దివ్య వైద్యుని దివ్య వాణి
Vol 12 సంచిక 4
జూలై / ఆగస్ట్ 2021
ఆహారం తిన్న తరువాత, మీరు తినడానికి ముందు కూర్చున్నంత తేలికగా లేవగలగాలి. ఇది ఆహారం తినడానికి సాత్విక మార్గం. మీరు ఆహారం కోసం కూర్చునే ముందు చాలా చురుకుగా మరియు తేలికగా ఉంటారు. కానీ ఆహారం తిన్న తర్వాత, కనీసం పైకి లేవడానికి కూడా మీకు కష్టమవుతుంది ఎందుకంటే కడుపులో అధికంగా ఆహారం లోడ్ కావడం వలన, ఇది బద్ధకానికి (తామసిక ప్రవృత్తి)దారి తీస్తుంది. మీకు ఇంకా మరి కొంచెం ఎక్కువ తినవచ్చని అనిపించినప్పుడే తినడం మానేయండి”
...సత్యసాయిబాబా, “పరిపూర్ణ జ్ఞానం నుండి అపరిమితమైన ఆనందం లభిస్తుంది” స్వామి వాణి 1996 సెప్టెంబర్ 1 http://sssbpt.info/ssspeaks/volume29/d960901.pdf
సేవను ప్రేమ, జ్ఞానము మరియు శ్రద్ధతో అందించినప్పుడు, అది వ్యక్తులను దైవత్వానికి దగ్గరగా మరియు ప్రేమపాత్రులుగా చేస్తుంది, ఎందుకంటే అది దేవుని దయను తనలోకి ఇమిడ్చుకుంటుంది.
… సత్యసాయిబాబా, “వైద్య వృత్తి” దివ్య వాణి, సెప్టెంబర్ 1980 http://www.sssbpt.info/ssspeaks/volume14/sss14-53.pdf