Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

అదనపు సమాచారం

Vol 3 సంచిక 4
July/August 2012


ఆరోగ్య చిట్కాలు
 

వీలయినంత తరుచుగా బొప్పాయి తీసుకోండి   

ప్రప్రధమంగా దక్షిణ మెక్సికో ప్రాంతానికి చెందిన ఈ బొప్పాయి పంటను ఇప్పుడు అనేక దేశాలలో (బెజిల్, ఇండియా, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, వియత్నాం, శ్రీలంక) పండిస్తున్నారు. బొప్పాయి శక్తివంతమైన సంప్రదాయక ఔషదం గా అనేక శతాబ్దాలు ఉపయోగించబడింది. బొప్పాయి రుచికరమయిన పండు మాత్రమేకాదు, దీనిలో అనేక విటమిన్లు, ఫైటోకెమికల్స్ సమృద్ధిగా ఉన్నాయి. బొప్పాయి యొక్క ఇతర భాగాలూ కూడా అనారోగ్య సమస్యలకు ఉపయోగించినట్లు చారిత్రక నేపధ్యం ఉంది.

ఇప్పుడు ప్లోరిడా విశ్వవిద్యాలయ (యూ‌ఎఫ్) పరిశోధకుడు డాక్టర్ నామ్ దంగ్ మరియు జపాన్ లోని అతని సహచరులు బొప్పాయి కేన్సర్ కణాలను నాశనం చేస్తుందని తమ నూతన పరిశోదన ద్వారా తెలియజేస్తున్నారు. వాస్తవానికి వారు పరిశోధన శాలలో ఎండిన బొప్పాయి అకులనుండి తయారుచేసిన ఔషదం అనేక రకాలయిన కణుతులు ముఖ్యంగా గర్భాశయం, రొమ్ము, లివరు, ఉపిరి తిత్తులు, వంటి అనేక క్యాన్సర్ లను నిరోధించ గలిగింది.

ఇటీవలే ఎత్నోఫార్మకాలజీ పత్రికలో ప్రచురితమైన పరిశోధనా అంశం ప్రకారము బొప్పాయి కి వివిధరకాల కణుతులను అరికట్టే స్వభావము ఉండడమే కాదు బొప్పాయి ఆకు నుండి తీసిన రసం మన శరీరంలో సిగ్నలింగ్ వ్యవస్థను పటిష్టం చేసే Th1-type సైటో కిన్స్ ఉత్పత్తి చేసే స్వభావము కలిగినదని నిర్ధారణ అయ్యింది.

ఇది చాలా ముఖ్యమైన అంశం ఎందుకంటే బొప్పాయి ఉపయోగించడం వలన శరీరంలో క్యాన్సర్ అరికట్టడానికి కావలసిన  రోగనిరోధక వ్యవస్థ పటిష్ఠ మవుతుంది. అంతేగాక, శరీరంలో మంట ఇంకా సుక్ష్మ జీవుల ద్వారా కలిగే ఇతరత్రా వ్యాధులను కూడా అరికడుతుంది.

పరిశోధనలు ఏం తెలుపుతున్నయంటే బొప్పాయి యొక్క క్యాన్సర్ నివారణ గుణం వీటి ఆకులరసాన్ని వాడినప్పుడు ఇంకా బలంగా ఉన్నట్లు కనుగొనబడింది. అంతేకాదు మిగతా ఇతర చికిత్సా విధానాల వలె కాకుండా దీనిని వాడడం వలన ఇతర కణాల పైన ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు.

డాక్టర్ డాంగ్ ఇచ్చిన నివేదిక ప్రకారము దుష్ఫలితాల ప్రభావం లేకుండా క్యాన్సర్ నివారింప బడడం బొప్పాయి లో ఉన్న గొప్ప విశేషం, ఆస్ట్రేలియా మరియు వియత్నాం ప్రాంతాలలోని అసంఖ్యాకంగా ఉన్న ప్రజల  ద్వారా  ఇది ప్రత్యక్షంగా నిరూపింప బడినట్లు వీరు తెలుపుతున్నారు.                                                                                                                           షాన్డ్స్ క్యాన్సర్ చికిత్స మరియు పరిశోధనా కేంద్రంలో వైద్య విభాగములో ప్రొఫెసర్ గా మరియు డైరెక్టర్ గా పనిచేస్తున్న డాక్టర్ డాంగ్ తమ అభిప్రాయాన్ని ఇలా వెలిబుచ్చుతున్నారు. ‘’ చికిత్సా విధానములో నేను చూసిన విన్న అంశాల ప్రకారము ఎవరయితే ఈ ఆకుల రసాన్ని తీసుకోవడం లేదో వారిలో చెప్పుకోదగిన పరిమాణములో టాక్జిన్ అనగా విషపదార్ధాలు ఉన్నట్లు నిర్దారింపబడింది, కనుక అది పనిచేసే వరకూ ఎక్కువ కాలం ఈ రసాన్ని తీసుకోవలసి ఉంటుంది ‘’.

ఇది ఇలా ఉండగా UF శాస్త్రవేత్తలు 10 రకాల క్యాన్సర్ల నివారణకు బొప్పాయి ఆకుల రసం ఎంతో సహాయకారిగా ఉంటుందని తెలిపారు. ఈ రసంత్రాగిన పేషంట్లకు 24 గంటల తర్వాత పరీక్షిస్తే కణుతుల పెరుగుదల తగ్గుముఖం పడుతున్నట్లు కనుగొనబడింది.

హానికారక గ్రంధుల వంటివాటిని నిరోధించడానికి బొప్పాయిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? దీనిని వివరించడానికి పరిశోధకులు బొప్పాయిలో ఉన్న T-లింఫోమా క్యాన్సర్ సెల్ లైన్ పైన దృష్టి సారించారు. వారు బొప్పాయి ఆకుల రసం లో ఉన్న సహజ సిద్ధమైన సమ్మేళన సామర్ధ్యము క్యాన్సర్ తాలూకు కణాలను మాత్రమే చంపివేస్తుంది కానీ, సాధారణ కణాలను మాత్రము ఏమీ చేయదు అని అని పరిశోధనా పూర్వకంగా కనుగొన్నారు.

పరిశోధకులు తమ బొప్పాయి మరియు క్యాన్సర్ నివారణ పరిశోధనలను జంతువుల పైన మనుషుల పైన కొనసాగించాలనే ప్రయత్నంతో ముందుకు వెళుతున్నారు. ఇంతేకాకుండా డాక్టర్ డాంగ్ మరియు వారి బృందము బొప్పాయి ఆకురసము క్యాన్సర్ ను నిరోధించడానికి దానిలో ఉన్న ప్రత్యేక పదార్ధాలు పైన టోక్యో విశ్వవిద్యాలయం నుండి పరిశోధనలు కొనసాగిస్తూ దానిపైన పేటెంట్ తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు.

ఈ ప్రయత్నంలో డాక్టర్ డాంగ్ UF షాండ్స్ క్యాన్సర్ సెంటర్ లో వైద్య రసాయనిక శాస్త్రంలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న హెండ్రిక్ లుయేష్ గారితో భాగస్వామ్యం వహించి ముందుకు పోవడానికి ప్రయత్నిస్తున్నారు. డాక్టర్ లుయేష్ వైద్య ప్రయోజనాలకోసం ప్రాకృతికమైన వనరులను గుర్తించడం లోనూ వాటిని ఉపయోగం లోనికి తీసుకురావడం లోనూ సిద్ధ హస్తులు. వీరు ఇటీవలే పగడపు రాయి కి చెందిన సమ్మేళనం క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుందని కనుగొన్నారు.

ఆరోగ్య ప్రయోజనాలు:

తీయగా, మధురంగా ఉండే బొప్పాయి పండ్లు ఉదయపు పలహరానికి ఎంతో అనువుగా ఉండడంతో పాటు ఫ్రూట్ సలాడ్ లో ఇది చాలా బాగుంటుంది. దీనిని యోగర్ట్ తో కలిపి రుచికరమైన పదార్దము చేసుకోవచ్చు. ఆకుపచ్చని సలాడ్ లలో దీనిని రుచికోసం కలుపుకోవచ్చు. నిమ్మరసాన్ని బొప్పాయి తో చేసిన పదార్ధాల పైన పిండుకుంటే మరింత రుచికరంగా ఉంటుంది. బొప్పాయి యొక్క ఆరోగ్య ప్రయోజనాల విషయానికొస్తే ఇది గుండెజబ్బులు, క్యాన్సర్ నివారణ, జలుబు, ఫ్లూ వంటి వాటిని నివారించడమే కాకుండా జీర్ణశక్తిని కూడా పెంపొందిస్తుంది. 

బొప్పాయిలో ఉన్న పోషకాలు:

బొప్పాయి లో C విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. ఒక మధ్యస్థమైన పరిమాణములో ఉన్న బొప్పాయిలో ప్రతిరోజూ మనం తీసుకునే పరిమాణానికి 150% ఎక్కువ లభ్యమవుతుంది. దీనిలో బీటా–క్రోటిన్ రూపంలో విటమిన్ A, కూడా సమృద్ధిగా లభిస్తుంది. దీనిలో  K విటమిన్, E విటమిన్, ఫోలిక్ యాసిడ్ ఇంకా పొటాషియం కూడా సమృద్ధిగా లభిస్తాయి.  

గుండెజబ్బుల నివారణకు బొప్పాయి:

 బొప్పాయి చేకూర్చే ఆరోగ్య ప్రయోజనాలలో మరొకటి ఇది గుండెజబ్బుల నియంత్రణకు ఉపయోగపడే మూడు విటమిన్లను కలిగి ఉంటుంది - అవి A, విటమిన్, E విటమిన్ మరియు బీటా కెరోటిన్. ఇంకా అదనంగా దీనిలో సమృద్ధిగా లభించే ఫోలిక్ యాసిడ్ గుండెజబ్బుల కు దోహదపడే అమినో ఆమ్లాల హోమో సిస్టిన్ ల స్థాయిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

జలుబు మరియు ఫ్లూ నివారణ కు:

C, విటమిన్ ఎక్కువగా ఉండే బొప్పాయి వంటివి రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఎంతో సహాయకారిగా ఉంటాయి. C విటమిన్ A, టైపు ఇన్ఫ్లుఎంజా, సాధారణ జలుబు, న్యుమోనియా లేదా నిమ్ము వీటి నివారణకు ఎంతో సహాయకారిగా ఉంటుంది. అలాగే బొప్పాయి లో ఉన్న A విటమిన్ రోగ నిరోధక వ్యవస్థకు మరింత సహాయకారిగా ఉంటుంది. 

నాడీ సంబంధితమైన రుగ్మతల నివారణకు బొప్పాయి:

బొప్పాయి లో ఉండే ఫోలిక్ ఆమ్లము నాడీ సంబంధిత రుగ్మతలను నివారించడంలో ఎంతో సహాయకారిగా ఉంటుంది. ఫోలిక్ ఆమ్లము అధికంగా ఉండే బొప్పాయి వంటివి గర్భధారణకు ముందు మరియు గర్భధారణ సమయంలో తీసుకోవడం వలన పిండము వెన్ను మరుయు నాడీ వ్యవస్థ చక్కగా అభివృద్ధి చెందుతుంది.

జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండడానికి బొ ప్పాయి:

బొప్పాయిలో పాపెయిన్, మరియు ఖయమోపాపెయిన్ అనే ప్రత్యేక ఎంజైములు మాంసకృత్తులను జీర్ణం చేయడంలో ఎంతో సహాయకారిగా ఉంటాయి. బొప్పాయి ఆహారానికి సంబంధించిన విష పదార్ధాలను నిర్వీర్యం చేయడంలోనూ మరియు దీనిలో పుష్కలంగా ఉన్న జీర్ణ స్రావాల వలన జీర్ణ వ్యవస్థ మెరుగు పడడానికి ఎంతో సహాయకారిగా ఉంటుంది. దీనిలో ఆంటిఆక్సిడెంట్లు గా పనిచేసే విటమిన్లు  C మరియు E ఇంకా ఫోలిక్ ఆమ్లము ఉండడం వలన ఇది కోలన్ క్యాన్సర్ నివారణకు ఉపయోగ పడుతుంది.

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

                                           విటమిన్ శోషణం చేసుకొనడంలో చర్మపు పాత్ర

‘’సూర్యకాంతి విటమిన్’’ గా అనేక సందర్భాలలో పిలవబడే D విటమిన్ సూర్యకాంతి నుండి సమృద్ధిగా లభిస్తుంది. ఐతే సూర్య కిరణాలు నేరుగా ఈ విటమిన్ ను ఇవ్వవు. సూర్యకాంతి కి గురికాబడిన శరీరము లోనికి చొచ్చుకుపోయిన అతినీలలోహిత (అల్ట్రా వైలెట్) కిరణాలు  ఈ శక్తిని D విటమిన్ గా మారుస్తాయి. ఈ ప్రక్రియలో భాగం పంచుకునే లివరు మరియు మూత్రపిండాలు ఎంతో ప్రాధాన్యత గలిగిన కాల్సిట్రియోల్ హార్మోన్ ను తయారుచేస్తాయి.  

పోషక విలువలు:

 విటమిన్ కాల్సిట్రోయిల్ హార్మోన్ కు పూర్వగామిగా చెప్పవచ్చు. శరీరంలో కణముల తయారీ మరియు పెరుగుదల విషయంలో  ఈ హార్మోన్ కు ఎంతో ప్రాధాన్యత ఉందని ప్రస్తుత పరిశోధనలు నిర్ధారిస్తున్నాయి. ఇదే D విటమిన్ ను మిగతా విటమిన్ లకన్నా వేరుగా చూడడానికి కారణ మవుతున్నది. ఇది శరీరపు వ్యవస్థలకు ఇందనం లాగా పనిచేస్తుంది కానీ మిగతా విటమిన్లు ప్రక్రియా సూచికలుగా మాత్రమే ఉంటాయి. ఇది కొవ్వులో కరిగే విటమిన్ గా ఉంటూ అదనముగా ఉన్న విటమిన్ శరీరములోని కొవ్వు కణాలలో నిల్వ ఉంటుందే తప్ప మిగతా నీటిలో కరిగే C మరియు అనేక B విటమిన్ల మాదిరిగా మూత్రం వెంబడి బయటకు జారీ కాదు.

ప్రముఖ పాత్ర :

 విటమిన్ మన శరీరంలో అనేక ప్రాధమిక క్రియలు నిర్వర్తిస్తుంది. ముఖ్యంగా జీర్ణప్రక్రియ దశలో చిన్న ప్రేవులు తీసుకునే కాల్షియం స్థాయిని పెంచడములో ఇది ప్రముఖ పాత్ర వహిస్తుంది. D విటమిన్ లేకుండా, ఎముకల పెరుగుదల మరియు ఎముకల నిర్మాణము సాధ్యంకాదు. D విటమిన్ లోపము వలన పిల్లలలో రికెట్స్ వ్యాధి, పెద్దలలో ఆస్టియోమలాసియా, ఆస్టియోపోరోసిస్ (ఎముకల బోలుతనము, పెళుసుదనము) కలుగుతాయి. D విటమిన్ రక్తంలో కాల్షియం మరియు ఫాస్పరస్ స్థాయి నియంత్రించడానికి వాపులను నిరోధించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, జన్యుపరమైన వ్యవస్థ పటిస్టతకు ఉపయోగపడుతుంది.

 విటమిన్ కు ఆధారాలు:

సూర్యరశ్మి విటమిన్ D తయారీకి చక్కని మూలము. ఆహార ఉపఉత్పత్తుల యొక్క జాతీయ ఆరోగ్య పరిశోధనా సంస్థ నివేదిక ప్రకారము "290-315 నానోమీటర్ల తరంగ దైర్ఘ్యం కల అల్ట్రా వైలెట్ (UV) B రేడియేషన్ ఆచ్చాదన లేని శరీరములోనికి చొచ్చుకొని పోయి క్యుటేనియస్ 7- డీహైడ్రో కొలెస్ట్రాల్ ను D3 ప్రివిటమిన్ గానూ, తిరిగి అది D3 విటమిన్ గానూ మారుస్తుంది." సూర్యరశ్మి కాకుండా D విటమిన్ లభించే ఇతర మూలాలు సోఖియే సల్మాన్, కాడ్ లివర్ నూనె, బలవర్ధకమైన పాల ఉత్పత్తులు, పుట్టగొడుగులను  ఇతర ఉపఉత్పత్తులు గా తీసుకోవాలి ఎందుకంటే  D విటమిన్ ప్రకృతి సిద్ధంగా పెద్ద మొత్తాలలో లభించదు.

దీనిని ఎలా పొందవచ్చు:

మన శరీరంలో విటమిన్ D తయారికి కావలసిన UVB కిరణాలను పొందడానికి ఉత్తమమైన పధ్ధతి తగినంత కాలం సూర్యకిరణాలకు శరీరాన్ని గురిచేయడమే. ఐతే మరీ ఎక్కువసేపు ఉండడం వలన చర్మపు క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశం కూడా ఉంది. కొద్ది నిమిషాల పాటు శరీరాన్ని సూర్యకాంతి కి గురిచేయడం వలన UVB తాకిడికి కావలసినంత D విటమిన్ పొందేందుకు అవకాశము ఉంది. శ్యామల వర్ణము కలవారు తెల్లని రంగు కలవారికంటే ఎక్కువసేపు సూర్యకాంతి లో ఉండాలి కారణం ఏమిటంటే వారి శరీరంలో ఉన్న మెలోనిన్ శోషణ క్రియను తగ్గిస్తుంది. పరిశోధనా ఫలితాలు ఏం చెపుతున్నాయంటే పగలు 10 గంటల నుండి   3 గంటల వరకూ గల సమయంలో ఐదు నుండి 30 నిముషాల పాటు వారంలో రెండుసార్లు సూర్యకాంతి కి గురికావడం వలన శరీరానికి కావలసిన D విటమిన్ అందుతుంది. ఐతే చర్మపు క్యాన్సర్ కు గురయ్యే అవకాశం ఉన్నవారు, ఇంటికే పరిమితమైన వారు, వెలుగు రాని ప్రాంతంలో గడిపేవారు, ఉపాహారం రూపంలో ఈ విటమిన్ తీసుకొనడం ఉత్తమం.

శోషణ ప్రక్రియను నిరోధించేవి ఏవి:

ప్రదేశము, ఋతువు, బౌతిక అడ్డంకులు అల్ట్రా వైలెట్ కిరణాల శోషణను నిరోధిస్తాయి. మనం ధరించే దుస్తులు, సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ SPF15 కంటే ఎక్కువగా ఉన్న సన్ స్క్రీన్, కిటికీలకు వేసిన రంగులు, ఆకాశంలో మబ్బులు ఇవన్నీ కూడా సూర్యకాంతి నుండి D విటమిన్ తయారుచేసుకోవడానికి అవరోధం కలిగిస్తాయి. శ్యామల వర్ణము గలవారికి కూడా సూర్యకాంతి ఎక్కువ కావాలి ఎందుకంటే వారి చర్మములో అధిక మొత్తంలో ఉన్న మెలోనిన్ UVB కి బహిర్గతం కావడాన్ని తగ్గింస్తుంది.

www.livestrong.com/article/109767-skin-absorb-vitamin-d-sun/#ixzz20jZYHZLf

 

ఓం సాయి రామ్