Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

దివ్య వైద్యుని దివ్య వాణి

Vol 14 సంచిక 6
నవంబర్ / డిసెంబర్ 2023


ప్రజలు తాము తిన్నప్లేట్ నుండి పైకి లేవడానికి చాలా అవస్థ పడేంత పెద్ద మొత్తంలో ఆహారం పొట్టలో నింపు కుంటారు. సంపన్నులు ఖరీదైన, ఆర్భాటంతో కూడిన విందులు చేస్తూ గర్వపడతారు కానీ భారీ ఆహారాలు తీసుకోవడం ద్వారా వారి జీర్ణ వ్యవస్థను నాశనం చేసుకుంటున్నామని అర్ధం చేసుకోరు. శారీరిక ఆరోగ్యమే గొప్ప సంపదని తెలిసినవారు సాత్వికమైన ఆహారం మాత్రమే తినడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. పూర్తిగా ఉడకని ఆహారము, కాయలు మరియు పండ్లు, మొలకెత్తిన విత్తనాలు ఉత్తమమైనవి. రోజులో కనీసం ఒక్క సారి ఉదాహరణకి రాత్రి భోజన సమయంలో వీటిని ఉపయోగించండి, ఇది సుదీర్ఘ జీవితాన్ని అందిస్తుంది”. 

... శ్రీ సత్య సాయి వాణి, సేవపై దివ్య వాణి చక్కని ఆరోగ్యం-మంచిదనం,  సంచిక 15, అధ్యాయము 21,30 సెప్టెంబర్ 1981                                              https:sssbpt.info/ssspeaks/volume15/sss15-21.pdf

 

సేవ చేస్తున్నప్పుడు హనుమంతుని ఉదాహరణగా తీసుకోండి. అతను అన్ని రకాల ఆటంకాలను లెక్కచేయకుండా ధర్మానికి యువకుడైన రాముడిని సేవించాడు అతను బలవంతుడు, విద్యావంతుడు మరియు గుణవంతుడు అయినప్పటికీ అతనికి కొంచం కూడా గర్వం లేదు. అతను చాలా ధైర్యంగా లంకలో ప్రవేశించి అక్కడ రాక్షసులు ఎవరు నీవు అని అడిగినప్పుడు తనను తాను చాలా వినయంగారాముని సేవకుడనుఅని వర్ణించుకున్నాడు. సేవ ద్వారా మనలో తీసుకురావాల్సిన అహంకార నిర్మూలనకు ఇది ఒక చక్కని ఉదాహరణ. అహం ప్రభలంగా ఉన్నప్పుడు ఎవరు మరొకరికి సేవ చేయలేరు. పరస్పర సహాయ దృక్పథం మరియు నిస్వార్థ సేవా దృక్పథం మనిషి లో మానవత్వాన్ని అభివృద్ధి చేస్తుంది మరియు అతనిలో నిక్షిప్తమైన దైవత్వాన్ని ఆవిష్కరించడానికి సహాయపడుతుంది”.   

 ... శ్రీ సత్య సాయి వాణి, సేవపై దివ్య వాణి http://Dal Conference, “సేవా సాధన పై పాఠాలు  సంచిక 15,అధ్యాయం 31, 19 నవంబర్ 1981                                            http://sssbpt.info/ssspeaks/volume15/sss15-31.pdf