హైపో థైరాయిడ్ 11576...India
2016 మార్చ్ 12వ తేదీన ఒక 43 మహిళ హైపో థైరాయిడ్ సమస్యతో బాధ పడుతూ ప్రాక్టీషనర్నుసంప్రదించారు. ఆమె ఉండవలసిన స్థాయికన్నా ఎక్కువ బరువుగా ఉండడమేకాక వంట్లో అసలు శక్తి లేనట్లు నిస్త్రాణంగా ఉన్నట్లుగానూ ఆమె హృదయ స్పందన, కొలెస్ట్రాల్ (కొవ్వు)శాతం సాధారణ స్థాయిలో ఉన్నప్పటికీ ఆమెకు అలసిపోయినట్లుగా, సోమరితనంగా, అవిశ్రాంతంగా అనిపించ సాగిందట. ఇంక ఆమెకు నిద్ర లేమి సమస్య తో పాటుగా ఆమెకు వాళ్ళంతా చల్లబడి పోతున్నట్లు అనిపిస్తూ ఉంటుందని కూడా చెప్పింది. ఆమె రోజుకు 75mg థైరాక్సిన్ Thyroxin అలోపతిక్ డోస్ తీసుకొనసాగింది. ప్రాక్టీషనర్ ఆమెకు క్రింది రెమిడి ఇవ్వడం జరిగింది:
CC6.2 Hypothyroid + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…QDS నీటితో
ఆమె చెప్పిన విషయం ప్రకారం మొదటిసారిగా ప్రాక్టీషనర్ను కలసి మొదటి పిల్ వేసుకోగానే ఏదో తెలియని అనందం కలిగిందట. నెల తర్వాత ఆమె థైరాయిడ్ హార్మోన్ రీడింగులు FT3, FT4 మరియు TSH ల స్థాయిలో తగ్గుదల కనిపించిందట. మూడు నెలల తర్వాత జూన్ 2016 లో పరీక్ష చేయించుకొన్నప్పుడు ఆమె థైరాయిడ్ గ్రంధి సాధారణ స్థాయి లో పనిచేస్తున్నట్లు తెలిసింది. కనుక ఆమెను డాక్టర్ థైరాక్సిన్ 25 mg మాత్రమే వేసుకోవాల్సిందిగా సూచించారు. ప్రాక్టీషనర్ కూడా రెమిడి డోస్ ఆగస్టు వరకు OD గానూ అప్పటి నుండి అక్టోబర్ వరకు OW గానూ తీసుకోవలసిందిగా సూచించారు. ప్రస్తుతం ఆమె థైరాయిడ్ హార్మోన్ స్థాయి సాధారణ స్థాయి లో ఉంది, ఆమె శరీర బరువు కూడా 10 కేజీలు తగ్గింది.
ప్రాక్టీషనర్ వివరణ:
అక్టోబర్ 2016 నాటి వరకూ పూర్తి ఆరోగ్యంతో ఉండి తరువాత వేరే పట్టణానికి పేషంటు వెళ్ళిపోయారు.