప్రోటీన్లే కణాల పనివారిలా పనిచేస్తూ, జీర్ణక్రియ నుండి కణాల మరమ్మత్తు వరకు శరీరంలోని దాదాపు అన్ని ముఖ్యమైన విధులను నిర్వహిస్తాయి.7-10
2. క్యాన్సర్ ఎలా ఏర్పడుతుంది
2.1 క్యాన్సర్ అనేది, సాధారణంగా చెప్పాలంటే, కణాల అదుపులేని పెరుగుదల. ఆరోగ్యకరమైన కణాల్లోని కొన్ని నిర్దిష్ట
జన్యువులలో ఉత్పరివర్తనాలు (Mutations) సంభవించినప్పుడు, ఆ కణాలు అసాధారణంగా మారి, శరీరంలోని సహజ నియంత్రణ వ్యవస్థలను దాటవేసి, అధికంగా విభజించుకోవడం (హైపర్ప్లాసియా – Hyperplasia) ప్రారంభిస్తాయి. దీని ఫలితంగా, ఈ అసాధారణ కణాలు ఆరోగ్యకరమైన కణాలను అధిగమించి, ఒకే చోట గుంపుగా చేరి కణితి (Tumour) గా ఏర్పడతాయి. అయితే లుకేమియాలో ఇటువంటి అసాధారణ కణాలు రక్తంలోనే అధికంగా పేరుకుపోతాయి. ప్రారంభ దశలో కణితులు నిరపాయమైనవి (Benign) కావచ్చు. కొన్ని సందర్భాల్లో అవి మొదటి నుంచే క్యాన్సర్ కణితులు గా ఉండవచ్చు. ప్రారంభంలో ఇవి సంబంధిత కణజాలం యొక్క సహజ పరిమితుల్లోనే ఉంటాయి. అయితే అవి పెరుగుతూ దుష్ట స్వభావాన్ని (Malignancy) సంతరించుకున్న తర్వాత, ఆ పరిమితులను దాటి సమీపంలోని కణజాలాల్లోకి చొచ్చుకుపోయి వ్యాపించే సామర్థ్యాన్ని పొందుతాయి.7-14
2.2 క్యాన్సర్ ఎలా వ్యాపిస్తుంది? చాలా రకాల క్యాన్సర్లు సాధారణంగా I నుండి IV వరకు నాలుగు దశల్లో అభివృద్ధి
చెందుతాయి. స్థానికీకరించబడిన క్యాన్సర్ (Localized Cancer) అంటే, క్యాన్సర్ ప్రారంభమైన కణజాలం లేదా అవయవానికే పరిమితమై ఉండి, సమీపంలోని శోషరస గ్రంథులు (Lymph Nodes) లేదా ఇతర అవయవాలకు ఇంకా వ్యాపించని స్థితి. ఇది సాధారణంగా దశ I లేదా II గా పరిగణించబడుతుంది. కొన్ని క్యాన్సర్లలో, ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ లో, దీనికంటే ముందుగా దశ 0 (Carcinoma in situ) ఉంటుంది. ఈ దశలో అసాధారణ కణాలు రొమ్ములోని పాలనాళాలకు మాత్రమే పరిమితమై ఉంటాయి; చుట్టుపక్కల కణజాలాల్లోకి ఇంకా చొచ్చుకుపోవు. ఈ దశలో అవి నిరపాయమైనవిగా ఉండవచ్చు లేదా భవిష్యత్తులో క్యాన్సర్‌గా మారే అవకాశం ఉండవచ్చు. క్యాన్సర్ కణాలు సమీపంలోని అవయవాలకు వ్యాపించి, అక్కడి నుంచి శరీరంలోని దూర ప్రాంతాలకు కూడా విస్తరించడం ప్రారంభించినప్పుడు, దానిని మెటాస్టాసిస్ అంటారు. ఇది సాధారణంగా దశ III లేదా IV లో కనిపిస్తుంది. మెటాస్టాసిస్ ప్రక్రియలో, క్యాన్సర్ కణాలు మొదట ఏర్పడిన కణితి నుంచి విడిపోయి, రక్తప్రవాహం (Bloodstream) లేదా శోషరస నాళాల (Lymph Vessels) ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు చేరి, అక్కడ కొత్త కణితులను ఏర్పరుస్తాయి. వీటినే ద్వితీయ కణితులు అంటారు. క్యాన్సర్ శరీరంలోని దాదాపు ఏ భాగానికైనా వ్యాపించగలదు. ముఖ్యంగా శోషరస గ్రంథులు, ఎముకలు, కాలేయం, ఊపిరితిత్తులు, థైరాయిడ్ గ్రంథి, మెదడు వంటి అవయవాలకు ఇది విస్తరించే అవకాశం ఉంటుంది.11-17
2.3 క్యాన్సర్ రకాలు: క్యాన్సర్‌కు 100 కంటే ఎక్కువ రకాలు ఉన్నాయి. సాధారణంగా ఇవి ప్రారంభమయ్యే స్థలాన్ని
ఆధారంగా మూడు ప్రధాన వర్గాలుగా విభజించబడతాయి: సాలిడ్ క్యాన్సర్లు, రక్త
సంబంధిత క్యాన్సర్లు, మరియు మిశ్రమ క్యాన్సర్లు. అన్ని కేసుల్లో సుమారు 80–90% వరకు సాలిడ్ క్యాన్సర్లు ఉంటాయి. ఇవి ప్రధానంగా- కార్సినోమా: చర్మం, రొమ్ము, పెద్దప్రేగు (Colon), ప్రోస్టేట్ మరియు ఊపిరితిత్తులు వంటి ఎపితీలియల్ కణజాలం లో ఏర్పడుతుంది. - సార్కోమా: ఎముకలు మరియు కనెక్టివ్ టిష్యూలో ఏర్పడుతుంది. రక్త సంబంధిత క్యాన్సర్లు రక్త కణాలు లేదా శోషరస వ్యవస్థ లో ప్రారంభమవుతాయి. ఉదాహరణలు: లుకేమియా, లింఫోమా (Lymphoma), మరియు మల్టిపుల్ మైలోమా. మిశ్రమ క్యాన్సర్ లో ఒకే కణితిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ రకాల కణజాలాల లక్షణాలు కనిపిస్తాయి. ఇది సాధారణ క్యాన్సర్లకు భిన్నం, ఎందుకంటే సాధారణంగా క్యాన్సర్ ఒకే రకమైన కణం నుంచి ప్రారంభమవుతుంది. క్యాన్సర్‌కు పేరు సాధారణంగా అది ప్రారంభమైన అవయవం లేదా కణజాలం ఆధారంగా ఇవ్వబడుతుంది. ఉదాహరణకు, క్యాన్సర్ రొమ్ములో ప్రారంభమైతే దాన్ని రొమ్ము క్యాన్సర్ అంటారు. అదే క్యాన్సర్ ఊపిరితిత్తులు లేదా ఇతర అవయవాలకు వ్యాపించినప్పుడు దాన్ని మెటాస్టాటిక్ బ్రెస్ట్ క్యాన్సర్ గా పేర్కొంటారు.5,12,18,19
2.4 క్యాన్సర్ కారణాలు: క్యాన్సర్ కేవలం జన్యుపరమైన కారణాల వల్ల మాత్రమే కాకుండా, ఆరోగ్యకరమైన కణాలు బాహ్య ప్రభావాల వల్ల మార్పు చెందినప్పుడు కూడా ఏర్పడవచ్చు. ఈ బాహ్య కారణాలలో రసాయనాలు, ఇన్ఫెక్షన్లు, కిరణాలు (Radiation), మరియు జీవనశైలి అలవాట్లు ముఖ్యమైనవి. కొన్ని అభిప్రాయాల ప్రకారం, క్యాన్సర్‌ను కేవలం ఒక వ్యాధిగా కాకుండా, శరీరంలోని అంతర్గత వాతావరణం దాని పెరుగుదలకు అనుకూలంగా మారినప్పుడు ఉద్భవించే ఒక వ్యక్తీకరణగా కూడా చూడవచ్చు. ప్రతి వ్యక్తిలో నిశ్శబ్దంగా ఉన్న క్యాన్సర్ కణాలు ఉండవచ్చని భావిస్తారు; కానీ శరీరంలో అధిక ఒత్తిడి (Stress) వంటి పరిస్థితులు వాటిని చురుకుగా మార్చే అవకాశం ఉంది.20-24
చాలా క్యాన్సర్‌కు సంబంధించిన జన్యు మార్పులు జీవితకాలంలో పొందబడతాయి మరియు అరుదుగా మాత్రమే వారసత్వంగా వస్తాయి. సాధారణంగా ఇవి 60 ఏళ్లు పైబడిన వయస్సులో ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ఇటీవల 20లు మరియు 30ల వయస్సులో ఉన్న యువతలో కూడా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి, ముఖ్యంగా భారత్‌లో ఈ ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. యువతుల్లో రొమ్ము క్యాన్సర్ మరియు యువకుల్లో తల-మెడ క్యాన్సర్లు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం జీవనశైలి మరియు పర్యావరణ కారకాల సమ్మేళనం అని భావించబడుతుంది. వాటిలో ముఖ్యమైనవి: అధిక బరువు, శారీరక శ్రమ లేని జీవనశైలి, అధిక ఒత్తిడి (Stress), ఆలస్యమైన ప్రసవం , ప్రాసెస్డ్ ఆహారం. అదేవిధంగా పరిశ్రమల్లో ఉండే క్యాన్సర్ కారక రసాయనాలు అయిన అస్బెస్టాస్, బెంజీన్, ఫార్మాల్డిహైడ్ వంటి పదార్థాలకు గురికావడం కూడా ప్రమాదాన్ని పెంచుతుంది. ఇంకా, కొన్ని సందర్భాల్లో DNA ప్రతిరూపణ (DNA replication) సమయంలో జరిగే యాదృచ్ఛిక పొరపాట్లు కూడా క్యాన్సర్ అభివృద్ధిలో పాత్ర పోషించవచ్చని భావించబడుతుంది.18,20-25
2.5 కొన్ని ప్రమాద కారకాలు: ఇటీవల పరిశోధనలు చూపిస్తున్న ప్రకారం, క్యాన్సర్‌కు దోహదపడే అవకాశమున్న మైక్రో
మరియు నానో ప్లాస్టిక్ కణాలు దాదాపు ప్రతి చోట కనిపిస్తున్నాయి. ఇవి శ్వాస ద్వారా లేదా జీర్ణవ్యవస్థ ద్వారా శరీరంలోకి ప్రవేశించి, DNA నష్టాన్ని కలిగించడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచవచ్చు. తాజా అధ్యయనాల ప్రకారం, ప్లాస్టిక్‌లలో 16,000కు పైగా రసాయనాలు ఉన్నట్లు గుర్తించబడింది. వాటిలో సుమారు 4,200 రసాయనాలు ఆరోగ్యానికి మరియు పర్యావరణానికి హానికరమైనవిగా పరిగణించబడుతున్నాయి. ప్లాస్టిక్‌లలో ఉండే కొన్ని యాడిటివ్‌లు, ఉదాహరణకు బిస్‌ఫెనాల్ A (BPA), ఫ్తాలేట్స్ , ఫ్లేమ్ రిటార్డెంట్స్ వంటివి కాలక్రమంలో ప్లాస్టిక్ నుంచి బయటకు లీక్ అయి శరీర హార్మోన్ సమతుల్యతను ప్రభావితం చేయవచ్చు. ఇవి ఎండోక్రైన్ వ్యవస్థను దెబ్బతీసి, కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ అభివృద్ధికి అనుకూల పరిస్థితులను సృష్టించవచ్చని భావించబడుతుంది.26-29
మన శరీరం సహజంగా క్షార ధర్మం (Alkaline nature) కలిగి ఉంటుంది మరియు ఆరోగ్యకరమైన రక్త కణాలు ఈ వాతావరణంలో మెరుగుగా పనిచేస్తాయి. అయితే కణజాలాలు అధికంగా ఆమ్లత్వం (Acidic) వైపు మారినప్పుడు, అవి తక్కువ ఆక్సిజన్‌ను మోయగలవు. క్యాన్సర్ కణాలు కూడా అధికంగా ఆమ్ల పదార్థాలను విడుదల చేస్తాయని భావించబడుతుంది, దీని వల్ల శరీరంలోని pH సమతుల్యత మరింతగా భంగం చెందుతుంది. కొన్ని అభిప్రాయాల ప్రకారం, క్యాన్సర్ కణాల పెరుగుదల కేవలం ఆమ్లత లేదా క్షారతపై మాత్రమే ఆధారపడదని, అవి క్షార రక్తంలో కూడా పెరుగగలవని భావిస్తారు. ఆహారం లేదా శరీర ఆమ్లత క్యాన్సర్ వృద్ధిపై ప్రత్యక్ష ప్రభావం పరిమితంగా ఉండవచ్చని, అయితే సమతుల ఆహారం మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని సూచించబడుతుంది. సాంప్రదాయ చికిత్సా విధానాల ప్రకారం, శరీరంలో ఏర్పడే విషతత్వం, ఇన్ ఫ్లమేషన్, మరియు ఆమ్లత (Acidity) వంటి వ్యవస్థాపక అసమతుల్యతలు ముఖ్యమైన ప్రమాద కారకాలుగా పరిగణించబడతాయి.30-32
2.6 లక్షణాలు: క్యాన్సర్ రకాన్ని బట్టి దాని లక్షణాలు భిన్నంగా ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో, సంవత్సరాల పాటు
ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడం కూడా సాధ్యం. సాధారణంగా కనిపించే లక్షణాలలో అలసట, ఎక్కువగా రాత్రివేళల్లో వచ్చే జ్వరం, ఆకలి తగ్గడం, రాత్రి చెమటలు, నిరంతర నొప్పి, చర్మ మార్పులు ఉంటాయి. ముఖ్యంగా పుట్టుమచ్చలు ఆకారం లేదా పరిమాణం మారడం లేదా కొత్త పుట్టుమచ్చలు ఏర్పడటం గమనించవచ్చు. అలాగే తెలియని కారణం వలన బరువు తగ్గడం (Unexplained weight loss) కూడా ఒక హెచ్చరిక సంకేతంగా పరిగణించబడుతుంది. కొన్ని అవయవాలకు సంబంధించిన నిర్దిష్ట లక్షణాలు కూడా కనిపించవచ్చు, ఉదాహరణకు మూత్రంలో లేదా మలంలో రక్తం, కఫంలో రక్తం, కొత్తగా ఏర్పడే గడ్డలు లేదా ముడులు. అయితే ఇవి కనిపించగానే తప్పనిసరిగా క్యాన్సర్ ఉన్నదని అర్థం కాదు.మెటాస్టాటిక్ క్యాన్సర్‌లో, క్యాన్సర్ ఎముకలకు వ్యాపిస్తే అదనంగా మందగించిన, నొప్పిగా లేదా తట్టుకోలేని ఎముక నొప్పి కనిపించవచ్చు. ఇది ముఖ్యంగా రాత్రివేళల్లో లేదా శారీరక కార్యకలాపాల సమయంలో ఎక్కువగా ఉంటుంది. క్యాన్సర్ ఊపిరితిత్తులకు వ్యాపిస్తే ఛాతి నొప్పి, పెరుగుతున్న దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా వీజింగ్ వంటి లక్షణాలు కనిపించవచ్చు.18,33,34
2.7 నిర్ధారణ కు పూర్తి స్థాయి శారీరక పరీక్షతో పాటు వివిధ ప్రయోగశాల పరీక్షలు మరియు ఇమేజింగ్ పద్ధతులు ఉపయోగించబడతాయి. రక్త పరీక్షల్లో పూర్తి రక్త గణన (Full Blood Count), రక్త ప్రోటీన్ పరీక్షలు, మరియు ట్యూమర్ మార్కర్ పరీక్షలు ముఖ్యమైనవి. ఇవి శరీరంలో అసాధారణ మార్పులను గుర్తించడంలో సహాయపడతాయి. ఇమేజింగ్ పరీక్షలలో అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్, మరియు ఎంఆర్ఐ వంటి పద్ధతులు ఉపయోగించి అంతర్గత అవయవాల్లో మార్పులను పరిశీలిస్తారు. అదనంగా, బయాప్సీ ద్వారా అనుమానిత కణజాలం నుంచి నమూనా తీసుకుని సూక్ష్మదర్శినిలో పరిశీలించి ఖచ్చితమైన నిర్ధారణ చేస్తారు. కొన్ని సందర్భాల్లో జన్యు పరీక్షలు కూడా క్యాన్సర్ ప్రమాదాన్ని మరియు దాని స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగించబడతాయి.8,18
2.8 రోగనిర్ణయ అంచనా (Prognosis): క్యాన్సర్ చికిత్స ఫలితాలు మరియు రోగనిర్ణయ అంచనా వ్యక్తి ఆరోగ్య స్థితి, వ్యాధి రకం, దాని దశ, అలాగే చికిత్సకు శరీరం ఇచ్చే ప్రత్యేక ప్రతిస్పందనపై ఆధారపడి విస్తృతంగా మారుతాయి. పూర్తి ఉపశమనం అంటే వ్యాధికి సంబంధించిన లక్షణాలు మరియు సంకేతాలు పూర్తిగా కనిపించకపోవడం. అయితే, ఇది క్యాన్సర్ తిరిగి రాదని హామీ ఇవ్వదు. సాధారణంగా వ్యాధిని ప్రారంభ దశల్లోనే గుర్తించి చికిత్స చేయబడితే, జీవించడానికి మరియు పూర్తిగా కోలుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శస్త్రచికిత్స, కీమోథెరపీ, రేడియోథెరపీ, ఇమ్యూనోథెరపీ వంటి ఆధునిక వైద్య చికిత్సలు వివిధ దుష్ప్రభావాలను కలిగించవచ్చు. ఈ దుష్ప్రభావాలను సహాయక సంరక్షణ (Supportive care) ద్వారా నిర్వహించవచ్చు. అయినప్పటికీ, ఈ దుష్ప్రభావాలు చికిత్స యొక్క ప్రయోజనాలను తగ్గించవు.35,36
3, కణాల ఆరోగ్యాన్ని కాపాడండి – క్యాన్సర్ను నివారించండి 37-40
- వేగంగా కాకుండా జాగ్రత్తగా ఉపవాసం చేయండి: ప్రతి రాత్రి 12–13 గంటల ఉపవాసం ఎక్కువ

ఆరోగ్యవంతులైన పెద్దలకు ప్రయోజనకరంగా ఉంటుంది, ఇది సౌకర్యంగా మరియు ఒత్తిడి లేకుండా చేయబడినప్పుడు మాత్రమే. ఇది కేవలం భోజనం మానేయడం కాదు; సాయంత్రం వేళలో తేలికగా, ముందుగానే మరియు జాగ్రత్తగా ఆహారం తీసుకోవడం ముఖ్యము. జాగ్రత్త అవసరమైన వారు:
- వృద్ధులు లేదా బరువు తక్కువగా ఉన్నవారు , తరచూ చిన్న చిన్న భోజనాలు అవసరం కావచ్చు
- మధుమేహం మందులు తీసుకునేవారు – ఉపవాసం వల్ల హైపోగ్లైసీమియాకు దారితీయవచ్చు
- గర్భిణీలు మరియు పాలిచ్చే తల్లులు
- ఆమ్లత్వ సమస్యలు, అల్సర్లు లేదా ఈటింగ్ డిజార్డర్స్ ఉన్నవారు
- ప్రమాద కారకాలను క్రింది చర్యల ద్వారా తగ్గించండి:
- సరైన విశ్రాంతి, సమయానికి నిద్ర, మరియు సరైన పోషకాహారం తీసుకోవాలి. అధిక ఫైబర్ ఉన్న ఆహారం కొలన్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది మరియు మధ్య పొట్ట ఊబకాయాన్ని నివారిస్తుంది. రొమ్ము పాలు తాగించడం ద్వారా రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని భావించబడుతుంది.
- ఆరోగ్యాన్ని పెంపొందించే వ్యాయామం లేదా థెరపీ పాటించాలి. ముఖ్యంగా రోజువారీ లోతైన శ్వాస (Deep breathing) మరియు వ్యాయామ సమయంలో ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం ద్వారా సహజంగా నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి పెరిగి ప్రతి కణానికి ఎక్కువ ఆక్సిజన్ చేరుతుంది.
- సూర్యరశ్మి, ఫంగస్, బ్యాక్టీరియా మరియు ఇతర రోగకారకాలకు అధికంగా గురికావడాన్ని నివారించాలి లేదా అవసరమైతే జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పొగ త్రాగడం మరియు మద్యం వంటి అలవాట్లను పూర్తిగా నివారించాలి.
- ప్లాస్టిక్‌లు (Melamine సహా), అల్యూమినియం వంటి లోహాలు, నాన్-స్టిక్ ప్యాన్లు వంటి వాటిని ఆహారాన్ని వండడం, నిల్వ చేయడం, వేడి చేయడం లేదా ప్యాక్ చేయడం కోసం ఉపయోగించడం తగ్గించాలి లేదా పూర్తిగా నివారించాలి.
• మనసు విప్పి మాట్లాడండి, తరచుగా నవ్వండి, స్వీయ ఉనికిని అనుభవించండి, ఆనందాన్ని ఇచ్చే హాబీలు చేపట్టండి, కుటుంబ సభ్యులతో సమయం గడపండి, అలాగే ఇతరులకు ఉపశమనం కలిగించే కార్యకలాపాలు లేదా సమూహాలలో పాల్గొనండి.
• 7 ముఖ్య హెచ్చరిక సంకేతాలను గమనించండి: మల లేదా మూత్ర అలవాట్లలో మార్పులు, మానని గాయం (Non-healing sore), అసాధారణ రక్తస్రావం లేదా స్రావం, రొమ్ము లేదా ఇతర చోట్ల గడ్డ లేదా గట్టిపడటం, జీర్ణ సమస్యలు లేదా మింగడంలో ఇబ్బంది, పుట్టుమచ్చ (wart/mole) ఆకారంలో మార్పు, నిరంతర దగ్గు లేదా గొంతు బొంగురుపోవడం (hoarseness).
చివరి సందేశం: మీ హృదయాన్ని అనుసరించండి – మీ శరీరం చెప్పేదాన్ని ఆలకించండి!
రిఫరెన్సులు మరియు లింకులు
- Divine Discourse, Hospital Day, 8 Oct 1983: Sathya Sai newsletter, USA, vol 8-4: https://www.facebook.com/radiosai/posts/sugar-is-the-root-cause-for-cancer-satya-sai-speakstill-date-no-doctor-has-been-/1981089541980174/
- https://www.sssmediacentre.org/listen/5fc6372955e853cb338870f9/
- Cellular health: https://www.healthline.com/health/number-of-cells-in-body#types-of-cells
- https://www.uab.edu/medicine/news/cell-developmental-integrative-biology/why-cellular-health-matters-more-than-you-think
- Health article on blood: https://news.vibrionics.org/en/articles/478
- Main Genes in cancer: https://www.cancer.org/cancer/understanding-cancer/genes-and-cancer/oncogenes-tumor-suppressor-genes.html#
- https://www.nature.com/scitable/topicpage/cell-division-and-cancer-14046590/#
- Cancer vs. normal cells: https://www.cancercenter.com/cancer-cells-vs-normal-cells#
- Apoptosis: https://my.clevelandclinic.org/health/articles/apoptosis
- Our DNA: https://my.clevelandclinic.org/health/body/dna
- How cancer happens? https://cancer.ca/en/cancer-information/what-is-cancer/how-cancer-starts-grows-and-spreads
- https://www.cancer.org/cancer/understanding-cancer/what-is-cancer.html
- https://www.mskcc.org/news/what-are-metastatic-and-metastasized-cancers
- https://www.ncbi.nlm.nih.gov/books/NBK279410/
- Cancer stages: https://my.clevelandclinic.org/health/diagnostics/22607-cancer-stages-grades-system
- Stage 0: https://www.verywellhealth.com/definition-of-carcinoma-in-situ-2249071#
- https://drmonikapansari.com/understanding-stage-0-breast-cancer/#
- Types of cancer: https://my.clevelandclinic.org/health/diseases/12194-cancer
- https://www.cancerresearchuk.org/about-cancer/what-is-cancer/how-cancer-starts/types-of-cancer#
- Triggers: https://treatcancer.com/blog/what-makes-a-healthy-cell-turn-cancerous/
- https://www.timesnownews.com/health/indian-oncologist-says-cancer-is-not-a-disease-but-a-manifestation-heres-what-it-means-article-116830980
- Stress: https://www.nih.gov/news-events/nih-research-matters/stress-may-awaken-dormant-cancer-cells
- High energy radiation: https://pubmed.ncbi.nlm.nih.gov/35671754/
- https://www.cancer.org/cancer/risk-prevention/radiation-exposure.html
- Afflicting youngsters! Times of India Health, 22 Oct 2025
- Plastic what it does: https://pmc.ncbi.nlm.nih.gov/articles/PMC9562888/
- https://oncodaily.com/oncolibrary/does-plastic-cause-cancer
- Plastic count: https://www.specialchem.com/plastics/news/more-than-16000-different-chemicals-in-plastics-000233506
- https://foodpackagingforum.org/news/more-than-16000-chemicals-present-in-plastic-nature-study-finds
- Cancer increases acidity: https://www.parkwaycancercentre.com/in/news-events/news-articles/news-articles-details/do-acidic-diets-cause-cancer
- Cancer cells and acidity: https://pmc.ncbi.nlm.nih.gov/articles/PMC11048434/
- Is acidity a cause: Ayurvedic perspective! https://pmc.ncbi.nlm.nih.gov/articles/PMC3398688/
- Metastasis symptoms: https://my.clevelandclinic.org/health/diseases/bone-metastasis
- Lung: https://www.mayoclinic.org/diseases-conditions/lung-cancer/symptoms-causes/syc-20374620#
- Managing Side effects: https://my.clevelandclinic.org/health/articles/10257-chemotherapy-side-effects
- https://anilcancerclinic.com/12-tips-and-strategies-to-manage-cancer-treatment-side-effects/
- Effect of fasting on cancer: https://pmc.ncbi.nlm.nih.gov/articles/PMC9530862/
- https://www.healthline.com/health/fasting-and-cancer#research
- Take care of cellular health: https://essentialhealth.health/provider-perspectives-what-is-cellular-health-and-why-is-it-important/
- Prevent cancer: https://www.health.harvard.edu/newsletter_article/the-10-commandments-of-cancer-prevention
______________________________________________________________________________________
2. UK ప్రాక్టీషనర్ల వార్షిక సమావేశం, లండన్, 21సెప్టెంబరు 2025.
UK ప్రాక్టీషనర్ల వార్షిక సమావేశం ప్రార్థనతో ప్రారంభమైంది. అనంతరం UK కోఆర్డినేటర్ 02822 కృతజ్ఞతా సందేశాన్ని అందించారు. నిస్వార్థ సేవే అత్యున్నత ఆధ్యాత్మిక సాధన అని ఆయన నొక్కి చెప్పారు. ఈ సమావేశంలో ప్రత్యక్షంగా మరియు ఆన్‌లైన్ ద్వారా మొత్తం 45 మంది పాల్గొన్నారు. వారు తమను తాము పరిచయం చేసుకోవడంతో పాటు, వివిధ అంశాలపై ప్రజెంటేషన్లు, చర్చల్లో చురుకుగా పాల్గొన్నారు.
సమావేశంలోని ముఖ్యాంశాలు:
- ప్రాక్టీషనర్ 03598, పదవీ విరమణ పొందిన జనరల్ ప్రాక్టీషనర్ (GP), తలతిరుగుడు (Dizziness) మరియు వెర్టిగో (Vertigo) మధ్య తేడాలను వివరిస్తూ, వాటి కారణాలు, లక్షణాలు, చికిత్సా విధానాలపై ప్రసంగించారు. ఇందులో వైబ్రియానిక్స్ కాంబినేషన్లు CC18.1 Brain disabilities మరియు CC18.7 Vertigo గురించి కూడా వివరించారు. అలాగే, విటమిన్ D3, విటమిన్ B12, ఐరన్ తగిన స్థాయిలో ఉండటం ఎంతో ముఖ్యమని ఆమె నొక్కి చెప్పారు.
- ప్రాక్టీషనర్ 00534 మూత్ర చికిత్స వల్ల కలిగే ప్రయోజనాల గురించి, ముఖ్యంగా శరీర శుద్ధి (Detoxification) మరియు స్వస్థతలో దాని పాత్రను వివరించారు. వైబ్రియానిక్స్ దృక్కోణంలో, రోగి మూత్రంతో తయారు చేసిన నోసోడ్ లో ఉండే మూలకణాలు (Stem Cells), హార్మోన్లు, ఎంజైములు, ప్రతిరక్షకాలు (Antibodies) సోరియాసిస్ వంటి చర్మవ్యాధులతో పాటు సమగ్ర ఆరోగ్యానికి కూడా ఉపయోగపడవచ్చని తెలిపారు. అలాగే, CC4.6 Diarrhoea వంటి వైబ్రియానిక్స్ కాంబినేషన్లు, అలాగే అనాసపండు, బొప్పాయి, ప్రోబయోటిక్స్ వంటి సహజ పద్ధతుల ద్వారా శరీరంలోని పరాన్నజీవుల (Parasites) భారాన్ని తగ్గించాలని సూచించారు. స్వయం ప్రతిరక్షక (Autoimmune) వ్యాధులలో అధికంగా స్పందించే రోగనిరోధక వ్యవస్థను శాంతింపజేయడానికి, ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడానికి నికోటిన్ నోసోడ్ ఉపయోగపడవచ్చని కూడా ప్రతిపాదించారు.
- ప్రాక్టీషనర్ 02802 శరీరంలోని విషపదార్థాలను తొలగించేందుకు, అవయవాల పనితీరును మెరుగుపరచేందుకు ఉపయోగపడే శ్వాస వ్యాయామాలను ప్రదర్శించారు. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, చిత్తవైకల్యం (Dementia) వంటి సమస్యలను నివారించడం ఎంత ముఖ్యమో వివరించారు.
- ప్రత్యేక అతిథి వక్త డాక్టర్ పబానీ నొప్పి నిర్వహణ కోసం సమగ్ర (Holistic) వ్యాయామాలను పరిచయం చేశారు. వీటిలో అవయవాలను ఉత్తేజపరచడం, పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించడం వంటి అంశాలు ఉన్నాయి.
- డాక్టర్ అగర్వాల్ సంస్థకు సంబంధించిన తాజా సమాచారం అందిస్తూ, ప్రాక్టీషనర్లు ఇన్‌స్టిట్యూట్‌కు లైఫ్ అసోసియేట్స్ గా చేరాలని ప్రోత్సహించారు. అలాగే, ప్యాట్ హంట్ పరిశోధన విభాగాధిపతి పదవి నుండి పదవీ విరమణ చేసినందున, ఇకపై ఔషధాలు, కాంబినేషన్లకు సంబంధించిన ప్రశ్నలను [email protected] కు పంపించాలని తెలిపారు.
సమావేశం కృతజ్ఞతా ప్రసంగం, మంగళ హారతి, అనంతరం తొమ్మిది 108CC బాక్సులను రీఛార్జ్ చేయడంతో ముగిసింది.

______________________________________________________________________________________
3. శిబిరాలు & క్లినిక్లు
సీతమ్మధార, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ 23 అక్టోబరు 2025
ఎనిమిది సంవత్సరాలుగా బాధపడుతున్న తన ఆరోగ్య సమస్యకు ప్రాక్టీషనర్ 11650…ఇండియా ఇచ్చిన వైబ్రో ఔషధం కేవలం రెండు మోతాదులు తీసుకున్న తర్వాతే విశేష ఉపశమనం పొందిన సమితి కన్వీనర్ అనుభవం స్ఫూర్తితో భక్తి భావంతో నిండిన వాతావరణంలో SVP 11567 ఈ సేవా శిబిరాన్ని అధికారికంగా ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన వారికి మొత్తం 37 ఇమ్యూనిటీ బూస్టర్లు (IB) పంపిణీ చేశారు. అనంతరం హృదయపూర్వక ప్రార్థనలతో కార్యక్రమం ముగిసింది. ఈ వెల్‌నెస్ సెంటర్‌లో ప్రతి నెల మొదటి శనివారం ప్రాక్టీషనర్ 11650…ఇండియా సేవలు అందించనున్నారు.

______________________________________________________________________________________
4. ఆసక్తికరమైన కథనాలు
డా. జిత్ కె. అగర్వాల్ డైరీ నుండి – ఫైబ్రాయిడ్లను అధిగమించిన విశ్వాసం: పొరపాటు ఒక అద్భుతంగా మారినప్పుడు
అది నేను వైబ్రియానిక్స్ సేవను ప్రారంభించి రెండేళ్లు కూడా పూర్తికాని ప్రారంభ దశ. 1996లో రెమెడీల మోతాదుకు సంబంధించి కఠినమైన నియమాలు లేకుండా, సాధారణ మార్గదర్శకాలు మాత్రమే ఉండేవి. వాటిని పాటించడంలో కూడా కొంత వెసులుబాటు ఉండేది. ఒక సాయంత్రం, నలభై ఏళ్ల వయస్సులో ఉన్న ఓ భారతీయ మహిళ తన భర్తతో కలిసి క్లినిక్‌కు వచ్చారు. ఫైబ్రాయిడ్ల కారణంగా ఆమె తీవ్రమైన అధిక రుతుస్రావంతో బాధపడుతున్నారు. గర్భాశయాన్ని తొలగించే శస్త్రచికిత్స (హిస్టరెక్టమీ) చేయించుకోవాలని వైద్యులు సూచించినప్పటికీ, ఆమె మరింత సౌమ్యమైన ప్రత్యామ్నాయ చికిత్స కోసం వెతుకుతున్నారు. వైబ్రియానిక్స్ గురించి తెలుసుకుని సహాయం కోసం నన్ను సంప్రదించారు. ఆ సమయంలో ఎక్కువశాతం రెమెడీలకు అనుసరిస్తున్న సాధారణ మోతాదు ప్రకారం, నేను ఆమెకు SR249 Medorrhinum ను రోజుకు మూడుసార్లు (TDS) తీసుకోవాలని సూచించాను. కొద్దిరోజులకే ఆమె బెంగళూరుకు తిరిగి వెళ్లిపోయారు.
మరుసటి రోజే ఆమె భర్త నుంచి నాకు ఆందోళనతో కూడిన ఫోన్ వచ్చింది. ఆమెకు పెద్ద పెద్ద రక్తపు గడ్డలతో తీవ్రమైన రక్తస్రావం ప్రారంభమైందని చెప్పారు. వెంటనే నాకు నా పొరపాటు అర్థమైంది. ఇది మయాజమ్ కు సంబంధించిన రెమెడీ కావడంతో, వారానికి ఒక మోతాదు మాత్రమే ఇవ్వాల్సి ఉండేది. వెంటనే రెమెడీని నిలిపివేయమని చెప్పి, పూర్తి విశ్వాసంతో ఆమెకు ఎలాంటి ప్రమాదం ఉండదని ధైర్యం చెప్పాను. అయితే, నాకు మిగిలిన ఏకైక ఆశ్రయం స్వామి మాత్రమే. నా పొరపాటును స్వస్థతగా మార్చమని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ ఆయన శరణు ఆశ్రయించాను. స్వామి అనుగ్రహంతో, ఒక రోజులోనే రక్తస్రావం పూర్తిగా ఆగిపోయింది. అంతేకాక, మా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ, ఆమెకు ఉన్న ఫైబ్రాయిడ్లు పూర్తిగా అదృశ్యమయ్యాయి!
ఈ అద్భుతమైన స్వస్థత వారి కుటుంబంలో వైబ్రియానిక్స్‌పై అచంచలమైన విశ్వాసాన్ని నెలకొల్పింది. అప్పటి నుంచి ఆ కుటుంబ సభ్యులందరూ చికిత్స కోసం మా వద్దకు రావడం ప్రారంభించారు. అమెరికా నుండి ప్రతి సంవత్సరం వచ్చినప్పుడు, లూపస్ వ్యాధితో బాధపడుతున్న తన కుమార్తె కోసం ఆమె సోదరి బ్లడ్ నోసోడ్ తయారుచేయించుకునేందుకు మా వద్దకు వచ్చేవారు. ఒకసారి వారు రాలేని పరిస్థితి ఏర్పడినప్పుడు, ఆ నోసోడ్ కోసం ప్రత్యేకంగా యునైటెడ్ కింగ్‌డమ్ (UK) వరకు ప్రయాణించి వచ్చారు! చివరికి, వారి నివాసానికి సమీపంలో ఉన్న ఒక ప్రాక్టీషనర్‌ను సంప్రదించాలని నేను ఆమెను ఒప్పించగలిగాను. వెనక్కి తిరిగి చూసుకుంటే, వైబ్రియానిక్స్ ప్రారంభ దశలో మేము ఎన్నో పొరపాట్లు చేసి ఉండవచ్చని ఇప్పుడు అనిపిస్తుంది. అయినప్పటికీ, స్వామి రక్షణ కవచం క్రింద, ఈ వైద్య విధానంపై అచంచలమైన విశ్వాసంతో, నిరంతరం నేర్చుకుంటూ, మెరుగుపరుచుకోవాలనే తపనతో మేము ఎన్నో సవాళ్లను విజయవంతంగా అధిగమించాము. ఆ అనుభవాలు వైబ్రియానిక్స్‌ను ముందుకు తీసుకెళ్లడానికి అమూల్యమైన మార్గదర్శకంగా నిలిచాయి.
______________________________________________________________________________________
5. జ్ఞాపకార్థం
కేరళలోని కాసరగోడ్‌కు చెందిన శ్రీ ఎ. కృష్ణానంద రావు 11178 వారి మహాప్రస్థానం పట్ల మా ప్రగాఢ సంతాపాన్ని
తెలియజేస్తున్నాము. ఆయన 2025 సెప్టెంబరు 10న, 89 ఏళ్ల వయస్సులో భగవంతునిలో ఐక్యమై, కరుణ మరియు నిస్వార్థ సేవతో కూడిన చిరస్మరణీయ వారసత్వాన్ని మిగిల్చారు. మహారాష్ట్రలో సాయిభక్తులైన తల్లిదండ్రులకు జన్మించిన శ్రీ రావు, సార్వత్రిక ప్రేమ మరియు ఆచరణాత్మక ఆధ్యాత్మికత అనే స్వామి ఆదర్శాలను జీవితాంతం ఆచరించారు. తన వృత్తిజీవితాన్ని విడిచిపెట్టి, పూర్తిగా స్వస్థత సేవకే అంకితమయ్యారు. అంకితభావం కలిగిన రేకి ప్రాక్టీషనర్‌గా, వైబ్రియానిక్స్‌ను స్వీకరించే ముందు మణిపాల్ ఆసుపత్రి ట్రామా వార్డులో రోగులకు నిస్వార్థంగా సేవలందించారు. అనేక మంది రేకి హీలర్లను వైబ్రియానిక్స్ వైపు ప్రేరేపించడమే కాకుండా, కర్ణాటక మరియు కాసరగోడ్ ప్రాంతాల్లో ఈ పవిత్ర వైద్యశాస్త్రాన్ని విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు. ఎండోసల్ఫాన్ విషప్రభావాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన అనేక కుటుంబాలకు ఆయన అవిశ్రాంత సేవలు గొప్ప ఓదార్పును అందించాయి. స్వామి కరుణకు కార్యరూపమే ఆయన జీవితం. భగవాన్ కృపతో ఆయన ఆత్మయానం సాఫీగా కొనసాగాలని, అలాగే ఈ లోటును తట్టుకునే శక్తిని ఆయన సతీమణికి మరియు కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని మనసారా ప్రార్థిస్తున్నాము.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన శ్రీ బల్వంత్ వై. నివాంత్ 10297 వారి మహాప్రస్థానాన్ని అత్యంత విచారంతో
తెలియజేస్తున్నాము. ఆయన 2025 అక్టోబరు 4న, 79 ఏళ్ల వయస్సులో తన దేహాన్ని విడిచారు. ప్రేమాభిమానాలు కలిగిన అంకితభావం గల ప్రాక్టీషనర్‌గా, కోవిడ్-19 మహమ్మారి ప్రారంభమయ్యే వరకు నాగ్‌పూర్‌లో నిర్వహించిన అనేక వైబ్రియానిక్స్ సేవా శిబిరాలలో చురుకుగా సేవలందించారు. తన ఆప్యాయ స్వభావంతో ప్రతి రోగినీ "సాయిరామ్" నామస్మరణ చేస్తూ, సంపూర్ణ విశ్వాసంతో ఔషధాలను తీసుకోవాలని ప్రోత్సహించేవారు. వైబ్రియానిక్స్ గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తితో, పుట్టపర్తికి వచ్చిన ప్రతిసారీ AVP వర్క్ షాప్లో క్రమం తప్పకుండా పాల్గొనేవారు. సేవ పట్ల ఆయనకున్న ఉత్సాహం, అనేకమంది కొత్తవారిని పుట్టపర్తికి వచ్చి వైబ్రియానిక్స్ స్వస్థత శక్తిని ప్రత్యక్షంగా అనుభవించేలా ప్రేరేపించింది. భక్తి, వినయం, నిస్వార్థ సేవలతో నిండిన ఆయన జీవితం అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచింది. భగవాన్ కృపతో ఆయన ఆత్మయానం సాఫీగా కొనసాగాలని, అలాగే ఈ లోటును తట్టుకునే శక్తిని ఆయన కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని మనసారా ప్రార్థిస్తున్నాము.