Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

Vol 16 సంచిక 4
జులై / ఆగష్టు 2025
ముద్రింప తగిన వార్తాలేఖ


పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి

డా. జిత్. కె అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి

ప్రియమైన ప్రాక్టీషనర్లకు,

అత్యంత పవిత్రమైన గురుపూర్ణిమ పర్వదినం సమీపిస్తున్న ఈ శుభవేళలో నా హృదయం కృతజ్ఞతా భావంతో, గురుదేవుని పట్ల భక్తి శ్రద్ధలతో నిండిపోతోంది. వరుసగా మూడు సంవత్సరాల పాటు, వైబ్రియానిక్స్ కుటుంబం తరఫున సాయి కుల్వంత్ హాల్లో స్వామివారికి ప్రేమపూర్వకంగా కేక్ సమర్పించే భాగ్యాన్ని ప్రసాదించడమే కాకుండా, స్వయంగా దానిని కోసి తమ అనుగ్రహాన్ని కురిపించిన ఆ పవిత్ర క్షణాలు నా మనస్సులో మధుర స్మృతులుగా చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఆ దివ్యానుభూతులు వైబ్రియానిక్స్ సేవపై స్వామివారి ఆశీస్సులకు ప్రత్యక్ష సాక్ష్యాలుగా మా హృదయాల్లో చిరకాలం నిలిచి ఉంటాయి. ఈ పవిత్ర గురుపూర్ణిమ సందర్భంగా, అర్ధ శతాబ్దానికి పైగా క్రితం గురుపూర్ణిమ సందేశంలో స్వామివారు ప్రసాదించిన ఆ శాశ్వతమైన మార్గదర్శక బోధనలను మనమందరం మరోసారి స్మరించుకుందాం:

మీ ప్రతి మాటను ప్రేమతో నింపండి. మీ ప్రతి కార్యాన్ని ప్రేమతో నింపండి. మీరు ఎక్కడ ఉన్నా, పని చేస్తున్నా, దానిని ఆరాధనగా, సమర్పణగా, మీకు ప్రేరణనిచ్చే, సాక్షిగా నిలిచే, సర్వాధిపతియైన భగవంతుని మహిమను చాటే పవిత్ర కార్యంగా చేయండి. మీరు పని చేసినా, అందులో ఏమాత్రం మిగులు ఉండకూడదు; పనినీ అసంపూర్ణంగా విడిచిపెట్టకండి. సమస్త కార్యాలను ఒకే దైవసేవగా భావించండి. మీరు చేసే ప్రతి కార్యాన్ని భగవంతుని పాదపద్మాలకు సమర్పించి, అహంకారమనే బంధం నుండి విముక్తం చేస్తే, కార్యఫలాలు మిమ్మల్ని బంధించవు. అప్పుడు మీరు స్వతంత్రులు, విముక్తులు; అదే మోక్షం.” … 29 జూలై 1969, ప్రశాంతి నిలయం, శ్రీ సత్య సాయి స్పీక్స్, సంపుటి 9

సేవ యొక్క అసలైన తత్త్వాన్ని—ప్రేమ, సమర్పణ, నిస్వార్థతలను ఆధారంగా చేసుకొని, చివరకు మోక్షానికి దారితీసే మార్గాన్ని—ఈ దివ్య వాక్యాలు ఎంత అందంగా ప్రకాశింపజేస్తున్నాయో మనం గ్రహించవచ్చు. వైబ్రియానిక్స్ సేవలో ఉన్న మనకు, తయారు చేసే ప్రతి రెమెడీ, సేవ చేసే ప్రతి రోగి, భగవంతుని పాదపద్మాలకు సమర్పించిన పవిత్ర సేవేనని ఇవి దివ్యమైన స్మరణను కలిగిస్తున్నాయి.

గత రెండు నెలల కాలంలో, శతజయంతి కానుకగా సిద్ధం చేస్తున్న వైబ్రియానిక్స్ త్రయం (మూడు గ్రంథాలు) కోసం ఎంతో పెద్ద సంఖ్యలో రచనలు మాకు అందాయి. నిర్ణయించిన గడువు ముగిసినప్పటికీ, భారతదేశంలోని ప్రతి రాష్ట్రం నుండి, అలాగే వీలైనన్ని దేశాల నుండి ప్రాక్టీషనర్ల అనుభవాలు ఈ గ్రంథాలలో చోటు చేసుకోవాలని మా హృదయపూర్వక ఆకాంక్ష. మీ వద్ద ఇంకా కేసు చరిత్రలు, విశేష అనుభవాలు ఉన్నా, లేదా అలాంటి అనుభవాలు కలిగిన మరో ప్రాక్టీషనర్ మీకు తెలిసినా, దయచేసి వీలైనంత త్వరగా మమ్మల్ని సంప్రదించండి. స్వామివారి శతజయంతి సందర్భంగా ఈ మహత్తర సంకల్పాన్ని సాకారం చేయడానికి మా మూడు సంపాదక బృందాలు అంకితభావంతో నిరంతరం శ్రమిస్తున్నాయి.

అదేవిధంగా, మా పరిశోధనా బృందాన్ని మరింత విస్తరించి, బలోపేతం చేయాలని భావిస్తున్నాము. ఈ ముఖ్యమైన సేవా విభాగంపై ఆసక్తి కలిగిన ప్రతి ప్రాక్టీషనర్ని, తాము కేటాయించగల సమయం మరియు సేవా నిబద్ధతను స్పష్టంగా పేర్కొంటూ [email protected] కు పంపమని ఆహ్వానిస్తున్నాము. గత ముప్పై సంవత్సరాలకు పైగా అచంచలమైన అంకితభావంతో ఈ బాధ్యతను నిర్వహించిన మన ప్రస్తుత పరిశోధన విభాగాధిపతి ఇప్పుడు 92 సంవత్సరాల వయస్సులో ఉండి, ఈ బాధ్యత నుండి విశ్రాంతి తీసుకోవాలనే అభిలాషను వ్యక్తం చేశారు.

అందువల్ల, ఈ బాధ్యతను చేపట్టగల అంకితభావం, సామర్థ్యం మరియు ఆధ్యాత్మిక దృక్పథం కలిగిన ఒక ప్రాక్టీషనర్ని మేము కోరుకుంటున్నాము. ఈ బాధ్యతలో పరిశోధన ప్రాజెక్టులను గుర్తించి నిర్వహించడం, కాంబోలకు సంబంధించిన సందేహాలను పరిష్కరించడం, నిర్దిష్ట రెమెడీల ప్రభావాన్ని అంచనా వేసే అధ్యయనాలను రూపొందించడం వంటి కార్యక్రమాలు ఉంటాయి. అవసరమైన శిక్షణ అందించబడుతుంది. హోమియోపతి ప్రాథమిక సూత్రాలపై అవగాహనతో పాటు, అంతర్ప్రేరణ ఆధారంగా సరైన రెమెడీని ఎంపిక చేసే సామర్థ్యం ఉంటే అది అదనపు అర్హతగా పరిగణించబడుతుంది.

గత నెలలో మరో ఆధ్యాత్మికంగా ఉల్లాసభరితమైన సందర్భాన్ని మనమందరం అనుభవించాము. 2025 జూన్ 15న, శతజయంతి ఉత్సవాల సందర్భంగా శ్రీ సత్య సాయి మీడియా సెంటర్ ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం సామూహిక జప కార్యక్రమం నిర్వహించబడింది. ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది భక్తులు, వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్లు  ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో సాయి గాయత్రి జపంతో పాటు ప్రత్యేకంగా సిద్ధం చేసిన వైబ్రేషనల్ రెమెడీని కూడా ఉపయోగించారు. ఈ దివ్య కార్యక్రమం అంతరంగ శాంతిని పెంపొందించడమే కాకుండా, సామూహిక చైతన్యాన్ని బలోపేతం చేసి, ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక స్పందనలను ఉన్నత స్థాయికి చేర్చింది. మరిన్ని వివరాల కోసం “అదనంగా” విభాగాన్ని చూడండి.

ఇటీవల జూన్ 29న ప్రశాంతి నిలయంలో నిర్వహించిన ప్రపంచ వైద్య సదస్సు సందర్భంగా, శ్రీ సత్య సాయి సేవా సంస్థ (SSSSO) ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వైద్య సేవలలో భాగంగా వైబ్రియానిక్స్ శిబిరాలకు ప్రత్యేక గుర్తింపు లభించడం ఎంతో గౌరవకరమైన విషయం. వైబ్రియానిక్స్ కుటుంబం తరఫున, ఈ ప్రోత్సాహకరమైన గుర్తింపును ప్రసాదించిన మా ప్రియ భగవానునికి హృదయపూర్వక కృతజ్ఞతలు సమర్పిస్తున్నాను.

అంతిమంగా, మనందరినీ నిరంతరం నడిపిస్తూ, ప్రేమతో, మార్గదర్శకత్వంతో, అనుగ్రహంతో కాపాడుతున్న స్వామివారికి నా వినమ్ర హృదయపూర్వక కృతజ్ఞతలను సమర్పిస్తున్నాను.

సాయికి ప్రేమపూర్వక సేవలో,

డా. జిత్ కె. అగర్వాల్

బోదకాలు, ఫైలేరియా వల్ల కలిగిన కీళ్లవాతం 03560...India

68 సంవత్సరాల వయస్సు గల ఒక మహిళకు 2012లో రెండు కాళ్లు, రొమ్ములలో వాపు, జ్వరం, నొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించి బోదకాలు (లింఫాటిక్ ఫైలేరియాసిస్) ఉన్నట్లు నిర్ధారించారు. మొదటి 18 నెలల్లో వాపు క్రమంగా పెరుగుతూ వచ్చింది. అదనంగా, ప్రతి మూడు నెలలకు ఒకసారి జ్వరం, నొప్పి మళ్లీ మళ్లీ రావడం కొనసాగింది. వ్యాధి ప్రారంభమైనప్పటి నుంచే ఆమె అలోపతి చికిత్స తీసుకున్నారు. కుటుంబ సభ్యులందరూ ఆరు సంవత్సరాల పాటు మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (MDA) అనే నివారణ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీని వల్ల వ్యాధి మరింత తీవ్రమవకుండా, వాపు పెరగకుండా నియంత్రించగలిగారు. అయితే జ్వరం, నొప్పి వంటి పునరావృత లక్షణాలు మాత్రం తగ్గలేదు. దీంతో నిరాశ చెందిన ఆమె 2017లో చికిత్సను నిలిపివేశారు (కుటుంబ సభ్యులు మాత్రం కొనసాగించారు).

అదే సంవత్సరంలో ఆమెకు రెండు మోకాళ్లలో తీవ్రమైన నొప్పి ప్రారంభమై, ఫైలేరియల్ ఆర్థ్రైటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. వైద్యులు సూచించిన మందులు తీవ్రమైన ఎసిడిటీ, కడుపు అసౌకర్యాన్ని కలిగించడంతో, ఏడాది లోపే వాటిని కూడా నిలిపివేయాల్సి వచ్చింది.

ఒకసారి జ్వరం, కాళ్ల నొప్పితో తీవ్రంగా బాధపడుతున్న సమయంలో ఆమె వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్ ని సంప్రదించారు. ఆమె కాళ్ల చర్మం మందంగా, నల్లగా మారిపోయింది. నడవడం చాలా కష్టంగా ఉండటంతో ఇంట్లో కూడా వాకర్ సహాయంతోనే నడిచేవారు. తన వ్యాధి కారణంగా సమాజంలో ఎదురైన అపోహలు, నిర్లక్ష్యం వల్ల ఎవరినీ కలవడానికి కూడా ఇష్టపడక, తీవ్ర మానసిక వేదనలో ఉండేవారు.

17 డిసెంబర్ 2018న ఈ క్రింది రెమెడీలు ఇవ్వబడ్డాయి:

బోదకాలు కోసం:

#1. CC9.3 Tropical diseases + CC12.1 Adult tonic…6TD for three days followed by TDS

మోకాలి నెప్పి కోసం:

#2. CC15.1 Mental & Emotional tonic + CC18.5 Neuralgia + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue… మూడు రోజుల పాటు 6TD, అనంతరం TDS. అదేవిధంగా కొబ్బరి నూనెలో కలిపి రోజుకు రెండుసార్లు (BD) కాలుపైన నొప్పి వున్నచోట రాసుకోవాలని సూచించారు.

చికిత్స పురోగతి :

  • 15 ఫిబ్రవరి 2019: మోకాళ్ల నొప్పి 40% తగ్గింది. కొంత పరిమితితో నడవగలిగింది. జ్వరం, నొప్పి, అలసట మళ్లీ రాలేదు. మానసికంగా కూడా ప్రశాంతంగా అనిపించింది.
  • 20 జూన్ 2019: మోకాళ్ల నొప్పి 70% తగ్గింది. ఇంట్లో స్వయంగా నడవగలిగింది. కాళ్లు, రొమ్ముల వాపు 20% తగ్గింది.
  • 14 జనవరి 2020: నొప్పి పూర్తిగా తగ్గిపోయింది (అతిగా శ్రమించినప్పుడు మాత్రమే స్వల్ప మోకాలి నొప్పి ఉండేది). కాళ్ల చర్మం మృదువుగా, సాధారణ స్థితికి వచ్చింది. అయితే వాపులో మరింత తగ్గుదల కనిపించలేదు. రెమెడీ మోతాదును రోజుకు రెండుసార్లు (BD)కు తగ్గించారు.

జూన్ 2025 నాటికి, ఆమె రోజుకు రెండుసార్లు రెమెడీ కొనసాగించాలని స్వయంగా కోరుకుంటున్నారు. వాపు స్థిరంగా ఉన్నప్పటికీ, బయటకు రాసుకునే నూనెతో మర్దన చేయడం వల్ల ఉపశమనం కలుగుతోందని చెబుతున్నారు. ప్రస్తుతం ఇంట్లో ఎటువంటి సహాయం లేకుండానే నడవగలుగుతున్నారు. పొరుగువారిని కలవడం, సామాజిక కార్యక్రమాలకు హాజరవడం కూడా తిరిగి ప్రారంభించారు.

సంపాదకుల గమనిక:

ఎలిఫెంటియాసిస్ పూర్తిగా నయం చేయలేని వ్యాధిగా పరిగణించబడుతుంది; సాధారణంగా లక్షణాలను మాత్రమే నియంత్రించగలరు. ఈ కేసులో వైబ్రియానిక్స్ చికిత్స ద్వారా రోగి నొప్పి, నడవలేని పరిస్థితి నుండి విముక్తి పొంది, సౌకర్యవంతమైన జీవితం గడపగలుగుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.

 

మడమ ఎముక ముళ్లు (కాలకానెల్ స్పర్స్), గుండ్రటి మచ్చలుగా జుట్టు రాలడం 03560...India

50 సంవత్సరాల వయస్సు గల ఒక వ్యక్తి 2018 నుండి ఐదు సంవత్సరాలుగా రెండు మడమలలో కాల్కేనియల్ స్పర్స్ (మడమ ఎముకలపై ముళ్ల వంటి పెరుగుదల) వల్ల తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నారు. ప్రతి మడమలో సుమారు 18 మిల్లీమీటర్ల పరిమాణంలో ఒక స్పర్ ఉండేది. కాలక్రమేణా నొప్పి మరింత పెరిగి, నడవడం కష్టమై, కుంటుతూ నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రత్యేక ఆర్థోపెడిక్ పాదరక్షలు, చల్లని కాపడం (కోల్డ్ పేక్స్), పాద వ్యాయామాలు వంటి సాధారణ చికిత్సలు ఫలితం ఇవ్వలేదు. వైద్యులు సూచించిన నొప్పి నివారణ మాత్రలు, ఆయింట్మెంట్లు వాడేవారు. వాటి వల్ల 6–8 గంటలపాటు మాత్రమే సుమారు 80% ఉపశమనం లభించేది. అనంతరం మళ్లీ నొప్పి ప్రారంభమయ్యేది.

ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడైన ఆయన చివరకు ఆటకు పూర్తిగా దూరం కావాల్సి వచ్చింది. ఇది ఆయన మానసిక స్థితిపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. 2023లో వైద్యులు కార్టిసోన్ ఇంజెక్షన్లు, శస్త్రచికిత్స చేయించుకోవాలని సూచించారు. అయితే ఆయన వాటిని అంగీకరించకుండా ప్రత్యామ్నాయ వైద్య విధానాల వైపు మొగ్గుచూపారు.

అదే సమయంలో, ఏడాదికిపైగా ఆయన గడ్డంపై ఒకచోట వెంట్రుకలు పూర్తిగా రాలిపోయి, క్రమంగా గడ్డం, దవడ భాగమంతా వ్యాపించాయి. తొమ్మిది నెలలకు పైగా ఆయుర్వేద నూనెలు, ఇతర స్థానిక మందులు వాడినా ఎటువంటి ఫలితం కనిపించలేదు. అనంతరం అన్ని చికిత్సలు నిలిపివేసి వైబ్రియానిక్స్ వైద్యాన్ని ఆశ్రయించారు. 16 మే 2023న ఈ క్రింది రెమెడీలు ఇవ్వబడ్డాయి.

కాల్కేనియల్ స్పర్స్ కోసం:

#1. CC15.1 Mental & Emotional tonic + CC20.1 SMJ tonic + CC20.4 Muscles & Supportive tissue…TDS

అలోపీసియా ఏరియేటా కోసం:

#2. CC11.2 Hair problems + CC12.4 Autoimmune diseases + CC21.1 Skin tonic…TDS అలాగే కొబ్బరి నూనెలో కలిపి బాహ్యంగా రాసుకోవడం కోసం…BD

చికిత్స పురోగతి:

  • 10 ఆగస్టు 2023: నొప్పి 40% తగ్గింది. వెంట్రుకలు రాలడం పూర్తిగా ఆగిపోయింది.
  • 5 అక్టోబర్ 2023: నొప్పి, నడకలో ఇబ్బంది 60% తగ్గాయి. ప్రభావిత ప్రాంతాల్లో కొత్త వెంట్రుకలు మొలకెత్తడం ప్రారంభమైంది.
  • 4 జనవరి 2024: నొప్పి 95%కు పైగా తగ్గింది. స్పర్ పరిమాణం తగ్గడం ప్రారంభమైంది. సాధారణంగా నడవగలిగారు. తీవ్రమైన శారీరక శ్రమ చేసినప్పుడు మాత్రమే స్వల్ప నొప్పి ఉండేది. #1 మోతాదును BDకు తగ్గించారు. గడ్డం, దవడ ప్రాంతంలో 70% వెంట్రుకలు తిరిగి పెరిగాయి.
  • 14 ఏప్రిల్ 2024: నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. స్పర్ పరిమాణం 2–3 మిల్లీమీటర్లకు తగ్గింది. ఆయన మళ్లీ సాధారణంగా క్రికెట్ ఆడడం ప్రారంభించారు. గడ్డంపై వెంట్రుకలు పూర్తిగా పెరిగాయి. రెండు రెమెడీల మోతాదును OD కు తగ్గించారు. #1ను 30 ఏప్రిల్ 2024న నిలిపివేశారు. #2ను మూడు నెలల తరువాత నిలిపివేశారు.

మే 2025 నాటికి, స్పర్ పరిమాణం ఇకపై తగ్గకపోయినా సమస్య మళ్లీ రాలేదు.

ప్రాక్టీషనర్ పరిశీలన: మడమ స్పర్స్ సాధారణంగా శస్త్రచికిత్స లేకుండా పూర్తిగా నయం కావని భావిస్తారు. ఈ కేసులో కేవలం ఒక సంవత్సరంలో స్పర్ పరిమాణం గణనీయంగా తగ్గడం విశేషం. మరింత కాలం రెమెడీ కొనసాగించి ఉంటే పూర్తిగా మాయమయ్యే అవకాశం ఉండేది. అయితే తనకు ఎలాంటి అసౌకర్యం లేకపోవడంతో రోగి స్వయంగా చికిత్సను నిలిపివేయాలని కోరుకున్నారు.

శ్వాసకోశ అలెర్జీ 11598...India

13 సంవత్సరాల వయస్సు గల ఒక బాలిక చిన్ననాటి నుంచే నిరంతరంగా తీవ్రమైన పొడి దగ్గుతో బాధపడుతోంది. ఈ దగ్గుతో పాటు గొంతులో తీవ్రమైన మంట, చికాకు ఉండేది. కొన్నిసార్లు దగ్గు ఎక్కువై వాంతులు కూడా అయ్యేవి. ఈ దగ్గు ప్రతి ఋతువు మారినప్పుడు సంవత్సరానికి 4 నుండి 5 సార్లు వచ్చేది. ఒక్కోసారి 8 నుండి 10 రోజుల వరకు కొనసాగేది. ఈ తీవ్రమైన దగ్గు కారణంగా ఆమెకు ఆకలి తగ్గిపోయి, బలహీనత, తీవ్ర అలసట కలిగేవి. ఐస్క్రీమ్, ఫ్రిజ్లో ఉంచిన చల్లటి ఆహార పదార్థాలు తీసుకుంటే ఆమె సమస్య తప్పకుండా మళ్లీ ప్రారంభమయ్యేది. అందువల్ల అలాంటి ఆహారాన్ని పూర్తిగా నివారించేది.

వైద్య పరీక్షల ద్వారా ఆమెకు శ్వాసకోశ అలెర్జీ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ప్రతి సారి సమస్య తీవ్రతరం అయినప్పుడు యాంటీహిస్టమిన్లు, యాంటీబయాటిక్ మందులు వాడినప్పటికీ తాత్కాలిక ఉపశమనం మాత్రమే లభించేది.

ఆగస్టు 2018లో, ప్రాక్టీషనర్ తన స్నేహితుడిని సాధారణంగా కలవడానికి వెళ్లినప్పుడు, అతని కుమార్తె తీవ్ర దగ్గుతో బాధపడుతున్నట్లు గమనించారు. ఆయన వైబ్రియానిక్స్ చికిత్సను సూచించగా, కుటుంబ సభ్యులు అంగీకరించారు. ఆ సమయంలో బాలిక పరిస్థితి చాలా తీవ్రమైనదైనా, వారు ఎటువంటి సంప్రదాయ వైద్య చికిత్స తీసుకోకుండా కేవలం వైబ్రియానిక్స్ మాత్రమే ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు.

20 ఆగస్టు 2018న ఈ క్రింది రెమెడీ ఇవ్వబడింది:

#1. CC12.2 Child tonic + CC19.2 Respiratory allergies + CC19.6 Cough chronic...6TD

చికిత్స పురోగతి:

  • 21 ఆగస్టు 2018: గొంతు మంట, దగ్గు 70% వరకు తగ్గాయి.
  • 25 ఆగస్టు 2018: లక్షణాలు పూర్తిగా తొలగిపోయాయి.
  • 27 ఆగస్టు 2018: #1 స్థానంలో #2. CC19.2 Respiratory Allergies + CC19.6 Cough Chronic … TDS ఇవ్వబడింది.
  • 8 సెప్టెంబర్ 2018: మోతాదును ఒక వారం పాటు BD, తరువాత మరో వారం రోజుకు OD కు తగ్గించారు. అనంతరం రోగి స్వయంగా రెమెడీని నిలిపివేశారు.
  • 12 ఫిబ్రవరి 2019: లక్షణాలు మళ్లీ కనిపించడంతో #2 ని 6TD గా మార్చి, తదుపరి సూచనలు వచ్చే వరకు కొనసాగించమని సూచించారు.
  • 20 ఫిబ్రవరి 2019: రోగి మరోసారి పూర్తిగా కోలుకుంది. మోతాదును TDS కు తగ్గించి, క్రమంగా తగ్గిస్తూ 22 మే 2019న పూర్తిగా నిలిపివేశారు.

జూన్ 2025 నాటికి, ఈ సమస్య మళ్లీ తిరిగి రాలేదు.

భగందర పుండు (ఇన్ఫెక్ట్డ్ యానల్ ఫిస్టులా) 11598...India

2018 ఏప్రిల్ నుండి ప్రాక్టీషనర్ 67 సంవత్సరాల వయస్సు గల బావమరిది మలవిసర్జన సమయంలో తీవ్రమైన అసౌకర్యాన్ని అనుభవించసాగారు. దీంతో 2018 మే నెలలో వైద్యుడిని సంప్రదించగా, శారీరక పరీక్ష అనంతరం గుద ప్రాంతం సమీపంలో ఫిస్టులా (భగందరం పుండు) ఉన్నట్లు నిర్ధారించి, శస్త్రచికిత్స ద్వారా తొలగించాలని సూచించారు. అయితే ఆ సమయంలో సమస్య పెద్దగా ఇబ్బంది కలిగించకపోవడంతో ఆయన చికిత్సను కొనసాగించలేదు. జూలై నెలాఖరుకు ఫిస్టులా వాపు, నొప్పి, వాపు వల్ల కలిగే మంట తీవ్రంగా పెరిగాయి. మరో వారం రోజులకు సరిగా కూర్చోలేని స్థితి ఏర్పడడంతో, 2018 ఆగస్టు 6న మళ్లీ వైద్యుడిని సంప్రదించారు. వైద్యుడు ఐదు రోజుల పాటు యాంటీబయాటిక్ మందులు, బెటాడిన్ సిట్జ్ బాత్ చేయాలని సూచించి, అనంతరం శస్త్రచికిత్స చేయించుకోవాలని సలహా ఇచ్చారు.

యాంటీబయాటిక్ కోర్సు పూర్తయిన తరువాత ఆయన శస్త్రచికిత్స చేయించుకోవడానికి ఇష్టపడలేదు. అందువల్ల వైబ్రియానిక్స్ చికిత్సను ఆశ్రయించారు. సంప్రదించిన సమయంలో ఆయన బలహీనంగా, ఆందోళనతో కనిపించారు. ఆయనకు అధిక రక్తపోటు, హైపోథైరాయిడిజం, మధుమేహం వంటి వ్యాధులు కూడా ఉండేవి. ఇవన్నీ అలోపతి మందులతో బాగా నియంత్రణలో ఉన్నాయి. ఫిస్టులా మధుమేహ రోగుల్లో ఎక్కువగా కనిపిస్తుందని వైద్యుడు చెప్పినందున, భవిష్యత్తులో సమస్య మళ్లీ రాకుండా ఉండేందుకు మధుమేహానికి కూడా వైబ్రియానిక్స్ రెమెడీ ఇవ్వమని ఆయన కోరారు.

15 ఆగస్టు 2018న ఈ క్రింది రెమెడీలు ఇవ్వబడ్డాయి:

#1. CC4.4 Constipation + CC10.1 Emergencies + CC12.1 Adult tonic+ CC15.1 Mental & Emotional tonic...6TD

#2. CC6.3 Diabetes...OD

అధిక రక్తపోటు, థైరాయిడ్, మధుమేహానికి అలోపతి మందులను కంటిన్యూ చేస్తూ సిట్జ్ బాత్ చేయాలని సూచించారు.

చికిత్స పురోగతి:

  • 18 ఆగస్టు 2018: 3 రోజుల తరువాత ఫిస్టులా నుండి పెద్ద మొత్తంలో చీము, రక్తం బయటకు వచ్చాయి. నొప్పి 25% తగ్గింది. దీంతో #1ను #3. CC21.11 Wounds & Abrasions + #1 … 6TD గా మార్చారు.
  • 30 ఆగస్టు 2018: నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. గాయం ఎండిపోయింది. తిరిగి తన పనికి వెళ్లగలిగారు. సిట్జ్ బాత్ను నిలిపివేశారు. అనంతరం #3ను #4. CC4.4 Constipation + CC21.11 Wounds & Abrasions … TDS గా మార్చారు.
  • 14 సెప్టెంబర్ 2018: #4 మోతాదును BD కు 16 సెప్టెంబర్న OD కు తగ్గించి, 18 సెప్టెంబర్ 2018న పూర్తిగా నిలిపివేశారు.

జూన్ 2025 నాటికి, ఫిస్టులా సమస్య మళ్లీ తిరిగి రాలేదు. రోగి మధుమేహం కోసం #2 రెమెడీని అలోపతి మందులతో పాటు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.

 

పార్శ్వ తలనొప్పి(మైగ్రేన్) 11673...India

38 సంవత్సరాల వయస్సు గల ఒక కుట్టు పనివారు 2021 నుండి గత మూడు సంవత్సరాలుగా తీవ్రమైన మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్నారు. నొప్పి ఎల్లప్పుడూ తల ఎడమ వైపునే ఉండేది. దానితో పాటు వికారం, వాంతులు, వెలుతురు మరియు శబ్దాన్ని భరించలేని స్థితి కూడా ఉండేది. ఈ తలనొప్పి వారానికి సుమారు మూడు సార్లు వచ్చేది. ఒక్కోసారి రోజంతా మధ్య మధ్యలో కొనసాగుతూ ఉండేది. దాంతో ఆమెకు రోజంతా విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చేది. కుటుంబానికి ఏకైక సంపాదనాధారమైన ఆమె నిరంతరం ఆర్థిక, మానసిక ఒత్తిడిలో ఉండేది. అదే తన మైగ్రేన్కు ప్రధాన కారణమని ఆమె భావించేది. కొద్దిసేపు ఎండలోకి వెళ్లినా మైగ్రేన్ దాడి ప్రారంభమయ్యేది. అందువల్ల బయటకు వెళ్లేటప్పుడు ఎల్లప్పుడూ గొడుగు వెంట తీసుకెళ్లేది. తరచూ వచ్చే ఈ తలనొప్పి ఆమె కుట్టు పనితో పాటు ఇంటి పనులను కూడా తీవ్రంగా ప్రభావితం చేసి, ఆమె మానసిక ఆందోళనను మరింత పెంచింది.

2021లో వైద్యులు ఆమెకు మైగ్రేన్ ఉన్నట్లు నిర్ధారించి, ఆవిరి పట్టుకోవాలని సూచించడంతో పాటు నొప్పి నివారణ మాత్రలు ఇచ్చారు. అయితే ఆమె తీవ్రమైన దాడులు వచ్చినప్పుడు మాత్రమే ఆ మాత్రలు వాడేది. వాటివల్ల సుమారు 20 నిమిషాల్లో తాత్కాలిక ఉపశమనం మాత్రమే లభించేది.

8 ఆగస్టు 2024న ఆమె అలోపతి మందులను నిలిపివేసి వైబ్రియానిక్స్ చికిత్సను ప్రారంభించారు. ప్రాక్టీషనర్ ఈ క్రింది రెమెడీలను ఇచ్చారు:

#1. CC10.1 Emergencies + CC11.3 Headaches + CC11.4 Migraines + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…TDS

#2. IB (from vol 13 #5)…OD

చికిత్స పురోగతి:

Ø  10 సెప్టెంబర్ 2024: ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే మైగ్రేన్ దాడి వచ్చింది. తలనొప్పి, వికారం, వాంతులు 50% వరకు తగ్గాయి. మానసిక ఒత్తిడి కూడా తగ్గినట్లు ఆమె భావించారు. ఇంటి పనులు, కుట్టు పనిని ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్వహించగలిగారు.

Ø  5 నవంబర్ 2024: మైగ్రేన్ దాడులు పూర్తిగా ఆగిపోయాయి. మానసిక ప్రశాంతత, ఉత్సాహం, ఆనందం పెరిగాయి. ఈ స్వస్థతకు స్వామివారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. #1 మోతాదును OD కు తగ్గించి, 8 జనవరి 2025న పూర్తిగా నిలిపివేశారు.

జూన్ 2025 నాటికి, సమస్య పునరావృతం  కాలేదు. ఆమె #2 రెమెడీని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.

 

అలర్జీ వల్ల వచ్చే ముక్కు వాపు (అలర్జిక్ రైనైటిస్) 03620...South Africa

ప్రాక్టీషనర్ ఇంట్లో పనిచేసే 37 సంవత్సరాల మహిళ గత నాలుగు సంవత్సరాలుగా అలెర్జిక్ రైనైటిస్తో బాధపడుతున్నారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ముక్కు కారడం, కళ్లలో దురద, అలాగే 30 నుండి 60 నిమిషాల పాటు వరుసగా తుమ్ములు రావడం ఆమెకు సాధారణమైపోయింది. అదనంగా, రోజంతా ముక్కు దిబ్బడ, ముక్కులోని కఫం గొంతులోకి కారడం(పోస్ట్-నాసల్ డ్రిప్), నిరంతర దగ్గుతో కూడా ఇబ్బంది పడుతుండేవారు. వైద్యుడిని సంప్రదించడానికి ఆమె ఇష్టపడలేదు. అందువల్ల స్వయంగా యాంటీహిస్టమిన్ మందులు వాడేది. వాటి వల్ల తాత్కాలిక ఉపశమనం మాత్రమే లభించేది. మరుసటి రోజుకే అన్ని లక్షణాలు మళ్లీ తిరిగి వచ్చేవి.

13 డిసెంబర్ 2024న ఆమెకు ఈ క్రింది రెమెడీ ఇవ్వబడింది:

IB (vol 15 #2)…TDS

చికిత్స పురోగతి:

  • 15 డిసెంబర్ 2024: ముక్కు కారడం, తుమ్ములు రోజంతా మరింత ఎక్కువయ్యాయి.
  • 16 డిసెంబర్ 2024: ఉదయం, సాయంత్రం అలెర్జీ లక్షణాలు కేవలం 20 నిమిషాలపాటు మాత్రమే కొనసాగాయి. మిగిలిన లక్షణాలు సుమారు 50% తగ్గాయి.
  • 20 డిసెంబర్ 2024: కళ్ల దురద, ముక్కు కారడం పూర్తిగా ఆగిపోయాయి. తుమ్ములు ఉదయం, సాయంత్రం కొద్దినిమిషాల పాటు మాత్రమే వచ్చాయి. ఇతర లక్షణాలు 80% వరకు తగ్గాయి.
  • 10 జనవరి 2025: అన్ని లక్షణాల నుండి పూర్తిగా (100%) ఉపశమనం లభించింది. మరికొంత కాలం కోసం మోతాదును OD కు తగ్గించారు.
  • 3 ఫిబ్రవరి 2025: రోగనిరోధక శక్తి పెంపు మరియు శరీర శుద్ధి కోసం CC12.1 Adult Tonic మరియు CC17.2 Cleansing … TDS, నెల విడిచి నెల చొప్పున ఒక సంవత్సరము పాటు తీసుకోవాలని సూచించారు.

జూన్ 2025 నాటికి, అలెర్జిక్ రైనైటిస్ లక్షణాలు మళ్లీ తిరిగి రాలేదు.

ఉబ్బిన సిరలు (వెరికోస్ వెయిన్స్), మణికట్టు నెప్పి 11573...India

45 సంవత్సరాల వయస్సు గల ఒక వ్యక్తికి కుటుంబంలో వెరికోస్ వెయిన్స్ (ఉబ్బిన సిరలు) వ్యాధి చరిత్ర ఉంది. ఆయనకు 2001లో, అంటే 20 సంవత్సరాల క్రితం ఈ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. రెండు కాళ్ల కండరాల భాగంలోని సిరలు నీలిరంగులో ఉబ్బి కనిపించేవి మరియు నొప్పిగా ఉండేవి. ముఖ్యంగా గంటసేపు లేదా అంతకంటే ఎక్కువసేపు నిలబడి ఉన్నప్పుడు రెండు కాళ్లలో భారంగా అనిపించడం, వాపు, నొప్పి కలిగేవి. అయితే నడిచేటప్పుడు మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు.

అదనంగా, 2016 అక్టోబర్ నుండి గత ఐదు సంవత్సరాలుగా ఆయన రెండు మణికట్టుల్లో నొప్పి, వాపు, అప్పుడప్పుడు బిగుసుకుపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. కంప్యూటర్పై ఎక్కువసేపు పనిచేయడం వల్లే ఈ సమస్య ఏర్పడిందని ఆయన భావించేవారు. చేతులను ఎక్కువగా ఉపయోగించినప్పుడు లక్షణాలు తీవ్రమయ్యేవి; విశ్రాంతి తీసుకుంటే కొంత ఉపశమనం కలిగేది.

తన తల్లికి కూడా ఇదే సమస్య ఉండడంతో, ఇది వంశపారంపర్యంగా వచ్చిన వ్యాధి అని ఆయన నమ్మారు. ఎటువంటి మందులు వాడకుండా జీవనశైలిలో మార్పులు చేసుకున్నారు. అధిక పీచు పదార్థాలు (ఫైబర్) ఉన్న ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా నడవడం, కాళ్లను పైకి ఎత్తి ఉంచడం, గోరువెచ్చని ఉప్పునీటిలో కాళ్లను ముంచడం, ఎక్కువసేపు నిలబడాల్సి వచ్చినప్పుడు ఒక కాలిపై నుండి మరో కాలిపై బరువు మార్చడం, వేళ్లకు వ్యాయామాలు చేయడం వంటి జాగ్రత్తలు పాటించారు. అయినప్పటికీ నొప్పి, వాపు తగ్గలేదు. 5 సెప్టెంబర్ 2021న ఆయన వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్ని సంప్రదించగా, ఈ క్రింది రెమెడీ ఇవ్వబడింది:

CC3.7 Circulation + CC4.2 Liver & Gallbladder tonic + CC13.1 Kidney & Bladder tonic + CC18.5 Neuralgia + CC20.3 Arthritis + CC20.7 Fractures…TDS

చికిత్స పురోగతి:

Ø  8 సెప్టెంబర్ 2021: మణికట్టు సమస్య 50% వరకు మెరుగుపడింది. వెరికోస్ సిరల వాపు మాత్రం కొద్దిగా పెరిగింది. ఇది ఫుల్లౌట్ ప్రక్రియలో భాగంగా జరిగి ఉండవచ్చు.

Ø  14 సెప్టెంబర్ 2021: మణికట్టు నొప్పి పూర్తిగా తగ్గిపోయింది.

Ø  23 డిసెంబర్ 2021: గత మూడు నెలలుగా క్రమంగా మెరుగుదల కొనసాగి, వెరికోస్ వెయిన్స్ పూర్తిగా నయమయ్యాయి. రెమెడీ మోతాదును OD కు తగ్గించారు. తరువాత మూడు నెలల వ్యవధిలో క్రమంగా తగ్గిస్తూ OW చేశారు. ఈ మోతాదును 18 నెలలకు పైగా కొనసాగించి, 10 సెప్టెంబర్ 2023న పూర్తిగా నిలిపివేశారు.

మే 2025 నాటికి, రోగి పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు. సమస్య మళ్లీ తిరిగి రాలేదు.

 

నిద్రలేమి 11669...India

ప్రాక్టీషనర్ కు పొరుగునున్న 65 సంవత్సరాల వయస్సు గల ఒక మహిళ రెండు సంవత్సరాలకు పైగా తీవ్రమైన నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఆమె ప్రతిరోజూ రాత్రి 10 గంటలకు పడుకున్నప్పటికీ, నిద్ర పట్టడానికి సుమారు ఒక గంట సమయం పట్టేది. అనంతరం కేవలం 3 నుంచి 4 గంటలకే మేల్కొని, మిగిలిన రాత్రంతా మళ్లీ నిద్రపట్టక ఇబ్బంది పడేవారు. వారానికి సుమారు రెండు రోజులు పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉండి, కేవలం 2 నుంచి 3 గంటల నిద్ర మాత్రమే లభించేది.

2014 వరకు ఆమెకు ప్రతిరోజూ 8 నుంచి 9 గంటల పాటు ప్రశాంతమైన, నిరాటంకమైన నిద్ర ఉండేది. అయితే, అదే సంవత్సరం ఆమె కుమార్తెలు శాశ్వతంగా ఆస్ట్రేలియాకు వెళ్లిన తరువాత, భావోద్వేగ ఒత్తిడి కారణంగా ఆమె రాత్రి నిద్ర 5 నుంచి 6 గంటలకు తగ్గిపోయింది. ఈ పరిస్థితి జూలై 2022 వరకు కొనసాగింది.

ప్రతిరోజూ మధ్యాహ్నం భోజనం అనంతరం ఒక గంట పాటు నిద్రపోయినప్పటికీ, రాత్రి సరిపడా నిద్ర లేకపోవడంతో ఆమె రోజంతా అలసట, మగతతో బాధపడుతూ, ఇంటి పనులు చేయడం కూడా కష్టంగా మారింది. అదనంగా, కళ్ల కింద నల్లటి వలయాలు (డార్క్ సర్కిల్స్) ఏర్పడ్డాయి. వీటికి కూడా తగినంత నిద్ర లేకపోవడమే కారణమని ఆమె భావించారు.

30 నవంబర్ 2024 న ఆమెకు ఈ క్రింది వైబ్రియానిక్స్ రెమెడీ ఇవ్వబడింది:

CC15.6 Sleep disorders… ప్రతి రాత్రి నిద్రకు అరగంట ముందు ఒక మోతాదు.

చికిత్స పురోగతి:

Ø  7 డిసెంబర్ 2024: రెమెడీ తీసుకున్న కొద్ది నిమిషాల్లోనే నిద్ర పట్టడం ప్రారంభమైంది.

Ø  15 డిసెంబర్ 2024: గత వారం రోజులుగా 4 నుంచి 5 గంటల పాటు నిరాటంకంగా, ప్రశాంతమైన నిద్ర లభించింది.

Ø  22 డిసెంబర్ 2024: గత వారం రోజులుగా 5 నుంచి 6 గంటల పాటు గాఢమైన నిద్ర లభించింది. పగటి సమయంలో ఉల్లాసంగా, శక్తివంతంగా అనిపించింది.

Ø  30 జనవరి 2025: రెమెడీ నిలిపివేయబడింది.

జూన్ 2025 నాటికి కూడా ఆమె ప్రశాంతమైన నిద్రను కొనసాగిస్తూ, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు.  అంతేకాకుండా, కళ్ల కింద ఉన్న నల్లటి వలయాలు పూర్తిగా మాయమయ్యాయి.

 

అరికాళ్లలో మంట 11632...India

2022 సెప్టెంబరులో, 54 ఏళ్ల వయస్సు గల ఒక పురుష ఉపాధ్యాయుడికి పాదాల అడుగుభాగంలో మంట ప్రారంభమైంది. ఇది ఆరు నెలల ముందు తీసుకున్న COVID-19 బూస్టర్ టీకా వల్ల వచ్చి ఉండవచ్చని భావించారు. ఉదయం ఈ మంట స్వల్పంగా ఉండేది, కానీ రోజు గడిచేకొద్దీ పెరిగి రాత్రికి భరించలేనంతగా మారేది. పాదాలను మంచు నీటిలో ఉంచితే తాత్కాలికంగా ఉపశమనం లభించేది. 2022 అక్టోబర్ 3న, సెన్సరీ నర్వ్ పరీక్షలు మరియు రక్త పరీక్షలు నిర్వహించగా నరాలకు ఎటువంటి నష్టం లేదని తేలింది. అయితే, యాదృచ్ఛిక రక్తంలో చక్కెర (Random Blood Sugar) 225 mg/dLగా ఉండటంతో ఆహార నియమాలు పాటించాలని, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని వైద్యులు సూచించారు. పాదాల మంట కోసం మాత్రలు కూడా ఇచ్చారు. వాటిని రెండు నెలలు వాడినా ప్రయోజనం కనిపించలేదు.

2022 డిసెంబరులో, ఆయనకు విటమిన్ B12 లోపం ఉన్నట్లు నిర్ధారణ అయింది. దానికి B12 ఇంజెక్షన్లు ఇవ్వగా మంచి ఉపశమనం లభించింది. అయితే, ఒక నెల తర్వాత మళ్లీ పాదాల మంట తిరిగి వచ్చింది. ఇదే సమయంలో, రక్తంలో చక్కెర స్థాయిలు నిరంతరం ఎక్కువగా ఉండటంతో వైద్యులు మెట్ఫార్మిన్ మరియు గ్లైకోమెట్ మందులు ప్రారంభించారు. దీంతో మధుమేహం నియంత్రణలోకి వచ్చినప్పటికీ, పాదాల మంట మాత్రం కొనసాగింది. అందువల్ల, 2024 మే 6న ఆయన ఒక ప్రత్యామ్నాయ ప్రాక్టీషనర్ని సంప్రదించగా ఈ క్రింది చికిత్స అందించారు:

#1. CC3.7 Circulation + CC18.5 Neuralgia + CC20.4 Muscles & Supportive tissue…BD ఆవ నూనెతో బాహ్యంగా రాయడానికి

#2. CC10.1 Emergencies + CC12.1 Adult tonic + #1…TDS

చికిత్స పురోగతి:

Ø  9 మే 2024: అరికాలు మంట సుమారు 30% తగ్గుదల కనిపించింది.

Ø  19 మే 2024: ఉపశమనం 80% వరకు కలిగింది.

Ø  20 జూన్ 2024: అరికాలు మంట పూర్తిగా తగ్గిపోయింది. #1 పూర్తిగా నిలిపివేశారు.

Ø  19 జులై 2024: #2 ను OD కి తగ్గించారు. రోగి తన ఇష్టప్రకారం దానిని కొనసాగిస్తునే వున్నారు.

2025 జూన్ నాటికి, పాదాల మంట మళ్లీ తిరిగి రాలేదు మరియు రోగి ఆరోగ్యంగా ఉన్నారు. అయన మధుమేహం నియంత్రణ కోసం అల్లోపతి మందులను మాత్రం కొనసాగిస్తున్నారు.

 

 

అలర్జీ వల్ల ముక్కు వాపు (అలర్జిక్ రైనైటిస్) 11984...India

48 సంవత్సరాల వయస్సు గల ఒక మహిళకు 2023 జనవరి నుంచి తరచుగా గొంతు చికాకు, కళ్లలో దురద, తుమ్ములు, స్వల్పంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించేవి. ప్రతి ఎపిసోడ్ రెండు రోజుల పాటు కొనసాగేది. ముఖ్యంగా చలికాలంలో మరియు దుమ్ము ధూళికి గురైనప్పుడు, నెలకు 2–3 సార్లు ఈ సమస్య వచ్చేది. ఆమెకు చిన్నతనంలో ఆస్తమా ఉండేది. అయితే యుక్తవయస్సు వచ్చిన తర్వాత అది సహజంగానే తగ్గిపోయింది.

గత కొన్ని నెలలుగా ఆమె మూలికా (హెర్బల్) మందులను ఉపయోగిస్తూ, తీవ్రమైన లక్షణాలు వచ్చినప్పుడు అల్లోపతి మందులు కూడా తీసుకునేది. అయినప్పటికీ, వాటివల్ల శాశ్వత ఉపశమనం లభించలేదు. శాశ్వత పరిష్కారం కోసం, ఆమె 13 జనవరి 2024న నిర్వహించిన నెలవారీ వైబ్రియోనిక్స్ శిబిరాన్ని సందర్శించింది. అక్కడ ఆమెకు ఈ క్రింది రెమెడీలు ఇవ్వబడ్డాయి:

CC19.2 Respiratory allergies + CC19.3 Chest infections chronic + CC19.6 Cough chronic…TDS

చికిత్స పురోగతి:

  • 13 ఫిబ్రవరి 2024: ఒకసారి మాత్రమే లక్షణాలు వచ్చి ఒక్క రోజు మాత్రమే కనిపించాయి.
  • 14 మార్చి 2024: చాలా స్వల్పంగా లక్షణాలు కనిపించి కొన్ని గంటల్లోనే తగ్గిపోయాయి.
  • 14 ఏప్రిల్ 2024: లక్షణాలు పూర్తిగా పోయాయి. దీంతో రెమెడీ మోతాదును OD కు తగ్గించారు.
  • 14 మే 2024: క్రమంగా మోతాదు తగ్గిస్తూ OW కు మార్చారు.

2025 జూన్ నాటికి, ఈ సమస్య మళ్లీ రాలేదు. ప్రస్తుతం రోగి OW కొనసాగిస్తున్నారు.

 

తోక ఎముక డిస్లోకేషన్ నొప్పి (టైల్ బోన్ డిస్లోకేషన్, పెయిన్) 11618...India

25 సంవత్సరాల వయస్సు గల ఒక యువకుడు 2022 మార్చి 10న బైక్ ప్రమాదానికి గురయ్యాడు. వైద్య పరీక్షల్లో, ప్రమాదం కారణంగా తోక ఎముక (కాక్సిక్స్) తన స్థానాన్ని కోల్పోయి (Dislocation) నిటారుగా మారినట్లు నిర్ధారణ అయింది. వైద్యులు ఈ గాయం 6 నుంచి 12 నెలల్లో సహజంగానే మానిపోతుందని తెలిపారు. నొప్పి తగ్గించడానికి ఆరు నెలల పాటు నొప్పి నివారణ మాత్రలు వాడాలని, అలాగే కూర్చునేటప్పుడు ఒత్తిడి తగ్గించడానికి ప్రత్యేకంగా రూపొందించిన కుషన్ ఉపయోగించాలని సూచించారు.

అయితే, నొప్పి నివారణ మాత్రలను ఎక్కువ కాలం వాడడం వల్ల వచ్చే దుష్ప్రభావాల గురించి ఆందోళన చెందిన రోగి వాటిని తీసుకోలేదు. దీంతో అతనికి కూర్చున్నప్పుడు , ఐదు నిమిషాలు నిలబడినా, కూర్చొని లేచేటప్పుడు, ద్విచక్ర వాహనాన్ని నడిపేటప్పుడు తీవ్రమైన నెప్పి వచ్చేది. ఈ సమస్యల వల్ల అతని చదువు, పార్ట్టైమ్ ఉద్యోగం, డాన్స్ కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నొప్పి మరియు కదలికల పరిమితి కారణంగా మానసిక ఒత్తిడి, ఆందోళన కూడా పెరిగాయి.

అతనికి గతంలో వైబ్రియోనిక్స్ చికిత్స వల్ల మంచి ఫలితాలు వచ్చినందున, అదే ప్రాక్టీషనర్ని సంప్రదించాడు. అదనంగా, గత 5–6 సంవత్సరాలుగా వారానికి ఒకటి లేదా రెండు సార్లు మలబద్ధకం (గట్టి మలం) కూడా ఉంటుందని తెలిపాడు. 23 మార్చి 2022న, అతనికి ఈ క్రింది చికిత్స ఇవ్వబడింది:

CC4.4 Constipation + CC10.1 Emergencies + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine + CC20.7 Fractures…TDS మరియు బాహ్యముగా రాసుకోవడానికి కొబ్బరినూనెలో…BD

చికిత్స పురోగతి:

  • 6 ఏప్రిల్ 2022: నొప్పి 50% తగ్గింది. 15–20 నిమిషాల పాటు సౌకర్యంగా కూర్చోగలిగాడు.
  • 7 మే 2022: నొప్పి 85% తగ్గింది. 2–3 గంటల పాటు సులభంగా కూర్చోగలిగాడు. మలబద్ధకం కూడా పూర్తిగా తగ్గిపోయింది.
  • 20 మే 2022: ఎక్స్-రే రిపోర్ట్ ప్రకారం తోక ఎముక మళ్లీ తన సహజ స్థానానికి మరియు వంపుకు చేరుకుంది. దీంతో రోగి ఎంతో ఆనందించాడు.
  • 30 మే 2022: నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. 
  • 30 జూన్ 2022: రెమెడీ మోతాదును BD కు తగ్గించారు. బాహ్యంగా రాసే చికిత్సను నిలిపివేశారు. రోగి మళ్లీ ఎలాంటి అసౌకర్యం లేకుండా డాన్స్ తో సహా తన సాధారణ రోజువారీ పనులను ప్రారంభించాడు.
  • 30 ఆగష్టు 2022: మోతాదును క్రమంగా తగ్గిస్తూ చికిత్సను పూర్తిగా నిలిపివేశారు. 

2025 జూన్ నాటికి, ఈ నొప్పి మళ్లీ తిరిగి రాలేదు.

పోషకాహార లోపం వల్ల వచ్చే చర్మ వ్యాధి 11632...India

2024 మార్చిలో, 15 సంవత్సరాల వయస్సు గల ఒక బాలిక చేతులు మరియు కాళ్లపై చర్మం పొరలుగా ఊడిపోవడం ప్రారంభమైంది. తరువాతి రెండు నెలల్లో ఈ సమస్య మరింత తీవ్రమై, ప్రభావిత ప్రాంతాల్లో దురద కూడా ఏర్పడింది. 6 జూన్ 2024 న, డెర్మటాలజిస్ట్ ఆమెకు ఇక్తియోసిస్ వల్గారిస్ (Ichthyosis Vulgaris) అని నిర్ధారించి, 30 రోజుల పాటు నోటితో తీసుకునే మందులు మరియు ఒక చర్మ క్రీమ్ను సూచించారు. క్రీమ్ వల్ల కొంత ఉపశమనం లభించినప్పటికీ, మాత్రలు తీసుకోవడం వల్ల వికారం రావడంతో ఆమె 10 రోజులకే వాటిని నిలిపివేసింది. ఆ తర్వాత ఆమె చర్మ సమస్య మరింత తీవ్రమైంది.(చిత్రం చూడండి)

16 జూన్ 2024న చేసిన రక్త పరీక్షల్లో, హీమోగ్లోబిన్ (Hb) స్థాయి 9.5 g/dLగా ఉండి రక్తహీనత (అనీమియా) ఉన్నట్లు, విటమిన్ D స్థాయి కూడా తక్కువగా ఉన్నట్లు తేలింది. మెడికల్ కాలేజ్ ప్రవేశ పరీక్షల కోసం తీవ్రంగా చదవడం వల్ల ఆమె తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైంది. దీని కారణంగా భోజనం సరిగా చేయకపోవడం, పోషకాహార లోపం ఏర్పడింది. అంతేకాక, చిన్నప్పటి నుంచే ఆకుకూరలను చూస్తే వికారం కలిగేది, అందువల్ల వాటిని తినలేకపోయేది.

20 జూన్ 2024 న, ఆమె వైబ్రియోనిక్స్ ప్రాక్టీషనర్ని సంప్రదించగా ఈ క్రింది చికిత్స ఇవ్వబడింది:

#1. CC21.1 Skin tonic + CC21.3 Skin allergies + CC21.5 Dry Sores + Potentised sunrays…BD బాహ్యముగా రాయడానికి కొబ్బరినూనెతో

#2. CC3.1 Heart tonic + CC4.10 Indigestion + CC12.1 Adult tonic + CC12.4 Autoimmune diseases + CC15.1 Mental & Emotional tonic + #1…TDS

చికిత్స పురోగతి

  • 25 జులై 2024: చర్మం ఊడిపోవడం మరియు దురదలో 40% మెరుగుదల కనిపించింది. అయితే ఆకుకూరలను చూస్తే వికారం మాత్రం కొనసాగింది.
  • 31 జులై 2024: #2 ను #3గా మార్చారు. Potentised Green Leafy Vegetables + #2 TDS.
  • 5 సెప్టెంబర్ 2024: చర్మ సమస్యలో 50% మెరుగుదల కనిపించింది. ఆకుకూరలను చూసినప్పుడు వచ్చే వికారం కూడా సగానికి తగ్గి, కొద్దికొద్దిగా ఆకుకూరలు తినగలిగింది.
  • 10 అక్టోబర్ 2024: అన్ని లక్షణాలు పూర్తిగా తగ్గిపోయాయి(చిత్రం తా. 15 అక్టోబర్ 2024 చూడండి). రక్త పరీక్షలో హీమోగ్లోబిన్ స్థాయి 13.0 g/dLకు పెరిగింది (రిపోర్ట్ వుంది).
  • 7 నవంబర్ 2024: #1 మరియు #3 మందుల మోతాదును OD కు తగ్గించారు.
  • 29 జనవరి 2025: #3 క్రమంగా తగ్గిస్తూ పూర్తిగా నిలిపివేశారు.

2025 జూన్ నాటికి, ఈ సమస్య మళ్లీ రాలేదు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉండి, #1 ను OD గా కొనసాగిస్తోంది.

 

 

 

 

 

 

 

            20 జూన్ 2024                            15 అక్టోబర్ 2024

సాధకుని వివరములు 03560...India

ప్రాక్టీషనర్ 03560…India ఫిజిక్స్ లో డిగ్రీ, సిస్టమ్స్ డెవలప్‌మెంట్‌లో పీజీ డిప్లొమా పొందారు. ఫార్మాస్యూటికల్ సేల్స్ విభాగంలో తన వృత్తి జీవితాన్ని ప్రారంభించి, అనంతరం IT రంగంలోకి ప్రవేశించి, అమెరికాలో పోర్ట్‌ఫోలియో మేనేజర్ హోదా వరకు ఎదిగారు.

2015లో ఆయన అత్తగారు భారతదేశం నుండి స్వామివారి చిత్రపటాన్ని తీసుకువచ్చి వారి ఇంటి పూజామందిరంలో ప్రతిష్ఠించినప్పటి నుండి ఆయనకు శ్రీ సత్యసాయి బాబాతో అనుబంధం ప్రారంభమైంది. ఆ సమయంలో స్వామివారి గురించి ఆయనకు పెద్దగా పరిచయం లేదు. అయన భార్య యొక్క సౌలుజర్నస్ కార్యక్రమాలపై గల ఆసక్తి, వాట్సాప్ వీడియోలు, అలాగే అప్పుడప్పుడు స్థానిక సాయి కేంద్రానికి వెళ్లడం వంటి వాటి వల్ల ఆయనకు స్వామివారి గురించి కొంత అవగాహన ఏర్పడింది.

అయితే, 2017 మార్చిలో ఆయన జీవితంలో ఒక కీలక మలుపు తిరిగింది. ఆయన భార్య పన్నెండు సంవత్సరాలుగా కీళ్లవాతం (ఆర్థ్రైటిస్)తో బాధపడుతున్నారు. అలోపతి, ఆయుర్వేద చికిత్సలు తీసుకున్నప్పటికీ ఆశించిన ఉపశమనం లభించలేదు. ఒక రోజు Souljournsలో "What is Vibrionics" వీడియోను చూసిన తరువాత వారు ఒక వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్ని సంప్రదించారు. మొదట నాలుగు వారాల పాటు శరీరము నుండి విషపదార్థములు (టాక్సిన్స్) తొలగించడం కోసం రెమెడీ ఇచ్చి, తరువాత ఆర్థ్రైటిస్‌కు సంబంధించిన రెమెడీ TDS అందించారు. కేవలం రెండు నెలల్లోనే ఆమె ఆరోగ్యం 80 శాతం మెరుగుపడింది.

ఈ అద్భుతమైన కోలుకోవడం ఆయన హృదయాన్ని ఎంతగానో స్పృశించింది. స్వామివారి పట్ల విశ్వాసం, సంపూర్ణ సమర్పణ మరింత పెరిగి, వైబ్రియానిక్స్ ద్వారా మరెంతో మంది ప్రయోజనం పొందాలని ఆయనలో బలమైన అంతరంగ ప్రేరణ కలిగింది. 2017 అక్టోబరులో ఆయన AVP శిక్షణ పూర్తి చేశారు. ప్రారంభంలో అమెరికాలో రోగులను కనుగొనడం కష్టంగా అనిపించింది. రోజుకు కనీసం ఒక్క రోగినైనా పంపించాలని ఆయన స్వామివారిని ప్రార్థించారు. ఆ ప్రార్థనకు త్వరలోనే ఫలితం లభించింది. కొద్ది కాలంలోనే ఆయన వారాంతాలు రోగులతో నిండిపోయాయి. అలాగే అయన స్థానిక సాయి కేంద్రంలో నారాయణ సేవ, ఆఫ్రికాకు పంపేందుకు కళ్లద్దాలను శుభ్రపరచేటటు వంటి సేవ వంటి కార్యక్రమాలలో కూడా చురుకుగా పాల్గొన్నారు.

2019లో, 57 సంవత్సరాల వయస్సులోనే ముందస్తు పదవీ విరమణ చేసి, భారతదేశంలో వున్న వారి వృద్ధ కుటుంబ సభ్యుల సంరక్షణతో పాటు వైబ్రియానిక్స్ సేవకు పూర్తిస్థాయిలో అంకితమయ్యారు. 2020 జనవరిలో VP, 2022 మార్చిలో SVPగా ఎదిగారు. అనంతరం పరిపాలనా బాధ్యతలు పెరగడంతో రోగుల సంఖ్యను తగ్గించాలని స్వామివారిని ప్రార్థించారు. స్వామివారు ఆయన ప్రార్థనకు స్పందించి, ప్రత్యక్ష వైద్యసేవ నుండి సంస్థకు అత్యంత కీలకమైన IT సేవ వైపు ఆయనను మళ్లించారు.

ప్రస్తుతం సంస్థలోని ఐదుగురు గవర్నర్లలో ఒకరిగా, SVIRT కార్యదర్శిగా వివిధ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. సంస్థకు సంబంధించిన ఐటీ వ్యవస్థలు, మూడు ఆన్‌లైన్ యాప్‌లు, కేంద్రీకృత డేటా నిల్వ, ఇ-మెయిల్ వ్యవస్థలు, డేటాబేస్ నిర్వహణ, ద్వైమాసిక వార్తాలేఖ రూపకల్పన, దానిని పలు భాషల్లోకి అనువదించే ప్రక్రియ సమన్వయం వంటి బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అదనంగా, స్వామివారి శతజయంతి సందర్భంగా సమర్పించబోయే మూడు వైబ్రియానిక్స్ గ్రంథాల కోసం వ్యాసాలను సేకరించే పనిలో కూడా చురుకుగా పాల్గొంటున్నారు. ఆయన అంకితభావం, సాంకేతిక నైపుణ్యం వైబ్రియానిక్స్ బృందానికి అమూల్యమైన ఆస్తిగా నిలిచాయి.

తన AVP శిక్షణ ప్రారంభ దశలో జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటనను ఆయన గుర్తుచేసుకుంటారు. 2018లో, 65 సంవత్సరాల వయస్సు గల తన బావమరిదికి కుడికాలిపై తీవ్రమైన గాయం ఏర్పడి రక్తస్రావం జరుగుతుండేది. నొప్పితో కుంటుతూ నడుస్తున్నప్పటికీ, "ఇవి కేవలం చక్కెర మాత్రలే" అని నోటి ద్వారా తీసుకునే వైబ్రియానిక్స్ మందులను ఆయన తిరస్కరించారు. ఆ రాత్రి ప్రాక్టీషనర్  "Move Well" రెమెడీ కలిపిన నీటిని గాయంపై స్ప్రే చేశారు. మరుసటి ఉదయం తనకు ఏ మార్పు వచ్చిందో కూడా తెలియకుండా ఆయన ఎటువంటి నొప్పి లేకుండా, కుంటకుండా వైద్యుని వద్దకు నడుచుకుంటూ వెళ్లారు. పరీక్షించిన వైద్యుడు గాయం ఆనవాళ్లు కూడా కనిపించకపోవడంతో, ఇది ఒక అద్భుతమైన కోలుకోవడమని ఆశ్చర్యపోయాడు. ఆ సంఘటనతో ఆయన బావమరిది సందేహాలన్నీ తొలగిపోయాయి. ఆ తరువాత మూత్రాశయ క్యాన్సర్ చికిత్స సమయంలో కూడా వైబ్రియానిక్స్‌ను తరచుగా ఉపయోగించి మంచి ఫలితాలను పొందారు.

ఇలాంటి ఎన్నో అద్భుతమైన స్వస్థతలను ఆయన ప్రత్యక్షంగా చూశారు. 2019లో, ఏడు సంవత్సరాలుగా రోజుకు కేవలం నాలుగు గంటలే నిద్రపోగలిగిన 53 ఏళ్ల మహిళకు, పడుకునే సమయంలో అరగంట వ్యవధితో CC15.1 Mental & Emotional Tonic మరియు CC15.6 Sleep Disorders నాలుగు మోతాదులు ఇచ్చారు. కేవలం ఒక రోజులోనే ఆమె నిద్రలేమి పూర్తిగా తగ్గిపోయింది. అలాగే, వెన్నెముక సమస్యలు మరియు విఫలమైన శస్త్రచికిత్స కారణంగా నాలుగు సంవత్సరాలుగా మంచానికే పరిమితమైన 61 ఏళ్ల మహిళకు CC10.1 Emergencies + CC12.1 Adult Tonic + CC15.1 Mental & Emotional Tonic + CC18.5 Neuralgia + CC20.5 Spine + CC20.7 Fractures కేవలం 15 రోజుల పాటు ఇచ్చారు. అనంతరం ఆమె స్వయంగా నడవడం ప్రారంభించారు. రద్దీ వాతావరణంలో తీవ్రమైన తలతిరుగుడు కారణంగా రెండేళ్లుగా ఇంటి బయటకు వెళ్లడానికి కూడా భయపడుతున్న 55 ఏళ్ల మహిళకు CC18.7 Vertigo ఇచ్చారు. ఐదు నెలల్లోనే ఆమె పూర్తిగా కోలుకున్నారు.

మానసిక ఆందోళనతో బాధపడే రోగులకు ఆయన తరచుగా CC15.1 Mental & Emotional Tonic + CC17.2 Cleansingను నీటి స్ప్రే రూపంలో ఇచ్చి, దానిని "ఫీల్ గుడ్ స్ప్రే" అని పిలుస్తారు. ప్రతిరోజూ తమపై స్ప్రే చేసుకోవడం, వారానికి ఒకసారి ఇంటి చుట్టూ కూడా స్ప్రే చేయడం వల్ల ప్రతికూల శక్తులు తొలగి మంచి ఫలితాలు వస్తాయని ఆయన నమ్ముతారు. అనేక శారీరక వ్యాధులకు మూలం మనస్సేనని ఆయన విశ్వసిస్తారు. చర్మవ్యాధుల రెమెడీలను తయారు చేసే సమయంలో CC4.2 Liver & Gallbladder టానిక్ ను కలపడం వల్ల గాయాలు త్వరగా మానుతాయని ఆయన చెబుతారు. కీళ్ల నొప్పుల విషయంలో నూనె కంటే నీటితో తయారుచేసిన స్ప్రేలు మరింత ప్రభావవంతంగా పనిచేస్తాయని ఆయన అనుభవం.

కాలక్రమేణా రెమెడీల ఎంపికలో తర్కం కంటే అంతర్‌ప్రేరణపై ఎక్కువగా ఆధారపడడం నేర్చుకున్నారు. వైద్యం ఫలప్రదంగా ఉండేందుకు అవసరమైన జీవనశైలి సూచనలపై కూడా నిరంతరం అవగాహన పెంచుకుంటున్నారు. దూరప్రాంతాల్లో ఉన్న రోగులకు ఫోన్ ద్వారా సంప్రదింపులు జరుపుతూ, రెమెడీస్ని కొరియర్ ద్వారా పంపి అవి చేరుకునేలోపు వారికి వెంటనే ప్రసారం (Broadcasting) ద్వారా వ్యాధినుండి కోలుకోవడానికి ప్రయత్నిస్తారు.

అతను ప్రతి ఒక్కరినీ వైబ్రియానిక్స్ దృక్కోణంలో చూస్తారు — వారికి ఎలా ఉత్తమంగా సహాయం చేయగలరో ఆలోచిస్తారు. ఫలితంగా, ఇప్పుడు అతని స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు అన్ని రకాల తీవ్రమైన అనారోగ్య సమస్యల కోసం ముందుగా వైబ్రోను ఆశ్రయిస్తున్నారు; తరచుగా వారికి మరే ఇతర చికిత్స కూడా అవసరం పడటం లేదు. వైబ్రియానిక్స్‌లోని సరళత మరియు ప్రభావశీలత కారణంగా, అది స్వతంత్రంగా లేదా ఇతర చికిత్సా విధానాలతో కలిపి, ఒక ప్రాథమిక వైద్య విధానంగా సేవలందించగలదని ఆయన విశ్వసిస్తున్నారు.

వైబ్రియానిక్స్ తనను మరింత దయగల వ్యక్తిగా మార్చిందని, వస్తువుల కంటే మనుషులకు ఎక్కువగా విలువ ఇవ్వడం నేర్పిందని ఆయన చెబుతారు. ఆయన అభిప్రాయం ప్రకారం వైద్యం విజయవంతం కావడానికి రెండు మూలస్తంభాలు ఉన్నాయి— ప్రాక్టీషనర్ విశ్వాసం, రోగి కోలుకుంటాననే నమ్మకం. రోగికి ధైర్యం చెప్పడమే చికిత్సలో సగం భాగాన్ని పూర్తి చేస్తుందని, మిగతా పని రెమెడీ చేస్తుందని ఆయన నమ్మకం.

వైబ్రియానిక్స్ సంస్థ సజావుగా నడవాలంటే ప్రతి ప్రాక్టీషనర్ అడ్మినిస్ట్రేటివ్ సేవలకు కూడా కొంత సమయం కేటాయించాలని ఆయన గట్టిగా సూచిస్తున్నారు.

తోటి ప్రాక్టీషనర్లుకు ఆయన సందేశం: “సేవ పట్ల అంకితభావంతో కొనసాగండి. మిగతాదంతా విశ్వమే చూసుకుంటుంది.”

Cases to share:

 

సాధకుని వివరములు 11598...India

 ప్రాక్టీషనర్ 11598…India  బీఎస్సీ, బెంగాలీ భాషలో బీఏ (ఆనర్స్) పట్టాలను పొందారు. వృత్తిరీత్యా చిత్రకళ ఉపాధ్యాయులు. సృజనాత్మకతకు ప్రతిరూపమైన ఆయనకు గానం, కవితలు మరియు పాటలు రచించడం, సంగీత స్వరరచన చేయడం ఎంతో ఇష్టం. చిత్రలేఖనంపై నాలుగు పుస్తకాలను రచించారు. ప్రయాణాలు చేయడం, జంతువులను ప్రేమించడం ఆయన అభిరుచులు. సామాజిక సేవ పట్ల ప్రత్యేక ఆసక్తి కలిగిన ఆయన, నిరుపేద పిల్లలకు ఉచితంగా చిత్రకళను బోధించడంతో పాటు వీధి జంతువులకు ఆహారం అందిస్తుంటారు.

ప్రకృతిని అమితంగా ప్రేమించే ఆయన తన ఇంటి పరిసరాల్లో సుమారు 200 రకాల మొక్కలు, వృక్షాలు, వాటిలో 65 రకాల కాక్టస్ మొక్కలు పెంచుతూ ఒక సుందరమైన ఉద్యానవనాన్ని అభివృద్ధి చేశారు. అంతేకాక, ఒక స్వచ్ఛంద సేవా సంస్థ (NGO)ను స్థాపించి అనేక సామాజిక సేవా కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తున్నారు. వాటిలో బంగాళాఖాతంలోని సుందర్‌బన్స్ దీవుల్లో 83,000కు పైగా మాంగ్రూవ్ అడవి మొక్కలు నాటడం, రక్తదాన శిబిరాలు నిర్వహించడం, కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో భాబా పాగ్లా ఆశ్రమం సహకారంతో పేదలకు అన్నదానం చేయడం, కోవిడ్ రోగులకు ఆక్సిజన్ మరియు అలోపతి మందులు అందించడం, అలాగే అంఫాన్ తుఫాను బాధితులకు ఆహారం, వస్త్రాలు పంపిణీ చేయడం వంటి విశేష సేవా కార్యక్రమాలు ఉన్నాయి.

చిన్ననాటి నుంచే ఆయనకు ఆధ్యాత్మికత పట్ల ప్రత్యేక ఆకర్షణ ఉంది. ప్రతిరోజూ ఉదయం తన ఇంటిలోని ఆలయంలో అమ్మవారు కాళీమాతను భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. ఆయన కుమార్తె బాలవికాస్ విద్యార్థిని కావడంతో సాయి మార్గంతో ఆయనకు పరిచయం ఏర్పడింది. స్థానిక సాయి వైద్య శిబిరాలలో చురుకైన సేవాదళ్ సభ్యుడిగా సేవలందిస్తున్నారు. 2012 నుండి ప్రతి సంవత్సరం డిసెంబరులో ప్రశాంతి నిలయాన్ని సందర్శిస్తూ, సేవాదళ్ బృంద నాయకుడిగా సేవ చేస్తున్నారు.

యుక్తవయస్సులోనే పేదలకు వైద్యసేవ చేయాలనే సంకల్పంతో వైద్యుడిగా మారాలని కలలు కనేవారు. ఆ సంకల్పంతో 2013 నుండి హోమియోపతి, అలోపతి వైద్యులకు సహాయకుడిగా సేవలందించడం ప్రారంభించారు. 2017లో బాబా ఆశ్రమంలో ఒక వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్ని కలుసుకున్నారు. ఆయన ద్వారా వైబ్రియానిక్స్ గురించి తెలుసుకొని ఆసక్తి పెంచుకున్నారు. అనంతరం డా. జిత్ కె. అగర్వాల్‌ను సంప్రదించగా, ఆయన ప్రోత్సాహంతో AVP కోర్సులో చేరి 2018 గురుపూర్ణిమ సందర్భంగా శిక్షణను విజయవంతంగా పూర్తి చేశారు.

“మానవ సేవయే మాధవ సేవ” అనే స్వామివారి బోధనను జీవిత సూత్రంగా భావించి, అపార భక్తి, సమర్పణతో వైద్యసేవ అందిస్తున్నారు. ఒక రోగి కోలుకోవడాన్ని చూడటం తనకు “స్వర్గానుభూతి” తో సమానమని ఆయన చెబుతారు. మరింత మంది రోగులకు సేవ చేసే అవకాశం కల్పించాలని ఎన్నోసార్లు స్వామివారిని ప్రార్థించగా, వెంటనే కొత్త రోగులు రావడం ఆయన గమనించారు. కొన్నిసార్లు లక్షణాల ఆధారంగా ఒక రెమెడీ ఎంచుకున్నప్పటికీ, 108CC పెట్టెలో ఆయన వేళ్లు మరో సీసా వైపు మళ్లడం జరిగింది. దానిని స్వామివారి ప్రత్యక్ష మార్గదర్శకత్వంగా ఆయన భావిస్తారు.

తనకు ఎంతో గుర్తుండిపోయిన కొన్ని స్వస్థత అనుభవాలను ఆయన పంచుకుంటున్నారు. జూన్ 2023లో, 48 సంవత్సరాల వయస్సు గల ఒక పొరుగువ్యక్తి కుడి పై దవడలో తీవ్రమైన పంటి నొప్పి, చిగుళ్ల వాపుతో బాధపడుతూ ఆయనను సంప్రదించారు. నొప్పి భరించలేనంతగా ఉంది. ఆయనకు CC11.5 Mouth Infections + CC11.6 Tooth Infections ఇచ్చారు. మరుసటి ఉదయమే ఆ రోగి ఆశ్చర్యంతో వచ్చి, కేవలం ఒక మాత్ర తీసుకున్న వెంటనే నొప్పి పూర్తిగా తగ్గిపోయిందని, మళ్లీ తిరిగి రాలేదని చెప్పారు. చిగుళ్ల వాపు మొదటి రోజే 20% తగ్గి, ఒక వారంలో పూర్తిగా నయమైంది.

మరో సంఘటనలో, ఆగస్టు 2018లో 37 సంవత్సరాల వయస్సు గల ఒక మహిళ రుతుక్రమ సమస్యలతో ఆయనను సంప్రదించారు. గత మూడు నెలలుగా ఆమెకు అధిక యోని స్రావం ఉండేది. అదనంగా, ప్రతి నెలలో రెండు సార్లు బహిష్టు వచ్చేది. ప్రతిసారి 5–6 రోజుల పాటు అధిక రక్తస్రావం, తీవ్రమైన నొప్పితో బాధపడుతూ, బలహీనతతో పాటు తీవ్రమైన ఆందోళనకు గురయ్యారు. ఆమెకు CC8.5 Vagina & Cervix + CC8.7 Menses Frequent + CC12.1 Adult Tonic + CC15.1 Mental & Emotional Tonic ఇచ్చారు. కేవలం నాలుగు రోజులకే యోని స్రావం 60% తగ్గి, వారం రోజుల్లో పూర్తిగా ఆగిపోయింది. చికిత్స ప్రారంభించిన నెల రోజుల తరువాత ఆమె ఎంతో ఆనందంగా వచ్చి, ఆ నెలలో రెండోసారి బహిష్టు రాలేదని, బలహీనత కూడా పూర్తిగా తగ్గిపోయిందని తెలిపారు. మరో నెల రోజుల పాటు రెమెడీ కొనసాగించారు. అప్పటి నుండి ఆ సమస్య మళ్లీ రాలేదు.

తన అనుభవంలో, అనేక మంది రోగుల రెమెడీలకు CC10.1 Emergencies జోడించడం ద్వారా మంచి ఫలితాలు లభిస్తున్నాయని ఆయన చెబుతారు. ఇటీవలి కాలంలో ఫిస్టులా, మొలలు (పైల్స్), చర్మంపై ఏర్పడే మచ్చలు వంటి సమస్యలకు CC2.3 Tumours & Growths ను కలిపి ఇవ్వడం ద్వారా కూడా ప్రోత్సాహకరమైన ఫలితాలు పొందుతున్నారు.

వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్ గా మారిన తరువాత తన జ్ఞానం ఎంతో విస్తరించిందని ఆయన చెబుతారు. సాధారణ వ్యాధుల గురించి ముందే తెలిసినప్పటికీ, వైబ్రియానిక్స్ ద్వారా మరెన్నో వ్యాధుల గురించి తెలుసుకున్నారు. అంతేకాక, వైద్య పరీక్షల నివేదికలను అర్థం చేసుకోవడం, సాధారణ ప్రమాణాలను గుర్తించడం కూడా నేర్చుకున్నారు.

తన వద్దకు వచ్చే ప్రతి రోగికి కుటుంబ సభ్యుడిలా ఆప్యాయ వాతావరణం కల్పించడానికి ఆయన ప్రయత్నిస్తారు. చిరునవ్వుతో, ప్రేమతో పలకరించడం వల్ల రోగులు సులభంగా మనసు విప్పి మాట్లాడతారని, దాంతో వ్యాధి మూల కారణాన్ని సులభంగా గుర్తించగలుగుతున్నానని ఆయన చెబుతారు.

చిత్రకళ ఉపాధ్యాయుడిగా ఉండడం వల్ల తన విద్యార్థులు, వారి కుటుంబాలకు కూడా వైబ్రియానిక్స్ ప్రయోజనాలను అందించే అవకాశం ఆయనకు లభిస్తోంది. కోవిడ్ మహమ్మారి సమయంలో తన ప్రాంతంలోని ప్రజలకు పెద్ద మొత్తంలో ఇమ్యూనిటీ బూస్టర్ రెమెడీలు, మాస్కులు పంపిణీ చేశారు.

మొక్కల పెంపకం కార్యక్రమాల్లో కూడా ఆయన స్వయంగా విత్తనాల నుండి లేదా అంటుకట్టడం ద్వారా మొక్కలను పెంచుతూ “సాయిరాం” నామస్మరణ, సాయి గాయత్రి జపం చేస్తారు. అవసరమైనప్పుడు CC1.2 Plant Tonicను కూడా ఉపయోగిస్తారు.

వైబ్రియానిక్స్ సేవను స్వామివారు తనకు ప్రసాదించిన దివ్య అవకాశంగా, గత జన్మల పుణ్యఫలంగా ఆయన భావిస్తారు. ఈ సేవ తనను మరింత ప్రశాంతమైన, వినయపూర్వకమైన, కరుణామయమైన వ్యక్తిగా మార్చిందని ఆయన అంటారు. తోటి ప్రాక్టీషనర్లకు ఆయన హృదయపూర్వక సందేశం: “మన సేవను స్వీకరించడానికి స్వామివారే ప్రతి రోగి రూపంలో మన ఇంటి గుమ్మం వద్దకు వస్తారు. ప్రతి రోగిలో స్వామివారి ప్రతిబింబాన్ని చూడండి. ఆయన మన నుండి కోరేది ఒక్కటే—ప్రేమ.”

పంచుకోవలసిన కేసులు

 

ప్రశ్నలు జవాబులు

Q1. పోటెంటైస్ చేసిన సూర్యకిరణాల రెమెడీని సాధారణంగా సూర్యకాంతి వల్ల వచ్చే అలెర్జీలకు ఉపయోగిస్తారు. దీనిని సూర్యకాంతికి సంబంధించిన ఇతర సమస్యలకూ ఉపయోగించవచ్చా?
A.
పోటెంటైస్ చేసిన సూర్యకిరణాలను (సాధారణంగా సూర్యకాంతి అని అంటారు) చర్మ దద్దుర్లు, దురద, దద్దుర్లు (Hives), ఫోటోఅలెర్జిక్ ప్రతిచర్యల వంటి సమస్యలలో విజయవంతంగా ఉపయోగించబడింది. అదనంగా, లక్ష్యిత (Targeted) కాంబినేషన్లతో పాటు సహాయక చికిత్సగా ఇతర పరిస్థితుల్లో కూడా ఉపయోగించవచ్చు. ఉదా:

·         వడదెబ్బ (Sunstroke): శరీర వ్యవస్థను స్థిరపరచడంలో సహాయపడుతుంది.

·         సన్ బర్న్ (Sunburn): ప్రారంభ దశలో ఉపయోగిస్తే వాపు, మంట, అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

·         అకాల చర్మ వృద్ధాప్యం (Photoaging): కాలక్రమేణా చర్మాన్ని సూర్యరశ్మికి తట్టుకునేలా చేయడంలో సహాయపడవచ్చు.

·         అతినీలలోహిత (UV) కిరణాల ప్రభావం: శరీర శుద్ధి (Detoxification), కణాల ఆరోగ్యానికి తోడ్పడవచ్చు.

·         చర్మ క్యాన్సర్: ప్రత్యేక క్యాన్సర్ రెమెడీలతో పాటు సహాయకంగా మాత్రమే ఉపయోగించాలి.

·         విటమిన్ D లోపం: ఇది సూర్యరశ్మికి ప్రత్యామ్నాయం కాదు. అయితే విటమిన్ D శరీరంలో బాగా గ్రహించబడటానికి, జీవక్రియలో ఉపయోగపడటానికి సహాయపడవచ్చు.

______________________________________________________________________________

Q2. SM1 Removal of Entities వల్ల తీవ్రమైన "పుల్అవుట్" రావచ్చా? వస్తే దాన్ని ఎలా నిలువరచాలి??

A. SM1 Removal of Entities ఒక లోతైన ఆధ్యాత్మిక రెమెడీ. చాలా అరుదుగా, ముఖ్యంగా అత్యంత సున్నితమైన వ్యక్తుల్లో లేదా లోతుగా అణచివేయబడిన భావోద్వేగాలు, మానసిక గాయాలు లేదా ప్రతికూల శక్తులు ఉన్నవారిలో, ఇది బలమైన పుల్అవుట్ కు కారణమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో, మొదట OD (రోజుకు ఒకసారి) లేదా ఒక్క మోతాదుతో ప్రారంభించి, తరువాత క్రమంగా TDS కు పెంచాలి. SM2 Divine Protectionను SM1తో పాటు ఇవ్వడం వల్ల శక్తి క్షేత్రం స్థిరపడుతుంది, రక్షణ లభిస్తుంది మరియు పుల్అవుట్ వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. ఒకవేళ పుల్అవుట్ వచ్చినట్లయితే (భావోద్వేగాలు ఎక్కువవ్వడం, శరీర నొప్పులు, అలసట మొదలైన రూపంలో) సాధారణ పుల్అవుట్ నిర్వహణ విధానాన్ని అనుసరించాలి. ఎక్కువ నీరు తాగాలి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. ప్రార్థనలు చేయడం ఎంతో ఉపయుక్తం. ఇంకా ఒక సూచన ఏమిటంటే, SRHVP ద్వారా SM1ను బ్రాడ్కాస్ట్ చేయడం. దీని వల్ల రెమెడీ ప్రభావం మృదువుగా ప్రారంభమవుతుంది. అలాగే, రెమెడీ కలిపిన నీటిని రోగి చుట్టూ, ముఖ్యంగా గదిలోని మూలల్లో చల్లడం కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

______________________________________________________________________________

Q3. ఎలక్ట్రోమాగ్నెటిక్ పరికరాల నుంచి వచ్చే రేడియేషన్ వైబ్రియోనిక్స్ రెమెడీ ప్రభావాన్ని ఎలా నిర్వీర్యం చేస్తుంది?

A. విద్యుదయస్కాంత రేడియేషన్ తన స్వంత శక్తివంతమైన ఫ్రీక్వెన్సీలను విడుదల చేస్తుంది. ఒక వైబ్రియానిక్స్ రెమెడీని బలమైన లేదా ఎక్కువసేపు ఉండే విద్యుదయస్కాంత క్షేత్రంకు గురిచేసినప్పుడు, ఈ బాహ్య తరంగాలు రెమెడీలో నిక్షిప్తము చేయబడిన సూక్ష్మ లేదా సున్నితమైన తరంగాన్నీ అధిగమించవచ్చు. ఒక కేసెట్ టేప్ ను శక్తివంతమైన అయస్కాంతం దగ్గర ఉంచినప్పుడు, అందులో రికార్డు చేసిన మ్యూజిక్ చెరిగిపోవడం లేదా పాడవడం అవడం గుర్తుందా? ఇదే విధంగా, సమీపంలోని బలహీనమైన రేడియో తరంగాని శక్తివంతమైన రేడియో తరంగం పాడు చేయవచ్చు లేదా పూర్తిగా తుడిచివేయవచ్చు.

______________________________________________________________________________

Q4. వైబ్రియోనిక్స్ మాత్రను నాలుక కింద ఉంచి తీసుకోవడం, నాలుకపై ఉంచి తీసుకోవడం లేదా మింగడం మధ్య ప్రభావంలో ఏమైనా తేడా ఉందా?

A. అవును. యోగ మరియు ఆయుర్వేద సంప్రదాయాల ప్రకారం (సిద్ధ వైద్యం మరియు కొన్ని తాంత్రిక సంప్రదాయాలు సహా), నాలుక కింద భాగం అనేక నాడులు (సూక్ష్మ శక్తి మార్గాలు) కలిసే ముఖ్యమైన శక్తి కేంద్రంగా పరిగణించబడుతుంది. ఈ కారణంగా ఆ ప్రాంతం సూక్ష్మ ప్రకంపనలను స్వీకరించడానికి ప్రత్యేకంగా సున్నితంగా ఉంటుందని భావిస్తారు. నాడులు తప్పనిసరిగా నాలుక కిందే ముగియకపోయినా, ఈ ప్రాంతంలో వాటి పరస్పర అనుసంధానం శరీరమంతా ప్రాణశక్తి ప్రవాహాన్ని మెరుగుపరుస్తుందని విశ్వసిస్తారు. అందువల్ల, రెమెడీని ఏకాగ్రతతో, అవగాహనతో నాలుక కింద ఉంచి తీసుకుంటే, దాని సూక్ష్మ ప్రకంపనలు మరింత వేగంగా మరియు ప్రభావవంతంగా శరీరంలో పనిచేస్తాయని భావిస్తారు. అయితే, రెమెడీని నాలుకపై ఉంచినా, నమిలినా లేదా మింగినా అది పనిచేస్తుంది. కానీ, నాలుక కింద ఉంచి తీసుకునే విధానాన్ని శక్తిపరంగా మరింత ప్రభావవంతమైనదిగా పరిగణిస్తారు.

ఆధునిక శరీర నిర్మాణ శాస్త్రం కూడా నాలుక కింద భాగం త్వరిత శోషణకు అనుకూలమని సూచిస్తుంది. ఈ ప్రాంతంలోని పలుచని శ్లేష్మ పొర కింద అనేక నరాలు మరియు సూక్ష్మ రక్తనాళాలు ఉండటం వల్ల, అక్కడ ఉంచిన కొన్ని మందులు త్వరగా రక్తప్రసరణలోకి చేరతాయి. అందుకే ఆంజైనా (Angina) ఉన్న రోగులకు నైట్రోగ్లిసరిన్ మాత్రలను నాలుక కింద ఉంచమని వైద్యులు సూచిస్తారు. దీంతో ఆ మందు వేగంగా రక్తంలో కలసి త్వరగా పనిచేస్తుంది.

______________________________________________________________________________

Q5. జీవితపు చరమ దశలో, ఆధ్యాత్మికంగా సాధనలో వున్నా వ్యక్తులు చాలా తక్కువ ఆహారం తీసుకుంటూ కూడా ప్రశాంతంగా ఉంటారు. అలాంటి సమయంలో, బరువు తగ్గుతున్నారని ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యులు చికిత్స ఇవ్వాలని కోరితే, నేను ఏ రెమెడీ సూచించాలి?

A. ప్రశాంతంగా, సంతృప్తిగా ఉండి చాలా తక్కువ ఆహారం తీసుకుంటున్న వ్యక్తి సహజంగానే భౌతిక ప్రపంచం నుండి క్రమంగా వైదొలుగుతున్న ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రక్రియలో ఉండవచ్చు. అలాంటి సందర్భంలో, ఆ వ్యక్తి ఆత్మయాత్రకు సున్నితంగా తోడ్పడుతూ, భావోద్వేగ బలం, సూక్ష్మ పోషణ మరియు ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని అందించడం లక్ష్యంగా ఉండాలి. ముందుగా కొద్దిసేపు నిశ్శబ్దంగా మనసును ఏకాగ్రపరచి, దైవ మార్గదర్శకత్వం కోసం ప్రార్థించిన తరువాత ఈ క్రింది రెమెడీలను TDS గా ఇవ్వవచ్చు:

108CC బాక్స్ ఉపయోగించే వారికి: CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic;

SRHVP ఉపయోగించే వారికి: రోగి అంతర్గతంగా ప్రశాంతంగా ఉంటే అంతర్గత ప్రశాంతతను మరియు సూక్ష్మ శరీర సమతుల్యతను కొనసాగించడం కొరకు NM75 Debility + NM90 Nutrition + SM2 Divine Protection + SM5 Peace & Love Alignment + SM6 Stress. రోగి మానసికంగా కలతగా, భయం లేదా అయోమయంలో ఉంటే, పై కలయికతో పాటు   NM6 Calming + SM1 Removal of Entities + SM4 Stabilising + SM9 Lack of  Confidence ఇస్తే ఇవి సూక్ష్మ అడ్డంకులను తొలగించడం, అనుబంధాలను సడలించడం మరియు భావోద్వేగ స్పష్టతను తీసుకురావడంలో సహాయపడతాయి.

అలాగే, రోగికి ఆధ్యాత్మికంగా సహాయం అందుతోందని కుటుంబ సభ్యులకు సున్నితంగా భరోసా ఇవ్వడం, అలాగే వారు రోగి పరిస్థితి పట్ల అతిగా ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండడం ద్వారా కూడా రోగి శ్రేయస్సుకు తోడ్పడవచ్చని తెలియచేయవలెను.

 

దివ్య వైద్యుని దివ్యవాణి

నా అభిప్రాయం ప్రకారం, ప్రతి వ్యక్తి తన ఆహారపు అలవాట్లు మరియు జీవనశైలిని నియంత్రించుకోవడం ద్వారా గుండె జబ్బుల బారిన పడకుండా చూసుకోవడం అతని ప్రాథమిక బాధ్యత. చికిత్స కంటే నివారణే ఉత్తమం. ఆహారపు అలవాట్లను సరిగ్గా నియంత్రించి పాటిస్తే, గుండె సంబంధిత వ్యాధులకు చాలా తక్కువ అవకాశం ఉంటుంది.”

… సత్య సాయిబాబాబా, దివ్య ప్రసంగం, “ఆహారం, హృదయం మరియు మనస్సు” 21 జనవరి 1994                                           http://www.sssbpt.info/ssspeaks/volume27/sss27-03.pdf

ఒక సూత్రాన్ని మీ హృదయంలో శాశ్వతంగా లిఖించుకోండిఇతరులకు సేవ చేయడం పుణ్యం; ఇతరులకు హాని చేయడం లేదా వారు బాధపడుతున్నప్పుడు నిర్లక్ష్యంగా, నిష్క్రియంగా ఉండడం పాపం.”             

… సత్య సాయిబాబాబా, “అద్దం మరియు దువ్వెన్న” దివ్య ప్రసంగం, 26 జూన్ 1969                            https://www.sssbpt.info/ssspeaks/volume09/sss09-12.pdf

ప్రకటనలు

భవిష్యత్తులో నిర్వహింప బోయే వర్క్ షాపులు* 

·ఇండియా పుట్టపర్తి: వర్చువల్ SVP ఫాలో-అప్ కోర్సు – 26–27 జూలై 2025. మరిన్ని వివరాల కోసం [email protected] ను సంప్రదించండి.

  • ఇండియా పుట్టపర్తి: తెలుగు AP ప్రాక్టికల్ వర్క్ షాప్ – 31 జూలై–4 ఆగస్టు 2025. మరిన్ని వివరాల కోసం [email protected] ను సంప్రదించండి 
  • ఇండియా పుట్టపర్తి: హిందీ AP ప్రాక్టికల్ వర్క్ షాప్ – 31 జూలై–4 ఆగస్టు 2025. మరిన్ని వివరాల కోసం [email protected] ను సంప్రదించండి.
  • ఇండియా పుట్టపర్తి: వర్చువల్ AVP* ప్రాక్టికల్ వర్క్ షాప్  3-21 నవంబర్ 2025** అనంతరం ముఖాముఖీ వర్క్ షాప్ 26-28 నవంబర్ 2025**, మరిన్ని వివరాల కోసం [email protected] ను సంప్రదించండి.
  • ఇండియా పుట్టపర్తి SVP ప్రాక్టికల్ వర్క్ షాప్ 1-4 డిసెంబర్ 2025**, మరిన్ని వివరాల కోసం [email protected] ను సంప్రదించండి.
  • ఇండియా పుట్టపర్తి: టీచర్స్ ట్రైనింగ్*** డిసెంబర్ 2024 టీచర్స్ ట్రైనింగ్ వర్క్ షాప్ లో పాల్గొన్న ప్రతి e-కోర్స్ టీచర్స్ మరియు పాల్గొన్న వారికందరికి - 9-11 డిసెంబర్ 2025** మరిన్ని వివరాల కోసం [email protected] ను సంప్రదించండి.

* ప్రవేశ ప్రక్రియ మరియు ఈ-కోర్సును పూర్తి చేసిన వారికి మాత్రమే. ప్రవేశ ప్రక్రియ 15 ఆగస్టు 2025 నుండి ప్రారంభమవుతుంది.

** తేదీలలో మార్పులు ఉండవచ్చు. ఏవైనా మార్పులు ఉంటే పాల్గొనేవారికి తెలియజేయబడుతుంది.

*** ప్రవేశ ప్రక్రియ పూర్తి చేసిన వారికి మాత్రమే. ఈ శిక్షణ కోసం ప్రవేశ ప్రక్రియ 15 అక్టోబర్ 2025 నుండి ప్రారంభమవుతుంది

 

అదనంగా

1. ఆరోగ్య వ్యాసం

ఆరోగ్యకరమైన హృదయం మీ చేతుల్లోనే ఉంది!

పరిశోధనలు వెల్లడించిన ప్రకారం, శాఖాహారులతో పోలిస్తే మాంసాహారులు మరియు మద్యానికి బానిసలైన వారు గుండె జబ్బులకు ఎక్కువగా గురవుతారు. శాఖాహార ఆహారం సమతుల్యంగా, పోషకవిలువలతో కూడి ఉండాలి. ముఖ్యంగా క్యారెట్ వంటి కూరగాయలలో లభించే విటమిన్ C మరియు విటమిన్ E సమృద్ధిగా ఉండాలి. విటమిన్లు గుండె వ్యాధులను గణనీయంగా నివారించడంలో సహాయపడతాయి.”… సత్య సాయి బాబా 1

1. మీ హృదయాన్ని తెలుసుకోండి!

1.1 పాత్ర: మన హృదయం పిడికిలి పరిమాణంలో ఉండే శంఖాకార కండరాల అవయవం. ఒక వయోజనుడిలో దీని బరువు సుమారు 227–340 గ్రాములు (8–12 ఔన్సులు) మాత్రమే ఉంటుంది. అయినప్పటికీ ఇది రోజుకు 7,500 లీటర్లకు పైగా రక్తాన్ని శరీరమంతా పంపిస్తుంది. హృదయం చేసే ప్రధాన పనులు - శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్ మరియు పోషకాలను అందించడం, రక్తపోటును నియంత్రించడం, శరీరంలోని అన్ని అవయవాలకు నిరంతర రక్తప్రసరణను కొనసాగించడం, మెదడు మరియు నాడీ వ్యవస్థ సూచనల మేరకు తన పనిని నిర్వహించడం.2-4

1.2 నిర్మాణం: హృదయం ఛాతీ మధ్యభాగానికి కొద్దిగా ఎడమవైపున, రెండు ఊపిరితిత్తుల మధ్య, ఛాతీ ఎముక వెనుక భాగంలో ఉంటుంది. ఇది పెరికార్డియం అనే రెండు పొరల సంచిలో రక్షించబడి ఉంటుంది. ఈ సంచి ఉత్పత్తి చేసే ద్రవం హృదయాన్ని రక్షిస్తూ, సాఫీగా కదలడానికి సహాయపడుతుంది. హృదయానికి మూడు కండరాల పొరలు ఉంటాయి. ఇవి సంకోచం మరియు వ్యాకోచం చెందుతూ రక్తాన్ని పంపిస్తాయి. సెప్టమ్ అనే కణజాలం హృదయాన్ని నిలువుగా రెండు భాగాలుగా విభజిస్తుంది. హృదయంలో నాలుగు గదులు ఉంటాయి - పై భాగంలో రెండు ఆట్రియా, క్రింది భాగంలో రెండు వెంట్రికల్స్, ఈ గదుల మధ్య తలుపుల్లాంటి వాల్వులు ఉంటాయి. ఇవి రక్తం ఒకే దిశలో ప్రవహించేలా చేసి, తిరిగి వెనక్కి వెళ్లకుండా నిరోధిస్తాయి.2,3,5,6

1.3 హృదయ పనితనం: శరీరంలోని వివిధ భాగాల నుండి వచ్చిన ఆక్సిజన్ తక్కువగా ఉన్న రక్తం ముందుగా కుడి ఆట్రియంలోకి పై మరియు క్రింది ప్రధాన సిరల ద్వారా ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి అది కుడి వెంట్రికల్ లోకి చేరి, పల్మనరీ ఆర్టరీ ద్వారా ఊపిరితిత్తులకు పంపబడుతుంది. అక్కడ రక్తం ఆక్సిజన్ను గ్రహిస్తుంది. తర్వాత ఆక్సిజన్తో సమృద్ధిగా ఉన్న రక్తం పల్మనరీ వీన్ల ద్వారా ఎడమ ఆట్రియంలోకి చేరుతుంది. అక్కడి నుంచి అది ఎడమ వెంట్రికల్ లోకి ప్రవేశించి, అక్కడి నుండి అయోర్టా అనే శరీరంలోని అతి పెద్ద ధమని ద్వారా శరీరమంతా పంపబడుతుంది. ఆరోగ్యకరమైన హృదయంలో ఈ మొత్తం ప్రక్రియ సుమారు 0.8 సెకన్లలో పూర్తవుతుంది. అంటే ఒక నిమిషానికి సుమారు 72 గుండె చప్పుళ్లు ఉంటాయి. 2,3,6,7

1.4 రక్తనాళాలు హృదయ చక్రంలో మూడు రకాల రక్తనాళాలు కీలక పాత్ర పోషిస్తాయి. ధమనులు హృదయం నుండి రక్తాన్ని బయటకు తీసుకెళ్తాయి. సిరలు రక్తాన్ని తిరిగి హృదయానికి తీసుకువస్తాయి. కేశనాళాలు ధమనులు మరియు సిరలను అనుసంధానించే అత్యంత సూక్ష్మ రక్తనాళాలు. ఈ రక్తనాళాలు భవనంలోని నీటి పైపుల్లా శరీరమంతా విస్తరించి ఉంటాయి. వీటి మొత్తం పొడవు సుమారు 60,000 మైళ్లు. సాధారణంగా, ధమనులు ఆక్సిజన్ అధికంగా ఉన్న రక్తాన్ని తీసుకెళ్తాయి. సిరలు ఆక్సిజన్ తక్కువగా ఉన్న రక్తాన్ని హృదయానికి తీసుకువస్తాయి. అయితే పల్మనరీ ఆర్టరీ మరియు పల్మనరీ వీన్లు మాత్రం దీనికి మినహాయింపు. హృదయం తనకు కావలసిన పోషకాలను తన ఉపరితలంపై ఉండే కరోనరీ ధమనుల ద్వారా పొందుతుంది.2,4,8

1.5 హృదయ విద్యుత్ ప్రసరణ వ్యవస్థ, ఒక భవనంలోని విద్యుత్ వ్యవస్థలాగే, హృదయంలో కూడా ప్రత్యేకమైన విద్యుత్ ప్రసరణ వ్యవస్థ ఉంటుంది. ఇందులో కణాలు, నోడ్లు మరియు విద్యుత్ సంకేతాలు కలిసి గుండె చప్పుళ్ల వేగం మరియు లయను నియంత్రిస్తాయి. ప్రతి గుండె చప్పుడు సమయంలో విద్యుత్ సంకేతాలు హృదయం అంతటా ప్రయాణించి, అది సంకోచించి, మళ్లీ వ్యాకోచం చెందేలా చేస్తాయి. సినో-ఏట్రియల్ నోడ్ హృదయానికి సహజ పేస్ మేకర్ గా పనిచేస్తూ ప్రతి గుండె చప్పుడిని ప్రారంభిస్తుంది. ఒక గుండె చప్పుడు రెండు ప్రధాన దశలను కలిగి ఉంటుంది: సిస్టోల్, ఈ దశలో హృదయం రక్తాన్ని శరీరమంతా పంపిస్తుంది. ఈ సమయంలో రక్తపోటు అత్యధికంగా ఉంటుంది. బీపీ కొలతలో కనిపించే పై సంఖ్య దీనిని సూచిస్తుంది. డయాస్టోల్, ఈ దశలో హృదయం విశ్రాంతి తీసుకుంటూ మళ్లీ రక్తంతో నిండుతుంది. ఈ సమయంలో రక్తపోటు తగ్గుతుంది. బీపీ కొలతలో కనిపించే క్రింది సంఖ్య దీనిని సూచిస్తుంది. ఈ రెండు దశల సమతుల్యతే ఒక వ్యక్తి రక్తపోటును నిర్ణయిస్తుంది. 120/80 mmHg ను సాధారణ రక్తపోటుగా పరిగణిస్తారు. మనకు వినిపించే "గుండె చప్పుడు" అనేది ప్రతి గుండె చక్రంలో హృదయ వాల్వులు మూసుకునే సమయంలో ఏర్పడే శబ్దం. (రక్తపోటుపై మా వ్యాసం కోసం, సంపుటి 8, సంచిక 6ను చూడండి).2,5,9,10,11

హృదయం, దాని వాల్వులు, కండరాలు, విద్యుత్ ప్రసరణ వ్యవస్థ, అలాగే రక్తనాళాలను ప్రభావితం చేసే అనేక రకాల వ్యాధులు ఉన్నాయి. హృదయం ఆరోగ్యంగా లేకపోతే, శరీరంలోని అవయవాలకు తగినంత రక్తం, ఆక్సిజన్ మరియు పోషకాలు అందక, వాటి పనితీరు దెబ్బతింటుంది.12,13

2. గుండె సంబంధిత వ్యాధులు

2.1 CAD (కరోనరీ ధమనుల వ్యాధి), కొరోనరీ ఆర్టరీ వ్యాధి (CAD) అత్యంత సాధారణమైన మరియు ప్రమాదకరమైన గుండె వ్యాధి. దీనిని కొరోనరీ హార్ట్ డిసీజ్ లేదా ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ అని కూడా అంటారు. దీనిని తరచుగా సైలెంట్ కిల్లర్ గా పేర్కొంటారు. ఈ వ్యాధికి ప్రధాన కారణం అథెరోస్క్లెరోసిస్. ఇందులో శరీరంలోని ధమనుల గోడలపై కొవ్వు, చెడు కొలెస్ట్రాల్ (LDL), కాల్షియం, కణ వ్యర్థాలు మరియు రక్తం గడ్డకట్టేందుకు సహాయపడే ఫైబ్రిన్ వంటి పదార్థాలు క్రమంగా పేరుకుపోయి ప్లాక్ గా మారతాయి. కాలక్రమేణా ఈ ప్లాక్ గట్టిపడి ధమనులను ఇరుకుగా చేసి, రక్తప్రసరణను తగ్గిస్తుంది లేదా పూర్తిగా అడ్డుకుంటుంది. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులు ఇరుకుగా మారినప్పుడు కనిపించే లక్షణాలు : శారీరక శ్రమ లేదా భావోద్వేగ ఒత్తిడి సమయంలో వచ్చే ఛాతీ నొప్పి లేదా అసౌకర్యం (ఆంజైనా). విశ్రాంతి తీసుకున్న తర్వాత లేదా నైట్రోగ్లిసరిన్ మాత్ర తీసుకున్న తర్వాత ఉపశమనం కలగడం. స్వల్ప శ్రమకే ఊపిరి ఆడకపోవడం (Dyspnea), ఛాతీ బిగుసుకున్నట్లు అనిపించడం.  అథెరోస్క్లెరోసిస్ ఇతర ధమనులను కూడా ప్రభావితం చేయవచ్చు. మెదడుకు వెళ్లే ధమనులు ప్రభావితమైతే: తాత్కాలిక మెదడు రక్తప్రసరణ లోపం (TIA – Transient Ischemic Attack) సంభవిస్తుంది. చేతులు లేదా కాళ్లలో బలహీనత, మాట తడబడటం, ముఖం ఒకవైపు వంగిపోవడం, ఒక కంటిలో తాత్కాలికంగా చూపు తగ్గడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. చికిత్స చేయకపోతే ఇది స్ట్రోక్కు దారితీయవచ్చు. కాళ్ల ధమనులు ప్రభావితమైతే: పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి (PAD) వస్తుంది (మరింత సమాచారం కొరకు vol 2 #5 చూడండి). జీవనశైలిలో మార్పులు, సరైన ఆహారం, వ్యాయామం మరియు తగిన మందుల ద్వారా CADను నియంత్రించవచ్చు. కొన్ని పరిశోధనల ప్రకారం ప్రారంభ దశల్లో దీనిని కొంతవరకు తిరోగమనంలోకి తీసుకురావడం కూడా సాధ్యమవుతుంది చికిత్స లేకపోతే CAD గుండెపోటు, అసాధారణ గుండె లయలు లేదా గుండె వైఫల్యానికి కారణమవుతుంది. 12-18

2.2 గుండెపోటు: కొన్నిసార్లు ఎలాంటి ముందస్తు లక్షణాలు లేకుండానే ధమనిలోని ప్లాక్ పగిలి రక్తం గడ్డకట్టడం (కొరోనరీ థ్రాంబోసిస్) జరుగుతుంది. ఇది రహదారి మధ్యలో కాంక్రీటు గోడ ఏర్పడినట్లుగా రక్తప్రసరణను అడ్డుకుంటుంది. ఫలితంగా గుండె కండరాలకు రక్తం అందక అవి దెబ్బతినడం ప్రారంభమవుతుంది. దీనినే గుండెపోటు అంటారు. ఇది అత్యవసర వైద్య పరిస్థితి. గుండెపోటు ముఖ్య లక్షణాలు: ఛాతీలో బిగుసుకుపోయినట్లు, నొక్కుతున్నట్లు లేదా తీవ్రమైన నొప్పి. నొప్పి ఒకటి లేదా రెండు చేతులు, భుజం, మెడ, దవడ లేదా వెన్ను వరకు వ్యాపించడం. కొన్నిసార్లు గుండెల్లో మంట లేదా అజీర్ణంగా పొరబడే అవకాశం. ఊపిరి ఆడకపోవడం. వికారం, చెమటలు పట్టడం. గుండెదడ, తల తిరగడం. ప్రమాద కారకాలు: వృద్ధాప్యం, ధూమపానం, అనారోగ్యకర జీవనశైలి, కుటుంబ చరిత్ర మధుమేహం, స్థూలకాయం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్. గుండెపోటు హెచ్చరిక సంకేతాల కోసం, చూడండి vol 1 #1 & vol 4 #1.12,13,19-22

2.3 అరిథ్మియా అంటే గుండె లయలో అసాధారణ మార్పులు రావడం. గుండె చాలా వేగంగా లేదా చాలా నెమ్మదిగా, అసమానంగా, లేదా క్రమరహితంగా కొట్టుకోవచ్చు. ఇవి గుండెలోని ఏ గదిలోనైనా ప్రారంభమై, గుండె సాధారణంగా సంకోచించి రక్తాన్ని పంపించే సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. కారణాలు గుండె వ్యాధులు, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత, థైరాయిడ్ సమస్యలు. రెండు సాధారణ రకాల గుండె వేగ మార్పులు, బ్రాడీకార్డియా నిమిషానికి 60 కంటే తక్కువ గుండె చప్పుళ్లు. ఇది నిద్రలో లేదా క్రీడాకారుల్లో సాధారణంగా కనిపించవచ్చు. టాకీకార్డియా నిమిషానికి 100 కంటే ఎక్కువ గుండె చప్పుళ్లు. వ్యాయామ సమయంలో ఇది సహజంగా ఉండవచ్చు. ఈ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి, ఛాతీ నొప్పి , గుండెదడ, చెమటలు, ఊపిరి ఆడకపోవడం, తల తిరగడం, మెడ నొప్పి, అజీర్ణం లేదా గుండెల్లో మంట, వికారం, నిద్రలేమి, స్వల్ప వ్యాయామం కూడా చేయలేకపోవడం.12,13,23-25

2.4 హృదయ కండరాల వ్యాధి ఇది గుండె కండరాల (Myocardium) వ్యాధి. ఈ పరిస్థితిలో గుండె కండరాలు గట్టిపడటం, బలహీనపడటం, మందంగా మారటం, విస్తరించటం,  లేదా గాయాల వల్ల మచ్చ కణజాలం ఏర్పడటం జరుగుతుంది. దీంతో గుండె రక్తాన్ని సమర్థవంతంగా పంపించలేకపోతుంది. లక్షణాలు: అలసట, గుండెదడ, ఊపిరి ఆడకపోవడం, చికిత్స లేకపోతే ఇది గుండె వైఫల్యానికి దారితీస్తుంది.12,13,26

2.5 హార్ట్ ఫెయిల్యూర్ గుండె బలహీనంగా లేదా గట్టిగా మారి రక్తాన్ని సమర్థవంతంగా పంపించలేని పరిస్థితిని గుండె వైఫల్యం అంటారు. దీంతో శరీరంలో, ముఖ్యంగా ఊపిరితిత్తుల్లో, కాళ్లలో, పాదాల్లో ద్రవం పేరుకుపోతుంది. లక్షణాలు: శ్రమ సమయంలో ఊపిరి ఆడకపోవడం, కాళ్లు, పాదాలు వాపు, రాత్రివేళ అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడం కష్టమవడం, నీరు నిల్వవడం వల్ల బరువు పెరగడం, నిరంతర దగ్గు, రాత్రిపూట తరచూ మూత్ర విసర్జన.12,13,27-29

 

2.6 కార్డియాక్ అరెస్ట్ కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె అకస్మాత్తుగా కొట్టుకోవడం ఆగిపోవడం. దీంతో రక్తప్రసరణ పూర్తిగా నిలిచిపోతుంది. రోగి స్పృహ కోల్పోయి కుప్పకూలిపోతాడు. ఇది సంభవించే కారణాలు: గుండె వ్యాధులు, తీవ్రమైన గాయాలు, కొన్ని మందుల ప్రభావం, శరీరంలో ఆక్సిజన్ తగ్గిపోవడం, రక్త పరిమాణం తగ్గిపోవడం. వెంటనే CPR లేదా AED (Automated External Defibrillator) ఉపయోగించకపోతే ప్రాణాపాయం ఏర్పడుతుంది.12,30

2.7 హృదయ కవాటాల వ్యాధులు: గుండె కవాటములు దెబ్బతినడం వల్ల ఇరుకుగా మారి (స్టెనోసిస్) రక్తప్రవాహాన్ని అడ్డుకోవచ్చు, సరిగా మూయక రక్తం వెనక్కి వెళ్లేలా (Regurgitation) చేయవచ్చు, ఎడమ ఆట్రియం–వెంట్రికల్ మధ్య కవాటం బయటకు ఉబ్బిపోవడం (Valve Prolapse) జరగవచ్చు, లేదా పుట్టుకతోనే కవాటములలో లోపాలు ఉండవచ్చు.  దీంతో గుండె ఎక్కువ శ్రమపడాల్సి వస్తుంది మరియు ఇతర గుండె వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.12,13,31

2.8 రక్తనాళపు ఉబ్బరం ధమని గోడలో బలహీనమైన భాగం బెలూన్లా ఉబ్బిపోవడాన్ని రక్తనాళపు ఉబ్బరం (అన్యూరిజం) అంటారు. ఇది పగిలిపోవచ్చు, లేదా రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని కలిగిస్తుంది. శరీరంలోని ఏ ధమనిలోనైనా ఇది ఏర్పడవచ్చు. సాధారణంగా ముందుగా లక్షణాలు కనిపించవు. పగిలినప్పుడు అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి, ఛాతీ, పొత్తికడుపు లేదా వెన్నునొప్పి, తలతిరగడం, గుండె వేగంగా కొట్టుకోవడం, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.13,32

2.9 పుట్టుకతో వచ్చే గుండె లోపాలు ఇవి గుండె మధ్య గోడలో రంధ్రం, వాల్వుల లోపాలు. రక్తనాళాల లోపాలు లాంటి పుట్టుకతోనే ఉండే గుండె నిర్మాణ లోపాలు. చర్మం, పెదవులు లేదా గోర్లు నీలం రంగులో కనిపించడం, అధిక నిద్రమత్తు, వేగంగా లేదా ఇబ్బందిగా శ్వాస తీసుకోవడం, అసాధారణ అలసట, గుండెలో అసాధారణ శబ్దం, బలహీనమైన నాడి స్పందన లాంటి లక్షణాలు కనిపిస్తాయి.33

 

2.10 గుండె కొచ్చే అంటువ్యాధులు అనేవి నోటి అపరిశుభ్రత, దంత లేదా ఇతర శస్త్రచికిత్సలు, కొన్ని ఇతర వ్యాధులు, గుండె శస్త్రచికిత్స అనంతరం లేదా ఇంజెక్షన్ ద్వారా మాదకద్రవ్యాలు తీసుకోవడం లాంటి వల్ల బ్యాక్టీరియా, వైరస్లు లేదా ఇతర సూక్ష్మజీవులు గుండె కండరాలు, కవాటాలు లేదా గుండెను కప్పి ఉంచే పొరలను సోకినప్పుడు గుండె ఇన్ఫెక్షన్లు ఏర్పడతాయి.34,35

 

 

 

 

 

3. మీ నాడి స్పందనను తెలుసుకోండి

3.1 గుండె స్పందన: మనం ఆరోగ్యంగా, సజీవంగా ఉన్నామనే సంకేతంగా ఆరోగ్యకరమైన గుండె సాధారణంగా నిమిషానికి సుమారు 72 సార్లు కొట్టుకుంటుంది. వ్యక్తి విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు, సాధారణంగా గుండె స్పందన నిమిషానికి 60 నుండి 100 సార్ల మధ్య ఉంటుంది. గుండె చప్పుడు చాలా స్వల్పంగా ఉండటం వల్ల ప్రత్యేక పరికరాలు (స్టెతస్కోప్ వంటివి) లేకుండా వినడం కష్టమే. అయితే, మణికట్టు లేదా మెడ వద్ద నాడి స్పందనను స్పృశించడం ద్వారా గుండె స్పందనను తెలుసుకోవచ్చు. గుండె స్పందన రేటు వ్యక్తి వయస్సు, శారీరక దృఢత్వం, మానసిక ఒత్తిడి, కొన్ని రకాల మందులు వంటి వల్ల మారవచ్చు.36

3.2 నాడి స్పందన పరీక్షించడానికి:

  • మీ చేతిని అరచేయి పైవైపు కనిపించేలా తిప్పండి.
  • మరో చేతిలోని మధ్య మూడు వేళ్లను (చూపుడు, మధ్య, ఉంగర వేళ్లు) బొటనవేలు కింద, మణికట్టు వెలుపలి భాగంలోని గాడిలో ఉంచండి.
  • వేళ్లతో మెల్లగా ఒత్తి నాడి స్పందనను గుర్తించండి. స్పందన అనిపించకపోతే కొద్దిగా ఎక్కువ ఒత్తిడి చేయండి.
  • 30 సెకన్ల పాటు ప్రతి గుండె స్పందనను లెక్కించండి.
  • మీరు లెక్కించిన సంఖ్యను రెట్టింపు (×2) చేయండి. అలా వచ్చిన సంఖ్యే మీ హార్ట్ రేటు లేదా పల్స్ రేట్. దీనిని బీట్స్ పేర మినిట్ (BPM)గా కొలుస్తారు.36

4. గుండెపోటు, గుండె వైఫల్యం లేదా కార్డియాక్ అరెస్ట్ సమయంలో ప్రథమ చికిత్స 37

4.1 గుండె-శ్వాస పునరుజ్జీవనం (CPR):

  •  బాధితుని ఛాతీపై రెండు అరచేతులను ఒకదానిపై మరొకటి ఉంచి, నిమిషానికి 100 నుండి 120 సార్లు బలంగా మరియు వేగంగా నొక్కండి. ఈ చర్యను ఛాతీపై ఒత్తిడి అంటారు.
  • CPR శిక్షణ పొందినవారైతే, ముందుగా బాధితుని శ్వాస మార్గం తెరిచి ఉందో లేదో పరిశీలించి, ప్రతి 30 సార్లు ఛాతీమీద ఒత్తిడి ఇచ్చిన తరువాత రెండు సార్లు కృత్రిమ శ్వాస (నోటి నుంచి బాధితుని నోటి ద్వారా గాలిని అందించడం) ఇవ్వండి.
  • CPR శిక్షణ లేని వారైతే, కేవలం ఛాతీ నొక్కులను నిరంతరంగా కొనసాగించండి. ప్రతి నొక్కు తర్వాత ఛాతీ పూర్తిగా పైకి లేవడానికి అవకాశం ఇవ్వండి.
  • వైద్య సహాయం అందే వరకు ఈ ప్రక్రియను కొనసాగించండి.

4.2 ఒంటరిగా వున్నపుడు గుండెపోటు నుంచి బయటపడుట, vol 2 #5 చూడండి.38

5. గుండె సంరక్షణకు సూచనలు 39-42E

  • తెలివిగా, జాగ్రత్తగా ఆహారం తీసుకోండి: తగినంత స్వచ్ఛమైన నీరు తాగుతూ శరీరాన్ని నీటితో సమతుల్యంగా ఉంచండి. మొక్కల ఆధారిత ఆహారం (Plant-based Foods), గింజలు, విత్తనాలు, పీచుపదార్థాలు అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోండి. చక్కెర, ఉప్పు మరియు అనారోగ్యకరమైన కొవ్వుల వినియోగాన్ని తగ్గించండి. మద్యం, ధూమపానం, ఈ-సిగరెట్ వాడటం (వేపింగ్) మరియు అన్ని రకాల పొగాకు ఉత్పత్తులను పూర్తిగా నివారించండి.
  • చురుకుగా, ఆనందంగా ఉండండి: ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వేగంగా నడవండి. యోగా చేయడం లేదా తోటపని వంటి శారీరక పనులను దైనందిన జీవితంలో భాగం చేసుకోండి. ఇతరులకు సహాయం చేయడానికి అవకాశాలను వెతకండి. ఆనందాన్ని కలిగించే పనులే హృదయానికి ఔషధం.
  • బాగా నిద్రపోండి: వ్యాయామం ఎంత అవసరమో, మంచి నిద్ర మరియు వినోదం కూడా అంతే అవసరం.
  • ఇన్ఫెక్షన్లను నివారించండి: నోటి మరియు దంతాల పరిశుభ్రతను పాటించడం ద్వారా గుండెకు వచ్చే కొన్ని ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు. ముఖ్యంగా చిగుళ్ల వ్యాధులు గుండె వ్యాధులకు ఒక ప్రమాదకర కారణంగా పరిగణించబడుతున్నాయి.
  • క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి: రక్తపోటు, రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలి.

చివరిగా ఒక మాట: ఆరోగ్యకరమైన అలవాట్లతో ఉత్తమమైన జీవనశైలిని కొనసాగిస్తూ, అంతర్గత ఆనందాన్ని అనుభవించడానికి కావలసిన లక్ష్యాలను కలిగివుండండి.!

రిఫరెన్సులు మరియు లింకులు

  1. “Food, the heart and the mind”—Sathya Sai Baba, Divine Discourse, 21 January 1994: https://www.sssbpt.info/ssspeaks/volume27/sss27-03.pdf
  2. Know your heart!: https://my.clevelandclinic.org/health/body/21704-heart
  3. https://www.narayanahealth.org/blog/heart-anatomy-and-function
  4. https://my.clevelandclinic.org/health/body/circulatory-and-cardiovascular-system
  5. Structure & Function of heart with video: https://kidshealth.org/en/parents/heart.html#
  6. https://www.webmd.com/heart-disease/high-cholesterol-healthy-heart
  7. Cardiac cycle: https://byjus.com/biology/cardiac-cycle/
  8. Blood vessels: https://my.clevelandclinic.org/health/body/21640-blood-vessels
  9. Heart conduction system: https://my.clevelandclinic.org/health/body/21648-heart-conduction-system
  10. Systole & Diastole: https://www.medicalnewstoday.com/articles/321447
  11. Blood pressure: https://news.vibrionics.org/en/articles/234
  12. Heart disease: https://my.clevelandclinic.org/health/diseases/24129-heart-disease
  13. https://www.mayoclinic.org/diseases-conditions/heart-disease/symptoms-causes/syc-20353118
  14. CAD: https://my.clevelandclinic.org/health/diseases/16898-coronary-artery-disease
  15. Atherosclerosis: https://www.mayoclinic.org/diseases-conditions/arteriosclerosis-atherosclerosis/symptoms-causes/syc-20350569#
  16. https://www.mayoclinic.org/diseases-conditions/peripheral-artery-disease/symptoms-causes/syc-20350557
  17. PAD: vol 2 #5, Sept 2011: https://news.vibrionics.org/en/articles/92
  18. Reverse CAD: https://www.health.harvard.edu/heart-health/ask_the_doctor_is_it_possible_to_reverse_coronary_artery_disease
  19. Heart attack: https://my.clevelandclinic.org/health/diseases/16818-heart-attack-myocardial-infarction
  20. Coronary thrombosis: https://www.medicalnewstoday.com/articles/coronary-thrombosis#symptoms
  21. 8 Warning signs of heart attack: vol4 #1, Jan-Feb 2013:  https://news.vibrionics.org/en/articles/149
  22. Signs of a heart attack: Vol1 #1 Sept 2010; https://news.vibrionics.org/en/articles/91
  23. Arrhythmia: https://my.clevelandclinic.org/health/articles/23489-circulatory-system-diseases
  24. https://my.clevelandclinic.org/health/diseases/16749-arrhythmia
  25. https://www.medicalnewstoday.com/articles/tachycardia-vs-bradycardia
  26. Cardiomyopathy: https://my.clevelandclinic.org/health/diseases/16841-cardiomyopathy
  27. Heart failure: https://my.clevelandclinic.org/health/diseases/17069-heart-failure-understanding-heart-failure
  28. https://www.heart.org/en/health-topics/heart-failure/warning-signs-of-heart-failure
  29. Heart failure video pictorial: https://watchlearnlive.heart.org/index.php?moduleSelect=hrtflr
  30. Cardiac arrest: https://my.clevelandclinic.org/health/diseases/21736-cardiac-arrest
  31. Heart Valve: https://my.clevelandclinic.org/health/diseases/17639-what-you-need-to-know-heart-valve-disease
  32. Aneurysm: https://my.clevelandclinic.org/health/diseases/22769-aneurysm
  33. Congenital: https://my.clevelandclinic.org/health/diseases/21674-congenital-heart-disease
  34. Heart infections: https://my.clevelandclinic.org/health/diseases/22054-heart-infection
  35. https://www.mayoclinic.org/diseases-conditions/endocarditis/symptoms-causes/syc-20352576
  36. Feel the pulse! https://www.heartfoundation.org.nz/wellbeing/managing-risk/how-to-check-your-pulse-heart-rate
  37. First aid in heart attack:  https://www.mayoclinic.org/diseases-conditions/sudden-cardiac-arrest/symptoms-causes/syc-20350634
  38. Survive heat attack when alone: Vol 2 #5 Sept 2011; https://news.vibrionics.org/en/articles/92
  39. Tips to prevent heart disease: https://health.ucdavis.edu/blog/cultivating-health/7-steps-you-can-take-to-help-prevent-heart-disease/2023/04
  40. https://www.mayoclinic.org/diseases-conditions/heart-disease/in-depth/heart-disease-prevention/art-20046502
  41. https://www.mayoclinic.org/diseases-conditions/heart-disease/in-depth/heart-healthy-diet/art-20047702
  42. High fibre diet: vol 4 #3, May-June 2013: https://news.vibrionics.org/en/articles/155

________________________________________________________________________________

2. సమావేశాలు, వైద్య శిబిరాలు & క్లినిక్లు

వెస్ట్ లండన్ గ్రూప్ (యూకే) వర్చువల్ సమావేశం – 18 మే 2025

యూకే కోఆర్డినేటర్ 02822 ప్రేరణతో, వెస్ట్ లండన్ వైబ్రియోనిక్స్ గ్రూప్ 18 మే 2025 న వర్చువల్ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి UK తో పాటు విదేశాల నుండి మొత్తం 20 మంది ప్రాక్టీషనర్లు హాజరయ్యారు. అందిన కేస్ స్టడీలు మరియు అనుభవాల నివేదికలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, డా. జిత్ కె. అగర్వాల్ పాల్గొన్న వారిని మరిన్ని రోగుల కేసులు, విశేష అనుభవాలను పంపాలని ప్రోత్సహించారు. స్వామి శతజయంతి సందర్భంగా ఈ సేవను చిరస్మరణీయంగా చేయడంతో పాటు, SVIRTలో అసోసియేట్ సభ్యత్వాన్ని పునరుద్ధరించడం ద్వారా సంస్థను మరింత బలోపేతం చేయాలని ఆయన సూచించారు.

దీని తరువాత రెండు విజ్ఞానవర్థకమైన పవర్పాయింట్ ప్రజెంటేషన్లు నిర్వహించబడ్డాయి. మొదటి ప్రజెంటేషన్లో ప్రాక్టీషనర్ 02802, "డిమెన్షియా" అంశంపై కొనసాగింపుగా, దాని నివారణకు సంబంధించిన వ్యూహాలను ఆచరణాత్మక వ్యాయామాలతో సహా వివరించారు. రెండవ ప్రజెంటేషన్లో ప్రాక్టీషనర్ 00534, 12 బయోకెమిక్ టిష్యూ సాల్ట్స్ (SR253–SR264)ను సమర్థవంతంగా ఉపయోగించి శరీరంలోని ఖనిజ సమతుల్యతను(మినరల్ బాలన్స్) పునరుద్ధరించడం, అలాగే శారీరక మరియు భావోద్వేగ అసమతుల్యతలను సరిచేయడం గురించి వివరించారు.

ప్రాక్టీషనర్ 02894, స్వగృహానికి దూరంగా ఉన్నప్పటికీ సేవను ఎలా కొనసాగించవచ్చో తన అనుభవంతో అందరికీ స్ఫూర్తినిచ్చారు. మారిషస్ పర్యటనలో ఉన్న సమయంలో, రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్న ఒక రోగి గురించి ఆమెను సంప్రదించారు. వెంటనే ఆమె యూకేలోని మరో ప్రాక్టీషనర్తో సమన్వయం చేసి అవసరమైన వైబ్రియోనిక్స్ నివారణను పోస్టు ద్వారా పంపించారు. అది ఐదు రోజుల్లో రోగికి చేరింది. అనంతరం రోగి కణితి (ట్యూమర్) గణనీయంగా తగ్గడంతో, వైద్యులు దానిని సురక్షితంగా శస్త్రచికిత్స ద్వారా తొలగించగలిగారు

ప్రాక్టీషనర్ 02862, సమావేశంలో చదివిన లిఖిత సందేశంలో, అనుభవజ్ఞులైన ప్రాక్టీషనర్లతో కలిసి పనిచేసి వారి నుండి నేర్చుకోవాలని సహచరులను ప్రోత్సహించారు. ఒక సీనియర్ ప్రాక్టీషనర్తో సన్నిహితంగా పనిచేయడం వల్ల తన అవగాహన, నైపుణ్యం మరియు సేవా సామర్థ్యం ఎంతో పెరిగిందని ఆమె పంచుకున్నారు.

సమావేశానికి ప్రత్యేక అతిథిగా హాజరైన డా. పబాని, హార్లీ స్ట్రీట్కు చెందిన నొప్పి నిపుణుడు, పొటెంటైజ్డ్ ప్రెడ్నిసోలోన్ అనే స్టెరాయిడ్ ఔషధం ప్రభావంపై తన ప్రత్యక్ష అనుభవాలను వివరించారు.

సియెర్రా లియోన్లో నిర్వహించిన ఒక వైద్య శిబిరంలో ప్రాక్టీషనర్ 02799 ద్వారా ఆయన మొదటిసారిగా వైబ్రియోనిక్స్ విధానాన్ని పరిచయం పొందారు. మోకాళ్ల నొప్పితో బాధపడుతున్న ఒక రోగి మోకాళ్లపై పొటెన్సైజ్డ్ ప్రెడ్నిసోలోన్ను స్ప్రే చేసిన 15 సెకన్లలోనే నొప్పి తగ్గడం చూసి ఆయన ఆశ్చర్యపోయారు. అలాగే, మూడు వారాలుగా తగ్గని దగ్గుతో బాధపడుతున్న ఒక గర్భిణీ స్త్రీకి కొన్ని స్ప్రేలు చేసిన వెంటనే దగ్గు దాదాపు తక్షణమే ఆగిపోయిన అనుభవాన్ని కూడా వివరించారు. అదనంగా, పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించే ఒక వీడియోను పంచుకొని, ఫైబ్రోమయాల్జియా బాధితులకు ఉపయోగపడే ఒక సులభమైన వ్యాయామాన్ని కూడా ప్రదర్శించారు

సమావేశం చివరలో స్వామికి హారతి సమర్పించడంతో కార్యక్రమం ముగిసింది.

* “డిమెన్షియా" మరియు "టిష్యూ సాల్ట్స్ వినియోగం" పై పవర్పాయింట్ ప్రజెంటేషన్లు ప్రాక్టీషనర్ల వెబ్ సైట్  https://practitioners.vibrionics.org లో Forms → Download లో అందుబాటులో ఉన్నాయి.

 

 

 

________________________________________________________________________________

3. డా. జిత్ కె. అగర్వాల్ డైరీ నుండి  - మూల కారణాన్ని వెలికితీయడం: వైబ్రేషనల్ అవగాహనలో ఒక పాఠం

వ్యాధికి మూలకారణాన్ని గుర్తించడం ఎంత ముఖ్యమో తెలుసుకుంటూ సాగుతున్న నా ప్రయాణంలో, మరో ఆసక్తికరమైన అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ సంఘటన 2001 నవంబర్లో, శ్రీ సత్యసాయి బాబా జన్మదిన వేడుకల సమయంలో జరిగింది. విదేశాల నుంచి వచ్చిన 40 సంవత్సరాల వయస్సు గల ఒక భక్తుడు, గత 4–5 నెలలుగా వేధిస్తున్న నిరంతర నడుము నొప్పికి ఉపశమనం కోరుతూ నన్ను సంప్రదించాడు. దర్శనం సమయంలో నేలపై ఎక్కువసేపు కూర్చుని ఉండగానే నొప్పి మరింత ఎక్కువ అవుతుందని ఆయన వివరించాడు.

నేను SRHVP ద్వారా సాధారణంగా నడుము నొప్పికి ఇచ్చే వైబ్రియోనిక్స్ రెమెడీను అందించాను. అయితే, ఒక వారం తరువాత ఆయన మళ్లీ వచ్చినప్పుడు, నొప్పిలో ఏమాత్రం మార్పు లేకపోవడం గమనించాను. దీంతో కాసేపు ఆలోచించి, ఆయన వ్యక్తిగత చరిత్రను మరింత లోతుగా తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇటీవల ఆయన ఆహారపు అలవాట్లలో లేదా జీవనశైలిలో ఏవైనా మార్పులు జరిగాయా అని అడిగాను. అప్పుడు ఆయనకు ఒక్కసారిగా ఒక ముఖ్యమైన విషయం గుర్తుకు వచ్చింది. తన గత ప్రశాంతి నిలయం సందర్శనలో, స్వామి మాంసాహారం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాల గురించి ప్రసంగించగానే, వెంటనే మాంసాహారం పూర్తిగా మానేశానని చెప్పారు. అప్పటివరకు ఆయన శరీరం చాలాకాలంగా ఆ ఆహార విధానానికే అలవాటు పడింది.

వెంటనే చికిత్సను మార్చి, NM25 – Shock...TDS ఒక వారం పాటు, మరో రెండు వారాల పాటు OD గా తీసుకోవాలని సూచించాను. ఫలితం అద్భుతంగా కనిపించింది. రెండు వారాల్లోనే ఆయన నొప్పి గణనీయంగా తగ్గిందని తెలియజేశారు. స్వదేశానికి తిరిగి వెళ్లడానికి కొద్ది రోజుల ముందు, ఆయన నడుము నొప్పి పూర్తిగా తగ్గిపోయింది.

ఈ అనుభవం నాకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పింది. వ్యాధి యొక్క అసలు కారణం ఎప్పుడూ మనకు స్పష్టంగా కనిపించే దానిలోనే ఉండకపోవచ్చు. అది శారీరక, మానసిక లేదా భావోద్వేగ ఆఘాతం వల్ల మాత్రమే కాకుండా, ఒక్కసారిగా జరిగిన ఆహారపు మార్పు వంటి సాధారణంగా కనిపించే అంశం వల్ల కూడా కలగవచ్చు. ఈ సంఘటన, శ్రద్ధగా వినడం, లోతైన ప్రశ్నలు అడిగి మూలకారణాన్ని తెలుసుకోవడం, అలాగే స్వామి కృపతో కూడిన మార్గదర్శకత్వం—ఇవే వైబ్రియోనిక్స్ ద్వారా నిజమైన స్వస్థతను అందించే ప్రధాన ఆధారాలన్న నా విశ్వాసాన్ని మరింత బలపరిచింది.

________________________________________________________________________________

    4. భూమి శాంతి కోసం సామూహిక జపం: సాయి గాయత్రితో వైబ్రియోనిక్స్ సమర్పణ

15 జూన్ 2025న, భగవాన్ శతజయంతి వేడుకల్లో భాగంగా శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ నిర్వహించిన ప్రపంచ శాంతి కోసం సామూహిక జప కార్యక్రమం, భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వందలాది వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్లను ఒకచోట చేర్చింది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో గంటసేపు సాగిన సాయి గాయత్రీ జపం యొక్క పవిత్రమైన వైబ్రేషన్స్‌ను, ప్రత్యేకంగా తయారు చేసిన వైబ్రియానిక్స్ రెమెడీ యొక్క హీలింగ్ ఎనర్జీతో కలిపారు. SRHVP వినియోగదారులు SM1 Removal of Entities + SM2 Divine Protection + SM4 Stabilising + SM5 Peace and Love Alignment + SM6 Stress + SM16 Cleansing ను సిద్ధం చేశారు. రెమెడీ బాటిల్‌ను ‘sample’ వెల్‌లో, మదర్ ఎర్త్ ఫోటోను ‘remedy well’లో ఉంచి, డయల్‌ను 573 (1M పొటెన్సీ)కి సెట్ చేయడం ద్వారా SRHVPను ఉపయోగించి దీనిని ప్రసారం చేశారు. ఇతర ప్రాక్టీషనర్లు 108CC Boxను ఉపయోగించి CC10.1 Emergencies + CC15.2 Psychiatric disorders + CC17.2 Cleansingను సిద్ధం చేశారు. ఈ రెమెడీ యొక్క ఒక బాటిల్‌ను స్వామి వారి పాదపద్మాల వద్ద ఉంచిన మదర్ ఎర్త్ ఫోటోపై ఉంచారు.

ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రాక్టీషనర్లు తమ భాగస్వామ్యాన్ని ధృవీకరించారు; పాల్గొన్న దేశాలలో అర్జెంటీనా, క్రొయేషియా, ఫ్రాన్స్, గ్రీస్, భారతదేశం, ఇటలీ, నేపాల్, పోలాండ్, ఖతార్, రొమేనియా, దక్షిణాఫ్రికా, ట్రినిడాడ్ & టొబాగో, యునైటెడ్ కింగ్‌డమ్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు మరియు జింబాబ్వే ఉన్నాయి.

ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం మంత్రోచ్చారణ ద్వారా ఉత్పన్నమయ్యే పవిత్ర ధ్వని తరంగాలు మరియు వైబ్రియోనిక్స్ సూక్ష్మ శక్తిలను సమన్వయం చేసి, ప్రపంచ శాంతి, అంతరంగ ప్రశాంతత మరియు సమష్టి శ్రేయస్సును ప్రోత్సహించడం. భక్తి భావంతో సమర్పించినప్పుడు ధ్వని చికిత్స (సౌండ్ హీలింగ్) మరియు వైబ్రేషనల్ హీలింగ్ దేశాలు, భాషలు, సరిహద్దులను అధిగమించి, మానవాళిని వసుధైవ కుటుంబకంగా ఉన్నత స్థితికి చేర్చగలవని చెప్పడానికి ఒక చక్కటి ఉదాహరణగా ఈ కార్యక్రమం నిలిచింది.

   

 

 

    

________________________________________________________________________________

5. జ్ఞాపకార్థం

మా ప్రియమైన వైబ్రియోనిక్స్ సేవకుడు శ్రీ కె. కమలనాభ గారు10681- ఇండియా, కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారు, 19 ఏప్రిల్ 2025న 67 సంవత్సరాల వయస్సులో పరమపదించారు అనే వార్తను తీవ్ర విచారంతో తెలియజేస్తున్నాము. వివాహం చేసుకోని ఆయన ఒక పదవీ విరమణ పొందిన బ్యాంకు ఉద్యోగి. శ్రీ సత్యసాయి బాబాపై అపార భక్తి కలిగిన ఆయన తన జీవితాన్ని పూర్తిగా స్వామి సేవకే అంకితం చేశారు. బళ్లారిలోని సాయి సేవా సమితి కన్వీనర్గా సేవలందిస్తూ, తన సౌమ్య స్వభావం, ప్రేమపూర్వక హృదయం, సేవాపట్ల అచంచలమైన అంకితభావంతో తోటి భక్తులందరి అభిమానాన్ని పొందారు. ఆయన ఒక ప్రతిభావంతమైన భజన గాయకుడు కూడా. 19 ఏప్రిల్ 2025 సాయంత్రం, సమితిలో ప్రతి వారం నిర్వహించే భజనలో పాల్గొని ఇంటికి తిరిగి వచ్చిన అనంతరం అస్వస్థతకు గురై, అకస్మాత్తుగా వచ్చిన గుండెపోటుతో ఈ లోకాన్ని విడిచిపెట్టారు. ఆయన 2011లో వైబ్రియోనిక్స్ ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రారంభ సంవత్సరాల్లో తన సహచర ప్రాక్టీషనర్ 10682- ఇండియా తో కలిసి సమీప గ్రామాల్లో వైబ్రియోనిక్స్ వైద్య శిబిరాలను నిర్వహించి అనేక మందికి సేవలందించారు. కరుణతో, నిస్వార్థ సేవాభావంతో అనేక మంది రోగులకు చికిత్స అందించారు. ప్రతి నెల తన సేవా నివేదికలను క్రమం తప్పకుండా సమర్పించడం ద్వారా తన క్రమశిక్షణ, నిజాయితీ మరియు సేవా నిబద్ధతను చాటిచెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఆయన భక్తి, సేవ మరియు సమర్పణతో కూడిన జీవితానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేస్తున్నాము.

మా ప్రియమైన వైబ్రియోనిక్స్ ప్రాక్టీషనర్ శ్రీ సూరజ్ ఉన్నికృష్ణన్ గారు11261- ఇండియా, కేరళ రాష్ట్రానికి చెందిన వారు, 11 మే 2025 న 52 సంవత్సరాల వయస్సులో కడుపు క్యాన్సర్తో ధైర్యంగా పోరాడిన అనంతరం పరమపదించారు అనే వార్తను తీవ్ర దిగ్భ్రాంతితో తెలియజేస్తున్నాము. ఆయన 2012లో వైబ్రియోనిక్స్ ప్రాక్టీషనర్గా మారి, తన సేవా ప్రయాణమంతా నిశ్శబ్దమైన అంకితభావంతో సేవలందించారు. షోరనూర్ మరియు పాలక్కాడ్ సాయి కేంద్రాలలో వైబ్రియోనిక్స్ వైద్య శిబిరాలను ప్రారంభించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. తన ప్రాంతంలోని అనేక మందికి ఆరోగ్యం, ఆశ మరియు ఆధ్యాత్మిక ధైర్యాన్ని అందించారు. శ్రీ సత్యసాయి బాబా పట్ల అపార భక్తి కలిగిన ఆయన, అనేక సంవత్సరాలుగా శ్రీ సత్యసాయి సంస్థ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఆయన పాలక్కాడ్ సాయి సమితి ఆధ్యాత్మిక సమన్వయకర్త గా సేవలందించారు. అలాగే 2025 జనవరి వరకు, తనకు అత్యంత ఆత్మీయమైన విద్యా వాహిని కార్యక్రమం కోసం కేరళ రాష్ట్ర ఇన్చార్జ్ బాధ్యతలను నిర్వహించారు. మృదుస్వభావం, ప్రశాంతమైన వ్యక్తిత్వం కలిగిన ఆయనను పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ ఎంతో అభిమానించేవారు. ఆయన తన ప్రియమైన భార్య, కుమారుడిని, అలాగే నిస్వార్థ సేవ, ఆధ్యాత్మిక క్రమశిక్షణ మరియు భక్తితో కూడిన ఒక విలువైన వారసత్వాన్ని విడిచివెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు సాయి కుటుంబ సభ్యులందరికీ ఆయన లేని లోటు ఎప్పటికీ తీరనిది. ఆయన పవిత్ర స్మృతి చిరస్థాయిగా నిలిచి ఉంటుంది.