Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

అదనపు సమాచారం

Vol 4 సంచిక 2
March/April 2013


ఆరోగ్యం చిట్కాలు

సాయి వైబ్రియానిక్స్ వార్తాలేఖల ద్వారా ప్రచురించే ఈ సమాచారము విద్యా సంబంధ మైన సమాచారమునకే తప్ప: దీనిని వైద్య సలహా గా భావించరాదు. ప్రాక్టీషనర్ లు పేషంట్ లను సరియైన వైద్య సమాచారము కోసము మరియు ప్రత్యేక వైద్య సలహాల నిమిత్తము వారి డాక్టర్లను సంప్రదించమని చెప్పవలసిందిగా సూచన. 

(నిస్త్రంత్రి )కార్డ్ లెస్ ఫోనులు మరియు సెల్ ఫోన్లు మన ఆరోగ్యము పైన వాటి ప్రభావము

ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ లేదా ఇ.ఎం.ఎఫ్. అనగా విద్యుదయస్కాంత తరంగాలు ఏవైనా విద్యుత్ పరికరాలు, సెల్ఫోన్ టవర్లు, విద్యుత్ వాహక తీగలు ద్వారా చుట్టుపక్కల ఉన్న ప్రదేశంలో ప్రసరితమయ్యే శక్తి తరంగాలు. ఇవి మన ఆరోగ్యానికి హానికలిగిస్తాయి కనుక వీటికి దూరంగా ఉండడం లేదా వీటి వినియోగం సాధ్యమైనంత తక్కువగా ఉండాలనేది వాస్తవం. మన శరీరము విద్యుత్తు వాహకంకు సంబంధించినంతవరకు చాలా సున్నితంగా వ్యవహరిస్తుంది(ముఖ్యంగా మన శరీర భాగాలు కొన్ని సూక్ష్మ విద్యుత్ వాహకాలతోనే పనిచేస్తాయి). దీనినిబట్టి సెల్ఫోన్, ల్యాప్టాప్ లూ, కంప్యూటర్లు, మైక్రో ఓవెన్లు, టి.వీ.లు ఇంక ఇతర ఎలెక్ట్రానిక్ పరికరాలు విడుదల చేసే ఇ.ఎం.ఎఫ్ తరంగాలు మన శరీరానికి ఎంత హాని కలిగిస్తాయో ఉహించవచ్చు. ఐతే ఈ అన్నింటికన్నా ఎక్కువ హాని కలిగించే పరికరము ఏమిటి ? ప్రతి రోజు వాడే ఒక వస్తువు మీ శరీరాన్ని బాధిస్తుందా? ఔను. పరిశోధనలు ఏమి చెపుతున్నాయంటే కార్డలెస్ ఫోన్ లు మొబైల్ ఫోన్ లకన్నా100 రెట్లు ఎక్కువ గా ఆరోగ్యమునకు హాని కలిగించేటువంటివి!

కార్డలెస్ ఫోన్లు

యూనివెర్సిటీ ఆఫ్ స్వీడెన్ కి చెందిన శాస్త్రజ్ఞులు లెన్నర్ట్ హర్డెల్, మైఖేల్ కర్బెరీ, మరియు జెల్ హసన్ మైల్డ్ అందించిన సమాచారము ప్రకారము ఇంట్లో కార్డ్లెస్ ఫోన్ ఉంటే అది మన ఆరోగ్యం పైన ఎంత దుష్ప్రభావము చూపిస్తుందంటే మన డ్రాయింగ్ రూం లో సెల్ఫోన్ టవర్ ఉన్నట్లే. ఈ వాదనను బలపరుస్తూ మరికొందరు వైద్య నిపుణులు కూడా వ్యాఖ్యలు చేసారు. లండన్ లోని హార్లే ప్రాంతానికి చెందిన డాక్టర్ డేవిడ్ డౌసన్ “ఎవరి దగ్గరయినా కార్డులెస్ ఫోన్ ఉన్నట్లయితే వెంటనే దానిని విడిచి మాములు ఫోన్ తీసుకోండి” అని చెపుతున్నారు.

మొబైల్ ఫోన్లు

సెల్ఫోన్ లను దీర్ఘకాలిక సంభాషణల కోసం గానీ లేదా ఇతరులు అవసరానికి మించి మాట్లాడుతూ ఉంటే వినడం కానీ మంచిది కాదు. ఒక స్వీడిష్ నివేదిక ప్రకారము రెండు నిమిషాల సెల్ఫోన్ సంభాషణ గంట సమయం పాటు మెదడులో సహజంగా జరగవలసిన విద్యుత్ ప్రసారాల పైన  ప్రభావం చూపిస్తుంది. 2007వ సంవత్సరములో డాక్టర్ లెన్నర్ట్ హర్డెల్ అందించిన సమాచారము ప్రకారము సెల్ఫోన్ వినియోగదారులకు మెదడులో గానీ వెన్నులో గానీ ప్రాణంతక మైన కణుతులు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ అని తెలియజేసారు.

వృత్తి రీత్యా ఎక్కువసేపు ఫోన్ సంభాషణలు చేయవలసిన వారు నిపుణుల సూచన పైన అధిక పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకొనడం మంచిది. కాల్ సెంటర్లు నిర్వహిస్తున్న యజమానులు తమ ఉద్యోగుల శ్రేయస్సుకోసం శాస్త్రీయ పరంగా నిర్ధారిత మైన ఇ.ఎం.ఎఫ్. నిరోధక పరికరాలనే వాడాలి. డాక్టర్ బాజ్పేయి “ ఇటీవల ఇ.ఎం.ఎఫ్ దు ష్ఫలితాల నుండి నిరోధించే ఆధునిక సాంకేతిక నైపుణ్యం, అంతేకాక మనలో రోగనిరోధకశక్తిని పెంచే ఆహారం కూడా అందుబాటులోనికి వచ్చాయి కనుక వీటిని ఉపయోగించుకోవాలి ”అంటున్నారు.

ఈ రేడియేషన్ మన శరీరం పైన కలిగించే ముప్పు గురించి మరింత లోతుగా అధ్యయనం చేయవలసి ఉన్నప్పటికీ సమయానుకూలముగా తీసుకునే కొన్ని చిన్న చిన్న చర్యలు (రేడియేషన్ లేకుండానో లేదా రేడియేషన్ తక్కువగా ఉండే పరికరాలు వాడడం) మన కుటుంబములోని చిన్నారులను ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు దోహద పడుతుంది. ఇప్పటికే చాలామంది ల్యాండ్ లైన్ ఫోన్ లను వదిలి పెట్టి నప్పటికీ ఇంకా మీ ఇంట్లో ల్యాండ్ ఫోన్ ఉన్నట్లయితే దానిని మాత్రమే ఉపయోగిస్తూ కార్డ్లెస్ ఫోన్ ను పక్కకి పెట్టడం ఎంతయినా శ్రేయస్కరం.  

కార్డ్ లెస్ ఫోన్లు ద్వారా విడుదలైన ఇ.ఎం.ఎఫ్ ఎన్నో ఆరోగ్య సమస్యలను సృష్టిస్తుంది ఉదాహరణకు,

* అభ్యసన సమస్యలు

* భావోద్వేగము మరియు ప్రవర్తనలో మార్పులు

* రక్త ప్రసరణ వ్యవస్థలో సమస్యలు

* లుకేమియా, రొమ్ము క్యాన్సర్ వంటివి మరియు, మెదడులో కణుతులు  

* నిద్ర పట్టకపోవడం

* తలపోటు

గతంలో ల్యాండ్ లైన్ ఫోన్లు సెల్ఫోన్ ల కన్నా సురక్షితమైనవని భావించేవారు, అలాగే కార్డ్లెస్ ఫోన్లను కూడా, కానీ కార్డ్లెస్ ఫోన్లు ఒక మీటరుకు 6 ఓల్టుల ఇ.ఎం.ఎఫ్ విడుదల  చేయగల శక్తి కలిగినట్టివి - అనగా 100 మీటర్ల దూరంలో ఉన్న సెల్ఫోన్ స్తంభం నుండి విడుదలయ్యే వానికన్నా రెట్టింపు శక్తి గలిగినవి. చార్జెర్ నుండి 2 మీటర్ల దూరంలో ఉన్న ఫోన్లు కూడా 2.5 వోల్టుల ఇ.ఎం.ఎఫ్  విడుదల చేస్తాయి. అనగా ఇది శాస్త్రజ్ఞులు చెప్పే సురక్షితమైన స్థాయి కన్నా 50 రెట్లు హానికరమైనది. అలాగే మీటరు దూరంలోనే ఉన్నట్లయితే అది 120 రెట్లు హానికరమైనది - కనుక ఈ ఫోన్ నుండి వచ్చే రేడియేషన్ సురక్షితమైన 0.05 వోల్టుల స్థాయిలో ఉండడానికి ఈ ఫోను 100 మీటర్ల దూరంలో ఉండాలి. మరో విషయం ఏమిటంటే కార్డ్లెస్ ఫోన్ పనిచేసే విధానము అనుసరించి దీని చార్జరు మరియు హ్యాండ్ సెట్ కూడా ఫోన్ ఉపయోగంలో లేకపోయినా పూర్తిస్థాయిలో ఇ.ఎం.ఎఫ్  విడుదల  చేస్తూనే ఉంటాయి.

దుష్ప్రభావాలకు గురికాకుండా ఉండాలంటే ఏమిచెయ్యాలి ?

మీవద్ద కార్డ్ లెస్ ఫోన్ ఉన్నట్లయితే  మీ కుటుంబం ఇ.ఎం.ఎఫ్ దుష్ప్రభావాలకు గురి కాకుండా  ఉండడానికీ దానిని వెంటనే  మామూలు ఫోనుకు మార్చే ప్రయత్నం చేయండి. దీని వలన  మీకు మునుపటి తరహాలో స్వేచ్ఛ ఉండకపోవచ్చు. ఐతే ఇంట్లో మీరు ఎక్కువ గా సంచరించే స్థానములో ఉంచడం ద్వారా దానిని ఉపయోగించడంలో మీకు ఇబ్బంది కలగక పోవచ్చు. కార్డ్ లెస్ ఫోన్ ను మామూలు ల్యాండ్ ఫోన్ తో రీప్లేస్ చేసుకోవడం ద్వారా మన ఇంట్లో హానికరమైన రేడియేషన్ లేకుండా  చేసుకోవడమే కాక, కుటుంబానికి ఆరోగ్యం మీద ఎక్కువ అవగాహన కలిగించిన వారు అవుతాము.

కార్డ్ లెస్ ఫోన్ ఉపయోగించకుండా ఉండటం మీకు కష్టం అనే పరిస్థితి ఉన్నట్లయితే ఎక్కువ ఫ్రీక్వెన్సీ గల ఫోన్లకు బదులు 900 MHz ఫోన్లను ఉపయోగించండి. చాలావరకు 2.4 GHz మరియు 5.8 GHz ఫోన్లు తమ బేస్ స్టేషన్ల నుండి నిరంతరంగా ఇ.ఎం.ఎఫ్ ప్రసరింప చేస్తూనే ఉంటాయి. కానీ 900 MHz ఫోన్లు అలా చేయవు. అంతేకాక 900 MHz ఫోన్లు చాలా సరళమైన సిగ్నల్ లను ఉపయోగించు కుంటాయి. కాగా 2.4 GHz మరియు 5.8 GHz ఫోన్లు జీవకణాలపై  హాని కలిగించే సిగ్నల్ లను ప్రసరింపజేస్తాయి. అంతేకాకుండా మీరు నిద్రించే సమయంలో ఈ ఫోన్లను మీ మంచానికి దూరంగా ఉంచండి. దానివలన మీరు ఇ.ఎం.ఎఫ్ లకు ప్రభావితం కాకుండా ఉంటారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ మన ఆరోగ్యము పైన ఇ.ఎం.ఎఫ్ యొక్క దుష్ప్రభావము గురించి ఇప్పటివరకూ ఎట్టి ప్రకటనా చేయనప్పటికీ  ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న పరికరాల ద్వారానో, శాస్త్ర పరిజ్ఞానము ద్వారానో ఈ దుష్ఫలితాలను అంచనా వేయలేము. సాధారణంగా మంచి కన్నా చెడు పట్ల ఆకర్షితులవడం సహజం కనుక విచక్షణ తో చెడునుండి దూరం కావడం మానవ కర్తవ్యం.

ఆధారాలు :
http://www.naturalnews.com/034078_cordless_phones_EMFs.html
http://bodyecology.com/articles/little-known-dangers-of-emf.php
http://www.emf-health.com/reports-cordlessphones.htm
http://www.emfprotectionltd.com/pages/Cordless-Phones-and-Cell-Phones 

 

ఆస్పరాగస్ తో ఆరోగ్య ప్రయోజనములు.

ఆస్పరాగస్ అనేది ఒక అద్వితీయమైన రుచి కలిగిన వసంతకాలపు కూరగాయ రకానికి చెందినది. ఇది ఎక్కడ పెరుగుతుందో తెలుసుకోవడానికి సంవత్సరంలో ఇది సరైన సమయం. ఇది సాధారణంగా మనముండే ప్రాంతంలోనే పండించగలిగే సేంద్రియ మొక్క అయి ఉండాలి. ఇది. ఆస్పరాగస్ లిల్లీ కుటుంబానికి చెందినది. మన ఇంటి పెరటిలోనే సులువుగా పండించగల పంట ఇది. ఇది అన్ని ఋతువుల లోనూ పండించగలిగేదే కాకుండా దశాబ్దాల కాలం పాటు పంట నివ్వగల సామర్ధ్యం కలది. ఆస్పరాగస్ ను విత్తనాల రూపంలో గానీ వేర్ల రూపంలో గానీ సంవత్సరంలో ఎప్పుడయినా నాట గలిగి నటువంటిది.

దీనిని ఆహార, ఔషధ అవసరాల నిమిత్తం 2000 సంవత్సరాల క్రితమే ఉత్పత్తి చేయడం జరిగింది. గ్రీకులు, రోమనులకు దీని ఔషధ వినియోగం పట్ల అపార విశ్వాసం. ఈ రోజులలో దీనిని అధిక మొత్తంలో పోషకాలు, విటమిన్లు, ఖనిజలవణాలు కలిగిన కూరగాయగా భావిస్తున్నారు.  

మన పెద్ద ప్రేవులలో ఉండే మానవ సహకారిక బ్యాక్టీరియాను పోషించ గలిగే ఇనులిన్ ను ఆస్పరాగస్ ఒక్కటే కలిగి ఉంటుంది. వివిధ అధ్యయనాల ప్రకారము ఇన్సులిన్ ను సమతౌల్యం చేయడం ద్వారా మధుమేహ నివారణలో ఇది ఎంతో బాగా ఉపకరిస్తుంది. గమనించ వలసిన విషయం ఏమిటంటే మన ఆరోగ్యం బాగుండాలంటే ఇన్సులిన్ స్థాయి శరీరంలో సమస్థాయిలో ఉండాలి. ఇలా చేయడం వలన మనం ఎక్కువ కాలం జీవించడానికి సుఖంగా జీవించడానికి ఆస్కారం కలుగుతుంది. దీనిలో ఉండే ఖనిజ లవణాల చేరిక సహజ సిద్ధమైన డైయురేటిక్ గా పనిచేస్తుంది. డైయురేటిక్ లు మూత్రపిండాలలో మూత్రం ఏర్పడడానికి తద్వారా శరీరములో మలినాలు బయటకు పోవడానికి శరీరం నిర్మాల్యం గా మారడానికి కారణ మవుతాయి.

ఇది శరీరంలో ఈస్ట్ త్వరగా పెరగకుండా నిరోధిస్తూ జీర్ణ వ్యవస్థను మంచి స్థితిలో ఉంచుతుంది.

ఆస్పరాగస్ తో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో. ఇలా చెప్పడానికి 7 ప్రధాన  కారణాలు క్రింద ఇవ్వబడాయి:

1. మన శరీర వ్యవస్థను నిర్మాలిన్యం చేస్తుంది. ఆస్పరాగస్ లో ఒక కప్పుకు 288 మిల్లీ గ్రాముల పొటాసియం ఉంది. పొటాసియం పొట్టలో ఉండే అధిక కొవ్వును కరిగిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఒక కప్పుకు 3 గ్రాముల ఫైబర్ లేదా పీచు పదార్ధము ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ప్రక్షాళన చేస్తుంది. దీనిలో సహజ సిద్దమైన సోడియం లేదు కనుక ప్రి మెన్స్ట్రవల్  సిండ్రోమ్ PMS, (ముందస్తు ఋతు సంబంధమైన రుగ్మత) లో ఉబ్బరము ఉండదు. ఇంకా ఆస్పరాగస్ తో  కొవ్వు గానీ కొలెస్ట్రాల్ గానీ పెరిగే అవకాశం లేకపోవడమే కాదు ఒక కప్పు ఆస్పరాగస్  కేవలం 40 కేలరీల శక్తిని మాత్రమే ఇవ్వగలదు.   అమెరికా లో UCLA కు చెందినమెడికల్ సెంటర్ వారి నివేదిక ప్రకారము నిర్విషీకరణకు సంబంధించి కూరగాయాలలో ఆస్పరాగస్ కు మించింది లేదని నిర్ధారించాయి.  

2. ముందస్తు వృద్ధాప్య నిరోధానికి - ఆస్పరాగస్లో పొటాసియం, ఎ.విటమిన్, ఫోలియేట్ అధిక మొత్తంలో ఉన్నాయి. గ్లుటాతియాన్ అనే ఆంటిఅక్సిడెంట్ ధర్మాలు కలిగిన అమినో ఆమ్లము కూడా దీనిలో అధిక మొత్తంలో లభిస్తుంది. మన శరీరము త్వరగా వృద్దాప్యబారిన పడకుండా ఇది సహాయకారిగా ఉంటుంది. గ్లుటాతియాన్ (GSH) అనే ఆంటిఆక్సిడెంట్ మన శరీరములోని జీవకణాలలో చేరే ఫ్రీరాడికల్స్ వంటి వ్యర్ధాల నుండి రక్షిస్తుంది. ఆస్పరాగస్ వలన మరొక ఉపయోగము ఏమిటంటే ఇది మెదడు త్వరగా తన శక్తిని కోల్పోవడం తగ్గిస్తుంది. ఇతర ఆకుకూరల వలెనే ఆస్పరాగస్ కూడా ఫోలియేట్ ను ఉత్పత్తి చేయడం ద్వారా విటమిన్ B12(ఇది చేపలు, కోళ్ళు, మాంసము, డైరీ ఉత్పత్తులలో లభిస్తుంది) పాటు కలిసి పనిచేస్తూ జ్ఞానాత్మక బలహీనతలను తగ్గిస్తుంది. అమెరికాకు చెందిన టఫ్ట్ విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారము ఫోలియేట్ మరియు B12 విటమిన్ అధికంగా ఉన్న వృద్ధులు వీరికి నిర్వహించిన పరీక్షలో మిగతా వారికన్నా వేగాన్ని స్తిరత్వాన్ని కనబరచ గలిగారు. 50వ సవత్సరంలో  ప్రవేశించిన వారు వయసుతో పాటు విషయ గ్రహింపు తగ్గకుండా ఉండాలంటే తగినంత  B12 ను తీసుకోవడం తప్పనిసరి.

3. క్యాన్సర్ బారినుండి కాపాడడానికి ఆస్పరాగస్ లో అదికంగా ఉన్న ఫోలియేట్ క్యాన్సర్ బారిన పడకుండా చేయడానికి ఉపయోగపడే ఒక ముఖ్యమైన ప్రోటీన్. సూచన: ఫోలియేట్ సాధారణంగా ఆకుపచ్చని కూరగాయలలోనూ నిమ్మజాతి పండ్ల లోనూ లభిస్తుంది. ఫోలియేట్ మరియు ఫోలిక్ యాసిడ్ ఒక్కటే ఐనప్పటికీ ఫోలిక్ యాసిడ్ అనుబంధ ఆహార రూపంలో లేదా ట్యాబ్ లెట్ రూపంలో లభిస్తుంది. ఐతే ఆరోగ్యపరంగా ఎక్కువ లాభం పొందడానికి అనుబంధరూపంలో కన్నా సహజంగా దొరికినదే తీసుకోవడం ఉత్తమం. 

4. మంటను నిరోధించడం    ఫోలియేట్ మంట ను నివారించడంలో ఎంతో సహాయకారి గా ఉంటుంది.

5. ఎముకలు పెళుసు బారడాన్ని కీళ్ళనొప్పులు నివారించడానికి - ఆస్పరాగస్ లో ఉన్న K విటమిన్ ఎముకల పెళుసు దనాన్ని కీళ్ళవ్యాధిని రాకుండా నిరోధిస్తుంది. అంతేకాక ఈ విటమిన్ ఎమకుల నిర్మాణానికి వాటి లోపాల సవరణకు కూడా ఉపయోగకరమైనది. ఈ విటమిన్ ఆస్టియోకాల్సిన్ తయారుకావడానికి కూడా దోహద పడుతుంది. ఆస్టియోకాల్సిన్ అనేది ఒక ప్రోటీన్ ఇది ఎముకల కణాలలో  ఉండి  కాల్షియంను స్పటికీకరణం చెందిస్తుంది. ఆస్పరాగస్ కె. విటమిన్ కి అద్భుతమైన మూలముగా రుజువయ్యింది.

6. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి దీనిలో ఉన్నఫోలియేట్ గుండెజబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

 7.పుట్టుకకు సంబంధించిన లోపాల నిరోధము : -

గర్భము దాల్చిన లేదా దాల్చుటకు నిర్ణయించుకొన్న మహిళలకు అవసరమైన ఫోలియేట్ లేదా ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ (డాక్టర్లు తరుచుగా దీనిని సూచిస్తూ ఉంటారు) దీని నుండి సమృద్ధిగా లభిస్తుంది. ఫోలియేట్ లోపము వలన స్పైనా బిఫిడా (పుట్టుకతో వెన్నుపాములో వచ్చే లోపము) మరియు అనేన్సిఫాలే(మెదడు లేని పుట్టుక/లేదా నాడీ లోప సంబంధిత పుట్టుక)వంటివి కలుగుతూ ఉంటాయి. ఫోలియేట్ గర్భస్త పిండ అభివృద్ధికి మరియు పిండ నాళము అభివృద్ధికి తోడ్పడడమే కాక గర్భస్థ కాలము పూర్తికాకుండానే జన్మించడమును నిరోధిస్తుంది.

అంతేకాకుండా కొన్ని అధ్యయనాల ప్రకారం ఆస్పరాగస్ యొక్క పోషకాహార ప్రయోజనాల కారణంగా మూత్రసంబంధిత వ్యాధులు మరియు మూత్రపిండాలలో రాళ్ళూ కలగకుండా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే  ఆస్పరాగస్ లో పొటాసియం, విటమిన్.ఎ, ఫోలిక్ యాసిడ్, గ్లుటాతియాన్ మరియు విటమిన్ కె. సమృద్ధిగా లభిస్తాయి. దీనిలో పీచుపదార్ధాలు(ఫైబర్) ఎక్కువగా ఉండడంతో పాటు దీనిలో సోడియం లేకపోవడం, తక్కువ కేలరీలు ఉండడంతో కొలెస్టరాల్ సమస్య కూడా రాదు.

సాధారణంగా ఆస్పరాగస్ ఆకుపచ్చ రంగులో లభిస్తుంది. ఐతే మరో రెండు రకాలను మనం సూపర్ మార్కట్ లోనూ, రెస్టారెంట్ లలోనూ చూడవచ్చు. అవి ఒకటి తెల్లగా ఉండేది ఇది చాలా సున్నితంగా ఉండడం తో పాటు దీనిని పండించడం చాలా కష్టము. రెండవది ఊదా రంగులో ఉంటుంది. ఇది కొంచం చిన్నగానూ, పండ్ల వాసనతో కూడి ఉంటుంది. ఆస్పరాగస్ కంకులు కొన్ని దళసరిగానూ కొన్ని పలచగానూ ఉంటున్నట్లు మీరు గమనించే ఉంటారు. దళసరిగా ఉండేవి కాల్చుకొనడానికి, ఉడకబెట్టు కొనడానికి బాగుంటాయి: తరువాతవి చాలా మంచివి మరియు త్వరగా తయారు చేసుకునేవి. పలచగా ఉండేవి సాధారణ వేపుడుకు లేదా దోరగా వేయించు కొనడానికి బాగుంటాయి. ఐతే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. కొందరు ప్రాక్టీషనర్లు ఆస్పరాగస్ ను హాటిచోకు లేదా అర్టిచోక్ దుంప తోనూ పాలకూర తోనూ కలపి ఒకే భోజనంలో తినకూడదని చెప్తారు. ఎందుకంటే ఇవి అననుకూలమైనవి.

ఆరోగ్య పరంగాఎక్కువ లబ్దిని పొందాలంటే ఆస్పరాగస్ ను పచ్చిది తినడమే మంచిదని చెప్తారు. తినేముందు, మందంగానూ పలచగానూ ఉన్న కంకుల నుండి కర్ర వలె ఉండే కాండాన్ని తొలగించాలి. వండడానికి ముందు మాత్రమే దళసరిగా ఉన్న కంకులను ఒలవండి. దీనిని సన్నగా తరిగి సలాడ్ లలో వేసుకున్నా, ఆవ నూనె లో సన్నగా వేయించనా, లేదా సల్పంగా ఉడకబెట్టినా తినడానికి చాలా రుచిగా ఉంటాయి. మీరు ఏ రకమైన ఆస్పరాగస్ ను తీసుకున్నా ఎన్ని రకాలుగా వండుకున్నా లేదా సలాడ్ లో వేసుకొని పచ్చిది తిన్నా దీని రుచిని  ఎంతో మధురంగా మీరు ఆస్వాదిస్తారు.

ఆధారాలు:
http://www.naturalnews.com/023368_asparagus_benefits_food.html
http://bkcreative.hubpages.com/hub/10-Super-Health-Benefits-of-Asparagus http://www.eatingwell.com/blogs/health_blog/5_powerful_health_benefits_of_asparagus_you_probably_didn_t_know http://www.google.co.in/url?sa=t&rct=j&q=asparagus%20benefits&source=web&cd=6&cad=rja&sqi=2&ved=0CFYQFjAF&url=http%3A%2F %2Fwww.pureinsideout.com%2Fasparagus-extraordinary-health-benefits.html&ei=- YxQUbbyGpLU8wTAnYDgCw&usg=AFQjCNFoSkx5Z9cnFfTtksP09Kvx9UloJw&bvm=bv.44158598,d.eWU
http://www.juicing-benefits-toolbox.com/health-benefits-of-asparagus.html 

 

ప్రాక్టీ షనర్ లకు సూచన:

మీ ఇమెయిల్ ఎడ్రస్ మారినప్పుడు, వెంటనే  [email protected] కు వీలయినంత తొందరగా తెలియజేయండి. ఈ విషయాన్ని ఇతర ప్రాక్టీ షనర్ లకు కూడా తెలియజేయండి.

ఈ వార్తలేఖను మీ పేషంట్ లకు కూడా తెలియ జేయవచ్చు. వారికేమయినా సందేహాలుంటే మీ ద్వారా మన పరిశోధనా మరియు స్పందన విభాగానికి తెలియ జేస్తే తగు సమాధానాలు ఇవ్వబడతాయి. మీ సహకారానికి ధన్యవాదాలు.

 .

          

 ఓం సాయిరామ్!