Vol 13 సంచిక 2
మార్చ్ / ఎప్రిల్ 2022
ముద్రింప తగిన వార్తాలేఖ
పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి
డా. జిత్ కె అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి
ప్రియమైన అభ్యాసకులకు
ఈ సంవత్సరంలో అత్యంత పవిత్రమైన సమయాల్లో ఒకటైన మహాశివరాత్రి సందర్భంగా ప్రశాంతి నిలయం నుండి మీకు ఇలా రాయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. శివరాత్రి సమయంలో పొందగలిగే ఆనందం మరియు ఆహ్లాదాన్ని శివుడు కాక మరి ఎవరు ఇవ్వగలరు? స్వామి ఇలా అంటారు, “కనీసం ఈ రాత్రి అయినా మీరు మేల్కొని దేవుని మహిమను కీర్తించినట్లయితే మీకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. సంవత్సరం మొత్తంలో కనీసం ఒక్క రాత్రి భగవంతుని మహిమను కీర్తిస్తూ గడపలేరా? భగవంతుని భజనలో పాల్గొనడం ద్వారా ఈ రాత్రిని పవిత్రం చేసుకోండి. భజన ద్వారా మీరు పొందే ఆనందం, దైవ నామం ద్వారా మీరు అనుభవించే మాధుర్యం, దైవ రూపాన్ని దర్శించడం ద్వారా మీరు పొంద గలిగే ఆనందం మరెక్కడా పొందలేరు. ప్రేమ ద్వారా ప్రతీదీ సాధ్యమే, కాబట్టి ప్రేమను పెంపొందించుకోండి మరియు జీవితాన్ని పవిత్రం చేసుకోండి“-సత్య సాయి బాబా, శివరాత్రి ప్రసంగం 1999 ఫిబ్రవరి 14
మహమ్మారి మన వైబ్రియానిక్స్ ఆపరేటింగ్ మోడల్ కు సానుకూల మార్గంలో రూపాంతరం చెందేలా సహకరించింది. చికిత్స మరియు పేషంట్లను చేరుకునే ప్రక్రియ రెండింటిని పెంచుకోవడానికి మాకు వీలు కల్పించింది. మన పోస్టల్ మరియు బ్రాడ్ కాస్టింగ్ నెట్వర్క్ ఇప్పుడు సజావుగా నడుస్తున్నాయని నివేదించడానికి నేను సంతోషిస్తున్నాను. మా అడ్మిన్ బృందం వెబ్సైట్ విచారణ చేపట్టిన పేషంటు నిమిత్తం స్థానిక ప్రాక్టీషనర్ అందుబాటులో లేకపోతే అప్పుడు వారు రోగికి పోస్టు ద్వారా రెమిడీ పంపగలిగే ప్రాక్టీషనరుకు వారిని కనెక్ట్ చేస్తారు పోస్టల్ ద్వారా రెమిడీ పంపడం సానుకూలం కానట్లయితే అప్పుడు రెమిడీ లను బ్రాడ్ కాస్టింగ్ ద్వారా రోగికి ప్రసారం చేసే బ్రాడ్కాస్టింగ్ బృందంతో కనెక్ట్ చేస్తాము.
మహమ్మారి ఫలితంగా ఏర్పడిన మరో గొప్ప అవకాశం సహకార వ్యవస్థ బలోపేతం కావడం. ప్రాక్టీషనర్లు సుదూర ప్రదేశంలో లేదా వేరే దేశంలో ఉన్న రోగులకు చికిత్స చేస్తున్నప్పుడు ఇతర ప్రాక్టీషనర్లు సహాయం చేస్తారు. ప్రస్తుతం ప్రాసెస్ లో ఉన్న ఈ వ్యవస్థ AVP దరఖాస్తుదారులకు ఒక వరంలా ఉంటుందని భావిస్తున్నాము, ఎందుకంటే ఈ కోర్సులో నమోదు చేసుకొని అర్హత పొందేందుకు పెద్ద సంఖ్యలో కాబోయే రోగులు సంఖ్య అవసరం.
కొత్త వెబ్సైట్ ప్రారంభంతో మనం నిజంగానే మన పరిధిని విస్తరిస్తున్నాము. అభ్యర్థనలను సమర్థవంతంగా మరియు సమయానుకూలంగా పరిష్కరించడంలో ప్రాక్టీషనర్12208 మరియు అతని బృందం యొక్క అసాధారణ ప్రయత్నాలను ప్రస్తుతించకుండా ఉండలేము. రోగుల నుండి వచ్చిన సానుకూల మరియు సంతృప్తికరమైన ఫీడ్బ్యాక్ ఆధారంగా అటువంటి అభ్యర్థులకు తక్షణమే ప్రతిస్పందించే ప్రాక్టీషనర్లందరికీ నేను నా అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రేమ మరియు శ్రద్ధతో అందరికీ సేవ చేస్తూనే ఉండాలని అభిలషిస్తున్నాను.
హిందీ మరియు తెలుగుతో ప్రారంభించి మాతృ భాషలో శిక్షణ అందించడానికి మేము చేసిన ప్రయత్నం అద్భుత విజయాన్ని సాధించింది. కొత్త అసిస్టెంట్ ప్రాక్టీషనర్లు అందరూ ప్రాక్టీస్ ప్రారంభించిన రెండు నెలల్లోనే తమ ప్రాంతాల్లోని రోగులకు ఆదర్శప్రాయమైన సేవలను అందించారనితెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను.
ఒమిక్రాన్ వేరియంట్ కు సంబంధించిన లక్షణాల వ్యాప్తి మరియు తీవ్రత రెండింటి తాలూకు ధూళి చివరకు స్థిరపడినట్లు కనిపించడం ఆనందకరం. దీని ఫలితంగా మా వైబ్రియానిక్స్ క్లినిక్కులు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో మరియు ప్రపంచ వ్యాప్తంగా తిరిగి తెరవ పడుతున్నాయి. మొదటి లాక్డౌన్ సమయంలో తలెత్తిన అవసరానికి ప్రతిస్పందనగా ప్రారంభించిన వైబ్రియానిక్స్ సేవ ఇప్పుడు సాధారణ లక్షణంగా మారింది. ఇమ్యూనిటీ బూస్టర్ కోసం డిమాండ్ మునుపెన్నడూ లేనంతగా పెరిగింది. SVP11567 మరియు AP18005 యొక్క కృషితో శ్రీ సత్యసాయి సంస్థ యొక్క నిరంతర సహకారం మరియు ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రాక్టీషనర్ల మద్దతుతో గ్రామీణప్రాంతాల్లో 800 IB బాటిళ్లు పంపిణీ చేయబడ్డాయి. ఇలాంటి కార్యకలాపాలు హర్యానాలోని గ్రామీణ ప్రాంతాల నుండి కూడా నివేదించబడినాయి. 2022 ఫిబ్రవరి 28 నాటికి IB లబ్ధిదారుల సంఖ్య 650,000 దాటింది. ప్రశాంతి నిలయానికి వచ్చే సేవాదళ్ బ్యాచ్చులు అన్నింటికి IB పంపిణీ చేసే అవకాశం కల్పించినందుకు సత్యసాయి సేవా సంస్థ కు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ప్రతీ వారం ప్రేమపూర్వకంగా సిద్ధం చేసినందుకు ప్రాక్టీషనర్లకు, వాటిని సకాలంలో పంపిణీ చేసిన RC లకు, మరియు ఆశ్రమ అధికారులు, రాష్ట్ర సేవ సమన్వయకర్తలు మరియు వాటిని పంపిణీ చేసిన స్థానిక బృందానికి మేము మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ సేవ సజావుగా జరిగేలా కృషి చేసిన కోఆర్డినేటర్11573, సీనియర్ ప్రాక్టీషనర్ r02814 మరియు హర్యానా జిల్లా అధ్యక్షులకు ప్రత్యేక ధన్యవాదాలు.
ఈ మహమ్మారికి సంబంధించి ఒక విచారకరమైన అంశం ఏమిటంటే చాలా కుటుంబాలు తమ దగ్గరి బంధువులను మరియు ప్రియమైన వారిని కోల్పోయాయి. నష్టాన్ని అనుభవించిన వ్యక్తుల యొక్క భావాలు లేదా వారి ఇబ్బందులు అనేకరకాలుగా ఉండవచ్చు. ఉదాహరణకి షాక్, తిమ్మిరి, విచారం, తిరస్కరణకు లోను కావడం, నిరాశ, ఆందోళన, కోపం, అపరాధ భావం, ఒంటరితనం, నిస్సహాయత, లేదా కొన్ని సమయాలలో ఉపశమనం పొందడం, లేదా కోరిక నెరవేరడం వంటివి ఉండవచ్చు. రోగులలో అటు వంటి లక్షణాలను కనుగొని వారికి ప్రేమ మరియు శ్రద్ధతో చికిత్స చేయాలని నేను సలహా ఇస్తున్నాను.
మేము మా కార్యనిర్వాహక బృందాన్ని అంతర్గతంగా కొంత పునర్నిర్మాణం చేశాము. అయినప్పటికీ ప్రాక్టీషనర్లపై ఇది ఎలాంటి ప్రభావం చూపదు కనుక వారి ప్రశ్నలను [email protected]. కు పంపించడం కొనసాగించవచ్చు. అలాగే రోగ చరిత్రలు, మరియు కోంబోలను గురించి ప్రశ్నలు మన సాధారణ e మెయిల్ ఎడ్రస్ కు పంపించడం కొనసాగించమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.
చివరిగా శివరాత్రి నాడు మనకు మన ప్రియతమ భగవానుని ఆదేశము “ఆయన అడుగుజాడల్లో నడవండి “ స్వామి ఇలా అంటారు “కబుర్లతో మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి, బదులుగా గ్రామాలు మరియు మురికివాడల్లో సేవా కార్యక్రమాలు చేపట్టండి” సత్యసాయిబాబా శివరాత్రి ప్రసంగం 1999 ఫిబ్రవరి 4 మనమందరం మన హృదయాలలో ప్రేమను పెంపొందించుకుంటూ ఈ మహత్కార్యంలో కొనసాగుదాం.
ప్రేమతో సాయి సేవలో
జిత్ కె అగర్వాల్
మద్యపానం మరియు మాదక ద్రవ్యాల వ్యసనం 03108...Greece
28 ఏళ్ల మహిళ 5 సంవత్సరాల క్రితం తన కొడుకు పుట్టిన వెంటనే ఈ దురాలవాట్లకు బానిస అయ్యారు. విడాకులు తీసుకున్న తరువాత ఆమె అబ్బాయిని చూసుకునే బాధ్యత చూసుకోలేక తగిన సత్సంబంధాలు లేకపోయినా తల్లి పైనే ఆధార పడాల్సి వచ్చింది. ఆమె తల్లి బేబీ సిట్టింగ్ లో ఉన్నప్పుడు ఈమె మద్యం సేవించి డ్యాన్స్ చేయడానికి క్లబ్బులకు వెళ్ళేవారు. ఆమె ఎల్లప్పుడూ నెర్వస్ గా ఉండే స్వభావం కలిగి ఉన్నట్లు అనిపించింది, స్వతహాగా సున్నితంగా ఉంటూ ఎల్లప్పుడూ క్షమాపణలు చెప్పేవారు. ఆమెకు ఆకలి కూడా సరిగా ఉండదు. ఆమె ప్రియుడు మాదక ద్రవ్యాలకు బానిస కావడంతో ఆమె 18 నెలల క్రితం నుండి డ్రగ్స్ తీసుకోవడం(వారాంతాల్లో మాత్రమే) ప్రారంభించారు. ఆమెకు తన వ్యసనం నుండి అధిగమించాలని ఉంది కనుక 2020 జనవరి 20 న ప్రాక్టీషనరును సంప్రదించగా క్రింది రెమిడీలు ఇచ్చారు:
#1. SR318 Thuja 30C…TDS 4 రోజుల వరకూ అనంతరం
#2. NM5 Brain TS + NM6 Calming + NM12 Combination-12 + NM22 Liver + NM69 CB8 + NM90 Nutrition + NM95 Rescue Plus + OM8 Hypo & Hyperglycaemia + OM17 Liver-Gallbladder + SM41 Uplift + SR240 Kidney + SR242 Liver + SR271 Arnica 30C + SR275 Belladonna + SR302 Nux Vomica CM + SR329 Crab apple + SR330 Addiction to Alcohol + SR340 Aloe Socotrina + SR417 Agrimony + SR439 Pine + SR443 Star of Bethlehem…QDS
మొదటి రెండు రోజుల తర్వాత ఆమె చాలా గాబరా, ఆందోళన మరియు వేగవంతమైన హృదయ స్పందన అనుభవించారు కానీ చికిత్స కొనసాగించారు. మూడు వారాల తర్వాత ఆమె డ్రగ్స్ తీసుకోలేదని మరియు చాలా తక్కువగా మద్యాన్ని తాగుతున్నట్లు తెలిపారు. ఆమె 60% మెరుగైన అనుభూతి పొందారు. తర్వాత మూడు వారాల్లో ఆమె వారాంతాల్లో మాత్రమే కొద్దిగా మద్యాన్ని తీసుకునే వరకూ ఆమె ఆల్కహాల్ వినియోగం నిరంతరం తగ్గింది. ఇది ఒక చక్కని మెరుగుదల కాబట్టి మార్చి4 న #2 మోతాదు TDS.కు తగ్గించబడింది. 6 నెలల తర్వాత ఆమె కొద్దిపాటి ఆల్కహాల్ మాత్రమే తీసుకుంటున్నది, అది కూడా అప్పుడప్పుడు ఒత్తిడికి గురి అయినప్పుడు మాత్రమే. 2020 ఆగస్టులో ఆమె స్విట్జర్లాండ్ కు వెళుతూ మూడు నెలలకు సరిపడా రెమిడీలు తీసుకుని అవి అయిపోయే వరకు కొనసాగించారు. గోళీలు నవంబర్ లో పూర్తిగా అయిపోయే వరకూ TDS గా కొనసాగించారు కానీ ప్రాక్టీషనరు తో సన్నిహితంగానే ఉన్నారు. వారి చివరి సందర్శన 2021 డిసెంబర్ లో అనగా రెమిడీ నిలిపివేసిన ఒక సంవత్సరం కంటే ఎక్కువ సమయం తదనంతరం జరిగింది. రోగి తనకు డ్రగ్స్ లేదా ఆల్కహాల్ తో ఇకపై ఎటువంటి సమస్య లేదని ధృవీకరిస్తూ ఆమె చాలా శక్తివంతంగా ప్రశాంతంగా ఉన్నట్లు ఆనందంగా తెలిపారు.
108CC బాక్సు ఉపయోగిస్తున్నట్లైతే#1: CC10.1 Emergencies; #2: CC4.2 Liver & Gallbladder + CC12.1 Adult tonic + CC15.1 Mental and Emotional tonic + CC15.3 Addictions + CC17.2 Cleansing + CC18.1 Brain Disabilities ఇవ్వండి.
కాళ్లలో న్యూరాల్జియా 11622...India
73 ఏళ్ల మహిళ గత 6 నెలలుగా మోకాళ్లు మరియు పిక్కలలో నొప్పి మంట మరియు జలదరింపుతో ప్రారంభమై అది క్రమంగా పాదం వరకూ ప్రసరిస్తున్నట్లు ప్రత్యేకించి కుడి కాలిలో మరింత ఇబ్బందితో బాధపడుతున్నారు. ఆమె కూర్చున్న స్థానం నుంచి లేచినప్పుడు నొప్పి ఆమె కాలిలో ఎక్కువవుతూ కొద్దిదూరం నడవడానికి కూడా కష్టంగా ఉంటుంది. నొప్పి భరించలేనంతగా ఉన్నప్పుడు ఆమె నొప్పి నివారిణి తీసుకోగానే అది తగ్గుతుంది. ఆ విధంగా ఒక నెల తీసుకున్నారు. ఆ తర్వాత నొప్పి నివారణ మాత్రలు తీసుకోవడంతోపాటు కొన్ని వారాలపాటు ఫిజియోథెరపీ కూడా తీసుకున్నారు అయితే ఉపశమనం ఎప్పుడూ తాత్కాలికమే. ఆ తర్వాత ఆమెకు నీరోబియాన్ అనే మందు ప్రతీ నెలలో పక్షం రోజుల పాటు అలా నాలుగు నెలల పాటు తీసుకున్నారు కానీ ఎలాంటి మెరుగుదల లేక సమస్య కొనసాగింది. ఆమె 2020 మార్చి 3వ తేదీన ప్రాక్టీషనరును సందర్శించగా వారికి క్రింది రెమిడీ ఇవ్వబడింది:
CC10.1 Emergencies+ CC12.1 Adult tonic + CC18.5 Neuralgia + CC20.4 Muscles & Supportive tissue...TDS
పది రోజుల్లో ఆమె మోకాలి మరియు పిక్కల నొప్పి నుంచి 70% ఉపశమనం పొందారు, కానీ మండుతున్న అనుభూతి కొనసాగింది. నెల తర్వాత ఏప్రిల్ 12వ తేదీన ఆమె నొప్పులు 90% తగ్గాయి అయితే మంట మరియు జలదరింపు కొనసాగింది. ఆమెకు తీవ్రమైన వెన్ను నొప్పి ఏర్పడింది. మోతాదు మూడు రోజుల పాటు 6TD కి పెంచి తరువాత TDS గా కొనసాగించారు. ఏప్రిల్ 30 నాటికి వ్యాధి లక్షణాలు పూర్తిగా తగ్గి ఆమె 100% మెరుగ్గా ఉన్నట్లు భావించారు. మోతాదు 15 రోజులకు BD కి తరువాత OD కి తగ్గించబడింది 18 నెలల తర్వాత 2022 జనవరి నాటికి ఏ ఇబ్బంది లేకుండా చక్కగా ఉంటూ యింటినెన్స్ డోసేజ్ OD గా కొనసాగించడాన్ని ఎంచుకున్నారు.
మైగ్రేన్ / పార్శ్వపు నొప్పి 11622...India
43 ఏళ్ల మహిళకు ఐదేళ్ల క్రితం తరుచుగా తీవ్రమైన పార్శ్వపు నొప్పి దీనితో పాటు బిగ్గరగా ఉండే శబ్దం మరియు చుట్టూ ప్రకాశవంతమైన కాంతి వంటి ఇంద్రియ సంబంధిత అవరోధాలు భరించలేని స్థితి ప్రారంభం అయ్యింది. ఆమె దాదాపు వారానికి రెండుసార్లు ఈ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రతీ సారి నాలుగు గంటలు చొప్పున లేదా కొన్నిసార్లు రాత్రంతా ఉంటూ ఆమె నిద్రకు భంగం కలిగిస్తున్నది. గత నాలుగు సంవత్సరాలుగా ఆమె ప్రతి రోజూ ఫ్లూనారాజిన్ అల్లోపతీ మందు తీసుకుంటున్నారు మరియు ఇది ఆమెకు పూర్తి ఉపశమనం కలిగిస్తున్నది, అయితే ఆమెకు ఈ మందు మానేయాలని ఉంది. ఆమె దాన్ని ఆపడానికి మూడు సార్లు ప్రయత్నించారు కానీ ఒక నెల తర్వాత మైగ్రేన్ మరింత తీవ్రతతో తిరిగి రాసాగింది. కాబట్టి 2020 ఏప్రిల్ 15న ఆమె ప్రాక్టీషనరును సంప్రదించారు. ఆ సమయంలో కుటుంబ సభ్యుల సమస్యల కారణంగా ఒత్తిడికి గురై ఉన్నారు, వారికి క్రింది రెమిడీ ఇవ్వబడింది:
CC10.1 Emergencies + CC11.3 Headaches + CC11.4 Migraines + CC12.1 Adult tonic…TDS
రోగి అల్లోపతి మందులు కూడా తీసుకోవడం కొనసాగించారు, రెమిడీ తీసుకున్న పది రోజుల తర్వాత ఆమె ఒత్తిడికి గురికాలేదు ఆమె మనస్సు ప్రశాంతంగా మరియు రిలాక్స్ గా ఉండసాగింది, అయినప్పటికీ మైగ్రేన్ వస్తుందనే భయంతో ఫ్లూనారాజిన్ ఆపాలి అనిపించలేదు. ఇదే సమయంలో ఆమె భర్త మరియు పిల్లలువైబ్రియానిక్స్ చికిత్స తీసుకొని మెరుగయ్యారు. ఆరు నెలల్లో ఆమె తగినంత విశ్వాసాన్ని పొంది ఫ్లూనారాజిన్ ఆపడానికి ధైర్యాన్ని కూడగట్టుకున్నారు. దీనిని ఆపిన ఒక నెల తర్వాత మైగ్రేన్ మళ్ళీ రాలేదని 2021 జనవరి 15న ఆమె సంతోషంగా తెలియజేశారు. 2021 ఏప్రిల్ నాటికి క్రమంగా OD కి ఆ తరువాత జూలై పూర్తిగా ఆపివేయ బడింది. 2022 నాటికి ఆమె బాగానే ఉన్నారు, సమస్య పునరావృతం కాలేదు.
ఆహారపు అలెర్జీ 03518...Canada
57 సంవత్సరాల మహిళ 2015 లో ఆమె ప్రయాణపు సమయాలలో ఆమె బుగ్గలపై మంట ఏర్పడి అది ఎర్రగా మారి మండుతున్న భావనతో వాపు ఏర్పడింది. ఆమె స్నేహితురాలు ఐన ఒక చర్మ వ్యాధి నిపుణురాలు ఆమె ముఖం యొక్క చిత్రం చూసి అది తామర గా గుర్తించి ఒక స్టెరాయిడ్ క్రీమును సూచించగా ఆమె దానిని వారం రోజులు ఉపయోగించారు. కొంత కాలం తర్వాత లక్షణాలు తిరిగి రావడంతో ఆమె ప్రతీ రోజూ కొత్తిమీర ఆకుల రసాన్ని మరియు మృదువైన ఆహారం తీసుకొనసాగడంతో ఒక వారంలో ఆమె బాగానే ఉన్నారు. తర్వాత 2015 మార్చిలో ఆమె AVP గా అర్హత సాధించిన తర్వాత లక్షణాలు కనిపించిన ప్రతీ సారి ఈ క్రింది రెమిడీ తీసుకొనసాగారు:
#1. CC21.3 Skin allergies + CC21.6 Eczema…6TD
లక్షణాలు నాలుగు రోజుల్లో తగ్గిపోతూ ఉండడంతో ఆమె క్రమంగా మోతాదు తగ్గిస్తూ వచ్చేవారు. అయితే లక్షణాలు తిరిగి ఏర్పడుతూ ఉండేవి. ఇది అలర్జీ కారణంగా జరుగుతున్నట్లు ఆమె గ్రహించారు. జాగ్రత్తగా అధ్యయనం చేయడం ద్వారా ఆమె వేరుశెనగ, తెల్ల
చక్కెర, మైదా ఉత్పత్తులు లేదా ప్యాక్ చేసిన ఆహారం తిన్నప్పుడు తనకు ఈ లక్షణాలు వస్తున్నట్లు కనుగొన్నారు. కాబట్టి ఈ ఆహారాలు తినడం మానివేసి ఆహారంలో ఆరోగ్యకరమైన మార్పులు చేసారు. కానీ కొన్నిసార్లు ఆమె వ్యాపార కార్యక్రమాలు మరియు ప్రయాణాలలో అనుకోకుండా తీసుకుంటూ#1 ద్వారా ఈ సమస్యను అధిగమించ గలుగుతున్నారు. అయితే 2020 ఆగస్టులో కోవిడ్ లాక్డౌన్ సమయంలో ఆమె తన నివాసం వేరే దేశానికి మారుస్తూ విపరీతమైన ఒత్తిడికి లోనైనప్పుడు సుమారు ఒక నెల పాటు వేరుశెనగలు, ప్యాకేజ్ చేసిన అల్పాహారం మీద ఆధార పడ్డారు. దీనితో లక్షణాలు ఎక్కువ తీవ్రతతో పునరావృతం అయ్యాయి. ఆగష్టు 17 న ఆమె క్రింది అభివృద్ధి పరచబడిన కోంబో తీసుకున్నారు:
#2. CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC18.5 Neuralgia + #1...6TD
రెండు రోజుల్లో ఎరుపుదనం మరియు వాపు 70% తగ్గాయి మరియు మంట 100% తగ్గింది. మోతాదు TDS కి తగ్గించబడింది మరో వారంలో ఎరుపు మరియు వాపు నుండి 90% ఉపశమనం లభించడంతో ఆగస్టు 25న మోతాదు BD కి మరియు సెప్టెంబర్ 7న OD కి తగ్గించబడి 100% మెరుగు అనిపించగానే 2020 సెప్టెంబర్ 30న రెమిడీ ఆపివేశారు. ఆమె ప్రతీరోజూ కొత్తిమీర రసాన్ని తీసుకుని ముఖానికి ఆలోవీరా జెల్ రాసుకునే వారు.
2022 జనవరి నాటికి ఆమె స్నాక్స్ గా వేరుశెనగలు మామూలుగా తీసుకుంటున్నారు, అలాగే వైట్ షుగర్ తో చేసిన తనకు ఇష్టమైన స్వీట్స్ తింటూనే ఉన్నా ఏ ఇబ్బంది లేకుండా బాగానే ఉన్నారు.
కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ 11632...India
39 ఏళ్ల సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ తన లాప్ టాప్ లో రోజుకు 16 గంటల పాటు ఒక సంవత్సర కాలంగా పనిచేస్తు ఉన్న సందర్భంలో 2020 అక్టోబర్ లో ఆమె కుడి చేతి చూపుడు వ్రేలు మరియు మధ్య వ్రేలు పై నొప్పి మరియు వాపు వచ్చాయి. అంతే కాక ఆమె చూపుడు వేలు వణుకుకు గురౌతోంది. పరిస్థితి రానురాను విషమించి ఆమె టైపింగ్ కోసం రెండువేళ్లు ఉపయోగించలేని పరిస్థితి ఏర్పడింది. ఐదు నెలల కంటే ఎక్కువ కాలం ఆమె ఇతర వేళ్ళ ద్వారా మాత్రమే టైప్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆమె ఔషధ గుణాలు కలిగిన నూనెను రాయడం ద్వారా కొంత ఉపశమనం పొందారు. వాపు అరచేతి మొత్తము వ్యాపించడంతో 2021 ఏప్రిల్ 5న ఆమె వైద్యుడిని సంప్రదించగా అది కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ వ్యాధిగా నిర్ధారించారు. నోటి ద్వారా తీసుకొనే కొన్ని మందులను వైద్యుడు సూచించగా వాటి దుష్ప్రభావాల ఫలితాలను దృష్టిలో ఉంచుకొని ఆమె వాటిని ఉపయోగించ లేదు. ప్రత్యామ్నాయ వైద్యం కోసం కోసం ఆమె ఎంతో ఆత్రంగా వెతుకుతున్న సందర్భంలో స్నేహితురాలి ద్వారా వైబ్రియానిక్స్ గురించి తెలుసుకున్నారు. 2021 మార్చి 5వ తేదీన ప్రాక్టీషనరును సంప్రదించగా వారు క్రింది రెమిడీ ఇచ్చారు:
#1. CC10.1 Emergencies + CC20.3 Arthritis...TDS
#2. CC20.3 Arthritis...BD కొబ్బరి నూనెలో బాహ్య అనువర్తనం కోసం
మే 21న ఆమె అన్ని లక్షణాలలో 40 శాతం ఉపశమనం పొందడంతో పాటు అప్పుడప్పుడు రెండు వేళ్ళ ను కూడా ఉపయోగించ గలిగే వారు. మరో వారంలో మరింత గణనీయమైన మెరుగుదల కలిగి ఆమె తన చేతిని మరింత స్వేచ్ఛగా ఉపయోగించ గలుగుతున్నారు. మరొక నెల తరువాత జూన్ 27నాటికి ఆమె మొత్త మీద 90% మెరుగైన ఉపశమనం పొందడంతో తన మునుపటి పనులన్నీ సులువుగా చేసుకొన గలిగినందుకు చాలా సంతోషంగా ఉన్నారు. సెప్టెంబర్ 5నాటికి వ్యాధి లక్షణాలన్నీ పూర్తిగా మాయమయ్యాయి. నవంబర్ 13 నాటికి పై రెండు రెమిడీలు ఆపివేయ బడ్డాయి. ల్యాప్ టాప్ పై రోజుకు 16 గంటలు పని చేసినప్పటికీ పై వ్యాధిలక్షణాలు ఏవీ పునరావృతం కాలేదు.
ఛాతి నొప్పి 11635...India
65 ఏళ్ల పురుషుడు గత తొమ్మిది నెలలుగా నడుస్తున్నప్పుడు మరియు విశ్రాంతి సమయంలో కూడా ఛాతీలో నొప్పి కొనసాగడం సమస్యతో ప్రాక్టీ షనరును సందర్శించారు. 1999 సంవత్సరంలో అతనికి తీవ్రమైన గుండెపోటు కలగడంతో యాంజియోప్లాస్టీ చేయించుకొని, BP మరియు లిపిడ్స్ తగ్గడానికి మరియు రక్తం పలచ బడడానికి మందులు వాడుతున్నారు. 2020 అక్టోబర్ లో ఛాతీనొప్పి ఏర్పడే వరకు అతను బాగానే ఉన్నారు. అతని కార్డియాలజిస్ట్ ఇది రెండవ హార్ట్ ఎటాక్ అని నిర్ధారించి మరొకసారి యాంజియో ప్లాస్టీ చేసారు. సూచింప బడిన మందులను వాడుతూనే ఉన్నప్పటికీ ఛాతీ నొప్పి విషయంలో ఉపశమనం లేదు. 2021 జూలై 30 వ తేదీన ప్రాక్టీషనరు క్రింది రెమిడీ ఇచ్చారు:
CC3.4 Heart Emergencies + CC3.5 Arteriosclerosis + CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic…TDS
రెండు వారాల తర్వాత విశ్రాంతి తీసుకునే సమయంలో కలిగే నొప్పి నుండి 100% ఉపశమనం మరియు నడుస్తున్నప్పుడు కలిగే నొప్పి విషయంలో 30% మెరుగుదల ఏర్పడింది. ఆగష్టు 23 తదుపరి సందర్శనలో ఛాతీ నొప్పి పూర్తిగా తగ్గిపోయిందని అతను తెలిపారు. మరో మూడు నెలల పాటు రెమిడీ ని TDS వద్ద కొనసాగించాలని రోగి భావించారు.
వైబ్రో రెమిడీ ని ప్రారంభించిన మూడు నెలల్లోనే అతని ట్రైగ్లిజరైడ్స్ స్థాయి సాధారణ స్థితికి వచ్చిందని అతను ఈ అదనపు ప్రయోజనం గురించి వెల్లడించిన సందర్భంలో నవంబర్లో రెమిడీ OD కి తగ్గించబడింది. అంతకుముందు ఈ విలువ ఎక్కువగా ఉండేవి. 2021 డిసెంబర్ నాటికి మోతాదును OD గా కొనసాగిస్తూ నొప్పిలేకుండా రోజుకి నాలుగు కిలోమీటర్లు నడవ గలుగుతున్నారు.
అధిక స్వేదము (హైపర్ హైడ్రోసిస్) 11635...India
51 సంవత్సరాల వ్యక్తికి చిన్నతనం నుంచి అరచేతులు మరియు అరి కాళ్లపై విపరీతమైన చెమట పడుతూ ఉండడంతో అతని సాధారణ కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. 2021 మార్చినుండి అతనికి రాత్రిపూట తన చేతులపై దురద కూడా ప్రారంభ మైంది. 20 ఏళ్ల క్రితమే ఇద్దరు చర్మవ్యాధి నిపుణులను సంప్రదించి వారు సూచించిన మేరకు నాలుగు నెలలు అల్లోపతి చికిత్స తీసుకున్నా ఉపశమనం లభించలేదు. ఈ సంఘటన బహుశా ఈ వ్యాధికి చికిత్స లేదేమో అని అతను భావిస్తూ 2021 ఆగస్టు 4న ప్రాక్టీషనరును కలిసే వరకు కొనసాగి వారి నుండి క్రింది రెమిడీ పొందారు:
CC15.1 Mental & Emotional tonic + CC21.10 Psoriasis…TDS మరియు బాహ్య అనువర్తనం కోసం విభూతిలో…BD
అతను మొదటి వారంలో OD వద్ద రెమిడీ తీసుకోవడం ప్రారంభించి తర్వాత వారంలో TDS కి పెంచారు. ఆగస్టు 23 నాటికి అతను చెమట విషయంలో 25% దురద విషయంలో 40% ఉపశమనం పొందారు. మరో వారం కొనసాగించగా మెరుగుదల వరుసగా 50% మరియు 100% నకు చేరుకుంది. సెప్టెంబర్ 19 నాటికి శ్వేదపు సమస్య కూడా పూర్తిగా అదృశ్యమయ్యింది. సెప్టెంబర్ 26న నోటి ద్వారా తీసుకునే రెమిడీ మోతాదు BD కి మరియు అక్టోబర్ 11న OD నిర్వహణ మోతాదుకు తగ్గించబడింది. డిసెంబర్ 14న బాహ్య అనువర్తనపు మోతాదు నిలిపివేయబడింది. 2022 జనవరి నాటికి రోగి OD వద్ద మోతాదు కొనసాగిస్తున్నారు. రోగలక్షణాలు పునరావృతం కాలేదు.
అరుదుగా వచ్చే ఋతుక్రమం (PCOD) 03582...South Africa
45 సంవత్సరాల మహిళకు అరుదుగా ఏడాదికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే రుతుక్రమం వస్తూ మొదటిరోజున అధిక రక్తస్రావం జరుగుతుంది. పదిహేనేళ్ళ క్రితం దీనిని పీసీఓడీ గా గుర్తించారు. ఆమె తక్కువ శక్తి స్థాయితో బలహీనంగా ఉండడం వలన ఇది ఉత్పాదకతపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఆమె ఇన్ని సంవత్సరాలుగా అల్లోపతీ చికిత్స తీసుకుంటూ గత ఎనిమిది నెలలుగా ఆయుర్వేద చికిత్స కూడా తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. రెండు చికిత్సలను నిలిపివేసి వైబ్రియానిక్స్ చికిత్స తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. 2019 ఆగస్టు 21న జరిగిన ప్రధమ సందర్శన సమయంలో ఆమె కలత చెంది ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది:
CC8.4 Ovaries & Uterus + CC8.8 Menses irregular + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…TDS
రెండు వారాల తర్వాత ఆమె శక్తి స్థాయి 50% మెరుగుపడింది. సెప్టెంబర్ 21న చాలాకాలం తర్వాత సాధారణ స్థాయిలో ఆమెకు రుతుస్రావం వచ్చినప్పుడు ఆమె పొంగిపోయారు. ఆ తర్వాత సాధారణ రక్తస్రావంతో ఆమె పీరియడ్స్ సక్రమంగా ఉంటున్నాయి. 2020 జులైలో మోతాదు OD కి తగ్గించబడింది, దానిని ఆమె మెయింటనెన్స్ మోతాదుగా తీసుకుంటున్నారు. 2022 ఫిబ్రవరి నాటికి ఆమె చక్కగా ఉన్నారు, ఆమె శక్తి స్థాయి కూడా బాగానే ఉంది. 15 సంవత్సరాల సమస్య ఒక నెలలో పరిష్కరింపబడిన ఈ అద్భుతమైన విజయమే ఆమెను వైబ్రియానిక్స్ కోర్సు చేయడానికి ప్రేరేపించి 2021 నవంబర్లో ఆమె ప్రాక్టీషనర్ గా అర్హత సాధించారు.
నిద్రా వైకల్యం, కోవిడ్-19 తదనంతర సమస్యలు, చిత్తవైకల్యపు మందుల యొక్క ప్రతికూల ప్రభావాలు 03598...UK
87 సంవత్సరాల వ్యక్తికి 2019లో తేలికపాటి చిత్తవైకల్యం ఉన్నట్లు నిర్ధారణ అయింది, కానీ దీనికి ఎలాంటి ఔషధం తీసుకోవలసిన అవసరం రాలేదు. అతను కోవిడ్-19 నుండి బయట పడిన కొన్ని నెలల తర్వాత 2020 జూలైలో అతను దీర్ఘకాల కలత నిద్రకు గురికావడంతో ఆ సమయంలో అతనిలో ఆందోళన, నిద్రలో కేకలు వేయడం వంటి లక్షణాలు పెంపొందాయి. ఇలా నెలలో రెండు మూడు సార్లు సమస్య ఏర్పడడంతో సంరక్షకులకు ఆ సమయంలో అతనిని మేల్కొల్పడం కూడా కష్టంగా ఉంది. 2021 జూన్ లో అతని చిత్త వైకల్యం కోసం అరిసెప్ట్ ఔషధాన్ని సూచించారు. దీనివల్ల ఉదయం నిద్రలేవగానే విపరీతమైన బలహీనత, నడవడంలో ఇబ్బంది, మరియు కొద్దిపాటి శ్రమకు కూడా గుండె దడ, ఊపిరి అందకపోవడం వంటి లక్షణాలు ఏర్పడ్డాయి. ఎరిసెప్ట్ వాడడం మానివేస్తే ఈ లక్షణాలు ఆగిఓపోతున్నాయి కానీ తిరిగి ప్రారంభించిన తర్వాత పునరావృతం అవుతున్నాయి. అతని కార్డియాలజిస్ట్ ఇవి ఎరిసెప్ట్ ఔషధం యొక్క దుష్ప్రభావాలని ధ్రువీకరించారు, అయితే ఇవి కలుగుతున్నప్పటికి వారు దాన్ని కొనసాగించాలనే నిర్ణయించుకున్నారు. 2021 సెప్టెంబర్ 10న ఇతనికి నిద్ర రుగ్మతల కోసం క్రింది రెమిడీ ఇవ్వబడింది:
#1. CC15.6 Sleep disorders…1 dose నిద్రించ డానికి 30 నిమిషాల ముందు
మూడు వారాల తర్వాత పీడకల ఫ్రీక్వెన్సీ తగ్గింది. అతనికి ఇప్పుడు మూడు వారాల్లో ఒకసారి మాత్రమే ఇలా కలుగు తున్నది అనగా 30% మెరుగుదల ఏర్పడింది. నిద్రపోవడం ఎప్పుడూ అతనికి సమస్య కాలేదు కానీ అతను ఇప్పుడు మరింత గాఢ నిద్ర పోతున్నట్లు భావించాఋ. అక్టోబర్ 3న అతని చిత్తవైకల్యం మరియు అరిసెప్ట్ ఔషధం యొక్క దుష్ప్రభావాలు ఎదుర్కోవడానికి ఈ క్రింది రెమిడీ అందించబడింది:
#2. CC3.4 Heart emergencies + CC3.6 Pulse irregular + CC9.1 Recuperation + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC17.3 Brain & Memory tonic + CC18.2 Alzheimer’s disease…TDS
దీనివలన ఎటువంటి మెరుగుదల కలగక పోవడంతో అక్టోబర్ 20న #2 క్రింది విధంగా మెరుగుపరచబడినది:
#3. Aricept potentised at 200C + #2…TDS
నవంబర్ 15 నాటికి అనగా ఒక నెల కంటే తక్కువ వ్యవధిలోనే రోగి 100% మెరుగైన అనుభూతిని పొందినట్లు తెలిపారు. అతని శక్తి స్థాయిలు సాధారణ స్థితికి రావడం మరియు అతని నడక మరియు శ్వాస ఇబ్బందులు ఇంకా గుండె దడ పూర్తిగా తొలగిపోయినందుకు అతను ఎంతో ఆనందించారు. అతనికి పీడకలల విషయంలో క్రమమైన తగ్గుదల కలిగి చివరి సారిగా డిసెంబర్ 1న ఏర్పడింది. ఆరు వారాల పాటు కలత నిద్రలు అనుభవించిన అనంతరం 2022 జనవరి మధ్యలో #1 తీసుకోవడం ఆపివేయబడింది. 2022 ఫిబ్రవరి నాటికి రోగి ప్రశాంతమైన నిద్రను కొనసాగిస్తున్నారు మరి ఇప్పుడు అరిసెప్ట్ ను సిఫార్సు చేయబడిన మోతాదులో సగమే కొనసాగిస్తున్నారు. అతను చిత్త వైకల్యాన్ని నివారించడానికి మరియు అరిసెప్ట్ యొక్క దుష్ప్రభావాలను ఎదుర్కోవడానికి #3 ను TDS గా కొనసాగించడానికి ఇష్టపడుతున్నారు.
భయము 11581...India
35 ఏళ్ల మహిళకు 2020 మే నెలలో రుతుక్రమంలో విపరీతమైన రక్తస్రావం జరిగింది. ఎప్పుడూ సాధారణ స్థాయిలో రుతుక్రమం కొనసాగే క్రమంలో ఆమెకు ఇది అసాధారణమైన మరియు భయపెట్టే అనుభవం. రెండు నెలల పాటు తీసుకున్న అల్లోపతీ చికిత్స ఈ సమస్యను పరిష్కరించింది. ఐతే రక్తస్రావం అవడం, భయం వలన మరియు ఆచరణాత్మకంగా అనేక విషయాలలో ఉదాహరణకు తన కుటుంబం పట్ల భయం, భవిష్యత్తు పట్ల ఆందోళన మొదలైన విషయాల కారణంగా ఇది ఎక్కువ ఔతోంది. చివరికి తాను చూసిన టీవీ షోలలో ఘటనలను తన జీవితానికి అన్వయించుకోవడం ప్రారంభించారు. ఆమె భయాలు త్వరలోనే అహేతుకంగా మరియు విపరీతంగా మారడంతో ఆమె ఆందోళన తీవ్రమైంది. ఆమె ఒక మనోరోగ వైద్యులను సంప్రదించారు. వారు సూచించిన యాంటీ డిప్రెసెంట్స్ పనిచేయక పోవడంతో ఆపివేశారు. 2020 నవంబర్ 5 న ఆమె అత్తగారు ప్రాక్టీషనరును సంప్రదించగా క్రింది రెమిడీ ఇచ్చారు:
CC8.1 Female tonic + CC8.7 Menses frequent + CC15.1 Mental & Emotional tonic + CC15.2 Psychiatric disorders + CC17.2 Cleansing…TDS
దీనికి అదనంగా ప్రాక్టీషనర్ రోగిని ఫోన్ ద్వారా కౌన్సిలింగ్ చేసి ఆమెలో ధైర్యాన్ని నింపి, ఆమె త్వరలోనే పూర్తిగా కోలుకుంటుందని హామీ ఇచ్చారు. వారం తర్వాత రోగి తన భయాలు అలాగే ఉన్నాయని తెలియజేయడానికి కాల్ చేశారు. కనీసం మరో మూడు వారాల పాటు కొనసాగించాలని ఆమెకు ప్రాక్టీషనరు సూచించారు. కేవలం రెండు వారాల తర్వాత రోగి మరలా ఫోన్ చేసి ఏమాత్రం మార్పు లేదని చెప్పారు. ఆమెకు మరో మందు ఇస్తానని దీంతో త్వరగా నయమవుతుందని ఐతే ఒక నెల రోజుల పాటు తీసుకోవాలని చెపుతూ గతంలో ఇచ్చిన రెమిడీనే బాగా పనిచేస్తుందనే విశ్వాసంతో దానినే పునరావృతం చేశారు. ఆమె కొద్దిగా రక్తహీనతతో ఉన్నట్లు కనిపించడంతో ఆమె తన స్థాయిని మెరుగు పరచడానికి ప్రతిరోజూ దానిమ్మ మరియు ఖర్జూరం తినమని సలహా ఇచ్చారు.
2021 ఫిబ్రవరి 10 న రోగి తన భయాలు పూర్తిగా పోయాయని ఇప్పుడు ఆమె పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. మోతాదు పదిరోజులకు OD కి తగ్గించబడింది, ఆ తర్వాత గోళీలు అయిపోయే వరకు కొన్ని వారాలపాటు OW కి తగ్గించబడింది. 2022 జనవరి నాటికి ఆమె బాగానే ఉన్నారు.
కీటకాల కాటుకు అలర్జీ 11634...India
మూడు సంవత్సరాల బాలుడు దోమలు మరియు చీమలు కుట్టడం వలన కలిగే అలెర్జీ తో సంవత్సరం నుండి బాధపడుతున్నాడు. కాటు ఏర్పడిన ప్రదేశంలో ఎరుపుదనం, వాపు మరియు నిరంతరం దురద రెండు నుంచి మూడు రోజుల పాటు కొనసాగి తర్వాత దానంతట అదే అదృశ్యమౌతుంది. పిల్లవాడు రోజుకు కనీసం ఒక కొత్త దోమ కాటుకు గురి ఔతూ ఉండేవాడు కానీ ఎప్పుడూ చికిత్స తీసుకోలేదు. తల్లి బాలుడిని ప్రాక్టీషనరు వద్దకు తీసుకుని వచ్చినప్పుడు బాలుడు తన చేతిపై వాపుతో కూడిన ఎర్రని భాగాన్ని గోకుతూ ఉన్నాడు. 2021 సెప్టెంబర్ 4 న అతనికి క్రింది రెమిడీ ఇవ్వబడింది:
CC21.3 Skin allergies + CC21.4 Stings & Bites…TDS నీటితో, అలాగే బాహ్య అనువర్తనం కోసం కాటుకు గురైన మచ్చ గల ప్రదేశంలో రాయాలి.
11 రోజుల తర్వాత సెప్టెంబర్ 15న అన్ని మచ్చలు అదృశ్యమయ్యాయి అని తల్లి తెలిపారు. మొదటి మోతాదు తర్వాత బాలుడికి దురద ఏర్పడలేదు, అలాగే కొత్త మచ్చలు కూడా కనిపించలేదు. టిడిఎస్ వద్దని కొనసాగించ పడింది మరియు దాని మోతాదు నెమ్మదిగా తగ్గించమని సలహా ఇచ్చినప్పటికీ తల్లి రెండు వారాల పాటు దానిని TDS వద్ద కొనసాగించి తర్వాత ఆపివేశారు. 2022 ఫిబ్రవరిలో జరిగిన సమీక్షలో బాలుడు అప్పటి నుండి పూర్తిగా క్షేమంగా ఉన్నాడని తల్లి ధ్రువీకరించారు.
అధికముగా ఉప్పు తినాలనే కోరిక 12051...India
5 సంవత్సరముల బాలికకు రెండు సంవత్సరాల వయసు నుంచే ఉప్పు మరియు ఉప్పగా ఉండే పదార్థాలు పట్ల విపరీతమైన కోరిక ఉండేది. తల్లి ఇంటి సహాయకురాలిగా పనిచేస్తూ ఉండగా సమీపంలోని దుకాణానికి వెళ్లి తన పాకెట్ మనీతో ఉప్పగా ఉండే ఊరగాయ చిన్న ప్యాకెట్ కోసం ఖర్చు చేస్తూ ఉండేది. ఇంట్లో ఆమె ఉప్పు మరియు ఇటీవల నిమ్మకాయ వంటి పుల్లని పండ్లు తినడానికి అలవాటు పడింది. తల్లిదండ్రులు ఈ అలవాటు అడ్డుకునేందుకు అనేక విధాలుగా ప్రయత్నించినా ఫలించలేదు. ఆమెకు ఆకలి తక్కువగా ఉన్నందున బరువు తక్కువగా ఉంది మరియు ఎప్పుడూ కాలు నొప్పి గురించి ఫిర్యాదు చేస్తూ ఉండేది. డాక్టర్లు కొన్ని పరీక్షలు సిఫారసు చేసినా ఇష్టం లేక తల్లిదండ్రులు అవి చేయించ లేదు. 2021 ఫిబ్రవరి 12న ఈ విషయాలను చెప్పినపుడు ప్రాక్టీషనరు ఆమెకు క్రింది రెమిడీ ఇచ్చారు.
CC6.1 Hyperthyroid + CC12.2 Child tonic…TDS
18 రోజుల తర్వాత మార్చి 2న తన కుమార్తెకు కోరికలు 80% తగ్గాయని మరియు ఇప్పుడు బాగా తింటున్నదని తల్లి సంతోషంగా తెలియజేశారు. మే 21 నాటికి ఇది 100% మెరుగుపడింది మరియు అమ్మాయి అదనపు ఉప్పును ఇచ్చినా కూడా తినలేదు. మోతాదు రెండు వారాలకు BD మరో రెండు వారాలకు OD కి తగ్గించబడి జూన్ 16న ఆపివేయ బడింది. 2022 నాటికి తన బిడ్డ ఆరోగ్యం మెరుగైందని బరువు పెరిగిందని మరియు కాలు నొప్పి గురించి ఫిర్యాదు చేయడం లేదని తల్లి చాలా సంతోషంగా తెలియజేశారు.
ప్రాక్టీషనర్ల వివరాలు 03108...Greece
ప్రాక్టీషనర్ 03108...గ్రీస్ మార్కెటింగ్ మరియు కామర్స్ లో మాస్టర్స్ డిగ్రీ తోపాటు బయో కెమిస్ట్రీలో వీరు గ్రాడ్యుయేషన్ చేసారు. స్వామికి అనుంగు భక్తురాలు కాననే భావన వీరికి ఉన్నప్పటికీ ఆమె తల్లి బాబా సాహిత్యము చదువుతూ ఉండడం మరియు ఇంట్లో
ఎప్పుడూ విభూతి ఉండడంతో చిన్నతనం నుండి స్వామి ఫోల్డు లోనే ఉన్నారు. వీరి ఇంటికి సమీపంలో ఉన్న దుకాణంలో ఉన్న పెద్ద కిటికీని కవర్ చేస్తూ సత్య సాయి బాబా వారి నిలువెత్తు పటం ఉంది. స్వామి మానవాళి కోసం చేస్తున్న వివిధ బృహత్తరమైన మానవతా ప్రాజెక్టుల పట్ల అభిమానం ఉంది .
ప్రాక్టీషనర్ యొక్క 4 ఏళ్ల కుమార్తెకు తన శరీరం అంతటా దురద దద్దుర్లు ఏర్పడినప్పుడు ఆమె విభూతి యొక్క శక్తిని ప్రత్యక్షంగా అనుభవించారు. తన కూతుర్ని ఆసుపత్రికి తీసుకు వెళ్లే ముందు ఆమె ప్రభావిత ప్రాంతాలపై కొంత విభూతిని రాయగా ఆమెను చాలా ఆశ్చర్యానికి గురిచేస్తూ దురద, దద్దుర్ట్లు వెంటనే మాయమయ్యాయి. ఇది పెన్సిల్ రాతను తుడిపివేసే ఎరాజరు లాగా పనిచేసి నిమిషాల వ్యవధిలోనే చర్మం మొత్తం సాధారణం అయింది.
ఈ సంఘటనతో జీవితం మరియు ప్రకృతి యొక్క అద్భుతాలను కేవలం సైన్స్ అనే భూతద్దం ద్వారా బహిర్గతం చేయలేమని ప్రారంభంలోనే ప్రాక్టీషనర్ గ్రహించారు. బాల్యంలో ఈ ప్రాక్టీషనర్ హోమియోపతిక్ మరియు రికీ చికిత్సలు తీసుకున్నారు. రెండు చాలా ప్రయోజనకరంగా ఉన్నాయి. పెద్దయ్యాక తన కుటుంబానికి మరియు తనకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ ప్రత్యామ్నాయ పద్ధతులను కోరుకుంటూ ఉండేవారు. 20 సంవత్సరాల క్రితం ఒక స్నేహితుడు తన చిన్న పిల్లలకు ఎప్పుడు జలుబు లేదా జ్వరం వచ్చినా వారికి అందించడానికి వైబ్రియానిక్స్ రెమిడీ ఇచ్చారు. ఇది ఒక మాయా మంత్రదండం వలె నిరూపించబడి ఆమెకు అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. 2014లో ఇదే స్నేహితుడు డాక్టర్ అగర్వాల్ త్వరలో గ్రీస్ లో ఒక సెమినార్ నిర్వహించ బోతున్నారని తెలిపారు. ఇదే వైబ్రియానిక్స్ తో ప్రయాణానికి ఆరంభం, ఇది ఆమె తన జీవితంలో అంతర్భాగంగా నిలిచిన వైబ్రియానిక్స్ యొక్క విలువైన బహుమతిగా భావించారు.
వైబ్రియానిక్స్ అభ్యసించే అవకాశాలు ఆమెకు చాలా ఊహించని విధంగా లభించేవి. ఆమె ఎటువంటి కారణం లేకుండా కొన్ని సార్లు అపరిచితులతో వైబ్రియానిక్స్ గురించి మాట్లాడుతూ ఉన్నట్లు కనుగొన్నారు. అంతేకాక వారు ఆమె నుండి చికిత్స తీసుకోవడానికి సిద్ధంగా ఉండటం చూసి ఆశ్చర్య పోయేవారు. ఒకసారి ఆమె ఒక మార్కెట్ వీధిలో ఆరోగ్యంగా కనిపిస్తున్న చేపల వ్యాపారిని చూసి వైబ్రియానిక్స్ గురించి మాట్లాడటం ప్రారంభించారు. థైరాయిడ్ శస్త్ర చికిత్స తర్వాత ప్రాణాంతకమైన ఆమె పరిస్థితి గురించి అలాగే తనకు ఏర్పడిన భయం మరియు అభద్రతా భావమునకు సంబంధించి ఆ విక్రేత చికిత్సను అభ్యర్థించారు. మరుసటివారం ప్రాక్టీషనరు ఆమెకు ఈ రెమిడీ ఇచ్చారు: NM6 Calming + NM12 Combination 12 + NM25 Shock + NM95 Rescue Plus + NM110 Essiac + BR2 Blood Sugar + BR3 Depression + BR4 Fear + SR308 Pituitary Gland + SR521 Pineal Gland ప్రతీవారం ఆమెను కలుసుకోవడం కొనసాగిస్తూ తదుపరి రెండున్నర నెలల పాటు వీధి మార్కెట్లో అవసరమైనప్పుడు ఆమెకు రీఫిల్ బాటిల్ ను అందజేయ సాగారు. ఈ సమయంలో రోగి తన భయాన్ని మరియు అభద్రతా భావాన్ని పూర్తిగా అధిగమించారు.
రెండు సంవత్సరాలుగా టిన్నిటస్ తో బాధపడుతున్న 53 ఏళ్లు ఎలక్ట్రీషియన్ మరియు అటువంటి అనేకమంది రోగుల విషయంలో ప్రాక్టీషనర్ విజయం సాధించారు. కళ్ళు తిరగడంతో ఎక్కువ గంటలు నిలబడలేక పోవడం ఎలక్ట్రిక్ డ్రిల్ యొక్క శబ్దము వలన అతని సమస్య తీవ్రం కావడంతో అతను పూర్తి సమయం పని చేయలేక పోయేవారు. ఆమె అతనికి CC5.3 Meniere’s disease + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC18.7 Vertigo…TDS. ఇచ్చారు. ఆరు నెలల తర్వాత రోగిని కలుసుకొన్నప్పుడు ఒక బాటిల్ తోనే ఆరు వారాల పాటు వాడి తాను పూర్తిగా కోలుకున్నట్లు అతడు చెప్పగా విని ఎంతో ఆనందించారు. ఒక గొప్ప విషయం ఏమిటంటే అతను చెప్పిన ప్రకారం చికిత్స ప్రారంభించిన తర్వాత వెర్టిగో వ్యాధి లక్షణాలు చాలా ఎక్కువై నప్పటికీ (బహుశా పుల్లౌట్ కావచ్చు) రెమిడీ కొనసాగించారు. ఆమె CC10.1 Emergencies యొక్క అధిక ప్రయోజనాన్ని ప్రత్యక్షంగా చూసి ఎల్లప్పుడు దాన్ని తన వెంట తీసుకుని వెళుతూ ఉంటారు. మానసిక స్థితి పరంగా చికిత్సలో అడ్డంకులు ఉన్నవారికి బ్యాచ్ రెమిడీలు(Bach remedies) అద్భుతంగా పనిచేస్తాయని, అలాగే 24/7 మానసిక వత్తిడితో బాధ పడేవారికి NM6 Calming చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఆమె కనుగొన్నారు.
ఆమె అనేక సంవత్సరాలుగా వైబ్రియానిక్స్ సాధనలో అభివృద్ధి చెందారు. ప్రారంభంలో తప్పులు చేస్తున్నానేమో అని భయంతో ఉండేవారు కానీ కాలాంతరంలో తాను దేవుడు(నిజమైన వైద్యుడు) మరియు రోగికి మధ్య మధ్యవర్తి మాత్రమే అనే ధృఢమైన విశ్వాసానికి దారితీసింది. ఆమె రెమిడీ లు ఇస్తున్నప్పుడు తరచుగా స్వామితో మాట్లాడుతూ ఉంటారు, ఆమె అభిప్రాయం ప్రకారం రాంగ్ రెమిడీ అనేది లేదని మన తర్కానికి అతీతంగా సరియయిన రెమిడీ తనంతట తానే మన చేతులలోనికి వస్తుందని చెప్పారు. సరియైన విధానం ఏమిటంటే మన చెవులతో కాక హృదయంతో రోగులు చెప్పేది వినాలని ఆమె పేర్కొంటున్నారు. రోగులకు చికిత్స చేయడం మరియు వారి కథలను వినడం ద్వారా ఆమె వ్యక్తిగత సమస్యలను పరిష్కరించు కోవడానికి, మరియు మన జాతీయత, మతము, హోదా, మొదలైన వాటికి అతీతంగా మనమందరము కనెక్ట్ అయి ఉన్నాము అని గ్రహించడంలో సహాయపడింది. వాస్తవానికి ఇది యాధృచ్ఛికమే అయినప్పటికి చాలా తరచుగా ఆమె చేత రోగికి అందించబడిన రెమిడీ తాను స్వయంగా తీసుకున్నట్లు భావన స్పురింప జేసింది.
ఒక ప్రాక్టీషనరుగా ఆమె దేవుడు మరియు రోగుల పట్ల తనకున్న నిబద్ధతను చాలా బాధ్యతా యుతమైనదిగా పరిగణిస్తున్నారు. రోగులకు సేవతో పాటు ఆమె వైబ్రియానిక్స్ వార్తాలేఖలను గ్రీకు భాషలోకి అనువదించడంలో పాల్గొంటున్నారు. వార్తాలేఖలు జ్ఞానం యొక్క అక్షయ పాత్రలు వంటివి కనుక వాటిని అందరూ చదవాలని ఆమె కోరుతున్నారు. వైబ్రియానిక్స్ అధ్యయనము మానవ శరీరం యొక్క సంక్లిష్టత అర్థం చేసుకోవడానికి ఎంతో సహాయపడుతుంది కనుక వైబ్రియానిక్స్ హ్యాండ్ బుక్కులు 1 మరియు 2 అలాగే సోహం సిరీస్ యొక్క 7 పుస్తకాలు ప్రాక్టీషనర్లు అందరూ తప్పక చదవవలసి ఉందని ఆమె తెలుపుతున్నారు. ఒక మంచి ప్రాక్టీషనర్ గా ఉండడం అనేది నిరంతరం అధ్యయనం మరియు పరిశోధన అవసరమయ్యే ఒక నిరంతర ప్రక్రియ అని వీరి అభిప్రాయం.
మనలో ప్రతీ ఒక్కరూ మన ప్రతిభకు అనుగుణంగా సమాజానికి తోడ్పడాలని ఆమె ఆకాంక్షిస్తున్నారు. వైబ్రియానిక్స్ సేవ తనకు స్వామి నుండి బహుమతిగా వచ్చిన మార్గం అని, స్వామి తనను ఒక పరికరంగా ఎంచుకున్నందుకు ఆమె కృతజ్ఞత వ్యక్తం చేస్తున్నారు.
పచుకున్న కేసులు
ప్రాక్టీషనర్ల వివరాలు 11622...India
ప్రాక్టీషనర్ 11622…ఇండియా మార్కెటింగ్ మేనేజ్మెంట్ లో మాస్టర్ డిగ్రీ, ఫార్మసీ లో గ్రాడ్యుయేషన్ కలిగిఉన్న ఈ ప్రాక్టీషనర్ ఒక ఫార్మా పరిశ్రమకు బ్రాండ్ బిల్లింగ్ మరియు ప్యాకేజీ మెటీరియల్ను అందించడంలో మద్దతుగా ఉంటూ పురోభివృద్ధి కరమైన వ్యాపారాన్ని
నడుపుతున్నారు. 1998లో ఒక పనిమీద శ్రీలంక పర్యటనకు వెళ్ళినప్పుడు(ఆ సమయంలో అక్కడ అంతర్యుద్ధం జరుగుతోంది) ఒక అదృశ్య శక్తి తనను నిరంతరం కాపాడుతూ ఉన్నట్లు భావించారు. అక్కడ ఆయన సందర్శించిన పలువురు వైద్యుల ఇళ్ళు మరియు క్లినిక్ లలో స్వామి వారి ఫోటోలు చూశారు. భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు స్వామివారి దర్శనం కావాలని ఆశిస్తూ అతను బృందావనం (బెంగళూరు లో స్వామివారి ఆశ్రమం) సందర్శించారు. పాద నమస్కారం ప్రసాదించడం ద్వారా స్వామి ప్రేమతో వీరిని తన ఫోల్డ్ లోనికి తీసుకున్నారు.
అప్పటి నుంచి ఈ సాధకుడు సాయి సంస్థ కార్యకలాపాల్లో ఆనందంగా పాల్గొంటూ 2018 నుండి జిల్లా సేవా సమన్వయకర్తగా సేవలు అందిస్తున్నారు. వీరు క్రమం తప్పకుండా సేవాదళ్ గా సేవచేస్తు ప్రశాంతి నిలయం లో జరిగిన అనేక సాయి కార్యక్రమాలకు పోస్టర్లను రూపొందించడం మరియు ముద్రించే పని చేపట్టారు. 2019 ప్రారంభంలో అతను వైట్ ఫీల్డ్ లోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో వైబ్రియానిక్స్ క్లినిక్ కోసం పోస్టర్ ను డిజైన్ చేశారు. అదే వీరు వైబ్రియానిక్స్ వైద్యం గురించి మొదటిసారి వినడం ఆ తరువాత వెంటనే దాని వైపు ఆకర్షింపడి మరింత సేవ చేయడానికి దీన్ని ఒక అద్భుతమైన అవకాశంగా తీసుకున్నారు. తనంతట తాను శిక్షణా కార్యక్రమంలో పేరు నమోదు చేసుకుని 2020 ఫిబ్రవరిలో AVP గా మరియు ఆరు నెలల తర్వాత VP గా అర్హత సాధించారు. వీరు ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో సేవలు అందిస్తూ ప్రాంతీయ కోఆర్డినేటర్ గా ప్రశాంతినిలయంలో సేవ చేసే వారికి IB పంపిణీ చేయడంలో చురుకుగా పాల్గొంటున్నారు.
రెండు సంవత్సరాల ప్రాక్టీస్ లో అతను అనేక అద్భుత సంఘటనలు చూసారు. ఒకసారి ఒక సాయి భక్తురాలు తనకు మరియు తన కుటుంబానికోసం IB(ఇమ్యూనిటీ బూస్టర్) అడిగారు. ఆమె దాన్ని స్వీకరించిన రోజు షిరిడి బాబా ఆమెకు కనిపించి తనకు అమృతాన్ని(దైవ మధువును) ఇచ్చి దాన్ని ఇతరులకు ఇవ్వమని కోరినట్టుగా ఆమెకు ఒక అందమైన కల వచ్చింది. షిరిడి సాయిబాబా వైబ్రియానిక్స్ ను అమృతంతో సమానం చేసారు!
దీర్ఘకాలిక IBS మరియు గ్లూటెన్ లేదా మైదా అసహనంతో బాధపడుతున్న 81 ఏళ్ల మహిళకు చికిత్స చేస్తున్న ప్రయత్నంలో వీరు అద్భుతమైన విజయాన్ని సాధించారు. అల్లోపతీ ఆమెకు పనిచేయలేదు. వీరు ఆమెకు: CC4.1 Digestion tonic + CC4.2 Liver & Gallbladder tonic + CC4.10 Indigestion + CC12.1 Adult tonic…TDS. ఇచ్చారు. ఒక వారం తర్వాత పేషెంట్ కుమార్తె ఉత్సాహంగా తన తల్లి ఎలాంటి దుష్పరిణామాలు లేకుండా తనకు నచ్చినది తింటున్నదని అతనికి తెలిపారు. అప్పటినుండి రోగి సాధారణ ఆహారం తీసుకుంటూ ఉన్నారు. ఒకసారి అతను తన ఇంటి పని మనిషికి CC11.3 Headaches అందించినప్పుడు ఆమె కేవలం ఒక వారం వ్యవధిలో రీఫిల్ కోసం తిరిగి వచ్చిందని కనుగొన్నారు. ఆమెను విచారించగా తనకు చాలా ఏళ్లుగా ఉన్న వ్యాధి మూడు రోజులలో తగ్గిపోయిందని అందుచేత తన చుట్టుపక్కల తల నొప్పితో బాధపడుతున్న వారికి ఆమె ఈ రెమిడీ ని పంచుతున్నట్లు అతనికి చెప్పారు. రోగి యొక్క నిస్వార్ధ సేవా భావం ప్రాక్టీషనరును మరింత ఉత్సాహంతో సేవ చేయడానికి ప్రేరేపించింది.
వైబ్రియానిక్స్ సేవ కోసం సాయి కేంద్రానికి బయలు దేరుతున్నప్పుడు అతని భార్య కారు డోరులో తన బొటనవేలు ఇరుక్కు పోయినప్పుడు వైబ్రియానిక్స్ యొక్క సమర్ధత గురించి అతనికి వ్యక్తిగత అనుభవం కలిగింది. ఆమెకు షాక్ మరియు నొప్పితో ఊపిరి సలపలేదు. ప్రాక్టీషనర్ వెంటనే ఆమె నోటిలో CC10.1 Emergencies మరియు CC18.5 Neuralgia ఒక మోతాదు వేసారు. కొన్ని నిమిషాల్లోనే ఆమె చాలా మెరుగైన అనుభూతిని పొంది తమ ప్రయాణం కొనసాగించారు. క్లినిక్ లో అతను: CC3.2 Bleeding disorders + CC10.1 Emergencies + CC18.5 Neuralgia + CC20.4 Muscles & Supportive tissue తయారు చేసి ఇవ్వగా ఆమె దానిని తరచూ తీసుకొనసాగారు, రెండు గంటలలో వాపు తగ్గింది. ఆమె ఎంతగా కోలుకున్నారంటే ఆ తర్వాత నాలుగు గంటల పాటు రెమిడీస్ సిద్ధం చేయగలిగారు.
ప్రాక్టీషనర్ 15 సంవత్సరాలకు పైగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న చాలా మంది రోగులను దృష్టిలో ఉంచుకుని అతను “సాయి అభయం”(భయం యొక్క కారణాలు తొలగించడం): CC3.1 Heart tonic + CC7.1 Eye tonic + CC12.1 Adult tonic + CC13.1 Kidney & Bladder tonic + CC15.1 Mental & Emotional tonic + CC17.2 Cleansing + CC18.1 Brain disabilities + CC 21.11 Wounds & Abrasions. అనే కోంబోను తయారు చేసారు. మధుమేహం వంటి ఏదైనా జీవనశైలి వ్యాధికి ఈకాంబో ను మిళితం చేసి అద్భుతమైన ఫలితాలు పొందారు.
రోగులతో సంభాషించడం తనకు తానుగా పనిచేయడానికి, సహనం, ఓపిక, మరియు మనస్సు కంటే హృదయంతో ఎక్కువ పని చేయడం నేర్పిందని ప్రాక్టీషనర్ అంగీకరిస్తారు. రోగితో సంభాషించే ప్రతీ అవకాశం స్వామి గురించి ఆలోచించే అవకాశం గానూ, రోగికి రెమిడీ తయారుచేసి ఇవ్వడం స్వామిని ప్రార్ధించడానికి ఒక అవకాశం గానూ భావిస్తారు. కనుక వైబ్రియానిక్స్ కు ఎక్కువ సమయం కేటాయించడం ద్వారా భవిష్యత్తును మార్చే ఈ మిషన్ కు సహకరించడం ద్వారా స్వామి వారి దివ్య ప్రేమను అనుభవించాలని ఆయన ప్రాక్టీషనర్లు అందరినీ కోరుతున్నారు.
పంచుకున్నకేసులు
ప్రశ్నలు జవాబులు
Q1. వైబ్రేషన్ తో కూడిన ఆల్కహాల్ నా దగ్గర ఉంది కానీ దానితో నాకు అవసరం లేదు. ఎస్ ఆర్. హెచ్ పి మిషన్ లో దీన్ని తటస్థీకరించడం సాధ్యమవుతుందా?
A. అవును, న్యూట్రలైజ్ చేసే విధానం షుగర్ మాత్రల మాదిరిగానే ఉంటుంది. సీనియర్ ప్రాక్టీషనర్ మాన్యువల్ అధ్యాయం 3 చూడండి.
________________________________________________________________________________
Q2. కుటుంబంలో వచ్చే వ్యాధులకు ముందస్తు నివారణ మోతాదు వ్యవధిని తెలుపగలరా ?
A. దాదాపు అన్నిఅనారోగ్య పరిస్థితులు మరియు వ్యాధులు జన్యుపరమైన/ వంశపారంపర్య అంశాలను కలిగి ఉన్నాయని పరిశోధకులు విశ్వసిస్తున్నారు, అయితే అనేక రుగ్మతలకు కారణాలు చాలా క్లిష్టంగా ఉంటాయి. ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి యొక్క కుటుంబ చరిత్ర ఉన్నప్పుడు సాధారణ మోతాదు OW. కానీ రోగికి వ్యాధి వస్తుందనే భావన లేదా సూచనలు లేదా అట్టి భయం ఉంటే నెల వరకూ OD అనంతరం OW. అయితే గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే వారసత్వంగా మరియు జన్యుపరమైన కారకాలు కొన్ని వ్యాధులకు గురయ్యే అవకాశం కల్పిస్తున్నప్పటికీ జీవనశైలిలో మార్పుల ద్వారా దీన్ని తగ్గించవచ్చు. ఉదాహరణకు ఆరోగ్యకరమైన ఆహారం, మంచి నిద్ర, కొన్ని ఆధ్యాత్మిక సాధనలు మరియు క్రమం తప్పకుండా చేసే వ్యాయామం.
________________________________________________________________________________
Q3. పగటి పూట రెమిడీ ఒక మోతాదు మాత్రమే తీసుకోవాల్సి వచ్చినప్పుడు రోగి యొక్క అలవాట్లు మరియు అభిరుచులకు అనుగుణంగా ఇతర సమయాల్లో కాకుండా రాత్రి నిద్రపోయే ముందు లేదా ఉదయం మేల్కొన్నప్పుడు దాన్ని ఎందుకు తీసుకోవాలని సిఫార్సు చేయబడింది? IB ని ఉదయాన్నే పళ్ళు తోముకో కుండా తీసుకోమని చెప్పడంలో లాజిక్ ఏమిటి?
A. నాడీ వ్యవస్థ విశ్రాంతిగా ఉన్నప్పుడు వైబ్రియానిక్స్ రెమిడీలు ఉత్తమంగా పనిచేస్తాయి. ఉదయాన్నే మీరు నిద్ర నుంచి మేల్కొన్నప్పుడు లేదా రాత్రి మీరు నిద్రపోవడానికి సిద్ధమవుతున్నప్పుడు మీరు పూర్తి విశ్రాంతి తీసుకుంటారు. అందువల్ల ఈ సమయాల్లో ఒకే మోతాదు/OD సిఫార్సు చేయబడింది. నిద్ర లేవగానే IB తీసుకోవడం అనేది గుర్తుంచుకోవడం సులభం మరియు రోజంతా ఇది కుటుంబ సభ్యులకు సంభవింపబోయే ఇన్ఫెక్షన్ నుండి రక్షణ అందిస్తుంది. అలాగే మీరు 20 నిమిషాలు ముందు ఏమీ తినకుండా ఉండాలనే నియమానికి భంగం కలుగదు. అయితే రెమిడీ తీసుకున్న తర్వాత కనీసం 20 నిమిషాల పాటు ఏదీ తినకూడదని లేదా పళ్ళు తోముకోకుండా ఉండాలని గుర్తుంచుకోవాలి.
________________________________________________________________________________
Q4. నవజాత శిశువుకు ఇవ్వగలిగే రెమిడీలు ఏమైనా ఉన్నాయా?
A.. సాధారణంగా నవజాత శిశువు యొక్క రోగనిరోధక వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందకుండా ఉన్నందున ఆరోగ్యకరమైన శిశువుకు వైబ్రియానిక్స్ ఇవ్వకూడదని సిఫార్సు చేయబడింది. అయినప్పటికీ నవజాత శిశువులు బాహ్య ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఎదుర్కొనే షాక్ ను తట్టుకునేందుకు CC10.1 Emergencies లేదా NM25 Shock ఒక సింగిల్ డోస్ ఇవ్వండి. అలాగే కోవిడ్-19 కోసం ముందస్తుగా IB ఒక సింగిల్ డోస్ ఇవ్వండి. ఇక్కడ సింగిల్ డోస్ అంటే ఒక చుక్క రెమిడీ నీరు శిశువు యొక్క నాలుగు పై ఉంచాలి. ఈ సమాధానం గతంలో సంపుటి 12 సంచిక 2 లో ఇచ్చిన సమాధానాన్ని భర్తీ చేస్తుంది.
ఒకవేళ శిశువు నెలలు నిండకుండా పుట్టినా లేదా బలంగా మరియు ఆరోగ్యంగా లేకున్నాCC3.1 Heart tonic + CC4.1 Digestion tonic + CC11.5 Mouth infections + CC12.2 Child tonic + CC18.1 Brain disabilities + 19.1 Chest tonic OR NM5 Brain TS + NM12 Combination-12 + NM22 Liver + NM49 Chest Tonic + NM75 Debility + OM19 Cardiac & Lung + BR5 Heart + SR301 Mercurius 30C…TDS ఇవ్వండి. మెరుగు పడినప్పుడు మోతాదు క్రమంగా తగ్గించండి, శిశువు బలంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మోతాదు నిలిపివేయండి.
పుట్టినప్పుడు శిశువుకు కామెర్లు ఉన్నట్లయితే CC4.1 Digestion tonic + CC4.2 Liver & Gallbladder tonic + CC12.2 Child tonic OR NM22 Liver + NM75 Debility + SR284 Chelidonium 30C + SR285 China Off 30C…TDS. ఇవ్వండి. మెరుగు పడినప్పుడు మోతాదు BD కి మరింత మెరుగుదలతో క్రమంగా మోతాదుOD కి తగ్గించి లక్షణాలు పూర్తిగా పోయినప్పుడు ఆపి వేయండి. అన్ని ఇతర వ్యాధులకు కూడా ఇదే విధానాన్ని అనుసరించండి పిల్లలు వైబ్రియానిక్స్ రెమిడీ లకు త్వరగా ప్రతిస్పందిస్తారు కాబట్టి కొద్ది రోజుల్లోనే వేగంగా అభివృద్ధిని చూడవచ్చు. శిశువులలో వచ్చే సాధారణ వ్యాధులకు ఇక్కడ కొన్ని రెమిడీలు సూచింపబడి ఉన్నాయి, వాటిని TDS మోతాదులో ప్రారంభించండి.
- కొలిక్(ఉదర సంబంధమైన వ్యాధి): CC4.1 Digestion tonic OR NM14 Cramps or SR302 Nux Vom 30C, give before and after feeding
- మలబద్ధకం : CC4.4 Constipation OR NM13 Constipation or SR280 Calc Carb 30C + SR302 Nux Vom 30C
- నీళ్ళ విరోచనాలు: CC4.6 Diarrhoea OR NM15 Diarrhoea or SR542 Aethusa Cyn
- ఇన్ఫెక్షన్ లు మరియు జ్వరాలు : CC9.2 Infections acute OR NM18 General Fever or SR265 Aconite 6X or SR275 Belladonna 6X
- పండ్లు రావడం CC11.5 Mouth infections OR SR254 Calc Phos 30C + SR283 Chamomilla 30C
మరొక సమస్య తక్కువ ఎదుగుదల మరియు అభివృద్ధి లేమి: CC4.1 Digestion tonic + CC12.2 Child tonic OR NM75 Debility + NM90 Nutrition or SR285 China Off 200C + SR263 Nat Sulph.
దివ్య వైద్యుని దివ్యవాణి
ఆరోగ్యాన్ని సంరక్షించు కోవలసి వచ్చినప్పుడు లేదా తగు జాగ్రత్త వహించ వలసి వచ్చినప్పుడు ప్రాధమికంగా ఆహారపు అలవాట్లు చాలా ముఖ్యమైనవి. వీటిని నియంత్రించకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. నిగ్రహం లేనిదే అనుగ్రహం లేదు అనేది సిద్ధాంతం. సంయమనం, నియంత్రణ, పరిమితి అనేవి ప్రతీ విషయంలోనూ పాటించాలి. నాలుక రుచు పై మక్కువను అరికట్టాలి.
… శ్రీ సత్య సాయిబాబాబా, “బోషాణంలో నగ” 1982 నవంబర్ 20 https://www.sssbpt.info/ssspeaks/volume15/sss15-54.pdf
రోగార్తులకు మరియు దీనులకు మీరు ఇచ్చే ఉపశమనం మరియు ఆనందం నాకే చేరుతుంది, ఎందుకంటే వారి హృదయాల్లో ఉన్నదీ నేనే మరియు వారు పిలిచే వ్యక్తినీ నేనే. దేవునికి మీసేవ అవసరం లేదు. అతను కాళ్లు నొప్పి తో బాధపడుతున్నాడా లేక కడుపు నొప్పితో బాధ పడుతున్నాడా? దైవ భక్తితో సేవ చేయడానికి ప్రయత్నించండి, భగవంతునికి దాసాను దాసుడుగా ఉండండి. మానవ సేవయే భగవంతుని సేవించే ఏకైక సాధనం.
...శ్రీ సత్య సాయిబాబా బా”వారి పాదాల చంత దివ్య సుమం” 1970 మార్చి 4 https://www.sssbpt.info/ssspeaks/volume10/sss10-06.pdf
ప్రకటనలు
భవిష్యత్తులో నిర్వహింప బోయే వర్క్ షాపులు *
- ఇండియా పుట్టపర్తి : SVP వర్క్ షాప్ 3-7 మార్చ్ 2022 సంప్రదించ వలసినవారు హేమ్ , వెబ్సైట్ [email protected]
- ఫ్రాన్స్ ప్యారిస్ : SVP వర్క్ షాప్ మరియు రిఫ్రెషర్ 14-18 మార్చ్ 2022 సంప్రదించ వలసినవారు డేనియల్ వెబ్సైట్ [email protected]
- USA: విర్చ్యువల్ AVP వర్క్ షాప్ ఏప్రిల్ 20 – జూన్ 20, 2022**, సంప్రదించ వలసినవారు సుసాన్ , వెబ్సైట్ [email protected]
- ఇండియా పుట్టపర్తి : విర్చ్యువల్ AVP వర్క్ షాప్ 20 జూన్ - 8 జులై 2022** అనంతరం పుట్టపర్తి లో ప్రత్యక్ష బోధనతో వర్క్ షాప్ 15-17 జూలై 2022**, సంప్రదించ వలసినవారు లలిత, వెబ్సైట్ [email protected] లేదా ఫోన్ నంబరు 8500-676-092
*ఈ వర్క్ షాప్ లు ప్రవేశ ప్రక్రియ మరియు e కోర్సు పూర్తి చేసిన వారికి మాత్రమే, మరియు రిఫ్రెషర్ కోర్సులు ప్రస్తుతం ఉన్న ప్రాక్టీషనర్ లకు మాత్రమే ఉంటాయి.
** మార్పులు ఉండవచ్చు
అదనంగా
1 ఆరోగ్య చిట్కాలు
మీ రోగ నిరోధక శక్తిని తెలుసుకొని అభివృద్ధి పరుచుకోండి!
“మీరు అనారోగ్యం బారిన పడకుండా చూడటమే ఉత్తమమైన మరియు తెలివైన పని అని నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. వైద్యుల యొక్క పవిత్ర కర్తవ్యం ఏమిటంటే ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి మరియు వ్యాధి ఎలా నివారించాలి అనేది ప్రజలకు తెలియ చెప్పడం మరియు గ్రామస్తులకు వ్యాధుల నుండి దూరంగా ఉండే పద్ధతుల గురించి అవగాహన కల్పించడం. అనారోగ్య సమయంలో మాత్రమే ఔషధం విలువైనదిగా పరిగణింపబడుతుందని వ్యాధి నివారణతో దాని ప్రయోజనం ముగుస్తుందనేది ప్రస్తుత నమ్మకం. కానీ ఈ నమ్మకంలో మార్పు రావాలి. ఔషధం అనేది అనారోగ్యం బారిన పడకుండా చూడటానికి మాత్రమే అనేది గ్రహించాలి” ... ‘
శ్రీ సత్య సాయి బాబా 1,2
1. రోగ నిరోధక శక్తి అంటే ఏమిటి ?
రోగ నిరోధక శక్తి అనేది శరీరంలో స్వీయ రక్షణా వ్యవస్థను పటిష్ఠం చేయడానికి, హానికరమైన విదేశీ కారకాలను నిరోధించడానికి ,అలాగే ఇన్ఫెక్షన్ల్ నుండి తనను తాను రక్షించు కోవడానికి ఉన్నటువంటి ఒక రక్షణ యంత్రాంగము. ఈ స్వయం వ్యవస్థలో కణాలు, కణజాలాలు, మరియు అవయవాలు ఉంటాయి. విదేశీ కారకాలు అంటే వైరస్, బ్యాక్టీరియా, ఇతర వ్యాధి కారకాలు మరియు టాక్సిన్స్ వంటి హానికరమైన జీవులను సూచిస్తాయి. ఈ సామర్థ్యం రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి పుట్టుకతో వచ్చిన సహజమైన రోగనిరోధక శక్తి మరొకటి వివిధ వ్యాధికారక క్రిములకు గురైనప్పుడు శరీరం ద్వారా అభివృద్ధి చేయబడిన రోగ నిరోధక శక్తి.3-8
2. సహజ రోగ నిరోధక వ్యవస్థ
సహజమైన రోగ నిరోధక వ్యవస్థ అనేది శరీరం నాలుగు విధాలుగా నిర్వహించే మొదటి మరియు తక్షణ రక్షణ
విధానము. మొదటిది మన నోరు, ముక్కు, కళ్ళు, మరియు శ్వాసకోస వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, మూత్ర విసర్జక వ్యవస్థ లలో హానికరమైన బాహ్య కారకాల ప్రవేశాన్ని నిరోధిస్తుంది. రెండవ వ్యవస్థ కన్నీళ్లు, లాలాజలం, ఉదర సంబందిత ఆమ్లాలు, మ్యూకస్ మరియు శరీరం ద్వారా ఉత్పత్తి అయ్యే ఇతర రసాయన అవరోధములు హానికరమైన బాహ్య ఆక్రమణదారులు శరీరంలోకి ప్రవేశించడానికి లేదా నివసించడానికి ఆస్కారం లేకుండా చేస్తాయి. ఈ రెండు అవరోధాలు ఉల్లంఘింప బడితే తర్వాత రెండు రక్షణలు జ్వరం మరియు వాపు ఇది శరీరం సహజమైన రోగనిరోధక వ్యవస్థ యొక్క కణాలను ఉపయోగించి పోరాడుతూ ఉందని సూచిస్తుంది. కాబట్టి అనారోగ్యంతో ఉన్నప్పుడు బాధగా ఫీల్ అవ్వకండి, మిమ్మల్ని రక్షించడానికి మీ శరీరం యొక్క కోటలో కనిపించకుండా నిరంతర యుద్ధం కొనసాగుతూ ఉందని దాని అర్ధం. 5,6,7
3. అనుకూల రోగ నిరోధక శక్తి (క్రియాశీల, నిష్క్రియ)
మన శరీరం క్రియాశీలకమైన అనుకూల రోగ నిరోధక శక్తిని రెండు విధాలుగా అభివృద్ధి చేస్తుంది. వ్యాధి కలిగిన మీదట కోలుకునే కాలంలో సహజంగా దానిపట్ల రోగనిరోధక శక్తిని పెంపొందించు కొనుట ద్వారా కానీ లేదా నిర్దిష్ట వ్యాధికి వ్యతిరేకంగా టీకాలు వేయడం ద్వారా రోగ నిరోధక శక్తిని అభివృద్ధి చేస్తుంది.5,6
3.1 వ్యాధి ద్వారా అనుకూల రోగ నిరోధక శక్తి : ఈ రోగ నిరోధక శక్తిని అభివృద్ధి చేసుకోవడానికి ఒక వ్యాధి వచ్చిన తర్వాత వారాలు పడుతుంది, అయితే ఇది జీవితాంతం ఆ వ్యాధి పునరావృతం కాకుండా కాపాడుతుంది. ఉదాహరణకు తట్టు మరియు చికెన్ పాక్స్. ఇవి పునరావృత మైనప్పుడు హానికారక సూక్ష్మ జీవులను ఎదుర్కొనడానికి లేదా వ్యాధిని నివారించడానికి శరీరం వేగంగా స్పందిస్తుంది, ఎందుకంటే రోగనిరోధక వ్యవస్థ తనకు ఎదురైన ప్రతీ క్రిమి/సూక్ష్మ జీవిని రికార్డ్ చేస్తుంది మరియు దానిని గుర్తించి వెంటనే దానితో పోరాటానికి ప్రతిరోధకాలు లేదా T సెల్స్ అనే యుద్ధ యోధులను ఉత్పత్తి చేస్తుంది. ఐతే ఇవి ఒక వ్యాధి లేదా సంబంధిత ఇన్ఫెక్షన్ ఉదాహరణకు మీజిల్స్ వంటి వ్యాధికి గురియైనప్పుడు మాత్రమే సంరక్షిస్తాయి, కానీ చికెన్ పాక్స్ వంటి ఇతర వ్యాధుల నుండి రక్షించవు. ఫ్లూ మరియు సాధారణ జలుబు వంటివి వైరస్లు లేదా ఒక వైరస్ లోని వివిధ జాతుల వల్ల సంభవిస్తాయి కాబట్టి చాలాసార్లు వీటితో పోరాడవలసి ఉంటుంది.5,6,7,8,9,10
3.2 టీకా ద్వారా ప్రేరేపించబడే అడాప్టివ్ ఇమ్యూనిటీ: వ్యాక్సిన్ అనేది బలహీన పరచబడిన లేదా క్రియారహితం
చేయబడిన పరాన్న జీవి యొక్క వ్యాధికారక భాగం. దీనిని ఇంజెక్ట్ చేసినప్పుడు లేదా నోటి ద్వారా లేదా నాసిక ద్వారా ఇచ్చినప్పుడు అది వ్యాధికారక పరాన్న జీవులకు /వ్యాధికి ప్రత్యక్షంగా వ్యాధిని కలిగించకుండానే శరీరాన్ని బహిర్గత పరుస్తుంది. వ్యాధి కారక క్రిముల దాడికి వేగంగా ప్రతిస్పందించడానికి మరియు భవిష్యత్తులో ఆ వ్యాధిని నిరోధించడానికి శరీరం వీలు కల్పిస్తుంది. సాధారణ రోగనిరోధక ప్రతిస్పందన వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత పని చేయడానికి రెండు వారాలు పడుతుంది మరియు దీర్ఘకాలిక రోగ నిరోధక శక్తిని కల్పించడానికి అనేకసార్లు ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే రోగనిరోధకశక్తి కాలానుగుణంగా తగ్గిపోతూ ఉంటుంది. 10
ఉదాహరణలు: డిప్తీరియా ధనుర్వాతం మరియు కోరింతదగ్గు నిరోధించడానికి ట్రై వాలెంట్ DTaP టీకా మూడు మోతాదుల్లో ఇవ్వబడడమే కాక ఆ తర్వాత బూస్టర్ డోస్ కూడా ఇవ్వబడుతుంది. MMRV వ్యాక్సిన్ యొక్క ఒకటి లేదా రెండు డోసులు తట్టు, గవదబిళ్లలు, రుబెల్లా లేదా జర్మన్ మీజిల్స్ మరియు చికెన్ పాక్స్ అనే నాలుగు వ్యాధులనుండి రక్షిస్తుంది. పెంటా వ్యాలెంట్ వ్యాక్సిన్ మూడు మోతాదులు 5 వ్యాధులు (కంఠవాతము, కోరింత దగ్గు, ధనుర్వాతము, హెపటైటిస్-బి మరియు హెమోఫిలాస్ ఇన్ ఫ్లు ఎంజా టైప్ బి) నుండి రక్షిస్తుంది.11,12,13
వ్యాక్సిన్ లతో అనేక దేశాల్లో నిరోధింప పడిన లేదా దాదాపుగా తొలగించబడిన అనేక వ్యాధుల్లో ఫ్లూ, క్షయ, హెచ్. ఐ. వి, HPV ( హ్యూమన్ పాపిల్లోమా వైరస్) వ్యాధి,మెనింగో కోకల్, న్యూమో కోకల్, రోటా వైరస్ షింగిల్స్ ఎల్‌ఈడి సర్పి, మరియు మలేరియా ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO చేత పూర్తిగా తొలగింప బడినట్లు ధృవీకరించబడిన రెండు వ్యాధులు గత 3000 సంవత్సరాల నుండి వారియోలా వైరస్ చే సోకబడుతున్న స్మాల్ ఫాక్స్(చివరిసారి 1977 ఏర్పడింది) మరియు 2011 మధ్య ప్రాంతం నుండి పూర్తిగా నిరోధింప బడిన రెండర్ పెస్ట్ (పశువులకు వచ్చే ప్లేగు వ్యాధి) అలాగే పోలియో వ్యాధి సంపూర్ణ నిర్మూలనకు దగ్గర్లోనే ఉంది.14,15,16
ప్రయోజనాలు: టీకాలు వేయడం వల్ల వ్యాధులు, శారీరక వైకల్యం, వివిధ రకాల అంటువ్యాధులే కాక మరణాలు కూడా తగ్గుతాయి అనడంలో ఎటువంటి సందేహము లేదు. వ్యక్తిగత రక్షణ తో పాటు మానవుని నుండి మానవునికి సంక్రమించే వ్యాధికారక గొలుసుకు అంతరాయం కలిగించడం ద్వారా మరియు వ్యాధి వ్యాప్తిని మందగింపచేయడం ద్వారా హెర్డ్ ఇమ్యూనిటీ అని పిలువబడే సమాజ రక్షణ కూడా టీకాలు అందిస్తాయి. 17,18,19,20
తేలికపాటి నుండి మితమైన దుష్ప్రభావాలు : శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థ టీకాకు ప్రతిస్పందిస్తుంది కాబట్టి ఇంజక్షన్ చేసిన స్థానంలో నొప్పి, వాపు, జ్వరం, అలసట, తలనొప్పి, కండరాల నొప్పి, లేదా వికారం వంటివి అనిపించడం సాధారణం.21
హెచ్చరిక: అలర్జీలు లేదా ఆటోఇమ్యూన్ లేదా ఇతర పరిస్థితులు ఉన్న వ్యక్తులు టీకాలు వేయించడానికి ముందు వారి వైద్యుడిని సంప్రదించాలి. వేగవంతమైన హృదయ స్పందన శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది నాలుక లేదా గొంతువాపు లేదా సాధారణ దద్దుర్లు లేదా తక్షణ వైద్య సహాయం అవసరమయ్యే రూపంలో గతంలో ఏదైనా తీవ్రమైన అలర్జీ ప్రతిచర్యలు ఉన్నవారికి టీకాలు వేయడం మంచిది కాదు.21,22
3.3 పాసివ్ ఇమ్యూనిటీ: ఒక వ్యక్తికి తన శరీరంలో కాకుండా ఇతర శరీరములో ఉత్పత్తి చేయబడిన వ్యాధి ప్రతిరోధకాలు ఇంజెక్ట్ చేసినప్పుడు దాన్ని కృత్రిమ నిష్క్రియాత్మక రోగనిరోధక శక్తి అంటారు. ఇది వ్యాధికి వ్యాక్సిన్ అందుబాటులో లేనప్పుడు, అధిక ప్రమాదం ఉన్న వ్యక్తులకు లేదా రోగ నిరోధక వ్యవస్థలో లోపాలు ఉన్న వారికి రొటీన్ గా ఇచ్చే దానివలే కాకుండా తక్షణ రక్షణ కోసం ఇవ్వబడుతుంది. ఈ రోగ నిరోధక శక్తి కొన్ని వారాలు లేదా నెలలు మాత్రమే ఉంటుంది. నవజాత శిశువు సహజంగానే తల్లి యొక్క మావి ద్వారా మరియు పుట్టిన తర్వాత తల్లి పాల ద్వారా రోగనిరోధక శక్తిని పొందుతుంది. ఆరు నెలల తర్వాత క్రమంగా క్షీణిస్తుంది.5,8,10,23
4. మీ రోగ నిరోధక వ్యవస్థ గురించి తెలుసుకోండి
మానవ రోగనిరోధక వ్యవస్థ అనేది కణాలు అవయవాలు మరియు రసాయనాల యొక్క అద్భుతమైన మరియు 
ఆకర్షణీయమైన నెట్వర్క్, ఇది ఒక సమర్థవంతమైన అంతర్గత పోలీసు దళం, మనల్ని రక్షించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఇది నాలుగు ప్రధాన విధులు కలిగి ఉంటుంది. శరీరంలో మిలియన్ల కొద్దీ చేరే సూక్ష్మ జీవులు(బ్యాక్టీరియా, వైరస్, పరాన్న జీవులు,శిలీంద్రాలు) లనుండి రక్షణ, చనిపోయిన సూక్ష్మ జీవుల తొలగింపు ద్వారా శరీర సమతుల్యత కాపాడడం, జన్యు సంబంధ పదార్ధానికి మార్పులు తెచ్చే ఉత్పరివర్తనమల పర్యవేక్షణ మరియు తొలగింపు, రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా నియంత్రణ. ఇది ఒక సంక్లిష్ట ప్రక్రియను కూడా కలిగి ఉంటుంది. ఇది అత్యంత ప్రభావవంతంగా ఉండాలంటే శరీరంలోని అన్ని యంత్రాంగాల మధ్య పరస్పర చర్య అవసరం 6,9,24. ప్రత్యేక B కణాలు మరియు T కణాలు తో సహా అనేక రోగ నిరోధక కణాలతో కూడిన ఐదు రకాల తెల్లరక్తకణాలు (WBC) కీలక పాత్ర పోషిస్తాయి, రోగనిరోధక వ్యవస్థ నియంత్రిస్తాయి, మరియు వైరస్ సోకిన కణాలపై దాడి చేస్తాయి. యాంటీ బాడీస్ అనేవి ఆక్రమణ దారులను గుర్తించడానికి, శోధన మరియు నాశనము చేసే సైన్యం లో భాగంగా బి కణాలు ఉత్పత్తి చేసే ప్రత్యేకమైన Y ఆకారము గల ప్రొటీన్లు. అన్ని రోగనిరోధక కణాలు నిరంతరం ఎవరితో మరియు ఎలా పోరాడాలి అనేది నేర్చుకుంటూనే ఉంటాయి. 7,10,25,26,27
5. రోగనిరోధక శక్తి లోపాల గురించి తెలుసుకోండి
ప్రాథమిక రోగనిరోధక శక్తి వ్యవస్థ సరిగా పనిచేయనప్పుడు నాలుగు రకాల రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది.28-31
5.1 ప్రాథమిక రోగనిరోధక లోపం అనేది లోపభూయిష్ట, లేదా తక్కువ రోగనిరోధక కణాలతో లేదా బలహీనమైన రోగనిరోధక వ్యవస్థతో పుట్టడం, సాధారణంగా బాల్యంలోనే ఇది నిర్ధారణ అవుతుంది. అటువంటి పిల్లలు పునరావృతమయ్యే లేదా దీర్ఘకాలంగా అసాధారణమైన ఇన్ఫెక్షన్ల యొక్క స్థిరమైన ప్రమాదంలో ఉంటారు, అవి చికిత్స చేయడం కూడా కష్టం. ఇతర లక్షణాలు స్ప్లీన్ యొక్క అసాధారణ, పేలవమైన ఎదుగుదల, మరియు ప్రత్యక్ష వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత సమస్యలు- తీవ్రమైన ఇన్ఫెక్షన్, ఆటోఇమ్యూన్ డిజార్డర్, లేదా క్యాన్సర్ రూపంలో తర్వాత జీవితంలో సమస్యలు తలెత్తవచ్చు.28,29
5.2 సెకండరీ లేదా ఆర్జిత రోగనిరోధక శక్తి లోపాలు కొద్దికాలంపాటు ఫ్లూ, మీజిల్స్ లేదా అటువంటి బాహ్య కారణాల వల్ల, క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి కోసం ప్రత్యేక మందులు లేదా చికిత్స ద్వారా, WBC ని నాశనం చేసే హెచ్ఐవి ఎయిడ్స్ వంటి వ్యాధులు ద్వారా రోగనిరోధక వ్యవస్థ బలహీన పడినప్పుడు ఆర్జిత రోగనిరోధక లోపం ఏర్పడుతుంది ధూమపానం మద్యపానం మరియు సరైన పోషకాహారం తీసుకోక పోవడం, సక్రమంగా లేని జీవనశైలి కారణంగా రోగనిరోధకశక్తి బలహీన పడుతుంది.28
5.3 అతి చురుకైన రోగనిరోధక వ్యవస్థ సాధారణంగా జన్యు ప్రభావం వలన ఏర్పాడే ఈ సమస్య దుమ్ము, పుప్పొడి, లేదా పొగ వంటి హాని చేయని ప్రతికూలతల ద్వారా ప్రేరేపించబడి ఉబ్బసం, తామర, లేదా అలర్జీ వంటి వ్యాధులకు కారణమవుతుంది. ఇది సాధారణంగా ఆరోగ్యకరమైన వ్యక్తిని ప్రభావితం చేయదు.28,30
5.4 ఆటోఇమ్యూన్ (స్వయం ప్రతిరక్షక) వ్యాధి: మన శరీరం లోని కొంత భాగము పరాయి దానిగా తప్పుగా గుర్తించడం ద్వారా మన సొంత రోగనిరోధక వ్యవస్థ మనకు వ్యతిరేకంగా మారినప్పుడు మరియు ఆరోగ్యకరమైన కణాలపై దాడి చేసే ఆటో యాంటీబాడీస్ అనే ప్రోటీన్ లను విడుదల చేసినప్పుడు ఆటోఇమ్యూన్ వ్యాధి వస్తుంది. ఇలాంటి వ్యాధులు చాలా ఉన్నాయి ఐతే అత్యంత సాధారణమైనవి టైప్-1 మధుమేహం,రుమటాయిడ్ ఆర్థ్రైటిస్, మల్టిపుల్ స్కెలో రోసిస్, ఇన్ఫ్లమేటరీ బవెల్ సిండ్రోమ్, క్రానిక్ ఫెటిగ్ సిండ్రోమ్, సీలియాక్ డీసీజ్, హష్మిటోస్ డీసీజ్, అలాగే లింఫోమా, మయలోమ, ల్యుకేమియా, వంటి కొన్ని రకాల క్యాన్సర్లు మరియు లూపస్ ఇది మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. దీనికి కారణం తెలియదు కానీ బహుశా ఆహారం లేదా వాతావరణ కారకం వంటి ఏదో ఒక దానితో ప్రేరేపించబడిన జన్యువులు కారణం కావచ్చు. దీనిని నిర్ధారించడం అంత సులువు కాదు..28,31
6. మీ రోగనిరోధక వ్యవస్థను సమతుల్యంగా ఉంచుకోండి
మనల్ని సజీవంగా మరియు చురుకుగా ఉంచడానికి రోగ నిరోధక వ్యవస్థ తీవ్రంగా శ్రమిస్తుంది, కనుక మనం దాని పట్ల తగు జాగ్రత్త వహిస్తూ దాని పనిలో జోక్యం చేసుకోకుండా ఉండాలి. ఈ వ్యవస్థ ఉత్తమంగా పని చేయడానికి బ్యాలెన్స్ స్థితిలో (తక్కువా కాదు ఎక్కువా కాదు) ఉంచాలి. 7,32-40
- ఆరోగ్యకరమైన జీవన శైలిని అనుసరించండి. నిద్ర, వ్యాయామం, తగినంత నీరు తీసుకోవడం మరియు ఆరోగ్యకరమైన ఆహారం గురించి మన వార్తా లేఖలలో ఇచ్చిన ఆరోగ్య చిట్కాలు చూడండి.
- సాయి వైబ్రియానిక్స్ రెమిడీస్ మూల స్థాయి నుండి మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి తీసుకోవచ్చు!
- రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం మరియు సప్లిమెంట్ల కోసం వచ్చే వ్యాపార ప్రకటనల ద్వారా ప్రభావితం కావద్దు. మీకు సహాయ పడవలసింది పోయి వాస్తవానికి మీ రోగనిరోధక వ్యవస్థ పనితీరులో ఆ పదార్ధాలు జోక్యం చేసుకోవచ్చు.
- ధూమపానం, మద్యం సేవించడం, డాక్టర్ సలహా లేకుండా స్వయంగా ఔషధాలు తీసుకోవడం వంటి అనారోగ్యకరమైన పద్ధతులకు దూరంగా ఉండండి.
- అలసట, కండరాల నొప్పి, వాపు మరియు ఎరుపుదనం, తక్కువ స్థాయిలో వచ్చే జ్వరము, చేతులు మరియు కాళ్ళు తిమ్మిరి మరియు జలదరింపు, అసాధారణముగా జుట్టు రాలడం, మరియు తరచుగా ఏర్పడే లేదా చికాకు కలిగించే చర్మంపై దద్దుర్లు వంటి వాటిని విస్మరించవద్దు.
- కోవిడ్ -19 వైరస్ మరియు దాని వైవిధ్యాలు మానవాళికి అపూర్వమైన సవాలు విసిరడంతో కొత్త వ్యాక్సిన్లు,సరి కొత్త చికిత్సా పద్ధతులు, ఆరోగ్యం మరియు భద్రతా చర్యలపై మార్గదర్శకాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎదుర్కోవడం జరిగింది. 36-39 కొవిడ్-19 నివారణ మరియు సంరక్షణ గురించి వార్తాలేఖ సంపుటి 11 సంచిక 2 మరియు 2021 జూన్ 9 నవీనీకరణల గురించి వార్తాలేఖ సంపుటి 0 సంచిక 3 చూడండి.
- ఎల్లప్పుడూ ఆనందంగా ఉండండి, నవ్వుతూ ఉండండి తరచుగా నవ్వండి మీ అంతరంగానికి అనుగుణంగా ఉండండి. మీ అంతర్గత కాంతి మరియు ప్రేమతో విశ్వాసాన్ని మరియు దాని సృష్టి ని ఆలింగనం చేసుకోండి! 35,40
రిఫరెన్స్ లు మరియు లింకులు
1. Sathya Sai Baba Speaks on preventing illness: Divine Discourse on “The Best Tonic”, 21 Sept 1960: https://www.sssbpt.info/ssspeaks/volume01/sss01-28.pdf
2. Sathya Sai baba Speaks on preventing illness: Divine Discourse on “The Doctor’s Profession”, Sept 1980: https://www.sssbpt.info/ssspeaks/volume14/sss14-53.pdf
3. Immune system: https://www.sciencedirect.com/topics/earth-and-planetary-sciences/immune-system
4. Antigens/pathogens: https://study.com/academy/lesson/antigens-vs-pathogens.html
5. Innate and Adaptive immunity: https://www.technologynetworks.com/immunology/articles/active-vs-passive-immunity-differences-and-definition-335112
6. https://www.verywellhealth.com/types-of-white-blood-cells-and-immunity-2252553
7. The myth of a super-charged immune system: https://www.bbc.com/news/health-60171592
8. Adaptive immunity: https://www.cdc.gov/vaccines/vac-gen/immunity-types.htm
9. https://www.betterhealth.vic.gov.au/health/conditionsandtreatments/immune-system
10. Immunity thru vaccine: https://www.immune.org.nz/immunisation/immune-system-vaccination#
11. DTaP vaccine: https://www.cdc.gov/vaccines/vpd/dtap-tdap-td/public/index.html#
12. MMRV vaccine: https://www.cdc.gov/vaccines/hcp/vis/vis-statements/mmrv.html
13. Pentavalent vaccine: https://www.gavi.org/types-support/vaccine-support/pentavalent
14. Vaccine eliminated diseases: https://www.cdc.gov/vaccines/parents/diseases/forgot-14-diseases.html
15. Disease prevention with vaccine: https://www.healthywa.wa.gov.au/Articles/U_Z/What-diseases-do-vaccines-protect-against
16. Eradicated diseases: https://asm.org/Articles/2020/March/Disease-Eradication-What-Does-It-Take-to-Wipe-out
17. Vaccines save lives: https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC5402432/
18. Unicef on safety of Covid vaccines: https://www.unicef.org/northmacedonia/vaccines-save-lives
19. Benefits of Covid-19 vaccine: https://www.cdc.gov/coronavirus/2019-ncov/vaccines/vaccine-benefits.html
20. Vaccines protect lives: https://timesofindia.indiatimes.com/life-style/health-fitness/health-news/protect-your-life-against-all-vaccine-preventable-diseases-get-vaccinated/articleshow/87108483.cms
21. Handling side effects or allergy: https://www.cdc.gov/coronavirus/2019-ncov/vaccines/expect/after.html
22. https://www.cdc.gov/coronavirus/2019-ncov/vaccines/safety/allergic-reaction.html
23. Passive immunisation: https://www.historyofvaccines.org/content/articles/passive-immunization
24. Our Immune system: https://primaryimmune.org/immune-system-and-primary-immunodeficiency
25. WBC the key player with five types of cells https://my.clevelandclinic.org/health/body/21871-white-blood-cells
26. B-cells & T-cells: https://www.cancercenter.com/what-are-b-cells-vs-t-cells
27. Antibodies: https://www.livescience.com/antibodies.html
28. Immunity disorders: https://www.hopkinsmedicine.org/health/conditions-and-diseases/disorders-of-the-immune-system
29. Primary Immunodeficiency: https://my.clevelandclinic.org/health/diseases/17964-primary-immunodeficiency
30. Overactive immune system: https://health.clevelandclinic.org/can-immune-system-go-haywire-falter/ (tips)
31. Autoimmune: https://www.healthline.com/health/autoimmune-disorders#causes
32. Balance immunity: https://www.health.harvard.edu/staying-healthy/how-to-boost-your-immune-system
33. Self-care: https://www.mohfw.gov.in/pdf/ImmunityBoostingAYUSHAdvisory.pdf
34. Reduce your risks: https://www.cedars-sinai.org/blog/boosting-your-immune-system.html
35. https://www.matherhospital.org/wellness-at-mather/boosting-your-immune-system-is-it-even-possible/
36. Hand sanitiser guidelines: https://www.fda.gov/drugs/coronavirus-covid-19-drugs/hand-sanitizers-covid-19
37. Covid-19 vaccines guidelines: https://www.who.int/emergencies/diseases/novel-coronavirus-2019/covid-19-vaccines/advice
39. Better to vaccinate than catch disease to get immunity: https://www.cdc.gov/coronavirus/2019-ncov/vaccines/facts.html
40. Laughter, the best therapy! https://www.khca.org/files/2015/10/Humor-Therapy.pdf
__________________________________________________________________________________
2. AP తెలుగు వర్క్ షాప్ 2021 డిసెంబర్ 30 నుండి 2022 జనవరి 1 వరకు- పుట్టపర్తి
గ్రామీణ ప్రాంతాలు, మరియు సుదూర ప్రాంతములలో ఉన్న వారికోసం వైబ్రియానిక్స్ సేవలు అందించే వినూత్న కార్యక్రమంలో భాగంగా అసిస్టెంట్ ప్రాక్టీషనర్ AP వారి కోసం వర్క్ షాప్ ని తెలుగులో నిర్వహించగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుండి నలుగురు పాల్గొన్నారు. ఇద్దరు సీనియర్ ఉపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయులు కాగోరు ముగ్గురు ఉపాధ్యాయులు నిశబ్ద పరిశీలకులుగా దీనిని నిర్వహించారు. పాల్గొన్న వారి ఆసక్తి ఉత్సాహం విశేషమైనవి, డాక్టర్ అగర్వాల్ గారి ప్రోత్సాహకరమైన మరియు స్పూర్తిదాయకమైన జ్ఞాన వాణి విన్న తర్వాత వారు మరింత ప్రేరణకు లోనయ్యారు- చిత్రాన్ని చూడండి. AP గా అర్హత సాధించిన వెంటనే సీనియర్ ప్రాక్టీషనర్11567 మరియు అంకిత బావం గల వారి బృందము నేతృత్వంలో ప్రాక్టీషనర్18005 ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాలలోని సాయి కేంద్రాలలో మరియు విశాఖపట్నం సమీపంలోని గిరిజన గ్రామములలో 2750 ఇమ్యూనిటీ బూస్టర్ IB పంపిణీ చేసే బాధ్యతను చేపట్టడం చాలా సంతోషకరమైన విషయం రాష్ట్ర అధ్యక్షుల వారి ప్రోత్సాహం మరియు ఆశీర్వాదంతో ఈ సేవ ప్రారంభించబడింది. ఐబి ఫోటో చూడండి


__________________________________________________________________________________
3. ఫ్రెంచ్ లో నెలవారీ సమావేశాలు
ఫ్రెంచ్ కోఆర్డినేటర్ 01620 గత రెండు సంవత్సరాలుగా ప్రతీ నెలా విర్చువల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనికి గాబన్ నుండి ముగ్గురు మరియు ఫ్రెంచ్ నుండి ఎనిమిది మంది ప్రాక్టీషనర్లు హాజరవుతున్నారు. ఒక ప్రాక్టీషనర్ శరీర వ్యవస్థ నుండి ఎంపిక చేసిన ఒక అవయవం గురించి (108 సిసి పుస్తకంలో 21 వర్గాల నుండి) లేదా నిర్దిష్ట వ్యాధిని కవర్ చేస్తూ అంశాలను అందజేస్తారు. ఈ ప్రదర్శనలో ఒక అవయవానికి సంబంధించి అనాటమీ, ఫిజియాలజీ, మరియు సంబంధిత వ్యాధులు, అనారోగ్యం లేదా అసమతుల్యత కనిపించే సంకేతాలు మరియు వైబ్రియానిక్స్ చికిత్స యొక్క వివరణాత్మక అంశాలు ఉంటాయి. ప్రాక్టీషనర్లు అందరూ వార్తాలేఖలు, మాన్యువల్ మరియు కాన్ఫరెన్స్ పుస్తకాన్ని శ్రద్ధగా పరిశీలించడం ద్వారా ఈ అంశాన్ని పరిశోధిస్తారు. వారందరూ తమ అభిప్రాయాలూ, కేసు చరిత్రలు, ప్రశ్నలు మరియు విజయ కథనాలతో ఈ అంశాలకు సహకరిస్తారు.
ప్రాక్టీషనర్ 03546 వ్యాఖ్యానము: “ఈ విషయాలు మానవ శరీరం అనే అసాధారణ యంత్రం యొక్క సృష్టి యొక్క సంక్లిష్టత మరియు అధునాతన గురించి మరింత ఎక్కువగా తెలుసుకోవడానికి నన్ను ప్రేరేపించాయి. ప్రతీ భాగం ఎంత చిన్నదైనా ఈ బహుళత్వంలో చాలా నిర్దిష్టమైన మరియు ఉపయోగకరమైన పాత్రను కలిగి ఉంటుంది. ఉచితంగా లభించే ఈ సృష్టి అంతా దైవమే అనే భావన పదిల పరుచుకొని మనం దానిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి”. ఈ ప్రాక్టీషనర్ తన రోగులలో కూడా ఈ విషయాన్ని అవగాహన కలిగించడానికి కూడా ప్రయత్నిస్తున్నారు.
__________________________________________________________________________________
4. ఆసక్తికరమైన కథనాలు
4.1 విశ్వాసం ద్వారా స్వస్థత చేకూరిన అద్భుత సంఘటన 18004…ఇండియా 56 ఏళ్ల గ్రామీణ మహిళ మూడు సంవత్సరాలుగా తీవ్రమైన కీళ్ళ నొప్పులు, వెన్నునొప్పి, సయాటికా, మరియు వెరికోస్ వీన్స్ వ్యాధులతో బాధపడుతున్నారు. ఆమె కొన్ని అడుగులు కూడా సరిగా నడవలేక పోయేవారు, సరిగా నిద్ర పోలేక పోయే వారు. కొన్ని సందర్భాలలో భరించలేని నొప్పి ఆమెను స్పృహ కోల్పోయేలా చేస్తూ ఉండేది. ఆమె ఆయుర్వేదిక్ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటున్నారు కానీ అవి ఆమెకు ఉపశమనం కలిగించలేదు. వైబ్రియానిక్స్ వైద్యం ఉపయోగిస్తున్న ఒక రోగి తన ప్రాక్టీషనర్ ను కలవమని సలహా ఇచ్చారు, అయితే ఆయుర్వేదంతో పాటు వైబ్రియానిక్స్ తీసుకోకూడదు అని అతనికి తెలుసు కాబట్టి ఆయుర్వేద మందులను మానివేసిన మూడు రోజుల తర్వాత మాత్రమే ప్రాక్టీషనర్ ను కలవమని చెప్పారు. అదేరోజు స్వామిని ప్రార్థించి తన మందులను ఆపివేసి వైబ్రియానిక్స్ మాత్రమే తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఐదు రోజుల తర్వాత ఆమె తనంతట తానుగా ప్రాక్టీషనర్ ఉండే ప్రదేశానికి వెళ్లి తాను వైబ్రియానిక్స్ తీసుకోవాలని సంకల్పం తీసుకున్నప్పటి నుండి పూర్తిగా నయం అయిందని వారికి తెలియజేశారు. ప్రాక్టీషనర్ ఆశ్చర్య పోయినప్పటికీ ఆమెకు తగిన రెమిడీ అందించగా దానిని తీసుకోవడానికి ఆమె సంతోషంగా అంగీకరించారు, నొప్పి ఆమెకు పునరావృతం కాలేదు. ఈ ప్రాక్టీషనర్ శిక్షణ పొందిన రెండు నెలల్లోనే 170 మంది రోగులకు విజయవంతంగా చికిత్స అందించారు.
4.2 ప్రాక్టీషనర్10707 డైరీ నుండి నొప్పి నివారణ ఐన అద్భుత కథనం. నా చిన్నతనం అంతా నేను తరచుగా బలహీనపరిచే తలనొప్పులతో బాధపడుతూ ఉండేవాడిని. అది ఏర్పడిన ప్రతీ సారి కనీసం నెల రోజుల వరకు ఉంటుంది. నేను బ్యాంకులో పని చేయడం ప్రారంభించిన తర్వాత దీని తీవ్రత పెరగడమే కాక వెంటనే వికారం కూడా కలిగేది. ఆకస్మాత్తుగా నా దృష్టి పథంలో ఉన్న వస్తువులు అస్పష్టంగా అయిపోవడమే కాక నా దృష్టి క్షేత్రంలో ప్రతీదీ తేలుతూ ఉన్నట్లు కనపడుతుంది. 30 నిమిషాల తర్వాత తలనొప్పి ప్రారంభమై సాధారణంగా రెండు రోజులు తీవ్రమైన తలనొప్పి వికారం నిద్రలేమి మరియు అలసటకు దారితీస్తుంది. ఉపశమనం కోసం అనేక సంవత్సరాలుగా ఎన్ని వేసుకున్నానో చెప్పబడలేని సంఖ్యలో అనాసిన్ టాబ్లెట్ వాడుతూ ఉండేవాడిని. నేను పుట్టపర్తిలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సందర్శించే వరకు నేను క్లాసిక్ మైగ్రేన్ తలనొప్పితో బాధ పడుతున్నట్లు తెలియదు, నొప్పి ఏర్పడిన ప్రతీసారి వాసోగ్రెయిన్ తీసుకోవలసిందిగా వారు సూచించారు.
సాయి వైబ్రియానిక్స్ నన్ను కాపాడటం...
క్రమంగా నేను సాయి వైబ్రియానిక్స్ గురించి తెలుసుకొని బృందావనంలో 2009 లో ఆగష్టులో శిక్షణా కోర్సులో చేరాను. శిక్షణ పూర్తి చేసుకొన్న రెండు రోజులలోపూ దాదాపు రాత్రి 8 గంటల ప్రాంతంలో మైగ్రేన్ నొప్పి ఏర్పడగా నాకు సూచించబడిన అల్లోపతి మందులను ఆశ్రయించకుండా నేను ఒక రెమిడీ: CC11.3 Headaches + CC11.4 Migraines. తయారు చేసుకున్నాను. సాయిరాం అని జపిస్తూ ఒక గోళి వేసుకున్నాను కేవలం 30 నిమిషాలలో గాఢంగా నిద్ర పట్టింది. ఐతే విపరీతమైన నొప్పితో రాత్రి పన్నెండున్నర గంటలకు మెలుకువ వచ్చింది. నొప్పి భరించలేక అల్లోపతి టాబ్లెట్ తీసుకొని వేసుకోవాలని ప్రయత్నించాను, కానీ ఏదో అదృశ్య శక్తి నన్ను ఆపడంతో నేను తీసుకున్న శిక్షణ కార్యక్రమం యొక్క ప్రమాణమును మరియు వైబ్రియానిక్స్ యొక్క బోధన ను అనుసరించి నేను మొదట నా పై మరియు నా కుటుంబం పై ప్రయత్నించాలి, అప్పుడే దాని ప్రభావం గురించి నాకు పూర్తిగా విశ్వాసం కలిగి అప్పుడు మాత్రమే ఇతరులకు అందించేందుకు నమ్మకం కలుగుతుంది. టాబ్లెట్ పక్కన పెట్టేసి వైబ్రో గోళీ నాలుక క్రింద వేసుకున్నాను. తెల్లవారుఝామున నాలుగున్నర గంటలకు నేను లేచి నొప్పి పూర్తిగా అదృశ్య మయ్యిందని తెలుసుకుని ఆశ్చర్యపోయాను. ఎంత దివ్యమైన అద్భుతం. మరుసటి రోజు నేను అసాధారణంగా ఫ్రెష్ గా మరియు శక్తివంతంగా కనిపించాను. నేను ప్రతీ రోజు రెమిడీ తీసుకోక పోయినప్పటికీ మైగ్రేన్ ఉదంతాలు త్వరగానే తగ్గిపోయాయి, ప్రస్తుతం నేను ఎటువంటి రెమిడీ తీసుకోనప్పటికీ అవి పూర్తిగా అదృశ్యమయ్యాయి. నా దృష్టిలో వైబ్రియానిక్స్ అనేది స్వామి అందించిన అత్యుత్తమ బహుమతులలో ఒకటి. 2009 నుండి మా కుటుంబం పూర్తిగా వైబ్రియానిక్స్ వైపు మారిపోయింది.
ఈ కేసును నా హృదయ పూర్వకంగా మన ప్రియమైన స్వామికి సమర్పిస్తున్నాను, మరియు ఈ అద్వితీయమైన అవకాశం అందించినందుకు, నా లాంటి ప్రాక్టీషనర్లను ఆ దివ్య ప్రేమ కు చక్కని పనిముట్లుగా మార్చిన వైబ్రియానిక్స్ టీముకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
__________________________________________________________________________________
5. జ్ఞాపకార్థం
2022 ఫిబ్రవరి 9వ తేదీన 84 సంవత్సరాల వయసులో స్వర్గస్తులైన కల్నల్ S. K. బోస్ 02414…ఇండియా గారికి భారమైన హృదయంతో మేము వీడ్కోలు పలుకుతున్నాము. వారు స్వామికి అత్యంత విధేయులైన సాయి భక్తుల కుటుంబం నుంచి వచ్చారు, వారి తండ్రి స్వామి చేత పునర్జీవింప బడ్డారన్న విషయం అందరికీ తెలిసినదే. వారు ఇండియన్ ఆర్మీలో సివిల్ ఇంజినీర్ గా పనిచేసి పదవీ విరమణ తర్వాత 1999లో పుట్టపర్తికి మారారు. చైతన్య జ్యోతి మ్యూజియం నిర్మాణాన్ని పర్యవేక్షించడమే కాక దానికి మొదటి డైరెక్టరుగా నియమితులయ్యారు. హోమియోపతి పట్ల ఎంతో ఆసక్తి ఉన్న వీరు 22 సంవత్సరాల క్రితం వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్ అయ్యారు. ఇంట్లో ఉన్నా, ఆఫీస్ లో ఉన్నా, రోగుల కోసం వారు సమయం కేటాయించేవారు. తన చివరి రోజు వరకు స్వామి వారి పనులు చేస్తూ ఉండేవారు. వారు తమ జీవితకాలమాలో ఎవరి జీవితాలనైతే స్పృశించారో వారందరూ ఆయనను ఎంతో ప్రేమ, గౌరవంతో ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారు.