Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

డా.జిత్. కే అగ్గర్వాల్ యొక్క మాటల్లో

Vol 5 సంచిక 5
September/October 2014


ప్రియమైన చికిత్సా నిపుణులకు,

ఈ సంచిక రెండు అంశాల్లో మనం అధిగమించిన ఒక మైలు రాయిని సూచిస్తుంది. మొదటిది ఈ సంచికతో మనం నాలుగవ     

వార్షికోత్సవానికి చేరుకున్నాము. సాయి వైబ్రియానిక్స్ వార్తాపత్రిక యొక్క ప్రచురణ 2010 సెప్టెంబర్ లో మొదటి సంచికతో ప్రారంభమైంది. ఇది సమర్పించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నేను ఒక కాపీని ముద్రించి స్వామి దర్శనానికి తీసుకు వెళ్ళాను. దర్శనంలో కూర్చున్నప్పుడు నేను అడగకుండానే స్వామి నన్ను పిలిచి వార్తాలేఖను వారు ఒక్కొక్కటిగా లేఖలోని 4 పేజీలనూ చూసి ఎంతో సంతోషంతో ఆశీర్వదించారు. కృతజ్ఞతతో నా హృదయం ఆనందంతో ఉప్పొంగింది. ఈ వార్తా పత్రిక ప్రచురణ వారి దయ వల్ల మాత్రమే ఇలా నిరవధికంగా కొనసాగుతోందని నాకు తెలుసు.

ప్రధానంగా ఈ వార్తాలేఖ ఒక సమస్యను పరిష్కరించడానికి ఆవిర్భవించింది. 2010 నాటికి సాయి వైబ్రియానిక్స్ శిక్షకులు 16 సంవత్సరాలుగా అభ్యాసకులకు మెంటరింగ్(గురువులుగా వ్యవహరించడం) చేస్తూ ఉన్నారు. భారత దేశము మరియు 80 ఇతర దేశాలలో ఇప్పటివరకు నాలుగు వేల మంది అభ్యాసకులు పని చేస్తూ ఉన్నారు. ఇంకా ఎంతోమంది అభ్యాసకులు తమ శిక్షణ పూర్తి చేసుకొని ప్రతీ సంవత్సరం వైబ్రియానిక్స్ సేవను ప్రారంభిస్తున్నారు. అయితే ఇది మాకు ఒక సమస్యను సృష్టించింది, మా ప్రధాన బృందంలోని ముగ్గురు లేదా నలుగురు సభ్యులు సూచించిన మేరకు: వైబ్రియానిక్స్ అభ్యాసకుల సంఖ్య ప్రతీ సంవత్సరం పెరుగుతున్నప్పటికీ మనం కోరుకున్నట్లుగా అందరితో సన్నిహిత సంబంధాలు కొనసాగించలేక పోతున్నాం. ప్రతి ఒక్కరికీ అవసరం మేరకు క్రమానుసారంగా సమాచారం అందించడానికి నియమితమైన మార్గం లేదు. కనుక ఈ మెయిల్ కు జోడించిన వార్తాలేఖ దీనికి మంచి పరిష్కారం అనిపించింది. కాబట్టి మేము అటువంటి ఏర్పాటు చేయడానికి  పూనుకున్నాము.

 ముందుకు సాగిపోతూనే దీన్ని ఎలా కొనసాగించాలో నేర్చుకుంటూ వచ్చాము. ప్రాథమికంగా రెండు నెలలకు ఒకసారి వార్తాలేఖ ప్రచురింప బడటానికి ఏమి అవసరమో లేదా సాయిబాబా ఎవరిని మాకు సహాయం నిమిత్తం పంపుతారో తెలియని పరిస్థితిలో ఉన్నాము. అభ్యాసకులు దీన్ని ఎలా స్వీకరిస్తారో, ఎలా ఉపయోగించుకుంటారో, వారు ఏమి కావాలని కోరుకుంటున్నారో కూడా మాకు తెలియదు. అదృష్టవశాత్తు ఎంతోమంది అభ్యాసకులు తమ సమయాన్ని ప్రతిభను అందించడానికి ముందుకు రావడంతో ఈకార్యక్రమం రూపుదిద్దుకుంది. ఆ విధంగా వార్తాలేఖ ప్రచురణ సుసాధ్యం చేసిన గత మరియు ప్రస్తుత సహాయకులు అందరికీ ఎంతో కృతజ్ఞతలు.  

మనందరికీ  తెలిసినట్లుగా, వార్తాలేఖ ఇటీవల ఎంతో అభివృద్ధి చెందుతోంది. అభ్యాసకుల కేంద్రీకృత సమాచారం విస్తరిస్తోంది. ఈ మార్పులు వార్తాలేఖ  ప్రస్తుత లక్ష్యాన్ని ప్రతిబింబిస్తాయి. దీని లక్ష్యం  అభ్యాసకులు తమ రోగులకు సాధ్యమైనంత ఉత్తమమైన సాయి వైబ్రియానిక్స్ సంరక్షణ అందించడానికి అభ్యాసకుల సామర్థ్యాన్ని పెంపొందించడంలో సహాయ పడుట; నిరంతర విద్యను అందించుట మరియు  అభ్యాసకులకు సామాజిక దృక్పధాన్ని పెంపొందించుకోవడంలో వారికి సహాయ పడుట. అభ్యాసకులు  తమ అనుభవాన్ని మరియు జ్ఞానాన్ని పంచుకున్నప్పుడు, ఈ సేవ ఇతరులను వారి హృదయాలు తెరవడానికి, ప్రశ్నలు అడగడానికి మరియు భాగస్వామ్యం  అందించడానికి ప్రోత్సహిస్తుందని మేము భావిస్తున్నాము. వైబ్రియానిక్స్ పురోగతి కోసం మీ అనుభవాలను పంచుకోవడం చాలా అవసరమని మేము భావిస్తున్నాము. సామాజిక పురోగతిని సాధించడానికి ఐక్యత భావాన్ని పెంచుకోవడం ఎంత ముఖ్యమో స్వామి మనకు ఎన్నో సార్లు చెప్పారు.  .

మన ప్రధాన బృందము మరియు ఇతర శిక్షకులు తమకు తెలిసిన ప్రతి విషయాన్ని నేర్పుతూనే ఉంటారు. కానీ మీరు ఈ ప్రక్రియలో మీ పాత్రను కూడా సరియైన రీతిలో పోషించడం ఎంతో ప్రాధాన్యత కలిగిన అంశం. అభ్యాసకులు ఒకరికొకరు బోధించుకొనడానికి  మరియు నేర్చుకోవడానికి ఎన్నో ఉన్నాయి. సాయిరాం వైబ్రేషనల్ హీలింగ్ ప్రధానంగా అభ్యాసకులు తమ ఆచరణాత్మక జ్ఞానం మరియు అనుభవాన్ని అందించడం ద్వారానే ముందుకు సాగుతుంది. మరో మాటలో చెప్పాలంటే మన వార్తాలేఖ యొక్క ప్రధాన లక్ష్యం బోధన మరియు సహకారం రెండింటికి ఒక వాహకముగా ఉపయోగపడటమే.

ఈ సంచిక మరొక విషయంలో కూడా ఒక మైలురాయి అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు పిడిఎఫ్ ఆకృతిలో ప్రచురించిన వార్తా లేఖలలో ఇదే చివరిది. ప్రశాంతి నిలయంలోని మా ఈమెయిల్ సర్వర్ యొక్క పరిమితుల కారణంగా మేము ఇప్పటివరకూ పిడిఎఫ్ ఆకృతిని ఉపయోగిస్తూ వచ్చాము. అభ్యాసకులకు కంటెంట్ విషయంలో మరింత సౌలబ్యమ్ కలిగించడానికి వచ్చే సంచిక నుండి html  వెబ్ ఆధారిత వార్తాలేఖ గా మార్చాలని మేము ప్రణాళిక సిద్ధం చేస్తున్నాము. మీలో వార్తాలేఖను ముద్రించాలనుకునేవారు మరియు చదవాలనుకునేవారు కొత్త సంస్కరణల ద్వారా కొనసాగించవచ్చు. వార్త లేఖలోని విషయాలను ఆన్లైన్ ద్వారా యాక్సెస్ చేయడానికి ఇష్టపడేవారు ఇప్పుడు ఇంటరాక్టివ్ ఫార్మేట్ యొక్క ప్రయోజనం పొందవచ్చు. మీ డెస్క్టాప్, ల్యాప్టాప్, టాబ్లెట్ లేదా స్మార్ట్ ఫోన్ ఇంకా అలాంటి ఇతర పరికరాలతో వార్తాలేఖలు తెరమీద యాక్సెస్ చేసుకొని చదవవచ్చు. ఇందులోని అంశాలను మీరు ఏ క్రమంలో నైనా చదవచ్చు. అలాగే ప్రస్తుత వార్తాలేఖ లోని అంశాలు మరియు పాత వార్త లేఖలోని అంశాలు సెర్చ్ చేయడానికి లేదా శోధించడానికి ఇప్పుడు ఎంతో అనుకూలంగా ఉంటాయి. అనగా రోగులకు చికిత్సచేయడంలో మీకు సహాయపడటానికి అన్ని సంబంధిత అంశాలు శోధించడానికి  కీవర్డ్ లేదా కీలక పద శోధన  మరియు సబ్జెక్ట్ సెర్చ్ లేదా  విషయ శోధన ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు మీరు మధుమేహం  చికిత్సపై అన్ని రోగ చరిత్రలను శోధించవచ్చు లేదా నీటితో తయారుచేసిన నివారణ వాడకాన్నిత్వరగా మరియు సౌకర్యవంతంగా పోల్చవచ్చు.

వాస్తవానికి మేము ఈ సంచిక తోనే ఈ మార్పులన్నీ చేయాలనుకున్నాము. కానీ html మార్పిడి ప్రక్రియ ఆశించిన దానికంటే ఎక్కువ సమయం తీసుకుంటోంది. మా వంతు మేము కృషి చేస్తూనే ఉన్నాం కానీ ప్రతిదీ స్వామి సంకల్పం మేరకే జరుగుతుంది.

దీన్ని ముగించే ముందు నా వల్ల జరిగిన ఒక వ్యక్తిగత సాంకేతిక లోపం గురించి క్షమించ వలసిందిగా అభ్యర్థిస్తున్నాను. అభ్యాసకులు నాకు పంపిన కొన్ని పెండింగ్ ఈ మెయిల్ లు వాటికి సమాధానం ఇచ్చే లోపుగానే అనుకోకుండా నా కంప్యూటర్ నుండి  తొలగించబడ్డాయి. నేను రోజుకు అనేక డజన్ల కొద్దీ ముఖ్యమైన ఈ మెయిళ్లను స్వీకరిస్తాను. కాబట్టి ఈ తప్పిదం వల్ల ఎంతోమందికి ఇబ్బంది కలిగి ఉండవచ్చు. ప్రతీ ఈ మెయిల్ కు సమాధానం ఇవ్వడమే నా యొక్క విధానము. కాబట్టి మీరు నా నుండి ప్రత్యుత్తరం పొందకపోతే దయచేసి మీ సందేశాన్ని తిరిగి పంపండి. ఈ తప్పిదానికి మరొకసారి క్షమాపణలు వేడుకుంటున్నాను. అర్థం చేసుకున్నందుకు మీకు ధన్యవాదాలు.

ప్రేమ పూర్వక సాయి సేవలో మీ

జిత్.కె. అగ్గర్వాల్