డా.జిత్. కే అగ్గర్వాల్ యొక్క మాటల్లో
Vol 5 సంచిక 6
November/December 2014
ప్రియమైన విబ్రియో అభ్యాసకులరా,
నూతన స్టైల్ లో తయారైన వార్తా లేఖ విడుదల సందర్భంగా
మన ప్రియతమ ప్రభువు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా యొక్క 89వ జన్మదిన పవిత్ర శుభ సందర్భమున, సాయి విబ్రియోనిక్స్ యొక్క వార్తాలేఖను ప్రేమపూరిత సేవతో సమర్పించుటకు మేమెంతో సంతోషించుచున్నాము. వార్తాలేఖను ఈ విధమైన నూతన తరహాలో సమర్పించుటకు మాకు అనుగ్రహించిన స్వామికి మేము కృతఙ్ఞతలు తెలుపుకొంటున్నాము. కష్టాలు మరియు రోగముల బారిన పడిన వారికి, సేవలందించుటకు విబ్రియో అభ్యాసకులుగా మనందరం పునరంకితం అవ్వడం ద్వారా స్వామి మీద మన యొక్క భక్తిని చూపుతాం.
హెచ్‌టిఎంఎల్ పంధా అనుసరించి మేము తయారు చేసిన తోలి సంచిక ఇది. దీని వలన పాఠకులకు సబ్జెక్టు ప్రకారం కేసులను వెతుకుటకు వీలు కల్గుతుంది. ప్రస్తుతానికి శోధన ప్రక్రియ ఈ సంచికకు మాత్రమే ఉపయోగపడుతుంది. పదములను మరియు గత అన్ని సంచికల విషయాలను శోధించటానికి ఈ శోధన ప్రక్రియను మేమింకా విస్తృత పరుస్తాము. కానీ ఈ పనికి మా టీంకు కొంత సమయం పట్టవచ్చు. అందువలన మీరు ఓర్పు వహించవల్సిందిగా కోరుచున్నాము. ఈ నూతన పంధా వార్తా లేఖను మరింత చేరువగా, ఉపయోగకరంగా చేస్తుందని మేము భావిస్తున్నాము.
వార్తాలేఖను మెరుగు పరిచినందుకు మరియు దానికవసరమైన సామాగ్రిని అందించడానికి ఎంతో మంది సహాయ సహకారాలందించారు. మీ యొక్క ప్రేమపూరిత సేవకు మా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. అభ్యాసకులందరు మా ఈ కృషికి ఉత్తేజితులై తమ కేసు హిస్టరీలను ఇతర విషయాలను రివ్యూ కొరకు మాకు పంపగలరని ఆశిస్తున్నాము (కేసు హిస్టరీల కొరకు దశా నిర్దేశములను ఈ సంచికలో క్రింద ఇచ్చిన ప్రకటనలు విభాగంలో చూడండి). కాలక్రమమున వార్తా లేఖ మరింత అభివృద్ధి చెందగలదని భావిస్తూ ఈ విషయంలో స్వామి యొక్క మార్గదర్శకత్వమును మేము సదా కోరుతాము.
ఈ సంచికను చదివిన తరువాత మీరు మీ యొక్క వ్యాఖ్యానమును, సూచనలను మరియు నూతన స్టైల్ లో తయారైన వార్తా లేఖ గురించి అభిప్రాయాలను మా టీం సభ్యులు తెలుసుకోవడానికి పంపగలరని భావిస్తున్నాము. మీ నుంచి స్పందనను మేము చాలా హర్షిస్తాము. మీరు నన్ను నేరుగా [email protected] వద్ద సంప్రదించవచ్చు.
ఆధునిక ట్రైనింగ్ గురించి క్రొత్త విషయాలు మరియు నూతన వార్తా లేఖా విభాగం
సాయి విబ్రియోనిక్స్ న్యూస్ లెటర్ మీకు మీ విబ్రియో ప్రాక్టీస్ లో సహాయ పడగలదని మరియు ప్రాక్టీషనర్ల మధ్య సమిష్టి తత్వాన్ని అలవర్చగలదని మేము భావిస్తున్నాము. విబ్రియో ప్రాక్టీషనర్లు రోగులకు అత్యంత ప్రేమతో, అత్యుత్తమ వైద్య సేవ అందించే విధంగా తోడ్పడటమే మా లక్ష్యం. ఇది జ్ఞప్తిలోఉంచుకొని నేను రెండు ప్రకటనలు చేయబోచున్నాను.
మొదటిది, ఈసంచికతో ప్రారంభించి, మీరు రోగులకుచేసే చికిత్సను మెరుగుపరచే వివిధ వ్యాసాలను ప్రచురించబోతున్నాను. ఈ వ్యాసాలు కాలక్రమంగా వార్తాలేఖలలో ప్రకటించబడి, విబ్రియోనిక్స్ వెబ్ సైట్లో ప్రచురించ బడును. నేను తరచుగా వివరణకోరే, వైద్యులకి తోడ్పడే ముఖ్యవిషయాలన్నీ యీవ్యాసాలలో తెలుపబడును. ఇటువంటివన్నీ ప్రశ్న-జవాబుల శీర్షికలో ప్రచురితమయే సౌలభ్యం లేదు. ఈ వ్యాసములవలన చికిత్స విధానాలను పునరావలోకించి, సరిదిద్ది, ప్రస్తుత నూతనవిధానాలను జతచేసే వీలుకలుగుతుంది. దయచేసి ప్రాక్టీషనర్స్ అందరూ ఈ వ్యాసాలను తదేకంగా చదవమని కోరిక.
మొదటి వ్యాసం: మందు మోతాదు, సేవించే విధం. ఈ వ్యాసం విబ్రియోనిక్స్ వెబ్ సైట్ లో, రిసోర్సెస్ లైబ్రరీలోని, బుక్స్, వీడియోస్ & ఆర్టికల్స్ సెక్షన్లో వున్నది. ఇది ప్రాక్టీషనర్స్ కొరకు మాత్రమే. మీరు www.vibrionics.org లో లాగిన్ చేసి చూడగలరు.
రెండవది: వార్తాలేఖలో ‘అదనముగా’ అనే శీర్షిక జత చేస్తున్నాము. ఇదే వార్తాలేఖలో అంతిమ శీర్షిక. దీనిలో విబ్రియోనిక్స్ సంఘానికి ఉపయుక్తమైన వివిధ విషయాలు చర్చించబడును. భౌగోళికంగా వేరై, వివిధ ప్రదేశాలలో వున్నా, మనుషుల హృదయాలు ఒకటే.
మన తొలి వ్యాసం ‘అదనముగా’ శీర్షికలో అమెరికా మరియు కెనడా శిక్షకులు & సహ దర్శకులు 01339…USA, తమ ప్రాంతంలోని వివిధ ప్రాక్టీషనర్స్ ని ఏరీతిలో సంప్రదించి, వారిని ప్రశ్నలడిగి పరస్పరం నేర్చుకొనునట్లు చేయుచున్నారో వివరిస్తారు. ప్రాక్టీషనర్స్ తో సంప్రదింపులకు యిదొక మంచి ఉదాహరణ. ఈ విధంగాచేయుటకు యితరమార్గాలు కూడా వున్నవి. అనుభవజ్ణులైన ప్రాక్టీషనర్స్ ని తమ ప్రశ్నలడిగి, వారినుండి తమప్రావీణ్యత వృద్ది చేసుకొని, తమరోగుల చికిత్సను మెరుగుపరచుట ముఖ్యమైనది. ఈ నివేదిక ద్వారా అభ్యాసకులకు, యితర అభ్యాసకులను కలిసే అపూర్వ అవకాశం, మరియు పబ్లిక్ ప్రదేశాలలో కాకుండా జరిగే ఇటువంటి సత్సంగాల వలన కలిగే లాభాలు అర్థమవుతాయి.
సాయి వైబ్రియానిక్స్ అనగానేమి?
పూజ్యబాబావారి 89వ జన్మదిన శుభ సందర్భమున (నవంబర్ 23వ తేదీన) వారి జ్ణాపకార్ధo “సాయి వైబ్రియానిక్స్ అనగానేమి” అను వీడియో, ‘సాయిరాం స్వస్తతా తరంగాలు’ (సాయిరాం హీలింగ్ వైబ్రేషన్స్) ఇంగ్లీష్ తోబాటు 13 భాషలలొ విడుదల చేయబడినది తెలుపుటకు నేనెంతో సంతోషించుచున్నాను.
ఈ వీడియో తొలి ‘అంతర్జాతీయ వైబ్రియానిక్స్ సమావేశం’, పుట్టపర్తిలో ఈ సంవత్సరం జనవరిలో ప్రదర్శించబడినది. నూతన అనువాదాలు త్వరలోనే వైబ్రియానిక్స్ వెబ్ సైట్ www.vibrionics.org లో చూడగలరు.
ఆరోగ్యమునకు కొన్ని సూచనలు
చివరగా నేను మీకు చెప్పబోయేదేమిటంటే, ఇటీవలే రేడియో సాయిలో ప్రచురితమైన వ్యాసం, శాకాహారఓ యొక్క విలువ - ప్రధమభాగం, ద్వితీయభాగం http://media.radiosai.org/journals/vol_12/01OCT14/Vegetarianism-part-01.html లో చదవండి.
ఈవ్యాసంలో శాకాహారం ప్రాముఖ్యత గురించి శ్రీ సత్య సాయిబాబా వారి బోధనలున్నవి. మాంసాహార భోజనము వల్ల మానవశరీరంలో కలుగు అనారోగ్యాలు, మనసుమీద కలిగే దుష్ప్రభావం గురించి శ్రీ బాబాగారు స్పష్టంగా విశదీకరించారు. కనుక ఈ వ్యాసాన్ని మీరు చదవటమేకాక, యితర రోగులకు కూడా చదివి, వినిపించి, శాకాహారం తినుటవల్ల కలిగే లాభాలను, మాంసాహారం తినుటవలన ఏదుర్కొంటున్న అనారోగ్యస్థితిని విశదీకరించి, వారు తమ ఆహారంతో ప్రయోజనం పొందేలా చేయమని కోరుతున్నాను.
ప్రేమపూరితమైన సాయిసేవలో,
జిత్ అగర్వాల్