Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

అదనపు సమాచారం

Vol 5 సంచిక 2
March/April 2014


సాయి విబ్రియోనిక్స్ విద్యా ప్రయోజనాలకోసం ఆరోగ్య సమాచారం మరియు వ్యాసాలను అందిస్తుంది; ఈ సమాచారం వైద్య సలహా కాదు. మీ రోగులకు వారి నిర్దిష్ట రోగలక్షణాల గురించి వారి వైద్యుని చూడమని సలహా ఇవ్వండి.

రోజుకొక ఉల్లిపాయ వాడి డాక్టరును దూరంగా ఉంచండి (భాగం 2)

మా జనవరి 2014 వార్తాలేఖలో మేము ఉల్లిపాయ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు, 1 వ భాగంలో ప్రస్తావించిన సంగతి గమనించండి.

 

ఉల్లిపాయ, కేన్సర్ వ్యాధి

వెల్లుల్లిలో కనిపించే అనేక గంధకం సమ్మేళనాలను కలిగి ఉన్ననూ, ఉల్లిపాయలలోగల అధిక ఫ్లావోనోయిడ్స్(flavonoids) మీకు మరిన్ని ప్రయోజనాలను అందిస్తాయి, ప్రత్యేకంగా క్వెర్సెటిన్ (Quercetin). ఇది ఒక యాంటిహిస్టామైన్ (antihistamine) మరియు యాంటి ఇన్ఫ్లమేటరీ (anti-inflammatory) వలె పనిచేయును. క్వెర్సేటిన్ మరియు క్యాన్సర్ ఒకదానికొకటి సరిపడవు. క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గించే శక్తి, సామర్థ్యాలు క్వెర్సేటిన్లో వున్నట్లు, క్యాన్సర్ కణాలను శరీరంలోని ఇతర భాగాలకు (మెటాస్టాసిస్) వ్యాపించకుండా ఆపి, క్యాన్సర్ కణాలను బలవంతంగా వివిధమార్గాల్లో నిర్మూలించి, క్యాన్సర్-జన్యువులను చంపగల శక్తి క్వెర్సేటిన్ లో వున్నదని పరిశోధనలలో వెల్లడయింది.

కార్నెల్ విశ్వవిద్యాలయ పరిశోధకుడు, Dr.Rui Hai Liu, MD, Ph D, ఆహారశాస్త్రములో అసోసియేట్ ప్రొఫెసర్, ఉల్లిపాయలలోగల వేర్వేరు రకాలు పదివరకు పరీక్షించారు. ఉల్లిపాయల రకాలలో, చాలాఘాటైన, గాఢమైన వాసన గలవి, కాలేయ మరియు పెద్దప్రేగు కాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించగల ఉత్తమ రకాలని పేర్కొన్నారు.

తొక్కలు వొలిచిన ఉల్లిపాయ బల్బుల నుంచి తీసిన సారంతో, తాజా, పచ్చి ఉల్లిపాయ రకాలను ఉపయోగించారు, ఈ అధ్యయనంలో చాలావరకు ఆసియన్, మెక్సికన్, ఫ్రెంచ్, మధ్యధరా, వంటలలో ప్రధానమైన చిన్న, ఎర్ర వుల్లిపాయలు, షాల్లట్ (Shallot), పరీక్షించిన మిగిలిన 11 రకాల వుల్లిపాయలకన్నా, అత్యధిక అనామ్లజనిక (antioxidant) చర్యను కలిగి ఉన్నవి. మిగతా రకాలకన్నా తక్కువ స్థాయిలోని, తేలిక వాసన, రుచి గల ‘విడాలియా’ (Vidalia) వుల్లిపాయలకన్నా,షాల్లట్ ఆరు రెట్లు ఎక్కువ యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు కలిగి ఉన్నది. షాల్లట్ కాలేయ క్యాన్సర్ కణ పెరుగుదల అరికట్టగల గొప్ప ప్రభావం కలిగివున్నది.

వేలమంది వ్యక్తుల ఆహారం మరియు ఆరోగ్య వివరాలను పరీక్షించి, విశ్లేషించిన పిమ్మట పరిశోధకులు ఈ విధంగా వెల్లడించిరి –

తక్కువ ఉల్లిపాయలు తినేవారితో పోలిస్తే, ఉల్లిపాయలు అధికంగా తినేవారికి, పెద్దప్రేగు కాన్సర్ 56%, రొమ్ము కాన్సర్ 25%, ప్రోస్టేట్ క్యాన్సర్ 71%, జీర్ణకోశ కాన్సర్ 82%, అండకోశ కాన్సర్ 73%, నోటి కాన్సర్ 84%, మూత్రపిండాల కాన్సర్ 38%, క్లోమం కాన్సర్ 54%రాగల అవకాశాలు, వచ్చే ప్రమాదం తక్కువ.

వారానికి 2 లేక అంతకంటే ఎక్కువ 80 గ్రాముల (2.82 ఔన్స్) ఉల్లిపాయలు, ఆహారంలోతినే స్త్రీలకు గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం  60% తగ్గుతుందని పరిశోధకులు గుర్తించారు. చైనాలో వారానికి ఒకసారి కాని అంతకన్నా ఏక్కువగా కాని ఉల్లిపాయలు తిన్నవారికి కడుపులో కాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువని నిర్ధారించేరు. ఈ అధ్యయనంలో పరిశోధకులు, ఉల్లిపాయ అధికంగా తీసుకోవడం వలన కడుపు క్యాన్సర్తో సంబంధంగల, వ్రణోత్పత్తికి కారణమైన మైక్రో ఆర్గానిజం, హెలికోబాక్టర్ పిలోరి, అరికట్టబడుతవి. ఆరోగ్యకరమైన బాక్టీరియా పెరుగుదలను వృద్ధిచేసి, పెద్దప్రేగులో హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదలను అణచివేయగల Fructo-oligosaccharides-సమ్మేళనాలు ఉల్లిపాయలో ఉన్నాయి. ఇది పెద్దప్రేగు కాన్సర్ నివారించడంలో ఉల్లిపాయ పాత్రను వివరిస్తుంది. ఉల్లిపాయ సారం పరీక్షనాళికలలో కణిత కణాలను చంపగలదని కనుగొనబడింది.

ఉల్లిపాయ, మధుమేహం

మధుమేహంగల రోగుల రక్తచక్కెరను ఉల్లిపాయలు తగ్గిస్తాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇన్సులిన్ కాని 100g పచ్చి, ఎర్ర, ఉల్లిపాయలను కాని, 1వ రకం, 2వ రకం మధుమేహరోగులకు యిచ్చి, వాటిప్రభావాలను ఒక అధ్యయనం పోలిస్తే. ఫలితాల ప్రకారం రక్త గ్లూకోజ్ స్థాయి ఇన్సులిన్ సాధించినమేరకు తగ్గించలేకపోయినా, ఉల్లిపాయలు రక్త చక్కెర స్థాయిలను ఖచ్చితంగా తగ్గించాయి. అలాగే, ఉల్లిపాయ తిన్న తర్వాత మొదటి గంటలో రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. ఇది ఉల్లిపాయ యొక్క గ్లైకోజెనిక్ ప్రభావo. అందువలన, ఇన్సులిన్ వంటి పలు మధుమేహం ఔషధాలు కలుగచేసే హైపోగ్లైకేమియా (రక్తంలో చక్కెర శాతం బాగా తగ్గడం) అనే దుష్ప్రభావాన్ని ఇది నివారిస్తుంది.

ఉల్లిపాయల్లో రక్తంలో చక్కెరను తగ్గించగల  ప్రధాన క్రియాశీల పదార్థం - Allyl propyl disulphide (APDS) అనబడు గంధక సమ్మేళనం. ఇది ఇన్సులిన్ యొక్క విచ్ఛినాన్ని అరికట్టి, శరీరంలో ఇన్సులిన్ అధిక స్థాయిలో ఉండేటట్లు తోడ్పడుతుంది. ఉల్లిపాయలలో క్రోమియం అనే మినరల్ కూడా వున్నది. అది ఇన్సులిన్కణాలను స్పందించడం ద్వారా రక్తంలో చక్కెర నియంత్రణకు సహాయపడుతుంది.

చర్మపు పరిస్థితులు

ఉల్లిపాయరసాన్ని క్రిమికీటకాల కాట్లు, మొటిమలు, వాపు, మంట, చర్మంలో రక్త ప్రసరణ తక్కువగుటచే వచ్చే దురదలకు చికిత్సకై ఉపయోగిస్తారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో జర్నల్ ఆఫ్ కాస్మెటిక్ డెర్మటాలజీలో ప్రచురించినట్లు, శస్త్రచికిత్స గాయాలపై, ఉల్లిపాయరసం పూయటంవల్ల, మెత్తగా, ఎర్రదనం తగ్గి, మృదువుగా చూచుటకు బాగున్నట్లు కనుగొన్నారు. సోడియం, కొవ్వు, కొలెస్ట్రాల్ లేని ఆహారంగా మాత్రమే కాక, ఉల్లిపాయలలోని ‘విటమిన్ సి’ రోగనిరోధకశక్తి పెంచుతుంది. ఒక కప్పు వుల్లిరసం, ‘విటమిన్ సి’ డైలీ విలువలో 20% అందిస్తుంది. అంతేకాకుండా, ఉల్లిపాయలలో ఎంజైమ్ శక్తివంతం చేయగల మాంగనీస్ మరియు మాలిబ్డినం, అలాగే గుండెను ఆరోగ్యపరిచే విటమిన్ B6, ఫైబర్, ఫోలేట్, పొటాషియం వున్నవి. మనకు నిత్య అవసరమైన పోషకపదార్ధాలు- ఒక కప్పు పచ్చివుల్లిరసంలో 11% ఫైబర్, 11% మాలిబ్డినం, 10.5% మాంగనీస్, 10% విటమిన్ B6, 8% ఫోలేట్, 7% పొటాషియం, మరియు 6 % ట్రిప్టోఫాన్ వున్నవి.

Sources:

http://health.tipsdiscover.com/onion-strong-cancer/

http://www.news.cornell.edu/stories/2004/10/some-onions-have-excellent-anti-cancer-benefits

http://www.sciencedaily.com/releases/2004/10/041022105413.htm

http://www.foods-healing-power.com/health-benefits-of-onions.html

http://www.ncbi.nlm.nih.gov/pubmed/16236005

http://www.offthegridnews.com/2011/06/09/onions-and-their-healing-properties/

http://jarretmorrow.com/2010/11/24/onion-blood-sugar-levels-diabetics/

http://www.thediabetescenter.org/natural-diabetes-cure-onion-for-diabetes-treatment.html#more-105

http://www.botanical-online.com/medicinalsalliumcepaangles.htm

 

మీ యొక్క జుట్టు రాలి పోవుచున్నదా?

మీ తలపై సుమారు 100,000 నుండి 150,000 కేశములుండగా, 50-100 కేశములు ప్రతిరోజూ కోల్పోవుట సహజం. అయితే, మీకు బట్టతల మచ్చలు లేదా బాగా జుట్టు వూడటం జరుగుతుంటే మీరు ఆలోపెషియా (alopecia) అనే సమస్యకు గురై ఉండవచ్చు. జుట్టు రాలడానికి కారణాలు చాలా ఉన్నాయి. జుట్టు రాలటం హఠాత్తుగా ప్రారంభమైనప్పుడు, అనారోగ్యం (ప్రధాన శస్త్రచికిత్స, అధిక జ్వరం, తీవ్ర సంక్రమణ లేదా ఫ్లూ), పౌష్టికాహారలోపం, ఆహారంలో తగినంత ప్రోటీన్ మరియు ఇనుములోపం, లేదా 15 పౌన్లు లేక ఇంకా బరువు తగ్గడానికి దారితీసే ఆహారం, ప్రత్యేక మందులు (ఇది ఆర్థరైటిస్, నిరాశ, గౌట్, గుండె సమస్యలు, అధిక రక్తపోటు, గ్లుకోమా, పూతలు, పార్కిన్సన్ వ్యాధి, లేదా విటమిన్ ఎ యొక్క అధిక మోతాదుల చికిత్స)  హార్మోన్ల మార్పులు, గర్భధారణ, ప్రసవం వలన కలిగే మార్పులు, కుటుంబ నియంత్రణ మాత్రలు నిలిపివేయడం లేదా రుతుక్రమ ప్రారంభం వంటి అసమానతలు అనేక కారణాలలో కొన్ని కావచ్చును.

జుట్టు నెమ్మదిగా వూడిపోతూ, ప్రతి సంవత్సరం మరింత గుర్తించదగ్గదిగా ఉంటే, ఆవ్యక్తికి వారసత్వంగా జుట్టు నష్టం లేదా బట్టతల(androgenetic alopecia) ఆండ్రోజేనిటిక్ అరోమతా ఉండవచ్చు. ఈ విధమైన జుట్టురాలిపోవడాన్ని, పురుషులలో/ స్త్రీలలో బట్టతల అని కూడా పిలుస్తారు. ఏదైనా వ్యాధి మొదటి లక్షణం జుట్టు రాలిపోవటమై ఉంటుంది. థైరాయిడ్ వ్యాధి (thyroid disease), పాలీసిస్టిక్ అండాశయ సిండ్రోమ్ (Polycystic ovary syndrome), రక్తహీనత (anaemia), నడినెత్తిన వచ్చే చర్మవ్యాధి (ringworm of the scalp), పద్దతిలేని ఆహారపు అలవాట్లు వంటివి సుమారు 30 వ్యాధులు కారణమై వుండవచ్చు. ప్రత్యేకమైన వ్యాధిని గుర్తించి, తగినచికిత్స చేసి, జుట్టు నష్టం నిలపవచ్చు, తిరిగి కొత్త జుట్టు తెప్పించవచ్చు. జుట్టు నష్టానికి ఇతర కారణాలు క్యాన్సర్ చికిత్సలయిన రేడియేషన్ మరియు కీమోథెరపీ, ఒత్తిడి (ఉదా: ప్రియమైన వారి మరణం లేక భార్యాభర్తల విడాకులువంటి బాధాకర సంఘటనవల్ల), మరియు తగినంత నిద్ర లేకపోవడంవంటివి కావచ్చు.

క్రింద వుదాహరించిన జుట్టు సంరక్షణ పద్ధతులవల్ల కూడా జుట్టు  పొడిగా అయి, తెగిపోయి జుట్టు రాలిపోవచ్చు:

  • బ్లీచింగ్, శాశ్వత పదార్థాలు, జుట్టు రంగులు, రిలాక్డర్స్, జెల్స్ హెయిర్ స్ప్రేస్ వంటి కృత్రిమ, కఠిన రసాయన పదార్ధాలతో తరచూ లేదా క్రమ పద్దతి లేని ఉపయోగం. (వీటిని నివారించడానికి ప్రయత్నించండి);
  • ప్రతిరోజూ షాంపూ మరియు కండిషనింగ్ (దీనిబదులు, 2-3 రోజులకొకసారి తల స్నానం చేస్తే, సహజమైన నూనెలు సరైన పద్ధతిలో ప్రసరిస్తాయి);
  • రింగుల జుట్టుకోసం కర్లింగ్ ఐరన్, జుట్టు ఆరబెట్టుటకు బ్లోడ్రైయర్, రింగుల జుట్టుని తిన్నగా చేసే ఫ్లేట్ ఐరన్, వంటి ఆధునిక విద్యుత్ పరికరాల వాడకం మానేసి, గాలితో మీ జుట్టు ఆరబెట్టండి. మీకు సమయంలేకపోతే, బ్లో డ్రైయర్ ను కనీసపు వేడితో ఉపయోగించండి;
  • రబ్బరుబ్యాండ్లతో గట్టిగా కట్టే పోనీ టైల్ వంటి కేశశైలులు;
  • రోజులో చాలాఎక్కువసార్లు, ఎక్కువసేపు దువ్వటం, బ్రష్ చేయడం (ఉదా: 100 సార్లు రోజు మొత్తం మీద దువ్వటం)
  • జుట్టును గట్టిగా కట్టడానికి రకరకాల పిన్నులు, క్లిప్పులు, రబ్బరు బ్యాండ్లను వాడటం(బదులుగా, వదులుగా వుండే, మృదువైన చివర గుండ్రంగా వుండే కేశాలపిన్నులు మరియు గుడ్డబ్యాండ్లు మంచివి);
  • తడిజుట్టు మామూలు జుట్టుకన్న 2 రెట్లు బలహీనంగా ఉంటుంది కనుక యెక్కువ వూడే అవకాశం ఉంటుంది, కాబట్టి తడిజుట్టును దువ్వటం కానీ బ్రష్ చేయటం కూడదు. బదులుగా పొడి తువ్వాలుతో జుట్టుతడి ఆరబెట్టి, తరువాత మీ జుట్టును ఒక వెడల్పు పళ్లుగల దువ్వెనతో చిక్కులుపడ్డ జుట్టు విడదీసి, తర్వాత పొడిజుట్టును 1 లేక 2 సార్లు ఉదయం, రాత్రి బ్రష్ చేయాలి. మీ నెత్తిమీద చర్మంలో మంచి చలనం కలుగుతుంది.
  • వేడినీటి తలస్నానం మీజుట్టునుండి రక్షణనూనెలను తొలగిస్తుంది కనుక మీ శరీర ఉష్ణోగ్రతకంటే కాస్త వెచ్చనినీరు వాడండి.

 

కొబ్బరి, ఆలివ్, బాదం, వుసిరిక వంటి మూలికా తలనూనెలు, జుట్టుయొక్కసాగే బలాన్ని పెంచుతాయి, చిక్కు పడటం, వెంట్రుకలు తెగటం తగ్గిస్తుంది. జుట్టుకి నూనె రాయటంవల్ల, ఒక రక్షితపొర నేర్పర్చి, జుట్టును చక్కగా పద్దతిగా పెరిగేలా చేస్తుంది. నూనెలు తేమను కలిగించి (తేమను కోల్పోకుండా మొదళ్ళనుండి చిగుళ్ళ వరకు నూనె పూయండి), అమీనో ఆమ్లాలు, కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు మరియు ఖనిజాలతో చర్మం పోషించును. ఈ ప్రధాన నూనెలకు దేవదారుచెక్క, వాము, లావెండర్, రోజ్ మేరీ వంటి ముఖ్యమైన నూనెలను కలిపినచో, మాడులో రక్తప్రసరణ బాగా జరిగి, జుట్టు మరింతగా పెరుగుతుంది. కానీ ఈ నూనెలను నేరుగా తలకు రాయకుండా, కొబ్బరివంటి ప్రధాననూనెలకు కొన్ని చుక్కలను జోడించిన తర్వాత జుట్టును మర్దించవలెను.

ఒక పరిశోధనలో, దేవదారుచెక్క, వాము, లావెండర్, రోజ్ మేరీవంటి ప్రధాన నూనెలతో, ఇప్ప, ద్రాక్షగింజల నూనెలను కొద్దిగా కలిపి తలకు మర్ధనచేసిన కొందరికి, కేవలం ప్రధాన నూనెలనే మర్ధనా చేసిన మిగిలినవారికన్నా, 7 నెలల్లో మరింతగా జుట్టుపెరిగింది. జపాన్ లోని ‘జర్నల్ ఆఫ్ డెర్మాటోలజీ’లో ప్రచురించిన మరో పరిశోధనలో, ఉల్లిపాయరసం రోజుకు2 సార్లు తలకు వ్రాయగా, 23 మందిలో 20 మందికి 6 వారాలలో జుట్టు బాగా పెరిగింది.

ప్రత్యామ్నాయ & కాంప్లిమెంటరీ మెడిసిన్, అమెరికాజర్నల్ లో జరిపిన అధ్యయనంలో, ‘సా పల్మెటో’ అను మూలికాసారం ప్రతిరోజూ తీసుకున్న పురుషులకు జుట్టు పెరుగుదల మెరుగుపడినట్లు తెల్పిరి. కొన్ని అధ్యయనాలు ఈ మూలికాసారం, ఫినరస్టైడ్(Finasteride) అను విక్రయ ఔషధం అంత సమర్థవంతమైన మందని, దానికున్న దుష్ప్రభావాలు లేకుండా, జుట్టువూడటం తగ్గిస్తున్నట్లు చెప్పిరి. స్త్రీ పురుషుల బట్టతలలు, మగ హార్మోన్ టెస్టోస్టెరోన్ (Testosterone), డీహెచ్ టి(Dihydrotestosterone) డైహైడ్రోటెస్టోస్టోరోన్ గా మార్చడానికి ముడిపడి ఉంది; సా పల్మెటో(Saw Palmetto)DHT ఏర్పడటానికి దెబ్బతీస్తుంది. Methylsulfonylmethane (సహజంగా ఆవు పాలు, ఆకుకూరలలో వుంటుంది) వుపయోగించిన 100 శాతం మంది ప్రజలలో కేరాటిన్ (keratin-జుట్టులో ప్రోటీన్) ఉత్పత్తికి సహాయపడునని మరొక పరిశోధనలో చెప్పిరి. ఇది 6వారాలలో జుట్టు రాలకుండాచేసి, జుట్టు పెరుగుదలని చూపించింది.

ఆరోగ్యకరంగా జుట్టు పెంచే చిట్కాలు:

  • ఒత్తిడి నిర్వహణ తరగతులు, యోగా తరగతులు తీసుకోవటం, ప్రియమైనవారితో ఎక్కువ సమయం గడపడం, డ్యాన్స్ చేయడం, శ్రావ్యమైన సంగీతం, ముఖ్యంగా, తగినంత నిద్ర పొందడం ద్వారా ఒత్తిడిని నియంత్రణలో వుంచండి.
  • పండ్లు, కూరగాయలు, మాంసకృత్తులు (శరీరానికి తగినంత ప్రోటీన్ లభించనిచో, జుట్టు పెరుగుదలకు ప్రోటీన్ చాలదు), ఇనుము, ఒమేగా -3 &6 కొవ్వు ఆమ్లాలు, విటమిన్స్ ముఖ్యంగా విటమిన్ ఎ, విటమిన్ సి (జుట్టుయొక్క ఆరోగ్యకరమైన అభివృద్ధికి), విటమిన్ ఇ (రాలిన జుట్టును పెంచుటకు), B- కాంప్లెక్స్ విటమిన్లు, ఖనిజాలు (మినరల్స్) కూడిన సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి.
  1. జుట్టుపెరుగుదలకు ముఖ్యమైన కొన్ని పదార్ధాలు: ఒమేగా -3 ఎక్కువగావున్న వాల్నట్స్, ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు, బోయోటిన్ (Omega-6 fatty acids, biotin), E, B విటమిన్స్, కాపర్ లో అధికంగా ఉంటాయి;
  2. చిలగడ దుంపలు &క్యారట్లు (విటమిన్ ఎ);
  3. ఇనుము, బీటా కెరోటిన్, ఫోలేట్ మరియు విటమిన్ సి ( Iron, Beta carotene, Folate and Vitamin C అధికంగా గల పాలకూర, బ్రోకలీ, తోటకూర, చుక్కకూర, బచ్చలికూర వంటి ఆకుకూరలు;
  4. ప్రోటీన్, ఇనుము, జింక్, బయోటిన్ సమృద్ధిగా గల పప్పుధాన్యాలు
  5. గ్రీక్ పెరుగు జుట్టుకు దోహదం చేసే ప్రోటీన్, విటమిన్ B5 పాంతోతేనిక్ ఆమ్లం (pantothenic acid) మరియు పాలవిరుగుడు ప్రోటీన్ మరియు కాల్షియం యొక్క గొప్ప వనరులు, జుట్టు పెరుగుదలకు ముఖ్యమైన ఖనిజాలు గల విటమిన్ D లేదా తక్కువ కొవ్వు పెరుగు లేదా పాలు;
  6. విటమిన్ సి సమృద్ధిగా గల బ్లూబెర్రీస్, కివీస్ మరియు స్ట్రాబెర్రీలు
  7. ఆకుపచ్చ బఠాణీలలో ఇనుము, జింక్ మరియు B- గ్రూప్ విటమిన్లు హెచ్చుగా వుంటాయి.

Sources:

http://www.aad.org/dermatology-a-to-z/diseases-and-treatments/e---h/hair-loss/who-gets-causes.

http://www.vogue.in/content/oiling-really-good-your-hair.

http://juanaaman.hubpages.com/hub/What-Makes-Herbal-Oils-the-Best-Hair-Loss-Cure-Treatment

http://www.advancednaturalmedicine.com/hair-renewal/treatments-for-hair-loss.html

http://www.dermatol.or.jp/Journal/JD/full/029060343e.pdf

http://umm.edu/health/medical/altmed/herb/saw-palmetto

http://www.hairsentinel.com/saw-palmetto-for-hair-loss.html

http://www.care2.com/greenliving/12-natural-remedies-that-boost-hair-growth.html?page=1

http://hair.allwomenstalk.com/natural-remedies-to-make-your-hair-grow-faster

http://www.onegoodthingbyjillee.com/2013/10/13-natural-remedies-to-reduce-hair-loss.html

http://www.webmd.com/beauty/hair-styling/top-10-foods-for-healthy-hair?page=1

http://articles.timesofindia.indiatimes.com/2012-06-01/beauty/29755718_1_hair-loss-hair-growth-walnuts

***అభ్యాసకులకు గమనిక***

  1. మా వెబ్ సైట్ www.vibrionics.org. మీ రెజిస్ట్రేషన్ నంబర్ తో, అభ్యాసకుల పోర్టల్ లో లాగిన్ చేయండి.మీ ఇ-మెయిల్ అడ్రసు మారినచో, వీలైనంత త్వరగా[email protected]తెలియచేయండి.
  2. మీరు ఈ వార్తాలేఖలను మీ తల్లిదండ్రులతో పంచుకోవచ్చును. వారి ప్రశ్నలు మీకు, సమాధానలకొరకు, పరిశోధనలకొరకు పంపబడును. మీ సహకారమునకు మా కృతజ్ణతలు.

                                      

   ఓం సాయి రామ్!