దీర్ఘ కాలిక గొంతు నొప్పి, చీలమండ నొప్పి మరియు హాట్ ఫ్లష్లు (రుతువిరతి సమయంలో శరీరంలో పెరిగే వేడి) 11964...India
ఒక 54 ఏళ్ళ మహిళ, గొంతులో అంటువ్యాధి, చీలమండ నొప్పి మరియు అప్పుడప్పుడు శరీరంలో వేడి పెరగడం(రుతువిరతి) సమస్యలతో, అభ్యాసకుడిని సంప్రదించింది. ఈ పేషంటు, గత ఇరవై ఏళ్ళగా దగ్గు, గొంతు నొప్పి, గొంతులో దురద మరియు బొంగురు గొంతు సమస్యలతో భాదపడుతోంది. ఆహారం తీసుకున్న తర్వాత, ఈమెకు గొంతులో ఒక గడ్డ ఉన్నట్లుగా అనిపించేది. ఈమెకు పుల్లని పదార్థాల ఎలర్జీ ఉండేది. ఈ మహిళ, గొంతులో సమస్య తీవ్రమైనప్పుడల్లా అల్లోపతి మందులు(ఆంటి ఎలర్జిక్) తీసుకునేది. ఈ మందుల వల్ల, ఈమెకు తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలిగేది. ఈమెకు గత నాలుగేళ్ళగా, అరికాలి ఫేసియైటిస్ కారణంగా చీలమండ నొప్పి ఉండేది. ఈ సమస్యకు కూడా ఈమె, అల్లోపతి మందులు తీసుకునేది. గత రెండేళ్ళగా ఈమెకు హాట్ ఫ్లష్ల(రుతువిరతి సమయంలో శరీరంలో వేడి పెరగడం) సమస్య కూడా మొదలయింది. ఇన్ని వ్యాధి సమస్యల కారణంగా, ఈమె మానసికంగా చాలా కుంగిపోయింది. వైబ్రియానిక్స్ చికిత్స ప్రారంభించే సమయంలో ఈమె వేరే ఏ మందులు తీసుకోవట్లేదు. 2014 డిసంబర్ 10న, ఈమెకు ఈ క్రింద వ్రాసిన మందులు ఇవ్వబడినాయి
అరికాలి ఫేసియైటిస్, దగ్గు మరియు హాట్ ఫ్లష్ల సమస్యలకు:
#1. NM3 Bone I + NM6 Calming + NM8 Chest + NM10 Climacteric + NM32 Vein Piles + NM36 War...TDS
నొప్పి మరియు దీర్ఘ కాలిక గొంతు సమస్యలకు:
#2. NM59 Pain + NM71 CCA...6TD
ఏడో రోజున, ఈ పేషంటుకు చీలమండ నొప్పి మరియు హాట్ ఫ్లష్ల సమస్య 75% వరకు తగ్గి, గొంతు సమస్య 50% వరకు తగ్గింది. #2 మందు మోతాదును TDS కి తగ్గించడం జరిగింది. ఒక నెల రోజులలో, ఈ మహిళకు ఆరోగ్యం 80% వరకు మెరుగు పడడంతో చాలా ఆనందంగా కనిపించింది. ఆమెకున్న నొప్పి మరియు గొంతులో గడ్డ ఉన్న స్పృహ కూడా తగ్గింది. అభ్యాసకుడు ఈ దశలో, ఈ పేషంటు కు #1 మరియు #2 మందులను మార్చివ్వడం జరిగింది. ఈమెకు కొత్తగా ఇచ్చిన కాంబోలో, NM8 Chest and NM71 CCA ఆపి, ఈమెకున్న దీర్ఘకాలిక సమస్యలకు మరియు బలానికి, NM2 Blood and SM40 Throat చేర్చివ్వడం జరిగింది:
#3. NM2 Blood + NM3 Bone I + NM6 Calming + NM10 Climacteric + NM32 Vein Piles + NM36 War + NM59 Pain + SM40 Throat...TDS
రెండు నెలల తర్వాత, నొప్పి తగ్గడంతో పాటు, ఈమెకున్న గొంతు సమస్యలు కూడా తగ్గిపోయాయి. హాట్ ఫ్లష్ల సమస్య కూడా చాలా వరకు నయమైంది. పేషంటుకు నొప్పి మరియు ఇన్ఫక్షన్ తగ్గడంతో, NM2 Blood, NM36 War and NM59 Pain ఆపడం జరిగింది. ఇతర దీర్ఘ కాలిక సమస్యలకు ఈ మందు ఇవ్వడం జరిగింది:
#4. NM3 Bone I + NM6 Calming + NM10 Climacteric + NM32 Vein Piles + SM40 Throat...TDS
చికిత్స ప్రారంభించిన మూడు నెలల్లో, ఈ పేషంటుకున్న రోగ లక్షణాలన్నీ తొలగి, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందింది. ఇప్పుడు ఈ మహిళ, పుల్లని పళ్ళను కూడా తినగలుగుతోంది. 2015 జూలై కి, ఈమెకు ఏ విధమైన రోగ లక్షణాలు లేవు. ప్రస్తుతం మందును,రోజుకి ఒకసారి(OD) తీసుకుంటోంది. ఈమెకు కలిగిన ఉపశమనాన్ని చూసి, ఈమె కుటుంభ సభ్యులందురు కూడను, వైబ్రియానిక్స్ చికిత్సను తీసుకోవడం ప్రారంభించారు.
పేషంటు యొక్క వ్యాఖ్యానం:
నేను దాదాపు ఇరవై సంవత్సరాలు, తీవ్రమైన గొంతు సమస్యలతో భాధపడేదాన్ని. నాకు దగ్గు ఎక్కువగా వస్తుండేది మరియు నాకు, ప్రతిసారి ఆహారం తీసుకున్న తర్వాత గొంతులో ఏదో ఒక గడ్డ/ముద్ద ఉన్నట్లు అనిపించేది. కొంచం మాట్లాడినా, దగ్గు వచ్చేది. క్రమంగా నా గొంతు బొంగురు పోయి, పుల్లని పదార్థాలు, కోల్డ్ డ్రింక్లు తీసుకోవడం మానాల్సి వచ్చింది. అల్లోపతి మందులు తీసుకోవడం వల్ల తాత్కాలికంగా మాత్రమే ఉపశమనం కలిగేది. ఇంతే కాకుండా, నాకు అరికాలి ఫేసైటిస్ సమస్య కారణంగా, చీలమండలో తీవ్రమైన నొప్పి ఉండేది. ఈ సమస్యలతో పాటు రెండేళ్ళ క్రితం, హాట్ ఫ్లష్ల సమస్య మొదలవ్వడంతో, చాలా ఆందోళన పడ్డాను, మానసికంగా కుంగిపోయాను.
2014 డిసంబర్ 10 న, నా భర్త ద్వారా, ఈ మహత్తరమైన సాయి వైబ్రియానిక్స్ చికిత్సను బహుమతిగా పొందాను. ఆ రోజునుండి నా జీవితంలో, చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. గత ఇరవై ఏళ్ళుగా, నేనెప్పుడు ఇంత ఆనందంగా లేను. నేను ఈ చికిత్సను ప్రారంభించి ఆరు నేలలయ్యాయి. నేనిప్పుడు ఎంతో స్వేచ్చగా నాకిష్టమైన కోల్ డ్రింకులు మరియు పుల్లని పదార్థాలు ఆరగించా గలుగుతున్నాను. చీలమండ నొప్పి తగ్గడంతో నేను అన్ని రకాల పాద రక్షలు ధరిస్తున్నాను. నేను ప్రస్తుతం, మందులు తయారు చేయడం ద్వారా, సాయి వైబ్రియానిక్స్ సేవా కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నాను. మా కుటుంభ సభ్యులందరు కూడను వైబ్రియానిక్స్ చికిత్సనే తీసుకుంటున్నారు. నేను ఈ చికిత్స విధానంలో శిక్షణ పొంది, అభ్యాసం చేయాలని అనుకుంటున్నాను.