Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

అదనంగా

Vol 11 సంచిక 3
May/June 2020


1. ఆరోగ్య చిట్కాలు

మీ దైనందిన ఆహారాన్ని ఆరోగ్య పరంగా సుగంధ ద్రవ్య భరితం చేసుకోండి!

మనం తినే ఆహారం రుచికరంగా శక్తి నిచ్చేది గా ఆహ్లాదకరంగా ఉండాలి. ఇది మరీ వేడిగా లేదా మరీ ఉప్పగా ఉండకూడదు; సమపాళ్ళలో, సంతులిత ఆహారం గా ఉండాలి. ఇది ఉద్రేకం కలిగించేదిగా లేదా నిర్జీవంగా ఉండకూడదు. రాజసిక ఆహారం భావోద్వేగాలను రేకెత్తిస్తుంది; తామసిక ఆహారం బద్ధకం మరియు నిద్రను ప్రేరేపిస్తుంది. సాత్విక ఆహారం సంతృప్తికరంగా ఉంటుందే తప్ప కోరికలను పెంచే దిగాను లేదా భావోద్వేగాలకు వదిలిపెట్టే విధంగానూ ఉండదు.”…శ్రీ సత్య సాయి బాబా 1

మసాలా అంటే ఏమిటి?

మసాలా అంటే మొక్కలు ఎండిన భాగము ఆకుల కాకుండా ఉన్న భాగాన్ని మూలికలు అని పిలవబడుతుంది. అయితే ఈ వ్యాసంలో దీనిని ప్రస్తావించడం లేదు. మసాలా అనేది ఒక విత్తనం లేదా పండ్ల పొట్టు కావచ్చు.(ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర, మెంతి, కరం, నిగెల్లా, జాజికాయ, సోపు, సోంపు, స్టార్ సోంపు మరియు యాలుకలు); మొక్క బెరడు (దాల్చిన చెక్క మరియు జాపత్రి), ఎండిన మొగ్గ (లవంగం), పూల కీలాగ్రము (కుంకుమపువ్వు), బెర్రీ ( మిరియాలు, మసాలా దినుసులు) వేరు లేదా కాండము (అల్లము, పసుపు) జీడి ( ఆశాపోటీడా), లేదా మొగ్గ (వెల్లుల్లి) 2,3  

సుగంధ ద్రవ్యాల వాడకం, ప్రయోజనాలు మరియు నిల్వ చేయడం

వాడకం: ప్రాచీన కాలం నుండి  సుగంధ ద్రవ్యాలను మసాలా, రుచి, మరియు అలంకరణార్థం ఉపయోగిస్తూ వచ్చారు. ఇవి ఆహారపదార్థాలకు ప్రత్యేకమైన పరిమళం, రుచి మరియు కొన్నిసార్లు రంగును కూడా ఇస్తాయి! తాజా మసాలా దినుసులు, మొత్తంగా లేదా పొడి చేసినవి మొదటగా దోరగా వేయించి లేదా రోస్ట్ చేసి వాటిని వంట మొదటిలో లేదా ఆహారాన్ని వడ్డించే ముందు రుచి మరియు సుగంధాన్ని నిలుపుకోవడానికి ఆహార పదార్ధం గిన్నెలో చేరుస్తారు. వీటిని ఆహారం మరింత ఎక్కువ గ్రహించటానికి వంట ప్రక్రిలో ముందుగా కూడా చేర్చవచ్చు. ఇవి ఆహారంలో వ్యాధికారక జీవుల పెరుగుదలను నిరోధించగలవు మరియు ఆహారం నిలువ ఉండే కాలాన్ని పెంచగలదు, కనుక సుగంధ ద్రవ్యాలు మంచి సంరక్షణ కారకులు .4,5

ప్రయోజనాలు: దాదాపు అన్ని సుగంధ ద్రవ్యాలలో యాంటీఆక్సిడెంట్లు, ఖనిజ లవణాలు అయిన కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్ సమృద్ధిగా ఉన్నాయి. పాక్షిక మాత్రంగా  ఇనుము, మ్యాంగనీస్, రాగి, సెలీనియం, అలాగే విటమిన్లు, అమైనో ఆమ్లాలు మరియు ఒమేగా- 3 కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, మరియు ఫైబర్, యాంటీ ఫంగల్, యాంటీ  వైరల్,  యాంటీ మైక్రోబియల్, యాంటీఇన్ఫ్లమేటరీ, క్రిమినాశక మత్తును కలిగించేవి మరియు అనాల్జసిక్ లక్షణాలు కలిగి ఉన్నాయి. అందుచేత ప్రాచీనకాలంలో ఇవి సాంప్రదాయక వైద్యంలో ఇవి విరివిగా ఉపయోగపడేవి. వైద్యపరంగా వీటి ప్రభావాన్ని నిరూపించడానికి సరైన పరిశోధనలు జరిగినప్పటికీ కొన్ని అధ్యయనాలు మరియు అభ్యాసాల ప్రకారం సుగంధద్రవ్యాలు శరీరానికి పోషణ కర్తగా, మానసిక స్థితిని పెంచేవిగా మరియు క్యాన్సర్ డయాబెటిస్ స్ట్రోక్ మరియు కోరోనరీ హార్ట్ డీసీజ్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా నిరోధించేవి అని తెలిపాయి.2,4,5,8

నిల్వచేయడం: కాలం గడిచే కొద్దీ సుగంధ ద్రవ్యాలు వాటి వాసన మరియు రుచిని కోల్పోతాయి. కాబట్టి వాటిని వేడి మరియు తేమకు దూరంగా గాలి సోకని కంటెయినర్లలో నిల్వ చేయాలి. తద్వారా విత్తనాలు వంటివి రెండు సంవత్సరాల వరకూ నిల్వ ఉంటాయి, మరియు పొడి సుగంధద్రవ్యాలు ఒక సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి.2,4

హెచ్చరిక: సుగంధ ద్రవ్యాలు తక్కువ  పరిమాణంలో తీసుకోవడం మాత్రమే ప్రయోజనకరం మరియు సురక్షితం. సాధారణంగా రోజుకు ఒక టీస్పూన్ (2 నుండి 2.5 గ్రాములు) లేదా  కొన్ని సందర్భాలలో చిటికెడు లేదా రెండు చిటికెల పొడి తీసుకోవాలి. వైద్య చికిత్సలో ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు మరియు పిల్లలకు పాలిచ్చే తల్లులు సుగంధ ద్రవ్యాలు తీసుకోవడం మరియు వాటి పరిమాణం గురించి తమ వైద్యుడిని సంప్రదించాలి.2,8 

నిర్దిష్ట సుగంధ ద్రవ్యాలు

మనకు తెలిసినవి 100 కంటే ఎక్కువ సుగంధద్రవ్యాలు ఉన్నాయి5, కానీ మేము సాధారణంగా అందరికీ తెలిసిన 20 ద్రవ్యాలను గూర్చి వాటి భారతీయ పేర్లను బ్రాకెట్లో వ్రాస్తూ కవర్  చేస్తున్నాము.  

1. ఆవాలు (సార్సో, రాయి)

ఈ విత్తనాలకు ఇతర సుగంధ పదార్థాలను జోడించే ముందు పేలుతూ శబ్దం వచ్చేవరకూ దోరగా   వేయించాలి. ఈ ఆవపిండిని సలాడ్లు లేదా వేడి ఆహార పదార్ధాలు, మసాలాలు మరియు పచ్చళ్ల పై చల్లుకోవచ్చు.

రాత్రిపూట నానబెట్టిన విత్తనాలతో తయారుచేసిన ఆవపిండి పేస్ట్ కూడా ప్రాచుర్యం పొందింది. అనేక ఖనిజ లవణాలు మరియు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉన్న ఈ ఆవపిండి ప్రేగులలో ఉన్న పరాన్న జీవులను తొలగించగలదు, శ్వాసనాళ వ్యవస్థకు చెందిన రుగ్మతలను నయం చేస్తుంది, అస్థిపంజర మరియు కండరాల నొప్పులు, బెణుకులు, కండరాల సంకోచాలు తగ్గించడానికి రక్తప్రసరణను ప్రోత్సహిస్తుంది. ఇంతేకాక సోరియాసిస్ మరియు స్పర్శ ద్వారా సోకే చర్మ శోధనలను నయం చేయడంలో సహాయపడుతుంది.  

బాహ్య అనువర్తనం: గొంతు నొప్పి ఉన్న రోగులకు ఆవాలతో కషాయం లేదా టీ చేసి ఇవ్వవచ్చు. ఆవపిండిని నానబెట్టి ఉపయోగించడం వలన ఛాతీలో రద్దీ తగ్గుతుంది. బ్రాంఖైటిస్, బ్రాంఖియల్ న్యూమోనియా, పార్శ్వ శూల మరియు అన్ని నొప్పులను తగ్గించడానికి ఆవపిండిని ఉడకబెట్టి  శరీరానికి వర్తింప చేయవచ్చు. శుభ్ర పరిచే సాధనంగా ఉపయోగించడానికి దంచిన ఆవాలను నీరు మరియు వినిగర్ తో కలిపి ఏర్పడిన మిశ్రమాన్ని మురికి పట్టిన పాత్రలు, పళ్ళాలు వంటి వాటికి పూసి రాత్రంతా ఉంచి మరునాడు శుభ్రపరిచినట్లైతే మురికంతా పోతుంది.  

హెచ్చరిక: దీని వాడకం రోజుకు రెండు గ్రాముల వరకు సురక్షితంగా భావిస్తారు. థైరాయిడ్, మూత్రపిండాలు లేదా పిత్తాశయ సమస్యలు ఉన్నవారు వారి వైద్యుడిని సంప్రదించాలి.6,7

2. జీలకర్ర (జీరా)

కొన్ని సంస్కృతులలో ఈ వెచ్చని మట్టి రంగు గింజల మసాలా దినుసును ఉడికించిన వంటకానికో, కూరలలో, పులుసులు, పప్పు ధాన్యాలు లేదా ధాన్యాలు మరియు చిరు ధాన్యాలకు సంబంధించిన వంటకాలలో జీలకర్ర లేనిదే వంటకం పూర్తికాదు.

జీలకర్ర పొడి పెరుగు మరియు మజ్జిగ రుచిని పెంచుతుంది. ఐరన్, కాల్షియం, విటమిన్ ఎ మరియు సి సమృద్ధిగా ఉన్న కారణంగా ఇది రక్తహీనత, ఆహారం ద్వారా వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్లు నిద్రలేమి మరియు బోలు ఎముకల వ్యాధిని నివారించడంలో సహాయపడుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది, నిర్విషీకరణ చేస్తోంది, జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది, రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది, రోగనిరోధకశక్తిని పెంచుతుంది. ఒక అధ్యయనం ప్రకారం పెరుగులో జీలకర్ర పొడి అధిక మొత్తంలో ప్రతీ రోజూ రెండుసార్లు భోజనసమయంలో తీసుకుంటూ అలా మూడు నెలలు సేవించిన అధిక బరువు గల స్త్రీలు శరీర బరువు కోల్పోవడం, మరియు కొవ్వు లో గణనీయమైన తగ్గుదల ఇంకా వారి HDL/LDL కొలెస్ట్రాల్ నిష్పత్తిని స్థిరీకరించ బడినదని ఒక అధ్యయనం పేర్కొంది. మరొక అధ్యయనం ప్రకారం 8 వారాలలో ఇన్సులిన్ స్థాయి చాలా వరకూ తగ్గింది 4,8,9,10

ఒక కప్పు తాజాగా తయారు చేసిన జీలకర్ర టీ ముఖ్యంగా కడుపు నొప్పి నివారిణిగా పనిచేస్తుంది, ఛాతీలో రద్దీని నివారిస్తుంది, గర్భిణీ స్త్రీలకు పాలు ఉత్పత్తిని పెంచుతుంది.11

హెచ్చరిక: ప్రయోజనం ఇవ్వడానికి రోజుకు ఒక చిటికెడు (0.1 గ్రా) సరిపోతుంది. 0.6 గ్రా (ఒక టేబుల్ స్పూన్ లో ¼ వంతు) వరకు   సురక్షిత మైనది మరియు తినడానికి నాన్ టాక్సిక్ గా పరిగణింప బడుతుంది. అధికంగా తీసుకుంటే గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లెక్స్ వంటి సమస్యలకు దారితీయవచ్చు. శస్త్రచికిత్సకు రెండు వారాల ముందు మానివేయాలి. అంతేకాక ఎవరికైనా రక్తస్రావ రుగ్మతలు ఉంటే ఇది రక్తం గడ్డ కట్టడాన్ని నెమ్మదింపజేస్తుంది మరియు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.8-10

3. అసపోటీడా (హింగ్)

బలమైన వాసన కలిగిన గట్టి జిగురు వంటి ఈ పదార్ధము ఎల్లప్పుడూ ఎండిపోని సోపు యొక్క కాండం మరియు మూలాల నుండి సేకరించిన ఎండిన కణసారము లేదా జిగురు నుండి తయారు లభిస్తుంది. ఇదీ సాధారణంగా ముద్దలుగా, పలుకులుగా లేదా పొడిగా లభిస్తుంది. దీనిని చాలా తక్కువ పరిమాణంలో వాడాలి, ఒకటి లేదా రెండు చికెడులు సరిపోతాయి. ఉడికిన తర్వాత ఇది ఆహ్లాదకరమైన రుచితో పాటు  కాయధాన్యాలు మరియు చిక్కుళ్ళు జీర్ణమయ్యేలా చేస్తుంది.

రోమన్ సామ్రాజ్యం యొక్క కాలం నుండి దీనిని ప్రేగు సంకోచాలు మరియు అపానవాయువు నివారించడానికి మరియు కఫాన్ని హరించేదిగా, విరోచన కారిగా, నిద్రాసహాయ కారిణిగా ఇది వాడుకలో ఉంది. ఇది ప్రేగు రుగ్మతల చికిత్సకు, బ్రాంకైటిస్, స్వైన్ ఫ్లూ, మరియు ఉబ్బసం కారణంగా శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది నుండి ఉపశమనం కోసం మరియు రుతు రుగ్మతల నివారిణిగా సహాయపడుతుంది. రక్తంలో ఆరోగ్యకరమైన చక్కెర స్థాయి కోసం మరియు రక్తపోటుకు నివారణకు, హృదయ ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడుతుంది. కొన్ని సంప్రదాయక వ్యవస్థలలో దీని బెల్లంతో కలిపి మూర్ఛలు మరియు మానసిక రుగ్మతలకు చికిత్స చేయడానికి మరియు నేతితో కలిపి సయాటికా నొప్పుల నివారణకు ఉపయోగిస్తారు.   

హెచ్చరిక: ఔషధ ప్రయోజనం కోసం సాంప్రదాయక మోతాదు 0.25- 0.5 గ్రాములు. గర్భిణీ స్త్రీలు మరియు శిశువులకు, ప్రేగు పూత ఉన్నవారికి, జీర్ణాశయ సమస్యలు లేదా రక్తస్రావం లోపాలు మూర్ఛ లేదా బీపీ సమస్యలు ఉన్నవారు శస్త్ర చికిత్సకు రెండు వారాల ముందు దీనిని తీసుకోవడం మంచిది కాదు 2-14

4. ఎర్ర మిరపకాయలు (లాల్ మిర్చి)/పాప్రికా /కేనే పెప్పర్

ఎర్ర మిరప కాయలు /మిరప మసాలా: భారతదేశంలో ఎండిన మరియు పొడి రూపంలో అనేక రకాల ఎర్ర మిరప కాయలు ఉన్నాయి. వీటిని  బియ్యంతో చేసే ప్రత్యేక వంటకాలు, కూరలు, ఊరగాయలు, పచ్చళ్ళు (మూలికల లేహ్యాలు,  కూరగాయలు లేదా ధాన్యాలు) తయారీకి ఉపయోగిస్తారు. ఇది మంచి ఆకలి వర్దని మాత్రమే కాదు దీనిలో A,C, మరియు E విటమిన్లు సమృద్ధిగా ఉన్నాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది, పార్శ్వపు నొప్పి, సైనసైటిస్, జలుబు మరియు ఫ్లూతో పోరాడగలదు. దీని రసాయన సమ్మేళనం క్యాప్సైసిన్ (మిరపకాయ లోని వేడి మూలకానికి బాధ్యత వహిస్తుంది) కారణంగా మిరపకాయ మసాలా కొన్ని ప్రాణాంతక వ్యాధులను నివారించడం మరియు నొప్పులు, బెణుకులు మరియు తిమ్మిరి నుండి ఉపశమనం కలిగించడానికి లేపనములతో ఉపయోగిస్తారు.   

మిరపకాయ/ పాప్రికా: దీని రుచి తీపి నుండి నాలుక మండే వరకు ఉంటుంది. ఇది అనేక దినుసుల నుండి తయారు చేసిన ఒక ప్రత్యేకమైన గ్రౌండ్ మసాలా. తీపి పాప్రికా ప్రధానంగా గ్రౌండ్ రెడ్ బెల్ పెప్పర్స్ నుండి తయారవుతుంది. దీనిలో రసాయనక్యాప్సాయిసిన్ ఉండదు కానీ విటమిన్ ఎ ఎక్కువ ఉంతుంది. పాప్రికా ముఖ్యంగా ఆటోఇమ్యూన్ పరిస్థితుల చికిత్సకు మరియు గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ను నివారించడానికి సహాయపడుతుంది.     

కారపు పొడి(సీనీ పెప్పర్): ఏదైనా వంటకానికి ఘాటును ఇచ్చే భూ సంబంధమైన మసాలా దినుసు ఇది. సాధారణంగా ఎండిన రూపంలో లేదా మెత్తని పొడి రూపంలో లభిస్తుంది. ఇది పాప్రికా లేదా ఎర్ర మిర్చి కన్నా ఘాటుగా ఉంటుంది. ఇది ముఖ్యంగా జీర్ణక్రియ, పంటి నొప్పి, సముద్రతీర రుగ్మత, మద్యపానం, మలేరియా, మరియు జ్వరాలకు సహాయపడుతుంది. శరీర జీవక్రియ  నియంత్రిస్తుంది మరియు మింగడానికి ఇబ్బంది ఉన్నవారికీ ఉపశమనం ఇస్తుంది. కొన్ని పరీక్షలు మరియు అధ్యయనాలు ప్రకారం దీనిలో ఉండే క్రీమ్ సొరియాసిస్ చికిత్సలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని తెలిపుతున్నాయి.   .

హెచ్చరిక : ఈ మసాలాను తాకడానికి లేదా నిర్వహించడానికి ముందు అర చేతులు మరియు వేళ్లపై 1-2 చుక్కలు నూనె వేసుకోవాలి. తరువాత కొంచెం నిమ్మకాయ రుద్ది ఆపైముఖం మీద లేదా కళ్ళను తాకే ముందు చేతులు బాగా కడగాలి. మోతాదు ఒక వ్యక్తి ఎంత వేడిని తట్టుకోగలడో అనే దానిపై ఆధారపడి ఉంటుంది. కడుపులో పుండ్లు లేదా ఆమ్లత్వం ఉంటే దీని తీసుకోవడం మంచిది కాదు.15-18

5. నల్ల మిరియాలు /Peppercorns (Kaali mirch)

మిరియాల మొక్క నుండి సగం పండిన బెర్రీలు తీసుకొని ఎండ బెట్టినప్పుడు అవి మెరిసే ముడతలు మరియు నలుపు రంగుకు మారుతాయి. ఈ నల్ల మిరియాలను పొడి చేసినప్పుడు పెప్పర్ అని పిలుస్తారు. సుగంధ ద్రవ్యాల రాజుగా పరిగణింపబడుతున్న ఈ మసాలా ఒకసారి భోజనానికి ఒక చిటికెడు అయితే సరిపోతుంది. ఇది దగ్గు మరియు జలుబు టానిక్కులలో ముఖ్యమైన మూల పదార్ధము. ఇది కడుపులో పుండ్లు మరియు బొల్లిని నయం చేయడంలో సహాయపడుతుంది. కణితి యొక్క పురోగతిని నిరోధిస్తుంది. పైపరిస్ అని పిలువబడే దాని క్రియాశీల పదార్థం అభిజ్ఞ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. నిరాశను పోగొడుతుంది. పోషకాల గ్రహింపును పెంచి జీర్ణశయాంతర పనితీరును మెరుగుపరుస్తుంది. బెర్రీలు పూర్తిగా పండినప్పుడు మరియు వాటి పైపొట్టు తొలగించినప్పుడు (ఆ విధంగా కొన్ని పోషకాలు తొలగింప బడతాయి) వీటిని తెల్ల మిరియాలు అంటారు. వీటి రుచి భూ సంబంధమైనదిగా మరియు సంక్లిష్టంగా వర్ణించబడింది  

హెచ్చరిక: అధికంగా తీసుకోవడం వల్ల గొంతు లేదా కడుపులో మంటను కలిగిస్తుంది. 9-22

6. ధనియాలు /శిలాంతర విత్తనాలు (ధనియా)

ఇవి వెచ్చని తీపి మరియు ఒక ప్రత్యేకమైన వాసన గల గింజలు. 1½ టీ స్పూన్ విత్తనాలను రాత్రిపూట రెండు కప్పుల నీటిలో నానబెట్టి ఉదయం వడకట్టి ధనియాల టి గా త్రాగండి లేదా ఉదయం తీసుకునే పండ్ల రసానికి జోడించండి. ఇది రక్తపోటుతో పాటు రక్తంలో చక్కెర ను తగ్గిస్తుందనీ, IBS (ప్రేగు రుగ్మతలు) వంటి అసౌకర్యాలను తగ్గిస్తుందనీ, నోటి పూత మరియు పుండ్లను నయం చేస్తుందనీ, UTI (మూత్రాశయ రుగ్మతలు) వంటి వాటితో సహా అనేక సంక్రమణలను నిరోధిస్తుందని, అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది డోడికెనాల్ అనే ఒక సహజ సమ్మేళనం కలిగి ఉంటుంది. ఇది యాంటీ బయాటిక్ కన్నా శక్తివంతమైనది మరియు విషాహారం నుండి రక్షిస్తుంది. శక్తివంతమైన గింజలు  ఆరోగ్యకరమైన రుతు పనితీరును మెరుగుపరుస్తాయని, మరియు న్యూరో వ్యాధులను కూడా నివారిస్తాయని తెలియబడుతున్నది. 23, 24

 

7. మెంతులు (ఫెనుగ్రీక్) (మెంతి)

దీన్ని కూరల్లో వాడుతారు ఇది చాలా చేదు రుచిని కలిగి ఉంటుంది కానీ కూర పూర్తయిన తరువాత  ఆహ్లాదకరంగా ఉంటుంది. దీనిని కాఫీ కోసం వేయించి పొడి చేయవచ్చు.

పోషకాలు సమృద్ధిగా ఉన్న ఈ మెంతులు మంటను తగ్గిస్తాయి (కాపడానికి కూడా దీనిని  ఉపయోగించవచ్చు) నోటి పూతలు, దిమ్మలు, బ్రాంకైటిస్, మరియు దీర్ఘకాలిక దగ్గు నుండి ఉపశమనం ఇస్తాయి. ఆకలినీ పెంచి జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి, మరియు మలబద్ధకాన్ని పోగొడతాయి. సంప్రదాయకంగా పిల్లలు పుట్టడానికి, తల్లి పాలు మెరుగు పరచడానికి, ఋతు విరతి సమయంలో ఉపశమనం కోసం, పురుషుల్లో పునరుత్పత్తి పనితీరును పెంచడానికి, మరియు శక్తి పునః చాలనం ద్వారా క్రీడాకారుల పనితీరుకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని విశ్వసిస్తారు. అధ్యయనాలు చెబుతున్న విషయం ఏమిటంటే వేడి నీటిలో నానబెట్టి ఉపయోగించిన మెంతి విత్తనాలు రెండవ రకాపు మధుమేహాన్ని అరికట్టడానికి సహాయపడతాయని తెలిపాయి.  

హెచ్చరిక: గర్భిణీ స్త్రీలు మరియు రక్త స్రావ లోపాలు మరియు మందుల వాడకం ఉన్నవారు దాని వాడకాన్నినిరోధించాలి లేదా వారి వైద్యుల్ని సంప్రదించాలి.25-27

8. కరావే లేదా కరుణ్ విత్తనాలు (అజ్విన్)

ఇవి చేదు రుచి మరియు వాసన కలిగి ఉంటాయి. వీటిని కాయధాన్యాలు, బీన్స్ మరియు టారో (కొలోకేసియా) మరియు బంగాళాదుంప వంటి వాటిలో అపానవాయువు నిర్మూలన కోసం కలుపుతారు. ఇంకా దీనిని కూరలు, పచ్చళ్ళు, మరియు భారతీయ రొట్టె వంటి వాటిలో కూడా కలుపుతారు. దాని రుచిని పెంచడానికి పొడిగా లేదా నేతితో వేపిస్తారు.

ఆకలిని మెరుగుపరచడానికి మరియు అపానవాయువు చికిత్స చేయడానికి బాగా తెలిసిన ఇంటి వైద్య చిట్కా ఇది. జీర్ణక్రియకు  సహాయపడటానికి భోజనం తర్వాత ఈ ముడి విత్తనాలను నమలాలి. వేయించిన గింజలతో తయారుచేసిన టీ అవసరమైతే కొద్దిగా తేనె చేర్చి తీసుకుంటే శరీర జీవక్రియ పెంచుతుంది, కొవ్వును కరిగిస్తుంది, దగ్గు నుండి ఉపశమనం ఇస్తుంది, శ్వాసక్రియను మెరుగు పరుస్తుంది మరియు మంటను తగ్గిస్తుంది . 

హెచ్చరిక: గర్భిణీ స్త్రీలకు ఇది మంచిది కాదు.28,29

 

నిగెల్లా /నల్ల జీలకర్ర (కాలోన్జీ)

ఈజట్ బ్లాక్ విత్తనాలను వేయించి పొడి చేసి వాటిని రుచి మరియు వాసన కోసం కూరలు, కూరగాయలు, కాయ ధాన్యాలు మరియు కొన్ని రకాల పచ్చళ్ళకు కలుపుతారు.

విస్తృతమైన పరిశోధన దాని అద్భుత వైద్య శక్తిని వెల్లడించింది! కనుక, ఇది పురాతన మరియు సంప్రదాయ వైద్యంలో హైపర్ టెన్షన్ నివారణకు, విరోచన నివారణకు, లివర్ టానిక్కు గాను, ఆకలి ఉద్దీపన, అనాల్జసిక్, యాంటీ బ్యాక్టీరియల్, మూత్ర విసర్జన మరియు చర్మ రుగ్మతలు నివారణకు విస్తృతంగా ఉపయోగించబడింది. ఇది అలర్జీ రినిటీస్ నుండి కూడా ఉపశమనం ఇస్తుంది. ఆవనూనెతో వేపించిన కొన్ని విత్తనాలను వాచిన జాయింటు వంటి వాటికి ఉపశమనం కలిగిస్తుంది.

హెచ్చరిక : సాధారణంగా ఒక గ్రామం (1/2 టి స్పూను) వంటకు సరిపోతుంది, అయితే ఔషధం లో 0.3 0.5 గ్రాముల ప్రయోజనకరమైన ప్రభావం చూపించాయి.30, 31, 32

10. పసుపు (హల్ది)

బంగారం లాంటి ఈ ప్రసిద్ధ మసాలా దినుసు పచ్చిగానూ లేదా ఎండినది కూడా దొరుకుతుంది, తరువాత దీనిని మెత్తని పొడిగా వాడతారు. ఇది మట్టి వాసన కలిగి ఉంటుంది కొద్దిగా మిరియాల వంటి చేదు రుచి కలిగి  ఉంటుంది. సూక్ష్మమైన అల్లం రుచితో మరియు ఇతర సుగంధద్రవ్యాలతో బాగా కలిసిపోతుంది. ప్రకాశవంతమైన సహజ ఫినాల్ కుర్కుమిన్ ఇది పసుపులో క్రియాశీల పదార్థం కాబట్టి విలువైన ఔషధ మసాలాగా పరిగణింపబడుతుంది. కుర్కుమిన్ క్రొవ్వును కరిగిస్తుంది కనుక దీనిని ఆరోగ్యకరమైన క్రొవ్వులతో (కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్ లేదా నెయ్యితో) మరియు నల్లమిరియాలు (ఎందుకంటే దీని పైపెరిన్ కంటెంట్ కర్క్యుమిన్ యొక్క జీవ లభ్యతను 20 రెట్లు పెంచింది) శరీరంలో దీని ఉత్తమ శోషణం కోసం చేర్చి తీసుకోవాలి. కుర్క్క్యుమిన్ విడిగా దేనితో కలపకుండా వాడినట్లైతే  పూర్తిగా శోషణం కాక ముందే జీవక్రియలో వ్యర్ధమైపోతుంది.

దాని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా పసుపు మధుమేహంతో పోరాడుతుంది, క్యాన్సర్ కణాలను ముఖ్యంగా రొమ్ము, కడుపు, పెద్దప్రేగు, క్లోమం, మరియు చర్మంలో వాటి పెరుగుదలను నిరోధించగలదు మరియు గుండెజబ్బులనుకూడా  నివారిస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, నిరాశను తగ్గిస్తుంది, రక్తం గడ్డకట్టడానికి తోడ్పడుతుంది, తాపాన్ని పోగొడుతుంది, కీళ్లవాతావకు చికిత్స చేస్తుంది, నొప్పులను పోగొడుతుంది, అల్జీమీర్ వ్యాధికి ఉపశమనము ఇస్తుంది, గాయాలను నయంచేస్తుంది, తామర, సోరియాసిస్, మరియు మొటిమలను నయం చేస్తుంది. కుర్క్యుమిన్ తో ఉపయోగించినప్పుడు కీమోథెరపీ ఔషధ నిరోధకత మరింత ప్రభావవంతంగా ఉంటుందని ఒక అధ్యయనం కనుగొన్నది.   

హెచ్చరిక : ఎక్కువ మొత్తంలో తీసుకుంటే వికారం మరియు విరోచనాలు సంభవించవచ్చు.33-38

11. అల్లం (అడ్రక్)

దీనికి కొంచం మరియు చాలా స్వల్పంగా తీపి రుచి ఉంటుంది. దీనిని అనేక రకాల కూరగాయలు, సలాడ్లు, పులుసులు మరియు జావ వంటి వాటిలో ఉపయోగిస్తారు. దీని పోషకాలు ఎక్కువగా పొందటానికి అల్లమును వంట ప్రారంభంలోనూ, చివరిలోనూ కూడా జోడించాలి. అల్లంతో చేసిన స్వీట్ కేక్ మరియు అల్లం టీ చాలా మందికి ఇష్టమైనది. పేరెన్నికగన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ మసాలా దినుసులలో ఇదికూడా ఒకటి. ఇది కడుపులో అసౌకర్యం, వికారం, వాంతులు, గర్భిణీ స్త్రీలలో ఉదయపు అనారోగ్యం, చలన ఆనారోగ్యం ముఖ్యంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్లో నొప్పులను నివారిస్తుంది. వేడి అల్లము నీరు జలుబు, ఫ్లూ మరియు దగ్గుకు ఉపశమనం ఇస్తుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అవి రాకుండా నివారిస్తుంది. ముడి మరియు వేడి చేసిన అల్లమును ప్రతిరోజూ తీసుకుంటే వ్యాయామంలో ఏర్పడే కండరాల గాయాలు మరియు నొప్పులను తగ్గిస్తుందని ఒక అధ్యయనం పేర్కొంది. పెద్ద ప్రేగు క్యాన్సర్ చికిత్సలో కూడా ఇది సహాయపడుతుంది.

చికిత్సా అల్లం టీ తయారీ: రెండంగుళాల పొట్టు తీయని తాజా అల్లం ముక్క తీసుకుని తురిమి రెండు కప్పుల నీటిని తీసుకొని 10 నుండి 20 నిమిషాలు ఉడకబెట్టాలి. దీన్ని బాగా వడకట్టి పసుపు, నల్లమిరియాలు లేదా దాల్చిన చెక్క వంటి ఇతర సుగంధ ద్రవ్యాలతో కలిపి ఒక చెంచా తేనె మరియు సగం నిమ్మకాయ బద్ద రసం కలిపి రుచికరమైన టీ తయారు చేయండి.  

హెచ్చరిక: 1-2 తురిమిన లేదా నలగ గొట్టిన అల్లం లేదా పేస్ట్ యొక్క ఒకటి రెండు టీ స్పూన్లు తీసుకుంటే అది మన శరీరానికి సరిపోతుంది మరియు సురక్షితమైనదిగా భావిస్తారు. గుండెల్లో మంట, విరోచనాలు లేదా కడుపునొప్పి ఉంటే దీనిని తీసుకోవడాన్ని తగ్గించండి.39-41

12. వెల్లుల్లి (లహసన్)

ఇది గుండ్రటి కూరగాయల రకానికి చెందినది అయినప్పటికీ దీన్ని సుగంధ ద్రవ్యంగానే ఉపయోగిస్తారు. కొన్ని సల్ఫర్ సమ్మేళనాలతో పాటు ముఖ్యమైన పోషకాలుతో నిండి ఉంటుంది. దీనిని పచ్చిది తిన్నప్పుడు తీవ్రమైనదిగా, కొంచం కారంగా, అదొక రకమైన వాసన కలిగి ఉంటుంది.  దీనిని పచ్చిదిగా లేదా ఉడికించిన, వేపిన, బేకింగ్ చేసిన వండిన ఏ రూపంలోనైనా ఏ వంటకాని కైనా వాడవచ్చు.

తాజా వెల్లుల్లి అల్లిన్ అనే అమినో ఆసిడ్ ను కలిగి ఉంటుంది. ఒక వెల్లుల్లి రెబ్బను తరిగినప్పుడు లేదా చితకకొట్టినప్పుడు అల్లినేజ్ అనే ఎంజైమ్ విడుదల ఔతుంది. అల్లిన్ మరియు అల్లినేజ్ సంకర్షణ చెంది అల్లిసిన్ అనే ద్రవం వెలువడుతుంది. ఇది జీవ శాస్త్ర పరంగా వెల్లుల్లి  యొక్క చురుకైన భాగము. ఐతే ఈ అల్లిసిన్ యాక్టివ్ గా కావడానికి కొన్ని  నిమిషాలు అవసరం కాబట్టి దీనిని తరిగిన లేదా దంచిన తరువాత వండే ముందు పది నిమిషాలు ఉంచాలని శాస్త్రజ్ఞులు సూచిస్తున్నారు. పచ్చి వెల్లుల్లి అనేక  ప్రయోజనాలను అందిస్తుంది. ఉడికించ్ దలిస్తే 140 F  కన్నా తక్కువ ఉడికించాలి, ఎందుకంటే అధిక ఉష్ణోగ్రతలు అల్లిసిన్ ను నిర్వీర్యం చేస్తాయి. వంటకం దాదాపు పూర్తి చేసినప్పుడు వెల్లుల్లిని జోడించడం మంచిది.

ప్రాచీన మరియు మధ్యయుగ కాలంలో వెల్లుల్లి దాని ఔషధగుణాలను బట్టి ఎంతో గౌరవింప బడింది. సమాధి త్రవ్వకందారులు దంచిన వెల్లుల్లిని ప్లేగు వ్యాధి రాకుండా రక్షణగా ఉపయోగించారు. రెండు ప్రపంచ యుద్ధాల సమయంలో దీనిని సైనికుల గాయాలకు యాంటీ సెప్టిక్ గానూ మరియు గ్యాంగ్రిన్ వంటి ఇన్ఫెక్షన్లు నివారించడానికి దీన్ని క్రిమినాశక మందుగా ఉపయోగించారు. పసుపు తరువాత సూపర్ మసాలాగా పరిగణింపబడే దీని ప్రయోజనాలపై చేసిన అధ్యయనాల ప్రకారం గుండెజబ్బులు, స్ట్రోక్, క్యాన్సర్,  మధుమేహము, మరియు ఇన్ఫెక్షన్ల వంటి ప్రధాన అనారోగ్యాలను నివారించడంలో దీని శక్తిని వెల్లడిస్తున్నాయి. ఇది రక్తపోటు, సాధారణ జలుబు జుట్టు రాలడము, అల్జీమిర్స్ వ్యాధి, చిత్తవైకల్యం వంటి వ్యాధులను నిరోధిస్తుంది మరియు ఫంగస్ తో పోరాడి అథ్లెట్స్ ఫుట్ వంటి వ్యాధులు నివారిస్తుంది.

సూచన: వెల్లుల్లి ఉప ఉత్పాదనలు, మందులు ఎటువంటి ప్రయోజనాలను అందించవు.

హెచ్చరిక: దీనిని తక్కువ మోతాదులో వాడాలి, దీర్ఘకాలిక లేదా పునరావృత వంటి వ్యాధులతో బాధపడే వారికి లేదా జలుబు మరియు ఫ్లూ తక్కువ నిరోధకత ఉన్నవారికి రోజుకు వెల్లుల్లి రెబ్బ సిఫార్సు చేయబడింది. రక్తపోటు, అల్సర్, ప్రేగు సమస్యలు,  మరియు రక్తం పలచగా చేసుకోవడానికి మందులు వాడేవారు. దీనిని తీసుకునే ముందు వారి వైద్యుడిని సంప్రదించాలి.  ఆధ్యాత్మిక గురువులు దీని ఔషధం గానే తప్ప రోజువారీ తీసుకోవడం కోసం ప్రతికూలశక్తిగల ఆహారంగా భావిస్తారు. ఎందుకంటే ఇది నాడీ వ్యవస్థ మొత్తాన్ని పెద్దఎత్తున ప్రేరేపిస్తుంది. కనుక తీవ్ర అధ్యాత్మిక సాధకులకు ఇది నిషేదిత పదార్ధంగా పరిగణింపబడింది.42-46

ఉల్లిపాయ కూడా వెల్లుల్లి వలె, గుండ్రటి కూరగాయ వలె ఇదే కుటుంబానికి చెందిన దైనా దీని యొక్క ఘాటైన వాసన బట్టి మసాలా గా వాడతారు. (ఉల్లిపాయలు గతంలో రెండు భాగాలుగా సంచిక 5 # 1&2 లో ఇవ్వబడ్డాయి)

13. సోంపు/పెద్ద జీలకర్ర గింజలు (సాంఫ్)

సోంపు మరియు పెద్ద జీలకర్ర గింజలు ఒకే కుటుంబానికి చెందిన వేరు వేరు మొక్కల నుండి లభించే టటువంటివి. ఒకే రుచి – కొద్దిగా తీపి మరియు కొంచం కారం రుచి కలిగి ఉంటుంది. ఒకటి మరియొక దానికి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. అయితే సోంపు బలంగా ఉండటం వలన తక్కువ పరిమాణంలో ఉపయోగపడుతుంది. ఈ గింజలను మొత్తంగా లేదా పొడిగా  సలాడ్లు, వంటకాలు, మరియు కూరలలో ఉపయోగిస్తారు. స్వీట్ కేకుల కోసం బేకింగ్ పిండికి జోడించబడుతుంది, పండ్ల రసాలు, హాట్ చాక్లెట్ లేదా కాఫీ మరియు టీ గా కూడా తయారు చేస్తారు.

తరచూ భోజనం తర్వాత శ్వాసను తాజాగా ఉంచడానికి మరియు జీర్ణక్రియకు సహాయపడటానికి ఈ గింజలు నములుతూ ఉంటారు. ఇవి బ్యాక్టీరియా మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి, కడుపులో పుండ్ల చికిత్సకు, ఋతువిరతి లక్షణాలను మరియు డిప్రెషన్ తగ్గించడానికి ఉపయోగపడతాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం రోజు 5 గ్రాముల గింజలను ఔషధంగా తీసుకుంటే ఋతువిరతి అనంతర లక్షణాల నుండి ఉపశమనం లభిస్తుందని పేర్కొంటున్నాయి. మసాలాగా ½ నుండి ఒక టీ స్పూన్ సరిపోతుంది.

స్టార్ అనైజ్ (నక్షత్రము ఆకారంలో ఉండే ఒక మసాలా దినుసు) తో సోంపు ను ఒకటే అని పొరపాటు పడకూడదు. ఎందుకంటే ఇది వేరే కుటుంబం నుండి వస్తుంది. అయితే రెండూ ఒకే రకమైన ఆరోగ్య ప్రయోజనాలను రుచిని కలిగి ఉంటాయి. 47, 48

14. యాలుకలు - ఆకుపచ్చ (ఇలాచి), నలుపు (బడీ ఇలాచీ)

పచ్చని యాలుకలు: ఇది నిమ్మ మరియు పుదీనా యొక్క లక్షణాలతో ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది. మరియు దీని సువాసన బట్టి కారంగా, వగరుగా, మరియు తీపిగా ఉంటుంది. దీనిని మానవ సంబంధిత శ్రమ ద్వారా పండించవలసిన అవసరం ఉన్నందున ఇది అధిక శ్రమతో కూడుకున్నది మరియు చాలా ఖరీదైనది. యాలుకల పైపొట్టును తొలగించి పిండివలె చేసుకొని తాజాగా ఉపయోగించుకొంటే చాలా ప్రభావ వంతంగా ఉంటుంది. ఇది భారతదేశంలో టీ తయారీలో ప్రసిద్ధ సంకలితము; మరియు రుచికరమైన వంటకాలు, రొట్టెలు, పాన్ కేకులు, కేకులు, మరియు జావ, హల్వా, స్మూతీలు, డిసెర్టులలో కూడా ఉపయోగిస్తారు. సహజమైన శ్వాస తాజాదనం కోసం మరియు ఛ్యుయింగ్ గమ్ లలో అవసరమైన పదార్థం గానూ, ఎక్కువగా ఆహారం తీసుకుంటే జీర్ణక్రియ వర్ధనం గానూ, మరియు చెడు శ్వాస నివారణకు మరియు దంతక్షయం నివారించడానికి, లాలాజలాన్ని శుభ్రపరచడానికి ఉపయోగింపబడుతుంది. ఇది ఉబ్బసం మరియు శ్వాసకోశ రుగ్మతలకు సహాయపడుతుంది, మరియు రక్తపోటును తగ్గిస్తుంది.   

నల్ల యాలుకలు:

ఇది ప్రత్యేకమైన పొగలాంటి సుగంధం మరియు ప్రత్యేక రుచిని కలిగి ఉంటుంది. తీపి వంటకాలలో అరుదుగా ఉపయోగిస్తారు. ఈ దినుసును కిడ్నీ బీన్స్, బఠానీ, కూరగాయలు, కూరలు వండటానికి మరియు ప్రత్యేక బియ్యం వంటకాలలో ఉపయోగిస్తారు.

నల్ల యాలుకలు అనేక ఉదర వ్యాధులు, సాధారణ ఇన్ఫెక్షన్లు మరియు దంత సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. నోటిని తాజాగా ఉంచే మౌత్ ఫ్రెష్నర్ గా కూడా పనిచేస్తుంది. సాంప్రదాయ చైనా ఔషధంలో మలేరియా చికిత్సకు ఉపయోగింస్తారు.  

హెచ్చరిక: తాజా శ్వాస మరియు జీర్ణక్రియకు రోజుకు ఒకటి లేదా రెండు ఆకుపచ్చ యాలకులు మించి తీసుకోకూడదు. వంటలకు ఒక నల్ల యాలుకకాయ సరిపోతుంది. ఇది సంకోచ నొప్పులకు ప్రేరణ కర్త కనుక పిత్తాశయ రాళ్ళు ఉంటే దీనిని ఉపయోగించడం మానుకోవాలి.49-51

15. లవంగము (లవంగ్)

ఇది ఎండిన పూల మొగ్గ. పరిమళ భరితంగా కొంచం తీపి మరియు కారపు రుచితో ఉండే ఈ తీక్షణమైన పదార్ధము అనేక రుచికరమైన మరియు తీపి వంటకాలకు జోడించబడుతోంది.

అత్యధిక యాంటీఆక్సిడెంట్ కౌంట్ తో ఉండే ఇది క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను నివారించగలుగుతుంది. యుజినాల్ అనే ఫినోలిక్ యాసిడ్ కు ప్రధాన సహజవనరుగా ఉన్న ఈ లవంగం యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమ్యూటాజెనిక్, మరియు యాంటీ మైక్రోబియల్ గా పనిచేస్తుంది. అంతేకాక యాంటీసెప్టిక్  మరియు అనాల్జెసిక్ గా పనిచేసే ఈ లవంగం నోటి ఆరోగ్యానికి అద్భుతమైనది. దంత ప్రక్రియలు మరియు సన్నాహాల్లో ఉపయోగించబడుతుంది, మరియు తలనొప్పి నుండి ఉపశమనం ఇస్తుంది. వంటి మీద చిన్న గాయాలు లేదా కోతల చికిత్స కోసం లవంగాల పొడి రాయవచ్చు. వేడి పానీయాలలో ఇది ఛాతీలో రద్ది మరియు దగ్గు నుండి ఉపశమనం కోసం వాడతారు.

హెచ్చరిక: రోజుకు పదిహేను లవంగాలు తీసుకోవడం సురక్షితం. చర్మ అలర్జీ ఉన్నా, రక్తస్రావం రుగ్మతలు ఉన్నా దీనిని నివారించండి.52-55

16. దాల్చిన చెక్క (దాల్చిని)

గోధుమ రంగులో ఉండే దాల్చినచెక్క చెట్టు బెరడు నుండి దీనిని సేకరిస్తారు. వెచ్చని మరియు ఓదార్పునిచ్చే పరిమళంతో మధురంగా  ఉంటుంది. ప్రపంచంలోని నెంబర్ వన్ మసాలాగా పరిశోధకులు దీనికి కితాబు నిచ్చారు. ఇది ఇతర మసాలాలను శరీరములోనికి శోషణం చేసుకొనడానికి సహాయపడుతుంది. దీనిని మిఠాయిలు, పానీయాలు మరియు పండ్లరసాలకు కలుపుతారు. ఇది సహజమైన ఆహార సంరక్షణకారి కనుక కత్తిరించిన పండ్లు మరియు కూరగాయలు రంగు మారకుండా చేయగలదు.

యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఇందులో ఫైబర్, మ్యాంగనీస్ కూడా అధికంగా ఉంటాయి. మంట ఇన్ ఫెక్షన్లు ముఖ్యంగా వైరస్లు మరియు అలర్జీలతో పోరాడుతుంది. బహిష్టు నొప్పులను తగ్గిస్తుంది మరియు అధిక రక్త స్రావాన్ని ఆపుతుంది, రక్తంలో చక్కెరను స్థిరపరుస్తుంది, భోజనం తర్వాత వచ్చే చిక్కులను నివారిస్తుంది, నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది, జీర్ణ వ్యవస్థ రుగ్మతలను నివారిస్తుంది. అల్లం మరియు మిరియాలతో తీసుకున్నప్పుడు శ్వాసకోశ మార్గాన్ని ముఖ్యంగా చల్లని వాతావరణం వల్ల ఏర్పడే రద్దీనీ పోగొడుతుంది, మరియు బోలు ఎముకల వ్యాధిని నివారిస్తుంది. దాల్చినచెక్క వాసన చూడడం లేదా నమలడం మెదడు చురుకుదనాన్ని పెంచుతుంది.  

హెచ్చరిక: రోజుకు గరిష్టంగా ఆరు గ్రాముల వరకు తీసుకోవడం సురక్షితం అధికంగా తీసుకోవడం వల్ల అలర్జీ ప్రతిచర్యలు, నోటి పుండ్లు, కాలేయ సమస్యలు, రక్తంలో చక్కెర తగ్గిపోవడం, మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడవచ్చు.56-59

17. కుంకుమపువ్వు (కేసర్)

ఊదా రంగు కుంకుమ పువ్వుల ఎండిన కీలాగ్రములను నుండి ఉద్భవించే ఈ దినుసు ఎరుపు రంగులో ఉంటుంది. కొద్దిగా చేదు రుచిని కలిగి ఉంటుంది. ఒక మిలియన్ కంటే ఎక్కువ పువ్వులు కేవలం ఒక పౌండు కుంకుమపువ్వును మాత్రమే అందిస్తాయి. కనుక దీనిని పెంచడం, పండించడం చాలా శ్రమతో కూడుకున్నది. కాబట్టి ఇది చాలా ఖరీదైనది, చాలా తక్కువ పరిమాణంలో పోగులవంటి రూపంలో లభిస్తుంది. కుంకుమపువ్వు తీపి వంటకాలు, హల్వా, బియ్యంతో చేసే వంటకాలు మరియు కూరలు వంటి వాటికి అందమైన పసుపు- ఆరెంజి రంగునిస్తాయి.   

సాంప్రదాయకంగా జీర్ణాశయ వ్యాధులు, ఎగువ శ్వాసకోశ సమస్యలకు, మరియు గాయాలను నయం చేయడానికి ముఖ్యంగా ఇది ఆందోళన, నిరాశ, హార్మోన్ రుగ్మతలు, రక్తపోటు, మరియు హృదయ ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో ప్రభావవంతంగా ఉంటుందని కనుగొనబడింది. ఇది అల్యూమినియం విషాన్ని వెనక్కి మళ్ళిస్తుంది. దీనిలో సమృద్ధిగా ఉన్న మ్యాంగనీస్ ఖనిజ లవణము వలన ఇది అస్థిపంజర మరియు థైరాయిడ్ ఆరోగ్యానికి మంచిది.    

హెచ్చరిక: నమ్మదగిన మూలము నుండి కొనండి! రోగులపై చేసిన అనేక అధ్యయనాల ప్రకారం ఆరు వారాల పాటు రోజుకు 30 మిల్లీ గ్రాముల చొప్పున ఔషధంగా తీసుకోవడం సురక్షితం గా పరిగణించబడుతుంది. అధిక మోతాదులో విషపూరితం అవుతున్నట్లు నివేదించబడింది.60-62

  18. జాజికాయ/జాపత్రి (జావిత్రి/జైఫల్)

జాజికాయ మరియు జాపత్రి వివిధ లక్షణాలతో జాజికాయ చెట్టు యొక్క ఓకే పండు నుండి తోబుట్టువులు అని చెప్పవచ్చు. జాజికాయ అనేది పండులోని ముదురు రంగు విత్తనము. దీని చుట్టూ ఎర్రని జుట్టు వంటిది ఉంటుంది, అది తియ్యగా మరియు వెచ్చగా ఉంటుంది. ఇవి రెండు కూడా బేకింగ్ చేయబడే వంటకాలు మరియు  తీపి పదార్ధాలలో ఉపయోగిస్తారు. జాపత్రి తియ్యగా, తేలికగా రుచి మరియు పరిమళంలో మరింత సూక్ష్మంగా ఉంటుంది. ప్రయోజనాలు రెండింటికి సమానంగా ఉంటాయి.

ఒక టీ స్పూన్ తేనె, చిటికెడు జాజికాయ లేదా జాపత్రి పొడితో కలిపి సేవిస్తే కిడ్నీ ఇన్ఫెక్షన్ మరియు రాళ్ళు శరీరం నుండి వదిలించుకోవటానికి సహాయపడుతుంది. నీరు మరియు కొద్దిగా అల్లంతో కలిపి తీసుకుంటే ఇది ఉదర సమస్యలను పరిష్కరించి విరేచనాలను తగ్గిస్తుంది. ఇది కడుపు పూతలకు, నోటి ఆరోగ్యానికి, నరాలకు శక్తి నివ్వడానికి, నిద్రలేమికి చికిత్స చేయడంతో పాటు గుండె, మెదడు, మరియు చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది.

హెచ్చరి: దీనిని తక్కువగా ఉపయోగించాలి. గరిష్టంగా ఒక గ్రాము సరిపోతుంది. 5 గ్రాములు వద్ద విషపూరితమయ్యి కేంద్రనాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది.63-66

19. ఆల్ స్పైస్ మసాలా

దీని పేరుకు విరుద్ధంగా ఇది ఎండిన బెర్రీలతో తయారు చేసిన ఒక ఒకే ఒక సుగంధ ద్రవ్యం. ఇది మిరియాల మాదిరిగా కనిపిస్తుంది కానీ రుచిలో మిరియాలు, లవంగం, దాల్చిన చెక్క, మరియు జాజికాయ మిశ్రమంవలె ఉంటుంది. ఇది అల్లం రొట్టెలు, మిఠాయి మరియు పానీయాలు తయారీకి ఉపయోగించబడుతుంది. దీని యొక్క తీపిదనం వలన చక్కెర వాడకాన్ని తగ్గించుకోవచ్చు. దీనితో తయారు చేసిన టీ ఉబ్బరం మరియు అపానవాయువు నుండి ఉపశమనం కలిగిస్తుంది. దీనిని పొడితో తయారు చేసిన పేస్టు నొప్పి నుంచి నివారణ ఇస్తుంది.67

 

 

20. ప్రఖ్యాతి చెందిన మసాలా మిశ్రమాలు

గరంమసాలా భారతీయ వంటకాలు విస్తృతంగా ఉపయోగించే ఒక సుగంధ ద్రవ్యాల మిశ్రమం. ప్రధానంగా దీనిలో జీలకర్ర, కొత్తిమీర, ఎర్ర కారం, నలుపు మరియు తెలుపు మిరియాలు, సోపు, లవంగాలు, దాల్చిన చెక్క, నలుపు మరియు ఆకుపచ్చ యాలుకలు, మరియు జాపత్రి పొడులు ఉంటాయి. వీటి రుచి మరియు పరిమళం కోసం పొడి చేయడానికి ముందు వీటిని వేయించుతారు. సమతుల్య ప్రభావాన్ని కలిగి ఉండటానికి అన్నింటినీ జాగ్రత్తగా కలపాలి.68

జీలకర్ర, మెంతి, నల్ల ఆవాలు, నల్ల జీలకర్ర మరియు సోపు గింజల మసాలా దినుసులతో చేసిన కలర్ ఫుల్ మిశ్రమము “పంచ్ ఫోరాన్” భారతదేశం యొక్క తూర్పు భాగము నుండి ఉద్భవించిన ఈ మిశ్రమాన్ని ఊరగాయలు తయారిలో విస్తృతంగా ఉపయోగిస్తారు. కూరగాయలు మరియు కాయధాన్యాల వంటకములలో  చేర్చడానికి ముందు ప్రత్యేక రుచి మరియు పరిమళం కోసం ఈ మిశ్రమమును మొదట నూనె లేదా నెయ్యిలో వేపిస్తారు. 69

తుది పలుకు: సుగంధద్రవ్యాలు మన వంటకాలకు రంగును, రుచిని, పరిమళాన్ని ఇస్తూ మన ఆహారాన్ని రుచికరంగా తయారుచేస్తాయి. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయి. అవగాహన మరియు శ్రద్ధతో ఉపయోగిస్తే అనేక అనారోగ్యాల నుండి మనలను కాపాడుతాయి అనడంలో ఎటువంటి సందేహము లేదు. శ్రీ సత్య సాయి బాబా వారి సూచన కూడా మనం జ్ఞప్తి యందు ఉంచుకోవాలి. “అధిక మసాలాలు, మిర్చి మరియు ఉప్పు అధికంగా ఉండకుండా జాగ్రత్త వహించండి ”.70

ఆధారాలు మరియు వెబ్సైట్ లింకులు :

  1. Sathya Sai Speaks on “Vehicle care” to prevent illness, 16 October 1974, http://www.sssbpt.info/ssspeaks/volume12/sss12-48.pdf
  2. What is a spice: https://www.thespruceeats.com/what-are-spices-995747
  3. https://www.diffen.com/difference/Herbs_vs_Spices)
  4. Spices for life: http://www.ayurvedacollege.com/blog/ayurvedic-uses-spices-incredible-powerhouses-medicinal-benefits/
  5. Benefits of spices: https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC5030248/
  6. Mustard seeds: https://foodfacts.mercola.com/mustard-seed.html
  7. https://www.healthline.com/nutrition/is-mustard-good-for-you#nutrition
  8. Cumin Benefits: https://draxe.com/nutrition/cumin-seeds/
  9. Cumin Benefits & Caution: https://www.emedihealth.com/cumin-benefits.html
  10. Cumin Study: https://www.medicalnewstoday.com/articles/319562 
  11. Cumin tea: https://food.ndtv.com/health/15-incredible-benefits-of-jeera-water-for-your-skin-hair-and-health-1644227
  12. Asafoetida: https://draxe.com/nutrition/asafoetida/
  13. https://www.emedicinehealth.com/asafoetida/vitamins-supplements.htm
  14. https://www.ayurtimes.com/hing/
  15. Red Chili: https://www.gyanunlimited.com/health/top-5-health-benefits-of-chilli-the-queen-of-spices/2755/
  16. Paprika: https://draxe.com/nutrition/paprika/
  17. Different peppers: https://www.masterclass.com/articles/whats-the-difference-between-cayenne-pepper-paprika-red-chili-pepper-and-ground-red-pepper-plus-15-red-pepper-varieties-and-culinary-uses
  18. Cayenne: https://draxe.com/nutrition/cayenne-pepper-benefits/
  19. Black pepper benefits: https://www.emedihealth.com/black-pepper-benefits.html
  20. Black pepper: https://www.24mantra.com/blogs/organic-lifestyle/top-6-health-benefits-of-black-pepper/
  21. Healthy black pepper study: https://www.ncbi.nlm.nih.gov/pubmed/23768180
  22. Black/white/red pepper: https://draxe.com/nutrition/black-pepper-benefits/
  23. Coriander seed: https://draxe.com/nutrition/coriander/
  24. https://food.ndtv.com/food-drinks/7-amazing-coriander-seeds-benefits-from-tackling-diabetes-to-improving-the-skin-1407915
  25. Fenugreek: https://draxe.com/nutrition/fenugreek/
  26. https://www.emedihealth.com/fenugreek-benefits.html
  27. https://foodfacts.mercola.com/fenugreek.html
  28. Carom: https://www.healthline.com/nutrition/carom-seeds
  29. https://food.ndtv.com/food-drinks/9-super-benefits-of-ajwain-the-multi-talented-household-spice-1438699
  30. Nigella: Miraculous healing powers studied: https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC3642442/
  31. https://food.ndtv.com/food-drinks/10-incredible-health-benefits-of-nigella-seeds-kalonji-1456233
  32. https://www.verywellhealth.com/nigella-sativa-89064
  33. Turmeric: https://healthcare.utah.edu/healthfeed/postings/2020/02/turmeric.php
  34. https://food.ndtv.com/food-drinks/what-is-the-difference-between-turmeric-and-curcumin-1657211
  35. https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC5664031/
  36. https://foodfacts.mercola.com/turmeric.html
  37. https://draxe.com/nutrition/turmeric-curcumin-benefits/
  38. https://www.hopkinsmedicine.org/news/publications/johns_hopkins_health/summer_2013/a_simple_spice_that_may_battle_cancer
  39. Ginger: https://foodfacts.mercola.com/ginger.html
  40. https://draxe.com/nutrition/ginger-tea-benefits/
  41. https://www.ncbi.nlm.nih.gov/books/NBK92775/
  42. Garlic: https://draxe.com/nutrition/7-raw-garlic-benefits-reversing-disease/
  43. https://www.thespruceeats.com/all-about-garlic-995693
  44. https://health.clevelandclinic.org/6-surprising-ways-garlic-boosts-your-health/
  45. Garlic a negative energy food!: https://www.youtube.com/watch?v=VBEOjcUDeFM; https://www.youtube.com/watch?v=so3rT66Hx7E
  46. Ayurvedic view on garlic/onion: https://www.thehealthsite.com/diseases-conditions/heres-why-a-no-onion-garlic-diet-is-recommended-in-ayurveda-bs0416-388694/
  47. Anise/Fennel: https://www.thespruceeats.com/what-is-anise-995562
  48. Anise: https://draxe.com/nutrition/anise-seed/
  49. Cardamom: https://draxe.com/nutrition/cardamom/
  50. https://foodfacts.mercola.com/cardamom.html
  51. Black cardamom: https://www.thespruceeats.com/badi-elaichi-black-cardamom-1957875
  52. Cloves: https://www.organicfacts.net/health-benefits/herbs-and-spices/health-benefits-of-cloves.html
  53. https://www.prohealth.com/library/clove-valuable-spice-thats-used-centuries-89015
  54. https://www.thespruceeats.com/substitute-for-whole-and-ground-cloves-4153883
  55. Clove, a powerful antioxidant: https://draxe.com/essential-oils/clove-oil-uses-benefits/
  56. Cinnamon: https://draxe.com/nutrition/health-benefits-cinnamon/
  57. https://foodfacts.mercola.com/cinnamon.html
  58. https://www.drugs.com/npp/cinnamon.html
  59. https://www.organicauthority.com/health/11-health-benefits-of-cinnamon
  60. Saffron: https://draxe.com/nutrition/saffron/
  61. https://foodfacts.mercola.com/saffron.html
  62. https://www.drugs.com/npp/saffron.html
  63. Nutmeg/mace: https://thespiceguide.com/mace-vs-nutmeg-whats-the-difference/
  64. https://thespiceguide.com/15-amazing-health-benefits-for-nutmeg/
  65. https://draxe.com/nutrition/nutmeg/
  66. https://www.drugs.com/npp/nutmeg.html
  67. Allspice: https://www.thespruceeats.com/what-is-allspice-p2-995556
  68. Garam masala: https://en.wikipedia.org/wiki/Garam_masala
  69. Panch Phoron: https://www.tarladalal.com/glossary-panch-phoron-1027i
  70. Food for a healthy body and mind: Sathya Sai Baba Speaks on Food, September 2014 edition, page 65, sourced from Sathya Sai Newsletter, USA, Vol28-3,(May-June 2004)

_________________________________________________________________________________________________________________________________________________

2. AVP వర్క్ షాప్, పుట్టపర్తి, ఇండియా, 23-29 ఫిబ్రవరి 2020

 సీనియర్ టీచర్లు10375 & 11422, నిర్వహించిన ఈ వారం రోజుల వర్క్ షాప్ లో భారతదేశం మరియు విదేశాల నుండి (దక్షిణాఫ్రికా, గాబన్ మరియు ఇండోనేషియా) 11 మంది ఉత్సాహభరితంగా పాల్గొన్నారు.Additionally four overseas practitioners (France, Gabon, Canada & అదనంగా తమ జ్ఞానాన్ని రిఫ్రెష్ మరియు అప్డేట్ చేసుకోవడం కోసం నలుగురు విదేశీ ప్రాక్టీషనర్లు (ఫ్రాన్స్, కెనడా, గాబన్, మరియు ఐర్లాండ్) కూడా పాల్గొన్నారు. వీరిలో   ఉన్నప్రాక్టీషనర్ 03578 ఫ్రెంచ్ అనువాదకుడిగా స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ వర్క్ షాప్ మాక్ మరియు లైవ్ రెండింటి ద్వారా ఆచరణాత్మక శిక్షణ అందించడానికి సన్నద్ధమైంది. అదేవిధంగా సీనియర్ ఉపాధ్యాయులు మరియు ప్రాక్టీషనర్ 11578 & 11964.  ప్రత్యక్ష  ప్రదర్శన మరియు రోల్ ప్లే ద్వారా ప్రత్యక్ష క్లినిక్కును ఆచరణాత్మకంగా చూపించారు. ఇది సజీవ వాతావరణం సృష్టించి నిగూఢ భావనలు మరింత స్పష్టంగా అందుకోవడానికి సహాయపడింది. కేస్ హిస్టరీలను వ్రాయడంలో విలువైన సమాచారం అందిస్తూ శ్రీమతి హేమ అగ్గర్వాల్ గారు అవసరమైన చోట రోగ చరిత్రలకు ఛాయా చిత్రాల మద్దతు ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. డాక్టర్ అగర్వాల్ గారు తన ప్రసంగంలో హాజరైన సభ్యులు అసలు వారు వర్క్ షాప్ లో ఎందుకు ఉన్నారో ప్రశ్నించడం ద్వారా వారిని ఆలోచించమని ప్రేరేపించారు. స్వామితో తన వ్యక్తిగత చర్యల ఆధారంగా వాస్తవ సంఘటనలను ఉటంకిస్తూ నిస్వార్థ సేవ అంటే ఏమిటో వివరించారు. SRHVP మిషను ఎలా ఆశీర్వదింపబడినదో మరియు వెైబ్రియానిక్స్  భవిష్యత్తు ఔషధం అంటూ స్వామి చెప్పిన విషయాలను కూడా వారు సభ్యులతో పంచుకున్నారు. ఐతే వైబ్రియానిక్స్ గురించి వర్ణిస్తూ పొడవైన వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించారు. దీనివలన రోగుల మనసులో అంచనాలు పెరుగుతాయి. దానికన్నా కూడా   మీరు ఇచ్చిన రెమిడీ నే  స్వయంగా మాట్లాడనివ్వండి. ఇది మీ రోగులలో విశ్వాసాన్ని ప్రేరేపిస్తుంది అన్నారు. తన సభా ముగింపు ప్రసంగంలో, మంచి ప్రాక్టీషనర్ గా మారడానికి వృత్తిపరమైన విధానాన్ని తీసుకోవాలని అదే సమయంలో ప్రేమ మరియు కరుణతో నిండిన హృదయం తో పని చేయాలని తెలిపారు.  

________________________________________________________________________________________________________________________________________________________

3. కోవిడ్ –19 ప్రపంచవ్యాప్తంగా సాయి వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్నుండి స్పందన

కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి ద్వారా ఏర్పడిన దుర్భర స్థితి ఊహించలేనన్ని అనేక సవాళ్ళను సృష్టించింది. 2020 ఫిబ్రవరి ప్రారంభంలో ఈ వైరస్ నుండి మొదటి మరణం చైనా వెలుపల జరిగినప్పుడు మనము విచారణ చేపట్టగా కొంతమంది యూరప్ ప్రాక్టీషనర్లు మరియు మన పరిశోధన బృందం ఈ వైరస్ను నిరోధించడానికి ఉత్తమ మార్గం ప్రజల యొక్క రోగ నిరోధక శక్తిని పెంచడం అని గ్రహించారు. కాబట్టి ఫిబ్రవరి 12న, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడే “ఇమ్యూనిటీ బూస్టర్” రెమిడీ  తయారుచేయబడి ఎవరైతే ఇది కావాలని కోరుకుంటున్నారో వారికి సరఫరా చేయబడింది. మార్చి 1న ప్రచురించిన వార్త లేఖ ద్వారా ఇది మన ప్రాక్టీషనర్ల అందరికీ విస్తృతంగా తెలియ చేయబడింది. మార్చి ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి క్షీణించడం ప్రారంభమై మార్చి 11న WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్-19 ఒక మహమ్మారిగా ప్రకటించింది. వెంటనే మన పరిశోధనా బృందం  మార్చి 12 న చర్యలు చేపట్టి కొవిడ్-19 కోసం జాగ్రత్తగా రెమిడీలు తయారుచేసింది. ఈ అప్డేట్ (నవీనీకరణ) వెంటనే అభ్యర్థులందరికీ పంపబడింది. ప్రపంచంలోని అన్ని మూలల నుండి మరింత సమాచారం రావడంతో వైరస్ శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందని దాని గురించి మేము మరింత అర్థం చేసుకున్నాము. కనుక ఈ సమయంలో, మన పరిశోధనా బృందం మెరుగైన కాంబోతో ప్రతిస్పందించింది. ఈ రెమిడీ ని చికిత్సకు కూడా ఉపయోగించి కావచ్చు కానీ మరింత ఎక్కువ మోతాదులో ఉపయోగించాలి. రెండవ అప్డేట్ మార్చి 20న పంపబడింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రాక్టీషనర్ల నుండి రోజువారీ అభిప్రాయాన్ని మరియు సూచనలను పరిగణన లోనికి తీసుకొని చివరకు మరింత మెరుగైన రెమిడీ మూడవ అప్డేట్ గా ఏప్రిల్ 13న జారీ చేయబడింది. 

ఇప్పటివరకు అందుకున్న పరిమిత సంఖ్యలో నివేదికలను మేము మీతో పంచుకుంటున్నాము.

ఇండియా: భారతదేశం అంతటా ప్రాక్టీషనర్లు వారి సాధారణ రోగులకు కుటుంబ సభ్యులకు లాక్డౌన్ కు ముందు వైద్య శిబిరాల్లో రెమిడీ లను అందించగలిగారు. లాక్ డౌన్ నేపథ్యంలో వారు ఏప్రిల్ 13 యొక్క మూడవ నవీకరణ యొక్క మార్గదర్శకాల ప్రకారం పంపిణీ చేయడం ప్రారంభించారు. ఈ వార్తాలేఖ ప్రెస్ కి వెళ్లే సమయమునకు భారతదేశంలోని 12 రాష్ట్రాల నుండి నమోదైన ఫీడ్బ్యాక్ ప్రకారం 42903 మంది వ్యక్తులు ఇమ్యూనిటీ బూస్టర్ తీసుకున్నారు. ప్రాక్టీషనర్లు ఇంకా గణాంకాలు పంపని కారణంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని విశ్వసించడానికి సరైన కారణాలే ఉన్నాయి, నివేదికలు ఇంకా వస్తూనే ఉన్నాయి.

భారతదేశం వెలుపల: మన ప్రాక్టీషనర్లు ఉన్న 80 దేశాలలో మనకు కేవలం 19 దేశాలనుండి మాత్రమే నివేదికలు వచ్చాయి అది కూడా కొన్ని దేశాల్లోని కొద్దిమంది ప్రాక్టీషనర్ల నుండి మాత్రమే. మొత్తం 5188 ముందస్తు రెమెడీ సీసాలు ఇవ్వబడ్డాయి  అమెరికా (1504), బ్రిటన్ (1001), పోలండ్ (628), బెనిన్ (480), ఫ్రాన్స్ (427), స్లొవేనియా (295), క్రొయేషియా (175), రష్యా (124), గ్రీస్ (102), అర్జెంటినా (78), ఉరుగ్వే (76), గాబన్ (48), రొమేనియా (45), సౌత్ ఆఫ్రికా (44), పేరు  (29), స్పెయిన్ (13), బెల్గియమ్ (10), లక్సెంబర్గ్ (6), మరియు మారిషస్ (3).

మొత్తం 131 మంది రోగులు కోవిడ్ -19 లక్షణాలతో  పాజిటివ్ గా పరీక్షించ బడ్డవారు లేదా బలమైన కొరోనా లక్షణాలు కలిగి ఉన్నవారికి చికిత్సను నేరుగా లేదా  బ్రాడ్కాస్టింగ్ ద్వారా కొందరు చికిత్స చేయబడ్డారు. ఆచరణాత్మకంగా వీరంతా రెండు వారాల్లో పూర్తిగా కోలుకున్నారు, కానీ ఎక్కువమంది ఒక్క వారంలోనే కోలుకున్నారు. అలాగే రెండు నుండి నాలుగు రోజుల లోపు కోలుకున్నవారు కనీసం ఇరవై ఆరు మంది ఉన్నారు. చికిత్స ప్రారంభించినప్పుడు ఐసీయూలో ఒక రోగి ప్రస్తుతం  మెరుగుపడినప్పటికీ ఇప్పటికీ ICU లోనే ఉన్నారు. సాధారణ అనుభవం ఏమిటంటే కోవిడ్-19 లక్షణాలు ప్రారంభమైన వెంటనే చికిత్స ప్రారంభించిన చోట రెమిడీలు వేగంగా పని చేశాయి. మూడు సందర్భాల్లో రోగులు ముందస్తు మోతాదు OD లో  ఉన్నప్పుడు లక్షణాలు అభివృద్ధి అయ్యాయి, కానీ మోతాదు పెంచగనే లక్షణాలు తగ్గటం ప్రారంభించాయి, వారు చాలా త్వరగా కోలుకున్నారు.   

కొంతమంది ప్రాక్టీషనర్లు తమను తాము వ్యక్తపరచుకొని, ధైర్యంతో ముందుకుసాగి రోగుల జీవితాల్లో ఆనందం తెచ్చిన ప్రోత్సాహకరమైన చరిత్రలు కూడా ఉన్నాయి. తర్వాత సంచికలలో వీటిని మీతో పంచుకోవాలని మేము ఆశిస్తున్నాము.

సమస్త లోకాః సుఖినోభవంతు, ప్రపంచంలోని అన్ని జీవులు సంతోషంగా మరియు స్వేచ్ఛగా ఉండాలి !

ఓం శ్రీ సాయి రామ్!