Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

అదనపు సమాచారం

Vol 5 సంచిక 4
July/August 2014


ఆరోగ్య చిట్కాలు 

సాయి వైబ్రియోనిక్స్ అందించే ఆరోగ్య సమాచారము, కథనాలు విజ్ఞానము నిమిత్తమే. దీనిని వైద్య సలహాలుగా భావించరాదు. మీ పేషంట్ల యొక్క ప్రత్యేక వైద్య పరిస్థితి నిమిత్తం తమ తమ వైద్య నిపుణులని సంప్రదించ వలసిందిగా సూచించండి.    

మెగ్నీషియం ఖనిజం యొక్క ఉపయోగాలు మరియు మీ ఆరోగ్య పరిరక్షణలో దీని ప్రాముఖ్యత

మెగ్నీషియం ఇది మన శరీరంలో పుష్కలంగా లభించే ఈ ఖనిజము సహజంగా ఎన్నో ఆహార పదార్ధాలలోనూ అనుబంధ ఆహార ఉత్పత్తులలోనూ, కొన్ని రకాల ఔషధాల లోనూ (యాంటాసిడ్స్& లాక్జేటివ్స్) లభ్యమవుతుంది. మెగ్నీషియం లేకపోతే మన దేహం శక్తిని ఉత్పత్తి చేయలేదు, మన కండరాలు శాశ్వతంగా కుంచించుకుపోయి ఉంటాయి, ఇంకా మన రక్తం లోనికి విడుదలయ్యే కొవ్వు శాతాన్ని నియంత్రించడం కూడా అసాధ్యమే.    

ఇది మనశరీరం లో జరిగే శక్తి స్థాయిలను క్రమబద్ధీకరించడం, విశ్రాంతిగా ఉండడానికి దోహద పడడం, గుండె మరియు రక్త నాళముల వ్యవస్థను  ఆరోగ్యంగా ఉంచడం వంటి   300 రకాల రసాయనిక చర్యలకు అవసరం.

మెగ్నీషియం లోపం మన శరీరంలో అస్తమా, మధుమేహం, బోలుఎముకలవ్యాధి వంటి అనేక రుగ్మతలను కలిగిస్తుంది. తగు పాళ్ళలో దీనిని తీసుకున్నట్లయితే గుండెజబ్బులకు దూరంగా ఉంచుతుంది.  

మెగ్నీషియం మన DNAను సంరక్షిస్తుంది

మెగ్నీషియం లోపం మన DNA సంశ్లేషణను నెమ్మదింప చేస్తాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. DNA పటుత్వము మనం తీసుకునే మెగ్నీషియం మీదే ఎక్కువ ఆధారపడిఉంటుంది. మెగ్నీషియం DNA నిర్మాణాలను స్థిరపరచడమే కాక జన్యుపరమైన లోపo వల్ల DNA క్షయమవడం నిరోధించడంలో సహాయకారిగా పనిచేస్తుంది. మెగ్నీషియం ATP తో కలిసి  మన శరీరంలో ప్రోటీన్ల ఉత్పత్తికి, DNA నిర్మాణం చదవడానికి కారణమైన RNA ఉత్పత్తికి కూడా కారణమవుతున్నది. 

మెగ్నీషియం మన శరీరంలోని విద్యుత్వాహక సమతౌల్యమును క్రమబద్ధీకరిస్తుంది

మన శరీరానికి అవసరమైన కాల్షియం, సోడియం, పొటాషియం వంటి ఖనిజ లవణాల సమతౌల్యం కాపాడడం ద్వారా విద్యుత్వాహకత్వానికి, కండరాల సంకోచ వ్యాకోచాలకు, హృదయ స్పందనకు ఈ మెగ్నీషియం ప్రధాన భూమిక నిర్వహిస్తోంది.

రక్తము, హృదయము, ఎముకల పటిష్ట స్థితికి మెగ్నీషియం

ఎముకలు గట్టిగా ఉండాలంటే కాల్షియం బాగా తీసుకోవాలని మనం తరుచుగా వింటూఉంటాము. అలాగే ఆరోగ్యకరమైన ఎముకల నిర్మాణానికి మెగ్నీషియం పాత్ర కూడా ఎంతో ఉంది.  సాధారణంగా ఎముకల గట్టిదనానికి కాల్షియం మాత్రలు తీసుకుంటూ ఉంటారు కానీ బోలుఎముకల వ్యాధి రాకుండా ఉండాలంటే కాల్షియం కంటే  మెగ్నీషియం ఎక్కువ తీసుకోవడం మంచిది.

మానవ హృదయానికి మెగ్నీషియం అతి ముఖ్యమైన పోషక పదార్ధము. గుండె కండరాలు పటిష్టంగా పనిచేయడానికి ఇది సహాయకారిగా ఉంటుంది. రక్తకణాల నిర్మాణంలోనూ, రక్తాన్ని పలచన పరచడం లోనూ దీని పాత్ర ఎంతో ఉంది కనుక గుండెజబ్బుల నిరోధానికి ఇదెంతో ఉపకరిస్తుంది.

మెగ్నిషియం మరియు మధుమేహ వ్యాధి

మెగ్నీషియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్ధాలను తీసుకోవడం ప్రత్యేకంగా మధుమేహ సమస్య నుండి దూరంగా ఉంచుతుంది  ఎందుకంటే గ్లూకోజ్ జీవక్రియలో మెగ్నీషియంకి ప్రముఖ పాత్ర ఉంది. హైపోమెగ్నీసేమియా (మెగ్నీషియంలోపం) ఇన్సులిన్ సమస్యకు దోహద పడుతుంది తిరిగి ఇదే మధుమేహ వ్యాధికి దారితీస్తుంది. మధుమేహం మూత్రం ద్వారా ఎక్కువ మెగ్నీషియం శరీరం నుంచి వెళ్లిపోయేటట్లు చేస్తుంది. ఆవిధంగా ఏర్పడే మెగ్నీషియంలోపం ఇన్సులిన్ తగు మోతాదులో శరీరంలో ఉండకుండా చేస్తుంది. అందువలన మధుమేహం అదుపులో ఉండకుండా ఇంకా జటిలమైయ్యే అవకాశం ఉంది.

మెగ్నిషియం లోపం లక్షణాలు

  • జాయింట్లు మరియు కండరాల నొప్పులు
  • వాపు
  • ఆకలి లేకపోవడం వికారము
  • తిమ్మిరులు మరియు వళ్ళు జలదరింపు
  • మైగ్రేన్ తలనొప్పి
  • అలసట
  • సాధారణమైన నీరసం
  • బోలు ఎముకల వ్యాధి
  • రక్తంలో చక్కర శాతం నిలకడ లేమి
  • అధిక రక్త పోటు

ఇటివలే వెలువడిన నూతన అధ్యయనాలు మెగ్నీషియం లోపం మన మానసిక భావోద్వేగములపైన కూడా ప్రభావం కలిగిస్తుందని తెలుపుచున్నాయి. ఎవరైతే నిద్రలేమితో, డిప్రెషన్, భావోద్వేగ అలజడులతో బాధ పడుతున్నారో వారి ఆహారంలో మెగ్నీషియం శాతం పెంచడం ద్వారా మంచిఫలితాలు కలిగాయి. అలాగే వారి భయాందోళనలు అభద్రతా భావం ఇవికూడా తగ్గుముఖం పట్టాయని సూచిస్తున్నాయి. శాస్త్రవేత్తలు మెగ్నీషియంను తక్కువ అంచనా వేయడానికి దాని ప్రాముఖ్యత గ్రహించలేకపోవటానికి మరో కారణం రక్తపరీక్ష ద్వారా మెగ్నీషియంశాతం తెలుసుకోవడం కష్టం. ఎందుకంటే రక్తంలో మెగ్నీషియంశాతం ఉండేది ఒక్క శాతమే. కనుక రకరకాల తాజా పళ్ళు తినడంవల్ల మెగ్నీషియంలోపం నుండి దూరంగా ఉండవచ్చు.

 

 

 

 

 

 

మెగ్నీషియం లోపానికి గురయ్యే అవకాశం ఉన్న వ్యక్తులు

  •  55 సంవత్సరాలకు పైబడినవారు
  • ప్రతీరొజూ ఆల్కహాల్ తీసుకునేవారు, కెఫీన్ తో కూడిన పానీయాలు లేదా సోడాలు తీసుకునే వారు
  • మూత్ర విసర్జనకు సంబంధించిన, గుండెజబ్బులకు, ఆస్తమాకు, సంతాన నియంత్రణ, ఈస్ట్రోజెన్ భర్తీకి చెందిన మందులు, ఇటువంటివాటికి  సంబంధించిన మందులు తీసుకునేవారు
  • మానసికమైన, శారీరక మైన వత్తిడికి గురైన వారు, లేదా శస్త్రచికిత్స, కాలిన గాయాలు, లివరుకు సంబంధించిన వ్యాధులు ఉన్నవారు
  • జీర్ణ సంబధమైన వ్యాధులున్నవారు

మెగ్నీషియం ఎక్కువగా లభ్యమయ్యే ఆహార పదార్ధాలు

1.    పొట్టు  – ధాన్యము, గోధుమలు, ఓట్లు

2.   మూలికలు  – ధనియాలు, కొత్తిమిర, కింజల్కము, పుదీనా, మెంతులు, సబ్జాలు మరియు తులసి   

     3.    విత్తనాలు  – గుమ్మడి, ప్రొద్దుతిరుగుడు, అవిశగింజలు, నువ్వులు

     4.    గింజలు – బాదం గింజలు, బ్రెజిల్ నట్ లు, జీడిపప్పు మరియు దేవదారు గింజలు

     5.    నల్లని చాక్లెట్లు 

మెగ్నీషియం పుష్కలంగా లభించే  ఇతర పదార్ధాలు: పాలకూర, క్యాబేజీ, ఎండిన చిక్కుడు విత్తనాలు, ధాన్యములు, బ్రెడ్, అపరాలు.

ఇంతేకాక తగినంత కాల్షియం, విటమిన్ D మరియు విటమిన్ K ఉన్నట్టి ఆహారము తీసుకొన్నట్లయితే మెగ్నీషియం యొక్క పూర్తి ఫలితాలు పొందవచ్చు. సమతుల్యం గల ఆహారం, సంధ్యా సమయాలలో సూర్య రాశ్మికి లోనుకావడం ఇవికూడా మన దేహానికి అవసరమే. 

 

   

 

 

 

 

 ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసుకొనుటకు ఆ ఆహార పధార్ధాల నుట్రీయేంట్ రేటింగ్ చార్ట్ ను చూడండి                         

 

 

 

 

 

మూలములు: 

http://ods.od.nih.gov/factsheets/Magnesium-HealthProfessional/
http://www.ancient-minerals.com/magnesium-benefits/what-is-function/
http://www.doctoroz.com/blog/daniel-heller-nd/magnesium-miracle-mineral
http://en.wikipedia.org/wiki/Magnesium
http://undergroundhealthreporter.com/magnesium-health-benefits/#axzz34AqqR6IE
http://www.whfoods.com/genpage.php?tname=nutrient&dbid=75 

 

డెంగ్యు జ్వరమా! నీవు ప్రమాదంలో ఉన్నావా ?

డెంగ్యు అనే అత్యంత బాధాకరమైన జ్వరం ( డెంగ్-గే అని పలకబడుతుంది) శతాబ్దాల తరబడి మానవాళికి హాని కలిగిస్తూ ఉన్నప్పటికీ 1980లో అనూహ్యంగా ఇది ఉధృతంగా విస్తరించ సాగింది. ఇటీవలి దశాబ్దాలలో డెంగ్యు కేసులు కూడా నాటకీయంగా పెరగసాగాయి. ప్రపంచ వ్యాప్తంగా 2.5 మిలియన్ల ప్రజలు అనగా సుమారు 40% డెంగ్యు బారిన పడినట్లు అంచనా. ఇటువంటి ప్రాణాంతకమైన వ్యాధి గురించి మనం తెలుసుకోవలసిన విషయాలు క్రింద ఇవ్వబడ్డాయి.  

డెంగ్యు అంటే ఏమిటి? డెంగ్యు అనేది ఏడిస్ ఎజిప్టి  అనే ఉష్ణమండలపు ఆడ దోమ ద్వారా తీసుకుపోబడే నాలుగు రకాల వైరస్ లలో ఏ ఒక్కదానితో నైనా కలిగే ఫ్లూ వంటి జ్వరము. ఈ  దోమలు  డెంగ్యు, చికెన్గున్యా, ఎల్లో ఫీవర్ మరియు ఇతర వ్యాధులను కలిగించే వైరస్లను చేరవేస్తాయి. ఈ దోమలను తెల్లనిమచ్చలు గల కాళ్ళు రొమ్ముభాగంలో గీతలలాంటి వాటి ద్వారా గుర్తించవచ్చు. ఈ దోమలు ఆఫ్రికా ఖండంలో ప్రవర్ధమానమైనా ఆ తర్వాత ప్రపంచములోని ఇతర ఉష్ణమండల, ఉప ఉష్ణమండలపు ప్రాంతాలకు విస్థరించాయి.

ఉత్తరాది ప్రాంతంలో ఈ దోమ ఆసియా టైగర్ దోమ లేదా ఏడిస్ ఆల్బోపిక్టస్ దోమ ద్వారా వ్యాపిస్తుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే చల్లని వాతావరణానికి కూడా ఇది తట్టుకోగలదు. దీనికి నలుపు తెలుపు మచ్చలు గల కాళ్ళు, అదేరంగు గీతలు గల శరీరము ఉంటుంది. ఇది దక్షిణాసియా ఉష్ణమండల ఉప ఉష్ణమండల ప్రాంతానికి చెందినప్పటికీ గత రెండు దశాబ్దాలలో అంతర్జాతీయంగా ఎగుమతి దిగుమతి చేయబడే వస్తువులద్వారా ప్రపంచమంతా విస్తరించింది. ఈ దోమ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో జాతుల వారికి ఇబ్బంది కలిగించే రీతిగా తయారవడానికి కారణం ఇది ఉష్ణమండల (చిత్తడి ప్రాంతాలకంటే కూడా) ప్రాంతాలలో ప్రబలుతోంది. ఇది రాత్రిపూట కంటే పగలే వ్యాధికారక వైరస్ ను చేరవేస్తుంటుంది. ఈ దోమను టైగర్ మస్కిటో అనడానికి ప్రధాన కారణం దీనికున్న చారలు పులిని పోలిఉంటాయి. వ్యాధి బారిన పడ్డ మానవులు మరొకరికి నేరుగా హాని కలిగించలేరు. కానీ వీరిని కుట్టిన దోమలు ఆ వైరస్ ను ఆరోగ్యవంతమైన వారికి చేరవేయడం ద్వారా హానికలిగిస్తాయి. 

ఎక్కడ ఈ వ్యాధి ఎక్కువగా ఉంది? ఈ ఇన్ఫెక్షన్ ముఖ్యంగా దక్షిణ అమెరికా మరియు మధ్య అమెరికాలో ఎక్కువగా ఉంది ఎందుకంటే ఇక్కడ ఉండే ఉష్ణమండలపు వాతావరణం ఈ దోమలు ప్రబలడానికి అనుకూలంగా ఉందికనుక. ఇంతేకాకుండా ఈ సమస్య ఆగ్నేయ ఆసియా, ఆఫ్రికామరియు పడమర పసిఫిక్ ప్రాంతాలలో కూడా ఉంది. ఇంకా ఈ సమస్య యూరప్ లోని కొన్ని భాగాలూ, రష్యా మరియు అమెరికాలోని మెక్సికన్ సరిహద్దుకు సమీపముగా ఫ్లోరిడా ప్రాంతంలో కూడా ఉంది.

వ్యాధి లక్షణాలు ఏమిటి? అమెరికాలోని సెంటర్ ఫర్ డిసిజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షణ్ సంస్థ ప్రకారము ఈ వ్యాధికి గురైన వారిలో సగం మందికి వ్యాధి లక్షణాలు ఏమీ కనిపించవు. కాన్ని మిగతా సగం మంది అంతా అదృష్ట వంతులు కారు. ఎందుకంటే దీని బారిన పడ్డవారికి తీవ్రమైన ఫ్లూ వంటి లక్షణాలు శిశువులకు, పిల్లలకు, పెద్దవారికి కూడా కలుగుతున్నాయి. 

డెంగ్యు గురించి ఎప్పుడు ఆలోచించాలంటే జ్వర తీవ్రత (40°C/ 104°F) ఉండి తీవ్రమైన తలపోటు, కళ్ళ వెనుక నొప్పి, కండరాలు జాయింట్లు నొప్పులు, తలతిప్పుడు, వాంతులు, గ్రంధుల వాపు లేదా దద్దుర్లు, వీటిలో ఏ రెండు లక్షణాలు ఉన్నా అది డెంగ్యుగా భావించవచ్చు. ఈ వ్యాధి కలిగినప్పుడు ఎముకలు విరిగి పోతున్న బాధ కలుగుతుంది కనుకనే దీనిని ఎముకలు పగిలే వ్యాధి (బ్రేక్ బోన్ ఫీవర్) అని కూడా అంటారు. వ్యాధి కారక దోమ కరిచిన 4-10 రోజుల వరకు రోగ లక్షణాలు రాకుండా ఆ తరువాత సుమారు 2-7 రోజుల వరకూ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి.

తీవ్రమైన డెంగ్యు వ్యాధి వలన రక్తంలో ప్లాస్మాతగ్గిపోవడం, ద్రవ శాతం పెరుగుదల, శ్వాశకోశ ఇబ్బంది, తీవ్ర రక్తస్రావం, అంగలోపము ఇలాంటిది ఏదో ఒకటి కలిగి ప్రాణాంతకమవుతుంది. తీవ్ర వ్యాధి యొక్క హెచ్చరిక లక్షణాలు తొలి వ్యాధి లక్షణాలు కనపడిన3-7 రోజులకు కనపడతాయి. అవి శరీర ఉష్ణోగ్రత తగ్గుదల (38°C/ 100°F కంటే తక్కువ ) తీవ్రమైన కడుపునొప్పి, ఆగకుండా వాంతులు, వేగంగా శ్వాశ తీసుకోవడం, రక్తం పడడం, నీరసం, రక్తవాంతులు వంటివి. ఆ పైన 24–48 గంటలు  చాలా విలువైనవి. ఈ సమయంలో సరియైన వైద్యం అందకపొతే ప్రాణానికే ప్రమాదం.

ఎంత తీవ్రమైనది?  ప్రపంచ వ్యాప్తంగా ఐదు లక్షల మంది ప్రతీ సంవత్సరం ఈ వ్యాధి బారిన పడుతుంటే వీరిలో చాలామంది 2-7 రోజులలో కోలుకుంటున్నారు. కొందరికి మామూలు జ్వరం కొంచం తగ్గగానే, ఈ వ్యాధి యొక్క ఇంకో తీవ్రమైన రకం -  హీమోరేజిక్ ఫీవర్ అనేది వస్తోంది. దీనివల్ల అత్యంత ప్రాముఖ్యత గల అవయవాలు పాడయి పోవడం, రక్తస్రావము, డిహైడ్రేషన్ కలుగుతాయి. చివరికి మరణము కూడా సంభవించవచ్చు. కానీ డెంగ్యుకు తొందరగా వైద్యం తీసుకున్నట్లయితే డెంగ్యు వ్యాధి శొకిన వారిలో  ప్రస్తుతం నూటికి ఒక శాతం కంటే తక్కువ మందికి మాత్రమే మరణం సంభవించే అవకాశం ఊంది.

చికిత్స మరియు నివారణ? పేషంట్లకు వ్యాధి లక్షణాలను బట్టి మందులు ఇవ్వబడతాయి. వారు ఎక్కువగా నీరు త్రాగవలసి ఉంటుంది. ఐతే దీనికి ఇంకా సరయిన మందు కనుగొనబడలేదు. పరిశోధకులు తగిన వాక్సిన్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు.  (వైబ్రియోనిక్స్ ప్రాక్టీషనర్లు మీ రెఫెరెన్స్ పుస్తకాలు పరిశీలించి డెంగ్యు జ్వరానికి సరిపడే కొమ్బో ను ఎంచుకోండి)

ఒకసారికన్నా ఎక్కువ సార్లు వస్తుందా? ఒకసారి మీరు డెంగ్యుకు గురయ్యి నివారణ పొందితే ఆ ప్రత్యేకమైన వైరస్ నుండి వ్యాధి నిరోధకత సాధించినట్లే, కానీ మిగతా మూడు వైరస్ ల నుండి కాదు. చాలా దేశాలు ఈ నాలుగు రకాల వైరస్ లకు స్వగృహాలు  కనుక ఎవరైన రెండవసారి ఈ వ్యాధికి గురైతే వ్యాది లక్షణాలు చాలా తీవ్రంగా ఉంటాయి. పరిస్థితులను మరింత దిగజార్చడానికి డెంగ్యు వైరస్ ను చేరవేసే దోమలు, ఎల్లో ఫీవర్ మరియు చికెన్గున్యాలను కలిగించే వైరస్ లను కూడా చేరవేస్తాయి. అంటే ఒక్క కాటు అనేక రకాల ఇన్ఫెక్షన్లను కలిగిస్తుందన్నమాట.

ప్రస్తుత సంఖ్య ఎంత? ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 50 నుండి 100 మిలియన్ల జనాభా (2013 అధ్యయనం ప్రకారం ఈ సంఖ్య 400 మిలియన్ల వరకూ ఉండొచ్చని అంచనా) ఈ ఇన్ఫెక్షన్ కి గురిఔతున్నట్లు అంచనా. ఒక్క అమెరికాలోనే 2003లో 5,20,000 గా ఉన్న సంఖ్య 2013 నాటికి 2.3 మిలియన్లకు పెరిగిందని అంచనా. 2014 జూన్ మధ్యలో జరిగిన ప్రపంచ కప్ ఫుట్బాల్ మ్యాచ్ ల కోసం ఆతిధ్య దేశం బ్రెజిల్ వెర్రిగా డెంగ్యు చేరవేసే దోమలతో యుద్ధం చేసిందనే చెప్పాలి.   

ఎందుకంత ఎక్కువ? ఈ విషయంలో మనం ప్రపంచీకరణ (గ్లోబలైజేషణ్)ను తప్పుపట్టవచ్చునేమో. దోమలు వ్యాపార సంబంధిత వస్తువులద్వారా ఒక చోటనుండి మరోచోటుకు బదిలీ ఐపోతున్నాయి. ఇలా దోమకాటుకు గురయిన ప్రయాణికుడు కూడా తనుండే ప్రాంతంలో ఈ వ్యాధి వ్యాప్తికి కారణమవుతున్నాడు. నగరాలలో భవంతుల నిర్మాణంలో గొట్టాల ద్వారా నీటి సరఫరా ఉండదు కనుక నీరు నిలబడి దోమల వ్యాప్తికి కారణ మవుతున్నాయి.

ఎలా నిరోధించగలము? వీధులు, పరిసరాలు, చుట్టుపక్కల ఇళ్ళు వీటిలో దోమల మందులు చల్లటం, జెనిటిక్ గా అభివృద్ధి చేసిన దోమలు, దోమ కాటు నుంచి తప్పించుకోవడానికి దోమతెరలు, స్ప్రేయర్లు, పొడవైన చేతులు గల చొక్కాలు వాడడం మొదలైన పద్దతుల ద్వారా డెంగ్యు వ్యాధి బారిన పడకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. 

మూలములు:
www.WBUR.org
http://www.ask.com/wiki/Aedes_aegypti?o=2801&qsrc=999
http://www.ask.com/wiki/Aedes_albopictus?o=2801&qsrc=999
http://www.who.int/mediacentre/factsheets/fs117/en/

 

   అల్పము  & మధురము 1

 

 

 

 

 

 

 

 

 

వైబ్రియో నిపుణురాలు  10375...ఇండియా నా చిన్నప్పటినుండి కూడా డాక్టర్ లను వారు పేషంట్ లకు చేసే సేవలను చూసి విస్మ్యయం పొందేదాన్ని. నేను కూడా వారిలో ఒకరినై డాక్టర్ గా సేవలందించాలని కలలు కన్నప్పటికీ భగవంతుడికి మాత్రమే తెలిసిన కొన్ని కారణాలవల్ల నా ప్రస్థానం ఇంజినీరింగ్ వైపు మరలి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గాస్థిరపడ్డాను.

చాలా సంవత్సరముల తర్వాత భగవదనుగ్రహం వల్ల రెకీ విధానం నేర్చుకునేందుకు అవకాశం రావడంతో ప్రత్యమ్నాయ వైద్య విధానాల వైపు నా దృష్టి మరలింది. తదుపరి 2008 డిసెంబర్ లో మొదటి వైబ్రో వర్క్ షాప్ గురించి ప్రకటన విన్నప్పుడు ఆఘ మేఘాల మీద AVPకోర్సుకు నమోదు చేయించుకుని దానిని పూర్తి చేశాను. 9 నెలల్లో JVP కోర్సు పూర్తి చేసి 2013లో SVP కోర్సు కూడా పూర్తి చేశాను. వైబ్రో థెరపీని ఆచరించడం నా జీవితానికి ఒక క్రొత్త అర్ధాన్ని ఇచ్చి పేషంట్లను చూసిన ప్రతీ సందర్భంలోనూ ఒక క్రొత్త అభ్యాసనానుభవాన్ని కలిగించేది. పేషంట్లు తిరిగి వచ్చి మీరిచ్చిన ‘’బాబామందు‘’ ఎంతో బాగా పనిచేసిందని కృతజ్ఞత తెలపడానికి వస్తే చెప్పలేని ఆనందం కలిగేది. పేషంట్ల ఫోన్ కాల్స్ స్వీకరించడం, వారి బాధలను ఓపికతో వినడం, వారికి స్వాంతన చేకూర్చే ప్రియవచనాలు చెప్పడం, మెడికల్ క్యాంపులకు హాజరు కావడం, ప్రతీ ఒక్కటీ అనందాన్ని రేకెత్తించేవే. పేషంట్ల యొక్క సమస్యలు విని దానికి కారణాలు అన్వేషించే ప్రతీ సందర్భంలోనూ నాకది కొత్త అనుభవమే, ఒకకొత్త పాఠమే. ఈ విధానం నాలో నా ప్రమేయం ఏమీ లేకుండానే సూక్ష్మమైన మార్పులు తీసుకువస్తున్నట్లు అనుభవమైనది.  

SRHVP మిషన్ ఉపయోగిస్తూ బ్రాడ్ కాస్ట్ చేయడం ద్వారా ప్రతీ కార్డు ఎంత శక్తివంతమైనదో అవగాహన చేసుకోగలిగాను. అలాగే పేషంట్ల సమక్షంలో రెమిడి తయారుచేస్తునప్పుడు దీనిలో కేవలం వైబ్రేషణ్ తప్ప మందు ఏమిలేదని తెలుసుకొని వారెంతో ఆనందించేవారు.

నేను నేర్చుకున్న కొన్ని అంశాలు మీ ముందుంచుతున్నాను:

  • నా 5 ½ సంవత్సరాల వైబ్రో సాధనలో నేను నేర్చుకున్న గొప్ప అంశం ఏమిటంటే పవిత్ర హృదయంతో ప్రార్ధిస్తే స్వామి తప్పక వింటారు, అద్భుతాలు సృస్టిస్తారు.
  • రెమిడిల విషయంలో SM39 Tension దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో అద్భుతంగా పనిచేస్తున్నట్లు నేను తెలుసుకోగాలిగాను. ఎందుకంటే నా విషయంలోనే ఇది ఉపయోగించిన తర్వాత నాలో ఎంతో మార్పు వచ్చింది. నా పేషంట్లు దీనిని ఉపయోగించిన తర్వాత వారిలో ఎంతో మార్పు వచ్చిందని, వారిలో ప్రేమ, అనురాగం ఆప్యాయంగా మాట్లాడడం ఇలా ఎంతో మార్పు వచ్చిన్నట్లు చెప్పారు. నిజంగా చెప్పాలంటే ఈవిధంగా వారి అభిప్రాయం తెలుసుకోవడం వైబ్రో విధానంలో ఒక ముఖ్యమైన విషయము. దీనివల్ల స్వామి ప్రతీ ఒక్కరిలోనూ ఏ విధంగా మార్పు తీసుకువస్తున్నారు అనేది అర్ధమవుతుంది.
  • పేషంటు చెప్పిన విషయాలను ఓపికతో వినడం, వారిలో నమ్మకాన్ని కలిగించడం, ప్రేమతో మాట్లాడడం చేయడం వల్ల వారిలో ఎంతో ఆత్మవిశ్వాసం పెరిగి సగం జబ్బు అప్పుడే మాయమైపోతుంది.
  • పేషంట్లను చూసేటప్పుడు, కౌన్సలింగ్ నిర్వహించే సందర్భంలోనూ నాకు కొత్త ఐనప్పటికీ స్వామి అనుగ్రహం వల్ల అంతా తెరిచిన పుస్తకం లా ఉండేది. నేను వైద్యశాస్త్రరీత్యా ప్రావీణ్యత కలిగిన డాక్టర్ని కాకపోయినప్పటికీ వైబ్రో విధానం ద్వారా నా కోరిక తీర్చిన స్వామికి ఎంతో కృతజ్ఞతలు. స్వామి ఈ రోజు వరకూ 4200 పేషంట్లను చూసే అవకాశం ఇచ్చారు. ఈ విధంగా సేవచేయడం ద్వారా నాలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నట్లు చెప్పగలను.

 

ప్రాక్టీ షనర్ 01616...క్రొయేషియ మా అమ్మ వైబ్రో విధానాన్ని నమ్మేవారు కాదు. ఆమెకు 79 సంవత్సరాల వయసులో ఒకరోజు సాయంత్రం 9 గంటలకు  పంటినొప్పి వచ్చింది. తక్షణమే ఆమెకు ఎదైనా  చికిత్స చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఆమెకు గుండెలో కృత్రిమ వాల్వ్ ఏర్పాటు చేయబడింది. పంటిని తొలగించాలంటే ౩ రోజులముందు నుండి సిద్ధము చేసుకుంటూ రావాలి. నేను ఆమెకు CC11.6 Tooth infections ఇచ్చి ప్రతీ 15 నిమిషాలకు వేసుకోవాలని సూచించాను. వెంటనే పంటి నొప్పి మాయమయ్యింది. కొద్దీ రోజులకు మంట కూడా పోయింది. ఆమె కనీసం ఒక్కసారి కూడా దంత వైద్యుని దగ్గరకి వెళ్ళే అవసరం రాలేదు. ఈ సంఘటన తో మా అమ్మలో ఎంతో మార్పు వచ్చి ప్రతీ ఆరోగ్య సమస్యకు వైబ్రియోనిక్స్ తీసుకోవడంతో పాటు తనకు తెలిసిన వారందరికీ ఈ మందులు తీసుకోమని ప్రోత్సహిస్తోంది.

కొంత కాలం తర్వాత ఆమెకు గుండెకు సంభందించిన సమస్యలు వచ్చి హాస్పిటల్లో చేరింది. అక్కడ ఆమె పరిస్థితి విషమం గామారడంతో ఇంటికి తీసుకురాబడింది. కానీ కనీసం కళ్ళు తెరిచి చూసే పరిస్తితి లేదు. దీనితో ఒక నెల పూర్తిగా CC7.1 Eye tonic + SR291 Gelsemium + SR359 Zincum Met…TDS. ఇచ్చాను. ప్రతీ ఒక్కరూ ఆశర్య పడే విధంగా ఆమె చక్కగా కోలుకునే సరికి నా కుటుంబ సభ్యులు ఇది ఒక అద్భుతంగా భావించారు. ఇప్పుడు నేను కేవలం ఏవో చిన్న గోళీలు ఇచ్చే వ్యక్తిగా కాక అద్భుతాలు చేసే వైబ్రియోనిక్స్ ప్రతినిధిగా భావిస్తున్నారు.  

 

     

వైబ్రియో నిపుణురాలు  01626...గ్రీస్ ను పరిచయం చేస్తున్న వైబ్రియో నిపుణురాలు 03101...గ్రీస్  గ్రీస్ లో జరిగే ఒక సదస్సుకు హాజరయ్యి జూనియర్ ప్రాక్టీషనర్ గా కావలసిన ఈమె దురదృష్టవశాత్తూ  కాలు విరిగి పేషంటుగా మారవలసిన పరిస్థితి ఏర్పడింది. సదస్సు జరుగుతున్నంత కాలము ఆమె బహుశా తను ఇక వైబ్రో సేవను కొనసాగించలేకపోవడమో లేక చాల తక్కువ స్థాయి లో చేయవలసి రావడమో ఔతుందని భావించారు. కానీ స్వామి అనుగ్రహం మరోలా ఉండడంతో సదస్సు మొదటి రోజునే ఆమె అద్భుత 108 బాక్స్ ను ఇంటికి తెచ్చుకున్నారు. ఇంటికి వచ్చేసరికి తనకు కాలు విరిగినందుకు సహాయం అందించాలని భావించిన ఈ ప్రాక్టీషనర్ మరిలినా అత్తగారు వాంతులతో ముఖం అంతా పాలిపోయి పచ్చగా మారిపోయి పూర్తిగా అసహాయ స్థితిలో ఉన్నారు. గత రాత్రంతా ఆమెకు వాంతులు, విరోచనాలు కావడంతో నిర్జలీకరణ –డిహైడ్రేషన్ కు గురయ్యి నీరసంగా నేలమీద పడిఉన్నారు. మెరిలినా వెంటనే CC4.8 Gastroenteritis మరియు CC10.1 Emergencies 200 ml నీటిలో రెండు చుక్కలు వేసి అత్తగారి చేత త్రాగించారు. అలా రెండుసార్లు ఇచ్చిన తర్వాత ఆ రోజుకు 6TD గానూ మరునాటికి TDS గానూ ఆ తర్వాత రోజు OD గానూ ఇవ్వడంతో ఆమెకు పూర్తిగా తగ్గిపోయింది. ఐతే ఆమె క్రింద పడినప్పుడు దెబ్బ తగలడంతో రెండు గంటల తర్వాత ఛాతీలో నొప్పి రావడంతో మెరిలినా  CC10.1 Emergencies + CC20.7 Fractures…TDS వారం రోజుల పాటు ఇవ్వడంతో అది కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఈ మొదటి అనుభవంతో ప్రాక్టీషనర్ కు సంశయములన్నితొలగి ఏ సందర్భంలో నైనా వైబ్రియోనిక్స్ ఎంత బాగా పనిచేస్తాయో అనుభవమయ్యింది.

అల్పము  & మధురము 2

“ఓం మంత్రం ద్వారా పొందగలిగే ఉపశమనము”: ఈ మంత్రోచ్చారణ ద్వారా వాపులు తగ్గుతాయి. సైఖోన్యూరోఎండోక్రినాలజి పత్రికలో అచ్చైన ఒక చిన్న అధ్యయనం ప్రకారం 2012 లో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో చిత్త వైకల్యము (డిమెంషియా)తో బాధపడే 45 మందిని రెండు గ్రూపులుగా చేసి ఒక గ్రూపుకు 8 వారాలపాటు రొజూ 12 నిమిషాలసమయం ఓంకార ధ్యానంతోనూ మరొక గ్రూపుకు 12 నిమిషాల సమయం విశ్రాంతి కలుగజేసే CDని వినిపించారు. రక్త పరిక్షల ద్వారా తెలిసిన అంశం ఏమంటే ఓంకార ధ్యానం చేసిన వారి వాపులు చాలా వరకు తగ్గినట్లు సూచికలు తెలిపాయి.

 

Om Sai Ram