Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ప్రశ్నలు జవాబులు

Vol 13 సంచిక 2
మార్చ్ / ఎప్రిల్ 2022


Q1.  వైబ్రేషన్ తో కూడిన ఆల్కహాల్ నా దగ్గర ఉంది కానీ దానితో నాకు అవసరం లేదు. ఎస్ ఆర్. హెచ్ పి మిషన్ లో దీన్ని తటస్థీకరించడం సాధ్యమవుతుందా?

A. అవును, న్యూట్రలైజ్ చేసే విధానం షుగర్ మాత్రల మాదిరిగానే ఉంటుంది. సీనియర్ ప్రాక్టీషనర్ మాన్యువల్ అధ్యాయం 3 చూడండి.

________________________________________________________________________________

Q2. కుటుంబంలో వచ్చే వ్యాధులకు ముందస్తు నివారణ మోతాదు వ్యవధిని తెలుపగలరా ?

A. దాదాపు అన్నిఅనారోగ్య పరిస్థితులు మరియు వ్యాధులు జన్యుపరమైన/ వంశపారంపర్య అంశాలను కలిగి ఉన్నాయని పరిశోధకులు విశ్వసిస్తున్నారు, అయితే అనేక రుగ్మతలకు కారణాలు చాలా క్లిష్టంగా ఉంటాయి. ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి యొక్క కుటుంబ చరిత్ర ఉన్నప్పుడు సాధారణ మోతాదు OW.  కానీ రోగికి వ్యాధి వస్తుందనే భావన లేదా సూచనలు  లేదా అట్టి భయం ఉంటే నెల వరకూ OD అనంతరం OW. అయితే గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే వారసత్వంగా మరియు జన్యుపరమైన కారకాలు కొన్ని వ్యాధులకు గురయ్యే అవకాశం కల్పిస్తున్నప్పటికీ జీవనశైలిలో మార్పుల ద్వారా దీన్ని తగ్గించవచ్చు. ఉదాహరణకు ఆరోగ్యకరమైన ఆహారం, మంచి నిద్ర, కొన్ని ఆధ్యాత్మిక సాధనలు మరియు క్రమం తప్పకుండా చేసే వ్యాయామం.

________________________________________________________________________________

Q3. పగటి పూట రెమిడీ ఒక మోతాదు మాత్రమే తీసుకోవాల్సి వచ్చినప్పుడు రోగి యొక్క అలవాట్లు మరియు అభిరుచులకు అనుగుణంగా ఇతర సమయాల్లో కాకుండా రాత్రి నిద్రపోయే ముందు లేదా ఉదయం మేల్కొన్నప్పుడు దాన్ని ఎందుకు తీసుకోవాలని సిఫార్సు చేయబడింది? IB ని ఉదయాన్నే పళ్ళు తోముకో కుండా తీసుకోమని చెప్పడంలో లాజిక్ ఏమిటి?

A.  నాడీ వ్యవస్థ విశ్రాంతిగా ఉన్నప్పుడు వైబ్రియానిక్స్ రెమిడీలు ఉత్తమంగా పనిచేస్తాయి. ఉదయాన్నే మీరు నిద్ర నుంచి మేల్కొన్నప్పుడు లేదా రాత్రి మీరు నిద్రపోవడానికి సిద్ధమవుతున్నప్పుడు మీరు పూర్తి విశ్రాంతి తీసుకుంటారు. అందువల్ల ఈ సమయాల్లో ఒకే మోతాదు/OD సిఫార్సు చేయబడింది. నిద్ర లేవగానే IB తీసుకోవడం అనేది గుర్తుంచుకోవడం సులభం మరియు రోజంతా ఇది కుటుంబ సభ్యులకు సంభవింపబోయే ఇన్ఫెక్షన్ నుండి రక్షణ అందిస్తుంది. అలాగే మీరు 20 నిమిషాలు ముందు ఏమీ తినకుండా ఉండాలనే నియమానికి భంగం కలుగదు. అయితే రెమిడీ తీసుకున్న తర్వాత కనీసం 20 నిమిషాల పాటు ఏదీ  తినకూడదని లేదా పళ్ళు తోముకోకుండా ఉండాలని గుర్తుంచుకోవాలి.

________________________________________________________________________________

Q4. నవజాత శిశువుకు ఇవ్వగలిగే రెమిడీలు ఏమైనా ఉన్నాయా?  

A.. సాధారణంగా నవజాత శిశువు యొక్క రోగనిరోధక వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందకుండా ఉన్నందున ఆరోగ్యకరమైన శిశువుకు వైబ్రియానిక్స్ ఇవ్వకూడదని సిఫార్సు చేయబడింది. అయినప్పటికీ నవజాత శిశువులు బాహ్య  ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఎదుర్కొనే షాక్ ను తట్టుకునేందుకు CC10.1 Emergencies లేదా NM25 Shock ఒక సింగిల్ డోస్ ఇవ్వండి. అలాగే కోవిడ్-19 కోసం ముందస్తుగా IB ఒక సింగిల్ డోస్ ఇవ్వండి. ఇక్కడ సింగిల్ డోస్ అంటే ఒక చుక్క రెమిడీ నీరు శిశువు యొక్క నాలుగు పై ఉంచాలి. ఈ సమాధానం గతంలో సంపుటి 12 సంచిక 2 లో ఇచ్చిన సమాధానాన్ని భర్తీ చేస్తుంది.  

ఒకవేళ శిశువు నెలలు నిండకుండా పుట్టినా లేదా బలంగా మరియు ఆరోగ్యంగా లేకున్నాCC3.1 Heart tonic + CC4.1 Digestion tonic + CC11.5 Mouth infections + CC12.2 Child tonic + CC18.1 Brain disabilities + 19.1 Chest tonic OR NM5 Brain TS + NM12 Combination-12 + NM22 Liver + NM49 Chest Tonic + NM75 Debility + OM19 Cardiac & Lung + BR5 Heart + SR301 Mercurius 30C…TDS ఇవ్వండి. మెరుగు పడినప్పుడు మోతాదు క్రమంగా తగ్గించండి, శిశువు బలంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మోతాదు నిలిపివేయండి.

పుట్టినప్పుడు శిశువుకు కామెర్లు ఉన్నట్లయితే CC4.1 Digestion tonic + CC4.2 Liver & Gallbladder tonic + CC12.2 Child tonic OR NM22 Liver + NM75 Debility + SR284 Chelidonium 30C + SR285 China Off 30C…TDS. ఇవ్వండి. మెరుగు పడినప్పుడు మోతాదు BD కి మరింత మెరుగుదలతో క్రమంగా మోతాదుOD కి తగ్గించి  లక్షణాలు పూర్తిగా పోయినప్పుడు ఆపి వేయండి. అన్ని ఇతర వ్యాధులకు కూడా ఇదే విధానాన్ని అనుసరించండి పిల్లలు వైబ్రియానిక్స్ రెమిడీ లకు త్వరగా ప్రతిస్పందిస్తారు కాబట్టి కొద్ది రోజుల్లోనే వేగంగా అభివృద్ధిని చూడవచ్చు. శిశువులలో వచ్చే సాధారణ వ్యాధులకు ఇక్కడ కొన్ని రెమిడీలు సూచింపబడి ఉన్నాయి, వాటిని TDS మోతాదులో  ప్రారంభించండి.

మరొక సమస్య తక్కువ ఎదుగుదల మరియు అభివృద్ధి లేమి: CC4.1 Digestion tonic + CC12.2 Child tonic OR NM75 Debility + NM90 Nutrition or SR285 China Off 200C + SR263 Nat Sulph.