Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

డా. జిత్ కె అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి

Vol 13 సంచిక 2
మార్చ్ / ఎప్రిల్ 2022


 ప్రియమైన అభ్యాసకులకు

  ఈ సంవత్సరంలో అత్యంత పవిత్రమైన సమయాల్లో ఒకటైన మహాశివరాత్రి సందర్భంగా ప్రశాంతి నిలయం నుండి మీకు ఇలా రాయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. శివరాత్రి సమయంలో పొందగలిగే ఆనందం మరియు ఆహ్లాదాన్ని శివుడు కాక మరి ఎవరు ఇవ్వగలరు? స్వామి ఇలా అంటారు, “కనీసం ఈ రాత్రి అయినా మీరు మేల్కొని దేవుని మహిమను కీర్తించినట్లయితే మీకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. సంవత్సరం మొత్తంలో కనీసం ఒక్క రాత్రి భగవంతుని మహిమను కీర్తిస్తూ గడపలేరా? భగవంతుని భజనలో పాల్గొనడం ద్వారా ఈ రాత్రిని పవిత్రం చేసుకోండి. భజన ద్వారా మీరు పొందే ఆనందం, దైవ నామం ద్వారా మీరు అనుభవించే మాధుర్యం, దైవ రూపాన్ని దర్శించడం ద్వారా మీరు పొంద గలిగే ఆనందం మరెక్కడా పొందలేరు. ప్రేమ ద్వారా ప్రతీదీ సాధ్యమే, కాబట్టి ప్రేమను పెంపొందించుకోండి మరియు జీవితాన్ని పవిత్రం చేసుకోండి“-సత్య సాయి బాబా, శివరాత్రి ప్రసంగం 1999 ఫిబ్రవరి 14

మహమ్మారి మన వైబ్రియానిక్స్ ఆపరేటింగ్ మోడల్ కు సానుకూల మార్గంలో రూపాంతరం చెందేలా సహకరించింది. చికిత్స మరియు పేషంట్లను చేరుకునే ప్రక్రియ రెండింటిని పెంచుకోవడానికి మాకు వీలు కల్పించింది. మన పోస్టల్ మరియు బ్రాడ్ కాస్టింగ్ నెట్వర్క్ ఇప్పుడు సజావుగా నడుస్తున్నాయని నివేదించడానికి నేను సంతోషిస్తున్నాను. మా అడ్మిన్ బృందం వెబ్సైట్ విచారణ చేపట్టిన పేషంటు నిమిత్తం స్థానిక ప్రాక్టీషనర్  అందుబాటులో లేకపోతే అప్పుడు వారు రోగికి పోస్టు ద్వారా రెమిడీ పంపగలిగే ప్రాక్టీషనరుకు వారిని కనెక్ట్ చేస్తారు పోస్టల్ ద్వారా రెమిడీ పంపడం సానుకూలం కానట్లయితే అప్పుడు రెమిడీ లను బ్రాడ్ కాస్టింగ్ ద్వారా రోగికి ప్రసారం చేసే బ్రాడ్కాస్టింగ్ బృందంతో కనెక్ట్ చేస్తాము.

మహమ్మారి ఫలితంగా ఏర్పడిన మరో గొప్ప అవకాశం సహకార వ్యవస్థ బలోపేతం కావడం. ప్రాక్టీషనర్లు సుదూర ప్రదేశంలో లేదా వేరే దేశంలో ఉన్న రోగులకు చికిత్స చేస్తున్నప్పుడు ఇతర ప్రాక్టీషనర్లు సహాయం చేస్తారు. ప్రస్తుతం ప్రాసెస్ లో ఉన్న ఈ వ్యవస్థ AVP దరఖాస్తుదారులకు ఒక వరంలా ఉంటుందని భావిస్తున్నాము, ఎందుకంటే ఈ కోర్సులో నమోదు చేసుకొని అర్హత పొందేందుకు పెద్ద సంఖ్యలో కాబోయే రోగులు సంఖ్య అవసరం.

కొత్త వెబ్సైట్ ప్రారంభంతో మనం నిజంగానే మన పరిధిని విస్తరిస్తున్నాము. అభ్యర్థనలను సమర్థవంతంగా మరియు సమయానుకూలంగా పరిష్కరించడంలో ప్రాక్టీషనర్12208 మరియు అతని బృందం యొక్క అసాధారణ ప్రయత్నాలను ప్రస్తుతించకుండా ఉండలేము. రోగుల నుండి వచ్చిన సానుకూల మరియు సంతృప్తికరమైన ఫీడ్బ్యాక్ ఆధారంగా అటువంటి అభ్యర్థులకు తక్షణమే ప్రతిస్పందించే ప్రాక్టీషనర్లందరికీ నేను నా అభినందనలు తెలియజేస్తున్నాను.  ప్రేమ మరియు శ్రద్ధతో అందరికీ సేవ చేస్తూనే ఉండాలని అభిలషిస్తున్నాను.

హిందీ మరియు తెలుగుతో ప్రారంభించి మాతృ భాషలో శిక్షణ అందించడానికి మేము చేసిన ప్రయత్నం అద్భుత విజయాన్ని సాధించింది. కొత్త అసిస్టెంట్ ప్రాక్టీషనర్లు అందరూ ప్రాక్టీస్ ప్రారంభించిన రెండు నెలల్లోనే తమ ప్రాంతాల్లోని రోగులకు ఆదర్శప్రాయమైన సేవలను అందించారనితెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను.

ఒమిక్రాన్ వేరియంట్ కు సంబంధించిన లక్షణాల వ్యాప్తి మరియు తీవ్రత రెండింటి తాలూకు ధూళి చివరకు స్థిరపడినట్లు కనిపించడం ఆనందకరం. దీని ఫలితంగా మా వైబ్రియానిక్స్ క్లినిక్కులు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో మరియు ప్రపంచ వ్యాప్తంగా తిరిగి తెరవ పడుతున్నాయి. మొదటి లాక్డౌన్ సమయంలో తలెత్తిన అవసరానికి ప్రతిస్పందనగా ప్రారంభించిన వైబ్రియానిక్స్ సేవ ఇప్పుడు  సాధారణ లక్షణంగా మారింది. ఇమ్యూనిటీ బూస్టర్ కోసం డిమాండ్ మునుపెన్నడూ లేనంతగా పెరిగింది. SVP11567 మరియు AP18005 యొక్క కృషితో శ్రీ సత్యసాయి సంస్థ యొక్క నిరంతర సహకారం మరియు ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రాక్టీషనర్ల మద్దతుతో   గ్రామీణప్రాంతాల్లో 800 IB బాటిళ్లు పంపిణీ చేయబడ్డాయి. ఇలాంటి కార్యకలాపాలు హర్యానాలోని గ్రామీణ ప్రాంతాల నుండి కూడా నివేదించబడినాయి. 2022 ఫిబ్రవరి 28 నాటికి IB లబ్ధిదారుల సంఖ్య 650,000 దాటింది. ప్రశాంతి నిలయానికి వచ్చే సేవాదళ్ బ్యాచ్చులు అన్నింటికి IB పంపిణీ చేసే అవకాశం కల్పించినందుకు సత్యసాయి సేవా సంస్థ కు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ప్రతీ వారం ప్రేమపూర్వకంగా సిద్ధం చేసినందుకు ప్రాక్టీషనర్లకు, వాటిని సకాలంలో పంపిణీ చేసిన RC లకు, మరియు ఆశ్రమ అధికారులు, రాష్ట్ర సేవ సమన్వయకర్తలు మరియు వాటిని పంపిణీ చేసిన స్థానిక బృందానికి మేము మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ సేవ సజావుగా జరిగేలా కృషి చేసిన కోఆర్డినేటర్11573, సీనియర్ ప్రాక్టీషనర్ r02814  మరియు హర్యానా జిల్లా అధ్యక్షులకు ప్రత్యేక ధన్యవాదాలు.

ఈ మహమ్మారికి సంబంధించి ఒక విచారకరమైన అంశం ఏమిటంటే చాలా కుటుంబాలు తమ దగ్గరి బంధువులను మరియు ప్రియమైన వారిని కోల్పోయాయి. నష్టాన్ని అనుభవించిన వ్యక్తుల యొక్క భావాలు లేదా వారి ఇబ్బందులు అనేకరకాలుగా ఉండవచ్చు. ఉదాహరణకి  షాక్, తిమ్మిరి, విచారం, తిరస్కరణకు లోను కావడం, నిరాశ, ఆందోళన, కోపం, అపరాధ భావం, ఒంటరితనం, నిస్సహాయత, లేదా కొన్ని సమయాలలో ఉపశమనం పొందడం, లేదా కోరిక నెరవేరడం వంటివి ఉండవచ్చు. రోగులలో అటు వంటి లక్షణాలను కనుగొని వారికి ప్రేమ మరియు శ్రద్ధతో చికిత్స చేయాలని నేను సలహా ఇస్తున్నాను.   

మేము మా కార్యనిర్వాహక బృందాన్ని అంతర్గతంగా కొంత పునర్నిర్మాణం చేశాము. అయినప్పటికీ ప్రాక్టీషనర్లపై ఇది ఎలాంటి ప్రభావం చూపదు కనుక  వారి ప్రశ్నలను [email protected]. కు పంపించడం కొనసాగించవచ్చు. అలాగే రోగ చరిత్రలు, మరియు కోంబోలను గురించి ప్రశ్నలు మన సాధారణ e మెయిల్ ఎడ్రస్ కు  పంపించడం కొనసాగించమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.

చివరిగా శివరాత్రి నాడు మనకు మన ప్రియతమ భగవానుని ఆదేశము “ఆయన అడుగుజాడల్లో నడవండి “ స్వామి ఇలా అంటారు “కబుర్లతో మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి, బదులుగా గ్రామాలు మరియు మురికివాడల్లో సేవా కార్యక్రమాలు చేపట్టండి” సత్యసాయిబాబా శివరాత్రి ప్రసంగం 1999 ఫిబ్రవరి 4 మనమందరం మన హృదయాలలో ప్రేమను పెంపొందించుకుంటూ ఈ మహత్కార్యంలో కొనసాగుదాం.

  ప్రేమతో సాయి సేవలో

జిత్ కె అగర్వాల్