అదనపు సమాచారం
Vol 5 సంచిక 3
May/June 2014
ఆరోగ్య సమాచారాన్నీ, రచనలనూ సాయవైబ్రియానిక్స్ తెలియజేయటం కోసమే అందిస్తోంది. ఇది వైద్య సలహా కాదు. రోగులు వారి ఆరోగ్య పరిస్థితి గురించి సైద్యుల సలహా పాటించాలని చెప్పండి.
బీట్ రూట్ (Beetroot) తో ఆరు ఆరోగ్య ప్రయోజనాలు
ఉత్తర ఆఫ్రికా, ఆసియా, యూరప్ లలో సముద్ర తీరప్రాంతాలలో చరిత్రకు అందని నాటినుంచి సహజంగా పెరిగుతున్న ఆహారం బీట్స్ (బీట్రూట్). మొదట్లో ఆహారం బీట్ ఆకులే. ఈ రోజు అందరూ బీట్ అని పిలిచే ఎఱ్ఱటి తీపి దుంప పెంపకం ప్రాచీన రోమ్ లో కాని ఆరంభం కాలేదు. 19వ శతాబ్దం నాటికి బీట్స్ కు సహజమైన తీపి వెలుగులోకి వచ్చి చక్కెర నిచ్చే పదార్థంగా వాడుక లోనికి వచ్చింది. ( బ్రిటిష్ వాళ్ళు చెరుకు అందకుండా చేసినప్పుడు నెపోలియన్ చక్కర కోసం బీట్స్ వాడమన్నాడని అంటారు)
ఈ దుంప కూరకు ఎఱ్ఱని దుంప భాగం నేల అడుగునా, ఆకులు నేలపైనా పెరుగుతాయి. ఇది ఉష్ణ, సమశీతోష్ణ ప్రాంతాలు రెండిటిలోనూ పెరుగుతూ పంటకు రావటానికి రెండు నెలలు తీసుకుంటుంది. వేల సంవత్సరాలుగా వీటి సేద్యం జరుగుతున్నా వీటి పోషక విలువల పరిశోధన ఇటీవల మాత్రమే ఆరంభమయ్యంది.
ఈ రోజుల్లో పంచదార ఉత్పాదనకు చక్కెర బీట్స్ (sugar beets) సామాన్యమైన ముడిసరుకు. కానీ చాలామంది వారి దైనందిన ఆహారానికి మొక్క మొత్తంగా అందించే ప్రయోజనాలను చేజార్చుకుంటున్నారు. నేటి పరిశోధనలు వాటిలో పోషకాలు ఎంత దట్టమో అనే కాక వ్యక్తి ఆరోగ్యాన్ని ఎంత స్థిరంగా ఉంచుతాయో ఋజువు చేస్తున్నాయి. ఆరోగ్యాన్ని వృద్ధి చేసే దీని పోషకాలు మరోక చోట ఉండక పోవచ్చు. అంతే కాకుండా ఇవి - రుచి గా ఉంటాయి.
మానిసిక ఆరోగ్యపు సమతూకానికి బీట్స్
కుంగుదల వైద్యం కొరకు వైద్యలు కొన్ని పద్ధతులలో వాడే బిటైన్ (Betaine) బీట్రూట్ లో ఉన్నది. సౌఖ్య భావననూ, మానసిక విశ్రాంతినీ కలిగిస్తుందని తేలిన ట్రిప్తోఫాన్ (tryptophan) బీట్ రూట్లో ఉన్న మరో ముఖ్యమైన అంశం. రక్తపోటు తగ్గిస్తూ, శరీరం మీద ఒత్తిడి పోగొట్టే ప్రధాన సాధనాలు ఇవి.
శక్తి నిలువలు పెంచే బీట్స్
బీట్స్ నుంచి అందిన షుగర్ శరీరమంతటా మెల్లగా విడుదల అవుతుంది కనుక షుగర్ స్థాయిలు హెచ్చుగా ఉన్నా శక్తిగా మారి ఆ స్థాయి స్థిరంగా ఉండటానికి సాయ పడుతుంది. చాకొలెట్ వంటి ఆహార పదార్థాలలోని షుగర్ ని శరీరం త్వరగా శక్తి రూపంలోకి మార్చకుంటుంది. కెలొరీలు కూడా తక్కువగా ఉన్నబీట్స్ తమ శక్తి ఊతాన్ని శరీరానికి దీర్ఘకాలం అందిస్తాయి.
బీట్స్ లో విటమిన్లు, ఖనిజాల సమృద్ధి
విటమిన్ బి, ఇనుములు పుష్కలంగా ఉన్నందువల్ల ఇవి గర్భిణీలకు మరింత ప్రత్యోక వరాలు. కొత్త కణాల ఉత్పత్తికీ తగ్గిపోతున్న ఇనుమును పునరుద్ధరించటానికీ విటమిన్ బి, ఇనుములు ఈ సమయంలో అవసరం. అంతేకాక బీట్స్ లో ఉండే విటమిన్లు, ఖనిజాలు, పీచు (fibre), ఫాస్పరము (phosphorus), పొటాషియం (potassium), ఫోలిక్ ఆమ్లము (folic acid), బీటా కెరొటిన్ (beta-carotene), విటమిన్ ఏ, మెగ్నీషియం (magnesium), విటమిన్ C మరియు బీటా సయనిన్ (betacyanin) అధికంగా ఉంటాయి..
శరీరాన్ని శుభ్ర పరచే బీట్స్
బీట్స్ కాలేయాన్ని (liver) శుభ్రంగానూ, స్వచ్ఛంగానూ ఉంచుతాయి. రక్తాన్ని శుభ్ర పరుస్తాయి. పైగా కొన్ని రకాల కాన్సర్ నివారించగలవని ఋజువులు ఉన్నాయి. కడుపులో ఆమ్లo తక్కువైన స్థితి ఉంటే బీట్స్ తిన్నప్పుడు మూత్రం పింక్ (pink) రంగుకు మారి బయట పడుతుంది.
బీట్స్ ను ఆహారానికి సులభంగా జోడించవచ్చు. చాలా మంది దంచి వండిన బీట్స్ ను పులుసుల్లో వేసుకుంటారు. మరో పద్ధతి సన్నని ముక్కలుగా తరిగి ఆలివ్ నూనె లో ముంచి కాల్చటం.
రక్తపోటు నియంత్రణలో బీట్స్
బీట్స్ రసం రక్తపోటును తగ్గించవచ్చని పరిశోధకులకు అప్పటికే తెలిసినా, 2010లో UK పరిశోధకులు బీట్స్ లోని నైట్రేట్ అనే మూలకం రక్తపోటు తగ్గించి గుండె జబ్బులను ఎదుర్కోoటుందని చూపించారు.
లండన్లోని క్వీన్ మేరీ యూనివర్సిటీ పరిశోధనలో కొందరు ఆరోగ్యవంతులైన సభ్యులు ఒక గ్లాస్ బీట్ రసాన్ని ఇతరులు మందు అనిపించే మరో మామూలు పానీయాన్నీ తాగారు. బీట్ రసం తాగిన వారికి 24 గంటలలో రక్తపోటు తగ్గింది. బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ నిధులతో జరిగిన ఈ పరిశోధనను హైపర్ టెన్షన్ అన్న తన పత్రికలో అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రచురించింది.
మెదడు, మతి భ్రమణాల (dementia) లో బీట్స్
2010లో జరిగిన ఒక పరిశోధన, వయసు మళ్ళిన వారిలో మెదడుకు అందే రక్తప్రవాహాన్ని బీట్ రసం పెంచుతుందని సూచించింది. మతి భ్రమణం అనే దుస్థితి లోనికి జారకుండా బీట్ రసం కాపాడవచ్చు. బీట్స్ లో నైట్రేట్లు అధికంగా ఉంటాయి. నోటిలోని బాక్టీరియా వీటిని నైట్రైట్లుగా మార్చుతాయి. నైట్రైట్ లు రక్తనాళాలను విశాలం చేసి ఆక్సిజన్ కరువైన చోట్లకు రక్తప్రవాహాన్ని, ఆక్సిజన్ అందబాటును పెంచుతాయి.
నైట్రైట్లు రక్తనాళాలను విశాలం చేస్తాయని ఇంతకు ముందు పరిశోధనలలో తేలినా అమెరికన్ పరిశోధకులు మెదడుకు రక్తప్రవాహపు పెరుగుదలను కూడా పెంచుతాయని గుర్తించటంలో తామే ప్రథములమని ప్రకటించారు.
ఆధారాలు:
http://www.webmd.boots.com/healthy-eating/guide/beetroot-benefits?page=2
http://articles.mercola.com/sites/articles/archive/2014/01/25/beets-health-benefits.aspx
http://www.naturalnews.com/044774_beetroot_healthy_vegetables_increase_energy.html#ixzz2zSgdhvhL
మీ రోగులను ప్రతి రోజూ ధ్యానం చేసుకోమని ప్రోత్సహించండి
చక్రాలు, చక్ర స్వస్థతను పెంపొందించే మార్గాలు
చక్రం అనే సంస్కృత పదం పరిభ్రమణాన్ని సూచిస్తుంది. సూక్ష్మ దేహంలో అమరి ఉన్న శక్తి కేంద్రాలకు ఈ పేరు. యోగులు, అతీంద్రయ జ్ఞానాన్ని సంతరించుకున్న సిద్ధులు వీటిని నిరంతరం తిరుగుతుండే ఫాన్లుగా, పద్మాలుగా, ప్రకాశించే సూర్యబింబాలుగా వర్ణించారు.
ఇవి భౌతిక దేహంలోని భాగాలు కావు. కానీ వీటికి ఈ దేహంలోని ప్రత్యేక తావులతోనూ, హార్మోనులు, శరీర కార్యకలాపాలతో సంబంధం ఉన్నది. మన ఆలోచనలు, మనోభావాలు, జీవిత పరిస్థితులు వీటిని ప్రభావితం చేస్తూ, వీటివల్ల ప్రభావితం చేయబడుతూ ఉంటాయి. ప్రాణం అనే జీవిత చోదక శక్తిని సమగ్ర సౌఖ్యం ఆరోగ్యం పొందే విధంగా రూపొందిస్తూ ఉంటాయి.
ఒక్కొక్క చక్రానికి ఒక్కక్క కార్య సముదాయం. ఈ కార్యాలు - శరీరంలోపల జీవ చర్యల రూపంలో, శరీరం బయట పరిసరాలతో వ్యవహారం రూపంలో జరిగేవి. మన లోపల బయట - జీవితం ప్రదర్శించే అంశాలు, వీటిని మనం పాటించే విదానాలతో ఈ చక్రాలకు సంబంధం ఉంటుంది. మన కార్యకలాపాలను ఉత్పాదించే శక్తిని గ్రహించి, జీర్ణించుకుని, పంచే చోట్లుగా ఈ చక్రాలను మనం భావించవచ్చు. శరీరం బయట కనుపించే పరిస్థితులు - శరీరం లోపలి భావాలు, ఉదాహరణకి నేను అనుకుంటూ కుదించుకునే స్వభావం, ఈ విధంగా రూపొందే ఒత్తిడుల రూపంలో- ఒక్కక్క చక్రం హీనపడుతూ లేదా పేట్రేగిపోతూ తన సమతౌల్యాన్ని కోల్పోవచ్చు.
ఏడు చక్రాల వైపు ఒక పరిశీలన
7 వ చక్రం – సహస్రారం
శిరస్సు మీద ఉంటుంది. వయలెట్ రంగు. మెదడు బయటి పొర (cerebral cortex), మధ్య నాడీ మండలము (central nervous system), పిట్యూటరీ గ్రంథు (pituitary gland) లతో దీని సంబంధం. సమాచారం, అవగాహన, అంగీకారం, ఆనందం – దీనికి సంబంధించిన విషయాలు. వ్యక్తి భగనంతునితో సంధిచబడేది ఇక్కడేననీ, భగవత్సంకల్పానికీ వ్యక్తి విధికీ నెలవు అని అంటారు. దీని స్తంభనతో మానసిక సమస్యలు ఉత్పన్నం కావచ్చు. .
6 వ చక్రం- మూడవ కన్ను
దీని రంగు ఇండిగో (ఎఱుపు, నీలాల మిశ్రమం). నుదుటి మధ్య కళ్ళకు ఎగువగా ఉంటుంది. ఈ చక్రం మన జీవితపు ఆధ్యాత్మిక స్వభావాన్ని గురించిన ప్రశ్నలు లేవదీస్తుంది. ప్రశ్నలు, పరిశీలన, తెలుసుకోవటం – దీని కార్యాలు. అంతరంగ దర్శనం (inner vision ), స్ఫురణ (intuition), జ్ఞానం (wisdom) లతో దీనికి సంబంధం. ఈ జీవితానికి వర్తించే కలలు, గడచిన జీవితాల జ్ఞాపకాలు ఈ చక్రంలో ఉంటాయి. దీని స్తంభన వల్ల ముందు చూపు లేకపోవటం, మొండి మనస్తత్వం, జ్ఞాపకాల లో ప్రత్యేకత (‘selective’ memory), కుంగుదల (depression) వంటి సమస్యలు రావచ్చు.
5 వ చక్రం-- గొంతు
ఇది నీలం రంగుతో గొంతులో ఉంటుంది. వ్యక్తం చేయటం, సృజనాత్మకత, ఆత్మ ప్రకటన, తీర్మానం ఈ చక్రపు విషయాలు. అంతరంగ ప్రబోధం (inner hearing) బయట ప్రపంచపు పరిశీలనలు (outer hearing), ఆలోచనల సమన్వయం, నయం చేయటం, పరిణామం, పవిత్రత దీని ప్రమేయాలు. దీని స్తబ్ధత – స్తంభించిన సృజనాత్మకత, కుటిలత్వము (dishonesty), అవసరాలను ప్రకటించుకోవటంలోని సమస్యలుగా వ్యక్తం కావచ్చు.
4 వ చక్రం – హృదయం
హృదయంలో ఆకుపచ్చ రంగుతో ఉంటుంది. ప్రేమ, ఆత్మీయత (compassion), సమన్వయం (harmony), శాంతులకు నిలయం. మీ ఊపిరితిత్తులు, గుండె, చేతులు, కాళ్ళు, థైమస్ గ్రంథులతో దీని సంబంధం. ఈ హృదయ చక్రం ప్రేమను పుట్టిస్తుంది. నిర్వ్యాజమైన ఈ ప్రేమభావం – సౌర నాడీ పుంజము (solar plexus) అనే ఉద్రేక కేంద్రాన్ని చేరుకుంటుంది. దీని స్ధబ్ధత వల్ల రోగనిరోధక వ్యవస్థ (immune system), ఊపిరితిత్తులు, గుండె సమస్యలు గానీ రాక్షసత్వము, ప్రేమ రాహిత్యము, విశృంఖల ప్రవర్తనలు గా కానీ తలెత్తగలవు.
3 వ చక్రము – సౌర నాడీ పుంజము (The Solar Plexus)
ఇది పసుపు రంగుతో బొడ్డుకు కొద్ది అంగుళాల పైన సౌరనాడీపుంజం వద్ద ఉంటుంది. జీర్ణవ్యవస్థ, కండరాలు, పాన్క్రియాస్ (pancreas), ఎడ్రినల్ (adrenal) గ్రంథులతో వ్యవహరిస్తూ జీవితపు ఉద్రేకాలకు నెలవు. తనగురించిన ధీమా, నవ్వు, సంతోషం, కోపం ఈ కేంద్రానికి చెందుతాయి. స్పందించే స్వభావము, సాధించే సంకల్పము, సామర్ధ్యాలు ఇక్కడ ఉంటాయి. దీని స్తబ్ధత - కోపం, నిరాశ, దిక్కు తోచక పోవటం, బలైపోతున్న భావనలుగా ప్రకటం కావచ్చు.
2 వ చక్రం – నాభి (The Sacral or Navel)
ఇది కమలాపండు (orange) రంగుతో వెన్నుపూస కొసకూ బొడ్డుకూ మధ్యగా ఉంటుంది. పొత్తి కడుపు, మూత్ర పిండాలు, బ్లాడర్, రక్త ప్రసరణ వ్యవస్థలు, సంతానోత్పాదక అవయవాలు, గ్రంథులతో దీనికి సంబంధం. ఉద్రేకం దీని విషయం. కోరిక, సుఖం, కామవాంఛ, సంతానోత్పత్తి, సృజనాత్మకతలకు ఇది ప్రతినిధి. దీని స్తంభన వల్ల మానసిక సమస్యలు, అదుపులేని ప్రవర్తన, రతి సంబంధమైన పాప భీతి తలెత్తవచ్చు.
1 వ చక్రము – మూలాధారము (Base or Root)
ఎరుపు రంగతో వెన్ను కొన అయిన పెరీనియమ్ (perineum) వద్ద ఉంటుంది. ఇది భూమికి అతి సమీపమైన చక్రము. భౌతిక విషయాలకు ప్రాధాన్యత, జీవన పోరాటం దీని చర్యలు. కాళ్ళు, పాదాలు, ఎముకలు, పెద్ద ప్రేగు, ఎడ్రినల్ గ్రంథులతో దీనికి సంబంధం. పోరాటమో పరుగో (fight or flight response) అనేదాన్ని నియంత్రిస్తుంది. దీని స్తంభన శతృభావన (paranoia), భయం, సాచివేత, తనని తాను కాపాడుకోవటం వంటి లక్షణాలుగా ప్రకటంకావచ్చు
ఏడు చక్రాలలో స్తంభనలు దేనివల్ల?
ఐదు జ్ఞానేంద్రియాలతో పోగు చేసుకునే దానితో సహా, ఏ సరి పడని ఆహారాన్ని తీసుకున్నా, ఈ ఆహారం నుంచి ఉత్పన్నమయ్యే ప్రతికూల స్పందనలు ఏదో ఒక చక్రాన్ని చేరుకుని దాని సమతుల్యతను దెబ్బతీస్తాయి. చక్రం దెబ్బతినటానికీ అది ఒక అవయవంలో రోగం గా వ్యక్తం కావటానికీ మధ్య వ్యవధి- కాన్యర్ వంటి ప్రమాదకర రోగంలో లాగా పదేళ్ళు కావచ్చు, ఫ్లూ వంటి మంచం పట్టించే రోగంలాగా కొద్ది గంటలు కావచ్చు. చక్రాలన్నిటికీ ఉన్న పరస్పర సంబంధం వల్ల పట్టించుకోకపోతే ఒక చక్రానికి దాపురించిన కుదుపు ఇతర చక్రాలకు దాపురించవచ్చు. ఈ. విధంగా వ్యాధి శరీరంలో వ్యాపించి దీర్ఘరోగంగా మారుతుంది..
బాల్యపు భయంకర అనుభవాలు, దుష్ట అనుభవాలు (abuse), సంతరించుకున్న విలునల వ్యవస్థ, నయంకాని మానసిక గాయాల వంటి – జ్ఞాపకాలు, సుప్త మనస్సు (subconscious mind) యొక్క లోతుల్లో కానరాకుoడా నిద్రిస్తూ చక్ర వ్యవస్థకు అస్వస్థ కలిగించవచ్చు. అశ్రద్ధ కూడా చక్రాన్ని మూలకూల్చవచ్చు. పదే పదే పక్కన పెట్టటం, నేరభావన, అదిమి పట్టటం, అవ్యక్తంగా ఉండిపోయిన ఉద్రేకాలూ – ఏ చక్రంలోనైనా ఒత్తిడిని సృష్టిస్తాయి. ఈ భూమిమీద అనేక జన్మలలో అంతఃకరణ (soul) ప్రోగు చేసుకున్న మంచి, చెడు ఆలోచనలు, ఇదివరకు చేసిన, ఇప్పుడు చేస్తున్న పనులు ఈ ఏడు చక్రాలలో నిలుస్తాయి. కర్కశమైన మనోభావాల నియంత్రణ(repression) నుంచి బాధ, సంక్షోభం (suffering), రోగం పుడతాయి.
పక్కన పెడుతున్న మనో భావాలను ఆమోదించటం.... క్షుణ్ణంగా పరిశీలించుకోవటం, క్షమించటం అనేది వైద్యానికి కీలకం.
క్షమించటం చక్రాల స్థంభనను లయంచేసే ఉత్తమోత్తమ విధానాలలో ఒకటి:
ప్రకటం కాని మనస్తాపాలు ఎక్కడికి పోతాయనుకుంటున్నారు? ఏ కొత్త వాటికీ చోటులేకుండా పోగవుతూ మీతోనే ఉంటాయి. మౌనంగా ఉన్నా వీటికి కృతజ్ఞతలు చెప్పండి. ఇవే మీ టీచర్లు.
ఆలోచనా విధానాన్ని మార్చుకుని అదుముకున్న మనోభావాలను నయంచేసుకుంటూ మీ జీవితానుభూతిని మెరుగుచేసుకోండి:
ఫలితాన్ని స్వస్థత పరుచుటకు కారణానికి కట్టు విప్పాలి. ఇటువంటి మనోభావాల హానిని సహిస్తూ వీటిని భద్రపరచుకోవటం సరైన బేరమా? మీ వల్ల మీకే హాని కలుగుతోంది. మీరు తిరస్కరిస్తున్న ఇతరుల దృక్పథాన్ని దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేయండి. మీ శరీరం యవ్వనాన్ని పుంజుకుంటుంది. కానీ ఈ తుప్పు రాలటానికి నమ్మకం, ప్రేమ అవసరం.
చక్ర శుద్ధికీ, మనశ్శరీరాల ఆరోగ్యాభివృద్ధికీ ఇతర మార్గాలు:
వైబ్రియానిక్స్ వైద్యాలు: స్పందనా వైద్యాలు చక్రాల మీదా దాని ద్వారా శరీరావయవాలూ, భాగాల మీదా పని చేస్తాయి. ఇవి తగిన స్పందనలను సృష్టించే తీపి మాత్రల రూపంలో ఉండి సంబంధించిన చక్రాలను సమ తుల్యం చేస్తాయి.
యోగాసనాలు: యోగం అంటే "సమాగమము (union)" లేక "నియమము (discipline)". మనసు, శరీరము, అతఃకరణలను కాడిగట్టి అసలైన ఆత్మకు అప్పగించటం. హానికారక శక్తులను వదిలించటంలో యోగాకి ప్రత్యక ప్రభావం ఉన్నది. కదలిక, సాగటాల వల్ల కేంద్రీకృతమై ఉన్న శక్తి తన కేంద్రం ద్వారా ఒత్తబడుతుంది. ఈ మూత తెరుచుకుంటూ ఉంటే తరచుగా చికాకు ఆలోచనలు (negative issue) వస్తూ ఉంటాయి. దీని మొదటి ఉపయోగం- చక్ర స్థంభనకు కారణం తెలియటం. కనుక దానిని వదిలించుకోవటం సాధ్యమవుతుంది.
ఆక్యుపంచర్ (Acupuncture), మసాజు (Massage), కీరో వైద్యం (Chiropractice), రేకి (Reiki) మొదలైనవి: ఈ వైద్యాలు వాటివాటి విధానాలలో శక్తి కదిలికలకు దోహదం చేస్తాయి. మనసుతో సమస్యని సడలించకపోతే, సమస్య మొదటికి వస్తుంది. క్షమించటానికీ, సమస్యను, ముద్రనూ వదిలించుకోవటానికీ వ్యక్తి ఎంత సిద్ధం అన్న మొట్ట మొదటి విషయాన్ని బట్టి, పూర్తిగానో, తాత్కాలికంగానో కోలుకోవటం జరుగుతుంది.
శరీర వ్యాయామం (Physical exercise): శ్రమ శక్తిని కదిలిస్తుంది. కాని మళ్ళీ పూర్తిగా కాక పోవచ్చు.
ఉష్ణము(Heat): వేడివల్ల కండరాలు సడలి హాని శరీరం నుంచి బయటపడుతుంది. ఈ వేడి – దీర్ఘకాలం పాటు ఉష్ణాన్ని ఇచ్చే ఉష్ణగుండాలు (sauna), సుడిగుండాలు (whirlpool) వంటి వేటి నుంచైనా కావచ్చు
ఆధారాలు:
Manual for Junior Vibrionics Practitioners, 2007
http://www.flourishinglotus.com/what-are-chakras-anyways-a-simple-guide-to-your-complex-energy-centers http://www.yogajournal.com/basics/898
http://www.zenlama.com/the-7-chakras-a-beginners-guide-to-your-energy-system/
http://www.2012-spiritual-growth-prophecies.com/seven-chakras.html.
***వైద్యులకు ముఖ్య గమనిక ***
- మన వెబ్ సైట్ www.vibrionics.org వైద్యుల విభాగంలో ప్రవేశానికి మీ రిజిస్ట్రేషన్ నంబర్ కావాలి మీ ఇ-మెయిల్ మారితే [email protected] కు వీలయినంత వెంటనే తెలియజేయండి.
- మీ రోగులతో ఈ వార్తాలేఖను పంచుకోవచ్చు. వారి ప్రశ్నలు మీ జవాబులు లేదా పరిశోధన, తీర్మానాల కొరకు మీకు చేరాలి. మీ సహకారానికి కృతజ్ఞతలు.
ఓం సాయి రామ్!