అదనంగా
Vol 3 సంచిక 5
September/October 2012
ఆరోగ్య చిట్కాలు
మీరు మీ నిద్రను పాడు చేసుకుంటున్నారా?
మన నిత్యజీవితంలో మారథాన్ పరుగు పందెం వంటి హడావుడి మధ్య లేదా ముఖ్యమైన వారి తోటి ఘర్షణతో కూడిన వాతావరణంలో గడిపిన తరువాత 8 గంటల ఆనందకరమైన నిద్రను ఆస్వాదించడం అసాధ్యమే అనిపించవచ్చు. కానీ మనం అటువంటి కఠినమైన సందర్భంలోనే నిద్రను తగ్గించడం వల్ల, ఒత్తిడిని అధిగమించడం మరింత కఠినమైపోతుంది. కనుక ఏది దొరికితే అది విసిరివేయడం, మనుషుల మీద గొంతు చించుకొని అరవడం ఆపండి. మీరు ఒత్తిడికి గురైనప్పుడు కూడా మంచి నిద్ర ఎలా పొందాలి అనే దానిపై ఇక్కడ ఉత్తమమైన చిట్కాలు ఇవ్వబడ్డాయి.
మీ నిద్రకు భంగం కలిగించే వాటిని అధిగమించడానికి--- మీ కార్యాచరణ ప్రణాళిక
బెడ్ మీద కూడా పని భారం పెట్టుకోవద్దు, బెడ్ షీట్లు మరియు తల దిండులను మీ పనికి తాత్కాలిక వాహకాలుగా మార్చడం వల్ల మీరు మీ మంచాన్ని ఒక విశ్రాంత ప్రదేశంగా చూడటం కష్టం అవుతుంది. నిద్రవేళకు ముందే ల్యాప్టాప్, ఫోన్, మరియు ఇతర సాంకేతిక పరికరాలను దూరంగా ఉంచండి. ఈ గాడ్జెట్ల నుండి వచ్చే కాంతి శరీరం యొక్క సహజ నిద్రాచక్రాన్ని గందరగోళానికి గురి చేస్తుంది
సహేతుకమైన వేళల్లో నిద్రపోండి. (దీనిని అలవాటుగా చేసుకోండి) ముఖ్యంగా మనం పనిలో పూర్తిగా మునిగి పోయినప్పుడు మనం చేస్తున్న ప్రాజెక్టుకు రాత్రంతా మేలుకుని చివరి దిద్దుబాట్లు చేయాలని దృష్టి పెడుతూ ఉంటాం. కానీ రాత్రంతా నిద్ర లేకుండా ఉండడం వల్ల మరుసటి రోజు పని మీద దృష్టి పెట్టడం చాలా కష్టమవుతుంది, మరియు సూర్యోదయం వరకూ నిలకడగా పనిమీద ధ్యాస ఉంచడం వల్ల అది అభ్యాస సామర్ధ్యాలపై ప్రభావం చూపడమే కాక ఆందోళన స్థాయిలను కూడా పెంచుతుంది (ఇప్పుడు ఇదే ఎక్కువమందిని ఒత్తిడికి గురి చేసే విషయ మయ్యింది). సాధారణ నిద్ర వేళకు కట్టుబడి ఉన్నట్లయితే ఉదయం ఈ విషయాలను చక్కగా పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది.
స్వల్ప విరామం తీసుకోండి. మీరు పనిని పూర్తిగా ఆపేసి ఎక్కడివక్కడ సర్దుకునే వరకూ దీర్ఘకాలం పని చేయడం కాకుండా మధ్య మధ్యలో కొంచెం విరామం ఇవ్వడం మంచిది. వెచ్చని నీటితో స్నానం లేదా ఆయుర్వేద మూలికలతో చేసిన టీని ఆస్వాదించండి. మిమ్మల్ని ఆందోళనకు గురిచేసే చింతలు మిమ్మల్ని వదలకుండా మీ నిద్రకు భంగం కలిగిస్తూ ఉంటే వాటిని ఒక పత్రికలో రాసిపెట్టుకోండి లేదా చక్కని ఆనందదాయకమైన సంగీతంతో విశ్రాంతి పొందండి.
ఒక పవర్ న్యాప్ (power nap మాగన్ను నిద్రను) తీసుకోండి. ఒత్తిడి అనే రాక్షసుడు మిమ్మల్ని రాత్రంతా విశ్రాంతి తీసుకోకుండా ఉంచినట్లయితే పగటిపూట మాగన్నుగా నిద్ర పోవడానికి ప్రయత్నించండి 10 నుండి 20 నిమిషాలు నిద్ర పోయినట్లయితే ఆ పగలంతా మీరు ఫ్రెష్ గా ఉండగలుగుతారు మరియు రాత్రి కూడా హాయిగా నిద్ర పోగలుగుతారు.
http://www.livestrong.com/blog/are-you-sabotaging-your-sleep#ixzz26kWO1Bzt
చర్మ క్యాన్సర్ అంటే ఏమిటి?
చర్మ క్యాన్సర్ అనే పదాన్ని చర్మాన్ని ప్రభావితం చేసే వివిధ క్యాన్సర్ పరిస్థితులను వివరించడానికి ఉపయోగిస్తారు. చర్మ క్యాన్సర్లలో రెండు ప్రధాన వర్గాలు ఉన్నాయి. మెలనోమా మరియు నాన్ మెలనోమా. నాన్ మెలనోమా క్యాన్సర్ కేసులు చర్మ క్యాన్సర్ యొక్క అత్యంత సాధారణము మరియు నయం చేయడానికి వీలుగా ఉండే రకాలు. మెలనోమా క్యాన్సర్, ప్రారంభంలోనే ఉన్నప్పుడు చికిత్స చేయగలిగిన ప్పటికీ ఇది బాగా ముదిరితే కేన్సర్లో ప్రాణాంతక రూపమని చెప్పవచ్చు.
నాన్ మెలనోమా క్యాన్సర్లలో కొన్ని రకాలు ఉన్నాయి. మెలనోమా క్యాన్సర్ తనలోనే అన్నీ ఉన్న వర్గంలో ఉంది.
నాన్ మెలనోమా చర్మ క్యాన్సర్ - బ్యాసల్ సెల్ కార్సినోమా
బ్యాసల్ సెల్ కార్సినోమా బాహ్యచర్మం యొక్క అత్యల్ప పొర ఎపిడెర్మిస్ లో ప్రారంభ మవుతుంది. ఇది నాలుగు చర్మ క్యాన్సర్ కేసులలో మూడింటికి బాధ్యత వహిస్తుంది. సాధారణంగా సూర్యరశ్మి ఎక్కువగా గురయ్యే ముఖం వంటి ప్రాంతాలను ప్రభావితం చేస్తుంది. సర్వసాధారణమైన రూపాలు - చిన్నవి దృఢమైన పాలిపోయిన రంగుతో గడ్డలు లేదా అటువంటివే గులాబీ లేదా ఎరుపు రంగులో ఉన్న ఉబ్బెత్తు ప్రాంతంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ క్యాన్సర్లు నెమ్మదిగా వ్యాప్తి చెందుతాయి మరియు చికిత్సకు బాగా స్పందిస్తాయి.
పొలుసుల కణ క్యాన్సర్
ఈ క్యాన్సరు కూడా ఎపిడెర్మిస్ పొరలోనే పైపొరపై ప్రారంభం అవుతుంది. ఇవి ఎర్రటి మరియు కఠినమైన ఉపరితల ముద్దలుగా కనిపిస్తాయి మరియు శరీరముపై బ్యాసల్ సెల్ క్యాన్సర్ల మాదిరిగానే అదే ప్రాంతంలో ప్రారంభమవుతాయి.
ఈ రెండు చర్మ క్యాన్సర్ల మధ్య పెద్ద వ్యత్యాసం ఏమిటంటే పొలుసులు కణాలు వ్యాప్తి చెందే అవకాశం ఉంది కనుక ఇది మొత్తం ఆరోగ్యానికి పెద్ద ముప్పుగా మారే అవకాశం ఉంది.
పుట్టకురుపు (మెలనోమా)
మెలనోమా కూడా సూర్యరశ్మికి సంబంధించినదే అయితే వీపు భాగము మరియు కాళ్ళ దిగువ వంటి ఈ ప్రాంతాల్లో అధికంగా సూర్య రశ్మికి గురికావడం వల్ల ఇవి ఏర్పడుతూ ఉంటాయి. మరియు పొలుసుల కణ క్యాన్సర్ కంటే ఇది చాలా తక్కువ సాధారణమే కానీ ఇది చాలా తీవ్రమైనది మరియు ప్రమాదకరమైనది, ఎందుకంటే శరీరంలోని ఇతర అవయవాలకు వ్యాపించే అవకాశం ఉంది మరియు వాస్తవానికి మరణానికి కూడా దారి తీస్తుంది.
మెలనోమా చర్మమునకు రంగును ఇచ్చే కణాలు మెలనోసైట్స్ లో మొదలవుతుంది. ఈ కణాలు వేసవిలో గరుకుగా లేదా పెళుసుగా ఉండేలా చర్మాన్ని చేస్తాయి. ఐతే ఇలా అప్పుడప్పుడు ఉంటుంది కానీ ఎల్లప్పుడూ మాత్రం ఉండదు. ఇది క్యాన్సర్ కణాలను గోధుమ లేదా నలుపు రంగులోకి మారుస్తాయి ఇలా చేయడం మంచిదే ఎందుకంటే వ్యాధి ముదిరిపోక ముందే ఈ క్యాన్సర్ ను గుర్తించవచ్చు.
చర్మ క్యాన్సర్ ను నివారించడం
సూర్యరశ్మి వలన చర్మానికి హాని కలగటమే దీనికి ప్రధాన కారణం ఇందులో ప్రమాదకరమైన అతినీలలోహిత కాంతి లేదా అల్ట్రావయొలెట్ కిరణాలు ఉంటాయి. ఈ కిరణాల నుండి మిమ్మల్ని మరియు పిల్లలను రక్షించడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి
- ఎక్కువ సమయం సూర్యరశ్మికి గురికాకుండా ఉండండి. ముఖ్యంగా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 వరకూ. గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే అల్ట్రా వైలెట్ కిరణాలు మామూలు సూర్యకాంతిలో ఎంత ప్రభావం కలిగిస్తాయో అంతే తీవ్రత ఆకాశం మబ్బుగా ఉన్నప్పుడు కూడా కలిగిస్తాయి.
- ప్రతిరోజూ సన్ స్క్రీన్ వాడండి. 15 లేదా అంతకంటే ఎక్కువ SPF తో బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్ ఉపయోగించండి. నునుపుగా ఉన్న చర్మం (ఫెయిర్ స్కిన్) ఉన్నవారు SPF-30 లేదా అంతకంటే ఎక్కువ ఉండే సన్ స్క్రీన్ వాడాలి. బయటకు వెళ్లడానికి 20 నుండి 30 నిమిషాల ముందు సన్ స్క్రీన్ రాసుకోమని వెళ్ళండి, మరియు ప్రతీ రెండు గంటలకు తిరిగి సన్ స్క్రీన్ రాసుకుంటూ ఉండండి.
- రక్షణ దుస్తులను ధరించండి. వాటితో పాటు విస్తృత అంచుగల టోపీలు, సన్ గ్లాసులు, మరియు గట్టి నేత బట్టతో చేసిన దుస్తులు ధరించండి అలాగే ముదురు రంగులు మరింత రక్షణ ఇస్తాయి.
- మీ చర్మాన్ని గురించి తెలుసుకోండి. ఏవైనా కొత్తగా మార్పులు చోటుచేసుకుంటున్నట్లైతే ముఖ్యంగా పుట్టుమచ్చలు మరియు ఇతర మచ్చలు విషయంలో మీ చర్మాన్ని తనిఖీ చేయించండి. చర్మానికి సంబంధించి మీరు తెలుసుకోవాల్సిన నిర్దిష్టమైన విషయాలు ఉన్నాయి. వీటిని ABCDE ఉపయోగించి సులభంగా గుర్తించవచ్చు.
ఏమిటీ ABCDE లు ?
చర్మంలో మార్పులు చోటుచేసుకున్నప్పుడు మనం ఏమి గమనించాలి గుర్తుంచుకోవడానికి ఇది ఒక సాధారణ మార్గము.
- అసిమెట్రీ అనగా క్రమానుగత లేమిని సూచిస్తుంది. మీ మచ్చ లేదా మోల్ అసమానంగా కనిపిస్తున్నదా?
- బోర్డర్ ఇర్రెగ్యులరిటీ లేదా సరిహద్దు అవకతవకలకు సూచిస్తుంది అంచులు సక్రమంగా లేవా?
- కలర్ ఇది రంగు యొక్క వైవిధ్యాన్ని సూచిస్తుంది. మీరు గాయం లోపల బహుళ రంగులను చూస్తున్నారా?
- డయామీటర్ అనగా వ్యాసాన్ని సూచిస్తుంది. ఇది ఆరు మిల్లీమీటర్ల కంటే వెడల్పుగా ఉందా ఐతే కొంచం ఆలోచించాలి.
- ఎవల్యూషన్ లేదా పరిణామాక్రమాన్ని సూచిస్తుంది. రంగు, పరిమాణం, లేదా లక్షణాలు మారాయా అనేది గమనించాలి.
చర్మ క్యాన్సరుకు చికిత్స
ఒక శుభవార్త ఏమిటంటే చర్మ క్యాన్సర్ ముందుగానే గుర్తించి నప్పుడు చక్కగా నయం చేసుకోవచ్చు (మెలనోమాతో సహా).
పైన వివరించిన విధంగా చర్మంలో ఏవైనా మార్పులు కనిపిస్తే మీరు మీ వైద్యుని సంప్రదించాలి. అతను లేదా ఆమె చర్మ క్యాన్సర్ నిర్ధారించడానికి బయాప్సీ చేయించుకోవాలి.
చర్మ కేన్సర్ చికిత్సలో స్వల్పమైన లేదా విస్తృతమైనది శస్త్రచికిత్స, లేదా రేడియేషన్ లేదా ఖిమో థెరపీ ఉండవచ్చు. ఇది చర్మ క్యాన్సర్ యొక్క రకము మరియు విస్తృతి పై ఆధారపడి ఉంటుంది.
ఇప్పటికే చికిత్స చేసినప్పటికీ కొన్ని చర్మ క్యాన్సర్లు పునరావృతం అవుతాయి. కాబట్టి మీరు గతంలో చర్మ క్యాన్సర్ తో బాధపడుతున్నట్లైతే క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకొనడం ముఖ్యం.
మూలాలు: What You Need To Know About Skin Cancer. Rockville, MD.: National Cancer Institute: 2005. (Accessed October 17, 2009 at http://www.cancer.gov/cancertopics/types/skin.)
సాయి వైబ్రియానిక్స్ వార్తాలేఖల ద్వారా ప్రచురించే ఈ సమాచారము విద్యా సంబంధ మైన సమాచారమునకే తప్ప దీనిని వైద్య సలహాగా భావించరాదు. ప్రాక్టీషనర్లు పేషంట్లను సరియైన వైద్య సమాచారము కోసము మరియు ప్రత్యేక వైద్య సలహాల నిమిత్తము వారి డాక్టర్లను సంప్రదించమని చెప్పవలసిందిగా సూచన.