అభ్యాసనా లోపము 02090...India
2017వ సంవత్సరం జనవరి 8వ తేదీన ఒక తల్లి తన 8 సంవత్సరాల పాపను ప్రాక్టీషనర్ వద్దకు తీసుకొని వచ్చింది. ఆ పాప  ప్రస్తుతం 3 వ తరగతి చదువుతున్నది కానీ అభ్యాసనా లోపంతో కనీసం అక్షరాలు కూడా గుర్తు పట్టలేని స్థితి లో ఉంది. ప్రాక్టీషనర్ ఆమె తోనూ తల్లి తోనూ మాట్లాడి క్రింది రెమిడి ఇవ్వడం జరిగింది:
CC12.2 Child tonic + CC15.5 ADD & Autism + CC17.3 Brain & Memory tonic…TDS 
ఆరు వారాలు తర్వాత ఆ తల్లి ఎంతో ఆనందంతో పాప గురించి వాళ్ళ టీచర్ చెప్పిన మాటలను వివరిస్తూ చాలా తక్కువ సమయంలో ఆమెకు అక్షరాలన్నీ వచ్చేసాయనీ ఏకాగ్రత పెరిగిందనీ చదువుకునే సామర్ధ్యం పెరిగిందనీ చెప్పిందట. ప్రాక్టీషనర్ సంవత్సరం పాటు ఇదే రెమిడి వాడమని సూచించటం జరిగింది.
సంపాదకుని వివరణ: పిల్లలకు,ముఖ్యంగా విద్యార్ధులకు అనేక రకాల టానిక్ లు ఇవడం ద్వారా కేరళ చికిత్సా నిపుణులు అద్బుతమైన ఫలితాలు, ప్రజల మన్ననలను పొందడం అభినందనీయము.
