Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

Vol 6 సంచిక 5
September/October 2015
ముద్రింప తగిన వార్తాలేఖ


పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి

డా.అగ్గర్వాల్ యొక్క డెస్కు నుండి

ప్రియమైన అభ్యాసకులకు

స్వామి యొక్క 90వ జన్మదిన సమర్పణలో పాల్గొనేందుకు ఆహ్వానం

నేను సాయి వైబ్రియానిక్స్ అభ్యాసకులకు ఒక ముఖ్యమైన ప్రకటనతో ఈ సంచికను ప్రారంభం చేయాలనుకుంటున్నాను. నవంబర్ 23న మనకు ప్రియమైన మన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి 90వ జన్మదినమని మీకందరికీ తెలిసినదే. ఈ పవిత్రమైన మరియు ఆనందమైన సందర్భంలో సాయి వైబ్రియానిక్స్ యొక్క టీం, వైబ్రియానిక్స్ కేసులను స్వామికి సమర్పించుకోవాలని  నిర్ణయించుకుంది. అభ్యాసకులందరు తమ కేసు వివరాలను పంపించి, ఈ యొక్క సమర్పణ కార్యక్రమంలో పాల్గొనమని ఆహ్వానిస్తున్నాము.

ప్రధాన నివారణ కారకుడైన స్వామిపై మనకున్న ప్రేమను వ్యక్తపరచటానికి, కేసులను సమర్పిస్తున్నాము. స్వామి యొక్క సాధనాలుగా స్వామీ మీద మనకున్న భక్తిని వ్యక్తపరచటానికి, 90వ జన్మదినోత్సవం ఒక సువర్ణ అవకాశం. స్వామికి మన కృతజ్ఞ్యతలు తెలుపుకోవడానికి, స్వామి మనకప్పగించిన సేవా కార్యక్రమము యొక్క సఫలితాలను సమర్పించడం కన్నా ఉత్తమ మార్గం మరేముంటుంది?

అభ్యాసకులందరు ఒకటి లేదా అనేక కేసు వివరాలను, సాయి వైబ్రియానిక్స్ వార్తాలేఖ, 90వ జన్మదిన ప్రత్యేక సంచికలో ప్రచురింప పడేందుకు పంపవచ్చు. ఈ సంచికలో ప్రతి ఒక్క ప్రాంత మరియు ప్రతి ఒక్క దేశ ప్రాతినిధ్యం ఉండాలని మేము కోరుకుంటున్నాము. మాకందే కేసులను, ఈ ప్రత్యేక సంచికలో, సాధ్యమైనంత వరకు చేర్చుతాము. కాని ఆఖరి తారీఖు లోపల మాకందే కేసులన్నియు స్వామికి, 90వ జన్మదినం రోజున సమర్పించబడతాయి.

రోగ చరిత్రలను (కేసు వివరాలు) సాధ్యమైనంత త్వరగా ఈ ఈమెయిల్ కు పంపవలెను: [email protected]. సమయాన్ని ఆదా చేసేందుకు, పూర్తి వివరాలుతో కూడిన రోగ చరిత్రలు పంపించవలసిందిగా కోరుకుంటూన్నాము. ఈ విషయంలో మీకు సహాయపడే విధంగా నేనొక 'చెక్ లిస్టును' తయారు చేసాను. వివరాల కోసం click here (ముందుగా మీ యూసర్ పేరు మరియు పాస్వర్డ్ ను ఉపయోగించి వైబ్రియానిక్స్ వేబ్సయిట్ www.vibrionics.org లో లాగిన్ అవ్వాలి. సందేహాలుంటే [email protected] వద్ద సంప్రదించండి)

2015 అక్టోబర్ 10 వరకు పంపిన కేసులను మాత్రమే స్వీకరించడం జరుగుతుంది. 10 అక్టోబర్ చివరి తేదియని ధృడంగా నిశ్చయించబడింది. ఆఖరి నిమిషంలో కాకుండా ముందుగానే కేసు వివరాలను మాకు పంపవలసిందిగా కోరుతున్నాము. ఈ విధంగా చేసినట్లయితే కేసు వివరాలను సవరించడానికి మరియు ప్రచురణకు సిద్ధం చేయడానికి మాకు సులభంగా ఉంటుంది. ఈ విలువైన అవకాశాన్ని అభ్యాసకులందరు ఉపయోగించుకుంటారని మేము హృదయపూర్వకంగా ఆశిస్తున్నాము.

 కేరళకు చెందిన అభ్యాసకులకు కృతజ్ఞ్యతలు

 108CC బాక్సులను సమీకరించడానికి ప్రశాంతి నిలయానికి ప్రత్యేక ప్రయాణాలు చేస్తున్న కేరళ సమన్వయకర్తకు మరియు అతని టీంకు చెందిన అభ్యాసకులందరికీ, హృదయపూర్వకమైన ప్రశంసలను మరియు క్రుతజ్ఞ్యతల్ను తెలుపుకుంటున్నాను. ఈ బాక్సులు వైబ్రియానిక్స్ అభ్యసించడానికి కావాల్సిన ప్రధాన సాధనాలు! పైకి కనబడక పోయినా, బాక్సులను సమీకరించటం చాలా కష్టమైన పని. ఇంతే కాకుండా కేరళ అభ్యాసకులు మరో ముఖ్యమైన సేవను అందిస్తున్నారు: మన అంతర్జాతీయ సంఘం IASVP యొక్క సభ్యత్వం కోసం, ID కార్డులు తయారు చేసేందుకు, అభ్యాసకుల వివరాలను సేకరించటం, కార్డులను ముద్రించటం మరియు తయారైన ID కార్డులను అభ్యాసకులందరికీ పంపించటం వంటివి. వారి సేవ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభ్యాసకులందరికీ ప్రయోజనకరంగా ఉంది.

ఈ సంచికలో ముఖ్యాంశం: ఢిల్లీ అభ్యాసకులు

 అత్యంత సమర్పనా భావంతో వైబ్రియానిక్స్ సేవనందిస్తున్న, విభిన్న సమూహాలకు చెందిన ఢిల్లీ అభ్యాసకుల వివరాలపై ఈ సంచికలో కేంధ్రీకరించబడింది. ఢిల్లీ అభ్యాసకుల వివరాలను మరియు వారి కేసుల వివరాలను వ్యవస్థాపింఛి మరియు సంకలనం చేసిన ఢిల్లీ-NCR సమన్వయకర్తకు02859...ఇండియా మా ప్రశంసలను అందచేస్తున్నాము. వీరందిoచే సేవ, నిస్వార్థ ప్రేమకు ఒక  స్పూర్తిదాయక ఉదాహరణ.

ప్రేమపుర్వకంగా సాయి సేవలో

జిత్ కే అగ్గర్వాల్

పార్కిన్సంస్ వ్యాధి(అవయవాల వణుకు రోగం) మరియు సోరియాసిస్(చర్మ వ్యాధి) 02859...India

2013 మార్చ్ లో ఒక 54 ఏళ్ళ వ్యక్తి, అత్యంత దు:ఖంతో, తన ఇద్దరు అబ్బాయిల సహాయంతో, అభ్యాసకుడుని సంప్రదించడానికి వచ్చారు. ఇయన మధ్య దశలో ఉన్న పార్కిన్సంస్ వ్యాధితో గత ఆరు ఏళ్ళగా భాద పడుతున్నారు. డెల్లిలో ఒక ప్రభుత్వ ఆశ్పత్రిలో అల్లోపతి చికిత్సతో పాటు, ఇయన జాండోపా మూళికను కూడా తీసుకుంటున్నారు. వణుకు, ఒళ్ళు భిగువు మరియు నొప్పులు కారణంగా ఈయన రోజువారి చర్యలకు కుటుంభ సభ్యుల మీద ఆధారపడేవారు. ఇయనకు సోరియాసిస్(చర్మవ్యాధి) మరియు పడక పుళ్ళు సమస్య కూడా ఉండేది. ఇయ్నకు ఒకటే స్తానంలో పడుకునియుండడం చాలా ఇబ్భందికరంగా ఉండేది. ఇయ్నకు ఈ క్రింద  వ్రాసిన మందులు ఇవ్వబడినాయి:

 పార్కిన్సంస్ సమస్యకు:
#1. CC18.6 Parkinson’s disease + CC20.2 SMJ tonic…TDS

 సోరియాసిస్ మరియు పడక పుళ్ళకి:
#2. CC21.10 Psoriasis + CC21.11 Wounds & Abrasions...TDS, మౌఖికంగా మరియు పై పూతకు కొబ్బరి నూనెలో

రెండు నెలల్లో, ఈ రోగికి సోరియాసిస్ సమస్య పూర్తిగా తగ్గిపోయిన కారణంగా #2 యొక్క మోతాదును రోజుకి ఒకసారికి (OD)తగ్గించారు. పార్కిన్సంస్ వ్యాధి లక్షణాలు కూడా 50% వరకు తగ్గిపోయాయి. ఎవరి సహాయం లేకుండా ఇయన నడవగాలిగాడు. వ్యాధి నుండి  ఉపశమనం కలగడం వల్ల ఇయన ప్రశాంతంగా నిద్రించ గలిగారు. రోగి పరిస్థితి మెరుగు పడడం కారణంగా, డాక్టర్ పార్కిన్సన్స కొరకు ఇచ్చిన మందు మోతాదును సగానికి తగ్గించేసారు. పేషంటు #1 మందును రోజుకి మూడు సార్లు(TDS) తీసుకోవడం కొనసాగించారు. ఒక నెల తర్వాత, పేషంటుకు 80% ఉపశమనం కలిగింది. ఇయన తన పొలంలో పని చేసుకోవడం కొనసాగించారు. సొంతంగా తన పనులన్నీ చేసుకోగలిగారు. పేషంటు మరియు అతని కుటుంభ సభ్యులు ఈ చికిత్స ద్వారా భగవంతుడు దీవెనలని అందుకున్నామని ఎంతో సంబర పడ్డారు.

ఈ పేషంటు #2 మందును ఆపివేసి #1 మందును తీసుకోవడం మరో మూడు నెలలవరకు కొనసాగించారు. 

 

పాదంలో అంటురోగం 02859...India

అభ్యాసకురాలు వ్రాస్తున్నారు: 2011 ఏప్రిల్ లో, మా వూరిలో జరిగిన, మూడు రోజుల AVP కోర్సు పూర్తి చేసాక, కనీసం ఒక్క వ్యక్తికైనా సహాయపడాలని దేవుడిని వేడుకున్నాను. కొన్ని రోజులలోనే మా బంధువుల ఇంట్లో పనిచేస్తున్న మహిళ కుంటుతూ నడవడం చూసాను. ఆమె పాదాలు వాచిపోయి, చీము కారుతున్నాయి. తీవ్రమైన నొప్పితో భాదపడుతున్న ఆ మహిళకు రోజువారి పనులు చేసుకోవడం ఎంతో కష్టంగా ఉండేది. ఈ విధంగా ఆ మహిళ, గత 15 రోజులగా భాధపడుతోంది. ఆమెకు ఈ క్రింద వ్రాసిన మందుల్నిచ్చాను:
CC21.1 Skin tonic + CC21.11 Wounds & Abrasions...6TD

ఒక వారంలో ఆమె పాదం నుండి చీము కారడం, వాపు మరియు నొప్పి తగ్గిపోయి, సాధారణంగా నడవ గలిగింది. ఆపై మూడు రోజులకి మందుల మోతాదును రోజుకి మూడు సార్లుగా (TDS) తగ్గించి, ఆపై ఒక వారం వరకు రోజుకి ఒక సారి (OD) మందును తీసుకుంది.

అభ్యాసకురాలి వ్యాఖ్యానం:
అల్లోపతి చికిత్సకు మందులను మరియు సమయాన్ని కర్చుచేసే అవసరం లేకుండా ఆ మహిళకు పూర్తిగా ఉపశమనం కలిగినందుకు నాకెంతో ఆనందంగాను మరియు సంత్రుప్తిగాను అనిపించింది. ఇంత అద్భుతమైన సేవా కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని ప్రసాదించినందుకు స్వామికి నా క్రుతజ్ఞ్యతలను తెలుపుకుంటున్నాను. వైబ్రియానిక్స్ సేవ ద్వారా నేనెంతో వినమ్రతగా ఉండడం నేర్చుకున్నాను. స్లం ప్రాంతాలలో క్రమం తప్పకుండా వైబ్రియానిక్స్ చికిత్సను అందిస్తున్నాను. స్వామీ యొక్క అపారమైన ప్రేమ మరియు కృప నాకు మరియు నా పేషంట్లకు ఎల్లప్పుడూ లభిస్తూనే ఉన్నాయి.

పళ్ళ నొప్పి, పికా మరియు జుట్టు రాలే సమస్య 02859...India

2013 మే లో ఒక 22 ఏళ్ళ పేషంటు, అభ్యాసకురాలిని ఈ రోగ సమస్యలతో సంప్రదించారు: చల్లగా లేదా వేడిగా ఉన్న పదార్థాలు తీసుకున్నప్పుడు పళ్ళ నొప్పి వచ్చేది. ఈ వ్యక్తికి చిన్న వయస్సు నుండి చాక్ పీసులు మరియు ఇతర బలంలేన ఆహారాలు తినే అలవాటుండేది. గత నెల రోజులుగా జుట్టు రాలడం మరియు నేరిసిపోవడం వంటి సమస్యలు  మొదలైయాయి. ఈ వ్యక్తికి, ఈ క్రింద వ్రాసిన మందుల్నిచ్చాను:

పళ్ళ నొప్పి మరియు పికా సమస్యకు:
#1.  CC11.6 Tooth infections + CC15.4 Eating disorders…TDS

జుట్టు రాలే సమస్యకు:
#2. CC11.1 Hair tonic + CC11.2 Hair problems + CC15.1 Mental & Emotional tonic...TDS

మూడు వారాల తర్వాత, అతని పళ్ళ నొప్పి పూర్తిగా తగ్గిపోయింది, చాక్లు వంటివి తినే అలవాటు 80% వరకు తగ్గి, జుట్టు రాలే సమస్య 60% వరకు తగ్గిపోయింది. రెండు నెలల చికిత్స తర్వాత అతనికున్న సమస్యలన్నీ పూర్తిగా తగ్గి అతనికి ఉపశమనం కలిగింది. మందు మోతాదును రోజుకి ఒకసారికి (OD) తగ్గించి, ఆపై నెల రోజుల వరకు ఇదే మోతాదులో తీసుకోవడం కొనసాగింది.

పరీక్షల ఒత్తిడి 02859...India

ఒక 17 ఏళ్ళ అమ్మాయి తల్లి తండ్రులు, తమ కుమార్తె మీదున్న దిగులుతో అభ్యాసకురాల్ని 2014 జనవరిలో సంప్రదించారు. వీళ్ళ కుమార్తె చదువులో మంచి ప్రభావశాలి. కాని పన్నెండో తరగతి పరీక్షలు సమీపిస్తున్న కారణంగా, ఈ అమ్మాయికి ఒత్తిడి కలిగి తన ఆత్మవిశ్వాసాన్ని కోలిపోయింది. [ఎడిటర్ వ్యాఖ్యానం: ఈ పరీక్షలు విశ్వవిద్యాలయ ప్రవేశం కొరకు అత్యంత ప్రతిస్టాత్మకంగా భారతీయ సెకండరి స్కూల్ విధ్యార్దులుకు నిర్వహింపబడుతాయి] ఈ కారణంగా ఆమె జ్ఞ్యాపక శక్తి తక్కువై పరీక్షలు అనుకున్న విధంగా వ్రాయలేకపోయింది. ఈమెకు ఈ మందుల్ని ఇవ్వడం జరిగింది:
NM5 Brain TS + BR4 Fear + BR6 Hysteria + SM1 Removal of entities + SM2 Divine protection + SM6 Stress + SM9 Lack of confidence + SM41 Uplift + SR218 Base chakra + SR222 Sacral chakra + SR227 Coral…6TD in water

ఒక వారంలో తల్లి తండ్రులు తమ కుమార్తె మానసిక స్థితిలో మెరుగు ఏర్పడినట్లు తెలియచేసారు. ఈ విద్యార్ధి, ఒత్తిడి తగ్గడంతో, తిరిగి ఒక మంచి ప్రభావశాలిగా మారింది. మందుల మోతాదును ఆపై 15 రోజులకు, TDS కి తగ్గించాను. ఈ విద్యార్ధి పూర్తిగా నయం కావడంతో మోతాదును రోజుకి ఒక సారి (OD) కి తగ్గించాను. ఈ మోతాదు మార్చులో పరీక్షలు పూర్తయ్యే వరకు కొనసాగింది. ఈ విద్యార్ధి పరీక్షలు ఉన్నత రీతిలో వ్రాసి తన జీవితాన్ని ఆత్మవిశ్వాసంతో కొనసాగిస్తోంది.

రుతువిరతి సమయంలో కున్గుపాటు 02859...India

2015 జనవరిలో ఒక 49 ఏళ్ళ మహిళ, తన జీవితంలో ప్రయోజనం కనిపించడం లేదని, ఈ కారణంగా చాలా అసంతోషంగా ఉన్నట్లు ఎవరితోనూ మాట్లాడడానికి ఇష్టం లేనట్లు అభ్యాసకురాల్ని సంప్రదించినప్పుడు చెప్పింది. ఈమెకు రుతుచక్రం కూడా అక్రమముగా ఉందని చెప్పింది:

ఈమెకు ఈ మందుల్నిచ్చాను:
CC15.1 Mental & Emotional tonic + CC8.6 Menopause…TDS

ఒక వారం రోజులలో ఈ మందుల యొక్క మహిమను తెలుసుకున్నట్లు చెప్పింది. రెండు నెలల తరవాత తనకు, పూర్తి ఉపశమనం కలిగి చాలా ఆనందంగాను, శాంతియుతంగాను ఉన్నట్లు తెలియచేసింది. ఈ కారణంగా మందుల మోతాదును ఒక నెల రోజులకు OD కి తగ్గించి, ఆపై వారానికి ఒక సారికి( OW) తగ్గించడం జరిగింది. 2015 ఆగష్టు లో, ఈమె మందును ఇదే మోతాదులో తీసుకోవడం కొనసాగిస్తోంది. ఈమె ఋతుచక్రం పూర్తిగా ఆగిపోయింది. ఈమెకు వైబ్రియానిక్స్ చికిత్సపై అత్యంత నమ్మకం కలిగి అనేక  మంది పేషంట్లను ఈ అభ్యాసకురాల్ని సంప్రదించడానికి పంపిస్తోంది.

డిప్రెషన్ (కున్గుపాటు), మెడ నొప్పి 02859...India

ఒక 27 ఏళ్ళ వ్యక్తి, గత మూడేళ్ళగా భాదపడుతున్న తీవ్రమైన మెడ నొప్పితో, 2015 మార్చ్ లో అభ్యాసకురాల్ని సంప్రదించాడు. అల్లోపతి మందులు శాశ్వత ఉపశమనాన్ని కలిగించలేదు.  జీవితంలో ఉన్న అనేక సమస్యల కారణంగా, ఈ వ్యక్తి కున్గుపాటు, అతి తక్కువైన ఆత్మ గౌరవం మరియు నత్తి సమస్యలతో భాదపడేవాడు. ఈ పేషంటుకు ఇచ్చిన మందులు

మెడ నొప్పి కోసం:
#1. CC10.1 Emergencies + CC20.1 SMJ tonic + CC20.5 Spine…TDS

మానసిక సమస్యలకు:
#2. CC15.1 Mental & Emotional tonic + CC17.3 Brain & Memory tonic + CC18.1 Brain disabilities…TDS

రెండు నెలల్లో ఈ వ్యక్తికి మెడ నొప్పి పూర్తిగా తగ్గిపోయింది మరియు ఇతర సమస్యలలో 80% ఉపశమనం కలిగింది. ఇతను చాలా ఆనందంగా కనిపించాడు. ఈ మందుల్ని మరో నెల వరకు TDS మోతాదులో కొనసాగించడం జరిగింది. ఆపై మోతాదును OD కి తగ్గించాను. క్లిష్టమైన సమస్యలు ఈ వ్యక్తి జీవితంలో కొనసాగుతున్న కారణంగా ఇంకా ఈ మందుల్ని తీసుకోవడం కొనసాగుతోంది.

అభ్యాసకురాలి వ్యాఖ్యానం:
మొదటి సంప్రదిమ్పులో చాలా కున్గుపాటుతో ఉన్న ఈ వ్యక్తి రెండు నెలల్లో ఉపశమనం కలిగి ఆనందంగా కనిపించాడు. ఇది చూసిన నాకెంతో సంతోషంగాను సంత్రుప్తిగాను అనిపించింది. 

 

ఎగ్జీమా (తామర) సమస్య 11569...India

ఒక 60 ఏళ్ళ మహిళ గత ఆరేళ్ళగా, కళ్ళ కింద ఎగ్జీమా సమస్యతో భాధపడుతోంది. దీని కారణంగా ఈమె కళ్ళ కింద ఉబ్బుగా ఉండేది. ఈ చర్మ వ్యాధికి అల్లోపతి చికిత్స తీసుకుంది కాని ఉపశమనం కలుగలేదు. 2015 మే 5 న, ఈ కింద వ్రాసిన మందులు ఈమెకు ఇవ్వబడినాయి:
#1. CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC21.6 Eczema…TDS in water

#2. CC21.6 Eczema…BD in water చర్మం పై రాయడానికి

పది రోజుల వరకు ఏ విధమైన మార్పూ కనపడలేదు. #1 మందుయొక్క మోతాదును పెంచడం జరిగింది (ప్రతి రోజు ఒక గంట వరకు, పది నిమిషాలకు ఒకసారి ఒక డోస్). ఇలా మోతాదును పెంచిన మూడు రోజుల తర్వాత ఈమె కళ్ళ కింద ఉన్న ఉబ్బుదల తగ్గింది (కింద ఇవ్వబడిన ఫోటోను చూడండి: ఎడమ పక్క:చికిత్సకు ముందు మరియు కుడి పక్క: చికిత్సకు తర్వాత). ఎగ్జీమా సమస్య 80% వరకు తగ్గింది. #1 మందు యొక్క మోతాదును ఆపై రెండు వారాల వరకు 6TD కి తగ్గించి, ఆపై ఒక నెల వరకు TDS కి తగ్గించాను. ఈ సమయంలో ఎగ్జీమా సమస్య పూర్తిగా తగ్గిపోయింది. #1 మందును మరో రెండు వారాల వరకు రోజుకి ఒకసారి (OD) మోతాదులో తీసుకుంది.

 

దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలు 11569...India

ఒక 47 ఏళ్ళ మహిళ దీర్ఘకాలిక శ్వాస కోశ సమస్యలకు చికిత్సను కోరి అభ్యాసకురాల్ని సంప్రదించింది. సంప్రదింపు సమయంలో ఈమె న్యుమోనియా వ్యాధితో (ఊపిరితిత్తుల వాపువ్యాధి) భాదపడుతోంది. ఈమె గత 40 సంవత్సరాలుగా బ్రోన్కైటిస్ (శ్వాసనాళాల వాపు) సమస్య, బొంగురు గొంతు మరియు గుండె భిగువు వంటి సమస్యలతో భాధపడుతోంది. ఈమె అల్లోపతి చికిత్స తీసుకుంటోంది కాని ఈమె గుండె భిగువు సమస్యలో ఉపశమనం కలుగలేదు. ఈమెకు ల్యుపస్ (ముఖచర్మరోగము) మరియు IBS  (ఇరిటబుల్ బొవల్ సిండ్రోం-జీర్ణ కోశ సమస్య) కూడా గత 13 ఏళ్ళగా ఉన్నాయి. న్యుమోనియా వ్యాధి మరియు ఇతర శ్వాస కోశ సమస్యలు ఎక్కువగా భాదిస్తున్న కారణంగా, ఈమెకు ఈ కింద వ్రాసిన మందుల్నివ్వడం జరిగింది:
CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC19.3 Chest infections chronic + CC19.7 Throat chronic…TDS in water

మూడు రోజుల తర్వాత ఈమె పరిస్థితిలో ఏ మార్పు లేనందువల్ల, మోతాదును ఈ విధంగా పెంచడం జరిగింది: ప్రతిరోజు, ఒక గంట వరకు, పది నిమిషాలకు ఒక సారి ఒక డోస్. ఈ విధంగా ఒక వారం తీసుకున్న తర్వాత ఈమె గుండె భిగువు సమస్య చాలా వరకు తగ్గిపోయింది. ఆపై మందుల మోతాదును ఈ విధంగా తగ్గించడం జరిగింది: మూడు రోజుల వరకు 6TD, ఆపై నెల రోజుల వరకు TDS. ఈ సమయంలో ఈమెకున్న న్యుమోనియా మరియు గుండె భిగువు సమస్య పూర్తిగా తగ్గి, ఉపశమనం కలిగింది. ఆపై ఒక వారానికి ఈమె మందును రోజుకి ఒక సారి (OD) తీసుకుని, ఆపేసింది. తర్వాత, ఈ పేషంటు వేరే వూరికి వెళిపోవడంతో ఈమెకున్న ఇతర సమస్యలకు చికిత్స తీసుకోలేదు.

స్కాల్ప్(తలపై చర్మము) సోరియాసిస్ 11569...India

ఒక 50 ఏళ్ళ మహిళ, తల వెనుక భాగంలో స్కాల్ప్ సోరియాసిస్ (తెల్ల పొరలు) సమస్యతో గత పదేళ్ళగా భాధపడుతోంది. ఈమెకు ఈ కింద వ్రాసిన మందులు ఇవ్వడం జరిగింది:
#1. CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC21.10 Psoriasis…TDS in water

#2. CC21.10 Psoriasis …TDS in water పై పూతకు

మూడు రోజుల తర్వాత కొద్దిపాటు ఉపశమనం మాత్రమే కలిగింది. అందువల్ల #1 మోతాదును పెంచడం జరిగింది - ప్రతిరోజు, ఒక గంట వరకు, పది నిమిషాలకు ఒక డోస్. ఈ విధంగా ఒక వారం రోజులు మందు తీసుకోవడంతో, ఈమెకు సోరియాసిస్ 90% వరకు తగ్గింది. #1 మరియు #2 ఒక నెల వరకు TDS మోతాదులో తీసుకోవడం జరిగింది. ఈ విధంగా తీసుకోవడంతో ఈ పేషంటు కున్న సోరియాసిస్ సమస్య పూర్తిగా తగ్గిపోయింది. అందువల్ల #2 మందును ఆపివేయడం జరిగింది. 2015 ఆగస్ట్ కి ఈమె ఈ మందును రోగ నివారణ కొరకు రోజుకొకసారి (OD) తీసుకుంటోంది.

వాడిపోతున్న మొక్క 11569...India

క్రమంగా నీరు పోస్తున్నప్పడికి, ఇంట్లో పెరిగే ఒక మొక్క యొక్క ఆకులు, గత నెల రోజులుగా వాడిపోతున్నాయి(ఎడమ పక్క ఫోటో చూడంది). ఈ మొక్కకు ఈ కింద వ్రాసిన టానిక్ ఇవ్వబడింది:
CC1.2 Plant tonic…in water

ఒక్క డోసు ఇచ్చిన 24 గంటలు తర్వాత ఈ మొక్క పూర్తిగా కోలుకుంది (కుడి పక్క ఫోటో చూడండి-ఈ ఫోటో టానిక్ ఇచ్చిన మరుసటి రోజు తీసినది)

 

కాళ్ళపై కురుపులు మరియు దురద 11570...India

2015 ఏప్రిల్ 27 న, ఒక పేద కుటుంభానికి చెందిన ఒక 11 ఏళ్ళ బాలుడు, కాళ్ళ పై కురుపులు మరియు దురద సమస్యతో  అభ్యాసకురాల్ని సంప్రదించడానికి తీసుకురాబడ్డాడు. ఈ బాలుడు, ఈ సమస్యతో గత ఆరు నెలలుగా భాధపడుతున్నాడు. ఒక అల్లోపతి డాక్టర్ ఇంజక్షేన్స్ ఇవ్వడంతో ఈ సమస్య తగ్గుతుందని వాగ్దానం చేసారు కాని, సఫలితం లభించలేదు. ఈ పేషంటుకు ఈ మందులు ఇచ్చారు:
#1. CC12.2 Child tonic + CC21.2 Skin infections + CC21.11 Wounds & Abrasions…TDS

#2. CC21.2 Skin infections + CC21.11 Wounds & Abrasions …BD కొబ్బరి నూనెలో పై పూతకు

15 రోజుల తర్వాత 50% వరకు తగ్గి, ఆపై నెల రోజుల తర్వాత 90% ఉపశమనం కలిగింది.

దీని తర్వాత, ఈ పేషంటు వేసవి సెలవులకు తన గ్రామానికి వెళిపోవడంతో, చికిత్స తీసుకోవడం ఆగిపోయింది. జూన్ 28 న ఈ పేషంటు ను తిరిగి అభ్యాసకురాల్ని సంప్రదించడానికి తీసుకు వచ్చారు. ఈ రోగి కుడి కాలిపిక్క భాగములో ఉన్న కురుపులు మరియు దురద తగ్గిపోయాయి. కాని ఇతని కుడి కాలి తొడపై మరియు ఎడమ కాలిపై కొత్తగా మొదలైన కురుపులు కనబడ్డాయి(కింద ఇవ్వబడిన ఫొటోస్ చూడండి)

ఈ పేషంటుకు #2 చర్మంపై పూయడానికి మరియు ఈ కింద వ్రాసిన మందులు ఇవ్వడం జరిగింది:
#3. CC12.2 Child tonic + CC17.2 Cleansing + CC21.2 Skin infections + CC21.11 Wounds & Abrasions…TDS

ఈ చికిత్స తీసుకున్న ఆరు రోజుల తర్వాత ఈ బాలుడుకి పుల్ అవుట్ (తీసివేత) వచ్చింది. పుల్ అవుట్ లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పటికీ, భరించగాలిగేలా ఉండడంతో చికిత్సను కొనసాగించారు.దీని తర్వాత, ఈ బాలుడుకి చర్మ అంటువ్యాధి నెమ్మదిగా తగ్గడం మొదలయింది. ఆరోగ్యరక్షణ మరియు   పరిశుద్ధత కొరకు,ఈ బాలుడు వాడుతున్న టవల్ను మరియు దుస్తులను, క్రిమినాశక ద్రవ్యం వేసిన నీటిలో ఉతకడం మాత్రమే కాకుండా విడిగా ఉంచమని  పేషంటు తండ్రికి సలహా ఇవ్వబడింది.

చికిత్స ప్రారంభించిన మూడు నెలల తర్వాత, 2015 ఆగష్టు 2న ఈ బాలుడుకి పూర్తి ఉపశమనం కలిగింది. అంటువ్యాధి కారణంగా రంగు మారిన ఇతని చర్మం సాధారణ రంగులో కనబడింది.(కింద ఇచ్చిన ఫోటోను చూడండి) ఈ పేషంటుకు #1 మరియు #2 మరో నెల రోజులు తీసుకోమని చెప్పబడింది.

అభ్యాసకురాలి వ్యాఖ్యానం:
ఇంత ఉత్తమమైన సేవ చేసే అవకాశాన్ని ప్రసాదించినందుకు నా కృతజ్ఞ్యతలు.

 
 

అజీర్ణం, క్లమిడియా, రుతువిరతి మరియు నోటిలో బొబ్బలు 11572...India

2015 ఏప్రిల్ 29న ఒక 49 ఏళ్ళ మహిళ గత మూడు సంవత్సరాలుగా భాదపడుతున్న అనేక రోగ సమస్యలతో, అభ్యాసకురాల్ని సంప్రదించింది. ఈమెకున్న సమస్యలు: అజీర్ణం, కడుపు ఉబ్బరం, ఆహార ఎలేర్జీలు,  క్లమిడియా మరియు రుతువిరతి కారణంగా వజిన పొడిగా ఉండడం, శరీరంలో హటార్తుగా పెరిగే ఉష్ణం మరియు కున్గుపాటు.

ఈమెకు ఆహారం తీసుకున్న వెంటనే నోటిలో బొబ్బలు వచ్చేవి. ఆహారంలో ఉప్పుని తప్ప వేరే ఏ పదార్థాన్ని చేర్చిన ఈమెకు నోటిలో బొబ్బలు వచ్చేవి.  అజీర్ణ సమస్య కారణంగా ఈమెకు తలనొప్పి మరియు వాంతులు సమస్య కూడా ఉండేది. ఈమె అనేక అల్లోపతి మందులు వాడినప్పడికి ఫలితం లభించలేదు. ఈ పేషంటుకు ఈ క్రింద వ్రాసిన మందులివ్వడం జరిగింది

మలభద్ధకమ్, క్లమిడియా మరియు రుతువిరతి సమస్యలకు:
#1. CC4.4 Constipation + CC8.5 Vagina & Cervix + CC8.6 Menopause…TDS

కడుపుబ్బరం మరియు నోటిలో బొబ్బలు సమస్యకు:
#2.CC4.5 Ulcers + CC4.10 Indigestion + CC11.5 Mouth infections + CC21.2 Skin infections + CC8.1 Female tonic…TDS

నోటిలో బొబ్బలుకు, పై పూత:
#3. CC11.5 Mouth infections + CC21.2 Skin infections…as needed

ఈ మందులు తీసుకున్న పది రోజులకి పేషంటుకు చాలా ఉపశమనం కలిగింది. నోటి బొబ్బలు చాలా వరకు తగ్గిపోయాయి. ఇతర సమస్యలలో 20% వరకు ఉపశమనం కలిగింది.

ఈమెకున్న ఎలర్జీ సమస్యకు మందు ఇవ్వడం జరిగింది:
#4. CC4.10 Indigestion…as needed

రెండు వారాలలో ఈమెకున్న అజీర్ణ సమస్య పూర్తిగా నయమైంది. క్రమక్రమంగా ఈమెకున్న ఇతర సమస్యలన్నీ కూడను చికిత్స ప్రారంభించిన 8 వారాలికి పూర్తిగా తగ్గిపోయాయి. ఈమె ఆహారంలో కారం మరియు మశాలాలు చేర్చి తీసుకున్నప్పుడు నోటిలో బొబ్బలు వస్తున్నాయి. ఈమె వైబ్రియానిక్స్ మందుల్ని తీసుకోవడం ఇప్పడికి కొనసాగిస్తోంది. ఏ విధమైన దుష్ప్రభావాలు లేనందువల్ల, వైబ్రియానిక్స్ చికిత్స తీసుకోవడం ఈమెకు ఎంతో సౌఖర్యంగా ఉంది.

ఒళ్ళు నొప్పులు, మానసిక దాడులు, మరియు తక్కువ రక్తపోటు 11573...India

2015 ఏప్రిల్ 23 న, ఒక 64 ఏళ్ళ ఉద్యోగం విరమించిన ఒక విధుత్ కార్మికుడు,తన భార్యా మరియు కుమారుల సహాయంతో అభ్యాసకుడిని సంప్రదించారు. ఇరవై సంవత్సరాలుగా, ఈ పేషంటుకున్న సమస్యలు: శరీరమంతా వాపు మరియు నొప్పులు, సక్రమంగా లేని మూత్ర విసర్జన, ఉదాసేనత మరియు అతి తక్కువ ఆహారం తీసుకోవడం వంటివి. ఇంతేకాకుండా, ఇతనికి గతంలో ఒక విద్యుత్ స్థంభం నుండి పడిపోవడం కారణంగా, కుడి కాలు ఫ్రాక్చర్ అయ్యి ఆపరేషన్ చేశారు. గత 35 సంవత్సరాలుగా ఇతనికి వినపడక పోయినా, రెండేళ్ళ క్రితమే ఇతనికి వినికిడి అమర్చబడింది. ఇతనికి 15 ఏళ్ళ క్రితం అప్పెండిసయిటిస్ ఆపరేషన్ కూడా అయ్యింది. ఇంతే కాకుండా 13 ఏళ్ళ క్రితం ఇతనికి మెదడులో రక్తస్రావము కారణంగా పక్షవాతం వచ్చింది. ఈ పేషంటుకు ఆపుడప్పుడు పీడకలలు, కున్గుపాటు వంటి మానసిక సమస్యలు కూడా ఉండేవి. సంప్రదింపు సమయంలో ఈ పేషంటులో చాలా ఆందోళన మరియు తనలో తానే మాటలాడుకోవడం వంటి లక్షణాలు కనిపించాయి. ఈ పేషంటు ఒళ్ళు నొప్పులు కారణంగా, ఒకటే స్థానంలో ఎక్కువ సమయం వరకు కూర్చోలేకపోయాడు. ఈ రోగికి ఏ విధమైన అల్లోపతి మందులు పని చేయనందు వల్ల అభ్యాసకుని ఉపశమనం కొరకు సంప్రదించారు. ఈ వ్యక్తికి ఈ క్రింద వ్రాసియున్న మందులివ్వడం జరిగింది:
#1. CC3.6 Pulse irregular + CC3.7 Circulation + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.2 Psychiatric disorders + CC17.3 Brain & Memory tonic + CC18.5 Neuralgia + CC20.2 SMJ pain + CC20.4 Muscles & Supportive tissue…in water, every 10 minutes for 2 hours, then 6TD ఉపశమనం కలిగే వరకు

ఒక వారం రోజులలో, ఈ రోగి ఆరోగ్యంలో మెరుగు ఏర్పడింది. ప్రస్తుతం, ఈ రోగికున్న శరీర వాపు మరియు నొప్పి పూర్తిగా తగ్గి, హాయిగా నిద్రించగలుగుతున్నాడు. ఇతనికి ఇష్టమైన ఆహారాన్ని అడిగి తింటున్నాడు. ముఖ్యంగా చాలా కాలం తర్వాత ఆనందంగా జీవిస్తున్నాడు.

ఈ పేషంటుకు 15 రోజుల తర్వాత, తక్కువ రక్త పోటు సమస్య రావడంతో తిరిగి అభ్యాసకుడిని సంప్రదించడం జరిగింది (పేషంటు కుటుంభ సభ్యులు ఈ సమస్య గురించి మొదటి సంప్రదిమ్పులో చెప్పలేదు). ఈ సమస్యకు మందు విడిగా ఇవ్వబడింది:
#2. CC3.2 Bleeding disorders + #1...QDS

ఒక నెల తర్వాత, పేషంటుకున్న సమస్యలకు చాలా వరకు ఉపశమనం కలిగింది. ఆపై 15 రోజులకు మందుల మోతాదును TDS కి తగ్గింఛి, 2015 జూలై లో మోతాదును BD కి తగ్గించడం జరిగింది. 2015 ఆగస్ట్ కి ఈ పేషంటు పూర్తిగా కోలుకున్నాడు. ప్రస్తుతం #2 మందును రోజుకి ఒకసారి (OD) తీసుకుంటున్నాడు. వైబ్రియానిక్స్ చికిత్స కారణంగా నయం కావడం వల్ల ఈ పేషంటు యొక్క డాక్టర్ అల్లోపతి మందుల మోతాదును తగ్గించి, ఆపై పూర్తిగా ఆపివేశారు.

వైరల్ జ్వరం 11573...India

అభ్యాసుడు వ్రాస్తున్నారు: 9 సంవత్సారాలు వయస్సున్న మా చిన్న అమ్మాయికి స్కూల్ లో పరీక్షలు జరుగుతుండగా ఈ క్రింద రాసిన రోగ లక్షణాలు మొదలయ్యాయి: దగ్గు,తలనొప్పి, గొంతు నోప్పి, మరియు జలుబు. నేను ఈ క్రింద వ్రాసిన మందులను తయారు చేసిచ్చాను:
#1. CC9.2 Infections acute + CC11.3 Headaches + CC12.2 Child tonic + CC19.2 Respiratory allergies…TDS 

పాప నిద్రపోవడానికి ముందు రెండు డోసులు ఇచ్చాను. కాని అర్ధరాత్రివేళ జ్వరం మరియు దగ్గు తీవ్రమైనందు వల్ల మందును ఈ క్రింద వ్రాసిన విధంగా మార్చాను:
#2. CC9.2 Infections acute + CC11.3 Headaches + CC12.2 Child tonic + CC19.2 Respiratory allergies + CC19.3 Chest Infections chronic + CC19.6 Cough chronic …in water every 10 minutes from midnight to 2 am

ఈ విధంగా మందును ఇవ్వడంతో పాపకు పూర్తిగా నయమై, పొదున్న స్కూల్కి వెళ్లి పరీక్ష వ్రాయగలిగింది.మరో వారం రోజులకు మందివ్వడం కొనసాగించాను. 

డయాబెటిస్ 11573...India

ఒక ఉత్సాహమైన 47 ఏళ్ళ మహిళ, ఈ క్రింద వ్రాసిన పలు సమస్యలతో అభ్యాసకుడిని సంప్రదించింది

18 ఏళ్ళ క్రితం హోమియోపతి మందుల మోతాదు ఎక్కువవ్వడం వలన కలిగిన రక్తశ్రావం (మెదడులో). అదృష్టవశాత్తూ ఈ సమస్యనుండి కోలుకుంది. ఇది జరిగిన ఏడాది తర్వాత ఈమ్కు బినయిన్ సర్వయికల్ ట్యూమర్ ఉందని నిర్దారించబడింది. ఈమె, కాళ్ళు మరియు చేతులలో వాపు, నొప్పులు మరియు తిమ్మిరివాయువు వంటి సమస్యలకు అల్లోపతి మందులు ఉపయోగిస్తోంది. 15 ఏళ్ళ క్రితం, ఈమెకు డయాబెటిస్ ఉందని తెలియడంతో మరియు ఈమె  బ్లడ్ షుగర్ స్థాయి అదుపులో లేనందువల్ల  ఇన్స్యులిన్ తీసుకుంటోంది. ఈమెకు ఈ మందులు ఇవ్వడం జరిగింది:

డయాబెటిస్ కు:
#1. CC6.3 Diabetes + CC12.1 Adult tonic…TDS

12 రోజుల చికిత్స తర్వాత (15 ఏప్రిల్ 22న), పదిహేనేళ్ళలో మొదటి సారిగా ఈమె బ్లడ్ షుగర్ నియంత్రిత స్థాయిలో ఉందని అభ్యాసకునికి తెలియచేసింది. దీని కారణంగా ఈమె తీసుకుంటున్న ఇన్స్యులిన్ డోస్ను డాక్టర్ తగ్గించారు. దీని తర్వాత పేషంటుకు ఈ క్రింద వ్రాసియున్న మందులివ్వడం జరిగింది

వాపు, నొప్పి మరియు తిమ్మిరివాయువు సమస్యకు:
#2. CC3.7 Circulation + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue…TDS

2015 ఆగస్ట్ కి ఈ పేషంటుకు వాపు మరియు తిమ్మిరివాయువు సమస్యనుండి పూర్తి ఉపశమనం కలిగింది. దీని కారణంగా #2 మందును ఆపడం జరిగింది. ప్రస్తుతం ఈ పేషంటు, బ్లడ్ షుగర్ నియంత్రణ కొరకు #1 మందునుతీసుకోవడం కొనసాగిస్తోంది.

మైగ్రేన్లు (పార్శ్వం నొప్పి), అధిక రక్తపోటు, హెమరాయిడ్లు(మూలవ్యాధి/పయిల్స్) 11573...India

2015 మే లో ఒక 73 ఏళ్ళ వృద్ధుడు, ఆయనకు దీర్ఘ కాలంగా ఉన్న మైగ్రేన్ తలనొప్పి సమస్య నివారణ కొరకు అభ్యాసకుడిని సంప్రదించారు. ఈ పేషంటు యొక్క ఇతర కుటుంభ సభులకు కూడా ఈ సమస్య ఉందని చెప్పారు. పేషంటు తన రోగ చరిత్ర వివరాలను పూర్తిగా ఇవ్వడానికి నిరాకరించారు. ఈ పేషంటు చాలా చురుకుగా ఉన్నారుగాని, ఆయన కుటుంభంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ఇయ్నకు ఈ మందులను ఇచ్చారు:
#1. CC11.4 Migraines + CC15.1 Mental & Emotional tonic…TDS

ఒక నెల గడిచినా, ఈ రోగికి ఉపశమనం కలుగలేదు, పైగా ఇయనకు అధిక రక్తపోటు సమస్యకూడా మొదలయింది. ఒక రోజు ఈ పేషంటు అభ్యాసకుడిని సంప్రదించి తను గత రెండేళ్ళగా హెమర్రాయిడ్ల( రక్తస్రావంతో కూడిన మూలవ్యాధి/పయిల్స్) సమస్యతో భాధపడుతున్నట్లు చెప్పారు.అనేక చికిత్సలు చేయించుకుని కూడా సఫలితం లేకపోయిందని చెప్పారు. ఈ రోగికి క్రింద వ్రాసిన మందులను ఇవ్వడం జరిగింది:
#2. CC3.2 Bleeding disorders + CC3.3 High Blood Pressure (BP)  + CC4.4 Constipation + CC10.1 Emergencies + CC11.4 Migraines + CC15.1 Mental & Emotional tonic…TDS

మరుసటి రోజు, రక్త స్రావం తగ్గిపోయింది. ఇయ్నకున్న మైగ్రేన్ మరియు అధిక రక్త పోటు సమస్యలు కూడా తగ్గి, ఉపశమనం కలిగింది. మరో రెండు రోజులలో ఈ రోగికున్న హెమర్రాయిడ్ల సమస్య పూర్తిగా నయమైంది. ఇయన దృక్పథంలో కూడా మార్పు వచ్చింది. 15 రోజుల చికిత్స తర్వాత ఈ రోగి యొక్క మైగ్రేన్ మరియు అధిక రక్త పోటు సమస్యలు పూర్తిగా తగ్గాయి. ఈ రోగికి CC10.1 Emergencies కాంబోను ఇవ్వడం ఆపి, ఈ క్రింద వ్రాసిన మందులు ఇవ్వడం జరిగింది:
#3. CC3.2 Bleeding disorders + CC3.3 High Blood Pressure (BP)  + CC4.4 Constipation + CC11.4 Migraines + CC15.1 Mental & Emotional tonic…BD

2015 ఆగస్ట్కి, ఈ పేషంటుకు CC3.2 Bleeding disorders కాంబోను ఆపి ,ఈ క్రింద వ్రాసిన మందు ఇవ్వడం జరిగింది:
#4. CC3.3 High Blood Pressure (BP)  + CC4.4 Constipation + CC11.4 Migraines + CC15.1 Mental & Emotional tonic…BD

భవిష్యత్తులో ఈ రోగికి మందు యొక్క మోతాదు క్రమంగా తగ్గించ బడుతుంది.

అభ్యాసకుని వ్యాఖ్యానం:
రోగి, తన రోగ చరిత్ర వివరాలను, అభ్యాసకులకి పూర్తిగా అందించడం చాలా ముఖ్యం.

గొంతు నొప్పి, దగ్గు మరియు బొంగురు గొంతు 11574...India

ఒక 75 ఏళ్ళ గాయకుడు, రెండు వారాలుగా భాదపడుతున్న గొంతు నొప్పి, దగ్గు మరియు బొంగురు గొంతు సమస్యలతో అభ్యాసకుడిని సంప్రదించారు. ఇయ్నకు ఈ మందులను ఇచ్చారు:
CC19.6 Cough chronic + CC19.7 Throat chronic...TDS

రెండు డోసుల తర్వాత, ఇయ్నకు కఫం అంతా బైటికి రావడంతో, బొంగురు గొంతు సమస్య తగ్గింది. రెండు వారాలు ఈ చికిత్సను తీసుకోవడంతో, ఈ రోగి సమస్యలన్నీ పూర్తిగా తగ్గాయి.

దీర్ఘ కాలిక గొంతు నొప్పి, చీలమండ నొప్పి మరియు హాట్ ఫ్లష్లు (రుతువిరతి సమయంలో శరీరంలో పెరిగే వేడి) 11964...India

ఒక 54 ఏళ్ళ మహిళ, గొంతులో అంటువ్యాధి, చీలమండ నొప్పి మరియు అప్పుడప్పుడు శరీరంలో వేడి పెరగడం(రుతువిరతి) సమస్యలతో, అభ్యాసకుడిని సంప్రదించింది. ఈ పేషంటు, గత ఇరవై ఏళ్ళగా దగ్గు, గొంతు నొప్పి, గొంతులో దురద మరియు బొంగురు గొంతు సమస్యలతో భాదపడుతోంది. ఆహారం తీసుకున్న తర్వాత, ఈమెకు గొంతులో ఒక గడ్డ ఉన్నట్లుగా అనిపించేది. ఈమెకు పుల్లని పదార్థాల ఎలర్జీ ఉండేది. ఈ మహిళ, గొంతులో సమస్య తీవ్రమైనప్పుడల్లా అల్లోపతి మందులు(ఆంటి ఎలర్జిక్) తీసుకునేది. ఈ మందుల వల్ల, ఈమెకు తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలిగేది. ఈమెకు గత నాలుగేళ్ళగా, అరికాలి ఫేసియైటిస్ కారణంగా చీలమండ నొప్పి ఉండేది. ఈ సమస్యకు కూడా ఈమె, అల్లోపతి మందులు తీసుకునేది. గత రెండేళ్ళగా ఈమెకు హాట్ ఫ్లష్ల(రుతువిరతి సమయంలో శరీరంలో వేడి పెరగడం) సమస్య కూడా మొదలయింది. ఇన్ని వ్యాధి సమస్యల కారణంగా, ఈమె మానసికంగా చాలా కుంగిపోయింది. వైబ్రియానిక్స్ చికిత్స ప్రారంభించే సమయంలో ఈమె వేరే ఏ మందులు తీసుకోవట్లేదు. 2014 డిసంబర్ 10న, ఈమెకు ఈ క్రింద వ్రాసిన మందులు ఇవ్వబడినాయి

అరికాలి ఫేసియైటిస్, దగ్గు మరియు హాట్ ఫ్లష్ల సమస్యలకు:
#1. NM3 Bone I + NM6 Calming + NM8 Chest + NM10 Climacteric + NM32 Vein Piles + NM36 War...TDS

నొప్పి మరియు దీర్ఘ కాలిక గొంతు సమస్యలకు:
#2. NM59 Pain + NM71 CCA...6TD

ఏడో రోజున, ఈ పేషంటుకు చీలమండ నొప్పి మరియు హాట్ ఫ్లష్ల సమస్య 75% వరకు తగ్గి, గొంతు సమస్య 50% వరకు తగ్గింది. #2 మందు మోతాదును TDS కి తగ్గించడం జరిగింది. ఒక నెల రోజులలో, ఈ మహిళకు ఆరోగ్యం 80% వరకు మెరుగు పడడంతో చాలా ఆనందంగా కనిపించింది. ఆమెకున్న నొప్పి మరియు గొంతులో గడ్డ ఉన్న స్పృహ కూడా తగ్గింది. అభ్యాసకుడు ఈ దశలో, ఈ పేషంటు కు #1 మరియు #2 మందులను మార్చివ్వడం జరిగింది. ఈమెకు కొత్తగా ఇచ్చిన కాంబోలో, NM8 Chest and NM71 CCA  ఆపి, ఈమెకున్న దీర్ఘకాలిక సమస్యలకు మరియు బలానికి, NM2 Blood and SM40 Throat చేర్చివ్వడం జరిగింది:
#3. NM2 Blood + NM3 Bone I + NM6 Calming + NM10 Climacteric + NM32 Vein Piles + NM36 War + NM59 Pain + SM40 Throat...TDS

రెండు నెలల తర్వాత, నొప్పి తగ్గడంతో పాటు, ఈమెకున్న గొంతు సమస్యలు కూడా తగ్గిపోయాయి. హాట్ ఫ్లష్ల సమస్య కూడా చాలా  వరకు నయమైంది. పేషంటుకు నొప్పి మరియు ఇన్ఫక్షన్ తగ్గడంతో, NM2 Blood, NM36 War and NM59 Pain ఆపడం జరిగింది. ఇతర దీర్ఘ కాలిక సమస్యలకు ఈ మందు ఇవ్వడం జరిగింది:
#4. NM3 Bone I + NM6 Calming + NM10 Climacteric + NM32 Vein Piles + SM40 Throat...TDS 

చికిత్స ప్రారంభించిన మూడు నెలల్లో, ఈ పేషంటుకున్న రోగ లక్షణాలన్నీ తొలగి, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందింది. ఇప్పుడు ఈ మహిళ, పుల్లని పళ్ళను కూడా తినగలుగుతోంది. 2015 జూలై కి, ఈమెకు ఏ విధమైన రోగ లక్షణాలు లేవు. ప్రస్తుతం మందును,రోజుకి ఒకసారి(OD) తీసుకుంటోంది. ఈమెకు కలిగిన ఉపశమనాన్ని చూసి, ఈమె కుటుంభ సభ్యులందురు కూడను, వైబ్రియానిక్స్ చికిత్సను తీసుకోవడం ప్రారంభించారు.

పేషంటు యొక్క వ్యాఖ్యానం:
నేను దాదాపు ఇరవై సంవత్సరాలు, తీవ్రమైన గొంతు సమస్యలతో భాధపడేదాన్ని. నాకు దగ్గు ఎక్కువగా వస్తుండేది మరియు నాకు, ప్రతిసారి ఆహారం తీసుకున్న తర్వాత గొంతులో ఏదో ఒక గడ్డ/ముద్ద ఉన్నట్లు అనిపించేది. కొంచం మాట్లాడినా, దగ్గు వచ్చేది. క్రమంగా నా గొంతు బొంగురు పోయి, పుల్లని పదార్థాలు, కోల్డ్ డ్రింక్లు తీసుకోవడం మానాల్సి వచ్చింది. అల్లోపతి మందులు తీసుకోవడం వల్ల తాత్కాలికంగా మాత్రమే ఉపశమనం కలిగేది. ఇంతే కాకుండా, నాకు అరికాలి ఫేసైటిస్ సమస్య కారణంగా, చీలమండలో తీవ్రమైన నొప్పి ఉండేది. ఈ సమస్యలతో పాటు రెండేళ్ళ క్రితం, హాట్ ఫ్లష్ల సమస్య మొదలవ్వడంతో, చాలా ఆందోళన పడ్డాను, మానసికంగా కుంగిపోయాను.

2014 డిసంబర్ 10 న, నా భర్త ద్వారా, ఈ మహత్తరమైన సాయి వైబ్రియానిక్స్ చికిత్సను బహుమతిగా పొందాను. ఆ రోజునుండి నా జీవితంలో, చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. గత ఇరవై ఏళ్ళుగా, నేనెప్పుడు ఇంత ఆనందంగా లేను. నేను ఈ చికిత్సను ప్రారంభించి ఆరు నేలలయ్యాయి. నేనిప్పుడు ఎంతో స్వేచ్చగా నాకిష్టమైన కోల్ డ్రింకులు మరియు పుల్లని పదార్థాలు ఆరగించా గలుగుతున్నాను. చీలమండ నొప్పి తగ్గడంతో నేను అన్ని రకాల పాద రక్షలు ధరిస్తున్నాను. నేను ప్రస్తుతం, మందులు తయారు చేయడం ద్వారా, సాయి వైబ్రియానిక్స్ సేవా కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నాను. మా కుటుంభ సభ్యులందరు కూడను వైబ్రియానిక్స్ చికిత్సనే తీసుకుంటున్నారు. నేను ఈ చికిత్స విధానంలో శిక్షణ పొంది, అభ్యాసం చేయాలని అనుకుంటున్నాను.

మస్తిష్క క్షీణత మరియు డిప్రషన్ 11964...India

అనేక రుగ్మతలతో భాదపడుతున్న, ఒక 82 ఏళ్ళ వృద్ధుడు 2015 జనవరి 14 నుండి, తన రోజువారి కార్యకలాపాలను మానేశారు. ఆహారం తీసుకోవడానికి  మరియు మందులు వేసుకోవడానికి  కూడా తిరస్కరించారు. ఈ పేషంటు జ్ఞ్యాపక శక్తిని కోల్పోవడంవల్ల, ఎవరిని గుర్తుపట్ట లేకపోయారు.ఈ వ్రుద్దుడును ఆశ్పత్రి లో చేర్చారు. ఆశ్పత్రిలో చేర్చాక, ఈ వ్రుద్దుడుకి మస్తిష్క క్షీణత, తీవ్రమైన కలవరపాటు, చిత్తవైకల్యం వంటి రోగ సమస్యలు ఉన్నట్లు నిర్ధారించారు. ఆశ్పత్రిలో ఉండగా ఈ రోగి యొక్క పరిస్థితి మరింత క్షీణించింది. మందులు వేసుకోవడానికి పేషంటు అంగీకరించే వారు కాదు. 15 రోజుల తర్వాత,డాక్టర్లు ఈ పేషంటుకు నయం కావడం అసాధ్యమని ఆశ్పత్రి నుండి డిశ్చార్జ్ చేశారు.

2015 ఫెబ్రవరి 5 న, ఈ పేషంటు యొక్క కుమారుడు అభ్యాసకుడిని సంప్రదించి, కళ్ళు కూడా తెరవడం మానేసిన తన తండ్రిని ఇంటికొచ్చి చూడవలసినదిగా కోరారు. అభ్యాసకుడు పేషంటుతో ఏకాంతంగా మాట్లాడారు. అభ్యాసకుడు ఉత్సాహంగా పేషంటుతో మాట్లాడుతూ, ప్రేమగా పట్టుభట్టడంతో, పేషంటు కళ్ళు తెరచి, తనకు శరీరమంతా విపరీతమైన నొప్పులుగా ఉందని చెప్పారు. స్వామి దయ వల్ల ఈ పేషంటు అభ్యాసకుడిచ్చిన విభూతిని స్వీకరించి వైబ్రో మందులను తీసుకోవడానికి అంగీకరించారు. ఈ క్రింద వ్రాసిన మందులను ఈ పేషంటుకు ఇవ్వడం జరిగింది

కలవరపాటు, చిత్తవైకల్యం మరియు నిరాశ సమస్యలకు:
#1. NM2 Blood + NM5 Brain TS + NM6 Calming + NM7 CB7 + SR268 Anacardium + SR425 Clematis + SR344 Avena Sat + SR428 Gorse…TDS

బలహీనత:
#2.  SM41Uplift…6TD

సానుకూల వాతావరణం కోసం:
#3.  CC15.1 Mental & Emotional tonic + CC17.3 Brain & Memory tonic…TDS in water (నీటిలో కలిపి పేషంటు యొక్క గదిలో మరియు మంచం చుట్టూ జల్లడానికి)

ఈ మందులు తీసుకున్న మూడవ రోజు, ఈ పేషంటు తన మంచం నుండి చాలా కాలం తర్వాత కిందకి దిగారు. పది రోజుల తర్వాత ఆహారం తీసుకోవడం ప్రారంభించారు. మరో ఐదు రోజుల తర్వాత, పేషంటు టాయిలెట్ కి, ఎవరి సహాయం లేకుండా వెళ్ళగలిగారు. తన చుట్టూ ఉన్నవారిని గుర్తుపట్టడం మరియు ఆహారం తీసుకోవడానికి డయినింగ్ టేబుల్ వద్దకు తనంతట తానే రావడం వంటి మార్పులు ఈ పేషంటు లో వచ్చాయి. ఈ మార్పులను చూడడం ద్వారా అభ్యాసకుడు, దివ్యశక్తి యొక్క మహిమను మరియు వైబ్రో మందుల సామర్ధ్యాన్ని పూర్తిగా గ్రహించారు. రోగియొక్క కుటుంభ సభ్యులందరు కూడను ఈ మహిమను చూసి ఆనందించారు.   

చికిత్స ప్రారంభించిన మూడు వారాలికి ఈ పేషంటు కు 80% ఉపశమనం కలిగింది. నలభై రోజుల తర్వాత, ఈ వృద్ధుడు తన రోగ సమస్యల నుండి పూర్తిగా కోలుకొని, ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొంది ఉత్సాహంగా జీవితాన్ని కొనసాగించారు.

ఆ తర్వాత, తన కుడి చేయి వనుకుతున్నట్లు ఈ రోగి చెప్పడంతో, #1 సీసాలో, NM43 Tremors చేర్చడం జరిగింది.

#4. NM43 Tremors + #1. 

#2 ను ఆపివేయడం జరిగింది.

రెండు వారాల తర్వాత, చేయి వణకడం సమస్య పూర్తిగా తగ్గింది. ప్రస్తుతం, రెండు నెలల వైబ్రో చికిత్సతో పూర్తిగా కోలుకున్న ఈ వృద్ధుడు ఆనందంగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. #4 మందును తీసుకోవడం కొనసాగిస్తున్నారు.

రోగి యొక్క కుమారుడిచ్చిన వ్యాఖ్యానం:

మా తండ్రిగారికి 2014 నవంబర్లో, అంతకుముందు అమర్చిన పేస్ మేకర్ ను (హృదయగతిప్రేరకం) తీసి కొత్త పేస్ మేకర్ను అమర్చడం జరిగింది. ఈ ఆపరేషన్ తర్వాత కోలుకుంటూ ఉండగా, మధ్యలో ఆయనకు జ్వరం వచ్చింది. ఆ తర్వాత మా తండ్రిగారు ఎవరిని గుర్తు పట్టలేక పోయేవారు.

ఆయనను తిరిగి ఆశ్పత్రిలో చేర్చాము. అక్కడ మా తండ్రికి మస్తిష్క క్షీణత, తీవ్రమైన కలవరపాటు, చిత్తవైకల్యం సమస్యలున్నట్లు నిర్దారించడం జరిగింది. మా తండ్రి మందులు వేసుకోవడానికి కాని ఆహారం తీసుకోవడానికి కాని సహకరించ లేదు. 15 రోజుల తర్వాత, ఏ విధమైన అభివృద్ధి లేకపోయేసరికి డాక్టర్లు ఆయనను డిశ్చార్జ్ చేశారు. ఇంట్లో మా తండ్రిగారు ఏమి తినకుండా, కళ్ళు కూడా తెరవకుండా పడుకొని ఉండేవారు. ఇది చూసి మేమెంతో కంగారు పడ్డాము.

ఆ తర్వాత ఒక రోజు మా తండ్రిగారి స్నేహితుడు, ఆయనను చూడడానికి వచ్చినప్పుడు, ఒక వైబ్రో అభ్యాసకుని వివరాలిచ్చి, అతనిని సంప్రదించ వలసిందిగా చెప్పారు. నేను వై బ్రియానిక్స్ గురించి అంతక ముందెప్పుడూ వినకపోయినా, మా తండ్రిగారికి ఉపశమనం కలిగించాలన్న ఆశతో ఈ అభ్యాసకుడిని సంప్రదించి మా తండ్రిగారి రోగ చరిత్ర వివరాల్ని చెప్పి, మా ఇంటికి వచ్చి మా తండ్రిగారికి చికిత్స ఇవ్వవలసినదిగా కోరాను. అభ్యాసకుడు వచ్చి చికిత్సను ప్రారంభించాక, మా జీవితంలో ఒక పెద్ద అద్భుతం జరిగింది. మా తండ్రిగారు రెండు నెలల్లో సంపూర్ణ ఆరోగ్యాన్ని తిరిగి పొందారు.

ఈ రోజు వరకు మా తండ్రిగారు ఏ విధమైన ఆరోగ్య సమస్యలు లేకుండా ఆనందంగా ఉన్నారు. నేను కూడా వైబ్రియానిక్స్ చికిత్సను తీసుకోవడం మొదలుపెట్టాను.

తీవ్ర భయాందోళన మరియు మూర్చ వ్యాధి 11964...India

2014 డిసంబర్ 30న, ఒక 28 ఏళ్ళ మహిళ, తను భాదపడుతున్న మనోవ్యాకులత, భయం, తీవ్రమైన తలనొప్పి మరియు పీడ కలలు వంటి మానసిక సమస్యల ఉపశమనం కొరకు అభ్యాసకుడిని సంప్రదించింది. ఈ పేషంటు తీవ్ర ఒత్తిడికి గురియై ఉంటుందని అనిపించింది. ఈమెకు ముందుగా మానసిక శాంతి కలిగించేందుకు ఈ కింద ఉన్న మందులను ఇవ్వడం జరిగింది

మానసిక శాంతికి:
#1. NM2 Blood + NM6 Calming + NM25 Shock + BR2 Blood Sugar…TDS

రెండు వారాల తర్వాత ఈమె అభ్యాసకుడిని మరళ సంప్రదించి తనకు మూర్చ వ్యాధి( ఫిట్స్ రావడం) ఉన్నట్లు చెప్పింది.ఈమెకు ఫిట్స్ తరచుగా వస్తాయని, అలా వచ్చినప్పుడు తన అదుపులో తాను ఉండటంలేదని, తను ధరించిన దుస్తులను చింపడం, ఎదుటివారి మీద వస్తువులను విసరడం వంటివి చేస్తున్నట్లు చెప్పింది.  ఫిట్స్ వచ్చి తగ్గిన తర్వాత, ఈమెకు మూడు లేదా నాలుగు గంటల వరకు తీవ్ర ఫ్రాన్టాల్ (తల ముందటి భాగం) తలనొప్పి వస్తుంది. అల్లోపతి మందులు తీసుకోవడానికి ముందు వారానికి ఒక సారి ఫిట్స్ వస్తూ ఉండేవి. ప్రస్తుతం ఈమె ఏ మందులు తీసుకోవడంలేదు. ఆ ముందు రోజు ఈమెకు ఆరు గంటల వ్యవధిలో రెండు సార్లు ఫిట్స్ వచ్చాయి. ఈమెకు ఈ కింద వ్రాసిన మందులు ఇచ్చారు:

ఫిట్స్ సమస్యకు:
#2. NM6 Calming + NM50 Epilepsy + NM78 Epilepsy-B + BR2 Blood Sugar + SR235 Bladder + SR240 Kidney + SR260 Mag Phos…TDS

ఫిట్స్ వచ్చినప్పుడు వాడడానికి (ఎమర్జెన్సీ మందు):
#3. NM91 Paramedic Rescue + NM95 Rescue Plus… every 15 minutes ఫిట్స్ వచ్చినప్పుడు, పేషంటుకు నయమయ్యేంత వరకు ఇవ్వాలి.

#2 యొక్క మొదటి డోస్ ను 2015 జనవరి 17 న, పేషంటు యొక్క నాలిక కింద వేయడం జరిగింది. మూడు రోజుల తర్వాత ఈమెకు 50% నయమైంది. తలనొప్పి పూర్తిగా తగ్గినట్లు చెప్పింది. కాని ఈమెకు విపరీతం నీరసంగా అనిపించడం కారణంగా, #2 మందుకు బదులు, ఈ కింద వ్రాసిన మందు ఇవ్వడం  జరిగింది:
#4. NM2 Blood + NM75 Debility + NM90 Nutrition + #2

రెండు వారాల తర్వాత ఈ పేషంటులో చాలా మార్పు కనిపించింది. తలనొప్పి మరియు ఫిట్స్ సమస్యలు నయం కావడంతో ఈమె చాలా ఉత్సాహంగా కనిపించింది. ఆపై రెండు వారాలు ఏ విధమైన రోగ లక్షణాలు లేకుండా ఉండడం కారణంగా, మందుల మోతాదును తగ్గించడం జరిగింది. ఆరు నెలల తర్వాత, ఈమె ఏ సమస్యలు లేకుండా ఉండడంవల్ల ఈమె సంరక్షణ కొరకు ఈ మందును రోజుకి ఒకసారి (OD) తీసుకొంటోంది: #4…OD.

ఈమెకు ఇంత త్వరలో ఉపశమనం కలుగడం తో, పేషంటు మరియు ఈమె కుటుంభ సభ్యులు చాలా ఆనందంగా ఉన్నారు. ఈమె ఇంటిలో క్రమం తప్పకుండా వై బ్రియానిక్స్ క్లినిక్ నిర్వహించ బడుతోంది.

పేషంటు యొక్క వ్యాఖ్యానం:

నేను ఢిల్లీలో మంగోల్పురి ప్రాంత నివాసిని. ఐదేళ్ళ క్రితం మా రెండో బిడ్డ పుట్టిన తర్వాత నాకు అనారోగ్యం మొదలైంది. ఏ కారణం లేకుండా నేను మూర్చ వచ్చి పడిపోయేదాన్ని. స్పృహలోకి వచ్చాక మా కుటుంభ సభ్యులనెవ్వరిని గుర్తు పట్టలేక పోయేదాన్ని. నన్ను ఢిల్లీ తీసుకు వెళ్లి అనేక రకాల చికిత్సలు చేయించారు. ఆరు నెలల తర్వాత మా కుటుంభ సభ్యులని గుర్తు పట్టేదాన్ని కాని మూర్చ వచ్చి పడిపోవడం సమస్య కొనసాగుతూనే ఉండేది. ఈ కారణంగా మా కుటుంభం వాళ్ళందరు చాలా ఆందోళన పడ్డారు.

2014 దిసంబర్లో, పూర్వ బాల వికాస్ విద్యార్ధి మరియు స్వామి భక్తుడైన నా భర్తను ఒక వైబ్రియానిక్స్ అభ్యాసకుడు కలిసి, మా ఇంటిలో ఒక వైబ్రో క్లినిక్ ప్రారంభించడానికి అనుమతి అడగడం జరిగింది. సత్యసాయి సేవా కార్యక్రమం అవ్వడంతో నా భర్త వెంటనే అంగీకరించారు. నా భర్త నా అనారోగ్యం గురించి అభ్యాసకుడికి చెప్పడం జరిగింది.

వైబ్రో మందులను తీసుకోవడం ప్రారంభించిన వెంటనే నా ఆరోగ్యంలో మెరుగు ఏర్పడింది. ఒక వారంలో నాకు ఫిట్స్ రావడం మరియు భయాందోళన వంటి సమస్యలు కూడా తగ్గిపోయాయి. పీడ కలలు లేకుండా నేను హాయిగా నిద్రించ గలిగాను. ఒక నెల రోజులలో నాకు పూర్తిగా ఉపశమనం కలిగింది.

నేను వైబ్రో చికిత్స తీసుకొని ఆరు నెలలు గడిచిపోయాయి. నేనిప్పుడు చాలా ఆరోగ్యంగాను ఆనందంగాను ఉన్నాను. నేను, మా కుటుంభ సభ్యులు, ఇంత అద్భుతమైన చికిత్సను మాకు ప్రసాదించినందుకు భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారికి మా కృతజ్ఞ్యతలు తెలుపుకుంటున్నాము. ప్రస్తుతం వారానికి మూడు సార్లు, మంగోల్పురి కాలనీలో, నిర్వహించ బడుతున్న వైబ్రో క్లినిక్లో ఇటువంటి అనేక  అద్భుతాలను చూడ గలుగు తున్నాము. ఇంత మహత్తరమైన సేవా కార్యక్రమానికి మా వంతు సహాయం మేము అందించ గలుగుతున్నందుకు మాకెంతో ఆనందంగా ఉంది.

అభ్యాసకురాలి వివరాలు 02859...India

ఈ విశేష భాగంలో ఢిల్లీలో విభిన్న సమూహాలకు చెందిన అభ్యాసకుల వివరాలు ప్రదర్శించ బడియున్నాయి. వీటిలో, ఇప్పటివరకు తమ అనుభవాలను మరియు దృక్పధాన్ని పంచుకుంటున్న ఆరుగురు కొత్త అభ్యాసకుల వివరాలు కూడా చేర్చబడ్డాయి. ఈ అభ్యాసకుల వివరాలను వ్యవస్థీకృత మరియు సంకలనం చేసిన ఢిల్లీ- NCR సమన్వయకర్త 02859...ఇండియా వివరాలతో ఈ భాగం ప్రారంభం అవుతోంది:

అభ్యాసకురాలు02859...ఇండియా వ్రాస్తున్నారు: నేను గత 28 సంవత్సరాలుగా ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రానిక్స్ భోధన చేస్తున్నాను. 2011 జూలై నుండి వైబ్రియానిక్స్ అభ్యాసం మొదలుపెట్టాను. అప్పటినుండి వివిధ తీవ్రమైన మరియు ధీర్గకాలిక రుగ్మతలను నయంచేసేందుకు అవకాశాలు వస్తున్నాయి. శిక్షణా శిబిరాలను (వర్క్ షాపులు) జరిపించడం మరియు ఢిల్లీ-NCR ప్రాంతంలో వివిధ వైబ్రియానిక్స్ కార్యకలాపాలను నిర్వహించడం నా వైబ్రియానిక్స్ సాధనలో భాగంగా ఉన్నాయి.

వైబ్రియానిక్స్ గురించి తెలుసుకునే ముందు నాకు సేవ చేయాలని ఒక బలమైన కోరిక ఉండేది కాని తగిన వేదిక దొరకలేదు. అలాంటి ఒక వేదికను వెతుకుతూ నేను వైబ్రియానిక్స్ శిక్షణను పొందాలని అనుకున్నాను. నా మొట్ట మొదటి పేషంటు మా బంధువులింటిలో పనిచేస్తున్న ఒక మహిళ. వాచిపోయి, చీము కారుతున్న పాదాలతో ఆమె కుంటుతూ నడవడం చూసాను. బాబాను మనసార ప్రార్థించుకుని ఆమెకు వైబ్రో మందును తయారు చేసిచ్చాను. ఒక వారంలో పాదాలలో వాపు మరియు చీము కారడం తగ్గి ఆమె సాధారణంగా నడవ సాగింది. అది చూసి నేను నమ్మలేక పోయాను. [సంపాదకుడి వ్యాఖ్యానం: పూర్తి కేసు వివరాలు "పంచుకో తగిన కేసులు" క్రింద ఇవ్వబడియుంది]. ఈ మహిళకు ఉపశమనాన్ని కలిగించడానికి నేనెలా ఒక సాధనగా ఎంచుకోబడ్డానన్న ఆలోచన నాలో కలిగింది. నా వైబ్రియానిక్స్ సాధనలో ఇప్పటివరకు ఇటువంటి క్షణాలు అనేకం. ప్రతీ సారి నేను " నేనెందుకు ఎంచుకోబడ్డాను?" అని ఆలోచిస్తాను. శిభిరాల్లో పాల్గొని అవసరమైన వారికి ఉపశమనాన్ని కలిగించడం ద్వారా నేను ఎంతో సంతృప్తిని మరియు ఆనందాన్ని పొందుతున్నాను. సేవ చేయాలన్న నా బలమైన కోరికను బాబా వైబ్రియానిక్స్ కార్యక్రమం ద్వారా తీర్చారు. బాబా చేస్తున్న అద్భుతాలతో జీవించడం నేర్చుకున్నాను.

 వైబ్రియానిక్స్ ప్రపంచంలో వివరించరాని విధములో అనేక అనుసంధానములు ఏర్పడుతున్నాయని నేను గమనించాను. ఉదాహరణకు ఒక సంఘటన: ఎనిమిదవ నెల గర్భిని అయిన ఒక సహోద్యోగికి దురద చాలా ఎక్కువగా ఉండేది. నా ఈమెయిల్స్ ను చూస్తుండగా, ఇదే సమస్యను సమర్థవంతంగా ఎలా నివారించారన్న ఒక అభ్యాసకుడు పంపిన వివరాలను చదవడం జరిగింది. ఇటువంటి అనేక సంఘటనలు బాబా ప్రేమను గుర్తు చేస్తాయి.

వైబ్రియానిక్స్, వేరొక స్థాయిలో, శాస్త్రానికి మరియు ఆధ్యాత్మికతకి మధ్య ఉన్న సంబoధం వాస్తవమైనదని నిర్ధారించే ఒక ఉత్తమ సాక్ష్యమని నేను భావిస్తున్నాను.  ఇది పరిశోధన చేయడానికి ఒక మనోహరమైన అంశం. " అందరిని ప్రేమించండి, అందరిని సేవించండి " అన్న బాబా మాటలను పాటించడానికి వైబ్రియానిక్స్ అభ్యసించడం ఒక ఉత్తమమైన మార్గం.

పంచుకుంటున్న కేసులు

అభ్యాసకుల వివరాలు 11569...India

అభ్యాసకురాలు 11569...ఇండియా ఎలెక్ట్రానిక్స్ లో పీ హెచ్ డీ చేసి ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేస్తోంది. ఈవిడ వ్రాస్తున్నారు: " సేవ చేయడం ద్వారా నేను ఎంతో సంతృప్తిని మరియు ఆనందాన్ని పొందుతున్నాను కాబట్టి, నేనొక ఉత్తమమైన ప్రయోజనం కోసం జన్మించానన్నది నా భావన. సేవ చేయడం నా అదృష్టమని భావిస్తున్నాను. శక్తియొక్క వైబ్రేషన్స్ (చక్రాలు) గురించి నాకున్న పరిచయం, ఆసక్తి కారణంగా, 2014 లో వైబ్రియానిక్స్ శిక్షణ పొందాలన్న ఆశక్తి నాకు కలిగింది. నాకు ఈ ఉన్నతమైన సేవా కార్యక్రమానికి పరిచయం చేసినది నా సహుధ్యొగైన అభ్యాసకురాలు02859...ఇండియా. ఆ సమయంలో కోల్పోయిన నా ఆరోగ్యాన్ని తిరిగి పొందుటకు నేను చాల ప్రయత్నం చేసేదాన్ని మరియు వైబ్రియానిక్స్ వలన నేను స్వస్థత పొందగలిగాను ". వైబ్రియానిక్స్ పేషంట్లకు చాలా సౌఖర్యంగా ను ఉపయోగకరంగాను ఉందని ఈమె భావన. వైబ్రియానిక్స్ టీంలో భాగంగా ఉన్నందుకు కృతజ్ఞ్యతలు తెలుపుకుంటోంది.

 పంచుకుంటున్న కేసులు

అభ్యాసకుల వివరాలు 11570...India

అభ్యాసకురాలు 11570...ఇండియా పబ్లిక్ రిలేషన్స్ లో మాస్టర్స్ పట్టా ఉన్నవారు.  ప్రభుత్వంలో పదవీ విరమణ తరువాత,ఆమె ప్రస్తుతం ఒక డిజిటల్ ప్రింటింగ్ వ్యాపారం నిర్వహిస్తోంది. 2015 ఏప్రిల్ లో వైబ్రియానిక్స్లో AVP గా శిక్షణ  పొందినప్పటి నుండి ఈమె ఉత్సాహంగా ఈ సేవను అందిస్తోంది. ఈమె వ్రాస్తున్నారు: "నేను చాలా మంది పేషంట్లకు చికిత్స చేసాను. జ్వరం, విరోచనాలు,నోటి పూత, కంటికి సెగ, ప్రయాణ అనారోగ్యం మరియు ఇతర సమస్యలు  బాబా కృప వల్ల  చాలావరకు రెండు మూడు రోజులలో నయమయ్యాయి. కొన్ని సమస్యలకు ఒకటే రోజులో ఉపశమనం కలిగింది.

మధుమేహం, థైరాయిడ్, దీర్ఘకాలిక దగ్గు, మూర్ఛ, నిరాశ, నిద్రలేమి, గోర్లు సమస్య, పగుళ్ళు, గాయాలు, చర్మ అలెర్జీలు , తీవ్రమైన దురద, పయిల్స్ , ఋతుచక్రం (నెలసరి) క్రమ పద్ధతిలో అవ్వకపోవడం వంటి ధీర్గకాలిక సమస్యలకు కూడా స్వామి దయవల్ల ఉపశమనం కలిగింది.

 పంచుకుంటున్న కేసులు

కాళ్ళపైన కురుపులు మరియు దురద

అభ్యాసకురాలి వివరాలు 11571...India

అభ్యాసకురాలు 11571...ఇండియా ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్. ఈమె 2015 ఏప్రిల్ నుండి వైబ్రియానిక్స్ అభ్యసించడం మొదలుపెట్టింది. ఇప్పటివరకు ఈ క్రింద వ్రాసియున్న సమస్యలకు ఈ  చికిత్సను ఇచ్చింది: జలుబు, ధీర్గకాలిక దగ్గు, ఋతుచక్రం (నెలసరి) క్రమ పద్ధతిలో అవ్వకపోవడం, గర్భిని స్త్రీకు చర్మంపై దురద, స్పాండిలైటిస్, బలహీన కంటి కండరాలు, జుట్టు సమస్యలు మరియు అజీర్ణం వంటివి. వైబ్రియానిక్స్ అందించే ప్రయోజనాలను తెలుసుకుని ఈమె ఒక గర్భినియై ఉండికూడా ఈ చికిత్సా విధానంలో ఉత్సాహంగా శిక్షణ పొందింది. ఆ తర్వాత ఆమెకు ఒక అమ్మాయి జన్మించింది. తన అనుభవాలని ఈ విధంగా వివరిస్తోంది:

 "నేను గర్భినిగా ఉన్నప్పుడు మూడో నెల చివరిలో, ఒక రోజు విపరీతమైన కడుపు నొప్పి మరియు వాంతులతో భాధపడ్డాను. మరుసటి రోజు నేను డాక్టర్ని సంప్రదించడానికి వెళ్ళిన సమయంలో కూడా కడుపులో నొప్పి తగ్గలేదు. డాక్టర్ అజీర్ణానికి మరియు నొప్పికి విడివిడిగా ఇంజక్షన్లు ఇచ్చారు. డాక్టర్ కడుపులో నొప్పి తగ్గక పోతే, ఒక అల్ట్రా సౌండ్ పరీక్ష చేయించుకోమన్నారు. ఆపై రెండు రోజుల వరకు నొప్పి లేదు. కాని ఆ తర్వాత తీవ్రమైన నొప్పి మొదలయింది. దీనివల్ల నాకు చాలా వేదన కలిగింది. గత వారం రోజులుగా నాకు మలబద్ధకo సమస్య కూడా మొదలవడంతో నా భాద మరింత ఎక్కువైంది. మా అమ్మగారు అభ్యాసకుడు11476...ఇండియా  నుండి మలబద్ధకం సమస్యకు వైబ్రో మందును తీసుకు వచ్చింది. ఈ మందుతో పాటు మూడు లీటర్ల గోరువెచ్చని నీరు తాగడంతో నా సమస్య వారం రోజులలో పూర్తిగా తగ్గిపోయింది. ఆ తర్వాత నేను ఇంకెప్పుడూ మలబద్ధకం సమస్యను ఎదుర్కొనలేదు. ఈ విధంగా స్వామి నన్ను వైబ్రియానిక్స్ సేవకు పరిచయం చేసారు. నేను ఈ మహత్తరమైన చికిత్సా విధానంపై శిక్షణ పొందాలని నిర్ణయించుకుని, దరఖాస్తు పత్రాన్ని సమర్పించాను. 

ఒక అద్భుతమైన అనుభూతినిచ్చిన AVP కోర్సు పూర్తయ్యాక, నేను ఈ క్రింద వ్రాసిన కాంబోలను తీసుకోవడం ప్రారంభించాను

 #1. CC4.10 Indigestion + CC8.2 Pregnancy tonic + CC12.1 Adult Tonic + CC15.1 Mental & Emotional tonic…TDS

 ఇది తీసుకున్నాక నాకు మానసికంగాను మరియు భౌతికంగాను చాలా తేలికగా అనిపించింది. అదే సమయంలో చాలా మత్తుగా అనిపించి రోజంతా నిద్రిస్తూనే ఉండేదాన్ని. కేవలం ఆహారం తీసుకోవడానికి మాత్రమే మేలుకొనే దాన్ని. కొన్ని రోజుల తర్వాత నేను సాధారణ స్థితికి చేరుకున్నాను.

ఎనిమిదో నెలలో శరీరమంతా దురద కారణంగా నాకు నిద్ర పట్టేది కాదు. ఈ సమస్యకు నేను ఈ క్రింద వ్రాసిన కాంబోలను తీసుకున్నాను

#2. CC21.1 Skin tonic + CC22.2 Skin infections + CC22.3 Skin allergies + CC21.6 Eczema...TDS మౌఖికంగా మరియు చర్మంపై రాయడానికి కొబ్బరి నూనెలో

ఒక వారం తర్వాత నాకీ సమస్యనుండి పూర్తిగా ఉపశమనం కలిగి శాంతియుతంగా నిద్రపో గలిగేదాన్ని. గర్భం యొక్క 38 వ వారంలో డాక్టర్ నాకు సిసేరియన్ ఆపరేషన్ చేయాలని చెప్పినప్పటి నుండి నేను ఈ క్రింద వ్రాసిన కాంబోను ప్రారంభించాను

#3. CC10.1 Emergencies…TDS

నేను #1, #2 మరియు #3  ప్రసవం అయిన నెల రోజుల వరకు కొనసాగించాను. 2015 జూలై 2న స్వామి నాకు ఒక అందమైన ఆడ బిడ్డను ప్రసాదించారు. వైబ్రో చికిత్స, ఆపరేషన్ నుండి త్వరగా కోలుకుని బిడ్డని చూసుకునేందుకు నాకెంతో సహాయపడింది. ఒక వారం తర్వాత సాధారణ ప్రసవం జరిగినంత తేలికకగా నాకు అనిపించింది. ఇదే సాయి వైబ్రియానిక్స్ యొక్క మహిమ. స్వామి దీవెనలు ఎల్లపుడు నాతో ఉన్నాయని నాకెంతో ఆనందంగా ఉంది.

నేను గర్భినిగా ఉన్నప్పుడు నా బరువు ఎక్కువగా పెరగక పోయినప్పటికి, నా బిడ్డ యొక్క పెరుగుదల సాధారణంగా కొనసాగింది. ఇది వైబ్రో తీసుకోవడం వల్లే సాధ్యమైంది.

అభ్యాసకుల వివరాలు 11572...India

అభ్యాసకురాలు11572...ఇండియా, ఒక రిటైర్డ్ బ్రిగేడియర్ భార్యైన ఈమె కమ్యునికేషన్స్ కంపనీలో సేల్స్ మరియు మార్కటింగ్ మేనేజర్ గా పదవి విరమణ చేసిన తర్వాత సాయి వైబ్రియానిక్స్ సేవ మరియు గుర్గావున్ లో జరిగే ఇతర సాయి కార్యకలాపాలలో పాల్గొంటూ తన జీవితాన్ని గడుపుతోంది. వైబ్రో చికిత్స పొందిన పేషంట్ల మొహాల్లో ఆనందాన్ని చూసి ఈమెకు ఎంతో ఆనందం కలుగుతోంది. ఇంత ఉత్తమమైన సేవకు ఒక సాధనగా ఎంచబడినందుకు ఈమె స్వామికి తన క్రుతజ్ఞ్యతను తెలుపుకుంటోంది.

పంచుకుంటున్న కేసులు

 అజీర్ణం, రుతువిరతి, నోటిలో బొబ్బలు మరియు క్లమిడియా

అభ్యాసకుల వివరాలు 11573...India

అభ్యాసకుడు11573....ఇండియా ఉద్యోగస్తుడు. ఇతను ఒక ప్రకృతి వైద్యుడు మరియు యోగా సాధకుడు కూడా. 1970 నుండి ఇతని తల్లి తండ్రులు బాబా భక్తులు. ఇరవై ఏళ్ళ క్రితం క్యాన్సర్ కారణంగా వెంటవెంటనే వీరు ఆకస్మికంగా మరణించారు. ఈ కారణంగా ఇతను ప్రత్యామ్నాయ వైద్య విధానాలు వైపు ఆకర్షింప పడ్డాడు. ప్రజలు చెడు జీవనశైలీల కారణంగా వారి ఆరోగ్యాలను నాశం చేసుకుంటున్నారని ఇతను భాధపడుతున్నారు. దైవమైన ప్రకృతి మనకు ఉచితముగా అందించే నీరు, గాలి, సూర్యరశ్మి వంటివి మంచి ఆరోగ్యానికి ప్రధాన సంపదలని మనము గుర్తించ లేకపోతున్నాము. తన పేషంట్లకు వైబ్రో చికిత్స ఇచ్చేటప్పుడు, ఆరోగ్య సంరక్షణకు, జీవన శైలిలో ఎటువంటి మార్పులు చేయాలో సలహా ఇస్తున్నారు.

ఇతను సాయి వైబ్రియానిక్స్ గురించి ఒక సాయి భక్తుడు ద్వారా 2014 డిసంబర్లో విన్న క్షణం నుండి, ఈ చికిత్సా విధానంలో శిక్షణ పొందాలని నిర్ణయించుకున్నారు. 2015 ఏప్రిల్ లో ఇతను AVP గా అర్హత పొందారు.

ఇతను అనుసరించే సిద్ధాంతానికి తగినట్లు మాత్రమే కాకుండా మానవాళికి ఎంతగానో ఉపయోగపడే మరియు ఉచితముగా అందించబడే సేవా రంగంలో ఒక కొత్త భాద్యతను ప్రసాదించడానికి బాబా ఇన్ని సంవత్సరాలుగా తనను శారీరికంగాను, మానసికంగాను సిద్ధం చేశారన్నది ఇతని భావన. ఇతను చెప్తున్నారు: అసలైన నివారణ కర్త బాబాయని, నేనొక పని ముట్టు మాత్రమే అని నాకు తెలుసు. ఇటువంటి ఒక మహత్తరమైన సేవా అవకాశాన్ని నాకు ప్రసాదించినందుకు బాబాకి కృతజ్ఞ్యతలు తెలుపుకుంటున్నాను. వైబ్రియానిక్స్ తో సాంగత్యం ఏర్పడిన తర్వాత, ఆధ్యాత్మికంగా బాబాతో నాకు అనుసంధానం చాలా సులభంగా ఏర్పడుతున్న అనుభూతి నాకు కలుగుతోంది.

 

పంచుకుంటున్న కేసులు

అభ్యాసకురాలి వివరాలు 11574...India

అభ్యాసకురాలు11574...ఇండియా కంప్యుటర్ శాస్త్రంలో పీ హెచ్ డీ చేసిన ఈమె ప్రస్తుతం ఢిల్లీ విశ్వవిధ్యాలయoలో భోదిస్తోంది. 2015 ఏప్రిల్ లో అభ్యాసకుల శిక్షణ పొందింది.

ఈమెకున్న చర్మ సమస్యకు చికిత్సనిచ్చి నయంచేసిన సహోద్యోగి అయిన అభ్యాసకురాలు02859...ఇండియా ద్వారా వైబ్రియానిక్స్ గురించి తెలుసుకుంది. సుమారు రెండేళ్ళ క్రితం ఈమె, మొహం మీద తీవ్ర మొటిమలతో భాధపడేది. ముఖంపై చర్మమంతా వాచిపోయి ఎర్రగా కనపడేది. ఈ సమస్య క్రమంగా ఆమె మెడ మరియు వీపు మీద కూడా వ్యాపించింది. ఆ సమయంలో, ఈమె ఏ విధమైన లేపనం లేదా మందు ఉపయోగించకుండా వైబ్రియానిక్స్ చికిత్స తీసుకోవడం ప్రారంభించింది. రెండు డోసులు తీసుకోవడంతో ఈమె ముఖం మీదున్న ఎరుపు తగ్గి ఉపశమనం కలిగింది. మరో రెండు నెలలలో ఈమెకు ఆశ్చర్యం కలిగేలా మొటిమలు తగ్గి, చర్మం పూర్తిగా నయమైంది. ఈ చికిత్స వల్ల దుష్ప్రభావాలు ఉండవని తెలిసి ఈ శిక్షణ పొందాలన ఆసక్తి, ఈమెలో మరింత పెరిగింది. కేవలం భౌతికంగా మాత్రమే కాకుండా మానసిక, భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక స్థాయిలలో కూడా నివారణ కలిగిస్తున్న ఈ చికిత్సా విధానాన్ని అభ్యసించే అవకాశం పొందడం తన అదృష్టమని భావిస్తోంది. ఇప్పటివరకు ఈమె చికిత్స ఇచ్చిన కేసులలో కొన్ని: మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మొటిమలు మరియు జుట్టు రాలడం వంటి సమస్యలు.

అభ్యాసం ప్రారంభించిన కొత్తలో ఈమె, చికిత్స ఫలితాల గురించి చాలా ఆత్రుత పడేది. ఆమె పేషంట్లు వచ్చి వాళ్లకు నివారణ కలిగిందన్న శుభవార్త  ఎప్పుడిస్తారా అని ఎదురు చూస్తూ ఉండేది. కాలక్రమేణా ఈ విషయంలో ఈమెకున్న అవగాహన పెరిగి ప్రతి సారి స్వామిని సరియైన మందును ఎంచుకోవడంలో తనకి సహాయపడమని ప్రార్థించి, ఆపై ఫలితాల విషయంలో నిర్లిప్తంగా ఉండడానికి ప్రయత్నిస్తోంది. వైబ్రియానిక్స్ గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకుని మరింత ఎక్కువగా సేవ చేయాలన్నది ఈమె కోరిక.

ఇక్కడ ఈమె CC1.2 Plant tonic యొక్క అద్భుతమైన స్వస్థతా మహిమను మరియు వైబ్రియానిక్స్ సేవ చేయడం వలన తాను పొందిన సంతోషాన్ని మనతో పంచుకొంటున్నారు. ఈమె వ్రాస్తున్నారు: 2015 ఏప్రిల్ 5న 108 కంబో వైబ్రో కిట్ నాకు ఇవ్వబడింది. ఈ అమూల్యమైన కిట్ ను ఇంటికి తీసుకు వెళుతుండగా, మా మెట్లమీద కుండీలో వాడిపోయిన ఒక షాల్మియా మొక్క మీద నా దృష్టి పడింది (ఎడమ పక్క ఉన్న ఫోటో చూడండి). గత రెండు రోజులగా ఆ మొక్కకు నీళ్ళు పోయలేదు. ఈ మొక్కే నా మొదటి పేషంట్ అని అనిపించి, వెంటనే ఒక లీటర్ నీళ్ళలో ఒక చుక్క CC1.2 Plant tonic కలిపి మొక్కకు పోసాను. మర్నాడు ఉదయానికల్లా  మొక్క చైతన్యవంతంగా మరియు బలంగా కనిపించింది. (కుడి పక్క ఫోటో చూడండి).

 

వైబ్రో మందు ఒక టమాటో మొక్క మీద కూడా సానుకూల ప్రభావం చూపింది. ఈ మొక్క 4 ఇంచీలు పెరిగాక CC1.2 Plant tonic…OW ఇవ్వడం ప్రారంభించాను. 3 నుండి 4 అడుగులు పెరిగాక కాయలు కాసాయి. మందుయొక్క మోతాదును పెంచి, రోజు విడిచి రోజు మొక్కకు వైబ్రో టానిక్ ఇచ్చాను. కొద్ది రోజులలో 9 టమాటాలు, ఆపై మరో ఐదు టమాటాలు పండాయి. ఇవి ఎంతో రుచికరంగా ఉన్నాయి.

అంతే కాకుండా జీవం కోల్పోతున్న ఒక వేప మొక్కను కాపాడేందుకు CC1.2 Plant tonic ను ఉపయోగించాను. దీని ఆకులు గోధుమ రంగులో మారి రాలి పోతున్నాయి. ఈ మొక్కకు CC1.2 Plant tonic ఇవ్వడంతో పాటు మొక్కను  ప్రేమతో హత్తుకునేదాన్ని. రెండు వారాల వరకు ఈ మొక్క పరిస్థితిలో మెరుగు కనపడలేదు. పదిహేనో రోజున ఒక కొమ్మనుండి ఆకుపచ్చని చిగురులు రావడం చూసి చాలా సంబరపడ్డాము. (క్రింద ఉన్న ఫోటోను చూడండి). ఆ మొక్క చిగురించడం చూడగానే కొత్తగా పుట్టిన శిశువును చూసినంత ఆనందం కలిగింది.

నర్సరీ నుండి తెచ్చిన ఒక సున్నితమైన బేర్ మొక్కను పునరుద్ధరించాలని CC1.2 Plant tonic  ఉపయోగించాను. తగినంత సూర్యకాంతి మరియు నీరు పోసినప్పటికి ఈ మొక్క ఎండిపోయింది. నేను మొక్కకు ఒక వారం వరకు ప్రతి రోజు CC1.2 Plant tonicను ఇవ్వడం ప్రారంభించాను. ఆపై వారానికి మూడు సార్లు ఇస్తూ వచ్చినప్పటికీ మెరుగు ఏర్పడలేదు. అయనా నేను మొక్కకు వైబ్రో టానిక్ను ఇవ్వడం ఆపలేదు. ఇరవై రోజుల తర్వాత ఎండిపోయిన కొమ్మ అడుగు భాగం నుండి చిగురు రావడం మొదలైంది (కుడి పక్క ఫోటోను చూడండి). మేము ఈ మొక్కకు "ఆశ" అని పేరు పెట్టాము. వైబ్రోతో ఈ మొక్క క్రమంగా కోలుకుంటోంది.

 పంచుకుంటున్న కేసులు

అభ్యాసకురాలి వివరాలు 11964...India

1978 లో నేషనల్ డిఫెన్స్ అకాడమి (దేశ రక్షణ అకాడమి) నుండి విజయవంతంగా ఉత్తీర్ణుడైన నన్ను, సాయి భక్తులైన నా తల్లి తండ్రులు బాబాకి కృతజ్ఞ్యతలు తెలపడం కొరకు షిర్డీ మరియు పర్తి తీసుకువెళ్ళారు. తదుపరి, 34 సంవత్సరాలు భారత సైన్యంలో పని చేసేటప్పుడు ఉండే కఠినమైన జీవన సరళి విధానాన్ని తట్టుకోవడానికి స్వామి దీవెనలు నాకు ఎంతో ఉపయోగపడ్డాయి. నేను పదాతి దళంలో ఉండడంతో  చాలా హత్యలు మరియు రక్తపాతం చూసాను. అటువంటి సమయాలలో స్వామి యొక్క దీవెనలు నన్ను రక్షించాయని నేను భావిస్తున్నాను. స్వామి యొక్క మార్గదర్శకత్వం నాకు ఎటువంటి భయంకరమైన అందోళన వచ్చినా దేశరక్షణ కోసం నిలబడేందుకు ధైర్యాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చింది. స్వామి కృప వల్ల నాకు రాష్ట్రపతి ద్వారా విశిష్ట సేవా మెడల్ ఇవ్వబడింది. శత్రువు కెదురుగా అత్యుత్తమ ప్రదర్శనకు ఉత్తర మరియు దక్షిణ ఆర్మీ కమాండర్ల నుంచి ప్రశంసలు బిరుదులు కూడా అందుకున్నాను.

2012 లో, 54 సంవత్సరాల వయస్సులో సైన్యం నుండి రిటైర్ (కల్నల్  హోదాలో) అయ్యాక , నాకు చాలా లాభదాయకమైన ఉద్యోగాలు చేయడానికి అవకాశాలు వచ్చాయి. నేను వాటిని తిరస్కరించి, స్వామి సేవలో ఉండాలని నిర్ణయించుకున్నాను. నేను సాయి సమితి సభ్యుడవడంతో ఢిల్లీ NCR  ప్రాంతంలో ఉన్న సత్యసాయి సేవ సంస్థ నిర్వహించిన కార్యకలాపాలలో ఉత్సాహంగా పాల్గొన్నాను. కాని నేను చేసిన సేవ యాంత్రిక పద్ధతిలో ఉన్నట్లు నేను భావించాను. ఆ రీతిలో సేవ చేయడం వల్ల నాలో ఆధ్యాత్మిక పురోగతి కనపడలేదు. 2014 జనవరి ఒకటో తేదిన, నేను సాయి వైబ్రియానిక్స్  గురించి విని, ఈ చికిత్సా విధానంలో శిక్షణ పొందాలని నిర్ణయించుకున్నాను. 2014 లో JVP కోర్సు పూర్తి చేసి అభ్యాసం ప్రారంభించిన తర్వాత, నా జీవితంలో అనేక మార్పులు ఏర్పడ్డాయి. నాలో ఆధ్యాత్మిక పురోగతి ప్రారంభమైంది. సాయి వైబ్రియానిక్స్ యొక్క మహిమను నేను త్వరలోనే గుర్తించగలిగాను.

2014 డిసంబర్లో నాలుగు రోజుల కఠిన శిక్షణ తర్వాత డా.అగ్గర్వాల్ నుండి SRHVP యంత్రాన్ని మరియు కార్డులను పొందాను. ఆపై నన్ను ప్రక్షాళన ప్రక్రియను (క్లీన్సింగ్ విధానము) తీసుకోమన్నారు.ఈ అద్భుతమైన ప్రక్రియ, నా జీవితం యొక్క ప్రయోజనం ఏమిటో నేను తెలుసుకోవడానికి ఒక మంచి అవకాశాన్నిచ్చింది. అదే సమయంలో పేషంట్లను ఒక స్థిరమైన ప్రవాహంలో పంపించి, నాకీ మహాత్తమరమైన సేవనందిoచే అవకాశాన్ని స్వామి ఇచ్చారు. స్వామి యొక్క అనంతమైన ప్రేమకు ఇదొక నిదర్శనం. ప్రక్షాళన ప్రక్రియ సమయంలో నా అనుభవాలు:

 2014 డిసెంబర్ 11న  NM25 Shock…TDS తీసుకోవడంతో నా ప్రక్షాళన ప్రక్రియను ప్రారంభించాను. ఆరవ రోజున తీవ్రమైన ఒళ్ళు నొప్పులు, తల నొప్పి మరియు టేకికార్డియా( గుండె వేగంగా కొట్టుకోవడం) సమస్యలతో భాధపడ్డాను. నా గుండె కొట్టుకునే వేగం 130 bpm కంటే ఎక్కువగా పెరిగింది మరియు నా రక్తపోటు 200/120 కు పెరిగింది. నేను NM25 తీసుకోవడం ఆపి విభూతి తీసుకుని, 36 గంటలు వరకు పడుకునే ఉన్నాను. మూడవ రోజున నాకు 90% వరకు నయమైంది. దీని తర్వాత నేను NM85 Headache-BP + BR5 Heart + SM11 Blood Pressure + SM15 Circulation...QDS తీసుకుని, ఇతర మందులను (రక్తపోటు కోసం గత పదిహేనేళ్ళగా వాడుతున్న అల్లోపతిక్ మందుతో సహా) ఆపేశాను. ఒక వారంలో నాకు 100% నయమైoది NM25Shock ఒకసారి తీసుకోవడంతో మళ్లీ ప్రారంభించి మూడు సార్లకు పెంచాను (OD to TDS).

2015 జనవరిలో నేను తిరిగి పర్తికి వెళ్ళినప్పుడు డా.అగ్గర్వాల్ మరియు శ్రీమతి అగ్గర్వాల్ గారిని కలిసే అవకాశం వచ్చింది. వారు ప్రక్షాళనను కొనసాగించడానికి NM83 Grief…TDS తీసుకోమని నాకు సలహా ఇచ్చారు. ఇది తీసుకున్న మూడు రోజుల తర్వాత నా కళ్ళు భారంగా ఉన్నట్లు అనిపించడంతో, నేను పగలంతా కూడా నిద్రించే వాడిని. ఆపై రెండు రోజులవరకు నేను ఎక్కువగా నిద్రపోయాను కాని ప్రతిసారి మరింత చైతన్యవంతంగా మేల్కొనే వాడిని.

 ఫెబ్రవరి మొదటి వారానికి నాకు చాలా ఆరోగ్యకరంగా అనిపిoచింది కాని ఇదే సమయంలో ఒక పాత గాయం తిరిగి వచ్చింది. 1990లో బాస్కట్ బాల్ ఆడుతుండగా లoబార్ భాగంలో (నడ్డి భాగం) ఒక చిన్న డిస్క్ ప్రోలాప్స్( డిస్కు జారుట) జరిగింది. అల్లోపతి మందులు, యోగా, అక్యుప్రేషర్ మరియు ఆక్యుపంక్చర్ ద్వారా ఈ సమస్యనుండి నేను పూర్తిగా కోలుకున్నాను. ఇన్నిసంవత్సరాల తర్వాత హటాత్తుగా ఎడం కాల్లో సయాటికా నొప్పి మొదలై, కాలు కదపడానికి వీలుపడలేదు. దీనితోపాటు వీపు నొప్పి కూడా మొదలైంది. MRI స్కాన్ చేయించడంతో లoబార్ ప్రాంతంలో డిస్కులన్ని ముందుకు వచ్చినట్లు తెలిసింది. డాక్టర్ నన్ను పెయిన్ కిల్లర్లు మరియు నరాల విశ్రాంతికారిణులు (నెర్వ్ రిలాక్సంట్) తీసుకోమని సలహా ఇచ్చారు కాని నేను ఒప్పుకోలేదు. నొప్పిగా ఉన్న భాగంపై విభూతి రాసి, ఈ క్రింద వ్రాసియున్న వైబ్రో మందులు తీసుకోవడంతో, నాకు రెండు నెలల్లో ఈ సమస్య పూర్తిగా తగ్గిపోయింది:

NM3 Bone Irregularity + NM6 Calming + NM21 KBS + NM24 Rheumatism & Arthritis + NM40 Knees + NM54 Spasm + NM113 Inflammation + OM16 Knees + OM30 Connective Tissue + SM33 Pain + SM36 Skeletal + SR271 Arnica + SR421 Bach Flower Cerato + SR479 Cartilage + SR500 Intervertebral Discs + SR510 Muscles + SR517 Parathyroid + SR540 Vertebrae...TDS

అదే సమయంలో నేను NM72 Cleansing…TDS తీసుకొని నా ప్రక్షాళన నియమావళి కొనసాగించాను.

స్వామి దయవల్ల ఈ రోజువరకు నేను ఆరోగ్యంగా ఉంటూ నా వైబ్రియానిక్స్ సేవను కొనసాగిస్తున్నాను. వైబ్రో చికిత్సను తీసుకోవడం వలన దీని యొక్క మహిమను పూర్తిగా గ్రహించగలిగాను. నాకు అనారోగ్యం వచ్చినప్పుడు, ఎక్కువగా విరామం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఆ సమయంలో వైబ్రియానిక్స్ కి సంబoదించిన అనేక పుస్తకాలను ( సోహం సీరీస్ అఫ్ నేట్యురల్ హీలింగ్, అన్ని సంపుటాలు) చదివే అవకాశం నాకు లభించింది. స్వామి దయవల్ల వచ్చే అనేక పేషంట్లకు నేను నా సేవను అందించ కలుగుతున్నాను. కొత్త కేసులకు చికిత్సను అందించడంతో వైబ్రియానిక్స్ లో ప్రావీణ్యత మరింత పెరిగుతోంది.

ఒక  సంవత్సరంగా చేస్తున్న ఈ వైబ్రియానిక్స్ సేవ ద్వారా నా జీవితం పూర్తిగా మారిపోయింది. నేను ప్రతిరోజు, ఉదయం ఒక్క గంట మరియు సాయంకాలం ఒక్క గంట చప్పున, మా ఇంటిలోనే పేషంట్లకు చికిత్సనిస్తున్నాను. మా ఇరుగు పొరుగులో ఉన్న కొన్ని కుటుంబాలు కేవలం వైబ్రియానిక్స్ చికిత్సను మాత్రమే తీసుకుంటున్నారు. వారానికి రెండు సార్లు ఒక అర్బన్ స్లంలో (పట్టణ మురికివాడలో) నా సేవను అందిస్తున్నాను. 

స్వామి కృప వలన వైబ్రియానిక్స్ నా జీవితానికి ఒక కొత్త ప్రయోజనాన్ని ఇచ్చింది. ఈ సేవ నిస్వార్థ ప్రేమతో చేయబడే ఒక అత్యుత్తమమైన సేవ. డా.అగ్గర్వాల్ ప్రోత్సాహoతో నేను SVP కోర్సు పూర్తి చేయగానే నా భార్య వైబ్రియానిక్స్లో నాకొక అసిస్టెంట్గా చేరడం జరిగింది. ఇప్పుడు మేమిద్దరము ఒక జట్టుగా మా సేవను అందిస్తున్నాము.

ఈ ఉత్తమమైన సేవను కొనసాగించడానికి మమ్మల్ను స్వామి యొక్క దివ్య ప్రేమతో నిండియున్న స్వచ్చమైన సాధనాలుగా తీర్చి దిద్ధమని స్వామిని ప్రార్థిస్తున్నాము.

 పంచుకుంటున్న కేసులు

జవాబుల విభాగం

1.  ప్రశ్న: నా పేషంట్లులలో ఒక మహిళకు జ్ఞాపకశక్తి తక్కువ ఉండడంతో, ఆమెకు అల్జీమర్ వ్యాధి ఉందేమోనని అనుమాన పడుతోంది. ఆమెకు CC17.3 Brain & Memory tonic ఇస్తే సరిపోతుందా లేదా అల్జీమర్ వ్యాధికి సంభందించిన కాంబోను కూడా చేర్చివ్వాలా?

     జవాబు:  CC18.2 Alzheimer’s disease కాంబో, అల్జీమర్ వ్యాధి నివారణగా ఉపయోగపడుతుంది కాబట్టి, CC18.2 Alzheimer’s disease కాంబోను CC17.3 Brain & Memory tonicతో పాటు చేర్చివ్వడం ఉత్తమం. ఏదైనా ఒక సందర్భంలో మీరు  అదనంగా ఒక కాంబోను చేర్చాలా వద్దా అని ఆలోచన చేస్తున్నప్పుడు, ఆ అదనపు కాంబోను చేర్చివ్వడమే మంచిది. 

________________________________________

2.  ప్రశ్న మందు సీసా మూతలో పిల్ ను ఎక్కువ సమయం ఉంచడంవల్ల పిల్లో ఉన్న వైబ్రెషన్స్ ఆవిరైపోతాయా? (ఉదాహరణకు పిల్ ను మూతలో వేసి నేను నా బిడ్డకోసం వెదుకుతున్నప్పుడు)

     జవాబు: లేదు. వైబ్రేషన్స్ పిల్స్ లో పాదుకొని ఉంటాయి. వాస్తవంగా చెప్పాలంటే, ఎక్కువ కాంబోలు చేర్చడం కారణంగా పిల్స్ లో తడి అధికంగా ఉన్నప్పుడు, పిల్స్ లో ఉన్న అదనపు అల్కహొల్ ఆవిరై పోవాలన్న ఉద్దేశ్యంతో మందు సీసా మూతను కొంత సమయం వరకు తెరిచి ఉంచుతాము.

________________________________________

3.  ప్రశ్న: వైబ్రో మందును పేషంట్లకు ఎదురుగా తయారు చేస్తారా లేదా మరో గదిలో తయారు చేస్తారా

  జవాబు: 108 కాంబో బాక్సును ఉపయోగించేటప్పుడు, పేషంట్లకు ఎదురుగా మందు తయారు చేయడంలో ఎటువంటి  సమస్య ఉండదు.  అయితే, SRHVP యంత్రాన్ని ఉపయోగించేటప్పుడు, రోగి యొక్క సౌఖర్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. వైబ్రియానిక్స్ గురించి తెలుసుకోవాలన్న పేషంట్ల ముందు యంత్రాన్ని ఉపయోగించి మందు తయారు చేయవచ్చు కాని అనుమానం ఎక్కువున్న పేషంట్ల విషయంలో మరో గదిలో మందు తయారు చేయడం ఉత్తమం.

________________________________________

4.  ప్రశ్న:  రోగ చరిత్ర రాసేటప్పుడు, ఒక వేళ అభ్యాసకుడే/ అభ్యాసకురాలే రోగి అయితే, వాస్తవాన్ని చెప్పాలా లేదా కేవలం ఆడ/మగ, వయస్సు వంటి సాధారణ వివరాలను సూచిస్తే చాలా?

      జవాబుఅభ్యాసకుడు తనను తాను రోగియని సూచించే అవసరం లేదు కాని అలా చేయడం ద్వారా కేసుకు మరింత ప్రామాణికతను ఇవ్వవచ్చు. ఒక అభ్యాసకుడు తన సొంత రోగ చరిత్రను వివరించేటప్పుడు, తాను అనుభవించిన భావోద్వేగాలను మరింత వివరంగా రాయడానికి అవకాశముంది.

________________________________________

5.  ప్రశ్న డాక్టర్కి అభ్యాసకుడికి మధ్య వ్యత్యాసం ఏమిటి?

    జవాబు:  సాధారణంగా సుధీర్గ కాలం వరకు, ప్రాథమిక వైద్య శిక్షణను పొంది మరియు ప్రభుత్వ నియంత్రణ విభాగం ద్వారా వైద్యం చేయడానికి అనుజ్ఞాపత్రము అందుకున్న వ్యక్తిని 'డాక్టర్' అని అంటారు. వైబ్రియానిక్స్ మందులలో ఎటువంటి రసాయనాలు లేదా మూలికలు చేర్చబడలేదు. ఈ వైబ్రేషన్స్ ఎటువంటి హానిచేయవని మీకు తెలిసినదే. ఈ కారణాలు వల్ల వైబ్రియానిక్స్ చికిత్సను అందించే మనల్ని "అభ్యాసకులు" అనడం సముచితం.

________________________________________

6.  ప్రశ్న: చాలా మంది పేషంట్ల దంతాలలో పాదరస మిశ్రమం నింపబడియుంది. పాదరసం ఒక లోహం కాబట్టి, వైబ్రో మందులకు దీనివల్ల అంతరాయం  కలుగుతుందా? ఒక వృద్ధ పేషంటుకున్న కట్టుడు పళ్ళలో ఒక మెటల్ క్లిప్ ఉంది. ఆమె పళ్ళలో ఉన్న లోహపు క్లిప్ వైబ్రో మందును ప్రభావితం చేయదా?

    జవాబు:  ఇతర లోహాలు వలె, పాదరసం సాధారణంగా, వైబ్రో మందుకు అంతరాయం కలిగించవచ్చు. వాస్తవంలో, చాలా మంది పేషంట్లకు పళ్ళల్లో లోహపు మిశ్రమాలు నింపబడో లేదా లోహం అమర్చబడో ఉంటుంది. ఇటువంటి ఎన్నో కేసులలో వైబ్రో మందులు సఫలితాలను కలుగచేసాయి. వైబ్రో మందును పేషంటు నోటిలో వేసుకోగానే, వైబ్రేషన్స్ శరీరంలోకి పీల్చబడతాయి.

________________________________________

7.  ప్రశ్నA నేను వైబ్రియానిక్స్ చికిత్స మాత్రమే కాకుండా, అనేక సేవలను నా పేషంట్లకు ఉచితంగా అందిస్తున్నాను. కొందరు పేషంట్లు కేవలం మార్గదర్శకత్వం కొరకు నన్ను సంప్రదిస్తున్నారు. కొందరు రేకి వంటి నిర్దిష్ట చికిత్సలు కోసం వస్తున్నారు. ఇటువంటివన్నీ కూడను సేవలే కాబట్టి, సేవలకోసం కేటాయించిన సమయాన్ని నేను నా నెలవారీ వైబ్రియానిక్స్ రిపోర్టులో చేర్చవచ్చా?

    జవాబు: మీ నెలవారీ రిపోర్టు వైబ్రియానిక్స్ సేవకు సంబoదించినది కాబట్టి, మీరు కేవలం ఈ సేవ కోసం కేటాయించిన సమయం మాత్రమే నెలవారీ రిపోర్టులో రాయాలి. అయితే వైబ్రియానిక్స్ చికిత్స సమయంలో మీరు కౌన్సిలింగ్ కూడా చేసినట్లయితే, మీరు కౌన్సిలింగ్ కోసం గడిపిన సమయాన్ని కూడా మీ రిపోర్టులో చేర్చవచ్చు.

________________________________________

8.  ప్రశ్నఒక రోగి కొన్ని రోగ లక్షణాల ఉపశమనం కోసం నన్ను సంప్రదించినప్పుడు, రోగిలో మరొక రోగ లక్షణాన్ని నేను గమనించినట్లయితే (ఉదాహరణకు రోగి నుదుటిపై బొడిపి), లక్షణానికి కూడా వైబ్రో మందును తీసుకోమని సలహా ఇవ్వవచ్చా? లేదా కేవలం రోగికి సహాయం చేయమని బాబాను ప్రార్థన చేయాలా?

      జవాబు:  ఎటువంటి సందర్భంలోనైన మనము బాబాను నయం చేయమని ప్రార్థన చేయాలి. మీరు మీ రోగికి ఎటువంటి సలహా ఇస్తారన్నది మీ పేషంటుతో మీకున్న అవగాహన పై ఆధారపడి ఉంటుంది. మీకు బాగా తెలిసిన పేషంటు అయితే, ఆ రోగ లక్షణాన్ని గురించి మెల్లగా విచారణ చేయవచ్చు. మీకు పేషంటుతో ఎక్కువ పరిచయం లేనట్లయితే, మీ పేషంటుకు మీపై మరియు వైబ్రో చికిత్సపై  విశ్వాసం కలిగేంత వరకు ఆగడం మంచిది. 

________________________________________

9.  ప్రశ్న108CC సీసాల మూతలు సులభంగా తెరవడం కోసం, మూతలో రబ్బరు పొదుగులో ఉన్న పట్టి  మీద ఆలివ్ నునె పూయవచ్చా?      

జవాబు సీసాలో ఉన్న మందు కాలుష్యపడే అవకాశం ఉంటుంది కాబట్టి మూత లోపలున్న రబ్బరు పట్టి మీద నునె కాని వేరొక పదార్థాన్ని కాని ఉపయోగించడం మంచిది కాదు. CC సీసాను సులభంగా తెరిచే మార్గం:  రబ్బర్ పొదుగును మరియు ప్లాస్టిక్ మూతను ఒక చేతితో స్థిరంగా ఉండేలా గట్టిగా పట్టుకొని, మరో చేతితో సీసాను తిప్పాలి. డెమో కోసం Click here 

________________________________________

10.  ప్రశ్న108CC సీసాను ఉపయోగించే ముందు సీసాను ఆడించకూడదని (షేక్) విన్నాను. ఇది నిజమేనా?

      జవాబు కాదు. నిజానికి ఉపయోగించే ముందు 108CC సీసాను ఆడించడం మంచిది. 108CC సీసాను నిలువుగా పట్టుకొని, అరిచేయి మీద తట్టడం ద్వారా సీసాలో ఉన్న మందు కదులుతుంది. సీసాను 8 ఆకారంలో తిప్పరాదు. చార్జింగ్ సమయంలో, సమయాన్ని ఆదా చేసే నిమిత్తమై 108CC సీసాను ఆడించమని చెప్పబడదు. చాలావరకు అభ్యాసులందరు వారి 108 CC  బాక్సులతో ప్రయాణం చేసేవారే కాబట్టి, ప్రయాణ సమయంలో సీసాలు కదలడం ఎలాగూ జరుగుతుంది.

ప్రధాన నివారణ కర్తయోక్క దివ్య వాక్కు

"భూమిలో ఉడికించిన ధాన్యాన్ని నాటితే, అది మొలకెత్తదు. అటువంటప్పుడు అది జీవులకు జీవమెలా ఇస్తుంది? ఆహారం రుచికరంగా ఉండాలని వండుకొని తింటున్నారు. వండే సమయంలో ఆహారంలో ఉన్న పౌష్టిక పదార్థాలు నశిస్తున్నాయి. పచ్చి కూరగాయిలు, పళ్ళు, మొలకెత్తుతున్న విత్తనాలు, పప్పులు తినడం చాలా ఉత్తమం. ఇటువంటి పౌష్టిక ఆహార పదార్థాలను కనీసం రోజుకొకసారి తీసుకోవడం వల్ల దీర్ఘాయువు లభిస్తుంది. ఈ విధంగా లభించిన దీర్ఘాయువును సాటి మానవలకు సేవ చేయడానికి ఉపయోగించాలి."
......సత్యసాయిబాబా, "మంచి ఆరోగ్యం మరియు మంచితనం" దివ్యోపదేశం, 30 సెప్టంబర్ 1981 
http://www.sssbpt.info/ssspeaks/volume15/sss15-21.pdf 

 

"మీరందరు సాటి మానవులకు సేవ చేయాలి. నిజానికి, చేతులు ఇవ్వబడింది ఇతరులకు సేవ చేయడానికే. సేవలందించే చేతులు ప్రార్థించే పెదవుల కన్నా పవిత్రమైనవి. అందువల్ల నిస్వార్థ సేవను చేపట్టి కీర్తిని పొందండి. ఒక మంచి కార్యాన్ని చేప్పట్టినప్పుడు మీ జీవితంలో శాంతిని అనుభవించ గలుగుతారు."                                                                                  
.....సత్యసాయి బాబా, "మానవ సేవే మాధవ సేవ" దివ్యోపన్యాసం,1 జనవరి 2004
http://www.sssbpt.info/ssspeaks/volume13/sss13-22.pdf

ప్రకటనలు

❖ USA  శేపెర్డ్స్ టౌన్, WV : SVP వర్క్ షాప్ 18-20 సెప్టంబర్ 2015 మరియు AVP వర్క్ షాప్ 16-18 అక్టోబర్ 2015, సంప్రదించవలిసిన వ్యక్తి సుసాన్ at t[email protected]

❖ పోలాండ్  వ్రొక్లావ్ : 19 సెప్టంబర్ 2015 మరియు వార్సావ్ 3 అక్టోబర్ 2015, రెఫ్రెశర్ సెమినార్, సంప్రదించ వలసిన వ్యక్తి డారియజ్  at [email protected]

❖ UK లండన్ : రెఫ్రెశర్ సెమినార్, 4 అక్టోబర్ 2015, సంప్రదించ వలసిన వ్యక్తి జెరామ్ at  [email protected] లేదా ఫోన్ నంబర్: 020-8551 3979. 

​❖ ఫ్రాన్స్  టూర్స్:  రెఫ్రెశర్ సెమినార్ 10 అక్టోబర్ 2015, సంప్రదించ వలసిన వ్యక్తి డెనిఎల్లె  at [email protected]

❖ ఇటలీ పడువా, వెనిస్:  SVP వర్క్ షాప్ 16-18 అక్టోబర్ 2015, సంప్రదించ వలసిన వ్యక్తి, మనోలిస్  at [email protected]

❖ ఇండియా  పుట్టపర్తి, APAVP వర్క్ షాప్ 18-21 నవంబర్ 2015, సంప్రదించ వలసిన వ్యక్తి హేమ at [email protected]

అదనంగా

2015 ఏప్రిల్ 4-5న డిల్లీ లో AVP శిక్షణ శిబిరం

డిల్లీ- NCR సమన్వయకర్త 02859...ఇండియా ఇచ్చిన నివేదిక : 2015 ఏప్రిల్ 4-5 న, ఒక అసిస్టెంట్ వైబ్రియానిక్స్ అభ్యాసకుల (AVP) శిక్షణ శిబిరం, ఢిల్లీలో జరిగింది. దూరవిద్య కోర్సును విజయవంతంగా పూర్తిచేసిన ఆరుగురు, ఈ శిక్షణలో పాల్గొన్నారు. వైబ్రియానిక్స్ యొక్క సైద్ధాంతిక అంశాలను పరిశీలించిన తర్వాత, ఈ చికిత్స యొక్క అభ్యాస విధానంలో శిక్షణ ఇవ్వబడింది. ఒక నమూనా క్లినిక్లో నిజమైన కేసులకు చికిత్సందించటం కూడా జరిగింది. రెండు గంటల పాటు ఆటంకం లేకుండా కొనసాగిన స్కయిప్ కాల్ ద్వారా డా.అగ్గర్వాల్ తో, ఈ శిక్షణలో పాల్గొన్న వారందరికీ అనుసంధానం జరిగింది.

ఆపై కొత్తగా శిక్షణ పొందిన అభ్యాసకులందరి 108 కాంబో బాక్సులు చార్జ్ చేయబడినాయి. ఈ ప్రక్రియ జరిగిన సమయంలో, ‘ఓం శ్రీ సాయి రామ్’ జపం హాలులో ప్రతిధ్వనించటంతో చార్జ్ చేసే ప్రక్రియ, ఒక శక్తివంతమైన అనుభవంగా మారింది. అభ్యాసకులందరు తమ తమ బాక్సులు పొందటంతో చాలా సంబరపడ్డారు. [సంపాదకుడి వ్యాఖ్యానం: ఈ శిక్షణ శిబిరంలో శిక్షణ పొందిన అభ్యాసకులందరి అనుభవాలు ఈ సంచికలో ఉన్న "అభ్యాసకుల వివరాలు" శీర్షక క్రింద ప్రచురింపబడియున్నాయి.]​

 

2015 జూన్, 21-22న ఫ్రాన్స్ లో మొదటి AVP శిక్షణ శిబిరం

ఫ్రెంచ్ సమన్వయకర్త 01620...ఫ్రాన్స్  యొక్క నివేదిక : విజయవంతగా  వారి ఇ-కోర్సులు పూర్తి చేసి, ఫ్రాన్స్ మరియు బెల్జియం నుండి ముగ్గురు వైబ్రియానిక్స్ విద్యార్థులు, 2015 జూన్ 21-22 న జరిగిన AVP ఆచరణాత్మక (అభ్యాసం) శిక్షణ పొందడానికి ఫ్రాన్స్ వచ్చారు. ఆ ముగ్గురు విద్యార్థులకి శిక్షణ ఇవ్వడానికి ముగ్గురు ఉపాధ్యాయులు రావటంతో ఒక విద్యార్థికి ఒక ఉపాధ్యాయుడు చప్పున శిక్షణ ఇవ్వటం జరిగింది! ఆ విద్యార్తులందరు పరీక్ష భాగా వ్రాయటంతో AVPలుగా అర్హత పొందారు. 

ఈ శిక్షణ శిబిరంలో మేము ప్రతియొక్క విద్యార్ధి తన స్థానం నుండి చూడగలిగేలా మరియు సులభంగా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలిగేలా, ఒక పెద్ద వైబ్రియానిక్స్ పవర్ పాయింట్ స్క్రీన్ ను స్థాపన చేయటం జరిగింది.

ఆపై విద్యార్థులకు ఒక ప్రత్యేక శిక్షణ అభ్యాసం ఇవ్వబడింది. 108 కాంబోల పుస్తకం ఇచ్చి విద్యార్థులకు దానిని ఎలా ఉపయోగించాలో వివరించాక మేము ప్రతియొక్క విద్యార్థి ని తమ దరఖాస్తు పత్రంలో వ్రాసిన కేసులలో ఒక కేసును ఎంచుకుని దాని యొక్క కేసు వివరాలు, ఇవ్వవలిసిన మందుల వివరాలు సరియైన రీతిలో వ్రాసి ఆపై అందరికి చదివి వినిపించమన్నాము. ఆ తర్వాత ప్రతియొక్క కేసుకు ఇవ్వవలిసిన చికిత్స మరియు కాంబో వివరాల పై చర్చ జరపబడింది. ఈ విధమైన శిక్షణా అభ్యాసం వలన విద్యార్థులకు పుస్తకం చూసి మందును (కాంబో ను) ఎంచుకోవటం మరియు కేసు వివరాల పై సరియైన అవగాహన కలిగింది.

ఈ శిక్షణలో మేము కూరగాయులు మరియు పళ్ళు ఉపయోగించి విద్యార్థులకు శాకాహార ఆహారాన్ని తయారు చేసివ్వడం జరిగింది.

విద్యార్థులకు శిక్షణ చివరిలో డా.అగ్గర్వాల్ గారితో స్కయిప్ కాల్ ద్వారా అనుసంధానం ఏర్పడింది. ఇది అందరికి ఒక ఆనందమైన అనుభూతిని ఇచ్చింది. అభ్యాసకులగా అర్హత పొందిన ఆ విద్యార్థులు స్వామికి తమ సేవను అందించడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు.

 

ఆగస్ట్ 16 న ఇల్ఫోర్డ్, ఎస్సెక్స్లో జరిగిన UK అభ్యాసకుల సమావేశం యొక్క సారాంశం

ఈ రిపోర్ట్ ను UK సమన్వయకర్త 02822…UK, అభ్యాసకుడు02899... UK , అభ్యాసకుడు 03507…UK  మరియు  అభ్యాసకుడు 03510…UK నమోదు చేసిన వివరాల నుండి సంకలనం చేసారు.

UK సమన్వయకర్త సమావేశంలో హాజరయిన 15 అభ్యాసకులకు, స్కయిప్ ద్వారా సమావేశంలో పాల్గొంటున్న మరో ఇద్దరు అభ్యాసకులు మరియు ఇతరులను ఆహ్వానించారు.ఇంత అద్భుతమైన నివారాణా సాధనను ప్రసాదిoచినందుకు స్వామికి కృతజ్ఞ్యతలు తెలుపుకుంటూ సమావేశాన్ని మొదలుపెట్టారు.

ముఖ్యాంశాలు క్రింద వ్రాసియున్నాయి:

1.0 కేసు వివరాలు వ్రాయటం

1.1 కేసు వివరాలను వ్రాయడానికి మార్గదర్శకం

వివరాలకు, click here (ముందుగా మీరు మీ వైబ్రియానిక్స్ యూసర్ వర్డ్ మరియు పాస్వర్డ్ ఇచ్చి వైబ్రియానిక్స్ వెబ్సైటు  www.vibrionics.org లో లాగిన్ అవ్వాలి)

1.2  కేసులు సమర్పించడానికి శూచకము

2015 జూలై/ఆగష్టు వార్తాలేఖలో సూచించిన విధంగా అభ్యాసకులందరు అసాధారణమైన కేసులతో పాటు సాధారణమైన కేసులను కూడా పంపించ వలసిందిగా కోరారు.

2.0 పేషంటులను ఆహ్వానించడం మరియు సంప్రదింపుల సమయంలో స్వామీ పై దృష్టిని కేంద్రీకరించటం

 సామూహిక చర్చ ద్వారా వచ్చిన కొన్ని సలహాలు:

2.1 సంప్రదింపుకు తయారి:

  • మీ మనస్సును పరిశుద్ధ పరచుకుని స్వామిపై మీ హృదయాన్ని నిలపండి.
  • మీరు ఏ విధమైన ప్రతికూల ఆలోచనలు లేకుండా శాంతివంతంగా ఉండాలి.
  • ప్రతికూల ఆలోచనలనుండి రక్షించమని స్వామిని ప్రార్థించండి.

2.2   పేషంట్లకు సౌఖర్య వంతమైన వాతావరణాన్ని సృష్టించాలి

  • పేషంట్లు సంప్రదించడానికి వచ్చినప్పుడు వారిని ప్రేమతో ఆహ్వానించి వారికి ఒక సౌఖర్యవంతమైన వాతావరణాన్ని సృష్టించండి.
  • అభ్యాసకురాలయితే ఆడ పేషంటుకు సమీపంగా కూర్చుని మాట్లాడవచ్చు.

2.3  పేషంట్ల సమస్యలను శ్రద్ధగా వినటం

  • పేషంట్లను వారి సమస్యలను వివరించడానికి అనుమతించి ఓర్పుతో వినండి. పేషంట్లకు సురక్షితమైన అనుభూతిని కలిగించటం మరియు ఓర్పుతో వాళ్ళ సమస్యలను వినటం చికిత్సనివ్వడానికి కావాల్సిన ప్రధాన అంశాలు. 
  • పేషంట్లకు నాణ్యమైన సమయాన్ని ఇవ్వండి మరియు వాళ్ళ మీద మీ దృష్టిని కేంద్రీకరించండి.
  • మీరు ప్రేమతో వింటే పేషంటు హృదయంలో దాగియున్న మరికొన్ని సమస్యలు వెలుపలికి వస్తాయి. ఈ విధంగా వైద్య ప్రక్రియ ప్రారంభమవుతుంది.

 2.4   స్వామితో అనుసంధానం   

  • పేషంటు సమస్యలను వింటున్నపుడు స్వామితో అంతర్గతమైన అనుసంధానం కొనసాగించాలి.
  • లోపలనుండి స్వామీ మార్గదర్శకత్వాన్ని వినండి.
  • పేషంటు సమస్యలను ‘స్వామి వలె’ మనం ప్రేమతో వినాలి మరియు పూర్తి సెషన్ను స్వామి స్వాధీనంలోకి తీసుకునేలా ప్రార్థించాలి.

2.5  కుటుంబ మరియు వ్యక్తిగత సంప్రదింపులు

కుటుంబ సంప్రదింపులో, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని కొందరు సభ్యులు, తమ కుటుంబoలోని ఇతర సభ్యులకు సమస్యలను బహిర్గతం చేస్తారు. మరోవైపు, పరస్పర సంప్రదింపులో, కొంతమంది పేషంట్లకు తమ సమస్యలను వివరించటం మరింత సౌఖర్యంగా ఉంటుంది.

3.0  చర్చ ప్రశ్నలు

3.1 ప్రశ్న:  పేషంట్లకు హో'ఒపోనోపోనో పదబంధాలైన "నన్ను క్షమించుము, ధన్యవాదాలు, నేను నిన్ను/మిమ్మల్ని ప్రేమిస్తున్నాను" అని చెప్పమని సిఫార్సు చేస్తున్నాము. మంత్రాలను నేను ఎవరిని ఉద్దేశించి చెప్పాలి? [సంపాదకుడి వ్యాఖ్యానం: అభ్యాసకుడు, హవాయిలో ఇతరులను క్షమించడానికి ప్రయోగించబడే, హో'ఒపోనోపోనో మంత్రాన్ని సూచిస్తున్నారు.]

వ్యాఖ్యానం:

  •  ఈ పదాలను ఏ ఒక్క వ్యక్తిని ఉద్దేశించి చెప్పబడవు. ఇవి సాధారణంగా విశ్వానికి చెప్పబడుతాయి.
  •  ఈ పదాలు ఆత్మను సూచించి చెప్పబడేవి. మీ జీవితం, మీ యొక్క చర్యలు మరియు మీ జీవనశైలి యోక్క ఫలితం. ఇప్పటివరకు మీరు మీ ఐదు ఇంద్రియాల ద్వారా విషపదార్తాలను తీసుకోవడం జరిగింది. ఈ మంత్రాలను చెప్పుకోవడం ద్వారా, మీ జీవితంలో జరిగే ప్రతియొక్క విషయానికి మీరు భాద్యత తీసుకున్నట్లు అవుతుంది. మీ జీవితంలో జరిగేవన్నీ మీరు సృష్టించుకున్నవే. ఇవి చెప్పడంతో మీ తప్పును గుర్తించి, క్షమాపణ చెప్పి దివ్య ప్రేమపై మీ దృష్టిని మళ్ళించాలి. ఇలా చేయడం ద్వారా పూర్తి నివారణ కలిగి స్వచ్చత ఏర్పడుతుంది.

3.2  Question: పేషంటుకు తను రకమైన తలనొప్పితో భాధపడుతున్నాడో నిశ్చితగా తెలియకపోతే మీరు ఏంచేస్తారు?       
వ్యాఖ్యానం: CC11.3 Headaches మరియు CC11.4 Migraines, రెండు చేర్చి ఇవ్వండి.

3.3. ఒక క్లిష్టమైన కేసు పై చర్చ: తీవ్రమైన అసూయతో భాదపడుతున్న ఒక మహిళ

ఒక సాయి భక్తురాలు తన ఆడపడుచుకున్న సద్గుణాల కారణంగా, ఆమె మీద చాలా అసూయ పడేది. ఆమెకు వైబ్రోతో పాటు వివిధ విధానాలు సూచించడం జరిగింది:

  • హో'ఒపోనోపోనో పదబంధాలు స్మరించు (పైన చూడండి)
  • ఒక ప్రక్షాళన వ్యాయామాన్ని పాటించాలి: కళ్ళు మూసుకొని, మూడు సార్లు దీర్గ శ్వాస తీసుకోవాలి. ఆపై మీ ఎదురుగా ఒక తెల్ల బోర్డ్ ఉన్నట్లుగా ఊహించుకోవాలి. మీకున్న ప్రతికూలమైన ఆలోచనలను మీరు ఊహించుకున్న తెల్ల బోర్డుమీద వ్రాయండి. తర్వాత వాటిని శుబ్రంగా తుడిచివేయండి. ఇలా చేయడం ద్వారా మీ మనస్సులో ఉన్న ప్రతికూలమైన ఆలోచనలన్నీ తొలగి, మీ ఊహలో శుబ్రపడిన తెల్ల బోర్డువలె స్వచ్చంగా మారుతుంది.( ఆధారం: డా.శ్రీకాంత్ సోలా, సువర్ణ  యుగం వర్క్ షాప్ )
  • ఆత్మ ప్రేమ, ఆత్మ ఎరుక మరియు ఆత్మ విశ్వాసం పెంచుకోవాలి. పేషంటు యొక్క సోదరి ఆత్మ స్థాయిలో పేషంటు కున్న సద్గుణాలనే ప్రతిబింబిస్తోంది. క్రింద వ్రాసియున్న వివిధ పద్ధతులు సహాయపడతాయి: ధ్యానం చేయడం, స్వామి యొక్క బోధనలు మరియు ఇతర ఆధ్యాత్మిక రచనలు చదవడం, (మైఖేల్ బ్రౌన్ ప్రెజెన్స్ ప్రాసెస్ ఉదహరించబడింది) మరియు సానుకూల నిర్ణయాలు ఉపయోగించడం (లూయిస్ హే పుస్తకాలు నుండి).
  • ఫిల్లిస్ క్రిస్టల్ యొక్క హార్ట్-రిబ్బన్ సాంకేతికతను ఉపయోగించండి: కళ్ళు మూసుకుని, మూడు సార్లు దీర్గ శ్వాసను తీసుకుని, మీ ఇష్టమైన దేవత యొక్క చిత్రంలో, దేవత యొక్క గుండె ప్రాంతం నుండి  సువర్ణ కాంతి, ఒక రిబ్బన్ వలె వచ్చి మీ హృదయంలో కలుస్తున్నట్లు ఊహించుకోవాలి. తర్వాత ఈ రిబ్బన్ మీ గుండెనుండి మీకే వ్యక్తిపైనయితే ప్రతికూలమైన ఆలోచనలు ఉన్నాయో, ఆ వ్యక్తియొక్క గుండె ప్రాంతానికి చేరుతున్నట్లు ఊహించుకోవాలి. ఆపై ఈ రిబ్బన్ తిరిగి దేవత యొక్క గుండె ప్రాంతానికి చేరుకున్నట్లు ఊహించుకోవాలి. ఈ విధంగా ఒక త్రికోణ ఆకారంలో ఈ రిబ్బన్ కదులుతున్నట్లు ఊహించుకోవాలి. ఈ ప్రక్రియ ద్వారా మానవులందరికీ దైవం యొక్క ప్రేమ సమానంగా లభిస్తుందని బలమైన నమ్మకం కలుగుతుంది.

3.4 వివిధ రోగాలకు చికిత్స ( అభ్యాసకుల చర్చ)

సలహాలు చేర్చబడ్డాయి:

3.4.1 కోపం మరియు భయానికి

  CC4.2 Liver and Gallbladder tonic + CC4.10 Indigestion + CC13.1 Kidney & Bladder tonic  కంబోలు చేర్చివ్వడం ఉపయోగకరంగా ఉంటుంది.

3.4.2 నిద్రలేక పోవడం సమస్య

  •  CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic + CC15.6 Sleep disorders ఉపయోగించండి నిద్ర పోవడానికి అరగంట ముందు ఒక డోస్ వేసుకోవాలి. అవసరమయితే అరగంటకి ఒకసారి చప్పున మరో రెండు డోసులు తీసుకోవచ్చు. మానసిక సమస్యలుండే సంభావ్యత ఉంటె CC15.2 Psychiatric disorders + CC18.1 Brain disabilities చేర్చవచ్చు.
  • SM2 Divine Protection చేర్చడం వలన  విజయవంతమైన ఫలితాలు లభిస్తున్నాయి.

3.4.3 మూర్చ రోగానికి

  CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC18.1 Brain disabilities + CC18.3 Epilepsy ఇవ్వండి.

3.4.4  మధుమేహం సమస్యకు

  •  డయాబెటిస్ కాంబోలో CC13.1 Kidney & Bladder tonic చేర్చి ఇవ్వండి.
  • ఈ రోగ లక్షణాలు తగ్గాక వైబ్రో మందులని వెంటనే ఆపి వేయరాదని పేషంట్లను హెచ్చరించండి. బదులుగా పేషంట్లను తమ డాక్టర్తో అల్లోపతి మందుల తగ్గింపు గురించి చర్చించమని చెప్పండి.
  •  పేషంటు శరీరం సాధారణ స్థితిని పొందడానికి మరి కొన్ని సంవత్సరాలు పడుతాయి కాబట్టి చక్కర, బిస్కెట్లు మరియు బ్రెడ్ వంటి ఆహార పదార్థాలను తీసుకోరాదని చెప్పాలి.
  • మధుమేహ రోగులకు చిట్కాలు: ఒక గరిటెడు దాల్చిన చెక్క పొడి, పెరుగు మరియు వెల్లుల్లి ఉదయం తీసుకొని 45 నిమిషాలు ఆగి రోజువారి కార్యకలాపాలు చేసుకోవడం మంచిది.

3.4.5  వెన్ను నొప్పి:

  • సమస్యకు CC20.5 Spine సరియైన మందు.
  • రోగికి ఆందోళన మరియు ఒత్తిడి వంటి మానసిక సమస్యలు ఉన్నాయని భావిస్తే add CC15.1 Mental & Emotional tonic చేర్చివ్వాలి. కాని CC4.2 Liver & Gallbladder tonic + CC13.1 Kidney & Bladder tonic  చేర్చడం చాలా ముఖ్యం.

3.4.6 Psychosomatic disorders:

 CC15.1 Mental & Emotional tonic + C15.2 Psychiatric disorders + CC17.3 Brain and Memory tonic ఇవ్వండి.

3.5  CCల యొక్క వినియోగంపై వ్యాఖ్యానాలు:

 3.5.1 CC17.2 ప్రక్షాళన

  • ఈ కాంబో వలన ‘పుల్ అవుట్’ వచ్చే అవకాశం ఉంది. ఈ కారణంగా చికిత్స చివరిలో (70% వరకు నయం అయ్యాక) కాని చికిత్స పూర్తయిన తర్వాత కాని ఇవ్వడం మంచింది.
  • ఈ కాంబోని రోగి యొక్క పర్యావరణం యొక్క బాహ్య ప్రక్షాళన కొరకు వాడుతున్నారు.

 3.5.2 CC12.1 Adult tonic

ఇది చికిత్స ప్రారంభంలో బలాన్ని పెంచడానికి ఇవ్వాలి.

ఓం సాయి రామ్