Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

అదనపు సమాచారం

Vol 2 సంచిక 5
September 2011


బరువును అదుపులో ఉంచే కొబ్బరి నూనె 

ఊబకాయం మరియు జీవక్రియ రుగ్మతల అంతర్జాతీయ జర్నల్ లో ప్రచురించిన అనేక అధ్యయనాలు, కొబ్బరి నూనె భరువును అదుపులో ఉంచడానికి సహాయపడుతుందని చెబుతున్నాయి. ఒక పరిశీలనలో, కొబ్బరి నూనెను తిన్న స్థూలకాయ పురుషుల్లో కొవ్వు కరగటం మరియు కాలరీల ఖర్చు వేగవంతంగా జరుగుతోందని మాత్రమే కాకుండా శరీరంలో కొవ్వు నిలవటం కూడా తగ్గిందని తెలిసింది. మరొక పరిశీలన, 27 రోజుల పాటు పద్యం చేసిన మహిళల్లో చేయబడింది. వీరు తీసుకున్న ఆహారంలో, రోజువారి కేలరీలలో 30%, కొబ్బరి నూనెలో ఉండేవిధంగా, మధ్యస్థ శృంఖల ట్రైగ్లిజరైడ్స్ (MCTs) నుండి వచ్చాయని మరియు అవి కొవ్వును మరియు కేలరీలను వేగంగా తగ్గించడానికి సహాయపడతాయని తెలిసింది. MCTలు పెద్ద ప్రేగులో ఉండే ఆరోగ్యకరమైన బాక్టీరియాను పోషించడమే కాకుండా జీర్ణకోశములో ఉండే హానీకరమైన వ్యాదికారకులతో పోరాడుతుంది.

కొబ్బరి నూనెలో లారిక్, కాప్రిక్ ఆమ్లాలు వంటి ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. లారిక్ ఆమ్లం హానీకరమైన సూక్ష్మజీవులతో పోరాడటమే కాకుండా H.pylori వంటి బాక్టీరియం నుండి రక్షిస్తుంది. కాప్రిక్ ఆమ్లానికి ఈస్టు తో పోరాడే లక్షణములున్నాయి. కొబ్బరి నూనె, ఒమేగా-3 నూనెల వలే, గుండెజబ్బుకు ఒక కారకమైన రక్తం యొక్క జిగటను తగ్గిస్తుంది. న్యూ గినియాలో త్రోబ్రియాండ్ ద్వీప స్థానికులు తీసుకొనే రోజువారి ఆహారంలో, 80% కేలరీలు కొబ్బరి మరియు కొబ్బరి నూనె నుండి వస్తున్నాయి. వారికి గుండెజబ్బు లేదా స్ట్రోక్ సమస్యలు ఏమాత్రము లేవు  మరియు శరీరంలో అదనపు కొవ్వు తక్కువున్నవారిగా ఈ ద్వీప స్థానికులు గుర్తించబడుతున్నారు.

భరువు తగ్గించడానికి ఎంత కొబ్బరి నూనెను తీసుకోవాలని తెలుసుకోవడానికి మరింత పరిశోధన అవసరం. అయితే కొబ్బరి నూనెతో వంట చేయవచ్చు, స్మూతీ తో పాటు చేర్చవచ్చు,  అన్నం లేదా పాస్తా పైన వేసుకోవచ్చు మరియు ఏ కూరలోనైనా చేర్చుకోవచ్చు. కాబట్టి ప్రతిసారి మీరు ఆహారం తీసుకొనే సమయంలో ఒక పెద్హ చెంచాడు కొబ్బరి నూనెను తీసుకుంటే మంచిది. మీరు కొబ్బరి నూనెను కొనేడప్పుడు చీటిపై "RBD" ముద్ర వేసియుంటే కొనరాదు. దీనికి "శుద్ధి మరియు దుర్గంధ హరము చేయబడిందని మరియు అది రసాయనాలతో ప్రాసెస్ (క్రమిక) చేయబడిందని అర్థం. "పచ్చి కొబ్బరి నూనె" లేదా "సేంద్రీయ కొబ్బరి నూనె" అని సూచించబడిన కొబ్బరి నూనెను మాత్రమే కొనండి.

మూలం:సాల్లీ ఫాలోన్ మోరెల్, MA అధ్యక్షుడు, వెస్టన్ A  ప్రైస్ ఫౌండేషన్ 

 

ఒంటరిగా ఉన్న సమయంలో గుండెపోటు వస్తే ప్రాణరక్షణ ఎలా చేసుకోవాలి?

గుండెపోటుతో భాదపడుతున్న రోగికి, స్పృహ కోల్పోవడానికి పది సెకన్ల సమయం మాత్రమే ఉంటుంది. ఒంటరిగా ఉన్న రోగులు తమను రక్షించుకోవడానికి ఈ విధముగా చేయాలి: భాదితులు తీవ్రంగా మరియు పదే పదే దగ్గుతూ ఉండాలి. ప్రతియొక్క దగ్గుకి ముందు, ఒక లోతైన శ్వాసను తీసుకోవాలి మరియు దగ్గు లోతైనదిగాను మరియు దీర్ఘమైనదిగాను ఉండాలి.

సహాయమందే వరకు లేదా గుండె సాధారణంగా మళ్ళి కొట్టుకొనే వరకు, ప్రతిరెండు సెకన్లకు ఒకసారి, ఆపకుండా ఒక శ్వాస తీసుకొని, ఒక మారు దగ్గుతూ ఉండాలి.

శ్వాసను లోతుగా తీసుకోవడం ద్వారా ఊపిరితిత్తులలోకి ఆక్సిజన్ చేరుతుంది మరియు దగ్గడం ద్వారా గుండె అదుముకొని రక్త ప్రసరణ సక్రమముగా జరగడానికి వీలుంటుంది. ఈ విధముగా నొక్కుకోవడం ద్వారా, గుండె సాధారణ లయకు తిరిగి చేరుకుంటుంది. ఈ విధముగా కుదుటపడ్డాక గుండెపోటు భాదితులు ఆశ్పత్రిని చేరుకోవచ్చు. ప్రాణాలను రక్షించే ఈ క్రియను గురించి సాధ్యమైనంతవరకు అందరికి తెలియచేయండి. 

 

మీ కాళ్ళకు కొవ్వు కలిగించే హానిని సూచించే 11 లక్షణాలు 

కొవ్వు గుండెలో ఉన్న రక్త నాళాలలో ఆటంకం కలిగిస్తుంది. అయితే, కాళ్ళ పైన కూడా దాని ప్రభావాన్ని చూపించి, PAD లేదా పరిధీయ ధమనీయ వ్యాధికి (పెరిఫెరల్ ఆర్టిరియల్ డిసీస్) దారితీయవచ్చు. US లో 12 మిల్లియన్ల ప్రజలకు మరియు ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి PAD వ్యాధి ఉంది. ఈ వ్యాధి గుండెజబ్బు, గుండెపోటు మరియు స్ట్రోక్ వంటి వ్యాధులకు   దారితీసేప్రమాదముందని మొన్టేఫియోర్ మెడికల్ సెంటర్లో ఒక ఉన్నత ఇంటర్వెన్షనల్ చికిత్సకు చెందిన డేవిడ్ స్లోవుట్, MD చెబుతున్నారు. ఐదేళ్ళ తరవాత, 20 శాతం PAD భాధితులకు ప్రాణాంతకం కాని గుండెపోటు వస్తుంది.

మీకు PAD ఉండుంటుందని సూచించే 11 లక్షణాలు. శుభవార్త ఏమిటంటే వ్యాధిని పూర్తిగా నయంచేయవచ్చు.

కాళ్ళ నొప్పి

కాళ్ళల్లో ఒక విధమైన నొప్పి లేదా అసౌకర్యం లేదా కాళ్ళు చచ్చుబడి పోవడం PAD వ్యాధి యొక్క సాధారణమైన లక్షణములు. రక్త నాళాలలో అడ్డంకం  ఉన్న కారణంగా పరిశ్రమ లేదా వినియోగం తర్వాత కాళ్ళకి కావలిసిన రక్త ప్రసరణ సక్రమంగా జరుగదు. డా.స్లోవుట్ అంటున్నారు "కాళ్ళు భరువుగానో లేదా అలసటగానో లేదా మండుతున్నట్లుగా ఉంటున్నాయని కొంత మంది చెబుతారు". నొప్పి, కాలి యొక్క ఏ భాగంలోనైనా ఉండవచ్చు మరియు ఒక కాలు లేదా రెండు కాళ్ళల్లోను ఉండవచ్చు. నొప్పి పునరుత్పాదకమైనదిగా కూడా ఉండవచ్చు: కొంత దూరం నడవగానే నొప్పి వచ్చి, కొంత సమయం విశ్రాంతి తీసుకోగానే తగ్గుతుంది, తిరిగి అదే దూరం నడచి వెళ్ళినప్పుడు నొప్పి ఏర్పడుతుంది.

రాత్రివేళ తిమ్మురులు

నిద్రిస్తున్న సమయంలో PAD భాధితులకు, మడమ,ముందరికాలు లేదా కాలి వేళ్ళల్లో  తిమ్మురులు లేదా ఈడ్పులు వచ్చే అవకాశముందని, న్యు యార్క్ ప్రెస్బైటీరియన్ ఆశ్పత్రి / వైల్ కార్నెల్ మెడికల్ సెంటర్ వద్ద  వాస్కులర్ అండ్ ఎండోవాస్క్యులర్ సర్జరీ సెంటర్ కు నిర్వాహకుడైన డారెన్ స్క్నీడెర్, మద్ చెబుతున్నారు. కుర్చీలో కూర్చోవడం లేదా మంచం నుండి కాళ్ళను క్రిందకు వేళాడనీయడం ద్వారా ఉపశమనం పొందవచ్చని ఈ డాక్టర్గారు చెబుతున్నారు.

చర్మం మరియు గోళ్ళలో మార్పులు

PAD వ్యాధి కారణంగా కాలి వేళ్ళ గోళ్ళు మరియు కాలి చర్మంపై మార్పులు ఏర్పడవచ్చు. కాళ్ళల్లో రక్త ప్రవాహం సక్రమంగా జరగనందువల్ల, వాటికి పోషణ అందదు. దీని కారణంగా కాళ్ళు మరియు పాదాల పై ఉండే జుట్టు వ్రాలిపోవడం మరియు కాళ్ళ పైనున్న చర్మం మెరుస్తూ, భిగుసుగా మారుతుంది. ఈ లక్షణములన్ని సాధారణంగా ఒకే సమయంలో కనిపిస్తాయని డా. స్క్నీడెర్ చెప్పారు.

అసాధారణ చర్మ రంగు

మిమ్మల్ని పరిశీలించే సమయంలో వైద్యులు ముఖ్యంగా మీ కాళ్ళ రంగులో మార్పుందాయని పరిశీలన చేస్తారు. కాలు పైకెత్తినప్పుడు రక్త ప్రవాహం తక్కువగా ఉండటం కారణంగా కాళ్ళ రంగు తెల్లగా ఉంటుంది. ఒక బల్లపై కూర్చుని కాలును వేళాడతీసినప్పుడు కాలి రంగు ఎర్రగానో లేదా ఊదా రంగులోకి మారవచ్చని డా.స్క్నీడెర్ చెబుతున్నారు. దీనికి కారణం ఏమిటంటే కాళ్ళకు అందే రక్త ప్రవాహాన్ని పెంచడానికి శరీరంలో ఉన్న రక్త నాళాల వెడల్పు అధికమవుతుంది. ఈ వ్యాదియున్న కొంత మందికి, రక్త ప్రవాహం సక్రమంగా జరగనందు వల్ల, పాదాలు లేదా కాలి వెళ్ళు పాలిపోయిన రంగులో లేదా నీలం రంగులోకి మారుతాయి.

చల్లటి పాదాలు

పాదాలు లేదా కాళ్ళు చల్లగా ఉండడం PAD వ్యాధికి మరొక సూచిక. కాని ఇది ఒక ఉత్తమ సూచన కాదని డా.స్క్నీడెర్  చెబుతున్నారు. ఎందుకంటే ఈ సమస్య PAD వ్యాధి లేని వ్యక్తుల్లో కూడా ఉండవచ్చు. అయితే, మీకు ఒక కాలు లేదా ఒక పాదం మాత్రం చల్లగా ఉన్నట్లు అనిపిస్తే కనుక, వెంటనే మీరు వైద్యుడును సంప్రదించడం మంచిది.

నయంకాని పుళ్ళు

PAD వ్యాధి పురోగమించిన రోగులలో, రక్త ప్రవాహం తగ్గిపోవడం కారణంగా పాదాలలో పుళ్ళు ఏర్పడతాయి. ఇస్కేమిక్ పుళ్ళు అనపడే వీటికి వెంటనే చికిత్సనివ్వడం మంచిది. లేదంటి ఇవి నయంకావు. ఈ పుళ్ళు నలుపు లదా గోధుమ రంగులో ఉండవచ్చు. ఇవి చాలా నొప్పిగా ఉంటాయి (మధుమేహం సంభందిత పుళ్ళు, ఈ వ్యాధి ద్వారా జరిగిన నరాల నష్టం కారణంగా, నొప్పిగా ఉండవు)

ఎరిక్టైల్ డిసఫంక్షన్

ఈ లక్షణము సంభవించే అవకాశం చాలా తక్కువ కాని కొంత మందిలో ఈ లక్షణము కూడా ఉండవచ్చని డా.స్లోవుట్  చెబుతున్నారు. అంతర్గత కీగడుపు సంభంధమైన ధమనులు నిగుడుటకు కావలిసిన రక్త సరఫరానిస్తాయి. ఈ ధమనులలో అడ్డంకులు ఏర్పడినప్పుడు ఎరిక్టైల్ డిసఫంక్షన్ ఎరిక్టైల్ డిసఫంక్షన్ కు (ED) దారి తీస్తుంది. రక్త నాళ సమస్య కారణంగా ED లక్షణమున్న రోగులు చాలా తక్కువని డా.స్లోవుట్ చెబుతున్నారు.

తిమ్మిరి లేదా బలహీనత

విశ్రాంతి సమయంలో మీ కాళ్ళు బలహీనంగా లేదా తిమ్మిరెక్కిన్నట్లుంటే కనుక, అది PAD యొక్క సూచిక కావచ్చని డా.స్క్నీడెర్ చెబుతున్నారు. సాధారణంగా PAD సమస్య తీవ్రంగా ఉన్న రోగులకు, కేవలం నడిచేడప్పుడు మాత్రమే కాకుండా విశ్రాంతి సమయంలో కూడా ఈ లక్షణములుంటాయి.

కాలిపిక్క కండరాల క్షీణత

PAD తీవ్రమైన దశలో ఉన్న రోగులు కాలిపిక్క కండరాల యొక్క క్షీణత లేదా పరిమాణం తగ్గడం వంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశముంది. అతిసూక్ష్మ స్థాయిలో, తగినంత రక్త ప్రవాహం లోపించడం కారణంగా కండరపు పోగు యొక్క సంఖ్య మరియు పరిమాణం క్షీణించిపోతుంది. నిజానికి, తీవ్రమైన PAD సమస్య ఉన్నవారు, ప్రభావితమైన ప్రాంతంలో సగానికి పైగా కండరాలు కోల్పోతారు. అంతేకాకుండా, మిగిలిన కండరపు  పోగు క్షీణించవచ్చు.

కణజాల క్షీణత

PAD భాదితులలో 80% మంది స్వల్ప రోగ లక్షణాల దశను ధాటి ముందుకి వెళ్ళరని మరియు ఈ వ్యాధి యొక్క తీవ్ర దశను అనుభవించే వారి సంఖ్య చాలా తక్కువని డా.స్క్నీడెర్ చెబుతున్నారు. ముదిరిన దశలో, ఈ వ్యాధి కణజాల క్షీణతకు మరియు అంగ, ప్రాణ హాని కలిగించే కండను తినిపొయ్యే పుళ్ళకు (గెంగ్రీన్) దారితీయవచ్చు. ముదిరిన  PAD భాదితులలో అంగ విచ్చేదనం చేసే అవసరం రావచ్చు. అయితే, కాళ్ళల్లో రక్త ప్రసరణ మెరుగుపరచడానికి ధూమపానం మానివేయడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని, ఔషధాలను తీసుకోవడం మరియు బైపాస్ లేదా యాంజియోప్లాస్టీ వంటి శస్త్ర చికిత్సలను చేయించుకోవడం వంటివి సహాయపడతాయి.

రోగ లక్షణములు లేకపోవడం

చాలా మంది PAD భాధితులకు ఈ వ్యాధి లక్షణాలేవి కూడా ఉండవు. అయితే, ఈ వ్యాధి కారణంగా గుండె పోటు మరియు స్ట్రోక్ల సంభావ్యత పెరిగే ప్రమాదముంటుంది కాబట్టి PAD సంభవించే ప్రమాదం ఎక్కువున్న వ్యక్తులు, తగిన పరీక్షలను చేయించు కోవడం మంచిది. క్రింది వ్యక్తులలో PAD సంభవించే అవకాశం ఎక్కువుంది: పొగ తాగేవారు, 50 సంవత్సరాల వయస్సు దాటిన వారు మరియు మధుమేహం ఉన్నవారు. క్రింది రోగ సమస్యలు మీకుంటే కనుక, మీకు PAD వచ్చే సంభావ్యత ఎక్కువగా ఉంటుంది: అధికమైన కొవ్వు, రక్తపోటు మరియు గుండె జబ్బు ,స్ట్రోక్ వంటి సమస్యలున్న కుటుంభ చరిత్ర కలిగియున్న వారు.  మూలం:Health.com

Om Sai Ram