Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

అదనంగా

Vol 2 సంచిక 6
November 2011


ఆరోగ్య చిట్కాలు

కండరాల నొప్పిని నయం చేసే అల్లం

అల్లం, వికారం, అజీర్ణం వంటి సమస్యలకు సాంప్రదాయక ఔషధంగా భారత మరియు చైనా దేశాలలో దీర్ఘకాలంగా ఉపయోగపడుతోంది. అంతే కాకుండా తీవ్ర వ్యాయామం తర్వాత కలిగే కండరాల నొప్పి మరియు పుండ్లను నయం చేయడానికి అల్లం సహాయపడుతుందని ఇప్పుడు శాస్త్రీయంగా నిరూపితమైంది. అల్లాన్ని ప్రతి రోజు తీసుకున్నట్లయితే కఠినమైన వ్యాయామం తర్వాత కలిగే నొప్పులు తగ్గుతాయని ఒక కొత్త అధ్యయనం చూపుతోంది.

జార్జియా విశ్వవిద్యాలయంలో పరిశోధకులు అల్లంను రోజువారి మోతాదులో తీసుకుంటే వ్యాయామానికి సంభందించిన నొప్పులను నిరిదించ గలదా లేదాయని అధ్యయనం చేసారు. ఈ అధ్యయనంలో భాగంగా, 34 వ్యక్తులున్న ఒక బృందం, రెండు గ్రాములు పచ్చి అల్లం నిండిన గుళికలు తీసుకోవడం జరిగింది: ఇది పౌష్టిక ఆహారపు దుకాణాల్లో లభించే 500 mg పచ్చి అల్లం గుళికలకు సమానం. 40 వ్యక్తులు పాల్గొన్న రెండవ బృందం, రెండు గ్రాములు వేడి చేసిన అల్లాన్ని తీసుకోవడం జరిగింది. వేడి చేసిన అల్లానికి నొప్పి నుండి ఉపశమనం కలిగించే లక్షణములు పెరగవచ్చని మునుపటి అధ్యయనాలు నిరూపించాయి. మూడవ బృందం ఉత్తుత్తిమాత్రలను (ప్లాసిబో) తీసుకుంది. ఈ అధ్యయనంలో పాల్పంచుకున్న వారందరు 11 రోజుల వరకు గుళికలను తీసుకోవడం జరిగింది -- కండరాల నొప్పి మరియు వాపు కలిగించే విధంగా తీవ్రమైన బరువులెత్తే కార్యక్రమానికి ఏడు రోజులు ముందు.

గుళికలు తీసుకున్న 11 రోజుల తర్వాత, పాల్గొన్న వారందరిలో పలు వేర్వేరు చరరాశుల కొలత జరుపబడింది : కృషి, నొప్పి తీవ్రత, బలం, వాపు మరియు చలనపు పరిధి వంటివి. ప్రతిరోజు పచ్చి అల్లపు గుళికలను తీసుకున్న బృందంవారు ప్లాసిబో బృందం కంటే 25 శాతం తక్కువ నొప్పిని అనుభవించారు మరియు ప్రతిరోజు వేడి అల్లాన్ని తీసుకున్న బృందం వారు ప్లాసిబో బృందం కంటే 23 శాతం తక్కువ నొప్పిని అనుభవించారు.

పరిశోధన నడిపించిన పాట్రిక్ ఓ కానర్, పీహెచ్డీ, ఈ అధ్యయనం పూర్తయ్యాక ఈ విధంగా వివరించారు: అల్లం ఆస్పిరిన్, ఇబూప్రోఫెన్ వంటి స్టెరాయిడ్కాని, యాంటీ ఇన్ఫ్లమేటరీ మందుల (NSAID లు) వలె పని చేయడంతో పాటు అల్లం ఈ మందుల వలె కాకుండా, పరిధీయ నరాలలో నొప్పి గ్రాహకతను తగ్గించి, శరీరంలో తాపజనకమైన రసాయనాల ఉత్పత్తిని కూడా తగ్గిస్తుంది. పైగా ఈ గుళికలు తీసుకున్న వారికి ఇబుప్రోఫెన్ మరియు నాప్రొక్షెన్ వంటి మందులను తీసుకున్న వారి కంటే నొప్పి నుండి అధిక ఉపశమనం కలిగిందని మరియు అల్లోపతి మందుల కారణంగా కలిగే కడుపు సంభందించిన సమస్యలు ఏవి కూడా వీళ్ళకి కలగలేదు. ఈ ఫలితాలు "ది జర్నల్ అఫ్ పయిన్" సెప్టెంబర్ 2010 సంచికలో ప్రచురింపబడినాయి.

మీరు ప్రయత్నించాలని అనుకుంటే, మీరు తీవ్ర వ్యాయాయం చేయడానికి కొన్ని రోజుల ముందు నుండి 5 శాతం అల్లం నిండియున్న అల్లం గుళికలను కొని, రోజుకి ఒక రెండు గ్రాముల గుళికలను తీసుకోవడం ప్రారంభించండి. మీకు అల్లం యొక్క రుచి ఇష్టముంటే కనుక, రోజు ఒక చెంచా అల్లం పొడి లేదా సగం చెంచా అల్లం రసం లేదా ఒక గరిటెడు సన్నగా తరిగిన తాజా అల్లం ముక్కలను తీసుకోవచ్చు. 

జుట్టు ఎందుకు నెరిసిపోతుంది?

వయసు పెరుగుతున్న కొద్ది జుట్టు ఎందుకు నెరిసి పోతుందని మరియు దాన్ని నిరోధించదానికి లేదా కనీసం దాని వేగం తగ్గించడానికి చేయవలసింది ఏమైనా ఉందాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? జుట్టు నెరిసి పోవడానికి కొన్ని కారకాలు క్రింది ఇవ్వబడినాయి.

మీరు ఏ వయసులో ఉన్నప్పుడు మీ జుట్టు నెరవడం ప్రారంభం అవుతుందన్నది (మీ జుట్టు ఊడిపోకుండా ఉన్న సంధర్బంలో) జన్యుశాస్త్రం  ద్వారా నిర్ణయించబడుతుంది. బహుశా మీ తల్లిదండ్రులు మరియు తాతామామలకు జుట్టు నెరిసిన అదే వయసులోనే మీకు కూడా నెరవవచ్చు. అయితే జుట్టు నెరిసే వేగాన్ని తగ్గించడం కొంత వరకు మన చేతుల్లో ఉంది. ధూమపానం నెరిసే వేగాన్ని పెంచుతుంది.  రక్తహీనత, సాధారణంగా పౌష్టిక ఆహారం తీసుకోక పోవడం, B విటమిన్లు తక్కువగా ఉండడం మరియు చికిత్స చేయని థైరాయిడ్ సమస్యలు వంటి కారణాల వల్ల కూడా జుట్టు నేరిసిపోయే వేగం పెరుగుతుంది. మీ జుట్టు యొక్క రంగు మారడానికి కారణం ఏమిటి? సూర్యకాంతి ప్రభావంతో చర్మం కంధడానికి కారణమైన వర్ణద్రవ్యం పేరు మెలనిన్. జుట్టు రంగు మార్పు కూడా ఇదే వర్ణద్రవ్యం యొక్క ఉత్పత్తి పై ఆధారపడియుంది.

ప్రతియొక్క రోమకూపములోను మెలానోసైట్స్ అను వర్ణధ్రవ్య కణాలుంటాయి. మెలానోసైట్లు యుమేలానిన్ అను నల్ల రంగు లేదా ముదూరు గోధుమ రంగుగల ఒక వర్ణద్రవ్యాన్ని మరియు ఎరుపు-పసుపు రంగుగల ఫియోమెలానిన్ ను ఉత్పత్తి చేసి, మెలానిన్ ను జుట్టులో ఉండే ప్రధాన ప్రోటీనైన కేరాటిన్ ను ఉత్పత్తి చేసే కణాలకు అందచేస్తాయి. కేరాటిన్ ఉత్పత్తి చేసే కణాలు నశించినప్పుడు, మెలానిన్ యొక్క రంగు మాత్రం వీటిలో నిలచియుంటుంది. మీ తలవెంట్రుకలు నెరవడం మొదలయినప్పుడు మెలానోసైట్లు ఉన్నప్పటికీ, వాటి క్రియాశీలత తగ్గుతుంది. తల వెంట్రుకలలో వర్ణధ్రవ్యం తక్కువగా నిక్షిప్తమవుతుంది. దీని కారణంగా జుట్టు రంగు మారుతుంది. క్రమంగా నల్ల రంగుకు కారణమైన మెలానోసైట్లు నశించి, జుట్టు పూర్తిగా నెరిసిపోతుంది.

వృద్ధాప్య ప్రక్రియలో ఇది ఒక సాధారణ మరియు అనివార్యమైన భాగం మరియు ఇది ఏ ఒక్క వ్యాధికి సంభందించింది కాదు. కాని కొన్ని ఆటో ఇమ్మ్యూన్ వ్యాధుల కారణంగా జుట్టు వేగంగా నెరిసే అవకాశముంది. అయితే కొంతమందికి ఇరవై సంవత్సరాల వయసులోనే జుట్టు నెరిసిపోతుంది. తీవ్ర ఒత్తిడి లేదా దిగులు కారణాలగా కూడా జుట్టు నెరిసే అవకాశముంది.....ఏన్ని మేరీ హెల్మెన్స్టైన్, Ph.D. About.com 

Om Sai Ram