Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

అదనంగా

Vol 10 సంచిక 5
September/October 2019


1. ఆరోగ్య చిట్కాలు

అవగాహనతో శ్వాసించండి!

శ్వాస మీకు ఎల్లప్పుడూ సోహం అనే ప్రక్రియను నేర్పుతూ ఉంటుంది. గాలి పీల్చినప్పుడు సో అని వదిలినప్పుడు హంఅని శబ్దం వస్తూ ఉంటుంది. ఈ ప్రక్రియను జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ సో అనేది దివ్యత్వానికి మరియు హం అనేది అహంకారము (ఇగో) కు సంబంధించినది. దైవత్వం మన శరీరంలోకి ప్రవేశిస్తూ ఉండగా అహంకారము మనల్ని వదిలి బయటకు వెళుతుంది. మరియు శరీరంలోకి ప్రవేశించిన దివ్యత్వాన్ని శరీరంలో నే చక్కగా పట్టి ఉంచగలగాలి. .. శ్రీ సత్య సాయి బాబా .1-2

1. శ్వాస లేనిదే జీవితం లేదు 

ఈ భూగ్రహం మీదికి వచ్చినప్పుడు మనం చేసిన మొదటి పని గట్టిగా శ్వాస తీసుకుని బిగ్గరగా ఏడవడం తో ఊపిరితిత్తులు పని చేయడం ప్రారంభించి జీవితం ప్రారంభం అవుతుంది. అలాగే మనం జీవిత అంత్య దశలో చేయబోయే పని ఏమిటంటే శ్వాస వదులుతూ ఇతరులను ఏడ్చేలా చేయడం.  కనుక ఈ రెండు ప్రధాన ఘటనల మధ్య 24 గంటలూ మనం శ్వాస తీసుకుంటూ  వదులుతూనే ఉంటాము.  అయినప్పటికీ మనం తీసుకునే శ్వాస పై శ్రద్ద  చూపము! 3

2. శ్వాస గురించి తెలుసుకుందాం

శ్వాస అంటే ఏమిటి?  భౌతిక స్థాయిలో చూసినట్లయితే ఊపిరితిత్తుల్లోకి గాలిని తీసుకోవడం మరియు బయటకు వదలడం శ్వాసించడం అంటాం. మన మనుగడకు అత్యంత కీలకమైన ఆక్సిజన్ పీల్చిన గాలి నుండి తీసుకొనబడుతుంది మరియు వదిలిన గాలి ద్వారా కార్బన్ డై ఆక్సైడ్ విడుదల అవుతుంది. ప్రతిక్షణం మన ప్రమేయం లేకుండా ఈ ప్రక్రియ నిశ్శబ్దంగా జరుగుతూనే ఉంటుంది. అయితే ఇది కేవలం వాయువుల మార్పిడి మాత్రమే కాదు ఏదో ఒక  అదృశ్య దివ్యశక్తి  ఒక అఖండమైన తీగవలె ఈ ప్రక్రియను నడిపిస్తూ ఉంటుంది. కనుక ప్రధానమైన విషయం ఏమిటంటే ప్రతి శ్వాస మన దేహం తో ముడిపడి ఉంటుంది ఆ శ్వాస లేకపోతే శరీరం నిర్జీవమే అవుతుంది.4-6

శ్వాస ప్రక్రియ: శరీరంలోని ప్రతి అవయవానికి, ప్రతి కణానికి ప్రతి పనికి శక్తి ఉత్పత్తి చేయడానికి కోసం తాజా ఆక్సిజన్ సరఫరా అవసరం. పీల్చే గాలి వెచ్చగా తేమగా  మరియు శరీర ఉష్ణోగ్రత కు అనుగుణంగా మార్పు చేయబడి తరువాత ముక్కు రంధ్రాల్లోనూ ఊపిరి తిత్తుల్లోనూ శుభ్రపరచ బడిన తరువాత ఆక్సిజన్ను శరీరం మొత్తానికి సరఫరా చేస్తాయి. రక్త ప్రసరణ వ్యవస్థ సహాయంతో వ్యర్థమైన గాలి కార్బన్ డయాక్సైడ్ తొలగించబడతాయి. మన మెదడు శరీరంలోని ఆక్సిజన్ మరియు కార్బన్ డయాక్సైడ్ స్థాయి గురించి నిరంతరం సంకేతాలను అందుకుంటూ వుంటుంది. ఈ సంకేతాలను వెన్నుపాము క్రింది నుండి డయాఫ్రంకు (ఇది ఊపిరితిత్తులకు  కింద  ఒక డోమ్ ఆకారంలో ఉన్నటువంటి కండరం) పంపుతుంది. ఇది ఊపిరి తీసుకునే  సమయంలో సంకోచ వ్యాకోచాలు చెందుతూ ఉంటుంది. మెదడులో ఉన్న సెన్సార్లు రక్త కణాలు కండరాలు ఊపిరితిత్తులు మన యొక్క కార్యాచరణ స్థితి ఆలోచన మరియు భావోద్వేగాలను బట్టి మారుతున్న అవసరాలకు అనుగుణంగా శ్వాసను సర్దుబాటు చేస్తాయి.4,5,7

సాధారణ శ్వాస యొక్క తరచుదనం: సాధారణంగా పెద్దవారిలో విశ్రాంతి తీసుకునే సమయంలో శ్వాస తీసుకునే సంఖ్య నిమిషానికి 12 నుండి 16 వరకు ఉంటుంది(ఒక రోజులో 17280 నుంచి 23040). నవజాత శిశువుల్లో ఇది నిమిషానికి 30 నుంచి 60 వరకు ఉంటుంది. ఇది వయసు పెరిగే క్రమంలో తగ్గుతూ ఉంటుంది, అయితే 65 సంవత్సరాలు దాటిన తర్వాత స్వల్పంగా పెరిగే అవకాశం ఉంటుంది.   ఇది చేస్తున్న పనిని బట్టి అలాగే ఏ వయసులో అయినా సరే వ్యాధి వచ్చినప్పుడు ఈ శ్వాస తీసుకునే సంఖ్య పెరిగే అవకాశం ఉంది. డాక్టర్లు మనలను పరీక్షించే సమయంలో చూసే నాలుగు ప్రధానమైన సంకేతాలలో అనగా రక్తపోటు, నాడీ, ఉష్ణోగ్రతతో పాటు శ్వాస తీసుకునే సంఖ్య కూడా ఒకటి. అనారోగ్యకరమైన జీవనశైలి శ్వాసను వేగిర పరుస్తుంది తద్వారా వ్యాధి కి మార్గం సుగమం అవుతుంది. శ్వాస తీసుకునే సంఖ్యను ప్రభావితం చేసే అంశాలు ఒత్తిడి, ఆందోళన, భావోద్వేగాలు, ఉబ్బసం, న్యుమోనియా గుండెకు రక్త ప్రసరణ సరిగా లేకపోవడం, ఊపిరితిత్తుల వ్యాధి, మాదకద్రవ్యాల వాడకం, లేదా అధిక మోతాదులో ఔషధ సేవనం మొదలగునవి. సాధారణంగా శ్వాస నెమ్మదిగా నిమిషానికి 8-10 సార్లు తీసుకోవడం సాధారణ స్థాయి గాను సంపూర్ణ ఆరోగ్యానికి ఒక రాచబాట గానూ భావిస్తారు. మనం వ్యక్తిగతంగా శ్వాసించే సంఖ్యను మనం కొలవలేము ఎందుకంటే దానిపై దృష్టి పెట్టిన క్షణం నుండి శ్వాస నెమ్మదిగా మరియు గాఢంగా మారిపోతుంది. 8-12

నాసిక శ్వాస యొక్క ప్రాముఖ్యత: సాధారణ శ్వాస ముక్కు ద్వారా నెమ్మదిగా లోపలికి బయటకు వెళుతూ ఉంటుంది. మన నాసిక నోటికి భిన్నంగా ప్రాణాంతక బ్యాక్టీరియా తో సహా అనేక మలినాలను మరియు కలుషితాలను తొలగించే విధంగా నిర్మాణాత్మకంగా ఉంటుంది. శరీరంలో ఉన్న ఒక జన్యువు ముక్కు యొక్క గ్రాహకాలను ప్రేరేపించి ఈ ప్రక్రియకు సహాయపడుతుంది. నిజానికి ఆక్సిజన్ను శరీరం లోకి గ్రహించుకోవటం  నిశ్వాస సమయంలోనే ఎక్కువ జరుగుతుంది కనుక ముక్కు ద్వారా గాలిని విసర్జించడం నోటితో శ్వాసను విసర్జించిన దానికన్నా నెమ్మదిగా జరుగుతుంది, తద్వారా ఊపిరితిత్తులు మరింత ఎక్కువ ప్రాణవాయువును శరీరంలోకి తీసుకుంటాయి. అంతేకాక ఇది  సరి అయిన ఆక్సిజన్ కార్బన్ డయాక్సైడ్ వాయువు ల మార్పిడికి సహాయపడుతూ రక్తంలో పీహెచ్ స్థాయి సమతుల్యంలో ఉండటానికి దోహదం చేస్తుంది.9,13,14

నోటి ద్వారా శాసించడం వల్ల కలిగే ప్రమాదాలు: నోటి ద్వారా శ్వాస ప్రక్రియ కొనసాగినప్పుడు కార్బన్డయాక్సైడ్ త్వరగా వదిలే అవకాశం ఉన్నందువలన ఆక్సిజన్ను గ్రహించడం మందగిస్తుంది. హైపర్ వెంటిలేషన్ కారణంగా అధిక బీపీ ఉబ్బసం గుండెజబ్బు వంటి అనారోగ్య లక్షణాలు తీవ్రమవుతాయి. సాధారణ శ్వాస ప్రక్రియలో ఉండే కొన్ని ముఖ్యమైన దశలు దాటవేయబడడం వల్ల ఊపిరి ఆడకపోవడం, గురక మరియు నిద్రావస్థ (స్లీప్ అప్నియా) వంటివి తలెత్తే అవకాశం ఉంది. నోటి ద్వారా శ్వాసలు కొనసాగితే చెడు బ్యాక్టీరియా లోపలికి ప్రవేశించి ఇన్ఫెక్షన్కు శరీరాన్ని గురి చేసే అవకాశం ఉంది అంతేకాక తగినంత ఆక్సిజన్ అందక పోవడం కారణంగా ఊపిరితిత్తులు, గుండె మరియు మెదడు బలహీనపడే  అవకాశాలు ఉన్నాయి. పగటిపూట మరియు రాత్రి నిద్రించే ముందు జాగరూకతతో ముక్కు ద్వారానే శ్వాసించడం అభ్యాసం చేయడం ద్వారా నోటితో గాలి తీసుకునే దురలవాటును పోగొట్టుకోవచ్చు.9,13,14

కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అనగా నాసికా మార్గం మూసుకు పోయినప్పుడు లేదా పరిమితంగా శ్వాస కొనసాగుతున్నప్పుడు శరీరంలో తక్కువ ఆక్సిజన్ ఉన్నప్పుడు నోటి ద్వారా శ్వాస తీసుకోవడం అనివార్యం కావచ్చు ఎవరైనా నా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటే వెంటనే అత్యవసర వైద్య సహాయం తీసుకోవడం మంచిది. సమస్య తీవ్రత తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు ఫిజీషియన్ లేదా వైబ్రియో అభ్యాసకుని  సంప్రదించవలసి ఉంటుంది.

ప్రత్యామ్నాయ నాసికా శ్వాస : శరీర నిర్మాణ శాస్త్రం బోధించని కొన్ని అంశాలు ఉన్నాయి. మన రెండు నాసికా రంధ్రాల ద్వారా శ్వాస ప్రవాహం ప్రకృతికి భిన్నంగా ఉంటుంది, అనగా ఎడమ నాసికా రంధ్రం ద్వారా శ్వాస తీసుకోవడం కుడి నాసికా రంధ్రం ద్వారా శ్వాస తీసుకోవడానికి భిన్నంగా ఉంటుంది. దీనికి కారణం ముక్కు యొక్క మూలము వద్ద ఉన్న చిన్న చిన్న నరాల చివరలు మెదడుకు నేరుగా అనుసంధానింపబడి వాసన మరియు గాలి ప్రసరణ ద్వారా ప్రభావితం చేయ పడతాయి. నాసిక యొక్క ఒక రంధ్రం లో ఉన్న మెత్తటి కణజాలం ఉబ్బినప్పుడు దాని ఎదురుగా ఉన్న మరొక నాసికా రంధ్రం లోని కణజాలం ప్రత్యామ్నాయంగా కుంచించుకు పోతుందని పరిశోధన అధ్యయనాలు చెబుతున్నాయి. ఇన్ఫ్రాడియన్ రిథమ్ గా పిలవబడే ఈ ప్రక్రియ ప్రతి గంట లేదా రెండు గంటలకు నిరంతరాయంగా జరుగుతూనే ఉంటుంది. భావోద్వేగానికి భంగం కలిగినప్పుడు అనుకూలంగా లేని ఆహార విహారాలు, కాలుష్యం లేదా ఇన్ఫెక్షన్ కారణంగా ముక్కు లో చికాకు ఏర్పడినప్పుడు ఇన్ఫ్రాడియన్ రిథమ్ లో మార్పులు జరుగుతాయి.15-17

నాసికా చక్రం యొక్క ప్రభావం: శ్వాస శాస్త్రంలో ప్రవీణులు మరియు యోగులు  గమనించిన అంశం ప్రకారం కుడి నాసికా రంధ్రం ద్వారా శ్వాస తీసుకునే వ్యక్తులు మరింత అప్రమత్తంగా క్రియాశీలకంగా మరియు బాహ్య ప్రపంచ విషయాల పట్ల శ్రద్ధ చూపుతూ ఉంటారని అనగా మెదడు యొక్క ఎడమ భాగం చురుకుగా ఉంటుందని పేర్కొన్నారు. అదేవిధంగా ఎడమ వైపు శ్వాస తీసుకోవడం సృజనాత్మకత పెంచుతుందని, మెదడు యొక్క కుడి భాగాన్ని చురుకుగా చేసి, అంతర్దృష్టితో విషయాలను అవగాహన చేసుకుంటూ మానసిక ప్రశాంతతో జీవించేటట్లు చేస్తుందని తెలుపుతున్నారు. అనగా ఇది వారి కుడి మెదడు యొక్క చురుకుదనాన్ని సూచిస్తుంది. ప్రాణాయామం వంటి వ్యాయామాలు రెండు నాసికా రంధ్రాల ద్వారా శ్వాస సమంగా ప్రవహించడానికి సహాయ పడతాయి కాబట్టి ధ్యానానికి అనుకూల స్థితి ఏర్పరుస్తాయి.  ప్రాణాయామం అనేది ధ్యానానికి ముందు చేయవలసిన ఒక ప్రక్రియ. యోగ సిద్ధాంతాల ప్రకారం ఏమైనా ఆసనాలు వేసే ముందు లేదా ఏదైనా పని చేసేముందు ప్రాణాయామం చేస్తే శ్వాస సరిగ్గా లభిస్తుంది అని పేర్కొన్నాయి. ఉదాహరణకు చురుకైన జీర్ణప్రక్రియ కోసం శరీరాన్ని సిద్ధం చేయడానికి తినడానికి ముందు కుడి నాసికా రంధ్రం తెరవడం మరియు నీరు లేదా ఇతర ద్రవ పదార్థాలు తీసుకునే ముందు ఎడమ నాసికా రంధ్రం తెరవడం, జీర్ణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు భోజనం తర్వాత ఎడమవైపు తిరిగి పడుకోవడం, నిద్ర పోవడానికి ముందు శరీరానికి తగినంత వెచ్చదనం కోసం ఎడమవైపు 5-10 నిమిషాలు పడుకొని ఆపై కుడివైపు తిరగడం, శరీరానికి కావలసినంత విశ్రాంతి పొందటానికి సులువుగా నిద్రపోవడానికి అన్ని విధాలా ప్రయోజనకరంగా ఉంటుంది.15-17 శాస్త్రీయ అధ్యయనాలు మరింత లోతుగా ఈ అంశాలను తెలుసుకోవలసి ఉంది. కొన్ని ప్రయోగాలు ఒకే నాసికా రంధ్రం ద్వారా శ్వాస తీసుకోవడం (యూని నోస్ట్రిల్)  ఒకదాని తర్వాత మరొక నాసికా రంధ్రం ద్వారా శ్వాస తీసుకోవడం (ఆల్టర్నేట్ నోస్త్రిల్ బ్రీథింగ్) వలన హృదయము మరియు రక్త నాళాల పరామితి లపై వేర్వేరు ప్రభావాలు చూపాయని అలాగే ఎడమ మరియు కుడి మెదడుల సమన్వయం పై కూడా ప్రభావం చూపాయని తెలుపుతున్నాయి. నియంత్రిత కుడి ఎడమ నాసికా శ్వాస జీవక్రియను మార్చ గలగటమే కాక రోగ నివారణ కూడా చేయగలదు. ముఖ్యంగా రక్తపోటు మరియు ఊపిరితిత్తుల వ్యాధుల నివారణలో దీని ప్రభావం అత్యంత ఫలవంతంగా ఉంది18-20

నాసికా చిత్రంలో అవరోధం కలగడం :  యోగా నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒక నాసికా రంధ్రము మూసుకుపోయి శ్వాసకు అవరోధం కలిగితే అనారోగ్యానికి గురికావలసి వస్తుంది. ఒక రంధ్రం మూసుకుపోతే తరచుగా మనం నొప్పి లేదా తలనొప్పిని అనుభవిస్తాము ఒకే నాసికా రంధ్రం లో శ్వాస రెండు గంటలకు మించి ప్రవహించినప్పుడు అది మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. శ్వాస ఎంత ఎక్కువ సేపు ఓకే నాసికా రంధ్రంలో ప్రసరిస్తే అంత ఎక్కువగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు నిరంతర కుడి నాసికా శ్వాస మధుమేహానికి దారితీస్తుంది, ఎడమ శ్వాస ఎక్కువకాలం కొనసాగితే అలసట మరియు మెదడు పనితీరు తగ్గడం ఉబ్బసం వంటివి కలుగుతాయి. నిపుణుల పర్యవేక్షణలో రెండు నాసికా రంధ్రాల్లో సరైన శ్వాస తీసుకుంటూ వీటిని పోగొట్టుకోవచ్చు. స్వర యోగా.16-17 అని పిలవబడే ఆల్టర్నేట్ నాసికా శాస్త్రం నేర్చుకోవడం మరియు సాధన చేయడం ద్వారా ఈ సమస్యలు పునరావృతం కాకుండా చేయవచ్చు. కొన్ని అధ్యయనాల ప్రకారం శ్వాస క్రమంలో మార్పులు మానవులలో వివిధ వ్యాధి స్థితిగతులకు అనుగుణంగా ఉంటుంది ఉదాహరణకు కుడి నాసికా రంధ్రాల ద్వారా శ్వాస తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి గణనీయంగా పెరిగిందని మరియు ఎడమ నాసికా రంధ్రాల ద్వారా శ్వాస తీసుకోవడం వల్ల తగ్గిందని అధ్యయనాలు తెలుపుతున్నాయి.21

నాసిక ఆధిపత్యాన్ని స్వయంగా తనిఖీ చేసుకోవడం: మన ముక్కు దూలానికి ఎదురుగా జేబులో అమెరే చిన్న అద్దం పట్టుకొని నెమ్మదిగా శ్వాసను విడవడం ద్వారా నాశిక రంధ్రాలలో శ్వాస ఆధిపత్యాన్ని స్వయంగా తనిఖీ చేసుకోవచ్చు ముక్కుద్వారా గాలిని అద్దం పైకి విడిచినప్పుడు అద్దంపైన రెండు రకాల ఆవిరి బిందువులను చూపుతుంది ఆవిరై పోవడానికి  ఎక్కువ సమయం తీసుకునేది ఆధిపత్య నాసికా రంధ్రాన్ని సూచిస్తుంది. శ్వాస మార్చుకోవడానికి ఆధిపత్య నాసికా రంధ్రం వైపు పదినిమిషాలు పడుకోవడం ద్వారా నాసిక శ్వాస క్రమంలో మార్పు తీసుకురావచ్చు. తిరిగి గమనించడానికి అద్దం ద్వారా తనిఖీ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా సరైన అవగాహన పెంచుకోవడానికి తనపై తాను ప్రయోగాలు చేసుకోవచ్చు కానీ దానిలో ప్రావీణ్యం పొందాలనుకుంటే సమర్థమైన ఉపాధ్యాయుడిని లేదా శిక్షకుడుని సంప్రదించడం మంచిది. నాసికా చక్రం ప్రకారం శ్వాస వ్యక్తికి వ్యక్తికి మరియు ఒకే వ్యక్తిలో వేర్వేరు సమయాల్లో కూడా మారవచ్చు.22

3. లయబద్ధమైన శ్వాసకు చిట్కాలు

నిపుణుల అభిప్రాయం ప్రకారం సాధారణంగా మనం తీసుకొనే శ్వాస అసలు సరైన శ్వాసే కాదు ఇది ఊపిరితిత్తుల ఎగువ భాగం ద్వారా తీసుకుని నిస్సారమైన శ్వాస, కానీ నిజమైన శ్వాస శ్రద్ధ, అభ్యాసంతో అవగాహనతో కూడి ఉండి మనకు శక్తిని ఇస్తుంది.23,24

సరళమైన శ్వాస లేదా సాధారణ శ్వాస: సహజంగా శ్వాస తీసుకోవడం మంచిదే కానీ అవగాహనతో తీసుకోవాలి. శ్వాస అనేది ఒక కొలమానం ప్రకారము బయటకు లోపలకు ప్రవేశించే విధంగా చూసుకోవడం ప్రాధమికమైన సరళమైన ఒక చిట్కా. ఇది మనసును శరీరాన్ని సామరస్య పరుస్తుంది. ఆ తర్వాత నిరంతర అభ్యాసం తో ఎవరికి వారు ఓం లేదా సోహం లేదా ఏదైనా పవిత్రమైన పదం మానసికంగా జపిస్తూ  శ్వాసించే వచ్చు.23

ఉదర పటలపు లేదా డయాఫ్రమాటిక్ శ్వాస: మనం వెనుకకు పడుకొని ఒక చేతిని ఛాతీపై మరొక చేతిని పొత్తికడుపు పై ఉంచితే సహజంగా శ్వాసించే టప్పుడు మన డయాఫ్రం యొక్క కదలికను గమనించవచ్చు.  మనం ఊపిరి పీల్చుకున్నప్పుడు మన ఉదరం లోకి గాలిని పీల్చుకుంటున్నట్లు ఊహించుకుందాం.  సరిగ్గా చేస్తే ఛాతీపై చేయి కదలకూడదు అయితే ఉదరముపై ఉంచిన చేయి శ్వాస లోపలికి తీసుకున్నప్పుడు పైకి , వదిలినప్పుడు కిందికి రావాలి. మనం పూర్తిగా శ్వాస లోపలికి తీసుకున్నప్పుడు డయాఫ్రం కిందికి లాగ బడుతుంది అప్పుడు గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది దీనివల్ల ఉదరం ముందుకు వస్తుంది.  మనం గాలి వదిలినప్పుడు తిరిగి దాని అసలు స్థానానికి చేరుతుంది, గాలి బయటకు విసర్జించబడుతుంది.  శ్రద్ధతో పది రోజులు క్రమం తప్పకుండా చేస్తే డయాఫ్రం కదలిక నియంత్రించబడుతుంది అంతేకాక డయాఫ్రం ఉపయోగించి శ్వాస తీసుకోవడం అలవాటు అవుతుంది.  ఉదయం మరియు సాయంత్రం కొన్ని నిమిషాలు సాధన చేయడం వల్ల ఇది అలవాటుగా మారి మన జీవితంలో ఒక అర్థవంతమైన భాగం అవుతుంది. 15,17

నిలబడి కూడా దీనిని సాధన చేయవచ్చు తల మెడ మరియు వీపు నిటారుగా ఉండాలి పొత్తికడుపు పై చేయి యొక్క కదలికలు గమనించాలి నిదానంగా పొట్ట లోపలికి తీసుకుంటూ  ఊపిరి వదిలి తర్వాత నిదానంగా బయటికి రానిస్తూ శ్వాస తీసుకొని ఊపిరితిత్తులను నింపండి అయితే దీనిని తీవ్రంగా చేయకూడదు. .15,17

జ్ఞప్తియందు ఉంచుకోవలసిన న మార్గదర్శకాలు వాటి ప్రయోజనాలు: శ్వాస పూర్తిగా మరియు సజావుగా శ్వాస లో ఎటువంటి కుదుపులు గాని శబ్దాలు గానీ లేకుండా అవగాహనతో గాఢనిద్రలో ఉన్న బిడ్డ తీసుకునే శ్వాసకు సమానమైన  స్థితిలో శ్వాస తీసుకోవాలి. ఉచ్వాస, నిశ్వాస లకు మధ్య సుదీర్ఘ విరామం ఉండకూడదు. సరిగ్గా చేస్తే శ్వాస తీసుకున్నప్పుడు నాసికా రంధ్రాల చల్లదనం యొక్క అనుభూతి మరియు విడిచినప్పుడు వెచ్చదనం యొక్క భావన మనం గమనించవచ్చు. ఈ రకమైన శ్వాస వల్ల ఊపిరితిత్తులు శుద్ధి చేయబడతాయి, శరీరం చల్లబడి మరింత శక్తివంతం అవుతుంది, అంతర్గత ఒత్తిడి పోగొట్టి  అద్భుతమైన విశ్రాంతిని ఇస్తుంది. ఇలా చేస్తే వరైనా సరే చక్కని ఆరోగ్యం,ఉన్నతమైన అవగాహన మరియు స్పష్టతతో కూడిన ఆలోచనా విధానాన్ని అనుభవించవచ్చు.15,17

హెచ్చరిక : ఎవరైనా సాధారణ శ్వాస అవగాహనా వ్యాయామాలు చేయవచ్చు కానీ అధునాతన పద్ధతులు ముఖ్యంగా శ్వాస స్థంభింప చేయడం లాంటివి సమర్ధుడైన శిక్షకుని సమక్షంలో సరియయిన మార్గ దర్శకత్వంలో నేర్చుకోవాలి మరియు సాధన చేయాలి. కొన్ని పద్ధతులు సన్యాసి మార్గంలో ఉన్న వారికి మాత్రమే సరిపోతాయి.  మనిషి జీవన విధానం మరియు స్వభావాన్ని బట్టిమరియు ప్రదేశాలను బట్టి యోగ పాఠశాలలో బోధించే పద్ధతులు వేరు వేరుగా ఉంటాయి. కొన్ని సాధనలలో మానవ జీవన విధానన్నే సమూలంగా మార్చుకోవలసి ఉంటుంది, అలా చేయకపోతే ఏ విధమైన ప్రయోజనం లేకపోగా హాని కలిగిస్తాయి.25

4. మన శ్వాసని విధంగా ముందుకు తీసుకు వెళ్దాం!

 ఆనందంగా అవగాహనతో మన శ్వాసను మనమే క్రమం తప్పకుండా గమనించడం వలన నిశ్చల స్థితి మరియు అంతర్దృష్టి  ఏర్పడతాయి. ప్రేమేనా స్వరూపం, సత్యమే నా శ్వాస, ఆనందమే నాఆహారం,  నాజీవితమే నాసందేశం, విశాల దృక్పథం నా జీవితం అంటూ మనందరికీ మార్గం చూపించడానికి భగవాన్ శ్రీ సత్య సాయి బాబా తన ఉపన్యాసంలో గానం చేస్తూ ఉండేవారు. మన శ్వాస  గురించి మనం తెలుసుకోవడం,  ప్రేమను చూపిస్తూ ఆనందించడం, శోధించడం మరియు శ్వాసే మనంగా మారిపోవడం ఎంతో ముఖ్యం. ఇది జీవితంలో ఆనందాన్ని ఇవ్వడమే కాక నిరంతరం శ్రద్ధతో కొనసాగించినట్లయితే జనన మరణాలకు సంబంధించిన అంతుచిక్కని భ్రమ కలిగించే చక్రాన్ని అధిగమించడంలో కూడా మనకు సహాయపడుతుంది !

రిఫెరెన్స్ కోసం వెబ్సైట్ లింకులు :

1. Sathya Sai Speaks, Vol11 (1971-72), Chapter 9, Step by Step, para7, http://www.sssbpt.info/ssspeaks/volume11/sss11-09.pdf

2. Sathya Sai Speaks, Dasara Discourse, 12 October 2002, Soham-the right sadhana, page 3: https://www.sathyasai.org/discour/2002/d021012.pdf

3. Ayurveda & Breath, a discourse by Gurudev Sri Sri Ravi Shankar, 1st edition, 2010, page 7, 23.

4. Breathing process: https://www.medicinenet.com/script/main/art.asp?articlekey=11056

5. https://www.nhlbi.nih.gov/health-topics/how-lungs-work

6. https://isha.sadhguru.org/in/en/wisdom/article/breath-bond

7. https://www.blf.org.uk/support-for-you/how-your-lungs-work/why-do-we-breathe

8. Respiratory rate: https://blog.epa.gov/2014/04/28/how-many-breaths-do-you-take-each-day/

9. http://www.normalbreathing.com/index-nb.php 

10. https://my.clevelandclinic.org/health/articles/10881-vital-signs

11. https://www.hopkinsmedicine.org/health/conditions-and-diseases/vital-signs-body-temperature-pulse-rate-respiration-rate-blood-pressure 

12. Slow breathing good for health: https://drsircus.com/general/breathing-live-longer/

13. Nasal breathing: https://www.livestrong.com/article/255298-mouth-breathing-vs-nasal-breathing/ 

14. Nasal breathinghttps://breathing.com/pages/nose-breathing

15. Alternate Nasal Breathing & Diaphragmatic breathing: A Practical Guide to Holistic Health by Swami Rama, The Himalayan Institute Press, Honesdale, Pennsylvania, 2005 edition, chapter 2, Cleansing, pages 19-22

16. http://www.onepointeded.com/alternate-nasal-breathing.html

17. Science of Breath, A Practical Guide by Swami Rama, Rudolph Balentine MD, Alan Hymes MD, Himalayan Institute of India, 2014 edition, p.62-67

18. Physiological and psychological effects of yogic nostril breathing: https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC4097918/

19. Benefits of Alternate Nasal Breathing: www.ncbi.nlm.nih.gov/pubmed/8063359

20. http://www.ijpp.com/IJPP%20archives/2005_49_4/475-483.pdf

21. Effect of disturbance in Nasal Cycle, a study: https://www.intechopen.com/books/pathophysiology-altered-physiological-states/alteration-in-nasal-cycle-rhythm-as-an-index-of-the-diseased-condition

22. Self-study on Nostril dominance: https://yogainternational.com/article/view/self-study-nostril-dominance

23. Techniques of breathing: Raja yoga, Conquering the internal nature,  by Swami Vivekananda, chapter IV, the psychic prana, p.56 & Chap V, The Control of Psychic Prana, p.62-63, Advaita ashram Publication, Kolkata

24. Rhythmic breathing: https://www.artofliving.org/in-en/breathing-techniques

25. Caution: https://isha.sadhguru.org/in/en/wisdom/article/dont-school-breath

 

 

2. అవగాహనా  సదస్సు దక్షిణ ఫ్లోరిడా యూఎస్ఏ 2019 జూలై 11- 14

దక్షిణ ఫ్లోరిడా పోర్టు లాడర్ డేల్ లో సీనియర్ అభ్యాసకులు11584 & 02787 ఇంటి వద్ద జూలై 13న ఒక అవగాహనా వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది. ఇందులో పాల్గొన్నవారు అంతా కూడా వైబ్రియానిక్స్ రెమెడీలు తీసుకోవడానికి మరియు తమంత తాము అభ్యాసకులుగా ఉండటానికి శిక్షణ తీసుకోవడానికి చాలా ఆసక్తి చూపించారు. దీనికి ముందు మరియు తర్వాత లాడర్డేల్ మరియు మియామి సాయి కేంద్రాలలో దీనిపై చర్చలు నిర్వహించడం జరిగింది. వీనిలో డాక్టర్ అగర్వాల్ గారు పాల్గొంటూ స్వామితో తన వ్యక్తిగత అనుభవాలను, వైబ్రియానిక్స్ మిషన్ విషయంలో స్వామి వారికి ఇచ్చిన ఆశీర్వాదాలు మరియు మార్గదర్శకత్వం గురించి తెలియజేశారు. ఈ రెండు సమావేశాలకు సభ్యులు అధిక సంఖ్యలో హాజరవడమే కాక వైబ్రియానిక్స్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి చాలా ఆసక్తి చూపించారు.

 

 

 

 

 

 

 

 

3. AVP వర్క్ షాప్ పుట్టపర్తి, ఇండియా, 17-22 జూలై 2019

భారతదేశం నుండి ఆరుగురు, గాబన్(మధ్య ఆఫ్రికా), బెనిన్(పశ్చిమ ఆఫ్రికా), దక్షిణాఫ్రికా మరియు యు. కె నుండి ఒక్కొక్కరు చొప్పున 10 మంది అభ్యర్థులు ఆరు రోజులపాటు విస్తృతస్థాయి స్థాయిలో నిర్వహించిన వర్క్ షాప్ లో AVP లు గా అర్హత సాధించారు.  భారతదేశం నుండి మరియు విదేశాలనుండి నలుగురు అభ్యాసకులు కూడా వారి జ్ఞానాన్ని  పునశ్చరణ చేసుకోవడానికి ఈ వర్క్ షాప్ లో పాల్గొన్నారు సీనియర్ అభ్యాసకుడు11964 మద్దతుతో ఇద్దరు సీనియర్ టీచర్లు10375 & 11422 నిర్వహించిన ఈ వర్క్ షాప్ ఉత్తేజకరంగా మరియు ఇంటరాక్టివ్ సెషన్లతో జరిగింది. డాక్టర్ అగర్వాల్ గారు యు.ఎస్ నుండి స్కైప్ ద్వారా కొన్ని విషయాలలో మార్గదర్శకత్వం చేశారు.  వర్క్ షాప్ లో శ్రీమతి హేమ్ అగర్వాల్  రోగుల కేస్ హిస్టరీ రాయటం విషయము లో అమూల్యమైన విషయాలను చెప్పారు. ఈ వర్క్ షాప్ లో ముఖ్యాంశం బోధనా పద్ధతిని అధ్యాయం వారిగా బోధించడం కాకుండా మరింత ఇంటరాక్టివ్ కేస్ స్టడీ పద్ధతి కి మార్చడం జరిగింది.  ఈ వర్క్ షాప్ లో ఉపాధ్యాయులు మరియు సీనియర్ అభ్యాసకులు మాక్ క్లినిక్ ఏర్పాటు చేసి  ఒకరు అభ్యాసకుడు మరొకరు రోగిగా అభినయించారు. ఈ వర్క్ షాప్ లో పాల్గొన్న వారు ఫార్మేట్ మరియు ప్రజెంటేషన్ అంశాల గురించి అధికారిక అభిప్రాయాలు తీసుకునే వ్యవస్థ కూడా ప్రారంభించబడింది. నూతన AVPలు అందరూ ఉత్సాహంతో మిక్కిలి భక్తితో స్వామి ముందు ప్రమాణం చేయడమే కాకుండా వెంటనే సేవ ప్రారంభించడానికి ఆసక్తిగా ఉన్నారు.

 

 

 

 

 

 

 

 

4. VP లు మరియు AVP నిమిత్తం పునశ్చరణ సదస్సు- రాజస్థాన్, ఇండియా- 2019 ఆగస్టు 25 - 27

రాజస్థాన్ రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలలో ప్రస్తుతం పనిచేస్తున్న అభ్యాసకులకు తిరిగి శిక్షణ ఇవ్వడానికి ప్రస్తుతం ఉన్న ప్రామాణికాల కు అనుగుణంగా నైపుణ్యాలను పెంచడానికి ఈ మూడు రోజుల సదస్సు నిర్వహించబడింది. ఈ శిబిరాన్ని  నిర్వహించడానికి సీనియర్ టీచర్ 10375 మరియు ఇద్దరూ కోఆర్డినేటర్లు10461 & 10462 తో కలిసి నెలల తరబడి గ్రౌండ్ వర్క్ చేయడం చేయడం జరిగింది. మొత్తం 14 మంది అభ్యాసకులను  వీరిలో జైపూర్ నుండి నలుగురు, భిల్వారా నుండి పదిమంది. వీరంతా కంప్యూటర్ పై అవగాహన లేనివారు ప్రస్తుత పరిస్థితుల్లో తప్పనిసరిగా చేయవలసిన ‘ఈ కోర్సు చేయనివారు, అందువల్ల వీరిని స్వయంగా  మాన్యువల్ గా ఈ కోర్సు పూర్తి చేయడానికి వారి జ్ఞానాన్ని మెరుగుపరచుకోవడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది.  భిల్వారా లోని సాయి సెంటర్లో సీనియర్ వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్ 11964 మద్దతుతో సీనియర్ టీచర్10375 ఈ సదస్సును హిందీలో నిర్వహించారు.

వైభ్రియానిక్స్ యొక్క చరిత్ర మరియు అభివృద్ధి, అభ్యాసకుల బాధ్యతలు, రెమెడీల ఎంపిక, తయారీ మరియు నిర్వహణ, రోగుల చరిత్రను రికార్డు చేయడం ఈ సమావేశంలో తెలియజేయడం జరిగింది. పాల్గొన్నవారు స్కైప్ ద్వారా డాక్టర్ అగర్వాల్ గారితో నేరుగా ఉత్సాహవంతంగా సంభాషించే అవకాశం కలిగి విషయాల పట్ల స్పష్టత పొందినందుకు ఎంతో ఆనందించారు.  డాక్టర్ అగర్వాల్ గారు  నిబద్దత తో కూడిన గుణాత్మకమైన సేవను, ప్రేమ మరియు కరుణ తో అందిస్తూ వృత్తి నైపుణ్యం కలిగి ఉండడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.

  ముఖ్యాంశం ఏమిటంటే ఇక్కడ నిర్వహించిన అనేక సెషన్లలో మోడల్ క్లినిక్ ఏర్పాటు చేసి పాల్గొన్న వారి చేత ఒకరు పేషెంటుగా మరొకరు అభ్యాసకునిగా అభినయం చేయించారు. ఇది రోగి మరియు అభ్యాసకుని మధ్య పరస్పర అవగాహనపై వారికి అంతర్దృష్టి ని చ్చింది. మూడు రోజులపాటు సాయంత్రం చీకటి పడే వరకు చర్చలు జరిగినా సభ్యులంతా ఎంతో ఉత్సాహంగా దీంట్లో పాల్గొనడం విశేషం. దీనికి అనుబంధంగా ప్రతి మధ్యాహ్నం వాస్తవమైన క్లినిక్ కూడా ఏర్పాటు చేయడం వలన ఆ విధంగా 30 మంది రోగులకు చికిత్స చేయడం కూడా జరిగింది. ఈ వర్క్ షాప్ శక్తిని ఆత్మవిశ్వాసాన్ని కలిగించిందని వారి ఉత్సాహం ద్వారా స్పష్టమైంది. ఈ వైబ్రియానిక్స్ సేవ స్వామి వారికి అప్పగించిన పనిగా భావించి ముందుకు తీసుకు వెళ్తామని అందరూ ప్రతిజ్ఞ చేశారు.

 

 

 

 

 

 

 

ఓం శ్రీ సాయి రామ్!