Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

అదనముగా

Vol 8 సంచిక 5
September/October 2017


ఆరోగ్య చిట్కాలు 

ఆరోగ్యకరమైన ఆహార సేవనం !

ఎట్టి ఆహారమో అట్టి మనసు ;

 ఎట్టి మనసో అట్టి ఆలోచనలు ;

ఎట్టి ఆలోచనలో అట్టి శీలము  ;

ఎట్టి శీలమో అట్టి ఆరోగ్యము.” 1

1. ఆహారము అంటే ఏమిటి ? 2,3

ఆకారము,రుచి కలిగి ఉండి నోటితో తీసుకోగలిగిన వివిధరకాల పదార్ధాలతో కూడిన దానిని ఆహారము అంటారు. ఐతే ఇది మనం తీసుకోగలిగిన దానిలో ఒక భాగము మాత్రమే .మన ఐదు ఇంద్రియాలు దృష్టి,వాసన,వినికిడి, రుచి, స్పర్శ ద్వారా మనము లోపలకి తీసుకునే దంతా ఆహారమే. ఆహారము ద్వారా మరియు ఇంద్రియాలద్వారా మనం తీసుకునే విషయాల పైన మనసు ఆధారపడి ఉంటుంది. ప్రతీ ఇంద్రియము నుండి పవిత్రమైన పరిశుద్ధమైన ఆహారాన్ని తీసుకోవాలి.కనుక మనము ఇంద్రియాలద్వారా తీసుకునే దానిపైన నిఘా ఉంచాలి. ఇంద్రియాల ద్వారా పవిత్రమైన ఆహారము తీసుకున్నప్పుడు దేహమే దేవాలయము అవుతుంది.    

2. మనకు ఆహారము ఎంతో అవసరం  4-6

మన జీవితానికి కావలసిన నిత్యావసరాలలో ఆహారము కూడా ఒకటి ఎందుకంటే ఆహారము ద్వారానే దేహము వివిధరకాల కృత్యాలు నిర్వహించుకోవడానికి కావలసిన శక్తి వస్తుంది. మరియు మనసు వివేచన చేయడానికి కావలసిన శక్తి కూడా ఆహారము నుండే లభిస్తుంది. జీవితం ఆహారము తోనే ప్రారంభమవుతుంది ఆహారముతోనే కొనసాగింపబడి జీవిత లక్ష్య మైన దేహములో ఉన్న పరమాత్మను తెలుసుకని లక్ష్య సిద్ధి కోసం పాటు పడడానికి కూడా ఆహారమే కావాలి.ఆహారము ద్వారా కొనసాగింప బడే జీవితం అల్పము కాగా దివ్యశక్తి చే కొనసాగింప బడే జీవితము అజరామరము.

3. దేహము,మనసు పైన ఆహారము యొక్క ప్రభావము  2,7,10

ఆహారము మనసు యొక్క తత్వాన్ని నిర్ణయిస్తుంది. మాన్ దేహము వలెనే ఆహారానికి కూడా స్థూల,సూక్ష్మ,అతిసూక్ష్మ స్థాయిలు ఉన్నాయి. ఆహారము జీర్ణ మైన తర్వాత స్థూల భాగము మలము రూపములో బయటకు తోసివేయ బడుతుంది. సూక్ష్మ భాగము కండరాలు ఎముకల పెరుగుదలకు ,దేహ సంరక్షణకు తోడ్పడుతుంది. అతి సూక్ష్మ భాగము మనసు గా రూపొందుతుంది.అలాగే మనం తీసుకొనే ద్రవాహారము లో కూడా స్థూల భాగము మూత్రము రూపంలో బయటకు పోతుంది.సూక్ష్మ భాగము రక్తము గా తయారవుతుంది.అతి సూక్ష్మ భాగము ప్రాణము గా తయారవుతుంది. కనుక మనం తీసుకునే ఆహారము యొక్క స్వభావము పవిత్రముగా ఉండాలన్నదే ఇక్కడి ప్రధానాంశము.

4. పోషణ నిమిత్త మై కొన్ని సూచనలు  8-10

ప్రతీ దేహము లోనూ భగవంతుడు జఠరాగ్ని రూపములో ఉండి  మనం తిన్న ఆహారాన్ని జీర్ణము చేస్తాడు. అటువంటి దేవుడికి మనిషి సృష్టించిన వానికన్నా దైవం సృష్టించినవి సమర్పించడమే ఉచితము. దీనిని ఆధారముగా చేసుకొనియే భారతీయ శాస్త్రాలు ఆహారము యొక్క స్వభావము ఆధారముగా  సాత్వికము,రాజసికము,తామసికము అని 3 భాగాలుగా విభజించాయి.ఆధ్యాత్మిక పథంలో ముందుకు పోవాలనే సాధకులు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలని సూచించబడింది.సాత్వికాహారము ప్రకృతికి దగ్గరగానూ,  వృక్ష సంబంధ మైనదిగానూ, మరే జీవికి హాని తలపెట్టని దిగానూ  ఉంటుంది. ఇది పవిత్రతను,సంతృప్తిని,ఆరోగ్యాన్ని,దీర్ఘాయుష్షును ,సరళతను,ఆధ్యాత్మిక జీవితానికి కావలసిన స్థిర చిత్తాన్ని అందిస్తుంది .

రాజసిక ఆహారము ఎక్కువ ఉప్పు,పులుపులతోనూ ,వేడిగానూ,మషాలాలతోను కూడి ఉంటుంది. ఇది దేహము,మనసు పైన ఉద్రేక స్వభావము చూపుతూ అనుక్షణం మనసును మంచి,చెడు మధ్య ఊగిస లాడేలా చేస్తుంది.  అటువంటి ఆహారము తినడం మొదట ఆనందంగా అనిపించ వచ్చు కానీ తర్వాత నిర్వేదానికి గురి చేస్తుంది. తామసిక ఆహారము ఎక్కువగా నిలువ చేయబడి ఉన్నదిగా  గానీ,ఎక్కువగా ఉడికించినదిగా గానీ,ఎక్కువ కొవ్వు పదార్ధాలతో కూడినదిగా  గానీ ఉంటుంది.ఇది భౌతికంగా మానసికంగా స్తబ్దతను,బద్దకాన్ని  కలిగించి  అనారోగ్యానికి గురి చేసేదిగా ఉంటుంది.

5. సాత్వికమైన ఆహారము  1,4,8-11

స్వచ్చమైన జలము,కొబ్బరి నీరు,పండ్లు,ఆకుపచ్చని తాజా కూరగాయలు,రాత్రిపూట నాన బెట్టిన గింజలు,చిరు ధాన్యాలు,చిక్కుళ్ళు,మొలకెత్తే విత్తనాలు, ఇవన్నీ కూడా సాత్వికాహారము నకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. చిక్కుళ్ళలో చాలా ఎక్కువ మోతాదులో మాంసకృత్తులు ఉంటాయి.వీటిని నీటిలో నానబెట్టుకొని మెత్తగా అయ్యాక తినాలి. సూక్ష్మ క్రిమి రహిత ,క్రొవ్వు తీసిన తాజా పాలు లేదా వాటి ఉత్పత్తులయిన పెరుగు,వెన్న,నెయ్యి మరియు ముడి తేనె ఇవి సాత్విక మైన ఆహారమే కానీ వీటిని తక్కువ పరిమాణంలో తీసుకోవాలి.

వండని ప్రకృతి సిద్ధమైన ఆహారము సాత్విక మైనది .ఎందుకు వండిన పదార్ధాలు సిఫార్సు చేయబడుట లేదు అంటే ఇక్కడ ఒక విషయం గ్రహించాలి వేపించిన గింజలు మొలకెత్తే స్వభావాన్ని కోల్పోతాయి ఎందుకంటే వాటి ప్రాణ శక్తితొలగించ బడుతుంది.  మనిషి మాత్రమే వండిన పదార్ధాల మీద లేదా అస్వాభావిక మైన పదార్ధాల పైన ఆధారపడి జీవిస్తాడు కనుకనే రోగాల పాలవుతాడు.పశు పక్షి మృగాదులు సహజ సిద్ధమైన ఆహారము తీసుకుంటాయి కనుక రోగాలు వాటి దరికి రావు.  

రెండవ రకపు సాత్వికాహారము  ఏమిటంటే తక్కువగా వండిన లేదా ఉడికించిన ఆకుకూరలు,కూరగాయలు మొదలగు తాజాగా వండిన ఆహారము. వండిన తర్వాత ఎంత ఎక్కువ సేపు ఈ ఆహారాన్ని ఉంచితే అంత తామసికముగా మారిపోతుంది. వండే పాత్రలు కూడా పరిశుభ్రంగా ఉండాలి మరియు వంట చేసేటప్పుడు ప్రేమతో చెయ్యాలి వడ్డించే టప్పుడు నవ్వుతూ వడ్డన చెయ్యాలి. . అందువల్ల పవిత్రమైన భావాలు ఆహారములో ప్రవేశించి దేహాన్ని ఆరోగ్యకరమైన దానిగా ఉంచుతాయి. ఇలా రోజూ సాత్వికాహారము నే భుజించి నట్లయితే  అది రాజసిక భావాలయిన కోరిక,కోపము,గర్వము,కామము,భ్రమ అసూయ ఇటువంటివి  మనలో పెరగ నీయక  పవిత్రంగా ఉంచుతుంది.                                                        

6. పండ్లు కూరగాయలను శుభ్రపరచడం  12-15

మనం తీసుకునే పండ్లు కూరగాయల పైన పురుగుమందులు,రసాయనిక మందుల అవశేషాలు ఉంటాయనే భయాలను త్రోసిపుచ్చలేము.వీటిని తొలగించడానికి ఒక పద్దతి ఏమిటంటే నల్లా క్రింద ప్రవహించే నీళ్ళలో  వీటిని ఉంచి బాగా కడగడం వీటిని 2% ఉప్పు ద్రావణం తో (అనగా లీటరు నీటిలో 20  గ్రాముల ఉప్పును వేయాలి) కడిగితే చాలా వరకు ఆ అవశేషాలు పోతాయి.ఐతే రెండు మూడు సార్లు కడగ వలసి ఉంటుంది. మరొక పద్దతి ఏమిటంటే ఆర్ద భాగం వరకూ నీరు ఉన్న ఒక పెద్ద గిన్నెలో ఒక చెంచా ఉప్పు ,రెండు చెంచాలు వినెగర్ వేసి కూరగాయలు పండ్లను 20 నిముషాలు నాననివ్వాలి.  ఎక్కువ సేపు నాననివ్వడం వలన పైన పేర్కొన్న అవశేషాలు పూర్తిగా తొలగి పోతాయి కానీ వినితో పాటు పోషకాలు కూడా పోతాయి.మరొక పద్దతి ఏమిటంటే అవకాశం ఉన్నవారు ఈ ఆర్గానిక్ కూరగాయలు,పండ్లను సొంతంగా పండించుకోవాలి లేదా నమ్మకమైన స్థానం నుండి వీటిని కొనుగోలు చెయ్యాలి.

7. మొదట ఆహారాన్ని భగవంతుడికి నివేదన చెయ్యాలి  11,16

మొదట ఆహారాన్ని తాను నమ్మి కొలిచే భగవంతుడికి లేదా ఒక సర్వోత్తం శక్తికి కృతజ్ఞతాపూర్వకముగా అర్పితము  చేయాలి . అంతేకాదు ఆ ఆహారము మనకు చేరడానికి దోహద పడ్డ ప్రతీ ఒక్కరికీ మనసులోనే  కృతజ్ఞత తెలుపుకోవాలి. ఆహారము తీసుకొనే ముందు ఏ ఒక్క జీవి కూడా ఆహారము లేకుండా మంచి నీరు లేకుండా ఉండరాదని ప్రార్ధించాలి. ఇంకా ఆహారము తినేముందు తనకిష్టమైన నామాన్ని లేదా మంత్రాన్ని స్మరించుకోవాలి..  ఇలా చేస్తే మనం తినే ఆహారము పవిత్రమై పండించిన లేదా వండిన వారికి సంబంధించిన వ్యతిరేక ఫలితాలు శక్తుల నుండి దూరం చేయబడుతుంది.అలాగే పవిత్రమైన సారము మన లోపలి చేరుకొని హృదయాన్ని పవిత్ర పరుస్తుంది.

8. ఆహారాన్ని ఎలా తీసుకోవాలి ? 1,3,17-19

పవిత్రమైన ఆహారము ఒక దివ్య వరప్రసాదితముగా భావించి నిశ్శబ్దముగా,ప్రేమతోను,కృతజ్ఞత తోనూ నిశ్శబ్ద వాతావరణములో నడుము నిటారుగా ఉంచి ప్రశాంతముగా కూర్చుని తీసుకోవాలి.  ఆహారము చక్కగా జీర్ణము కావడం కోసం ఒక ధ్యాన నిమగ్నతతో ,కృతజ్ఞతాపూర్వక భావనతో నోటిలో బాగా నమిలి మింగాలి. అలా  చేస్తే నోటిలోనే ఆహారము 50% వరకు జీర్ణమవుతుంది. ఆహారాన్ని మన కుటుంబ సభ్యులు,లేదా బంధువులు, స్నేహితులతో తింటే అది ఆనంద దాయకంగా ఉంటుంది. ఒకవేళ వంటరిగా తినవలసి వస్తే దైవభావనలతో తినాలి  ఆయుర్వేదం మన చేతితోనే మనం ఆహారం భుజించాలనే నియమాన్ని ప్రోత్సహిస్తుంది.ఎందుకంటే మన ప్రతీ వ్రేలు పంచభూతాలకు ప్రతీక కనుక ఇవి ఆహారము పచనమవడాన్ని ప్రోత్సహిస్తాయి .

ఆహారము తీసుకునే సమయంలో సంభాషణలో పాల్గొనడం,టి.వి. చూడడం లేదా ఉద్రేకం కలిగించే విషయాలు వినడం వీటివల్ల మనసు యొక్క ప్రశాంతతకు భంగం వాటిల్లుతుంది. ఏదయితే విన్నామో,చూసామో అవి కొంత కాలవ్యవధిలో మనసు పొరల లోనికి ప్రవేశించి అనారోగ్యాన్ని కలిగిస్తాయి. ఆహారమును తొందరపాటుగానూ,నిలబడి, అదొక నిత్య కృత్యము అన్నట్లు యాంత్రికంగా తినకూడదు.  

ఘనాహారము తినేముందు సులువుగా జీర్ణమయ్యే పండ్లు,పచ్చి కూరగాయలు తినడం మంచిది. మనం తినే ఆహారము గట్టిగానో తడిలేనిది గానో ఉంటే తప్ప ఆహారము తీసుకునే సమయంలో నీరు లేదా ద్రవపదార్ధాలు తీసుకోకుండా ఉంటే మంచిది. భోజనం చేసేందుకు అరగంట ముందు గానీ లేదా చేసిన రెండు గంటల తర్వాత గానీ నీరు త్రాగావచ్చు.

9. ఎంత తినాలి,ఎప్పుడు తినాలి  3,10,17,18

మనం తీసుకునే ఆహారము నియమిత పరిణామములో అవసరం మేరకు ఆకలి అనే వ్యాధికి మందు అనే భావంతో ఉండాలి.భోజనము పూర్తయిన తర్వాత ఉదరములో 50% ఘన పదార్ధలతోను,25% ద్రవపదార్ధాలతోనూ,మిగతా 25% గాలి తోనూ ఉండాలి.దీనివల్ల జీర్ణ రసాలు ఉత్పత్తి అయ్యి ఆహారము చక్కగా జీర్ణ మవడానికి అవకాశము కలుగుతుంది. పాటించవలసిన నియమం ఏమిటంటే భోజనం తినక ముందు ఎంత తేలికగా ఉన్నామో భోజనం అనంతరం కూడా అంటే తేలికగా ఉండాలి గానీ బద్దకంగా నిద్ర వచ్చే విధంగా ఉండరాదు. కడుపు నిండి నట్లు అనిపించింది అంటే మీరు ఎక్కువ తిన్నట్లే. 

మీరు సత్వికాహారము తీసుకున్నప్పటికీ అది అమితముగాను లేదా ఎక్కువ మోతాదులో (దానిలో నెయ్యి,బెల్లము వంటివి ఎక్కువగా ఉండడం)ఉన్నట్లయితే అది రాజసిక,తామసిక  గుణాలను ప్రేరేపిస్తుంది

మనకు 50 ఏళ్ళు పైబడిన తర్వాత క్రమేణా మనం తీసుకునే ఆహారము తగ్గించుకుంటూ రావాలి, నేను దేహాన్ని కాదు అనే భావన మనలో జాగృత మయితే మన శరీరం ఎక్కువ ఆహారం రుచులకోసం వెంపర్లాడదు. మన దేహము యొక్క అవసరాలను చాలా సున్నితంగా పరిశీలిస్తూ డానికి తగ్గట్టుగా ప్రతిస్పందించాలి. రాత్రి భోజనం చాలా తేలిక ఉండాలి మరీ ఆలశ్యం కాకుండా చూసుకోవాలి,ఉదరానికి నియమిత కాలానుగుణంగానే ఆహారము అందించాలి. మరుసటి భోజనం అందించే ముందు ఆకలి అనేది దేహానికి తెలియాలి. భారత ఇతిహాసాల ప్రకారము రోజుకు మూడు సార్లు తినేవాడు రోగి ,రెండు సార్లు తినేవాడు భోగి,ఒక్కసారి మాత్రమే తినేవాడు  యోగి .

10. నిషేదించవలసిన లేదా తగ్గించవలసిన ఆహారపు వివరములు  10,18

ఇక్కడ సూచించబడ్డ ఆహార దినుసులను పూర్తిగా మానివేయడం కానీ లేదా తగ్గించడం కానీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. నిలువ ఉంచే పదార్ధాలు,కృత్రిమ రంగులు వేసిన పదార్ధాలు,సువాసన కోసం వేసే పదార్ధాలు ఇవన్నీ వేసి ప్యాకింగ్ చేసిన పదార్దాలు,,అలాగే  MSG ఇది రుచిని పెంచేది కానీ నిలవ ఉంచేది కాదు కానీ ఆరోగ్యానికి ఎంతో నష్టం కలిగిస్తుంది. ఇంకా మిఠాయిలు,చాకొలెట్ లు,ఐస్ క్రీం ,కూల్ డ్రింకులు,కెఫీన్(ఇది కాఫీ,టి లలో ఉంటుంది)కొవ్వు పదార్ధాలు,వేపుళ్ళు,ఇవన్నీ అనారోగ్యం కలిగించేవే.

ఇక్కడ సూచించబడ్డ ఐదు తెల్లని వస్తువులను తగ్గించడానికి ప్రయత్నించండి. వెన్న, నెయ్యి తో సహా  పాలు మరియు దాని ఉత్పత్తులు( దీని బదులు కొబ్బరి పాలు,మజ్జిగ,పెరుగు వాడవచ్చు) తెల్లని పంచదార (ఇది తప్పనిసరి అనుకుంటే బెల్లము లేదా పటికబెల్లము వాడవచ్చు),ఉప్పు (దీని బదులుగా రాతి ఉప్పు వాడవచ్చు)మైదా మరియు దాని ఉత్పత్తులు (దీని బదులు ముడి గోధుమ పిండి లేదా చిరు ధాన్యాల పిండి వాడవచ్చు. తెల్లని బియ్యం ( విని బదులుగా ముడి బియ్యము లేదా బ్రౌన్ రైస్ వాడవచ్చు

గ్రుడ్లు చేపలతో సహా మాంసాహారమును మానివేయాలి.అలాగే సారాయి ,ధూమపానము కూడా మానాలి ,ఎందుకంటే ఇవి భగవద్ నిర్మితమైన దేహ నిర్మాణానికి అవరోధాలు.ఇవి ఆద్యాత్మిక ప్రగతికి ప్రతిబంధకాలుగా పనిచేస్తాయి. 

11. ఆహారపు అలవాట్లు ఎలా మార్చుకోవాలి  15,20

మనం రోగాల బారిన పడేంత వరకూ మనకు అనారోగ్యం కలిగించే ఆహారము పట్ల ఉపేక్ష ఎందుకు వహించాలి ? కానీ ఇక్కడొక ఇబ్బంది ఉంది.అందరికీ ఒకే రకమైన పరిపూర్ణమైన ఆహారము లభించదు అనేది నిర్వివాదాంశం .దీని నిమిత్తము వ్యక్తి తాను తీసుకునే ఆహారము పైన ప్రయోగము చేసి తనకు ఏది అనుకూల మైనది,ఏది తనను ఆనందంగా ఆరోగ్యంగా ఉంచుతుంది అనేది తెలుసుకోవాలి.అలాగే తన మనసుకు తాను నచ్చ చెప్పుకుని కొంత కాలవ్యవధిలో మంచి ఆహారపు అలవాట్ల వైపు మరల్చాలి.   ఈ కాలవ్యవధి  మన దేహము మనసు ఈ ఆరోగ్య కరమైన ఆహార అలవాట్లకు సర్దుబాటు చేసుకోవడానికి ఉపకరిస్తుంది. దీని నిమిత్తము చిన్న చిన్న లక్ష్యాలు ఏర్పరుచుకొని ఒక్కొక్క వారములో వాటిని చేరుకుంటూ ఉంటే అది చాలా  సంతృప్తిని ముందుకు వెళ్ళడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది..ఇది మాకు కష్టంగా ఉంది అనుకున్న వారు మధ్యేమార్గం అనుసరించడం మేలు.

12. ఆహారము మరియు శీలసంపద  10

మానవుని శీలసంపదకు ప్రధాన ఆధారము ఆహారమే. మనుషులంతా ఒకటే కానీ వారు తమ ఇంద్రియాలద్వారా తీసుకునే విషయాల పవిత్రతను బట్టి మరియు తినే ఆహారము యొక్క గుణాన్ని బట్టి   సంఘంలో ఘర్షణలకు తావు కల్పిస్తోంది. ఎవరయినా ఇద్దరు వ్యక్తులలో ఒకరు సాత్విక ఆహారము,మరొకరు రాజసిక ఆహారము తినే వారయితే వారి మధ్య సయోధ్య అనేది అసంభవం. కనుక ఎవరయినా భగవంతునితో సన్నిహితంగా మెలగాలంటే భగవంతునితో సఖ్యం చేయాలంటే వారు సాత్విక మైన ఆహారము,సాత్విక ప్రవృత్తి,సాత్విక ఆలోచనలు,కలిగి ఉండాలి ఎందుకంటే భగవంతుడు పవిత్ర సత్వగుణ సంపన్నుడు.

మూలములు : ఈ వ్యాసము ప్రధానంగా ఆహారము పైన భగవాన్ బాబా చేసిన ఉపన్యాసాల పైన ఆధారపడింది.

  1. Sathya Sai Speaks Vol 27-3, Food, the heart, and the Mind, 21st January 1994
  2. Sathya Sai Speaks Vol 23-16, The Buddhi and the Atma, 26th May 1990
  3. Sathya Sai Speaks Vol 29-03,Triple transformation: Sankranti’s Call,15th January 1996
  4. Sathya Sai Speaks Vol 14-31, Food and Health, 21st September 1979
  5. Sathya Sai Speaks Vol 24-16, The Human Predicament and the Divine, 30th May 1991;
  6. Sathya Sai Speaks Vol 13-19, The Message of Love, 23rd November 1975 & Summer showers in Brindavan 1972, Chapter 4
  7. Sathya Sai Speaks Summer Showers in Brindavan 1993 Chapter 11.
  8. Sathya Sai Speaks 10th Aug 1983, Prashanti Nilayam, Sathya Sai Baba Speaks on Food, Sri Sathya Sai Sadhana Trust, Publications 2014, page 17-19
  9. Sathya Sai Speaks Vol 11, Forms of Food, 28th January 1971; Bhagvad Gita, Chapter 17, verses 7-10
  10. Sathya Sai Speaks Vol 16-19, Food and Character
  11. Sathya Sai Speaks Vol 35-22, Listen to the Master of Universe and Transform Yourselves into Ideal Human Beings, 23rd November 2002
  12. http://www.cfs.gov.hk/english/multimedia/multimedia_pub/multimedia_pub_fsf_128_02.html
  13. http://www.cseindia.org/node/2681\
  14. https://www.quora.com/How-much-of-combination-is-2-salt-water
  15. Manual  for Vibrionics Practitioners, chapter 9
  16. Sathya Sai Baba Speaks on Food, Sri Sathya Sai Sadhana Trust, Publications, 2014, page 21-22
  17. Food & Body, Isha Health and wholeness Guides
  18. https://www.mygov.in/sites/default/files/user_comments/Health_Tips_latest%20pdf.pdf
  19. Sai Vibrionics Newsletter, Vol.8 issue 2, p-15
  20. https://zenhabits.net/eating

 

2. పోలాండ్ లో సాయి వైబ్రియోనిక్స్  పోలిష్ కోఆర్డినేటర్  02515 వద్దనుండి సమాచారము 

పోలాండ్ లో మొదటి వైబ్రియో సదస్సు మొదటిసారిగా  1999 లో డాక్టర్ అగ్గర్వాల్ గారు మా దేశాన్ని సందర్శించి నప్పుడు జరిగింది. రెండు సంవత్సరాల తర్వాత వారు తిరిగి మా దేశాన్నిసందర్శించి నపుడు అనేక మైన వైబ్రో సదసులు జరిగాయి. మా దేశం నుండి ఎందరో భక్తులు పుట్టపర్తిలో  ప్రశాంతి నిలయం సందర్శించినపుడు సాయివై బ్రియోనిక్స్ లో శిక్షణ తీసుకున్నారు.  

108 కామన్ కొమ్బో బాక్స్ ప్రవేశ పెట్టిన మీదట కొత్తవారికి శిక్షణ నివడం ఇంకా శులభ తర మైనది.కనుక పోలాండ్ ఆవల నుండి ఇతర సహాయం ఏమీ అవసరం లేకుండానే మా దేశం లోనే శిక్షణ ఇవ్వసాగాము.ఇటీవల 2017 మార్చ్ లో స్పాలా లో జరిగిన సెమినార్ తో కలుపుకొని ఇప్పటివరకు 12 సదస్సులు జరిగాయి.ఇప్పటివరకూ పోలాండ్ లో 250 ప్రాక్టీషనర్ లు శిక్షణ పూర్తి  చేసుకొని  పేషంట్లకు వైద్యం చేయడానికి అర్హత పొంది ఉన్నారు

గత 5 సంవత్సరాలలో పోలిష్ ప్రాక్టీషనర్ లు 29,000 పేషంట్ లకు వైద్యం అందించి 59,000 గంటలు వైబ్రియో సేవలో పాల్గొన్నారు.మేము రెండు రకాల సమావేశాలను ఏర్పాటు చేస్తున్నాము ఒకటి క్రొత్తవారికోసం కోర్సు రూపం లోనూ,పాతవారికోసం సదస్సు రూపంలోనూ ఏర్పాటు చేస్తున్నాము.  పోలాండ్ దేశవ్యాప్తంగా సుమారు 70 మంది ఇటువంటి సదస్సులలో పాల్గొంటున్నారు.ఈ సదస్సులు ప్రాక్టీషనర్ లు తమ వైబ్రో జ్ఞానాన్ని,నైపుణ్యములను పెంచుకోవడానికి,.ఎంతగానో ఉపయోగ పడుతున్నాయి..   

 

 

 

 

 

 

 

Om Sai Ram