దీర్ఘకాలిక పొత్తికడుపు నొప్పి 10602...India
40 సంవత్సరాలుగా కడుపు నొప్పితో బాధ పడుతున్న 93 సంవత్సరాల ఒక వృద్ధ మహిళ 2017 మార్చ్ 7 న ప్రాక్టీషనర్ వద్దకు వచ్చింది. ఐతే ఈ 40 సంవత్సరాలుగా ఆమె అలోపతిక్ మందులు వాడుతూ 35 సంవత్సరాల క్రితం గర్భాశయం తొలగింపు, 20 సంవత్సరాల క్రితం గాల్ బ్లాడర్ తొలగింపు, 10 సంవత్సరాల క్రితం పాంక్రియాస్, కిడ్నీల లో రాళ్ల నిమిత్తం శస్త్ర చికిత్స, 5 సంవత్సరాల క్రితం హెర్నియా ఆపరేషన్ ఇలా ఎన్నో ఆపరేషన్లు చేయించుకున్నా మందులు వాడినా ఈ పొత్తి కడుపు నొప్పికి కారణం ఏమిటో తెలియలేదు, నొప్పి కూడా తగ్గలేదు. ఈ నొప్పి తో పాటు ఆమెకి ఉదరంలో నొప్పి మంట కలగసాగాయి. దీనితో ఆమెకు ఆకలి మందగించింది, నిస్త్రాణంగా ఉంటోంది, దీనితో పాటు విసుగు కోపము కూడా కలగసాగాయి.
స్వామిని ప్రార్ధించి ప్రాక్టీషనర్ ఆమెకు క్రింది డోస్ ఇవ్వడం జరిగింది:
#1. CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC18.7 Vertigo…6TD
2. CC4.2 Liver & Gallbladder tonic + CC4.3 Appendicitis + CC4.4 Constipation + CC4.5 Ulcers + CC4.6 Diarrhoea + CC4.8 Gastroenteritis + CC4.9 Hernia + CC4.10 Indigestion…6TD
రెండు వారాలు మందులు వాడిన తర్వాత ఆమె ప్రాక్టీషనర్ను కలిసి తనకు 50 శాతం మెరుగుదల కనిపించిందని వర్టిగో పూర్తిగా తగ్గిందని ఆహారం చక్కగా తీసుకొంటూ ఉండడం వల్ల అంతగా నీరసం కూడా లేదని చెప్పింది. ప్రాక్టీషనర్ #1 మరియు #2 మందులను QDS గా తగ్గించారు. నెల రోజుల తర్వాత ప్రాక్టీషనర్ ను కలసి తనకు పూర్తిగా తగ్గిపోయిందని ఆహారం చక్కగా తీసుకుంటున్నాననీ నీరసం పూర్తిగా తగ్గిందని తెలిపింది. ఐతే డోస్ మాత్రం నెల రోజుల పాటు BD గానూ మరో నెల రోజులు OD గానూ తీసుకోవలసిందిగా సూచింపబడింది. తిరిగి 2016 జనవరి 20వ తేదీన ఆమె తిరిగి ప్రాక్టీషనర్ను కలసినప్పుడు తనకు పూర్తిగా తగ్గిపోయిందని తెలిపింది. అలాగే ఏప్రిల్ నెలలో కలసినప్పుడు ఇన్ని రోజులుగా పాత సమస్యలేవీ తలెత్తలేదని పూర్తిగా కోలుకున్నానని తెలిపారు.