కాళ్ళపై కురుపులు మరియు దురద 11570...India
2015 ఏప్రిల్ 27 న, ఒక పేద కుటుంభానికి చెందిన ఒక 11 ఏళ్ళ బాలుడు, కాళ్ళ పై కురుపులు మరియు దురద సమస్యతో అభ్యాసకురాల్ని సంప్రదించడానికి తీసుకురాబడ్డాడు. ఈ బాలుడు, ఈ సమస్యతో గత ఆరు నెలలుగా భాధపడుతున్నాడు. ఒక అల్లోపతి డాక్టర్ ఇంజక్షేన్స్ ఇవ్వడంతో ఈ సమస్య తగ్గుతుందని వాగ్దానం చేసారు కాని, సఫలితం లభించలేదు. ఈ పేషంటుకు ఈ మందులు ఇచ్చారు:
#1. CC12.2 Child tonic + CC21.2 Skin infections + CC21.11 Wounds & Abrasions…TDS
#2. CC21.2 Skin infections + CC21.11 Wounds & Abrasions …BD కొబ్బరి నూనెలో పై పూతకు
15 రోజుల తర్వాత 50% వరకు తగ్గి, ఆపై నెల రోజుల తర్వాత 90% ఉపశమనం కలిగింది.
దీని తర్వాత, ఈ పేషంటు వేసవి సెలవులకు తన గ్రామానికి వెళిపోవడంతో, చికిత్స తీసుకోవడం ఆగిపోయింది. జూన్ 28 న ఈ పేషంటు ను తిరిగి అభ్యాసకురాల్ని సంప్రదించడానికి తీసుకు వచ్చారు. ఈ రోగి కుడి కాలిపిక్క భాగములో ఉన్న కురుపులు మరియు దురద తగ్గిపోయాయి. కాని ఇతని కుడి కాలి తొడపై మరియు ఎడమ కాలిపై కొత్తగా మొదలైన కురుపులు కనబడ్డాయి(కింద ఇవ్వబడిన ఫొటోస్ చూడండి)
ఈ పేషంటుకు #2 చర్మంపై పూయడానికి మరియు ఈ కింద వ్రాసిన మందులు ఇవ్వడం జరిగింది:
#3. CC12.2 Child tonic + CC17.2 Cleansing + CC21.2 Skin infections + CC21.11 Wounds & Abrasions…TDS
ఈ చికిత్స తీసుకున్న ఆరు రోజుల తర్వాత ఈ బాలుడుకి పుల్ అవుట్ (తీసివేత) వచ్చింది. పుల్ అవుట్ లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పటికీ, భరించగాలిగేలా ఉండడంతో చికిత్సను కొనసాగించారు.దీని తర్వాత, ఈ బాలుడుకి చర్మ అంటువ్యాధి నెమ్మదిగా తగ్గడం మొదలయింది. ఆరోగ్యరక్షణ మరియు పరిశుద్ధత కొరకు,ఈ బాలుడు వాడుతున్న టవల్ను మరియు దుస్తులను, క్రిమినాశక ద్రవ్యం వేసిన నీటిలో ఉతకడం మాత్రమే కాకుండా విడిగా ఉంచమని పేషంటు తండ్రికి సలహా ఇవ్వబడింది.
చికిత్స ప్రారంభించిన మూడు నెలల తర్వాత, 2015 ఆగష్టు 2న ఈ బాలుడుకి పూర్తి ఉపశమనం కలిగింది. అంటువ్యాధి కారణంగా రంగు మారిన ఇతని చర్మం సాధారణ రంగులో కనబడింది.(కింద ఇచ్చిన ఫోటోను చూడండి) ఈ పేషంటుకు #1 మరియు #2 మరో నెల రోజులు తీసుకోమని చెప్పబడింది.
అభ్యాసకురాలి వ్యాఖ్యానం:
ఇంత ఉత్తమమైన సేవ చేసే అవకాశాన్ని ప్రసాదించినందుకు నా కృతజ్ఞ్యతలు.