ఎముకలలో ఆస్టియో నెక్రోసిస్ వ్యాధి (Osteonecrosis of ribs) 10602...India
2016వ సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీన 67 సంవత్సరాల వృద్ధ మహిళ ప్రాక్టీషనర్ వద్దకు వచ్చింది. చాలా సంవత్సరముల క్రిందట జరిగిన ఒక ఆపరేషన్ తాలూకు మచ్చకు చుట్టూ ఉన్న ప్రాంతం నుండి గడ్డలు, పుండ్లు వ్యాపించి చీము కారుతూ చాలా నొప్పి పుడుతోందట. ఒక ప్రముఖ వైద్యుణ్ణి ఆమె సంప్రదించినప్పుడు గతంలో ఆమె తీసుకున్న రేడియేషన్ థెరపీ వల్ల ఇలా జరుగుతోందని చెప్పాడు. 18 సంవత్సరాల క్రితం ఆమె రొమ్ము క్యాన్సర్ నిమిత్తం రేడియేషన్ థెరపీ తీసుకుని క్యాన్సర్ వ్యాపించిన ప్రక్కటెముకలు తొలగించుకొనుటకు ఒక పెద్ద ఆపరేషన్ కూడా చేయించుకున్నది. ప్రస్తుతం తిరిగి సంప్రాప్తించిన ఈ వ్యాధి ఇంకా వ్యాపించకుండా ఉండాలంటే ఆమె మరో ఆపరేషన్ కు సిద్ధపడి వ్యాధికి గురయిన ప్రక్కటెముకలు తొలగింప చేసుకోవాలని ఆ వైద్యుడు చెప్పాడు. కానీ ఈ వృద్ధ మహిళ మరోసారి ఆపరేషన్ చేయించుకొనడానికి సుముఖంగా లేదు. కారణం ఏమంటే గతం లో ఆపరేషన్ కు ముందే కాక ఆపరేషన్ అనంతరం కూడా 15 రోజులు విపరీతమైన బాధ అనుభవించవలసి వచ్చింది. ఐతే ప్రాక్టీషనర్ ఆమెకు ధైర్యం చెప్పి బాబా పైన అచంచల విశ్వాసం ఉంచి ఆపరేషన్ చేయించుకొనడానికి సిద్ధపడాలని సూచించారు. ఆమెకు క్రింద సూచించిన రెమిడి ఇచ్చారు:
#1. CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…TDS
#2. CC2.1 Cancers - all + CC2.2 Cancer pain + CC9.2 Infections acute + CC21.11 Wounds & Abrasions…6TD
సెప్టెంబర్ 27 న ప్రాక్టీషనర్ సూచన పైన ఆమెకు ఆపరేషన్ అయ్యింది. ఆపరేషన్ కు 5 గంటల సమయం పట్టినా ఆశ్చర్యకరంగా ఏమాత్రం నొప్పి తెలియలేదు. ICU నుండి ఆమె ప్రాక్టీషనర్ తో మాట్లాడుతూ ఇన్ఫెక్షన్ కారణంగా చాలా వరకు పక్కటెముకలు తొలగింప చూసిన వైద్యులు ఇన్ఫెక్షన్ వ్యాపించకుండా ఆగిపోవడం చూసి చాలా ఆశ్చర్యం పొందారు. ఐతే కుడివైపు పై భాగాన ఉన్న ఒక్క ఎముక మాత్రం తొలగించవలసి వచ్చింది. నెల తర్వాత #2 ను QDS గానూ రెండు నెలల తర్వాత TDS గానూ అలాగే #1 ను BD గానూ డోస్ తగ్గించడం జరిగింది. మూడు నెలల తర్వాత పేషంట్ తనకు పూర్తిగా తగ్గిపోయిందని తెలుపుతూ ఆనందాన్ని తెలియ జేసింది. ఐతే ప్రాక్టీషనర్ డోస్ మానకుండా మరో నెలరోజలు OD గ తీసుకోవాలని ఆ తర్వాత నుండి OW మెయింటెనేన్స్ డోస్ గా తీసుకోవాలని సూచించారు. ఇటీవల ఆమె కనిపించి నప్పుడు తనకు ఏ ఇబ్బంది లేనందువల్ల డోస్ తీసుకోవడం పూర్తిగా ఆపివేసాననీ తనకు రోగ నివారణ చేసిన స్వామికి సాయి వైబ్రియానిక్స్ కు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.