Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

డా.జిత్ కే అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి

Vol 8 సంచిక 4
July/August 2017


ప్రియమైన చికిత్సానిపుణులకు,

ఈ గురుపూర్ణిమ(శిష్యుడు గురువును పూజించే పౌర్ణమి దినము)పర్వదిన సందర్భాన మీతో ఇలా నా భావాలను పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎన్నో కార్యక్రమములు చేపట్టారు. అవి డ్రామాలే కానివ్వండి, డ్యాన్సులే కానివ్వండి, సేవాకార్యక్రమాలే కానివ్వండి ఇవన్నీ కూడా మన సద్గురువును ప్రసన్నం చేసుకొనే దానిలో భాగంగాను వారి అడుగుజాడలలో నడుస్తూ వారి సందేశాన్ని ఆచరణాత్మకంగా నిరూపించడానికి ఉద్దేశించినవే. నా పరిశీలనలో నేను గమనించినదేమంటే స్వామి తమ భౌతిక దేహం వీడినప్పటినుండీ వారు ఏ మిషన్ కోసం తమ జీవితమును అంకితం చేసారో అట్టి సేవాకర్యక్రమాలు అదే ఉత్సాహంతోను, అంకితభావం తోనూ వెయ్యింతలు గా పెరిగిపోతూ వచ్చాయి. అదేవిధంగా వారు ప్రారంభించిన వైబ్రియోనిక్స్ మిషన్ కూడా అలాగే విస్తరిస్తూ ఉన్నదని చెప్పడానికి నాకెంతో ఆనందంగా ఉన్నది.

నా పరిశీలనలో తెలిసిన విషయం ఏమిటంటే ఇటీవల మన వార్తాలేఖలలో అత్యంత క్లిష్టమైన కేసుల గురించి వైబ్రియో రెమిడిలద్వారా అవి నయమైన తీరు గురించీ, మొక్కలు, జంతువుల పైన విస్తరిస్తున్న పరిశోధనలు గురించి చక్కటి అంశాలు ప్రచురితమవుతున్నాయి. భవిష్యత్తులో వైబ్రియోనిక్స్ స్వర్ణయుగం రానున్నదనే భావన నాలో స్వాప్నికమవుతున్నది.

ఈ మధ్యనే మన స్పానిష్ అనువాదకుడు స్వర్గస్తులయ్యారు. ఆ భర్తీ నింపడానికి నేను అడిగిందే తడవుగా ఇద్దరు చికిత్సా నిపుణులు ప్రాక్టీషనర్ 01001 మరియు  ప్రాక్టీషనర్ 00423 స్వచ్చందంగా ముందుకు వచ్చారు. అతి తక్కువ సమయంలో రెండు వార్తాలేఖలను అనువదించడమే కాక అసంపూర్తిగా ఉన్న వాటిని కూడా త్వరగా పూర్తిచేసే దిశలో ముందుకు వెళుతున్నారు. భారత దేశంలో కూడా ఎందరో అనువాదకులు వార్తాలేఖ లనే కాక వైబ్రియోనిక్స్ పుస్తకాలన్నీ కూడా తెలుగు, మరాఠీ, హిందీ వంటి  భాషలలోనికి అనువదిస్తూ ఉన్నారు.

మన కర్ణాటక కోఆర్డినేటర్  10776 ఇటివలే  వైట్ ఫీల్డ్ SSIHMS లో మన వైబ్రియోనిక్స్ క్లినిక్ నిర్వహించడం పై వారు పంపిన  సమాచారాన్ని మీతో పంచుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది. ఇది మార్చ్ 2 వ తేదీన న్యూరో పేషంట్ విభాగం నుండి ప్రారంభమయ్యింది. దీనిని ఐదుగురు అంకిత భావం గల వైబ్రో నిపుణులు రొటేషన్ పద్ధతి పైన వారానికి మూడు సార్లు నిర్వహిస్తున్నారు. ఇక్కడ కొచ్చే పేషంట్ల సంఖ్య కూడా కేవలం నోటి మాట ద్వారానూ, ఇంకా రిఫెరెన్సు ద్వారానే క్రమంగా పెరుగుతోంది. మరొక  హృదయానందకరమైన విషయం ఏమిటంటే డాక్టర్లు కూడా ఎంతో విశాల హృదయంతో మన వైబ్రో వంటి ప్రత్యామ్నాయ వైద్య విధానాలను సిఫార్సు చేస్తూ తమ పేషంట్లను మన చికిత్సా నిపుణుల వద్దకు పంపడం ఒక శుభ పరిణామం. ఇటీవల నేను అమెరికా లోని సత్యసాయి సేవా సంస్థల శిబిరానికి వెళ్ళినప్పుడు ఇటువంటి వాతావరణమే కనిపించింది. అక్కడకు వచ్చిన అసంఖ్యాక డాక్టర్ల బృందంతో మాట్లాడినప్పుడు  వారి విశాలమైన భావాలు, వైబ్రియోనిక్స్ పట్ల వారికున్న అభిరుచి గురించి స్వామి యొక్క ప్రేమే కృత్య రూపంలో ఎలావ్యక్తమవుతున్నదో తెలుసుకొనే అవకాశం కలిగింది.

ప్రియమైన సోదరి సోదరులారా స్వామి ఎప్పడూ ఇలా అనేవారు. ” పని, ఆరాధన, జ్ఞానము ఇవన్నీ సేవతోనే ప్రారంభమవుతాయి. సేవ ఎటువంటిదైనా ప్రేమ తోనూ దైవ భావన తోనూ చేస్తే అది పూజ (ఉపాసన)గా మారిపోతుంది ”. 1999 మార్చి 14 నాటి శ్రీవారి దివ్యవాణి. కనుక ఇప్పటినుండి మనం శ్రీవారి అడుగు జాడలలో నడుస్తూ వైబ్రియోనిక్స్ ను మన జీవితంలో ఒక  భాగం చేసుకునేలా ప్రతిన బూనుదాం. దీనిలో భాగంగా మీ నుండి నెలవారీ రిపోర్టులు, మీ అనుభవాలు, కేస్ హిస్టరీల(రోగ చరిత్రలు)పరంపర నియమ బద్ధంగా కొనసాగుతుందని ఆశిస్తున్నాను. మన సంస్థ చేస్తున్న ఎన్నో కార్యక్రమాలకు స్వచ్చంద సేవకుల అవసరం ఎంతో ఉంది. కనుక మీమీ పరిధిలోని రాష్ట్ర లేదా జాతీయ సమన్వయ కర్తను ఇట్టి అవకాశల కోసం సంప్రదించండి లేదా  [email protected]. కు వ్రాయండి.

సాయి సేవలో మీ

జిత్ కె అగ్గర్వాల్