Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

అదనపు సమాచారం

Vol 3 సంచిక 6
November/December 2012


అరటి పండు యొక్క  నిజాలు

మన ఆహార పోషక మరియు ఔషధ విలువ అందించే పండ్ల విషయానికి వచ్చేసరికి వినయపూర్వకమైన అరటి తరచుగా నిర్లక్ష్యం చేయబడుతుంది. అరటి లో విటమిన్లు A B, C, E మరియు G పుష్కలంగా ఉన్నాయి. అంతేకాక అరటిలో ఖనిజాలు పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం, మరియు సెలేనియం ఉంటాయి.

ఒక అరటిలో మూడు సహజ చక్కెరలు సుక్రోజ్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్ కలిగి – ఫైబర్ తో కలిపి ఉండి, అది ఒక తక్షణ, నిరంతర మరియు గణనీయమైన శక్తిని ఇస్తుంది. కేవలం రెండు మాగిన అరటి పళ్ళు తినడం వలన 90 నిమిషాల వరకు చేసే కఠిన శారీరక శ్రమకు కావాల్సిన శక్తి లభిస్తుందని పరిశోధనలు నిరూపించాయి. అందువలనే అరటి ప్రపంచంలో ప్రముఖ క్రీడాకారులుకి మొదటి పండు. పూర్తిగా పండిన అరటి అసాధారణ కణాలను పోరాడేందుకు సామర్థ్యం కలిగిన TEN అని పిలిచే ఒక పదార్ధం (Tumour నెక్రోసిస్ ఫ్యాక్టర్) ని ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి దుకాణాలు త్వరలో అరటిపండ్ల స్టాక్ లేదు అని అంటే, వెంటనే ఆశ్చర్యపడవద్దు . అరటి మాగే కొద్దీ మచ్చలు అభివృద్ధి అవుతాయి. ఆ మచ్చలు ఎంత ముదురుగా ఉంటె అంత రోగ నిరోధకత సామర్ధ్యం ఉంటుంది.

అందువల్ల జపనీస్ కు అరటి పండు అంటే చాలా ఇష్టపడుతారు దానికి కారణం, ఒక జపనీస్ శాస్త్రీయ పరిశోధన ప్రకారం, అరటి క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలు TEN కలిగి ఉంటుంది. అరటి పండు ఎంత బాగా మాగితే దాని యొక్క క్యాన్సర్ వ్యతిరేక లక్షణం అంత ఎక్కువుగా ఉంటుంది. అరటి, ద్రాక్ష, యాపిల్, పుచ్చకాయ, పైనాపిల్, పియర్ మరియు వివిధ పండ్లు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు పోల్చడం కోసం టోక్యో విశ్వవిద్యాలయంలో ఒక ప్రొఫెసర్, నిర్వహించిన ఒక జంతువు ప్రయోగంలో, అరటి ఉత్తమ ఫలితాలు ఇచ్చింది. ఇది తెల్ల రక్త కణాల సంఖ్య పెంచడమే కాకుండా క్యాన్సర్ వ్యతిరేక పదార్ధం TEN ఉత్పత్తిని మరియు   శరీరం యొక్క రోగ నిరోధకత సామర్ధ్యం పెంచింది.

ప్రతి రోజు ఒకటి లేదా రెండు అరటి పండ్లు తింటే జలుబు, ఫ్లూ మరియు ఇతర రోగములు రాకుండా శరీర రోగనిరోధక శక్తిని ఇస్తుంది.  జపనీస్ ప్రొఫెసర్ ప్రకారం, పసుపు చర్మం, మచ్చలు ఉన్న అరటి ఆకుపచ్చ చర్మం అరటి కంటే 8 రేట్లు అధికంగా తెల్ల రక్త కణాల సామర్ధ్యం మెరుగు పరుస్తుంది. అందువలన ప్రతి రోజు 1 లేదా 2 అరటి పళ్ళు ఆహారం లో తప్పనిసరిగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది

మనో వ్యాకులత: ఇటీవల జరిగిన ఒక సర్వే ప్రకారం డిప్రెషన్తో బాధపడుతున్న ప్రజల్లో చాలా మంది అరటి పండు తిన్న తరువాత చాల సౌఖ్యంగా ఫీల్ అయ్యారు  మనసు చేపట్టిన అనేక మంది ఒక అరటి పండు  తినడం తర్వాత మంచి భావించారు. దానికి కారణం అరటి పండ్లో ట్రీప్టోఫాన్  అనే ఒక్క రకమైన ప్రోటీన్ ఉంటుంది అది శరీరంలో సెరోటోనిన్ గా మారి మిమల్ని ప్రశాంతంగా మరియు ఆనందంగా ఉంచి మీ మానసిక స్థితిని మెరుగు చేస్తుంది

PMS: మాత్రలు మరిచిపోండి. ఒక అరటి పండు తినండి. దానిలో ఉన్న విటమిన్ B6 మీ మానసిక స్థితిని ప్రభావితం చేసే బ్లడ్ గ్లూకోస్ స్థాయిని నియంత్రిస్తుంది.

రక్తహీనత: అరటిపండ్లు లో ఐరన్ ఎక్కువ ఉంటుంది, అరటిపండ్లు రక్తం లోని హెమోగ్లోబిన్ ఉత్పత్తి ఎక్కువ చేస్తుంది. అందువలన రక్తహీనత యొక్క సందర్భాలలో సహాయపడుతుంది.

రక్తపోటు : అరటిలో పొటాషియం చాల ఎక్కువగా ఉండి సోడియం చాలా తక్కువ ఉండడం వలన అధిక రక్తపోటును నియంత్రిస్తుంది అందువలన అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధిక రక్తపోటు మరియు స్ట్రోక్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుందని చెప్పడానికి అరటిపరిశ్రమకి అధికారికంగా అనుమతిచ్చింది

బ్రెయిన్ పవర్ : ట్వికెంహం (యూకే లోని మిడ్డ్లేసెక్స్లో ) లోని 200 స్కూల్ విద్యార్థులకు టిఫిన్, మధ్యాహ్న మరియు రాత్రి ఆహారంలో అరటిపండు తినడం వలన పరీక్షలు బాగా రాయగలిగారని తేలింది. పొటాషియం అధికంగా ఉన్న అరటి పండును తినడం ద్వారా మెదడు యొక్క చురుకుదనం బాగా మెరుగవుతుందని పరిశోధనలు చెబుతున్నాయి  

మల బద్ధకం : అరటి పండ్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది దాని వల్ల మలం సాఫిగా అవుతుంది, ఇది మల బద్ధకం సమస్యను మందుల అవసరం లేకుండా పోగొడుతుంది.

హ్యాంగోవర్లు : అరటి మిల్క్ షేక్స్లో తేనే కలుపుకుని తాగడం వలన హ్యాంగోవర్ బారి నుంచి అతి తొందరగా కోలుకోవచ్చు అరటి కడుపును శాంతపరచి తేనే యొక్క సహాయంతో తగ్గిన రక్త్తంలోని చక్కర శాతాన్ని పెంచుతుంది. పాలు మీ శరీరాన్ని రీహైడ్రాట్ చేస్తుంది

కడుపులో మంట : అరటిపళ్ళకి ఆమ్ల తత్వాన్ని తటస్థ పరిచే గుణం సహజంగానే ఉండటం వలన కడుపులో మంట తగ్గడానికి ఒక అరటి పండును తిని చుడండి

వేవిళ్ళు వికారము: రెండు భోజనాల మధ్య ఒక్క అరటి పండు స్నాక్స్ గా తింటే రక్తం లోని చక్కర శాతం పెరిగి  వేవిళ్ళు వికారము దూరం అవుతుంది.

దోమ కాటు : క్రిమి కాటు క్రీం రాయడం కంటే, అరటి తొక్క లోపలి భాగంతో ప్రభావితమైన ప్రాంతం మీద రుద్దండి. చాలా మందికి ఇది అద్భుతంగా వాపు మరియు మంటను తగ్గించింది.

నరములు: అరటిపళ్ళలో నాడీ వ్యవస్థను శాంతపరచే B విటమిన్లు అధికంగా ఉంటాయి.

అధిక బరువు మరియు పని వద్ద: ఆస్ట్రియా లోని సైకాలజీ అధ్యయన సంస్థ ప్రకారం పని యందు ఎక్కువ ఒత్తిడి ఎదుర్కొనే ఉద్యోగులు చాకోలెట్స్ మరియు చిప్స్ వంటి ఆహారాన్ని ఎక్కువగా తింటారని తేలింది. 5000 మంది హాస్పిటల్ రోగులను గమనించిన పరిశోధకులు బాగా ఊబకాయం గల వ్యక్తులు అధిక ఒత్తిడి గల ఉద్యోగాలలో ఉంటున్నట్లు గమనించారు. ఒత్తిడి మూలంగా ఎక్కువగా చిరుతిళ్ళు తినే స్వభావాన్ని అధిగమించాలంటే ప్రతి రెండు గంటలకొకసారి అధిక కార్బోహైడ్రేట్ గల ఆహారాన్ని తీసుకోవాలని ఆ నివేదిక వెల్లడించింది

పుండ్లు: మెత్తని సున్నితమైన స్వభావం వలన అరటి పండును పేగులలోని సమస్యల కొరకు వాడతారు. ఇది అధిక ఆమ్ల తత్వాన్ని తటస్థ పరచటమే కాకుండా కడుపు లోపలి భాగంలో ఒక పూత లాగా ఏర్పడి మంటను తగ్గిస్తుంది 

 ఉష్ణోగ్రత నియంత్రణ : అనేక ఇతర సంస్కృతులలో, దేశాలలో అరటి పళ్ళను చల్లదనం ఇచ్చే పండుగా భావిస్తారు. ఎందుకంటే తల్లులు కాబోతున్న స్త్రీల యొక్క శారీరక మానసిక వేడిని ఇది తగ్గిస్తుంది

సీజనల్ ఎపెక్తివ్ డిజార్డర్ (SAD): సహజ మానసిక స్థితిని ఉత్తేజ పరచే ట్రీప్టోఫాన్ను కలిగి ఉండడం వల్ల అరటి పళ్ళు SAD రోగులకు చాల మేలు చేస్తాయి  

ధూమపానం & పొగాకు ఉపయోగం : ధూమపానాన్ని మానాలనుకొంటున్న వ్యక్తులకు అరటి పళ్ళు సహాయం చేస్తాయి. ఎందుకంటే వాటిలోనున్న విటమిన్లు బి6. బి12 మరియు పొటాషియం మెగ్నీషియం, నికోటిన్ మానివేయడం వలన కలిగే పరిణామాల నుంచి శరీరం కోలుకునేందుకు తోడ్పడుతాయి

ఒత్తిడి: కీలక ఖనిజమైన పొటాషియం గుండెచప్పుడును సాధారణీకరణ చేస్తుంది, మెదడుకు ఆక్సిజన్ పంపుతుంది మరియు మీ శరీరం యొక్క జల సంతులనాన్ని నియంత్రిస్తుంది. మనం ఒత్తిడికి గురైనప్పుడు మన శరీర జీవ క్రియ వేగం పెరుగుతుంది అందువలన పొటాషియం శాతం తగ్గుతుంది. కావున పొటాషియం అధికంగా గల అరటి పళ్ళను తినడం చాలా మంచిది

స్ట్రోక్స్ : " న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ " లో పరిశోధన ప్రకారం, సాధారణ ఆహారంలో భాగంగా అరటి తినడం వలన 40% వరకు స్ట్రోక్ ద్వారామరణం సంభవించే ప్రమాదాన్ని శాతం వరకు తగ్గించవచ్చు!

పులిపిర్లు: సహజ ప్రత్యామ్నాయాలు వైపు ఆసక్తి ఉన్నవారు ఏమంటారంటే పులిపిర్లును పోగొట్టాలంటే, కొంచం అరటి తొక్క లోపలి భాగాన్ని పులిపిర్ పై ఉంచి ప్లాస్టర్ లేదా సర్జికల్ టేప్తో అతికించి ఉంచితే పులిపిర్ మాయం  

అందువలన అరటి పండు నిజంగానే ఎన్నో రోగాలకు సహజమైన ఔషధం. కానీ గుర్తుంచుకోండి , అరటిని ఫ్రిజ్ లో మాత్రం ఉంచకండి! ఆపిల్ తో పోలిస్తే అరటిపండులో ప్రోటీన్ నాలుగు రెట్లు, కార్బోహైడ్రేట్లు రెండు రెట్లు, భాస్వరం మూడు రెట్లు, విటమిన్ A మరియు ఇనుము అయిదు రెట్లు మరియు ఇతర ఖనిజాలు మరియు విటమిన్ల రెండు రెట్లు అధికంగా ఉంటాయి . దీనిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కావున ఇది అత్యుత్తమ ఆహార పదార్దాలలో ఒకటని కచ్చితంగా చెప్పవచ్చు. అందువలనే ఇప్పుడు మనం “ రోజుకొక అరటి ఉంచుతుంది దూరంగా డాక్టర్ని ” అని అంటాము 

http://www.naturalnews.com/031308_bananas_health_benefits.html

http://www.naturalnews.com/028206_bananas_health.html

http://www.naturalnews.com/034151_bananas_nutrition_facts.html

http://healthmad.com/nutrition/10-health-benefits-of-bananas/

http://www.naturalnews.com/026376_selenium_cancer_thyroid.html
http://www.naturalnews.com/026368_calcium_magnesium_vitamins.html
http://www.nutritiondata.com/facts/fruits-and-fruit-juices/1846/2
http://health.learninginfo.org/banana-nutrition.htm
http://news.bbc.co.uk/2/hi/health/264552.stm
http://www.medicinenet.com/ace_inhibitors/article.htm

http://www.todayifoundout.com/index.php/2010/09/15-facts-you-probably...
http://www.whfoods.com/genpage.php?tname=foodspice&dbid=7


++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
                                                    

                                                    మధుమేహాన్ని నియంత్రించే ఆరు ఆహారాలు


మధుమేహం రెండు రకాలు టైప్ ఒకటి మరియు టైప్ రెండు. రెండింటిలోనూ సమతుల్యత లేని బ్లడ్ షుగర్ మరియు ఇన్సులిన్ సమస్యలుంటాయి ఇన్సులిన్ హార్మోన్ గ్లూకోస్ ను కణజాల శక్తిగా మార్చే హార్మోన్. ఇది పోషకాల జీవ ప్రక్రియ చర్యకు చాలా అవసరం.టైప్ ఒకటి మధుమేహాన్నిజువెనైల్ డయాబెటిస్ అని కూడా అంటారు ఎందుకంటే ఇది చాలా చిన్న వయసులో వస్తుంది. పాంక్రియాస్ గ్రంధి ఇన్సులిన్ హార్మోన్ ను చాలా తక్కువ స్థాయిలో లేదా అసలు ఉత్పత్తి చేయలేని కారణం వలన ఇన్సులిన్ ను శరీరంలోకి ఇంజక్షన్  అనగా ఇన్సులిన్ పెన్, ఇన్సులిన్ పిల్స్ లేదా పోర్తబుల్ ఇన్సులిన్ పంప్ రూపములో ఇవ్వవలసి ఉంటుంది. టైప్ రెండు డయాబెటిస్ మధ్య లేదా ముసలి వయసులో వస్తుంది. ఇందులో శరీరం ఇన్సులిన్ నిరోధకత లేదా ఇన్సులిన్ ను సరిగా ఉపయోగించలేక పోవడం ఒక కారణం. టైప్ రెండు డయాబెటిస్ ను వ్యాయామం తో మరియు ఆహారపు అలవాట్లతో బ్లడ్ షుగర్ను గమనిస్తూ నియంత్రించవచ్చు.

దీర్ఘ కాలంగా బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉంటె అది టైపు 1  లేదా 2 డయాబెటిస్ అవచ్చు. కానీ కొన్నిసార్లు ముఖ్యంగా టైపు 2 డయాబెటిస్ లో బ్లడ్ షుగర్ తక్కువగా ఉండడం జరుగుతుంది. మధుమేహ వ్యాధి లక్షణాలు అడ్రినల్. థైరాయిడ్, ఫైబ్రోమైయాల్జియా వ్యాధి లక్షణాలను పోలి ఉండవచ్చు. అందువలన బ్లడ్ షుగర్ పరీక్ష చేసుకుని మీకు మధుమేహం ఉందా లేదాని నిర్దారించుకోవడం మంచిది.

                                                                 మధుమేహుల కొరకు ఆహారం

అధిక గ్లిసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాన్ని తినకపోవడం ఉత్తమం. అవి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్స్ షుగర్, హై ఫ్రూక్టోజ్ కార్న్ సిరప్ తేనె, మాపుల్ సిరప్, కేకులు, బిస్క్యూట్లు మొదలైనవి. కృత్రిమ చక్కెర ప్రత్యామ్నాయ ఆహారం మీ మెదడు కణాలకు మంచిదిద్ కాదు. తక్కువ బ్లడ్ షుగర్ ( హైపోగ్లిసెమియా) ఉన్నపుడు తియ్యగా లేని పండ్ల రసాలు తీసుకోవడం మంచిది. కానీ హై బ్లడ్ షుగర్ ఉన్నపుడు వాటి తీసుకోకూడదు లేదా బాగా పలుచగా చేసి తాగాలి. ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్స్ లోని చాలా తినుబండారాలలో, ప్రొసెస్డ్ ఫుడ్ లో, అవి తియ్యగా లేకపోయినా వాటిలో చక్కర శాతం ఎక్కువన్న విషయం మీకు తెలుసా? అందువలన వాటిని తినకుండా సాధ్యమైనంత వరకు ఆర్గానిక్ ఫుడ్ ను తినండి కొనండి. 

1) కూరగాయలు ముఖ్యంగా ఆకుకూరలు మీరు ప్రతి రోజు తినవచ్చు. ఉడికించిన కూరగాయలు మరియు పచ్చి సలాడ్లు అందరికి మంచివి. సలాడ్ డ్రెస్సింగ్ కోసం వాడే వాటిలో షుగర్ లేదా ఇతర స్వీటెనర్స్ ఉండే అవకాశం ఉంది. అందువలన ప్రాసెస్ చేయని, కోల్డ్ ప్రెస్ చేసిన వర్జిన్ వెజిటబుల్ నూనె, ఒక సొయా ఆయిల్ తప్ప వాడవచ్చు. లేదా వినెగర్ లేదా నిమ్మ రసం వాడవచ్చు.

(2) అవోకాడో మీ సాలాడ్స్లో రుచి మరియు పోషక విలువల కోసం కొన్ని అవొకాడో ముక్కల్ని కలపండి. అవొకాడోలో చాల తక్కువ జి ఉంటుంది . అంతేకాక వాటిలో మధుమేహులలో సహజమైన దీర్ఘ కాలిక ఇన్ఫ్లమేషన్ నయం చేసే ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. అవకాడోలో ప్రోటీన్ లు కూడా చాల ఎక్కువ ఉంటాయి 

(3) వాల్నట్ వీటిలో ఒమేగా ఫాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి మరియు GI తక్కువ. వీటిని సలాడ్లు లేదా మొలకెత్తే గింజలపై రుచి కోసం చల్లుకొని తినవచ్చు. ఉప్పు లేని ఇతర పచ్చి గింజలను కూడా మధుమేహులు తినవచ్చు.

(4) తాజా (సాగు చేయని) చేపలు, ముక్యంగా ట్యూనా లేదా కోల్డ్ వాటర్ సాల్మన్ లో  ఒమేగా  అధికంగా  మరియు GI తక్కువ ఉంటుంది.
 
(5) ధాన్యాలు : ప్రొసెస్డ్ గ్రేయిన్స్  ను వాడకపోవడం మంచిది. కానీ  కొన్ని తృణధాన్యాలు మీరు భావించే దాని కంటే ఎక్కువ GI (గ్లైసెమిక్ సూచిక) కలిగి ఉంటాయి. ఉదాహరణకి గోధుమ. వాటికీ ప్రత్యామ్నాయాలుగ క్వినోవా లేదా బక్ గోధుమ వాడచ్చు. ఆర్గానిక్ ముడి బియ్యం కొంత మంది డియాబెటిక్స్ లో పని చేయవచ్చు. ఎందుకంటే ఇది సంక్లిష్ట కార్బోహైడ్రేట్ కావున తొందరగా  గ్లూకోస్ గా   మారదు.కానీ చాల మంది నిపుణులు వీటిని ప్రతి రోజు డియాబెటిక్స్ తినకూడదని చెప్తారు.

(6) వివిధ చిక్కుళ్ళు (బీన్స్) రకరకాల బీన్స్ ను బ్రౌన్ రైస్ కి రుచి కోసం వాడచ్చు. బీన్స్ లో పొటాటో కంటే  ప్రోటీన్ మరియు ఫైబర్ ఎక్కువగా తక్కువగా ఉంటాయి. వాటిని కూరగాయలతో కలపచ్చు లేదా వేరే కూరగా తినవచ్చు 

                                                                                     

Sources for this article include:  http://www.ehow.com/about_5372662_safe-foods-diabetics.html
Learn more: http://www.naturalnews.com/037217_diabetics_foods_glycemic_index.html#ixzz26kf3a5Ps

  *******************************************************************************************

సాయి విబ్రియోనిక్స్ యొక్క పై వ్యాసం ఆరోగ్య సమాచారం కోసం మాత్రమే. దీనినే వైద్య సలహాగా పరిగణించరాదు