అదనంగా
Vol 13 సంచిక 3
మే / జూన్ 2022
1. ఆరోగ్య చిట్కాలు
జీవనశైలి వ్యాధులను నివారించడానికి ఆరోగ్యంగా జీవించండి
“ నేడు ప్రజలలో అనారోగ్యానికి అత్యంత సాధారణ మూలబీజం టెన్షన్. టెన్షన్‌కి కారణం ఏమిటి? మితిమీరిన అనేక కృత్యాలలో పాలుపంచు కోవడం. మగవారు జీవన గమనాన్ని నియంత్రించడం నేర్చుకోవాలి. తొందరపాటు(హర్రీ) ఆందోళన(వర్రీ) కలిగిస్తుంది మరియు ఆందోళన వ్యాధిని కలిగిస్తుంది. ‘హర్రీ, వర్రీ మరియు కర్రీ (కూర లేదా కొవ్వు ఆహారం)’ గుండె జబ్బులకు కారణాలు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇన్సులిన్ ఇంజెక్షన్ల ఉపయోగం నాల్గవ వంతు మాత్రమే, మిగిలిన మూడు వంతులు: ఆహార పరిమితులు, శారీరక వ్యాయామాలు మరియు ఇటువంటి ఇతర విషయాలు. కాబట్టి, మొదట నియంత్రించ వలసినది ఫుడ్(ఆహారం) మరియు హెడ్(మనస్సు). మీరు ఈ రెండింటినీ నియంత్రించినప్పుడు, అనారోగ్యానికి ఆస్కారం ఉండదు”...సత్యసాయిబాబా 1,2
1. ఆరోగ్యం అంటే ఏమిటి ?
హెల్త్ (ఆరోగ్యం) అనే పదం హోల్ (మొత్తం) అనే పదం నుండి వచ్చింది. ఇది శారీరకంగా, మానసికంగా, సామాజికంగా మరియు ఆధ్యాత్మికంగా - కేవలం వ్యాధి లేకపోవడమే కాకుండా - రోజువారీ జీవితంలో ప్రతి స్థాయిలో అనుభవించాల్సిన సంపూర్ణ శ్రేయస్సు యొక్క స్థితి. ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి లోపల నుండి శాంతి మరియు ఆనందం వెల్లివిరుస్తుంది3,4.
2. జీవన శైలి వ్యాధులు అంటే ఏమిటి?
ప్రాథమికంగా ఇవి అంటు వ్యాధులు కావు కానీ ఎక్కువగా దీర్ఘకాలికమైనవి. అనారోగ్యకరమైన మరియు క్రమశిక్షణ లేని జీవనశైలి వల్ల ఇవి ఉత్పన్నమవుతాయి లేదా ప్రేరేపించబడతాయి లేదా తీవ్రతరం అవుతాయి. మందులను తీసుకోవడమే ఒక జీవన విధానంగా చేసిన వ్యాధులు ఇవి.5,6,7,8
ప్రధాన కారణాలు: శరీర తత్వానికి సరిపడని విధంగా అధికంగా తినడం తాగడం, శారీరక శ్రమ లేకపోవడం, స్వచ్చమైన గాలి మరియు సూర్యకాంతికి లోనుకాకపోవడం, నిద్ర సరిపోక పోవడం మరియు ఒత్తిడి. ఈ వ్యాధి-పీడిత జీవనశైలి ఏర్పడడానికి ప్రధాన కారణాలు సాంకేతికతతో నడిచే వేగవంతమైన జీవితం, ఎక్కువ గంటలు పని చేయడం, పేలవమైన భంగిమ, పోటీగా ఉండాలనే కోరికతో సామాజిక మరియు తోటివారి ఒత్తిడి, ఆరోగ్యకరమైన వినోదం మరియు ప్రియమైనవారితో సమయం గడప లేకపోవడం, కుటుంబంలో సంస్కృతి పరంగా వచ్చే సాధారణ మార్పులు లేదా కుటుంబాల విచ్ఛిన్నం. ఈ సమస్య ధూమపానం, మద్యం సేవించడం మరియు మాదకద్రవ్యాల దుర్వినియోగం వంటి అలవాట్లతో మరింత జటిలం అవుతుంది. జన్యు పరంగానూ, గాలి, నీరు మరియు నేల కాలుష్యం వంటివి కూడా ఇతర ప్రధాన కారకాలు.5,6,7,8
అత్యంత సాధారణ జీవన శైలి వ్యాధులు అసిడిటీ, హైపర్ టెన్షన్, గుండె జబ్బులు, గుండెపోటు, ఊబకాయం, మరియు టైప్ 2 మధుమేహం, ఇటీవలే అధికంగా పెరుగుతూ ఈ జాబితాలో చేరే ఇతర వ్యాధులు క్యాన్సర్, ముఖ్యంగా నోటి మరియు పెద్దప్రేగు క్యాన్సర్, దీర్ఘకాలిక కాలేయ వ్యాధి, సిర్రోసిస్, పెద్దప్రేగు శోథ, ప్రేగు ప్రకోప వ్యాధి లేదా ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్, PCOD, ఎముక లేదా దంత క్షయాలు, ప్రవర్తనా సమస్యలు, నిరాశ, అల్జీమర్స్ వ్యాధి, ఆస్తమా, కీళ్లనొప్పులు, బోలు ఎముకల వ్యాధి, చర్మ వ్యాధులు, మరియు మూత్రపిండాల వైఫల్యం.5,6,7,8
3. మూడు ప్రధాన జీవనశైలి వ్యాధుల స్వభావం మరియు లక్షణాలు
3.1 ఊబకాయం: ఊబకాయం అంటే శరీరంలో అసాధారణ అధిక కొవ్వు చేరిక; అధిక చక్కెర, అధిక కొవ్వు, ఆహారంలో ఉప్పు అధికంగా తీసుకోవడం, తక్కువ శారీరక శ్రమ వలన ఊబకాయం కలుగుతుంది. స్థూలకాయం యొక్క సూచిక BMI (బాడీ మాస్ ఇండెక్స్ అనేది శారీరక బరువును కిలోలలో అలాగే ఎత్తును మీటర్ల స్క్వేర్‌లో భాగించడం ద్వారా వచ్చినది) 30 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే స్థూలకాయం కలిగి ఉన్నట్లే. ఇది అనేక వ్యాధులకు ప్రధాన కారణాలలో ఒకటి, ముఖ్యంగా పెద్దలలో టైప్ 2 మధుమేహం, ప్రస్తుతం పిల్లలు మరియు యువత కూడా దీనికి గురి అవుతున్నారు. 25 కంటే ఎక్కువ ఉన్న BMI అధిక బరువుగా పరిగణించబడుతుంది, ఇది నివారించవలసిన ఊబకాయానికి సంకేతం. 8,9
3.2 టైప్ 2 మధుమేహం: టైప్ 2 డయాబెటిస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుంది అంటే, ప్యాంక్రియాస్ ద్వారా ఉత్పత్తి చేయబడిన ఇన్సులిన్ సరిగ్గా పనిచేయక పోవడం లేదా రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి సరిపోకపోవడం. సాధారణంగా ఇది పెద్దలలో సంభవిస్తుంది కానీ ఇటీవల పిల్లలలో కూడా ఎక్కువగా కనిపిస్తోంది. ఊబకాయం ఉన్నవారు, అధిక కేలరీల ఆహారాన్ని తినడం, కుటుంబ చరిత్ర లేదా జన్యు సంబంధిత కారణాలు, మరియు ఉదర ఊబకాయం (పెరిగిన నడుము నుండి తుంటి నిష్పత్తి) ఉన్న వారు దీనికి ఎక్కువగా గురైయె అవకాశం ఉంది. అలాగే, గర్భధారణ సమయంలో తల్లికి పోషకాహార లోపం వలన తక్కువ బరువుతో పుట్టిన పిల్లలు మరియు బాల్యంలో తల్లిపాలు సరిపోని పిల్లలు కూడా దీనికి గురైయె అవకాశం ఉంది. అటువంటి బలహీనమైన పిల్లలకు అత్యుత్సాహం గల తల్లిదండ్రులు అతిగా తినిపించడం వలన ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడుతుంది. 8,9,10
లక్ష ణాలు నెమ్మదిగా అభివృద్ధి అవుతాయి: వ్యాధి ప్రాధమిక దశలో దాహం పెరగడం, తరచుగా మూత్రవిసర్జన లేదా మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ వంటి వాటిలో ఏదో ఒకటి ఉండవచ్చు. ఆకలి పెరగడం, బరువు తగ్గడం, అలసట, కళ్లు తిరగడం, చూపు మసకబారడం, పుండ్లు నెమ్మదిగా తగ్గడం, తరచుగా ఇన్‌ఫెక్షన్‌లు, చేతులు లేదా కాళ్లు తిమ్మిరి లేదా జలదరింపు లేదా పాదాలలో స్పర్శ తగ్గడం, తినేటప్పుడు చెమటలు పెరగడం మరియు చర్మం పైన అక్కడక్కడ నల్లబడిన ప్రాంతాలు వంటివి ఈ వ్యాధిని గుర్తించదగిన సంకేతాలలో కొన్ని. ఖచ్చితమైన లక్షణాలు వ్యక్తికి వ్యక్తికి భిన్నంగా ఉండవచ్చు. మధుమేహాన్ని అనుమానించడానికి ఒక్క లక్షణం మైనా సరిపోతుంది ఐతే యాభై శాతం కేసులు లక్షణరహితంగా ఉండవచ్చు మరియు రక్త పరీక్షలు ఈ పరిస్థితిని వెల్లడించినప్పుడు మాత్రమే వెలుగులోకి వస్తాయి. అనుకోకుండా బరువు తగ్గడం, చిన్నపాటి స్కిన్ ఇన్‌ఫెక్షన్ లేదా ప్రైవేట్ పార్ట్స్‌లో దురద వంటి తేలికపాటి లక్షణాలను ఈ వ్యాధిగ్రస్తులు కలిగి ఉండవచ్చు, ఇవి గుర్తించబడకపోతే గుండెపోటు, స్ట్రోక్, దృష్టి కోల్పోవడం, కోమా మొదలైన వాటికి దారితీయవచ్చు. పిల్లల విషయంలో ముఖ్యంగా తగినంత పోషకాహారాన్ని పొందుతున్నప్పటికీ పిల్లల ఎదుగుదలలో లోపం, చీమలు పిల్లల మూత్రం పోసిన చోట చేరడం, ఇలాంటి సూచికల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. 8,9,10
డయాబెటిక్ ఎమర్జెన్సీ లక్షణాలు: మధుమేహం ఉన్న వ్యక్తి భోజనం మానేసినప్పుడు లేదా ఎక్కువ వ్యాయామం చేసినప్పుడు రక్తంలో చక్కెర అకస్మాత్తుగా పడిపోతుంది (హైపోగ్లైసీమియా). దీని సాధారణ లక్షణాలు: ఆకలి, చెమట, మగత లేదా గందరగోళం, బలహీనత లేదా మూర్ఛ, లేదా అకస్మాత్తుగా ప్రతిస్పందన కోల్పోవడం: లేదా రక్తంలో చక్కెర అకస్మాత్తుగా పెరగవచ్చు (హైపర్‌గ్లైసీమియా) దీని సాధారణ లక్షణాలు: శ్వాస ఆడకపోవడం, నోటి నుండి పండ్ల వాసన, వికారం, వాంతులు, మరియు నోరు పొడిబారడం. 8,9
3.3 హృదయ సంబంధ వ్యాధులు: ఇవి గుండె మరియు రక్త నాళాల రుగ్మతలు. అనారోగ్యకరమైన జీవనశైలి సాధారణంగా కరోనరీ ఆర్టరీ వ్యాధి (CAD)కి దారి తీస్తుంది, ధమని గోడలపై దీర్ఘకాలం కొవ్వు నిల్వలు గుండె మరియు మెదడుకు రక్త ప్రవాహాన్ని నిరోధిస్తాయి. దీని వల్ల గుండెపోటు లేదా స్ట్రోక్ రావచ్చు. అధిక రక్తపోటు, అసాధారణ కొలెస్ట్రాల్ మరియు అధిక ట్రైగ్లిజరైడ్స్, ఊబకాయం మరియు మధుమేహం ఉన్న వ్యక్తులు సులభంగా ఈ వ్యాధికి లోనౌతారు. గుండె పోటుకు ముందు ఏదైనా ఒక సూచన పొందవచ్చు (దానిని విస్మరించకూడదు), లేదా అది ఆకస్మికంగా కూడా ఉండవచ్చు. 8,9,13-16
గుండెపోటు యొక్క తీవ్రమైన లక్షణాలు: ఆకస్మిక నొప్పి లేదా ఛాతీలో ఒత్తిడిని అనుభూతి చెందడం, పిండినట్లుగా లేదా నొక్కివేసి నట్లుగా అనిపించడం, ఛాతీ మధ్యలో బరువుగా ఉండడం, లేదా చేతులు, భుజాలు, మోచేతులు, దవడ లేదా వీపులో ఆకస్మిక నొప్పి ఉండవచ్చు. వీటికి అదనంగా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆందోళన, వికారం, వాంతులు, మూర్ఛ, దడ, లేదా చెమటతో వళ్ళు చల్లగా అయిపోవడం, లేదా పాలిపోయినట్లుగా మారిపోవడం ఉండవచ్చు. ఇది కొన్ని నిమిషాల పాటు కొనసాగవచ్చు లేదా తిరిగి వస్తూ ఉండవచ్చు. 8,13-16
స్ట్రోక్ (మెదడుపై దాడి) యొక్క తీవ్రమైన లక్షణాలు: ముఖం, చేయి లేదా కాలు, ముఖ్యంగా శరీరం యొక్క ఒక వైపున ఆకస్మిక బలహీనత లేదా తిమ్మిరి. ఇతర లక్షణాలు అనగా అకస్మాత్తుగా గందరగోళం, మాట్లాడటంలో ఇబ్బంది, మాటలను అర్థం చేసుకోలేకపోవడం, దృష్టిలో అస్పష్టత /రెండుగా కనిపించడం లేదా డబల్ విజన్, లేదా దృష్టి కోల్పోవడం, ముఖ్యంగా ఒక కంటిలో, మైకము, సమతుల్యత కోల్పోవడం లేదా సమన్వయం కోల్పోవడం లేదా కారణం ఏదీ లేకుండా తీవ్రమైన తలనొప్పి మరియు మూర్ఛపోవడం ఉండవచ్చు.8,9,17
4. మధుమేహ సంబంధిత అత్యవసర స్థితి, గుండెపోటు లేదా స్ట్రోక్ సమయంలో చేయవలసిన ప్రధమ చికిత్స:
4.1 డయాబెటిక్ ఎమర్జెన్సీ: డయాబెటిక్ ఎమర్జెన్సీ అనేది రక్తంలో చక్కెర ఎక్కువ లేదా చాలా తక్కువ ఐన కారణంగా కావచ్చు. ఒక వేళ కారణం చక్కెర చాలా తక్కువ స్థాయి వలన అయితే రోగి స్పృహలో ఉండి మింగగలిగే స్థితిలో ఉన్నప్పుడు, ఏదైనా ఒక తీపి పానీయం, లేదా చాక్లెట్ లేదా ఏదో ఒక స్వీట్ ను తినడానికి ఇవ్వండి; నిమిషాల్లో రోగి మెరుగు పడతాడు. రోగి మరింత అప్రమత్తంగా ఉన్నప్పుడు, గణనీయమైన కార్బోహైడ్రేట్ లు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని అందించండి, ఉదా, శాండ్‌విచ్ లేదా తీపి బిస్కెట్లు. వ్యక్తి అపస్మారక స్థితిలో ఉంటే వెంటనే అంబులెన్స్‌కు కాల్ చేయండి; అట్టి వారికి తినడానికి లేదా త్రాగడానికి ఏదైనా ఇవ్వడానికి ప్రయత్నించవద్దు ఎందుకంటే వారు ఉక్కిరిబిక్కిరి అయ్యే ప్రమాదం ఉంది. శ్వాసకు ఆటంకం కలగకుండా వారిని ఒక వైపుకు తిప్పండి.18,19
4.2 గుండెపోటు: గుండెకు శాశ్వత నష్టాన్ని నివారించడానికి తక్షణ వైద్య సహాయం లేదా ఒక గంటలోపే చికిత్స చేయడం అవసరం. సహాయం అందే వరకూ గుండెపై ఒత్తిడిని తగ్గించడానికి మరియు వారు కింద పడిపోతే గాయాన్ని నివారించడానికి వ్యక్తిని కుర్చీలో లేదా గోడకు ఆనుకుని నేలపైన గానీ కూర్చోబెట్టండి. రోగి యొక్క మెడ, ఛాతీ మరియు నడుము చుట్టూ ఉన్న దుస్తులను వదులు చేసి వారు ప్రశాంతంగా ఉండటానికి సహాయం చేయండి. రోగి చుట్టూ ఎవరినీ గుమికూడనివ్వవద్దు. రక్తాన్ని పలచన చేయడానికి ఆస్పిరిన్ టాబ్లెట్ (ఒక మోతాదులో 300 mg కంటే ఎక్కువ కాకూడదు) చప్పరించ నివ్వాలి. రోగి అప్పటికే మందులపై ఆధారపడి ఉంటే వారు నిత్యమూ తీసుకొనే ఔషధం ఇవ్వవచ్చు. 20-23
కార్డియో పల్మనరీ రిసస్కియేషన్ (CPR): రోగి కుప్పకూలిపోయినా లేదా నాడీ స్పందన ఆగిపోయినట్లు అనిపించినా రోగిని నేలపై నిటారుగా ఉండేలా దృఢమైన ఉపరితలంపై మెల్లగా వెల్లకిలా పడుకునేలా చేసిన తర్వాత CPR ఇవ్వండి. అనగా రోగి ఛాతీపై వెంటవెంటనే 30 వేగవంతమైన మరియు గట్టి కుదింపులను లేదా వత్తిడి లను ఒక సైకిల్ గా లేదా చక్రంలా ఇవ్వండి. శ్వాస తీసుకోవడానికి వాయుమార్గాన్ని తెరుచుకొనేలా చేసి రెండు రెస్క్యూ బ్రీత్‌లను కూడా ఇవ్వండి (C-A-B అని పిలుస్తారు). రోగి ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించే వరకూ లేదా వైద్య సహాయం అందె వరకూ ఈ C-A-B సైకిల్ లను కొనసాగించండి. ఛాతీపై కుదింపులు మాత్రమే ఒక జీవితాన్ని రక్షించగలవు! సాధారణ వ్యక్తి CPR.21-23.ని ఎలా నిర్వహించవచ్చో తెలుసుకోవడానికి క్రింది లింక్‌ల ద్వారా వెళ్లండి (మహిళల్లో గుండెపోటు పై అవగాహన కోసం వాల్యూం 1 #1 సెప్టెంబర్ 2010 మరియు ఒంటరిగా ఉన్నప్పుడు గుండెపోటును ఎలా తట్టుకోవాలో వాల్యూం 2 #5 సెప్టెంబర్ 2011 చూడండి).
ఎడమ చిటికెన వేలు గోరు యొక్క మొదలు చుట్టూ నొక్కడం గుండెపోటుకు ఆక్యుప్రెషర్‌లో విధానంలో సమర్థవంతమైన ప్రాణాలను రక్షించే ప్రథమ చికిత్సగా పరిగణించబడుతుంది.24
4.3 స్ట్రోక్ మెదడులోని రక్తనాళం గడ్డకట్టడం లేదా పగిలిపోవడం కారణంగా మెదడులోని కొంత భాగానికి రక్త సరఫరా నిలిచిపోయినప్పుడు స్ట్రోక్ సంభవిస్తుంది. ఇది ఎప్పుడూ పిడుగులా వస్తుంది. మెదడులో కణాలు చనిపోతూ ఉంటాయి కనుక ప్రతీ సెకను కూడా ప్రధానమైనదే. అత్యవసర వైద్య సహాయం కోసం కాల్ చేయవలసి ఉంటుంది. రోగి పూర్తి స్పృహలో లేకుండా ఉంటే సాధ్యమైనంత ఎక్కువ సౌలభ్యం ఉన్న స్థితిలో వారిని ఒక ప్రక్కగా పడుకునేలా ఉంచి, వైద్య సహాయం వచ్చే వరకు వేడిని కోల్పోకుండా రోగిని కవర్ చేయాలి. 25-26
రోగిని నిద్రపోనివ్వవద్దు. స్ట్రోక్ వ్యక్తి యొక్క మింగే సామర్థ్యాన్ని ప్రభావితం చేసి రోగిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది, కాబట్టి మందులు, ఆహారం లేదా పానీయాలు ఇవ్వకూడదు. ఇది హెమరేజిక్ స్ట్రోక్ అయితే (20% స్ట్రోక్స్ ఇలాంటివే కావచ్చు) ఆస్పిరిన్ ఇవ్వడం మరింత రక్తస్రావమును కలిగిస్తుంది. లక్షణాలు త్వరగా అదృశ్యమైనప్పటికీ, సహాయం కోసం కాల్ చేయడంలో ఆలస్యం చేయవద్దు. చాలా మంది స్ట్రోక్ రోగులకు CPR అవసరం లేదు కానీ రోగికి పల్స్ లేకపోయినా, శ్వాస తీసుకోలేకపోయినా, అపస్మారక స్థితిలో ఉన్నా వెంటనే CPR.25-26 ఇవ్వండి.
5 ఆరోగ్య కరమైన జీవన శైలి ఏ వ్యాధినైనా నివారించ వచ్చు లేదా నిరోధించవచ్చు.
చాలా వరకు జీవనశైలి వ్యాధులు నివారించదగినవి మరియు తిరిగి వెనుకకు మళ్లింపదగినవి! క్రమమైన శారీరక శ్రమ తో పాటు తగిన ఆహారంతో అనేక దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారంలో సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు (తృణధాన్యాలు, కూరగాయలు మరియు పండ్లు), మొక్కల ఆధారిత ప్రోటీన్ (కాయధాన్యాలు, బీన్స్, బఠానీలు, గింజలు మరియు విత్తనాలు) మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు "కొవ్వు రహిత" ఆహారాలు అని పిలవబడే వాటితో పోలిస్తే మితంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి జన్యు పరంగా మనం గురి అయ్యె వ్యాధులను కూడా చాలా వరకు అరికట్టగలవని పరిశోధనలు చెబుతున్నాయి.5,8,9,27-32
సామాజిక ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం దయ, సేవ లేదా సమాజపు పని, మరియు సంబంధాలను పెంపొందించడం అలాగే ధ్యానం లేదా సైలెంట్ సిటింగ్ ద్వారా ప్రతిరోజూ తనతో తను నాణ్యమైన సమయాన్ని గడపడం శాంతి మరియు ఆనందాన్ని ఇస్తుంది. 32. జీవనశైలికి సంబంధించి ఈ సందర్భంలో మహాత్మా గాంధీ యొక్క బంగారు పదాలు గుర్తు తెచ్చుకోవడం సముచితం. "దేహాన్ని దేవుని ఆలయంగా ఉపయోగించుకునే బదులు, మనము దానిని భోగాలకు వాహనంగా ఉపయోగించడం మరియు అవసరమైనప్పుడు సహాయం కోసం వైద్యుల వద్దకు పరిగెత్తుతూ ఈ భూలోక గుడారాన్ని దుర్వినియోగం చేయడానికి సిగ్గుపడము.” 33
రిఫరెన్సులు మరియు వెబ్సైట్ లింకులు
- Sathya Sai Speaks, Divine Discourse on “Health, Diet, and Divinity”, 3 June 1995,https://www.sssbpt.info/ssspeaks/volume28/sss28-16.pdf
- Sathya Sai Speaks, Divine Discourse on “One-fourths and three-fourths”, 27 March 1968 https://www.sssbpt.info/ssspeaks/volume08/sss08-14.pdf
- Health comes from whole: https://isha.sadhguru.org/yoga/yoga-articles-body-health/living-healthy-well/
- https://www.who.int/about/governance/constitution
- https://www.who.int/news-room/fact-sheets/detail/noncommunicable-diseases
- https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC2862441/
- https://www.who.int/news-room/fact-sheets/detail/healthy-diet
- https://www.nhp.gov.in/lifestyle-disorder_mtl
- Prevent diabetes: The world’s invisible enemy: Diabetes, by Dr V. Lakshminarayan & Dr. Sooraj Tejaswi, Sri Sri Publications Trust India, foreword by Dr V Mohan
- https://www.diabetes.org.uk/diabetes-the-basics/differences-between-type-1-and-type-2-diabetes#
- Symptoms of diabetic emergency: https://www.redcross.org.uk/first-aid/learn-first-aid/diabetic-emergency
- https://my.clevelandclinic.org/health/diseases/9815-hyperglycemia-high-blood-suga
- Symptoms of heart attack: https://www.who.int/news-room/fact-sheets/detail/cardiovascular-diseases-(cvds)
- https://www.cdc.gov/heartdisease/heart_attack.htm
- https://www.cdc.gov/heartdisease/risk_factors.htm
- https://www.heart.org/en/health-topics/heart-attack/warning-signs-of-a-heart-attack
- Symptoms of Stroke: https://www.cdc.gov/stroke/signs_symptoms.htm
- First aid in a diabetic emergency: https://www.stjohn.org.nz/first-aid/first-aid-library/diabetes/
- First aid in diabetic coma: https://www.betterhealth.vic.gov.au/health/conditionsandtreatments/diabetic-coma
- First aid in heart attack: https://www.redcross.org.uk/first-aid/learn-first-aid/heart-attack
- Apollo Hosp on first aid in heart attack: https://www.youtube.com/watch?v=WDh0LdqCeYg
- CPR: https://www.drugs.com/cg/lay-person-cpr-on-adults.html#
- https://www.icicilombard.com/blogs/health-insurance/hi/heart-attack-first-aid-steps-everyone-must-know#
- Acupressure for Total Wellness, Ketan V Shah, 2011 edition, page 118
- Stroke: https://www.stjohn.org.nz/first-aid/first-aid-library/stroke/
- Stroke—Dos and Donts: https://www.pennmedicine.org/updates/blogs/neuroscience-blog/2022/march/what-to-do-if-someone-is-having-a-stroke
- Prevent heart ailments: https://www.northwestern.edu/newscenter/stories/2010/11/heart-disease.html
- Diabetic diet: https://drmohans.com/patient-care/diabetic-diet/
- Sai Baba advice for diabetes: http://saibaba.ws/articles/medicaladvices.htm
- https://www.sathyasai.org/healthy-living/simply-prevent-diseases
- Nine ways to prevent disease: https://health.clevelandclinic.org/9-ways-to-prevent-disease/
- Self-care health checklist: https://draxe.com/health/self-care-checklist/
- Gandhiji, 8 August 1929, Young India magazine, https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC6515727/
________________________________________________________________________________
2. SVP వర్క్ షాప్ 2022 మార్చ్ 3నుండి 7 ప్రశాంతి నిలయం
సాయి వైబ్రియానిక్స్ మానవాళికి సేవ చేయడానికి వాస్తవం చెప్పాలంటే భగవంతునికి సేవ చేయడానికి నిరంతరం అవకాశాన్ని అందించే ఒక అద్వితీయమైన బహుమతి. స్వామివారి ఆశీర్వాదం దీని ప్రభావాన్ని ఇనుమడింప చేయడమె గాక ప్రాక్టీషనర్లు తమ రోగులకు ఉత్సాహంతో సేవ చేయడంతో పాటు నైపుణ్యము మరియు జ్ఞానంలో అభివృద్ధి చెందడానికి తమతో పాటు సాయి వైబ్రియానిక్స్ సంస్థను కూడా బలోపేతం చెయడానికి పనికి వస్తుంది. ఇటీవల జరిగిన ఈ SVP వర్క్‌షాప్‌లో ఇది స్పష్టమైంది.
మా సీనియర్ శిక్షకులు నిర్వహించిన 12 వారాల అద్భుతమైన ఆన్‌లైన్ శిక్షణను పూర్తి చేసిన తర్వాత, చాలా ఉత్పాదకమైన ఈ ప్రాక్టికల్ వర్క్‌షాప్‌కు భారతదేశం నుండి నలుగురు ప్రాక్టీషనర్లు, USA నుండి ఒకరు మరియు ఫ్రాన్స్ నుండి ఒకరు హాజరయ్యారు. పాల్గొనే వారందరూ వారి 'విజన్ ఫర్ వైబ్రియోనిక్స్ - ఇప్పటి నుండి ఐదు సంవత్సరాలు" మరియు వైబ్రియానిక్స్‌ను ముందుకు తీసుకెళ్లడంలో ప్రతి ఒక్కరూ ఎలా దోహదపడగలరు అనే అంశంపై ప్రెజెంటేషన్‌లు ఇచ్చారు. డా. అగర్వాల్ ద్వారా స్ఫూర్తిదాయకమైన మరియు హృదయపూర్వక ప్రసంగం జరిగింది మరియు ఇది ప్రశ్నోత్తరాల సెషన్‌తో ముగిసింది. శిక్షణార్థులందరి ప్రమాణ స్వీకార కార్యక్రమంతో వర్క్‌షాప్ ముగిసింది. పాల్గొన్నవారు మరియు శిక్షకుల నుండి తీసుకున్న సామూహిక ఫీడ్‌బ్యాక్ అత్యంత సానుకూలంగా ఉండడమే కాక వైబ్రియానిక్స్ ప్రపంచవ్యాప్తంగా మరింత మందికి అందుబాటులో ఉండేందుకు స్వామి సంకల్పం కోసం కృషి చేయడానికి అందరినీ ప్రేరేపించింది.
________________________________________________________________________________
3. రిఫ్రెషర్ వర్క్ షాప్, బెంగళూరు, 2022 ఏప్రిల్ 9
కర్ణాటక ప్రాక్టీషనర్లు ఏప్రిల్ 2020 నుండి ఆన్‌లైన్‌లో నెలవారీ సమావేశాలను నిర్వహిస్తున్నారు అలాగే 108CC పుస్తకంలోని 21 కేటగిరీలలో 20ని కవర్ చేసారు. బెంగుళూరులోని సాయి గీతాంజలి సమితిలో ఈ రిఫ్రెషర్ వర్క్ షాప్ సమాచారాత్మకమైన, ప్రోత్సాహకరమైన మరియు ఉత్తేజకరమైన రీతిలో జరిగింది. చాలా మంది ప్రాక్టీషనర్లు తమ లేఖలు మరియు 108 CC బాక్సులు స్వామి ఫోటో ముందు ఉంచడానికి ముందుగానే ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ ఉత్తరాలు, పంపిణీకి ఉపయోగించబోయే ఫోటోలు, అలాగే SSIHMS లో వెల్నెస్ సెంటర్ లో ఉపయోగించే 108 CC బాక్సుతో సహా కొన్ని ఇతర బాక్సులపైన స్వామి తమ అనుగ్రహ విభూతిని అపారంగా వర్షించడంతో ప్రాక్టీషనర్లు అందరూ ఉద్వేగానికి ఆనందానికి గురి అయ్యారు (ఫోటోను చూడండి). ప్రాక్టీషనర్ 11622 ‘స్వీయ పరివర్తనకు సేవ యొక్క ఆవశ్యకత’ అనే అంశం పై తమ ప్రసంగంతో ఉదయపు సమావేశము ప్రారంభించారు. తదుపరి సమావేశములో 108CC పుస్తకంలోని 21వ వర్గంపై సమాచారం అందించడము మరియు దానిపై చర్చ జరిగింది, తదుపరి ఐదుగురు ప్రాక్టీషనర్లు స్ఫూర్తిదాయకమైన తమ అనుభవాలను అందించారు. ఈ వర్క్‌షాప్‌లో హైలైట్ మధ్యాహ్నం నిర్వహించిన రీఛార్జ్ సెషన్. ప్రాక్టీషనర్11601 కృషితో పర్తి నుండి ప్రత్యేకంగా ఈ సెషన్ కోసం మాస్టర్ బాక్స్ తెప్పించబడి సెషన్ అనంతరం తిరిగి పంపించి వేయ బడింది. హాజరైన 35 మంది ప్రాక్టీషనర్లు తమ బాక్సులను నేరుగా మాస్టర్ బాక్స్ నుండి ఛార్జ్ చేయడం విశేషంగా భావించారు (ఫోటో చూడండి).
________________________________________________________________________________
4. రీ చార్జింగ్ సెషన్, ముంబయ్ 2022 ఏప్రిల్ 23.
ధర్మ క్షేత్రం వేదికగా సాయంత్రం 4 గంటలకు వెల్‌నెస్ సెంటర్‌లో ఉత్సాహభరితమైన వాతావరణంలో స్వామివారికి ప్రార్థన, ఓంకార మంత్రోచ్ఛారణలతో ఈ రీఛార్జ్ సెషన్ ప్రారంభమయ్యింది. సాయంత్రం 5 గంటలకు రిచార్జ్ చేసిన మొత్తం 31, 108CC బాక్సులను స్వామివారి ఆశీస్సుల కోసం స్వామివారి పాద పద్మాల చెంత ఉంచడం జరిగింది. మంగళ హారతి తో కార్యక్రమం ముగించే ముందు మహమ్మారి అనంతర సమస్యలు మరియు సాధారణ సమస్యల పరిష్కారానికి కొంత సమయం కేటాయించ బడింది.
________________________________________________________________________________
5. చికెన్ ఫాక్స్ నుండి గోవులు కోలుకోవడం …11570 ఇండియా
ఒక పెద్ద గోశాలలో గల మొత్తం 2200 ఆవులలో ఐదు ఆవులకు ముఖం, మెడ మరియు వీపుపై పొక్కులు ఏర్పడడం తో పాటు జ్వరం కూడా వచ్చింది. ఫలితంగా, అవి ఆహారం మానివేయడంతో, ఐదు రోజుల తర్వాత, ఆసుపత్రి పాలయ్యాయి. రెండు రోజుల తర్వాత అక్టోబర్ 5న, మరో 20 గోవులు అస్వస్థతకు గురయ్యాయి. అందువలన వాటి ప్రదేశంలోనే అవి క్వారనైటైన్ చేయబడ్డాయి. ఆసుపత్రిలో వారం రోజులు గడిపిన తర్వాత, అక్టోబర్ 10న, ఐదు ఆవులు తిరిగి వచ్చాయి, అవి జ్వరం లేకుండా బాగానే ఉన్నాయి, కానీ ఇంకా బలహీనంగా ఉన్నాయి. అంతేకాక ఆకలి సరిగా లేకపోవడంతో పాటు పొక్కులు వంటి లక్షణాలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్టోబరు 11న ప్రాక్టీషనర్ అన్ని ఆవులకు CC1.1 Animal tonic + CC9.4 Children’s diseases…TDS తాగే నీటిలో ఇవ్వడం జరిగింది. మరుసటి రోజుకు వాటికి ఆకలి పెరిగింది, అలాగే జ్వరం మరియు పొక్కులు కూడా తగ్గాయి. అక్టోబర్ 17 నాటికి, వాటి జ్వరం తగ్గిపోయి, పొక్కులు కూడా తగ్గడంతో అవి 80% మేర కోలుకున్నాయి. అవి ఇప్పుడు చక్కగా మేత మేస్తున్నాయి. ఒక వారం తర్వాత అక్టోబర్ 24న, మొత్తం 25 ఆవులు పూర్తిగా కోలుకున్నందుకు ఆ ప్రదెశాన్ని సందర్శించిన ప్రాక్టీషనర్ ఎంతో సంతోషించారు! 2022 ఏప్రిల్ నాటికి అనగా ఆరు నెలల అనంతరం మొత్తం 25 ఆవులు బాగానే ఉన్నాయి. ఈ అనుభవం ప్రాక్టీషనరుకు వైబ్రియానిక్స్ సేవ చేసుకోవడానికి మరొక వేదికను అందించింది.
________________________________________________________________________________
6. జ్ణాపకార్ధం
శ్రీ రవీందర్ బాలకృష్ణ దవే 10163 2021 డిసెంబర్ 24న 70 సంవత్సరాల వయస్సులో శ్రీ దవే స్వామిలో ఐక్య మయ్యారు. ఒక సంవత్సరం క్రితం గుండెపోటుతో కోలుకున్న తరువాత వీరికి పేగులో గ్యాంగ్రీన్ ఏర్పడింది. దాని కోసం ఆపరేషన్ చేయబడినప్పటికి ఒక నెల తరువాత వీరు స్వర్గస్తులయ్యారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ, వీరు తన జీవితంలో చివరి నెల వరకు చురుకుగా ఉండడమే కాక నెలవారీ నివేదికలను క్రమం తప్పకుండ సమర్పించారు. వైబ్రియానిక్స్ పట్ల వీరికి ఉన్న గొప్ప అంకితభావాన్ని మేము కృతజ్ఞతతో తెలియజేస్తున్నాము.
ఫాదర్ చార్లెస్ ఒగడా 02522 2022 మార్చి 30 న 51 ఏళ్ల చిన్న వయస్సులో తన స్వర్గలోకపు నివాసానికి నిష్క్రమించారు. వీరు 2009 నుండి నైజీరియాలో వైబ్రియానిక్స్ ప్రాక్టీస్ చేస్తూ తన సోదరుడితో కలిసి వేలాది మంది రోగులకు చికిత్స అందించారు. నాలుగేళ్ల క్రితం తాను స్థాపించిన ఆసుపత్రిలో వైబ్రియానిక్స్‌ను ప్రవేశపెట్టారు. మరణించడానికి రెండు నెలల ముందు వీరు కోవిడ్ -19 బారిన పడ్డారు, ఐతే దాని నుండి వారు కోలుకున్నారు కాని తరువాత మలేరియా బారిన పడ్డారు. ఈ నిజమైన అన్వేషకుని యొక్క సేవ మరియు జ్ఞానభాండాగారమును రెండింటినీ కోల్పోవడం నిజంగా విచారకరం. కోవిడ్-19 నుండి కోలుకుంటున్నప్పుడు, వీరు ఒక పద్యం వ్రాసారు, దానిని మీతో పంచుకోవాలనుకుంటున్నాము.
మీ ఉనికి యొక్క అస్తిత్వాన్ని వెతకండి.
నేను ఈ దేహాన్ని కాదు-ఇది అనారోగ్యం మరియు బలహీనత గురించి చింతిస్తుంది.
నేను మనసు కాదు – శరీరం గురించి చింతిస్తుంది.
నేను భావోద్వేగాలు కాదు- ఇవి చీకటి శక్తి యొక్క మేఘం లా నా చుట్టూనే తిరుగు తున్నాయి.
నేను నా బిడ్డలు కూడా కాదు - ఏకత్వం అనే వేదికపై నిర్మించిన లోతైన బంధాలతో కూడినవి.
నేను ఆనంద గ్రామాన్ని కాదు - ప్రేమ మరియు సేవ యొక్క ఆకాశ హార్మ్యాలు ఎత్తుగా, ధృఢంగా నిలిచి ఉన్నాయి.
నేను నా వైఫల్యాలు కూడా కాదు - అవి చాలానే ఉన్నాయి.
నేను నా విజయాలు కూడా కాదు - అవి కూడా చాలా ఉన్నాయని నాకు తెలుసు.
నేను పూజారిని కాదు – సన్యాసిగా గుర్తింపబడే అలవాట్లు మరియు దుస్తులు లేవు.
నేను దేవుణ్ణి కాను - అన్ని మతపరమైన భావనలు మరియు ఆలోచనలు దానికి ఒక ఉనికిని ఏర్పరిచాయి.
నేను ఏమీ కాదు; నేను ఏమీ కానివాడిని కూడా కాదు; నేను నేనే కాదు – అది స్వకీయ ప్రతిబింబంగా అంచనా వేయబడింది!
మరియు నేను ఈ ఆలోచనా ప్రక్రియను కూడా కాదు - 'నేను ఇది కాదు మరియు నేను అది కాదు'
నేను ఏదీ కాదు ;
అయినప్పటికీ నేను ఉన్నాను.