ఆరోగ్య చిట్కాలు
Vol 2 సంచిక 3
May 2011
ఊపిరి
ధ్యానం చేస్తున్న సమయంలో, మన దృష్టిని శ్వాస పైనుంచాలని మనందరికీ తెలిసిన విషయమే. తీసుకున్న ఊపిరి, కేవలం ఊపిరితిత్తులకు పరిమితం కాకుండా, ఉదరం వరకు చేరాలని మనకి చెప్పబడింది.
ఆరోగ్యానికి ఇది శ్రేయస్కరమని ఇప్పుడు కనుగొన్నాము. రాబర్ట్ ఫ్రైడ్ చే వ్రాయబడిన "బ్రీథ్ వెల్, బీ వెల్" పుస్తకంలో, చాలా మంది తీసుకొనే శ్వాస గాడమైనదిగా ఉండడంలేదని చెప్పబడియుంది. దీనికారణంగా, రక్తంలో ఉన్న కార్బన్ డై ఆక్సైడ్ యొక్క స్థాయిలో అసమతౌల్యం ఏర్పడి, చేతుల్లో జలదరింపు, తల తిరగడం, బలహీనత, అలసట, తరచుగా ఆవలించడం, మలబద్ధకం, నిద్ర పట్టక పోవడం, చిరాకు వంటి లక్షణాలు కనపడుతూ ఉంటాయి. సరైన రీతిలో శ్వాసను తీసుకోవడం కారణంగా, రక్తపోటు, ఆస్తమా మరియు మైగ్రేన్ తలనొప్పి వంటి దీర్గ కాలిక అనారోగ్య సమస్యలు మెరుగుపడతాయి. ఊపిరి తీసుకుంటున్న ప్రతిసారి, ఒక శిశువు యొక్క పొట్ట నెమ్మదిగా పైకి లేచి మరియు శ్వాస వదులుతున్న సమయంలో పొట్ట నెమ్మదిగా కిందకి దిగడం మీరు గమనించే ఉంటారు. ఈ విధంగా శ్వాసను తీసుకోవడం సరైన పద్ధతని రాబర్ట్ ఫ్రైడ్ చెబుతున్నారు. రాబర్ట్ ఫ్రైడ్ చే చెప్పబడిన ఒక వ్యాయామం, ఈ క్రింద ఇవ్వబడింది :
మీ శరీరం తలకిందులుగా ఉన్న ఒక మందు చుక్కలు వేసే పరికరం అని ఊహించుకోండి. ఈ పరికరం యొక్క రంద్రం మీ ముక్కుగాను మరియు దాని యొక్క బల్బు మీ ఉదర భాగంగాను ఊహించుకోండి. మీ ఉదర భాగంపై చేతులు పెట్టి, ఊపిరి తీసుకోండి. ఊపిరి తీసుకుంటున్న సమయంలో, చుక్కలు వేసే పరికరం యొక్క బల్బు విస్తరించే విధంగా, మీ ఉదర భాగం విస్తరిస్తున్నట్లు ఊహించుకోండి. ఆపై పరికరం యొక్క బల్బును గట్టిగా నొక్కినట్లు, మీ ఉదర కండరాలను కట్టడి చేస్తూ, ఊపిరిని వదలండి.
ఈ ఉదర శ్వాస సాధనను ప్రతిరోజు చేయడంతో, రెండు వారాల లోపు ఆరోగ్యం మేరుగుపడుతందని గమనిస్తారు. ఉదరం నుండి ఊపిరిని తీసుకోవడమే ఈ సాధన యొక్క గమ్యం. దీని కారణంగా మీరు చేసే ధ్యానం మరింత మెరుగుపడవచ్చు!
మూలం: రాబర్ట్ ఫ్రైడ్, న్యు యార్క్ హంటర్ కాలేజ్ లో బయో ఫిసియోలోజి మరియు బిహేవియరల్ న్యూరో సైన్స్ లో ప్రోఫ్ఫేసర్ మరియు బ్రీథ్ వెల్, బీ వెల్ అను ఒక కార్యక్రమానికి కర్త. ఒత్తిడి, ఆందోళన, ఆస్తమా, రక్తపోటు, మైగ్రేన్ మరియు ఇతర రుగ్మతల నుండి ఉపశమనం కొరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతోంది..
మంచి ఆరోగ్యం కొరకు రసాలు మరియు పండ్లు-కూరల సమన్వయ పానీయాలు
వేసవి కాలంలో రసాలు, పళ్ళుకూరల సమన్వయాలు(స్మూతీలు) వంటి చల్లని పానీయాలను ఎక్కువగా తీసుకోవాలని అనిపిస్తుంది. ఈ పానీయాలను ఆరొగ్యకరమైనవిగా తయారు చేసుకుంటే ఎంత భాగుంటుంది? పాట్ క్రాకేర్ వ్రాసిన "స్మూతీస్ బైబిల్" పుస్తకంలో ఇవ్వబడిన స్మూతీల తయారి విధానం: ఈ క్రింది పదార్థాలలో ఏదైనా ఒకటి అర కప్పు తీసుకోవాలి : పళ్ళ రసాలు, పాలు, పెరుగు లేదా టమాటాలు, కేరట్లు, బీట్రూట్లు లేదా కీరా ముక్కల నుండి తీసిన రసం లేదా గ్రీన్ టీ మరియు హెర్బల్ టీను కూడా ఉపయోగించవచ్చు. ఈ రసంలో, రెండు లేదా మూడు రకాల పళ్ళు లేదా కూరగాయలను చేర్చుకోవాలి. నాణ్యత గల పళ్ళు మరియు కూరగాయలను ఎన్నుకోవడం చాలా ముఖ్యమని రచయిత చెబుతున్నారు. దానిమ్మ (పీచు మరియు అంటియోక్సిడేంట్లు ఎక్కువగా ఉన్న గింజలుతో సహా), బ్లూబెర్రీలు, బ్లేక్ కరంట్లు, స్ట్రాబెర్రీలు వంటి పౌష్టిక విలువలు అధికంగా ఉన్న పండ్లను ఉపయోగిస్తే మంచిది. పైనాపిల్, మామిడి, కివీలు వంటి చక్కర అధికంగా ఉన్న పండ్లను ఉపయోగించే సమయంలో, ఆపిలు, పుచ్చకాయ లేదా స్ట్రాబెర్రీలు వంటి తక్కువ చక్కర ఉన్న పండ్లను చేర్చడం మంచిది.
ఇటువంటి ఆరోగ్యకరమైన పానీయాలను తయారు చేయడానికి ఎల్లప్పుడూ ఒక బ్లెండర్ ని ఉపయోగించడం మంచిది. బ్లెండర్ ను ఉపయోగించడం ద్వారా పండ్లలో మరియు కూరగాయిలలో ఉన్న పీచు పదార్థాలు మరియు ఇతర పౌష్టిక విలువలున్న పదార్థాలు నిలిచియుంటాయి.
ముందుగా పళ్ళు కూరల సమన్వయము (స్మూతీ) యొక్క తయారికి ఎన్నుకున్న పళ్ళను మరియు కూరగాయిలను స్వచ్చమైన నీటితో శుబ్రంగా కడగాలి. బ్లెన్డర్ను ఉపయోగించే ముందుగా, దానిలో కొన్ని నీళ్ళు పొయ్యడం మంచిది. ఆపై తరిగిన పళ్ళ మరియు కూరగాయిల ముక్కలను ( కావాలంటే వీటితో పాటు ఐసు కూడా వేసుకోవచ్చు) వేసుకొని బ్లెన్డర్ను స్టార్ట్ చేయాలి. బ్లెన్డర్ను ముందుగా 10 నుండి 30 సెకన్లు వరకు తక్కువ సెట్టింగ్లో పెట్టుకోవాలి, ఆపై ఎక్కువ సెట్టింగ్లోకి పెంచి మరో 10 నుండి 30 సెకన్లు వరకు ఉంచవచ్చు. ఈ విధంగా తయారు చేయబడిన సమన్వయము ఎక్కువ తీయగా ఉందనిపిస్తే, కొద్దిగా నిమ్మ రసం చేర్చవచ్చు. లేదా ఎక్కువ పుల్లగా అనిపిస్తే అరిటిపండు, ద్రాక్ష పండ్లు, ఎండు కజ్జూరం, ఆప్రికాట్ వంటి పళ్ళ ముక్కలను చేర్చవచ్చు.
మరో రెండు రకాల స్మూతీలు తయారి విధానం: తోలు తీయని రెండు ఆపిలు పళ్ళ ముక్కలు, 350 గ్రాములు చెర్రీ పళ్ళు ( గింజలు తీసినవి). ఈ రసం విటమిన్ C, కారోటినాయిడ్స్, ఫోలిక్ ఆసిడ్, పోటాశియుం వంటి పౌష్టిక పదార్థాలు కలది మరియు చర్మానికి మంచిది. నాలుగు క్యారెట్లు (తొక్కతో పాటు); ఒక ఆపిల్ పండు (తొక్కతో పాటు), ఒక కివి పండు (తొక్కతీసినది), పార్స్లీ కొమ్మలు (కొతిమిరివంటి వొక కూరాకు) ఒక గుప్పెడి. విటమిన్లు A, C, E, B మరియు పోటాశియుం నిండుగా ఉన్న ఈ స్మూతీను ప్రొద్దున పూట త్రాగడం మీ ఆరోగ్యానికి ఎంతో మంచిది.
మీరు ఆస్వాదించడం కోసం మరొక ఆరోగ్యకరమైన పానీయం. తొక్క తీయని బీట్రూట్, కారెట్ మరియు ఆపిల్ ను ముక్కలుగా చేసుకొని, స్వచ్చమైన నీరు కలిపి, బ్లెన్డర్లో వేసి తిప్పుకోవాలి. ఈ రసాన్ని వెంటనే త్రాగితే మంచిది. ఈ పానీయంలో కొద్దిగా నిమ్మ రసాన్ని చేర్చుకుంటే మరింత రుచికరంగా ఉంటుంది. ఈ రసాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉన్నవారికి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పచ్చి కూరగాయిలలో మరియు పండ్లలో ఉన్న పోషకాలు, మన కంటిచూపు, జీర్ణక్రియ మరియు విసర్జన క్రియలు మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. ఈ రసాన్ని, ఉదయాన్నే, ఖాళి కడుపున తీసుకోవడం శ్రేష్టమైనది. ఈ రసాన్ని రోజుకి రెండు సార్లు తీసుకోవడం ద్వారా మీ ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది.
సాయి వైబ్రియానిక్స్ యొక్క తరువాతి సంచికలో ఆరోగ్యకరమైన రసాల పై, మరికొన్ని సలహాలను మీకు అందచేస్తాము.