పరీక్షల ఒత్తిడి 02859...India
ఒక 17 ఏళ్ళ అమ్మాయి తల్లి తండ్రులు, తమ కుమార్తె మీదున్న దిగులుతో అభ్యాసకురాల్ని 2014 జనవరిలో సంప్రదించారు. వీళ్ళ కుమార్తె చదువులో మంచి ప్రభావశాలి. కాని పన్నెండో తరగతి పరీక్షలు సమీపిస్తున్న కారణంగా, ఈ అమ్మాయికి ఒత్తిడి కలిగి తన ఆత్మవిశ్వాసాన్ని కోలిపోయింది. [ఎడిటర్ వ్యాఖ్యానం: ఈ పరీక్షలు విశ్వవిద్యాలయ ప్రవేశం కొరకు అత్యంత ప్రతిస్టాత్మకంగా భారతీయ సెకండరి స్కూల్ విధ్యార్దులుకు నిర్వహింపబడుతాయి] ఈ కారణంగా ఆమె జ్ఞ్యాపక శక్తి తక్కువై పరీక్షలు అనుకున్న విధంగా వ్రాయలేకపోయింది. ఈమెకు ఈ మందుల్ని ఇవ్వడం జరిగింది:
NM5 Brain TS + BR4 Fear + BR6 Hysteria + SM1 Removal of entities + SM2 Divine protection + SM6 Stress + SM9 Lack of confidence + SM41 Uplift + SR218 Base chakra + SR222 Sacral chakra + SR227 Coral…6TD in water
ఒక వారంలో తల్లి తండ్రులు తమ కుమార్తె మానసిక స్థితిలో మెరుగు ఏర్పడినట్లు తెలియచేసారు. ఈ విద్యార్ధి, ఒత్తిడి తగ్గడంతో, తిరిగి ఒక మంచి ప్రభావశాలిగా మారింది. మందుల మోతాదును ఆపై 15 రోజులకు, TDS కి తగ్గించాను. ఈ విద్యార్ధి పూర్తిగా నయం కావడంతో మోతాదును రోజుకి ఒక సారి (OD) కి తగ్గించాను. ఈ మోతాదు మార్చులో పరీక్షలు పూర్తయ్యే వరకు కొనసాగింది. ఈ విద్యార్ధి పరీక్షలు ఉన్నత రీతిలో వ్రాసి తన జీవితాన్ని ఆత్మవిశ్వాసంతో కొనసాగిస్తోంది.