వైద్యులకే వైద్యుడి యొక్క దివ్య వాక్కు
Vol 7 సంచిక 2
March/April 2016
“మానసిక అశాంతి మనిషి ఆరోగ్యానికి ఎంతో చేటు చేకూరుస్తుంది కనుక మానవునిలో వత్తిడికి,అశాంతికి కారణమయినట్టి భావోద్వేగాలను ,కోరికలను ,అదుపులో ఉంచుకొనడం ఎంతో అవసరం. ఆహారము తీసుకొనేటప్పుడు కూడా మనసును పవిత్రంగా,ప్రశాంతంగా ఉంచడం ఎంతో అవసరం. మనం ఆహారము తీసుకొనేటప్పుడు కోపాన్ని,ఉద్రేకాన్ని కలిగించే సంభాషణలలో పాల్గొనకుండా ఉండడం ఎంతో అవసరం. ఆహారము తీసుకునేటప్పుడు ఆవేశ కావేశాలకు లోనుకావడం మానసిక అశాంతికి కారణ మవుతుంది. ఇట్టి మానసిక అశాంతి అనారోగ్యానికి కారణ భూత మవుతుంది.ఇంతేకాక ఆహారము తీసుకునే టప్పుడు టి.వి. చూడడం,మానసిక అశాంతిని కలిగిస్తుంది కనుక టివి చూడకూడదు. ‘’
……సత్యసాయిబాబా , “ఆహారము ,హృదయము మరియు మనసు ” 1994 జనవరి 21 నాటి శ్రీవారి భాషణము “సేవకు సంసిద్ధత ” శ్రీవారి భాషణము 1986 నవంబర్ 21
http://www.sssbpt.info/ssspeaks/volume27/sss27-03.pdf
నీవు ఈ ప్రపంచము మరియు దానికి సంబంధించిన విషయాలలో జోక్యం చేసుకోకూడదు. నోటితో భగవన్ నామాన్ని పలుకుతూ ప్రాపంచిక విషయాలకు ఎంత వీలయితే అంత దూరం ఉండు. నీకున్న 24 గంటలలో 6 గంటలు నీ దైనందిన అవసరాలకు ,6 గంటలు ఇతరుల సేవకు, ఆరు గంటలు నిద్రకు, ఆరు గంటలు భగవన్నామస్మరణ కు కేటాయించు. ఈ 6 గంటలు నిన్ను ఉక్కు కన్నా గట్టిగా తయారు చేస్తాయి. …సత్యసాయిబాబా, “మానవ నావ ”— సత్యసాయిబాబా, 1964 డిసెంబర్ 14 నాటి శ్రీవారి భాషణము
http://www.sssbpt.info/ssspeaks/volume04/sss04-46.pdf