అదనపు సమాచారం
Vol 2 సంచిక 2
March 2011
ఆరోగ్య చిట్కాలు
భరువును మరియు రక్త చక్కెర స్థాయిను తగ్గించే దాల్చిని
ఒక పరిశీలనలో, సాధారణ వంటగది మసాలాగా ఉపయోగపడే, దాల్చిన చెక్క, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుందని తెలిసింది. అంతేకాకుండా దాల్చిన చెక్కకు కొవ్వును కరిగించి భరువును తగ్గించే లక్షణాలు కూడా ఉన్నాయని తెలిసింది. దాల్చిన చెక్క పురాతన కాలం నుండి ఉపయోగించ బడుతోంది.
ఒక పరిశీలనలో, ప్రతిరోజు ఒకటి నుండి ఆరు గ్రాముల దాల్చినను తీసుకున్న టైప్ 2 డయాబెటిస్ రోగులలో రక్త చక్కెర స్థాయిలు తగ్గాయని నిర్ధారించబడింది. దాల్చిన తీసుకోవడం వల్ల ఈ ఫలితాలు ఎలా లభించాయని నిర్ణయించబడలేదు కాని దాల్చిన ద్వారా కలిగిన సఫలితాలు దీన్ని తీసుకోవడం ఆపేసిన ఇరవై రోజుల వరకు కొనసాగాయి. భోజనం చేసిన తర్వాత, రోజుకి మూడు గ్రాములు దాల్చిన తిన్న ఆరోగ్యవంతులైన వ్యక్తులలో రక్త చక్కెర స్థాయిలు తగాయని, 2009 లో చేసిన ఒక పరిశీలనలో తెలిసింది.
శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు అధికంగా ఉన్నప్పుడు రక్తంలో ఉన్న అదనపు చక్కెర, తక్కువగా ఉపయోగించబడుతుంది (చక్కెర శరీరంలో కొవ్వుగా నిల్వ చేయబడుతుంది). ఈ కారణంగా భోజనం తర్వాత ఇన్సులిన్ తగ్గింపు చాలా శ్రేష్టమైనది. దాల్చిని రక్తంలో చక్కెర స్థాయిను, దీని కారణంగా కొవ్వు స్థాయిను నియంత్రించడానికి సహాయపడుతుంది. ఈ విధంగా దాల్చిని శరీర భరువును తగ్గిస్తుంది.
మధ్య యుగంలో దాల్చిని బంగారం కంటే ఎక్కువ విలువైనదిగా భావించ పడేది. 17 వ శతాబ్దం డచ్ పోర్చుగీస్ యుద్ధం భాగంగా, ఒక విధమైన తీపి దాల్చిని అపారంగా లభించే సిలోన్ దేశాన్ని (ఇప్పుడు శ్రీలంక) నియంత్రణలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయబడింది. సిలోన్ దాల్చిని లేదా "అసలైన దాల్చిని" అన్న పురాతన పేరు ఇప్పడికి ఉంది. మరొక పురాతనమైన మరియు ప్రధానమైన రకం కేసియా దాల్చిని. ఇది "అసలైన దాల్చిని" కన్నా తక్కువ కరీదులోను మరియు సులభంగాను లభిస్తుంది. కేసియా దాల్చిని గురించిన ప్రస్తావన బైబుల్లో చేయపడి ఉంది. ఈజిప్షియన్లు శవాలని భద్రపరిచే ప్రక్రియలోనూ మరియు ఆహార సువాసన కొరకు దాల్చిని చెక్కను ఉపయోగిస్తారు.
వివిధ తీయటి రుచులున్న అనేక దాల్చిన రకాలు పెరుగుతాయి. క్రిమినాశక లక్షణాలు దాల్చినిలో ఉన్న కారణంగా, అథ్లెట్ ఫుట్ (పాదాలలో ఒక రకమైన చర్మ వ్యాధి) నయంచేయడానికి ఇది ఉపయోగపడుతోంది. ధల్చినిని పీల్చడం వల్ల జ్ఞ్యాపక శక్తి మెరుగుపడుతుంది మరియు కడుపు రుగ్మతలు, అజీర్ణం వంటి సమస్యల ఉపశమనానికి కూడా ఉపయోగపడుతుంది. దాల్చిని శరీరంలో అధికంగా వేడి సృష్టిస్తుందని గమనించాలి. ఈ వేడిని ఎదుర్కోవడానికి శరీరం తన సొంత వేడిని సృష్టించి సమతుల్యతను తీసుకు వస్తుంది. ఈ ప్రక్రియను తెర్మోజేనిక్స్ అంటారు. ఈ ప్రక్రియ ద్వారా కొవ్వు కరుగుతుంది.
టీలు, బజ్జీలు, కేకులు, ఐస్ క్రీమ్లు, చారు, కుడుములు, కూరలు వంటి ఆహార పదార్థాలను మరింత రుచికరంగా ఉండాలంటే వాటిలో దాల్చిని చెక్కను చేర్చాలి. మీరు దాల్చిని చెక్క సువాసనను చూసి దాన్ని ఎన్నుకోవచ్చని మీరు గుర్తు పెట్టుకోవాలి. ఒక గాఢమైన మరియు తీపి వాసన, దాల్చిని యొక్క తాజాదనాన్ని సూచిస్తుంది. దాని రుచి కొంతవరకు చేదు లేదా గాడమైన సువాసన లేకుండా ఉన్నట్లయితే, అది దాని బలహీనతను సూచిస్తుంది కాబట్టి దాన్ని పారవేయచ్చు. ఇటువంటి దాల్చిని భరువు తగ్గించడానికి పనికి రాదు. దాల్చిని చెక్కను ఇతర ఆహారాలుతో కలిపినప్పుడు, దాని సువాసన బయిటికి వస్తుంది కాబట్టి దాల్చిని యొక్క తాజాతనం చాలా ముఖ్యం.
ఇప్పటివరకు దాల్చిన ఎక్కువగా ఉపయోగించడం వలన, ఏ విధమైన శాశ్వత హానికరమైన ప్రభావాలు కలగలేదు. అయితే డయాబెటిస్ లేదా కొలెస్ట్రాల్ మందులను తీసుకొనే రోగులు తమ తమ వైద్యులు వద్ద సలహా తీసుకోవడం మంచింది. దాల్చిన రక్త చక్కెర నియంత్రణలో మరియు భరువు తగ్గించడంలో ఒక ఉత్తమ ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చని నిర్ధారించపడింది.
మూలం: NaturalNews.com and http://care.diabetesjournals.org
రుమటాయిడ్ ఆర్థరైటిస్(కీళ్ళ వాతం) యొక్క ఎనిమిది సంకేతాలు మరియు లక్షణాలు
రుమటాయిడ్ ఆర్థరైటిస్ (RA ) లేదా వాత రోగం కీళ్ళను మరియు ఇతర శరీర భాగాలను భాదింప చేసే ఒక తీవ్రమైన ఆటో ఇమ్యూన్ వ్యాధి. కాని ఈ రోగాన్ని నిర్దారించడం చాలా కటినం. ఈ రోగం యొక్క లక్షణాలు ఇతర అనారోగ్యాలను అనుకరించవచ్చు లేదా లక్షణాల తీవ్రత ఎక్కువై తగ్గుతూ ఉండవచ్చు. ల్యాబ్ పరిశోధనల్లో సరైన ఫలితాలు లభించక పోవచ్చు. వ్యాధి ముదిరే వరకు ఎక్స్రేలు ఈ వ్యాధిని సూచించవు.
వాత రోగాన్ని నిర్ధారించే ఎనిమిది లక్షణాలు మరియు సూచనలు :
నయంకావడానికి లేదా మానడానికి కఠినమైన గాయాలు: వాతరోగం కారణంగా, వచ్చే కీళ్ళ నొప్పిను మీరు ఒక గాయం వల్ల అని అనుకోవచ్చు. ఉదాహరణకు నయంకాని బెనికిన చీలమండ. న్యూ యార్క్ సిటీలో స్పెషల్ సర్జరీ హాస్పిటల్ లో పనిచేస్తున్న సహాయక కీళ్ళవాతశాస్త్ర నిపుణురాలు, లిసా A. మండల్, MD, MHP, ఈ రోగం యువతలో సర్వసాధారణమని చెభుతున్నారు.” ఒక రోగికి సాకర్ ఆట ఆడిన మరుసటి రోజు మోకాలు వాచిపోయింది. రెండు ఆర్థ్రోస్కోపిక్ శస్త్రచికిత్సలు మరియు తీవ్ర ఫిసియోతేరపి చేయించుకున్న రోగులను నేను చూసాను. ఈ రోగులకు వాతరోగం ఉంది.”
చేతులలో తిమ్మిరి లేదా జలదరింపు: మణికట్టు మరియు చేతులలో జలదరించటం, వాతరోగం యొక్క లక్షణాలలో ఒకటి. దీన్ని కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అంటారు. ఈ వ్యాధి ఉన్న రోగులకు, వాపు కారణంగా చేతుల్లోకి వెళ్ళే నరాలు నొక్కబడి జలదరింపు ఏర్పడుతుంది. ఈ వ్యాధి లక్షణాలు సాధారణంగా రాత్రి సమయంలో తీవ్రంగా ఉంటాయి. ఈ లక్షణాలతో వైద్యుడును సంప్రదించినప్పుడు, వాతరోగం యొక్క ఇతర లక్షణాలు లేనందువల్ల (లేదా మీరు చెప్పనందువల్ల) మీకున్నది కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అని నిర్ధారించి, వైద్యుడు దీనికి సంభంధమైన చికిత్సను మాత్రము మీకివ్వడం జరుగుతుంది.
పాదాల రోగ సమస్య: నొప్పి లేదా వాపు వంటి వాతరోగం సంభందిత లక్షణాలు తరచుగా కనపడే ప్రాంతం ముందరికాలు. ఈ సమస్యున్న మహిళలు హీల్సున్న చెప్పులు ధరించడం ఆపేసి నొప్పి ఉపశమనం కొరకు పాదనిపుణుడను సంప్రదిస్తూ ఉంటారు. వాతరోగం ఉన్న కొంతమంది రోగులు, ప్లాంటార్ ఫేసిఐటిస్ (అరికాలిలో మడమ వద్దనున్న కణజాలంలో వాపు కారణంగా కలిగే సమస్య) కారణంగా వచ్చే మడమ నొప్పితో భాధపడుతుంటారు.
కంటి సమస్యలు: వాతరోగం ఉన్న రోగులలో జగ్రెన్స్ సిండ్రోమ్ అన్న ఒక కంటి సమస్య వచ్చే ప్రమాదముంది. ఈ సమస్యున్న రోగులకు, గ్రంధులలో ఏర్పడే వాపు కారణంగా కళ్ళు , నోరు, ముక్కు, గొంతు, లేదా చర్మం వంటి ప్రాంతాలు పొడిగా మారి మంట కలిగిస్తాయి. ఈ సమస్య వాతరోగం ప్రారంభమైన వెంటనే రావచ్చు, అయితే రోగులకు ఈ ఒక్క లక్షణం మాత్రముండే అవకాశం లేదు. పొడి కళ్ళ సమస్యున్న అనేక రోగులు కారణం కనుగొనేందుకు ఒక కంటి వైద్యుడును సంప్రదిస్తుంటారు. అయితే, డాక్టర్ మండల్, మనము ఏ వైద్యుడి వద్దకు వెళ్లినప్పడికి మనకున్న ఇతర రోగ లక్షణాలను వైద్యుడికి తెలపడం చాలా ముఖ్యమని చెబుతున్నారు.
కీళ్ళ నొప్పులు: కీళ్ళ నొప్పి వాతరోగం యొక్క ప్రధానమైన లక్షణాలలో ఒకటి. ఈ సమస్యకి కారణాలు అధికశ్రమ లేదా ఆస్టియో ఆర్త్రైటిస్ అని రోగులు అనుకుంటూ ఉంటారు. ఈ సమస్యను ఫైబ్రోమైయాల్జియా లేదా క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ (నిరంతరం ఉండే అలసట) అని కూడా తప్పుగా నిర్ధారణ చేయవచ్చు. వాతరోగం కారణంగా కలిగే కీళ్ళ నొప్పులు తాత్కాలికమైనవి కావు. ఈ నొప్పి సాధారణంగా ఒక వారం కంటే ఎక్కువ కాలం ఉంటుంది. ఒకటే సమయంలోరెండు చేతులు, పాదాలు , మోకాళ్ళు మరియు చీలమండలలో నొప్పి ఉండవచ్చు. ఈ నొప్పి ఒక వారం కన్నా ఎక్కువ కాలం ఉండవచ్చు.
ఉదయం వేళ కీళ్లలో భిగువు: రుమటాయిడ్ ఆర్థరైటిస్వా లేదా వాతరోగం యొక్క మరొక లక్షణం ఉదయం కీళ్లలో భిగువు సమస్య. మళ్ళీ, ఈ లక్షణం కూడా ఆస్టియో ఆర్థరైటిస్ వ్యాధిలో ఉండే ఒక సాధారణమైన సమస్య. అయితే, రెండింటి మధ్య వ్యత్యాసం ఏమిటంటే, ఆస్టియో ఆర్థరైటిస్ నొప్పి సాధారణంగా ఒక అరగంటలో తగ్గిపోతుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ కారణంగా ఏర్పడిన భిగువు తగ్గడానికి ఎక్కువ సమయం పడుతుంది. సరైన వ్యాయాయం చేయడం ద్వారా ఈ నొప్పి కొంతవరకు తగ్గుతుంది.
కీళ్ళు కదలకపోవడం: వాతరోగం ఉన్న రోగులలో కొన్నిసార్లు కీళ్ళు కదలకపోవడం సమస్య ఉండవచ్చు ప్రత్యేకించి మోకాలి మరియు మోచేతి కీళ్ళు. కీళ్ళ చుట్టూ ఉన్న స్నాయువులు యొక్క వాపు కారణంగా, కీళ్లలో కదలిక ఉండదు. దీని కారణంగా మోకాలి వెనుక తిత్తులు ఏర్పడి కదలికను నిరోధిస్తాయి. ఈ లక్షణం మోకాలి కీళ్లలో ఏర్పిడిన గాయం కారణంగానని తప్పుగా అనుకునే అవకాశముంది.
బుడిపెలు: వాతరోగం వల్ల ప్రభావిత కీళ్ళ దెగ్గర బుడిపెలు రావచ్చు. ఇవి తరచుగా మోచేతి వెనుక లేదా కళ్ళలో వస్తాయి. ఈ బుడిపెలు వాతరోగం భాగా ముదిరినప్పుడు కనిపిస్తాయి. ఈ లక్షణం గౌట్ అన్న మరొక రకమైన ఆర్థరైటిస్ సమస్యలో కూడా కనిపిస్తుంది.
మూలం: Health.com