అదనంగా
Vol 10 సంచిక 1
January/February 2019
1. ఆరోగ్య వ్యాసము
ఆరోగ్యం మరియు ఆనందం కోసం వ్యాయామం
“మంచి ఆలోచనలతో నిండిన ఆరోగ్యకరమైన మనస్సు కోసం మనిషికి ఆరోగ్యకరమైన శరీరం కావాలి. మనిషికి ఆరోగ్యం మరియు ఆనందాన్ని అందించే విధంగా క్రీడలు మరియు సంగీతం రూపొందించబడినవని గుర్తించాలి. శారీరక ధృఢత్వం మాత్రమే సరిపోదు. మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. ప్రతీ ఒక్కరిలోనూ సూక్ష్మ శరీరం ఉంటుంది ఈ సూక్ష్మ శరీరాన్ని కూడా సరియైన విధంగా చూసుకోవాలి. ఇందుకోసం, ఆధ్యాత్మిక వ్యాపకాలలో కూడా పాల్గొనవలసి ఉంటుంది, ఇదే దైవాన్ని పొందడానికి ప్రతీ ఒక్కరికీ సహాయపడుతుంది.1”
1. వ్యాయామం అంటే ఏమిటి ?
వ్యాయామం అనేది శారీరక శ్రమ లేదా అభ్యాసము. ఇది మన రోజువారీ కార్యకలాపాల కంటే చాలా శ్రమ తో కూడి ఉంటుంది కనుక మనిషికి ఒక విధమైన సవాలుగా అనిపిస్తుంది.2
2. వ్యాయామం ఎందుకు చెయ్యాలి?
శారీరకంగా ఆరోగ్యంగా మరియు మానసికంగా తాజాగా, ఉల్లాసంగా, చురుకుగా ఉండటం, ఆనందించడం మరియు తనలో తాను సామరస్యంగా ఉండటమే దీని ఉద్దేశ్యము. ఇది వయసు, లింగం లేదా శారీరక సామర్థ్యంతో సంబంధం లేకుండా ఉంటుంది.3,4,5
3. వ్యాయామం యొక్క ప్రయోజనాలు అనేకములు!
- తగినంత తీవ్రత, సమయము మరియు తరుచుదనము కలిగిన ఏదైనా వ్యాయామం మన శారీరక బరువు, శరీరములోని కొవ్వు శాతమును తగ్గించి గుండెకు బలాన్ని, శరీరానికి సత్తువను ఇస్తుంది. వ్యాయామం శరీరంలోని కేలరీలను దహనం చేస్తుంది కనుక బరువు నియంత్రణకు ఎంతో ఉపకరిస్తుంది. ఇది మెదడులోని రసాయనాలను చైతన్య పరచి అభిజ్నా శక్తులను ప్రేరేపించడం ద్వారా మానసిక ఉద్రేకాలకు లోనుకాకుండా స్థిరపరుస్తుంది. ఇది మెదడులోని కణాలకు కణభాగాలకు రక్త సరఫరాను మెరుగు పరచడం తద్వారా ఆక్సిజన్ సరఫరాను పెంపొందించి గుండె, ఊపిరి తిత్తులు వంటి ప్రధాన అవయవాల పనితీరును మెరుగు పరుస్తుంది. మెదడు కొన్ని రకాల ఎంజైములను స్రవించడం వలన మానసిక ఆందోళన, క్రుంగుబాటు వంటివి దూరమయ్యి మనిషి ఆనందం పొందడానికి అవకాశం ఉంది.3,4,5,6
- కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో కలిసి చేసే శారీరక శ్రమ జీవితాన్ని ఆనందదాయకంగా చేయడంతో పాటు మంచి నిద్రను అందిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేసే మహిళలు గర్భధారణ సమయంలో మరియు పిల్లల పుట్టిన తరువాత అనారోగ్య సమస్యలకు గురికారు.6 6 సంవత్సరాల నుంచి పిల్లలు మరియు టీనేజర్లు వ్యాయామం మరియు ఫిట్నెస్ ఎక్సర్ సైజులు చేయడం వలన పెద్దవారితో సమానంగా ప్రయోజనం పొందుతారు.7 వ్యాయామం మంచం పట్టే రోగులకు సమస్యలను తగ్గించడంతో పాటు త్వరగా తిరిగి కోలుకోవడానికి సహాయపడుతుంది. హాస్పిటల్ లో ఐసియులో ఉన్న రోగులకు కూడా వారు చేయదగిన సరళమైన వ్యాయామం చేయడం ద్వారా త్వరగా, బలంగా, సంతోషంగా ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కావడానికి వ్యాయామం సహాయపడుతుంది8,9. అంగ వైకల్యాలున్నవారు వారి పరిస్తితులకు తగిన వ్యాయామంతో మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు.10
- దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు మరియు తీవ్ర వ్యాధులను, ముఖ్యంగా హృదయ సంబంధ వ్యాధులు, స్ట్రోక్, మెటబాలిక్ సిండ్రోమ్, అధిక రక్తపోటు, అనేక రకాల క్యాన్సర్, ఆర్థరైటిస్ మరియు పడిపోవడం వంటి వాటిని నివారించడానికి మరియు నిర్వహించడానికి వ్యాయామం సహాయపడుతుంది. వ్యాయామం కీళ్ళలో నొప్పి మరియు వాపును తగ్గిస్తుంది3-5
- డయాబెటిస్ నిర్వహణకు లేదా నియంత్రణకు వ్యాయామం మూలస్తంభము వంటిది. ఇది మధుమేహం రాకుండా చేయడం లేదా రాబోయే దానిని ఆలస్యం చేయడంలో కీలక పాత్ర వహిస్తుంది. రక్తంలో గ్లూకోజ్‌ను నియంత్రించడం ద్వారా డయాబెటిక్ సమస్యలను నివారిస్తుంది. కొన్ని సందర్భాల్లో, డైట్ ప్లాన్‌తో కలిపి వ్యాయామం చేయడం వలన మందుల అవసరం లేకుండా మధుమేహాన్ని నియంత్రించవచ్చు.6
- వ్యాయామం వృద్ధాప్యాన్ని నెమ్మదింప జేస్తుందనీ, మరియు సెల్యులార్ స్థాయిలో వయస్సుసంబంధిత క్షీణతను వెనుకకు మళ్లిస్తుందని పరిశోధనలో తేలింది11 కనుక వ్యాయామం చేయగలిగే అద్భుతాలను గ్రహించడానికి క్రమం తప్పకుండా మరియు స్థిరంగా వ్యాయామం చేయాలి.
4. అన్ని వ్యాయామాల కంటే నడక చాలా సరళమైనటువంటిది!
- నడక అనేది ఎముకల మరియు కండరాల యొక్క లయబద్ధమైన, డైనమిక్, ఏరోబిక్ చర్య. ప్రమాదములు మరియు గాయాల బారిన పడకుండా ఉండే సరళమైన, సురక్షితమైన వ్యాయామము నడక. దీనికి ఖర్ఛేమీ ఉండదు, ఎటువంటి నైపుణ్యం అవసరం ఉండదు మరియు అన్ని వయసుల వారికి సరిపోయేటటువంటిది. ఎవరికి వారు తమ యొక్క శారీరక సామర్ధ్యాలను బట్టి అలిసి పోకుండా వేగాన్ని ఎంచుకోవచ్చు.12-13
- 1989 లో అమెరికాలోని కూపర్ ఇన్స్టిట్యూట్ 8 సంవత్సరాల పాటు 13000 మంది పురుషులు మరియు స్త్రీల పై వేగవంతమైన నడక (బ్రిస్క్ వాకింగ్)పైన చేసిన అధ్యయనము ఒక మైలు రాయి వంటిది. అధ్యయనాల ప్రకారం రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, మరియు డయాబెటిస్ వంటివి నిరోధించడంలో పరిగెత్తడం వలన ఏ ఏ ప్రయోజనములు ఉన్నాయో బ్రిస్క్ వాకింగ్ వలన కూడా అంతే ప్రయోజనాలు ఉన్నాయని నిరూపించాయి.
- పూర్వకాలం నుండీ నడక ఉత్తమ ఔషధంగా పరిగణించబడుతూ ఉన్నది.11తీరికగా నడవడం మానసిక స్థితిని క్రమబద్ధీకరించడం తోపాటు ప్రశాంతతను పెంచుతుంది. రోజుకు 4000 అడుగులు నడవడం వృద్ధులలో అభిజ్ఞా కౌశలము యొక్క పనితీరును పెంచుతుందని పరిశోధనలో తేలింది.15 ఉదయాన్నే స్వచ్ఛమైన గాలిలో ధ్యాన పూర్వకమైన నడక సున్నితమైన వ్యాయామమే కాక ఆనందకరంగా దినచర్యను ప్రారంభించడానికి ఒక చక్కని మార్గము. ఉదయం ఖాళీ కడుపుతో చెప్పులు లేకుండా నడవడం మరింత ఉత్తమమైనదిగా భావిస్తారు.
- 8 ఆకారంలో లేదా సైన్స్ లో ఇన్ఫినిటీ లేదా అనంతము అనే దానికి సూచించే 8 యొక్క ఆకారంలో నడవడం తనను తాను ఆరోగ్యంగా మరియు వ్యాధులు లేకుండా ఉంచడానికి భారతదేశంలో ఒక పురాతన పద్ధతి. బహిరంగ ప్రదేశంలో దక్షిణ–ఉత్తర దిశలో సుమారు ఆరు అడుగుల వ్యాసం కలిగిన రెండు వృత్తాలను దగ్గర చేర్చడం ద్వారా ఈ ఆకారము ఏర్పడుతుంది. ఆరోగ్య సంరక్షణ మరియు విద్యకు సంబంధించిన విషయంలో చికిత్సా నిపుణులు మరియు ఉపాధ్యాయులు నైపుణ్యం పెంపొందించే వ్యాయామంగా ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫినిటీ ఆకారంలోని నడకను సూచిస్తున్నారు16-20.
5. తగిన వ్యాయామం ఎంచుకోండి
- ఆరోగ్యవంతులైన వయోజనులు చురుకైన నడక, పరుగు, జాగింగ్, దుముకుట, సైక్లింగ్, ఈత, నృత్యం, తోటపని లేదా క్రీడ వంటి ఏదైనా మితమైన ఏరోబిక్ వ్యాయామము ఎంచుకొని ప్రతీ రోజూ చేయాలి. ప్రతీరోజూ సుమారు 20నుండి 25నిమిషాలు చేయాలి. దీనికన్నా కూడా 10 నిమిషాలు వ్యక్తి తన యొక్క బరువు మరియు సామర్ధ్యము మేరకు గురుత్వాకర్షణ వ్యతిరేక దిశలో 21 వెయిట్ లిఫ్టింగ్ మరియు శరీర బరువుకు సంబంధించిన వ్యాయామాలు వంటి వాయురహిత వ్యాయామములు చేయడం ఉత్తమం. వ్యక్తి యొక్క వృత్తి, సామర్థ్యంమేరకు వారి ఆరోగ్య స్థితిననుసరించి రెండింటి యొక్క (మితమైన మరియు తీవ్రమైన) వ్యాయామములు ఎంచుకోవడం మంచిది.3-5
- డయాబెటిక్ రోగులు సాధారణంగా రోజూ అరగంట నుండి ఒక గంట వరకు మితమైన వ్యాయామాలు చేయమని డాక్టర్లు సలహా ఇస్తారు6. పిల్లలు మరియు టీనేజర్లు మితమైన మరియు శక్తివంతమైన వ్యాయామము లేదా క్రీడను ప్రాక్టీస్ చెయ్యాలి. ఇలా ఎంచుకున్న వ్యాయామం లేదా క్రీడ భౌతికంగా వారిని శక్తివంతంగా చేసేదిగా ఉండాలి. ఇట్టి ఎంపిక వారిని బలంగా ఊపిరి పీల్చుకొనేలా చేయడానికి, వారి హృదయ స్పందన రేటు పెరగడానికి దోహదం చెయ్యాలి. దీనివలన వారి కార్డియో వాస్కులర్ మరియు అస్థిపంజర వ్యవస్థలను బలంగా చేయడానికి ఉపయోగ పడుతుంది. ఈ వ్యాయామం ఒక గంట సమయం పాటు మధ్య మధ్య విరామం తోగానీ లేదా ఒకేసారి గాని చేయవచ్చు.7
- చేతులు కాళ్ళు సాగదీయడం (స్ట్రెచింగ్) అనేది తేలికపాటిది అయినప్పటికీ, అది ఒక మంచి వ్యాయామము. వ్యాయామం కోసం సమయం కేటాయించలేని లేదా ఎక్కువసేపు డెస్క్ మీద పని చేయలేని వారికి ఇది బాగా సరిపోతుంది. శరీర సౌలభ్యాన్ని పెంచుతుంది, భంగిమను మెరుగుపరుస్తుంది మరియు ఒత్తిడి మరియు శరీర నొప్పులను కూడా తగ్గిస్తుంది. వ్యాయామం చేయని రోజులలో కూడా, తమ దినచర్య లో భాగంగా చిన్నచిన్న విరామములు తీసుకుంటూ స్ట్రెచింగ్ రోజులో చాలాసార్లు చేయవచ్చుఇది రోజంతా వ్యక్తిని విశ్రాంతిగా మరియు చురుగ్గా ఉంచుతుంది. నిజం చెప్పాలంటే స్ట్రెచింగ్ లేదా సాగదీయడం రోజువారీ వ్యాయామాలలో అంతర్భాగం. ఏ వ్యక్తైనా కండరాలను సమాయత్త పర్చడానికి వ్యాయామం ముందు 3-5 నిమిషాలు డైనమిక్ స్ట్రెచింగ్ చేయవచ్చు. కండరాలను సాగదీయడానికి చేతులు మరియు కాళ్ళను చురుకుగా కదిలించడాన్ని డైనమిక్ స్ట్రెచింగ్ అంటారు. ఐతే నొప్పి పుట్టే వరకూ లేదా తుది స్థానంవరకూ సాగదీయకూడదు. దినసరి వ్యాయామము పూర్తయ్యాకా 3 నుండీ 5 నిమిషాలు స్టాటిక్ స్ట్రెచ్ స్థితిలో ఒక్కొక్క స్థితికి అరనిమిషం చొప్పున ఉంచాలి. గాయాలను నివారించడానికి, కండరాల నొప్పిని తగ్గించడానికి మరియువ్యక్తి యొక్క కదలికల శ్రేణిని మెరుగుపరచడానికి వ్యాయామం తర్వాత ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుందని విశ్వసిస్తారు. శరీరము – ఆత్మ – మనసులను ఏకం చేయడానికి తగిన భంగిమలు, స్ట్రెచింగ్ మరియు శ్వాస పద్ధతులను కలిగి ఉన్న యోగా ఆసనాలను గురువు యొక్క మార్గదర్శకత్వంలో ఎంచుకోవడం చాలా ఉత్తమ మైనది. 21
- ఒకరికి తగిన వ్యాయామము మరొకరికి కఠినమైనదిగానో లేక అత్యంత సులువైనది గానో అనిపించ వచ్చు. కనుక అనుకరణకు పోకుండా ఎవరి సామర్ధ్యానికి, సౌకర్యానికి తగిన వ్యాయామం వారు ఎంచుకొని రోజూ కొనసాగించడం మంచిది. నెమ్మదిగా ప్రారంభించి మరియు క్రమంగా తీవ్రతరం చేసుకోవడం మంచిది. శరీరం క్రమంగా అలవాటుపడినప్పుడు ప్రస్తుత వ్యాయామ స్థాయిని, సమయాన్ని పెంచుకోవడం ద్వారా ఈ ప్రక్రియ ఆసక్తిని, ఆనందాన్ని కలిగించేలా చేసుకోవచ్చు. తగిన వ్యాయామము నిర్ణయించడానికి ఫిట్నెస్ నిపుణుల సహాయం తీసుకోవచ్చు. ఆరోగ్య సమస్యలున్నవారు వ్యాయామం ఎంచుకొనేముందు వారి వైద్యుడిని లేదా చికిత్సకుడిని సంప్రదించాలి .2-6
- స్వచ్ఛమైన గాలిలో చేసిన వ్యాయామం, భూమాతకు కృతజ్ణతతో ఆహ్లాదకరమైన ప్రకృతి అందాన్ని అనుభవిస్తూ చేసే వ్యాయామం మనసును అధ్యాత్మిక పరంగా ఉన్నత స్థాయికి తీసుకు వెళుతుంది. అవగాహనతోనూ మరియు మన శరీరము మరియు శ్వాసపై అవిభక్త శ్రద్ధతో చేసిన వ్యాయామము అంతర్గతంగా ఉన్న శక్తిని అనుభూతి చెందడానికి తోడ్పడడమే కాక ఇది ఆధ్యాత్మిక ప్రయాణంగా రూపాంతరం చెందుతుంది 1,22-25
6. వ్యాయామానికి అడ్డంకులను అధిగమించండి
వ్యాయామశాలకు వెళ్ళే సౌకర్యం లేదా సామర్థ్యం మనకు లేకపోవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడానికి సమయం లేదా స్థలం ఉండక పోవచ్చు. అందువలన నిరుత్సాహ పడిపోవడం, లేదా బద్ధకించడం చేయనవసరంలేదు. అసలు చేయకుండా మానడం కన్నా దానిపైన దృష్టి పెట్టి ఎంతో కొంత వ్యాయామం చేయడం మేలు. వ్యాయామం మనలను రోజంతా చురుకుగా ఉంచడమే కాక ఆరోగ్యంను ఆనందమును కూడా ఇస్తుంది. ఐతే వ్యాయామం యొక్క ప్రయోజనాలను మనం పూర్తిగా అనుభవించడానికి ఏదో ఒక రూపంలో వ్యాయామం చెయ్యాలనే తపన మనలో ఉండాలి. ఉదాహరణకు, ఎలివేటర్‌కు బదులుగా మెట్లు ఉపయోగించడం, దగ్గర దూరాలకు వాహనాన్ని ఉపయోగించకుండా నడిచి వెళ్ళడం యంత్రాలను ఉపయోగించకుండా ఇంటి పనులను స్వయంగా చేసుకోవడం మొదలైనవి చేయవచ్చు. ఈ విషయంలో క్రమబద్ధత మరుయు స్థిరత్వము కీలకం అని గమనించాలి. 3-6, 26
7. వ్యాయామం కోసం భద్రతా చిట్కాలు
*ఏదైనా వ్యాయామం ప్రారంభించే ముందు శరీరంలో తగినంత నీరు ఉండేటట్లు జాగ్రత్త వహించాలి. తగినంతగా వార్మ్ అప్ కసరత్తులు చెయ్యాలి.26,27 కండరాలు సిద్ధం కాకముందే వాటిని స్ట్రెచ్ చేయడం (సాగదీయడం) ఒక సాధారణ తప్పు. ‘అతి సర్వత్రా వర్జయేత్ ’ అన్నట్లు దేనినీ కూడా అతిగా చేయకూడదు.
*తీవ్రమైన కండరాల నొప్పి, కీళ్లలో బెణుకు లేదా ఎముక విరిగినప్పుడు అవి పూర్తిగా నయం అయ్యే వరకు వ్యాయామానికి దూరంగా ఉండాలి. అనారోగ్యంతో ఉన్నప్పుడు గానీ లేదా రక్తంలో చక్కెర లేదా బిపి ఎక్కువ ఉన్నప్పుడు గానీ వ్యాయామం చేయకపోవడమే మంచిది6,21
*శక్తివంతమైన లేదా అధిక తీవ్రత కలిగిన ఏరోబిక్ వ్యాయామాలతో కూడిన ఏదైనా వ్యాయామ దినచర్యను ప్రారంభించే ముందు కార్డియో స్ట్రెస్ టెస్ట్ చేయించుకోవడం మంచిది.2-6
ప్రాక్టీషనర్లు 108 సిసి బాక్స్ లేదా యెస్.ఆర్.హెచ్.వి.పి. మిషన్ ని ఉపయోగించి రక్తప్రసరణ మరియు అస్థిపంజర వ్యవస్థలను బలోపేతం చేయడానికి, (క్లెన్సింగ్ ( ప్రక్షాళన మరియు (ఎమెర్జెన్సీ( అత్యవసర పరిస్థితులు రెమెడీలను అవసరం మేరకు సహాయకారిగా ఉపయోగించుకోవచ్చు.
రిఫరెన్సులు మరియు ముఖ్యమైన వెబ్ సైట్ లింకులు:
- Sathya Sai Baba, The Journey from Physical Fitness to Mental Health, Source: Only God is your true friend, Discourse 6, My dear students, Volume 2 --https://sathyasaiwithstudents.blogspot.com/2014/01/the-journey-from-physical-fitness-to.html#.XBaQ-S2B3WU
- What is exercise: https://www.weightlossresources.co.uk/exercise/questions-answers/what-is-exercise.htm
- Benefits of exercise: https://www.mayoclinic.org/healthy-lifestyle/fitness/in-depth/exercise/art-20048389
- Benefits: https://www.medicalnewstoday.com/articles/153390.php
- Benefits: https://www.healthline.com/nutrition/10-benefits-of-exercise
- Importance of exercise: https://drmohans.com/exercise-for-diabetes/
- Exercise good for children and teenagers: https://www.uofmhealth.org/health-library/aba5595
- https://www.news-medical.net/news/20090922/Mild-exercises-for-the-bed-bound-patients-helps-to-combat-muscle-wasting.aspx
- https://care24.co.in/blog/exercises-for-bedridden-patients
- https://www.allterrainmedical.com/benefits-of-exercise-for-persons-with-disabilities-new/
- https://www.psychologytoday.com/intl/blog/the-athletes-way/201703/mayo-clinic-study-identifies-how-exercise-staves-old-age
- Walk for health: https://www.ncbi.nlm.nih.gov/pubmed/9181668
- Walk for fitness: https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC3490463/
- https://www.webmd.com/fitness-exercise/features/is-walking-enough#3
- https://www.medicalnewstoday.com/articles/317451.php
- Figure 8 walk – an ancient practice https://www.youtube.com/watch?v=N0hALqks-kA
- Infinity walking in 8 shape https://www.youtube.com/watch?v=pjKQeVFJVvk
- http://www.infinitywalk.org
- http://www.infinitywalk.org/medical_professionals.htm
- https://www.practo.com/healthfeed/8-walking-a-simple-alternative-daily-routine-33100/post
- Body weight Exercises: https://www.youtube.com/watch?v=VkBxPdqczzo
- Stretching: https://www.healthline.com/health/benefits-of-stretching
- https://seattleyoganews.com/insight-health-habits-sadhguru/
- Thich Nhat Hanh, How to Walk, Parallax Press, California, 2015 edition
- Eckhart Tolle, The Power of Now – A Guide to Spiritual Enlightenment, 2001 edition, page 92-111
- Barriers to exercise: https://www.mayoclinic.org/healthy-lifestyle/fitness/in-depth/fitness/art-20045099
- https://www.bupa.co.uk/health-information/exercise-fitness/hydration-exercise
- https://isha.sadhguru.org/in/en/wisdom/article/shouldnt-drink-water-during-yoga
2. 2019 నవంబర్ లో పుట్టపర్తి లో నిర్వహింపబడిన 3 శిక్షణా శిబిరాలు:
నవంబరులో ఎప్పటిలాగానే AVP లు మరియు SVP ల కోసం నిర్వహింపబడే శిక్షణా శిబిరాలతో ఉత్సాహవంతమైన వాతావరణం నిండి ఉంది. కేరళ మరియు కర్ణాటక నుండి వచ్చిన 17 గురు VP లు మరియు ఇద్దరు AVP లకు అదనంగా రెండు రోజుల రెఫ్రెషర్ వర్క్ షాప్ కూడా నిర్వహింపబడింది. డాక్టర్ జిత్ అగర్వాల్ మరియు శ్రీమతి హేమ అగర్వాల్ చేత ఉత్తేజకరమైన సెషన్లతో పాటు ఇద్దరు సీనియర్ ఉపాధ్యాయులు10375 & 11422 చేత ఇవి చక్కగా నిర్వహింపబడ్డాయి. వైబ్రియోనిక్స్ ఎలా ప్రారంభించబడి, ఈ దశకు చేరుకున్నదీ, అడుగడుగునా స్వామి దీనికి ఎలా మార్గనిర్దేశం చేశారో వివరించి చెపుతూ ఇచ్చిన అవకాశమును హృదయపూర్వక కృతజ్ఞతతో వినియోగించుకొని వైబ్రియానిక్స్ ను ముందుకు తీసుకెళ్లడములో ప్రతీ అభ్యాసకుడికి ఒక విశిష్ట పాత్ర ఉందని డాక్టర్ అగర్వాల్ సుదీర్ఘ ప్రసంగంలో తమ భావాలను పంచుకున్నారు. పేషంటు యొక్క పూర్తి రికార్డులు మరియు డాక్యుమెంటులు, కేస్ హిస్టరీలను సరిగ్గా నిర్వహించడం ఎంత ముఖ్యమో ఈ వర్క్ షాప్ లో నొక్కి చెప్పబడింది.
5 రోజుల శిక్షణ పొందిన అనంతరం VP లు SVPలు గా అర్హత సాధించారు. SVP అభ్యర్థులలో ఒకరు ఉరుగ్వే నుండి స్కైప్ వాట్సాప్ ద్వారా ఈమెయిల్ ద్వారా పరీక్షలో ప్పాల్గొన్నారు. ఎందుకంటే ఆమెకు పసిబిడ్డ ఉండడంతో పుట్టపర్తికి రాలేక పోయారు. నేర్చుకోవటానికి ఆమె పడిన తపన ఎంత గొప్పది అంటే ఆమె ఈ 5 రోజులలో ప్రతీ రాత్రీ అన్ని సెషన్లకు (టైమ్ జోన్స్ వేరు కనుక ఇక్కడ పగలు ఉరుగ్వే లో రాత్రి సమయం అయ్యేది) హాజరయ్యారు. పాల్గొన్న VP లు మరియు SVP లు వారి వైబ్రియనిక్స్ అభ్యాసం అంతర్గత పరివర్తనకు ఎలా మార్గం సుగమం చేసిందనే అంశము పైన తమ భావాలను పంచుకున్నారు. SVP లు ప్రతీ ఒక్కరూ వైబ్రియోనిక్స్ ను ముందుకు తీసుకెళ్లడంలో తాము కీలక పాత్రను పోషిస్తామని వాగ్దానం చేసారు.
ఓం సాయి రామ్!