Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

అదనంగా

Vol 10 సంచిక 2
March/April 2019


1.  ఆరోగ్య వ్యాసము

దగ్గుని నివారించడం మరియుఎదుర్కోవడం

మన శరీరంలో ప్రతి అవయవము మరియు శరీర భాగము అది నిర్వహించవలసిన పని యొక్క పరిమితి మరియు సమతుల్యత ఉన్నాయి. తక్కువ ఆహారం లేదా సరైన ఆహారం తీసుకోకపోవడం ఈ సమతుల్యతను ప్రమాదంలో పడేస్తోంది అప్పుడప్పుడు వచ్చే దగ్గు ఊపిరితిత్తులను బలోపేతం చేయడానికి మరియు వ్యర్థ పదార్థాలు బయటకు పంపించడానికి సహాయపడుతుంది కానీ అనుకూలంగా వచ్చే దగ్గు అనారోగ్యం యొక్క సంకేతాలను సూచిస్తుంది. మితంగా తినండి ఎక్కువ కాలం జీవించండి... శ్రీ సత్య సాయి బాబా. 1

1.  దగ్గు అంటే ఏమిటి?

దగ్గు అనేది మనశరీరంలో ఉన్న గొంతు, వాయు మార్గాలను మలిన రహితంగా చేయటానికి మరియు ఇన్ఫెక్షన్ను నివారించడానికి సహజసిద్ధంగా ఏర్పడిన అసంకల్పిత చర్య. అప్పుడప్పుడు వచ్చే దగ్గు సాధారణమైనది గా మరియు ఆరోగ్యకరమైనదిగా పరిగణింపబడుతుంది. ఇది మనకు చికాకు కలిగించేదిగా ఉండవచ్చు కానీ శరీరం తనకు తానే స్వస్థ పరచు కోవడానికి ఇది సహాయపడుతుంది. ఇది అలాగే కొనసాగుతూ ఉంటే వెంటనే దాన్ని తగ్గించుకునే మార్గాలు అన్వేషించాలి.2,3,4 

2.  ప్రకృతి, కారణాలు మరియు దగ్గులో రకాలు

దగ్గు తీవ్రమైనది మరియు దీర్ఘకాలిక మైనది అనే రెండు రకాలు. దగ్గు అకస్మాత్తుగా ప్రారంభమై రెండు నుండి మూడు వారాల వరకు ఉంటే అది తీవ్రమైనదిగా పరిగణింప బడుతుంది. కొన్ని సందర్భాల్లో ఇది ఎనిమిది వారాల వరకు ఉంటుంది. పెద్ద వారిలో ఎనిమిది వారాల కంటే ఎక్కువ మరియు పిల్లల్లో నాలుగు వారాల కంటే ఎక్కువ కాలం కొనసాగితే దగ్గు దీర్ఘకాలిక వ్యాధిగా పిలవబడుతుంది.4

తీవ్రమైన దగ్గుకు కారణాలు: పొగ, పుప్పొడి వంటి అలర్జెన్స్, తేమ లేదా ఫంగస్ ఉపరితల నీళ్లపై మరియు చుట్టూ కనిపించే కొన్ని రకాల స్పోర్ట్స్ ఇంకా దుమ్ము వంటివి వాయు మార్గాల లోని నరాల చివరకు చేరి చికాకు కలిగిస్తుంది. ఇది సాధారణ జలుబు వల్ల లేదా ఫ్లూ వైరస్ లేదా బ్యాక్టీరియా వల్ల కలిగే శ్వాస కోశ సంక్రమణ వ్యాధి వల్ల కూడా కలగవచ్చు.2-7

దీర్ఘకాలిక దగ్గుకు కారణాలు: ఇది గ్యాస్ట్రో ఇసు పాగల్ రిఫ్లెక్స్(GERD)వ్యాధివలన, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు అయినటువంటి ఆస్త్మా లేదా బ్రాంకైటిస్ వలన గాని దీర్ఘకాలిక అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్(COPD) వలన కూడా సంభవించవచ్చు. వృద్ధాప్యంలో దీర్ఘకాలిక దగ్గు ఎక్కువగా జీర్ణకోశం లోని ఆమ్లం గొంతులోనికి రావడం లేదా యాసిడ్ రెఫ్లెక్స్2 వలన ఏర్పడుతుంది. ఇది కొన్ని రకాల ఔషధ సేవనం వల్ల కూడా కలగవచ్చు.2-7

మొండి దగ్గులు అని పిలవబడే దీర్ఘకాలిక దగ్గులు మానసిక సంబంధమైన కారణాలు అనగా ఆత్మవిశ్వాసం లేకపోవడం, ప్రతికూల భావనలు, అవగాహన రాహిత్యమూ, అలసట వంటి వాటి వల్ల కూడా కలుగుతుందితుంది.8

స్థూలంగా చెప్పాలంటే దగ్గులు రెండు రకాలు6 పొడి దగ్గు--తడి దగ్గు :

 పొడి దగ్గు దీనికి ప్రధాన కారణంపొగ త్రాగడం, మందులు,  ప్రారంభదశలో ఉన్న శ్వాసకోశ సంక్రమణ వ్యాధులు లేదా పల్మౌనరీ ఫైబ్రోసిస్ వంటి ప్రగతిశీల ఊపిరితిత్తుల వ్యాధులు మొదలగునవి.  పొడి దగ్గు లో కఫం ఉత్సర్గం ఉండదు.6,7

 తడి దగ్గు లేదా ఛాతీ తగ్గు దీనినే ఉత్పాదక దగ్గు అని కూడా పిలుస్తారు. ఇది తరచుగా గొంతు ఇన్ఫెక్షన్తో పాటు జలుబును  అనుసరిస్తుంది. అంతేగాక శ్వాస కోశాలలో ఇన్ఫెక్షన్, న్యుమోనియా,క్షయ లేదా ఊపిరి తిత్తులలో కఫం చేరడంతో గుండె ఆగిపోవడం వంటి వాటివలన కూడా ఏర్పడవచ్చు. ఇది శ్లేష్మాన్ని విడుదల చేస్తూ ఉంటుంది. గ్రంథుల ద్వారా క్రమం తప్పకుండా ప్రతీరోజూ ఇది  ఉత్పత్తి అవుతూ ముక్కు మరియు సైనస్, నోరు, గొంతు, ఊపిరితిత్తులు మరియు ముఖ్యమైన వాయు మార్గాలను తడి ఆరిపోకుండా ఉంచుతుంది. ఇది కొన్నిరకాల సూక్ష్మ జీవుల వంటివి, అలాగే కొన్ని రకాల ఇరిటెంట్స్ ఊపిరి తిత్తుల లోనికి ప్రవేశించకుండా ఒక వల లాగా ఉపయోగపడుతుంది. అంతేగాక ఇది కొన్ని రకాల ఇన్ఫెక్షన్లతో పోరాడే ప్రతిరోధకాలు మరియు ఎంజైమ్ లను కలిగి ఉంటుంది. అనారోగ్య సమయంలో మాత్రమే దీనిని మనం గమనించవచ్చు. అనారోగ్య సమయంలో శ్వాసకోశ వ్యవస్థ యొక్క దిగువ వాయు మార్గం నుండి దగ్గు ద్వారా బహిష్కరింపబడిన దీనిని కఫము లేదా శ్లేష్మం అంటారు. వైద్య పరిభాషలో పరీక్ష కోసం దీనిని తీసుకున్నప్పుడు శ్లేష్మం అనే పిలవబడుతుంది. ఇది జిగురుగా ఉండి అంటుకునే స్వభావం కలిగి ఉంటే డీ హైడ్రేషన్ లేదా అనార్ద్రత ను లేదా ఇన్ఫెక్షన్ పురోగమిస్తూ ఉన్నట్లు సూచిస్తుంది. దీని రంగు అంతర్లీనంగా ఉన్న అనారోగ్యమును సూచిస్తుంది. ఐతే  దీని రంగు ఒక రోజులో మారిపోయే అవకాశం కూడా ఉంది. 6,7,9-11  

కఫం యొక్క రంగులు: మన దైనందిన జీవితాన్ని ప్రభావితం చేయనంతవరకు పల్చగా ఉండి పారదర్శకంగా ఉన్నటువంటి కఫము సాధారణమైనది మరియు ఆరోగ్యకరమైనది అని భావించాలి. ముక్కుకు సంబంధించిన ఎలర్జీ, గవత జ్వరం, వైరల్ బ్రాంకైటిస్, న్యుమోనియా వలన కఫం ఏర్పడుతుంది. జలుబు, సైనుసైటిస్, బ్రాంకైటిస్ లేదా న్యూమోనియా ఉన్నపుడు కఫం యొక్క రంగు పసుపు రంగులో ఉండి ఆకుపచ్చ రంగులోకి చేరుకుంటూ ఉంటే ఇది పెరుగుతున్న ఇన్ఫెక్షన్ ను సూచిస్తుంది. తెల్లని కఫము అలర్జీలు, ఆస్త్మా లేదా సిఓపిడి(COPD), వైరల్ ఇన్ఫెక్షన్లు(GERD) లేదా గుండె జబ్బు వల్ల వస్తుంది. సిమెంట్ రంగు, లేదా నల్లని కఫం ఫంగల్ ఇన్ఫెక్షన్ ను లేదా బ్యాక్టీరియల్ సంబంధించిన ఊపిరితిత్తుల వ్యాధిని సూచిస్తుంది. ఇది పొగ త్రాగేవారు లేదాబొగ్గు గనుల్లో పనిచేసే వారికి వస్తూ ఉంటుంది. రస్టీ రంగు (లేదా పాత రక్తపు రంగు) అనేది దీర్ఘకాలిక వూపిరి తిత్తుల వ్యాధిని సూచిస్తుంది. ఎరుపు రంగు ఇన్ఫెక్షన్ లేదా కేన్సర్ వంటి రోగాన్ని సూచిస్తుంది .12,13 

గ్గులలో అంటువ్యాధులు  :

క్రూప్ అనేది 5 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లల్లో వచ్చే వైరల్ కు సంబంధించిన సంక్రమణ వ్యాధి. ఇది వాయునాళం, స్వరపేటిక మరియు వాయు మార్గాల వాపు కారణంగా మొరిగి నట్లుగా ధ్వనితో వచ్చే దగ్గు, మరియు ధ్వనితో కూడిన శ్వాస ఏర్పడుతూ ఉంటుంది. రాత్రి సమయాల్లో పరిస్థితి అధ్వాన్నంగాఉంటుంది. సాధారణంగా 2 నుండి 5 రోజుల్లో తగ్గిపోతుంది. కానీ  కొన్ని సందర్భాల్లో ఇది ఎక్కువ కాలం కూడా ఉండవచ్చు.14,15

 కోరింత దగ్గు: ఇదిబ్యాక్టీరియా వల్ల కలిగే తీవ్రమైన అత్యంత అంటుకునే స్వభావం కల శ్వాసకోశ సంక్రమణ వ్యాధి. ఇది ఫ్లూ వంటి  లక్షణాలతో కూడి 6 నుంచి 8 వారాల వరకు ఉంటుంది. టీకాల ద్వారా దీనిని నివారించవచ్చు. టీకాలు వేయడానికి ముందు పసిపిల్లల్లో ఇది వస్తుంటుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా లేదా క్షీణించిన వాళ్లలో లేదా వృద్ధాప్యము ఉన్న వాళ్లలో ఇది ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది. 16,17 

3. దగ్గుకి చికిత్స

దగ్గు అనేది వ్యాధి కాదు ఇది అంతర్లీనంగా ఉన్న శ్వాసకోశ వ్యవస్థ యొక్క రుగ్మత యొక్క సాధారణ లక్షణము.18  తీవ్రమైన దగ్గు పక్కటెముకలు మరియు ఛాతిలో నొప్పికలిగించడం, నిద్రలేమి, తలనొప్పి, వాంతులు ఇంకా మూత్రం ఆపుకోలేని స్థితిని కలిగిస్తుంది. దగ్గు తీవ్రంగా ఉండి మూడు వారాల కన్నా ఎక్కువ కాలం కొనసాగినా కఫంలో రక్తం పడుతున్నా, గాలి తక్కువగా పీల్చుకుంటున్నా లేదా ఊపిరి తీసుకోవడంలో కష్టం ఉన్నా, ఛాతీలో నొప్పి ఉన్నా వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది.4-6   అభ్యాసకుడు వ్యాధికి సంబంధించిన అనేక ప్రశ్నలు వేసి దగ్గు గురించి నిర్ధారణకు రావాలి. 18    

కొన్ని గృహ చిట్కాలు:

చిన్న పిల్లల విషయంలో ప్రత్యేక శ్ర ద్ధ : దగ్గు అనేది చిన్న పిల్లల విషయంలో సాధారణమైన సమస్య అయితే దీన్ని జాగ్రత్తగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. పిల్లలలో ఆరు సంవత్సరాలు వచ్చే వరకూ లక్షణాల రీత్యా దగ్గు ఉపశమనం కోసం మందులు వాడాలి. ఈ విషయంలో చేయబడిన అధ్యయనాలు పైవిషయానికి మద్దతు ఇవ్వడం లేదు. యాంటీబయాటిక్స్  వైరల్ ఇన్ఫెక్షన్స్ పై ప్రభావం చూపు తాయి. పైగా అవి కలిగించే సైడ్ ఎఫెక్ట్లు దగ్గు కన్నా కూడా మరింత బాధకలిగించే దుష్ప్రభావాలను కలిగిస్తాయి. కనుక ఈ విషయంలో ఖచ్చితమైన రోగనిర్ధారణ అనేది అత్యంత ఆవశ్యకం. 18,24,25   

పిల్లల కోసం కొన్ని నిర్దిష్ట గృహ సంరక్షణ చిట్కాలు :

4. నివారణ మరియు జాగ్రత్తలు

త్వరగా జలుబు మరియు దగ్గుకు గురి అయ్యే లక్షణాలు గల వ్యక్తి ప్రారంభం నుండి కూడా దాని తీవ్రతను నివారించడానికి తగిన గృహ చిట్కాలను క్రమం తప్పకుండా తీసుకోవడం మంచిది .

 సాధారణ జలుబు, దగ్గు నుండి త్వరగా ఉపశమనం కోసం మునుపటి వార్తా పత్రికలో ఇచ్చినటువంటి గృహ చిట్కాలను అనుసరించ వచ్చు.29 వయసు మళ్ళిన వారిలో దగ్గుకు ప్రధాన కారణం ఎసిడిటీ లేదా ఆమ్లత్వం. సరైన జీవనశైలి, సరైన ఆహారం మరియు  వ్యాయామం ద్వారా దీనిని నిరోధించవచ్చు. 30

ఇన్ఫెక్షన్ వ్యాపించకుండా నివారణ : సరైన  పరిశుభ్రతా అలవాట్ల ద్వారా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చేయకుండా నిరోధించవచ్చు. తుమ్ములు, దగ్గు వచ్చినప్పుడు మందమైన టిష్యూ పేపర్ లేదా కాటన్ క్లాత్ ఉపయోగించాలి మరియు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.29 టిస్యూ పేపరయితే వదిలివేయాలి, పునర్వినియోగ వస్త్రాన్నివాడితే దానిని శుభ్రంగా ఉతకాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం ఎందుకంటే అతి తక్కువ సమయంలో జలుబుకు సంబంధించిన తుంపర్ల ద్వారా ఇది ఇతరులకు వ్యాపిస్తుంది. ముఖ్యంగా అజాగ్రత్త కారణంగానే జలుబు, దగ్గు వేగంగా వ్యాపిస్తాయి..

ముందస్తు చర్యల్లో భాగంగా అనారోగ్యంతో ఉన్న వారితో సన్నిహిత సంబంధాలు నివారించడం, అనారోగ్య సమయంలో ఇంట్లోనే ఉండటం, ముక్కు మరియు నోటిని బట్టతో కప్పి ఉంచుకోవడంమంచిది. కళ్ళు, ముక్కు , నోరు వంటివి క్లాత్ వంటివి ఏమీ లేకుండా తాకకుండా ఉండటం మంచిది. అలాగే తాకిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ధూమపానం చేసే వారు మద్దతు సమూహాలు లేదా నెట్వర్క్ ల సహాయంతో ఆ అలవాటును మానివేయవచ్చు.

సాయి వైబ్రియానిక్స్వైబ్రియానిక్స్ రెమిడీ ల ద్వారా  దగ్గు తీవ్రతను తగ్గించవచ్చు లేదా రాకుండా నివారించ వచ్చు. CC4.10     Indigestion, CC9.2 Infections acute, CC19.1 Chest tonic, CC19.2 Respiratory allergies, CC19.6 Cough chronic, CC19.7 Throat chronic, లేదా 108 CC బాక్సు నుండి తగిన నివారణ  NM8 Chest, NM9 Chest TS, NM37 Acidity, NM46 Allergy-2, NM54 Spasm, NM62 Allergy-B, NM70 CB9, NM71 CCA, NM73 Croup, NM76 Dyspnoea, NM92 Post Nasal Drip, లేదా 576 కార్డుల నుండి తగిన కార్డుల ను ఎంపిక చేయవచ్చు.31

రిఫెరెన్స్ కోసం వెబ్సైట్ లింకులు:

  1. http://www.sssbpt.info/ssspeaks/volume15/sss15-21.pdf Sathya Sai Speaks,vol.15,21 Good health and goodness, 30 Sept.1981
  2. What is cough & its nature: https://www.nhlbi.nih.gov/health-topics/cough;https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC2532915/
  3. https://medlineplus.gov/cough.html     
  4. https://www.mayoclinic.org/symptoms/cough/basics/definition/SYM-20050846https://www.mayoclinic.org/diseases-conditions/chronic-cough/symptoms-causes/syc-20351575?p=1
  5. Causes of cough: https://www.health.com/health/gallery/0,,20358279,00.html
  6. Types of cough: https://www.health24.com/Medical/Cough/Overview/Types-of-cough-20120721
  7. https://www.nhsinform.scot/illnesses-and-conditions/lungs-and-airways/cough
  8. Psychological cause of cough: https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC5357770/
  9. Mucus, phlegm, sputum:  https://www.medicinenet.com/what_is_mucus/article.htm
  10. https://www.everydayhealth.com/cold-flu/everything-you-ever-wondered-about-mucus-and-phlegm.aspx
  11. https://en.wikipedia.org/wiki/Phlegm
  12. Colour of phlegm: https://www.healthline.com/health/green-phlegm
  13. https://wexnermedical.osu.edu/blog/what-does-the-color-of-your-phlegm-mean
  14. Croup cough in children: https://www.healthline.com/health/croup#symptoms  
  15. https://www.mydr.com.au/respiratory-health/croup-symptoms-and-treatments
  16. Whooping cough: https://www.mayoclinic.org/diseases-conditions/whooping-cough/symptoms-causes/syc-20378973
  17. https://www.nhs.uk/conditions/whooping-cough/
  18. Pertinent questions on cough: https://www.ncbi.nlm.nih.gov/books/NBK359/
  19. Home remedies for dry cough from online information guide launched by the Government of India:http://vikaspedia.in/health/ayush/ayurveda-1/ayurveda-for-common-disease-conditions/is-dry-cough-keeping-you-awake-find-relief-through-ayurveda
  20. Home remedies: https://food.ndtv.com/health/6-best-home-remedies-for-cough-to-give-you-instant-relief-1445513
  21. https://www.medicalnewstoday.com/articles/322394.php
  22. https://www.rd.com/health/wellness/natural-cough-remedies/
  23. https://www.slideshare.net/BhimUpadhyaya/food-body-by-sadhguru
  24. 2011 study on Handling cough of children: https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC3056681/
  25. 2017 study on chronic cough in children: https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC5427690/
  26. Honey for cough in children:  https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC4264806/
  27. Specific home care for children: https://parenting.firstcry.com/articles/35-safe-home-remedies-for-cough-in-children/
  28. https://www.healthline.com/health/parenting/toddler-cough-remedy#home-remedies
  29. Sai Vibrionics Newsletter, Precautions and Home remedies for Combating Common Cold, paras 4 & 5, Vol 9 Issue 6
  30. Sai Vibrionics Newsletter, Health Tips on Acidity – Nip it in the bud, Vol 8 Issue 4.
  31. Soham Series of Natural Healing, Volume 5, The Diseases, Coughs, p.79. Also refer to volume 3, and Vibrionics 2018, p.116

 

2.  రిఫ్రెషర్ సెమినార్, వెస్ట్ లండన్, యుకె, 6 జనవరి 2019

15మంది సభ్యులు పాల్గొన్న ఈ సదస్సు ఉత్సుకత వాతావరణంలో కొనసాగించడానికి వీలుగా ఒక చిన్న ధ్యాన ప్రక్రియతోనూ, ప్రార్ధన తోనూ ప్రారంభం అయింది. ప్రాక్టీషనర్  02799 విలువలతో కూడిన పంట పండించడానికి స్వామికి పూర్తిగా శరణాగతి చేయాలని నొక్కి చెబుతూ సదస్సును ప్రారంభించారు. ఎస్.వి.పి. కోర్సు చేయడానికి మరిన్ని ఎక్కువ చికిత్స విధానాల అవకాశాలను ఎలా అందిస్తుందో ఆమె వివరించారు. ఉదాహరణకి శరీరంలోని ద్రవాలు ఉపయోగించి నోసొడ్ల తయారీ ఎన్నో చోట్ల తయారీ అలర్జెన్స్ఉపయోగించి వ్యక్తిగత నివారణలు తయారీ అల్లోపతిమందుల దుష్ప్రావాల నివారణకు పోటెన్టైజ్చేయడం వంటివి వివరింపబడ్డాయి. ఎస్.వి.పి. కోర్సు దరఖాస్తుదారులు పరిపాలన విధులను చేపట్టడం ద్వారా వైబ్రియానిక్స్ పట్ల మరింత ఎక్కువ నిబద్ధత ప్రదర్శించాల్సిఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో ఒకే సమయంలో ఒకే వ్యాధికి చికిత్స చేయడం యొక్క ప్రాముఖ్యత చెప్పబడింది. విజయవంతమైన కేసులను పంచుకునేటప్పుడు కేస్ హిస్టరీ పూర్తి వివరాలతో సమర్పించవలసిన అవసరం గురించి కూడా చెప్పబడింది. 108 సి సి బాక్స్ లోని ద్రవ నివారణలు మబ్బుగా లేదా మేఘావృతం అయినట్టుగా ఉంటుందని బహుశా శీతల వాతావరణం కారణంగా ఇలా ఉండవచ్చని గుర్తించబడింది. భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితి ఎదుర్కోడానికి ఎలా సిద్ధమవవ్వాలో గుర్తించడం జరిగింది.

సదస్సులో పాల్గొన్న వారు తాము తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ వహించవలసిన అవసరాన్ని చర్చించారు. అప్పుడు మాత్రమే ఒక అభ్యాసకుడు రోగులకు తగు విధంగా మార్గ నిర్దేశం చేయగలడు. తాజా పండ్లు మరియు కూరగాయలు మరియు వాటి రసాలు మరియు మొరింగా (మునగ)  వంటి ఆకుకూరలపైన ఆధారపడాలని సూచింపబడింది. మాంసాహార ఆహారాలకు దూరంగా ఉండటం మరియు ఐదు తెల్లని పదార్ధాలు శుద్ధి చేసిన బియ్యం, పాలు, రిఫైన్ఉప్పు, మైదాపిండి, పంచదార అనే  ఈ ఐదు పదార్థాల నుంచి దూరంగా ఉండి ప్రత్యామ్నాయాలతో వీటిని భర్తీ చేసుకోవడం ద్వారా జీర్ణకోశ ఇబ్బందులు నొప్పులు మరియు క్యాన్సర్ కూడా రాకుండా ఉంటుందని గుర్తించబడింది. ప్రాక్టీషనర్ 03541 తన అనుభవాన్ని వివరిస్తూ ఈ ఐదు పదార్ధాలను పూర్తిగా వదలడం వల్ల తను దంతాల నొప్పి నుండి నివారణ అవడమే కాక ఒక వారంలోనే జీర్ణ వ్యవస్థ మెరుగుపడింది మరియు  దీర్ఘకాలిక వెన్నునొప్పి దాదాపుగా మాయమైంది అని చెప్పారు. 108 సి సి బాక్స్ రీఛార్జి చేసిన తర్వాత తారీకు నమోదు చేసుకోవాలని నిర్ణయించడం జరిగింది. ఈ సదస్సు స్వామికి హారతి సమర్పించడంతో ముగిసింది.

 

 

 

 

 

 

 

 

 

3. ధర్మక్షేత్ర, ముంబై, ఇండియా లో  రిఫ్రెషర్ వర్క్ షాప్, 9 ఫిబ్రవరి 2019

36 మంది అభ్యాసకులు హాజరైన  అత్యంత విలువైన సమాచారం మరియు ఇంటర్ యాక్టివ్ కోర్సుఅందించే సదస్సు సీనియర్    వై బ్రియానిక్స్ టీచర్ 10325. ఆధ్వర్యంలో ప్రారంభం అయింది. కొత్తగా వచ్చినటువంటి ఎ. వి. పి. మాన్యువల్‌ ప్రతి అధ్యాయాన్ని స్పృశిస్తూ ఇటీవల వచ్చిన నవీ నీకరణలను నొక్కి చెప్పడం జరిగింది. కొత్తగా వచ్చిన అభ్యాసకులకు మార్గ దర్శకత్వం వహించడం వంటి కార్యక్రమం గురించి పాల్గొన్నవారికి తెలియజేయడం జరిగింది. కొన్ని ముఖ్య సూచనలు ( టేక్ హోమ్ పాయింట్లు) క్రింది విధంగా ఇవ్వబడినవి. తక్కువ పనులకు కట్టుబడి ఎక్కువ పని చేయడం లేదా తక్కువ పనులను ఎంచుకొని సమర్థవంతంగా నిర్వహించడం, వైబ్రియానిక్స్ విషయంలో స్వామికి ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉండడం. వైబ్రియానిక్స్ కొoబోలు చాలా  శక్తివంతమైనవి కాబట్టి చికిత్స వేగవంతం చేయడానికి తగిన కొంబోలను ఇవ్వాలి. ఎక్కువగా కాకుండా నిర్దేశించిన కొంబోలను మాత్రమే ఇవ్వాలి. వ్యాధి నివారణ తర్వాత క్రమ పద్ధతిలో మోతాదును తగ్గించడం, అలాగే ప్రక్షాళన, ఇమ్యూనిటి కొంబొలు నియమ బద్ధంగా రోగికి ఇవ్వడం (అయితే ఈ విషయంలో మొదట ప్రాక్టీషనర్ అనుసరించాలి). రోగి యొక్క రికార్డులను క్రమపద్ధతిలో నిర్వహించడం, వివరాలను వెంటనే నివేదించడం, అలాగే విజయవంతమైన కేసులు ప్రచురణ కోసం నివేదించడం మరియు వైబ్రియానిక్స్ సoస్థను బలోపేతం చేయడానికి పరిపాలన బాధ్యతలు తీసుకోవాలని ఈమె అభ్యాసకులకు సూచించారు.

పుట్టపర్తి నుండి డాక్టర్ అగర్వాల్ గారు వాట్సాప్ ద్వారా చేసిన ప్రసంగంలో ఇటీవల వైబ్రియానిక్స్ పెరుగుదల గురించి మాట్లాడుతూ స్వామి ఏ విధంగా 2007వ సంవత్సరం పుట్టపర్తి బయట మొట్ట మొదటి సారిగా మహారాష్ట్ర నుండి ప్రారంభించిన సదస్సులను ప్రేరేపించి  ఆశీర్వదించారు మరియు మార్గనిర్దేశం చేశారు అనేది తెలియచేశారు. ప్రేమ మరియు కరుణ సేవకు రెండు స్తంభాల వంటివని అవి రోగులకు ఉత్తమ ఫలితాలు ఇస్తాయని చెప్పారు.

మహారాష్ట్రలోని సాయి సంస్థ యొక్క గత మరియు ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుల మద్దతు పొందటం, విశేషమనిచెప్పారు. అభ్యాసకులు చేసిన అమూల్యమైన సేవలు అభినందిస్తూ తమ రాష్ట్రంలో వైబ్రియూనిక్స్ ను ముందుకు తీసుకువెళ్లడానికి వారు ఆసక్తిని వ్యక్తం చేసిన విషయం చెప్పారు. పునరుద్ధరించిన ఉత్సాహంతో సేవలను అందించడానికి సదస్సు, అభ్యాసకులను ఎంతో ప్రేరేపించింది.

 

 

 

 

 

 

 

 

Om Sai Ram