Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

అదనంగా

Vol 13 సంచిక 2
మార్చ్ / ఎప్రిల్ 2022


1 ఆరోగ్య చిట్కాలు

మీ రోగ నిరోధక శక్తిని తెలుసుకొని అభివృద్ధి పరుచుకోండి!

మీరు అనారోగ్యం బారిన పడకుండా చూడటమే ఉత్తమమైన మరియు తెలివైన పని అని నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. వైద్యుల యొక్క పవిత్ర కర్తవ్యం ఏమిటంటే ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి మరియు వ్యాధి ఎలా నివారించాలి అనేది ప్రజలకు తెలియ చెప్పడం మరియు గ్రామస్తులకు వ్యాధుల నుండి దూరంగా ఉండే పద్ధతుల గురించి అవగాహన కల్పించడం. అనారోగ్య సమయంలో  మాత్రమే ఔషధం విలువైనదిగా పరిగణింపబడుతుందని వ్యాధి నివారణతో దాని ప్రయోజనం ముగుస్తుందనేది ప్రస్తుత నమ్మకం. కానీ ఈ నమ్మకంలో మార్పు రావాలి. ఔషధం  అనేది అనారోగ్యం బారిన పడకుండా చూడటానికి మాత్రమే అనేది గ్రహించాలి”  ...       ‘

శ్రీ సత్య సాయి బాబా 1,2

1. రోగ నిరోధక శక్తి అంటే ఏమిటి ?

రోగ నిరోధక శక్తి అనేది శరీరంలో స్వీయ రక్షణా వ్యవస్థను పటిష్ఠం చేయడానికి, హానికరమైన విదేశీ కారకాలను నిరోధించడానికి ,అలాగే ఇన్ఫెక్షన్ల్ నుండి తనను తాను రక్షించు కోవడానికి ఉన్నటువంటి ఒక రక్షణ యంత్రాంగము. ఈ స్వయం వ్యవస్థలో కణాలు, కణజాలాలు, మరియు అవయవాలు ఉంటాయి. విదేశీ కారకాలు అంటే వైరస్, బ్యాక్టీరియా, ఇతర వ్యాధి కారకాలు మరియు టాక్సిన్స్ వంటి హానికరమైన జీవులను సూచిస్తాయి. ఈ సామర్థ్యం రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి పుట్టుకతో వచ్చిన సహజమైన రోగనిరోధక శక్తి మరొకటి వివిధ వ్యాధికారక క్రిములకు గురైనప్పుడు శరీరం ద్వారా అభివృద్ధి చేయబడిన రోగ నిరోధక శక్తి.3-8

2. సహజ రోగ నిరోధక వ్యవస్థ

సహజమైన రోగ నిరోధక వ్యవస్థ అనేది శరీరం నాలుగు విధాలుగా నిర్వహించే మొదటి మరియు తక్షణ రక్షణ విధానము.  మొదటిది మన నోరు, ముక్కు, కళ్ళు, మరియు శ్వాసకోస వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, మూత్ర విసర్జక వ్యవస్థ లలో హానికరమైన బాహ్య కారకాల ప్రవేశాన్ని నిరోధిస్తుంది. రెండవ వ్యవస్థ కన్నీళ్లు, లాలాజలం, ఉదర సంబందిత ఆమ్లాలు, మ్యూకస్ మరియు శరీరం ద్వారా ఉత్పత్తి అయ్యే ఇతర రసాయన అవరోధములు   హానికరమైన బాహ్య ఆక్రమణదారులు శరీరంలోకి ప్రవేశించడానికి లేదా నివసించడానికి ఆస్కారం లేకుండా చేస్తాయి. ఈ రెండు అవరోధాలు ఉల్లంఘింప బడితే తర్వాత రెండు రక్షణలు జ్వరం మరియు వాపు ఇది శరీరం సహజమైన రోగనిరోధక వ్యవస్థ యొక్క కణాలను ఉపయోగించి పోరాడుతూ ఉందని సూచిస్తుంది. కాబట్టి అనారోగ్యంతో ఉన్నప్పుడు బాధగా ఫీల్ అవ్వకండి, మిమ్మల్ని రక్షించడానికి మీ శరీరం యొక్క కోటలో కనిపించకుండా నిరంతర యుద్ధం కొనసాగుతూ ఉందని దాని అర్ధం. 5,6,7

3. అనుకూల రోగ నిరోధక శక్తి (క్రియాశీల, నిష్క్రియ)

మన శరీరం క్రియాశీలకమైన అనుకూల రోగ నిరోధక శక్తిని రెండు విధాలుగా అభివృద్ధి చేస్తుంది. వ్యాధి కలిగిన మీదట  కోలుకునే కాలంలో సహజంగా దానిపట్ల రోగనిరోధక శక్తిని పెంపొందించు కొనుట ద్వారా కానీ లేదా నిర్దిష్ట వ్యాధికి వ్యతిరేకంగా టీకాలు వేయడం ద్వారా రోగ నిరోధక శక్తిని అభివృద్ధి చేస్తుంది.5,6

3.1 వ్యాధి ద్వారా అనుకూల రోగ నిరోధక శక్తి : ఈ రోగ నిరోధక శక్తిని అభివృద్ధి చేసుకోవడానికి ఒక వ్యాధి వచ్చిన తర్వాత వారాలు పడుతుంది, అయితే ఇది జీవితాంతం ఆ వ్యాధి పునరావృతం కాకుండా కాపాడుతుంది. ఉదాహరణకు తట్టు మరియు చికెన్ పాక్స్. ఇవి పునరావృత మైనప్పుడు హానికారక సూక్ష్మ జీవులను ఎదుర్కొనడానికి లేదా వ్యాధిని నివారించడానికి శరీరం వేగంగా స్పందిస్తుంది, ఎందుకంటే రోగనిరోధక వ్యవస్థ తనకు ఎదురైన ప్రతీ క్రిమి/సూక్ష్మ జీవిని రికార్డ్ చేస్తుంది మరియు దానిని గుర్తించి  వెంటనే దానితో పోరాటానికి ప్రతిరోధకాలు లేదా T సెల్స్ అనే యుద్ధ యోధులను ఉత్పత్తి చేస్తుంది. ఐతే ఇవి ఒక వ్యాధి లేదా సంబంధిత ఇన్ఫెక్షన్ ఉదాహరణకు మీజిల్స్ వంటి వ్యాధికి గురియైనప్పుడు మాత్రమే సంరక్షిస్తాయి, కానీ చికెన్ పాక్స్ వంటి ఇతర వ్యాధుల నుండి రక్షించవు. ఫ్లూ మరియు సాధారణ జలుబు వంటివి వైరస్లు లేదా ఒక వైరస్ లోని వివిధ జాతుల వల్ల సంభవిస్తాయి కాబట్టి చాలాసార్లు వీటితో పోరాడవలసి ఉంటుంది.5,6,7,8,9,10

3.2 టీకా ద్వారా ప్రేరేపించబడే అడాప్టివ్ ఇమ్యూనిటీ: వ్యాక్సిన్ అనేది బలహీన పరచబడిన లేదా క్రియారహితం చేయబడిన పరాన్న జీవి యొక్క వ్యాధికారక భాగం. దీనిని ఇంజెక్ట్ చేసినప్పుడు లేదా నోటి ద్వారా లేదా నాసిక ద్వారా ఇచ్చినప్పుడు అది వ్యాధికారక పరాన్న జీవులకు /వ్యాధికి ప్రత్యక్షంగా వ్యాధిని కలిగించకుండానే శరీరాన్ని బహిర్గత పరుస్తుంది. వ్యాధి కారక క్రిముల దాడికి వేగంగా ప్రతిస్పందించడానికి మరియు భవిష్యత్తులో ఆ వ్యాధిని నిరోధించడానికి శరీరం వీలు కల్పిస్తుంది. సాధారణ రోగనిరోధక ప్రతిస్పందన వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత పని చేయడానికి రెండు వారాలు పడుతుంది మరియు దీర్ఘకాలిక రోగ నిరోధక శక్తిని కల్పించడానికి అనేకసార్లు ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే రోగనిరోధకశక్తి కాలానుగుణంగా తగ్గిపోతూ ఉంటుంది. 10

ఉదాహరణలు:  డిప్తీరియా ధనుర్వాతం మరియు కోరింతదగ్గు నిరోధించడానికి ట్రై వాలెంట్ DTaP టీకా మూడు మోతాదుల్లో ఇవ్వబడడమే కాక ఆ తర్వాత బూస్టర్ డోస్ కూడా ఇవ్వబడుతుంది. MMRV వ్యాక్సిన్ యొక్క ఒకటి లేదా రెండు డోసులు తట్టు, గవదబిళ్లలు, రుబెల్లా లేదా జర్మన్ మీజిల్స్ మరియు చికెన్ పాక్స్ అనే నాలుగు వ్యాధులనుండి రక్షిస్తుంది. పెంటా వ్యాలెంట్ వ్యాక్సిన్ మూడు మోతాదులు 5 వ్యాధులు (కంఠవాతము, కోరింత దగ్గు, ధనుర్వాతము,  హెపటైటిస్-బి మరియు హెమోఫిలాస్ ఇన్ ఫ్లు ఎంజా టైప్ బి) నుండి రక్షిస్తుంది.11,12,13

వ్యాక్సిన్ లతో అనేక దేశాల్లో నిరోధింప పడిన లేదా దాదాపుగా తొలగించబడిన అనేక వ్యాధుల్లో ఫ్లూ, క్షయ, హెచ్. ఐ. వి, HPV ( హ్యూమన్ పాపిల్లోమా వైరస్) వ్యాధి,మెనింగో కోకల్, న్యూమో కోకల్, రోటా వైరస్ షింగిల్స్ ఎల్‌ఈ‌డి సర్పి, మరియు మలేరియా ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO చేత పూర్తిగా తొలగింప బడినట్లు ధృవీకరించబడిన రెండు వ్యాధులు గత 3000 సంవత్సరాల నుండి వారియోలా వైరస్ చే సోకబడుతున్న స్మాల్ ఫాక్స్(చివరిసారి 1977 ఏర్పడింది) మరియు 2011 మధ్య ప్రాంతం నుండి పూర్తిగా నిరోధింప బడిన రెండర్ పెస్ట్ (పశువులకు వచ్చే ప్లేగు వ్యాధి) అలాగే  పోలియో వ్యాధి సంపూర్ణ నిర్మూలనకు దగ్గర్లోనే ఉంది.14,15,16

ప్రయోజనాలుటీకాలు వేయడం వల్ల వ్యాధులు, శారీరక వైకల్యం, వివిధ రకాల అంటువ్యాధులే కాక మరణాలు కూడా తగ్గుతాయి అనడంలో ఎటువంటి సందేహము లేదు. వ్యక్తిగత రక్షణ తో పాటు మానవుని నుండి మానవునికి సంక్రమించే వ్యాధికారక గొలుసుకు అంతరాయం కలిగించడం ద్వారా మరియు వ్యాధి వ్యాప్తిని మందగింపచేయడం ద్వారా హెర్డ్ ఇమ్యూనిటీ అని పిలువబడే సమాజ రక్షణ కూడా టీకాలు అందిస్తాయి. 17,18,19,20

తేలికపాటి నుండి మితమైన దుష్ప్రభావాలు : శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థ టీకాకు ప్రతిస్పందిస్తుంది కాబట్టి ఇంజక్షన్ చేసిన స్థానంలో నొప్పి, వాపు, జ్వరం, అలసట, తలనొప్పి, కండరాల నొప్పి, లేదా వికారం వంటివి అనిపించడం సాధారణం.21

హెచ్చరిక: అలర్జీలు లేదా ఆటోఇమ్యూన్ లేదా ఇతర పరిస్థితులు ఉన్న వ్యక్తులు టీకాలు వేయించడానికి ముందు వారి వైద్యుడిని సంప్రదించాలి. వేగవంతమైన హృదయ స్పందన శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది నాలుక లేదా గొంతువాపు లేదా సాధారణ దద్దుర్లు లేదా తక్షణ వైద్య సహాయం అవసరమయ్యే రూపంలో గతంలో ఏదైనా తీవ్రమైన అలర్జీ ప్రతిచర్యలు ఉన్నవారికి టీకాలు వేయడం మంచిది కాదు.21,22

3.3 పాసివ్ ఇమ్యూనిటీ: ఒక వ్యక్తికి తన శరీరంలో కాకుండా ఇతర శరీరములో ఉత్పత్తి చేయబడిన వ్యాధి ప్రతిరోధకాలు ఇంజెక్ట్ చేసినప్పుడు దాన్ని కృత్రిమ నిష్క్రియాత్మక రోగనిరోధక శక్తి అంటారు. ఇది వ్యాధికి వ్యాక్సిన్ అందుబాటులో లేనప్పుడు, అధిక ప్రమాదం ఉన్న వ్యక్తులకు లేదా రోగ నిరోధక వ్యవస్థలో లోపాలు ఉన్న వారికి రొటీన్ గా ఇచ్చే దానివలే కాకుండా తక్షణ రక్షణ కోసం ఇవ్వబడుతుంది. ఈ రోగ నిరోధక శక్తి కొన్ని వారాలు లేదా నెలలు మాత్రమే ఉంటుంది. నవజాత శిశువు సహజంగానే తల్లి యొక్క మావి ద్వారా మరియు పుట్టిన తర్వాత తల్లి పాల ద్వారా రోగనిరోధక శక్తిని పొందుతుంది. ఆరు నెలల తర్వాత క్రమంగా క్షీణిస్తుంది.5,8,10,23

4. మీ రోగ నిరోధక వ్యవస్థ గురించి తెలుసుకోండి

మానవ రోగనిరోధక వ్యవస్థ అనేది కణాలు అవయవాలు మరియు రసాయనాల యొక్క అద్భుతమైన మరియు ఆకర్షణీయమైన నెట్వర్క్, ఇది ఒక సమర్థవంతమైన అంతర్గత పోలీసు దళం, మనల్ని రక్షించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఇది నాలుగు ప్రధాన విధులు కలిగి ఉంటుంది. శరీరంలో మిలియన్ల కొద్దీ చేరే సూక్ష్మ జీవులు(బ్యాక్టీరియా, వైరస్, పరాన్న జీవులు,శిలీంద్రాలు) లనుండి రక్షణ, చనిపోయిన సూక్ష్మ జీవుల తొలగింపు ద్వారా శరీర సమతుల్యత కాపాడడం, జన్యు సంబంధ పదార్ధానికి మార్పులు తెచ్చే ఉత్పరివర్తనమల పర్యవేక్షణ మరియు తొలగింపు, రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా నియంత్రణ. ఇది ఒక సంక్లిష్ట ప్రక్రియను కూడా కలిగి ఉంటుంది. ఇది అత్యంత ప్రభావవంతంగా ఉండాలంటే శరీరంలోని అన్ని యంత్రాంగాల మధ్య పరస్పర చర్య అవసరం 6,9,24. ప్రత్యేక B కణాలు మరియు T కణాలు తో సహా అనేక రోగ నిరోధక కణాలతో కూడిన ఐదు రకాల తెల్లరక్తకణాలు (WBC)  కీలక పాత్ర పోషిస్తాయి, రోగనిరోధక వ్యవస్థ నియంత్రిస్తాయి, మరియు వైరస్ సోకిన కణాలపై దాడి చేస్తాయి. యాంటీ బాడీస్ అనేవి ఆక్రమణ దారులను గుర్తించడానికి, శోధన మరియు నాశనము చేసే సైన్యం లో భాగంగా బి కణాలు ఉత్పత్తి చేసే ప్రత్యేకమైన Y ఆకారము గల ప్రొటీన్లు. అన్ని రోగనిరోధక కణాలు నిరంతరం ఎవరితో మరియు ఎలా పోరాడాలి అనేది నేర్చుకుంటూనే ఉంటాయి. 7,10,25,26,27

5. రోగనిరోధక శక్తి లోపాల గురించి తెలుసుకోండి

ప్రాథమిక రోగనిరోధక శక్తి వ్యవస్థ సరిగా పనిచేయనప్పుడు నాలుగు రకాల రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది.28-31

5.1 ప్రాథమిక రోగనిరోధక లోపం అనేది లోపభూయిష్ట, లేదా తక్కువ రోగనిరోధక కణాలతో లేదా బలహీనమైన రోగనిరోధక వ్యవస్థతో పుట్టడం, సాధారణంగా బాల్యంలోనే ఇది నిర్ధారణ అవుతుంది. అటువంటి పిల్లలు పునరావృతమయ్యే లేదా దీర్ఘకాలంగా అసాధారణమైన ఇన్ఫెక్షన్ల యొక్క స్థిరమైన ప్రమాదంలో ఉంటారు, అవి చికిత్స చేయడం కూడా కష్టం. ఇతర లక్షణాలు స్ప్లీన్ యొక్క అసాధారణ, పేలవమైన ఎదుగుదల, మరియు ప్రత్యక్ష వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత సమస్యలు- తీవ్రమైన ఇన్ఫెక్షన్, ఆటోఇమ్యూన్ డిజార్డర్, లేదా క్యాన్సర్ రూపంలో తర్వాత జీవితంలో సమస్యలు తలెత్తవచ్చు.28,29

5.2 సెకండరీ లేదా ఆర్జిత రోగనిరోధక శక్తి లోపాలు కొద్దికాలంపాటు ఫ్లూ, మీజిల్స్ లేదా అటువంటి బాహ్య కారణాల వల్ల, క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి కోసం ప్రత్యేక మందులు లేదా చికిత్స ద్వారా, WBC ని నాశనం చేసే హెచ్ఐవి ఎయిడ్స్ వంటి వ్యాధులు ద్వారా రోగనిరోధక వ్యవస్థ బలహీన పడినప్పుడు ఆర్జిత రోగనిరోధక లోపం ఏర్పడుతుంది ధూమపానం మద్యపానం మరియు సరైన పోషకాహారం తీసుకోక పోవడం, సక్రమంగా లేని జీవనశైలి కారణంగా రోగనిరోధకశక్తి బలహీన పడుతుంది.28

5.3 అతి చురుకైన రోగనిరోధక వ్యవస్థ సాధారణంగా జన్యు ప్రభావం వలన ఏర్పాడే ఈ సమస్య దుమ్ము, పుప్పొడి, లేదా పొగ వంటి హాని చేయని ప్రతికూలతల ద్వారా ప్రేరేపించబడి ఉబ్బసం, తామర, లేదా అలర్జీ వంటి వ్యాధులకు కారణమవుతుంది. ఇది సాధారణంగా ఆరోగ్యకరమైన వ్యక్తిని ప్రభావితం చేయదు.28,30

5.4 ఆటోఇమ్యూన్ (స్వయం ప్రతిరక్షక) వ్యాధి: మన శరీరం లోని కొంత భాగము పరాయి దానిగా తప్పుగా గుర్తించడం ద్వారా మన సొంత రోగనిరోధక వ్యవస్థ మనకు వ్యతిరేకంగా మారినప్పుడు మరియు ఆరోగ్యకరమైన కణాలపై దాడి చేసే ఆటో యాంటీబాడీస్ అనే ప్రోటీన్ లను విడుదల చేసినప్పుడు ఆటోఇమ్యూన్ వ్యాధి వస్తుంది. ఇలాంటి వ్యాధులు చాలా ఉన్నాయి ఐతే అత్యంత సాధారణమైనవి టైప్-1 మధుమేహం,రుమటాయిడ్ ఆర్థ్రైటిస్, మల్టిపుల్ స్కెలో రోసిస్, ఇన్ఫ్లమేటరీ బవెల్ సిండ్రోమ్, క్రానిక్ ఫెటిగ్ సిండ్రోమ్, సీలియాక్ డీసీజ్, హష్మిటోస్ డీసీజ్, అలాగే లింఫోమా, మయలోమ, ల్యుకేమియా, వంటి కొన్ని రకాల క్యాన్సర్లు మరియు లూపస్ ఇది మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. దీనికి కారణం తెలియదు కానీ బహుశా ఆహారం లేదా వాతావరణ కారకం వంటి  ఏదో ఒక దానితో ప్రేరేపించబడిన జన్యువులు కారణం కావచ్చు. దీనిని నిర్ధారించడం అంత సులువు కాదు..28,31

6. మీ రోగనిరోధక వ్యవస్థను సమతుల్యంగా ఉంచుకోండి

మనల్ని సజీవంగా మరియు చురుకుగా ఉంచడానికి రోగ నిరోధక వ్యవస్థ తీవ్రంగా శ్రమిస్తుంది, కనుక మనం దాని పట్ల తగు జాగ్రత్త వహిస్తూ దాని పనిలో జోక్యం చేసుకోకుండా ఉండాలి. ఈ వ్యవస్థ ఉత్తమంగా పని చేయడానికి బ్యాలెన్స్ స్థితిలో (తక్కువా కాదు ఎక్కువా కాదు) ఉంచాలి. 7,32-40

 రిఫరెన్స్ లు మరియు లింకులు

1. Sathya Sai Baba Speaks on preventing illness: Divine Discourse on “The Best Tonic”, 21 Sept 1960: https://www.sssbpt.info/ssspeaks/volume01/sss01-28.pdf

2. Sathya Sai baba Speaks on preventing illness: Divine Discourse on “The Doctor’s Profession”, Sept 1980: https://www.sssbpt.info/ssspeaks/volume14/sss14-53.pdf

3. Immune system: https://www.sciencedirect.com/topics/earth-and-planetary-sciences/immune-system

4. Antigens/pathogens: https://study.com/academy/lesson/antigens-vs-pathogens.html

5. Innate and Adaptive immunity: https://www.technologynetworks.com/immunology/articles/active-vs-passive-immunity-differences-and-definition-335112

6. https://www.verywellhealth.com/types-of-white-blood-cells-and-immunity-2252553

7. The myth of a super-charged immune system: https://www.bbc.com/news/health-60171592

8. Adaptive immunity: https://www.cdc.gov/vaccines/vac-gen/immunity-types.htm

9. https://www.betterhealth.vic.gov.au/health/conditionsandtreatments/immune-system

10. Immunity thru vaccine: https://www.immune.org.nz/immunisation/immune-system-vaccination#

11. DTaP vaccine: https://www.cdc.gov/vaccines/vpd/dtap-tdap-td/public/index.html#

12. MMRV vaccine: https://www.cdc.gov/vaccines/hcp/vis/vis-statements/mmrv.html

13. Pentavalent vaccine: https://www.gavi.org/types-support/vaccine-support/pentavalent

14. Vaccine eliminated diseases: https://www.cdc.gov/vaccines/parents/diseases/forgot-14-diseases.html

15. Disease prevention with vaccine: https://www.healthywa.wa.gov.au/Articles/U_Z/What-diseases-do-vaccines-protect-against

16. Eradicated diseases: https://asm.org/Articles/2020/March/Disease-Eradication-What-Does-It-Take-to-Wipe-out

17. Vaccines save lives: https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC5402432/

18. Unicef on safety of Covid vaccines: https://www.unicef.org/northmacedonia/vaccines-save-lives

19. Benefits of Covid-19 vaccine: https://www.cdc.gov/coronavirus/2019-ncov/vaccines/vaccine-benefits.html

20. Vaccines protect lives: https://timesofindia.indiatimes.com/life-style/health-fitness/health-news/protect-your-life-against-all-vaccine-preventable-diseases-get-vaccinated/articleshow/87108483.cms

21. Handling side effects or allergy: https://www.cdc.gov/coronavirus/2019-ncov/vaccines/expect/after.html

22. https://www.cdc.gov/coronavirus/2019-ncov/vaccines/safety/allergic-reaction.html

23. Passive immunisation: https://www.historyofvaccines.org/content/articles/passive-immunization

24. Our Immune system: https://primaryimmune.org/immune-system-and-primary-immunodeficiency

25. WBC the key player with five types of cells https://my.clevelandclinic.org/health/body/21871-white-blood-cells

26. B-cells & T-cells: https://www.cancercenter.com/what-are-b-cells-vs-t-cells

27. Antibodies: https://www.livescience.com/antibodies.html

28. Immunity disorders: https://www.hopkinsmedicine.org/health/conditions-and-diseases/disorders-of-the-immune-system

29. Primary Immunodeficiency: https://my.clevelandclinic.org/health/diseases/17964-primary-immunodeficiency

30. Overactive immune system: https://health.clevelandclinic.org/can-immune-system-go-haywire-falter/ (tips)

31. Autoimmune: https://www.healthline.com/health/autoimmune-disorders#causes

32. Balance immunity: https://www.health.harvard.edu/staying-healthy/how-to-boost-your-immune-system

33. Self-care: https://www.mohfw.gov.in/pdf/ImmunityBoostingAYUSHAdvisory.pdf

34. Reduce your risks: https://www.cedars-sinai.org/blog/boosting-your-immune-system.html

35. https://www.matherhospital.org/wellness-at-mather/boosting-your-immune-system-is-it-even-possible/

36. Hand sanitiser guidelines: https://www.fda.gov/drugs/coronavirus-covid-19-drugs/hand-sanitizers-covid-19

37. Covid-19 vaccines guidelines: https://www.who.int/emergencies/diseases/novel-coronavirus-2019/covid-19-vaccines/advice

38. https://www.hopkinsmedicine.org/health/conditions-and-diseases/coronavirus/covid19-vaccine-hesitancy-12-things-you-need-to-know

39. Better to vaccinate than catch disease to get immunity: https://www.cdc.gov/coronavirus/2019-ncov/vaccines/facts.html

40. Laughter, the best therapy! https://www.khca.org/files/2015/10/Humor-Therapy.pdf

__________________________________________________________________________________

2. AP తెలుగు వర్క్ షాప్ 2021 డిసెంబర్ 30 నుండి 2022 జనవరి 1 వరకు- పుట్టపర్తి

 గ్రామీణ ప్రాంతాలు, మరియు సుదూర ప్రాంతములలో ఉన్న వారికోసం వైబ్రియానిక్స్ సేవలు అందించే వినూత్న కార్యక్రమంలో భాగంగా అసిస్టెంట్ ప్రాక్టీషనర్ AP వారి కోసం వర్క్ షాప్ ని తెలుగులో నిర్వహించగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుండి నలుగురు పాల్గొన్నారు. ఇద్దరు సీనియర్ ఉపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయులు కాగోరు ముగ్గురు ఉపాధ్యాయులు నిశబ్ద పరిశీలకులుగా దీనిని నిర్వహించారు. పాల్గొన్న వారి ఆసక్తి  ఉత్సాహం విశేషమైనవి, డాక్టర్ అగర్వాల్ గారి ప్రోత్సాహకరమైన మరియు స్పూర్తిదాయకమైన జ్ఞాన వాణి  విన్న తర్వాత వారు మరింత ప్రేరణకు లోనయ్యారు- చిత్రాన్ని చూడండి. AP గా అర్హత సాధించిన వెంటనే సీనియర్ ప్రాక్టీషనర్11567 మరియు అంకిత బావం గల వారి బృందము నేతృత్వంలో ప్రాక్టీషనర్18005 ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాలలోని సాయి కేంద్రాలలో మరియు విశాఖపట్నం సమీపంలోని గిరిజన గ్రామములలో 2750 ఇమ్యూనిటీ బూస్టర్ IB పంపిణీ చేసే బాధ్యతను చేపట్టడం చాలా సంతోషకరమైన విషయం రాష్ట్ర అధ్యక్షుల వారి ప్రోత్సాహం మరియు ఆశీర్వాదంతో ఈ సేవ ప్రారంభించబడింది. ఐబి ఫోటో చూడండి

 

 

__________________________________________________________________________________

3. ఫ్రెంచ్ లో నెలవారీ సమావేశాలు

ఫ్రెంచ్ కోఆర్డినేటర్ 01620 గత రెండు సంవత్సరాలుగా ప్రతీ నెలా విర్చువల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనికి గాబన్ నుండి ముగ్గురు మరియు ఫ్రెంచ్ నుండి ఎనిమిది మంది ప్రాక్టీషనర్లు హాజరవుతున్నారు. ఒక ప్రాక్టీషనర్ శరీర వ్యవస్థ నుండి ఎంపిక చేసిన ఒక అవయవం  గురించి (108 సి‌సి పుస్తకంలో 21 వర్గాల నుండి) లేదా నిర్దిష్ట వ్యాధిని కవర్ చేస్తూ అంశాలను అందజేస్తారు. ఈ ప్రదర్శనలో ఒక అవయవానికి సంబంధించి అనాటమీ, ఫిజియాలజీ, మరియు సంబంధిత వ్యాధులు, అనారోగ్యం లేదా అసమతుల్యత కనిపించే సంకేతాలు మరియు వైబ్రియానిక్స్ చికిత్స యొక్క వివరణాత్మక అంశాలు ఉంటాయి. ప్రాక్టీషనర్లు అందరూ వార్తాలేఖలు, మాన్యువల్  మరియు కాన్ఫరెన్స్ పుస్తకాన్ని శ్రద్ధగా పరిశీలించడం ద్వారా ఈ అంశాన్ని పరిశోధిస్తారు. వారందరూ తమ అభిప్రాయాలూ, కేసు చరిత్రలు, ప్రశ్నలు మరియు విజయ కథనాలతో ఈ అంశాలకు సహకరిస్తారు.  

ప్రాక్టీషనర్ 03546 వ్యాఖ్యానము: “ఈ విషయాలు మానవ శరీరం అనే అసాధారణ యంత్రం యొక్క సృష్టి యొక్క సంక్లిష్టత మరియు అధునాతన గురించి మరింత ఎక్కువగా తెలుసుకోవడానికి నన్ను ప్రేరేపించాయి. ప్రతీ భాగం ఎంత చిన్నదైనా ఈ బహుళత్వంలో చాలా నిర్దిష్టమైన మరియు ఉపయోగకరమైన పాత్రను కలిగి ఉంటుంది. ఉచితంగా లభించే ఈ సృష్టి అంతా దైవమే అనే భావన పదిల పరుచుకొని మనం దానిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి”. ఈ ప్రాక్టీషనర్ తన రోగులలో కూడా ఈ విషయాన్ని అవగాహన కలిగించడానికి కూడా ప్రయత్నిస్తున్నారు

__________________________________________________________________________________

4. ఆసక్తికరమైన కథనాలు  

4.1 విశ్వాసం ద్వారా స్వస్థత చేకూరిన అద్భుత సంఘటన 18004…ఇండియా 56 ఏళ్ల గ్రామీణ మహిళ మూడు సంవత్సరాలుగా తీవ్రమైన కీళ్ళ నొప్పులు, వెన్నునొప్పి, సయాటికా, మరియు వెరికోస్ వీన్స్ వ్యాధులతో బాధపడుతున్నారు. ఆమె కొన్ని అడుగులు కూడా సరిగా నడవలేక పోయేవారు, సరిగా నిద్ర పోలేక పోయే వారు. కొన్ని సందర్భాలలో భరించలేని నొప్పి ఆమెను స్పృహ కోల్పోయేలా చేస్తూ ఉండేది. ఆమె ఆయుర్వేదిక్ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటున్నారు కానీ అవి ఆమెకు ఉపశమనం కలిగించలేదు. వైబ్రియానిక్స్  వైద్యం ఉపయోగిస్తున్న ఒక రోగి తన ప్రాక్టీషనర్ ను కలవమని సలహా ఇచ్చారు, అయితే ఆయుర్వేదంతో పాటు వైబ్రియానిక్స్ తీసుకోకూడదు అని అతనికి తెలుసు కాబట్టి ఆయుర్వేద మందులను మానివేసిన మూడు రోజుల తర్వాత మాత్రమే ప్రాక్టీషనర్ ను కలవమని చెప్పారు. అదేరోజు స్వామిని ప్రార్థించి తన మందులను ఆపివేసి వైబ్రియానిక్స్ మాత్రమే తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఐదు రోజుల తర్వాత ఆమె తనంతట తానుగా ప్రాక్టీషనర్ ఉండే ప్రదేశానికి వెళ్లి తాను వైబ్రియానిక్స్ తీసుకోవాలని సంకల్పం తీసుకున్నప్పటి నుండి పూర్తిగా నయం అయిందని వారికి తెలియజేశారు. ప్రాక్టీషనర్ ఆశ్చర్య పోయినప్పటికీ ఆమెకు తగిన రెమిడీ అందించగా దానిని  తీసుకోవడానికి ఆమె సంతోషంగా అంగీకరించారు, నొప్పి ఆమెకు పునరావృతం కాలేదు. ఈ ప్రాక్టీషనర్ శిక్షణ పొందిన రెండు నెలల్లోనే 170 మంది రోగులకు విజయవంతంగా చికిత్స అందించారు.   

4.2 ప్రాక్టీషనర్10707 డైరీ నుండి నొప్పి నివారణ ఐన అద్భుత కథనం. నా చిన్నతనం అంతా నేను తరచుగా బలహీనపరిచే తలనొప్పులతో బాధపడుతూ ఉండేవాడిని. అది ఏర్పడిన ప్రతీ సారి కనీసం  నెల రోజుల వరకు ఉంటుంది.  నేను బ్యాంకులో పని చేయడం ప్రారంభించిన తర్వాత దీని తీవ్రత పెరగడమే కాక వెంటనే వికారం కూడా కలిగేది. ఆకస్మాత్తుగా నా దృష్టి పథంలో ఉన్న వస్తువులు అస్పష్టంగా అయిపోవడమే కాక నా దృష్టి క్షేత్రంలో ప్రతీదీ తేలుతూ ఉన్నట్లు కనపడుతుంది. 30 నిమిషాల తర్వాత తలనొప్పి ప్రారంభమై సాధారణంగా రెండు రోజులు తీవ్రమైన తలనొప్పి వికారం నిద్రలేమి మరియు అలసటకు దారితీస్తుంది. ఉపశమనం కోసం అనేక సంవత్సరాలుగా ఎన్ని వేసుకున్నానో చెప్పబడలేని సంఖ్యలో  అనాసిన్ టాబ్లెట్ వాడుతూ ఉండేవాడిని.  నేను పుట్టపర్తిలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సందర్శించే వరకు నేను క్లాసిక్ మైగ్రేన్ తలనొప్పితో బాధ పడుతున్నట్లు తెలియదు, నొప్పి ఏర్పడిన ప్రతీసారి   వాసోగ్రెయిన్ తీసుకోవలసిందిగా వారు సూచించారు.

 సాయి వైబ్రియానిక్స్ నన్ను కాపాడటం...

 క్రమంగా నేను సాయి వైబ్రియానిక్స్ గురించి తెలుసుకొని బృందావనంలో 2009 లో ఆగష్టులో శిక్షణా కోర్సులో చేరాను. శిక్షణ పూర్తి చేసుకొన్న రెండు రోజులలోపూ దాదాపు రాత్రి 8 గంటల ప్రాంతంలో మైగ్రేన్ నొప్పి ఏర్పడగా  నాకు సూచించబడిన అల్లోపతి మందులను  ఆశ్రయించకుండా నేను ఒక రెమిడీ: CC11.3 Headaches + CC11.4 Migraines. తయారు చేసుకున్నాను. సాయిరాం అని జపిస్తూ ఒక గోళి వేసుకున్నాను కేవలం 30 నిమిషాలలో గాఢంగా నిద్ర పట్టింది. ఐతే విపరీతమైన నొప్పితో రాత్రి పన్నెండున్నర గంటలకు  మెలుకువ వచ్చింది. నొప్పి భరించలేక అల్లోపతి టాబ్లెట్ తీసుకొని వేసుకోవాలని ప్రయత్నించాను, కానీ ఏదో అదృశ్య శక్తి నన్ను ఆపడంతో నేను తీసుకున్న శిక్షణ కార్యక్రమం యొక్క ప్రమాణమును మరియు వైబ్రియానిక్స్ యొక్క బోధన ను అనుసరించి నేను మొదట నా పై మరియు నా కుటుంబం పై ప్రయత్నించాలి, అప్పుడే దాని ప్రభావం గురించి నాకు పూర్తిగా విశ్వాసం కలిగి అప్పుడు మాత్రమే ఇతరులకు అందించేందుకు నమ్మకం కలుగుతుంది. టాబ్లెట్ పక్కన పెట్టేసి వైబ్రో గోళీ నాలుక క్రింద వేసుకున్నాను.  తెల్లవారుఝామున నాలుగున్నర గంటలకు నేను లేచి నొప్పి పూర్తిగా అదృశ్య మయ్యిందని తెలుసుకుని ఆశ్చర్యపోయాను. ఎంత దివ్యమైన అద్భుతం. మరుసటి రోజు నేను అసాధారణంగా ఫ్రెష్ గా మరియు శక్తివంతంగా కనిపించాను. నేను ప్రతీ రోజు రెమిడీ తీసుకోక పోయినప్పటికీ మైగ్రేన్ ఉదంతాలు త్వరగానే తగ్గిపోయాయి, ప్రస్తుతం నేను ఎటువంటి రెమిడీ తీసుకోనప్పటికీ అవి పూర్తిగా అదృశ్యమయ్యాయి. నా దృష్టిలో వైబ్రియానిక్స్ అనేది స్వామి అందించిన అత్యుత్తమ బహుమతులలో ఒకటి. 2009 నుండి మా  కుటుంబం పూర్తిగా వైబ్రియానిక్స్ వైపు మారిపోయింది.

ఈ కేసును నా హృదయ పూర్వకంగా మన ప్రియమైన స్వామికి సమర్పిస్తున్నాను, మరియు ఈ అద్వితీయమైన అవకాశం అందించినందుకు, నా లాంటి ప్రాక్టీషనర్లను ఆ దివ్య ప్రేమ కు చక్కని పనిముట్లుగా మార్చిన  వైబ్రియానిక్స్ టీముకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 

__________________________________________________________________________________

5. జ్ఞాపకార్థం

 2022 ఫిబ్రవరి 9వ తేదీన 84 సంవత్సరాల వయసులో స్వర్గస్తులైన కల్నల్ S. K. బోస్ 02414…ఇండియా గారికి  భారమైన హృదయంతో మేము వీడ్కోలు పలుకుతున్నాము. వారు స్వామికి అత్యంత విధేయులైన సాయి భక్తుల కుటుంబం నుంచి వచ్చారు, వారి తండ్రి స్వామి చేత పునర్జీవింప బడ్డారన్న విషయం అందరికీ తెలిసినదే. వారు ఇండియన్ ఆర్మీలో సివిల్ ఇంజినీర్ గా పనిచేసి పదవీ విరమణ తర్వాత 1999లో పుట్టపర్తికి మారారు. చైతన్య జ్యోతి మ్యూజియం నిర్మాణాన్ని పర్యవేక్షించడమే కాక దానికి మొదటి డైరెక్టరుగా  నియమితులయ్యారు. హోమియోపతి పట్ల ఎంతో ఆసక్తి ఉన్న వీరు 22 సంవత్సరాల క్రితం వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్ అయ్యారు. ఇంట్లో ఉన్నా, ఆఫీస్ లో ఉన్నా, రోగుల కోసం వారు సమయం కేటాయించేవారు. తన చివరి రోజు వరకు స్వామి వారి పనులు చేస్తూ ఉండేవారు. వారు తమ జీవితకాలమాలో ఎవరి జీవితాలనైతే స్పృశించారో వారందరూ ఆయనను ఎంతో ప్రేమ, గౌరవంతో ఎల్లప్పుడూ  గుర్తుంచుకుంటారు.