Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

అదనంగా

Vol 11 సంచిక 1
January/February 2020


           1. ఆరోగ్య చిట్కాలు

ఆరోగ్యం మరియు శక్తి కోసం డ్రై ఫ్రూట్స్(ఎండిన పండ్లు) తో స్నేహం చేయండి  

“మితంగా తినండి ఎక్కువకాలం జీవించండి...  భౌతిక పరమైన ఆరోగ్యమే మహాభాగ్యం అని భావించేవారు సాత్వికమైన ఆహారం మాత్రమే తీసుకోవడానికి ఎంతో శ్రద్ధ వహిస్తారు. ఉడికించని ఆహారము, గింజలు మరియు పండ్లు, మొలకెత్తిన విత్తనాలు చాలా ఉత్తమ మైనవి. ప్రతీరోజూ మీ భోజనంలో కనీసం ఒక్కసారైనా ఉదాహరణకి రాత్రి భోజన సమయంలో వీటిని   తీసుకోండి. ఇది మీకు దీర్ఘ జీవితాన్ని ఇస్తుంది. ఇట్టి సుదీర్ఘ జీవితం కోసం ప్రయత్నించినప్పుడు లభ్యమైన ఆ విలువైన కాలము తోటి మానవులకు సేవ చేయడానికి తోటి జీవులను ప్రేమించడానికి ఉపయోగపడుతుంది”. .... శ్రీ సత్య సాయి బాబా

1. డ్రై ఫ్రూట్స్ అంటే ఏమిటి?

ఇది ఒక పండు, దీనిలో పై పొర లేదా బాహ్య భాగములో గుజ్జు ఉండకుండా ఎండిపోయి ఉంటుంది.   డ్రై ఫ్రూట్స్లో ఎండిన పండ్లు మరియు గింజలు అని రెండు రకాలుగా ఉంటాయి. జీవ సంబంధంగా చూస్తే ఈ రెండూ ఒకటే ఐనా సాంకేతిక పరంగా రెండు ప్రధాన భేధాలు ఉంటాయి. పండ్ల విత్తనానికి తిరిగి మొలకెత్తి మొక్క అయ్యే అవకాశం ఉంది కానీ గింజలకు ఈ అవకాశం లేదు. పండ్లకు జ్యూస్ ఉంటుంది కానీ గింజలకు ఇది ఉండదు.2

డ్రై ఫ్రూట్ అంటే ఏమిటి? ఒక పండు సూర్యుడి వల్ల గానీ లేదా డ్రైయర్(ఆరబెట్టే సాధనం)వల్లగానీ, డీహైడ్రేటర్ (నిర్జలీకరణి)వల్లగానీ తనలోని తేమను పోగొట్టుకొని వడిలిపోయి కేంద్రీకృత శక్తి కేంద్రంగా ఉంటే అదే డ్రై ఫ్రూట్. డ్రై ఫ్రూట్స్ అన్నీ రుచికి తియ్యగా ఉంటాయి,   తమ పోషకాలన్నీ నిలుపుకొని సుదీర్ఘ కాలం నిల్వ ఉంటాయి.  ఎండు ద్రాక్ష, డేట్లు(ఖర్జూరాలు) ఎండిన రేగుపండ్లు, అత్తిపండ్లు, ఆఫ్రికోట్లు, ఇవి సాంప్రదాయ ఎండిన పండ్లుగా ప్రాచుర్యం పొందాయి. వీటి తర్వాత ఎండిన పీచే పండ్లు (ఒకరకమైన చైనా పండు), ఆపిల్ బేర్ పండు, క్రాన్ బెర్రీ, బ్లూ బెర్రీ,  చెర్రీ పండ్లు, స్ట్రాబెర్రీ మరియు మామిడి వంటివి ఎండటానికి ముందే తీపి పదార్ధం తో నింపబడి ఉంటాయి.

అయితే ఎండిన బొప్పాయి, కివీ, మరియు పైనాపిల్ ఇవి క్యాండీ (తీపి పానీయంతో కృత్రిమంగా నింపడం) ఫ్రూట్స్ గా ఉంటాయి.3

గింజ అంటే ఏమిటి. గింజ అనేది ఒకటి  గానీ అరుదుగా రెండు గానీ బద్దలుకలిగిన ఎండిన పండు. బాదం, ఆక్రోట్, జీడిపప్పు, పిస్తా, బ్రెజిల్ గింజలు, హాజల్ నట్స్ చెస్ట్ నట్స్, ఓక్ గింజలు, పెకాన్ గింజలు,పైన్ గింజలు,మకాడమియా గింజలు మొదలగునవి. బఠానీ గింజలు కాయధాన్యాలవలే లెగుమనే కుటుంబానికి చెందినవి. ఐతే వాటిలో ఉండే న్యూట్రిషన్ ప్రొఫైల్ కారణంగా గింజలు అని పిలవబడతాయి.2,4

2. ఎండిన పండ్లు వల్ల ఉపయోగాలు  

సాధారణము: రుచికరమైనవి మరియు అధిక పోషక విలువలు కలిగినట్టి ఇవి తాజా పండ్లతో సమానం ఐతే కేంద్రీకృతరూపంలో చక్కెర మరియు క్యాలరీలు ఉన్నందున ఇవి తిన్నవారికి సంపూర్ణ ఫలం తిన్న అనుభూతి ఇస్తాయి. బరువు దృష్ట్యా చూస్తే ఎండిన పండ్లు తాజాపండ్ల కంటే 3.5 రెట్లు ఫైబర్, విటమిన్లు, మరియు ఖనిజలవణాలు కలిగి ఉంటాయి. ఎండిన పండ్లన్నీ రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచేవి, రోగ నిరోధక శక్తిని పెంచేవి, జీర్ణకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేవి, ఆక్సీకరణ నష్టాన్ని తగ్గించేవి, మెదడు ఆరోగ్యాన్ని ప్రోత్సహించేవి, ముందస్తు వృద్ధప్యాన్ని నిరోధించేవి, ఎముక మరియు చర్మానికి కావలసిన వనరులు అందించేవి, మరియు కేన్సర్ తో సహా అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించేవి ఐన ఫినోలిక్ యాంటీ ఆక్సిడెంట్లకు చక్కని మూలం.5,6

ఎండిన పండ్లు యొక్క ప్రత్యేక ప్రయోజనాలు

ఎండు ద్రాక్ష (59% చక్కెర): విటమిన్ సి, కాల్షియం, ఐరన్, పొటాషియం మరియు మొక్కల సమ్మేళనాలతో ముఖ్యంగా పిల్లలకు కావలసిన విలువైన పోషకాలను అందిస్తాయి. దంతాలపై ఎక్కువసేపు అంటుకొని ఉండవు మరియు దంతాలలో చిక్కుకున్న ఇతర ఆహారపు అణువులను తొలగించే సామర్ధ్యము కలిగినట్టివి కనుక దంతాలకు రంధ్రాలు ఏర్పడడం ఉండదు. ఇవి బీపీ మరియు బ్లడ్ కొలెస్టరాల్ను తగ్గిస్తాయి. మంటను తగ్గిస్తాయి మరియు రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరిచి టైప్ 2 మధుమేహం మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గి స్తాయి.5,7,8

డేట్స్ లేదా ఖర్జూరాలు (64-66% చెక్కెర): ఇవి అత్యంత తీపి కలిగి ఉన్నప్పటికీ వీనిలో ఉండే తక్కువ స్థాయి గ్లైసిమిక్ ఇండెక్స్ (glycemic index) కారణంగా రక్తంలోని చక్కెర స్థాయిలో పెద్దగా హెచ్చుతగ్గులు ఉండవు. వీటిలో ఉండే ఖనిజ లవణాలు మరియు ఇనుము వంటి వాటి వలన ఇది గర్భిణీ స్త్రీలకు చాలా అనువైనది. ఇవి ముందస్తు గర్భాశయ విస్తరణను ప్రోత్సహించి ప్రేరేపిత శ్రమ అవసరాన్ని తగ్గిస్తాయి. మూత్రాశయ మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ మరియు శారీరక ఒత్తిడి ప్రమాదాన్ని తగ్గించే సెలీనియం వంటి మినరల్స్ కు చక్కని ఆధారము. అంతేగాక ఇవి పురుషుల్లో వంధత్వాన్ని నివారించే సామర్ధ్యము కలిగినట్టివి. 5,9,10

 ప్రూన్స్ లేదా రేగుపండ్లు(38% చెక్కెర): వీనిలో బీటా కెరోటిన్( ఇది విటమిన్ A గా మార్చబడుతుంది)మరియు K విటమిన్ ఉంటాయి కనుక ఇవి ఆరోగ్యకరమైన కంటి దృష్టిని కలిగిస్తాయి. అధిక ఫైబర్ కంటెంట్ మరియు సార్బిటాల్ కారణంగా సహజ విరోచనకారి ప్రభావాన్ని కలిగి ఉంటాయి మరియు మూత్రాశయ అధిక క్రియాశీలతను కూడా నియంత్రిస్తాయి. బోలు ఎముకల వ్యాధిని నివారించడానికి బోరాన్ ఖనిజము మరియు   ఇనుము లోపాన్ని నివారించడానికి మరియు చికిత్స చేయడానికి కావలసిన ఇనుప ధాతువుకు ఇది గొప్ప ఆధారము. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల రేగుపండ్లు శరీర కణాలను రక్షిస్తాయి.5,11,12

హెచ్చరిక: వ్రణోత్పత్తి, పెద్దప్రేగు శోధ, లేదా అలర్జీతో బాధపడేవారు ప్రునే ను నివారించవచ్చు.11

అత్తిపండ్లు(ఫిగ్స్) (48% చక్కెర): వీటి తీపి మరియు ఒక విధమైన సువాసన కారణంగా అందరూ ఇష్టపడతారు. ఇవి ఉత్తమ నాణ్యత కలిగిన యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. A, C, K & B విటమిన్లు మరియు పొటాషియం కాల్షియం వంటి ఖనిజ లవణాలు కలిగిన ఉత్తమ వనరులలో ఇవి కూడా ఒకటి. మలబద్దకం నుండి ఉపశమనం మరియు మొత్తంగామధుమేహ నిర్వహణలో ఎంతో సహాయపడతాయని వీటికి మంచి పేరుంది. చర్మం మరియు జుట్టుకు ఇవి ఎంతో మంచివి. తామర, బొల్లి, మరియు సోరియాసిస్ వంటి ఎన్నో చర్మ వ్యాధులకు అత్తి పండ్లు చక్కని చికిత్సా కారకాలు.13

హెచ్చరిక:  రబ్బరు పాలు లేదా బీచ్, పుప్పొడి లేదా మలబరి కుటుంబ పండ్లకు అలర్జీ ఉన్న వారికి కూడా ఇవి అలర్జీ ఇవ్వవచ్చు.   రక్తం పలచ బడటానికి మందులు వాడేవారు వీటిలో అధిక విటమిన్ కె ఉన్న కారణంగా అత్తి పండ్లను నివారించవచ్చు.13

ఆఫ్రికాట్లు (53% చక్కెర): జీర్ణక్రియను పెంచడానికి అనేక అవసరమైన విటమిన్లు ఖనిజాలు మరియు కరిగే ఫైబర్ కలిగి ఉంటాయి. పొటాషియం అధికంగా ఉండటం వల్ల ఇవి శరీరంలో ద్రవ సమతుల్యతను నియంత్రిస్తూ హార్ట్ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇవి బీటా కెరోటిన్ మరియు ఇతర కరోటినాయిడ్స్ అలాగే A, C, మరియు E విటమిన్లకు చక్కని మూలము మరియు కళ్ళను పాడవకుండా రక్షిస్తాయి.14

ఎండిన పీచ్ (దొండపండు వలె ఎర్రగా ఉండే శప్తాలు పండు) ఆపిల్ మరియు పియర్స్(బేరి) పండ్లు: పీచ్ పండ్లు రుచికరమైనవి మరియు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు వీనిలో అధికంగా ఉంటాయి. అంతేకాక రోగ నిరోధక శక్తిని పెంచే ఎ మరియు సి విటమిన్లకు చక్కని మూలము. నిర్జలీకరణ చేసిన యాపిల్ పండ్లు ఎన్నోB కాంప్లెక్స్ విటమిన్లను కలిగి ఉంటాయి. ఇవి జీవక్రియలకు,  లివరు మరియు చర్మానికి ఎంతో మంచివి. అంతేకాక ఇవి వంటకాలకు మంచి రుచిని ఇస్తాయి. ఎండిన బేరి పండ్లు  C,E, మరియు ఫోలెట్ వంటి B కాంప్లెక్స్ విటమిన్లను సమృద్ధిగా కలిగి ఉంటాయి. సంపూర్ణ ఆరోగ్యానికి ఇవి ఎంతో మంచివి.15-17

ఇతర ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్స్: అరుదుగా దొరికే బెర్రీ, చెర్రీ, మరియు దానిమ్మ గింజలు ఇవి ఎంతో ఆరోగ్యకరమైనవిగా భావిస్తారు. ప్రత్యేకంగా గోజీ బెర్రీలు ఆధునిక కాలానికి సూపర్ ఫుడ్ గా అభివర్ణిస్తారు. ఎందుకంటే వీటిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇండియన్ గూస్ బెర్రీ గా పేరొందిన ఆమ్ల లేదా ఉసిరి యాంటీఆక్సిడెంట్లు కలవానిలో అగ్రస్థానంలో ఉంది.6

3. గింజల యొక్క ప్రయోజనాలు  

సాధారణం: కొవ్వు ఎక్కువగా ఉంటుంది మరియు ఫినోలిక్ ఏంటి ఆక్సిడెంట్స్, విటమిన్లు, ఖనిజలవణాలు, ఉపయోగకరమైన పీచు పదార్థము గింజలలో సమృద్ధిగా ఉంటాయి. ఇవి తక్కువ పిండి పదార్ధము ఉన్న అద్భుతమైన ఆహారము. సాధారణంగా వీనిలో ఉన్న అధిక క్యాలరీ పదార్ధము వలన బరువు పెరుగుతామని భావిస్తారు కానీ నిజానికి ఇవి బరువు తగ్గడానికి సహాయ పడతాయి. ఇవి జీవన శైలి మార్పు వల్ల వచ్చే వ్యాధులను నివారించి మెదడు యొక్క పనితీరును, చర్మము యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

గింజల యొక్క ప్రత్యేక ప్రయోజనాలు   

బాదం:  ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్ E,  మెగ్నీషియం, మరియు మ్యాంగనీస్ అధికంగా ఉంటాయి. పురాతన కాలం నుండి విలువైన గింజలుగా వీటిని పరిగణిస్తారు. మరియు వీటిని అందరూ ఇష్టపడతారు. ఇవి చెడు LDL కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి, రక్తపోటును అదుపులో ఉంచుతాయి మరియు జీర్ణ వ్యవస్థ మార్గాన్ని ఆల్కలైజ్ చేసి pH ను సమస్థితిలో ఉంచుతాయి కనుక ఇవి ఆరోగ్యానికి అద్భుతమైనవి.23,24

వాల్ నట్స్: క్యాన్సర్ రాకుండా నివారించడానికి మరియు కేన్సర్ తో పోరాడటానికి కావలసిన ఒమేగా 3 కొవ్వు ఆమ్లం ఉన్న గింజలలో ఇది కూడా ఒకటి. గుండెకు ఆరోగ్యకరమైన అమైనో ఆమ్లాలు, వయో సంబంధిత మేధో రుగ్మతలను నివారించడానికి,  మరియు టైప్ 2 మధుమేహములో జీవక్రియా సంబంధిత పరామితులను మెరుగుపరిచే ఆరోగ్య కరమైన కొవ్వును అందించేవిగాను ఇవి ఉపయోగపడతాయి. 90 శాతం యాంటీఆక్సిడెంట్లు ఈ గింజల చర్మంలో ఉన్నాయి. ఇవి త్వరగా నశించే గుణము కలిగి నట్టివి కనుక గాలి చొరబడని కంటెయినర్లలో నిల్వ చేయవలసి ఉంటుంది.25-27

హెచ్చరిక: హెర్పిస్ లేదా సర్పి వ్యాధి ఉన్నవారు అది పూర్తిగా నయం అయ్యేవరకు వీటిని పరిమితం చేయాలి లేదా నివారించాలి.25

జీడిపప్పు: సాధారణంగా ఈ గింజల యొక్క పోషక లక్షణాలతోపాటు వాటిలో జియాక్జాంతిన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ వర్ణ ద్రవ్యం ఉంటుంది. ఇది రెటీనా ద్వారా నేరుగా గ్రహించబడి వయో సంబంధిత మాక్లియర్ క్షీణతను నివారించి తద్వారా కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. జీడిపప్పు జుట్టు ఆరోగ్యంగా మరియు మెరిసేలా ఉండటానికి సహాయపడుతుంది.28,29

పిస్తా పప్పు: అధిక పోషకాలు తమ సహజ రూపంలో ఉండి అన్ని రకాల గింజల యొక్క ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఒక ప్రత్యేకమైన  తీపి రుచి కలిగిననటువంటిది. అధిక మొత్తంలో  జియాక్జాంతిన్ మరియు లుటిన్ కలిగి ఉండుట చేత కళ్ళకు అలాగే గుండెకు కూడా చాలా మంచిది. చక్కటి ఆరోగ్యాన్నిఅందించడమే కాక  పెద్ద ప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.30,31

బ్రెజిల్ నట్స్ : ఆకృతిలో మృదువుగా రుచికి తియ్యగా ఒక విధమైన మట్టి వాసన కలిగిన ఈ గింజలు అమెజాన్ అటవీ ప్రాంత స్థానిక ప్రజల ప్రధాన ఆహారము. కేవలం ఒక బ్రెజిల్ గింజ శరీర జీవక్రియలకు, అభిజ్ఞా(మేధాశక్తి) పనితీరుకు, ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థ, ఆరోగ్యకరమైన మెరిసే జుట్టు, స్త్రీ పురుషుల్లో సంతానోత్పత్తికి కావలసిన  రోజువారీ  అవసరమైన సెలీనియం ఖనిజాన్ని100% అందిస్తుంది. ఈ గింజ చర్మానికి సహజమైన కాంతిని, అందాన్ని ఇస్తుంది మరియు మొటిమలు, ముందస్తు వృద్ధాప్యం చర్మ క్యాన్సర్ నిరోధిస్తుంది.32

హాజెల్ నట్: తీపి రుచి కలిగిన వీటిని పచ్చిగా కూడా తినవచ్చు. అధిక క్యాలరీలు కలిగిఉండే ఈ గింజలలో ఏక మరియు బహుళ అసంతృప్త కొవ్వులు, మరియు ఒమేగా 6 మరియు ఒమేగా 9  కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు వీటి చర్మంలో కేంద్రీకృతమై ఉంటాయి కనుక వీటి తొక్క తీయకుండా లేదా ఒలవకుండా కాల్చకుండా పూర్తిగా తినడానికి అనువైనది. ప్రాచీన కాలం వారు దీనిని ఔషధంగా మరియు టానిక్ గా ఉపయోగించేవారు. హాజల్ గింజలు సాధారణంగా కాఫీ మరియు రొట్టెలకు ఫ్లేవర్ కోసము, మరియు అలంకరణ మరియు విందులలో కూడా ఉపయోగిస్తారు.33,34,35

చెస్ట్ నట్స్: తక్కువ గ్లైసెమిక్ సూచికతో అధిక పోషకాలు ఉండే ఇవి ఆరోగ్యానికి అద్భుతమైనవి.  కాల్చినవి జనాదరణ పొందినవి కానీ సాధారణంగా క్యాండీ(కలకండ మాదిరి నీళ్ళు తగలకుండా చేసేది) ఉడకబెట్టి గానీ, ఆవిరితో లేదా రొట్టెగా కూడా తయారు చేస్తారు. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి, ఎముక ఖనిజ సాంద్రత పెంచుతాయి, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి, జీర్ణ సమస్యల నుండి ఉపశమనం ఇస్తాయి, బీపీని నియంత్రిస్తాయి ఇంకా దీర్ఘకాలిక అనారోగ్యాలను కూడా నివారిస్తాయి.36

కార్న్స్(ఓక్ చెట్టు కాయలు): విటమిన్లు ముఖ్యంగా B1 నుండి B9 మరియు అనేక ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉంటాయి. జీర్ణక్రియ మరియు శక్తి స్థాయిలను పెంచడం, ఎముకలను ఆరోగ్యంగా ఉంచడం, గుండె జబ్బులు మధుమేహం క్యాన్సర్  వంటి ప్రమాదాలను తగ్గిస్తాయి. కానీ ఇవి రుచికి చేదుగా ఉంటాయి మరియు వాటిలో ఉండే టానిన్ అనే పదార్ధము కారణంగా  జీవక్రియ లేదా అరుగుదలకు కఠినంగా ఉంటాయి కనుక వీటిని తినడానికి అనువుగా చేసుకొనడానికి ఉడక పెట్టడం, లేదా వీటిని నానబెట్టిన నీరు గోధుమ రంగులోకి మారనంతవరకూ నీటిలో ఉంచి వీటిని సేవించవచ్చు. ఈ నానబెట్టిన నీటిని చర్మముపై మంటకు, కాలిన గాయాలు నయం చేయడానికి, దద్దుర్లకు, తెగిన గాయాలు మరియు పుండ్లను నయం చేయడానికి ఉపయోగించవచ్చు. అత్యంత పోషకకారక మైనటువంటి మార్గంలో  వీటిని ఉపయోగించుకోవటం ఎలా అంటే కాఫీ గింజల నుండి కాఫీ తయారు చేసినట్లే  వీటినుండి కూడా కాఫీ తయారు చేసుకోవాలి. ఇలా అకార్న్స్ నుండి తయారుచేసిన కాఫీ 100% కెఫీన్ లేకుండా ఉంటుంది  !37,38

 పేకాన్స్ (వాల్నట్ కు సంబంధించినవి): ఫైన్  మరియు పిస్తా గింజల యొక్క అన్ని పోషక లక్షణాలను కలిగి ఉండి వెన్నవంటి రుచి కలిగి ఉంటుంది.39-41

సాధారణ హెచ్చరిక : ఎవరైనా ఏదైనా గింజలకు అలర్జీ కలిగి ఉంటే వాటిని నివారించడం లేదా తీసుకోవడం పరిమితం చేయడం మంచిది.

4.  ఆరోగ్యానికి మితమైన ఆహారం కీలకం    

ఇన్క్లూజివ్ డైట్(ఆహారం లో అన్నింటి చేరిక): తాజా పండ్లు    సాధారణంగా ఎండిన వాటి కంటే ఎక్కువ విటమిన్లు మరియు ఖనిజలవణాలు కలిగి ఉంటాయి. ఎందుకంటే ఎండబెట్టే ప్రక్రియ నీటిలో కరిగే విటమిన్ బి మరియు సి ని నాశనం చేస్తుంది.  అయినప్పటికీ ఎండిన పండ్లు ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్ పదార్ధము విషయంలో తాజా పండ్లను అధిగమిస్తాయి కనుక మన ఆహారంలో ఒక ముఖ్యమైన భాగముగా వీటిని తీసుకోవాలి. ఇవి క్రమంగా మన ఆహారంలో కొవ్వు మరియు చక్కెర అవసరమును తగ్గిస్తాయి. ఎండిన పండ్లు మరియు గింజలను ఆహారంతో చేర్చడం క్రీడాకారులకు వారి పనితీరును మెరుగు పరచడంలో సహాయ పడుతున్నట్లు తెలుస్తోంది.6,18,19,42

మితమైన పరిమాణం: ప్రాసెస్ చేసిన లేదా జంక్ ఫుడ్ కంటే ఆరోగ్యమైన ఎండిన పండ్లలో ముఖ్యంగా తీపి పదార్ధాలు చేర్చిన లేదా లేదా క్యాండీ చేసినవి వాటిలో చక్కెర మరియు కేలరీలు ఎక్కువగా ఉంటాయి కనుక ఆరోగ్యంగా ఉండడం కోసం వాటిని మితంగా  తీసుకోవాలి. ఒక సర్వే ప్రకారం పావు కప్పు లేదా ఒక చేతి గుప్పెడు(30 గ్రాములు) ఎండిన పండ్లు ఒక కప్పు  తాజా ఫ్రూట్ జ్యూస్ మరియు అవసరమైన ఫోలెట్ (విటమిన్) అందించడానికి సరిపోతుంది. కనుక రోజుకు  ఒక గుప్పెడు(30 గ్రాములు) ఎండుపండ్లు తీసుకోవడం మంచిది. అందుబాటులో (స్థోమత) ఉండి  మరియు ఆచరణీయము అయినట్లయితే ప్రతీరోజూ  ఏదో ఒక రకం ఎండిన మరియు తాజా పండ్లు తీసుకుంటూ అవి శరీర అవసరాలకు సరిపోతుందో లేదో వాటి ఫలితాన్ని కొంతకాలం పాటు అంచనా వేస్తూ ఉండాలి.5,6

ఎండు పండ్లు తీసుకునే ఉత్తమ సమయం : ఉదయం లేదా పగటి పూట ఇతర పోషకాలతో పాటు ఆహారాలు ఎండిన పండ్లను శిశువు యొక్క 7-9 నెలల వయసు నుండి ప్రారంభించి 2-3 రోజులు గమనించి అ తరువాత శిశువు ఆహారంలో వీటిని చేర్చవచ్చు.20

 గింజలు తినడానికి ఉత్తమ సమయం ఆకలితో ఉన్నప్పుడో లేదా అలసిపోయినప్పుడో వీటిని స్నాక్స్ లాగా లేదా సలాడ్ లేదా సూప్ తో సేవించ వచ్చు.ఐతే ఉదయం అల్పాహారంతో పాటు వీటిని తీసుకోవడం మంచిది. ఇవి అలసటను నిరోధించి రోజంతా మనలను శక్తివంతంగా ఉంచుతాయి. ఈ గింజలను ముఖ్యంగా బాదం మరియు ఆక్రోటు కాయలు రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం సేవించి నట్లయితే యాంటీ న్యూట్రింట్స్ నుండి దూరం చేసి త్వరగా జీర్ణం అవుతాయి. భగవాన్ బాబా వారు విద్యార్ధులను ప్రతి రోజూ రాత్రి 2-3 బాదం గింజలను నానబెట్టి ఉదయమే తొక్క వొలిచి తినవలసిందిగా సూచించారు. రాత్రిపూట జీడిపప్పు తినకుండా ఉండడం మంచిది ఎందుకంటే అవి ఉదరముపై అధిక భారము కలిగించి నిద్రకు అంతరాయం కలిగిస్తాయి. అంతేకాక నూనెలో వేపిన మరియు చాకోలేట్ గింజలను కూడా తీసుకోకూడదు.43,44

హెచ్చరిక : ఎండు పండ్లలో  పోషక విలువలు ఎక్కువ ఉంటాయి కనుక వీటిని ఎక్కువగా తీసుకోవడం సులభము సహజము. అలచేస్తే బరువు పెరగడం, అజీర్ణం మరియు ఇతర అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి.    కనుక శరీరానికి సరిపడినంత మాత్రమే వీటిని తీసుకోవాలి.19

ఆధారాలు మరియు వెబ్సైట్లు :

  1. Sathya Sai Speaks, Volume 15, Chapter 21, Divine Discourse on Good Health and Goodness, 30 September 1981; www.sssbpt.info/English/sssvol15.html
  2. https://www.quora.com/What-is-the-difference-between-nuts-and-dry-fruits
  3. https://en.wikipedia.org/wiki/Dried_fruit
  4. https://www.bodyandsoul.com.au/nutrition/almonds-walnuts-cashews-get-to-know-your-nuts/news-story/e9d80be322939d514fdb6519b5e82ba5
  5. General benefits of dried fruits: https://www.healthline.com/nutrition/dried-fruit-good-or-bad
  6. Moderation, Caution & Care: https://heartmdinstitute.com/diet-nutrition/dried-fruit-healthy-sugar-bomb/
  7. Raisins: https://www.newswise.com/articles/new-raisin-research-shows-several-health-benefits
  8. https://www.healthline.com/health/food-nutrition/are-raisins-good-for-you
  9. Dates: https://www.healthline.com/nutrition/benefits-of-dates
  10. https://nuts.com/healthy-eating/benefits-of-dates
  11. Prunes: https://www.healthline.com/health/food-nutrition/top-benefits-of-prunes-prune-juice#iron
  12. https://food.ndtv.com/health/7-amazing-prunes-benefits-1404766
  13. Figs: https://www.healthline.com/health/figs
  14. Apricots: https://www.healthline.com/nutrition/apricots-benefits
  15. Dried Peaches: https://nuts.com/driedfruit/peaches/jumbo.html
  16. Dehydrated Apples: https://healthyeating.sfgate.com/dehydrated-apples-healthy-5756.html
  17. Dried Pears: https://nuts.com/driedfruit/pears/premium.html
  18. Diet: https://www.ncbi.nlm.nih.gov/pubmed/15670984
  19. https://www.health.harvard.edu/healthy-eating/is-eating-dried-fruit-healthy
  20. https://parenting.firstcry.com/articles/dry-fruits-for-babies-when-to-introduce-and-health-benefits/
  21. Benefits of Nuts: https://www.healthline.com/nutrition/8-benefits-of-nuts#section1
  22. https://www.healthline.com/nutrition/9-healthy-nuts#section2
  23. Almonds: https://draxe.com/nutrition/almonds-nutrition/
  24. https://www.healthline.com/nutrition/9-proven-benefits-of-almonds
  25. Walnuts: https://www.healthline.com/nutrition/benefits-of-walnuts#section5
  26. https://articles.mercola.com/sites/articles/archive/2014/05/19/7-walnuts-benefits.aspx
  27. https://www.nutritionfitnesscentral.com/proven-benefits-walnuts/
  28. Cashew nuts: https://www.healthline.com/health/are-cashews-good-for-you#takeaway
  29. https://food.ndtv.com/food-drinks/7-incredible-cashew-nut-benefits-from-heart-health-to-gorgeous-hair-1415221
  30. Pistachios: https://www.medicalnewstoday.com/articles/322899.php#myths-about-pistachios
  31. https://www.healthline.com/nutrition/9-benefits-of-pistachios#1
  32. Brazil nuts: https://www.healthbeckon.com/brazil-nuts-benefits
  33. Hazelnuts: https://www.organicfacts.net/health-benefits/seed-and-nut/hazelnuts.html
  34. https://draxe.com/nutrition/hazelnuts/
  35. https://www.healthline.com/nutrition/hazelnut-benefits#section1
  36. Chestnuts: https://www.organicfacts.net/health-benefits/seed-and-nut/chestnuts.html
  37. Acorns:  https://www.healthline.com/nutrition/can-you-eat-acorns#downsides
  38. https://www.organicfacts.net/health-benefits/seed-and-nut/acorns.html
  39. Pecans: https://food.ndtv.com/food-drinks/why-pecan-nuts-are-good-for-you-and-how-to-eat-them-1262183
  40. Pine nuts: https://food.ndtv.com/food-drinks/8-health-benefits-of-pine-nuts-chilgoza-the-nutty-winter-treat-1621360
  41. Macadamias: https://www.healthline.com/nutrition/9-healthy-nuts#section11
  42. https://omigy.com/fruits/dried-fruit-health-benefits/
  43. https://food.ndtv.com/food-drinks/what-is-the-best-time-to-consume-nuts-we-find-out-1749282
  44. Eat almonds: https://sathyasaiwithstudents.blogspot.com/2012/11/do-you-eat-almonds.html#.Xgoz4i2B3nU

 

2. AVP వర్క్ షాప్ & పునశ్చరణ సదస్సు, పుట్టపర్తి , ఇండియా, 2019 నవంబర్ 16-22

ఈ కేంద్రీకృత వారం రోజుల శిక్షణా సదస్సులో    భారత దేశము మరియు విదేశాలనుండి ఎనిమిది మంది అభ్యర్థులు పాల్గొన్నారు. ఫ్రెంచ్ కోఆర్డినేటర్ మరియు ఇద్దరు SVP లు పర్యవేక్షకులుగా హాజరై శిక్షణా అభ్యర్థులకు సహాయం చేసారు. కేసు  పరిశీలనా ఆధారిత అత్యంత ప్రభావవంతమైన  సదస్సు యొక్క ప్రణాళిక మరియు నిర్వహణ ఇద్దరు సీనియర్ టీచర్లు10375 & 11422, చేయగా వ్యవస్థాపక ఫ్యాకల్టీ మెంబరు శ్రీమతి అగర్వాల్  108CC పుస్తకం మరియు ఫలవంతమైన రోగ చరిత్ర వ్రాయడం పై ఎంతో విలువైన సలహాలు మరియు సమాచారము అందజేశారు.ఈ వర్క్ షాప్ లో పాల్గొన్న వారికి అనుకరణ ద్వారా లైవ్ క్లినిక్ మరియు టీచర్లు, సభ్యులు, SVP లు అభ్యాసకుడు మరియు పేషంటు గా పాత్రాభినయము ద్వారా వాస్తవ శిక్షణను అందించారు. డాక్టర్ అగర్వాల్ గారు వైబ్రియానిక్స్ తో తన ప్రయాణము, స్వామితో వారి అనుభవాలు, స్వామి నుండి నేర్చుకున్న పాఠాలు తెలియజేసారు. ప్రేమ మరియు కృతజ్ఞతతో ప్రతీ ఒక్కటి కూడా స్వామి యొక్క అనుగ్రహంగా భావించి ఆదర్శప్రాయంగా ఉంటూసేవ చేయాలి అంటూ ఎంత ఎంతో విలువైన సలహాలు ఇచ్చారు. శిక్షణలో ఉత్తీర్ణులైన AVP లు చిత్తశుద్ధి మరియు నిబద్దతతో ఆశీర్వాదం కోరుకుంటూ స్వామి వద్ద ప్రమాణ స్వీకారం చేసారు.

 

 

 

 

 

 

 

 

3. SVP వర్క్ షాప్  పుట్టపర్తి ఇండియా 2019 నవంబర్ 24-28   

భారత దేశము మరియు విదేశాలనుండి పాల్గొన్న నలుగురు అభ్యర్థులకు పైన పేర్కొన్న ఫ్యాకల్టీ సభ్యులు 00006,10375& 11422  ఐదు రోజులు నిర్వహించిన అభ్యాస కేంద్రీకృత శిక్షణా సదస్సులో SVP లుగా ఉత్తీర్ణులయ్యారు. ఫ్రెంచి టీచర్ మరియు సమన్వయకర్త01620 మరో ముగ్గురు సీనియర్ ప్రాక్టీషనర్లు తమ జ్ఞానాన్ని పునశ్చరణ చేసుకోవడానికి పరిశీలకులుగా హాజరయ్యారు మరియు  అవసరమైనచోట సహాయం అందించారు. ఫ్రాన్సు కు  చెందిన అభ్యాసకుడు03589 ఆంగ్లేతర భాష మాట్లాడే అభ్యర్థికి శిక్షణా కాలమంతా అనువదించారు. డాక్టర్ అగర్వాల్ తమ ప్రసంగంలో ఒక SVP నుండి ఆశించే  నిబద్ధత, జీవితంలో మధ్యే మార్గాన్ని అనుసరించడం యొక్క ప్రాముఖ్యత ముఖ్యంగా జీవనశైలి విషయంలో,  స్వీయ ఆధ్యాత్మిక పరిణామం కోసం “క్షమించు మరియు మర్చిపో” అనే సూత్రం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అర్హత గల అభ్యర్థులు స్వామి ముందు ప్రమాణ స్వీకారం చేసి వారి యంత్రాలను స్వీకరించారు మరియు సాయి సేవలో తమ వంతు కృషి చేయాలని సంకల్పించారు.

 

 

 

 

 

 

 

 

4. వైబ్రియానిక్స్ అవగాహనా శిబిరములు భద్రాద్రి జిల్లా తెలంగాణ ఇండియా  2019 డిసెంబర్ 8 &17

డిసెంబర్ 8వ తేదీ  తెలంగాణ సత్యసాయి సేవా సంస్థలకు చెందిన రాష్ట్రస్థాయి  సమావేశం భద్రాచలం లో జరిగింది. తగినంత మంది హాజరైన ఈ సమావేశంలో మన సీనియర్ ప్రాక్టీషనర్11585  పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్వామి వైబ్రియానిక్స్ చికిత్సా విధానాన్ని భవిష్యత్ ఔషధంగా ఎలా ఆశీర్వదించారు, ఇది ఎలా పనిచేస్తుంది మరియు కొన్ని విజయవంతమైన రోగ చరిత్రలను సభ్యులకు వివరించారు. పాల్గొన్న50 మందిలో 21 మంది ప్రేరణ పొంది భోజన విరామంలో ఏర్పాటుచేసిన వైబ్రియానిక్స్ మెడికల్  క్యాంపులో రెమిడీలు తీసుకోవడానికి ముందుకు వచ్చారు.     

ఈ అభ్యాసకుడు డిసెంబర్ 17వ తేదీ భద్రాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ నిర్వహించిన మరొక అవగాహన సదస్సులో అక్కడ పనిచేస్తున్న ఇంజినీర్లు పాల్గొన్నారు. ప్రేరణాత్మకమైన ఈ ఉపన్యాసం విన్న అనంతరం 17 మంది వైబ్రియానిక్స్ చికిత్స తీసుకున్నారు.  

 పై రెండు సదస్సులలో ఈ అభ్యాసకుడు వైబ్రియానిక్స్ చికిత్సా విధానంలో ప్రవేశం పొందే విధానం కూడా వివరించారు. దీనిపై ఆసక్తి వ్యక్తం చేసిన వారికి మార్గ దర్శకత్వం చేయడం జరిగింది.

 

 

 

 

 

 

 

ఓంసాయిరామ్