డయాబెటిస్ 11573...India
ఒక ఉత్సాహమైన 47 ఏళ్ళ మహిళ, ఈ క్రింద వ్రాసిన పలు సమస్యలతో అభ్యాసకుడిని సంప్రదించింది
18 ఏళ్ళ క్రితం హోమియోపతి మందుల మోతాదు ఎక్కువవ్వడం వలన కలిగిన రక్తశ్రావం (మెదడులో). అదృష్టవశాత్తూ ఈ సమస్యనుండి కోలుకుంది. ఇది జరిగిన ఏడాది తర్వాత ఈమ్కు బినయిన్ సర్వయికల్ ట్యూమర్ ఉందని నిర్దారించబడింది. ఈమె, కాళ్ళు మరియు చేతులలో వాపు, నొప్పులు మరియు తిమ్మిరివాయువు వంటి సమస్యలకు అల్లోపతి మందులు ఉపయోగిస్తోంది. 15 ఏళ్ళ క్రితం, ఈమెకు డయాబెటిస్ ఉందని తెలియడంతో మరియు ఈమె బ్లడ్ షుగర్ స్థాయి అదుపులో లేనందువల్ల ఇన్స్యులిన్ తీసుకుంటోంది. ఈమెకు ఈ మందులు ఇవ్వడం జరిగింది:
డయాబెటిస్ కు:
#1. CC6.3 Diabetes + CC12.1 Adult tonic…TDS
12 రోజుల చికిత్స తర్వాత (15 ఏప్రిల్ 22న), పదిహేనేళ్ళలో మొదటి సారిగా ఈమె బ్లడ్ షుగర్ నియంత్రిత స్థాయిలో ఉందని అభ్యాసకునికి తెలియచేసింది. దీని కారణంగా ఈమె తీసుకుంటున్న ఇన్స్యులిన్ డోస్ను డాక్టర్ తగ్గించారు. దీని తర్వాత పేషంటుకు ఈ క్రింద వ్రాసియున్న మందులివ్వడం జరిగింది
వాపు, నొప్పి మరియు తిమ్మిరివాయువు సమస్యకు:
#2. CC3.7 Circulation + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue…TDS
2015 ఆగస్ట్ కి ఈ పేషంటుకు వాపు మరియు తిమ్మిరివాయువు సమస్యనుండి పూర్తి ఉపశమనం కలిగింది. దీని కారణంగా #2 మందును ఆపడం జరిగింది. ప్రస్తుతం ఈ పేషంటు, బ్లడ్ షుగర్ నియంత్రణ కొరకు #1 మందునుతీసుకోవడం కొనసాగిస్తోంది.