మధుమేహ వ్యాధి 11576...India
78 సంవత్సరాల మహిళ తనకు 2009 లో మధుమేహ వ్యాధి ఉన్నట్లు గుర్తింపబడి మందులు వాడసాగింది. తగిన ఫలితం లేకపోవడంతో 2016 ఏప్రిల్ 3న చికిత్సా నిపుణుడను సంప్రదించారు. చాలా సంవత్సరాల పాటు నిస్త్రాణంగా ఉండడంతో ఎక్కువ విశ్రాంతి తీసుకొనడం, పరిమితమైన ఆహారం తీసుకోవడం, చెక్కెరను తగు మోతాదులోనే తీసుకొనడం ఆమెను మానసికంగా కూడా కృంగిపోవునట్లు చేసింది. ఆమె బి.పి మరియు కొలెస్ట్రాల్ (కొవ్వు) శాతం సాధారణ స్థాయి లోనే ఉన్నాయి. ఆమె పూర్వీకులకు కూడా చెక్కెర వ్యాధి ఉన్న దాఖలాలు లేవు. ఆమెకు అన్నం తినక ముందు చెక్కెర శాతం (బ్లడ్ షుగర్) 180 mg/dl గానూ (normal 70-100mg/dl) తిన్న తర్వాత 240mg/dl (normal <140 mg/dl) గానూ ఉన్నాయి. ఈ 7 సంవత్సరాలుగా డాక్టర్ సూచించిన అన్ని రకాల మందులు వాడుతూనే ఉన్నప్పటికీ ఫలితం లేదు. ప్రస్తుతం ఆమె మెట్ ఫార్మిన్ 500 mg మరియు విటమిన్ బి12 (Metformin 500mg and Vitamin B12) వాడుతున్నారు. ఈమె రోగ చరిత్రంతా తెలుసుకున్న ప్రాక్టీషనర్ లోలకం (pendulum) సహాయంతో ఆమెకు లివర్ సాధారణ స్థాయిలో పని చెయ్యడం లేదని తెలుసుకున్నారు. క్రింది రెమిడి ఆమెకు సూచింపబడింది:
CC4.2 Liver & Gallbladder tonic + CC6.3 Diabetes + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…QDS నీటితో
మందులతో పాటు ఆహారంలో పరిమితి, శారీరక కసరత్తులు, బరువు నియంత్రణలో ఉంచుకొనడం కూడా ఆమె చికిత్సలో భాగమయ్యాయి. అంతేకాకుండా చెక్కెర శాతం ఎక్కువుగా ఉన్న పదార్ధాలు తీసుకోకుండా తాజా పళ్ళను తీసుకుంటూ ఉండవలసిందిగా ఆమెకు సూచింపబడింది. గోధుమ గడ్డిని, కట్ చేసిన ఉల్లిపాయల ముక్కలు, ఎక్కువగా నీరు తీసుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు చెక్కర శాతం పరీక్ష చేయించుకుంటూ తన ఫిజిషియన్ కు అందుబాటులో ఉండవలసిందిగా సూచింపబడింది.
10 రోజులు వాడిన తర్వాత చెక్కర శాతంలో 20 శాతం తగ్గుదల కనిపించగా 9 వారాల తర్వాత 50 శాతం తగ్గుదల కనిపించింది. కనుక డోస్ ను TDS గా తగ్గించడం జరిగింది. ఆమెకు ప్రస్తుతం ఎంతో తేలికగా, ఆరోగ్యంగా, బలంగా ఉన్నట్లు అనిపించ సాగింది. నాలుగు నెలలు మందులను వాడిన తర్వాత పరీక్ష చేయించగా ఆమె బ్లడ్ షుగర్ లెవెల్ సాధారణ స్థాయిలో ఉన్నట్లు తెలిసింది. కనుక డోస్ ను BD స్థాయికి తగ్గించడం జరిగింది. ఆమె రోజుకు రెండు సార్లు వేసుకొనే మెట్ ఫార్మిన్ మాత్రను రోజుకు ఒక్కసారి చొప్పున తగ్గించి చివరకు జనవరి 2017 నుండి పూర్తిగా మానివేసింది. ఏప్రిల్ 2017 నాటికి పేషంట్ కు పూర్తిగా తగ్గిపోయి మానసికంగా ఎంతో ప్రశాంతత పొందుతున్నట్లు తెలపడంతో OW నిర్వహణా డోస్ గా రెమిడిను తీసుకోవలసిందిగా సూచించారు.
ప్రాక్టీషనర్ వివరణ:
రోగి యొక్క బ్లడ్ షుగర్ క్రమ తగ్గుదలను సూచించే రిపోర్టులన్నీ భద్రపరచబడినవి.