Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

Vol 8 సంచిక 3
May/June 2017
ముద్రింప తగిన వార్తాలేఖ


పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి

డా.జిత్. కే అగ్గర్వాల్ యొక్క మాటల్లో

ప్రియమైన చికిత్సా నిపుణులకు,

2017 ఏప్రిల్ 24 తేదీన స్వామి వారి 6వ ఆరాధనోత్సవాలు జరిగాయి. మనందరికీ తెలుసు ఇది స్వామి మహాసమాధి చెందిన రోజు. స్వామి భౌతికముగా మనందరికీ దూరమైనా మన హృదయం లోనే కొలువు తీరి ఉన్నారు. జీసస్ కూడా దేవుని సామ్రాజ్యం నీ హృదయం లోనే ఉన్నదని ప్రవచించారు. మరి  మన లోనే ఉన్న ఆ దేవాదిదేవునితో నిరంతర సామీప్యత అనుభవిస్తూ ఆనందపు అంచులలో విహరించే మార్గం ఏది? దీనికి సమాధానం కూడా భగవంతుడే ప్రసాదించారు. ప్రేమ,సేవ అనే రెక్కలతో మానవాళి ఆ దివ్య పధాన్ని చేరుకోవచ్చు ...శ్రీసత్యసాయి ప్రవచనాలు 28.34: 21నవంబర్  1995. కనుక మన హృదయ కవాటాలను తెరిచి లోనున్న ప్రేమ వాహినిని నిస్వార్ధ సేవ వైపు ప్రవహింప చేద్దాం. ఇదే ఆనందానికి రాచబాట.

స్వామి మనందరికీ అందించిన బాటలో నడుస్తూ వైబ్రియోనిక్స్ కు అద్బుతమైన సేవలందించే చికిత్సా నిపుణులు ఎందరో ఉన్నారు. ఈ విషయానికొస్తే మన వార్తా లేఖలను ఇతర వైబ్రియోనిక్స్ సమాచారాన్ని ఇతర భాషలలోనికి అనువదించే వారి సేవలు ఎన్నదగినవి. వారి సేవలు మన సమాచారాన్ని ఆంగ్ల భాషా పరిగ్జ్ఞానం లేని వారికి  అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ సమయంలో వారి సేవలను ప్రస్తుతిస్తూ ఇలా అనువాద రూపంలో సేవలందించే కొందరి అనుభవాలను ఈ వార్తా లేఖలో మీకు అందిస్తున్నాము.

మార్చ్ 24 -27 తేదీలలో పోలాండ్ దేశంలో వర్క్ షాప్ నిర్వహించేందుకు అవకాశం మనకు కలిగింది. ఈ దేశపు వారే కాక జర్మనీ, నార్వే, రొమేనియా, స్లోవేనియా నుండి ప్రాక్టీషనర్ లు పాల్గొన్నారు. వారి ద్వారా విన్న కొన్ని అరుదయిన, అద్భుతమైన కేసుల వివరాలు మీతో పంచుకోవాలనుకొంటున్నాను. ఎందుకంటే  నిజంగా అ వివరాలు  వింటుంటే కళ్ళవెంట ఆనందబాష్పాలు రాలక మానవు. ఇట్టి స్పూర్తి,నైపుణ్యము,అంకిత భావం తో పనిచేసే ప్రాక్టీషనర్లు ఎప్పటికప్పుడు వృత్యంతర శిక్షణ పొందుతూ యూరప్ లో వైబ్రియోనిక్స్ అంచెలంచెలుగా  ఎదగడానికి దోహద పడడం ఎంతో ప్రోత్సాహకర పరిణామము. ఈ అనుభవాలను మరొక వార్తాలేఖ ద్వారా మీతో పంచుకోవాలనుకొంటున్నాను.

అమెరికా దేశపు మన వైబ్రియో ప్రాక్టీషనర్లు మొక్కలు, జంతువుల పైన మన అవగాహనను విస్తృత పరిచే  దిశలో భాగంగా ఒక  నూతన పరిశోధనా ప్రాజెక్ట్ ను ప్రారంభించారు, ఆ విధంగా మొక్కలూ, జంతువులలో వివిధరకాల రోగ సమస్యలను ఎదుర్కొనేందుకు సహకరించే నూతన పరిశోధనకు శ్రీకారం చుట్టారు.

స్వామి తమ అమూల్యమైన ఆశీస్సులు అందించిన ఈ వైబ్రియానిక్స్ తో సాధ్యమైనంత ఎక్కువ జీవితాలలోనికి ప్రవేశించాలానే లక్ష్యం తో ముందుకు పోవాలని వైబ్రియానిక్స్ సాధన పెంచుకునే దిశగా అందరూ ఒకటే అందరూ స్వామి ప్రతిరూపాలు అనే భావన విడనాడకుండా సేవ చేయాలనీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకా ప్రాక్టీషనర్లు అందరూ   సాయి వైబ్రియోనిక్స్ ప్రాక్టిషనర్ ల అంతర్జాతీయ సంస్థ International Association of Sai Vibrionics Practitioners  కు మన వెబ్ సైట్ ద్వారా లాగిన్ అయ్యి మెంబెర్ షిప్ పొందవలసిందిగానూ దీని నిమిత్తం సమాచారం కావలసి వస్తే మీ రాష్ట్ర కోఆర్డినేటర్ను ఎట్టి సందేహము లేకుండా సంప్రదించవలసిందిగా సూచిస్తున్నాను. అలాగే సంస్థాగతంగా కానీ, పరిపాలనా పరంగా కానీ మీరేమైనా సహాయం అందించదలిచినచో  ఇదే మా సాదర ఆహ్వానము. మీ సేవలు ప్రస్తుత తరుణంలో అత్యవసరమైనవిగా భావించండి. మీలో ప్రతీ ఒక్కరికీ ముఖ్యంగా ‘’అందరినీ ప్రేమించు,అందరినీ సేవించు’’ అనే సూత్రంతో మనందరినీ ఈ వైబ్రియోనిక్స్ ద్వారా దగ్గర చేర్చి సేవ చేసుకొనేందుకు అవకాశాన్ని, అదృష్టాన్ని ప్రసాదించిన స్వామికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ

ప్రేమపూర్వకంగా సాయి సేవలో,

జిత్ కే అగ్గర్వాల్.

 

గొంతు క్యాన్సర్ 02090...India

2014వ సంవత్సరం జూన్ నెలలో 90  సంవత్సరాల వృద్ధుడిని అతని కుమారుడు వైబ్రో చికిత్సా నిపుణుని వద్దకు తీసుకొని వచ్చాడు. అతని MRI స్కానింగ్ మరియు ఇతర రిపోర్టుల ప్రకారము గొంతు క్యాన్సర్ అంతిమ స్థాయిలో ఉంది. పేషంటుకు ఏదయినా తినడానికి, తాగడానికి వీలు కానీ పరిస్తితిలో ఉంది. మొదట ఒక ENT వైద్యుడు దీనిని గుర్తించి కేరళలోని ఒక ప్రముఖ కేన్సర్ వైద్యనిపుణుని వద్దకు పంపడం జరిగింది. పరీక్షల అనంతరం రోగికి రేడియేషన్ థెరపీ చేయాలనీ దానివల్ల వయస్సు దృష్ట్యా రోగికి గుండె ఆగిపోయి చనిపోవడానికి కూడా ఆస్కారం ఉందని చెప్పాడు. అంతేకాక రోగికి మరో మూడు నెలలలో ఆహారము, ద్రవము నిమిత్తం కడుపులోనికి గొట్టం వేయవలసి ఉంటుందని చెప్పాడు. వృద్ధుని కుమారుడు ఇతర వైద్యులను సంప్రదించినా ఇదే సమాధానంలభించింది. చివరకు ఈ దంపతులు అలోపతి వైద్యం నుండి విరమించుకుని వైబ్రో చికిత్సా నిపుణుడిని సంప్రదించారు. ఐతే ప్రాక్టీషనర్ తను ఇవ్వబోయే రెమిడీ తోపాటు అలోపతి మందులు కూడా తీసుకోవలసిందిగా సూచించినా వారు నిరాకరించారు. రోగికి క్రింది మందులు ఇవ్వడం జరిగింది:
#1. CC2.1 Cancers - all + CC2.2 Cancer pain + CC2.3 Tumours & Growths + CC19.7 Throat chronic…TDS

నెల రోజులు వాడిన తర్వాత వృద్దునికి చాలా తేలికగా ఉన్నట్లు తెలుసుకున్నారు. నొప్పి కూడా చాల వరకు తగ్గింది. తినడంలో  త్రాగడంలో పెద్దగా ఇబ్బంది పడడం లేదని తెలిసింది. మొత్తంగా 20 శాతం మెరుగుదల కనిపించింది. ఐతే ప్రాక్టీషనర్ తన అంతఃచేతన యొక్క బోధతో మొదటి డోస్ కొనసాగిస్తూనే క్రింది రెమిడి కూడా ఇవ్వడం జరిగింది:
#2. SR522 Pituitary Anterior + SR523 Pituitary Posterior…TDS

ప్రాక్టీషనర్ ఇది వాడుతూ ఉన్నప్పుడు రోగిలో చక్కని మెరుగుదల కనిపించింది. రెండు సంవత్సరాలు వాడిన తర్వాత తిరిగి కేన్సర్ వైద్యునికి చూపిస్తే ‘’ ఎంత అద్భుతం వైద్య చరిత్రకే ఇది గొప్ప సవాల్, కేన్సర్ కనీసం అనమాలుకు కూడా ఇతనిలో లేదు’’ అంటూ ఆశ్చర్యపోయాడు. కడుపులోనికి ట్యూబ్ అవసరం లేకుండానే చక్కగా ఆహారం తింటూ 2015 లో అనాయాస మరణం పొందాడు.

సంపాదకుని వివరణ: కేన్సర్ వైద్యం జరుగుతున్నప్పుడు పేషంటుకు దగ్గు, జ్వరము, అలసట వంటి ఇతర తాత్కాలిక లక్షణాలకు కూడా అవసరార్ధం మందులు ఇవ్వబడ్డాయి.

అభ్యాసనా లోపము 02090...India

2017వ సంవత్సరం జనవరి 8వ తేదీన ఒక తల్లి తన 8 సంవత్సరాల పాపను ప్రాక్టీషనర్ వద్దకు తీసుకొని వచ్చింది. ఆ పాప  ప్రస్తుతం 3 వ తరగతి చదువుతున్నది కానీ అభ్యాసనా లోపంతో కనీసం అక్షరాలు కూడా గుర్తు పట్టలేని స్థితి లో ఉంది. ప్రాక్టీషనర్ ఆమె తోనూ తల్లి తోనూ మాట్లాడి క్రింది రెమిడి ఇవ్వడం జరిగింది:
CC12.2 Child tonic + CC15.5 ADD & Autism + CC17.3 Brain & Memory tonic…TDS

ఆరు వారాలు తర్వాత ఆ తల్లి ఎంతో ఆనందంతో పాప గురించి వాళ్ళ టీచర్ చెప్పిన మాటలను వివరిస్తూ చాలా తక్కువ సమయంలో ఆమెకు అక్షరాలన్నీ వచ్చేసాయనీ ఏకాగ్రత పెరిగిందనీ చదువుకునే సామర్ధ్యం పెరిగిందనీ చెప్పిందట. ప్రాక్టీషనర్ సంవత్సరం పాటు ఇదే రెమిడి వాడమని సూచించటం జరిగింది. 

సంపాదకుని వివరణ: పిల్లలకు,ముఖ్యంగా విద్యార్ధులకు అనేక రకాల టానిక్ లు ఇవడం ద్వారా కేరళ చికిత్సా నిపుణులు అద్బుతమైన ఫలితాలు, ప్రజల మన్ననలను పొందడం అభినందనీయము.

ఎముకలలో ఆస్టియో నెక్రోసిస్ వ్యాధి (Osteonecrosis of ribs) 10602...India

2016వ సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీన 67 సంవత్సరాల వృద్ధ మహిళ ప్రాక్టీషనర్ వద్దకు వచ్చింది. చాలా సంవత్సరముల క్రిందట జరిగిన ఒక ఆపరేషన్ తాలూకు మచ్చకు చుట్టూ ఉన్న ప్రాంతం నుండి గడ్డలు, పుండ్లు వ్యాపించి చీము కారుతూ చాలా నొప్పి పుడుతోందట. ఒక ప్రముఖ వైద్యుణ్ణి ఆమె సంప్రదించినప్పుడు గతంలో ఆమె తీసుకున్న రేడియేషన్ థెరపీ వల్ల ఇలా జరుగుతోందని చెప్పాడు. 18 సంవత్సరాల క్రితం ఆమె రొమ్ము క్యాన్సర్ నిమిత్తం రేడియేషన్ థెరపీ తీసుకుని క్యాన్సర్ వ్యాపించిన ప్రక్కటెముకలు తొలగించుకొనుటకు ఒక పెద్ద  ఆపరేషన్ కూడా చేయించుకున్నది. ప్రస్తుతం తిరిగి సంప్రాప్తించిన ఈ వ్యాధి ఇంకా వ్యాపించకుండా ఉండాలంటే ఆమె మరో ఆపరేషన్ కు సిద్ధపడి వ్యాధికి గురయిన ప్రక్కటెముకలు తొలగింప చేసుకోవాలని ఆ వైద్యుడు చెప్పాడు. కానీ ఈ వృద్ధ మహిళ మరోసారి ఆపరేషన్ చేయించుకొనడానికి సుముఖంగా లేదు. కారణం ఏమంటే గతం లో ఆపరేషన్ కు ముందే కాక ఆపరేషన్ అనంతరం కూడా 15 రోజులు విపరీతమైన బాధ అనుభవించవలసి వచ్చింది. ఐతే ప్రాక్టీషనర్ ఆమెకు ధైర్యం చెప్పి బాబా పైన అచంచల విశ్వాసం ఉంచి ఆపరేషన్ చేయించుకొనడానికి సిద్ధపడాలని సూచించారు. ఆమెకు క్రింద సూచించిన రెమిడి ఇచ్చారు:
#1. CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…TDS

#2. CC2.1 Cancers - all + CC2.2 Cancer pain + CC9.2 Infections acute + CC21.11 Wounds & Abrasions…6TD
సెప్టెంబర్ 27 న ప్రాక్టీషనర్ సూచన పైన ఆమెకు ఆపరేషన్ అయ్యింది. ఆపరేషన్ కు 5 గంటల సమయం పట్టినా ఆశ్చర్యకరంగా ఏమాత్రం నొప్పి తెలియలేదు. ICU నుండి ఆమె ప్రాక్టీషనర్ తో మాట్లాడుతూ ఇన్ఫెక్షన్ కారణంగా చాలా వరకు పక్కటెముకలు తొలగింప చూసిన వైద్యులు ఇన్ఫెక్షన్ వ్యాపించకుండా ఆగిపోవడం చూసి చాలా ఆశ్చర్యం పొందారు. ఐతే కుడివైపు పై భాగాన ఉన్న ఒక్క ఎముక మాత్రం తొలగించవలసి వచ్చింది. నెల తర్వాత #2 ను QDS గానూ రెండు నెలల తర్వాత TDS గానూ అలాగే #1 ను BD గానూ డోస్ తగ్గించడం జరిగింది. మూడు నెలల తర్వాత పేషంట్ తనకు పూర్తిగా తగ్గిపోయిందని తెలుపుతూ ఆనందాన్ని తెలియ జేసింది. ఐతే ప్రాక్టీషనర్ డోస్ మానకుండా మరో నెలరోజలు OD గ తీసుకోవాలని ఆ తర్వాత నుండి OW మెయింటెనేన్స్ డోస్ గా తీసుకోవాలని సూచించారు. ఇటీవల ఆమె కనిపించి నప్పుడు తనకు ఏ ఇబ్బంది లేనందువల్ల డోస్ తీసుకోవడం పూర్తిగా ఆపివేసాననీ తనకు రోగ నివారణ చేసిన స్వామికి  సాయి వైబ్రియానిక్స్ కు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

దీర్ఘకాలిక పొత్తికడుపు నొప్పి 10602...India

40 సంవత్సరాలుగా కడుపు నొప్పితో బాధ పడుతున్న 93 సంవత్సరాల ఒక వృద్ధ మహిళ 2017 మార్చ్ 7 న ప్రాక్టీషనర్ వద్దకు వచ్చింది. ఐతే ఈ 40 సంవత్సరాలుగా ఆమె అలోపతిక్ మందులు వాడుతూ 35 సంవత్సరాల క్రితం గర్భాశయం తొలగింపు, 20 సంవత్సరాల క్రితం గాల్ బ్లాడర్ తొలగింపు, 10 సంవత్సరాల క్రితం పాంక్రియాస్, కిడ్నీల లో రాళ్ల నిమిత్తం శస్త్ర చికిత్స, 5 సంవత్సరాల క్రితం హెర్నియా ఆపరేషన్ ఇలా ఎన్నో ఆపరేషన్లు చేయించుకున్నా మందులు వాడినా ఈ పొత్తి కడుపు నొప్పికి కారణం ఏమిటో తెలియలేదు, నొప్పి కూడా తగ్గలేదు. ఈ నొప్పి తో పాటు ఆమెకి ఉదరంలో నొప్పి మంట కలగసాగాయి. దీనితో ఆమెకు ఆకలి మందగించింది, నిస్త్రాణంగా ఉంటోంది, దీనితో పాటు విసుగు కోపము కూడా కలగసాగాయి.

స్వామిని ప్రార్ధించి ప్రాక్టీషనర్ ఆమెకు క్రింది డోస్ ఇవ్వడం జరిగింది:
#1. CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC18.7 Vertigo…6TD
2. CC4.2 Liver & Gallbladder tonic + CC4.3 Appendicitis + CC4.4 Constipation + CC4.5 Ulcers + CC4.6 Diarrhoea + CC4.8 Gastroenteritis + CC4.9 Hernia + CC4.10 Indigestion
…6TD

రెండు వారాలు మందులు వాడిన తర్వాత  ఆమె ప్రాక్టీషనర్ను కలిసి తనకు 50 శాతం మెరుగుదల కనిపించిందని వర్టిగో పూర్తిగా తగ్గిందని ఆహారం చక్కగా తీసుకొంటూ ఉండడం వల్ల అంతగా నీరసం కూడా లేదని చెప్పింది. ప్రాక్టీషనర్ #1 మరియు #2 మందులను QDS గా తగ్గించారు. నెల రోజుల తర్వాత ప్రాక్టీషనర్  ను కలసి తనకు  పూర్తిగా తగ్గిపోయిందని ఆహారం చక్కగా తీసుకుంటున్నాననీ నీరసం పూర్తిగా తగ్గిందని తెలిపింది. ఐతే డోస్ మాత్రం నెల రోజుల పాటు BD గానూ  మరో నెల రోజులు OD గానూ తీసుకోవలసిందిగా సూచింపబడింది. తిరిగి 2016 జనవరి 20వ తేదీన ఆమె తిరిగి  ప్రాక్టీషనర్ను కలసినప్పుడు తనకు పూర్తిగా తగ్గిపోయిందని తెలిపింది. అలాగే ఏప్రిల్ నెలలో కలసినప్పుడు ఇన్ని రోజులుగా పాత సమస్యలేవీ తలెత్తలేదని పూర్తిగా కోలుకున్నానని తెలిపారు.

మధుమేహ వ్యాధి 11576...India

78 సంవత్సరాల మహిళ తనకు 2009 లో మధుమేహ వ్యాధి ఉన్నట్లు గుర్తింపబడి మందులు వాడసాగింది. తగిన ఫలితం లేకపోవడంతో 2016 ఏప్రిల్ 3న చికిత్సా నిపుణుడను సంప్రదించారు. చాలా సంవత్సరాల పాటు నిస్త్రాణంగా ఉండడంతో ఎక్కువ విశ్రాంతి తీసుకొనడం, పరిమితమైన ఆహారం తీసుకోవడం, చెక్కెరను తగు మోతాదులోనే తీసుకొనడం ఆమెను మానసికంగా కూడా కృంగిపోవునట్లు చేసింది. ఆమె బి.పి మరియు కొలెస్ట్రాల్ (కొవ్వు) శాతం సాధారణ స్థాయి లోనే ఉన్నాయి. ఆమె పూర్వీకులకు కూడా చెక్కెర వ్యాధి ఉన్న దాఖలాలు లేవు. ఆమెకు అన్నం తినక ముందు చెక్కెర శాతం (బ్లడ్ షుగర్) 180 mg/dl గానూ (normal 70-100mg/dl) తిన్న తర్వాత 240mg/dl (normal <140 mg/dl) గానూ ఉన్నాయి. ఈ 7 సంవత్సరాలుగా డాక్టర్ సూచించిన అన్ని రకాల మందులు వాడుతూనే ఉన్నప్పటికీ ఫలితం లేదు. ప్రస్తుతం ఆమె మెట్ ఫార్మిన్ 500 mg మరియు విటమిన్ బి12 (Metformin  500mg and Vitamin B12) వాడుతున్నారు. ఈమె రోగ చరిత్రంతా తెలుసుకున్న ప్రాక్టీషనర్  లోలకం (pendulum) సహాయంతో ఆమెకు లివర్ సాధారణ స్థాయిలో పని చెయ్యడం లేదని తెలుసుకున్నారు. క్రింది రెమిడి ఆమెకు సూచింపబడింది:
CC4.2 Liver & Gallbladder tonic + CC6.3 Diabetes + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…QDS నీటితో 

మందులతో పాటు ఆహారంలో పరిమితి, శారీరక కసరత్తులు, బరువు నియంత్రణలో ఉంచుకొనడం కూడా  ఆమె చికిత్సలో భాగమయ్యాయి.  అంతేకాకుండా చెక్కెర శాతం ఎక్కువుగా ఉన్న పదార్ధాలు తీసుకోకుండా తాజా పళ్ళను తీసుకుంటూ ఉండవలసిందిగా ఆమెకు  సూచింపబడింది. గోధుమ గడ్డిని, కట్ చేసిన ఉల్లిపాయల ముక్కలు, ఎక్కువగా నీరు తీసుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు చెక్కర శాతం పరీక్ష చేయించుకుంటూ తన ఫిజిషియన్ కు అందుబాటులో ఉండవలసిందిగా సూచింపబడింది.

10 రోజులు వాడిన తర్వాత చెక్కర శాతంలో 20 శాతం తగ్గుదల కనిపించగా 9 వారాల తర్వాత 50 శాతం తగ్గుదల కనిపించింది. కనుక డోస్ ను TDS గా తగ్గించడం జరిగింది. ఆమెకు ప్రస్తుతం ఎంతో తేలికగా, ఆరోగ్యంగా, బలంగా ఉన్నట్లు అనిపించ సాగింది. నాలుగు నెలలు మందులను వాడిన తర్వాత పరీక్ష చేయించగా ఆమె బ్లడ్ షుగర్ లెవెల్ సాధారణ స్థాయిలో ఉన్నట్లు తెలిసింది. కనుక డోస్ ను BD స్థాయికి తగ్గించడం జరిగింది. ఆమె రోజుకు రెండు సార్లు  వేసుకొనే మెట్ ఫార్మిన్ మాత్రను రోజుకు ఒక్కసారి చొప్పున తగ్గించి చివరకు జనవరి 2017 నుండి పూర్తిగా మానివేసింది. ఏప్రిల్ 2017 నాటికి పేషంట్ కు పూర్తిగా తగ్గిపోయి మానసికంగా ఎంతో ప్రశాంతత  పొందుతున్నట్లు తెలపడంతో OW నిర్వహణా  డోస్ గా రెమిడిను తీసుకోవలసిందిగా సూచించారు.

ప్రాక్టీషనర్ వివరణ:
రోగి యొక్క బ్లడ్ షుగర్ క్రమ తగ్గుదలను సూచించే రిపోర్టులన్నీ భద్రపరచబడినవి.

హైపో థైరాయిడ్ 11576...India

2016 మార్చ్ 12వ తేదీన ఒక 43 మహిళ హైపో థైరాయిడ్ సమస్యతో బాధ పడుతూ ప్రాక్టీషనర్నుసంప్రదించారు. ఆమె ఉండవలసిన స్థాయికన్నా ఎక్కువ బరువుగా ఉండడమేకాక వంట్లో అసలు శక్తి లేనట్లు నిస్త్రాణంగా ఉన్నట్లుగానూ ఆమె హృదయ స్పందన, కొలెస్ట్రాల్ (కొవ్వు)శాతం సాధారణ స్థాయిలో ఉన్నప్పటికీ ఆమెకు అలసిపోయినట్లుగా, సోమరితనంగా, అవిశ్రాంతంగా అనిపించ సాగిందట. ఇంక ఆమెకు నిద్ర లేమి సమస్య తో పాటుగా ఆమెకు వాళ్ళంతా చల్లబడి పోతున్నట్లు అనిపిస్తూ ఉంటుందని కూడా చెప్పింది. ఆమె రోజుకు 75mg థైరాక్సిన్  Thyroxin అలోపతిక్ డోస్ తీసుకొనసాగింది. ప్రాక్టీషనర్ ఆమెకు క్రింది రెమిడి ఇవ్వడం జరిగింది:
CC6.2 Hypothyroid + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…QDS నీటితో

ఆమె చెప్పిన విషయం ప్రకారం మొదటిసారిగా ప్రాక్టీషనర్ను కలసి మొదటి  పిల్ వేసుకోగానే ఏదో తెలియని అనందం కలిగిందట. నెల తర్వాత ఆమె థైరాయిడ్ హార్మోన్ రీడింగులు FT3, FT4 మరియు TSH ల స్థాయిలో తగ్గుదల కనిపించిందట. మూడు నెలల తర్వాత జూన్ 2016 లో పరీక్ష చేయించుకొన్నప్పుడు ఆమె థైరాయిడ్ గ్రంధి సాధారణ స్థాయి లో పనిచేస్తున్నట్లు తెలిసింది. కనుక ఆమెను డాక్టర్ థైరాక్సిన్ 25 mg మాత్రమే వేసుకోవాల్సిందిగా సూచించారు. ప్రాక్టీషనర్ కూడా రెమిడి డోస్ ఆగస్టు వరకు OD గానూ అప్పటి నుండి అక్టోబర్ వరకు OW గానూ తీసుకోవలసిందిగా సూచించారు. ప్రస్తుతం ఆమె థైరాయిడ్ హార్మోన్ స్థాయి సాధారణ స్థాయి లో ఉంది, ఆమె శరీర బరువు కూడా 10 కేజీలు తగ్గింది.

ప్రాక్టీషనర్ వివరణ:
అక్టోబర్ 2016 నాటి వరకూ పూర్తి ఆరోగ్యంతో ఉండి తరువాత వేరే పట్టణానికి పేషంటు వెళ్ళిపోయారు.

 

దెబ్బ తగలడం వలన కలిగిన గాయం 03536...Italy

పునరుద్ధరణ విభాగానికి చెందిన కళాకారిణి ఐన 53 ఏళ్ళ వయసున్న ఒక మహిళ కుడి చేతి చూపుడువేలుకు ఒక చెక్క చీలిక వల్ల గాయం అవడంతో ప్రాక్టీషనర్ను సంప్రదించారు. ఈ గాయం 8 మి.మీ.లోతుగా ఉంది. కళాకారిణిగా  ఆమె యొక్క దైనందిన జీవితము మరియు అక్కడ ఉన్నట్టి శీతల వాతావరణం వల్ల గాయం ఐనప్పటినుండి అది తగ్గడం లేదు. 2017 జనవరి 25న ఆమె ప్రాక్టీషనర్ను కలిసే నాటికీ ఈ గాయం ఒక చీలిక మాదిరిగా ఉండి రక్తం కారుతూ మంటగాను, నొప్పిగాను ఉంది. ఐతే ఆమె ఈ గాయం గురించి ఇతర చికిత్స ఏమీ తీసుకోవడం లేదు.

ఆమెకు క్రింది రెమిడి ఇవ్వబడింది:
CC21.5 Dry Sores + CC21.11 Wounds & Abrasions ఈ రెమిడిని ఆల్కహాల్ మీడియం ద్వారా గాయం పైన వేశారు. కొన్ని నిమిషాలలోనే అందరికీ ఆశ్చర్యం కలిగే విధంగా ఎర్రగా ఉన్న పుండు రంగు మారడం నొప్పి, మంట నెమ్మదించడం, ప్రారంభమయ్యింది. తిరిగి 5 గంటల తర్వాత ప్రాక్టీషనర్ గాయం పైన రెమిడి ఆల్కహాల్ మీడియంతో వేసారు.

రెండు రోజులలో మృత చర్మం సహజంగానే రాలిపోవడం జరిగింది. పేషంటుకు ఇదంతా నమ్మలేని నిజం లాగా అనిపించింది. ఆమె  ఇది సైన్స్ కు అందని ఒక  అద్భుత విషయం అని వ్యాఖ్యానించింది. ఇకనుండి తన జీవితంలో ఆరోగ్యానికి సంబంధించిన అన్ని సమస్యలకు వైబ్రియోనిక్స్ పైనే అధారపడతానని చెప్పారు.

లీష్ మానియోసిస్ కానయిన్( Leishmaniosis Canine) కుక్కలకు వచ్చే ప్రాణాంతక వ్యాధి 02584...Italy

ఒక వేటగాడు 4 నుండి 8 సంవత్సరాల మధ్యనున్న తన యొక్క పెంపుడు కుక్కలు నాలుగింటిని ప్రాక్టీషనర్ వద్దకు తీసుకొని వచ్చాడు. ఇవి లీష్ మానియోసిస్ వ్యాధితో బాధపడుతూ ఉన్నాయి. ఇది ఇసుక ప్రాంతపు దోమల మాదిరి ఉండే ఒక రకమైన ఈగ జాతి చేరవేసే పరాన్నజీవుల వలన కలిగే వ్యాధి. ఇది చాలా ప్రాణాంతకమైన వ్యాధి. నాలుగింటిలో రెండు సంవత్సరం పైగానూ మరోరెండు గత కొన్ని నెలలు గానూ వ్యాధికి గురయి ఉన్నాయి. ఈ వ్యాధి లక్షణం ఏమిటంటే బరువు తగ్గిపోవడం, వెంట్రుకలు పూర్తిగా రాలిపోవడం, గోర్లు పెరగక పోవడం వంటివి. పశువైద్య నిపుణుడు ఈ వ్యాధికి  తన వద్ద మందు ఏదీ లేదు కనుక ఆ కుక్కలను చంపేయడం శ్రేయస్కరమని సూచించాడు.

2005 నవంబర్ 30వ తేదీన ప్రాక్టీషనర్ క్రింది రెమిడీ ఇచ్చారు:
#1. NM2 Blood + NM86 Immunity + NM116 Malaria Extra Strength + OM28 Immune System + SM26 Immunity...OD

ఈ రెమిడిని 3 వారాలు పాటు ఇచ్చి మరో 3 వారాలు విరామం, తిరిగి 3 వారాలు ఇవ్వడం ఇలా మూడు సార్లు చేయవలసిందిగా ప్రాక్టీషనర్ సూచించారు. 3 -4 వారాలు లోనే వీటి జబ్బు పూర్తిగా నయమయ్యింది. ఐతే ప్రాక్టీషనర్ ఈ మధ్య కాలంలోనే నాలుగు నెలల పాటు సెలవు పైన వెళ్ళవలసి వచ్చింది. ఈమె తిరిగి వచ్చేసరికి కుక్కల యజమాని వాటి వెంట్రుకలు మొత్తం రాలిపోయాయని చూపించారు. 2006 మే 4వ తేదీన వాటికి క్రింది రెమిడీ ఇవ్వడం జరిగింది.

నీరసానికి మరియు వెంట్రుకలు పెరుగుదలకు:
#2. SR256 Ferrum Phos + SR361 Acetic Acid
 

మూడు వారాలలోనే అవి శక్తిని పొంది బలంగా తయారయ్యాయి. వాటి వెంట్రుకలు కూడా పెరగడం ప్రారంభమయ్యింది. వేటగాడు ఉండునట్టి ద్వీపపు ప్రాంతంలో ఈ వ్యాధి ఎక్కువ కనుక #1 ని జాగ్రత్త కోసం OD గా ప్రతీ సంవత్సరం వసంత ఋతువు లో తీసుకుంటూ ఉండమని సూచించారు. తన కుక్కలు పూర్తిగా నయమవ్వడంతో వేటగాడు ఆనందంతో కృతజ్ఞతలు తెలిపారు.

దీర్ఘకాలిక ఆమ్లత్వము మరియు గోధుమలు పడక పోవడం (ఎలర్జీ) 10001...India

2015 సెప్టెంబర్లో 28 సంవత్సరాల మహిళ ప్రాక్టీషనర్ను కలసి తను గత 8 సంవత్సరాలుగా ఆమ్లత్వముతో బాధ పడుతున్నట్లు చెప్పారు. దీనివల్ల రోజంతా తలపోటుగా ఉంటోంది దీని నివారణకు నొప్పి నివారిణిగా క్రోసిన్ తీసుకుంటున్నారు. దీనివల్ల విపరీతమైన ఒత్తిడికి లోనవడము, తనపైన తనకు విశ్వాసం సన్నగిల్లడం జరుగుతోందని ఆమె తెలిపారు. అలోపతి మందులతో విసుగు చెంది వైబ్రో ప్రాక్టీషనర్ను ఆశ్రయించడంతో క్రింది రెమిడి ఇవ్వడం జరిగింది. 

అమ్లత్వము మరియు శిరోవేదనకు (For acidity and headache):
#1. CC4.10 Indigestion + CC11.3 Headaches + CC12.1 Adult tonic…6TD

ఎక్కువ మానసిక వత్తిడి ఉన్న సమయాలలో (During periods of high stress): 
#2. CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic…ఒక్క డోసు, అవసరమైనప్పుడు

మొదటి వారం వాడిన తర్వాత పేషంటు తనకు తలపోటు విషయంలో 80 శాతం మెరుగుదల కనిపించిందని చెప్పారు. ఈ వారంలోపు #2 ను ఒకటి, రెండు సార్లు మాత్రమే తీసుకున్నానని వత్తిడి కూడా చాలావరకు తగ్గిందని తెలిపారు. నెల రోజులు వాడిన తర్వాత  #1ను TDS గానూ ఆపైన  క్రమంగా తగ్గించుకుంటూ  OW తీసుకోసాగారు.  #2 యొక్క అవసరం లేదు కనుక దానిని పూర్తిగా మానివేసారు. 

2016 ఫిబ్రవరి నెలలో పేషంటు తనకు 3 సంవత్సరాలుగా గోధుమ పిండితో చేసిన చపాతీలు తింటే పడడం లేదని అవి తిన్న వెంటనే కడుపునొప్పి వస్తోందని చెప్పారు. ప్రాక్టీ షనర్ గోధుమ పిండిని 200 C తో (potentising it at 200C ) పోటెంటైజ్ చేసి TDS గా ఇచ్చారు. నెల రోజులు వాడే సరికి తను చెపాతీలు చక్కగా తినగలుగుతున్నానని కడుపునొప్పి రావడం లేదని పేషంట్ తెలిపారు. 2016 జూలై లో రెమిడి తీసుకోవడం పూర్తిగా ఆపివేసే నాటికి డోస్ను క్రమంగా OWగా తగ్గించుకొంటువచ్చారు. 2016 డిసెంబర్ నాటికి పేషంటుకు అసిడిటీ, తలనొప్పి, కడుపునొప్పి పూర్తిగా తగ్గిపోవడంతో రెమిడి తీసుకోవడం మానివేసారు.

సంపాదకుని  వివరణ:
అసిడిటీ మరియు తలనొప్పి గోధుమపిండి అంటే ఎలర్జీ వల్లే వచ్చి ఉంటుంది. కనుక మొదట ఎలర్జీకి మందు ఇచ్చిఉంటే  వేరే ఇతరత్రా రెమిడి తీసుకోకుండానే తగ్గిపోయి ఉండవచ్చు. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎవరైనా పేషంటు మన వద్దకు వచ్చినప్పుడు సంశయం లేకుండాను, దాపరికము లేకుండాను రోగలక్షణాలు అన్నింటిని చెప్పవలసిందిగా ప్రోత్సహించాలి.

పరీక్షల ఆందోళన రుగ్మత 02899...UK

2016 మార్చ్ 27 వ తేదీన 15 సవత్సరాల బాబును అతని తల్లి ప్రాక్టీషనర్ వద్దకు తీసుకువచ్చారు. ఈ బాబు GCSE తుది పరీక్షకు తయారవుతూ చాలా అందోళన చెందుతున్నాడు. ఈ పరీక్ష అతని జీవితానికే ఒక ముఖ్యమైన మలుపు వంటిది. సాధారణంగా పరీక్ష అంటే ఎలాంటి ఆందోళన పడని ఈ బాబుకు ఏదో తెలియని భయం ప్రారంభమయ్యి ముక్కు వెంట రక్తం కూడా వస్తోంది. దీని నిమిత్తం మందులేమి వాడడం లేదు కానీ ఈ బాబు చిన్నప్పటినుండి కూడా గొంతుమంట తోనూ, చలికాలంలో జలుబుతోనూ  బాధపడుతూ డాక్టర్ సలహా అనుసరించకుండానే ఏవో కొన్ని బాధా నివారణలను వాడేవాడు. ఐతే వీటివల్ల తాత్కాలిక ఉపశమనమేకానీ రోగనివృత్తి మాత్రం కలిగేది కాదు. బాబు తల్లి ప్రాక్టీషనర్తో యితడు చాలా సున్నిత మనస్కుడు, భావోద్వేగాలు చాలా ఎక్కువ అని కూడా చెప్పారు.

ప్రాక్టీషనర్ బాబుకు క్రింది రెమిడి సూచించారు:
CC10.1 Emergencies + CC12.2 Child tonic + CC15.1 Mental & Emotional tonic + CC19.7 Throat chronic…నీటితో గంట వరకూ పదినిమిషాల కొకసారి అనంతరం 6TD

6 వారాల తర్వాత బాబు తల్లి రెమిడి అద్భుతంగా పనిచేసిందని, పరీక్షలు భయంలేకుండా రాయగలిగాడని, ముఖ్యంగా బాబుకు మందుల పట్ల ఎంతో విశ్వాసం పెరిగిందనీ తాను రెమిడి నీటితో కలపడం మరిచిపోయినా బాబే తనంతట తాను కలుపుకుంటూ ఉంటాడని చెప్పారు. బాబు పరీక్షలు మే, జూన్ లలో వ్రాయగా వాటి ఫలితాలు ఆగస్టులో వచ్చాయి. సెప్టెంబర్ 27న బాబు తల్లి టెలిఫోన్లో బాబు పరీక్షల్లో చక్కని స్కోర్ సాధించాడని రోగలక్షణాలు పూర్తిగా తగ్గి ప్రశాంతంగా ఉంటున్నాడని చెపుతుంటే బాబు ఫోన్ తీసుకొని తనకు మందులు అద్భుతంగా పనిచేసాయని పరిక్షా ఫలితాలు చూసి తన స్నేహితులు, బంధువులు, అమ్మా నాన్నా కూడా ఎంతో ఆశర్య పోతున్నారని ఎంతో ఉద్విగ్నంగా చెప్పాడు. 2016 జూలై నుండి 27 మార్చ్ 2017 వరకూగల సమయయంలో తనకు ఆందోళనగాని, ఒత్తిడి గానీ ముక్కు వెంట రక్తం కారడం గానీ, గొంతుమంట, జలుబు ఇవేమీ లేవని చక్కగా చదువుకోగాలుగుతున్నాననీ చెప్పాడు.  

పేషంటు వివరణ:
పరీక్షలకు ముందు నాలో భరింపరాని వత్తిడి, ఆందోళన ఉండేది. నా పైన నాకు ఎన్నో ఆశలు ఉండేవి కానీ వత్తిడి నా ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసింది. మా అమ్మ ప్రాక్టీషనర్ నుండి మందు తెచ్చాక గంట వరకు ప్రతీ 10 నిమిషాల కొకసారి వేసుకున్నాను. తర్వాత రెండు గంటలు విరామం ఇచ్చి తిరిగి మందు వేసుకోవడం ప్రారంభించాను. రెండు వారాలు వాడిన తర్వాత నాకెంతో తేలిక అనిపించింది. ఎక్కువ సమయం వత్తిడి లేకుండా ఉండగాలిగేవాడిని. పరిక్షలలో మంచి స్కోర్ సాధించాను. దీనికంతటికి కారణం నీటితో తీసుకున్న రెమిడినే. నన్ను ఈ రకంగా ఆరోగ్యవంతుణ్ణి చేసినందుకు ప్రాక్టీషనర్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.  

Practitioner Profile 02090...India

ప్రాక్టీషనర్ 02090 భారత దేశము 2001 లో ప్రభుత్వ ఉద్యోగం నుండి పదవీవిరమణ చేసిన వీరు ఆధ్యాత్మిక సాధనలో పూర్తిగా నిమగ్నమయ్యారు. భగవాన్  బాబా పైన ఉన్న ప్రగాఢ విశ్వాసం వల్ల అనేక సార్లు ప్రశాంతినిలయం వెళ్లివచ్చారు. అలా వెళ్లి వస్తున్న సందర్భములో ఒకసారి డాక్టర్  అగ్గర్వాల్ సార్ ద్వారా నిర్వహింపబడు 3రోజుల వైబ్రియోనిక్స్ సదస్సు లో పాల్గొనే అవకాశం వచ్చింది. వెంటనే వారు ఈ అద్బుతమైన చికిత్సా విధానానికి ఆకర్షితులయ్యారు. ఎందుకంటే గతంలో కేరళలో జరిగిన మెడికల్ క్యాంపులలో పాల్గొన్న అనుభవం వీరికి ఉంది. ఈ వైద్యవిధానం గురించి నేర్చుకోవాలనే తపనతో డాక్టర్ అగ్గర్వాల్ సార్ ను సంప్రదించారు. క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం 12 మందితో కూడిన  SRHVPలో శిక్షణకు అగర్వాల్ సార్ అంగీకరించారు. వైబ్రియోనిక్స్ కు రాక పూర్వము వీరు ఇతరత్రా ప్రత్యామ్నాయ వైద్య విధానములయిన రికీ, మాగ్నెటిక్ థెరపీ, ప్రకృతి వైద్యము, ఆయుర్వేదం వంటి వాటిలో శిక్షణ కూడా తీసుకున్నారు. ప్రత్యామ్నాయ వైద్య విధానంలో వీరికి MD డిగ్రీ కూడా ఉంది. కొంతకాలం వైబ్రో విధానంలో ప్రాక్టీస్ చేసిన తర్వాత సాక్షాత్తు భగవంతుడు అనుగ్రహించిన ఈ వైద్యవిధానం కంటే మరొక గొప్ప విధానం ఏదియు లేదని వీరికి అనుభవం లోనికి వచ్చింది. వంటరిగా సాధన చేసుకొనే కంటే భగవంతుడి అనుజ్ఞానుసారం వైబ్రో సేవ చేయడమే ఉత్తమం అని భావించారు. దీనిని సమర్దిస్తూ వీరు పుట్టపర్తి వెళ్ళినప్పుడు తాను పూర్తి సమయం వైబ్రియో సేవ చేయడానికిగాను అనుజ్ఞా, ఆశీర్వాదము ఇవ్వమంటు వీరు వ్రాసిన ఉత్తరాన్నిస్వామి చిరునవ్వు నవ్వుతూ గ్రహించే సరికి వీరికి కొండంత బలం వచ్చింది. అప్పటినుండి పూర్తిసమయం హృదయపూర్వకంగా ఈ సేవ కే వినియోగించసాగారు తదనుగుణంగానే పేషంట్లు కూడా భగవదానుగ్రహంతో పెద్ద సంఖ్యలో రాసాగారు.

ఇలా పేషంట్ల సంఖ్యతో బాగాపెరిగిన  పరిస్థితిలోనే ఒకే రెమిడిని అనేకమందికి SRHVP ద్వారా ఇవ్వడం ఇబ్బందిగా తోచింది. కనుక వీరికి వచ్చిన ఒక  వినూత్నమైన ఆలోచనతో 10 మిల్లీమీటర్ల డ్రాపర్ సీసాలతో తరుచుగా ఉపయోగించే రెమిడిలను తయారు చేసారు. వీరు ఎన్నోరకాల వ్యాధులకు వైద్యం అందించడంలో నిమగ్నమై ఉన్నారు కనుక రానురానూ ఈ సీసాల సంఖ్య కూడా పెరిగిపోయింది. దీనితో వీరి వడ్రంగి (కార్పెంటర్) ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న 108 CC కొమ్బో బాక్సుకు రెట్టింపు సైజులో ఉన్న చెక్క పెట్టెను తయారు చేసారు(చిత్రం చూడండి).  

2008లో తన అంతరంగ ప్రభోధతో కేరళలోని ఇతర ప్రాంతాలకు కూడా దీనిని విస్తరించాలనే ఆశయంతో సాయి హాస్పిటల్ ఇంచార్జ్ గా  ఉన్నరాష్ట్ర మెడికల్ ట్రస్ట్ కన్వీనర్ను సంప్రదించారు. మొదట కొంత ప్రతిఘటించినప్పటికీ ఆ హాస్పిటల్ లో నెలవారీ వైబ్రియోనిక్స్ క్యాంపు నిర్వహించడానికి ఒప్పుకోవడం వైబ్రియోనిక్స్ విషయంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా అభివర్ణించవచ్చు.

2010లో వీరు మొట్టమొదటి  AVP వర్క్ షాప్ ను కేరళలో నిర్వహించగా అదే కాలానుగుణంగా ఇతర ప్రాంతాలకు విస్తరించింది. దీని ఫలితమే ప్రస్తుతం కేరళలో 100 కు పైగా అంకితభావం గల ప్రాక్టీషనర్లు విస్తృతంగా సేవలు అందిస్తూ అద్భుత ఫలితాలు పొందుతున్నారు. ఐతే కొంత కాలం గడిచిన తర్వాత ఈ వైబ్రియో ప్రాక్టీషనర్ లు డబ్బు చెల్లించి ఇతర ప్రత్యామ్నాయ వైద్య విధానాల్లో శిక్షణ తీసుకోవడానికి వెళుతున్నట్లు తెలిసింది. దీనికి కారణం ప్రాక్టీషనర్ లలో వ్యక్తిగత సాధన లోపించడమే అని భావించి పేషంట్లకు, మరియు ప్రాక్టీషనర్ లకు యోగాలో మరియు ఆరోగ్యం పై ఆధ్యాత్మికత ప్రభావం పైన శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు.

వీరి నాయకత్వంలోనే కేరళలోని వైబ్రియోనిక్స్ టీం  నివారణా మరియు చికిత్సా విధానంలో వినూత్నమైన ప్రోగ్రాంలను ఆవిష్కరింప జేసింది. ఉదాహరణకు కాసర్గడ్ జిల్లాలోని ఎండోసల్ఫాన్ బాదితుల కోసం ఒక ప్రత్యేక రెమిడి ప్యాకేజిని ఈ టీం తయారుచేసింది. వైబ్రియోనిక్స్ కు ఇంకా విస్తృతంగా సేవలందించాలనే ఉదాత్తమైన భావంతో వీరు ప్రతీ రోజు నడిచే 3 వైబ్రియో సెంటర్లను ప్రారంభించారు.వీరు కేరళ వైబ్రియో న్యూస్ లెటర్ కు కూడా 3 సంవత్సరాలు సంపాదకులుగా పనిచేసారు.

వీరు వందల సంఖ్యలో పేషంట్లకు అనేక రకాల వ్యాధులకుముఖ్యంగా సంతానలేమి, త్రాగుడు, థైరాయిడ్, కణుతులు, మూత్ర విసర్జక సమస్యలు, PCOD, ల్యుకోరియ, స్త్రీల బహిస్టు సమస్యలు, చుండ్రు, బట్టతల, పార్శ్వపునొప్పి, మొగవారి సమస్యలు, మానసిక సమస్యలు, మూలశంకలు, అలెర్జీ, ఆస్తమా, సైనసైటిస్, భుజాల బిగింపు, కీళ్ళనొప్పులు, వడదెబ్బ, కేన్సర్ ఇలా ఎన్నో వ్యాధులకు చికిత్సనందించుచున్నారు. వీరు మొక్కలపైన కూడా ఎన్నో పరిశోధనలు చేసారు. వీరు   CC1.2 Plant tonic ను మొక్కలలో లేత వయసులో ఇచ్చినపుడు అది వాటి పెరుగుదలకు ఎంతో బాగా సహాయపడుతున్నట్లు, అలాగే ఒకటి లేదా రెండు వారాల లేత మొక్కలకు ఇచ్చినట్లయితే మరింతగా ఉపయోగం కనపడినట్లు వీరు  కనుగొన్నారు. వృద్ధాప్యం వల్ల ఓపిక సన్నగిల్లుతున్నా సత్యసాయి సంస్థలో ఆఫీస్ బేరర్ గా  బాధ్యత నిర్వహిస్తూనే చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో కేరళ లోని జిల్లాలన్నింటికీ సాయి వైబ్రియోనిక్స్ చేరాలనే ధ్యేయంతో పనిచేస్తున్నారు. ముఖ్యంగా యువతను తన కుటుంబ సభ్యులను కూడా వైబ్రియోనిక్స్ లో కీలక పాత్ర నిర్వహించ వలసిందిగా ప్రోత్సహిస్తున్నారు. వైబ్రియోనిక్స్ కు వీరు చేసిన అమోఘ కృషికి అభినందనలు తెలియజేస్తూ వీరి సేవ కొత్తవారికి మార్గదర్శకం కావాలని స్వామిని ప్రార్ధిస్తున్నాము.

 పంచుకుంటున్న రోగ చరిత్రలు

 

Practitioner Profile 10602...India

ప్రాక్టీ షనర్ 10602 ... భారత దేశము  వీరు 2009లో ఉపాధ్యాయ వృత్తి నుండి పదవీవిరమణ పొందారు. 1995 లోనే వీరు భగవాన్ బాబా వారి అనుసరణియులై సంస్థ యొక్క అన్ని కార్యక్రమాలలోను ముఖ్యంగా బాలవికాస్, భజనలు పాడడము, వేదం చదవడం, జ్యోతిధ్యానము చేయడం ఇలా అన్నింటిలో పాల్గొనసాగారు. వీరు సేవాదళ్ వాలంటీర్ మరియు విద్యవాహిని వాలంటీర్ కూడా. వీరు 2012లో మహారాష్ట్రలో జరిగిన మానవతా విలువల విద్యకు సంబంధించిన డిప్లమా కోర్సుకు ఎంపిక కాబడడమే కాక ఈ కోర్సులో బంగారు పతకాన్ని కూడా గెలుచుకున్నారు. వీరికి చిన్నప్పటినుండి సేవ చేయాలనే తపన ఉండేది. 10వ సంవత్సరం నుండి ప్రఖ్యాత సిద్ధ ఆయుర్వేద యునాని డాక్టర్ ఐన వీరి తండ్రికి సహాయకారిగా ఉండేవారు. 2008లో వీరు తీవ్రమైన జలుబు దగ్గుకు వైబ్రియోనిక్స్ రెమిడి తీసుకుని రెండు రోజుల్లోనే వ్యాధి నుండి దూరమయ్యారు. ఈ వ్యక్తిగత అనుభవంతో  వీరు ముగ్ధులై వెంటనే వైబ్రియోనిక్స్ కోర్సుకు నమోదు చేయించుకున్నారు. స్వామి చేతిలో ఒక ఉపకరణముగా మారి తన చుట్టూ ఉన్నవారిని సేవించి తరించాలనే సంకల్పంతో 2009లో ముంబైలో వీరు కోర్సు పూర్తి చేసారు. తర్వాత 5 సంవత్సరాలలో వీరు వారానికి 3 సార్లు జరిగే మెడికల్ క్యాంపులలో పాల్గొనసాగారు.

2014 లో వీరు చెన్నైకి తమ నివాసం మార్చిన తర్వాత తమ ఇంటివద్ద పేషంట్లను చూడడం ప్రారంభమయ్యింది. పేషంట్ల సంఖ్య కూడా పెరగసాగింది. సంస్థ కార్యక్రమాలలో పాల్గొంటూనే ఖాళి సమయాన్ని వైబ్రో సేవకు వినియోగించేవారు. ఇతర ప్రాక్టీషనర్లతో కలసి తన చుట్టుపక్కల  రద్దీగా ఉన్న ప్రాంతాలలో 15 రోజులకొకసారి మెడికల్ క్యాంప్ లు నిర్వహించేవారు.

ఇలా వైబ్రియోనిక్స్ ద్వారా సేవ చేసే అవకాశం లభించడం స్వామి ఇచ్చిన బంగారు అవకాశంగా భావించేవారు. వీరు ఇచ్చిన రెమిడిలు ఉపయోగించుకొని బాబా దయవల్ల పేషంట్లకు తగ్గిపోతే ఆమె ఆనందానికి అవధులే ఉండవు. వీరు ఎన్నో స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక వ్యాధులను వైబ్రో రెమిడిల ద్వారా నయం చేసారు. ఉదాహరణకు 62 సంవత్సరాల మహిళ, లివర్ యొక్క సిర్హోసిస్ వ్యాధితో బాధపడుతూ అలోపతితో విసిగిపోయి ఈ ప్రాక్టీషనర్ ద్వారా క్రింది రెమిడి 3 నెలలు తీసుకున్నారు:
CC4.1 Digestion tonic + CC4.2 Liver & Gallbladder tonic + CC4.10 Indigestion + CC4.11 Liver & Spleen + CC9.2 Infections acute + CC12.1 Adult tonic + CC13.1 Kidney & Bladder tonic + CC15.1 Mental & Emotional tonic

మరొక కేసులో  68 సంవత్సరముల మహిళ 7 సంవత్సరములుగా ఎముకలు, కండరాల నొప్పులతో బాధ పడుతూ అలోపతి మందులు ఏమీ పనిచేయకుండా పోయేసరికి ఈ ప్రాక్టీషనర్ ను సంప్రదించారు. వీరిచ్చిన రెమిడితో 8 వారాలలో నూరుశాతం రోగ నివారణ పొందారు. వీరికిచ్చిన రెమిడి:
#1. CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic

#2. CC3.7 Circulation + CC18.5 Neuralgia + CC20.1 SMJ tonic + CC20.2 SMJ pain + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue

ఈమె 108 బాక్స్ నుండి తయారు చేసిన క్రింది రెమిడిలను తరుచుగా వాడతారు:
1.     CC12.1 Adult tonic + CC15.2 Psychiatric disorders + CC17.3 Brain & Memory tonic ఇవి ఆందోళన, ఆత్మన్యూనత, జీవితము పైన విరక్తి వంటి వాటికి  ఎంతో బాగా పనిచేసినట్లు వీరికి రుజువయ్యింది.. 

2.     CC4.2 Liver & Gallbladder tonic ఈ రెమిడి చర్మ సమస్యలకు కలిపి ఇచ్చినట్లయితే వేగంగా ఫలితం కనిపించింది.. 

3.     CC19.6 Cough chronic + CC19.7 Throat chronic ఈ రెమిడి ప్రఖ్యాత గాయకులకు గొంతు సమస్యలు లేకుండా చేయడానికిగాను, గాత్రం చక్కగా ఉండడానికి, బొంగురు సమస్య పోగొట్టడానికి బాగా ఉపయోగపడినట్లు తెలుసుకున్నారు.

వైబ్రియోనిక్స్ సాధన ఎన్నోరకాలుగా ఉపయోగ పడినట్లు వీరి భావన. కాలం గడిచే కొద్దీ వీరిలో ఎంతో పరివర్తన వచ్చి పేషంట్లతో ప్రేమగా ఆప్యాయంగా మాటలాడగలిగేవారు. స్వామీయే పేషంట్లను తనవద్దకు పంపేవారని వారితో ప్రేమగా మాటలాడి వారి బాధలను తీర్చడం తన కర్తవ్యమని వీరి భావన. వీరు పేషంట్లకు మందులు సూచించే ముందు స్వామిని ప్రార్ధించి తన అంతః చేతనలో స్పురించిన రెమిడినే ఇచ్చేవారు. వైబ్రియోనిక్స్ తో ఈ ప్రయాణం రోజు రోజుకు స్వామికి దగ్గరవడానికి స్వామి ప్రేమను పొందడానికి చక్కని రాచబాట అని వీరి భావన . 

పంచుకుంటున్న రోగ చరిత్రలు:

 

 

Practitioner Profile 11576...India

ప్రాక్టీషనర్ 10602...భారత దేశము మానవాళికి ఎన్నో రీతులుగా సేవ చేయాలనే ఉదాత్తమైన ఆశయంతో పనిచేయలనుకొనే వారిలో ఈ ప్రాక్టీషనర్ ఒకరు. వీరు భారత సైన్యానికి చెందిన నౌకా విభాగములో వ్యూహాత్మక దళానికి సభ్యులుగా కూడా ఉన్నారు. అంకిత భావంతోను, ఆకట్టుకొనే స్వభావంతోనూ పనిచేసిన వీరు సర్వీసు నుండి పదవీ విరమణ చేసిన తరువాత తమ చదువును కొనసాగించి అమెరికాలోను మరియు భారత దేశములోను గల విశ్వవిద్యాలయాలలో పట్టాలు పుచ్చుకున్నారు. వీరికి ముఖ్యంగా వెనుకబడిన సామాజిక వర్గ ప్రజలకు సేవచేయాలనే సంకల్పము ఉండేది. ఇటీవల వీరు న్యూయార్క్ లో కార్పోరేట్ రంగంలో సామాజిక భాద్యత, మానవీయ, సామాజిక ప్రాజెక్టులపైన ప్రపంచ వ్యాప్త పెట్టుబడులు అన్న అంశము పైన ఫెలోషిప్ చేసారు. వీరు ప్రత్యమ్నాయ వైద్య పద్ధతులయన సాయి సంజీవని, ప్రకృతి వైద్యం, ప్రాణిక్ మరియు తీటా హీలింగ్, రికీ, NLP, ఆక్యుప్రెజర్, సుజోక్, హిప్నో మరియు సౌండ్ థెరపీలలో శిక్షణ పొంది తమకు దగ్గరలో ఉన్న గ్రామాలలోని ప్రజలకు నిస్వార్థ సేవలందించేవారు. 2015లో వీరు పుట్టపర్తిలో సాయివైబ్రియోనిక్స్ గురించి తెలుసుకోవడానికి నిర్ణయించుకొని నవంబర్లో AVP శిక్షణ తీసుకొని తిరిగి 2016 మే కల్లా VPగా ప్రొమోట్ అయ్యారు.

గడిచిన సంవత్సరం నుండి కేరళ లోని ఇతర వైబ్రో వైద్యులతో కలసి నెలవారీ క్యాంపుల నిర్వహణలో పాల్గొనగలగడం భగవదనుగ్రహంగా వీరు భావిస్తున్నారు. నెలకొకసారి కోచిలో జరిగే వైబ్రో సదస్సులో పాల్గొనడం కొత్త విషయాలు నేర్చుకొనడానికి, అనుభవాలు పంచుకొండానికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నట్లు వీరు భావిస్తున్నారు. సేవలో భాగంగా ఎంత దూరమైనా ప్రయాణం చేస్తూ ఎప్పుడయినా ఎక్కడయినా మందులివడానికి వీలుగా వెల్నెస్ కిట్ ఎప్పుడూ వీరి చెంతనే ఉంటుంది. వీరు తమ పేషంట్లు అందరినీ రెమిడిలను నీటితోనే వేసుకోవాలని అదే ఉత్తమ మైన పద్ధతి అని సూచిస్తారు. వైబ్రో రెమిడిలద్వారా మొక్కలు, జంతువులు స్వస్థత పొందడం వీరికి ఎంతో అనందం కలిగించే ఓకే కార్యక్రమము.

వీరు ఎంతోమంది మానసిక రోగులకు వైబ్రో రెమిడిల ద్వారా ఆరోగ్యం కలిగించారు. ఆందోళన, వత్తిడి, మానసిక సమస్యలకు CC15.2 Psychiatric disorders ఖచ్చితంగానూ, వేగవంతముగానూ పనిచేసే రెమిడి అని వీరి ప్రగాఢ విశ్వాసము. ఉదాహరణకు 23 సంవత్సరాల ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ 3 సంవత్సరాలుగా భయము, ఆందోళన, తీవ్ర మాంద్యము, ఆత్మన్యూనత, మబ్బుగా డల్ గా ఉండడం వంటి మానసిక వ్యాధితో బాధ పడుతూ అనేక ప్రమాదాలకు కూడా గురిఅవుతూ ఉండేవారు. ఈ విద్యార్ధి మానసిక వైద్యుణ్ణి సంప్రదించి కౌన్సిలింగ్ తీసుకొనడానికి నిరాకరించినా వైబ్రో రెమిడి తీసుకొనడానికి మాత్రం అభ్యంతరం పెట్టలేదు. 2016 ఆగస్టు 5న ప్రాక్టీషనర్ క్రింది రెమిడి ఇచ్చారు:
CC12.1 Adult tonic + CC15.2 Psychiatric disorders + CC17.2 Cleansing + CC17.3 Brain & Memory tonic…QDS నీటితో

మూడు రోజుల తర్వాత ఈ అబ్బాయి తండ్రి తన కుమారుని ప్రవర్తనలో 25 శాతం మార్పు వచ్చినట్లు గమనించారు. వారంలోనే అబ్బాయి తన కర్తవ్యాన్ని గుర్తించి జీవితము పైన విశ్వాసము పెంచుకొని ఉద్యోగ ఇంటర్వులకు కూడా వెళ్ళడం ప్రారంభించాడు. ఇతనికి డోస్ మూడు వారాల తర్వాత OD గానూ ఏడు వారాల తర్వాత OW గానూ  మరో నెల తర్వాత పూర్తిగా మానివేయడం జరిగింది. 2017 ఏప్రిల్ నాటికి అబ్బాయికి పూర్తి ఆరోగ్యం చేకూరడమే కాక కెనడాలో మంచి ఉద్యోగం సంపాదించుకొని ఆనందంతో జీవితం గడుపుతున్నాడు.

వీరు మనందరిలో ఉన్న అంతఃశక్తులకు పదునుపెట్టి అంతః చేతనానుసారము నడవడమే సరియయిన మార్గము అంటారు. రెమిడి పేషంట్లకు ఇచ్చే ముందు ప్రార్ధనతో ఇవ్వడమే కాదు తన పేషంట్లను కూడా నమ్మకముతోను ప్రార్ధనతోనూ తీసుకోవలసిందిగా సూచిస్తారు.

’’అందరినీ ప్రేమించు అందరినీ సేవించు‘’ అనే స్వామి సూక్తిని ఆచరణలో పెట్టటానికి, దివ్యభావనలను అనుభవంలోనికి తెచ్చుకొనడానికి సాయి వైబ్రియోనిక్స్ ఒక ఉత్తమ సాధనం అని వీరి అభిప్రాయము. ఈ కారణంతోనే మిగతా అన్ని ఇతర వైద్య పద్ధతులను విడనాడి సాయివైబ్రియోనిక్స్ పైనే పూర్తి ధ్యాసను లగ్నం చేసారు. ఈ వైబ్రియోనిక్స్ సేవ ద్వారా మనసు లయమయ్యి ప్రత్యేకించి ఒక వ్యక్తీ పట్లా, వస్తువు పట్లా సంఘటన పట్లా నిర్ణయం తీసుకొనే స్థాయి నుండి అంతా భగవత్ సంకల్పము వల్లనే జరుగుతుంది అనే స్థాయికి ఎదిగినట్లు వీరు ఆనందంగా వ్యక్త పరుస్తున్నారు. స్తితప్రజ్ఞత అలవడడానికి ఇదే ప్రధాన సోపానము కనుక ఇది వైబ్రియో సేవ ద్వారా సులభసాధ్యము అని వీరు వ్యక్తం చేస్తున్నారు.

పంచుకుంటున్న రోగ చరిత్రలు

 

ప్రశ్నలు సమాధానాలు

1. ప్రశ్న: నా పేషెంటు కేవలం రెమిడి పిల్స్ బాటిల్ ను తన రొమ్ము భాగంలో పెట్టుకొన్నంత మాత్రననే తనకెంతో  తేలికగా వ్యాధి నివృత్తి ఐనట్లు అనిపిస్తోందని చెప్పారు. దీనికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా? 

జవాబు: నిజమే. కొందరు పేషంట్లు పిల్స్ నోటితో తీసుకున్నప్పుడు ఎట్టి ఫలితం కనిపించిందో అదేఫలితం రెమిడి బాటిల్ ను తమ శరీరానికి దగ్గరగా ఉంచినప్పుడు కూడా కలిగిందని చెప్పారు. దీనికి కారణం ఏమిటంటే కొందరి శరీర తత్వం సూక్ష్మ కంపనాలకు కూడా చాలా సున్నితంగా ప్రతిస్పందించడం వలన కేవలం శరీరానికి దగ్గరగా ఉన్నప్పటికీ ఈ సూక్ష్మ శక్తులను స్వీకరించగలుగుతారు. ఇది పూర్తిగా రెమిడి తీసుకొనే వ్యక్తి పైనే ఆధారపడి ఉంటుంది. 

________________________________________

2. ప్రశ్న: నా పేషంటు చాలా సంవత్సరాలుగా పుపుసకుహరంలో (ప్లురల్ క్యావిటీలో) చీము చేరిన వ్యాధితో (empyema) బాధ పడుతున్నారు. అతనికి నేనిచ్చిన CC15.1 Mental &Emotional tonic +CC19.5Sinusitis  రెమిడి పనిచేయలేదు. మీ సూచన ఏమిటి? 

జవాబు: ఎంపైమా అనేది సాధారణంగా ఉపిరితిత్తులు వంటి శరీర భాగ కుహరాలలో చీమువంటి ద్రవం చేరడం వలన వచ్చే వ్యాధి. దీనికి రెమిడిగా  CC19.3 Chest infection chronic + CC19.6 Cough chronic and CC15.1 Mental & Emotional tonic ఇస్తాము. ఇది దీర్ఘకాలికమైన వ్యాధి కనుక నయమవడానికి చాలా సమయం తీసుకుంటుంది. అంతేకాకుండా ఆహార అలవాట్లలో మార్పులు ముఖ్యంగా రాత్రి పూట తక్కువ ఆహారం తీసుకోవడం మంచిది.

________________________________________

3. ప్రశ్న: సాధారణంగా మార్కెట్లో దొరికే రేకు డబ్బాలు అల్యూమినియంవి ఐఉంటాయనే ఉద్దేశ్యంతో నేను నా రెమిడి బాటిల్స్ మరియు 108CC బాక్సును ఒక డబ్బాలో ఉంచాను. కానీ ఇటివలే ఈ డబ్బా అయస్కాంతమునకు ఆకర్షితమవడం చూసి ఆలోచనలో పడ్డాను. ఇలాంటి ఇనుప డబ్బాలలో రెమిడి బాక్సులు ఉంచకూడదనే నియమం ఎదైనా ఉందా?  

జవాబు: సాధారణంగా మెటల్ బాక్స్ లో ఉంచిన ప్లాస్టిక్ కంటయినర్లోని రెమిడిలు ఏవిధంగా ప్రభావితం కావో అలాగే 108 CC బాక్స్ కూడా ప్రభావితం కాదు. ఐతే మీ SRHVP ని మాత్రం అట్టి డబ్బాలకు దూరంగా ఉంచడం తెలివైన నిర్ణయం అని గ్రహించండి.

________________________________________

4. ప్రశ్న: కార్లు, బస్సులు, విమానాలలో ప్రయాణం చేస్తున్నప్పుడు వాటి వైబ్రేషణ్ మనం తీసుకుని వెళ్ళే వైబ్రో మందులు మీద పడుతుందా?

జవాబు:  ప్రయాణించే కార్లు, బస్సులు, విమానాలు వంటి మోటారు సంబంధమైన వాహనాల వైబ్రేషణ్ లవల్ల వైబ్రో మందులపైన  ఎటువంటి ప్రభావం ఉండదు. కానీ విమానంలోనికి వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వైబ్రో మందులపైన ప్రభావం చూపిస్తుంది. ఐతే ప్రతీ ఒక్క 108 కొమ్బో బాక్స్ లోనూ యాంటిరేడిఏషణ్ రెమిడిలను కలపడం జరిగింది. కొందరు ప్రాక్టీషనర్లు తమ CC బాక్సులను అల్యూమినియం ఫోయిల్లో చుట్టడం ద్వారా జాగ్రత్త చేస్తారు. కానీ దీనిని తిరిగి ఉపయోగించడంలో ఫోయిల్ కు కన్నాలుగాని, చిరుగులు గానీ లేకుండా జాగ్రత్త వహించాలి.

________________________________________

5. ప్రశ్న: వైబ్రో సేవను మరింతగా  అంకితభావంతో కొనసాగించడానికి ప్రాక్టీషనర్ లకు మీరిచ్చే సూచనలేవి?

జవాబు: అకుంఠీత దీక్షతో మనం చేసే సాధనలో లేదా సేవలో నిమగ్నమయితే దానిలో ఎదురయ్యే కష్ట, నష్టాలకు క్రుంగి పోకుండా ముందుకు పోగలిగేందుకు కావలిసిన స్పూర్తి, ప్రేరణ మనం చేసే సేవే మనకు కలుగజేస్తుంది. సాధారణంగా వైబ్రియోనిక్స్ సేవను అంకితభావంతో చేసే వారికి అడ్డంకులు లేకుండా ముందుకు పోగలిగేందుకు కావలిసిన శక్తిని అదే ఇస్తుంది అని నిర్ద్వందంగా చెప్పడానికి ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఐతే ఒక్కొక్క సారి కొన్ని అననుకూల పరిస్థితులు ప్రాక్టీషనర్ లకు  బాధాకరంగా పరిణమించే పరిస్థితులను త్రోసిపుచ్చలేము.

  • ముఖ్యంగా కోటిఆశలతో క్రొత్తగా ఈ సేవలోనికి అడుగిడిన ప్రాక్టీషనర్లకు ప్రతికూలమైన పరిస్థితులు ఎదురయితే వారి ఉత్సాహమంతా నీరుగారిపోతుంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి ఎన్నెన్నో చర్యలు చేపడుతున్నాము. ఇటీవలే చేర్చబడిన మెంటర్ పద్దతి కొత్తవారికి ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకుపోవడానికి కావలసిన మానసిక స్పూర్తిని కలిగిస్తుంది. పాతవారు కూడా తాము ఆత్మవిశ్వాసంతో తమ వృత్తిని కొనసాగించలేకపోతున్నాం అని భావించినట్లయితే ఈ పద్ధతిలో తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. మేము మిమ్మల్ని మీకు దగ్గరగా నిర్వహింపబడుతున్న మీటింగులకు, వర్క్ షాపులకు పిలవడంలో ప్రధాన లక్ష్యం మీరు ఇతర ప్రాక్టీషనర్ల సహకారం తీసుకోవడానికి మీకేమైనా  సందేహాలుంటే నివృత్తి చేసుకోవడానికి అని గ్రహించాలి. మీకు దగ్గరగా ఉన్న వైబ్రో ప్రాక్టీషనర్ల వివరాలు కావాలంటే  [email protected]కు వ్రాయండి. అమెరికా, కెనడాలో ఉన్నవారు నేరుగా మీ కోఆర్డినేటర్ ను  [email protected]
  • పైన సంప్రదించవచ్చు. ఒకవేళ ప్రాక్టీషనర్ లు తగిన అనుభవం, జ్ఞానము లేక క్లిష్టమైన కేసులకు న్యాయం చేయలేకపోతే ఆందోళనలకు గురికాకుండా [email protected] పై మా టీంను సంప్రదించండి. మీకు ఉపయోగకరమైన సమాచారం అందించడాని వారెప్పుడు సిద్ధంగా ఉంటారు.
  • కొందరు ప్రాక్టీషనర్లు తమకు పేషెంటులు రావడం లేదని చెపుతూ ఉంటారు. అట్టివారు జంతువులు, మొక్కలకు మందులివ్వవచ్చు. అలాగే మీ మెయిల్ ఎడ్రస్ లు, స్కైప్ ఐడిలు,ఫోన్ నంబర్లు ఇవ్వడం ద్వారా కొంతమంది పేషంట్లు మిమ్మల్ని సంప్రదించవచ్చు. అన్నింటిని మించి జపము, ధ్యానము, నామస్న్మరణ చేయడం, భజనలు, స్టడీ సర్కిల్ , సత్సంగాలలో  పాల్గొనడం, ఆధ్యాత్మిక సాహిత్యం చదవడం ద్వారా మీవ్యక్తిగత సాధనను మానకుండా కొనసాగించడం చాలా ఉత్తమం.

 

 

వైద్యులకే వైద్యుడి యొక్క దివ్య వాక్కు

మానవ జీవితములో ఇతరులు నీకు నీవు ఇతరులకు పరస్పరం సేవలందించకుండా మనుగడ సాగించలేని విషయం నీవు గ్రహించాలి. నాయకుడు-సేవకులు, పరిపాలకులు-పరిపాలితులు, గురువు-శిష్యులు, యజమాని-ఉద్యోగి, తల్లిదండ్రులు-పిల్లలు వీరంతా కూడా ఒకరి సేవలపైన మరొకరు ఆధారపడ్డవారే. ప్రతీ ఒక్కరూ సేవకుడే. నీవు సేవించే రైతు మరియు కూలివాడు ప్రతిఫలంగా నీకు ఆహారము, దుస్తులకు కావలసిన ప్రత్తిని ఎంతో శ్రమతో పండించి సేవ రూపంలో ఇస్తున్నారు. భగవంతుడు ప్రసాదించిన దేహము, బుద్ధి, ఇంద్రియాలు, మనసు, నిర్భాగ్యులకు సేవ చేయడానికే. కాబట్టి భగవత్ అనుగ్రహం సాధించడానికి సేవకు మించిన ఉత్తమ సాధనా మార్గం లేదు అని గ్రహించండి.    

...సత్యసాయి బాబా, "సేవకు సమాన మైనది." 21 నవంబర్ 1986

http://www.sssbpt.info/summershowers/ss1973/ss1973-08.pdf

 

ఎక్కువ మొత్తంలో మనం త్రాగే నీరు మూత్రం రూపంలో బయటకు వెళ్లిపోతుంది. దానిలో చాలా సూక్ష్మమైన భాగము ప్రాణ శక్తిగా మారుతుంది. అలాగే ఆహారం కూడా. కనుక మనం తినే ఆహారము, నీరే మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయి. మనం తినే ఆహారము త్రాగే

నీరు సరియయిన రీతిలో నియంత్రించగలిగితే మనం దివ్యత్వానికి చేరువ కాగలుగుతాము. కనుకనే ఫుడ్ ఈజ్ గాడ్ అన్నారు. కనుక ఆహారమును  వృధా చేస్తే దైవమును వృధా చేసినట్లే. కనుక ఆహారము వృధా చేయక తగినంత ఆహారమే తీసుకోవాలి, సాత్వికఆహారమే తీసుకోవాలి. అవసరం కన్నా ఎక్కువగా ఉన్న ఆహారాన్ని అవసరమైన వారికి ఇచ్చివేయాలి.

...సత్యసాయి బాబా, " సత్యసాయి బోధ –సంచిక 1

https://www.sathyasai.org/publications/TeachingsOfBSSSB-Vol01.html              

 

ప్రకటనలు

జరగనున్న శిక్షణా శిబిరాలు 

❖  ఫ్రాన్స్  డోర్డోగ్నే: పునశ్చరణ గోష్టి (రిఫ్రెషర్ సెమినార్) & AVP శిక్షణా శిబిరం 2017 జూన్ 3-4న, సంప్రదించవలసిన వ్యక్తి డానియెల్, ఈ-మెయిలు చిరునామా [email protected]

❖  ఇండియా పుట్ట్టపర్తి: AVP శిక్షణా శిబిరం 10 -14  జూలై 2017 , సంప్రదించవలసిన వ్యక్తి లలిత, ఈ-మెయిలు:  [email protected] ఫోన్ నంబరు 08555-288 377 

❖ ఇండియా పుట్ట్టపర్తి: AVP శిక్షణా శిబిరం 18-22 నవంబర్ 2017 , సంప్రదించవలసిన వ్యక్తి లలిత, ఈ-మెయిలు:  [email protected] ఫోన్ నంబరు 08555-288 377 

❖ ఇండియా పుట్ట్టపర్తి: SVP శిక్షణా శిబిరం 24-28 నవంబర్  2017, సంప్రదించవలసిన వ్యక్తి హేమ, ఈ-మెయిలు [email protected]

అదనపు సమాచారం

1. ఆరోగ్య చిట్కాలు  

నీరు మరియు ఆరోగ్యము - 3 భాగము - సహజ పద్ధతిలో పరిశుద్ధమైన శక్తియుతమైన నీరు.

మన శరీరములో ఎక్కువ భాగము నీటితో చేరియున్న విషయము మనందరికీ తెలుసు. నీటికి గుర్తుంచుకునే శక్తి ఎక్కువ. కనుక మనము శక్తివంతంగాను, రోగాలకు దూరంగానూ, ఉండాలంటే  ప్రతీరోజు తగినంతగా నీటిని నెమ్మదిగా శాంతియుతంగా ప్రేమగా త్రాగాలి. అలా మనం తీసుకొనే నీరుకూడా  పరిశుద్ధమైనదిగా ఉండాలి. .

ప్రపంచ వ్యాప్తంగా తగ్గుతున్న జలనిల్వలు:  ఒక సర్వేప్రకారము ప్రపంచ జనాభాలో 1/5 భాగము ప్రజలు తగినంతగా నీరు లేని ప్రాంతాలలోను, 1/4 భాగము ప్రజలు శుద్ధ జలము దొరకని ప్రాంతాలలోనూ నివసిస్తున్నారు. ఒకవేళ అక్కడ నీరు ఉన్నా అది త్రాగడానికి యోగ్యంగా ఉండదు. స్వేదనము చేసిన నీటిలో ఖనిజ లవణాలు ఉండవు కనుక అది ఆరోగ్యానికి అంత మంచిదికాదు . ప్లాస్టిక్ క్యాన్లలో లభ్యమయ్యే మినరల్ వాటర్ లో మలినాలు ఉండక పోవచ్చు కానీ మన శరీరానికి కావలసిన జీవశక్తి దానిలో ఉండదు. కనుక  నీటిని సరళమైన పద్ధతుల ద్వారా శుద్ధపరచడం, శక్తివంతం చేయడం, నిలవ చేయడం గురించి తెలుసుకుందాం.

1. శుద్ధపరచడంలో లోహాల పాత్ర.

ప్రాచీన ఆయుర్వేద  గ్రంధాలలో రాగి, వెండి పాత్రలలో నీటిని నిల్వ చేయడం ద్వారా పరిశుద్ధమైన వాటిగా మార్చవచ్చు అనే ప్రస్తావన ఉంది. ఇటీవల వెలువడిన పరిశోధనా ఫలితాలు రాగి మరియు వెండి లోహాలు నీటిని సూక్ష్మజీవి రహితంగాను ఆహారాన్ని శుద్దపరచడానికి, గాయాలను మాన్ప డానికి ఉపయోగకరమైనవని  తెలుపుచున్నాయి.

2. రాగిపాత్రల లోని నీరు అవగాహన 5-7

అమెరికాలోని జాతీయ ఆరోగ్య సంస్థ నిర్వహించిన పరిశోధనలో రాగి పాత్ర నీటిలోని సూక్ష్మజీవులను తొలగించి శుద్ధపరచగల గుణము కలిగినదని తెలిపింది. అలాగే అమెరికాలోని వాతావరణ పరిశోధనా సంస్థ ఇదే విషయం ధ్రువ పరిచింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారము రాగిపాత్రలో నిల్వ చేసిన నీటిలో ఉన్న రాగి పరిమాణం  నిర్దిష్ట ప్రమాణాలు ప్రకారం ఉండవలసిన 2 mg/litre మాత్రమే ఉంటోందని, అలాకాక ఇది 2.5 mg/litre, ఉన్నట్లయితే నీటి యొక్క రుచి చేదుగా మారుతుందని ఈ పరిమాణం ఇంకా పెరిగితే నీటి యొక్క రంగు కూడా మారిపోతుందని ఈ సంస్థ తెలిపింది.

3. రాగిపాత్రల లోని నీరు ఒక అమృతం!8-13

మన ప్రాచీన శాస్త్ర వాంగ్మయం ప్రకారము నాలుగు గంటలు ఇంకా శ్రేయస్కరంగా కావాలంటే రాత్రంతా రాగి పాత్రలో ఉన్న నీటికి ఆరోగ్యము, శక్తి నిచ్చే గుణం ముఖ్యంగా కాలేయమునకు బలాన్నిచ్చే ఔషదగుణం వస్తుందట. రాగి మన శరీరములోని pH ఆమ్లత్వమును సమపాళ్ళలో ఉంచుతుంది. ఈ నీరు మన శరీరంలో ఒక  సహజమైన యాన్టి ఆక్సిడెంట్ లా ఉంటూ జీవకణముల చేత సులభంగా గ్రహించబడి ఆర్ద్రీకరణను లేదా హైడ్రీషణ్ ను పెంచుతుంది. ఒకటి లేక రెండు గ్లాసుల ఈ రాగిపాత్రలలోని నీరు ఉదయమే తీసుకుంటే మన  ఉదరములోని విషపదార్ధాలను తొలగించేటందుకు సహకరిస్తుంది. ఆయుర్వేదం ఏం చెపుతోందంటే  ఈ  నీరు శరీరంలోని వాత, పిత్త, కఫాలను సమపాళ్ళలో ఉంచుతుంది. ఈ నీరు జీర్ణాశయ రుగ్మతలను తొలగించి, వ్రణములు రాకుండా, శ్వాశ, హృదయ, కండరాల సమస్యలు రాకుండా తోడ్పడుతుంది.    

4. రాగి పాత్రలలో నీటిని విచక్షణతో గ్రహించండి 6,12,13

మనము రోజూ తీసుకునే నీటితో పాటు ఈ రాగి పాత్రలోని నీటిని ఉదయము సాయంత్రము తీసుకుంటే మన శరీరానికి కావలసినంత రాగి మన శరీరములోనికి చేరుతుంది. (1.2 mg రోజుకు). ఈ విధంగా 3 నెలలు చేసి ఒక నెల విరామం ఇవ్వాలి. దానివల్ల మన శరీరములో ఎక్కువగా పేరుకున్న రాగి నిల్వలు తొలగింపబడతాయి. నెల తర్వాత ఈ పద్దతిని తిరిగి కొనసాగించవచ్చు. ఇలా జీవితాంతము చేస్తే అనారోగ్యము మన దరిజేరదు. 

ఆయుర్వేదం నిలబడి నీళ్ళు (లేక ఆహారాన్ని) త్రాగడాన్ని సమర్ధించదు. అంతేగాక మనం త్రాగే నీరు ఎల్లప్పుడూ గోరువెచ్చగా ఉండాలట. మనం చల్లని నీరు త్రాగితే ఆ నీరు శరీర ఉష్ణోగ్రతకు చేరేవరకు ఎక్కువ మొత్తంలో జీర్ణాశయమునకు రక్త సరఫరా జరుగుతుంది. దీనివల్ల మెదడు మరియు గుండెకు కావలసినంత రక్త సరఫరా కాక వాటి పనితీరు దెబ్బతింటుంది.

5. వెండి పాత్రల లోని నీరు 12,14-16

ప్రేవులలో ఉండే వ్యాధి కారకమైన బ్యాక్టీరియా పైన చేసిన పరిశోధనలో వెండి పాత్రలలోని నీటికి  ఈ బ్యాక్టీరియాను నిర్మూలనం చేసే శక్తి ఉందని తెలిసింది. వెండి మిశ్రమానికి గురియయిన సూక్ష్మ క్రిములు 6 నిమిషాల కంటే ఎక్కువ బ్రతకలేవు అని మేధావుల పరిశీలనలో తెలిసింది. నాసా అంతరిక్ష పరిశోధనా సంస్థ వెండి ఆయనీకరణము ద్వారా నీటిని శుభ్ర పరిచే రష్యన్ పద్ధతినే అనుసరిస్తూ ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారము వెండి పాత్ర లోని నీరు శారీరక పిత్త దోషాన్ని తొలగించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.  కనుక ఈ నీటిని రోజూ  తీసుకోవాలని చెప్పింది.   .

6. ఇత్తడి పాత్రలలోని నీటి  గుణాలు 17-18 

బ్రిటన్ దేశానికి చెందిన సూక్ష్మజీవ శాస్త్రజ్ఞులు ఇత్తడి పాత్రలలో నిల్వ చేసిన నీటికి నీటి ద్వారా వ్యాపించే రోగాలను అరికట్టే గుణమున్నట్లు కనుగొన్నారు. బ్యాక్టీరియ ఈ నీటిలో తన ఉనికిని కొల్పోతున్నట్లు వీరు చెప్పారు. ఇత్తడిలో 70 శాతం రాగి, 30 శాతము జింకు ఉంటాయి. కనుక దీనిలో ఉండే రాగి అయానుల వల్ల నీరు శుభ్రపడుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల వారు తమ ప్రాచీన విధానములో వలనే ఇత్తడి పాత్రలలో నిల్వచేసిన నీటిని వాడడం మొదలు పెట్టినట్లయితే చాలావరకు నీటిద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టవచ్చు. 

7. లోహ పాత్రలను శుభ్ర పరిచే పధ్ధతి 19-20

రాగి, వెండి, ఇత్తడి పాత్రలను ప్రతీ రోజు నిమ్మకాయ లేదా నిమ్మ జ్యూస్ తో, ఉప్పు లేదా చింతపండు పులుసుతో కలిపి (కలపక పోయినా ఫరవాలేదు) ఉపయోగిస్తూ మెల్లగా తోముతూ శుభ్రపరచాలి. అరనిమిషం తోమిన తర్వాత నీటితో శుభ్రపరచాలి. స్క్రబ్బర్ ఎట్టి పరిస్థితులలో ఉపయోగించరాదు. ఇవేకాక వేరే పద్ధతులద్వారా కూడా ఈ పాత్రలను శుభ్ర పరచవచ్చు.

8. మట్టి పాత్రలలోని నీరు 12,13,15,21-22

మట్టి పాత్రలలో నిల్వ చేసిన మట్టి వాసనతో కూడిన చల్లని నీటిని త్రాగడం ఆరోగ్యమే కాక ఆనందాన్నికూడా ఇస్తుంది. బాగా వేడిగా ఉండే వేసవి తాపాన్ని తట్టుకోవడానికి ఇవి బాగా ఉపకరిస్తాయి. మట్టిపాత్రలు తమ లోని నీటిని ఆవిరి  ద్వారా చల్లబరచడమే కాక త్వరగా శరీర ఉష్ణోగ్రతకు చేరుకొంటాయి. మట్టిపాత్రల కుండే సన్నని సూక్ష్మ రంధ్రాలు వల్లనే ఇది సాధ్యమవుతుంది. మరే ఇతర పాత్రలకు ఈ సదుపాయం లేదు. మట్టి సహజమైన క్షార గుణాలున్న పదార్ధము కాబట్టి ఈ నీరు శరీరము లోని అమ్లత్వము pH ను సమ పాళ్ళలో ఉంచుతుంది. కనుక ఈ నీరు ఎసిడిటీ ని తగ్గించి గ్యాస్ సమస్యలున్నవారికి ఉపశమనం ఇస్తుంది. కుండలలో నిల్వ చేసిన నీరు ప్రిజ్ లో నీటి వలె నోటికి ఇబ్బంది కలిగించకుండా మెల్లగా చల్లగా నోటిలోనికి జారి పోతుంది. ఖాళి కడుపుతో దీనిని త్రాగాలనుకొనే వారు ఈ నీటిని కొంచం వేడి చేసుకొనవచ్చు. మట్టిపాత్రలు తక్కువ ధరకు లభిస్తాయి కనుక అందరికీ అందుబాటులో ఉంటాయి. ఐతే వీటిని రెండు రోజులకొకసారి శుభ్ర పరిచే సమయంలో సబ్బు ఉపయోగించ కుండా బ్రష్ తో మెల్లిగా శుభ్రం చేయాలి. మట్టి పాత్రలు దొరకని పక్షంలో ప్లాస్టిక్ పాత్రలు వాడే బదులు స్టీలు పాత్రలు వాడవచ్చు.

9. సూర్యరశ్మికి గురిచేసిన నీరు 13,23-26

సూర్య రశ్మి నీటి యొక్క గుణాలను పెంచుతుంది. కొన్ని పరిశోధనల ప్రకారము కోబాల్ట్ బ్లూ గ్లాస్ సీసాలో నీటిని పోసి సూర్యరశ్మి లో 20 నిముషాలు ఉంచినప్పుడు (లేక కృత్రిమ వెలుతురులో గంట సమయం) ఆ నీరు సూక్ష్మజీవ రహితం ఔతుంది. దీనిని కొంచం సేపు ఊపడం ద్వారా దానిలోకి శక్తి చేరుతుంది. ఐతే దీనిని లోహం కాని మూత లేదా  ప్లాస్టిక్ మూత తోనే బంధించాలి. మీరు కూడా క్రింద ఇచ్చిన వెబ్ లింకులలో సూచించిన ప్రకారంగా గాజు సీసాలు ఉపయోగించి సూర్యరశ్మి తో శుద్ధి చేయబడిన నీటిని తయారు చేసుకోవచ్చు. 

10. ట్యాప్ ద్వారా వచ్చే నీటిలో శక్తి పునరుద్ధరణ 8-27

సాధారణంగా ట్యాప్ ల ద్వార వచ్చే నీరు శుద్ధపరచబడి మన ఇళ్లకు వస్తుంది. కానీ ఆ నీరు ప్లాస్టిక్ లేదా లోహపు గొట్టల ద్వారా మన ఇళ్లకు చేరే క్రమంలో హానికరమైన కారకాలు అందులో చేరే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఉష్ణమండల ప్రాంతాలయిన భారత దేశమువంటి దేశాలలో ఈ నీటిలో హానికరమయిన బ్యాక్టీరియా కూడా ఈ నీటిలో చేరుతుంది. నీటికి అన్నింటిని దాచుకొనే శక్తి ఎక్కువ కనుక త్వరగా హానికరమైన పదార్ధాల వైబ్రేషణ్ గ్రహిస్తుంది అంత త్వరగానూ వదిలి పెట్టి తన మాములు స్థితికి చేరుతుంది, ట్యాప్ వాటర్ ను ఒక  గంట సమయం కదల్చకుండా అలానే ఉంచితే దానిలోని హానికరమైనవి చాలావరకు పోతాయి. ఒక జగ్ లోని నీటిని 24 గంటల సమయం అలానే ఉంచితే (లేదా 20 నిముషాలు మరగ బెడితే) దానిలోని క్లోరిన్ పోతుంది. నీరు కూడా త్రాగడానికి యోగ్యంగా ఔతాయి. ట్యాప్ నీటిని వేడి చేసి చల్లార్చడం ద్వారానూ పిల్టర్లను ఉపయోగించడం ద్వారాను శుద్ధిచేసి ఉపయోగించుకొనవచ్చు.

11. పాత్రల ఆకారము పైన కూడా ప్రభావము ఉంటుంది 12.28

త్రాగే నీటిని నిల్వ చేయుటకు ఉపయోగించే పాత్రల ఆకారము ప్రాచీనమైనట్టి దీర్ఘ వృత్తాకారముగా ఉంటే వాటి పైన తలతన్యత లేదా సర్ఫేస్ టెన్షన్ తక్కువగా ఉంటుంది కనుక ఇవి యోగ్యమయినవిగా భావించ వచ్చు. అంతేకాకుండా వాటి శీర్షము ఉర్ధ్వఅభిముఖముగా ఉంటుంది. కనుక దాని లోపల నిరంతర శక్తి ప్రవాహానికి అనుకూలంగా ఉంటుంది. కనుక దానిలో ఉన్న నీటికి శక్తిని ఎక్కువ కాలం నిల్వ ఉంచుకొనే సామర్ధ్యం ఉంటుంది

12. నిర్మాణాకృతి పొందిన నీరు దాని అద్బుత ప్రభావము! 26,28-30

నిశ్చలంగా ఉన్న నీరు అవాంచనీయ శక్తులను గ్రహిస్తుంది. సహజంగా సుడులు తిరుగుతూ ప్రవహించే నీటిలో అనేక శక్తులు నిక్షిప్త మై ఉంటాయి. కొన్ని అధ్యయనాల ప్రకారము గంగా నది నీరు ప్రకృతి సిద్ధంగా నిర్మాణాకృతి పొందినట్టిది, మానవ శరీర కణాలలో ఉన్న నిర్మాణాకృతి నీటినే అది తనగుండా ప్రవహింపజేస్తుంది.

నీటిని శక్తివంతము మరియు నిర్మాణాత్మకము చేసే విధానము: నీటిని నిర్మాణాత్మకమైనట్టిదిగా మార్చడానికి సరళమైన వాటినుండి సంక్లిష్టమైన వాటివరకు అనేక పద్ధతులు వెబ్ సైట్లలో దొరుకుతాయి. సీనియర్ వైబ్రియనిక్స్ ప్రాక్టీషనర్ల కోసం రూపొందించిన మాన్యువల్ లో అనుభందం A5 లో నీటిని నిర్మాణాత్మకమైన దానిగా మార్చేందుకు పద్ధతి ఉన్నది. ఒక అధ్యయనం ప్రకారము ఒక చెంచాతో నీటిని త్రిప్పడం ద్వారా ఉత్పన్నమైన శక్తి ఇతరత్రా నిర్మాణాత్మక పద్ధతులద్వారా లభ్యమయ్యే శక్తి కన్నా ఎక్కువ అనేది రుజువయ్యింది. కనుక సవ్య, అపసవ్య దిశలో చెమ్చాను కొన్ని నిమిషాల పాటు త్రిప్పడం ద్వారా ఒక శీర్షము ఏర్పడుతుంది. కానీ గమనించవలసింది ఏమిటంటే మన ధ్యాసంతా నీటి పైన లగ్నం చేయాలి కానీ చెమ్చాను తిప్పే వేగం పైన కాదు. ఇంకా బాగా శక్తివంతం చేయాలంటే చెమ్చాను 8 ఆకారములో లేదా గణితంలో అనంతము అని చెప్పడానికి వాడే  ∞ ఆకారములో తిప్పవచ్చు. ఈ పద్దతి నీటిలో ఉన్న హానికరమైన శక్తులు, కారకాలు అన్నింటిని తొలగించి ఉపయోగకరమైన విశ్వ శక్తితో నీటిని శక్తివంతం చేస్తుంది. అంతేకాకుండా ధ్వనిని 432Hz వద్ద నీటి ద్వారా పంపినపుడు ఏర్పడే నిర్మాణా కృతి ఉత్తమమైనదని నిరూపించబడింది. ఈ అధ్యయనము ద్వారా ధ్వనికి అంత శక్తి ఉన్నప్పుడు ధ్వని ద్వారా మానవులలో రోగ నివృత్తి కూడా సాధ్యమే అనేది ఋజువవుతుంది . ఎందుకంటే మానవ దేహమంతా నీరే కనుక.30 

13. వైబ్రియోనిక్స్ ద్వారా నీటిని స్వచ్చ పరచడం శక్తివంతం చేయడం.

నీటిలో ఉన్న విషతుల్య మైన రసాయనాలను, హానికరమైన శక్తులను వేరు చేయడానికి క్రింది కోమ్బోలు:

CC10.1 Emergencies, CC15.1 Mental & Emotional tonic or CC17.2 Cleansing ఇవి108CC బాక్స్ ఉపయోగించే వారికోసం

NM6 Calming, NM25 Shock, SM1 Removal of Entities, SM14 Chemical Poison or SM16 Cleansing ఇవి  SRHVP ఉపయోగించే వారికోసం

నీటిని శక్తివంతంగాను రోగ నిరోధక శక్తి పెంచే విధంగానూ చేయడం కోసం మనం ఉపయోగించేవి:

CC12.1 Adult tonic 108CC బాక్స్ ఉపయోగించే వారికోసం

 SM2 Divine Protection, NM86 Immunity, or SM26 Immunity  SRHVP ఉపయోగించే వారికోసం

సూచన : వైబ్రియోనిక్స్ రెమిడి లు ఉపయోగించేవారు అలోహం తో చేసినవి లేదా ప్లాస్టిక్ కంటైనర్ లే ఉపయోగించాలి.

14. సాయి మార్గం లో  నీటిని శక్తివంతం చేయడం ప్రేమమరియు ప్రార్ధన   

మనం బాహ్యంగా ఉన్న నీటిని శుద్ధి చేయడం శక్తివంతం చేయడం లాగానే దేహమంతా కణకణము లో నిండిఉన్న నీటిని కూడా శక్తివంతం చేయడానికి ప్రశాంతంగా ఒక చోట కూర్చుని విధాత పైన దృష్టి లగ్నం చేయాలి. అలాగే మంత్రజపం ద్వారా సృష్టింపబడుతున్న శబ్ద తరంగాల ద్వారా  కూడా దేహంలో ఉన్న నీటిని శక్తివంతం చేయవచ్చు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే దేహంలో ఉన్న నీరు కూడా చాలా ముఖ్యం కనుక దీనిని ప్రేమతో కూడిన తరంగాలతో నింపాలి. ఆ తరంగాలు అన్ని దిశలకు వ్యాపిస్తాయి. భగవాన్ బాబా WHO ప్రామాణికాలతో శుద్ధి చేసిన జలమును దక్షిణ భారత దేశంలోని రాష్ట్రాల ప్రజలకు ప్రేమతో అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అన్న నియమానుసారము వారి ఇంటికే చేరే విధంగా ఏర్పాటు చేసారు. ఈ నీటిని త్రాగుతున్న గ్రామాలలోని ప్రజలకు వంటి నొప్పులు, మోకాళ్ళ నొప్పులు మాయమయ్యాయి. జలుబు వంటి సామాన్య రోగాలు అరుదుగా కనబడ సాగాయి. ఈ ప్రాజెక్ట్ ను క్రమంగా దేశమంతా వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు.  

References and Links 

  1. Sai Vibrionics Newsletter vol 8 issue 2
  2. http://sailoveinaction.org/project/DRINKING-WATER-DEFLUORINATION
  3. http://www.academicjournals.org/article/article1380626432_Varkey.pdf
  4. http://www.mercola.com/article/water/distilled_water.htm
  5. https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC3312355/
  6. http://www.wholesomeayurveda.com/2017/02/27/correct-way-to-drink-water-copper-vessels-health-benefits/
  7. http://www.who.int/water_sanitation_health/dwq/chemicals/copper.pdf
  8. http://isha.sadhguru.org/blog//lifestyle/health-fitness/treat-yourself-to-a-copper-detox/
  9. http://www.dailyayurveda.com/blog/5-amazing-health-benefits-of-drinking-water-out-of-a-copper-vessel
  10. http://www.thehealthsite.com/diseases-conditions/10-benefits-of-drinking-water-from-a-copper-vessel-p214/
  11. https://www.vasantihealth.com/copper/
  12. https://www.mygov.in/sites/default/files/user_comments/Health_Tips_latest%20pdf.pdf
  13. http://naturalwaysofliving.blogspot.in/2010/04/which-water-is-best-for-drinking.html
  14. https://www.ncbi.nlm.nih.gov/pubmed/25145073
  15. https://www.quora.com/What-difference-does-it-make-if-I-drink-water-stored-in-a-stainless-steel-silver-copper-clay-or-glass-jug
  16. http://www.space.news/2016-06-06-nasa-open-to-using-silver-treated-water-in-space-despite-fda-opposition.html
  17. http://www.nature.com/news/2005/050404/full/news050404-14.html
  18. http://globalvarnasramamission.blogspot.in/2014/05/use-of-copper-and-brass-way-to-good.html
  19. https://anubhavati.wordpress.com/2010/09/28/5-minutes-to-sparkle-your-silverware-and-keeping-them-that-way/
  20. htp://www.boldsky.com/home-n-garden/improvement/2013/tamarind-uses-cleaning-032137.html
  21. https://vaishali2013.blogspot.in/2016/02/healing-power-of-clay-pot-water.html
  22. http://www.thehealthsite.com/diseases-conditions/health-benefits-of-water-matka-clay-pot-k0417/
  23. http://www.instructables.com/id/Miraculous-Solar-Charged-Water/
  24. http://www.robinskey.com/blue-solar-water/
  25. https://hubpages.com/health/Health-Benefits-Of-Water-Blue-Water
  26. Vibrionics Manual for Senior Vibrionics Practitioners, Appendix A-5
  27. http://cci-coral-club.okis.ru/file/cci-coral-club/knigi/FereydoonBatmanghelidj_Your_Bodys_Many_Cries_for_Water_eng.pdf
  28. http://www.spiritofmaat.com/feb11/water_structuring.pdf
  29. http://articles.mercola.com/sites/articles/archive/2011/01/29/dr-pollack-on-structured-water.aspx
  30. https://www.youtube.com/watch?v=Cm0l9O5E4YM
 

2. మా అనువాదకులకు ఒక చిరుకానుక  

ప్రస్తుత సంచికలోని ఈ విభాగాన్ని అలుపెరుగ, అంకిత భావంతో పనిచేస్తూ వైబ్రియోనిక్స్ వార్తాలేఖలు మరియు ఇతర సమాచారాన్ని ఆంగ్లము నుండి తమ తమ మాతృభాషల లోనికి అనువాదం చేస్తున్న వారికి అంకితం చేస్తున్నాము. పాఠకులకు మా హృదయపూర్వక ప్రార్ధన ఏమిటంటే వైబ్రియో మిషన్ కు అవిశ్రాంతంగా సేవ చేస్తున్న వీరి నుండి మీరు స్పూర్తి, ప్రేరణ పొంద వలసిందిగా సూచన.   .

ప్రాక్టీ షనర్ 00723…బోస్నియా  (క్రొయేషియన్ /బోస్నియన్ ) వీరు 2010 లో సాయివైబ్రియోనిక్స్ లోనికి ప్రవేశించినప్పటి నుండి వార్తాలేఖలను అనువదిస్తూ ఉన్నారు. ఈమె ప్రాక్టీషనర్ కాక ముందునుండి కూడా వైబ్రియోనిక్స్ కు చెందిన హ్యాండ్ బుక్స్, మాన్యువల్ వంటి వాటిని అనువదించారు. ఈ సేవ తనకు మరువరాని, వెలకట్టలేని అవకాశముగా ఆమె అభివర్ణిస్తున్నారు. ఇలా చేసేందుకు అవకాశము రావడము వలన తను ఎన్నోరకాల వ్యాధుల గురించి ముఖ్యంగా ఆరోగ్యం గురించి తెలుసుకోగాలిగానని అంటున్నారు. వారి మాటల్లోనే చెప్పాలంటే ‘’ ఈ అనువాద అనుభవానికి కృతజ్ఞతలు. దీనివల్ల నాకు ప్రాక్టీషనర్ నయ్యే అవకాశం కలిగింది. ఈ సేవ ద్వారా బాబా వారి దివ్య హస్తాలలో ఒక ఉపకరణముగా మారి మరింతగా ఈ సేవాభాగ్యాన్ని పొందే అవకాశం లభించింది.

 

ప్రాక్టీ షనర్ 01620…ఫ్రాన్సు  (ఫ్రెంచ్) 2012 నుండి వీరు అనువాదకులుగా సేవాభాగ్యాన్ని అందిస్తున్నారు. వైబ్రియోనిక్స్ టీచర్ గా పట్టా పొందిన వీరు పరిపాలనా మరియు బోధనా గ్రంధాలను అలాగే వార్తాలేఖలను కూడా ఎప్పటికప్పుడు  అనువదిస్తూ ఉన్నారు. ఇలా చేయడం వల్ల విషయాన్ని అర్ధం చేసుకోవడానికి అభినందించడానికి కావలసినంత సమయం చిక్కుతోందని భావిస్తున్నారు. అంతేకాక ఎప్పుడు వార్తాలేఖను అనువదిస్తున్నా తాను ప్రశాంతి నిలయానికి చేరిన అనుభూతి కలుగుతుందట. వీరికి ‘’చికిత్సా నిపుణుల వివరాలు’’ అనే అంశం అంటే బాగా ఇష్టమట. వారు అనుభవాలను అనువదిస్తున్నప్పుడు వారు భౌతికంగా దూరంగా ఉన్నప్పటికీ తన దగ్గరే ఉండి చెపుతున్న అనుభూతి కలుగుతుందట. ఇంతటి మహత్తరమైన సేవను ప్రసాదించినందుకు స్వామికి తమ కృతజ్ఞతలను వీరు తెలియ జేసుకుంటున్నారు. .

ప్రాక్టీషనర్ 02713…ఆస్ట్రియా  (జర్మన్ ) 2006 నుండి వీరు చురుకైన వైబ్ర్రియో నిపుణురాలిగా ఉంటూ ఇప్పటి వరకూ విడుదలైన అన్ని వార్తాలేఖలను అనువదించారు. ఇలా చేయడం ఒక సవాలుగానూ దాన్ని పూర్తి చేసినప్పుడు ఒక  సంతృప్తి గానూ అనిపిస్తుందట. స్వామి తనకు ఈ చిన్ని సేవాభాగ్యాన్ని ప్రసాదించి  సాయి మిషన్ లోనికి తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. ధ్యాసంతా స్వామి పైన లగ్నం చేసి అనువాదం చేస్తూ ఉంటే స్వామి చిరునవ్వుతో తన దగ్గరే ఉన్న అనుభూతి కలుగుతుందట. స్వామీనే ఈ పని చేస్తున్నారు తను కేవలం నిమిత్తమాతృరాలీని అని వీరి భావన. వీరి మాటల్లోనే చెప్పాలంటే ‘’ప్రతీ వార్తాలేఖ స్వామికి మానవాళి పై ఉన్న ప్రేమకు నిదర్శనము. ఈ జగద్గురువు చెప్పిన ఒక్క మాటతో ముగిస్తాను ‘’హెడ్ ఇన్ ద ఫారెస్ట్, హ్యాండ్స్ ఇన్ ద సొసైటీ ‘’

ప్రాక్టీషనర్ 03108…గ్రీస్ (గ్రీక్) 2013 సెప్టెంబర్లో పుట్టపర్తిలో AVPగా శిక్షణ పొందిన తర్వాత ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మరియు ఆమె వ్యక్తిగతంగా ఎన్నో లీలలకు సాక్షిగా నిలిచింది. రెండు సంవత్సరముల క్రితం ఈమె వార్తాలేఖలను అనువదించడం మొదలు పెట్టాక ఇది చాలా కష్టమైన పని అని రోగాల గురించి దేహతత్వం గురించి సరైన అవగాహన లేకుండా దీనికి న్యాయం చేయలేమని ఒక్కొక్కసారి కేసు గురించి ఎంతో అధ్యయనం చేస్తే తప్ప దాని పూర్వాపరాలు గ్రహించలేమని  ఈమె భావించారు. ఐనప్పటికీ ఇది బాబా తనకు ప్రసాదించిన వరంగా ఈమె భావించారు. వారి అనుభవం ఆవిడ మాటల్లోనే విందాం“కొంతకాలం ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ వైబ్రియో ప్రపంచము ఎంత విశాలంగా ఉందో గ్రహించ వచ్చు. ఇది కేవలం ఓకే కేసు గురించి విషయాన్ని పంచుకోవడం కాదు మన అవగాహనను పెంచుకోవడం. వార్తాలేఖ గురించి గంటలకొద్దీ సమయం వెచ్చించడం ద్వారా స్వామి లీలలు ప్రపంచ వ్యాప్తంగా ఎలా విస్తరించి ఉన్నాయో తెలిసింది. అంతేకాక ఇది ఒక  సమగ్ర జ్ఞానం ఎందుకంటే ప్రతీ కేసు అద్వితీయమైనదే. నా ప్రాక్టిస్ లో ఇతర  నిపుణుల విధానాలను ఉపయోగించుకోవడానికి అవకాశం కలిగింది. కనుక నా  సలహా ఏమిటంటే ప్రతీ వార్తాలేఖ ప్రత్యేకమైనదే తిరిగి తిరిగి చదవదగినదే.

ప్రాక్టీ షనర్ 01588…ఇటలీ  (ఇటాలియన్) 2000వ సంవత్సరంలో ట్రైనింగ్ తీసుకున్న వెంటనే వీరు ప్రకృతి వైద్య విధానములో వచ్చిన సోహం సిరీస్ పుస్తకాలను అనువదించడం ప్రారంభించారు. తరువాత దృష్టిని వైబ్రియోనిక్స్ మాన్యువల్ వైపు మరలించి అక్కడితో ఆగకుండా అదే సమయంలో క్రొత్తగా వచ్చిన 2010 సెప్టెంబర్ వార్తాలేఖతో ప్రారంభించి ఇప్పటివరకు వచ్చిన అన్నిటినీ అనువదిస్తూ వచ్చారు. వీరికి ఇష్టమైన భాగము ''వైబ్రో మందులు ఉపయోగించిన కేసుల వివరాలు'' అందులో ఉదాహరించిన వివిధరకాల కేసుల వివరాలు చూసినప్పుడు బాబా యొక్క లీలలు అగోచరం అనిపించింది. వైబ్రియోనిక్స్ అంటే ఏమిటి అనే ఆంగ్ల వీడియోని ఇటలీ లోనికి అనువదించడం ఒక గొప్ప అనుభూతి అంటున్నారు. తనకీ అవకాశము ఇచ్చినందుకు స్వామికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ   భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు కోసం ఎదురుచూస్తున్నారు.

ప్రాక్టీషనర్ 02779…జపాన్  (జపనీస్) వార్తాలేఖలు ప్రారంభ మైన నాటినుండి వాటిని అనువదిస్తున్న వీరు ఈ సేవ వల్ల తానెంతో లాభపడ్డట్లు వీరు భావిస్తున్నారు. తాను కొత్త సాంకేతిక పదాలకు అర్ధం తెలుసుకోనడమే కాక ఈ జ్ఞానం తన వైబ్రో సేవకు కూడా ఎంతో ఉపకరించిందని అంటున్నారు. అంతేకాక వైబ్రో నిపుణుల వివరాలు, బాబా వాణి, అగ్గార్వాల్ గారి సంపాదకీయం వల్ల తనకెంతో ప్రేరణ కలిగిందని వీరు అంటున్నారు. వీరి మాటల్లోనే చెప్పాలంటే ''ఈ సేవ దొరకడం భగవంతుడి వరప్రసాదమే, ఈ సేవ వల్ల నేను మరింత ముందుకుపోవడానికి లక్ష్యము చేరుకోవడానికి కావలసినంత శక్తిని ప్రసాదిస్తోంది''

 

 

 

 

ప్రాక్టీషనర్ 02150…పోలండ్ (పోలిష్  & రష్యన్) 2001నుండి వీరు మన వైబ్రియోనిక్స్ పుస్తకాలను పోలిష్ భాష లోనికి అనువదిస్తున్నారు.ఎప్పుడయితే మన రష్యన్ . ప్రాక్టీషనర్  00004…కెనడా  2015 వరకు వార్తాలేఖలను రష్యన్ భాష లోనికి  అనువదించి ఇతర  కార్యక్రమాల కారణంగా అనువదించడం విరమించుకున్నారో అప్పటినుండి   ఆపని కూడా వీరు తమ భుజ స్కంధాల పైకి ఎత్తుకున్నారు.  ఈ సేవ ద్వారా నూతన ఆవిష్కరణలు, కొత్తగా చేపడుతున్నపరిశోధనలు,గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడమే కాక ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న వివిధరకాల కార్యక్రమాల గురించి తెలుసుకొనేందుకు అవకాశము కలిగిందని భావిస్తున్నారు. వీరు వార్తాలేఖ లోని బాబా దివ్యవాణి చదవడం ద్వారా ఎంతో ప్రేరణ పొందుతారు. వీరి మాటల్లోనే ''స్వామి నన్ను ఒక ఉపకరణము గా ఎన్నుకొన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది '' అని వినమ్రంగా తెలుపుతున్నారు.”

 

ప్రాక్టీషనర్ 02308…స్లోవేనియా (స్లోవేనియా) వీరు 15 సంవత్సరాలుగా వైబ్రో ప్రాక్టీస్ చేస్తున్నారు. అనువాదకులుగా అన్నిరకాల పుస్తకాలను అనువదించడమే కాక ఇప్పటివరకూ వచ్చిన అన్ని వార్తాలేఖలను అనువదించారు. వీరి దృష్టిలో రెమిడిలు ఇవ్వడం, అనువాదం చేయడం రెండూ ఉపయోగకరమైనవే. ఒకసారి దర్శన సమయంలో స్వామి ఈమె వైపు తీక్షణంగా చూడడంతో అప్పటి నుండి వీరిలో ఎంతో మార్పు వచ్చింది. సాయి వైబ్రియోనిక్స్ ద్వారా ఇతరులకు నిస్వార్ధంగా అంకిత భావంతో సేవ చేయడం ఇదే జీవిత పరమావధి అని భావించారు.

 

 

 

 

ప్రాక్టీషనర్ 02678…స్పెయిన్  (స్పానిష్)2003లో వీరు వైబ్రో ప్రాక్టిస్ ప్రారంభించారు. 2009 నుండి మాన్యువల్స్ శిక్షణా కరదీపికలు ,వార్తాలేఖలు స్పానిష్ భాష లోనికి అనువదించడం ప్రారంభించారు. 2016 డిసెంబర్లో 81 సంవత్సరాల వయసులో వీరి దేహ యాత్ర ముగియడం వైబ్రియోనిక్స్ కు తీరని లోటు!

 

ప్రాక్టీషనర్ 11567...ఇండియా  (తెలుగు) ఈ ప్రాక్టీషనర్ ఒక సంవత్సరం నుండి వార్తాలేఖలను అనువదించడం, అనువాదానికి సహకరించడం చేస్తున్నారు. బాబా దయ వల్ల ఈ సేవ ద్వారా ఆంగ్ల భాష తెలియని వారికీ, వైబ్రియోనిక్స్ గురించి తెలుసుకోవాలనే పేషంట్లకు అవకాశం కలిగించినట్లయ్యిందని భావిస్తున్నారు. ఈ సేవ చేస్తున్న సందర్భాలలో బాబా ఇచ్చిన వాగ్దానం ''నీవు నా పని చెయ్యి. నేను నీ పని చేస్తాను'' అనేది అనుభవమయ్యింది. ఈ అనువాద ప్రక్రియలో వీరికి

 

 

 

ప్రాక్టీషనర్ 11568…ఇండియా  ఎంతో సహకారం అందిస్తున్నారు. ఈమె ఇటీవలే మన వైబ్రియోనిక్స్ కుటుంబములోనికి వచ్చారు. ఈ విధంగా సేవ చేసే అవకాశం కలగడం చాలా అదృష్టంగా వీరు భావిస్తున్నారు. ఎందుకంటే వైబ్రియోనిక్స్ లో ఉన్న ''హో ఒపోనో పోనో'' ప్రార్ధన ఈమె నిజ జీవితంలో ఎంతో మార్పు తీసుకువచ్చిందని ఎంతో సహాయకారిగా ఉందని వీరు తెలియ చేస్తున్నారు. వార్తాలేఖలు అనువదించే సమయంలో బాబా వారి దివ్యవాణి అనువదించే సమయంలో స్వామి తనతోనే ఉన్న అనుభూతిని పొందుతారట. ఇలా అనువాద ప్రక్రియ ద్వారా సేవ చేసుకొనేందుకు అవకాశం కల్పించినందుకు బాబాకు ఎంతో కృతజ్ఞురాలిని అంటూ సవినయంగా తెలుపుకుంటున్నారు*-

 

 

 

 

 

3. Aపుట్టపర్తిలో AVP వర్క్ షాప్ 17-21 మార్చి  2017

2017 సంవత్సరానికి గాను మొదటి  AVP వర్క్ షాప్ ఇద్దరు అనుభవజ్ఞులైన టీచర్ల చే teachers 10375 &11422 మార్చ్ 17 నుండి 21వరకు జరిగింది. తెలంగాణా, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుండి ఐదుగురు పాల్గొన్నారు. వీరికి AVP మాన్యువల్ లోని అధ్యాయాలను అనుభవ పూర్వకముగా సోదాహరణంగా వివరించడం జరిగింది. శిక్షణా భాగస్వాములకు పేషంట్లతో ఎలా వ్యవహరించాలి, కేస్ హిస్టరీ ఎలా తయారు చేయాలి, వంటివి వివరంగా చెప్పడమే కాకుండా మోడల్ సెషన్ ద్వారా పేషంట్లతో ఇంటరాక్ట్ అయ్యే వీలు కల్పించ బడింది. దేవునికి ప్రతిజ్ఞ దీనిలో భాగంగా  ప్రతినెలా ఖచ్చితంగా నివేదిక పంపడానికి అలాగే మెంటర్ సిస్టంలో భాగంగా మెంటర్తో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండడానికి హామీలను తీసుకోవడం జరిగింది. ప్రారంభ దినముతో మొదలుకొని ఈ 6రోజులు కూడా డాక్టర్ అగ్గార్వాల్ గారితో స్కైప్ కాల్ సంభాషణలలో వారు పేషంట్లతో ప్రేమతో  మసలుకోవాలనీ, ఎలా వైద్యం చేసాము, ఎప్పటికి తగ్గుతుందనే వాటి పైన దృష్టి పెట్టకుండా ఎంతమేరకు మనం పేషంట్ల పైన ప్రేమా ఆప్యాయతలు  కనబరిచాము అనేది ముఖ్యం అన్నారు. ఈ సందర్భంగా వారి స్వీయ అనుభవాలను కూడా వివరించారు, కొన్ని సందేహాలకు చక్కటి వివరణ కూడా ఇచ్చారు. శిక్షణా భాగస్వాముములంతా చక్కటి మార్కులతో ఉత్తీర్ణులవడమే కాక ఈ వైబ్రియోనిక్స్ కుటుంబములోనికి ప్రవేశించిన ఆనందంతో కొత్త ఆశలతో ఆశియాలతో సేవా దృక్పథంతో తమ స్వస్థలాలకు వెళ్లారు.

 
 
 
 
 
 
 
 
4. ఇండియాలోని హైదరాబాదు లో వైబ్రియో నిపుణుల సదస్సు  - 26 మార్చి  2017

Practitioner00123  హైదరాబాదులోని తమ గృహములో 26 మార్చి  2017 న  ఏర్పాటు చేసిన సదస్సుకు 14 మంది వైబ్రియో నిపుణులు హాజరయ్యి   వైబ్రియోనిక్స్ లో వచ్చిన నూతన ఆవిష్కరణలు,రోగ చరిత్రలు రెమిడిలు వంటి విషయాలపైన  తమ అనుభవాలను పరస్పరం పంచుకోవటం జరిగింది.  ఆతిథ్య మిచ్చిన వైబ్రియో నిపుణుడు మాట్లాడుతూ తన 22 సంవత్సరాల వైబ్రియో అనుభవంలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నాననీ చెపుతూ సభ్యుల ఉపయోగార్దం అవన్నీ గుర్తుచేసుకున్నారు.సదస్సులో మాట్లాడిన నిపుణులందరూ ప్రేమ,అంకిత భావంతో సేవ చేయాలనీ మన వద్దకు వచ్చే పేషంట్లను హృదయ పూర్వకంగా ఆహ్వానించడమే కాక ఓపికతో వారు చెప్పేది వినాలని అభిప్రాయం వెలిబుచ్చారు. అంతేకాకుండా వైబ్రియో నిపుణులు భౌతికముగా ,మానసికంగా కూడా చక్కని స్థితిని కలిగి ఉండాలని చెప్పారు.ఇటీవలే ప్రవేశ పెట్టిన మెంటరింగ్ విధానం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు కొత్త ప్రాక్టీషనర్ లకు ఇది నిజంగా ఒక వరమని ఇలాంటి చక్కని అవకాశం మేము జారవిడుచుకున్నామని సీనియర్ నిపుణులు చెప్పారు. కనుక ఇకనుండి ఎలెక్ట్రానిక్ మీడియా ద్వారా తమ జ్ఞానము,అనుభవాలు,సలహాలు,సూచనలు పంచుకోవాలని సభ్యులు నిర్ణయించారు. Practitioner11562 మానవ భౌతిక దేహము హ్యూమన్ అనాటమీ గూర్చి ఒక 5 నిమిషాల నిడివి ఉండే వీడియో లను సభ్యల ఉపయోగార్ధము మీడియా గ్రూప్ లో నికి పంపిస్తూ ఉంటానని సభ్యలకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు.అనంతరం డాక్టర్ అగ్గార్వాల్ సార్ తో స్కైప్ కాల్ లో సభ్యులంతా పాల్గొన్నారు.డాక్టర్ అగ్గార్వాల్ సభ్యులకు సూచనలు ఇస్తూ ప్రాక్టీషనర్ కు పేషంటు కు మధ్య ప్రేమ అనే అనుభందం ఉండాలనీ అప్పుడే భగవంతుడి అనుగ్రహం ప్రసరించి రోగ నివృత్తి చేస్తుందనీ ఏ రెమిడి ఇచ్చారు అనే దానికన్నా ఎంత ప్రేమతో ఇచ్చారు అనేది ప్రధానమని చెప్పారు.రోగ నివృత్తి చేసేది రెమిడి కాదు భగవంతుడు అనే స్పృహ ఎప్పుడూ కలిగి ఉంటే భగవంతుని చేతిలో చక్కని ఉపకరణములుగా ఉంటామని సభ్యులకు సూచించారు .ఇకనుండి తరుచుగా   సదస్సులు నిర్వహించుకుంటూ సభ్యులంతా కలుసుకుంటూ ఉండాలని మరింతగా వైబ్రియో సేవకు అంకిత మవ్వాలని నిర్ణయముతో సభ్యలు సెలవు తీసుకున్నారు.

 

 

 

 

 

 

 

 

Om Sai Ram