Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

చికిత్సా నిపుణుల వివరాలు 11380...India


ప్రాక్టీషనర్ 11380..ఇండియా  వైబ్రియానిక్స్ ఉపయోగించి కూరగాయలను పండించడం గురించి నా అనుభవాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. 

సొరకాయ(బాటిల్ గార్డ్):  

మాకు చక్కగా శుభ్రంచేసిన పెరడు ఉంది. ఇందులో కూరగాయల పెంపకం కోసం18’ X15’ స్థలం కూడా ఉంది. నేను అక్కడ సొరకాయ పాదులను  పెంచాలని నిర్ణయించుకున్నాను. నేను యాంటి ఫంగస్ కాంబోతో ప్లాంట్ టానిక్ ఇలా తయారుచేశాను 
CC1.2 Plant tonic + CC21.7 Fungus, 5 గోళీలు ఒక బకెట్ నీటిలో

నేను ప్రతి రెండు వారాలకు ఒకసారి అన్ని మొక్కలకు నీరు పోసాను. నేను అన్ని మొక్కలతో మాట్లాడుతూ వాటి మృదువైన ఆకులను తాకి “సాయిరాం అని ప్రేమగా అంటూ మంచి ఫలితాలు ఇవ్వాలని చెప్పాను. 

సొరకాయలు తీగలు త్వరగా పెరిగి పిందెలు వేయడం ప్రారంభమైంది. 2014 ఏప్రిల్ మధ్యలో, నాటిన విత్తనాలు నుండి మొక్కలు 2014 మే నెల చివరినాటికి, సొరకాయ పిందెలు ఇవ్వడం ప్రారంభించాయి. దీని యొక్క పుష్పగుచ్చాలు పొడవుగా మరియు మృదువుగా పెరిగాయి. మేమున్న ఇంటికి పైన మరియు పక్కన నివసించిన వారు సొరకాయలను క్రమం తప్పకుండా చూస్తూ ఇవి ఇంత వేగంగా మరియు పొడవుగా ఎదగడానికి గల రహస్యం ఏమిటి? అని నన్ను అడగడం ప్రారంభించారు. కొన్ని సొరకాయలు 62 సెంటీమీటర్ నుండి 70 సెంటీమీటర్ల పొడవు (పైన మరియు తరువాత చిత్రాల్లో చూడండి) ఉండడమే కాక  చాలా మృదువుగా ఉండేవి. సొరకాయను సుతారంగా గోటితో గిచ్చినప్పుడు దాని గుండా రసం బయటికి రావడం ప్రారంభమైంది!.   

పెద్దవైన సొరకాయలను నా ఇరుగుపొరుగు వారికి మరియు స్నేహితులకు పంచి పెట్టాను.

ఈ సొరకాయతో చేసిన వంటకాలు  చాలా రుచికరంగానూ మరియు కూరగాయలు మృదువుగా ఉన్నాయని వారు పేర్కొన్నారు.

నేను ప్లాంట్ టానిక్ గురించి వైబ్రేషన్స్ గురించి వారికి చెప్పాను.

ఆ తర్వాత కొంత మంది మహిళలు నా నుండి నివారణలు పొంది తమ సొంత కూరగాయల తోటలలో దీన్ని ఉపయోగించడం ప్రారంభించారు.

ముల్లంగి ,టర్నిప్ (ఎర్ర ముల్లంగి) మరియు పాలకూర

నేను నా పెరటి తోటలో ముల్లంగి మరియు పాలకూరను పెంచడానికి వైబ్రియానిక్స్ ఉపయోగించాను. మరోసారి అదే నివారణ ను సిద్ధం చేశాను:
# 1.2 Plant tonic + CC21.7 Fungus, బకెట్ నీటిలో 5 గోళీలు  

నెలకొకసారి మొక్కలపై ఈ నీళ్లు పోస్తూ సాయిరాం అని దైవనామమును స్మరించే దానిని. నేను ఈ మిశ్రమాన్ని  స్ప్రే బాటిళ్లలో కూడా నిల్వచేసి వారానికి ఒకసారి మొక్కలపై చల్లుతూ ఈ మొక్కలతో మాట్లాడుతూ ఉండే దానిని.

 ఈ పటంలో చూపిన విధంగా పాలకూర ఆకులు వెడల్పుగా పచ్చగా పెరిగాయి. టర్నిప్ దుంపలు చాలా లావుగా మరియు గుత్తులుగా పెరిగాయి. (మధ్యలో చిత్రాన్ని చూడండి. ముల్లంగి దుంపలు మృదువుగా పొడవుగా పెరిగాయి. అందులో చాలా వరకూ 42 సెం.మీ. పొడవు కూడా పెరిగాయి(కుడి వైపు చిత్రం చూడండి). పచ్చి ముల్లంగి లేత కొబ్బరి వలె రుచిగా ఉన్నాయి. వాటిని రుచి చూసిన వారంతా ఎంతో ఇష్ట పడ్డారు

మునుపటి వలనే ఈ ఆర్గానిక్ వైబ్రో కూరగాయలను కూడా  చుట్టుపక్కల వారికి పంచగా వీటితో తయారుచేసిన కూరలు ఎంతో రుచికరంగా ఉన్నాయని వారు తెలిపారు

 

 


పంచుకోదగిన దృష్టాంతములు