Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ప్రశ్న జవాబుల విభాగము

Vol 6 సంచిక 4
July/August 2015


1. ప్రశ్న:మేము ఎక్కడికైనా ఎక్కువ సమయానికి(ఉదాహరణకి 3 నెలలు) వెళ్ళవలిసి వస్తే అపుడు పెశంట్లుకి చెప్పాలా? ధీర్గకాలిక రోగ సమస్యలుకి ఎన్ని బాటిల్స్ మందులివ్వాలి?లేక పెశంట్లుని వేరొక అభ్యాసకుడిని హీలర్ ఇన్ఫో ఈమెయిలు ద్వారా సంప్రదించమని చెప్పాలా?

    జవాబు: మీరు ఎక్కువ కాలానికి ఎక్కడికైనా వెళుతుంటే పెషంట్లకి విషయం తెలియచేయడం మంచిది.పేషంట్లు మందుని నీళ్ళలో కలిపి తీసుకొమ్మని చెప్పండి.(200మిలి నీళ్ళలో 5 పిల్స్ కలపాలి). విధంగా చేసినప్పుడు ఒక బాటిల్ మందు రోజుకి మూడుసార్లు తీసుకుంటే మూడు నెలల వరకు సరిపోతుంది.పెశంట్లుకి వేరొక అభ్యాసకుడి సంపర్క వివరాలు ఇవ్వడం మంచింది.

________________________________________

2. ప్రశ్న: అప్పుడపుడు పేషంట్లు వాళ్ళ కుటుంభ సభ్యులకి మందులు కావాలని అడిగి మందులు తయారుచేసాక వచ్చి తీసుకోరు.మరికొద్ది మంది మందును తీసుకొని వాడకుండా ఉంచుకుంటారు లేదా వేసుకుని సమాచారము తెలియచేయరు. ఇటువంటప్పుడు ఒక అభ్యాసకునిగా నేను ఏమి చేయవలెను?

    జవాబు: ఒక పేషంటు మరో వ్యక్తి కొరకై మందు అడిగినప్పుడు ఆ యొక్క వ్యక్తి మీతో సంప్రదించినట్లయితేనే మీరు ఆ పేషంటుకి మందు తయారు చేయాలి.మీరు ఈ క్రింద వ్రాసిన మూడు కారణాలు కొరకు పేషంటుతో స్వయంగా సంపర్కం పెట్టుకోవాలి:1) పేషంటుకి  వైబ్రియానిక్స్ మందులు కావాలా వద్దాయని కచ్చితంగా తెలుసుకోవడానికి 2) పేషంటుకి మొదటి డోస్ అభ్యాసకుడు స్వయంగా వేస్తే మంచిది.3) పేషంటుకి ఈ మందు వాడేడప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు స్వయంగా చెప్పడానికి. పేషంటు తనకున్నసమస్యల్ని తానే స్వయంగా వివరించితే మంచిది.

________________________________________

3. ప్రశ్న:కొంతమంది పేషంట్లు రెండు లేదా ఇంకా ఎక్కువ  రకాల మందులు తీసుకుంటున్నపుడు మధ్యలో పది నిమిషాల సమయం చాలా అధికమని అంటున్నారు.వాళ్ళకి నేను మొదటి మందు తీసుకున్న వెంటనే మరో మందు తీసుకోవచ్చని చెప్పవచ్చునా?

    జవాబు: రెండు విధముల మందులకి మధ్య పది నిమిషాల వ్యవధి అవసరం లేదు. మొదటి పిల్ నోటిలో కరిగిపోగానే రెండవ పిల్ వేసుకోవచ్చు.

________________________________________

4) ప్రశ్న:నేను పంపిన అసాధారణ (ఎక్స్ట్రా ఆర్డినరీ ) కెసు ప్రచురింపబడ్డ ఒక నెలరోజుల తరవాత పేషంట్ తన సమస్యకి సంభందించిన వేరే అంశాలలో కూడా  మెరుగు కనపడింది.మరో ఐదు నెలల తరవాత పేషంటు ఆరోగ్యం మరింత మెరుగుపడిందని తెలిసింది.నేను కేసు వివరాలని తాజా మార్పులతో మళ్ళి పంపించాలా?

    జవాబు: పెషంట్లో వ్యాధి సంభందించిన వేరే అంశాలలో మెరుగు ఏర్పడినందువలన మీరు ఈ కేసు మునుపటి సూచికతో పాటు కొత్తగా ఏర్పడిన మార్పులను పంపవలెను.(వార్తాలేఖ నెల మరియు ఏడాది)

________________________________________

5) ప్రశ్న: నేను అప్పుడప్పుడు వేర్వేరు ధీర్గకాలిక రోగ సమస్యలకి మందులన్నీ ఒకటే కవర్లో పెట్టి పంపిస్తాను. పేషంటుకి  పుల్ అవుట్ లేకపోతే రెండవ మందుని కూడా తీసుకోవడం మొదలుపెట్టమని చెప్పవచ్చా?

    జవాబు: పేషంటుకి పుల్ అవుట్ లేకపోయినా లేదా పుల్ అవుట్ పూర్తయిన తరవాత మొదటి సమస్యలో కొంతవరకు మెరుగు కనిపించాక రెండవ మందుని తీసుకోవడం మొదలు పెడితే మంచిది.

________________________________________

6. ప్రశ్న: ఒక పేషంటు తన మందుల్ని వేసుకోవడంలో క్రమం పాటించకుండా తన రోగ లక్షణాలు నయం కావట్లేదని మోర పెట్టుకుంటే నేను ఎలా స్పందించాలి?

    జవాబు: మనమిచ్చే మొదటి మరియు ఆఖరి మందు ప్రేమ మాత్రమే. మందు తీసుకోవడంలో ఎంతుకు పేషంటు క్రమం పాటించలేకపోతున్నాడో అడిగి తెలుసుకోవాలి.పేషంటు ఇచ్చే సమాధానం ఓర్పుగా వినండి.క్రమం తప్పకుండా ఈ మందు వేసుకుంటే త్వరగా ఉపసమనం కలుగుతుందని ప్రేమగా  చెప్పి పేషంటుని మందు రోజు వేసుకోనేలా ప్రోత్సాహించాలి.

________________________________________

7. ప్రశ్న:పాత పేషంట్లు ఫోన్లో సంప్రదించినప్పుడు సుమారు ఎంత సేపు వాళ్ళకి నేను ఇవ్వచ్చు?అప్పుడప్పుడు నేను వాళ్ళతో సంభాషణని ముగించాలాని ప్రయత్నిస్తే పేషంట్లకు నచ్చడంలేదు.

    జవాబు: ఒకవేళ ఫోన్ సంపర్కం ఫాల్లో అప్ విసిటుకి భధులుగా అయితే ఆ పేషంట్కి మీరు 30 నిమిషాలు సమయం ఇవ్వవచ్చు.మీరు మీ సంభాషణని ఏ విధంగా మళ్లించాలంటే ఈ ముప్పై నిమిషాల సమయంలో ఆ పేషంటు తాను చెప్పవలసినదంతా చెప్పాక  మీరు అతని ప్రశ్నలన్నిటిని ఓర్పుతో విని ప్రేమతో జవాబివ్వడానికి అవకాశం ఉండాలి. మీ సంభాషణ ప్రారంభంలోనే మీరు ఎంత సమయం ఆ పేషంట్ కి ఇవ్వగలుగుతారని  చెప్పడం మంచిది.

________________________________________

8. ప్రశ్న:పేషంట్లని తపాలు పంపడానికయ్యే ఖర్చుని ఇవ్వమని అడగవచ్చునా?

    జవాబు: పేషంట్లనుండి పైకము తీసుకోము అని మీరు ప్రమాణం చేసియున్నారు కనుక తపాలు పంపడానికి కావలసినంత పైకం మీరు పెట్టుకోగలిగితే పెట్టుకోవడం మంచిది.ఒకవేళ తపాలు ఖర్చు చాలా ఎక్కువగా ఉంటె మీరు పేషంట్లను తపాలా బిళ్ళలని మీకు పంపించమని అడగవచ్చు.

________________________________________

9. ప్రశ్న:ఒకవేళ పేషంట్ బహుమానంకాని పైకంకాని మనకివ్వాలని తీసుకొస్తే ఏం చేయాలి?

    జవాబు: పేషంట్లకు చికిత్స ప్రారంభంలోనే మీరు బహుమానాలుకాని పైకంకాని తీసుకోరని ప్రమాణం చేసియున్నారని తెలియచేసుంటే కనుక ఇలాంటి సందర్భం రానే రాదూ.ఒకవేళ పేషంటు మీకు పైకం బహుమతిగా ఇవ్వాలని పట్టుబడితే ఆ పైకాన్ని విరాళముగా వేరే చోట ఇవ్వమని చెప్పచ్చు. ఒకవేళ పేషంటు మీకు బహుమతినిగాని లేదా అభిమానంతో మీకు ఉపకారం చేయాలని చూస్తే మీరు ప్రేమతో తిరస్కరించాలి. పేషంటుకి ఏదైనా ఉపద్రవం కలిగినట్లయితే అతనికి/ఆమెకి వచ్చిన మంచి ఆలోచనకు ధన్యవాదాలు తెలుపుకొని ఆ బహుమతిని ప్రేమతో తిరిగి  ఇచ్చేయాలి. ఆ పేషంటు సేవ చేయడానికి మీకొక మంచి అవకాశాన్ని ఇచ్చి మీ కర్తవ్యాన్ని నెరవేర్చడానికి సహాయపడ్డారని చెప్పండి.