అజీర్ణం, క్లమిడియా, రుతువిరతి మరియు నోటిలో బొబ్బలు 11572...India
2015 ఏప్రిల్ 29న ఒక 49 ఏళ్ళ మహిళ గత మూడు సంవత్సరాలుగా భాదపడుతున్న అనేక రోగ సమస్యలతో, అభ్యాసకురాల్ని సంప్రదించింది. ఈమెకున్న సమస్యలు: అజీర్ణం, కడుపు ఉబ్బరం, ఆహార ఎలేర్జీలు, క్లమిడియా మరియు రుతువిరతి కారణంగా వజిన పొడిగా ఉండడం, శరీరంలో హటార్తుగా పెరిగే ఉష్ణం మరియు కున్గుపాటు.
ఈమెకు ఆహారం తీసుకున్న వెంటనే నోటిలో బొబ్బలు వచ్చేవి. ఆహారంలో ఉప్పుని తప్ప వేరే ఏ పదార్థాన్ని చేర్చిన ఈమెకు నోటిలో బొబ్బలు వచ్చేవి. అజీర్ణ సమస్య కారణంగా ఈమెకు తలనొప్పి మరియు వాంతులు సమస్య కూడా ఉండేది. ఈమె అనేక అల్లోపతి మందులు వాడినప్పడికి ఫలితం లభించలేదు. ఈ పేషంటుకు ఈ క్రింద వ్రాసిన మందులివ్వడం జరిగింది
మలభద్ధకమ్, క్లమిడియా మరియు రుతువిరతి సమస్యలకు:
#1. CC4.4 Constipation + CC8.5 Vagina & Cervix + CC8.6 Menopause…TDS
కడుపుబ్బరం మరియు నోటిలో బొబ్బలు సమస్యకు:
#2.CC4.5 Ulcers + CC4.10 Indigestion + CC11.5 Mouth infections + CC21.2 Skin infections + CC8.1 Female tonic…TDS
నోటిలో బొబ్బలుకు, పై పూత:
#3. CC11.5 Mouth infections + CC21.2 Skin infections…as needed
ఈ మందులు తీసుకున్న పది రోజులకి పేషంటుకు చాలా ఉపశమనం కలిగింది. నోటి బొబ్బలు చాలా వరకు తగ్గిపోయాయి. ఇతర సమస్యలలో 20% వరకు ఉపశమనం కలిగింది.
ఈమెకున్న ఎలర్జీ సమస్యకు మందు ఇవ్వడం జరిగింది:
#4. CC4.10 Indigestion…as needed
రెండు వారాలలో ఈమెకున్న అజీర్ణ సమస్య పూర్తిగా నయమైంది. క్రమక్రమంగా ఈమెకున్న ఇతర సమస్యలన్నీ కూడను చికిత్స ప్రారంభించిన 8 వారాలికి పూర్తిగా తగ్గిపోయాయి. ఈమె ఆహారంలో కారం మరియు మశాలాలు చేర్చి తీసుకున్నప్పుడు నోటిలో బొబ్బలు వస్తున్నాయి. ఈమె వైబ్రియానిక్స్ మందుల్ని తీసుకోవడం ఇప్పడికి కొనసాగిస్తోంది. ఏ విధమైన దుష్ప్రభావాలు లేనందువల్ల, వైబ్రియానిక్స్ చికిత్స తీసుకోవడం ఈమెకు ఎంతో సౌఖర్యంగా ఉంది.