Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

Vol 13 సంచిక 2
మార్చ్ / ఎప్రిల్ 2022
అవలోకనం

డా. జిత్ కె అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా, డాక్టర్ అగర్వాల్ వైబ్రియోనిక్స్ సేవలు మరియు చికిత్సలు మహమ్మారి కాలంలో మన వెబ్‌సైట్, వినూత్నమైన నెట్‌వర్కింగ్ (పరస్పర అనుసంధానం), యెస్ యెస్ యెస్ ఒ (SSSSO) సహకారం, అలాగే ప్రాక్టీషనర్ల చురుకైన కృషి మరియు అంకితభావం వల్ల ఎలా విస్తరించాయో వివరిస్తున్నారు. అలాగే ఇబి యొక్క ప్రభావవంతమైన ఫలితాలు, దానికి పెరుగుతున్న ఆదరణ, అలాగే ప్రతి రోగికి మరింత ప్రేమ మరియు ఆప్యాయతతో చికిత్స అందించాల్సిన అవసరాన్ని కూడా ఆయన నొక్కి చెబుతున్నారు.

పూర్తి వ్యాసం చదవండి

దృష్టాంత చరిత్రలు

ఈ సంచికలో 12 ఆసక్తికరమైన కేసులు పంచుకోబడ్డాయి: మద్యం మరియు మాదకద్రవ్యాల వ్యసనం; కాళ్ల నరాల నొప్పి; మైగ్రేన్; ఆహార అలర్జీ; కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ (మణికట్టు నరాల ఒత్తిడి సిండ్రోమ్); ఛాతీ నొప్పి; హైపర్‌హైడ్రోసిస్ (అధిక చెమట పట్టడం); బహిష్టు ఆలస్యంగా రావడం / పాలీసిస్టిక్ ఓవరీ వ్యాధి; కోవిడ్-19 అనంతర నిద్ర సంబంధిత రుగ్మత, డిమెన్షియా మందుల దుష్ప్రభావాలు; భయం; క్రిమి కాటు వల్ల అలర్జీ; ఉప్పు ఎక్కువగా తినాలనే కోరిక.

దృష్టాంతములు చదవండి

సాధకుని వివరములు

ఈ సంచికలో ఇద్దరు అంకితభావం కలిగిన ప్రాక్టీషనర్లను పరిచయం చేస్తున్నాము. మొదటి ప్రాక్టీషనర్ గ్రీస్కు చెందినవారు. వైబ్రియోనిక్స్ యొక్క అద్భుతమైన ఫలితాలను స్వయంగా అనుభవించిన తరువాత ప్రాక్టీషనర్‌గా మారారు. రోగులకు అత్యంత ప్రేమతో, శ్రద్ధతో చికిత్స అందించడమే కాకుండా, వార్తాలేఖలును గ్రీక్ భాషలోకి అనువదించే సేవ కూడా చేస్తున్నారు. రెండవ ప్రాక్టీషనర్ భారతదేశానికి చెందినవారు. గత రెండు సంవత్సరాల వైబ్రియోనిక్స్ సేవలో అనేక అద్భుతమైన స్వస్థతలను ప్రత్యక్షంగా చూసారు. అంతేకాకుండా, పరిపాలనా బృందంలో చురుకైన సభ్యునిగా కూడా సేవలందిస్తున్నారు.

సాధకుని వివరములు చదవండి

ప్రశ్నలు జవాబులు

తెలుసుకోవడానికి చదవండి: మద్యంలోని వైబ్రేషన్స్ ను ఎలా తటస్థీకరించాలి? కుటుంబంలో తరతరాలుగా వస్తున్న వ్యాధులకు నివారణ మోతాదు ఎలా ఇవ్వాలి? ఇబి రెమెడీని తెల్లవారుజామున తీసుకోవాలని సూచించడానికి కారణం ఏమిటి? నవజాత శిశువుకి ఇవ్వగల రెమెడీలు ఏమిటి?

పూర్తి వ్యాసం చదవండి

దివ్య వైద్యుని దివ్యవాణి

స్వామి ప్రేమపూర్వకంగా మనకు నాలుకను అదుపులో ఉంచుకోవడం, ఆహారపు అలవాట్లను నియంత్రించడం, అలాగే మానవ సేవే మాధవ సేవ అనే భావంతో సేవ చేయడం గురించి మార్గనిర్దేశం చేస్తున్నారు.

పూర్తి వ్యాసం చదవండి

ప్రకటనలు

భారతదేశం, ఫ్రాన్స్, మరియు అమెరికా లో జరగబోయే శిక్షణా శిబిరాలు.

పూర్తి వ్యాసం చదవండి

అదనంగా

మీ రోగనిరోధక శక్తిని తెలుసుకోండి మరియు పెంపొందించుకోండి అనే ఆరోగ్య వ్యాసంలో రోగనిరోధక శక్తి అంటే ఏమిటి, దాని రకాలు, రోగనిరోధక వ్యవస్థ నిర్మాణం, పనితీరు, దానికి సంబంధించిన రుగ్మతలు, అలాగే రోగనిరోధక వ్యవస్థను సమతుల్యంగా ఉంచుకోవడానికి అవసరమైన మార్గాలను వివరించారు. ఆంధ్రప్రదేశ్ తెలుగు వర్క్‌షాప్ చిత్రాలు, అలాగే కొత్తగా అర్హత పొందిన ఆంధ్రప్రదేశ్ మరియు ఇతర ప్రాక్టీషనర్లు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలలో ఇబి రెమెడీలను పంపిణీ చేసిన కార్యక్రమాల చిత్రాలు. ఫ్రెంచ్ భాషలో నిర్వహిస్తున్న నెలవారీ సమావేశాల విశేషాలు. విశ్వాసం ద్వారా జరిగిన అద్భుతమైన స్వస్థతను వివరించే రెండు ఆసక్తికరమైన అనెక్డోట్స్ (స్ఫూర్తిదాయక సంఘటనలు), అలాగే వైబ్రియోనిక్స్ ఎలా ఒక కొత్త ప్రాక్టీషనర్‌ను తీవ్రమైన నొప్పి నుండి కాపాడి, చిన్ననాటి నుండి ఉన్న దీర్ఘకాలిక వ్యాధిని వేగంగా నయం చేసిందో తెలిపే అనుభవాలు. జీవితాంతం స్వామి వారి సేవలో నిమగ్నమైన ఒక ఆదర్శ సాయి భక్తుడు మరియు అంకితభావం కలిగిన ప్రాక్టీషనర్ కు మన ప్రణామాలు.

పూర్తి వ్యాసం చదవండి