Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ఆరోగ్య చిట్కాలు

Vol 2 సంచిక 4
July 2011


మొబైల్ ఫోను కలిగించే ప్రమాదాలు

మొబైల్ లేదా సెల్ ఫోన్లు మన దైనందిన జీవితాలలో భాగంగా మారిపోయాయి. కనుక వీటిని ఉపయోగించడం ద్వారా కలిగే ప్రమాదాలేమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మొబైల్ ఫోనును అధికంగా ఉపయోగించే వారు క్రింది విషయాలు తెలుసుకోవటం అత్యవసరం.

నిజానికి మొబైల్ అన్నది ఒక ద్విమార్గములొ సూక్ష్మతరంగాలను ప్రసరించే రేడియో. ఇది నిరంతరం యాంటెన్నాల ద్వారా సంకేతాలను అందుకుంటూ మరియు పంపుతూ ఉంటుంది. ఇది మీ వద్ద ఉన్నప్పుడు లేదా మీరు ఉపయోగిస్తున్నప్పుడు, దీని యొక్క యాంటెన్నాల ద్వారా వచ్చే సంకేతాలు మీ శరీరం లోపలి నుండి, సమీపంలోనున్న టవర్ను చేరుతాయి. దీనికి అర్థం మన శరీరాలు నిరంతరం వికిరణాలను ఎదుర్కుంటున్నాయి. మొబైల్ను చెవి దెగ్గర పెట్టుకొని మాట్లాడినప్పుడు, మన మెదడులో అనేక మార్పులు ఏర్పడతాయి. ఈ సంకేతాలు మెదడుకు హాని కలిగిస్తాయన్న విషయాన్ని పరిశోధకులు ఎవరికీ తెలియ చేయటం లేదు.  

2011 మేలో, దాదాపు ఏకగ్రీవ నిర్ణయంతో, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) యొక్క సలహాదారులైన 31 నిపుణులు, ప్రపంచంలోనున్న ఐదు బిలియన్ మొబైల్ ఫోన్ వినియోగదారులు ఆశ్చర్యపోయే విధంగా, రేడియో తరంగాలు మరియు విద్యుదయస్కాంత వికిరణం, మెదడు క్యాన్సర్ కు ఒక "సాధ్యమైన కారణం" అని ప్రకటించింది. యంత్ర శూన్యికరణం, కొన్ని పురుగుమందులు, సీసం, కాఫీ మరియు అసాధారణంగా సంరక్షించబడిన కూరగాయలు వంటి కాన్సర్ కారకులతో పాటు సూక్ష్మతరంగ వికిరణం చేరింది. (సంపాదకుడు: వికిరణం వైబ్రో గోలీలలోనున్న వైబ్రేషన్లను నాశనం చేస్తుందని మనకు తెలిసిన విషయమే)

మొబైల్ ఫోన్లు కలిగించే ప్రమాదాల నుండి సురక్షితంగా ఉండడానికి కొన్ని సూచనలు:

1. మొబైల్ ఫోనులో "టెక్స్ట్ మెసేజ్ " పంపడం సురక్షితమైనది. మొబైల్ ఫోను లో మాట్లాడ రాదూ.

2. ఒక వేళ మొబైల్ ఫోనులో మాట్లాడే సందర్భం వస్తే కనుక, చెవి ఫోన్లను లేదా మైక్రో ఫోన్ను ఉపయోగించండి.

3. మొబైల్ ఫోనులో మీ సంభాషణలు సంక్షిప్తంగా ఉంటే మంచిది. దీర్ఘ సంభాషణలు చేయవలసి వచ్చినప్పుడు లాండ్లైన్ ఫోన్లను     ఉపయోగించవలెను.

4. మొబైల్ ఫోన్ల వలె వికిరణ ప్రమాదం అధికంగా ఉండే కార్డ్ లెస్ లాండ్లైన్ ఫోన్లను ఉపయోగించ రాదూ.

   పర్యావరణ ఆరోగ్య సంస్థ వెబ్సైట్ www.ehtrust.org వద్ద మీరు మొబైల్ ఫోన్ల పై మరిన్ని సమాచారాలు తెలుసుకోవచ్చు.

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

ఆరోగ్యానికి మరిన్ని రసాలు మరియు పండ్లు- కూరగాయిల సమన్వయాలు

సాయి వైబ్రియానిక్స్ యొక్క మే-జూన్ సంచికలో చేసిన వాగ్దానం ప్రకారం, ఇక్కడ మరిన్ని రసాల మరియు స్మూతీల తయారి విధానాలు ఇస్తున్నాము. ఉష్ణప్రదేశాలలో, ఈ సమయంలో సమృద్ధిగా లభించే అత్యంత రుచికరమైన మామిడి పండుతో ప్రారంభిద్ధాము.

పుచ్చకాయ మరియు మామిడిపండ్ల సమన్వయము

ఒలిచిన మరియు టెంక తీసిన ఒక మామిడి పండు, ఒలిచిన మరియు గింజలు తీసిన ఒక కస్తూరికరుబూజా పండు. వీటిని ఒక బ్లెన్డెర్ లో వేసి తిప్పాలి.

ఉదయం వేళలో ఈ అద్భుతమైన రసం యొక్క సువాసన నిద్దురమత్తును తొలగించి, శరీరంలో రక్త ప్రసరణను మేరుగుపర్చుతుంది.ఈ రసం త్రాగటం  ద్వారా మనకు ఒక రోజుకి అవసరమైన A మరియు C విటమిన్లు  లభిస్తాయి. అనేక శాతాభ్దాలుగా మూత్రవిసర్జన సక్రమముగా ఉండడానికి ఉపయోగపడే కర్భూజా పండు, ఉదయాన్న ఉండే ఉబ్భుధలను తొలగిస్తుంది. ఈ పండులో అడినోసిన్ అను ఒక పదార్థం రక్తం గడ్డకట్టడం మరియు గుండె దాడులు వంటి ప్రమాదాలను తగ్గించడానికి ఉపయోగ పడుతుంది. తక్షణ శక్తినిచ్చే మామిడి పండును గత 400 సంవత్సరాలుగా సాగుచేయటం జరుగుతోంది. ఈ రెండు పండ్లు రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి. ఈ రసాన్ని వేగంగానూ మరియు సులభంగాను తయారు చేసుకోవచ్చు. తాజాతనాన్ని అందచేసే ఈ చల్లటి పానీయం, మీ జీవక్రియ సరైన రీతిలో ప్రారంభం కావడానికి ఉపయోగపడుతుంది మరియు ఉదయ వేళలో ఉండే సోమరితనాన్ని తొలగిస్తుంది. ఈ రసాన్ని ఒక గ్లాసుడు త్రాగటం ద్వారా మీకు ఒక రోజుకి కావల్సిన శక్తి లభిస్తుంది!

బ్లూ పాషన్

గింజలు తీసిన మూడు పాషన్ పండ్లు, ఒలిచిన, గింజలు తీసిన ఒక కర్భూజా పండు మరియు ఒక  మామిడిపండు, ఫాల్ సా పండ్లు (బ్లూ బెర్రీలు). వీటిని ఒక బ్లెన్డెర్ లో వేసి తిప్పి పలచగా చేసుకోవాలి.

ఈ రసం, A, B, C మరియు E విటమిన్లు, పోటాశియుం, కాల్శియుం మరియు కేరోటినాయిడ్లు గల ఒక  బలవర్ధకౌషధము. ఇది క్యాన్సర్లు మరియు ఇతర ప్రమాదకరమైన వ్యాదులనుండి రక్షిస్తుంది. ఇది కళ్ళకు కూడా మంచిది. ఈ రసం చూడడానికి మాత్రమే కాదు, త్రాగడానికి కూడా భాగుంటుంది.

ఉత్తేజమును కలిగించే అద్భుతమైన రసం

కడిగి, ఒలవని (సేంద్రియ), గింజలు తీసిన రెండు ఆపిల్ పండ్లు

ఒలవని రెండు పెద్ద కేరట్లు (సేంద్రియ)

రెండు టమాటాలు, ఒక ఒలవని కివి పండు, గుప్పెడు కడిగిన వాటర్ క్రేస్స్, ఒక గుప్పెడు కడిగిన పాలకూర. వీటినన్నిటిని బ్లెన్డెర్ లో వేసి తిప్పి, పల్చగా చేసుకోవాలి.

ఆరోగ్యాన్ని మెరుగు పరచే ఈ రసాన్ని వారానికి ఒకటి లేదా రెండు సార్లు తీసుకోవడం మంచిది. ఈ రసం మీరు ఒత్తిడి కలిగియున్న సమయంలో మీ శరీరం మరియు మెదడుకు మద్దుతును అందించి మీలో ఉత్తేజమును కలుగచేస్తుంది. ఈ రసంలో విటమిన్లు A మరియు C, బీటా కెరోటిన్, పోటాశియుం, మేగ్నిశియుం, జింక్ , ఐరన్ మరియు కాల్శియుం వంటి పోషక విలువలు ఉంటాయి. ఆపిల్ పండు మరియు వాటర్ క్రేస్స్ , జలుబు మరియు ఫ్లూ జ్వరాల నుండి రక్షించడానికి సహాయపడుతుంది.

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

 మీరు పండ్లచక్కెర (ఫ్రక్టోజ్ )గురించి చింతిస్తున్నారా?

సాధారణంగా ఒక స్వీటెనర్గా ఉపయోగపడే పండ్లచక్కెర (ఫ్రక్టోజ్) శరీరంలో క్యాన్సర్ యొక్క పెరుగుదలకు తోడ్పడే అవకాశముందని UCLA కు చెందిన శాస్త్రవేత్తలచే నిర్వహించ బడిన ఒక అధ్యయనం హెచ్చరిస్తోంది. ఈ అధ్యయనం లో, పండ్ల చక్కెర తో "పోషించ" బడిన వృక్వ కణాలు మరింత వేగంగా పెరిగినట్టు కనుగొనబడింది.

స్వీటేనర్గా ఉపయోగపడే ఈ పండ్ల చక్కెర ఇతర క్యాన్సర్ల యొక్క పెరుగుదలకు కూడా తోడ్పడుతుందని, ఈ అధ్యయనానికి కార్యకర్త మరియు ఈ విశ్వవిద్యాలయం యొక్క క్యాన్సర్ కేంద్రంలో, మెడిసిన్ మరియు న్యూరోసర్జరీ విభాగంలో సహాచార్యులైన  డా. అన్తోనీహేనీచెప్పారు.

శుద్ధి చేయబడిన చక్కెర మరియు పండ్ల చక్కెర కలిగించే హానీల పై, డా.హేనీ ఈ విధంగా వ్రాస్తున్నారు: "ఆధునిక ఆహార పదార్థాలలో శుద్ధి చేయబడ్డ చక్కెర అధికంగా ఉందన్నది గుర్తుంచుకోవల్సిన విషయం. దీని కారణంగా స్థూలకాయం, మధుమేహం మరియు కొవ్వుతో నిండిన కాలేయం మొదలైన ఆధునిక వ్యాధులు వచ్చే ప్రమాదముంది."

హేని అమెరికాలో హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ (HFCS ) యొక్క వినియోగాన్ని తగ్గించడానికి, తగిన చర్యలను తీసుకోవలసిందిగా అమెరిక ప్రభుత్వాన్ని  కోరారు. హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్, పాశ్చాత్య ఆహారంలో ఫ్రక్టోజ్ యొక్క ప్రధాన మూలం. పళ్ళు, కూరగాయలు మరియు చక్కెర వంటి ఇతర ఆహార పదార్థాల్లోను ఫ్రక్టోజ్ ఉంటుంది. ప్రజలకు ఉపయోగపడే అనేక ఆరోగ్య సూచనలు ఈ అధ్యయనంలో ఉన్నాయని హేని చెప్పారు.

అయితే కార్న్ రిఫైనర్ల సంఘము, మానవ శరీరంలో కాకుండా ఒక ప్రయోగశాలలో జరపబడిన ఈ పరిశోధనను నిరాకరించి, వృక్వము క్యాన్సర్ యొక్క మూలకారణాలు క్లిష్టంగా ఉంటాయని మరియు వాటిని పూర్తిగా అర్థంచేసుకోవడం కష్టమని, ఒక ప్రకటనలో తెలిపారు.

1970 మరియు 1990 ల మధ్య, హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్పు యొక్క వినియోగం 1000 శాతం పెరిగిందని క్యాన్సర్ పరిశోధకులు తెలిపారు. ఫ్రక్టోజ్ మరియు గ్లూకోజ్ యొక్క మిశ్రమమైన ఈ స్వీటేనర్ అనేక రకాల ఆహారాలలోను మరియు పానీయాలలోను (సాఫ్ట్ డ్రింకులు) ఉంది.

అమెరిక ఆహారంలో, ఇప్పటికి, ఫ్రక్టోజ్ యొక్క అత్యంత సాధారణమైన రూపంగా, చక్కెరను, ఉపయోగిస్తున్నట్లు ఈ సంఘం తెలిపింది. హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ యొక్క స్తానంలో చక్కెరను ఉపయోగించిన ఉత్పాదితాలను కొని మోసపోవద్దని, వీటిలో కూడా ఫ్రక్టోజ్ యొక్క స్థాయి అధికంగానే ఉంటుందని ఈ సంఘం హెచ్చరించింది.  మూలం:www.cbsnews.com  

సంపాదకుడుపానీయాల సీసాలపై మరియు ఆహార పోట్లాలపై (పాకేజ్డ్ ఫుడ్) ఉన్న పట్టీ వివరాలను చదవడం చాలా అవసరమని మీకు సిఫార్సు చేస్తున్నాము. అనేక దేశాలలో ఉత్పాదకులు ఫ్రక్టోజ్ ను ఉపయోగించడం జరుగుతోంది.